20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : అక్టోబర్ 20 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాగా దీపావళి పండగ దృష్ట్యా మధ్యలో అసెంబ్లీకి సమావేశాలకు మూడు రోజుల విరామం ఉంటుంది. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల్లో ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు.
తాగునీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగమని ఆయన అన్నారు. వచ్చే ఏడాది జూన్లో చెరువుల పూడికతీత పనులు, జూలైలో హరితవనం ఉద్యమం చేపడతామని కేసీఆర్ తెలిపారు. 500 మంది కళాకారులతో ప్రచారం నిర్వహిస్తామన్నారు. మరోవైపు ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ఆలస్యం కావటంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.