drinking water
-
‘జల్‌జీవన్’కు రాజకీయ జాఢ్యం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నీటి కుళాయిల ఏర్పాటుకు అమలు చేస్తున్న జల్‌జీవన్ కార్యక్రమానికి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన పనులను రద్దుచేసి, తిరిగి టీడీపీ నేతలు, అధికార పార్టీల ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వాటికి మళ్లీ అనుమతిస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక, కుళాయిల ఏర్పాటు కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన 44,194 పనులను రద్దు చేసింది. వీటిల్లోని 7,792 పనులను తిరిగి కొనసాగించేందుకు శుక్రవారం నాటి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. గత డిసెంబరులో రద్దు చేసిన పనుల విలువ రూ.10,680.50 కోట్లు కాగా.. వాటిలో తిరిగి కొనసాగించాలని నిర్ణయించిన పనుల విలువ రూ.2,210 కోట్లు. ఎన్నికల్లో అందరికీ అని హామీ ఇచ్చి..మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ తమ ఉమ్మడి మేనిఫెస్టోలో ‘ఇంటింటికీ తాగునీరు–ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్’ అంటూ హామీ ఇచ్చారు. కానీ, వీరి ప్రభుత్వం ఇప్పుడు ఆమోదం తెలిపింది కేవలం మూడు లక్షలకే. ఈ హామీ పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం 25.08 లక్షల ఇళ్లకు కుళాయిల ఏర్పాటు పనులను రద్దు చేసేదే కాదు. పైగా.. అలా రద్దయిన వాటిలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీడీపీ నేతలు సూచించిన కొన్ని పనులను తిరిగి కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి రాజకీయ రంగు పులమడమే అవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జగన్ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు కుళాయిలు..వాస్తవానికి.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 95.53 లక్షల ఇళ్లుండగా.. 2019 ఆగస్టు 15 వరకు అంటే గత 72 ఏళ్లుగా కేవలం 30.74 లక్షల ఇళ్లకు మాత్రమే కుళాయిలు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు కొత్తగా 39.71 లక్షల ఇళ్లలో ఏర్పాటుకాగా, ఇందులో 39.34 లక్షల కుళాయిలు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటయ్యాయి. ఇంకా 25.08 లక్షల ఇళ్లకు ఏర్పాటు చేయాల్సి ఉంది. -
తాగునీటికే తొలి ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలిన నిల్వలను.. తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇస్తూ సాగు చేసిన పంటల పరిరక్షణకు జాగ్రత్తగా వాడుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులకు కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. పంటల పరిరక్షణకు అవసరమైన నీళ్లు, వాటి వినియోగంపై ప్రతి 15 రోజులకోసారి ఈఎన్సీలు సమావేశమవుతూ.. పొదుపుగా నీటిని వాడుకోవాలని సూచించింది. నెలకోసారి బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తామని, నీటి వినియోగంపై సమీక్షిస్తామని తెలిపింది. జూలై వరకూ ఇదే రీతిలో సమావేశాలు నిర్వహిస్తూ సమీక్షించడం ద్వారా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని పేర్కొంది. చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం జలసౌధలో కృష్ణా బోర్డు రెండో అత్యవసర సమాశం జరిగింది.తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్, సీఈ రమేశ్‌బాబు, ఎస్ఈ విజయ్‌కుమార్, ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు హాజరయ్యారు. సమర్థ వినియోగంపై దృష్టి పెట్టండివాటా కంటే ఎక్కువ నీటిని ఏపీ వాడుకుందని తెలంగాణ అధికారులు బోర్డుకు ఫిర్యాదు చేశారు. అయితే శ్రీశైలం, సాగర్‌లలో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు విడుదల చేసి సముద్రంలో కలిసేలా చేసి వృథా చేసింది తెలంగాణానేనని ఏపీ అధికారులు చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న బోర్డు చైర్మన్.. రెండు రాష్ట్రాలు ఉమ్మడి ప్రాజెక్టుల్లో మిగిలిన నీటి నిల్వలను సమర్థవంతంగా వాడుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. ఏపీకి 55, తెలంగాణకు 63 టీఎంసీలు అవసరమని సీఈల కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఉమ్మడి ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టానికి ఎగువన 60 టీఎంసీలే లభ్యతగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి 16–20 టీఎంసీలను బోర్డు కేటాయించే అవకాశం ఉండగా, మిగిలిన నీళ్లు తెలంగాణకు కేటాయించనుందని సమావేశానంతరం అధికార వర్గాలు తెలిపాయి.శ్రీశైలంపై ఎన్డీఎస్ఏ ఆరాశ్రీశైలం జలాశయం ప్రమాదంలో ఉందంటూ తెలంగాణ ఈఎన్సీ రాసిన లేఖపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) స్పందించింది. ఏపీ ఈఎన్సీతో ఫోన్లో మాట్లాడిన సంస్థ చైర్మన్.. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మరమ్మతు పనులకు సంబంధించి సీడబ్ల్యూపీఆర్ఎస్కు చెల్లించాల్సి ఉన్న బిల్లులను ఏపీ ప్రభుత్వం క్లియర్ చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ ప్రమాదంలో ఉందనే అంశాన్ని తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ మరోసారి కృష్ణా బోర్డు సమావేశంలో ప్రస్తావించగా, ఏపీ అధికారులు పై వివరాలు తెలియజేశారు. నీటి వినియోగంపై ఈఎన్సీల భేటీకృష్ణా బోర్డు బోర్డు సూచనల మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సమావేశమయ్యారు. పంటల పరిరక్షణ కోసం సాగర్ కుడి కాలువ నుంచి 7 నుంచి 8 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 7 వేల క్యూసెక్కులు వాడుకోవాలని నిర్ణయించారు. శ్రీశైలం జలాల విషయంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు అంగీకరించారు. -
తాగునీరే కాదు... తప్పుడు సమాచారమూ సవాలే!
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో మన దేశం ప్రధానంగా రెండు సవాళ్లను ఎదుర్కోనుంది. వాటిలో ఒకటి తాగునీటి సరఫరా కాగా... మరొకటి తప్పుడు సమాచారం. ఈ రెండు 2025–2027 మధ్య దేశానికి అత్యంత క్లిష్టమైన సమస్యలుగా మారుతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) హెచ్చరించింది. ఈ సమస్యలను ఇప్పటి నుంచే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలని సూచించింది. ఇటీవల దావోస్‌లో జరిగిన వార్షిక సమావేశానికి ముందు డబ్ల్యూఈఎఫ్ వార్షిక గ్లోబల్ రిస్క్ రిపోర్టు–2025ను విడుదల చేసింది.ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువగా నీటి సరఫరా కష్టాలు ఎదుర్కొనే దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉందని ఈ నివేదిక వెల్లడించింది. మొదటి నాలుగు స్థానాల్లో మెక్సికో, మొరాకో, ట్యునీషియా, ఉజ్బెకిస్తాన్ ఉన్నట్టు ప్రకటించింది. మానవ తప్పిదాలు, పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలతోపాటు పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడం వంటి అంశాలు తాగునీటి సమస్యకు కారణమవుతున్నట్లు వివరించింది. నీటి సరఫరా కొరతను ఎదుర్కొనే ‘టాప్ రిస్క్’ దేశాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్టు తెలిపింది. 2024లో నీటి సరఫరా సంక్షోభాన్ని ఏడు దేశాలు ఎదుర్కోగా, 2025 ప్రారంభంలో ఆ సంఖ్య 27కి పెరిగింది. రానున్న కాలంలో మరిన్ని దేశాల్లో ఈ సంక్షోభం తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.రెండో స్థానంలో తప్పుడు సమాచారం భారతదేశం రానున్న రెండేళ్లలో నీటి సరఫరా సమస్యతోపాటు మరో నాలుగు ప్రమాదాలను ఎదుర్కోనుందని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్–2025 వివరించింది. వీటిలో తప్పుడు సమాచారం రెండో స్థానంలో, మానవ హక్కుల ఉల్లంఘన–పౌర స్వేచ్చ క్షీణత మూడో స్థానంలోను, కాలుష్యం నాలుగో స్థానంలోను, కార్మికుల కొరత–ప్రతిభ కొరత ఐదో స్థానంలో ఉంటాయని వెల్లడించింది.గాలి, నీరు, నేల కాలుష్యం వల్ల భారతదేశానికి గణనీయమైన ఆరోగ్య, ఆర్థిక నష్టాలను కలిగిస్తుందని హెచ్చరించింది. వచ్చే రెండేళ్లల్లో ప్రపంచం ఎదుర్కొనే మరో అత్యంత తీవ్రమైన ప్రమాదం విపరీతమైన వాతావరణ మార్పులేనని కూడా ఈ నివేదిక తెలిపింది. అదేవిధంగా విపరీత వాతావరణ మార్పులు మానవ వినాశనానికి దారితీస్తున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వార్షిక నివేదిక ప్రకటించింది. విపరీత వాతావరణ మార్పుల కారణంగా 2024లో దేశవ్యాప్తంగా 3,238 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ఇది 2022తో పోలిస్తే 18 శాతం పెరిగినట్లు వెల్లడించింది. -
జగన్ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు కొళాయిలు
సాక్షి, అమరావతి: తాగు నీటి(Drinking water) కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దూరంలోని బావులు, చెరువుల నుంచి తోడి తెచ్చుకొంటుంటారు. అవీ ఎండితే నీరే దొరకని పరిస్థితి. గ్రామీణ ప్రజల దుస్థితిని అర్ధం చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy).. నీటి కోసం ఇల్లు దాటి వెళ్లే అవసరం లేకుండా ఇంటింటికీ తాగు నీటి కొళాయి ఏర్పాటు చేయించారు. గ్రామీణ ప్రజల నీటి వెతలను తీర్చారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని లోక్‌సభకు తెలిపింది.కేంద్ర జల శక్తి శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ లోక్‌సభకు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.53 లక్షల ఇళ్ల ఉన్నాయి. 2019 ఆగస్టు 15 వరకు.. అంటే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 72 సంవత్సరాల వరకు రాష్ట్రంలోని ప్రస్తుత 26 జిల్లాల పరిధిలో 30.74 లక్షల ఇళ్లకు మాత్రమే అప్పటి ప్రభుత్వాలు తాగు నీటి కొళాయిలు ఏర్పాటు చేశాయి. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదేళ్లలో కొత్తగా మరో 39.34 లక్షల ఇళ్లకు తాగు నీటి కొళాయిలు అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 25.08 లక్షల ఇళ్లకు మాత్రమే కొళాయిలు ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8 నెలల్లో కేవలం 36 వేల ఇళ్లకే కొళాయిలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వంఇంటింటికీ తాగు నీటి కొళాయి ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన వేల కోట్ల రూపాయల విలువైన రక్షత మంచి నీటి పనులను రద్దు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటింటికీ తాగునీటి కొళాయి ఏర్పాటు చేసే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 11,400 కోట్ల రక్షిత తాగునీటి పథకాల పనులను రద్దు చేసింది. ఇదేమని అడిగితే కొత్త అంచనాలు తయారు చేసి మళ్లీ టెండర్లు పిలుస్తామంటూ సాకులు చెబుతోంది. -
బడి పిల్లల గొంతు తడిచేదెలా!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 450 ప్రభుత్వ స్కూళ్లకు తాగునీటి సరఫరా లేదు. 1,000కి పైగా స్కూళ్లలో స్థానికులు అరకొరగా కుండల్లో, క్యాన్లలో నీళ్లు అందిస్తున్నారు. మొదటి గంటలోనే ఇవి ఖాళీ. మధ్యాహ్నం వేళ విద్యార్థులు మంచినీటి కోసం అల్లాడే పరిస్థితి ఉంది.సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో(Government school) ఇతర సౌకర్యాల మాట అటుంచితే వందలాది స్కూళ్లలో కనీసం తాగునీటి(Drinking water) వసతి లేకపోవడంతో విద్యార్థులు(Students) ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎండలు పెరుగుతుండటంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. దాహం తీర్చుకునేందుకు పిల్లలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల విద్యాశాఖ జరిపిన సమీక్షలో దాదాపుగా అన్ని జిల్లాల డీఈవోలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు.మధ్యాహ్న భోజన సమయంలోనూ తాగునీరు అందుబాటులో లేని పరిస్థితి ఉంటోందని ఎంఈవోలు వివరిస్తున్నారు. స్కూళ్ళలో నీటి ట్యాంకుల నిర్వహణ సరిగా లేకపోవడం, గత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ మంచినీటి సరఫరా లేకపోవడం, అనేకచోట్ల విద్యుత్ కోతల కారణంగా ఓవర్ హెడ్ ట్యాంకులు నిండకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటోంది.రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ స్కూళ్లుండగా.. ప్రభుత్వానికి అందిన వివరాల ప్రకారం దాదాపు 6 వేల స్కూళ్ళకు భగీరథ నీరు సరఫరా అవ్వడం లేదు. 10 వేల స్కూళ్ళల్లో విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్ళే తాగుతున్నారు. దాదాపు 4500 స్కూళ్ళల్లో నీళ్ళ ట్యాంకులు మరమ్మతుకు నోచుకోకపోవడం లేదా, నిర్వహణ లోపం వల్ల విద్యార్థులకు మంచి నీటి కొరత ఉంది.దాదాపు అన్నిచోట్లా అదే దుస్థితి⇒ ఆదిలాబాద్ జిల్లాలోని పలు స్కూళ్ళలో విద్యార్థులకు మంచినీటి సౌకర్యం లేదు. మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు నీటి కోసం విద్యార్థులు ఎగబడే పరిస్థితి ఉంది. అంతమంది విద్యార్థులకు వాటర్ క్యాన్లలో నీళ్లు తేవడం సాధ్యం కావడం లేదని అక్కడి డీఈవో ఉన్నతాధికారులకు తెలిపారు. ⇒ కరీంనగర్ జిల్లాలోని 600 స్కూళ్ళకు మిషన్ భగీరథ నీటి సరఫరా లేదు. తాగునీటి కోసం ప్రధానోపాధ్యాయులు.. స్థానిక నేతలను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల స్థానికులు నీళ్ళు అందిస్తున్నారు. 800 ప్రభుత్వ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కునే నీళ్ళు కూడా పొదుపుగా వాడాల్సిన పరిస్థితి ఉంది. ⇒ నిజామాబాద్‌లో పలు హాస్టళ్ళు, స్కూళ్ళల్లో నీటి నిల్వకు అవసరమైన వాటర్ ట్యాంకులు లేవు. దీంతో అప్పటికప్పుడు క్యాన్లలో నీళ్ళు తెప్పిస్తున్నారు. ఇవి మొదటి గంటలోనే అయిపోతున్నాయి. ⇒ వరంగల్ జిల్లాలో 1500 స్కూళ్ళలో విద్యార్థులు ఇళ్ళ నుంచే నీళ్ళు తెచ్చుకుంటున్నారు. తెచ్చుకోని తోటి విద్యార్థులు దాహం అవుతోందని అన్నా.. సందేహిస్తూనే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటోంది. పలువురు హెచ్ఎంలు ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళారు. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లా మారుమూల పల్లెల్లోని 820 పాఠశాలల్లో తాగునీటి సరఫరా అరకొరగా ఉంది. దీంతో విద్యార్థులు మధ్యలోనే స్కూళ్ళ నుంచి ఇంటికెళ్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 600 స్కూళ్ళలో నీటి ట్యాంకుల నిర్వహణ సరిగా లేకపోవడంతో విద్యార్థులు దాహార్తితో అల్లాడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెరుగుతున్న ఎండలతో పాటు స్కూళ్లలో మంచినీటి సమస్య తీవ్రమవుతుండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. పాఠశాలల నుంచి సమగ్ర వివరాలు తెప్పించుకునే పనిలో ఉంది. టెన్త్ పరీక్షలు దగ్గర పడుతున్న దృష్ట్యా విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తుండటంతో నీటి కొరత వేధిస్తోందని విద్యాశాఖ అధికారులు గుర్తించారు.తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక బడ్జెట్ విడుదల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ఈలోగా స్థానిక ప్రజాప్రతినిధులు, అలా వీలు కాకపోతే హెచ్ఎంలు అవసరమైన తాగు నీటిని తెప్పించాలని, ఇందుకు సంబంధించిన బిల్లులను చెల్లిస్తామని డీఈవోలకు తెలిపారు. ఎంఈవోలు స్కూళ్ళలో నీటి సమస్యపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. -
కేజ్రీ యమునా జలం తాగాలి: రాహుల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు సరఫరా చేసే దుర్గంధపూరిత నీరు తాగాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ప్రధాని మోదీ మాదిరిగానే కేజ్రీవాల్ కూడా తప్పుడు హామీలతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. హౌజ్ కాజీ చౌక్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. 2020 అల్లర్ల బాధితులను తరఫున తనతోపాటు తన పార్టీ మాత్రమే మద్దతుగా నిలిచిందని, అణచివేతకు గురయ్యే వారికి ఇకపైనా దన్నుగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రేమ, సోదరభావాన్ని పంచే కాంగ్రెస్ కావాలో విద్వేషాన్ని, హింసను ప్రేరేపించే బీజేపీ కావాలో తేల్చుకోవాలని ప్రజలను ఆయన కోరారు. -
అక్క తగ్గేదేలే...
-
కోహ్లి-అనుష్క తాగే నీరు ఎక్కడ నుంచి దిగుమతి అవుతుందో తెలుసా..!
విరాట్ కోహ్లి-అనుష్క జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందమైన సెలబ్రిటీ జంటగా పేరుగాంచిన ఈ ఇద్దరు ఏ వేడుకకైన జంటగానే హాజరవ్వుతారు. ఫ్యాషన్ పరంగా కూడా ఇద్దరూ స్టైలిష్ ఐకాన్లుగా ట్రెండ్‌కి తగ్గట్టు ఉంటారు. అలాగే ఇద్దరు కూడా ఫిట్నెస్ విషయంలో చాలా కేర్‌గా ఉంటారు. వ్యాయామ సెషన్ నుంచి నిద్ర వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడంలో ఈ జంట చాలా ప్రత్యేకం. మాములుగా ఏజ్‌ని బట్టి, పరిస్థితుల రీత్యా డైట్‌ని మారుస్తు కాస్త హెల్తీగా మార్పులు చేసకోవడం సహజం. కానీ వీళ్లు ఏకంగా తాగే నీళ్ల విషయంలో కూడా మార్పులు చేశారు. అదికూడా వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్న నీళ్లను తాగుతారట. వీళ్లు ఎవియన్ అనే సరస్సు నుంచి వచ్చే నేచురల్ స్ప్రింగ్ వాటర్ (భూమి నుంచి సహజసిద్ధంగా వచ్చేది) తాగుతారట. అంతేగాదు నివేదికల ప్రకారం ఎవియన్-లెస్-బెయిన్స్ సరస్సులోని నీరు ఎటువంటి రసాయనాలతో కలుషితం కాలేదని వెల్లడయ్యింది. ముఖ్యంగా ఈ వాటర్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుందట. ఎవియన్-లెస్-బెయిన్స్ జెనీవా సరస్సు దక్షిణ భాగంలో ఉంటుంది. ఇది పశ్చిమ ఐరోపాలోని అతి పెద్ద సరస్సులలో ఒకటి. దీన్ని స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు పంచుకుంటున్నాయి. అంతేగాదు ఒక లీటరు ఎవియన్ బాటిల్ ధర దాదాపు రూ. 600ల దాక ఉంటుంది. అంటే ప్రతిరోజు రెండు లీటర్ల నీటిని తీసుకుంటే రూ. 1200 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఒక లీటర్ ఎవియాన్ బాటిళ్లు డజను వచ్చేటప్పటికీ ఏకంగా రూ. 4200/ పలుకుతుంది.(చదవండి: వర్కౌట్ సెషన్లో రకుల్‌కి వెన్ను గాయం..అలా జరగకూడదంటే..!) -
గ్రామాల్లో మంచినీటి సహాయకులు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో తాగునీటి సరఫరా విషయంలో నూతన ఒరవడికి ప్రభుత్వం నాంది పలికిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి గ్రామంలో మంచినీటి సహాయకుడిని నియమించి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 15 జిల్లాల్లోని 60 ప్రాంతాల్లో శిక్షణ కొనసాగుతోందని.. ఈ నెలాఖరులోగా అన్ని గ్రామాలకూ సహాయకులను నియమించి శిక్షణ పూర్తి చేస్తామన్నారు. తాగునీటి నాణ్యత పరిశీలనతోపాటు బోర్లు పాడైతే అదే రోజు మరమ్మతులు జరిగేలా, లీకేజీలను సరిచేసేలా గ్రామాల్లో మంచినీటి సహాయకులు కృషి చేస్తారని వివరించారు. సోమవారం సచివాలయం నుంచి శాఖాపరమైన సమీక్ష సందర్భంగా వివిధ విభాగాలవారీగా పనుల్లో వేగం పెంచాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. కొనసాగుతున్న పనుల పురోగతిని ఆమె అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలోని పెండింగ్ బిల్లులను త్వరలో చెల్లిస్తామని చెప్పారు. విభాగాలవారీగా నూతన పనులకు కార్యాచరణ సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పీఆర్ ఆర్డీ కమిషనర్ అనితా రామచంద్రన్, స్పెషల్ కమిషనర్ షఫీఉల్లా హాజరయ్యారు. -
‘సుంకిశాల’ ప్రాజెక్టు ఘటన ఎందుకు దాచారు?: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: నాగార్జునసాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడకూలిపోవడం హైదరాబాద్ నగర ప్రజలకు విషాద వార్త అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కేటీఆర్ అన్నారు. శుక్రవారం(ఆగస్టు9) తెలంగాణభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు ఘటన జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా లేక విషయం కప్పిపెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ తెలియకపోతే ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. మునిసిపల్ శాఖ తనవద్దే పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. మేడిగడ్డలో ఏమైనా జరిగితే కేంద్రం స్పందిస్తుందని, ఇప్పుడు బీజేపీ ఏం చెబుతుందని కేటీఆర్ నిలదీశారు. మేడిగడ్డ ఘటను ఎన్నికలున్నప్పటికీ తాము దాచలేదని గుర్తు చేశారు. రాజధాని హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని విమర్శించారు. ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానివి దివాళాకోరు విధానాలని, చిల్లర విమర్శలని ఫైర్ అయ్యారు. ‘రాష్ట్ర ప్రజల కోట్లాది రూపాయల సంపద నీట మునిగింది. సుంకిశాలలో ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలింది. హైదరాబాద్‌కు తాగునీరు ఇవ్వాలని సుంకిశాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి ప్రారంభించాం. గత దశాబ్దంగా హైదరాబాద్ విస్తరించింది. సాగు నీటికి ఇబ్బంది లేదని రైతుల్లో విశ్వాసం కల్పించిన తర్వాతే సుంకిశాల ప్రారంభించాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాం. రాబోయే 50 ఏళ్లలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా శరవేగంగా నిర్మాణం చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయం లేదు. మున్సిపల్ శాఖలో పాలన పడకేసింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయాలని వేగంగా పనులు చేశాం. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభించలేదు. నెత్తిమీద నీళ్ళు జల్లుకొని భట్టి, తుమ్మల యాక్టింగ్ చేస్తుండవచ్చు’అని కేటీఆర్ చురకంటించారు. -
70,00,000 తాగునీటి కొళాయిలు
⇒ రాష్ట్రాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పరీక్షల నిర్వహణలో మొత్తం 700 మార్కుల ప్రాతిపదికన ఆ రాష్ట్రాల పురోగతిని పరిశీలిస్తే 699.93 మార్కులతో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 657.10 శాతం మార్కులతో రెండో స్థానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది. ⇒ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు రెండున్నర లక్షల తాగునీటి వనరులు ఉండగా, నీటిశుద్ధి పరీక్షల అనంతరం 25,546 తాగునీటి వనరుల్లో నీరు వివిధ కారణాలతో కలుషితమైనట్టు గుర్తించగా, ఆయా ప్రాంతాల్లొ అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు నివేదిక స్పష్టం చేసింది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.45 లక్షల ఇళ్లు ఉంటే, అందులో 70.04 లక్షల ఇళ్లకు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికే తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ అండ్ శానిటేషన్ 2023–24 ఆరి్థక సంవత్సరం వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీన విడుదల చేసింది. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీటిని వారి ఇంటి ఆవరణలోనే అందజేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో కలిసి 2019 ఆగస్టు 15వ తేదీన జలజీవన్ మిషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 60 శాతం గ్రామీణ ప్రాంత ఇళ్లలో తాగునీటి కుళాయిలు అందుబాటులోకి రాగా, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంత ఇళ్లలో 73.38 శాతం ఇళ్లకు 2024 మార్చి నెలాఖరుకే అందుబాటులోకి వచ్చాయని నివేదిక పేర్కొంది. -
స్కై వాటర్: సూర్యరశ్మి, గాలితో వాటర్..!
ప్రస్తుతం మహా నగరాల్లో తాగునీటి ఇక్కట్లు మాములుగా లేవు. మన దేశంలో బెంగుళూరు, ముంబై, హైదరబాద్ వంటి నగరాలు సమ్మర్ వస్తే చాలు నీటి సమస్యతో అల్లాడిపోతున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో జనాలు నివశించడానికే భయపడే పరిస్థితి ఎదురవ్వుతుందని హెచ్చరిస్తున్నారు కూడా. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి చేసిన తప్పిదాలే ఇందుకు కారణమని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచే మొత్తుకుంటున్నారు. నీటి ఎద్దడి కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. అవన్నీ ఆయా ప్రాంతాలను బట్టి సక్సెస్ అవ్వడం అనేది ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడూ ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా ఓ సరికొత్త వాటర్‌ని తాజాగా శాస్త్రవేత్తలు సృష్టిస్తున్నారు. త్వరలోనే ఆ నీటిని బాటిల్స్ రూపంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు కూడా. ఇంతకీ పరిశోధకులు ఎలా నీటిని సృష్టిస్తున్నారంటే..అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు సూర్యుడు, గాలితో నీటిని తయారుచేసే సరికొత్త సాంకేతికను కనుగొన్నారు. ఏంటీ సూర్యకాంతి, గాలితోనా అని ఆశ్చర్యపోకండి. గాలిని స్వేదనంగా మార్చేందుకు హైడ్రోపనెల్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ సాయంతో గాలి నుంచి నీరు ఆవిరిని అయ్యేలా చేసి..ఆ నీటిని సేకరిస్తారు. ఇందుకోసం సోలార్ ప్యానెల్ మాదిరిగా ఉండే వాటిని తీసుకుంటారు. అయితే ఇవి విద్యుత్తుకు బదులు స్వచ్ఛమైన నీటిని ఉత్పత్తి చేశాయి.ఇక్కడ ఈ ప్యానెళ్లు గాలి నుంచి నీటి ఆవిరిని తీసుకుంటాయి. ఈ తేమను సాంద్రీకృత గాలి ప్రవాహంలోకి విడుదల చేసేందుకు మళ్లీ సౌరశక్తిని వినియోగిస్తుంది. ఈ ప్యానెల్ లోపల నీటి నిష్క్రియాంతక సంక్షేపణను అనుమతిస్తుంది. అంతేగాదు ప్రతి ప్యానెల్ ఒక వ్యక్తి రోజువారీ అవసరాలకు సరిపోయేలా మూడు లీటర్ల వరకు త్రాగునీటిని ఉత్పత్తి చేయగలదు. ఈ నీరు స్వచ్ఛమైనది, మినరలైజ్ చేసినది. త్రాగేందుకు సురక్షితంగా ఉండేలా ఓజోనేటెడ్ చేయబడుతుంది కూడా.నిజానికి దీన్ని జీరోమాస్ వాటర్ పేరుతో అమెరికా సోర్స్ కంపెనీ 2014లోనే ప్రారంభించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 56 దేశాల్లో హైడ్రోప్యానెల్స్ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్లను గ్రౌండ్ శ్రేణులుగా లేదా ఇంటి పైకప్పులపై తాగునీటితో అనుసంధానించవచ్చు. ప్రతి హైడ్రోప్యానెల్ ధర సుమారు రూ. 2 లక్షల్లో అందుబాటులో ఉండేలా చేసి, నీటి కొరత సమస్యను నివారించాలని భావిస్తున్నారు పరిశోధకులు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ పద్ధతిలో నీటిని తయారు చేసే ప్రక్రియను ప్రారంభించేశారు కూడా. ఇక్కడ రోజుకు దాదాపు మూడు వేల లీటర్‌ని ఉత్పత్తి చేస్తున్నారు కూడా. అంతేగాదు సెప్టెంబర్ 2024 కల్లా యూఎస్ అంతటా స్కైవాటర్ బ్రాండ్‌తో పునర్వినియోగించే అల్యూమినియం క్యాన్‌ల్లో ఈ నీటిని విక్రయించాలని చూస్తున్నారు. అంతేగాదు అమెరికా కంపెనీ సోర్స్ స్కై వాటర్‌ని ప్రజలకు పరిచయం చేసేలా మార్కెటింగ్ చేయాలనుకోవడమే గాక హైడ్రోపనెల్ టెక్నాలజీ గురించి అవగాహన పెంచి స్థిరమైన నీటి వనరులను ప్రోత్సహించడమే లక్ష్యం అని చెబుతోంది. ప్రస్తుతం సోర్స్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ హైడ్రోప్యానెల్స్ అధిక ధర కాస్త అవరోధంగా ఉంది. భవిష్యత్తులో వీటి ధరలు గణనీయంగా తగ్గితే సదరు కంపెనీకి మంచి లాభదాయకమే గాక అన్ని దేశాలు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుతుందని చెప్పొచ్చు. (చదవండి: ఆ రెస్టారెంట్లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్) -
తాగునీటిలో విష ప్రయోగం
కణేకల్లు: ప్రజలు తాగే నీళ్లలో విషాన్ని కలిపారు.. ఆ నీరు తాగినోళ్లు ప్రాణాలతో ఉండకూడదనుకున్నారో.. లేక వాంతులు, విరేచనాలొచ్చి నిర్వహణ చేసే వారికి చెడ్డపేరు రావాలనుకున్నారో గానీ అత్యంత అమానుష ఘటనకు ఒడిగట్టారు. వాటర్‌ప్లాంట్ నిర్వాహకులు సకాలంలో గుర్తించడంతో ముప్పు తప్పింది. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం తుంబిగనూరులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తుంబిగనూరులో సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్.. రెండేళ్ల క్రితం మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీకి అప్పగించింది. గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు ఫణీంద్ర గౌడ్ వాటర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు తన తండ్రి తిప్పయ్యను ప్లాంట్ వద్దే ఉంచారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పంచాయతీ ఆధ్వర్యంలో రూ.5కే రెండు బిందెల నీటిని పంí³ణీ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దుప్పటి కప్పుకుని మినరల్ వాటర్ ప్లాంట్ వద్దకు వచ్చారు. కిటికీలు తీసి నీటి ట్యాంకులో టెర్మినేటర్ పురుగుల మందు కలిపారు. అదే సమయంలో బహిర్భూమి కోసం లేచిన తిప్పయ్య ప్లాంట్ వద్ద వ్యక్తులు ఉండటాన్ని గమనించి.. ఎవరక్కడ అంటూ గద్దించాడు. దీంతో పొరుగున ఉండే తలారి హనుమంతు, కొట్రేగౌడ్ నిద్ర లేచి అక్కడికి వచ్చారు. ఇంతలోనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వాటర్‌ప్లాంట్‌ను పరిశీలించగా.. అందులో పురుగుల మందు కలిపినట్టు తేలింది. ఈ ఘటనను అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి సీరియస్‌గా తీసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారిని ఉపేక్షించొద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, కణేకల్లు ఎస్ఐ శ్రీనివాసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ను రంగంలో దింపి ఆధారాలను సేకరించారు. జరిగిన ఘటనపై తిప్పయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎల్లో మీడియాలో దుష్ప్రచారం ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ రాలేదన్న ఉద్దేశంతో నేనే కొందరితో తాగునీటిలో విషం కలిపించానంటూ ఎల్లో మీడియాలో ప్రసారం చేయడం దుర్మార్గం. గ్రామ సర్పంచ్‌గా నేను 365 ఓట్ల మెజార్టీతో గెలిచాను. గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 494 ఓట్లు రాగా.. టీడీపీకి 512 ఓట్లు వచ్చాయి. ఓట్లు వేయలేదని ప్రజలను బెదిరించడం, దౌర్జన్యం చేయడం లాంటివి నేను ఏరోజూ చేయలేదు. ఎల్లో మీడియా నాపై నింద వేయడంబాధాకరం.– ఫణీంద్ర గౌడ్, గ్రామ సర్పంచ్, తుంబిగనూరు -
భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా?
నీళ్లు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎంత ఎక్కువగా నీళ్లు తాగితే అంతమంచిదని అంటారు. అలా అని ఎప్పుడుపడితే అలా తాగడం మంచిది కాదని కూడా చెబతున్నారు నిపుణులు. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగాలని..ఇలా చేస్తే మలబద్దక సమస్య ఉండదని అంటారు. ఆ తర్వాత వీలు కుదిరినప్పుడైన నీళ్లు తాగే యత్నం చేయండని అంటారు. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే బోజనం అయ్యిన వెంటనే లేదా భోజనం మధ్యమధ్యలో అదేపనిగా తాగుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదంట. ఇలా చేయడం వల్ల తలెత్తే సమస్యలు గురించి సవివరంగా చెప్పుకొచ్చారు నిపుణులు. అవేంటంటే..నీళ్లు ఆరోగ్యానికి చాలా అవసరం. దాహార్తిని తీర్చడమే కాకుండా ఆహారాన్ని చక్కగా విచ్ఛిన్నం చేసి సులభంగా జీర్ణమవ్వడంలో సహాయపడుతాయి. తద్వారా శరీరం త్వరిగతగతిన పోషకాలను సులభంగా గ్రహించగలుగుతుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం..భోజనం అయ్యిన వెంటనే నీళ్లు తాగకూడదు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటంటే..జీర్ణ సమస్యలు..తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. గ్యాస్టిక్ రసాలు, జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేసి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుందని చెబతున్నారు. దీని వల్ల పోషకాల సహజ శోషణపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కడుపులో ఉన్న ఆహారం నీళ్లు తాగిన వెంటనే శీతలీకరణం అయిపోతుంది. దీంతో సాధారణంగా జీర్ణం అయ్యే వ్యవధిలో మార్పులు వచ్చి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. బరువు పెరగడం..తిన్న వెంటనే నీళ్లు తాగడంతో తొందరగా ఆహారం విచ్చిన్నమయ్యి వేగంగా జీర్ణ మయ్యిపోతుంది. దీంతో వెంటనే ఆకలిగా అనిపించి..అతిగా తినడానికి దారితీస్తుంది. ఫలితంగా బరువు పెరగడం, ఓబెసిటీ వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గుండెల్లో మంట..భోజనం చేసిన వెంటనే తాగిన నీరు జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేసి ఆమ్లత్వానికి దారితీసి గుండెల్లో మంటకు కారణమవుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ రసాయనాలు, డైజిస్టివ్ ఎంజైమ్‌లు అదనపు నీటితో కరిగించబడి ఆమ్లత్వానికి దారితీస్తుంది. దీంతో గుండెల్లో మంట వంటివి కలుగుతాయి. ఇన్సులిన్ పెరుగుదలకు..ఇలా నీళ్లు తాగడం వల్ల కొంత ఆహారం జీర్ణం కాకుండా ఉండిపోయే అవకాశం ఉంది. ఇది కాస్త కొవ్వుగా మారి శరీరంలో నిల్వ చేయడబడి ఇన్సులిన్ పెరుగుదలకు దారితీస్తుంది. దీంతో మధుమేహానికి దారితీసి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడానికి కారణమవుతుంది. ఎలా తాగడం మంచిదంటే..భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత నీరు తాగడానికి సరైన సమయం అని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ భోజనం చేస్తున్నప్పుడూ ఎక్కిళ్లు వచ్చి నీళ్లు తాగక తప్పడం లేదు అనుకుంటే..తింటున్నప్పుడూ మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నీటిని సిప్ చేయండి. ఇలా చేస్తే కాస్త గొంతులో ఆహారం సాఫీగా దిగడమే కాకుండా ఆహారం మృదువుగా అయ్యి సులభంగా జీర్ణమవుతుంది. అలాగే బాగా చల్లగా ఉన్న నీటిని అస్సలు తాగొద్దు. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేసి జీర్ణమయ్యే వ్యవధిని మందగించేలా చేస్తుంది. పైగా యాసిడ్ రిఫ్లక్స్‌కి దారితీసి, టాక్సిన్ సేకరణకు దారితీస్తుంది. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ తినేటప్పుడూ ఎరేటెడ్ డ్రింక్స్, కెఫిన్ వంటి పానీయాలను తీసుకోకండి అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: పుణే ఘటన! ఎవరిది ఈ పాపం? ఇది పేరెంటింగ్ వైఫల్యమేనా..?) -
Summer Special: ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త!
ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ లోనుంచి బాటిల్ తీసుకుని చల్లని నీళ్లు గటగటా తాగడం చాలా మందికి అలవాటే. విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగించేమాట నిజమే అయినా ఇలా చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల గొంతు నొప్పి, టాన్సిలైటిస్ సమస్య మాత్రమే కాదు.. జీర్ణక్రియ నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు... చివరకు గుండెపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని తాగడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఘన ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం వస్తుంది.అంతేకాదు, చల్లటి నీటిని తాగడం వల్ల ఈ నాడి చల్లబడుతుంది. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా తగ్గితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో వివిధ రకాల సమస్యలు సంభవిస్తాయి. చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు గట్టిపడుతుంది. ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది.అందువల్ల వీలయినంత వరకు ఎండలో నుంచి రాగానే చల్లటి నీళ్లు తాగకూడదు. అందులోనూ ఫ్రిజ్‌లోని నీళ్లు తాగడం అసలు మంచిది కాదు. కొంచెంసేపు ఆగిన తర్వాత కుండలోని నీళ్లు లేదా నార్మల్ వాటర్ ముందు తాగి, ఆ తర్వాత చల్లటి నీళ్లు తాగినా ఫరవాలేదు.ఇవి చదవండి: Summer Special: పిల్లల్లో... వ్యాధి నిరోధకత పెంచండిలా! -
ఎండుతున్న జలకళ
అనుకున్నంతా అయింది. విశ్లేషకులు భయపడుతున్నట్టే జరిగింది. మొన్న మార్చిలోనే దేశంలోని ప్రధాన జలాశయాలన్నీ అయిదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి అడుగంటినట్టు వార్తలు వచ్చి నప్పుడు వేసవిలో ఇంకెంత గడ్డుగా ఉంటుందో అని భయపడ్డారు. సరిగ్గా అప్పుడనుకున్నట్టే ఇప్పుడు దేశం నీటికొరత సంక్షోభంలోకి జారిపోతోంది. ఏప్రిల్ 25 నాటికి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయినట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు వెల్లడించాయి. ముఖ్యంగా, దక్షిణాదిలో పదేళ్ళలో ఎప్పుడూ లేనంత కనిష్ఠస్థాయికి జలాశ యాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. సాగునీటికీ, తాగునీటికీ, జలవిద్యుత్ ఉత్పత్తికీ తిప్పలు తప్పేలా లేవు. ఆ సవాళ్ళకు సంసిద్ధం కావాల్సిన అవసరాన్ని గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.దేశం మొత్తం మీద రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యంలో కేవలం 30 శాతం వరకే ప్రస్తుతం నీళ్ళున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఏడాది కన్నా తక్కువ. అందుకే ఇప్పుడింతగా ఆందోళన. వర్షాకాలంలో 2018 తర్వాత అతి తక్కువ వర్షాలు పడింది గత ఏడాదే. దానికి తోడు ఎల్‌నినో వాతావరణ పరిస్థితి వల్ల గత వందేళ్ళ పైచిలుకులో ఎన్నడూ లేనంతగా నిరుడు ఆగస్టు గడిచి పోయింది. వర్షాలు కురిసినా, కొన్నిచోట్ల అతివృష్టి, మరికొన్నిచోట్ల అనావృష్టి. ఇవన్నీ కలిసి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా వర్షాలు కొరవడడంతో నీటి నిల్వలు తగ్గి, అనేక ప్రాంతాలు గొంతు తడుపుకొనేందుకు నోళ్ళు తెరుస్తున్నాయి. హెచ్చిన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పులు సైతం నీటిమట్టాలు వేగంగా పడిపోవడానికి కారణమయ్యాయి. దేశంలో తూర్పు ప్రాంతంలోని అస్సామ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో నీటి నిల్వలు కొంత మెరుగ్గా ఉన్నాయి కానీ, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రధానంగా తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఈ ప్రభావం అమితంగా కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలకూ తిప్పలు తప్పడం లేదు. దక్షిణాదిలో దాదాపు 42 జలాశయాలను సీడబ్ల్యూసీ పర్యవేక్షిస్తుంటుంది. గత ఏడాది ఇదే సమయానికి వాటిలో 29 శాతం దాకా నీళ్ళున్నాయి. దశాబ్ద కాలపు సగటు గమనిస్తే, ఈ సమయానికి కనీసం 23 శాతమన్నా నీళ్ళుండేవి. కానీ, ఈ ఏడాది కేవలం 17 శాతానికి తగ్గిపోయాయి. దాన్నిబట్టి ప్రస్తుత గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్, మహారాష్ట్రలున్న పశ్చిమ భారతావనిలోనూ అదే పరిస్థితి. అక్కడ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 49 రిజర్వాయర్లలో పదేళ్ళ సగటు 32.1 శాతం కాగా, నిరుడు నీటినిల్వలు 38 శాతం ఉండేవి. కానీ, ఈసారి అది 31.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మధ్య, ఉత్తర భారతావనుల్లోనూ జలాశయాల్లో నీళ్ళు అంతంత మాత్రమే. అక్కడ చారిత్రక సగటు నిల్వలతో పోలిస్తే, ఈసారి బాగా తక్కువగా ఉన్నాయట. మొత్తం మీద దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాల రీత్యా చూస్తే... నర్మద, బ్రహ్మపుత్ర, తాపీ నదీపరివాహక ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం సాధారణ నిల్వస్థాయుల కన్నా మెరుగ్గా ఉంది. అయితే, కావేరీ నదీ పరివాహక ప్రాంతం, అలాగే మహానది, పెన్నా నదులకు మధ్యన తూర్పు దిశగా ప్రవహించే పలు నదీ క్షేత్రాలు తీవ్రమైన లోటును ఎదుర్కొంటున్నాయి. ఎండలు ముదిరి, వేసవి తీవ్రత హెచ్చనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత గడ్డుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఇవన్నీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. బెంగళూరు కొద్ది వారాలుగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలో కూరుకుపోయింది. విషయం జాతీయ వార్తగా పరిణమించింది. ఇక, తమిళనాట పలు ప్రాంతాల్లో నెర్రెలు విచ్చిన భూములు, ఎండిన జలాశయాలు, తాగునీటి కొరతతో బిందెడు నీళ్ళ కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. సహజంగానే నిత్యజీవితంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలనూ ఈ నీటి నిల్వల కొరత బాధిస్తోంది. తగిన నీటి వసతి లేక వివిధ రకాల పంటలు, తోటలు దెబ్బతింటున్నాయి. ఇవాళ్టికీ భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం కీలకం. జలాశయాల్లో తగ్గిన నీటితో అది పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ మన దేశంలోని సేద్యపు భూముల్లో దాదాపు సగం వర్షపు నీటిపైనే ఆధారపడ్డాయి. రానున్న వర్షాకాలంలో సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతుందని అంచనా వెలువడింది. ఫలితంగా, ఋతుపవనాలు ఇప్పుడున్న చిక్కులను తొలగిస్తాయన్నది ఆశ. నిజానికి, దేశంలో జలవిద్యుదుత్పత్తి సైతం తగ్గుతూ వస్తోంది. విద్యుచ్ఛక్తి గిరాకీ విపరీతంగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో హైడ్రోపవర్ జనరేషన్ 17 శాతం పడిపోయింది. ఆ మాటకొస్తే, తగ్గుతున్న జలాశయాల నిల్వలు, పెరుగుతున్న ప్రజల నీటి అవసరాల రీత్యా గత కొన్ని దశాబ్దాలుగా ఆసియాలో, ప్రధానంగా చైనా, భారత్‌లలో జలవిద్యుదుత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో జలసంరక్షణ కీలకం. ప్రభుత్వాలు, పాలకులు తక్షణం స్పందించి, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టం. గృహవినియోగం మొదలు వ్యవసాయ పద్ధతులు, పారిశ్రామిక కార్యకలాపాల దాకా అన్ని స్థాయుల్లోనూ నీటి వృథాను తగ్గించి, ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టుకోవడం ముఖ్యం. నీటి నిల్వ, పంపిణీలు సమర్థంగా సాగేలా చూడాలి. సుస్థిర వ్యవసాయ విధానాలు, పంటల వైవి ధ్యంతో నీటి వినియోగాన్ని తగ్గించాలి. ఎప్పుడైనా వర్షాలు లేక, దుర్భిక్షం నెలకొన్నా తట్టుకొనే సామర్థ్యం పెంపొందించుకోవాలి. నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత నుంచి వర్షపునీటి నిల్వల దాకా అన్నిటిపై ప్రజా చైతన్యం కలిగించాలి. గడ్డుకాలం కొనసాగితే, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సత్వరమే మేలుకోవాలి. -
నీరమ్మా... నీరు
ముసిల్దానికి అర్ధరాత్రి దప్పికేసింది. ‘నీల్లు... నీల్లు’... ప్రాణం తుదకొచ్చి అంగలార్చింది. పదేళ్ల మనవరాలు పోలికి దిక్కు తెలియలేదు. బంగారమో, వెండో అయితే ఎవరింటి నుంచైనా దేబిరించి తేవచ్చు. నీళ్లెక్కడవి? అందునా రాళ్లమిట్ట అనే ఈ ఊళ్లో. వానలకు ముఖం వాచిన రాయలసీమ వాకిట్లో! ‘నీల్లే’... ముసల్ది ఆర్తనాదం చేసింది. మనవరాలికి ఉన్నది ఒక్కతే అవ్వ. అవ్వకు మిగిలింది ఒక్కతే మనవరాలు. మనవరాలు అవ్వ దగ్గరికి వచ్చి నిలబడింది. ముసల్దాని కట్టె బిగుసుకుపోతూ ఉంది. ‘తెస్తానుండవ్వా’ సత్తు చెంబు తీసుకొని పరిగెత్తింది. ఎక్కడికి? పక్కింటికా? దాపున ఉన్న బావికా? ఎక్కడా నీళ్లు లేవు. ఊరవతల కోనేటికి వెళ్లాలి. ఈ రాత్రి... నిర్మానుష్యదారుల్లో. దాహానికి పిడచగట్టిన బాట వెంట. పోలి పరిగెత్తింది. భయంతో పరిగెత్తింది. దడతో పరిగెత్తింది. దప్పికతో పరిగెత్తింది. కోనేరు వచ్చింది. చీకటి పరదాలు కప్పుకుని ఉన్న నీరు. రాత్రయితే దెయ్యాలు తిరుగుతాయని చెప్పుకునే తావు. నుదుటి మీద చెమటతో పోలి కోనేటి మెట్ల మీద నిలుచుంది. వెళ్లిపోదామా? అవ్వ దప్పికతో ఉందే! ధైర్యం చేసి దిగింది. చెంబు ముంచింది. ఎవరో చేయి పట్టి లాగిన భ్రాంతి. ‘ఓలమ్మో’. పోలి నీళ్లలో పడింది. జీవితాన మరలా దప్పికే వేయనంత నీరు తాగుతూ మింగుతూ ఆ చిన్నారి పోలి, పసిపిల్ల పోలి అలా అడుక్కు వెళ్లిపోయింది. రాయలసీమ రచయిత దాదా హయత్ రాసిన ‘గుక్కెడు నీళ్లు’ కథ ఇది. నీళ్లెప్పుడో తెల్లారి మూడుగంటలకు వస్తాయి. నిద్ర చెడిపోతుంది. పోనీ వచ్చేవి నిండుగా వస్తాయా? రెండు బిందెలు దొరికితే పెన్నిధి. అంత తెల్లవారుజామున మొగుడు లేస్తాడా? పెళ్లామే లేవాలి! దక్కిన నీళ్లను ఇంట్లో మొగుడు సర్దుబాటు చేస్తాడా? పెళ్లామే చేయాలి. అన్నం దగ్గర అందరూ కూచున్నప్పుడు చేయి కడుక్కునే ఉప్పునీళ్ల చెంబు ఒకవైపు, తాగే నీళ్ల చెంబు ఒకవైపు. భూమి బద్దలైపోయినా చెంబులు మారడానికి లేదు. ఆ రోజు ఇంటి పిల్లాడు తాగే నీళ్లతో చేయి కడిగేశాడు పొరపాటున. అంతే! తల్లి భద్రకాళి అయ్యింది. పిల్లాడి వీపు చిట్లగొట్టేసింది. ఆనక వాణ్ణే పట్టుకుని బోరుమని ఏడ్చింది. ఆ కళ్లల్లో వచ్చేన్ని నీళ్లు కుళాయిలో వస్తే ఎంత బాగుండు! బండి నారాయణ స్వామి రాసిన ‘నీళ్లు’ కథ ఇది. తల్లి ‘ఒక బిందె నీళ్లు తేమ్మా’ అంటే బిందె పట్టుకుని వెళ్లిన కూతురు సాయంత్రమైనా పత్తా లేదు. వయసొచ్చిన కూతురు. షాదీ చేయాల్సిన కూతురు. అందాక రోజూ నీరు మోసి తేవాల్సిన కూతురు. ‘ఈ నీళ్ల బాధ పడలేనమ్మా. నన్ను నీళ్ల కోసం బయటకు పంపని గోషా పెట్టే ఇంట్లో పెళ్లి చెయ్యి’ అనడిగిందా కూతురు. నీళ్లున్న చోట గోషా కానీ నీళ్లు లేని చోట ఏం గోషా! కూతురైనా, కోడలైనా నీళ్లకు పోవాల్సిందే. ‘నీళ్లు ముందు... మతం తర్వాత తల్లీ!’ అందా తల్లి కూతురితో. పాపం ఏమనుకుందో ఆ కూతురు! నీళ్ల బిందె పట్టుకెళ్లి ఆ తర్వాత ఎవరితోనో వెళ్లిపోయింది. ఎవరు తీసుకెళ్లాడో వాడు ఆమె చేత నీళ్లు మోయించకుండా ఉంటాడా? ఏమో! వేంపల్లి షరీఫ్ రాసిన ‘పానీ’ కథ ఇది. కాళీపట్నం రామారావు ‘జీవధార’ కథ ప్రఖ్యాతమైనది. అందులో బస్తీ ఆడవాళ్లు సంపన్నుల బంగ్లా ముందు నీళ్ల కోసం నిలువుకాళ్ల కొలువు చేస్తుంటారు. ‘వెళ్తారా కుక్కల్ని వదలమంటారా?’ అంటుంటారా బంగ్లావాళ్లు. ‘మీరు కుక్కల్ని వదిలితే మేము అంతకన్నా పెద్దగా మొరిగి తరిమికొడతాం’ అంటారు బస్తీ ఆడవాళ్లు. పాలకుల పుణ్యాన నీళ్లు లేక వారిది కుక్కబతుకైంది మరి. పేదలు తెగబడితే నిలువరించే ఇనుపగేట్లు ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. సంపన్నులు తల ఒంచి నీళ్లు ఇవ్వడానికి గేట్లు తెరుస్తారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘నీళ్లు’ కథ కూడా విఖ్యాతమైనదే. అందులో రాయలసీమ నుంచి విజయవాడకు ఉద్యోగం కోసం వచ్చిన యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు ముంచుకోదగ్గ కూజాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం చేయదగ్గ కృష్ణ ప్రవాహాన్ని చూసి తబ్బిబ్బవుతాడు. ఎన్ని బకెట్లు కావాలంటే అన్ని బకెట్లు పోసుకోదగ్గ బావి గట్టును అతడు వదలడే! ‘మా ఊళ్లో ఇన్ని నీళ్లుంటే ఎంత బాగుండు’ అని నీళ్లకు దీనులయ్యే తల్లినీ, చెల్లినీ అతడు తలుచుకు ఏడ్వని రోజు ఉందా? ఇదంతా ఒక బాధైతే దళితులది మరో బాధ. అవును. నీటికి కూడా కులం ఉంటుంది. వారు తాగేందుకు వేరే గ్లాసుంటుంది. ఈ బాధ పడలేక ఇంట్లోనే బావి తవ్వించుకోవాలనుకుంటాడో దళిత లెక్చరరు అనంతపురంలో. కాని బండ పడుతుంది. బతుకులో వర్ణాశ్రమబండ... బావిలో రాతి బండ. కాని ఆగకూడదు. ఆగితే ప్రాణం, ఆత్మాభిమానం మిగలదు. ధైర్యం చేసి బండను తూటాలతో పేలుస్తాడు లెక్చరరు. బండ ముక్కలవుతుంది. గంగ పైకి ఎగజిమ్ముతుంది. నేలమ్మకు అంటరానితనం లేదు. అది ప్రతి బిడ్డకు నీళ్లు కుడుపుతుంది. కొలకలూరి ఇనాక్ ‘అస్పృశ్య గంగ’ కథ ఇది. నీరు నాగరికత. నీరు సంస్కృతి. నీరు శుభ్రత. నీరు సిరి. నీరు శాంతి. నీరు గాదె. నీరు బోదె. నేల మీదున్న, నింగి మీదున్న నీటిని ఏ జనవాహినైతే కాపాడుకోగలదో దానిదే భవిష్యత్తు. మండు వేసవిలో నిండు కుండను ఇంట ఉంచగలిగేలా చూసేదే మంచి ప్రభుత. ప్రకృతి ఎన్నో సంకేతాలిస్తోంది. సూచనలు చేస్తోంది. నీళ్లింకిన నగరాలను ఆనవాలు పట్టిస్తోంది. నీళ్లు లేకపోతే ఏమవుతుందో సాహిత్యం కన్నీటి తడితో రాసి చూపింది. మేల్కొనడం మన వంతు! -
తెలంగాణకు 8.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాగునీటి అవసరాలకు తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయపురే నేతృత్వంలో ఈ ముగ్గు రు సభ్యుల కమిటీ శుక్రవారం జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో రాయపురే 2 గంటలకు పైగా చర్చించారు. తుదకు శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటి నిల్వలను వినియోగించుకోవద్దని నిర్ణ యించారు. సాగర్ రిజర్వాయర్‌లోని నీటి నిల్వలపై చర్చించారు. సాగర్ ఎండీడీఎల్ 510 ఫీట్లు కాగా, గతంలో 505 ఫీట్ల వరకు అందుబాటులో ఉన్న నీటిని లెక్కగట్టి ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. తాజా సమావేశంలో దీన్ని 500 అడుగులకు తగ్గించారు. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 510.53 అడుగులు కాగా, 132.86 టీఎంసీలు అందుబాటులో ఉన్నా యి. అందులో 500 అడుగుల ఎండీడీఎల్ మేరకు మొత్తం 17.55 టీఎంసీలు ప్రస్తుతం వినియోగానికి అందుబాటు లో ఉన్నాయి. అందులో 3.55 టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించి మిగతా 14 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. తదుపరి అవసరాలపై మేలో సమా వేశం కావాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. రెండు రాష్ట్రాల విజ్ఞప్తితో.. మే మాసాంతం వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ గత అక్టోబర్‌లో చివరి సారిగా సమావేశమైంది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస మట్టం (ఎండీడీఎల్)ను 805 ఫీట్లు, సాగర్ ఎండీడీఎల్‌ను 505 ఫీట్లకు నిర్ణయించి, వేసవి ఆవిరి నష్టాలను కూడా లెక్కగట్టి రెండు జలాశయాల్లో 92.78 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్టు నిర్ధారించింది. అయినప్పటికీ మే మాసాంతం వరకు మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 82.78 టీఎంసీలనే వినియోగించాలని అప్పట్లో కమిటీ నిర్ణయించింది. అందులో 2.78 టీఎంసీలను జూన్, జూలై తాగునీటి అవసరాల కోసమని రిజర్వ్ చేసింది. మిగిలిన 80 టీఎంసీల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి కేటాయించిన విషయం విదితమే. కాగా కమిటీ నిర్ణయించిన కోటాకు మించి తెలంగాణ ఇప్పటికే 11 టీఎంసీలను వినియోగించుకుంది. ఏపీ కోటా మేరకు వినియోగించుకుంది. అయితే ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు అదనంగా జలాలను విడుదల చేయాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంది. సమావేశంలో సాగర్ సీఈ అజయ్‌కుమార్, ఈఈ విజయ్‌భాస్కర్, కృష్ణా బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సల్లా విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో మంచినీటి కొరత ఎక్కువగా ఉంది: ఈఎన్సీ త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించామని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశానంతరం చెప్పారు. 2 రాష్టాల అంగీకారంతో నీటి వాటాల పంపిణీ జరిగిందని తెలిపారు. ఏపీలో మంచినీటి కొరత కొంత ఎక్కువగా ఉందని వివరించారు. -
ఎండల తీవ్రత ముదురుతున్నా.. జూన్ వరకు నీటి సమస్య రాదు
సాక్షి, హైదరాబాద్: ఎండల తీవ్రత ముదురుతున్నా.. వచ్చే జూన్ వరకు రాష్ట్రంలో తాగునీటి సమస్య అధికం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో తాగునీటి ఎద్దడి కాస్త అధికంగా ఉన్నట్లు గుర్తించామనీ, అలాగే 67 మున్సిపాలిటీలను సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. తాగునీటి సమస్యపై ప్రతీరోజు ఉన్నతస్థాయిలో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. తాగునీటి సమస్య పర్యవేక్షణకు ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించిన విషయాన్ని గుర్తు చేసింది. ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందన తాగునీటి సమస్య ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చినా, వార్తలు వచ్చినా వెంటనే అధికార యంత్రాంగం స్పందిస్తోందని ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 143 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉంటే.. అందులో 130 మునిసిపాలిటీల్లో సాధారణ రోజులతో పోలిస్తే పదిశాతం మేరకు నీటి కొరత ఉన్నా.. ప్రజలకు సరిపడే తాగునీటి సరఫరా జరుగుతోందని వివరించింది. సాధారణ రోజుల్లో ఈ పట్టణాల్లో సగటున 1398.05 ఎల్ఎండీ(మిలియన్స్లీటర్స్ పర్ డే) తాటి సరఫరా జరిగితే ప్రస్తుతం 1371 ఎల్‌ఎండీల నీటి సరఫరా జరుగుతోందని, 26.31 ఎల్‌ఎండీల కొరత ఏర్పడిందని స్పష్టం చేసింది. పది మునిసిపాలిటీలతోపాటు, రెండు కార్పొరేషన్లలో అధికంగా నీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఖమ్మం, కరీంనగర్లో ప్రత్యామ్నాయ చర్యలు ఖమ్మం, కరీంనగర్లో ఎండలు ముదిరే కొద్ది నీటి ఎద్దడి పెరుగుతుందన్న అంచనాతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 27 పట్టణాల్లో 135 ఎల్ పీసీడీ(లీటర్స్ పర్ పర్సన్ పర్డే) కంటే ఎక్కువ నీటి సరఫరా జరుగుతుంటే, 48 పట్టణాల్లో 100 నుంచి 135 ఎల్పీసీడీల మధ్య, 67 మునిసిపాలిటీల్లో 100 ఎల్పీసీడీ కంటే తక్కువ సరఫరా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 23,839 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, గ్రామాల్లో నీటి ఎద్దడి లేదని భగీరథ అధికారవర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో వంద ఎల్పీసీడీ నీటి సరఫరా జరుగుతోంది. అందుబాటులో గ్రిడ్, స్టాండ్ బై పంపులు మంచినీటి సమస్య ఎక్కడైనా తలెత్తితే గ్రిడ్ పంప్‌లతోపాటు, స్టాండ్‌బై పంపులు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా స్థాయిలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు జిల్లా కలెక్టర్లకు మొత్తం రూ. 100 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. నాగార్జునసాగర్ నుంచి పాలేరు, ఉదయ సముద్రం రిజర్వాయర్ల నుంచి నల్గొండ, ఖమ్మం పట్టణాలకు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేట్టింది. మిడ్ మానేర్, లోయర్ మానేరు నుంచి కరీంనగర్ నగరానికి నీటిని అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే కర్ణాటక లోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కొంత నీటిని విడుదల చేయాలంటూ అక్కడి ప్రభుత్వాన్ని కోరాలని ఇప్పటికే ఇరిగేషన్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. నారాయణపూర్ నుంచి జూరాల రిజర్వాయర్‌కు వచ్చే నీటితో గద్వాల మిషన్ భగీరథకు తాగునీటి సరఫరా చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు 131 పట్టణాల్లో అందుబాటులో ఉన్న 294 ప్రభుత్వ ట్యాంకర్లతో పాటు 97 ట్యాంకర్లను అద్దెకు తీసుకుని, అత్యవసరమైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నీటి మట్టాలు తగ్గడం వల్లనే ఎద్దడి గడిచిన అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడం, గోదావరి, కృష్ణా రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గడం వల్ల తాగునీటి సమస్య ఉత్పన్నం అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వేసవి తీవ్రతతో ఎండలు పెరుగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ ప్రత్యేకంగా మూడుసార్లు వాటర్ బెల్ మోగించి.. విద్యార్థులంతా తప్పనిసరిగా మంచినీరు తాగేలా చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈనెల 23తో ముగియనుంది. అప్పటివరకు ‘వాటర్ బెల్’ కొనసాగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి కూడా ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగించనుంది. డీహైడ్రేషన్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంపునకు ప్రత్యేక పోస్టర్లను సైతం పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. విద్యాశాఖ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచే విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎదిగే పిల్లల్లో నీటిలోపం లేకుండా చేసేందుకే.. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇదొక్కటే కాకుండా పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో నీటి లోపం లేకుండా చూసేందుకు వాటర్ బెల్ విధానం ఉపయోగపడుతుంది. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా పారదర్శకంగా ఉంటే శరీరంలో తగినంత నీరు ఉందని, సరిపడినంత నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం లేత గోధుమ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించవచ్చు. లేత పసుపు రంగులో ఉంటే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే నీరు తక్కువగా తాగుతున్నారని, మరికొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో ఉంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని సంకేతం. ముదురు గోధుమ రంగులో మూత్రం ఉంటే వెంటనే ఎక్కువ నీరు తాగాలని అర్థం. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటిస్తారు. రోజూ మూడుసార్లు వాటర్ బెల్ రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు మొత్తం మూడుసార్లు వాటర్ బెల్ మోగిస్తున్నారు. బెల్లు మోగిన వెంటనే ప్రతి విద్యార్థి మంచినీరు తాగాల్సిందే. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కూడా వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. రోజూ వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈవోలకు సూచించారు. అంతేకాకుండా మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు తెలుసుకునేలా మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటించాలని ఆదేశించారు. దీనిద్వారా నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించవచ్చన్నారు. -
నీళ్లు లేవు.. సార్లు రారు
మంథని: ‘మా బడిలో తాగేందుకు మంచినీళ్లు రావు.. మరుగుదొడ్లులేవు.. సార్లయితే స్కూల్‌కే రావడం లేదు.. అదే మని అడిగితే బెదిరిస్తున్నారు. మూడేళ్లు గా ఇదే దుస్థితి.. అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. ఓపిక నశించి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కినం’అని పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలుర గురుకుల వసతి గృహం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలోని మంథని – కాటారం ప్రధాన రహదారిపై వెంకటాపూర్ క్రాస్ రోడ్డు వరకు కాలినడకన చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు హాస్టల్ నుంచి బయలు దేరిన సుమారు వంద మంది విద్యార్థులు.. వెంకటాపూర్ క్రాస్‌రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా బోధించడం లేదని వాపోయారు. కలుషితనీటితో అలర్జీ వస్తోందని, చాలామంది అనారోగ్యం బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలని సార్లకు చెబితే పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై వచ్చి నచ్చజెప్పి.. గంటల కొద్దీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు స్తంభించాయి. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ అధికారులతో మాట్లాడుతానని విద్యార్థులకు నచ్చజెప్పారు. వారిని వసతి గృహానికి తీసుకెళ్లి అవగాహన కల్పించారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆర్సీవో గౌతమ్, జిల్లా కనీ్వనర్ సుస్మిత హాస్ట ల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన.. బోధన్/రుద్రూర్: నిజామాబాద్ జిల్లా లోని బోధన్, సాలూర, రుద్రూర్, పోతంగల్ మండలాల్లోని గ్రామాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయని, కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటల కోతలు 50 శాతం వరకు పూర్తయ్యాయి. కాగా, మిగిలిన పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. -
అడుగంటిన పాలేరుకు జీవం
సాక్షి, మహబూబాబాద్: మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే పాలేరు జలాశయంలో నీరు అడుగంటడంతో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీరు వదిలారు. ఎడమ కాల్వనుంచి రోజుకు 3,300 క్యూసెక్కుల నీటిని పాలేరు జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో నాలుగు జిల్లాలకు పొంచి ఉన్న తాగునీటి ముప్పు తప్పింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లోని 2,439 గ్రామాలకు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు, నర్సంపేట మున్సిపాలిటీలకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నారు. వీటి పరిధిలోని సుమారు 22లక్షల జనాభాకు పాలేరు నుంచి వచ్చే గోదావరి నీరే ఆధారం. ఇటీవల పాలేరు జలాశయం అడుగంటే పరిస్థితికి చేరుకుంది. 2.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో నీరు బుధవారం నాటికి 0.49 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ఉన్న నీటితో రెండు, మూడు రోజులకు మించి తాగునీరు అందదని అధికారులు భావించి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు, రాష్ట్ర ఉన్నతాధికారులకు వివరించారు. ఈ నేపథ్యంలో సాగర్ జలాలు విడుదల చేయడంతో ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు విడుదల చేసే నీరు ఏప్రిల్, మే నెలలకు సరిపోనుందని, ప్రస్తుతానికి గండం తప్పినట్లేనని పాలేరు గ్రిడ్ డీఈ మురళీకృష్ణ చెప్పారు. -
కృష్ణా జలాలు తీసుకుంది చాలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీళ్లను తీసుకోవడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని కృష్ణా నదీయాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్యులు డాక్టర్ ఆర్ఎన్ శంఖువా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నెల 2న లేఖ రాశారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ జరిపిన కేటాయింపులకు మించి 7.391 టీఎంసీ లను తెలంగాణ వాడుకుందని ఫిర్యాదు చేస్తూ ఈ నెల 1న ఏపీ రాసిన లేఖకు స్పందించి ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఉభయ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. కృష్ణాబోర్డుపై తెలంగాణ గరం.. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టు ఏపీ చేసిన ఆరోపణలతో ఏకీభవిస్తూ కృష్ణాబోర్డు తెలంగాణను కట్టడి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంలో కృష్ణాబోర్డు తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. త్వరలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కృష్ణాబోర్డుకు తమ నిరసనను తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం శ్రీశైలం, సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం వాడుకున్న జలాల్లో 20శాతాన్ని మాత్రమే లెక్కించాల్సి ఉండగా, 100 శాతం జలాలను కృష్ణాబోర్డు లెక్కించడాన్ని చాలాకాలంగా తెలంగాణ తప్పుబట్టుతోంది. ఈ వాదనలను ఇప్పటికే కృష్ణాబోర్డు తిరస్కరించింది. 2022–23లో తమ రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 18.701 టీఎంసీలను వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకున్నామని, ఆ నీళ్లను ప్రస్తుత నీటి సంవత్సరం 2023–24లో సైతం తమ రాష్ట్రానికి పునః కేటాయింపులు(క్యారీ ఓవర్) జరపాలని తెలంగాణ చేసిన మరో డిమాండ్‌ను సైతం కృష్ణాబోర్డు తిరస్కరించింది. ఈ రెండు డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను పునఃసమీక్షిస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇంకా మిగిలి ఉంటాయని, ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నట్టు తేలుతుందని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 18.7 టీఎంసీల జలాలు ఇంకా తమకు రావాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్క తేలి్చనట్టు సమాచారం. 2022–23లో సైతం ఏపీ కేటాయింపులకు మించి 51.745 టీఎంసీలను వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తోంది. నేటి త్రిసభ్య కమిటీ భేటీకి రాలేం ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు.. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టగా, ఈ సమావేశానికి రాలేమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తెలియజేశాయి. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. త్రిసభ్య కమిటీ కనీ్వనర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు ఉంటారు. ఆ 8 టీఎంసీలు తెలంగాణకు కావాలి నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 512.5 అడుగులకు పడిపోగా నిల్వలు 136.95 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వమట్టం(డెడ్ స్టోరేజీ) 505 అడుగులు కాగా, బుధవారం నాటికి జలాశయంలో కనీస నిల్వమట్టానికి ఎగువన వాడుకోవడానికి వీలుగా 13.617 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయి. ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసినా, మిగిలిన 8.61 టీఎంసీలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కేటాయించడానికి వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం దృష్టికి కృష్ణా జలాల పంచాయితీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను సూచించాలని విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖకు కృష్ణాబోర్డు లేఖ రాయనున్నట్టు తెలిసింది. ఈ నెల 1న ఏపీ రాసిన లేఖకు స్పందించి ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఉభయ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. కృష్ణాబోర్డుపై తెలంగాణ గరం.. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టు ఏపీ చేసిన ఆరోపణలతో ఏకీభవిస్తూ కృష్ణాబోర్డు తెలంగాణను కట్టడి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంలో కృష్ణాబోర్డు తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. త్వరలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కృష్ణాబోర్డుకు తమ నిరసనను తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం శ్రీశైలం, సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం వాడుకున్న జలాల్లో 20శాతాన్ని మాత్రమే లెక్కించాల్సి ఉండగా, 100 శాతం జలాలను కృష్ణాబోర్డు లెక్కించడాన్ని చాలాకాలంగా తెలంగాణ తప్పుబట్టుతోంది. ఈ వాదనలను ఇప్పటికే కృష్ణాబోర్డు తిరస్కరించింది. 2022–23లో తమ రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 18.701 టీఎంసీలను వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకున్నామని, ఆ నీళ్లను ప్రస్తుత నీటి సంవత్సరం 2023–24లో సైతం తమ రాష్ట్రానికి పునః కేటాయింపులు(క్యారీ ఓవర్) జరపాలని తెలంగాణ చేసిన మరో డిమాండ్‌ను సైతం కృష్ణాబోర్డు తిరస్కరించింది. ఈ రెండు డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను పునఃసమీక్షిస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇంకా మిగిలి ఉంటాయని, ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నట్టు తేలుతుందని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 18.7 టీఎంసీల జలాలు ఇంకా తమకు రావాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్క తేలి్చనట్టు సమాచారం. 2022–23లో సైతం ఏపీ కేటాయింపులకు మించి 51.745 టీఎంసీలను వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తోంది. నేటి త్రిసభ్య కమిటీ భేటీకి రాలేం ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు.. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టగా, ఈ సమావేశానికి రాలేమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తెలియజేశాయి. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. త్రిసభ్య కమిటీ కనీ్వనర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు ఉంటారు. ఆ 8 టీఎంసీలు తెలంగాణకు కావాలి నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 512.5 అడుగులకు పడిపోగా నిల్వలు 136.95 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వమట్టం(డెడ్ స్టోరేజీ) 505 అడుగులు కాగా, బుధవారం నాటికి జలాశయంలో కనీస నిల్వమట్టానికి ఎగువన వాడుకోవడానికి వీలుగా 13.617 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయి. ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసినా, మిగిలిన 8.61 టీఎంసీలను హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కేటాయించడానికి వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం దృష్టికి కృష్ణా జలాల పంచాయితీ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను సూచించాలని విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖకు కృష్ణాబోర్డు లేఖ రాయనున్నట్టు తెలిసింది. -
ఏపీ, తెలంగాణ మధ్య ‘కృష్ణా’ మంటలు!
సాక్షి, హైదరాబాద్: మండు వేసవి కృష్ణా జలాల్లో మంటలు పుట్టించింది. కృష్ణా జలాల వాడకంపై ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు వేసవికి ముందే అడుగంటడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో తాజాగా ఇరు రాష్ట్రాలు కోట్లాటకు దిగాయి. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ జరిపిన కేటాయింపులకు మించి 7.391 టీఎంసీల జలాలను తెలంగాణ వాడుకుందని ఏపీ ఆరోపించింది. లెక్కాపత్రం లేకుండా తెలంగాణ చేస్తున్న నీటి వాడకాన్ని నియంత్రించడానికి సత్వరమే త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణా బోర్డుకు ఈ నెల 1న లేఖ రాసింది. త్రిసభ్య కమిటీకి నీటి అవసరాలపై సరైన ఇండెంట్లు సమర్పించకుండానే.. బోర్డు నుంచి వాటర్ రిలీజ్ ఆర్డర్లు లేకుండానే తెలంగాణ రాష్ట్రం కృష్ణా జలాలను వాడుకుందని లేఖలో ఆరోపించింది. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 513.4 అడుగులకు పడిపోగా నిల్వలు 137.515 టీఎంసీలకు తగ్గిపోయానని ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. డెడ్ స్టోరేజీ లెవల్ 505 అడుగులకు ఎగువన వాడుకోవడానికి వీలుగా 14.182 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నా యని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఏపీ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసేందుకు అనుమతించేలా సీఆర్పీఎఫ్ బలగాలకు ఆదేశాలు జారీ చేయడంతోపాటు నీటి విడుదల ప్రక్రియను పర్యవేక్షించడానికి సిబ్బందిని పంపించాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది. సభ్యులంతా హాజరు కావాలన్న బోర్డు.. ఏపీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కృష్ణా బోర్డు ఈ నెల 4న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, సభ్యులందరూ హాజరు కావాలని ఇరు రాష్ట్రాలను కోరింది. త్రిసభ్య కమిటీ కన్వినర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు వ్యహరించనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలతోపాటు నీటి విడుదల ఆర్డర్ల జారీపై ఈ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు ఏప్రిల్, మేలలో తాగునీటి సరఫరాకు సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని పంపుల ద్వారా తరలించాలని ఇప్పటికే తెలంగాణ నిర్ణయం తీసుకుంది. ‘42.39 టీఎంసీలను తెలంగాణ వాడేసుకుంది’ శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి తమ రాష్ట్రానికి 45 టీఎంసీలు కేటాయించగా తాము 42.457 టీఎంసీలనే వినియోగించుకున్నామని... కానీ తెలంగాణకు 35 టీఎంసీలను కేటాయిస్తే 7.391 టీఎంసీలు అధికంగా మొత్తం 42.391 టీఎంసీలను వాడుకుందని ఏపీ ఆరోపించింది. ఏపీలో తాగునీటికి తీవ్ర కొరత ఉన్నందున పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల తాగునీటి అవసరాల కోసం ఈ నెల 8 నుంచి నీటి విడుదలకు అనుమతించాలని కోరింది. ఏపీ ఆరోపణలకు బదులిస్తూ త్వరలో తెలంగాణ కృష్ణా బోర్డుకు లేఖ రాయనుంది. -
కరెంట్ కోతలుండొద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: వేసవిలో పెరిగిన డిమాండ్‌కు సరిపడా విద్యుత్ లభ్యత ఉందని.. ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండరాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి తీవ్రతతో పెరిగిన డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అన్నారు. కరెంట్ పోయిందనే ఫిర్యాదులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వేసవిలో విద్యుత్, తాగునీటి సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు జారీ చేశారు. అత్యవసర సేవలైన విద్యుత్, తాగునీటి సరఫరాలపై తొలుత సమీక్ష నిర్వహించాలని సీఎం భావించినా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కేవలం సూచనలు జారీ చేశారని సీఎంఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వేసవి అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, పంటలు ఎండిపోకుండా, పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పారు. గత ఏడాది కంటే రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్ సరఫరా చేయటం కొత్త రికార్డును నమోదు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగిందని, పీక్ డిమాండ్ ఉన్నా, కోత లేకుండా విద్యుత్‌ను అందించటంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని ప్రశంసించారు. ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్కని అభినందించారు. తాగునీటి సరఫరాకు యాక్షన్‌ప్లాన్ అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. బోర్‌వెల్స్, బావులను తాగునీటి అవసరాలకు వాడుకోవాలని, సమీపంలో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సమస్య ఉన్న చోట తక్షణ పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆదేశించారు. గ్రామాలవారీగా డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని చెప్పారు. అవసరాన్ని బట్టి రాష్ట్రస్థాయి నుంచి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలలో తాగునీటి కొరత అధిగమించేందుకు వాటర్‌ట్యాంకులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యం లేకుండా 12 గంటల్లోపు అవసరమైన చోటకు చేరేలా చూడాలని, అందుకు సరిపడా ట్యాంకర్లు సమకూర్చుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. గత ఏడాదితో పోలిస్తే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సగటున 9,712 మెగావాట్ల విద్యుత్ లోడ్ ఉంటుంది. గత రెండు వారాలుగా 14,000 మెగావాట్ల నుంచి 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటోంది. ఏప్రిల్ నెల రెండోవారం వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని విద్యుత్ అధికారులు అంచనా వేశారు. – గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్ వినియోగం ఉంటే.. 2024 జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో సగటున రోజుకు 251.59 ఎంయూల విద్యుత్ వినియోగం ఉంది. – గత ఏడాది మార్చి 14న అత్యధికంగా 297.89 ఎంయూల విద్యుత్ వినియోగం ఉండగా, ఈ ఏడాది 308.54 ఎంయూల వినియోగం జరిగి కొత్త రికార్డును సృష్టించింది. – గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. -
వేసవిలో కుండలోని నీళ్లే ఎందుకు బెటర్?
వేసవిలో దాహార్తి మాములుగా ఉండదు. ఎంతలా అంటే ఏం తిన్నా ముందుగా దాహం అనిపించేస్తుంది. దీనిక తోడు బయట ఎండ ధాటికి తట్టుకోలేక చలచల్లగా నీళ్లు ఉంటే చాలనిపిస్తుంది. అందుకని ఫ్రిజ్‌లోని బాటిళ్లను ఖాళీ చేసేస్తుంటాం. అయితే చాలామంది కుండలోని నీళ్లే మంచిది అంటారు. ఫ్రిజ్‌లోని నీరు అస్సలు తాగొద్దని హెచ్చరిస్తుంటారు నిపుణులు. అసలు కుండలోని నీళ్లే ఎందుకు బెటర్ అంటే.. వేసవి రాగానే చల్లదనాన్ని అందించే కూలర్లు, ఏసీల అమ్మకాలు ఊపందుకుంటాయి. ఇదే సమయంలో ఫ్రిజ్ అమ్మకాలు కూడా పెరుగుతాయి. నేడు ప్రతి ఇంట్లో ప్రిజ్ తప్పనిసరిగా ఉంటుంది. కూరగాయలు ఇతర పదార్థాలను స్టోర్ చేసుకోవడంతో పాటు ఇందులో నీటిని కూడా ఉంచి చల్లగా చేసుకుంటాం. అయితే ఫ్రిజ్ నీరు తాగడం అంత మంచిది కాదని కొందరు ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. పూర్వకాలంలో వేసవిలో ఎక్కువగా మట్టితో చేసిన కుండ నీరు తాగేవారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కుండ నీరే తాగుతున్నారు. వేసవిలో కుండ నీరు మాత్రమే చల్లగా ఉంటాయి. ఓపెన్ ప్లేసులో పెట్టడం వల్ల ఇవి మరింత చల్లగా మారుతాయి. ముఖ్యంగా మట్టిలో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి. అందువల్ల కుండనీరు తాగగానే అవన్నీ నేరుగా శరీరంలోకి వెళ్లి మేలు చేస్తాయి. అందువల్ల ఫ్రిజ్ నీరు కంటే కుండలోని నీళ్లే ఆరోగ్యానికి మంచిది. రిఫ్రిజిరేటర్ నీరు మోతాదుకు మించి చల్లదనం ఉంటుంది. దీంతో శరీరంలోని కొన్ని కణాలు దెబ్బతింటాయి. కుండలో నీరు అయితే సమపాళ్లలో చల్లగా ఉంటాయి. దీంతో ఇవి తాగడం వల్ల ఎలాంటి హాని జరగదు. రెగ్యులర్‌గా కుండలో నీరు తాగడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు. ఫ్రిజ్ లో నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి అనూహ్యంగా పెరుగుతుంది. చలవ చేయడం మాటే అటుంచి అందులోనూ ఈ వేసిలో వేడిచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియంది కాదు. అందువల్ల కుండలోని నీటికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది నిపుణులు సూచిస్తున్నారు. అదీగాక మట్టి కుండలో నీరు తాగడం వల్ల జీవ క్రియలు పెరుగుతాయి. పైగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. (చదవండి: Fennel Seeds: సొంపుతో ఇన్ని లాభాలా? ఐతే దీన్ని..!) -
తాగునీటికి ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన మూడు జలాశయాలైన శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నాగార్జున సాగర్‌లలో గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ సరిపడా నీటి లభ్యత ఉన్నందున ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తాగునీటి సరఫరాను సమీక్షించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ‘వేసవి కార్యాచరణ ప్రణాళిక’ను రూపొందించి జిల్లాలకు తగు నిధులను కూడా విడుదల చేసినట్లు సీఎస్ తెలిపారు. తాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు పూర్తి చేయడం జరిగిందన్నారు. నిరంతర నీటి సరఫరా కొనసాగింపునకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి రోజూ గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు, నోడల్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లోని తాగునీటి సమస్యను మన రాష్ట్రానికి కూడా అన్వయిస్తూ ఆందోళనకరమైన వార్తా కథనాలు రాయడం సరికాదన్నారు. ఏప్రిల్ రెండో వారం అనంతరం రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్‌ను చేపడతామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో కూడా సరిపడా నీటి సరఫరా చేస్తున్నామని, వాణిజ్య అవసరాల నిమిత్తం డిమాండ్ ఎక్కువగా ఉందని జలమండలి అధికారులు వెల్లడించారు. -
నల్లా ఇరుక్కు!
మీ ఇంట్లో నల్లాల ద్వారా నీరొస్తోందా.. దాన్ని నేరుగా తాగుతున్నారా? లేదా ఏదైనా ఫిల్టర్‌లో వేసి తాగుతున్నారా? అత్యధిక శాతం ప్రజలు ఫిల్టర్లనే వాడుతుంటారు. ఎందుకంటే.. మంచి నీళ్లని చెబుతున్నా.. అవన్నీ మంచిగా ఉన్నవేనా అన్న డౌటు. ఫిల్టరైజేషన్ చేయకుంటే.. రోగాల బారినపడతామన్న భయం. అయితే.. కొన్ని దేశాల్లో నల్లా నీటిని నేరుగా తాగేయొచ్చు. ఎందుకంటే.. తాగునీటి సరఫరా విషయంలో ఇవి కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి. సురక్షితమైన నీటిని నల్లాల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. అందుకే ఈ కింది దేశాల్లోని నీరు ‘నల్లా ఇరుక్కు’అన్నమాట!! చాలా సినిమాల్లో ఈ మాట విన్నట్లు అనిపిస్తోంది కదూ.. ఈ తమిళ పదానికి అర్థం ఇది బాగుంది లేదా మంచిది అని. మార్చి 22న ‘అంతర్జాతీయ నీటి దినోత్సవం’ నేపథ్యంలో.. ఈ ‘నల్లా ఇరుక్కు’ దేశాల టాప్–10 వివరాలివీ.. ఫిన్లాండ్ ప్రకృతి సహజ వనరులకు పెట్టింది పేరైన ఫిన్లాండ్లో అత్యాధునిక వ్యవస్థలతో విస్తృతంగా నీటి శుద్ధి చేపడతారు. ఇక్కడ నల్లాల ద్వారా సరఫరా చేసే మంచి నీరు ప్రపంచంలోనే సురక్షితమైనదిగా పేరుపొందింది. ఐస్‌ల్యాండ్ ఈ దేశంలో హిమానీ నదాలు (గ్లేసియర్లు), వేడి నీటి ఊటల నుంచి వచ్చే నీరు సాధారణంగానే సురక్షితమైనది. ఆ నీటినే మరికాస్త శుద్ధిచేసి ఇళ్లకు సరఫరా చేస్తారు. స్విట్జర్లాండ్ కలుషితాల విషయంలో కఠిన నిబంధనలు, శుద్ధి చేసేందుకు అనుసరించే విధానాలతో ఈ దేశంలో నల్లా నీళ్లు సురక్షితమైనవిగా గుర్తింపు పొందాయి. ఆస్ట్రియా ఇక్కడి పర్వత ప్రాంతాలు, వాటికి అనుబంధంగా ఉన్న మంచి నీటి వనరులకు తోడు.. నీటి సంరక్షణ చర్యలు, కఠిన నిబంధనలతో నాణ్యమైన నీటిని ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. నార్వే హిమానీనదాలు, ఇతర మంచి నీటి వనరులు అందుబాటులో ఉండటం, నీటి శుద్ధికి అత్యంత ఆధునిక విధానాలు అవలంబించడంతో.. సురక్షిత నీరు సరఫరా చేసే దేశాల్లో నార్వే ఒకటిగా నిలిచింది. నెదర్లాండ్స్ మంచినీటి వనరులు మరీ ఎక్కువగా లేని దేశమే అయి నా.. నీటి శుద్ధి, నల్లాల ద్వారా పరిశుభ్రమైన నీటి సరఫరా విషయంలో ముందు నుంచీ మంచి ప్రమాణాలు పాటిస్తోంది. మాల్టా ఇది చుట్టూ ఉప్పునీరే కమ్ముకుని ఉన్న చిన్న ద్వీప దేశమే అయినా.. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే (డీసాలినేషన్ ప్రక్రియ) ద్వారా సురక్షిత నీటిని ఇళ్లకు సరఫరా చేస్తోంది. ఐర్లాండ్ ఇక్కడ మంచినీటి వనరులు పుష్కలంగా ఉండటంతోపాటు జలాల సంరక్షణ, శుద్ధి విషయంలో కఠిన నిబంధనలతో నాణ్యమైన నీటి సరఫరాలో టాప్–10 దేశాల్లో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ కలుషితాల విషయంలో కఠిన నిబంధనలు పాటించడం, నీటి శుద్ధికి అత్యున్నత విధానాలను అవలంబించడంతో ప్రమాణాలతో కూడిన నీటిని ఈ దేశంలో సరఫరా చేస్తున్నారు. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
బెంగళూరు దాహార్తి!
దేశంలో నీటి ఎద్దడి నిత్యజీవిత వ్యథగా పరిణమించి చాలా కాలమైంది. అది స్థలకాలాదులను అధిగమించింది. దాని బారిన పడని నగరమంటూ లేదు. బెంగళూరు దాహార్తి అందులో భాగమే. అది జనాభారీత్యా దేశంలో మూడో అతి పెద్ద నగరం. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అది దేశానికే ఐటీ రాజధాని. కానీ తాగటానికి గుక్కెడు నీళ్లు కరువైతే ఆ భుజకీర్తులన్నీ దేనికి పనికొస్తాయి? 500 ఏళ్లనాటి ఆ నగరం గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తోంది. టెకీలంతా నగరాన్నొదిలి స్వస్థలాల నుంచి పనిచేయటం మొదలుపెట్టారు. అపార్ట్మెంట్లన్నీ బేల చూపులు చూస్తున్నాయి. కోచింగ్ సెంటర్లు ఆన్లైన్ క్లాసులకు మళ్లాయి. రోడ్డుపై పోయే నీటి ట్యాంకర్ల వెనక జనం పరుగు లెడుతున్నారు. ఇది పరీక్షల కాలమైనా విద్యార్థులకు నీటి అన్వేషణ ముఖ్యమైపోయింది. కావేరి పరివాహ ప్రాంతాన్ని కరువు కాటేయటంతో నగరానికి వచ్చే నీరు తగ్గింది. భూగర్భ జలాలు అడుగంటాయి. మార్చి నెలాఖరుకు రావాల్సిన ఉష్ణోగ్రతలు బెంగళూరును ఫిబ్రవరి మూడోవారంలోనే పలకరించాయి. కోటిన్నర జనాభాగల ఆ నగరంలో వాల్‌మార్ట్ మొదలుకొని గూగుల్ వరకూ ఎన్నో అంతర్జాతీయ సంస్థలున్నాయి. ఇవిగాక బోలెడు స్టార్టప్‌లు కొలువుదీరాయి. బెంగళూరుకు సగటున రోజుకు కనీసం 185 కోట్ల లీటర్ల నీరు లభిస్తుండగా కనీసం మరో 168 కోట్ల లీటర్లు అవసరమని అంచనా. కానీ ఎక్కడుంది లభ్యత? ఇది దిక్కుతోచని స్థితి. ఆరా తీస్తే బెంగళూరు నగరానిది కూడా దేశంలోని అన్ని నగరాల వ్యథే. మౌలిక సదుపాయాల కల్పనపై కనీస స్థాయి దృష్టిపెట్టకుండా దశాబ్దాలుగా అభివృద్ధిని కేంద్రీకరించిన పర్యవసానమే ప్రస్తుత కష్టాలకు మూలకారణం. అభివృద్ధి పేరు చెప్పి వెనకా ముందూ చూడకుండా హరిత ప్రాంతాలను హరించటంవల్ల వర్షాలు గణనీయంగా తగ్గాయి. పెరుగుతున్న జనాభా పేరు చెప్పి ఆవాసప్రాంతాలను విస్తరించటం, అందుకోసం చెరువులనూ, సరస్సులనూ మాయం చేయటం అలవాటైపోయింది. 1961 నాటికి బెంగళూరు నగర పరిసరాల్లో 262 సరస్సులుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 81కి పడిపోయింది. వాస్తవానికి ఆ సరస్సుల్లో ఇప్పటికీ జీవంతో వున్నవి కేవలం 33 మాత్రమే. జనావాసాలకు అననుకూల ప్రాంతాల్లో వుండటంవల్లే ఇవి బతికిపోయాయి. మిగిలినవి పేరుకు సరస్సులుగా వున్నా వాటిలో చుక్క నీరు కూడా కనబడదు. ఇంకా దారుణం... ఇప్పుడున్న సరస్సుల్లో 90 శాతం కాలుష్యం కారణంగా పనికిరాకపోవచ్చని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలో తేలింది. లీటర్ నీటిలో కనీసం 4 మిల్లీగ్రాముల ఆక్సిజన్ వుంటేనే ఆ నీరు మెరుగ్గా వున్నట్టు లెక్క. కానీ అంతకన్నా తక్కువ స్థాయిలో ఆక్సిజన్ వున్నదని నిపుణులు తేల్చారు. ఎన్నడో 1971లో ఇరాన్‌లోని రాంసర్లో నీటి వనరుల సంరక్షణపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో కుదిరిన ఒడంబడికపై సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడావుంది. కానీ దానికి అనుగుణంగా శ్రద్ధాసక్తులు కనబరిచిన దాఖలా లేదు. 2030 నాటికి నీటి అవసరాలు రెట్టింపవుతాయని నీతి ఆయోగ్ నివేదిక 2018లో చెప్పింది. మన దేశంలో కేవలం రక్షిత మంచినీరు అందక ఏటా 2 లక్షలమంది మరణిస్తున్నారని వివరించింది. అంతకు రెండేళ్లముందు దక్షిణ కన్నడ జిల్లాలోని మూద్బిద్రీలో సరస్సులపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. హరిత ఆచ్ఛాదనగా వున్న పట్టణ అడవులు, తడి నేలలు వగైరాలను పట్టణీకరణ కోసం మూడు దశాబ్దాలుగా డీ నోటిఫై చేస్తున్నారనీ, ఇది బెంగళూరుకు ముప్పు కలిగిస్తుందనీ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఏళ్లు గడు స్తున్నకొద్దీ ఆ ధోరణి మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. అసలు పట్టణీకరణలో స్థానిక జీవావరణం, పర్యావరణం, నీటి లభ్యత వగైరాలకు చోటేలేదు. వాటిపై ఎలాంటి అధ్యయనమూ లేదు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల జనాభా అనేక రెట్లు పెరగటం, దాంతోపాటే మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్థం కావటం తరచు కనబడుతున్న వాస్తవం. స్థానికంగా వుండే చెరువులు, సరస్సులు వగైరాల్లో మురుగు నీరు విడిచిపెట్టే దురలవాటుతో అటు నీటి వనరులూ నాశనమవుతున్నాయి, ఇటు భూగర్భ జలాలు సైతం కాలుష్యం బారిన పడుతున్నాయి. నగరాలు నేల చూపులు విడిచిపెడుతున్న తీరు ఆందోళనకరం. నేల విడిచి ఆకాశంలోకి దూసుకుపోయే నగరాలకు చుక్కలు కనబడటం ఖాయమని కేప్‌టౌన్ అనుభవాలు ఆరేళ్ల క్రితమే చెప్పాయి. దక్షిణ అట్లాంటిక్ సముద్ర తీరాన దక్షిణాఫ్రికాలో వున్న ఆ నగరంలో కళ్లు చెదిరే స్థాయిలో భారీ భవంతులు దర్శనమిస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచీ తరలివచ్చే వినియోగ వస్తువులతో అక్కడి మహా దుకాణాలు మెరిసిపోతుంటాయి. ఏటా కనీసం 20 లక్షలమంది ఆ నగర అందచందాల్ని చూడటానికి తరలివస్తారని అంచనా. 46 లక్షల జనాభాగల ఆ నగరం 2018లో నీటి సంక్షోభంలో చిక్కుకుని గుడ్లు తేలేసింది. ఇళ్లకూ, దుకాణ సముదాయాలకూ, కార్యాలయాలకూ నీటి సరఫరాను పూర్తిగా నిలిపేసింది. 200 నీటి కేంద్రాలవద్ద రోజుకు మనిషికి 25 లీటర్ల నీరిస్తామని అన్ని అవసరాలనూ దాంతోనే తీర్చుకోవాలని ప్రకటించింది. నీటి సంరక్షణను ఒక సంస్కృతిగా మార్చుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడటం మొదలెట్టింది. కేప్‌టౌన్ కష్టాలూ, వాటిని ఆ నగరం అధిగమించిన తీరూ అధ్యయనం చేయటం ఒక్క బెంగళూరుకు మాత్రమే కాదు... అన్ని మెట్రొపాలిటన్ నగరాలకూ తక్షణావసరం. నీటి వృథాను, నష్టాలను అరికట్టడంలో... కాలాను గుణమైన ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సంస్థల చొరవను పెంచితేనే ఈ సమస్యను అధిగమించగలమని పాలకులు గుర్తించటం మంచిది. -
రూ.900 కోట్ల తో ఇంటిఇంటికి మంచి నీరు సరఫరా
-
తాగునీటికి తొలి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు, తండాలనే తేడా లేకుండా ప్రతి నివాస ప్రాంతానికి తాగునీరు అందేలా చూడాలని సూచించారు. ఇందుకోసం సాగునీటి, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు కలసి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. వర్షాభావంతో రాష్ట్రంలోని కీలక జలాశయాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అధికారులతో కలిసి తాగునీటి అంశంపై సమీక్షించారు. బోర్లు, మోటార్లకు మరమ్మతులు కొత్త నీటి పథకాలను తెచ్చినప్పుడల్లా అంతకుముందున్న అనేక నీటి వనరులను వదిలేశారని.. అలాంటి వాటిని ప్రస్తుతం వినియోగంలోకి తెచ్చే అవకాశాన్ని పరిశీలించాలని సమీక్షలో సీఎం సూచించారు. కాగ్నా నుంచి తాండూర్, కొడంగల్ నియోజకవర్గాలకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని.. కానీ మిషన్ భగీరథ వచ్చాక దానిని వదిలేశారని చెప్పారు. ఇలాంటివి రాష్ట్రంలో ఎక్కడున్నా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి బోర్లు, బావులు, మోటార్లకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఇందుకోసం ఎమ్మెల్యేలకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి (ఏసీడీపీ) నిధుల నుంచి కోటి రూపాయలు, అవసరమైతే అంతకన్నా ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. కృష్ణానీటిపై దృష్టి పెట్టండి ఏపీ సర్కారు తాగునీటి కోసమంటూ నాగార్జునసాగర్ నుంచి తొమ్మిది టీఎంసీలకుపైగా నీటిని తీసుకుపోతోందని సమీక్షలో అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన రేవంత్.. అంత పెద్దమొత్తంలో తాగునీటిని ఎక్కడ వినియోగిస్తున్నారో సరైన గణాంకాలు తీసుకోవాలని.. ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాలని సూచించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటిని తీసుకోవాలంటే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ ఎంబీ)కి లేఖ రాయాల్సి ఉంటుందని చెప్పగా.. ఎంత నీరు అవసరమో వెంటనే సమీక్షించి లేఖ రాయాలని ఆదేశించారు. నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటకను కోరవచ్చని అధికారులు చెప్పగా.. పరిస్థితిని బట్టి దీనిని చివరి అవకాశంగా తీసుకోవాలని సీఎం సూచించారు. తప్పుడు నివేదికలతో అందని నిధులు ఇటీవల తాను ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు అనేక గ్రామాల్లో తాగునీటి సరఫరా లేదని గుర్తించినట్టు సీఎం చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా 99శాతం ఇళ్లకు నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చినందునే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్ నిధులు రావడం లేదన్నారు. గొప్పలకు పోయి తప్పుడు నివేదికలు ఇవ్వవద్దని అధికారులకు స్పష్టం చేశారు. మొత్తంగా జూలై చివరిదాకా ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్లతో సమీక్షించాలని సీఎస్‌ను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ తాగునీటికి సమస్య లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే హైదరాబాద్‌కు పెద్దగా ఇబ్బందులు లేవని.. అవసరమైతే ఎల్లంపల్లి, నాగార్జునసాగర్‌ల నుంచి తెప్పించుకునే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇక వేసవి పూర్తయ్యే వరకు హైదరాబాద్ నగరంలో తాగునీటి ట్యాంకర్ల రాకపోకలకు పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూడా లని సీఎం ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోని క్షేత్రస్థాయి సిబ్బందికి వేతనాలకోసం నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. -
తాగునీటి కష్టాలకు కారణం కేసీఆరే..
నల్లగొండ: ‘‘మాజీ సీఎం కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులను బీజేపీకి తాకట్టు పెట్టారు. పైగా రేవంత్‌రెడ్డే కేంద్రానికి అప్పగించారని ఉల్టా మాట్లాడుతున్నారు. దీనిపై నల్లగొండలో సభ పెడతామంటున్నారు. కేసీఆర్ నల్లగొండకు ఎలా వస్తారో చూస్తాం. కేసీఆర్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఆయన మిలటరీని పెట్టుకుని వచ్చినా నల్లగొండ ప్రజలు తరిమికొడతారు’’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ (శ్రీశైలం సొరంగమార్గం), డిండి లిఫ్ట్, లోలెవెల్ కెనాల్ ప్రాజెక్టులను పక్కనబెట్టి దక్షిణ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో ఎస్ఎల్బీసీ మంజూరు చేస్తే.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగు, తాగునీటి ఎద్దడి ఏర్పడిందని మండిపడ్డారు. తన బిడ్డ కవిత లిక్కర్ కేసులో జైలుకు పోకుండా ఉండేందుకు కేసీఆర్ బీజేపీకి తలొగ్గి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించారని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో కుమ్మక్కై ఏపీ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. కేసీఆర్ పారిపోయేలా ఉన్నారు! కమీషన్ల కోసం చేసిన ప్రాజెక్టుల వల్లే జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్టు అయ్యారని.. కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేస్తారంటున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తాను జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతోనే కేంద్రం ఏం చెబితే కేసీఆర్ అది చేశారని ఆరోపించారు. ‘‘పులి వస్తోందని హరీశ్‌రావు అంటున్నారు. పులి లేదు, గిలి లేదు. మూటాముల్లె సర్దుకుని పోవాల్సిందే. కేసీఆర్ ఓడిపోయినా ప్రైవేటు స్పెషల్ ఫ్లైట్‌ను ఇంకా ఎందుకు రద్దు చేసుకోలేదు? కవిత లిక్కర్ కేసు సమయంలో అద్దెకు తీసుకుని, మాజీ సీఎం అయినా దాన్ని అలానే ఉంచారంటే ఏ రాత్రి అయినా అరెస్టు చేస్తామంటే.. ఠక్కున ఫ్యామిలీ అంతా పారిపోయేందుకు స్పెషల్ ఫ్లైట్‌ను సిద్ధంగా ఉంచుకున్నారు. దుబాయ్ వెళ్లిపోతే ఎవరూ అరెస్టు చేయరనేది వారి ఉద్దేశం..’’ అని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ విషయంలో కేసు నమోదవడం, కేసీఆర్, హరీశ్‌రావు అరెస్టవడం ఖాయమని పేర్కొన్నారు. హంతకుడికి మంత్రి పదవి ఇచ్చారు నల్లగొండ జిల్లాకు చెందిన హంతకుడికి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని.. ఆ మంత్రి అవినీతికి పాల్పడ్డారే తప్ప ఏనాడూ ప్రాజెక్టులను సందర్శించలేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి వెంకట్‌రెడ్డి ఆరోపణలు చేశారు. రెండు పూటలా తిండికి లేని వ్యక్తి మంత్రి అయ్యాక దోపిడీకి పాల్పడ్డాడని, యాదాద్రి పవర్ ప్లాంట్‌లో దోచుకున్నాడని వ్యాఖ్యానించారు. ఆ అవినీతిపై విచారణ చేయిస్తున్నామని, ఆయన జైలుకుపోక తప్పదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అంతా అవినీతేనని, హెచ్ఎండీఏ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి దగ్గరే వెయ్యి కోట్లు దొరికాయంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. -
నీడనిచ్చిన కుప్పాన్నికూడా.. చప్పరించేసారు
పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఆయన రెక్కల కష్టంతో నిర్మించిన పార్టీని, అధికారాన్ని గుంజుకోవడాన్ని ఏమంటారు? మోసం.. ద్రోహం.. వంచన అనే కదా! నోట్ల కట్టలతో దొంగ ఓట్లతో మూడు దశాబ్దాలుగా నెగ్గుకొచ్చి రాజకీయ భిక్ష పెట్టిన ప్రజలకు చుక్క నీళ్లు ఇవ్వకుండా ఖజానాను దోచేసిన మనిషిని నమ్మక ద్రోహి అనే కదా అంటారు! రాజకీయ అరంగేట్రంలోనే చంద్రబాబు ఫోర్ ట్వంటీ వేషాలు వేయడంతో సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరి ప్రజలు తరిమికొట్టారు. గత్యంతరం లేక వలస వెళ్లిన కుప్పంలోనూ ఆయన అవే వేషాలు వేశారు! ఏడుసార్లు తనను గెలిపించిన కుప్పాన్ని తన కమీషన్ల కోసం తాకట్టు పెట్టి.. నీళ్లివ్వకుండా ఎండగట్టారు! సాక్షి, అమరావతి: కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను తరలించి సాగు, తాగునీరు అందిస్తానని నమ్మబలికిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆ ముసుగులో ఖజానాను దోచేసి పనులు చేయలేక చేతులెత్తేసి నయవంచనకు పాల్పడ్డారు! తన కమీషన్ల కోసం సొంత నియోజకవర్గం కుప్పంను తాకట్టుపెట్టి నీచ రాజకీయం చేస్తున్నారు. బాబు ఇలా మోసం చేస్తే, 2022 సెప్టెంబర్ 23న కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా ప్రజలకు ఇచ్చి న హామీ మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మేలు చేస్తున్నారు. పూర్తయిన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ఈ నెలలోనే సీఎం జగన్ ప్రారంభించి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఇప్పటికే రామకుప్పం మండలం వరకూ కృష్ణా జలాలను తరలించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా చెరువులు నింపి సమృద్ధిగా సాగు, తాగునీరు అందించనున్నారు. పురిటిగడ్డకు ద్రోహం సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన చంద్రబాబు నాడు టీడీపీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడి చేతిలో 17,429 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఆ దెబ్బకు 1985 ఎన్నికల్లో పోటీ చేయడానికే జంకిన చంద్రబాబు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ పంచన చేరి 1989లో తమిళనాడు, కర్ణాటక, రాష్ట్ర సరిహద్దుల్లోని కుప్పం నియోజకవర్గానికి వలస వెళ్లారు. అప్పటి నుంచి గూండాయిజం, నోట్ల కట్టలు, దొంగ ఓట్లతో నెగ్గుకొస్తున్నారు. దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం లో భాగంగా దివంగత వైఎస్సార్ చేపట్టిన హంద్రీ–నీవా సుజల స్రవంతిలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగు, తాగునీరు అందిస్తానని చంద్రబాబు నమ్మబలికారు. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో చిత్తూరు జిల్లా పెద్దపంపాణి మండలం అప్పినపల్లి (207.8 కిమీ వద్ద) నుంచి రోజుకు 216 క్యూసెక్కులను మూడు (పంప్ హౌస్‌లు) దశల్లో ఎత్తిపోసి 123.641 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా తరలించి, 110 చెరువులను నింపడం ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందిస్తామని నమ్మించారు. అంచనాల్లోనే రూ.120 కోట్ల లూటీ! కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను 123.641 కి.మీ. పొడవున తవ్వేందుకు 98,85,140 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 3,84,457 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలి. 2015–16 ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టిపనికి రూ.89, క్యూబిక్ మీటర్ కాంక్రీట్ పనికి రూ.3 వేలు చొప్పున వ్యయం అవుతుంది. ఈ లెక్కన కుప్పం బ్రాంచ్ కెనాల్లో మట్టి, కాంక్రీట్ పనులకు రూ.203.11 కోట్లు ఖర్చు అవుతుంది. మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం, మోటార్లు, ప్రెజర్మైన్లు, విద్యుత్ సరఫరా ఏర్పాటుకు రూ.90 కోట్ల వ్యయం అవుతుంది. 2015–16 ధరల ప్రకారం కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.293.11 కోట్ల వ్యయం అవుతుంది. ఆ మేరకు జలవనరుల శాఖ అధికారులు 2015 మేలో అంచనాలు రూపొందించారు. కానీ అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిడితో పనుల అంచనా వ్యయాన్ని రూ.413 కోట్లకు పెంచేశారు. అంటే టెండర్ల దశలోనే రూ.120 కోట్ల మేర పెంచేసినట్లు స్పష్టమవుతోంది. కడప టీడీపీ అధ్యక్షుడికి కానుక.. అంచనా వ్యయం పెంచేసిన పనులను కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రాకు కట్టబెట్టి రూ.120 కోట్లు కాజేయడానికి చంద్రబాబు స్కెచ్ వేశారు. ఆ మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.413 కోట్లు అంచనా విలువగా నిర్ణయించి 2015 ఆగస్టులో టెండర్లు పిలిచారు. ఆర్కే ఇన్ఫ్రా సంస్థకే పనులు దక్కేలా టెండర్లులో నిబంధనలు పెట్టారు. టెండర్లలో ఆ సంస్థ ఒక్కటే నాలుగు శాతం అధిక(ఎక్సెస్) ధరకు కోట్ చేస్తూ షెడ్యూలు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం ఒకే షెడ్యూలు (సింగిల్ బిడ్) దాఖలైతే ఆ టెండర్‌ను రద్దు చేసి మళ్లీ పిలవాలి. కానీ చంద్రబాబు ఒత్తిడి మేరకు ఆర్కే ఇన్ఫ్రాకు 4 శాతం అధిక ధరకు రూ.430.26 కోట్లకు పనులు కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ.43 కోట్లు దక్కించుకున్న శ్రీనివాసరెడ్డి వాటిని బాబు జేబులో వేసేశారు. సీఎం రమేష్ పేచీతో చెరిసగం.. శ్రీనివాసరెడ్డికి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చుతూ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కట్టబెట్టడంపై అప్పటి టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పేచీ పెట్టారు. తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్ ఒత్తిడి చేయడంతో దిగివచ్చి న చంద్రబాబు చీకటి పంచాయితీ చేశారు. శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రాకు 50 శాతం పనులు, మిగతా 50 శాతం పనులు సీఎం రమే‹Ùకు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్కు సబ్ కాంట్రాక్టు కింద ఇవ్వాలని ఆదేశించారు. ప్రధాన కాంట్రాక్టర్‌పై వేటు.. ‘సబ్’కే మొత్తం చెరి సగం పనులు దక్కించుకున్న శ్రీనివాసరెడ్డి, సీఎం రమేష్ క్యూబిక్ మీటర్‌కు రూ.40 చొప్పున మట్టి తవ్వకం పనులను సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి భారీ లబ్ధి పొందుతూ వచ్చారు. వారి వద్ద నుంచి చంద్రబాబు ఎప్పటికప్పుడు కమీషన్లు వసూలు చేసుకుంటూ వచ్చారని టీడీపీ నేతలే అప్పట్లో ఆరోపించారు. తనతోపాటు శ్రీనివాసరెడ్డి భారీ ఎత్తున లబ్ధి పొందుతుండటాన్ని సహించలేని సీఎం రమేష్ మొత్తం పనులను తనకే కట్టబెట్టాలని మరోసారి పేచీకి దిగారు. దీంతో పనులన్నీ రిత్విక్ ప్రాజెక్టŠస్కే కట్టబెట్టాలని జలవనరుల శాఖను చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న శ్రీనివాసరెడ్డిపై వేటు వేసి సీఎం రమేష్‌కు చెందిన రితి్వక్ ప్రాజెక్టŠస్కే మొత్తం పనులు అప్పగించేశారు. మాట నిలబెట్టుకున్న సీఎం జగన్.. సీఎం జగన్ అధికారం చేపట్టాక ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కుప్పంను మున్సిపాల్టీని చేశారు. కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. మున్సిపాల్టీతోపాటు గ్రామాల్లో అంతర్గత రహదారులు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేసి కృష్ణా జలాలను అందించి సుభిక్షం చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటూ యుద్ధప్రాతిపదికన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేయించారు. ఇప్పటికే కుప్పం బ్రాంచ్ కెనాల్ 74 కి.మీ. వరకూ అంటే రామకుప్పం మండలం మనేంద్రం గ్రామం వరకూ కెనాల్ నీటిని తరలించారు. చెరువులను నింపి సాగు, తాగునీరు అందించనున్నారు. రూ.460.88 కోట్లు నీళ్ల పాలు.. కుప్పం బ్రాంచ్ కెనాల్లో సీఎం రమేష్ సంస్థకు రూ.460.88 కోట్లను 2019 ఏప్రిల్ నాటికి ప్రభుత్వం బిల్లుల రూపంలో చెల్లించింది. అంటే కాంట్రాక్టు విలువ కంటే రూ.30 కోట్లు ఎక్కువగా చెల్లించినా పనులు పూర్తి కాలేదు. రూ.99.41 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి. నాసిరకమైన పైపులు వేయడం వల్ల వర్షపునీటికే పగిలిపోయాయి. దీన్ని బట్టి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో సీఎం రమేశ్ తో కలిసి చంద్రబాబు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారో విశదం చేసుకోవచ్చు. వరుసగా ఏడు సార్లు గెలిపించిన కుప్పం ప్రజలకు సాగునీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగునీళ్లు కూడా అందించకుండా చంద్రబాబు నమ్మకద్రోహం చేశారు. పాలార్‌కు మోకాలడ్డు కుప్పం నియోజకవర్గాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా జలయజ్ఞంలో భాగంగా కుప్పం మండలం గణేశపురం వద్ద పాలారు నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో రూ.55 కోట్ల వ్యయంతో రిజర్వాయర్ పనులను 2005లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ రిజర్వాయర్ ద్వారా నాలుగు వేల ఎకరాలకు సాగునీరు, 1.50 లక్షల మందికి తాగునీరు అందించేలా పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే కుప్పం నియోజకవర్గంలో తనకు రాజకీయంగా ఉనికి లేకుండా పోతుందని ఆందోళన చెందిన చంద్రబాబు తమిళనాడు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారు. పాలారు రిజర్వాయర్ నిర్మాణం వల్ల తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, దాని నిర్మాణాన్ని నిలిపివేసేలా ఆంధ్రప్రదేశ్‌ను ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వంతో సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. పాలార్ రిజర్వాయర్ నిర్మాణాన్ని ఆపేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో అప్పట్లో ఆ పనులు ఆగిపోయాయి. -
నియోజకవర్గానికి రూ.కోటి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యతను పూర్తిగా సర్పంచ్‌లకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అయితే సర్పంచ్ల పదవీకాలం నెలాఖరుతో ముగుస్తున్నందున అధికారులు ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కతో కలసి సచివాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద కేటాయించిన రూ.10 కోట్లలోంచి రూ. కోటి చొప్పున తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి కొత్త రిజర్వాయర్లన్నింటినీ తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని.. తద్వారా చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటి సరఫరా సులభమవుతుందని సీఎం తెలిపారు. గ్రామాల వరకు రక్షిత మంచినీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని, ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల మెయింటెనెన్స్‌ను సర్పంచులకే అప్పగించాలన్నారు. నీరురాని గ్రామాల సర్వే.. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు తాగునీరు అందట్లేదో సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. సంబంధిత ఇంజనీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజ నిర్ధారణ బృందం చేసినట్లుగానే పక్కాగా తాగునీరు అందని ఆవాసాల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకొనేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు... స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయాతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థిని విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్‌లను కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. రహదారులు లేని గ్రామాలకు తారురోడ్లు... రోడ్డు సౌకర్యంలేని గ్రామాల్లో రోడ్లను నిర్మించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 422 గ్రామ పంచాయతీలు, 3,177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎంకు నివేదించగా వాటన్నింటికీ తారురోడ్లు వేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను అనుసంధానించి వాటిని పూర్తి చేయా లని చెప్పారు. ఈ బడ్జెట్లోనే అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో కేంద్ర నిధులు రాలేదు.. తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచి్చనట్లు గత ప్రభుత్వం చెప్పుకోవడంతో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ ప్రకటనలతో కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ నిధులు రాకుండా పోయాయన్నారు. ఇకపై వాస్తవాలను దాచిపెట్టి గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులకు సూచించారు. -
సుజలధార ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్
-
111 జీవో రద్దు అమలుపై స్తబ్ధత
సాక్షి, హైదరాబాద్: జీవో 111 రద్దు అమలుపై స్తబ్ధ త నెలకొంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం నిబంధనల సడలింపులపై అధ్యయనం చేసేందుకు జీవో 69ను జారీ చేస్తూ, ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక అందించే దాకా 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో నిబంధనలు కొనసాగుతాయని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో 111జీవో పరిధిలోని 84 గ్రామాల్లో మళ్లీ స్తబ్ధత నెలకొంది. అయితే ప్రభుత్వం విధించిన ఆంక్షలు కేవలం సామాన్యులకే పరిమితమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల చేయి తడిపే అక్రమార్కుల నిర్మాణాలు మాత్రం జోరుగా సాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కాలయాపన కమిటీ.. హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిధిలో సుమారు 1.32 లక్షల ఎకరాలలో భూమి ఉంది. ఇక్కడ 84 గ్రామాలకు కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి ప్రణాళిక ప్రకారం హరిత నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే 111 జీవోను రద్దు చేసింది. అయితే ఈ జలాశయాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. మున్సిపల్, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలమండలి ఎండీ, కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్) సభ్యులుగా ఉండే ఈ కమిటీలో.. ఏయే అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న దానిపై విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే కమిటీ ఏర్పాటై నెలలు గడుస్తున్నా నేటికీ ఎలాంటి విధానాలను రూపొందించకపోవడం గమనార్హం. ఆగని నిర్మాణాలు.. ఇప్పటికే 111 జీవో పరిధిలోని భూముల్లో సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు, బ్యూరోక్రాట్స్ తక్కువ ధరకే పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేసి, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లను నిర్మించుకున్నారు. శంషాబాద్, మెయినాబాద్, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాబాద్, కొత్తూరు శంకర్పల్లి మండలాల పరిధిలో అక్రమంగా లగ్జరీ విల్లాలు, హైరైజ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. 111 జీవో ఎత్తివేశాక ఒక్క శంషాబాద్ పట్టణంలో దాదాపు 400 అక్రమ నిర్మాణాలు చేపట్టారని అంచనా. మొయినాబాద్ మండలంలో కొందరు రియల్టర్లు భూములను 10, 25 గుంటల చొప్పున ఫామ్ ల్యాండ్లుగా విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన చాలా మంది ఆయా ఫామ్ ల్యాండ్లలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని తెలుస్తోంది. వీటిని ఫామ్ హౌస్, వీకెండ్ హోమ్స్‌గా మార్చేసి అద్దెకు ఇస్తున్నారని స్థానికులు చెపుతున్నారు. రేటు పెట్టి మరీ వసూళ్లు.. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే నోటీసులు జారీ, క్షేత్ర స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా.. అవి అంతంతమాత్రమేనని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే 111 జీవో పరిధిలో చాలా వరకు అక్రమ నిర్మాణాలు నేతలు, ప్రముఖులవే కావడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు స్థానిక మున్సిపల్ అధికారుల చేతులు తడపడంతో వారూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒక్కో భవనానికి రూ.2–5 లక్షల వరకు మున్సిపల్ అధికారులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జీవో రద్దు తర్వాత రియల్ బూమ్.. జీవో111 పరిధిలోని పాత వెంచర్లలో గజం ధర రూ.3–4 వేల వరకు ఉండేది. కాగా, ఈ జీవోను రద్దు చేశాక ధరలు ఒక్కసారిగా గజానికి రూ.12 వేలకు పైగానే చెబుతున్నారు. శంషాబాద్ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భూములు ఎకరం ధర రూ.8 కోట్లకు పైగానే చెబుతున్నారు. విమానాశ్రయానికి దగ్గర్లోని గ్రామాల్లో ఎకరం రూ.3–5 కోట్ల వరకు పలుకుతున్నాయని చెపుతున్నారు. సాంకేతికతను వినియోగించుకోవాలి నీటి వనరుల సంరక్షణ పేరుతో అభివృద్ధికి అడ్డుకట్ట వేయకూడదు. జలాశయాల ఆక్రమణలు, కాలుష్య నియంత్రణకు సాంకేతికతను వినియోగించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకుంటే వ్యవస్థ బాగుంటుంది. – కంచర్ల సంతోష్ రెడ్డి, సీఎండీ, డ్రీమ్ వ్యాలీ గ్రూప్ -
రాయలసీమ ఎత్తిపోతల తొలిదశకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం తొలిదశలో రాయలసీమలోని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీరు, చెన్నైకి నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన పనులను ప్రాధాన్యతగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆరు పంపులను (ఒక్కొక్కటి 2,913 క్యూసెక్కుల సామర్థ్యం) ఏర్పాటుచేసి.. నీటి సమస్య తీవ్రంగా ఉండే జూన్ నుంచి జూలై మధ్య 59 టీఎంసీలు తరలించి నీటి ఎద్దడిని నివారించవచ్చని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ఠ నీటి మట్టం సముద్ర మట్టానికి 885 అడుగుల ఎత్తున ఉంటుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరునిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగుగంగకు 29, గాలేరు–నగరికి 38 వెరసి 101 టీఎంసీలు సరఫరా చేయాలి. వర్షాభావ పరిస్థితులవల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు ఏయేటికాయేడు తగ్గుతున్నాయి. మరోవైపు.. తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా 800 అడుగుల నుంచే నీటిని తోడేస్తుండటం ఫలితంగా శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గిపోతోంది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లందడంలేదు. అనుమతి వచ్చేలోగా తాగునీటి కోసం.. ఇక రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అది వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులు చేపట్టాలని నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు 8.4 టీఎంసీలు వెరసి 35.23 టీఎంసీలు కనీసం నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశముంటుంది. రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6)అంటే దాదాపు 59 టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జలవనరుల అధికారులు ప్రతిపాదించారు. పర్యావరణ అనుమతి వచ్చేలోగా రాయలసీమ ఎత్తిపోతలలో తాగునీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతివ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పర్యావరణ అనుమతితోనే పనులు రాయలసీమ హక్కులను పరిరక్షించడం, చెన్నైకి నీటి సరఫరా చేయడమే లక్ష్యంగా.. శ్రీశైలం రిజర్వాయర్ జలవిస్తరణ ప్రాంతంలో సంగమేశ్వరం వద్ద 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020, మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీని ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. పర్యావరణ అనుమతి తీసుకోకుండా ఎత్తిపోతలను చేపట్టడంవల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో టీడీపీ నేతలు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని.. అదనంగా నీటిని నిల్వచేసేలా రిజర్వాయర్లు నిర్మించడంలేదని.. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని ఎన్జీటీలో ప్రభుత్వం వాదించింది. కానీ.. ఎత్తిపోతల పనులను ఆపేయాలంటూ 2020, మే 20న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్జీటీ నియమించిన జాయింట్ కమిటీ కూడా ఏపీ ప్రభుత్వ వాదననే బలపరుస్తూ నివేదిక ఇచ్చింది. కానీ, పర్యావరణ అనుమతితోనే పనులు చేపట్టాలని 2020, అక్టోబర్ 29న ఎన్జీటీ నిర్దేశించింది. దాంతో పర్యావరణ అనుమతి కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో జలవనరుల అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. -
తాగునీటి సరఫరాలో జలమండలి నిర్లక్ష్యం
హైదరాబాద్: మహా నగరానికి సురక్షిత తాగునీటి సరఫరాలో జలమండలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నీటి క్లోరినేషన్ నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లోపం ప్రజలకు ప్రాణ సంకటంగా పరిణమిస్తోంది. ప్రభుత్వం నీటి శుద్ధి చేసేందుకు క్లోరిన్ గ్యాస్‌పై రూ.కోట్లు వెచ్చిస్తున్నా.. ఆచరణ అమలు మేడిపండు చందంగా మారింది. మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి చివరి సర్వీస్ రిజర్వాయర్ వరకు క్లోరినేషన్ నిర్వహణ అంతంత మాత్రంగానే మారింది. ఫలితంగా నీటిలో తగిన మోతాదులో క్లోరిన్ మెయింటెన్ కాకుండానే సరఫరా కావడంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నది నుంచి నీరు రిజర్వాయర్‌కు చేరే క్రమంలో మట్టి, ఇతరత్రా వ్యర్థాలు కలిసి వస్తుండటంతో ప్రతి పాయింట్‌కు నీటి శుద్ధి అవసరం ఉంటుంది. క్లోరినేషన్ సరిగా జరగకపోవడంతో రిజర్వాయర్ అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి బ్యాక్టీరియా, ఇకొలి వైరస్‌కు కారణమవుతున్నాయి. మరోవైపు రిజర్వాయర్లలో చేరిన మట్టి క్లోరిన్‌ను తినేస్తోంది. క్లోరినేషన్ చేయకుండా నీరు సరఫరా కావడంతో జనం వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు గురికాక తప్పదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మూడంచెల క్లోరినేషన్ నామమాత్రమేనా? కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు నదుల నుంచి తరలిస్తున్న జలాలపై మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియ అంతంతగా తయారైంది. నదుల నుంచి మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మీదుగా సర్వీస్ రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులకు నీరు సరఫరా అవుతోంది. మొదటి విడతగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాట్ (డబ్లూటీపీ) వద్ద, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల (ఎంబీఆర్) వద్ద, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమితో క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కానరాని మెయింటెనెన్స్.. ► నీటి సరఫరా క్లోరిన్ మెయింటెనెన్స్ ప్రశ్నార్థకంగా తయారైంది. రిజర్వాయర్ వద్ద కోర్లిన్ రెండు పీపీఎం (పార్ట్ పర్ మిలియన్) మెయింటెన్ జరగాలి. నల్లా ద్వారా వినియోగదారుడికి నీరు చేరే సమయంలో కచ్చితంగా అందులో 0.5 పీపీఎం క్లోరిన్్ మెయింటెన్ కావాల్సి ఉండగా ఆచరణలో లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీటి సరఫరా సమయంలో కోర్లిన్ శాతంపై ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. సూక్ష్మక్రిములు వృద్ధి చెందే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ► రిజర్వాయర్‌లో నీటిలో క్లోరిన్ ప్రభావం తగ్గగానే తిరిగి కలిపితేనే ఆ నీటి నాణ్యత మెరుగుపడుతుంది. క్లోరిన్ శాతం నిర్దేశించిన దానికంటే తక్కువ ఉంటే ఆ నీరు సురక్షితం కానట్లే. క్లోరిన్ ప్రభావం లేని కారణంగా సూక్ష్మ క్రిములు వృద్ధి చెంది నీరు ప్రజా ఆరోగ్యానికి హానికరంగా మారే ప్రమాదం లేకపోలేదు. నీటి శాంపిల్ సర్వేలో మాత్రం పలు రిజర్వాయర్ పరిధిలో క్లోరిన్ మెయింటెన్ కావడంలేదని బహిర్గతం కావడం ఆందోళన కలిగిస్తోంది. కొన్నిసార్లు ఔట్లెట్ టాప్ వద్ద సైతం క్లోరిన్ నిల్‌గా ఉండటం నిర్వహణ తీరుకు అద్దం పడుతోంది. లాగ్‌బుక్ నిర్వహణేదీ? సర్వీస్ రిజర్వాయర్లలో లాగ్‌బుక్ నిర్వహణ మొక్కుబడిగా తయారైంది. కేవలం ప్రధాన పాయింట్ మినహా మిగతా పాయింట్లల్లో ఎప్పటికప్పుడు లాగ్‌బుక్‌లో నమోదు లేదు. వారానికోసారి నమోదు చేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. నిబంధనల ప్రకారం ఎగువ నుంచి రిజర్వాయర్‌లోకి వచ్చి చేరే నీటి ప్రవాహంలో క్లోరిన్ శాతంతో పాటు దిగువ నీటిని విడుదల చేసే సమయంలో క్లోరిన్ శాతాన్ని లాగ్‌బుక్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. సర్వీస్ రిజర్వాయర్ నుంచి లైన్లకు నీటిని సరఫరా జరిగే సమయంలో సైతం క్లోరిన్ శాతాన్ని లాగ్ బుక్‌లో నమోదు చేయాలి. గంట గంటకూ నమోదు చేయాల్సి ఉండగా ఆచరణలో మాత్రం అమలు కావడంలేదని తెలుస్తోంది. 30 నిమిషాల ముందే.. సర్వీస్ రిజర్వాయర్ నుంచి లైన్‌కు సరఫరా చేసే అర్ధ గంట ముందు క్లోరిన్ గ్యాస్‌ను నీటిలో విడుదల చేయాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా తయారైంది పరిస్థితి. ప్రతి లైన్‌కు క్లోరిన్ శాతం పరిశీలించి సరఫరా చేయాల్సి ఉండగా.. నీటి ప్రవాహంలోనే క్లోరిన్ గ్యాస్ కలిసేటట్లు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో క్లోరిన్ శాతం హెచ్చు తగ్గులై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
‘కృష్ణా’లో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తాగునీటి అవసరాల కోసం సెపె్టంబర్ 30 తేదీ వరకు తెలంగాణకు 6.04 టీఎంసీలు, ఏపీకి 25.29 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణాబోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ సిఫారసు చేసింది. ఈనెల 21న హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కన్వినర్ డీఎం రాయిపూరే ఈ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 15.609 టీఎంసీలు, శ్రీశైలంలో 58.865 టీఎంసీల లభ్యత మాత్రమే ఉందని, ఇండెంట్లలో కోరిన విధంగా తాగు, సాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేసేందుకు నిల్వలు సరిపోవని త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది. తీవ్ర వర్షాభావం నెలకొని ఉండడంతో ప్రస్తుత నీటి సంవత్సరంలో ఎగువ నుంచి ఆశించిన మేర వరద వచ్చే అవకాశం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలకు మాత్రమే నీటి కేటాయింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ 12 టీఎంసీలు, ఏపీ 7 టీఎంసీలు వాడుకున్నాయి ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఏపీ 7.427 టీఎంసీ లు, తెలంగాణ 12.595 టీఎంసీలు కలిపి మొ త్తం 20.022 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకున్నట్టు త్రిసభ్య కమిటీ చెప్పింది. ♦ నాగార్జునసాగర్ కుడికాల్వ ద్వారా ఏపీ 3.592 టీఎంసీలు, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 2.088 టీఎంసీలు, సీడబ్ల్యూఎస్(తాగునీటి పథకం) ద్వారా 1.748 టీఎంసీలను ఏపీ వాడుకున్నట్టు పేర్కొంది. ♦ నాగార్జునసాగర్ప్రాజెక్టు నుంచి జంట నగరాల తాగునీటి అవసరాలకు 3.493 టీఎంసీలు, ఏఎంఆర్పీ ద్వారా 2.921 టీఎంసీలు, ఎడమకాల్వ ద్వారా 1.536 టీఎంసీలు కలిపి మొత్తం 7.95 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది. శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3.771 టీఎంసీలు, తాగునీటి కోసం 0.874 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది. కృష్ణాబోర్డుకు లేఖ: కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ అవసరాలకు కేవలం 4.8 టీఎంసీలను నాగార్జునసాగర్ నుంచి కేటాయించడం పట్ల తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుద ల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ కృష్ణా బోర్డుకు లేఖ రాసినట్టు తెలిసింది. కృష్ణా బోర్డు నిర్ణయంతో తెలంగాణలో తీవ్ర తా గునీటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా?హైపోనాట్రేమియా వస్తుంది జాగ్రత్త!
నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అందుకే రోజూ వీలైంత ఎక్కువగా నీళ్లు తాగాలని డాక్టర్లు కూడా చెబుతుంటారు. మంచినీళ్లు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మరీ ఎక్కువగా నీళ్లు తాగినా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఓవర్‌హైడ్రేషన్ వల్ల శరీరం రకరకాల ఇబ్బందులకు గురి అవుతుంది. మరి ఒక మనిషి రోజు ఎన్ని లీటర్ల నీటిని తాగాలి? అతిగా నీళ్లు తాగితే వచ్చే ఇబ్బందులేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరం కావాలంటే సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే, నీళ్లు మన శరీరానికి హాని కలిగించే టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. సరైన మోతాదులో నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అయితే మంచిది కదా అని అతిగా నీళ్లు తాగడం చేయొద్దని డాక్టర్లు చెబుతున్నారు. మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అతిగా నీళ్లు తాగడం వల్ల మెదడపు ఆ ప్రభావం పడుతుంది. బీపీ పెరగడంతో పాటు, కండరాలు నీరసించిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో అంత మేరకే నీళ్లు తీసుకోవాలి. హైపోనాట్రేమియా ఏర్పడి.. మరణానికి కూడా అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతిగా నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు దాహం వేస్తుంది. అప్పుడు నీళ్లు తాగితే మంచిది. కానీ కొందరు కావాలని బలవంతంగా ఎక్కువగా నీళ్లు తీసుకుంటారు. దీని వల్ల రక్తంలో సోడియం లోపం ఏర్పడుతుంది. దీన్నే హైపోనాట్రేమియా అంటారు. ఇది ఎక్కువైతే, మెదడు వాపు,కోమాలోకి వెళ్లడం వంటివి కూడా జరుగుతాయి. కొన్నిసార్లు ఇది మరణానికి దారితీసే అవకాశం కూడా ఉంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా వాటి పనితీరు తగ్గిపోతుంది. రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? మన శరీరానికి నీరు అవసరం అయినప్పుడు దాహం ద్వారా అది మనకు తెలుస్తుంది. అప్పుడు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. చాలామంది నిలబడి నీళ్లు తాగుతుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల నీరు చాలా త్వరగా శరీరంలోకి చేరి జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ఒకేసారి ఏకధాటిగా కాకుండా చిన్న సిప్స్‌లో నెమ్మదిగా నీళ్లు తాగడానికి ప్రయత్నించడం. మరీ చల్లని, మరీ వేడినీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్లు తాగడం ఉత్తమం. ఆరోగ్యంగా ఉన్న మనిషికి రోజుకు 3-4 లీటర్ల నీరు సరిపోతుంది. -
డెడ్ స్టోరేజీకి ‘నాగార్జున సాగర్’!.. ఆందోళనలో ఆయకట్టు రైతులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. బోరుబావుల వసతి ఉన్నవారు నార్లు పోసి నీటివిడుదల కోసం ఎదురుచూస్తుండగా, మిగతావారు ఎగువ కృష్ణానది నుంచి వరద వస్తుందా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాల్వ ద్వారా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు 6.57 లక్షల ఎకరాలు. గతేడాది జూలై 28వ తేదీన ఎడమ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు సాగునీటిని విడుదల చేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శ్రీశైలం ప్రాజెక్టు వరకే... గత నెల చివరలో కురిసిన వర్షాలతో కృష్ణానదికి ఎగువ నుంచి వరద రాక మొదలైంది. అది కూడా శ్రీశైలం ప్రాజెక్టు వరకే వస్తోంది. దిగువకు అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు రాలేదు. ఈ ఆగస్టులోనూ ఇంతవరకు వర్షాలు పడలేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.81 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 864.57 అడుగుల (120.92 టీఎంసీలు) మేర మాత్రమే నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి 65 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. కృష్ణానదికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తే మరో వారంలో ఈ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. లేదంటే 15 రోజులకుపైగా సమయం పట్టవచ్చని, ఆ ప్రభావం నాగార్జునసాగర్ ఆయకట్టుపైనా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయశాఖ కూడా అప్పుడే ముమ్మరంగా వరినాట్లు వద్దని, పంటలు ఎండిపోయే పరిస్థితి రావొచ్చని పేర్కొంటోంది. చదవండి: అంకాపూర్ @మక్కవడలు.. చికెన్‌తో నంజుకుని తింటే.. ఆ టేస్టే వేరు! సాగర్ 570 అడుగులకు చేరితేనే.... నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేయాలంటే సాగర్ జలాశయంలో కనీసం 570 అడుగుల మేర నీటినిల్వ ఉండాలి. అయితే ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి దగ్గరలో ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా, ప్రస్తుతం 515.4 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే ఈ నీటిని వినియోగించుకునే పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ రిజర్వాయర్‌లోని బ్యాక్‌వాటర్ నుంచే నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ కింద 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల తాగునీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం రోజుకు 595 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. నారు ఎండిపోతోంది పదిహేను రోజుల క్రితం వరినారు పోశాను. ఎడమకాల్వ నీటికోసం ఎదురుచూస్తున్నా. బోరుబావుల కింద ఐదు ఎకరాలు నాట్లు వేశా. ఎడమకాల్వ నుంచి నీరు విడుదల కాకపోవడంతో బోర్లలో కూడా నీరు తగ్గిపోయింది. నారుమడి, నాట్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సకాలంలో సాగునీరు అందించకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. – పసునూరి హనుమంతరెడ్డి, రైతు,యాద్గార్పల్లి, మిర్యాలగూడ సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల ఇలా... ►2019- ఆగస్టు 12 ►2020- ఆగస్టు 8 ►2021- ఆగస్టు 2 ►2022 - జూలై 28 ప్రాజెక్టుల నీటిమట్టం ఇలా... (అడుగుల్లో) గరిష్టం ప్రస్తుతం శ్రీశైలం 885 864.57 నాగార్జున సాగర్ 590 515.4 -
పోలవరం ప్రాజెక్టులో తాగునీటి విభాగం ఖర్చూ భరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తులకు కేంద్రం అంగీకరించింది. ప్రాజెక్టులో కేవలం సాగు నీటి విభాగం పనులకే నిధులిస్తామని, తాగు నీటి విభాగం ఖర్చును భరించే ప్రసక్తే లేదంటూ ఇన్నాళ్లూ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. సీఎం జగన్ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంది. తాగునీటి విభాగానికి ప్రతిపాదించిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లు నిధులపై అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు ఈ విషయం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ విభాగానికి సంబంధించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, వరదల కారణంగా ప్రాజెక్టులో దెబ్బతిన్న చోట్ల మరమ్మతులకు అదనంగా మరో రూ.2 వేల కోట్లు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం నిరభ్యంతరం తెలిపిందని పేర్కొన్నారు. అదేవిధంగా తాగు నీరు కాంపొనెంట్ ఖర్చును కూడా ఇవ్వడానికి అభ్యంతరం లేదని సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. వేధింపుల నిరోధక చట్టంలో బాధితులకూ శిక్షలా? వేధింపుల నిరోధక చట్టంలో ఫిర్యాదుదారులను శిక్షించే పరిస్థితి కూడా ఉండడంతో బాధితులు ముందుకు రావడంలేదని, దీని పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఎంఎస్ఎంఈ సహాయ మంత్రి భాను ప్రతాప్ వర్మ స్పందిస్తూ.. లైంగిక వేధింపులపై బాధిత మహిళలు చేసే ఫిర్యాదులను అంతర్గత కమిటీ అన్ని కోణాల్లో క్షుణ్నంగా దర్యాప్తు చేసిన మీదటే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీలో 47.17 టన్నుల బంగారు నిల్వలు ఇండియన్ మినరల్స్ ఇయర్ బుక్ – 2021 ప్రకారం ఏపీలో 47.17 టన్నుల బంగారు నిల్వల సామర్ధ్యం ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీంట్లో 5.3 టన్నుల నిరూపిత, సంభావ్య నిల్వలు, 41.87 టన్నుల మిగిలిన వనరులు ఉన్నాయని వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన పరిశోధనల ప్రకారం రామగిరి, పెనకచర్ల బంగారు క్షేత్రాలు, జోనగిరి షిస్ట్ బెల్ట్, సౌత్ చిగర్గుంట – బిసనట్టం గోల్డ్బెల్ట్లో బంగారు నిల్వలు గుర్తించారు. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం ప్రతిపాదన లేదు సెయిల్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమను విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు. కాగా ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్(పీఎస్‌యూ) విధానానికి అనుగుణంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్.(ఆర్ఐఎన్ఎల్) షేర్‌హోల్డింగ్‌లో 100% పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం పొందిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. -
వర్షాకాలమైనా.. తీరని దాహం.. వీడని కష్టాల తంటా..!
సిద్ధిపేట్: అంగట్లో అన్నీ ఉన్నా...అల్లుడు నోట్లో శని ఉందన్న చందంగా తయారైంది అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామ పరిధిలోని చౌటకుంటతండా పరిస్థితి. ఓ వైపు దంచికొడుతున్న వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతుంటే తండాలో తాగడానికి గుక్కెడు నీరు కరువైంది. తండాలో దాదాపుగా 83 పైగా కుటుంబాలు ఉన్నాయి. 310వరకు జనాభా ఉంది. ఇక్కడ వ్యవసాయం చేసుకుని జీవించే వారు.. పదుల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ జవాన్లు సైతం ఉన్నారు. అయితే దాదాపు 20రోజులుగా తాగునీరు సరఫరా నిలిచింది. గ్రామపంచాయతీ ద్వారా సరఫరా చేసే బోరు మోటార్ పాడైంది. మరమ్మతులు చేయించాలని పలుమార్లు తండావాసులు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని తండావాసులు చెబుతున్నారు. అలాగే నెలరోజులుగా మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం బంద్ అయ్యాయని తెలిపారు. తండాలో ఉన్న సోలార్ పాడై మూడునెలల గడుస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. నీటి కోసం వర్షాల్లో కిలో మీటరు మేర పొలాల వద్దకు పరుగులు తీస్తున్నామని కన్నీటి పర్యతమవుతున్నారు. మోటార్ రిపేర్ చేయిస్తాం.. చౌటకుంటతండాలో బోరు మోటార్ పాడైంది వాస్తవమే. రిపేర్ చేయిద్దామంటే వారంరోజులుగా వానలు దంచికొడుతు న్నాయి. మిషన్ భగీరథ అధికారులకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించడంలేదు. గత పాలకులు బోరుబావిని వాగులో తవ్వించారు. దీంతో వానాకాలం వస్తే తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. – అన్నాడీ దినేష్‌రెడ్డి, సర్పంచ్, కుందనవానపల్లి -
Hyderabad: 36 గంటలపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్: గోదావరి తాగునీటి సరఫరా పథకం దశ –1లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ముర్మూర్ నుంచి బొమ్మకల్ వరకు ఉన్న మెయిన్ పైపులైనుకు ఏర్పడ్డ లీకేజీలు అరికట్టడానికి మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో 36 గంటలపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఈ నెల19.(బుధవారం) ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ పనులు జరుగనున్నాయి. దీంతో నగరంలోని పలు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగానీటి సరఫరాలో అంతరాయం కలుగనున్నట్లు జలమండలి వర్గాలు పేర్కొన్నాయి. పాక్షికంగా అంతరాయం... ► ఓ అండ్ ఎం డివిజన్–6 (ఎస్.ఆర్.నగర్): బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్ గూడ. ► ఓ అండ్ ఎం డివిజన్–9 (కూకట్పల్లి): కేపీహెచ్‌బీ, మలేషియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. ► ఓఅండ్ఎం డివిజన్–15 (శేరిలింగంపల్లి): లింగంపల్లి నుంచి కొండాపూర్, గోపాల్‌నగర్, మయూరి నగర్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. ► ఓఅండ్ఎం డివిజన్– 23 (నిజాంపేట్): ప్రగతినగర్‌లో కొన్ని ప్రాంతాలు, నిజాంపేట్/బాచుపల్లి. పూర్తిగా అంతరాయం... ► ఓఅండ్ఎం డివిజన్–9 (కూకట్పల్లి): ఎల్లమ్మ బండ, అల్వాల్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు. ► ఓఅండ్ఎం డివిజన్–12 (కుత్బుల్లాపూర్): షాపూర్‌నగర్, చింతల్, జీడిమెట్ల/వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, అల్వాల్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. ► ఓఅండ్ఎం డివిజన్ –13 (మల్కాజిగిరి/అల్వాల్): సైనిక్ పురి, డిఫెన్స్ కాలనీ, అల్వాల్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. ► ఓఅండ్ఎం డివిజన్–14 (ఉప్పల్): కాప్రా మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాలు. సాయిబాబా నగర్, రాధిక, మహేష్ నగర్, అవుట్ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు. ► ఓఅండ్ఎం డివిజన్–19 (నాగారం/దమ్మాయిగూడ): నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి, కీసర, ఆర్జీకే ప్రాంతాలు. ఓఅండ్ఎం డివిజన్– 24 (బొల్లారం): రింగ్ మెయిన్–3 ఆన్లైన్ సరఫరా ► ఓఅండ్ఎం డివిజన్– 25 (కొంపల్లి): కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్‌నగర్, దేవరయాంజల్, హకీంపేట్ ► ఆర్డబ్ల్యూఎస్ అప్టేక్ ప్రాంతాలు: ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి) ఘన్పూర్ (మేడ్చల్/ శామీర్‌పేట్), కంటోన్మెంట్ లోని కొన్ని ప్రాంతాలు, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు. -
సురక్షిత తాగునీటిలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో నూటికి నూరు శాతం సురక్షితమైన తాగునీటిని అందించే ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. జలజీవన్ మిషన్ ద్వారా ఇది సాకారమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. జలజీవన్ మిషన్ అమలులో భారతదేశం పురోగతి సాధించిందని తెలిపింది. ఇంటింటికీ వంద శాతం సురక్షితమైన తాగునీరు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ, గోవా, హరియాణా, గుజరాత్, పంజాబ్ ఉన్నాయి. తెలంగాణలో 53.98 లక్షల ఇళ్లుంటే.. అందులో ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉందని నివేదిక వివరించింది. కాగా, ఈ రాష్ట్రాల కంటే నీటి స్వచ్ఛతలో మాత్రం తెలంగాణే నంబర్‌వన్ స్థానంలో ఉంది. మన రాష్ట్ర తాగునీటి స్వచ్ఛత 98.7 శాతంగా ఉంది. యూరప్‌లో కేవలం 62 శాతం ఇళ్లకే స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. కాగా, దేశంలో ఇప్పటివరకు సగటున 62.84 శాతం మందికి ఇంటింటికీ తాగునీటి వసతి ఉందని తెలిపింది. దేశంలో డయేరియా మరణాలు 6 లక్షలు.. దేశంలో డయేరియా, ఇన్ఫెక్షన్లు, మలేరియా, డెంగీ, శ్వాసకోశ సంబంధిత రోగాల వల్ల ప్రతీ ఏడాది లక్షకు 40–70 మంది వరకు మరణిస్తున్నారని డబ్లు్యహెచ్‌వో వేదిక వివరించింది. ఈ మరణాల్లో ఐదేళ్లలోపువారే 60 శాతం ఉంటారని పేర్కొంది. తాగునీరు సరిగా లేకపోవడం, పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించకపోవడం, చేతి శుభ్రత పాటించకపోవడం వల్ల డయేరియా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. 2019 లెక్కల ప్రకారం డయేరియాతో దేశవ్యాప్తంగా 6.07 లక్షల మంది చనిపోతున్నారు. అందులో తాగునీరు సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియా మరణాలు 2,03,863 ఉన్నాయి. ఇందులో మహిళలే 1,23,964 మంది ఉన్నారు. ఐదేళ్లలోపు వారు 20,045 మంది ఉన్నారు. ఇక పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియాతో 2,44,287 మంది చనిపోతున్నారు. అందులో మహిళలు 1.48 లక్షల మంది ఉన్నారు. ఐదేళ్లలోపు వారు 24,020 మంది ఉన్నారు. ఇక చేతి శుభ్రత సరిగా లేకపోవడం వల్ల సంభవించే డయేరియా మరణాలు ఏడాదికి 1,59,015 ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వివరించింది. అందులో 96,694 మంది మహిళలుండగా, ఐదేళ్లలోపువారు 15,635 మంది ఉన్నారు. ఇదిలావుంటే 51,740 మంది చేతి శుభ్రత సరిగా లేకపోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులతో చనిపోతున్నారని ఆ వేదిక పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలు.. ► పరిశుభ్రమైన నీరు, పరిసరాలు శుభ్రంగా ఉంచకపోవడం, చేతి శుభ్రత పాటించకపోతే సాంక్రమిక వ్యాధులు వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు, మలేరియా, డెంగీ వంటివి వస్తాయి. ఆసుపత్రుల్లోనూ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ► తాగునీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే జబ్బులు వస్తాయి. ► డయేరియా కారణంగా పిల్లలు బడికి వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. ప్రజల పనితీరులోనూ మార్పులు వస్తాయి. ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి పెరుగుతుంది. ► చేతి శుభ్రత లేకపోతే కరోనా వంటి వైరస్లు వస్తాయి. తాగునీరు సరిగా లేకపోవడం వల్ల రక్తహీనత కూడా సంభవిస్తుంది. ► ప్రపంచంలో 56 శాతం జనాభాకు మాత్రమే ఇంటి వద్ద సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంది. ఆఫ్రికాలో 9 శాతం, యూరప్‌లో 62 శాతం మాత్రమే సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంది. ఇది దక్షిణాసియా దేశాల్లో 27 శాతమే ఉంది. ► వాగులు వంకల్లో నీటిని తాగే వారితో పోలిస్తే శుద్ధి చేసిన ఇంటి వద్దే అందుబాటులో ఉన్న నీటిని తాగడం వల్ల 52 శాతం డయేరియా కేసుల సంఖ్య తగ్గుతుంది. మిషన్ భగీరథతో స్వచ్ఛమైన నీరు డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారానే ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించడం సాధ్యపడింది. ఇదే దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం స్వచ్ఛమైన నీటిని అందించే విషయంలో యూరప్ మన రాష్ట్రం కంటే వెనుకబడి ఉంది. తాగునీటి స్వచ్ఛతలో గెలంగాణ టాప్‌లో నిలవడం మనకు గర్వకారణం. -
నీళ్ల కోసం రోడ్డుపైకి వచ్చిన పెద్ద పులి.. నిలిచిపోయిన వాహనాలు!
-
చింతబావి బస్తీలో నల్లాల ద్వారా కలుషిత నీటి సరఫరా
-
జలపథంలో... తొలి పదం
దేశచరిత్రలోనే ఇది తొట్టతొలి ప్రయత్నం. మనిషికి ప్రాణావసరమైన జల వనరులు ఎక్కడెక్కడ, ఎంతెంత, ఎలా ఉన్నాయని లెక్కలు తేల్చిన ఘట్టం. మానవ తప్పిదాల వల్ల క్షీణిస్తున్న నీటి వసతులను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో మరోసారి గుర్తు చేసిన జలగణన యజ్ఞం. కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల విడుదల చేసిన భారత జలవనరుల తొలి గణన అనేక విధాల కీలకమైనది అందుకే. దేశంలో అటు ప్రకృతి సహజమైన, ఇటు మానవ కల్పితమైన చెరువులు, సరస్సులు, నీటి కుంటల సమగ్ర సమాచారాన్ని ఈ లెక్కలు తొలిసారిగా ముందుకు తెచ్చాయి. దేశంలో ఈ జల వనరులు ఏ మేరకు ఆక్రమణకు గురైనదీ తేల్చాయి. సమస్త జీవరాశి మనుగడ కొనసాగాలంటే... ప్రతి నీటి చుక్కా కీలక సమకాలీన సందర్భంలో కేంద్రశాఖ నిర్వహించిన ఈ జలవనరుల గణన ఆహ్వానించదగ్గ యత్నం. ప్రతి ఇంటికీ సురక్షిత మంచి నీటిని అందిస్తామని పాలకులు పదే పదే సంకల్పం చెప్పుకుంటున్న వేళ ఈ నీటి వసతుల సమగ్ర సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది. చెరువులు, రిజర్వా యర్లు, సరస్సులు – ఇలా జలవనరులు వివిధ రకాలు. కాగా, వాగులు, నీటి చెలమలు, గృహ సము దాయాలు – ఇతర ప్రాంతాల నుంచి చేరిన వర్షపునీళ్ళు, ఏదైనా నది – వాగుల నుంచి దారి మళ్ళించడం ద్వారా నిల్వచేసిన నీళ్ళు, మంచు కరగడంతో ఏర్పడ్డ నీటి వసతి... ఇలాంటివన్నీ కూడా నీటి వనరులేనని ఈ తొలి జలగణన నివేదిక నిర్వచించింది. వ్యవసాయం, చేపల పెంపకం, ఆధ్యాత్మికత – ఇలా రకరకాల ప్రయోజనాల కోసం నీటిని నిల్వ చేసినవాటిని జాబితాకు ఎక్కించింది. 2018– 19లో చేసిన ఈ గణన దేశం మొత్తం మీద 24 లక్షలకు పైగా జలవనరులు ఉన్నాయని తేల్చింది. వీటిలో 97.1 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, 2.9 శాతమే పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. నీటి వస తుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న భారీ అంతరాలను ఈ జల నివేదిక ఎత్తిచూపింది. ఈ లెక్కల్లో దేశంలోకెల్లా అత్యధికంగా 7.47 లక్షల జలవనరులతో పశ్చిమ బెంగాల్ ప్రథమ స్థానం దక్కించుకోగా, దేశంలోనే అత్యధిక జనాభాకు నిలయమైన ఉత్తర ప్రదేశ్ కేవలం 2.5 లక్షల నీటివనరులతో రెండో స్థానంలో నిలిచింది. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా ఏకంగా 3.55 లక్షల నీటి వనరులతో దేశంలోనే ముందుంది. అలాగే, దేశంలోని నీటి వనరుల్లో దాదాపు 63 శాతం పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో నెలకొన్నాయి. బెంగాల్లో నీటి మడుగులు, రిజర్వాయర్లు, ఆంధ్రప్రదేశ్‌లో చెరువులు, తమిళనాట సరస్సులు ఎక్కువని ఈ నివేదిక తేల్చింది. అదే సమయంలో దాదాపు 1.6 శాతం మేర, అంటే 38 వేలకు పైగా వనరులు కబ్జాకు గురయ్యాయట. ఈ కబ్దాలో 40 శాతం వాటా యూపీదే అన్నది నివేదిక సారాంశం. నిజానికి, 1986 నుంచి అయిదేళ్ళకోసారి కేవలం చిన్న నీటిపారుదల వసతుల లెక్కలను కేంద్రం చేపడుతూ వచ్చింది. అందులో ప్రధానంగా ప్రభుత్వ సంస్థల జనాభా లెక్కల నుంచి సేకరించిన డేటాను సంకలనం చేస్తూ వచ్చింది. అయితే, ప్రభుత్వాలు ఒకప్పుడు నీటి వసతులను కేవలం వ్యవసాయ, ఆర్థిక ప్రయోజనాల్లో భాగంగానే చూస్తూ వచ్చాయి. ఆ దృక్కోణం గత రెండు దశాబ్దాల్లో మారింది. మానవ, పర్యావరణ సంక్షేమానికి జలవనరుల ప్రాధాన్యాన్ని గ్రహించి, పాత తప్పును సరిదిద్దుకొనే పనిలో ప్రభుత్వాలు పడ్డాయి. 2005లోనే కాంగ్రెస్ సారథ్యంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘జలవనరుల మరమ్మతులు, నవీకరణ, పునరుద్ధరణ పథకం’ చేపట్టింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువుల లాంటి సాంప్రదాయిక నీటివసతులకు మళ్ళీ ఊపిరిపోసే పని చేపట్టింది. అయితే, సమగ్ర సమాచార లేమి వల్ల ఈ పథకాల లక్ష్యాలు ఏ మేరకు సిద్ధించాయో చెప్పలేని పరిస్థితి. తాజా జలగణన ముఖ్యత్వం సంపాదించుకున్నది అక్కడే. ఆఖరుసారి 2013–14లో చేసిన చిన్న నీటిపారుదల వసతుల సర్వేతో పోలిస్తే, తాజా గణనలో నీటి వసతుల సంఖ్య 5 రెట్లు పెరగడం విశేషం. పట్టణప్రాంత చెరువులు, కుంటల వివరాలపై పౌరసంస్థలు, విద్యాకేంద్రాలే గళమెత్తేవి. వాటి క్రియాశీలత వల్లే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, శ్రీనగర్, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో చెరువులు కనుమరుగవుతున్న తీరు కొంతైనా జనం దృష్టికి వచ్చింది. ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే జలగణనతో రంగంలోకి వచ్చింది గనక పరిస్థితులు మరింత మెరుగవుతాయని చిన్న ఆశ. గమనిస్తే, ఒకప్పుడు పుష్కలంగా నీళ్ళున్న భారతావని ఇవాళ అధిక జనాభా, పట్టణీకరణతో నీటి కొరత దిశగా జారిపోతోంది. దీనికి తక్షణం పగ్గం వేయాలి. ప్రపంచంలో 18 శాతం జనాభాకు నెలవైన మన దేశంలో ఉన్న నీటి వనరులు 4 శాతమే. అవసరాలు ఎక్కువ, అందుబాటులో ఉన్న నీరు తక్కువ గనక నీటి కోసం ఒత్తిడీ అధికమే. దానికి తోడు పర్యావరణ మార్పుల ప్రభావం నీటి వసతులు, వాటి నాణ్యత, నిర్వహణ పైన గణనీయంగా పడుతోంది. ఈ పరిస్థితుల్లో జనగణన లాగానే క్రమం తప్పకుండా జల వనరుల గణన చేయడం అవసరం. పదేళ్ళకోసారి చేసే జనాభా లెక్కల లాగా కాక, వీలైనంత తరచుగా ఈ నీటి లెక్కలు తీయాలి. ప్రతి సుస్థిర అభివృద్ధి లక్ష్యానికీ, నీటికీ లంకె ఉంది గనక దీంతో నీటి నిర్వహణను మెరుగుపరుచుకొనే వీలు చిక్కుతుంది. అలాగే పట్టణ నిర్మాణం, విస్తరణల్లో పాలకులు సరైన నిర్ణయాలు చేయడానికీ నీటి వసతుల వివరాలు దోహదపడతాయి. స్థానిక సంస్థలను, పౌరసమాజ బృందాలను కూడా ఈ జలగణనలో భాగస్థుల్ని చేస్తే మెరుగైన ఫలితాలొస్తాయి. ఆ దిశగా ఈ నివేదిక తొలి అడుగు. మేలైన ముందడుగు. -
పిల్లిలంకలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎంపీ బోస్
-
పథకాలు అందకుంటే వెతికి పట్టుకుని అందిస్తాం: మంత్రి కేటీఆర్
సిరిసిల్ల: రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇంకా ఎవరైనా రాని వారు ఉంటే.. వెతికి పట్టుకొని అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే 24 గంటల కరెంట్, ఇంటింటికీ తాగునీరు, పొలాలకు సాగునీరు, అర్హులకు ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ.. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు. దేశంలోనే బీడీ కార్మికులను పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే ఎక్కడ కూడా రైతులకు జీవిత బీమా చేయించలేదని, ఒక్క తెలంగాణలోనే 40 లక్షల మంది రైతులకు ఏటా రూ.1,450 కోట్లు ప్రీమియం చెల్లించి బీమా చేయిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో లక్ష రైతుకుటుంబాలకు రూ.5వేల కోట్ల బీమా సాయం అందిందని వివరించారు. 31 వేల మంది గిరిజన ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో 3,416 గిరిజన తండాలను, గూడేలను గ్రామపంచాయతీలుగా చేశామని సర్పంచులను నుంచి వార్డు సభ్యుల వరకు 31వేల మంది గిరిజనులు పాలనలో భాగస్వాములయ్యారని కేటీఆర్ వెల్లడించారు. గిరిజన బిడ్డలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని, పోడు భూములకు త్వరలోనే పట్టాలు ఇస్తామని తెలిపారు. గ్రామాల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ.. పల్లెల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టాలని సర్పంచులను మంత్రి కోరారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు సారూ.. స్పందించిన కేటీఆర్.. కలెక్టర్‌కు ఆదేశాలు జిల్లాలోని బాకూర్‌పల్లితండాలో ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ.. మంత్రి కేటీఆర్ మీకు మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవా? అని మహిళలను ప్రశ్నించారు. వస్తలేవంటూ.. మహిళలు చెప్పడంతో కేటీఆర్ స్పందించారు. ‘ఎందుకు రావడం లేదు.. పైపులైన్ వేశాం, ట్యాంకు కట్టాం.. కారణం ఏంటి..? సాయంత్రంలోగా మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి నాకు నివేదిక ఇవ్వాలని’కలెక్టర్‌ను ఆదేశించారు. స్థానిక సర్పంచ్ స్పందించి.. ‘ఇక్కడ బోర్లు ఉన్నాయి.. బోరు నీళ్లే వాడుకుంటున్నారు.. మిషన్ భగీరథ నీళ్లు తాగడం లేదని’అన్నారు. ‘ప్రభుత్వం వేసినా మీరు తాగకుంటే ఎలా.. బోరు నీరు తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ ఇష్టమని’కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల్లో గిరిజన భవన్‌ను కట్టుకుందామన్నారు. చదవండి: ఉన్నమాట అంటే ఉలిక్కిపడుతున్నారు.. ఏపీ మంత్రులపై హరీశ్‌రావు -
మల్లన్న సు‘జలం’ సిద్ధం.. 6.57 లక్షల గృహాలకు తాగునీరు
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను శుద్ధిచేసి ఆరు జిల్లాల్లోని 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలలో 6.57లక్షల గృహాలకు తాగునీటిని అందించే బృహత్తర పథకం అమలుకు రంగం సిద్ధమవుతోంది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్ వద్ద రూ.1,212 కోట్ల వ్యయంతో 540 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. 270 ఎంఎల్డీ చొప్పున రెండు ప్లాంట్లను నిర్మించగా, ఒక ప్లాంట్ పూర్తికావడంతో సోమవారం ట్రయల్ రన్ నిర్వహించారు. మరో 270ఎంఎల్డీ డబ్ల్యూటీపీ పనులు ఆగస్టులో పూర్తికానున్నాయి. మల్లన్నసాగర్ నుంచి 7.26టీఎంసీల నీరు.. కొమురవెల్లి మల్లన్నసాగర్‌ను 50టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేలా నిర్మించారు. ఏటా 7.26టీఎంసీల నీటిని తాగునీటిగా వినియోగించాలని నిర్ణయించారు. రా వాటర్‌ను శుద్ధి చేసేందుకు కుకునూరుపల్లి మండలం తిప్పారం వద్ద ఆరు మోటార్ల ద్వారా 5.6 కిలోమీటర్ల పైప్‌లైన్‌తో మంగోల్‌లోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు చేరుస్తారు. 540 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) సామర్థ్యంతో రెండు నీటి శుదీ్ధకరణ ప్లాంట్లు ఒక్కోటి 270 ఎంఎల్డీ చొప్పున నిర్మించారు. మల్లన్నసాగర్ నుంచి వచ్చిన నీళ్లు మంగోల్ వద్ద శుదిŠధ్ చేసి, 3 కిలోమీటర్ల దూరంలోని లకుడారంలో 6 ఎంఎల్(మిలియన్ లీటర్లు) సామర్థ్యం కలిగిన గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (జీఎల్‌బీఆర్)లోకి పంపిస్తారు. ఇందుకు జీఎల్‌బీఆర్ వద్ద రెండు పాయింట్స్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొమురవెల్లి కమాన్ వద్ద ఉన్న ట్యాంక్‌లోకి తరలిస్తారు. అక్కడి నుంచి జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాలకు తాగునీరు అందుతుంది. అక్కారంలోని నాలుగు పాయింట్ల నుంచి.. కొమురవెల్లి కమాన్ నుంచి మరో పాయింట్ ద్వారా 29 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేట నియోజకవర్గానికి నీటిని తరలిస్తారు. లకుడారం నుంచి 16 కిలోమీటర్ల దూరంలోని అక్కారం వద్ద 6ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన సంపులోకి పంపిస్తారు. అక్కారం వద్ద ఏర్పాటు చేసిన నాలుగు పాయింట్లలో.. ఒక పాయింట్ నుంచి 33.6 కిలోమీటర్ల దూరంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘనపురం గుట్టకు నీటిని పంపింగ్ చేస్తారు. ఈ గుట్ట నుంచి మేడ్చల్, ఆలేరు, భువనగిరికి ప్రస్తుతం ఉన్న పైప్‌లైన్‌తో నీటిని పంపిస్తారు. రెండో పాయింట్‌ను 5.4 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ కోమటిబండ లైన్‌కు కలుపుతారు. ఇక్కడి నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు మెదక్ జిల్లాలోని కొన్ని మండలాలకు ఈ జలాలు వెళ్తాయి. మూడో పాయింట్ నుంచి సంగాపూర్ వద్ద నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలోని మల్లన్నసాగర్ నిర్వాసితులకు తరలిస్తారు. నాలుగో పాయింట్‌ను భవిష్యత్ అవసరాల దృష్ట్యా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి పంపింగ్ చేయనున్నారు. 6 జిల్లాలు, 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలకు మొత్తంగా మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు ఆరు జిల్లాలలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలలోని 6,57,203 గృహాలకు తాగునీటిని అందించనున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 4,81,217 గృహాలకు నీటి సరఫరా కానున్నాయి. సిద్దిపేట, గజ్వేల్, చేర్యాల, మేడ్చల్, దుబ్బాక, ఆలేర్, జనగామ, భువనగిరి, యాదగిరిగుట్ట, తుప్రాన్, మోత్కూర్, పోచంపల్లి, ఘట్కేసర్, దిండిగల్, గుండ్ల పోచంపల్లి, తిరుమలగిరి పట్టణాల్లో 1,75,986 గృహాలకు నీటిని సరఫరా చేస్తారు. జూలై నాటికి సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 439 ఆవాసాలకు, గజ్వేల్, దుబ్బాక, తుప్రాన్ మున్సిపాలిటీలకు, ఆగస్టు నాటికి మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో 611 ఆవాసాలు, ఘట్కేసర్, మేడ్చల్, దుండిగల్, గుండ్లపోచంపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు, మోత్కూరు, పోచంపల్లి మున్సిపాలిటీలకు తాగు నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. నెల రోజుల్లో సరఫరా డబ్ల్యూటీపీ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ ప్లాంట్ ద్వారా నెల రోజుల్లో పంపింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టు నాటికి 6 జిల్లాలు, 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలకు మల్లన్న సాగర్ నుంచి శుద్ధిచేసిన గోదావరి జలాలను సరఫరా చేస్తాం. – రాజయ్య, మిషన్ భగీరథ గ్రీడ్ ఈఈ చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
వైరల్ వీడియో.. అనాధ వృద్ధుడికి నీళ్లు తాగించిన చిన్నారి
-
Hyderabad: తాగునీటి సరఫరా నిలిపివేతలో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్య్లూఎస్ఎస్) ఫేజ్ – 1 లో సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద చేపట్టాల్సిన గోదావరి మెయిన్ 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు లైన్ బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్షన్ పనులను 24 గంటల పాటు వాయిదా వేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ వెల్లడించారు. హోలీ పండగ నేపథ్యంలో నగర ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ నెల 8వ తేదీకి బదులు 9వ తేదీ గురువారం ఉదయం 6 నుంచి 11వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సోమవారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సరఫరా అంతరాయానికి సంబంధించి జీఎంలు తమ పరిధిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. దానికి అనుగుణంగా 24 గంటలు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. చదవండి: రంగుల పండుగ హోలీ విశిష్టత ఇదే.. ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలంటే..? -
హైదరాబాద్: నగరవాసులకు అలర్ట్.. 48 గంటలు నీళ్లు బంద్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాలకు 48 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నెల 8వ తేదీ ఉదయం 6 నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆదివారం జలమండలి ప్రకటించింది. మహానగరానికి తాగునీరు అందిస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ –1 లో మెయిన్ పైపులైన్ తరలింపు నేపథ్యంలో రెండు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఇదీ పరిస్థితి.. దక్షిణ మధ్య రైల్వే శాఖ మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిరిసిల్ల జిల్లాలోని కొత్తపల్లి వరకు నూతనంగా రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు చేపడుతోంది. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద ఈ ట్రాక్ వేసే దగ్గర హైదరాబాద్‌కు నీటి సరఫరా చేసే గోదావరి మెయిన్ వాటర్ పైపులైన్ ఉంది. రైల్వే ట్రాక్ క్రాసింగ్ కోసం అక్కడ ఉన్న 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు లైన్‌కు బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్ష¯న్ పనుల చేపడుతుండటంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. వాస్తవంగా పనుల పూర్తికి 66 గంటలు సమయం పడుతుందని ముందుగా భావించినప్పటిఈ వాటిని 48 గంటల్లో పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించే విధంగా జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తి అంతరాయం కలిగే ప్రాంతాలివే.. నగర శివారులోని షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, డిఫెన్స్ కాలనీ. నాగారం, దమ్మాయిగూడ, కీసర, బొల్లారం రింగ్ మెయిన్–3 లైన్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కొండపాక (జనగామ, సిద్దిపేట), ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి), ఘన్పూర్ (మేడ్చల్/శామీర్ పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు, కాప్రా మున్సిపాలిటీ పరిధి ప్రాంతాలు. పాక్షికంగా .. బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ, కేపీహెచ్‌బీ, మలేసియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ ప్రాంతాలు. లింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు గల ప్రాంతాలు, గోపాల్ నగర్, మయూర్ నగర్, రిజర్వాయర్ ప్రాంతాలు, ప్రగతి నగర్ ప్రాంతం, నిజాంపేట్ బాచుపల్లి. ట్యాంకర్ల ద్వారా ఉచితంగా ప్రభావిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటి సరఫరా జరగనుంది. ఇప్పటికే నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే డివిజన్ల సీజీఎం, జీఎం తదితర ఉన్నతాధికారులతో జలమండలి ఎండీ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా స్లమ్, బస్తీలకు ప్రాధాన్యమిస్తూ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీరందించాలని, అవసరమైతే ట్రిప్పుల సంఖ్యను సైతం పెంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరాన్ని బట్టి ప్రైవేటు ట్యాంకర్ల సేవలను ఉపయోగించుకోవాలని, 24 గంటలూ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లలో ఎప్పటికప్పుడు తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని ఎండీ ఆదేశించారు. సంపులు, స్టోరేజీ సామర్థ్యం ఉన్నవాళ్లు నీటి నిల్వ చేసుకుని, నీటి వృథాను అరికట్టి, పొదుపుగా వాడుకోవాలని జలమండలి ఎండీ విజ్ఞప్తి చేశారు. చదవండి: ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది?.. టేప్ ఎందుకు వేశారు: ప్రీతి సోదరుడు -
రెండు రెట్లు కడలి పాలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తాగు, సాగునీటి కోసం వినియోగిస్తున్న నదీ జలాల కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా కడలి పాలవుతున్నట్లు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నదీ జలాలను మళ్లించకుంటే తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. దేశంలో సగటు వర్షపాతం, నదుల్లో ప్రవాహం, ఉపయోగించుకోదగిన జలాలు, ప్రస్తుతం వాడుకుంటున్న నీరు, భవిష్యత్ అవసరాలపై సీడబ్ల్యూసీ సమగ్రంగా అధ్యయనం చేసింది. అందులో ప్రధానాంశాలు ఇవీ.. ► దేశంలో ఏటా సగటున 1,298.6 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. వర్షపాతం రూపంలో 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ► వర్షపాతం వల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను ఉపయోగించుకుంటున్నాం. అంటే ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలుస్తున్నట్లు స్పష్టమవుతోంది. వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్లు వెల్లడవుతోంది. ► దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటి నిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వ చేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను వాడుకుంటున్నాం. ► ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ► దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జలాశయాలను నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించకుంటే సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవు. ► నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపర్చ కుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదు. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగకుంటే ఆహార సంక్షోభానికి దారి తీస్తుంది. ► దేశంలో ప్రజల రోజువారీ అవసరాలు, తాగునీటి కోసం తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (వెయ్యి లీటర్లు ఒక క్యూబిక్ మీటర్‌కు సమానం) ఉంది. 2011 నాటికి 1,545 క్యూబిక్ మీటర్లకు, 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోయింది. నదీ జలాలను మళ్లించకుంటే తలసరి నీటి లభ్యత 2031 నాటికి 1367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1228 క్యూబిక్ మీటర్లకు తగ్గుపోతుంది. తాగు, రోజువారీ అవసరాల కోసం నీటి కొరత తీవ్రమవుతుంది. -
‘జల్‌జీవన్’తో వందశాతం రక్షిత మంచి నీరు
సాక్షి, న్యూఢిల్లీ: జల్ జీవన్ మిషన్‌లో భాగంగా తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలు వంద శాతం మేర ప్రతీ ఇంటికి సురక్షిత మంచినీటిని అందించాయని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ప్రజలపై పన్నులు మోపి ఆదాయాలు పెంచుకున్నాయని వెల్లడించింది. కోవిడ్–19 మహమ్మారితో రాష్ట్రాల రెవెన్యూలకు పెద్దఎత్తున తగిలిన ఎదురుదెబ్బతో కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా వాటిని ఆదుకుందని పేర్కొంది. అయితే పట్టణ ఆర్థిక వనరులపై ఇటీవల ఆర్బీఐ ఇచి్చన నివేదికలో ఓఈసీడీ దేశాల కంటే భారత్‌లో ఆస్తిపన్ను వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయని ఎత్తిచూపింది. రాష్ట్రాలు వసూలు చేస్తున్న ఆస్తిపన్నుల్లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల ఆస్తిపన్ను విధానాల్లో పెద్దఎత్తున సంస్కరణలకు అవకాశం ఏర్పడుతుందని ఆర్బీఐ నివేదికలో పేర్కొందని ఆర్థిక సర్వే వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, హర్యానా, కేరళ, అసోం, పుదుచ్చేరి 2022–23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీలను సవరించాయని మంగళవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక సర్వే 2022–23లో పేర్కొన్నారు. వీటితోపాటు 2022 ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు అకాల భారీ వర్షాల కారణంగా పంటనష్టం, సరఫరాలో అంతరాయం కారణంగా కూరగాయల్లో అధిక ద్రవ్యోల్బణం నమోదైందన్నారు. ఈ కారణంగా టమోటాల ధరల పెరుగుదల ప్రభావం ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై పడిందని వెల్లడించారు. పెరిగిన ద్రవ్యోల్బణం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా సహా చాలా రాష్ట్రాల్లో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ–సీ) ద్రవ్యోల్బణం పెరిగిందని, దీనికి ఇంధనం, దుస్తులు ప్రధాన కారణమని ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రసూతి మరణాల నిష్పత్తి(ఎంఎంఆర్) 2014–16లో లక్షకు 130 మంది ఉండగా, 2018–20లో లక్షకు 97గా నమోదైందని తెలిపింది. కాగా, 2030 నాటికి ప్రతి లక్ష సజీవ జననాలకు ప్రసూతి మరణాలరేటు(ఎంఎంఆర్) 70 కంటే తక్కువకు తగ్గించాలనే లక్ష్యాన్ని తెలంగాణ(43), ఆంధ్రప్రదేశ్(45) సహా ఎనిమిది రాష్ట్రాలు ఇప్పటికే సాధించాయని పేర్కొంది. ముఖ్యంగా, ప్రధానమంత్రి గతిశక్తి, కోవిడ్–19 నేపథ్యంలో లాజిస్టిక్స్ రంగంలోని ప్రస్తుత పరిణామాలను పరిగణనలోకి తీసుకొని విడుదల చేసిన లీడ్స్–2022 సర్వేలో తెలంగాణ 90 శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించి అచీవర్స్ జాబితాలో చేరిందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. -
సిద్ధమవుతున్న ‘మల్లన్నసాగర్ భగీరథ’
గజ్వేల్: ‘మల్లన్నసాగర్ భగీరథ పథకం’సిద్ధమవుతోంది. మార్చి నెలాఖరులోగా ఈ పథకం పనులను పూర్తి చేయడానికి సంబంధిత యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు ఇక ఇక్కడి నుంచే మంచినీటి సరఫరా జరగనుంది. ప్రస్తుతం ఈ జిల్లాలకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే పైప్‌లైన్ నుంచి నీటిని సరఫరా చేస్తుండగా, మార్చి తర్వాత దీనిని హైదరాబాద్‌కే పరిమితం చేసి.. ఈ పైప్‌లైన్‌కు సమాంతరంగా నిర్మిస్తున్న మల్లన్న సాగర్ భగీరథ కొత్త లైన్ ద్వారా మంచినీటి సరఫరా చేపట్టనున్నారు. ఈ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ శనివారం పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కొరత లేకుండా మల్లన్న సాగర్ నుంచి నీరు.. హైదరాబాద్‌లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి సుజలస్రవంతి పథకాన్ని పదేళ్ల క్రితం రూ.3,375 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు 186 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఈ లైన్ ద్వారా 735 ఎంఎల్డీ (మిలి యన్ లీటర్స్ పర్ డే) నీటి సరఫరా జరుగుతోంది. ఇందులో సిద్దిపేట, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు భగీరథ పథకం అవసరాల కోసం సుమారుగా 300 ఎంఎల్డీ నీటిని వాడుకుంటున్నారు. మిగతా నీరు హైదరాబాద్ అసరాలకు వెళ్తుంది. దీనివల్ల హైదరాబాద్‌కు వెళ్లే నీటిలో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా నీరు తక్కువగా వచ్చినప్పుడు ఈ జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలో గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ నీటిని మిషన్ భగీరథ కోసం వాడు కోవాలని నిర్ణయించారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్ వద్ద 540 ఎంఎల్డీ సామర్థ్యంతో చేపట్టిన డబ్ల్యూటీపీ పనులు పూర్తి కావొస్తున్నాయి. మార్చి నాటికి హైదరాబాద్ లైన్‌పై నీటిని తీసుకునే వాల్వులను మూసి వేయనున్నారు. సిద్దిపేట, జనగామ, యదాద్రి, సూర్యా పేట జిల్లాలకోసం మల్లన్నసాగర్ నుంచే లైన్లను నిర్మిస్తున్నారు. ఇబ్బంది లేకుండా నీటి సరఫరా.. మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం ద్వారా మొదటగా జనగామ జిల్లాకు నీటిని సరఫరా చేస్తారు. మల్లన్నసాగర్ నుంచి కొమురవెల్లి కమాన్ వద్ద గల ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా జనగామ జిల్లాకు తాగునీరు వెళ్లనుంది. ఇందుకోసం మల్లన్నసాగర్ నుంచి కొమురవెల్లి కమాన్ వరకు 6.9 కిలోమీటర్ల మేర ప్రత్యేక లైన్ నిర్మించారు. ప్రస్తుతం నీటిని తీసుకుంటున్న హైద రాబాద్ లైన్ వల్ల ఎప్పడైనా నీటి కొరత ఏర్పడితే తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడేవి. మార్చి తర్వాత అలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ఇదే తరహాలో సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోనూ భగీరథ పథకానికి ప్రత్యేక వ్యవస్థను తీసు కురానున్నారు. స్మితా సబర్వాల్ పర్యటన సందర్భంగా మార్చి ఆఖరులోగా పనులు పూర్తి చేయడానికి దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి నెలాఖరులో పనులు పూర్తిచేయడమే లక్ష్యం నాలుగు జిల్లాల తాగునీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే ‘మల్లన్నసాగర్ భగీరథ పథకం’ఉద్దేశం. దీనికి సంబంధించి పనులు సాగుతున్నాయి. మార్చి నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తాం. – రాజయ్య, మిషన్ భగీరథ ఈఈ, గజ్వేల్ -
దర్శి దాహార్తి తీరేలా.. ప్రత్యేక దృష్టి సారించిన సీఎం జగన్
దర్శి పట్టణవాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు పడుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రూ.121 కోట్లు మంజూరు చేశారు. రానున్న 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక టెండర్లు పిలవడమే తరువాయి. దీనిపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్శి(ప్రకాశం జిల్లా): దర్శి పట్టణంలో 33,500 మంది జనాభా నివశిస్తున్నారు. అధికారికంగా పన్ను చెల్లిస్తున్న నివాసాలు 8,800 ఉండగా అనధికారికంగా 10 వేలకు పైగానే ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఉన్న నిమ్మలబావి కనెక్షన్లు 600, ఆర్డబ్ల్యూఎస్ కనెక్షన్లు 60, వీధి కుళాయిలు మరో 960 ఉన్నాయి. ప్రస్తుతం మూడు రోజులకు ఒక సారి నీరు అందుతోంది. 50 ఏళ్లు నీటి ఇబ్బందులు అధిగమించేలా: మరో 50 ఏళ్లు ఇంటింటికీ కుళాయి నీరు ఇచ్చి నీటి ఇబ్బందులు అధిగమించేలా సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్ నిర్మిస్తున్నారు. ఈ ఎస్ఎస్ ట్యాంక్‌లో 1600 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. రోజుకు 9 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేలా ప్రణాళికలు చేశారు. రోజుకు ఒక వ్యక్తికి 135 లీటర్ల నీరు సరఫరా చేస్తారు. కేటాయింపు ప్రణాళికలు ఇలా.. ఈ ప్రాజెక్ట్‌కు రూ.121 కోట్లు మంజూరు చేస్తూ జీఓ విడుదల చేశారు. నాలుగు విభాగాలుగా పనులకు ప్రణాళికలు రూపొందించారు. సాగర్ కాలువ నుంచి ఎస్ఎస్ ట్యాంక్ (సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్)కు నీరు రావడానికి, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్, ఫుట్ బ్రిడ్జి, ఇంటేక్ వెల్ ల నిర్మాణానికి, నీటి సరఫరా లైన్లకు, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణాలకు రూ.8938.67 లక్షలు కేటాయించారు. రెండో విభాగంలో 7 సంవత్సరాల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు రూ.660.85 లక్షలు కేటాయించారు. మూడో విభాగంలో జీఎస్టీ ఇతర చార్జీలు రూ.1752.64 లక్షలు కేటాయించగా నాలుగో విభాగంలో ఏపీఎస్పీ డీసీఎల్, ప్రైజ్ వేరియేషన్స్, కన్సల్టెన్సీ చార్జెస్, ల్యాండ్ కేటాయింపునకు, ఇతర అవసరాలకు రూ.747.84 లక్షలు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను దర్శి పట్టణాన్ని ఆనుకుని ఉన్న ముండ్లమూరు మండలం పులిపాడు చెరువు వద్ద నిర్మిస్తారు. ఆ చెరువుకు మొత్తం 250 ఎకరాలు భూమి ఉంది. చెరువు నిండితే 120 నుంచి 150 ఎకరాల భూమిలో నీరు నిల్వ ఉంటుంది. 100 ఎకరాల నుంచి 130 ఎకరాల వరకు చెరువుకు మిగులు భూమి ఉంది. అందులో 96 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్‌కు సేకరించారు. ప్రత్యేకంగా రావాటర్ స్టోరేజ్ ట్యాంక్, నీటి శుద్ది కర్మాగారాలు, స్టాఫ్ క్వార్టర్స్ వంటి సౌకర్యాలకు భూమిని ఉపయోగిస్తారు. సాగర్ కుడి కాలువ నుంచి నేరుగా చెరువులోకి నీరు వచ్చేలా పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ నీటిని శుద్ధి ప్లాంట్‌లో శుద్ధి చేసి పైప్లైన్ల ద్వారా పట్టణంలోని ఇంటింటికీ నీటి సరఫరా చేస్తారు. వీధి పంపులకు చెక్: ప్రస్తుతం మంజూరైన ప్రాజెక్ట్ పూర్తయితే మహిళలు వీధి కుళాయిల వద్ద లైన్లో నిలబడి నీరు పట్టుకోవాల్సిన పని లేదు. నేరుగా ఇంట్లోకే తాగు నీరు పైప్ లైనుల ద్వారా చేరేలా ప్రణాళికలు చేశారు. వారి సమయం కూడా వృథా కాదు. పాత పైప్ లైనులు బాగున్న చోట అవే లైన్లు ఉంచి, నీరు అందని ఎత్తు పల్లాల వద్ద నూతన పైప్ లైన్లు వేస్తారు. దీంతో ప్రతి ఇంటికి నీరు కచ్చితంగా చేరుతుంది. పరోక్షంగా పట్టణ అభివృద్ధి: తాగునీటి ఇబ్బందులు అధిగమిస్తే నివాసాలు ఉండేవారు ఎక్కువ చొరవ చూపుతారు. దీంతో దర్శిలో నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. తద్వారా పట్టణం కూడా వ్యాప్తి చెందుతుంది. శిథిలావస్థలో నెదర్లాండ్ చెరువు 35 సంవత్సరాల క్రితం సాగర్ కాలువ నిర్మించినప్పుడు ఏర్పాటు చేసిన తాగునీటి రిజర్వాయర్ మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉంది. అప్పటి జనాభా ప్రకారం ప్రణాళికలతో నిర్మించిన నిర్మాణాలు, పైపులైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పట్టణం తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ప్రాజెక్ట్ పూర్తయితే ఇబ్బందులను అధిగమించవచ్చు. -
వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి
సాక్షి, హైదరాబాద్: రాబోయే వేసవికాలంలో తాగునీటి సరాఫరాలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాల ని అధికారులను సీఎంవో, మిషన్ భగీరథ విభాగం కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అంతరాయాలు లేని తాగునీటి సరాఫరా కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆవాసాలు, విద్యాసంస్థలకు నిరాటంకంగా తాగునీటి సరాఫరా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం తాగునీటి సరాఫరాపై మిషన్ భగీరథ కార్యాలయంలో స్మితా సబర్వాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం సాగుతున్న బల్క్, ఇంట్రా సరాఫరా తీరుపై స్మితా సబర్వాల్ సంతృప్తి వ్యక్తంచేశారు. రిజర్వాయర్ల నీటి మట్టాల నిరంతర పర్యవేక్షణ ఇంటెక్ వెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో ఉన్న పంపులు, మోటార్ల వ్యవస్థలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మెయిన్, సెకండరీ పైప్లైన్లలో ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే వెంటనే రిపేర్ చేసేలా మొబైల్ టీంలను నిరంతరం అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. మారుమూల, అట వీ ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలు, రెసిడెన్షియల్ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ తాగునీటి సరాఫరా తీరుపై గిరిజన, సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌చోంగ్తూతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, వివిధ జిల్లాల చీఫ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. -
స్వచ్ఛ జల్ సే సురక్ష.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఏపీ
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరా కోసం తీసుకుంటున్న చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్‌లో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘స్వచ్ఛ జల్ సే సురక్ష’ పేరుతో గతేడాది అక్టోబర్ 2 నుంచి ఈ ఏడాది జనవరి 26 వరకు కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దేశంలోని అన్ని గ్రామాల్లో సురక్షిత నీటి వాడకంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే రాష్ట్రాల్లో రక్షిత తాగునీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి మార్కులు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి వనరులు(రక్షిత మంచినీటి పథకాలు, బోర్లు, బావులు తదితరాలు) వద్ద నీటి నాణ్యత పరీక్షల నిర్వహణను కేంద్ర జల శక్తి శాఖ పరిశీలించింది. అలాగే నీటిలో ఫ్లోరైడ్, నైట్రేట్ తదితర రసాయనాలతో పాటు ఈ–కోలి తదితర బ్యాక్టీరియా కారకాలను గుర్తించినప్పుడు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను పరిగణనలోకి తీసుకుంది. వర్షాకాలం ముందు, తర్వాత నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల సంఖ్యను.. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి సౌకర్యాలను, నాణ్యత పరీక్షల నిర్వహణకున్న వసతులు, అందులో స్థానిక మహిళలకు తగిన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలను కూడా కేంద్ర జల శక్తి శాఖ పరిశీలించింది. వీటన్నింటి ఆధారంగా 900 మార్కులకు గాను రాష్ట్రాలకు మార్కులు కేటాయించింది. ఈసారి 900 మార్కులకు గాను 598 మార్కులతో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ 568 మార్కులతో రెండో స్థానం దక్కించుకుంది. 96% నీటి వనరుల వద్ద నాణ్యత పరీక్షలు.. ఏపీలో 87 శాతానికి పైగా గ్రామాల్లో స్థానికంగానే తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణకు అవసరమైన కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచినట్లు కేంద్ర జలశక్తి శాఖ గణాంకాల్లో తేలింది. 18,393 గ్రామాలుండగా, 96 శాతానికి పైగా అంటే 17,772 గ్రామాల్లోని వనరుల వద్ద రెండు విడతల పాటు పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.64 లక్షల తాగునీటి వనరుల వద్ద పరీక్షలు నిర్వహించగా, 21,193 చోట్ల వివిధ రకాల కాలుష్య కారకాలను గుర్తించారని తెలిపింది. అందులో 20,739 చోట్ల ఏపీ ప్రభుత్వం అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రక్షిత మంచినీటి వనరులు కల్పించినట్టు కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. -
రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో భాగస్వామ్యం పెంచండి
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో స్థానికుల భాగస్వామ్యం పెరిగినప్పుడే ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తాగునీటి సరఫరాకు అవకాశం ఉంటుందని గ్రామీణ మంచినీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్) ఉన్నతాధికారులు పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్డబ్ల్యూఎస్, యునిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాల అధికారులు, ఎన్జీవో ప్రతినిధులతో రెండు రోజుల వర్క్‌షాప్ విజయవాడలో ప్రారంభమైంది. ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి, జలజీవన్ మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరేరామ్ నాయక్, సీఈలు గాయత్రిదేవి, సంజీవరెడ్డి, రవికుమార్ అధికారులు, ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఎన్జీవో ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు 40 ఎన్జీవో సంస్థలకు చెందిన 600 మంది ప్రతినిధులకు బాధ్యత అప్పగించింది. -
Hyderabad: నిత్యం 150 మిలియన్ గ్యాలన్ల నీరు నేలపాలు
సాక్షి, హైదరాబాద్: వందల కిలో మీటర్ల దూరం నుంచి నగరానికి తరలిస్తోన్న కృష్ణా, గోదావరి జలాల్లో నిత్యం 150 మిలియన్ గ్యాలన్ల విలువైన తాగునీరు వృథా అవుతుండడం తీరని వ్యథ మిగులుస్తోంది. నిత్యం కృష్ణా మూడు దశలు, గోదావరి మొదటి దశ, జంట జలాశయాలు, సింగూరు, మంజీరా జలాశయాల నుంచి 593 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరించి శుద్ధి చేసి నగరంలోని 12 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది. ఇందులో సుమారు 25 శాతం వృథా అవుతోంది. పురాతన పైపులైన్లకు తరచూ ఏర్పడుతోన్న లీకేజీలు, అక్రమ నల్లాలు, నీటి చౌర్యం ఇందుకు ప్రధాన కారణం. కాగా ఈ నీటితో శివారు ప్రాంతాల్లో 35 లక్షల మంది దాహార్తిని తీర్చే అవకాశం ఉందని తాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీటివృథాను అరికట్టేందుకు నగరంలో 400కు పైగా ఉన్న స్టోరేజి రిజర్వాయర్ల పరిధిలో సోషల్ ఆడిట్ నిర్వహించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. వృథాపై పబ్లిక్ నజర్.. తాగునీటి వృథాను అరికట్టే కృషిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు నూతనంగా ప్రవేశపెట్టనున్న మొబైల్యాప్ దోహదం చేస్తుందని జలమండలి అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు ఈ మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా పైపులైన్ల లీకేజీలు, రిజర్వాయర్ల వద్ద నీటివృథా, అక్రమ నల్లాల ద్వారా జరుగుతోన్న నీటిచౌర్యంపై నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కలి్పంచనున్నారు. అంతేకాదు నీటివృథాపై అప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో ఫోటో తీసి అప్లోడ్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఈ సమాచారం క్షణాల్లో ఉన్నతాధికారులతోపాటు క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేయడం ద్వారా నీటివృథాకు చెక్‌పెట్టవచ్చని తెలిపారు. అక్రమ నల్లాలపై సమాచారం అందించిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. కాగా ఔటర్‌పరిధిలోని 190 గ్రామాలు, నగరపాలక సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు తాగునీటిని సరఫరా చేసేందుకు జలమండలి ఓఆర్ఆర్ తాగునీటి పథకం ఫేజ్–1,ఫేజ్–2 పథకాలను పూర్తిచేసిన విషయం విదితమే. ఈ పథకం కింద సుమారు ఐదువేల కిలోమీటర్లకు పైగా తాగునీటి పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సుమారు 200కు పైగా నూతనంగా తాగునీటి స్టోరేజి రిజర్వాయర్లను నిరి్మంచిన విషయం విదితమే. ప్రస్తుతం జలమండలి ప్రతీ వ్యక్తికి ప్రధాన నగరంలో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 150 లీటర్ల తాగునీటిని అందిస్తుండగా..శివారు ప్రాంతాల్లో సుమారు వంద లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తోంది. -
కిడ్నీ రోగులకు మెరుగైన వైద్యం
ఎ.కొండూరు: కిడ్నీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో ఆమె శనివారం పర్యటించారు. కృష్ణారావుపాలెం శివారు మాన్సింగ్, దీప్లా నగర్, గిరిజన తండాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్తులను పరామర్శించారు. వ్యాధి సోకటానికి కారణాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ సెంటర్, పీహెచ్‌సీని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్థానిక పీహెచ్సీలో స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తామని చెప్పారు. అవసరమైన వారికి విజయవాడలో 12 ప్రైవేటు ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి, మందులు కూడా ఇస్తామని తెలిపారు. రోగుల కోసం శనివారం నుంచి ఇక్కడ ఒక వాహనం అందుబాటులో ఉంటుందన్నారు. స్థానిక పీహెచ్‌సీలోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 104 వాహనం ద్వారా ప్రతి నెలా కిడ్నీ రోగులకు మందులు అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఐదు తండాల్లో తాత్కాలికంగా ట్యాంకర్లతో తాగునీరు అందిస్తున్నామని, త్వరలో మరో 15 తండాల్లో రూ. 6 కోట్లతో పైపులైన్ల ద్వారా తాగునీరిస్తామని చెప్పారు. ఈ మండలానికి స్వచ్ఛమైన తాగు నీరు అందించడం కోసం రూ.38 కోట్లతో కృష్ణా జలాలను ఇంటింటికి అందిస్తామని, దీనికి టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేసిన వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.రక్షణనిధి,తదితరులు పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు గుంటూరు మెడికల్: రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. గుంటూరులో శనివారం జరిగిన నెఫ్రాలజిస్టుల రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణాలపై ఐసీఎంఆర్‌తో కలిసి పరిశోధనలు చేసినట్లు చెప్పారు. నొప్పి నివారణ మాత్రలు ఎక్కువగా వాడటం, తాగే నీటిలో సిలికాన్, హెవీ మెటల్స్ ఎక్కువగా ఉండటం, ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం కారణాలని తేలిందన్నారు. ఉద్దానంతోపాటు, ఎ.కొండూరులో కూడా కిడ్నీ కేసులు వెలుగులోకి వచ్చాయని, వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. -
రూ.1,400 కోట్లతో ‘పశ్చిమ’కు తాగునీరు
సాక్షి, అమరావతి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా కల్చర్‌తో ఏర్పడిన నీటి కాలుష్యంతో పాటు తీర ప్రాంతంలో ఉప్పునీటి సాంద్రత కారణంగా నెలకొన్న తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా రూ.1,400 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఇందుకు సంబంధించిన పనులకు సీఎం వైఎస్ జగన్ ఈ నెల 21న శంకుస్థాపన చేయనున్నారు. నిడదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, దెందులూరు (కొంత భాగం), తాడేపల్లిగూడెం (కొంత భాగం) పరిధిలోని 26 మండలాల ప్రజలకు పథకం ద్వారా ఏడాది పొడవునా తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. మొత్తం 1,178 గ్రామీణ నివాసిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయిని ఏర్పాటు చేసి రోజూ సగటున ప్రతి వ్యక్తికి 55 లీటర్ల సురక్షిత తాగునీటి సరఫరా చేస్తామని గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వెల్లడించారు. సమీపంలోని నదుల నుంచి.. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల ఇప్పటికే రక్షిత మంచినీటి పథకాలున్నా సరఫరా చేయడానికి నీరు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. వాటర్ గ్రిడ్ ద్వారా ఏడాది పొడవునా తాగునీటి సరఫరా జరిగేలా సమీప నదులతో ప్రత్యేక పైపులైన్ల ద్వారా అనుసంధానిస్తున్నారు. సీఎం ప్రారంభించనున్న రూ.1,400 కోట్ల తాగునీటి పథకానికి కూడా గోదావరి నుంచి ఏటా 1.374 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. 30 నెలల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. రూ.10,131 కోట్ల పనులు.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వాటర్ గ్రిడ్ ద్వారా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో రూ.10,131 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ప్రభుత్వం చేపట్టింది. దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో రూ.700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని అధికారంలోకి రాగానే సీఎం జగన్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.480 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులు ఇప్పటికే 34 శాతానికిపైగా జరిగాయి. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలో రూ.279 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులు 25 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగతా చోట్ల త్వరలోనే ప్రారంభం.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రూ.1,650 కోట్లతో, ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.1,290 కోట్లతో, ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో రూ. 1,200 కోట్లతోనూ, ఉమ్మడి కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో రూ.750 కోట్లతో, ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.2,370 కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా శాశ్వత రక్షిత మంచినీటి పథకాలకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తి చేసింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. -
ప్రాధాన్యత ప్రాజెక్టుగా మహేంద్రతనయ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో సాగు, తాగు నీటి సదుపాయాలను మెరుగుపర్చడం ద్వారా జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో అత్యంత వెనుకబడిన నందిగం, పలాస, టెక్కలి, మెళియపుట్టి మండలాల్లో 24,600 ఎకరాలకు సాగు నీరు, 108 గ్రామాలకు తాగు నీరు అందించే మహేంద్ర తనయ ప్రాజెక్టును జలవనరుల శాఖ అధికారులు ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టును చేపట్టారు. దీనిని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రాజెక్టు నత్తనడకన సాగింది. ఇప్పుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృషిపెట్టింది. దివాలా తీసిన పాత కాంట్రాక్టర్‌ను తొలగించి, మిగిలిపోయిన పనులను కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించడానికి టెండర్ షెడ్యూళ్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపింది. జ్యుడిషియల్ ప్రివ్యూ అనంతరం రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ధరకు కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తారు. రోజుకు 1200 క్యూసెక్కులు మళ్లించి.. ఒడిశాలోని తుపరసింగి వద్ద పుట్టిన మహేంద్రతనయ గొట్టా బ్యారేజ్‌కు 4 కిలోమీటర్ల ఎగువన వంశధారలో కలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా మెళియపుట్టి మండలం చాపర వద్ద మహేంద్రతనయపై రెగ్యులేటర్ నిర్మించి, అక్కడి నుంచి రోజుకు 1200 క్యూసెక్కులు తరలించేలా 13.52 కిలోమీటర్ల వరద కాలువ తవ్వుతారు. ఈ కాలువ ద్వారా నీటిని తరలించి రేగులపాడు వద్ద 1.76 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌లో నిల్వ చేస్తారు. రిజర్వాయర్ నుంచి ఎడమ కాలువ (11.20 కిలోమీటర్లు) ద్వారా 12,500 ఎకరాలకు, కుడి కాలువ (10.20 కిలోమీటర్లు) ద్వారా 12,100 ఎకరాలు.. మొత్తం 24,600 ఎకరాలకు సాగు నీటితోపాటు 108 గ్రామాలకు తాగు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.852.45 కోట్లు. వరద కాలువలో ఇప్పటికే 7.27 కిలోమీటర్ల పని పూర్తయింది. మరో 6.3 కిలోమీటర్ల కాలువ తవ్వాల్సి ఉంది. కాలువపై 26 కాంక్రీట్ నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. రిజర్వాయర్ పనుల్లో భాగంగా 2.485 కిలోమీటర్ల పొడవున 55.6 మీటర్ల ఎత్తుతో మట్టికట్ట నిర్మించాలి. రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యే ఏడు గ్రామాల్లోని 1,059 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా.. ఇప్పటికే 659 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. ఆయకట్టుకు నీళ్లందించేలా 51.5 కిమీల పిల్ల కాలువల కోసం 373.75 ఎకరాల భూమిని సేకరించాలి. ఈ భూమి సేకరణ, నిర్వాసితులకు పునరావాసంపై అధికారులు దృష్టి సారించారు. మిగిలిపోయిన పనులను కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించి.. శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. -
మరో 40 ఏళ్లు తాగునీటికి కొదవ లేదు
సనత్‌నగర్: రాబోయే 40 ఏళ్లు హైదరాబాద్ నగరంలో తాగునీటికి ఎలాంటి కొదవ ఉండదని జలమండలి ఎండీ దానకిషోర్ అన్నారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) తెలంగాణ ఆధ్వర్యంలో ‘తెలంగాణ ఇన్ఫ్రా సమ్మిట్–2022’ సదస్సు శుక్రవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా ‘ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియాల్టీ–ప్రాస్పెక్టస్ అండ్ ఛాలెంజెస్’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన దానకిషోర్ మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రాజెక్టులలో పెట్టుబడులు ప్రైవేటు రంగం ద్వారానే జరుగుతున్నాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతోనే రియాల్టీ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆక్స్ఫర్డ్ నగరాల నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భారతదేశంలో 17 నగరాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే హైదరాబాద్ 85 బిలియన్ల జీడీపీని అధిగమించగలదన్నారు. సీఐఐ తెలంగాణ ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ ప్యానెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎం.గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, నీటి ప్రాజెక్టులు, మెట్రోరైల్ వంటి మెరుగైన మౌలిక సదుపాయాలపరంగా తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. సమారు 30 ఏళ్లుగా 80 శాతం ప్రయాణికులు రైల్వేల ద్వారా ప్రయాణిస్తున్నారని, అయితే ఇప్పుడు రోడ్డు నెట్వర్క్, మారుతున్న మౌలిక సదుపాయాల రంగం కారణంగా 70 శాతం మంది రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీఐఐ చైర్మన్ వాగీష్దీక్షిత్, వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, షేక్ సమీవుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
Health Tips: ఆ పళ్లు తిన్న వెంటనే నీళ్లు తాగారో ఇబ్బందుల్లో పడ్డట్లే!
కొందరు వైద్యులు మంచినీళ్లు బాగా తాగమని చెబుతుంటారు. ఇంకొందరు అంత ఎక్కువగా తాగవద్దని చెబుతారు. అయితే కొన్ని పదార్థాలు తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత నీళ్లు తాగడం మంచిది కాదని పెద్దవాళ్లు చెబుతుంటారు. దీని వెనుక మనలో చాలా మందికి తెలియని కారణం ఉంది. ఇంతకీ మనం ఏయే పదార్థాలు తీసుకున్న తర్వాత నీరు తాగకుండా ఉండాలో తెలుసా మరి? ►అరటిపండు.. ఆయుర్వేదం ప్రకారం, పండ్లను తీసుకున్న తర్వాత నీరు తాగకూడదు. ఎందుకంటే ఇది శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. మరి అరటిపండు తిన్న తర్వాత కనీసం అరగంట పాటు నీళ్లు తాగకపోవడానికి ఇదే కారణం. ►పుచ్చకాయ: నీటిశాతం అధికంగా ఉండే వాటిలో పుచ్చకాయదే ప్రముఖ స్థానం. పుచ్చకాయ తిన్న తర్వాత నీటిని తాగడం ద్వారా సహజంగా ఊరే జీర్ణరసాలు పలుచన అవుతాయి. దీనివల్ల పొట్ట ఉబ్బరంగా మారుతుంది. కడుపు నొప్పి లేదా అజీర్ణంతో బాధపడ వలసి వస్తుంది. ►పాలు: పాలు తాగిన తర్వాత నీళ్లు తినకూడదు. ఇలా చేయడం వల్ల జీవక్రియలు మందగిస్తుంది. ఇది ఎసిడిటీ, అజీర్ణానికి కూడా దారి తీస్తుంది. ►సిట్రస్ జాతి ఫలాలు తిన్న తర్వాత... నారింజ, ఉసిరి, సీజనల్ మొదలైన సిట్రస్ పండ్లను తిన్న తర్వాత మన జీర్ణవ్యవస్థ నుండి యాసిడ్ బయటకు వస్తుంది. ఈ పండ్లను తిన్న తర్వాత మనం నీరు తాగితే, పిహెచ్ బ్యాలెన్స్ చెదిరిపోతుంది. అందుకే సిట్రస్ పండ్లు తిన్న తర్వాత మనం నీరు తాగకూడదు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే. చదవండి: Postpartum Care- Fitness: బిడ్డల్ని కనే సమయాన్ని వాయిదా వేయనక్కర్లేదు! ఇవి పాటించడం వల్ల ప్రసవం తర్వాత కూడా.. Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
అభిమాని లేఖకు మంత్రి హరీశ్ రావు ఫిదా..
సాక్షి, సిద్దిపేట: హరీశ్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యతలు చూసే కీలక మంత్రిగా ఉన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషిచేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. ప్లాస్టిక్ వాడకంతో భయంకరమైన కేన్సర్ బారినపడే ఆవకాశాలు ఉన్నాయని వారిని జాగృతం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మరో మార్గం లేక మంత్రి కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ దప్పిక తీర్చుకొనే అత్యవసర పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని గుర్తించిన ఓ వీరాభిమాని అమాత్యుడు హరీశ్‌రావు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలంటూ శుక్రవారం దుబ్బాక పర్యటనలో మంత్రికి లేఖ అందించారు. మీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం..మీరు తప్పని పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడుతున్నారని, ఈ నీరు తాగడం వల్ల భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఇటీవల అంతర్జాతీయ ప్రముఖ రేడియాలజిస్టు డాక్టర్ విమల్ సోమేశ్వర్ ఇంటర్వ్యూలో చెప్పారని లేఖలో వివరించారు. దయచేసి ఇకపై కాపర్ వాటర్ బాటిల్ వినియోగించాలని మంత్రికి దుబ్బాక పరిధి మల్లాయపల్లికి చెందిన ఎంబీఏ విద్యార్థి కీసరి ప్రవీణ్ లేఖ అందించాడు. ప్రవీణ్ రాసినలేఖను చదివి తన ఆరోగ్యం పట్ల ఎంతో తపనతో రాశాడంటూ ఫిదా అయ్యాడు. ప్రవీణ్ కు మంత్రి ప్రత్యేకంగా ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో లేఖ హల్చల్ అవుతోంది. చదవండి: చివరిశ్వాస వరకూ ‘అమ్మవారి’తోనే.. -
ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు
సాక్షి, అమరావతి: గ్రామాల్లోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్.వి.కృష్ణారెడ్డి, తాగునీరు– పారిశుధ్యం ప్రాజెక్టు డైరెక్టర్ హరిరామ్ నాయక్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుతో వంద శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్జీవోలతో కలిసి గ్రామాల్లో మంచినీరు, ఇంటింటికి నీటి కుళాయిల ప్రాధాన్యంపై ప్రచారం చేయనున్నట్టు వివరించారు. ఎంపిక చేసిన ఎన్జీవో ప్రతినిధులకు యునిసెఫ్ ఆధ్వర్యంలో మూడు రోజుల శిక్షణ తరగతులను బుధవారం విజయవాడలో ప్రారంభించారు. మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందిన వీరు జిల్లాల వారీగా మరికొందరికి శిక్షణనిచ్చి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు రూ.25 వేల కోట్ల ఖర్చుతో అన్ని గ్రామాల్లోను ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 లక్షల కుళాయిలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 40 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును 2024 నాటికి పూర్తి చేస్తామన్నారు. దీంతోపాటు మురుగు నీటి నిర్వహణ, నీటి సంరక్షణ, వర్షపు నీరు పునర్వినియోగంపై దృష్టి పెట్టినట్టు వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో ఎన్జీవోలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని యునిసెఫ్ అందిస్తున్నట్టు తెలిపారు. -
జలమే గరళమై! గద్వాలలో ఘోరం.. 100 మందికి అస్వస్థత, ఇద్దరు మృతి
గద్వాల రూరల్: కలుషిత తాగునీరు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచే సుకుంది. గద్వాల పట్టణం 12వ వార్డుకు చెందిన వేదనగర్, గంటగేరి, ధరూరుమెట్టు, కృష్ణారెడ్డి బంగ్లా కాలనీల్లో మూడు రోజుల కిందట తాగునీరు కలుషితమై పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో గంటగేరికి చెందిన కృష్ణ (50), మంగలి నర్సింగమ్మ (59) సైతం వాంతులు విరేచనాలతో గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో చేరారు. చదవండి👉🏾వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా కృష్ణ పరిస్థితి విషమంగా మారడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కర్నూలుకు రిఫర్ చేశారు. దీంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో గుండెపోటు రావడంతో మృతి చెందాడు. అలాగే ఈ నెల 4 నుంచి జిల్లా ఆస్ప త్రిలో మంగలి నర్సింగమ్మ చికిత్స పొందుతు న్న క్రమంలో బుధవారం ఆమె పరిస్థితి విష మించడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్ప త్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతులిద్దరూ పక్క పక్క వీధుల వారే కావడంతో ఆ కాలనీలో విషాదం నెలకొంది. కాగా, 12వ వార్డులోని 4 కాలనీల్లో వాంతులు, విరేచనాలతో 3 రోజు లుగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో 24 మంది చికిత్స పొందుతున్నారు. గద్వాల ప్రైవేట్ ఆస్ప త్రుల్లో 70–75 మంది చికిత్స తీసుకుంటుండగా వారిలో 20 మంది చిన్నారులు ఉన్నారు. చదవండి👉🏾తాగేనీళ్లు లేకున్నా..మద్యం ఏరులై పారుతోంది కలుషిత నీటితోనే.. ఈ నెల 4న వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న కేసులు గుర్తించాం. వెంటనే వైద్యులతో కూడిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కలుషిత నీటి ప్రభావానికి గురైన కాలనీలో సర్వే చేపట్టాం. మృతి చెందిన ఇద్దరూ వాంతులు, విరేచనాల బారినపడినవారే. అయితే వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో వైద్యం అందించే సమయంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించి మృతి చెందారు. అస్వస్థతకు గురైన వారి నుంచి రక్తనమూనాలతోపాటు వారు వినియోగించే నీటి నమూనాలు సేకరించాం. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రాథమికంగా ఇలాంటి కేసులు నీటి కలుషితం కారణంగానే తలెత్తుతాయి. – చందూ నాయక్, డీఎంహెచ్ఓ, గద్వాల -
దాహమైనపుడు, దాహం తీరేంత వరకే నీళ్లు తాగాలి.. లేదంటే అంతే సంగతులు!
నీళ్లు ఎంతగా తాగితే ఆరోగ్యం కూడా అంతగా బాగుంటుందని చాలా మంది చెబుతుంటారు. ఇందుకు కారణం చెబుతూ... మనం నీళ్లు తాగుతున్న కొద్దీ దేహంలోని వ్యర్థాలు కొట్టుకుపోతాయనీ, మలినాలు కడిగినట్లుగా అవుతుంటాయని అంటుంటారు. కానీ నీళ్లు తాగడం అన్నది మన దాహం మీద ఆధారపడి ఉంటుంది. మనకు ఎంత దాహం వేస్తే అన్ని నీళ్లే తాగాలి. ఓ మోస్తరుగా కాస్త ఎక్కువైనా పర్లేదుగానీ... మరీ ఎక్కువగా తాగడం ప్రమాదమే అంటున్నారు వైద్యనిపుణులు. అంతేకాదు... అతిగా తాగితే నీళ్లతో కూడా ఆరోగ్యం చెడే ప్రమాదం ఉంటుందంటున్నారు. అంటే దాహం కొద్దీ నీరు మాత్రమే ఆరోగ్యకరం అన్నమాట. అదెలాగో చూద్దాం. నీళ్లు ప్రాణాధారం. ఆహారం లేకుండానైనా ఓ వ్యక్తి మూడు వారాలు బతకగలడేమోగానీ... నీళ్లు లేకుండా ఏ వ్యక్తి కూడా రెండు, మూడు రోజులకు మించి బతకలేడు. దేహంలోని అనేక కీలకమైన జీవక్రియలకు నీళ్లు ఉపయోగపడతాయి. దేహం ఒక నియమిత పద్ధతిలో తన అవసరాల కోసం నీటిని సమర్థంగా వాడుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు మన శరీర ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచడానికి నీళ్లు కావాలి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు దేహ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి వీలుగా చెమట పడుతుంది. అది మనలో ఉన్న లేటెంట్ హీట్‌ను గ్రహించి, ఆవిరైపోయే క్రమంలో శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి ఈ నీరు దోహదపడుతుంది. అనేక కార్యకలాపాలకు కీలకం... నీరు అలాగే రక్తప్రసరణ సరిగా జరగడం కోసం, మల విసర్జన సాఫీగా జరగడానికి, మూత్ర విసర్జన రూపంలో దేహంలోని వ్యర్థాలూ, మలినాలను బయటకు పంపడానికి నీరు చాలా కీలక భూమిక పోషిస్తుంది. దేహానికి అవసరమైన మేర నీరు తాగడం మంచిది. ఓ మేరకు కాస్త ఎక్కువైనా పర్లేదుగానీ... మరీ ఎక్కువైనప్పుడు... శరీరం తాను చేయాల్సిన కీలకమైన పనులను పక్కనబెట్టి దేహంలో ఎక్కువగా ఉన్న నీటిని ఎలా బయటకు పంపాలా అని చూస్తుంది. అందుకే మూత్రరూపంలో బయటకు పంపుతుంది. అందుకే ఎంత ఎక్కువగా నీరు తాగితే అంతగా మూత్రానికి వెళ్లాల్సిన అవసరం వస్తుంటుంది. ఈ క్రమంలో కేవలం నీరు మాత్రమే బయటకు పోదు. దాంతోపాటు దేహానికి అవసరమైన విలువైన సోడియమ్, పొటాషియమ్ లాంటి లవణాలూ విసర్జితమవుతుంటాయి. సోడియం, పొటాషియమ్ వంటివి మన దేహంలో ఏ భాగంలోని కండరాలు సక్రమంగా పనిచేయడానికి చాలా అవసరం. నీరు బయటకు ఎక్కువగా పోతున్నప్పుడు తనతో పాటు లవణాలను తీసుకెళ్లడం వల్ల మెదడు నుంచి కండరాలకు వెళ్లాల్సిన ఆదేశాలు చక్కగా అందక... కండరాలు బిగుసుకుపోతాయి. మూత్రవిసర్జన ఎక్కువగా జరిగేందుకు మందులు (డై–యూరిటిక్స్) వాడుతూ హైబీపీ కోసం మాత్రలు వాడే వారిలోనూ, ఉప్పు చాలా తక్కువగా వాడేవారు, ఎక్కువగా చెమటపట్టే స్వభావం కలిగినవారు... వీళ్లంతా నీరు చాలా ఎక్కువగా తాగితే ‘డల్యూషనల్ హైపోనేట్రీమియా’ గురయ్యే అవకాశాలు ఎక్కువ. హై–బీపీ బాధితుల్లోనూ, వయసుపైబడ్డవాళ్లలోనూ, ఆటగాళ్లలోనూ ఈ పరిణామాలు చోటు చేసుకోడాన్ని అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ (ఏసీఎస్ఎమ్), కెనెడియన్ న్యూట్రిషన్ సొసైటీ వంటి పలు ఆరోగ్య సంస్థలు గుర్తించాయి. ∙ వాటర్ ఇంటాక్సికేషన్ తప్పకపోవచ్చు... శరీర అవసరాలకంటే ఎక్కువగా నీరు తాగితే ఒక్కోసారి అది మన జీవకణాల్లోకి చొచ్చుకుపోయి వాటిని నాశనం చేసే ప్రమాదమూ ఉంది. దీన్నే ‘వాటర్ ఇంటాక్సికేషన్’ అంటారు. బరువు తక్కువగా ఉండే చిన్నారులూ, బాగా ఎండలో ఆటలాడే స్పోర్ట్స్ పర్సన్స్, ఎవరెక్కువ నీళ్లు తాగుతారో అంటూ నిర్వహించే గేమ్ షోలలో పాల్గొనేవారిలో (ఇలా గేమ్షోలలో పాల్గొని నీరు ఎక్కువగా తాగడంతో) ‘సెల్ఫ్ ఇండ్యూస్డ్ వాటర్ ఇంటాక్సికేషన్’ (ఎస్ఐడబ్ల్యూఐ అనే అనర్థం ఏర్పడవచ్చు. అలాగే సైకోజెనిక్ పాలీడిప్సియా అనే మానసిక వ్యాధితో బాధపడేవారు కూడా ఎక్కువగా నీరు తాగుతుంటారు. (ఈ రుగ్మత ఉన్నవారు దాహంవేస్తున్నట్లుగా అనిపించడం వల్ల అదేపనిగా నీళ్లు తాగేస్తూ ఉంటారు). ఇలా ‘సెల్ఫ్ ఇండ్యూస్డ్ వాటర్ ఇంటాక్సికేషన్’కు పాల్పడేవారు, సైకోజెనిక్ పాలీడిప్సియా ఉన్నవారు అధికమొత్తంలో నీరు తాగినప్పుడు శరీరంలోని లవణాలు కోల్పోయి... అలాగే మెదడు నుంచి లవణాల అయాన్ల ద్వారా కరెంటు రూపంలో అందాల్సిన ఆదేశాలు అందక ఒక్కోసారి అది ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే దేహానికి ఎంత అవసరమో, మనకు ఎంత దాహం వేస్తుందో... ఆ మేరకే, అవసరమైనన్ని నీళ్లు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. మరి ఎన్ని నీళ్లు తాగాలి? ఎలా తాగాలి? ∙దాహమైనప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి. దాహం తీరేవరకే తాగాలి. ∙మూత్రం మరీ తెల్లగా వస్తోందంటే శరీరంలో నీరు ఎక్కువైందని అర్థం. మరీ పచ్చగా వస్తోందంటే నీరు తగ్గిందని అర్థం. ఈ రెండూ ప్రమాదమే. కాబట్టి మూత్రం దాని స్వాభావిక రంగులో వచ్చేంత నీరు మాత్రమే తాగాలి. ∙అందుకే ఒకసారికి దాదాపు 100 ఎం.ఎల్. గానీ లేదా దాహం బాగా తీరే మేరకు మాత్రమే తాగడం మంచిది. ∙ఉజ్జాయింపుగా చెప్పాలంటే... వారి వారి బరువును బట్టి ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ 2 లీటర్ల నుంచి 3.5 లీటర్ల వరకు నీళ్లు తాగవచ్చు. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే... మహిళలు 2.7 లీటర్లు (11.5 కప్పులు), పురుషులు 3.7 లీటర్లు (15.5 కప్పులు) తాగడం మేలు. అంతకంటే ఎక్కువ నీరు తాగడం అంత మంచిదికాదు. తక్కువగానూ మంచిది కాదు. -
ఇంటింటికి అమృతధార
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రజలకు శుద్ధి చేసిన మంచినీటిని అందించే లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మైక్రో వాటర్ ఫిల్టర్లను గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసేందుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన పనులను కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలంలో ప్రారంభించారు. ఈ మండలంలోని 22 గ్రామ పంచాయతీలుండగా, ఇప్పటికే 12 పంచాయతీల్లో ఈ ఫిల్టర్ మార్పు పనులు పూర్తయ్యాయి. మిగిలిన పంచాయతీల్లో కూడా వేగవంతంగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. సమస్య ఇదీ.. ప్రస్తుతం గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల ద్వారా ప్రజల తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. అయితే ఇందులో స్లో శాండ్ ఫిల్టర్లు ఉండటంతో, వాటి నిర్వహణ పంచాయతీలకు భారంగా మారింది. ఫిల్టర్లు కడగటం వల్ల అరిగిపోయి తరుచూ మార్చాల్చి వస్తోంది. దీనికితోడు ఈ ప్రాసెస్ కోసం క్వాలిటీ ఇసుక అవసరం కావడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. శేరీదగ్గుమిల్లిలో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో.. ►జిల్లాలో ఎక్కువ శాతం తాగునీటి చెరువులు, కాలువల ద్వారా వచ్చే నీటినే తాగునీటికి వినియోగిస్తున్నారు. ఈ నీటిని శుద్ధి చేసేందుకు ఫిల్లర్లు తప్పని సరి. ►ఈ నేపథ్యంలో పంచాయతీలపై నిర్వహణ భారాన్ని తప్పించేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాయంతో.. గుడ్లవల్లేరు పంచాయతీల్లోని జనాభా ఆధారంగా 0.5 ఎంఎల్డీ, ఒక ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన మైక్రో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ►0.5 ఎంఎల్డీ వాటర్ ఫిల్టర్ల ఏర్పాటుకు రూ.5లక్షలు ఖర్చు అవుతోంది. ఈ నిధులను జెడ్పీ నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సమకూర్చుతున్నారు. ►ఇప్పటికే 12 గ్రామాల్లో రూ.70 లక్షలతో మైక్రో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేశారు. ►ఇంకా 12 గ్రామాల్లో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా రూ.85 లక్షలతో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. ►మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఫ్లాట్ ఫారాలను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఫ్లాట్ పారం నిర్మాణానికి రూ. 2.5లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చు అవుతోంది. తగ్గనున్న నిర్వహణ భారం.. మైక్రోఫిల్టర్ల ఏర్పాటుతో శుద్ధి చేసిన నీటితో పాటు, పంచాయతీలపైన వీటి నిర్వహణ భారం తగ్గనుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించడం వల్ల మూడేళ్ల వరకు ఇబ్బంది ఉండదు. దీని తర్వాత దశల వారీగా మిగిలిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. పెడన మండలంలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజారోగ్యమే దేశ సౌభాగ్యం.. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని బాపూజీ చెప్పిన మాటలను ఈ ప్రభుత్వం పాటిస్తోంది. అందులో భాగంగానే మా గ్రామంలో శుద్ధ జలాలు అందించేందుకు మైక్రో వాటర్ ఫిల్టర్ల ఏర్పాటుకు కృషిచేస్తోంది. ప్రజలకు స్వచ్ఛమైన సురక్షిత మంచినీటిని అందించేందుకు కృషి చేస్తున్న జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికకు మా గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. – డాక్టర్ బండారు శ్యామ్‌కుమార్, సింగలూరు, గుడ్లవల్లేరు మండలం రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం.. గుడ్లవల్లేరు మండలాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇందులో భాగంగానే మొదటి దశలో అన్ని గ్రామాలకు శుద్ధి నీరు అందిస్తున్నాం. ఆ తర్వాత విడతల వారీగా మిగిలిన గ్రామాల్లోనూ పనులు ప్రారంభిస్తాం. ఇక నాడు–నేడు ద్వారా పీహెచ్‌సీలు, పాఠశాలలను ఆధునికీకరిస్తున్నాం. ఈ పథకం కింద కవర్‌కాని పాఠశాలలను జెడ్పీ నిధులతో ఆధునికీకరిస్తున్నాం. – ఉప్పాల హారిక, జెడ్పీ చైర్పర్సన్, ఉమ్మడి కృష్ణా జిల్లా చదవండి: నీట్ పీజీ ఫలితాలు.. కోనసీమ విద్యార్థిని హర్షితకు జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ -
కొండ, కోన, గంగమ్మ.. అన్నీ సాక్ష్యంగా ఆ ప్రాంత అభివృద్ధి
ఈ ఫొటో చూడండి. మెళియాపుట్టి కొండకు ఆనుకుని ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రదేశమిది. ఇక్కడి నుంచే ఉద్దానం ప్రాంతానికి నీరు వెళ్లనుంది. నీటి పిల్లర్, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణంతో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యం ఈ చిత్రం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొండ, కోన, గంగమ్మ.. అన్నీ సాక్ష్యంగా సిక్కోలు అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. ప్రతిపక్షం చేస్తున్న ప్రచారంలో వీసమెత్తు కూడా నిజం లేదని రుజువు చేస్తున్నాయి. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయని పనిని అధికారంలోకి రాగానే చేసి చూపించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కింది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులకు అక్కడి తాగునీరే కారణమై ఉండొచ్చని పలు అధ్యయనాలు చెబుతుండటంతో ఆ సమస్యను మొదటిగా పరిష్కరించేందుకు వైఎస్ జగన్ ఉపక్రమించారు. రూ.700కోట్లతో ఉద్దానం మెగా మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడా పనులు 80శాతం మేర పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి చేసి సాధ్యమైనంత వేగంగా ఉద్దానంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు సన్నద్ధమవుతున్నారు. ►జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 187 గ్రామాల్లో మూత్రపిండాల జబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ►సుమారు 20వేల మంది మూత్రపిండాల వ్యాధితో వివిధ దశల్లో ఉన్నట్లు అంచనా. ►ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతికే పనిలో ఉపరితల రక్షిత మంచినీరు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతోంది. వంశధార రిజర్వాయర్ నుంచి 807 గ్రామాలకు తాగునీరు అందించే ప్రయత్నం చేస్తోంది. ►దాదాపు 5,57,633 మందికి తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. చేపడుతున్న పనులివి.. ►హిరమండలం రిజర్వాయర్ నుంచి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు ప్రత్యేక పైపులైన్ల ద్వారా 1.12 టీఎంసీల వంశధార నీటిని అందించేందుకు 1067.253 కిలోమీటర్ల పైపులైను ఏర్పాటు చేస్తున్నారు. ►మెళియాపుట్టి మండల కేంద్రం వద్ద 84 మిలియన్ లీటర్ల తాగు నీటి పిల్లర్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ►264ఓవర్ హెడ్ సర్వీసింగ్ రిజర్వాయర్లు నిర్మించారు. మరో 500 ఓవర్ హెడ్ సర్వీసింగ్, బ్యాలెన్సింగ్ ఇతరత్రా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ►హెడ్ ట్యాంకుల నుంచి గ్రామాల్లోని స్థానిక ట్యాంకులకు అనుసంధానం చేసి అక్కడ నుంచి ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తారు. చదవండి: అద్దెకుంటున్న యువకుడితో పరిచయం.. యువతికి ఫోన్ చేసి ఫొటోలు పోస్టు చేస్తానంటూ -
హైదరాబాద్‌లో 1, 2 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం
సాక్షి,హైదరాబాద్: సింగూరు ఫేజ్– 3 పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతుల కారణంగా బుధ, గురువారాల్లో నగరంలో పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జలమండలి ప్రకటించింది. బుధవారం (జూన్ 1) ఉదయం 6 గంటల నుంచి గురువారం (జూన్2) ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్‌కు నీటి లీకేజీలు నివారించేందుకు శంకర్పల్లి సమీపంలో మూడు చోట్ల మరమ్మతు పనులను చేపట్టనున్నారు. దీంతో గండిపేట, నార్సింగి, మంచిరేవుల, మణికొండ, కోకాపేట, పుప్పాలగూడ, చందానగర్, హుడా కాలనీ, బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ, తారానగర్, గంగారం, లింగంపల్లి రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీ, నల్లగండ్ల, గోపన్‌పల్లి, గుల్మొహర్ పార్కు, నేతాజీనగర్, నెహ్రూ నగర్, తెల్లాపూర్, వట్టినాగులపల్లి, చింతలబస్తీ, విజయనగర్ కాలనీ, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. (క్లిక్: సర్కారు స్థలాల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణ సర్వే షురూ..) -
త్వరలో ఆర్టీసీ నీళ్లు
సాక్షి, హైదరాబాద్: త్వరలో టీఎస్ఆర్టీసీ మంచినీళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రత్యేకంగా ఆర్టీసీ బ్రాండ్‌తో ప్యాకేజ్డ్ తాగునీటిని ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. రైల్ నీర్ పేరుతో రైల్వే సొంత బ్రాండ్‌తో నీటిని స్టేషన్లలో విక్రయిస్తున్న తరహాలోనే ఆర్టీసీ కూడా సొంత బ్రాండ్‌తో బస్సులు, బస్టాండ్లలో విక్రయించనుంది. ఈమేరకు నగర శివారులోని ఓ ప్యాకేజ్డ్ వాటర్ ప్లాంట్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ నీటి విక్రయం లాభసాటిగా ఉంటే, సొంత తయారీ యూనిట్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. టికెట్ రూపంలో వచ్చే ఆదాయంతో ఆర్టీసీ మనుగడ దాదాపు ప్రశ్నార్థకం కావటంతో ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సొంత బ్రాండ్ ప్యాకేజ్డ్ నీటిని విక్రయించాలని నిర్ణయించింది. డివిజినల్ మేనేజర్ స్థాయి అధికారికి బాధ్యత ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో సగటున నిత్యం 33 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కోవిడ్‌కు ముందున్న స్థితికి చేరుకోవటంతో, ఇంత భారీ సంఖ్యలో ప్రయాణికుల ద్వారా కేవలం టికెట్ డబ్బులు మాత్రమే కాకుండా.. నీటిని అమ్మడం ద్వారా కూడా ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది. ఇతర కంపెనీలతో పోలిస్తే కొంత తక్కువ ధరను విక్రయించడం ద్వారా డిమాండ్‌ను సృష్టించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం బస్టాండ్లలో పేరున్న బ్రాండ్లతోపాటు స్థానికంగా తయారయ్యే ఎన్నో రకాల మంచినీటి సీసాలు అందుబాటులో ఉంటున్నాయి. కానీ వీటిలో చాలావరకు నాణ్యత ఉండటం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో, సొంత బ్రాండ్ పేరుతో నాణ్యమైన నీటిని అందుబాటులోకి తెస్తే బాగుంటుందని ఇటీవల ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. ఆమేరకు ఓ డివిజినల్ మేనేజర్ స్థాయి అధికారికి బాధ్యత అప్పగించారు. ఓ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చిందని తెలిసింది. గతంలో బిస్లెరీతో ఒప్పందం గతంలో రమణారావు ఎండీగా ఉన్న సమయంలో బిస్లెరీ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. ఆర్టీసీ లోగోను కూడా ముద్రించిన సీసాలను బస్టాండ్లలో విక్రయించేలా ఏర్పాట్లు చేసింది. తొలుత కేవలం ఆ సీసాలను మాత్రమే అమ్మాలని నిబంధన విధించినా.. న్యాయపరమైన చిక్కులు రావటంతో వెనకడుగు వేసింది. ప్రస్తుతం ఆర్టీసీ లోగో చిన్నగా ఉన్న సీసా నీటిని బిస్లెరీ అమ్ముతోంది. కానీ దీనివల్ల ఆర్టీసీ బ్రాండ్‌కు గుర్తింపు రాలేదని ఆర్టీసీ తేల్చింది. దీంతో సొంతంగా కేవలం ఆర్టీసీ పేరుతోనే నీటి సీసాలను తేవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు కాంప్లిమెంటరీగా 500 మి.లీ. బిస్లెరీ సీసాలను ఇస్తోంది. సొంత బ్రాండ్ అందుబాటులోకి వచ్చాక, ఆ కాంప్లిమెంటరీ సీసాలతోపాటు, అన్ని బస్సుల్లో సొంత నీటి సీసాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. డ్రైవర్/కండక్టర్ టికెట్లతోపాటు నీటి సీసాలనూ విక్రయించేలా ఏర్పాట్లు చేయనున్నారు. కుదిరితే, బస్టాండ్లలో కేవలం ఆర్టీసీ బ్రాండ్ సీసా నీళ్లు మాత్రమే విక్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. పేరు, డిజైన్ చెప్పండి సొంతంగా ఆర్టీసీ బ్రాండ్‌తో తయారయ్యే నీటికి ఏ పేరు పెడితే బాగుంటుందో, సీసా ఆకృతి ఎలా ఉంటే బాగుంటుందో 9440970000 వాట్సాప్ నంబర్‌కు సూచనలను పంపాలని ఆర్టీసీ కోరింది. ఎంపిక చేసిన వాటికి రివార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. -
50 ఏళ్ల వరకు హైదరాబాద్‌లో.. తాగునీటికి ఢోకా ఉండదు
పెద్దవూర/నాగార్జునసాగర్: ‘హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు భవిష్యత్‌లో తాగునీటికి, పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా రూ.1,450 కోట్లతో సుంకిశాల వద్ద ఇన్‌టేక్ పంపింగ్ స్టేషన్ నిర్మిస్తున్నాం. వచ్చే వేసవి నాటికి దీన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’అని మంత్రి కేటీఆర్ చెప్పారు. జంటనగరాలకు వచ్చే 50 ఏళ్ల వరకు తాగునీటికి ఢోకా ఉండదని అన్నారు. నగరానికి సరిగ్గా 50 ఏళ్ల నాటికి 2072లో 70.97 టీఎంసీల నీరు అవసరమని, దీనికి తగ్గట్టు ఇన్‌టేక్ వెల్ నిర్మిస్తున్నామని తెలిపారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద నిర్మిస్తున్న భారీ ఇన్‌టేక్ వెల్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం హైదరాబాద్ అని, మరో 15 ఏళ్లలో దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద నగరం అవుతుందని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ 159 కిలోమీటర్ల మేర వాటర్ పైప్లైన్లు (రింగ్ మెయిన్)లు వేయాలని నిర్ణయించామని.. దీంతో కృష్ణా, గోదావరి నీళ్లను నగరంలోని ఏ ప్రాంతాలకైనా అందించేందుకు వీలవుతుందని వివరించారు. వరుసగా ఐదేళ్లు కరువు వచ్చినా తాగునీటికి ఇబ్బంది లేకుండా, ఒక సిస్టమ్‌లో లోపం వచ్చినా మరో సిస్టమ్ ద్వారా తాగునీరు అందేలా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు. అంతకుముందు ఇన్‌టేక్ వెల్ పనులను టన్నెల్లోకి వెళ్లి కేటీఆర్ పరిశీలించారు. కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం: తలసాని, సబిత హైదరాబాద్ ప్రజలం సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని మంత్రులు తలసాని, సబితారెడ్డి అన్నారు. నగర ప్రజలకు కొండపోచమ్మ నుంచి గోదావరి జలాలను, సుంకిశాల నుంచి కృష్ణా జలాలను తరలించే ప్రాజెక్టులకు కేసీఆర్ రూపకల్పన చేశారని చెప్పారు. దలైలామాను ఆహ్వానిద్దాం ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధ మహాస్తూపం నిర్మితమైన నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేసేందుకు బౌద్ధ దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిద్దామని కేటీఆర్ అన్నారు. బుద్ధవనాన్ని ప్రారంభించిన అనంతరం మహాస్తూపంలోని ఆడిటోరియంలో ఆయన మాట్లాడారు. సీఎం విజన్‌కు తగినట్టు మల్లే్లపల్లి లక్ష్మయ్య, నాగిరెడ్డి ఈ బుద్ధవనాన్ని తీర్చిదిద్దారన్నారు. సీఎం అనుమతితో జరగబోయే కార్యక్రమాలకు దలైలామాను ఆహ్వానిద్దామన్నారు. తెలంగాణలోని ఫణిగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట, బాదన్‌కుర్తి లాంటి బౌద్ధ ప్రాం తాలన్నింటినీ అభివృద్ధి చేస్తామన్నారు. -
బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట.. పక్షి ప్రేమికుల విలక్షణ ఆలోచన
అనకాపల్లి: సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ సమయం.. పశుపక్ష్యాదులకు గడ్డుకాలం. పల్లెల్లో పక్షులకు ఏదో రూపంలో ఆహారం, నీరు సమకూరుతాయి. పట్టణ ప్రాంతాల్లో జంగిల్ కాంక్రీట్ పుణ్యమా అని నీరు లభించడమే కష్టమవుతోంది. అందుకే పక్షి ప్రేమికులు వాటి కోసం విలక్షణంగా ఆలోచించారు. పట్టణాల్లో కూడా ఆహారం, నీరు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. పర్యావరణ పరిరక్షణకు విశేష సేవలందించిన కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ ఆధ్వర్యంలో సేవామూర్తులు పక్షులకు అండగా నిలుస్తున్నారు. చదవండి👉: 11 ఏళ్ల కిందట సంచలనం.. ఇప్పటి యువ ఐపీఎస్‌లకు పాఠమైంది.. పక్షి జాతిని కాపాడుకుందామని ప్రదర్శన చేస్తున్న విద్యార్థినులు నూనె డబ్బాను నాలుగు అరలుగా అమరిక చెట్ల వద్ద ఆహారం, నీటి సౌకర్యం గ్రీన్‌క్లబ్ వ్యవస్థాపకుడైన కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తాను పని చేసే పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దే అలవాటు ఉన్న శ్రీధర్ మాస్టారు.. పర్యావరణ పరిరక్షణలో కూడా ముందుంటారు. వేసవి నేపథ్యంలో పట్టణంలో అక్కడక్కడా ఉండే చెట్ల వద్ద అలమంటించే పక్షులకు ఆహారం, నీటిని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నూనె డబ్బాలను సగానికి కోసి దాంట్లో నాలుగు అరలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అరలో కొర్రలు, గంట్లు వంటి ఆహార పదార్థాలను, మరో అరలో నీటిని వేసి చెట్లకు కట్టించారు. నీటి బాటిళ్లను మట్టిపాత్రలకు అమర్చి పలు చోట్ల ఏర్పాటు చేశారు. పక్షిజాతిని కాపాడుకోవాలని పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొక్కకు అమర్చిన మట్టిపాత్ర పక్షుల కోసమే.. ఇప్పటికే చాలా పక్షిజాతులు అంతరించిపోయాయి. వేసవికాలంలో అవి పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నగరాల్లో పక్షులకు ఆహారం, మంచినీరు అందించే లక్ష్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. పక్షి జాతులకు ఎంతో కొంత సహాయం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ మహాయజ్ఞంలో చాలా మంది పాలు పంచుకుంటున్నారు. – ఫణిభూషణ్ శ్రీధర్, క్లబ్ వ్యవస్థాపకుడు -
Andhra Pradesh: నీళ్లు.. ఫుల్లు
పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొగ్గరం గ్రామ సమీపంలోని సమ్మర్ స్టోరేజి ట్యాంకు (మంచినీటి చెరువు) బొగ్గరం, చిన్న కొండాయపాలెం, పెద్ద కొండాయపాలెం, గుండేపల్లి గ్రామాల్లో ఉండే దాదాపు 1,200 కుటుంబాలకు మంచి నీరు అందిస్తుంది. పది రోజుల కిందట నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వకు సాగు నీటి విడుదల నిలిపివేసే సమయంలోనే ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది ఈ ట్యాంకును నింపారు. ప్రస్తుతం చెరువు నీటిని మే, జూన్ నెలలు పూర్తిగా, జులై నెలలో దాదాపు సగం రోజులపైనే ఆ గ్రామాలకు సరఫరా చేయవచ్చని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో 1,480 కుటుంబాలు ఉంటాయి. ఆ గ్రామంలో నిరంతరం మంచినీటి సరఫరాకు ప్రత్యేకంగా సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఉంది. ఇది పూర్తిగా నిండుగా ఉంది. వచ్చే 120 రోజుల పాటు తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఈ మండలంలో మొత్తం 8 సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఉండగా, అవన్నీ 90 శాతం నీటితో నిండి ఉన్నాయి. – సాక్షి, అమరావతి ఇవే కాదు.. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అధిక శాతం చెరువులను నింపింది. రాష్ట్రవ్యాప్తంగా 1278 సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఉన్నాయి. వీటిలో 76 శాతానికి పైగా చెరువులు వేసవికి సరిపడా నీటితో నిండి ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. నాలుగో వంతు చెరువుల్లో మూడు నెలలకు సరిపడా నీరు ఉందని చెప్పారు. 60 శాతం చెరువుల్లో రెండు నెలలకు పైబడి నీరు ఉన్నట్టు తెలిపారు. 30 రోజులకు లోపు 57 చెరువుల్లోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 31, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో తొమ్మిది, కర్నూలు జిల్లాలో ఎనిమిది చెరువుల్లో నెల రోజుల లోపు అవసరమయ్యే నీరు ఉంది. ఆ ట్యాంకుల సామర్థ్యం తక్కువగా ఉన్నందువల్లే తక్కువ నీరు ఉన్నట్లు అధికారులు చెప్పారు. కేవలం 8 చెరువుల్లోనే వివిధ కారణాలతో నీరు లేదని తెలిపారు. ఈ ట్యాంకుల పరిధిలోని గ్రామాలకు వేసవిలో ట్యాంకర్ల ద్వారా లేదంటే బోర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు చెప్పారు. రూ.42.53 కోట్లతో వేసవి తాగునీటి ప్రణాళిక వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం రూ.42.53 కోట్లతో ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసింది. ఆర్డబ్ల్యూఎస్ విభాగం గణాంకాల ప్రకారం గ్రామాలను 48 వేలకు పైబడి నివాసిత ప్రాంతాలుగా వర్గీకరించగా, అందులో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని 105– 132 నివాసిత ప్రాంతాలకు మాత్రమే ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు కొనసాగుతుందని.. ఈ వేసవిలో అవసరమైతే గరిష్టంగా 1855 నివాసిత ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఎండలు మరింత పెరిగితే 242 నివాసిత ప్రాంతాల్లో పశువుల అవసరాలకు సైతం ఈ వేసవిలో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడొచ్చని ఆర్డబ్ల్యూఎస్ విభాగం ముందస్తు అంచనా వేసుకుంది. -
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఏపీ తాగునీరే సేఫ్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకెల్లా మన ఏపీలోని బోరు, బావుల్లోని తాగునీరే అత్యంత సురక్షితమని తేలింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అన్ని రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లోని బోర్లు, బావుల నీటికి నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో వంద శాంపిల్స్కుగాను 14 నమూనాల్లో వివిధ రకాల కాలుష్య కారకాలను గుర్తించారు. కానీ, మన రాష్టంలో మాత్రం వందకు నాలుగు శాంపిల్స్‌లో మాత్రమే అవి ఉన్నట్లు తేలింది. ఈ పరీక్షల ఫలితాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. అలాగే, ఏపీలో మూడు నాలుగేళ్ల కిందట నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఎక్కువగా కనిపించేవని.. అయితే, గత మూడేళ్లగా రాయలసీమ జిల్లాలతో సహా రాష్ట్రమంతటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాల్లో నీటి నాణ్యత చాలాబాగా మెరుగైనట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వెల్లడించారు. కాలుష్య కారకాలు.. వాటితో దుష్ఫలితాలు.. వైద్యులు పేర్కొంటున్న వివరాల ప్రకారం.. ► మెర్క్యూరీ ఉన్న నీటిని దీర్ఘకాలం తాగితే మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► క్లోరైడ్ కారకం ఉండే నీటిని తాగితే రక్తపోటు వ్యాధులకు గురవుతుంటారు. ► లెడ్ వంటివి చిన్న పిల్లల ఎదుగుదల మీద, పెద్దల్లో కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ► ఇక ఫ్లోరైడ్‌తో కీళ్ల వ్యాధులు రావడంతో చిన్న వయస్సులో పళ్లు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో.. ప్రజల తాగునీటిలో కలుషిత కారకాలను గుర్తించడానికి ప్రభుత్వం ముందస్తుగానే ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంటుంది. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 2.60 లక్షల బోర్లు, బావుల్లో నీటికి ఏటా ఒకసారి.. అలాగే, దాదాపు 50 వేలకు పైబడి రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరాచేసే నీటికి ఏటా రెండు విడతల చొప్పున ఆర్డబ్ల్యూఎస్ విభాగం, రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలు చేపడుతుంది. ఇక ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 107 నీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌లు ఉండగా, వాటిల్లో మొత్తం 21 రకాల కలుషిత కారకాలను గుర్తించే సౌలభ్యం ఉంది. పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్లో పొందుపర్చాల్సి ఉంటుంది. పరీక్షల్లో మన రాష్ట్రమే ఫస్ట్ మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా నాణ్యత పరీక్షలు నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లో 47,03,476 నీటి శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించగా.. అందులో మన రాష్ట్రం అత్యధికంగా 4,04,083 నమూనాలకు నిర్వహించింది. తర్వాత మధ్యప్రదేశ్ 4,01,022 శాంపిల్స్‌కు.. పశ్చిమ బెంగాల్లో 3,82,846 శాంపిల్స్‌కు పరీక్షలు జరిగాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా 3 లక్షల మించి పరీక్షలు నిర్వహించలేదు. నీటి నాణ్యతలోనూ ఏపీ చాలా మెరుగు మరోవైపు.. గత ఏడాది ఏపీలో పరీక్షలు నిర్వహించిన 4,04,083 శాంపిల్స్‌లో కేవలం 16,801 నమూనాల్లోనే కాలుష్య కారక ఆనవాళ్లు గుర్తించారు. అంటే మొత్తం శాంపిల్స్‌లో ఇది 4.15 శాతం మాత్రమే. అదే సమయంలో దేశం మొత్తం మీద 47,03,476 నీటి శాంపిల్స్‌కు నిర్వహించిన పరీక్షల్లో 6,73,687 శాంపిల్స్‌లో కలుషిత కారకాలు బయటపడ్డాయి. అంటే ఇది 14.32 శాతం. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక నీటి కాలుష్యం ఉన్నట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. -
గాజులదిన్నెకు జీవం పోస్తున్న సీఎం జగన్