Water Supply To Interrupt Completely And Partially In Some Areas Of Hyderabad - Sakshi
Sakshi News home page

Hyderabad Water Supply Halt: 36 గంటలపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం

Published Sat, Jul 15 2023 6:04 AM | Last Updated on Sat, Jul 15 2023 11:18 AM

- - Sakshi

హైదరాబాద్: గోదావరి తాగునీటి సరఫరా పథకం దశ –1లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ముర్మూర్‌ నుంచి బొమ్మకల్‌ వరకు ఉన్న మెయిన్‌ పైపులైనుకు ఏర్పడ్డ లీకేజీలు అరికట్టడానికి మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో 36 గంటలపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఈ నెల19.(బుధవారం) ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ పనులు జరుగనున్నాయి. దీంతో నగరంలోని పలు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగానీటి సరఫరాలో అంతరాయం కలుగనున్నట్లు జలమండలి వర్గాలు పేర్కొన్నాయి.

పాక్షికంగా అంతరాయం...

ఓ అండ్‌ ఎం డివిజన్‌–6 (ఎస్‌.ఆర్‌.నగర్‌): బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్‌ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్‌పేట్‌, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్‌ గూడ.

ఓ అండ్‌ ఎం డివిజన్‌–9 (కూకట్‌పల్లి): కేపీహెచ్‌బీ, మలేషియన్‌ టౌన్‌ షిప్‌ రిజర్వాయర్‌ పరిధి ప్రాంతాలు.

ఓఅండ్‌ఎం డివిజన్‌–15 (శేరిలింగంపల్లి): లింగంపల్లి నుంచి కొండాపూర్‌, గోపాల్‌నగర్‌, మయూరి నగర్‌ రిజర్వాయర్‌ పరిధి ప్రాంతాలు.

ఓఅండ్‌ఎం డివిజన్‌– 23 (నిజాంపేట్‌): ప్రగతినగర్‌లో కొన్ని ప్రాంతాలు, నిజాంపేట్‌/బాచుపల్లి.

పూర్తిగా అంతరాయం...
ఓఅండ్‌ఎం డివిజన్‌–9 (కూకట్‌పల్లి): ఎల్లమ్మ బండ, అల్వాల్‌ రిజర్వాయర్‌ పరిధిలోని ప్రాంతాలు.

ఓఅండ్‌ఎం డివిజన్‌–12 (కుత్బుల్లాపూర్‌): షాపూర్‌నగర్‌, చింతల్‌, జీడిమెట్ల/వాణి కెమికల్స్‌, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, అల్వాల్‌ రిజర్వాయర్‌ పరిధి ప్రాంతాలు.

ఓఅండ్‌ఎం డివిజన్‌ –13 (మల్కాజిగిరి/అల్వాల్‌): సైనిక్‌ పురి, డిఫెన్స్‌ కాలనీ, అల్వాల్‌ రిజర్వాయర్‌ పరిధి ప్రాంతాలు.

ఓఅండ్‌ఎం డివిజన్‌–14 (ఉప్పల్‌): కాప్రా మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాలు. సాయిబాబా నగర్‌, రాధిక, మహేష్‌ నగర్‌, అవుట్‌ రిజర్వాయర్‌ పరిధి ప్రాంతాలు.

ఓఅండ్‌ఎం డివిజన్‌–19 (నాగారం/దమ్మాయిగూడ): నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి, కీసర, ఆర్జీకే ప్రాంతాలు. ఓఅండ్‌ఎం డివిజన్‌– 24 (బొల్లారం): రింగ్‌ మెయిన్‌–3 ఆన్‌లైన్‌ సరఫరా

ఓఅండ్‌ఎం డివిజన్‌– 25 (కొంపల్లి): కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్‌నగర్‌, దేవరయాంజల్‌, హకీంపేట్‌

ఆర్‌డబ్ల్యూఎస్‌ అప్‌టేక్‌ ప్రాంతాలు: ప్రజ్ఞాపూర్‌ (గజ్వేల్‌), ఆలేరు (భువనగిరి) ఘన్‌పూర్‌ (మేడ్చల్‌/ శామీర్‌పేట్‌), కంటోన్మెంట్‌ లోని కొన్ని ప్రాంతాలు, ఎంఈఎస్‌, తుర్కపల్లి బయోటెక్‌ పార్కు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement