Hyderabad District News
-
కొలువుదీరిన పుస్తకం
కవాడిగూడ: హైదరాబాద్ 37 వ జాతీయ పుస్తక ప్రదర్శన గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ నెల 29 వరకు కొనసాగనున్న పుస్తక ప్రదర్శనలో జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మొత్తం 350 స్టాళ్లు కొలువుదీరాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగనుంది. మొదటి రోజే పుస్తక ప్రియులతో సందడి నెలకొంది. తెలంగాణ పబ్లిషర్స్. విశాలాంధ్ర, నవోదయ, ఎమెస్కో, మంచి పుస్తకం, మిళింద్ పబ్లిషర్స్, అన్వీక్షికి, నవ తెలంగాణ, జైభారత్, రాయలసీమ ఆధ్యాత్మిక వేదిక, బుద్ధం, మానవహక్కుల వేదిక, వీక్షణం, అరుణతార, విరసం తదితర పుస్తక ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. బుక్ఫెయిర్లో సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. తెలంగాణ బుక్ స్టాల్ ను గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, టీ– శాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘భారతీయతకు భాష్యం సీతారాం ఏచూరి’ పుస్తకాన్ని పబ్లికేషన్స్ నిర్వాహకులు కోయ చంద్రమోహన్ వీరికి బహూకరించారు. హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ప్రారంభం తొలిరోజే భారీ సంఖ్యలో సందర్శకులు -
తరలి వెళ్తుంది.. తరచి చూస్తుంది!
సాక్షి, సిటీబ్యూరో: సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కుతుండటంతో సరికొత్త ఆవిష్కరణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కోవలోకి వచ్చేదే రోబోటిక్ క్యాప్సుల్ ఎండోస్కోపీ టెక్నాలజీ. జీర్ణకోశ సమస్యలతో బాధపడే వారికి సులువుగా వ్యాధి నిర్ధారించేందుకు ఈ సరికొత్త సాంకేతికత మన భాగ్యనగరంలో అందుబాటులోకి వచ్చింది. దీని పేరే పిల్బోట్ రోబో.. దీన్ని గురువారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆవిష్కరించారు. కృత్రిమ మేధ సాంకేతికత సాయంతో పనిచేసే ఈ పిల్బోట్.. సంప్రదాయ ఎండోస్కోపీలతో పోలిస్తే ఎన్నో రెట్లు కచ్చితత్వంతో పని చేస్తుందని వైద్యులు తెలిపారు. ఈ సాంకేతికతను ఏఐజీ ఆస్పత్రి భారత్‌లోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. అలా మింగేస్తే చాలు.. చిన్నపాటి ట్యాబ్లెట్ పరిమాణంలో ఉండే ఈ పిల్బోట్ను నోటి ద్వారా మింగితే చాలు అది కడుపులోకి వెళ్లి.. జీర్ణవ్యవస్థను పూర్తిగా పరిశీలిస్తుంది. ఇందులోని కెమెరా వ్యవస్థ హై రిజల్యూషనల్ చిత్రాలను మనకు పంపిస్తుంది. వైద్యులకు జీర్ణాశయంలోని పరిస్థితి క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు దోహదపడుతుంది. వ్యాధి నిర్ధారణ చేసేందుకు ఇది సమర్థంగా పని చేస్తుంది. అయితే.. పిల్బోట్ ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉందని, ఇంకా ఎఫ్‌డీఏ ఆమోదం పొందలేదని ఎండియాక్స్ ప్రతినిధి వెల్లడించారు. కార్యక్రమంలో మయో క్లినిక్‌కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ వివేక్ కుంభారి, ఎండియాక్స్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అలెక్స్ ల్యూబ్కే, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందుబాటులోకి పిల్బోట్ రోబో ఏఐజీ ఆస్పత్రిలో ఆవిష్కరణ -
మిల్లెట్ల వినియోగం, ప్రచారం మరింత పెరగాలి
రాయదుర్గం: మిల్లెట్ల వినియోగం, ప్రచారం మరింత పెరగాల్సిన అవసరం ఉందని హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. నాలెడ్జి సిటీలోని ఐకియా ప్రాంగణంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బైసీ(బీఐఎస్వై) గ్రూప్, ఐకియా ఆధ్వర్యంలో మిల్లెట్ల వినియోగం, అవగాహన, గిరిజన సంఘం ప్రతినిధులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మినుములను, ఇతర మిల్లెట్లను తప్పనిసరిగా తినాలని ఆయన సూచించారు. వీటి వినియోగం పెరిగేలా చేయడానికి విస్త్రృత స్థాయిలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన గిరిజన క్యూరేటర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. కొన్ని వందల ఏళ్ల క్రితం గిరిజనులు మినుములు, జొన్నలు తినేవారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మిల్లెట్ మ్యాన్ రాంబాబు, బైసీ గ్రూప్ వ్యవస్థాపకుడు నవీన్ మేడిశెట్టి పాల్గొన్నారు. -
నయా వేడుకలపై నిఘా పెట్టండి
ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ వేడుకల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్రగ్స్, గంజాయిపై నిఘా పెట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి సూచించారు. గురువారం ఆబ్కారీ భవన్లో రంగారెడ్డి, హైదరాబాద్ ఎకై ్సజ్, ఎస్టీఎఫ్ బృందాలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి మొదటి వారం వరకు ఆయా అధికారులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అనివార్యమైతే తప్ప ఎవరూ సెలవులు పెట్టొద్దని సూచించారు. ఎన్డీపీఎల్ మద్యం రాకుండా చూడాలని, ఈవెంట్ మేనేజర్ల కదలికలపై దృష్టి పెట్టాలని, నానక్‌రాంగూడ, సింగరేణి కాలనీ, ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, గోల్కొండ, పుప్పాల్‌గూడ, మణికొండ, రామకృష్ణ కాలనీలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో జాయింట్ కమిషనర్లు ఖురేషీ, కేఏబీ శాస్త్రి, డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, అడిషనల్ ఎస్పీ భాస్కర్, అసిస్టెంట్ కమిషనర్లు ఆర్.కిషన్, అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రణవి పాల్గొన్నారు. -
‘వినియోగం’ మారినా కూల్చుడే!
అనేక అపార్ట్మెంట్లలో నిబంధనల ఉల్లంఘన సాక్షి, సిటీబ్యూరో/మణికొండ: ‘హైడ్రా–2.0’ తన పంథాను పూర్తిగా మార్చుకుంది. కూల్చివేతల విషయంలో సామాన్యులకు ఇబ్బందులు రాకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. కేవలం చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలే కాదు.. నిబంధనల విరుద్ధంగా గృహావసరాలకు అనుమతులు తీసుకుని, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న నిర్మాణాలపైనా చర్యలు తీసుకుంటోంది. మణికొండ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్లో ఉన్న అనుహర్ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్‌తో దీన్ని ప్రారంభించింది. ఓ ఫిర్యాదు ఆధారంగా ముందుకు వెళ్లిన హైడ్రా, స్థానిక అధికారులు దాని గ్రౌండ్ ఫ్లోర్‌లోని వ్యాపార సముదాయాలను గురువారం కూల్చేసింది. ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతూ.. నగరంలోని ఎన్నో నిర్మాణాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. పార్కింగ్తో పాటు ఇతర అవసరాల కోసం కేటాయిస్తూ అనుమతి తీసుకున్న, కేటాయించాల్సిన ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు వాడేస్తున్నారు. దీంతో అటు నివాసితులకు, ఇటు ఆ మార్గంలో ప్రయాణించే వారికి ఇక్కట్లు తప్పట్లేదు. నివాసితుల వద్దకు వచ్చే విజిటర్స్‌తో పాటు ఆయా వాణిజ్య, వ్యాపార సంస్థలకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రహదారిపై పార్క్ చేసుకుంటున్నారు. ఇది తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులకు కారణం అవుతోంది. అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదులతో.. అనుహర్ మార్నింగ్ రాగా అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో రెసిడెన్షియల్‌కు అనుమతి తీసుకుని, వ్యాపార సముదాయాలుగా మారుస్తున్నారంటూ 38 ఫ్లాట్ల నివాసితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం నార్సింగి పోలీసు స్టేషన్లోనూ ఫిర్యాదు చేశామని చెప్పారు. దీని ఆధారంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్థానిక మున్సిపల్ అధికారులతో కలిసి రెండు వారాల క్రితం క్షేత్రస్థాయి పరిశీలించారు. వివిధ అభ్యంతరాల నేపథ్యంలో హైడ్రా కార్యాలయంలో ఇరుపక్షాల వారిని సమావేశపరచడంతో పాటు అపార్టుమెంట్ నిర్మాణ అనుమతులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. దీంతో రెసిడెన్షియల్ అనుమతి పొందిన భవనంలో కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నట్లు తే లింది. ఎలివేషన్ కారిడార్లను మూసి ఓ బ్యాంక్‌నకు అవసరమైన స్ట్రాంగ్ రూం నిర్మాణం చేయడంతో అపార్ట్‌మెంట్‌కు పగుళ్లు కూడా వచ్చినట్లు గుర్తించారు. వాహనాల బ్యాటరీ చార్జింగ్ పాయింట్ల ప్రమాదాల నేపథ్యంలో నివాసితుల ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అనుహర్ మార్నింగ్ రాగా అపార్టుమెంట్ నిర్మాణ యజమాని హర్షవర్ధన్ రెడ్డికి సంబంధిత విభాగాలు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. షోకాజ్ తర్వాత డిమాలిషన్ నోటీసులు.. మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులకు హర్షవర్ధన్‌రెడ్డి స్పందించకపోవడంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆపై డిమాలిషన్ నోటీసులు ఇస్తూ అవసరమైన సమయం ఇచ్చినా స్పందన లేకపోవడంతో హైడ్రా సమక్షంలో స్థానిక అధికారులు గురువారం కూల్చివేతలు చేపట్టారు. జీహెచ్ఎంసీ మినహా ఔటర్ రింగురోడ్డు పరిధిలోని అన్ని మున్సిపాలిటీలలో తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 సెక్షన్ 178 (2) ప్రకారం హైడ్రాకు సమకూరిన అధికారాల ఆధారంగా కమిషనర్ కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని వ్యాపార సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని తొలగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో చిరు వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ట్రాఫిక్, స్థానికులకు ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. అల్కాపురిలో కూల్చివేతలు గృహావసరాలకు వాడాల్సిన భవనాలు వాణిజ్యానికి.. ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తున్న హైడ్రా మణికొండ అల్కాపురిలో షటర్ల కూల్చివేతమిగతా వాటికీ వర్తింపజేయాలి.. అనుహర్ మార్నింగ్ రాగా అపార్ట్మెంట్ కింద ఉన్న 14 షటర్లను అధికారులు గురువారం తొలగించారు. మున్సిపాలిటీకి కమర్షియల్ పన్నులు చెల్లిస్తున్న షటర్లను తాము కొనుగోలు చేసి వ్యాపారాలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. అవి కూల్చేయడం ఎంత వరకు సబబు అంటూ కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి నిర్మాణాలను మొదట్లోనే అడ్డుకోవాల్సిన అధికారులు కాలయాపన చేశారని, వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో నివాసిత అనుమతులతో వందలాది భవనాలలో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేశారని, వాటిపైనా హైడ్రా చర్యలు తీసుకోవాలంటున్నారు. తాము అప్పులు చేసి, ఆస్తులు అమ్మి వ్యాపారాలు పెట్టుకున్నామని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
నిమ్స్.. అభివృద్ధి అదుర్స్!
కొత్త భవనాలతో మరింత బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. నూతన భవనాలు, అత్యాధునిక వసతుల కల్పనతో రోగుల్లో నమ్మకం పెరిగింది. ప్రస్తుత పడకలకు అదనంగా మరో 2 వేల పడకల భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో నిమ్స్‌లో పడకల సంఖ్య సుమారు 4 వేలకు చేరనుంది. కొత్త భవనాలతో మాపై బాధ్యత మరింత పెరుగుతుంది. పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం. 4 వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద హాస్పిటళ్ల జాబితాలో నిమ్స్ చేరనుంది. – ప్రొ.నగరి బీరప్ప, నిమ్స్ డైరెక్టర్ లక్డీకాపూల్: నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) విస్తరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రూ.1,678 కోట్ల వ్యయంతో 32.16 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం నిమ్స్‌లో అకడమిక్స్, ఇన్వెస్టిగేషన్, రీసెర్చ్‌తో పాటు 30కి పైగా విభాగాలు ఉన్నాయి. గుండె, మూత్రపిండాలు, మెదడు, కాలేయం, కేన్సర్, అత్యవసర విభాగం, ట్రామా, ఆర్థోపెడిక్ తదితర 42 విభాగాలకు సంబంధించి నూతన భవనాలు సమకూర్చనున్నారు. నూతన భవనాలు అందుబాటులోకి వస్తే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో పీజీ సీట్లు పెరుగుతాయి. ఆయా స్పెషాలిటీ విభాగాల్లో నర్సింగ్ సేవల్లోనూ ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఇప్పటికే నిమ్స్‌లో ౖకార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, వాస్కులర్ సర్జరీ, యూరాలజీ, రుమటాలజీ, క్రిటికల్ కేర్, డయాగ్నొస్టిక్ వంటి విభాగాలు ఉన్నాయి. ఆంకాలజీ విభాగంలో మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజీ, క్యాథ్ ల్యాబ్, డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక వైద్య విద్య విషయానికి వస్తే.. 14 స్పెషాలిటీ విభాగాలతో పాటు 23 సూపర్ స్పెషాలిటీల్లో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీలలో నర్సింగ్, పారా మెడికల్, అల్లైడ్ హెల్త్ సైన్సెస్‌కు సంబంధించిన సంస్థలు కొనసాగుతున్నాయి. 4 బ్లాక్‌ల్లో కొత్త భవనాలు.. బిల్టప్ ఏరియా 23,96,542.34 చ.అ. విస్తీరణంలో 4 బ్లాక్‌లను నిర్మించనున్నారు. 8 అంతస్తుల బ్లాక్–ఏలో అవుట్ పేషెంట్ విభాగం (ఓపీడీ), 13 అంతస్తుల బీ–బ్లాక్‌లో ఇన్‌పేషెంట్ విభాగం, 8 అంతస్తుల సీ–బ్లాక్‌లో ఎమర్జెన్సీ విభాగం, 14 అంతస్తుల బ్లాక్–డీలో ఐపీడీ విభాగాలు ఏర్పాటు కానున్నాయి. మొత్తంగా 2 వేల ఆక్సిజన్ పడకలతో పాటు 120 ఓపీడీ చాంబర్లు, 500 ఐసీయూ పడకలు, 300 పేయింగ్ రూమ్‌లతో పాటు 38 మాడ్యులర్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఏ బ్లాక్, బీ బ్లాక్ భవన సదుపాయాలు మొదటి అంతస్తుల స్లాబ్ నిర్మాణం పురోగతిలో ఉంది. సీ బ్లాక్ భవనం నిర్మాణ పనులలో తవ్వకం పనులు పూర్తయ్యాయి. భూగర్భ డ్రైనేజీ, నీటి లైన్లను నిర్మించారు. బ్లాక్ డిలో నాలుగు అంతస్తుల స్లాబ్ నిర్మాణం పూర్తయింది. సర్వీస్ బ్లాక్‌కు సంబంధించి కూడా తవ్వకం పనులు పురోగతిలో ఉన్నాయి. సెక్టార్– 3లో టీజీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో ఎన్హెచ్ఎం నిధుల కింద 200 పడకల ఎంసీహెచ్ ఆస్పత్రి భవన సదుపాయా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సెక్టార్–4లో ఆలయం, మసీదు, పాఠశాలలు వంటి నిర్మాణాల పునరావాస చర్యలు సాగుతున్నాయి. ఇందులో ఆలయ నిర్మాణం ఇప్పటికే 50 శాతం మేరకు పూర్తయింది. పాఠశాల భవన నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. సెక్టార్–5లో నిమ్స్ కోసం ఆడిటోరియాన్ని నిర్మించనున్నారు. రూ.1,678 కోట్ల వ్యయంతో విస్తరణ చురుగ్గా కొనసాగుతున్న పనులు 32.16 ఎకరాల్లో 4 బ్లాక్‌ల నిర్మాణం 2,000 పడకలు.. 500 ఐసీయూ బెడ్లు 300 పేయింగ్ గదులు 38 మాడ్యులర్ థియేటర్లు రోగులకు మరింత మెరుగైన వైద్యం -
బల్దియా బడ్జెట్ పెంపు!
23న స్టాండింగ్ కమిటీ సమావేశం సాక్షి, సిటీబ్యూరో: గత నెల 30న జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2025–26) సంబంధించి ప్రవేశపెట్టిన రూ.8,340 కోట్ల ముసాయిదా బడ్జెట్‌పై సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో దాన్ని సవరించారు. సవరించిన బడ్జెట్‌ను ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న ప్రత్యేక స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుంచనున్నారు. గత సమావేశం ముందుంచిన బడ్జెట్లో ఆస్తిపన్ను, టౌన్‌ప్లానింగ్, ట్రేడ్‌లైసెన్స్, అడ్వర్టయిజ్మెంట్ ఫీజులు, తదితరాలను తక్కువగా చూపారని సభ్యులు మండిపడటంతో వాటిని సవరించడంతో పాటు ఇతరత్రా మార్పుచేర్పులతో బడ్జెట్‌ను సవరించారు. పరిశీలించేందుకు తమకు తగిన సమయమివ్వలేదని సభ్యులు మండిపడటంతో గురువారమే సమాచారం నిమిత్తం సదరు బడ్జెట్ ప్రతులను స్టాండింగ్ కమిటీ సభ్యులకు పంపించారు. అనంతరం అజెండాలో మార్పులున్నట్లు సంబంధిత యంత్రాంగం సమాచారం పంపినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు సవరించిన ముసాయిదా బడ్జెట్లోని మార్పుల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. అంశాల వారీగా పెంచిన నిధులు .. (రూ.కోట్లలో)అంశం ముసాయిదా సవరణ ఆస్తిపన్ను 2005.81 2029.81 టౌన్‌ప్లానింగ్ 1037.41 1201.15 ట్రేడ్ లైసెన్స్ 92.00 112.00 ప్రకటనల ఫీజులు 20.45 60.70 ఇవిలా ఉండగా, ముసాయిదాలోని రెవెన్యూ ఆదాయాన్ని రూ.4,205 కోట్ల నుంచి రూ.4,445 కోట్లకు పెంచుతూ సవరించారు. -
దేశ ఆర్థికాభివృద్ధిలో విద్య పాత్ర కీలకం
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాంగోపాల్‌పేట్: దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ సెంటినరీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి మేనేజ్మెంట్ ఎంప్రెసా–24ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉన్నత విద్యాధికులతో పాటు మేధోశక్తి పెరిగితే ఆ దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. దేశంలో భిన్న మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్నా మనమంతా భారతదేశ పౌరులమేనన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్చ్ బిషప్, కార్డినల్ పూల ఆంథోని, కళాశాల డైరెక్టర్ డాక్టర్ పి.ఆంథోని వినయ్, ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్, ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్మెంట్ కళాశాల డీన్ ప్రొఫెసర్ శ్రీరాములు, విద్యాసాగర్, మిన్నీ మ్యాథ్యూ, చేతన్ శ్రీవాత్సవ్, కున్నుంకల్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో పోలీసు వాహనంపై మహిళ దాడి
రాంగోపాల్‌పేట్: మద్యం మత్తులో ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చి హంగామా చేయడమేగా పోలీసు వాహనంపై రాయితో దాడి చేసిన సంఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం మద్యం మత్తులో స్టేషన్‌కు వచ్చిన ఓ జంట ఫిర్యాదు తీసుకోవాలని పోలీసులను కోరారు. అయితే వారు మద్యం మత్తులో దురుసుగా మాట్లాడుతుండటంతో పోలీసులు వారిని బయటికి పంపారు. దీంతో సదరు మహిళ మా ఫిర్యాదునే తీసుకోవా.? అంటూ పోలీసులపై తిరగబడింది. అంతటితో ఆగకుండా స్టేషన్ ప్రాంగణంలో ఉన్న పోలీసు వాహనంపై రాయితో దాడి చేసి అద్దాలు పగులగొట్టింది. స్టేషన్ లోపలికి వెళ్లి ఉన్నతాధికారులపై కూడా దాడికి యత్నించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ధ్యాన మహా యాగానికి భారీ ఏర్పాట్లు
కడ్తాల్: ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ చేపట్టే పత్రీజీ ధ్యాన మహాయాగ వేడుకలకు మహేశ్వర మహా పిరమిడ్ ముస్తాబయ్యింది. ఈ నెల 21న ప్రారంభమయ్యే ఈ వేడుకలు డిసెంబర్ 31 వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ ధ్యాన మహాయాగానికి ది హైదరాబాద్ స్పిరుచ్యువల్ సొసైటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ధ్యానులకు వసతి గృహాలు, కుటీరాలు 12 ఏళ్లుగా డిసెంబర్ నెలలో వివిధ ప్రాంతాల నుంచి ధ్యానులు అంతా ఇక్కడికి తరలి వచ్చి ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగంలో పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చే వేలాది మంది ధ్యానుల మధ్య పత్రీజీ ధ్యాన మహాయాగాలను వైభవంగా నిర్వహించేందుకు ది పిరమిడ్ ట్రస్ట్ స్పిరుచ్యువల్ సొసైటీ మూవ్మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టింది. ధ్యానులకు ప్రత్యేక వసతి, ఉచిత భోజన సదుపాయాలు కల్పించనున్నా రు. ఉచిత అన్నదాన కేంద్రం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం శాశ్వత గదులతో పాటు, తాత్కాలిక వసతి గృహలు, కుటీరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రోజు ధ్యానం చేసేందుకు వీలుగా భారీ సభా ప్రాంగణం, ప్రత్యేక అలంకరణతో పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. పత్రీజీ ధ్యాన మహాయాగంలో భాగంగా ప్రతి రోజు పత్రీజీ వీడియో సందేశం, ప్రముఖ ధ్యాన గురువులు, ఆధ్యాత్మిక వేత్తల, పిరమిడ్ మాస్టర్ల ఆధ్యాత్మిక సందేశాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 21న ప్రారంభం కానున్న ధ్యాన మహా సభలు 12 ఏళ్లుగా 11 రోజుల పాటు నిర్వహణ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి ధ్యానుల రాక కార్యక్రమ వివరాలు ఉదయం 5గంటల నుంచి 8.30గంటల వరకు పత్రీజీ వీడియో సందేశాలు, సామూహిక వేణుగాణ ధ్యానం, అఖండ ధ్యానం ఉదయం 10గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ధ్యాన గురువుల సందేశాలు, గురుసమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, సంగీత ధ్యానం -
దారి దోపిడీ కేసులో ఇద్దరి అరెస్ట్
బాలానగర్: సులభంగా డబ్బు సంపాదించేందుకు దారి దోపిడీకి పాల్పడిన ఇద్దరు యువకులను బాలానగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాలానగర్ ఏసీపీ హనుమంతరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన షేక్ సమీర్ ప్లంబర్‌గా పని చేసేవాడు. నగరంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన మహమ్మద్ హుస్సేన్ అతడి స్నేహితుడు. చెడు వ్యసనాలకు బానిసలైన వీరు సులువుగా డబ్బులు సంపాదించేందుకు దారి దోపిడీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5న చింతల్ ప్రాంతానికి చెందిన సతీష్ డ్యూటీ నుంచి ఇంటికి తిరిగివెళుతుండగా ఉషా ఫ్యాన్ కంపెనీ సమీపంలో సమీర్, మహమ్మద్ హుస్సేన్ పథకం ప్రకారం సతీష్ బైక్‌ను ఢీకొన్నారు. అతను కింద పడిపోవడంతో అతడికి సహాయం చేస్తున్నట్లు దగ్గరికి వెళ్లి అతని మెడలోని 26.3 గ్రాముల గోల్డ్ చైన్, రెండు సెల్ఫోన్లు లాక్కున్నారు. సతీష్ వారిని అడ్డుకునేందుకు యత్నించగా అతడిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి బంగారు గొలుసు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మోండా మార్కెట్లో అగ్ని ప్రమాదం
● 5 దుకాణాలు దగ్ధం ● రూ.20 లక్షల ఆస్తినష్టంరాంగోపాల్పేట్: సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్లో గురువారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో 5 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో దాదాపు రూ.20 లక్షల మేర ఆస్తినష్టం వాటిళ్లింది. మార్కెట్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం తెల్లవారు జామున మార్కెట్లోని కొబ్బరికాయలు, కిరాణా దుకాణాల్లో మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, మార్కెట్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటను అదుపులోకి తెచ్చారు. కాగా అప్పటికే రెండు కొబ్బరికాయల దుకాణాలు, ఒక పూజా సామగ్రి, ప్లాస్టిక్ దుకాణం, కిరాణా షాప్ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.20 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిళ్లిందని బాధితులు తెలిపారు. చలిమంట కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అగ్ని ప్రమాదం విషయం తెలియడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటూ ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్లో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. -
పేలుడు పదార్థం ఇచ్చింది అతడే..
‘దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో దోషిగా తేలిన ఉగ్రవాది అఫాఖీ ● మంగుళూరులో అందుకున్న ఉగ్రవాది అసదుల్లా అక్తర్ ● 2015లో అరెస్టు చేసిన బెంగళూరు సీసీబీ అధికారులు ● బుధవారం తీర్పు ఇచ్చిన అక్కడి స్పెషల్ కోర్టు ● అతడితో సహా ముగ్గురికిత్వరలో శిక్ష ఖరారు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్లు సహా అనేక విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాలను సరఫరా చేసిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీ దోషిగా తేలాడు. ఇతడిపై బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) నమోదు చేసిన ప్రధాన కేసుకు సంబంధించి అక్కడి న్యాయస్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. అతడితో పాటు సహకరించిన మరో ఇద్దరు ఉగ్రవాదులకు వచ్చే సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. 2015లో భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను టార్గెట్ చేశారన్నది అఫాఖీ మాడ్యుల్‌పై ఉన్న కీలక ఆరోపణ. పాక్ నుంచి ప్లాన్ చేసిన రియాజ్ భత్కల్.. ఉత్తర కన్నడ జిల్లాలోని భత్కల్ ప్రాంతానికి చెందిన అఫాఖీ అలియాస్ డాక్టర్ సాబ్ వృత్తిరీత్యా హోమియోపతి వైద్యుడు. పాకిస్థాన్, కరాచీలోని డిఫెన్స్ ఏరియాలో తలదాచుకున్న ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ (2007 నాటి గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల నిందితుడు) ఆదేశాల మేరకు ఈ పని చేశాడు. భత్కల్ ప్రాంతానికే చెందిన సద్దాం హుస్సేన్, అబ్దుల్ సుబూర్లతో ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. రియాజ్ భత్కల్ 2012లో హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్‌గా చేసుకున్నాడు. ఆ ఏడాది సెప్టెంబర్‌లోనే ఉత్తరప్రదేశ్‌లోని ఆజామ్ఘడ్కు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, పాకిస్థానీ జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌లను కర్ణాటకలోని మంగుళూరుకు పంపి అక్కడ షెల్టర్ ఏర్పాటు చేయించాడు. వీరు రియాజ్‌తో నెట్ కేఫ్‌ల నుంచి చాటింగ్ చేయడం ద్వారా సంప్రదింపులు జరిపేవారు. ఎజాజ్ షేక్‌తో నగదు... అఫాఖీతో ఎక్స్‌ప్లోజివ్స్... రియాజ్ భత్కల్ 2013 ఫిబ్రవరి మొదటి వారంలో చాటింగ్ ద్వారా హడ్డీకి కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఈసారి హైదరాబాద్‌ను టార్గెట్ చేశామని చెప్పి వఖాస్, బీహార్‌లోని దర్భంగా వాసి తెహసీన్ అక్తర్ అలియాస్ మోనుతో కలిసి ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని నిర్దేశించాడు. ఈ ఆపరేషన్‌తో పాటు ఇతర అవసరాల కోసం రూ.6.8 లక్షలు హడ్డీకి అందించే బాధ్యతల్ని మహారాష్ట్రలోని పుణేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఎజాజ్ షేక్‌కు, పేలుడు పదార్థాలను ఇచ్చే బాధ్యతల్ని బెంగళూరులో ఉంటున్న సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీకి అప్పగించాడు. మోను, వఖాస్ హైదరాబాద్ చేరుకుని, అబ్దుల్లాపూర్‌మెట్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. పేలుడు పదార్థాల కోసం మంగుళూరులోనే వేచి ఉన్న హడ్డీకి రియాజ్ భత్కల్ నుంచి ఆ ఏడాది ఫిబ్రవరి 4న కీలక ఆదేశాలు వచ్చాయి. మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ వ్యక్తి వాటిని అందిస్తాడని చెప్పడంతో అక్కడికి వెళ్లాడు. రియాజ్ సూచించిన ప్రకారం అఫాఖీ 25 కేజీల పేలుడు పదార్థం (అమ్మోనియం నైట్రేట్), 30 డిటోనేటర్లు సమీకరించి వాటిని బంగారు రంగులో ఉన్న ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి సద్దాం హుస్సేన్ ద్వారా యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద హడ్డీకి అప్పగించాడు. ఒకరికొకరు తెలియకుండా మరొకరితో.. దిల్సుఖ్నగర్ పేలుళ్లలో పాలు పంచుకున్న యాసీన్ భత్కల్ (నేపాల్ నుంచి సహకరించాడు), తెహసీన్ అక్తర్ (ఏ–1 మిర్చ్ సెంటర్ దగ్గర బాంబు పెట్టాడు), వఖాస్ (107 బస్టాప్ దగ్గర బాంబు పెట్టాడు), హడ్డీ (నగదు, పేలుడు పదార్థాలు చేరవేశాడు)లకు ఎజాజ్ షేక్ (నిధులు అందించాడు), అఫాఖీలు తెలియకుండా రియాజ్ భత్కల్ జాగ్రత్తలు తీసుకున్నాడు. వీరిలో ఎవరు చిక్కినా మిగిలిన వారి విషయం బయటపడకుండా కుట్ర పన్నాడు. అఫాఖీ, ఎజాజ్ షేక్లకూ ఎలాంటి పరిచయం లేదని, హడ్డీకి పేలుడు పదార్థాలు ఇచ్చినప్పుడు అతడు ఎవరనేది అఫాఖీకి తెలియదని సీసీబీ తేల్చింది. 2015 జనవరి 8న ఈ త్రయం అరెస్టు కాగా... బుధవారం దోషులుగా తేల్చారు. వీరికి వచ్చే సోమవారం శిక్ష ఖరారు చేయనున్నట్లు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. -
అడ్రస్‌లేని ఆస్పత్రికి శంకుస్థాపన!
భూమి కేటాయించకుండానే శిలాఫలకాలు ఆ ఆంతర్యం ఏమిటో..? భూమిని కేటాయించకుండా ఆగమేఘాల మీద శిలాఫలకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే విమర్శలు లేకపోలేదు. ఆ తర్వాత ఆయా శిలఫలకాలను అక్కడి నుంచి మున్సిపల్ ఆఫీసులకు తరలించడం విశేషం. ఇప్పటికే శంకుస్థాపనలు చేసిన భవనాలకు, రోడ్లకే దిక్కు లేదు. నిధుల లేమి సహా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఆయా నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. దీనికి తోడు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలు అటు వైపు వెళ్లేవారిని వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. కేవలం నియోజకవర్గంలోని ఒకరిద్దరి రాజకీయ ఆదిపత్యం, లబ్ధి కోసమే ఇలాంటి అవగాహన లేని చర్యలు చేపడుతున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చర్యలను నియంత్రించాల్సిన జిల్లా అధికారులు సైతం ఏమీ చేయలేక మిన్నకుండిపోతున్నారు. ప్రజాప్రతినిధుల తొందరపాటు చర్యల వల్ల ప్రజల్లో తాము అభాసుపాలు కావాల్సి వస్తుందని ఆయా విభాగాల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఏదైన భవనం నిర్మించాలంటే ముందు నిర్ధేశిత ప్రాంతంలో అవసరమైన విస్తీర్ణంలో భూమిని ఎంపిక చేస్తాం. ఆ తర్వాత ఓ శుభముహూర్తం చూసుకుని శంకుస్థాపన చేస్తాం. కానీ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు భూమిని ఎంపిక చేసి, కేటాయింపులు జరపకుండానే సాక్షాత్తు జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలకు తోడు.. ప్రజాప్రతినిధుల తొందర పాటు చర్యల వల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తలపట్టుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. అన్నింటికీ ఒకే చోట శిలాఫలకాలు మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్సీఐ రోడ్డు సహా బడంగ్పేట్, తుక్కుగూడలో 15వ ఆర్థిక సంఘం నిధులతో పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో భవనానికి రూ.1.43 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఆయా ఆస్పత్రి భవనాలకు అవసరమైన భూమిని మాత్రం నేటికీ ఎంపిక చేయలేదు. ప్రజాపాలన ఏడాది ఉత్సవాల్లో భాగంగా నవంబర్ 30న ఆయా భవనాలకు ఏకంగా శంకుస్థాపనలు చేయడం విశేషం. తుక్కుగూడలో ఓ రోడ్డుకు శంకుస్థాపన చేసిన చోటే.. ఆయా ఆస్పత్రి భవనాలకు సంబంధించిన శిలాఫలకాలను ఏర్పాటు శంకుస్థాపనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఆరోగ్య కేంద్రం మంజూరు చేసిన వెంటనే అనువైన భూమిని ఎంపిక చేయాలి. కానీ ఇవేవీ చేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఏకంగా శిలాఫలకాలు ఏర్పాటు చేసి, వాటికి శంకుస్థాపనలు చేయడం వివాదాస్పదంగా మారింది. తుక్కుగూడ, ఆర్సీఐ, బడంగ్‌పేట్‌లలో వింత పరిస్థితి ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై విమర్శల వెల్లువ -
ప్రయోగాలు చేయాలి
సాంకేతిక విద్యతో వెంగళరావునగర్ : మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విద్యను జోడిస్తూ యునానీ ఔషధాల తయారీలో ప్రయోగాలు చేపట్టాలని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ యునానీ మెడిసిన్ డైరెక్టర్ జనరల్ (న్యూఢిల్లీ) డాక్టర్ ఎన్.జహీర్ అహ్మద్ అన్నారు. ఎర్రగడ్డ యునానీ కేంద్రీయ విద్యాలయంలో పరిశోధనలపై మూడురోజుల వర్క్‌షాప్‌ను గురువారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్కిన్ డిజాస్టర్ రోగులకు అందించే మందులను ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు, మారుతున్న వైద్య విధానాలకు అనుగుణంగా రూపొందించాలన్నారు. రీసెర్చ్ మెథడాలజీతో సహా ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి, సిద్ధకు చెందిన పీజీ విద్యార్థులకు ఉత్తమ బోధనా పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్థానిక యునానీ కేంద్రీయ వైద్య కళాశాల ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ యూనిస్ ఇఫ్తికార్, మున్షీ, డాక్టర్ వసీం అహ్మద్ (యుపీ), పహ్మిదా జీనత్, డాక్టర్ ఐషా అంజుమ్ తదితర సీనియర్ వైద్యులతో పాటుగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యునానీ పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. -
సెల్‌ఫోన్ దొంగల అరెస్ట్
అమీర్‌పేట: ప్రైవేట్ హాస్టళ్లను టార్గెట్ చేసుకుని సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్న బావ, బామ్మర్ధులను అరెస్ట్ చేసిన ఎస్ఆర్నగర్ పోలీసులు వారి నుంచి రూ.10 లక్షల విలువైన 51 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డీఐ గోపాల్‌తో కలిసి గురువారం వివరాలు వెళ్లడించారు. నేపాల్‌కు చెందిన గోవింద్ బండారి, హిక్మత్ రావల్ గత కొన్నేళ్లుగా నగరంలో నివాసముంటున్నారు. గోవింద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తుండగా, రావల్ రాణీగంజ్‌లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. బావ,బామ్మర్దులైన వీరు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో సెల్‌ఫోన్ చోరీలను ఎంచుకున్నారు. తెల్లవారుజామున ప్రైవేట్ హాస్టళ్లలోకి ప్రవేశించి సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లేవారు. వాటిని నేపాల్ తీసుకెళ్లి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై 22 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, కూకట్పల్లి స్టేషన్ల పరిధిలోనూ చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. వారి నుంచి 51 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన క్రైం సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. -
లారీ ఢీ కొని మహిళ దుర్మరణం
నాగోలు: బైక్‌పై రామోజీ ఫిల్మ్ సిటీకి వెళుతున్న జంటను వెనుక నుంచి లారీ ఢీ కొనడంతో ఓ యువతి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎల్బీనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రోహిత్‌కుమార్ పాట్లే మీర్పేట్, అన్నపూర్ణ కాలనీలో ఉంటూ నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన అతడి స్నేహితురాలు ప్రియాంక గాధే బుధవారం రోహిత్‌కుమార్ ఇంటికి వచ్చింది. ఇద్దరూ కలిసి గురువారం ఉదయం బైక్‌పై రామోజీ ఫిల్మ్ సిటీకి వెళుతుండగా ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ వారిని ఢీకొనడంతో ఇద్దరూ కింద పడ్డారు. లారీ చక్రాలు ప్రియాంక గాధే తల మీదుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఎల్బీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. రోహిత్‌కుమార్ పాట్లే ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి
చందానగర్: అవగాహనతోనే సైబర్ నేరాలను నియంత్రించవచ్చని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రాజెక్ట్ ‘ప్రొటెక్ట్’ (ప్రివెంటింగ్ రిస్క్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొలాబొరేషన్స్ అండ్ ట్రైనింగ్) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. 2016 నుంచి 2024 వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సుమారు రూ.700 కోట్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లాయన్నారు. ఈ సంవత్సరం రూ.74 కోట్లు రికవరీ చేశామని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కి డయల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ వారియర్స్, ఎస్సీఎస్సీ, సంగమిత్ర, దిల్సే వివిధ స్వచ్ఛంద సంస్థల వలంటీర్లతో ఈ నెల 18 నుంచి సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామన్నారు. అనంతరం ప్రాజెక్ట్ ‘ప్రొటెక్ట్’ పోస్టర్, వలంటీర్ల ప్రొటెక్ట్ టీ షర్టులను ఆవిష్కరించారు. సైబర్ క్రైం డీసీపీ శ్రీబాల, ఎస్సీఎస్సీ సెక్రటరీ జనరల్ రమేష్ కాజా, సీఈఓ నవీద్ ఖాన్, ఉమెన్ అండ్ చైల్డ్ భద్రత వింగ్ డీసీపీ సృజన, మాదాపూర్ డీసీపీ వినీత్, ఏసీపీలు రవీందర్‌రెడ్డి, చంద్రకాంత్, సైబర్ ఎక్స్పర్ట్ ప్రవీణ్ తంగళ, భాను మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అవగాహనతోనే సైబర్ నేరాల నియంత్రణ
ఎల్బీనగర్ జంక్షన్లో కళాకృతులుసాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు, సెంట్రల్ మీడియన్లు, జంక్షన్లు తదితర ప్రాంతాలను వివిధ కళాకృతులు, థీమ్ పెయింటింగులతో సుందరీకరిస్తూ అభివృద్ధి చేస్తున్న జీహెచ్ఎంసీ.. ఎల్బీనగర్ జంక్షన్‌ను విభిన్నంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. గ్రేటర్లో అత్యధిక రద్దీ ప్రాంతాల్లో ఒకటైన ఎల్బీనగర్ జంక్షన్‌ను పాదచారులకు సదుపాయంగా మార్చడంతో పాటు చూడగానే ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకునేందుకు వివిధ పనులను చేపట్టనుంది. జంక్షన్‌లోని ఫ్లై ఓవర్లకు చెందిన ఎనిమిది స్తంభాల చుట్టూ ప్రత్యేక శిల్పాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక థీమ్‌తో బ్యూటిఫికేషన్ తదితర పనులు చేయనుంది. ఎండా వానలకు దెబ్బ తినకుండా ఉండేందుకు వెదర్‌ప్రూఫ్ మెటీరియల్ వినియోగించనుంది. ఏపీ వైపు ప్రయాణాలు సాగించేవారు, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు ఎక్కువ మంది ఈ మార్గం నుంచే వెళ్తుండటం తెలిసిందే. అధిక రద్దీ ఉండే ఈ జంక్షన్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు రూ. 1.50 కోట్ల అంచనా వ్యయంతో పనులకు సిద్ధౖమై, టెండర్లు పిలిచింది. త్వరలోనే టెండరు ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించనున్నారు. రూ. 150 కోట్లతో 225 ప్రాంతాల్లో.. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే సందర్శకులకు కనువిందు చేసేలా సిటీ ఇమేజ్ను పెంచేందుకు దాదాపు 225 ప్రాంతాల్లో పనులు చేసేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ ఇందుకోసం రూ.150 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. వాటిలో ఇప్పటికే రూ.5 కోట్లకు పైగా వ్యయంతో 15 పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రారంభం కావాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. రూ. 1.50 కోట్లతో సుందరీకరణ టెండర్లు పిలిచిన జీహెచ్ఎంసీ త్వరలో పనులు ప్రారంభం -
ఆ తర్వాత నిర్మించిన అక్రమ కట్టడాలనే కూల్చివేస్తాం
మోతీనగర్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటుందనే అంశంపై కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాది జూలైలో హైడ్రా ఏర్పాటైందని, ఆ తర్వాత నిర్మించిన అక్రమ నిర్మాణాలపైనే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దానికి ముందు నిర్మించిన నివాసాలు సక్రమమైనా, అక్రమమైనా వాటి జోలికి హైడ్రా వెళ్లదని పునరుద్ఘాటించారు. అయితే.. ఇది వాణిజ్య సముదాయాలకు వర్తించదన్నారు. మంగళవారం మూసాపేటలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కాముని చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటానికి ప్రణాళికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అవాంతరాలను తొలగించటానికి హైడ్రా సహకారం కావాలని హెచ్ఎండీఏ కోరింది. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. ‘కాముని చెరువులో నిర్మాణ వ్యర్థాలతో పాటు మట్టిని నింపి కొంతమంది ఆక్రమిస్తున్నారు. అదేమంటే పట్టా భూములని చెబుతున్నారు. ఈ చెరువులకు అనుసంధానంగా ఉండే కాలువల కబ్జాపైనా ఫిర్యాదులు అందడంలో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నాం. కాముని చెరువులో మట్టిపోసిన వారిని వదిలి పెట్టేది లేదు. నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తాం. చెరువు కబ్జాపై స్థానికులు సంఘటితమై ఫిర్యాదు చేయటమే కాకుండా చెరువును కాపాడటంలో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తామని ముందుకు వచ్చారు. పేదల ఇళ్ల జోలికి వెళ్లం. భవిష్యత్తులో చెరువులు, కుంటలు, నాలాల్లో అక్రమంగా నిర్మించే ఏ కట్టడమైనా కూల్చివేస్తాం. ఇప్పటికే ఈ చెరువులను ఆనుకుని కట్టిన నిర్మాణాలను కదిలించబోం. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మి, అఘాయిత్యాలకు పాల్పడవద్దు’ అని స్పష్టం చేశారు. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా కాకుండా స్థానికులే కాపాడుకోవాలని రంగనాథ్ సూచించారు. కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువు వరకు వరద కాలువ పనులు పూర్తి కాకుండా అక్కడ ఓ భవన నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టింది. దీన్ని గమనించిన రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 మీటర్ల వెడల్పుతో నిర్మించతలపెట్టిన వరద నీటి కాలువ పనులను తక్షణం పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు సూచించారు. వరద కాలువను మళ్లించటం వల్ల దిగువన ఉన్న సఫ్దర్‌నగర్, రాజీవ్ గాంధీనగర్ బస్తీలు వర్షాకాలంలో మునిగి పోతున్నాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే వర్షాకాలానికి ఇబ్బంది లేకుండా కాముని చెరువు, మైసమ్మ చెరువు మధ్య ఉన్న వరద కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసేలా చూడాలని అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కాముని చెరువు, మైసమ్మ చెరువుల పరిశీలన -
మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమివ్వండి
సాక్షి, సిటీబ్యూరో: నగరాన్ని చలి వణికిస్తోంది. రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. తెల్లవారుజామున పొగ మంచు రోడ్లను కమ్మేస్తోంది. రాత్రుళ్లు చలి తీవ్రత మరింత పెరుగుతోంది. శివారులో అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయింది. నగరంలో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రత 11.9 డిగ్రీలు నమోదైంది. సగటు కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు మైనస్‌లో పడిపోయింది. ● యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి ● జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చేపట్టిన పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఈ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ సీఈ పనసరెడ్డిలతో కలిసి ఇంజినీరింగ్ పనులపై జోన్ల వారీగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ప్రజా సదుపాయాల దృష్ట్యా చేపట్టిన పనుల్ని నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యాత్మకంగా ఉన్న 141 వాటర్ లాగింగ్ పాయింట్లను తగ్గించేందుకు శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, వచ్చే వర్షాకాలంలోగా సమస్యల్లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు. 125 జంక్షన్ల అభివృద్ధి పనులకు సంబంధించి భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ సమస్యల పరిష్కారానికి ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్, అడ్వర్టైజ్మెంట్, యూబీడీ విభాగాల అధికారులతో అంతర్గత కమిటీ వేసినట్లు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో జోనల్ ఎస్.ఈలు చిన్నారెడ్డి, రత్నాకర్, మహేష్ రెడ్డి, నిత్యానంద్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బుకాయించబోయారు బుక్కయ్యారు!
కంటోన్మెంట్: నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి వాచ్‌మన్ మృతి చెందగా.. యజమానులు మృతదేహాన్ని సమీపంలోని చెత్త కుప్పల్లో పడేసిన ఘటన బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ముంజంపల్లి యాకయ్య (55), సావిత్రి దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చి అంజయ్య నగర్లో నివాసముంటున్నారు. యాకయ్య మనోవికాస్ నగర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్‌మన్‌గా పని చేస్తున్నారు. సోమవారం సాయంత్రం క్యూరింగ్ నిమిత్తం నీళ్లు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి జారిపడి ఆయన మృతి చెందారు. కొద్దిసేపటి తర్వాత గమనించిన భవన యజమాని జహంగీర్ కుటుంబ సభ్యులు ఎవరికీ అనుమానం రాకుండా సమీపంలోని చెట్ల పొదల్లో యాకయ్య మృతదేహాన్ని పడేశారు. మృతుడి భార్య యజమానులను ఆరా తీసినప్పటికీ, తమకేమ తెలియదని బుకాయించారు. అంజయ్యనగర్ దారిలో వెళ్లే వాహనదారులు, యాకయ్య మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వివరాలు కనుక్కున్న పోలీసులు, భవన యజమానిపై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించడంతో వాస్తవాన్ని అంగీకరించారు. భవనం వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో నిక్షిప్తం అయిన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
క్లబ్ హౌస్‌లు కబ్జా
సాక్షి, సిటీబ్యూరో: నివాసిత సంఘానికి చెందాల్సిన క్లబ్ హౌస్‌లను డెవలపర్లు కబ్జా చేస్తున్నారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ (టీజీ–రెరా) చట్టం ప్రకారం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన మూడు నెలల్లోపు క్లబ్ హౌస్‌ను రెసిడెంట్స్ అసోసియేషన్‌కు అప్పగించాలి. కానీ.. చాలా మంది బిల్డర్లు రెరా నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. అక్రమ మార్గంలో క్లబ్ హౌస్‌లను థర్డ్ పార్టీకి లీజుకు లేదా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో న్యాయం చేయండంటూ నివాసిత సంఘాలు రెరాను ఆశ్రయిస్తున్నాయి.డెవలపర్ల జేబుల్లోకి డబ్బులు..జీఓ 168 ప్రకారం వంద యూనిట్లకు పైగా ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లలో వసతుల కోసం మొత్తం బిల్టప్ ఏరియాలో 3 శాతం లేదా 50 వేల చ.అ. (ఏది తక్కువైతే అది) కేటాయించాలి. క్లబ్ హౌస్‌లో స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా, బాంక్వెట్ హాల్, సూపర్ మార్కెట్ వంటి వసతులు ఉంటాయి. క్లబ్ హౌస్‌ను నివాసిత సంఘానికి రిజిస్ట్రేషన్ చేసి యాజమాన్య హక్కులను అప్పజెప్పాలి. కానీ.. డెవలపర్లు తెలివిగా నివాసితులకు కేవలం క్లబ్ హౌస్‌లోని వసతులను వినియోగించుకునేందుకు సభ్యత్వం ఇచ్చి సరిపెట్టేస్తున్నారు. క్లబ్ హౌస్‌ను థర్డ్ పార్టీకి లీజుకు లేదా విక్రయిస్తున్నారు. ఆయా సొమ్మును డెవలపర్లే జేబులో వేసుకుంటున్నారు.ఒకటే క్లబ్ హౌస్ రెండు ప్రాజెక్ట్‌లకు..రెరా సెక్షన్ 17 ప్రకారం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చిన మూడు నెలల్లోపు డెవలపర్లు వసతుల బ్లాక్‌ను రెసిడెంట్స్ అసోసియేషన్‌కు చట్టబద్ధంగా అప్పగించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ వారు వీటిని అతిక్రమిస్తున్నారు. క్లబ్ హౌస్ బ్లాక్‌ను థర్డ్ పార్టీకి లీజుకు లేదా విక్రయిస్తున్నారు. కొందరు బిల్డర్లు క్లబ్ హౌస్‌ను ప్రాజెక్ట్‌లో ఎక్కడైనా నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ.. థర్డ్ పార్టీకి వినియోగించేందుకు వీలుగా ఉండేలా ప్రధాన మార్గానికి యాక్సెస్ ఉన్న ప్రాంతంలోనే నిర్మిస్తున్నారు. ఒకే క్లబ్ హౌస్‌ను రెండు ప్రాజెక్ట్‌లకు కలిపి వాడుతున్నారు.నిర్వహణ వ్యయం కార్పస్ ఫండ్ నుంచే..అపార్ట్మెంట్ కొనుగోలు సమయంలో కస్టమర్ల నుంచి వసూలు చేసే కార్పస్ ఫండ్‌ను బిల్డర్లు సొంతానికి వినియోగించుకోకూడదు. ఆ సొమ్మును వడ్డీతో సహా అసోసియేషన్‌కు ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరిచి జమ చేయాలి. క్లబ్ హౌస్‌లో రెస్టారెంట్, బార్ వంటి వాణిజ్య సముదాయాలను నిర్మించి, వాటిని థర్డ్ పార్టీకి లీజుకు లేదా విక్రయిస్తున్నారు. క్లబ్ హౌస్ నిర్వహణ వ్యయాన్ని కూడా డెవలపర్లు అక్రమంగా కస్టమర్ల నుంచి వసూలు చేసిన కార్పస్ ఫండ్ నుంచే ఖర్చు చేస్తున్నారు.క్లబ్ హౌస్ యజమానుల హక్కుఇంటి యజమానులకు సౌకర్యాలను వినియోగించుకునే హక్కు ఉంటుంది. డెవలపర్లు కస్టమర్లకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా పూర్తి చేయాలి. వ్యాపార ప్రయోజనాల కోసం క్లబ్ హౌస్ స్థలాలను వినియోగించడం చట్ట విరుద్ధం. ఈ తరహా కేసులలో కస్టమర్లకు న్యాయం జరిగేలా రెరా తగిన చర్యలు తీసుకుంటుంది.– కె.శ్రీనివాస రావు, టీజీ– రెరా సభ్యుడు -
ఆశల రేషన్!
హజ్ యాత్రికులకు ఏ లోటూ రానీయం శివారులో 7.. సిటీలో 11.9రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ బియబానీ సాక్షి, సిటీబ్యూరో: హజ్ యాత్రకు ఏర్పాట్ల ప్రక్రియ ప్రారంభమైంది. యాత్రికులకు ఏ లోటూ రాకుండా అన్ని రకాల వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మౌలానా సయ్యద్ అఫ్జల్ బియబానీ ఖుస్రో పాషా అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల హజ్ సొసైటీలతో నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో జరిగిన సమన్వయ సమావేశం అనంతరం విలేకరుల ఆయన మాట్లాడారు. 2025 హజ్ యాత్ర కోసం ఏర్పాట్లు చేశామన్నారు. 150 మంది యాత్రికులకు ఒక హజ్ సేవకుడు వెళ్తున్నట్లు చెప్పారు. జిల్లా సొసైటీలు యాత్రికులను షెడ్యూల్ ప్రకారం నాంపల్లి హజ్ హౌస్‌కు పంపించాలని ఆయన సూచించారు. హజ్ ఆరాధనలతో పాటు మక్కా, మదీనా నగరాల్లో వసతులు, ప్రయాణ వివరాలు, లగేజ్ తదితర విషయాలు సొసైటీ సభ్యులు యాత్రికులకు అవగాహన కల్పించాలన్నారు. సాక్షి, సిటీబ్యూరో: ‘సంక్రాంతి పండగ తర్వాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు జారీ చేస్తాం’.. అసెంబ్లీ సాక్షిగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన ప్రజాపాలనలో పేద కుటుంబాలు ఆరు గ్యారంటీల పథకాలతో పాటు ప్రత్యేకంగా రేషన్ కార్డుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నాయి. అయినా ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేకుండా పోయింది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే.. అప్పట్లో లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చింది.. ముగిసింది. కానీ.. ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. పేదలు మాత్రం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వం మరోసారి హామీ ఇవ్వడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై ఆశలు చిగురిస్తున్నాయి. ఆన్లైన్ ద్వారానే.. ● పౌరసరఫరాల శాఖ సంస్కరణలో భాగంగా ఆన్లైన్ ద్వారా సేవలు ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్లైన్ లాగిన్ ద్వారానే దరఖాస్తులను స్వీకరించి కొత్త కార్డులను మంజూరు చేస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో ఆహార భద్రత కార్డులుగా మార్పు చేసింది. కొత్త కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి కొద్దికాలం జారీ ప్రక్రియ కొనసాగించింది. ● నాలుగేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల చేసుకునే పౌరసరఫరా శాఖ వెబ్సైట్ ఆన్లైన్ లాగిన్‌ను నిలిపివేసి అప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో కేవలం 40 శాతం మాత్రమే క్లియర్ చేసి మిగతా దరఖాస్తులను తిరస్కరించింది. అప్పటి నుంచి కొత్త కార్డుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా లేకుండాపోయింది. తాజాగా ఆ లాగిన్ పునఃప్రారంభమై గ్రీన్ సిగ్నల్ లభిస్తే దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం 40 లక్షల కుటుంబాలు.. నగరంలో సుమారు 10 లక్షల కుటుంబాలకుపైగా రేషన్ కార్డులు లేవు. సుమారు కోటిన్నర జనాభా ఉన్న భాగ్యనగరంలో దాదాపు 40 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందులో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలు 27.21 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం హైదరాబాద్–రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాలో 17.21 లక్ష కుటుంబాలు మాత్రమే తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. మిగతా కుటుంబాలు రేషన్ కార్డులు లేక వివిధ సంక్షేమ పథకాల వర్తింపు కోసం తల్లడిల్లుతున్నాయి. ● పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ● వణికిపోతున్న నగర వాసులు పెండింగ్‌లో 5.73 లక్షల దరఖాస్తులు ఇప్పటికే సుమారు 5.73 లక్షల కుటుంబాలు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజా పాలనా కార్యక్రమం నిర్వహించగా సుమారు 24 లక్షల 74 వేల 325 కుటుంబాలు వివిధ పథకాల వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అందులో అయిదు గ్యారంటీల కోసం సుమారు 19,01,256 కుటుంబాలు, రేషన్ కార్డు కోసం 5,73,069 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమివ్వండి
సాక్షి, సిటీబ్యూరో: నగరాన్ని చలి వణికిస్తోంది. రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. తెల్లవారుజామున పొగ మంచు రోడ్లను కమ్మేస్తోంది. రాత్రుళ్లు చలి తీవ్రత మరింత పెరుగుతోంది. శివారులో అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయింది. నగరంలో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రత 11.9 డిగ్రీలు నమోదైంది. సగటు కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు మైనస్‌లో పడిపోయింది. ● యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి ● జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చేపట్టిన పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఈ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ సీఈ పనసరెడ్డిలతో కలిసి ఇంజినీరింగ్ పనులపై జోన్ల వారీగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ప్రజా సదుపాయాల దృష్ట్యా చేపట్టిన పనుల్ని నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యాత్మకంగా ఉన్న 141 వాటర్ లాగింగ్ పాయింట్లను తగ్గించేందుకు శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, వచ్చే వర్షాకాలంలోగా సమస్యల్లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు. 125 జంక్షన్ల అభివృద్ధి పనులకు సంబంధించి భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ సమస్యల పరిష్కారానికి ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్, అడ్వర్టైజ్మెంట్, యూబీడీ విభాగాల అధికారులతో అంతర్గత కమిటీ వేసినట్లు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో జోనల్ ఎస్.ఈలు చిన్నారెడ్డి, రత్నాకర్, మహేష్ రెడ్డి, నిత్యానంద్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.