పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ మేనేజర్‌గా సునీల్‌కుమార
సాక్షి, సిటీబ్యూరో: పంజాబ్ నేషనల్ బ్యాంకు హైదరాబాద్ జోనల్ మేనేజర్‌గా సునీల్‌కుమార్ ఛుగ్ మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ నుంచి పదోన్నతిపై జోనల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. సీఏ పూర్తి చేసిన సునీల్‌కుమార్ ఛుగ్ గత 30 ఏళ్లుగా బ్యాంకింగ్ రంగంలో అనుభవం కలిగి ఉన్నారు. అనేక బ్యాంకులకు చెందిన కార్పొరేట్ బ్రాంచ్‌లలో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన నేతృత్వంలో పీఎన్‌బీ హైదరాబాద్ జోన్‌కు ఆయన నియమితులు కావడం వల్ల బ్యాంకు కార్యకలాపాలు మరింత విస్తృతమవుతాయని పీఎన్‌బీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆకాంక్షించారు.


