
ఒక్క వానకే.. వణుకు..
చాదర్‌ఘాట్ రైల్వే బ్రిడ్జి కింద నీటమునిగిన ఆర్టీసీ బస్సు
ఎండల వేడిమితో, వేసవి తాపంతో అల్లాడుతున్న నగర ప్రజలకు ఒక్కసారిగా కురిసిన వాన ఎంతో ఉపశమనాన్నిచ్చినప్పటికీ, రాకపోకలు సాగించేవారికి తీవ్ర ఇబ్బందులు కలిగించింది. మాన్సూన్ యాక్షన్‌ప్లాన్‌ల పేరిట జీహెచ్‌ఎంసీ ప్రకటనలు తప్ప సమ్మర్‌లోని వానకే ప్రజలు అవస్థలు పడ్డారు. వరద నివారణకు తీసుకున్న చర్యలను వాన బట్టబయలు చేసింది. కేసీపీ గెస్ట్‌హౌస్ దగ్గర జలాశయాన్ని నిర్మించినప్పటికీ, ఎప్పటిలాగే రోడ్డు చెరువుగా మారింది. అలాంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ తొలిదశలో రూ. 100 కోట్లతో 50 నిర్మించేందుకు సిద్ధమయ్యారు. 11 ప్రాంతాల్లో 12 నిర్మాణాల పనులు ప్రారంభించారు. వాటి నీటి నిల్వ సామర్ధ్యం 90వేల లీటర్ల నుంచి 10 లక్షల లీటర్లు. వాటిల్లో నాలుగింటి నిర్మాణం మాత్రం పూర్తయింది. మిగతావి గత డిసెంబర్–జనవరిల్లోనే పూర్తిచేస్తామన్నా ఇంకా పూర్తికాలేదు. పూర్తయిన వాటివద్ద సైతం పరిస్థితి మారకపోవడంతో అధికారుల ప్లానింగ్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్షం కురిసిన వెంటనే ఆయా ప్రాంతాల్లో నీటిని తోడివేసేందుకు వెంటనే రంగంలోకి దిగే జీహెచ్‌ఎంసీ బృందాలు ఈసారి చాలా ప్రాంతాల్లో కనిపించలేదు.
బంజారాహిల్స్‌లో నీట మునిగిన బైక్‌లు

ఒక్క వానకే.. వణుకు..

ఒక్క వానకే.. వణుకు..