
మూసీ నదిలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు
కాపాడిన హైడ్రా, జీహెచ్‌ఎంసీ రెస్క్యూ టీం
చైతన్యపురి: చైతన్యపురి డివిజన్ నర్సింహస్వామి ఆలయం సమీపంలో మూసీ నది మధ్యలో ఉన్న శివాలయం వద్ద పనికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో చిక్కుకున్నారు. గురువారం ఆలయం వద్ద దిమ్మకట్టేందుకు వీరయ్యతో పాటు మరో వ్యక్తి వెళ్లాడు. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మూసీలో ప్రవాహం పెరిగి నీటిమట్టం పెరిగింది. నది బయటికి వచ్చేందుకు దారిలేక తెలిసిన వారికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్ రంగానర్సింహ గుప్తా, సరూర్‌నగర్ డిప్యూటి కమిషనర్ సుజాత అక్కడకు చేరుకున్నారు. హైడ్రా, జీహెచ్ ఎంసి రెస్క్యూ టీంను రంగంలోకి దింపి రాత్రి 8 గంటలకు మూసీ మధ్యలో చిక్కుకున్న ఇద్దరిని క్షేమంగా కాపాడారు.

మూసీ నదిలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు