బిర్యానీ తిని భార్యా మృతి.. భర్త పరిస్థితి విషమం | Husband and wife In Food poison | Sakshi

బిర్యానీ తిని భార్యా మృతి.. భర్త పరిస్థితి విషమం

May 3 2025 12:51 PM | Updated on May 3 2025 1:50 PM

Husband and wife In Food poison

భర్త ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం 

పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి సోదరి

రాజేంద్రనగర్‌(హైదరాబాద్‌): ఫుడ్‌ పాయిజన్‌తో తన సోదరి మృతి చెందిందని రాజేంద్రనగర్‌ పోలీసులకు ఓ మహిళ శుక్రవారం ఉదయం ఫిర్యాదు చేసింది. పోలీసుల సమాచారం మేరకు... ఎర్రబోడ ప్రాంతానికి చెందిన రమేశ్‌(48), రాజేశ్వరి(38)లు భార్యాభర్తలు. రమేశ్‌ బాలానగర్‌లోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చే సమయంలో బాలానగర్‌లోని ఓ రెస్టారెంట్‌ నుంచి బిర్యానీ తీసుకొచ్చి అదే రోజు రాత్రి భుజించి నిద్రకు ఉపక్రమించారు. 

తెల్లవారుజాము నుంచి వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. గురువారం రాజేశ్వరి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రమేశ్‌ సైతం అనారోగ్యంతో ఉండటంతో ఉప్పర్‌పల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ఫుడ్‌ ఫాయిజన్‌ కారణంగా తన సోదరి మృతి చెందిన రాజేశ్వరి అక్క శుక్రవారం ఉదయం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement