husband and wife
-
‘పెళ్లాం చెబితే వినాలి'.. ఇది పుష్పగాడి మాటే కాదు..
‘శ్రీవల్లి నా పెళ్లాం. పెళ్లాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో పెపంచకానికి చూపిస్తా’ అని తాజాగా విడుదలైన ‘పుష్ప2’ ట్రైలర్లో హీరో అంటాడు. సానుకూల వివాహ అనుబంధంలో భార్య మాటకు విలువ ఇవ్వడం కుటుంబానికి మంచిది అంటారు నిపుణులు. ‘భార్య మాట వినే భర్త’ను లొంగుబాటుగా చెప్పే పితృస్వామ్య పరంపర ఉన్నా దాని వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు.కుటుంబ జీవనంలో కీలక నిర్ణయాలే కాదు మంచీ చెడూల్లో భార్య సలహా వినదగ్గది. కొన్ని పరిశీలనలు. ఒక వివాహబంధం విజయవంతం కావాలంటే ముందు వినడం నేర్చుకోవాలి’ అంటున్నారు ప్రవర్తనా నిపుణులు. ‘భార్యాభర్తలు మొదట ఎదుటి వారు ఏం చెప్తున్నారనేది ఓపిగ్గా వింటే చాలు ఆ బంధం సగం సఫలమైనట్టే’ అని వారు అంటున్నారు. మన సమాజంలో భార్య మాట వినే భర్త గురించి పరిహాసం ఆడటం ఉంది. ‘భార్యా విధేయుడు’ అంటూ గేలి చేసేవారు కూడా ఉంటారు. సమాజం ఇంత ముందడుగు వేసినా ‘భార్య మాట వినడంలో తప్పు ఏముంది’ అని ఆలోచించే పరిస్థితి లేదు. అమెరికాలో కొత్తగా పెళ్లయిన దాదాపు 130 జంటలను పరిశీలించిన ఒక జాన్ గోట్‌మ్యాన్ అనే సైకాలజిస్ట్ ‘భార్య చెప్పేది సానుకూలంగా వినే భర్త ఉన్న జంటలు సంతోషంగా గడపడం’ గమనించాడు. ‘అలాగని ఈ జంటల్లో భర్త మాట భార్య వినకపోవడం అంటూ లేదు. వారు ఎలాగూ వింటారు’ అంటాడు గోట్ మ్యాన్. భారతీయ సమాజంలో భర్తకు ఎదురు నిలవడం అందరు భార్యలు చేయరు. అయితే జోక్గానో, గొణుగుతున్నట్టుగానో, అనునయంగానో చెప్పే భార్యలు ఉంటారు. ‘అలాంటి భార్యలు చెప్పింది విని ముందుకు సాగే భర్త ఉన్న జంటలు కూడా ఇంచుమించు గొడవలు లేకుండా ఉంటున్నాయి’ అంటాడు గోట్‌మ్యాన్. భార్యాభర్తల్లో ‘అతను చెప్పేది ఏముందిలే’ అని భార్య అనుకున్నా ‘ఆమెకేం తెలుసు ఆమె ముఖం’ అని భర్త అనుకున్నా ఆ వివాహబంధం ప్రమాదంలో పడుతుంది. ఏ వివాహ బంధమైనా ఒకరి దృష్టికోణం నుంచి నడవదు. కాపురంలో తల్లి తరపు వాళ్లు, తండ్రి తరుపు వారు ఉంటారు. స్నేహితులు ఉంటారు. ఇద్దరి వేరు వేరు కెరీర్లు ఉంటాయి. అంటే ఒక సమస్యకు కచ్చితంగా కనీసం రెండు దృష్టికోణాలుంటాయి. భర్తలు కేవలం తమ దృష్టికోణమే సరైనది అనుకోకూడదు. ‘స్త్రీలు జాగ్రత్తగా అన్నీ గమనించి భర్తకు సూచనలు చేస్తారు. ఆ సూచనలను భర్త ఆమెతో చర్చించాలి. నా మాటే నెగ్గాలి అని తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టం ఇద్దరికీ వస్తుంది’ అంటాడు గోట్‌మ్యాన్.భర్త తన స్పందన, అప్పులు, ఇచ్చిన హామీలు, కొన్న/కొనబోయే ఆస్తులు, పిల్లల కోసం పొదుపు, ఆరోగ్య విషయాలు... ఇవన్నీ భార్యకు తెలియచేస్తూ ఆమె సలహాను వినాల్సి ఉంటుంది. అలాగే భర్త ఇంట్లో లేనప్పుడు పిల్లల ప్రవర్తన, వారి కదలికలు, బంధువుల రాకపోకలు వచ్చే డిమాండ్లు ఇవన్నీ భార్య తప్పకుండా భర్తకు చేరవేయాలి. ముఖ్యంగా పిల్లలను కరెక్ట్ చేయాల్సిన అంశాలు భార్య లేవనెత్తినప్పుడు భర్త నిర్లక్ష్యం చేయరాదు.అవి సమస్యలు తెస్తాయి. అందుకే గతంలో స్త్రీల మాట చెల్లుబాటయ్యే సందేశం ఇస్తూ ‘పెళ్లాం చెబితే వినాలి’ లాంటి సినిమాలు వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత ‘ఫైర్’లాంటి పుష్ప కూడా ‘పెళ్లాం మాట వినాలి’ అంటున్నాడు. భార్య సరైన సలహా ఇస్తే దానిని ఎందుకు వినకూడదు చెప్పండి? (చదవండి: హృతిక్ రోషన్ సోదరి సునైనా వెయిట్ లాస్ స్టోరీ: ఏకంగా 50 కిలోలు..!) -
మంచానపడ్డవాణ్ని మామూలు మనిషిని చేస్తే.. మరో పెళ్లి చేసుకున్నాడు!
బొమ్మనహళ్లి: కష్టసుఖాలలో భర్తకు వెన్నంటి ఉండేది భార్య, భర్తకు ఏ కష్టం వచ్చినా తోడుండి ఊరడిస్తుంది. అదే రీతిలో భర్త తీవ్ర అనారోగ్యంగా ఉన్న సమయంలో అతనిని కళ్ళలో పెట్టుకొని చూసుకొన్న భార్యను కాదని మరో మహిళను పెళ్లి చేసుకున్న సంఘటణ మంగళూరులో జరిగింది. వివరాలు.. స్థానిక యువతి సయాజ్ సైజ్వాని అనే యువతికి, మలేషియాలో నివాసం ఉంటున్న వ్యక్తితో 2016లో పెళ్లయింది. రెండేళ్ల తరువాత ఓ ప్రమాదంలో అతనికి పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు.ఈ సమయంలో సైజ్వాని భర్తకు సహాయంగా నిలిచింది. అన్నం తినిపించ డం, మందులు ఇవ్వడం తదితరాల సేవలు చేసే ది. భార్య చేసిన సేవల వలన పూర్తిగా కోలుకున్న భర్త అసలు బుద్ధిని చూపించాడు. భార్యకు విడాకులు ఇచ్చిన అతడు మరో మహిళను వివాహం చేసుకొన్నాడు. సైజ్వాని సోషల్ మీడియా ద్వారా తన మాజీ భర్తకు రెండవ పెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా, అతని కథ తెలుసుకున్న నెటిజన్లు బంగారం లాంటి భార్యను వదులుకొని చాలా పెద్ద తప్పు చేశాడని శాపనార్థాలు పెట్టారు. -
పచ్చని సంసారంలో చిచ్చురేపిన మద్యం
నెల్లూరు (క్రైమ్): పచ్చని సంసారంలో మద్యం చిచ్చు రేపింది. ఉరేసుకుని భార్య, రైలు కింద పడి భర్త ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన నెల్లూరు నగరం ఎన్టీఆర్నగర్లో శనివారం జరిగింది. అభం శుభం తెలియని ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. దంపతులు బలవన్మరణం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఏం జరిగిందో తెలియక మృతుల కుమారులిద్దరూ అటు ఇటూ తిరుగుతూ ఉండడం చూపరులను కంట తడి పెట్టించింది. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన కె. నాగరాజు(23), సురేఖ (19) నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా రు. వారికి మూడేళ్లు, పదకొండు నెలల కుమారులు ఉన్నారు. నాగరాజు మార్బుల్స్, టైల్స్ పనులు చేసుకుంటుండగా, సురేఖ మాగుంట లేఅవుట్లోని ఓ బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు సంతోషంగా సాగుతున్న వీరి కాపురాన్ని మద్యం విచ్ఛిన్నం చేసింది. మద్యానికి బానిసైన నాగరాజు సంపాదించిందతా మద్యానికి ఖర్చు చేయడంతో పాటు అప్పులు చేశాడు. దీంతో కుటుంబ భారం సురేఖపై పడింది. ఆమె తాను సంపాదించిన మొత్తంలో కొంత కుటుంబ పోషణకు ఖర్చు చేసి మిగిలిన దాంతో అప్పులు తీర్చింది. పలుమార్లు మద్యం మానేయమని, అప్పులు చేయొద్దని భర్తను ప్రాధేయపడింది. అయినా అతని తీరులో మార్పు రాలేదు. కొద్ది రోజులుగా పుట్టింటికి వెళ్లి నగదు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో వారి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ నేపథ్యంలో శనివారం నాగరాజు పని నిమిత్తం బయటకు వెళ్లగా సురేఖ తన ఇంట్లోనే ఉరేసుకుంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలు సుకున్న ఆమె తల్లిదండ్రులు గీత, సురేష్ హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకుని ఆమెను కిందకు దించారు. ఆమెను నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సురేఖ మృతి చెందిందని నిర్ధారించారు. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న నాగరాజు హాస్పిటల్ వద్దకు వెళ్లి కన్నీరు మున్నీరయ్యారు. భార్య లేని జీవితం వ్యర్థమంటూ రోదించాడు. ఇక తాను బతకలేనంటూ అక్కడి నుంచి పరుగున వెళ్లి విజయమహాల్ రైల్వే గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం అందరి హృదయాలను కలిచి వేసింది. సురేఖ ఆత్మహత్య ఘటనపై సమాచారం అందుకున్న బాలాజీనగర్ ఎస్ఐ విజయ్‌శ్రీనివాస్, నెల్లూరు తహసీల్దార్ హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి దీప్తి ఫిర్యాదు మేరకు బాలాజీనగర్ ఎస్ఐ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. నాగరాజు ఆత్మహత్య ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త తర్వాత భార్య
బెంగళూరు: ఒక రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమంటే.. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అన్నీ తానై వ్యవహరించడం. కర్నాటకలో ఈ కీలక పోస్టును భర్త తర్వాత భార్య చేపట్టే అరుదైన రికార్డును రజనీష్ గోయల్, శాలినీ రజనీష్ లు దక్కించుకున్నారు. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న రజనీష్ గోయల్ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శిగా శాలినిని నియమిస్తూ కర్నాటక ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. 1989 ఐఏఎస్ బ్యాచ్ టాపర్ అయిన శాలిని గ్రామీణాభివృద్ధిలో పీహెచ్డీ చేశారు. మేనేజ్మెంట్, వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారికతలపై పలు పుస్తకాలు రచించారు. రజనీష్ దంపతులకంటే ముందు కర్నాటకలో మరో జంట కూడా ప్రధాన కార్యదర్శులుగా పని చేసింది. 20 ఏళ్ల కిందట బి.కె.భట్టాచార్య, ఆయన భార్య థెరెసా భట్టాచార్యలు ఇద్దరూ సీఎస్‌లుగా చేశారు. -
తుపాకీతో భార్య కాల్చివేత
మండ్య: ఓ మహిళను ఆమె భర్త తుపాకీతో కాల్చి చంపిన ఘటన కొడగు జిల్లా విరాజపేటె సమీపంలోని బేటోళి గ్రామంలో జరిగింది. బేటోళి గ్రామ పంచాయతీ మాజీ సభ్యురాలు శిల్పా సీతమ్మ (40) అనే మహిళను ఆమె భర్త సి. నాయకండ బోపణ్ణ తుపాకీతో కాల్చి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య చాలా రోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి శిల్పా వేరొకరితో ఫోన్లో మాట్లాడుతుండగా, బోపణ్ణ అడ్డు చెప్పాడు. ఈ విషయమై గొడవ జరగడంతో కసితో రగిలిపోయిన బోపణ్ణ శనివారం ఉదయం ఇంట్లోని సింగిల్ బ్యారెల్ తుపాకీతో భార్య శిల్పాపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించింది. శిల్పా సీతమ్మ 2012 నుంచి 2017 వరకు బేటోళి గ్రామ పంచాయతీ సభ్యురాలిగా పనిచేశారు. జిల్లా ఎస్పీ కే.రామరాజన్, విరాజపేటె గ్రామీణ పోలీసు అధికారులు గ్రామానికి వెళ్లి పరిశీలించి నిందితున్ని అరెస్టు చేశారు. కొడగు జిల్లాలో ఇళ్లలో తుపాకులు ఉంచుకోవడం సాధారణం. దీని వల్ల అప్పడప్పుడు తుపాకీ కాల్పుల ఘటనలు జరుగుతూ ఉంటాయి. -
భర్త పెడ్లర్ భార్య ట్రాన్స్పోర్టర్!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు నుంచి డ్రగ్స్ ఖరీదు చేసుకోవచ్చు, నగరంలో విక్రయిస్తున్న భార్యభర్తల దందాకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్–నాబ్) అధికారులు చెక్ చెప్పారు. ఈ దంపతులుసహా ఐదుగురిని అరెస్టు చేసి, రూ.4 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్ స్వా«దీనం చేసుకున్నట్లు టీఎస్–నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య బుధవారం వెల్లడించారు. అంబర్‌పేటకు చెందిన సయ్యద్ ఫైజల్ పెట్స్ విక్రయిస్తుంటాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ దందా మొదలెట్టాడు. ఇతడిపై గతంలో అంబర్‌పేట, బాలానగర్ ఎక్సైజ్ పోలీసుస్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. కొన్నిసార్లు భార్య ముస్రత్తున్నిస్సా బేగంతో కలిసి ఈ దందా చేయడంతో ఆమె పైనా ఓ కేసు నమోదైంది. జైలుకు వెళ్లివచ్చినా తమ పంథా మార్చుకోలేదు. బెంగళూరుకు చెందిన జునైద్ ఖాన్, డబీర్‌పుర వాసి మహ్మద్ అబ్రార్, రహ్మత్ ఖాన్‌లను తమతో కలుపుకున్నారు. జునైద్ డ్రగ్ సరఫరాలో సహకరిస్తుండగా... మిగిలిన ఇద్దరూ నగరంలో కస్టమర్లను గుర్తించేవారు. పోలీసుల నిఘా పెరిగిందని గుర్తించిన సయ్యద్, వారికి చిక్కకుండా ఉండటం కోసం కొత్త పంథా మొదలెట్టాడు. బెంగళూరు నుంచి డ్రగ్స్ ఖరీదు చేస్తూ పెడ్లర్‌గా మారాడు. కస్టమర్లకు సరఫరా చేయడానికి మస్రత్తున్నిస్సా బేగంను ట్రాన్స్‌పోర్టర్‌గా వాడుతున్నాడు. బెంగళూరుకు వెళ్లి వచ్చా... ఇటీవల బెంగళూరు వెళ్లిన ఈ నలుగురు నిందితులు అక్కడ జునైద్‌ను కలిసి 34 గ్రాముల ఎండీఎంఏ ఖరీదు చేశారు. అనంతరం జునైద్‌తో కలిసి వారు నగరానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీఎస్–నాబ్ అధికారులు బహదూర్‌పుర పోలీసులతో కలిసి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రూ.4 లక్షల విలువైన డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి క్రమం తప్పకుండా డ్రగ్ ఖరీదు చేస్తున్న 19 మంది కస్టమర్లను పోలీసులు గుర్తించారు. ఒక్కో గ్రాము రూ.8 వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ కస్టమర్ల పైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడానికి కృషి చేస్తున్నామన్న పోలీసులు వీటిపై సమాచారం తెలిస్తే 87126–71111 నెంబర్‌కు ఫోన్ చేసి లేదా ( tsnabho& hyd@tspolice. gov. in)కు ఈ–మెయిల్ ద్వారా తెలపాలని కోరారు. ఇలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. -
వధూవరులిద్దరిది ఒకే నక్షత్రం అయితే వివాహం చేయకూడదా..?
కొత్త ఏడాది నేపథ్యంలో పంచాగ శ్రవణం చేస్తాం. ఈ ఏడాది పెళ్లి ఈడు కొచ్చిన పిల్లలకు పెళ్లి చేయదలచుకున్న తల్లిదండ్రలు వాళ్ల గ్రహస్థితి ఎలా ఉందని తెలుసుకుంటారు. ఎలాంటి వరుడని చేస్తే మంచిది, ఏ నక్షత్రం అయితే బెటర్ అని ముందుగా పంచాగంలో చూసుయకోవడం వంటివి చేస్తారు. తరుచుగా అందరిలో వచ్చే అతిపెద్ద సందేహం.. వధువరులిద్దరిది ఒకే నక్షత్రం అయితే చెయ్యొచ్చా? లేదా?. చేస్తే ఏమవుతుంది? ఏయే నక్షత్రాల వారు చేసుకోకూడదు.. వధూవరులు ఒకే నక్షత్రములు రాశిభేదమున్నను ఏకరాశి అయి ఉండి వేరే నక్షత్రములైయున్నను శుభము. అయితే కొన్ని నక్షత్రాల వద్దకు వచ్చేటప్పటికీ..వధువరులిద్దరిది ఒకే నక్షత్రమైతే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. కొందరికైతే అస్సలు పొసగదు. అందువల్లే నక్షత్రం వారి రాశి ఆధారంగా కొన్ని నక్షత్రాలు ఇరువురి ఒకటే అయినా సమస్య ఉండదు. కొన్ని నక్షత్రాల విషయంలో మాత్రం వివాహం చేసే విషయంలో జాగ్రత్తుతు తీసుకోవాల్సిందే అని చెబుతున్నారు. ఇంతకీ ఏయే నక్షత్రాలు వధువరులిద్దదరిది ఒకటే అయినా సమస్య ఉండదు? వేటికి సమస్య అంటే.. రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, విశాఖ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి ఈ ఎనిమిది నక్షత్ర ములలోను వధూవరులు ఏకనక్షత్రము వారైనను వివాహము చేయవచ్చును. అశ్వని, భరణి, ఆశ్లేష, పుబ్బ, స్వాతి, మూల, శతభిషము మధ్యమములు. తక్కిన నక్షత్రములు ఒక్కటైనచో వధూవరులకు హాని కలుగును. 27 నక్షత్రములలో ఏ నక్షత్రము ఏక నక్షత్రము అయినప్పటికీ పాదములు వధూ వరులు ఇరువురుకి వేరువేరుగా ఉన్నచో వివాహం చేయవచ్చు. గ్రహమైత్రి బ్రాహ్మణులకు, క్షత్రియులకు గణకూటమి (దేవ, రాక్షస, మనుష్య గణములు) వైశ్యులకు స్త్రీ దీర్ఘ కూటమి, శూద్రులకు యోని కూటమి (జంతువులు) ప్రధానంగా చూడవలెను. పాయింట్ల పట్టిక చూసినప్పటికీ ఈ కూటములు చూడనిదే ఎటువంటి ప్రయోజనం లేదు. (చదవండి: ఈ కొత్త సంవత్సరం మేష రాశివారికి ఆర్థిక లాభాలు ఉంటాయి) -
భర్త, అత్త వేధింపులతో వివాహిత తీవ్ర నిర్ణయం..! చివరికి..
ఆదిలాబాద్: వివాహిత ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్తకు నిర్మల్ న్యాయస్థానం బుధవారం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు సమన్వయల అధికారి సక్రియనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ పట్టణం శాంతినగర్‌కు చెందిన బైరి లక్ష్మి(25), కడెం మండలం పాతమద్దిపడగ గ్రామానికి చెందిన బైరీ రమేష్‌కు 23 మే 2013న వివాహమైంది. పెళ్లిలో కట్నంగా లక్ష రూపాయలు, తులం బంగారం, మోటార్ సైకిల్ ఇచ్చారు. పైళ్లెన తర్వాత వీరికి ఓ పాప జన్మిచ్చింది. ఆ తర్వాత బైరి రమేష్ అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెతో గ్రామం వదిలి వెళ్లిపోయాడు. నెల రోజుల తరువాత ఆమెను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బైరి లక్ష్మి, తల్లి కౌసల్య కుల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. గ్రామ పెద్దలు బైరి రమేష్‌కు రూ.20వేల జరిమానా విధించారు. కొద్ది రోజుల తర్వాత బైరి రమేష్ భార్యను డబ్బులు నువ్వే కట్టాలని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో లక్ష్మి తల్లి రూ.20వేలు కట్టి నచ్చజెప్పి సంతోషంగా ఉండాలని చెప్పింది. మళ్లీ కొన్ని రోజులకు బైరి రమేష్, ఆయన కుటుంబ సభ్యులు రూ.50వేలు కట్నం తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టారు. దీంతో 23 జూలై 2017వ తేదీ రాత్రి 8గంటల ప్రాంతంలో పాతమద్దిపడగ గ్రామ శివారులోని పొద్దుటూరి నరసింహారెడ్డి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లి కౌసల్య కడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్సై రాము కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం అప్పటి డీఎస్పీ మనోహర్‌రెడ్డికి అప్పగించాడు. డీఎస్పీ కేసు విచారణ అనంతరం చార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరు పరిచాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోద్‌రావు 17మంది సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువు చేశాడు. దీంతో వారికి పైవిధంగా శిక్ష విధిస్తూ.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ తీర్పునిచ్చారు. ఇవి చదవండి: ప్రేమోన్మాదికి బెయిల్ రాకుండా చూడాలి.. -
మరో పెళ్లి చేసుకుంటున్నాడని.. భర్త ఇంటి ఎదుటే భార్య?
నిజామాబాద్: అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు తనకు తెలియకుండా మరో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఓ మహిళ తన భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే కామారెడ్డి పట్టణంలోని భవానీనగర్ కాలనీకి చెందిన వడ్ల కార్తీక్‌కు సిరిసిల్లకు చెందిన శివానితో 2019లో వివాహమైంది. పెళ్లిసమయంలో శివానీ కుటుంబ సభ్యులు కార్తీక్‌కు రూ.5లక్షల నగదుతోపాటు 15తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాగా, గర్భిణీగా ఉన్న శివానీని కార్తీక్ ఆమె తల్లిగారింటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. పాప పుట్టిన తరువాత పెద్ద మనుషుల సమక్షంలో రాజీకుదర్చగా హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. మరో 6 నెలల గడిచిన తరువాత రూ.10 లక్షలు అదనపు కట్నం తేవాలని శివానీని వేధించడం మొదలు పెట్టిన కార్తీక్.. శివానీని మళ్లీ తల్లి గారి ఇంటి వద్ద వదిలేసి వెళ్ళిపోయాడు. వారి మధ్య గొడవలు పోలీస్స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్లాయి. ఈ క్రమంలో కార్తీక్ మరో పెళ్ళికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసుకున్న శివాని.. తన మూడేళ్ల కుమార్తె, తల్లిదండ్రులు, సోదరునితో కలిసి ఆదివారం కామారెడ్డికి వచ్చింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. తమకు కార్తీక్ వచ్చి తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడని శివానీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఇరు కుటుంబాల సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇవి చదవండి: క్యాబ్ డ్రైవర్‌ది హత్యా? ఆత్మహత్యా? -
భార్య హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించిన న్యాయస్థానం!
చిక్కడపల్లి: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు చెప్పింది. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ సీతయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రజని, జి.బాలకృష్ణ దంపతులు బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లో నివాసం ఉండేవాడు. బాలకృష్ణ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో 2013 సెప్టెంబర్ 27న రాత్రి తన భార్య రజనిని కత్తితో పొడిచి హత్య చేశాడు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నాంపల్లి మూడో అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జె.కవిత వాదోపవాదాల అనంతరం బాలకృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్లూరి రామిరెడ్డి వాదనలు వినిపించారు. -
వేధింపులు భరించలేక.. భర్తను హతమార్చిన భార్య
బల్మూర్: మద్యం తాగి నిత్యం వేధిస్తున్న భర్తను కుమారుడితో కలిసి కట్టుకున్న భర్త హతమార్చిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగులలో సోమవారం వెలుగు చూసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఎండి మహమూద్ (45) తాపీమేసీ్త్రగా, భార్య నిరంజన్‌బీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉండగా కుమార్తె వివాహం జరిగింది. మహమూద్ నిత్యం మద్యం తాగొచ్చి ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. ఆదివారం అర్ధరాత్రి కూడా ఘర్షణకు దిగి భార్యపై గొడ్డలితో దాడి చేయగా.. ఆమె ఎదురుతిరిగి కుమారుడు పాషాతో కలిసి అదే గొడ్డలి తీసుకొని కొట్టగా తల, గొంతుకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఖైరున్‌బీ ఫిర్యాదు మేరకు నిరంజన్‌బీ, కుమారుడు పాషాపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. -
భర్తను వదిలేసి చాటింగ్ ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య.. ఆ యువకుడిపై భర్త దాడి!
ఉండవెల్లి: చాటింగ్‌లో పరిచయం పెంచుకుని, యువకుడితో ఓ వివాహిత భర్తను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో వారు తిరిగి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వివాహిత భర్త, మరో ఆరుగురు వారిని పట్టుకుని చితకబాదిన ఘటన పుల్లూరు టోల్‌ప్లాజా సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ ఈరన్న తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా కోవెలకుంట్లకు చెందిన ఇంద్రవతి, అయిజకు చెందిన హరీష్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. కాగా ఇంద్రవతికి ఆన్లైన్ చాటింగ్ ద్వారా కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన హరిచరణ్‌తో పరిచయం పెరిగింది. పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరు ఈ నెల 13వ తేదీన హైదరాబాద్‌కు పరారయ్యారు. వీరు తిరిగి ఆదివారం కర్నూల్‌కు వెళ్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వివాహిత భర్త హరీష్, ఆరుగురు మిత్రులతో కలిసి పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద వారి వాహనాన్ని అడ్డుకుని కర్రలతో దాడి చేశారు. ఘటనలో హరిచరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని వివాహితను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లగా, హరిచరణ్‌ను కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హరిచరణ్ తండ్రి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. -
కుటుంబ కలహాలతో భార్యాభర్తలిద్దరూ తీవ్ర నిర్ణయం! కానీ భర్త?
నల్గొండ: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతిచెందాడు. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండలంలోని కొమ్మాల గ్రామంలో ఈ నెల 12న తేదీన జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాల గ్రామానికి చెందిన భాషపోలు నవీన్(35)ది వ్యవసాయ కుటుంబం. నవీన్‌కు 14 ఏళ్ల కిందట నిర్మలతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు అక్షిత, దీక్షిత ఉన్నారు. నవీన్, నిర్మల మధ్యన చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడడంతో గత రెండేళ్ల నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టగా.. చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడవద్దని ఇద్దరికీ నచ్చజెప్పారు. అయినప్పటికీ అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 12న భార్యభర్తలిద్దరు తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పనులు చేసుకుంటూ అక్కడ కూడా ఘర్షణ పడ్డారు. క్షణికావేశంలో నిర్మల అక్కడే ఉన్న పురుగుల మందు తాగింది. దీంతో తాను కూడా తాగుతానని నవీన్ అక్కడే ఉన్న గడ్డి మందును తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి ఇద్దరిని సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. నిర్మల సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కోలుకుంటుంది. కాగా నవీన్ మృతదేహానికి గురువారం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి వీరస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు అర్వపల్లి ఎస్ఐ బి. అంజిరెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి కూడా చదవండి: పెళ్లి చేసుకుంటానని ఇలా చేశాడు. చివరికి యువతి? -
దంపతుల పోట్లాట దెబ్బకు.. దారి మళ్లిన విమానం!
న్యూఢిల్లీ: భార్యాభర్తల గొడవలంటే ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అయితే ఆ గొడవ దెబ్బకు బుధవారం ఏకంగా ఓ అంతర్జాతీయ విమానాన్నే దారి మళ్లించాల్సి వచ్చింది! మ్యూనిచ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానం ఈ ఘటనకు వేదికైంది. విమానం మ్యూనిచ్ నుంచి బయల్దేరిన కాసేపటికే అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు గొడవ పడ్డారు. భర్తది జర్మనీ కాగా భార్యది థాయ్‌లాండ్. భార్య ఫిర్యాదుతో విమానాన్ని పైలట్ ఢిల్లీ మళ్లించి భర్తను పోలీసులకు అప్పగించారు. అయితే, క్షమాపణలు చెప్పడంతో అతన్ని మరో విమానంలో బ్యాంకాక్ పంపడం కొసమెరుపు! ఇదీ చదవండి: నిజంగా ఇది వింతే మరి.. పెద్దాయన పెద్ద పేగులో ఈగ.. -
నా భర్త మృతికి ఆ ఇద్దరే కారణం: నాయని సరిత
విద్యానగర్(కరీంనగర్): ఇటీవల కోర్టు ఆవరణలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న నాయిని శ్రీనివాస్ మృతికి కరీంనగర్ కార్పొరేటర్ గుగ్లిళ్ల జయశ్రీ– శ్రీనివాస్ దంపతులే కారణమని ఆయన భార్య నాయిని సరిత ఆరోపించారు. కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో బుధవారం మాట్లాడుతూ.. తన భర్త నాయిని శ్రీనివాస్ వద్ద నుంచి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్ ఖర్చుల నిమిత్తం రూ.8.50లక్షలు, మూడున్నర తులాల బంగారం తీసుకున్నట్లు తెలిపారు. తిరిగి ఇమ్మని అడిగితే.. ఇవ్వకపోగా.. తమ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఆ భయంతోనే తన భర్త ఆత్మహత్మ చేసుకున్నాడని వివరించారు. ఈ ఘటనకు కారణమైన కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, ఆమె భర్త శ్రీనివాస్‌పై కరీంనగర్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ అరెస్టు చేయడం లేదని, మంత్రి గంగుల కమలాకర్ అండతోనే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తమ డబ్బు, బంగారం ఇప్పించి, కార్పొరేటర్ జయశ్రీ– శ్రీనివాస్‌ను అరెస్టు చేయాలని కోరారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com. -
చీకటి నీడ!..ఒక బాస్ జంటల మధ్య సాగే థ్రిల్లింగ్ కథ!
వర్షం ధారగా కురుస్తూ రాత్రిని చల్లగా తడుపుతోంది. కన్నీటి వాన నా మనసును బాధతో తడుముతోంది. కొద్దిసేపటికో లేదా మరునాటికో వర్షం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. నా కన్నీరు కూడా అలాగే ఆగిపోతుందేమో. కానీ నా మనసులోని బాధ ఎప్పటికి తగ్గుతుంది? నేను మళ్లీ సాధారణ స్థితికి రాగలనా..! ఎదురుగా కనిపిస్తున్న పిస్తా రంగు వెడ్డింగ్ కార్డుపై గోల్డ్ కలర్లోని ‘మానస వెడ్స్ తరుణ్’ అనే అక్షరాలను చూస్తుంటే నా బాధ రెట్టింపు అవుతోంది. ఇన్ని సంవత్సరాల నా రిలేషన్‌షిప్‌ని ఎలా వదులుకోగలుగుతోంది మానస. ఆ తరుణ్ అనే వాడితో అంత సులువుగా పెళ్లికి ఎలా ఒప్పుకుంది? ఎంత ఆలోచించినా కారణం అంతుబట్టడం లేదు. కార్డు ఇస్తున్నప్పుడు అదే విషయం అడిగాను. ‘చిల్ యార్. తరుణ్‌తో పెళ్ళి అమ్మా..నాన్న, సొసైటీ కోసమే! నా మనసులో నీ స్థానం ఎప్పటిలాగానే పదిలంగా ఉంటుంది. నా పెళ్లి తరువాత కూడా మనం మునుపటిలాగానే కలుసుకుందాం..’ అని ఎంత ఈజీగా చెప్పేసింది. నా మనసులో మానసకు తప్ప మరో మనిషికి చోటు లేదు. కానీ తనెందుకు ఇలా చేసింది! బాల్కనీలోకి వచ్చి సిగరెట్ వెలిగించాను. ఆమె పరిచయం, సాన్నిహిత్యం తరువాత నేనొక అనాథనని మరచిపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒంటరినని తలుచుకుంటే దుఃఖం ముంచుకొస్తోంది. బెడ్ పై వాలి కళ్ళు మూసుకుంటే నిద్ర దరి చేరటం లేదు. నాలుగేళ్ల క్రితం నాటి మా మొదటి పరిచయం గుర్తుకు వచ్చింది. ∙∙ చురుకుగా ఉండటం, సమయస్ఫూర్తి, కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీతో పాటు చూడగానే ఆకర్షించే నా రూపం.. చిన్న వయసులోనే.. పేరున్న కంపెనీలో టీమ్ లీడర్‌గా ఎదగటానికి దోహదపడింది. అది నా రెండో ప్రాజెక్ట్ అనుకుంటా. కొత్తగా ఒక జావా డెవలపర్ అవసరం పడింది. షార్ట్ లిస్ట్ చేసిన ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేసి రిక్రూట్ చేసుకొనే బాధ్యతను నాకు అప్పగించారు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ప్రొఫైల్స్ చూస్తే ముగ్గురూ టాలెంటెడ్ అనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఒక్కొక్కరినీ నా క్యాబిన్లోకి పంపించమన్నాను. మొదట వచ్చిన అమ్మాయిది.. బంగారు వర్ణం. ఒకసారి చూస్తే ఏ మగాడికైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సోయగం. కొన్ని కోడ్స్, ప్రాబ్లెమ్ ఎనాలిసింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేశాక ఎందుకో సంతృప్తి కలగలేదు నాకు. తరువాత వచ్చిన అబ్బాయి ఎన్.ఐ.టి గ్రాడ్యుయేట్. కానీ అతనిలోని కొంచెం నిర్లక్ష్యపు దోరణి నచ్చక రిజెక్ట్ చేశాను. చివరగా వచ్చింది మానస. చామనఛాయ రంగు దేహం.. ఆ కళ్ళలోని మెరుపు సమ్మోహనంగా ఉంది. ‘గుడ్ మార్నింగ్’ అంటూ సన్నని నవ్వు. అదేంటి ఆశ్చర్యంగా ఆ నవ్వు నాలో చక్కిలిగింతలు పెడుతోంది. ఇదేమి వింత! ఇది కరెక్ట్ కాదు కదా అని అనిపించింది. కానీ ఆ పొడవాటి మొహంలోని కాంతి, మెడ దగ్గరి నునుపు నన్ను కళ్ళు తిప్పుకోనివ్వ లేదు. తమాయించుకొని ప్రోగ్రామింగ్ మాడ్యూల్స్ డిస్కస్ చేశా. అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానాలే. ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే ముచ్చటేసింది. ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని చెప్పాను. ‘థాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ. ఈ జాబ్ నాకు రావటానికి మీరే కారణం. మీ గైడెన్స్‌లో పనిచెయ్యటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ మెత్తని స్పర్శకు నా నరనరాల్లో వేల వోల్ట్ల విద్యుత్ ప్రవహించిన అనుభూతి. సర్దుకొని ‘బై ద వే.. నీ డేట్ అఫ్ బర్త్ చూశాను. నువ్వే నా కన్నా ఆరు నెలలు పెద్ద. సో నేను నీ బాస్ అయినప్పటికీ మీరు అనొద్దు. నువ్వు అని సింగిలర్ యూస్ చెయ్యి. నో ప్రాబ్లెమ్’ అన్నాను. కళ్ళతోనే నవ్వింది. ఆ చూపు గుచ్చుకొని నా హృదయంలో తియ్యని అలజడి మొదలయ్యింది. అలా తొలి పరిచయంలోనే తను నాకు బాగా కావాల్సిన వ్యక్తిలా కనిపించింది. తరువాత నుండి ప్రతిరోజు తనను చూడాలనే తహ తహ మొదలయ్యింది. అయితే ఒకటే టీమ్ అయినా ఆఫీస్‌లో ఇద్దరం కలిసి మాట్లాడుకునే టైమ్ అస్సలు ఉండేది కాదు. మీటింగ్స్ కుడా జూమ్‌లోనే అయ్యేవి. కానీ నాకు మాత్రం రోజుకి ఒక్కసారైనా మానసని చూడాలని, చలాకీగా తను మాట్లాడుతుంటే వినాలని అనిపించేది. మానస ఇదేమీ గమనించేది కాదు. నాలో తన పట్ల కలుగుతున్న ప్రేమ పూరిత భావనలు తను కనిపెట్టే అవకాశం అస్సలు లేదు. ‘నువ్వు సిగరెట్లు తగ్గించు. పెదాలు కొంచెం నలుపు రంగులోకి మారేలా కనిపిస్తున్నాయి’ అంది ఒక రోజు. ‘ఇంత అందంగా ఉంటావు. ఆఫీస్‌లో ఇప్పటివరకు ఎవ్వరూ ప్రపోజ్ చెయ్యలేదా నీకు?’ చొరవగా అడిగింది ఇంకో రోజు. ‘నువ్వు మామూలు డ్రెస్‌లో కంటే జీన్స్.. టీ షర్ట్‌లో సూపర్ ఉంటావు’ మరో రోజు కాంప్లిమెంట్. ఎప్పుడూ క్యాంటీన్లోనే తినే నాకోసం అప్పుడప్పుడు తన లంచ్ బాక్స్ షేర్ చేసేది. కొద్ది రోజుల్లోనే ఒక స్నేహితురాలిగా దగ్గరయ్యింది. ఆఫీస్ విషయాలు, ఇంట్లో సంగతులే కాకుండా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేది. ఎప్పుడైనా తను లీవ్ పెడితే ఆ రోజంతా నా మనసు విలవిల్లాడేది. తను పరాయి మనిషి కాదు అని నా కోసమే పుట్టిందేమో అనే తీవ్రమైన భావన నాలో! నేను తనకి ఇంకా దగ్గర అవ్వకముందే మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి మారిపోయింది. మా ఆఫీస్‌లో తన లాస్ట్ వర్కింగ్ డేనాడు వీడ్కోలు పలుకుతున్నప్పుడు నా కళ్ళలోని తడిని చూసి ‘హే.. ఇప్పుడు ఏమైంది? నేను వేరే కంట్రీకి ఏమీ పొవట్లేదు. ఈ సిటీలోనే ఉంటున్నా. ఇంకా చెప్పాలంటే మనిద్దరి ఆఫీస్‌ల మధ్య దూరం పది నిమిషాలే. రెగ్యులర్‌గా టచ్‌లో ఉందాం. ఓకే నా’ అంటూ హగ్ చేసుకొంది. ఆ కౌగిలి తను కాజువల్‌గా ఇచ్చినా అప్పుడు మా రెండు దేహాల స్పర్శలో నేను పొందిన ఆనందం అనిర్వచనీయం. అలారం క్లాక్, మొబైల్ రెండూ ఒకేసారి మోగుతుండగా నిద్ర లేచాను. టైమ్ చూస్తే పది. మానస గురించి ఆలోచిస్తూ లేట్‌గా పడుకున్నానేమో మెలకువ రాలేదు. మొబైల్ చూస్తే తన నుండే కాల్. ‘హలో.. గుడ్ మార్నింగ్ ’ అన్నాను. నా గొంతులో విషాదం నాకే తెలుస్తోంది. ‘హే గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? కమాన్ క్విక్‌గా రెడీ అయ్యి బేగంపేట షాపర్స్ స్టాప్‌కి వచ్చేయ్. చిన్న షాపింగ్. తరుణ్ కూడా వస్తున్నాడు. నువ్వుంటే నాకు బాగుంటుంది’ అని చెప్పేసి ఫోన్ కట్ చేసింది. ఏమనుకుంటుంది ఈ మనిషి అసలు! మా ఇద్దరి మధ్య ఏమీ లేనట్లు ఇంత క్యాజువల్‌గా ఎలా మాట్లాడుతుంది? తరుణ్‌తో షాపింగ్ చెయ్యటానికి నన్నెందుకు రమ్మంటోంది? వాళ్ళిద్దరినీ పక్క పక్కన చూస్తే నేను తట్టుకోగలనా! అలా ఆలోచిస్తూనే రెడీ అయ్యి కిందకి వచ్చి కార్ స్టార్ట్ చేశాను. రాత్రి తగ్గిన వర్షం మళ్ళీ సన్నని తుంపరతో మొదలయ్యింది. కొన్ని జ్ఞాపకాలకు మరణమే ఉండదు. కొన్ని జ్ఞాపకాలు అస్సలు పురుడు పోసుకోవు. డ్రైవ్ చేస్తూ మళ్ళీ పాత జ్ఞాపకాలను వెతుక్కొన్నాను. మొదటిసారి తను నా కార్ ఎక్కటానికి కూడా ఇలాంటి వర్షమే కారణం. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి బయటకు వచ్చేసరికి చిన్న ముసురు. నా కార్ దగ్గరికి వెళ్తూ, నీటి బిందువులతో ఆనందంగా పరవశిస్తున్న చెట్ల ఆకుల సోయగాన్ని చూస్తే ఎందుకో మానస గుర్తుకు వచ్చింది. స్కూటీ పై ఆఫీస్‌కి వచ్చే తను ఈ వర్షంలో ఇంటికి ఎలా వెళ్తుందో అనిపించి మొబైల్ తీసి కాల్ చేశా. నేనేం మాట్లాడక ముందే ‘హే.. హౌ అర్ యూ? ఒక్క మెసేజ్ లేదు, కాల్ లేదు. మర్చిపోయావనుకున్నా బేబీ’ అన్నది గారాలు పోతూ. ఆ గొంతులో ఆ చనువుకి నా వొళ్ళు సంతోషంతో పులకరించింది. ‘ఐ యామ్ గుడ్. వర్షం వస్తుంది కదా ఎలా వెళ్తావు? ఫైవ్ మినిట్స్‌లో వస్తా. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా’ అన్నాను. ‘థాంక్ గాడ్. క్యాబ్ కోసం ట్రై చేస్తుంటే రెస్పాన్స్ రావట్లేదు. కమాన్ తొందరగా వచ్చేయ్. నీతో కబుర్లు చెప్పుకొని చాలా రోజులు అవుతోంది. వెయిటింగ్ ఫర్ యూ..’ అన్న తన మాటలకి కొత్త ఉత్సాహం ఆవరించింది నన్ను. రెడ్ కలర్ చుడీదార్ పై కొన్ని వర్షపు చినుకులు అద్దుకొని మంచి పరిమళాన్ని మోసుకుంటూ వచ్చి కార్లో కూర్చుంది. ఆ కళ్ళు చూస్తేనే మైకం కమ్ముకుంటుంది నాలో. ఎప్పటిలాగానే గలగలా మాట్లాడుతుంటే ముందున్న అద్దంలో మెరిసే తన పెదాలనే చూస్తున్నా. ‘హే.. ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే చల్లటి ఐస్‌క్రీమ్ చప్పరించాలని ఉంది’ అంది. ‘నిజం చెప్పనా! నాకైతే నిన్ను చూస్తూ చిల్డ్ బీర్ కొట్టాలని ఉంది’ అన్నాను. ‘అబ్బా.. నీకెప్పుడూ బోల్డ్ థాట్స్ వస్తాయి.. లెట్స్ డూ ఇట్..’ అంటూ కన్ను గీటింది. తను అలా చేస్తే ఏదో తెలియని థ్రిల్ ఫీలింగ్ కలిగింది నాకు. ‘అయితే చలో నా ఫ్లాట్‌కే పోదాం. ఫ్రిజ్‌లో ఐస్‌క్రీమ్, బీర్ రెండూ ఉన్నాయి’ అంటూ నేను కూడా కన్ను గీటాను కావాలని. ‘డన్..’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాల్కనీలో కూర్చొని, వర్షాన్ని ఆస్వాదిస్తూ తను బటర్ స్కాచ్‌ని, నేను బడ్వైజర్ని రుచి చూస్తున్నాం. ఎలా మొదలు పెట్టాలో అర్థంకావటం లేదు నాకు. డైరెక్ట్‌గా ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోకుంటే భరించలేను. నా గురించి అందరికీ చెపితే ఆ అవమానాన్ని తట్టుకోలేను. బాల్కనీ కుండీల్లో రకరకాల మొక్కలు ఉంటే, వాటివైపు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది మానస. బీర్‌తో పాటు నైట్ క్వీన్ గుబాళింపు ఒక వైపు, మరువం పరిమళం ఇంకో వైపు నాకు మత్తుని కలిగిస్తున్నాయి. ధైర్యం చేసుకొని తన దగ్గరగా వెళ్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను. అదే మెరుపు. నవ్వుతూ నన్ను ఆహ్వానిస్తున్నట్లుగా..చప్పున తన భుజాలు పట్టుకొని ముద్దు పెట్టి ‘లవ్ యూ మానసా..’ అన్నాను. ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోయి నిలుచుంది తను. నా వొంట్లో భయం కలిసిన ఉద్విగ్నత. ‘నీకు ఎందుకు ఇలా అనిపించింది. ఇది కరెక్టేనా?’అని అడిగింది. ముద్దు పెడితే ఏమీ అనకుండా ఆ ప్రశ్న అడగటంతో నాకు ధైర్యం వచ్చింది. ‘కరెక్టో కాదో అన్నది ప్రశ్న కాదు. నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు. నాకు నువ్వు కావాలి. జీవితాంతం నీ తోడు కావాలి’ అన్నాను. అంతే లతలా నన్ను పెనవేసుకొని ‘లవ్ యూ టూ డియర్’ అని నా నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టింది. ఆ క్షణం ఈ ప్రపంచాన్ని జయించిన అనుభూతి కలిగింది నాకు. ఆ రోజు నుండి మా ఇద్దరి ప్రపంచం కొత్తగా మొదలయ్యింది. ఎన్నో కబుర్లు, సినిమాలు, పార్టీలు, అలకలు, ఆనందాలతో జీవితం రంగుల హరివిల్లులా సాగుతూ.. ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఇంకొకరం ఉండలేని ప్రేమలోకంలో విహరించసాగాం. అలా అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఇలా సడన్‌గా తరుణ్‌తో నా పెళ్లి అంటూ వెడ్డింగ్ కార్డు ఇచ్చింది. నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ బేగంపేట్ వచ్చింది. ∙∙ నేను వెళ్లేసరికి వెడ్డింగ్ డ్రెస్ సెలక్షన్లో బిజీగా ఉన్నారు ఇద్దరూ. ‘తరుణ్.. మీట్ మై బాస్ ఇన్ మై ఫస్ట్ జాబ్. అఫ్కోర్స్ ఇప్పుడు మాత్రం తనే నాకున్న ఒకే ఒక్క క్లోజ్ ఫ్రెండ్ అనుకో’ అని నన్ను పరిచయం చేసింది. ఆ మాటకు నా హృదయం భగ్గుమంది. ‘ఎంతకు తెగించావే రాక్షసి. నేను క్లోజ్ ఫ్రెండ్ అంతేనా? ఇంకేమీ కానా? అయినా ఎలా చెపుతావు లే!’అని మనసులో అనుకున్నాను. మొహం మీద బలవంతంగా నవ్వు పులుముకొని ‘హాయ్’ అన్నాను. ఇంకేం మాట్లాడబుద్ధి కాలేదు. వాళ్లిద్దరినీ అలా చూస్తుంటే బాధ, కోపం, కసి, చిరాకు.. మనసంతా చేదుగా అయిపోయింది. మానస లేకుండా నేను అసలు జీవించగలనా! ఎక్కడి నుండి ఊడిపడ్డాడు ఈ ఇడియట్ తరుణ్ గాడు? మమ్మల్ని వేరు చెయ్యటానికే పుట్టినట్లున్నాడు. నాకు వాడంటే అసూయ, అసహ్యం రెండూ కలిగాయి. షాపింగ్ అయిపోయింది. వస్తుంటే ‘మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. ఇది నా నుండి ఇన్విటేషన్’ అన్నాడు తరుణ్. ‘ష్యూర్.. సీ యూ’అని చెప్పి బయట పడ్డాను. మానస ఎప్పటికైనా నాకే సొంతం కావాలి. తను లేకుంటే నాకు చావే దిక్కు అనిపించింది. దేవుడా ఎలాగైనా ఈ పెళ్లి ఆపు అని జీవితంలో మొదటిసారి దేవుడికి మొక్కుకున్నాను. కానీ దేవుడు నా మొర ఆలకించలేదు. వైభవంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది. ఆ రోజు ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. నా కళ్ల ముందు అంతా శూన్యం. ఇంత చేసినా ఆశ్చర్యంగా నాకు మానస మీద కోపం మాత్రం రావట్లేదు. ప్రతిరోజు తన గొంతు వినాలని, తనని చూడాలని అనిపించి పిచ్చెక్కేది. కాల్ చేస్తే జస్ట్ హాయ్, బాయ్ అని రెండు మూడు మాటలు మాట్లాడి ఫోన్ కట్ చేసేది అంతే. ఇప్పుడు నా భవిష్యత్తు గురించి నేనో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అది ఎంత కఠినమయినా కచ్చితంగా ఆచరణలో పెట్టాలని డిసైడ్ అయ్యాను. వాళ్ళ పెళ్ళైన వారం రోజుల తరువాత ఒక రోజు ఉదయాన్నే ఫోన్ చేసింది మానస. ‘హేయ్.. ఏం చేస్తున్నావ్? మరిచిపోయావా మమ్మల్ని? ఈ రోజు నేను ఆఫీస్‌కి వెళ్లట్లేదు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. వచ్చేయ్ ఇంటికి’ అంది. అడ్రస్ అడిగి జుట్టు కూడా సరిగ్గా దువ్వుకోకుండా బయటపడ్డాను. ఎందుకు రమ్మంది? క్యాజువల్గానా లేక ఇంకేదైనా చెప్పటానికా? నాలో అంతులేని ప్రశ్నలు. నేను వెళ్లేసరికి తరుణ్ ఇంకా పోలేదు. రెడీ అయ్యి షూ వేసుకుంటున్నాడు. నన్ను చూసి ఆశ్చర్యంగా ‘అరే చెప్పకుండా వచ్చారు? ముందే చెపితే నేను కూడా లీవ్ పెట్టే వాడిని కదా! ఎనీవే ఆఫ్టర్ నూన్ వచ్చేస్తాను. లంచ్ ముగ్గురం కలిసే చేద్దాం. బాయ్’ అంటూ వెళ్ళిపోయాడు. వీడికి మా ఇద్దరి మీద డౌట్ వచ్చే అవకాశం అస్సలు లేదులే అనుకున్నాను. నన్ను చూస్తూనే గట్టిగా కౌగిలించుకొని ‘మిస్ యూ బేబీ..’ అంటూ ముద్దు పెట్టింది మానస. నాకు ఏడుపు ఆగలేదు. ‘ఎందుకిలా చేశావ్? నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశావ్? నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా?’ నిలదీశాను. నా నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ‘ఇప్పుడేమైంది? నిన్ను దూరం పెట్టను అని చెప్పాగా. నువ్వంటే నాకు ఎప్పటికీ ప్రేమే’ అంది. ‘మరి అలాంటప్పుడు ఆ తరుణ్గాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు?’ కొంచెం కోపంగా అడిగాను. ‘ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకుంటే లోకం ఒప్పుకోదు కాబట్టి. చూడు అమృతా.. నాకు నీ ప్రేమ కావాలి. సోషల్ లైఫ్ కావాలి. అలాగే పిల్లలు కూడా కావాలి. అందుకోసం తరుణ్‌ని పెళ్లి చేసుకున్నాను. కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉంటావు..’ అని చెప్పుకుంటూ పోతోంది. తన నుండి దూరంగా జరిగి ‘ప్రేమంటే రెండు దేహాల కలయిక మాత్రమే కాదు. రెండు మనసుల అపూర్వ సంగమం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు. ఇంకో వ్యక్తికి చోటు ఉండదు. కానీ నువ్వు అలా కాదు. నీది నిజమైన ప్రేమ కాదు’ అన్నాను. ‘అమృతా.. ప్లీజ్ అలా అనకు. నన్నర్థం చేసుకో’ నా చేతులు పట్టుకుంటూ అడిగింది. ‘ఒకే జెండర్ అయినా, జెండర్స్ వేరైనా.. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు మూడో వ్యక్తితో రిలేషన్ అంటే అది మొదటి ప్రేమికుడు లేదా ప్రేమికురాలికి ద్రోహం చేసినట్లే అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే అది మానసిక వ్యభిచారం లాంటిదే’ స్థిరంగా చెప్పాను. ‘అమృతా.. చెప్పానుగా.. సమాజం కోసం.. ఇంకా చెప్పాలంటే మా పేరెంట్స్ కోసమే నేను తరుణ్‌ని పెళ్లి చేసుకుంది. నాకు నువ్వే ప్రాణం’ అంది. ‘నేను నీ ప్రాణమే అయితే నన్నిలా వదిలేసే దానివి కాదు. జీవితాంతం నాకు తోడుగా ఉండేదానివి. నీ కోసం ఎవ్వరినైనా ఎదిరించి బతకటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు? నీది స్వార్థం. నిజమైన ప్రేమకు కావాల్సింది నమ్మకం. అది నీ మీద నాకు ఇప్పుడు లేదు. మళ్ళీ నా జీవితంలో ప్రవేశించాలని చూడకు. గుడ్ బై’ అని చెప్పి బయటకు నడిచాను. --మొగలి అనిల్ కుమార్ రెడ్డి (చదవండి: -
తోడొకరుండిన అదే భాగ్యము!
తోడుండటమే పండు జీవితం. ఏడడుగులతో పడే బంధం. ఏడు జన్మలు కొనసాగాలనుకునే బంధం వైవాహిక బంధం. భార్యకు భర్త.. భర్తకు భార్య.. సంసారాన్ని ఈదాక ఏడు పదుల వయసు దాటాక ఒకరికి ఒకరై మరీ మెలగాలి. తమిళనాడులోని ఒక వృద్ధ జంట మధ్యాహ్న భోజనం తయారు చేసుకునే వీడియో పది లక్షల వ్యూస్ పొందింది. రోజులు కొందరికి కలిసి వస్తాయి. పెళ్లయిన నాటి నుంచే భార్య మనసు భర్తకు అర్థమయ్యి, భర్త స్వభావాలు భార్య అకళింపు చేసుకుని కాపురాన్ని కాపాడుకుంటూ వస్తారు. పిల్లల్ని కని, పెద్ద చేసి ఒక దారికి చేరుస్తారు. ఆ తర్వాత? తామిద్దరూ జీవించాలి. ఏం భయం? ఇప్పటికే ఎంతో జీవితం గడిపారు. కష్టసుఖాలు పంచుకున్నారు. అనుబంధాన్ని దృఢం చేసుకున్నారు. పిల్లలు దూరంగా ఉన్నా హాయిగా జీవిస్తారు. అతను కూరగాయలు తెస్తాడు. ఆమె వంట చేస్తుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కు వెళ్లి వస్తారు. గుళ్లకు తిరుగుతారు. ఓపికుంటే పర్యటనలు చేస్తారు. నేనున్నానని.. నీకై నిలిచే.. తోడొకరుండిన అదే భాగ్యము.. అదే స్వర్గము అని రాశాడు శ్రీశ్రీ. తమిళనాడులో ఒక జంట అలాంటిదే. మధ్యతరగతికి చెందిన ఈ జంట ముదిమి వయసులో కలిసి మధ్యాహ్న వంట చేసుకుంటున్న వీడియోను అభిషేక్ చందరమరక్షణ్ అనే ఇన్‌స్టా యూజర్ పోస్ట్ చేశాడు. తన భార్యతో కలిసి వీడియోలు చేసే అభిషేక్ ఈ వీడియో పోస్ట్ చేస్తూ ‘భవిష్యత్తులో నువ్వూ నేనూ’ అనే క్యాప్షన్ పెట్టాడు. నిజమే.. ఈ వీడియో చూసిన యువ జంటలు ఆ వయసులో తాము అలా ఉంటే ఎంత బాగుంటుంది అని వ్యాఖ్యానించారు. జీవితం పండాలి... అని పెద్దలు అంటారు. పండు వయసులో భార్యకు భర్త; భర్తకు భార్య. (చదవండి: అయ్బాబోయ్... ఇదేం డాన్సండీ!) -
అన్నా చెల్లెళ్ల దారుణ హత్య
తిరుపతి: నగరంలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో అన్నా చెల్లెళ్లు దారుణంగా హత్యకు గురైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అలిపిరి సీఐ అబ్బన్న కథనం మేరకు.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన యువరాజ్, మనీషా దంపతులకు షక్షీమ్(6), ప్రజ్ఞాన్(4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను మేస్త్రీ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఏడాది నుంచి భర్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో దూరంగా ఉండేవారు. అయితే యువరాజ్ 4 రోజుల కిందట తిరుపతి కి చేరుకుని నగరంలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో బస చేశాడు. ఇదే క్రమంలో భార్యకు ఫోన్ చేసి, తిరుపతి కొస్తే మాట్లాడుకుందామని చెప్పా డు. దీంతో మనీషా పిల్లలను తీసుకుని హైదరాబాద్ వర కు రైలులో వచ్చి, అక్కడి నుంచి తన అన్న హర్షవర్దన్‌తోపాటు విమానంలో తిరుపతికి చేరుకుంది. ఆ రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో యువరాజ్ తన భార్య మనీషాతోపాటు ఆమె అన్న హర్షవర్ధన్(25) కూడా దారుణంగా కత్తితో పొడిచి, హత్య చేశాడు. అయితే హత్యకు కారణాలు పలు కోణాల్లో వినిపిస్తున్నాయి. వీరి మధ్య ఆస్తి తగాదాలున్నాయని, యువరాజును హత్య చేస్తే పెద్ద మొత్తంలో ఆస్తి వస్తుందని, అతడిని చంపడానికి వారు తిరుగు తున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. ఈ క్రమంలోనే యువరాజ్ చంపి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. యువరాజ్ అన్నతో మనీషాకు వివాహేతర సంబంధం ఉండడంతో వారి మధ్య గొడవ జరిగినట్లు కూడా తెలిసిందని సీఐ చెప్పారు. అయితే నిజాలు పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉందన్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చామని, వారు వస్తే నిజాలు బయటపడతాయన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించామన్నారు. -
డ్యాన్స్! నువ్వు చేయకపోతే వేరేవాళ్లతో వెళ్లిపోతా..జాగ్రత్త!
‘ఎంత ఇంజినీర్ అయితే మాత్రం.. విస్తరిలో ప్రాజెక్ట్ కట్టాలా?’ అన్నాడు చందర్. గతి తప్పిన ఆలోచనలతో నా చేయి నా ప్రమేయం లేకుండానే విస్తరిలో అన్నాన్ని ఇష్టమొచ్చినట్టు అక్కడక్కడా చిన్నచిన్న ముద్దలుగా పేర్చింది. ప్రతిదాన్నీ కళాదృష్టితో చూసే చందర్కి ఆ ముద్దలు ఇరిగేషన్ ప్రాజెక్టులా కనిపించడంలో తప్పు లేదనిపించింది. దానికి తోడు విస్తరిలో వడ్డించిన పప్పులో పప్పు కన్నా ఎక్కువున్న నీళ్ళు ఆ ముద్దల మధ్య నుండి ఎత్తు నుండి పల్లానికి ప్రవహిస్తున్న తీరు కూడా చందర్ మాటలను సమర్థిస్తున్నట్టుగా ఉంది. ‘అరేయ్.. విజ్జూ..’ అని చందర్ మళ్లీ నా భుజం తట్టడంతో ఊహల్లో నుండి బయటపడ్డ నేను త్వరత్వరగా భోజనం ముగించి అప్పుడే వేసిన పెళ్ళి పందిరి కింద మూలన ఉన్న కుర్చీలో ఒరిగి కూర్చున్నా. చూస్తుండగానే మండుటెండలో కూడా కునుకు పట్టేసింది. నా పక్కన కూర్చుని, పెళ్ళి పందిరి కింద కునుకు తీస్తున్న నాకు నిద్రాభంగం చేస్తూ ‘పొద్దున్నుండి ఎందుకలా ఉన్నావ్?’ అంది నా భార్య శారద. ‘ఏమీ లేదు’ అన్నాన్నేను ఏదో ఉన్నట్టు. ‘ఈ రోజు డాన్స్ చేయాల్సొస్తుందనా!!’ నాకళ్ళల్లోకి చూస్తూ అంది తను. అడ్డంగా తలూపాను ‘కాదు’ అన్నట్టు. వెంటనే ఏదో అర్థం అయినట్టు ‘మన పెళ్ళికి తప్పించుకున్నావ్! మీ చెల్లి పెళ్లికి కూడా నోరు చేసి పక్కకు జరిగావ్. చివరికి నీ కొడుకు మొదటి పుట్టినరోజు.. మీ అమ్మతో నాకు చెప్పించి జారిపోయావ్. కాని రేపు మా తమ్ముడి పెళ్ళి.. ఈరోజు రాత్రి హల్దీలో నేను డాన్స్ చేయాల్సిందే! నేను చేస్తే నువ్వూ నాతో పాటు చేయాలి. ఒకవేళ నువ్ చేయలేదనుకో.. ఆ గుంపులో ఎవడు నా చేయిపట్టుకుని డాన్స్ చేస్తే వాడితో వెళ్ళిపోతా’ అంది శారద నా చెవిలో మెల్లిగా. ఇంతకుముందు అయితే నన్ను డాన్స్ చేయమని అడగడానికి భయపడేది తను. బెదిరిస్తే వింటాడు అనుకుందో లేదా నన్ను బతిమిలాడి విసిగిపోయిందో తెలీదుగాని, నా మనసు చివుక్కుమనేలా మాట్లాడింది ఇప్పుడు. ఏం చెప్పాలో తెలీక ‘సరే’ అన్నాను.. తన కళ్ళల్లోకి చూడకుండా నా కళ్ళల్లో పైకి ఉబికి వస్తున్న నీళ్ళను ఆపుకుంటూ. ఓ రెండు నిమిషాల తర్వాత ‘ఆ అన్నూ కూడా డాన్స్ చేస్తోంది బాబు..’ అంది శారద.. ఫోన్లో ఏదో డాన్స్ వీడియో చూస్తూ. అన్నూ.. నా అక్క కూతురు. తన వయసు రెండు సంవత్సరాలు. రెండు సంవత్సరాల పాపకు చేతనైంది కూడా నీకు చేతగాదా అన్నట్టు ఉన్నాయి శారద చూపులు, మాటలు. నేనేం మాట్లాడలేదు. కొన్నిసార్లు మౌనమే మేలు అనుకుని మౌనంగా ఉండిపోయాను. ఏమీ మాట్లాడకుండా ఉన్నానే గాని, రాత్రి జరగబోయే హల్దీ ఫంక్షన్ గురించిన ఆలోచనలతోనే నా మైండ్ అంతా నిండి పోయింది. ‘ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్లో నేను చేయకున్నా తనొక్కతే డాన్స్ చేస్తుంది. కాని తమ్ముడి పెళ్ళి కాబట్టి ఈసారి నాతో జంటగా చేయాలనుకుని ముచ్చట పడుతోంది. నేను చేస్తే నాతో పాటు చేస్తుంది.. లేకపోతే..’ నా మెదడు ఆ ప్రశ్నను పూర్తిచేయడానికి కూడా ఇష్టపడలేదు. ఉండబట్టలేక, వెంటనే ‘నేను చేయకుంటే ఎవరితో చేస్తావ్?’ అంటూ అడిగాను శారదను. ఓ ఐదుసెకన్ల నిశ్శబ్దం. అడిగానే గాని ఆమె వైపు నేను కూడా చూడలేదు. చూసే ధైర్యం లేదు. తను ఎప్పుడూ నన్ను అనే ‘నువ్వు పిరికివాడివి’ అన్న మాటలు ఇంకోసారి గుర్తొచ్చాయి. ఐదుసెకన్ల తర్వాత ‘నీలాంటి వాడితోనే’ అంది.. ఫోన్లోనే మొహం పెట్టి. ‘నాలా ఉంటాడా!!’ ‘అవును నీలాగే ఉంటాడు. కాని మొహంలో కళ ఉంటుంది. నీలా ఎప్పుడూ ఏదో కొల్పోయిన వాడిలా ఉండడు. నవ్వుతూ ఉంటాడు. నేనేం చెప్పినా కాదనడు.’ ‘నిజమా?’ ‘నీ మీద ఒట్టు బాబు!’ శారద గొంతులో వెటకారం, పెదవులపై ఆపుకుంటున్న నవ్వు. ఆ మాటలతో నేల మీద ఓ కన్నీటి బొట్టు రాలింది. అది నాదే అని నేలతల్లికి కూడా తెలిసినట్టుంది.. ‘నేనైనా నీ పరువు కాపాడుతా’ అన్నట్టు ఓ రెండుసెకన్లలో దాన్ని తనలో కలిపేసుకుని మాయం చేసింది. ‘తమ్ముడితోనా.. ఉహూ అయ్యుండదు.. మరెవరు? ఎప్పుడూ వదినా వదినా అంటూ వెంటతిరిగే కిరణా? అవునేమో.. వాడు డాన్స్ బాగా చేస్తాడు. నాలా కాకుండా అందరితో ఇట్టే కలిసిపోతాడు. మంచి స్టైల్ మెయింటేన్ చేస్తాడు. ఫుల్ పోష్‌గా కనిపిస్తాడు. అన్నింటికీ మించి నాలా పిసినారి కాడు. ఆడవాళ్ళు ఇష్టపడే అన్ని లక్షణాలు ఉన్నాయి వాడిలో. అయితే మాత్రం నా శారు..’ అంటూ నా మెదడు మళ్ళీ తనకు తానే ప్రశ్నలు వేసుకుంది. తన కుడి చేతితో ఎవరి చేయినో గట్టిగా పట్టుకుంది శారు. నా హృదయం తట్టుకోలేక పోయింది. కాళ్ళు ఒక్కసారిగా వణికాయి. ‘నేను పిరికివాణ్ణి కాదు’ అని నాకు నేను చెప్పుకుని. ధైర్యం తెచ్చుకుని తలకొద్దిగా పైకిలేపేసరికి అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాను. శారు ‘వేరేవాడితో వెళ్ళిపోతా’ అన్న మాటలు నా మనసుని ముక్కలు చేస్తే, బాధతో నాకు నేను వేసుకుంటున్న ప్రశ్నలు నా మెదడుని మొద్దుబార్చేశాయి. వెంటనే ఒక్కసారిగా కళ్ళు మూతలు పడ్డాయి. దానికితోడు అస్పష్టంగా కిరణ్ గొంతు మళ్ళీ ‘వదినా.. వదినా’ అంటూ ఎక్కడో వినిపించడంతో.. ఒక్కసారిగా విచక్షణ జ్ఞానం కోల్పయినట్టయింది. కుర్చీలో ఉన్న నాకు, సినిమాలో లాగా చేయి నేలకు తాకించగానే ఏదో రాయిలాంటి ఆయుధం దొరికింది. అంతే ఒక్కసారిగా పిడికిలి బిగించి.. పళ్లుకొరికి ఉన్న శక్తినంతా కూడదీసుకుని ‘రేయ్..’ అంటూ పైకి లేచి చేతిలో ఉన్న రాయిని విసురుగా విసిరేశాను... బరువుగా కళ్ళు తెరిచేసరికి అంతా చీకటి.. ‘నేను శారుని చూసి బాధపడకూడదని నా కాళ్ళు తీసేశారా?’ అతికష్టం మీద అనగలిగాను. ‘అబ్బబ్బ.. డాన్స్ చేయాల్సొస్తుందని ఇంత నాటకాలెందుకురా?’ అంది నా చెల్లి సోని.. రూమ్‌లో లైట్వేస్తూ. నా కాలికి చిన్న కట్టు కనిపించింది. ‘ఏంటీ ఇది?’ అని అడిగితే.. ‘ఏంటా? చూడు ఎంత అమాయకుడిలా అడుగుతున్నావో అన్నయ్యా.. బాగా తిని నీ బావమరిది పెళ్ళి పందిరి కింద కుర్చీలో కూర్చుని.. కుంభకర్ణుడిలా నిద్రపోయావా మధ్యాహ్నం అంతా! అదే వింత అనుకుంటే.. ఇంకో వింతలా వదిన చిన్న డాన్స్ చేయమంటే కళ్ళు మూసుకుని దయ్యం పట్టినట్టు ఏదేదో వాగావ్! ఆ తర్వాత ఇదిగో ఈ రాయితో నీ కాలిని నువ్వే పొడుచుకున్నావ్. నీ పిరికితనంతో మా పరువు తీస్తున్నావ్ రా అన్నయ్యా..’ అంటూ రాయి చూపించింది. అందరూ నన్నే నిందిస్తున్నట్టు అనిపించి తట్టుకోలేకపోయాను. అందుకే ‘నేను ఈరోజు డాన్స్ చేయకపోతే మీ వదిన వేరేవాడితో డాన్స్ చేస్తా అందిరా!’ అన్నాను. ‘అవునా.. ఆ అందగాడి పోలికలు కూడా చెప్పి ఉంటుందే!’ ‘అవును.. నీకేలా తెలుసు?’ ఆశ్చర్యపోయాన్నేను. ‘వాడు నాక్కూడా రెండేళ్ళ నుండి తెలుసు. రా చూపిస్తాను ఆ అందగాడిని!’ అంటూ సోని నన్ను మెల్లిగా వాకిట్లోకి తీసుకెళ్ళింది. వాకిలి మొత్తం రంగురంగుల లైట్లతో మెరిసిపోతుంటే.. డీజే పాటలకు బంధువులు అందరూ ఊగిపోతున్నారు. నా కళ్ళు మాత్రం నా శారు కోసం ఆత్రంగా వెతికాయి. నరాలు తెగే ఉత్కంఠలాగా అనిపించింది. అందరి మొహాలకు పసుపు ఉండడంతో శారుని అంతమంది మధ్యలో గుర్తుపట్టలేక పోయాను. ఇంతలో ‘అదిగో వదిన’ అంటూ సోని గుంపు మధ్యలోకి చేయి చూపించింది. ఆ చేయి వెంబడి చూసిన నాకు.. అదిగో అక్కడ కనిపించింది నా శారు. అందరితో కలిసి నవ్వుతూ.. తన తమ్ముడి పెళ్ళికి ఉత్సాహంగా డాన్స్ చేస్తోంది. కానీ నా దృష్టి తను పట్టుకున్న చేయి వైపు మళ్ళింది. తన కుడి చేతితో ఎవరి చేయినో గట్టిగా పట్టుకుంది శారు. నా హృదయం తట్టుకోలేక పోయింది. కాళ్ళు ఒక్కసారిగా వణికాయి. ‘నేను పిరికివాణ్ణి కాదు’ అని నాకు నేను చెప్పుకుని. ధైర్యం తెచ్చుకుని తలకొద్దిగా పైకిలేపేసరికి అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాను. ‘అదిగో ఆ అబ్బాయే.. వదిన డాన్సింగ్ పార్ట్నర్’ అంది సోని నా రెండేళ్ళ కొడుకుని చూపిస్తూ. అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్ళు.. నోటి నుండి ‘శారు’ అన్న మాట బయటకొచ్చింది. వినిపించినదానిలా నా వైపు చూసిన శారు ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వు ‘ఇంత అమాయకుడివైతే ఎలా బాబు’ అని నన్ను ప్రశ్నిస్తున్నట్టనిపించింది. (చదవండి: Neeraj Chopra: బంగారు బాలుడు.. మన నీరజ్ చోప్రా) -
నువ్వంటే ప్రాణం ప్రియాంక.. లెటర్ రాసి భర్త బలవన్మరణం
ఏలూరు: భార్యాభర్తల మధ్య వివాదాలు ఒక మనిషి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భార్య తరఫు బంధువులు, పోలీసుల వేధింపులు భరించలేక మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి, బంధువులు ఆరోపించారు. దెందులూరు గ్రామానికి చెందిన చెక్క రామ్‌ప్రసాద్ కుమారుడు చెక్క తేజ మూర్తి (26) సోమవారం తెల్లవారుజామున దెందులూరులో రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వద్ద సూసైడ్ నోట్‌ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తేజమూర్తి తల్లి ధర్మ రత్నమాల, పెదనాన్నలు మానేపల్లి ఉదయ్‌భాస్కర్, మానేపల్లి మురళీ, బావమరిది చలంచెర్ల సత్యకిషోర్ సోమవారం మధ్యాహ్నం దెందులూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు ఆరోపణలు చేశారు. మూడు నెలల క్రితం ఏలూరుకు చెందిన ప్రియాంకతో తేజమూర్తికి వివాహం జరిగిందని, వారిద్దరూ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత నెల 26న ప్రియాంక ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో భర్త తేజమూర్తిపై ఫిర్యాదు చేసింది. పెద్దలు మాట్లాడినా, నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ప్రియాంక అంగీకరించలేదని తెలిపారు. విచారణ పేరుతో సీఐ రాజశేఖర్ వేధించారని ఆరోపించారు. కేసు పరిష్కారానికి నెల గడువు ఇవ్వమని అడిగినా తమ మాట వినలేదని వాపోయారు. ఈ మానసిక ఒత్తిడితోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తేజ తల్లి, బంధువులు ఆరోపించారు. సూసైడ్ నోట్లో నిన్ను ప్రేమించానని.. జరగనిది జరిగినటు్ల్ నిందలు వేయడాన్ని తట్టుకోలేకపోతున్నానని భార్యనుద్దేశించి తేజమూర్తి పేర్కొన్నాడు. తన మృతికి ప్రియాంక తండ్రి తవ్వ సత్యనారాయణ, అక్క సౌజన్య, మావయ్య సురేష్ కారణమని రాశాడు. తనకు తగిన న్యాయం చేసే వరకు పోరాడాలని బంధువులను కోరాడు. తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. ఈ సంఘటనలో తేజ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తేజమూర్తి మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి పంపించారు. కేసును రైల్వే ఎస్సై డీ.నర్సింహరావు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నాం ఏలూరు టౌన్: తేజ మూర్తి ఆత్మహత్య ఘటనలో వన్‌టౌన్ సీఐపై ఆరోపణలు వచ్చాయని.. వాస్తవాలపై శాఖాపరమైన విచారణ చేస్తున్నామని, అసత్య ప్రచారాలు చేయవద్దని ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు తెలిపారు. తేజమూర్తి భార్య ఫిర్యాదు మేరకు సీఐ ఇరు పక్షాల కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారని తెలిపారు. సూసైడ్ నోట్లో మృతుడు సీఐ తనను వేధించినట్లు చెప్పలేదన్నారు. చట్టం మేరకే సీఐ విచారణ చేశారని, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భూమి ఆక్రమిస్తున్నారని..
నర్మెట: తమ పట్టాభూమి ఆక్రమణకు గురవుతోందని మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దంపతులు పురుగు మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసు కోవడం కలకలం రేపింది. జనగామ జిల్లా నర్మెట మండలం సూర్యబండతండాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తండాలో ఇరువర్గాల మధ్య కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. 257, 258, 259, 263 సర్వే నంబర్లలో అసైన్డ్ భూమి తో పాటు పట్టాభూమి ఉంది. ఇందులో భూక్య ఈర్యా, మేగ్యా, కిష్ట, మోహిలా సోదరులకు 258 సర్వే నంబర్లో 12.18 గుంటల పట్టాభూమి ఉంది. వీరికి 12 మంది వారసులు ఉన్నారు. మరోవర్గంలో భూక్యా పాపా వారసులు చంద్రు, లక్ష్మా, సకృ, రాములు, జయరాంలకు 257 సర్వేనంబర్ లో పట్టా భూమితో పాటు అసైన్డ్ భూమి ఉంది. కాగా, భూక్య జయరాం.. ఇటీవల హిటాచీతో భూమి చదును చేపట్టడంతో మరో వర్గానికి చెందిన మేగ్యా కుమారుడు భూక్య గురు, జయరాంల మధ్య తగాదా ఏర్పడింది. దీంతో వీరు పోలీసులను ఆశ్రయించగా భూమి సర్వేకు సూచించారు. ఈ నేపథ్యంలో ఈనెల 3న సర్వే నిర్వహించిన అధికారులు 257, 258 సర్వేనంబర్లకు హద్దులు గుర్తించి, 14న పత్రాలు అందిస్తామని చెప్పి వెళ్లినట్లు సమాచారం. అనంతరం ఈ భూమిని పరిశీలించిన పోలీసులు సర్వే రిపో ర్టులు వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని చెప్పినా, జయరాం 258 సర్వేనంబర్‌లో హిటాచీతో భూమి చదును చేయించాడు. దీంతో తమకు న్యాయం జరగదని ఆందోళనకు గురైన భూక్య గురు, సునీత దంపతులు పురుగు మందుతాగడంతో అది గమనించిన తండావాసులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు వీరికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న ఏసీపీ దేవేందర్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. -
పిల్లలను హతమార్చి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి దంపతుల ఆత్మహత్య
మచిలీపట్నంటౌన్: బందరుకోటలో విషాదఛాయలు అలముకున్నాయి. నగరంలోని 21వ డివిజన్ బందరుకోటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండు వీరార్జున వినయ్ (కన్నా) తో పాటు కుటుంబ సభ్యుల మృతదేహాలు శనివారం స్వస్థలానికి చేరుకున్నాయి. కన్నా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడు నెలల నుంచి భార్య, ఇద్దరి కుమార్తెలతో బెంగళూరులో ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం కన్నా భార్య హైమావతి తల్లిదండ్రులు.. ఆమెకు ఫోన్ చేస్తున్నా తీయలేదు. అనుమానం వచ్చిన వారు బెంగళూరులో కుమార్తె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా లోపలి నుంచి దుర్వాసన వస్తుండటంతో సమీపంలోని కడిగోడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్యభర్తలతో పాటు పిల్లలిద్దరూ విగతజీవులుగా కనిపించారు. పిల్లలను హతమార్చి తరువాత భార్యభర్తలు ఉరివేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగానే ఘటనకు పాల్పడ్డారనే చర్చ జరుగుతోంది. వీరికి రెండేళ్ల వయసున్న హనీ, ఎనిమిది నెలల వయసున్న కుమార్తెలు ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరులోని కడిగోడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి మృతదేహాలకు పోస్టుమార్టం చేసి అనంతరం బంధువులకు అప్పగించారు. ఘటనపై కడిగోడి పోలీసులు విచారణ చేస్తున్నారు. -
దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి..
సాక్షి, హైదరాబాద్: తనని మోడల్‌గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేసిన ఓ మహిళకు బ్యూటీ పార్లర్ షాక్ ఇచ్చింది. పొడవాటి కురుల కోసం ప్రయత్నించి ఉన్న జుట్టును పొగొట్టుకుంది. అందం కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ మహిళ అబిడ్స్‌లోని బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది. జుట్టును అందంగా చేస్తానని చెప్పిన బ్యూటిషియన్.. ముందుగా మహిళ హెయిర్ కొంచెం కట్ చేసింది. బాధిత మహిళ అభ్యంతరం చెబుతున్నా విన్నకుండా ఏదో హెయిర్ ఆయిల్ కూడా పూసారు. ఇంటికెళ్లిన తర్వాత ఆ మహిళ జుట్టు మొత్తం ఊడిపోయింది. జుట్టు ఊడిపోయిన భార్యను చూసి భర్త షాక్ అయ్యాడు. అందగా కనిపించాలనుకున్న తన భార్యకు వెంట్రుకలు ఊడిపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆలుమగల మధ్య చిచ్చు పెట్టిన బ్యూటీ పార్లర్‌పై బాధితురాలు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊడిపోయిన జుట్టును పట్టుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: భార్యతోనే స్నేహితుడికి వలపు వల..! చివరికి.. బ్యూటీ పార్లర్ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ, హెయిర్ కలర్ కోసం అబిడ్స్‌లోని న్యూ క్వీన్ బ్యూటీ సెలూన్‌కి వచ్చాను. స్పెషల్ హెయిర్ స్టైల్ చేస్తానని నా హెయిర్ మొత్తం కాలిపోయేలా చేసింది. పార్లర్ నిర్వహకురాలు సొంతంగా తయారు చేసిన హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడతామన్నారు. అది వాడితే పూర్తిగా నా జుట్టు రాలిపోయింది. వాటర్ పెడితే.. దువ్వెనతో దువ్వినా కూడా జుట్టు రాలిపోతుంది. క్వీన్ పార్లర్‌ను వెంటనే సీజ్ చేయాలి’’ అని ఆమె పేర్కొంది. -
రిమ్జిమ్ గిరే సావన్.. ఒక జంట.. ఒక వాన.. ఒక పాట..
వానొస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు? కిటికీలో నుంచి చూస్తారు. బయటకెళ్లకండి అని భార్య అంటుంది. టీ పెట్టమని భర్త అంటాడు. కాని ముంబైకి చెందిన శైలేష్, వందన అనే భార్యాభర్తలు మాత్రం ముంబై రోడ్ల మీద తడవడానికి బయలుదేరారు. ఒకప్పటి‘మంజిల్’ సినిమాలో ‘రిమ్జిమ్ గిరే సావన్’ హిట్ పాటలో ఎలాగైతే అమితాబ్, మౌసమీ చటర్జీ తడుస్తూ తిరిగారో అచ్చు అలాగే తిరిగారు. పాటను షూట్ చేసి వదిలితే వైరలే వైరలు. ఒక జంట. ఒక వాన. ఒక పాట. గతం మళ్లీ వర్తమానం అయ్యింది. నిజ పాత్రలు నటీనటులు అయ్యారు. ముంబై నగర వీధుల్లో ఒక సుందర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. చూసిన ప్రేక్షకులు మురిసిపోయారు. ఆనంద్ మహీంద్ర అంతటి వాడు ట్వీట్ చేసి మెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ లక్షల మంది వీక్షించారు. ఇంతకూ ఏమిటది? రిమ్జిమ్ గిరె సావన్ పాట. రీమేక్ పాట. మంజిల్ సినిమా నుంచి అమితాబ్, మౌసమీ చటర్జీ నటించిన ‘మంజిల్’ (1979) సినిమాకు దర్శకుడు బాసూ చటర్జీ. సినిమా ఓ మోస్తరుగా ఆడినా ‘రిమ్జిమ్ గిరె సావన్’ పాట పెద్ద హిట్. కిశోర్ కుమార్ వెర్షన్, లతా వెర్షన్ ఉంటాయి. లతా వెర్షన్‌ను బాసూ చటర్జీ నిజమైన వర్షంలో తీయాలనుకున్నాడు. ముంబైలో వాన కురుస్తున్న రోజు ఒక చిన్న యూనిట్‌ను పెట్టుకుని సూట్లో ఉన్న అమితాబ్‌ను, చీరలో ఉన్న మౌసమీ చటర్జీని రోడ్ల మీద నడిపిస్తూ పిక్చరైజ్ చేశాడు. ఈ పాట పెద్ద హిట్. సేమ్ ఇదే పాటను ఇన్నేళ్ల తర్వాత ఈ జంట మళ్లీ అభినయించింది. వారి పేర్లు శైలేష్, వందన ముంబైలోని థానేలో నివసించే శైలేష్, వందనలకు పెళ్లయ్యి 26 ఏళ్లు. ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, ఇష్టం. ఈ ఇష్టం ఒక వానరోజున రికార్డు చేద్దామని, అదీ రిమ్జిమ్ గిరే సావన్ పాటలా ఉండాలని శైలేష్ కోరిక. భార్య దగ్గర ఎప్పుడు ప్రస్తావన తెచ్చినా ఆమె సిగ్గుతో ‘నేను చేయనండీ’ అనేది. శైలేష్ పట్టు వీడక ఈ సంగతి తన స్నేహితుడు అనుప్ రింగాన్గవాకర్కు చెప్పాడు. అనుప్ భార్య అంకిత ఇది విని ఉత్సాహపడింది. వాళ్లిద్దరినీ మనిద్దరం వానలో షూట్ చేద్దాం అని చెప్పింది. ఇంకేముంది శైలేష్ అచ్చు మంజిల్ సినిమాలోని సూట్ లాంటిది కుట్టించుకున్నాడు. వందన అలాంటి చీరలోనే నిరాడంబరంగా తయారైంది. మొన్న మొదలైన వానల్లో ఒకరోజు మొత్తం పాటను సేమ్ అవే లొకేషన్లలో తీశారు. పెద్ద హిట్ పాత పాట ఎంత హిట్టో ఈ పాట అంతే హిట్ అయ్యింది. ‘మేము ఇంత రెస్పాన్స్ ఊహించలేదు’ అని శైలేష్ అన్నాడు. ‘మా లొకాలిటీలో మేము సెలబ్రిటీలం అయిపోయాం’ అని చెప్పాడు. దేశవిదేశాల్లో ఈ వీడియోకు ఆదరణ లభించింది. ‘మనసుండాలి గాని ప్రతి సందర్భాన్ని ఆనందమయం చేసుకోవచ్చు’ అని చాలా మంది మెచ్చుకున్నారు. ఈ జంటను చాలామంది డిన్నర్‌కు పిలుస్తున్నారు. అన్నట్టు ‘మంజిల్’ కోసం ఈ పాటను నిజమైన వానలో తీసేప్పుడు అమితాబ్ నడకను అందుకోవడానికి మౌసమీ చటర్జీ పరుగులు తీయాల్సి వచ్చేది. అమితాబ్ కాళ్లు పొడవు కదా. ‘చాలాసార్లు ఆయన మెల్లగా నడిచి బేలెన్స్ చేసేవాడు. షూటింగ్ కోసం చాలాసేపు చీర నానడం వల్ల ఇంటికొచ్చాక దాని రంగు నా ఒంటి మీద అంటుకుపోయింది. వానలో పాట మాకు ఏమీ వినిపించేది కాదు. దూరం నుంచి డైరెక్టర్ కర్చీఫ్ ఆడిస్తే యాక్షన్ అని, మళ్లీ ఆడిస్తే కట్ అని భావించే నటించాం’ అని మౌసమీ చటర్జీ గుర్తు చేసుకుంది. వానలు మనకు అంతగా పడట్లేదు. పడినప్పుడు ఈ పాట చూడండి. -
వివాహేతర సంబంధం: భార్యపై వేడి సాంబార్ పోసిన భర్త
తిరువొత్తియూరు: విల్లుపురం సమీపంలోని తిరువెన్నె నల్లూరులో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భార్యపై భర్త వేడి సాంబార్ పోశాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. విల్లుపురం జిల్లా తిరువైన్నె నల్లూరు సమీపంలోని తడుతొట్ట కొండూరు గ్రామానికి చెందిన ఆరోగ్యస్వామి (40) ప్రొక్లైన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా డు. ఇతనికి కడలూరు జిల్లాకు చెందిన పెరియనాయకి(30)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతనికి ఆరోగ్యసామికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిపై భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో శుక్రవారం వంట చేస్తున్నప్పుడు, భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఆగ్రహించిన ఆరోగ్యసామి వేడి సాంబార్‌ను పెరియనాయకిపై పోశాడు. తీవ్రంగా గాయపడిన పెరియనాయకిని ఇరుగుపొరుగు వారు అంబులెన్స్‌లో ముండియంబాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరువెన్నెనల్లూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.