అర్థరాత్రి షాకింగ్‌ ఘటన.. దంపతులపై దాడి.. మహిళను కారు ఎక్కాలంటూ.. | Youth Attacked Couple In Midnight At Zaheerabad | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి షాకింగ్‌ ఘటన.. దంపతులపై దాడి.. మహిళను కారు ఎక్కాలంటూ..

Published Wed, Dec 7 2022 8:46 PM | Last Updated on Wed, Dec 7 2022 8:50 PM

Youth Attacked Couple In Midnight At Zaheerabad - Sakshi

దంపతులపై దాడి చేస్తున్న యువకులు

జహీరాబాద్‌(సంగారెడ్డి జిల్లా): అర్ధరాత్రి దంపతులు బస్సుదిగి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో యువకులు దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆదివారం రాత్రి పట్టణంలోని శాంతినగర్‌ కాలనీకి చెందిన దంపతులు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బస్టాండ్‌లో బస్సుదిగి కాలినడకన తమ ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో యువకులు వారిని అనుకరిస్తూ బ్లాక్‌రోడ్డులో అటకాయించారు.

కారులో ఎక్కాలంటూ మహిళపై దాడి చేయగా, ఆమె కేకలు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యువకులు తాగిన మైకంలో వారిని అటకాయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎస్‌ఐ శ్రీకాంత్‌ను వివరణ కోరగా దంపతులపై జరిగిన జరిగిన దాడిపై ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితులను అరెస్ట్‌చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
చదవండి: ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement