పొట్టి బట్టలేసుకునే వాళ్లు చావాల్సిందేనంటూ.. | Turkish Man Held For Attacking Woman Wearing Shorts | Sakshi
Sakshi News home page

పొట్టి బట్టలేసుకునే వాళ్లు చావాల్సిందేనంటూ..

Published Mon, Sep 19 2016 11:34 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

పొట్టి బట్టలేసుకునే వాళ్లు చావాల్సిందేనంటూ.. - Sakshi

పొట్టి బట్టలేసుకునే వాళ్లు చావాల్సిందేనంటూ..

ఇస్తాంబుల్: పొట్టి దుస్తులు వేసుకొని వచ్చిందని ఓ యువకుడు బస్సులో ఓ యువతిపై దాడి చేశాడు. పిడిగుద్దులు కురిపించి కాళ్లతో తన్నాడు. ఈ ఘటన ఇస్తాంబుల్లో చోటుచేసుకుంది. దాడికి పాల్పడిన ఆ వ్యక్తిని ఉస్కుదార్ అనే చోట అరెస్టు చేశారు. 'పొట్టి దుస్తులు వేసుకునేవాళ్లంతా తప్పక చచ్చిపోవాల్సిందే' అని గట్టిగా అరుస్తూ ఆగ్రహంతో ఊగిపోతూ నర్సుగా పనిచేస్తున్న యువతి ముఖంపై చేతితో పంచ్లమీద పంచ్లు ఇచ్చి గాయపరిచాడు.

ఆ మహిళ బట్టలు వేసుకునే విధానం చూసి తనకు కోపం వచ్చిందని, ఆమె దుస్తులు సరైన విధంగా లేవని పోలీసులకు తెలిపాడు. అందుకే తాను ఆగ్రహానికి లోనై అలా ప్రవర్తించానని వివరించాడు. ఈ దాడికి పాల్పడిన ఆ యువకుడు ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డులా పనిచేస్తున్నాడు. టర్కీలో మహిళలపై ఇలాంటి దాడులు జరగడం ఇటీవల సర్వసాధారణంగా మారాయి. భర్తలు కూడా కొట్టి చంపుతుండటంవంటి ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement