attacked
-
‘జనసేన వాళ్లమని చెప్పినా చితకబాదారు!’
ఎన్టీఆర్, సాక్షి: పండుగ పూట కూటమి నేతలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. రికార్డింగ్ డ్యాన్యుల ముసుగుతో అశ్లీల నృత్యాలను దగ్గరుండి మరీ ప్రొత్సహిస్తున్నారు. అలాగే బరుల్లో తమ ఆధిపత్యమే కొనసాగేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో దాడులకూ పాల్పడుతున్నారు. అయితే.. కోడి పందేలు కూటమి మధ్య లుకలుకలను బయటపెడుతున్నాయి. బరుల్లో తెలుగు తమ్ముళ్లు(TDP Activists) బరి తెగించేస్తున్నారు. ఎవరూ ముందుకు రాకుండా.. ఉత్త పుణ్యానికే దాడులకు దిగుతున్నారు. అయితే ‘‘ఎందుకు కొడుతున్నారు?’’ అని అడిగినందుకు కర్రలతో మూకుమ్మడి దాడి చేశారు. దాడిని అడ్డుకున్న వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు. దాడిలో ఆరుగురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ ఆరుగురు జనసేన కార్యకర్తలని తేలింది. కంచికచర్ల(Kanchikarla) మండలం గండేపల్లి కోడిపందేల బరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాము జనసేన వాళ్లమని చెప్పిన్నా వినకుండా దుర్భాషలాడుతూ తమను చితకబాదారని బాధితులు వాపోయారు. మరోవైపు తమ కార్యకర్తల పై జరిగిన దాడిపై జనసేన(Jana Sena) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చంద్రబాబు, పవన్‌లు 15 ఏళ్లు కలిసి పొత్తులో ఉందామనుకుంటున్నారు. కానీ టీడీపీ నేతలు అలా ఉండనిచ్చేలా లేరు’’ అని అంటున్నారు. తాజా దాడిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని జనసేన నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో కోడి పందేలు(Rooster Fightings) కూటమి నేతల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. జనసేన, బీజేపీ వాళ్లను టీడీపీ వాళ్లు ముందుకు రానివ్వకపోవడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించిన ఘటనలు.. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఇక.. ఏపీలో సాంప్రదాయ సంబరాల ముసుగులో యధేచ్ఛగా జూద క్రీడలు. కోడిపందాల బరులను ఆదాయ వనరులుగా మార్చేసుకుంటున్నారు కూటమి నేతలు. కోడి పందాల బరుల్లో వాటాల కోసం కూటమి పార్టీ ఎమ్మెల్యేలు తహతహలాడిపోతున్నారు. ఈ క్రమంలో.. తమ అనుచరులను రంగంలోకి దించుతున్నారు. ఏపీలో మునుపెన్నడూ లేనంతగా ఇష్టానుసారంగా బరులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందాల బరుల్లో జూదక్రీడలకు స్పెషల్ ఎరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. పేకాట, గుండాట, లోన బయట , నంబర్ల గేమ్స్ కోసం కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఇక.. జూద క్రీడలకు తోడు మద్యం ఏరులై పారుతోంది. మద్యం కోసం ప్రత్యేకంగా మినీ బార్లు , బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ.. తొలి రెండు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొత్తం.. ఈ పండక్కి జూదం ,మద్యం ద్వారా భారీగా సంపాదించాలని పక్కా ప్రణాళిక వేసుకున్న కూటమి నేతలు.. దానిని అంతే పక్కాగా అమలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. కోడిపందాలు , పేకాట ,గుండాటలు ఆడితే తాటతీస్తామని పండగ ముందు పోలీసులు హెచ్చరికల వరకే పరిమితం అయ్యారు. బరుల వద్ద కనీసం కనుచూపుమేరలో కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కనిపించకపోవడంతో.. కూటమి నేతలతో కుమ్మక్కయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: కోడి పందేల కోసం మహిళా బౌన్సర్లు!! -
ఇద్దరు ఎమ్మార్వోల వీరంగం.. రియల్టర్‌పై దాడి
సాక్షి,చిత్తూరు:మద్యం మత్తులో చిత్తూరులో ఇద్దరు తహసీల్దార్లు వీరంగం సృష్టించారు. తప్పతాగి నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి దిగారు. శివ,ప్రసన్నలు గంగవరం,పెద్దపంజాణి ఇన్ఛార్జ్ తహసీల్దార్లుగా పనిచేస్తున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కృష్ణకుమార్‌పై శివ,ప్రసన్నలు దాడి చేశారు. చిత్తూరులోని ఓ బార్లో శివ,ప్రసన్న,కృష్ణ కుమార్‌లు వేరువేరుగా మద్యం సేవించారు. శివ,ప్రసన్న,కృష్ణ కుమార్ల మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయి.మద్యం తాగేటపుడు మాటా మాటా పెరిగి కృష్ణ కుమార్‌పై శివ,ప్రసన్న దాడి చేశారు. ఈ దాడి వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కృష్ణకుమార్ డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: తెలుగు తమ్ముళ్ల స్వైర విహారం -
AP: ప్రేమోన్మాది ఘాతుకం.. దాడిలో ఇంటర్ విద్యార్థిని మృతి
సాక్షి, నంద్యాల: ఏపీలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ప్రమాదంలో బాధితురాలు మృతిచెందింది. అనంతరం తాను నిప్పంటించుకొని అతడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని తాను ప్రేమిస్తున్నానంటూ రాఘవేంద్ర వేధింపులకు గురిచేశాడు . అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో.. లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లహరి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
వైఎస్సార్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదని ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. వేముల మండలం కొత్తపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఇంట్లో వారు రావడంతో ఆ యువకుడు పరారయ్యారు.పరిస్థితి విషమించడంతో పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉండడంతో పాటు రక్తస్రావం ఎక్కువగా అవుతుండడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం
ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి తరపు న్యాయవాది రమణ్ రాయ్‌పై దాడి జరిగిందని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్(ఇస్కాన్) తెలిపింది.ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ ట్విట్టర్లో ఒక పోస్ట్‌లో ‘దయచేసి అడ్వకేట్ రమణ్ రాయ్ కోసం ప్రార్థించండి. అతను చేసిన ఒకేఒక తప్పు చిన్మయ్ కృష్ణ ప్రభు కోసం కోర్టులో వాదించడం. ఇస్లాంవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారు, ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు’ అని రాశారు.Please pray for Advocate Ramen Roy. His only 'fault' was defending Chinmoy Krishna Prabhu in court.Islamists ransacked his home and brutally attacked him, leaving him in the ICU, fighting for his life.#SaveBangladeshiHindus #FreeChinmoyKrishnaPrabhu pic.twitter.com/uudpC10bpN— Radharamn Das राधारमण दास (@RadharamnDas) December 2, 2024బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు న్యాయవాదులు ఈ ఘటనలను ఖండించారు. కాగా చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాది హత్యకు గురయ్యాడంటూ గత నెలలో సోషల్ మీడియాతోపాటు కొన్ని వార్తా కథనాలలో కనిపించింది. అయితే ఈ ప్రస్తావనలో వచ్చిన లాయర్ పేరు సైఫుల్ ఇస్లాం అని విచారణలో తేలింది. ఆయన ప్రభుత్వం తరపు న్యాయవాది అని, అతను చిన్మోయ్ దాస్ కేసులో పోరాడలేదని సమాచారం.బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి ఇటీవల రంగ్‌పూర్‌లో హిందువులకు మద్దతుగా జరిగిన నిరసనలకు నాయకత్వం వహించారు. ఆ తరువాత గత నెలలో ఢాకాలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతనిపై దేశద్రోహం అభియోగం మోపారు. ఈ నేపధ్యంలో ఢాకా కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుండి, మైనారిటీలపై హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. అలాగే వీటిని నిరసిస్తూ పలు ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌లో చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులు ఇద్దరు అదృశ్యమయ్యారని రాధారమణ్ దాస్ గతంలో ఒక పోస్టులో తెలిపారు. కాగా బంగ్లాదేశ్‌లో హిందువుల అరెస్టులను భారత్ ఖండించింది. హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.ఇది కూడా చదవండి: దూసుకొచ్చిన మృత్యువు -
దాడి చేయబోతే 'దాడి' చేశార్సార్!
-
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువతిపై ఓ యువకుడు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మేఘన తీవ్రంగా గాయపడింది. కాగా, మేఘనపై జరిగిన దాడిలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. రెండు సార్లు నిందితుడిపై ఫిర్యాదు చేసిన కానీ పోలీసులు పట్టించుకోలేదు.మేఘన తలపై బలంగా ఇనుప రాడ్డుతో నిందితుడు నీరజ్ శర్మ దాడి చేశాడు. మేఘన పై దాడి చేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన మరో ఇద్దరిపై కూడా ప్రేమోన్మాది దాడి చేశాడు. బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు వేశారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని కిమ్స్‌కు తరలించారు. -
కొడుకు, కోడలు కలిసి తండ్రిపై దాడి
-
బహ్రాయిచ్‌లో పట్టుబడిన చిరుత
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో జనాలపై దాడి చేస్తున్న చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. దానిని అటవీశాఖ అధికారులు బోనులో బంధించారు. ఆ చిరుత ఒక బాలికతో పాటు వృద్ధురాలిపై కూడా దాడి చేసింది. చిరుత పట్టుబడటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.దీనికిముందు గత సోమవారం అటవీశాఖ అధికారులు ఒక చిరుతను పట్టుకున్నారు. ఇప్పుడు రెండో చిరుతపులిని పట్టుకున్నారు. కతర్నియాఘాట్ అటవీ ప్రాంత పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం ఒక చిరుత 13 ఏళ్ల బాలికపై దాడి చేసి గాయపరిచింది. ఇదేవిధంగా 80 ఏళ్ల రెహమానా ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసింది. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు గ్రామ సమీపంలోని చెరుకు తోటలో బోనును ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికి చిరుత ఆ బోనులో చిక్కింది. పోలీస్ స్టేషన్ హెడ్ హరీష్ సింగ్, రేంజర్ రోహిత్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని, చిరుతను ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కించి, అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు.ఇది కూడా చదవండి: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి -
హర్యానా మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి
జీంద్: హర్యానాలోని జింద్ జిల్లా ఉచన కలాన్‌లో కలకలం చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కాన్వాయ్‌పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం దుష్యంత్ చౌతాలా బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా కొందరు యువకులు వీరంగం సృష్టించారు. అనంతరం దుష్యంత్ కాన్వాయ్ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.ఈ రోడ్ షోలో దుష్యంత్‌తో పాటు ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్రశేఖర్ రావణ్ కూడా పాల్గొన్నారు. ఈ హఠాత్ దాడి హర్యానా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిలో చంద్రశేఖర్ ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దాలు పగిలిపోయాయి. జేజేపీ నేత, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా ఉచన కలాన్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. చంద్రశేఖర్ ఆయనకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. హర్యానాలో అక్టోబర్ 5న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఇది కూడా చదవండి: గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు -
మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు
పట్నా: గత కొంతకాలంగా బీహార్‌లో మద్యం అక్రమ రవాణా కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా మద్యం మాఫియా పోలీసులపై దాడికి దిగింది. బెగుసరాయ్ జిల్లాలోని లాఖో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం మద్యం మాఫియా దాడిలో లాఖో పోలీస్ స్టేషన్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ), సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)తో సహా ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. లాఖో పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అభిషేక్ కుమార్ నేతృత్వంలో పోలీసుల బృందం మద్యం స్థావరాలపై దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. బహద్పూర్ ముషారి తోలా ప్రాంతానికి వెళ్లి, దేశీ మద్యం తయారీలో నిమగ్నమైన కొంతమంది స్థానికుల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో మద్యం మాఫియా పోలీసు బృందంపై రాళ్లు రువ్వింది.ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారని తెలుసుకున్న వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన పోలీసులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: రూ.లక్షన్నర కోట్ల ‘మూసీ’కి లక్షల జీవితాలు బలి -
దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమరావతి: ఏరా లం...కొడకా.. చంపేస్తాను నా కొడకా.. ఏంటి రా నన్ను తిట్టావంట.. చదువుకునే కుర్రాళ్లను రెచ్చగొడతావా.. అంటూ నోటికొచ్చినట్టు బండ బూతులు తిడుతూ ఓ దళిత ప్రభుత్వ వైద్యుడిపై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తన అనుచరులతో కలసి పిడిగుద్దులతో దాడి చేశారు. శనివారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) మైదానంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్వాపరాలిలా ఉన్నాయి. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు శ్రీనగర్‌లో 12 ఎకరాల క్రీడా మైదానం ఉంది.ఇందులో సుమారు 150 గజాల్లో మెడికోల కోసం వాలీబాల్ కోర్ట్æ ఉంది. వైద్య కళాశాల ముందస్తు అనుమతి లేకుండా ఇతరులు క్రీడల కోసం ఆ కోర్టును వినియోగించరాదు. అయితే గత కొంత కాలంగా కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ అనుచరులమంటూ సుమారు 40 మంది యువకులు వాలీబాల్ కోర్ట్‌కు వస్తూ మెడికోలపై గొడవకు దిగుతున్నారు. వైద్య విద్యార్థినులతో పాటు వాకింగ్ కోసం వస్తున్న మహిళలపై తరచూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్‌చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు మెడికోలు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని వైద్య విద్యార్థులు అటు రంగరాయ యాజమాన్యంతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)కి ఫిర్యాదు చేశారు. అనుమతి అడిగి.. అంతలోనే గొడవకు దిగి..తమ అనుచరులను కోర్టులో ఆడుకునేందుకు అనుమతివ్వాలని ఆర్ఎంసీ ప్రిన్సిపాల్, డీఎంఈ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహాన్ని ఇటీవల ఎమ్మెల్యేలు ఇరువురూ ఫోన్లో అడిగారు. అందుకు నరసింహం అభ్యంతరం చెబుతూ.. ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి చెబుతామని వారికి చెప్పారు. ఇంతలో అనుమతి లేకుండానే శనివారం కూటమి ఎమ్మెల్యేల అనుచరులు వాలీబాల్ కోర్టులో ఆటలాడుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపాల్, డాక్టర్ విష్ణువర్ధన్, కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావు, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్‌తో కలసి ఆర్ఎంసీ గ్రౌండ్‌కి చేరుకున్నారు.కోర్టు నుంచి వెళ్లిపోవాలని ఎమ్మెల్యేల అనుచరులకు నచ్చజెప్పగా.. వారు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు కోర్టు ఖాళీ చేసి వెళ్లిపోయాక ఎమ్మెల్యే నానాజీ తన అనుచరులను వెంట బెట్టుకుని గ్రౌండ్‌కు వచ్చి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై బండ బూతులు మొదలుపెట్టి.. ఆ డాక్టర్ ముఖానికి మాస్క్‌ను బలవంతంగా లాగేసి పిడిగుద్దులు కురిపించారు. మరోమారు తన అనుచరులను అడ్డుకుంటే చంపేస్తానని హెచ్చరించి వెళ్లారు. ఆ సమయంలో ఇరు పక్షాలు గొడవకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.నేటి నుంచి జూడాల నిరసన..ఎమ్మెల్యే నానాజీ దౌర్జన్యానికి నిరసనగా ఆదివారం నుంచి విధులు బహిష్కరిస్తామని వైద్యులు, జూడాలు ప్రకటించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహం ఆధ్వర్యంలో వైద్యులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు జరిగిన సంఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంఎల్ఏ నానాజీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆర్ఎమ్సీకి వచ్చి ఇరుపక్షాలతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు వైద్యులు, మెడికోలు ససేమిరా అంటున్నారు. దళిత సంఘాలు ఆర్ఎంసీ గ్రౌండ్స్‌కు చేరుకుని దళిత జాతికి జరిగిన అవమానమంటూ ధర్నాకు దిగారు.క్రిమినల్ కేసు నమోదు చేయాలిడా.ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.జయధీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు. -
మళ్లీ తోడేలు దాడి.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలోని 35 గ్రామాలు నరమాంస భక్షక తోడేళ్ల దాడులతో వణికిపోతున్నాయి. ప్రతిరోజూ తోడేళ్ల దాడులకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి ఇద్దరు చిన్నారులపై నరమాంస భక్షక తోడేలు దాడి చేసింది.ఈ ఘటన బహ్రయిచ్‌లోని మహసీ ప్రాంతంలోని గిర్ధర్ పూర్వా గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి నరమాంస భక్షక తోడేలు ఇద్దరు పిల్లలపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒక చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. మరో బాలిక గాయపడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతోంది.ఐదేళ్ల బాలిక తన అమ్మమ్మతో కలిసి ఇంట్లో మంచంపై నిద్రిస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో తోడేలు ఆమెపై దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. దీంతో ఆ తోడేలు అక్కడి నుంచి పారిపోయి, మరో ఇంట్లోని చిన్నారిపై దాడి చేసింది. ఆ చిన్నారి కూడా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన మహసీ తహసీల్ ప్రాంతంలోని పాంధుయా గ్రామంలో చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా రాత్రివేళ నరమాంస భక్షక తోడేళ్లు దాడులకు దిగుతున్నాయి. -
మరో వైద్యురాలిపై దాడి.. నిందితులు పరార్
దేశంలో ఎక్కడో ఒకచోట వైద్యులపై దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. ఓ వైద్యురాలిపై రోగి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో ఆ వైద్యురాలు గాయపడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈరోజు(ఆదివారం) తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై బీఎంసీ ఎంఏఆర్డీ అసోసియేషన్ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వైద్యురాలిపై దాడి చేసిన వారంతా మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. వీరు ఆమెపై దాడికి పాల్పడిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.కాగా కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన తర్వాత, దేశవ్యాప్తంగా వైద్యులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. తాజాగా సియోన్ ఆస్పత్రిలో జరిగిన ఘటనతో వైద్యుల భద్రతపై మరోసారి పలు సందేహాలు తలెత్తుతున్నాయి. -
Maharashtra: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై దాడి
మహారాష్ట్రలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. థానేలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై దాడి జరిగింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై పేడ, టమోటాలు, గాజులు, కొబ్బరికాయలు విసిరారు. ఈ దాడికి పాల్పడిన 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో రాజ్ ఠాక్రే ర్యాలీపై శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన వ్యక్తులు కిళ్లీలు విసిరారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దరిమిలా మర్నాడు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై పేడ, టమోటాలు విసిరారు. దీంతో రాజ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు ఉద్ధవ్ కాన్వాయ్‌పై దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.వివరాల్లోకి వెళితే ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లాలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం శనివారం ఒక మీటింగ్ నిర్వహించింది. దీనిలో ఉద్ధవ్ ఠాక్రే కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో కొంతమంది ఎంఎస్ఎన్ కార్యకర్తలు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై పేడ, టమోటాలు, గాజులు, కొబ్బరికాయలను విసిరారు.పోలీసు వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం పోలీసులు 20 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ రాజ్ ఠాక్రే వివాదం మొదలయ్యిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. -
తీహార్ జైలులో ఖైదీల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
ఢిల్లీలోని తీహార్ జైలులో మరోమారు గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఖైదీల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. జైలులోని ఫోన్ రూమ్‌లో ఈ గొడవ జరిగింది. లవ్లీ, లావిష్ అనే ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు.వివరాల్లోకి వెళితే లోకేష్ అనే ఖైదీ ఈ దాడికి పాల్పడ్డాడని సమాచారం. లోకేష్ సోదరుని హత్య కేసులో లవ్లీ, లావిష్ జైలులో ఉన్నారు. జైలులోనే దాడికి ప్లాన్ చేసిన లోకేష్ తన సహచరులు హిమాన్ష్, అభిషేక్‌ల సాయం తీసుకున్నాడు. అవకాశం చూసుకున్న లోకేష్, అతని సహచరులు కలసి లవ్లీ, లావిష్‌లపై దాడి చేశారు. గాయపడిన ఖైదీలిద్దరినీ జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఒక ఖైదీని ఆస్పత్రి నుంచి తిరిగి జైలుకు తీసుకువచ్చారు. మరొక ఖైదీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీహార్ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. -
కోఠిలో కలకలం.. ప్రభుత్వ వైద్యుడిపై తోటి డాక్టర్ల దాడి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద కలకలం రేగింది. ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యులు దాడికి పాల్పడ్డారు. దీంతో డీఎంఈ కార్యాలయం ముందు బాధిత వైద్యుడు డాక్టర్ శేఖర్ ఆందోళనకు దిగారు.సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని డీఎంఈకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని.. ఈ జీవో అమలు చేస్తే హైదరాబాద్‌లో పని చేస్తున్న వైద్యులు జిల్లాలకు, జిల్లాలలో పని చేస్తున్న వాళ్లు హైదరాబాద్‌కు 40 శాతం మేర బదిలీలు జరుగుతాయి. ఈ బదిలీ లను అడ్డుకునేందుకు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్, బొంగు రమేష్, రాథోడ్ , వినోద్ కుమార్‌లు కుట్ర చేస్తున్నారని డాక్టర్ శేఖర్ ఆరోపించారు.తాను డీఎంఈకు వినతి పత్రం ఇవ్వకుండా తనను అడ్డుకుని. తనపై దాడి చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ సిటీ లోనే తిష్ట వేశారు. వాటిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నలుగురు వైద్యులపై చర్యలు తీసుకొనేంత వరకు తాను డీఎంఈ కార్యాలయం ముందే బైఠాయిస్తానని వైద్యుడు శేఖర్ చెబుతున్నారు. -
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కో కన్వినర్ ఇంటిపై దాడి
తెనాలి అర్బన్: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా గుంటూరు జిల్లా కో–కన్వినర్ నీలి అజయ్‌కుమార్ ఇంటిపై బుధవారం అర్ధరాత్రి టీడీపీ గూండాలు దాడి చేశారు. నాలుగు గంటలపాటు విధ్వంసానికి పాల్పడ్డారు. ఇంట్లో వస్తువులు, కిటికీల అద్దాలు, పూల కుండీలు ధ్వంసం చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి నందులపేటకు చెందిన నీలి అజయ్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా కో–కన్వినర్. ప్రతిపక్ష పార్టీల విమర్శలను సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టేవాడు. అతనిపై కక్ష పెంచుకున్న కొందరు టీడీపీ గూండాలు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే బెదిరింపులు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం అజయ్ విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొందరు టీడీపీ గూండాలు కారులో అతని ఇంటికి వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో కర్రలు, రోకలి బండలతో కిటికి అద్దాలు పగలకొట్టారు. కిటికీల నుంచి కర్రలు, రాడ్లతో లోపల అందిన వస్తువులను ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలోని వాషింగ్ మిషన్, పూల కుండీలు, వస్తువులను పగులగొట్టారు. దీనిని గమనించిన స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై దౌర్జన్యానికి దిగారు. వారిపై దుర్భాషలాడి, బెదిరించారు. తెల్లవారుజామున 4 గంటల వరకు నాలుగు గంటల పాటు విధ్వంసం కొనసాగినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. -
విజయవాడ: కోర్టు ఆవరణలో దారుణం.. పచ్చ గూండాల అరాచకం
సాక్షి, విజయవాడ: ఏపీలో టీడీపీ శ్రేణుల అరాచకాలు ఆగడం లేదు.. అధికార మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. తాజాగా విజయవాడలోని కోర్టు ఆవరణలోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చమూకలు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై గద్దె రామ్మోహన్ అనుచరులు దాడికి దిగారు.కర్రలు, బీర్ బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆటోలో వెంబడించి టీడీపీ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పవన్, రాజేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.ఎంతమంది తల్లులను క్షోభ పెడతారు..వైఎస్సార్సీపీ కోసం పనిచేసినందుకే తమ పిల్లలపై దాడి జరిగిందని బాధితుల తల్లి మద్దెల మల్లిక అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి అరాచకం జరుగుతోంది. చంద్రబాబు, లోకేష్ ఈ దాడులకు సమాధానం చెప్పాలి. ఎంతమంది తల్లులను క్షోభ పెడతారు. ఎంతమంది మహిళల ఉసురు పోసుకుంటారు. నా బిడ్డల తలలు పగలగొట్టారు.. పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పైకి సౌమ్యంగా కనిపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారని.. దాడులను ప్రోత్సహించే వ్యక్తి అని, బీరు సీసాలు, కర్రలతో మాటు వేసి దాడి చేశారన్నారు. -
‘ఉగ్రదాడి సమయంలో సీట్ల కింద దాక్కున్నాం’
జమ్మూలోని రియాసి జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో నిండిన బస్సుపై శివఖోడిలో జరిగిన ఈ దాడి నుంచి వారణాసికి చెందిన అతుల్ మిశ్రా, అతని భార్య నేహా మిశ్రాలు తెలివిగా తప్పించుకున్నారు.అతుల్ మిశ్రా దంపతులు ఈ దాడి దృశ్యాలను కేవలం 10 అడుగుల దూరం నుంచి ప్రాణాలను ఉగ్గబట్టుకుని చూశారు. ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం నుంచి తప్పించుకునేందుకు బస్సు సీటు కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నామని వీరు ఇతర కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఈ ఘటనలో వీరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.వారణాసిలోని కాలభైరవ ప్రాంతానికి చెందిన అతుల్ మిశ్రా అతని భార్య నేహా మిశ్రాలు మాతా వైష్ణో దేవిని దర్శించుకునేందుకు జమ్మూ వెళ్లారు. ఈ ప్రమాదం అనంతరం వీరిద్దరూ వీడియో కాల్ చేసి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.ఈ దురాగతానికి పాల్పడిన పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అతుల్ తండ్రి రాజేష్ మిశ్రా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కాగా అతుల్, నేహా దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జూన్ ఏడున వారణాసి నుండి జమ్మూకు బయలుదేరి వెళ్లారు. వైష్ణో దేవి దర్శనం అనంతరం శివఖోడి వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకుని, ఇతర ప్రయాణికులతో పాటు బస్సులో తిరిగి వస్తుండగా ఈ ఉగ్ర దాడి ఘటన చోటుచేసుకుంది. దాడి సమయంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు కాలువలో పడింది. -
మణిపూర్ సీఎం కాన్వాయ్‌పై దాడి
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్‌పై సోమవారం అనుమానిత మిలిటెంట్లు దాడి చేశారు. కాంగ్పోక్పి జిల్లాలో జాతీయ రహదారి 37 వద్ద సోమవారం ఉదయం సాయుధ ఈ ఆకస్మికంగా దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు.కాగా జూన్ 6న జిరిబామ్‌కు చెందిన ఓ రైతు హత్యతో అక్కడ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా మారిన ఇక్కడ పరిస్థితులను సీఎం బీరెన్ సింగ్ మంగళవారం సందర్శించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే నేడు సీఎం కాన్వాయ్ ఇంఫాల్ నుంచి జిరిబమ్ జిల్లాకు వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. సెక్యూరిటీ దళాలపై మిలిటెంట్లు పలుమార్లు ఫైరింగ్ జరిపారు. అయితే ఆ దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.అయితే దాడి సమయంలో సీఎం సంఘటన ప్రాంతంలో లేనట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిరిబామ్‌లో వ్యక్తి హత్యతో కొందరు అరాచకవాదులు రెండు పోలీస్ అవుట్‌పోస్టులు, ఫారెస్టు బీట్ కార్యాలయంతోపాటు మేతీ, కుకీ తెగల వారికి చెందిన దాదాపు 70 ఇళ్లను తగలబెట్టారు. ఈ ఘటన అనంతరం మైతీ వర్గానికి చెందిన వందలాది మంది పౌరులు ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారు. -
Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
నంద్యాల, సాక్షి: పోలింగ్ ముగియడంతో జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి!. గత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. సదరు యువకుడ్ని టీడీపీ నేత భూమా అఖిలప్రియ దగ్గర పని చేసే బాడీగార్డుగా గుర్తించగా.. ఏవీ సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తున్నాయి.కిందటి ఏడాది మే నెలలో జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా.. అఖిల ప్రియ వర్గీయులు కొత్తపల్లిరోడ్డులో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆ సమయంలో నిఖిల్ ఆయనపై చేయి చేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇరువురిని ఎన్నికలయ్యేదాకా గొడవపడొద్దని మందలించినట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. ఏడాది తర్వాత నిన్న అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై దాడి జరిగింది. తొలుత కారుతో నిఖిల్‌కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. అయితే దాడికి ఉపయోగించిన వాహనం నంద్యాలకు చెందిందిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. -
ఊరకుక్క దాడిలో చిన్నారి దుర్మరణం
తాండూరు రూరల్: దగ్గర్లోనే పనిచేస్తున్న భర్తకు మంచినీళ్లు ఇచ్చొద్దామని వెళ్లిందా తల్లి. ఇంతలోనే అంత ఘోరం జరిగిపోతుందని ఊహించలేదు. ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఐదు నెలల చిన్నారి రక్తపు మడుగులో కన్పించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శిశువుపై ఊరకుక్క దాడి చేసింది. మెడ, కన్ను భాగంలో కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. వైద్యులు చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగానే బాలుడు మరణించాడు.దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మరోవైపు కోపోద్రిక్తులైన చుట్టుపక్కల ఉండే కార్మికులు కుక్కను కొట్టి చంపేశారు. మంగళవారం ఉదయం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బసవేశ్వర్‌నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. రూరల్ సీఐ అశోక్, ఎస్ఐ విఠల్‌రెడ్డి, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.గదిలో బాలుడు ఒంటరిగా ఉండటంతో..కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన నీలం మధు, మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దుప్పల్లికి చెందిన లావణ్యల వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం సాయినాథ్ పుట్టాడు. కాగా స్టోన్ పాలిషింగ్ పనిచేసే మధు వారం క్రితమే బసవేశ్వర్‌నగర్‌లోని సంగెం కలాన్ గ్రామానికి చెందిన నాగభూషణం పాలిషింగ్ యూనిట్లో చేరాడు. సమీపంలోనే ఓ అద్దె గదిలో దంపతులు నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం చిన్నారిని ఇంట్లో పడుకోబెట్టిన లావణ్య పక్కనే వంద అడుగుల దూరంలో పనిచేస్తున్న మధుకు మంచినీళ్లు ఇవ్వడానికి వెళ్లింది.బాబుకు ఉక్కపోస్తుందని, వెంటనే తిరిగొస్తాను కదా అన్న ఉద్దేశంతో గది తలుపు వేయలేదు. లావణ్య అలా బయటకు వెళ్లగానే పరిసర ప్రాంతంలో తిరుగుతున్న ఓ ఊరకుక్క ఇంట్లోకి చొరబడింది. ఒంటరిగా ఉన్న సాయినాథ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్లుగా సంతానం కోసం ఎదురు చూసి, ఎన్నో మొక్కులు మొక్కగా పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ‘నాన్నా లే నాన్నా’అంటూ లావణ్య రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ నెల 24న తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందని మధు విలపించాడు.అందరూ ఎన్నికలకు వెళ్లడంతో..సాధారణ రోజుల్లో పాలిషింగ్ యూనిట్ సమీపంలోని కార్మికుల గదుల వద్ద సందడి ఉంటుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో చాలావరకు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్లడంతో పెద్దగా మనుషుల అలికిడి లేకుండాపోయింది. దీనికి తోడు మధు కుటుంబం నివాసం ఉంటున్న గది ఒక్కటే విడిగా ఉండటం, పక్కన ఇతర నివాసాలు లేకపోవడంతో కుక్క దాడి చేసేందుకు అవకాశం ఏర్పడింది. -
టీడీపీ నేతల బరితెగింపు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు
సాక్షి, పల్నాడు: జిల్లాలో టీడీపీ నేతలు బరి తెగించారు. తమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసం సృష్టించారు.గురజాల మండలం కొత్త గణేషన్ పాడులో కర్రలు రాళ్లతో వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులు చేశారు. కొత్త గణేషన్‌పాడులో బీసీలపైన టీడీపీ గూండాలు దాడులు చేశారు. సీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదు. -
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
సాక్షి, పల్నాడు జిల్లా: రెంటచింతలలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రెంటచింతల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఉమామహేశ్వర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఉమామహేశ్వర్‌రెడ్డిపై ఒకేసారి 60 మందికిపైగా దాడి చేశారు.ఉమామహేశ్వర్‌రెడ్డి కారును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఉమామహేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు: పిన్నెల్లిటీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దౌర్జన్యాలు, అల్లర్లతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మహిళలపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య. మూడు రోజుల క్రితం నా భార్యపైనా దాడి చేశారు.ఇవాళ రెంటచింతలలో మా నాయకులపై హత్యాయత్నం చేశారని పిన్నెల్లి మండిపడ్డారు.