IndiGo Derosters Woman Pilot After Beating Video Viral - Sakshi
Sakshi News home page

జనం చేత తన్నులు తిన్న వీడియో.. మహిళా పైలట్‌పై ఇండిగో చర్యలు

Published Thu, Jul 20 2023 1:55 PM | Last Updated on Thu, Jul 20 2023 2:02 PM

IndiGo Derosters Woman Pilot After Beating Video Viral - Sakshi

ఢిల్లీ: ఇండిగోకు చెందిన ఓ మహిళా పైలట్‌ను, ఆమె భర్తను కొందరు చితకబాదిన వీడియో నిన్నంతా విపరీతంగా వైరల్‌ అయ్యింది. తమ ఇంట్లో పని చేసే పదేళ్ల చిన్నారిని వేధిస్తున్నారని, శారీరకంగా గాయపర్చానే కారణంతో ఆ చిన్నారి బంధువులే ఆ పని చేశారు. 

అయితే.. ఈ ఘటన వైరల్‌ కావడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సదరు పైలట్‌ను విధుల నుంచి పక్కనపెడుతున్నట్లు ప్రకటించింది. సదరు ఘటనపై దర్యాప్తు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో తాజాగా ఇది చోటు చేసుకుంది. రెండు నెలలుగా ఆ చిన్నారిని వాళ్లు వేధిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక ఆమె భర్త కూడా అదే ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తుండగా.. ఆయన విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. ద్వారకా పోలీస్‌ స్టేషన్‌లో ఆ జంటపై కేసు నమోదు అయ్యింది. 


ఇదీ చదవండి: సెల్‌ఫోన్‌ వాడుతోందని తిడితే.. జలపాతంలో దూకింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement