ఖలిస్తాన్ మద్దతుదారులు యూకేలోని భారత్ హైకమిషన్‌పై దాడి చేసిన ఘటన మరువ మునుపే సుమారు రెండు వేల మంది వేర్పాటు వాదులు భవంతి సమీపంలో నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసనను తెలియజేస్తూ..తగిన చర్యలను తీసుకోవాలని యూకేని కోరింది. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు వేర్పాటువాదుల దాడి యత్నాన్ని విఫలం చేశారు.
ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ మద్దతుదారులకు ప్రతిస్పందనగా అమెరికాలోని శాన్ ప్రావిన్స్‌స్కోలో భారత హైకమిషన్ వెలుపల భారతీయుల బృందం జాతీయ జెండాను, యూఎస్ జెండాను పట్టుకుని ఊపుతూ..వందేమాతరం, భారత్‌మాతాకీ జై అని నినాదాలు చేశారు. మరోవైపు ధోల్ దరువులు కూడా మారుమ్రోగాయి. అదేసమయంలో కొంతమంది నిరసనకారులు దూరంగా ఖలిస్తాన్ జెండాలను ఊపుతూ కనిపించారు.
అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కాగా, శాన్‌ప్రాన్సిస్కోలో భారతీయ కాన్సులేట్‌పై ఒక గుంపు దాడి చేసి భవనం వెలుపల గోడపై ఫ్రీ అమృత్‌పాల్ అని రాసి భారీ గ్రాఫిటీని స్ప్రే చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగడం గమనార్హం. అంతేగాదు అంతకుమునుపు యూఎస్‌లోని భారత్ హైకమిషన్ వెలుపల ఖలిస్తానీ మద్దతుదారులు భారత్ జెండాను తొలగించారు ప్రతిగా పెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసింది. అలాగే భారత్ దీనిపై తీవ్రంగా నిరసించడమే గాక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా ఒక ప్రకటనలో యూఎస్‌ని కోరింది.
#WATCH | United States: Indians gather outside the Indian consulate in San Francisco in support of India's unity pic.twitter.com/tuLxMBV3q0
— ANI (@ANI) March 25, 2023
(చదవండి: ప్రకంపనలు రేపుతున్న ఉత్తర కొరియా ప్రకటన.. సునామీని పుట్టించే..)
Comments
Please login to add a commentAdd a comment