వీరి వీడియోలు క్షణాల్లో వైరల్‌.. టాప్‌-10 భారత యూట్యూబర్లు | top 10 Indian Youtubers who are Ruling the Internet | Sakshi
Sakshi News home page

వీరి వీడియోలు క్షణాల్లో వైరల్‌.. టాప్‌-10 భారత యూట్యూబర్లు

Published Sun, Feb 9 2025 10:54 AM | Last Updated on Sun, Feb 9 2025 11:42 AM

top 10 Indian Youtubers who are Ruling the Internet

యూట్యూబ్‌.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలువురికి ఉపాధి మార్గంగా మారింది. కెమెరాలు, మైకులు పట్టుకుని తిరుగుతూ, అందమైన ప్రకృతిని లేదా జనం తిరుగాడే ప్రాంతాలను చిత్రీకరిస్తూ, యూ ట్యూబ్‌లో వీడియోలు అప​్‌లోడ్‌ చేస్తున్నారు. తద్వారా వారు ఆనందాన్ని అందుకోవడమే కాకుండా, మనకు వినోదాన్ని కూడా పంచుతున్నారు. అలాగే యూట్యూబ్‌ నుంచి ఆదాయాన్ని కూడా అందుకుంటున్నారు. ఇదేకోవలో మన దేశానికి చెందిన 10 మంది యూట్యూబర్లు ఇంటర్నెట్‌ను శాసిస్తున్నారు. వారి జాబితా ఇలా..

అజయ్ నాగర్
అజయ్ నాగర్.. దేశంలో ప్రముఖ యూట్యూబర్‌గా పేరొందారు. 2000 జూన్ 12న హర్యానాలోని  ఫరీదాబాద్‌లో జన్మించారు.  అజయ్‌నాగర్‌ ‘CarryMinati’ అనే యూట్యూబ్‌ ఛానల్ ద్వారా రోస్ట్ వీడియోలు, కామెడీ, గేమింగ్ వీడియోలతో అందరికీ వినోదాన్ని పంచుతుంటారు. ఇతని యూట్యూబ్‌ ఛానల్ నాలుగు కోట్ల పైగా సబ్స్క్రైబర్లున్నారు. "YouTube vs TikTok" వంటి వీడియోలు అజయ్ నాగర్‌కు మరింత ఆదరణను తెచ్చిపెట్టాయి.

ఆశిష్ చంచలానీ
ఆశిష్ చంచలానీ (Ashish Chanchlani) ప్రముఖ కామెడీ క్రియేటర్. ఆయన "Ashchanchlani Vines" అనే యూట్యూబ్ ఛానల్‌తో విపరీతమైన ఆదరణను అందుకున్నారు. 1993 డిసెంబర్ 7న ముంబైలో జన్మించిన ఆశిష్ తన వినోదాత్మక వీడియోలు, స్కిట్స్, హాస్యంతో కూడిన కంటెంట్‌తో యువతలో పాపులర్ అయ్యారు. ఆశిష్ చంచలానీ ఛానల్ మూడు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను  అందుకుంది. ఆశిష్ తన వీడియోలలో సాధారణ పరిస్థితులను కూడా వినోదాత్మకంగా చూపించి, జనాలకు నవ్వు తెప్పించే ప్రయత్నం చేస్తుంటారు.

భువన్ బామ్
భువన్ బామ్.. ఇతనొక  కామెడీ కంటెంట్‌ క్రియేటర్. ఆయన "BB Ki Vines" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదరణ పొందారు. 1994 సెప్టెంబర్ 22న న్యూఢిల్లీలో జన్మించిన భువన్, తన వినోదాత్మక వీడియోలు, స్కిట్స్‌తో యువత అభినందనలు అందుకుంటున్నారు. ఈ ఛానల్ రెండు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. భువన్ తన వీడియోల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతపై సరదా కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు.

అమిత్ భదానా
అమిత్ భదానా (Amit Bhadana).. ప్రముఖ కంటెంట్ క్రియేటర్. కామెడీ వీడియోలను చేయడంలో ముందుంటారు. ‘Amit Bhadana’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయ్యారు. 1999 జూలై 7న న్యూఢిల్లీ లో జన్మించిన అమిత్, తన వీడియోలలో హాస్యంతోపాటు రోజువారీ జీవితం, సామాన్య పరిస్థితులు, కుటుంబ సంబంధాలు తదితర విషయాలపై  వినోదాత్మక కంటెంట్ అందిస్తుంటారు.

సందీప్ మహేశ్వరి
సందీప్ మహేశ్వరి.. ఈమె భారతీయ పారిశ్రామిక దిగ్గజం. మోటివేషనల్ స్పీకర్, ఎంట్రప్రెన్యూర్. 1975 సెప్టెంబరు 28న న్యూఢిల్లీ లో జన్మించిన సందీప్, "Sandeep Maheshwari" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు పలు అంశాలలో స్ఫూర్తి అందిస్తుంటారు. మహేశ్వరి తన వీడియోలలో జీవితంలో సానుకూలత, మనోభావాల నియంత్రణ మొదలైన అంశాల గురించి చెబుతూ యువతకు సన్మార్గాన్ని చూపిస్తుంటారు.

గౌరవ్ చౌధరి
గౌరవ్ చౌధరి (Gaurav Chaudhary) టెక్నికల్ క్రియేటర్.  "Technical Guruji" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా టెక్నాలజీ, గాడ్జెట్లు, నూతన ఆవిష్కరణలు, రివ్యూ, టిప్స్ , ట్రిక్స్ తెలియజేస్తుంటారు. 1995 అప్రిల్ 7న రాజస్థాన్‌లో జన్మించిన గౌరవ్ టెక్నికల్ విషయాలను  శరళమైన భాషలో అందిస్తుంటారు. టెక్నికల్‌ గురూజీ ఛానల్ రెండు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను పొందింది.

నిశ్చయ్ మల్హన్ 
నిశ్చయ్ మల్హన్ (Nischay Malhan), Triggered Insaan పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతున్నారు. 1995 నవంబర్ 3న న్యూఢిల్లీలో జన్మించిన నిశ్చయ్, తన వీడియోల్లో రోస్టింగ్, కామెడీ, మీమ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈయన ఇతర క్రియేటర్లపై చేసిన పంచ్‌లు పాపులర్ అయ్యాయి.

హరిష్ బెనివాల్
హరిష్ బెనివాల్  ప్రముఖ  కామెడీ క్రియేటర్. ఆయన "Harish Beniwal" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదరణ పొందారు. హరిష్ తన వీడియోల్లో ప్రధానంగా కామెడీ స్కిట్స్, హాస్యభరిత కంటెంట్‌ను చూపిస్తుంటారు. 1996లో జన్మించిన హరిష్, తన వినోదాత్మక వ్యవహారశైలితో యువతను ఆకట్టుకుంటున్నారు.

సమయ్ రైనా
సమయ్ రైనా.. కామెడీ క్రియేటర్,  స్ట్రీమర్. ఆయన "Samay Raina" అనే ఛానల్  పాపులర్ అయ్యారు. సమయ్  పలు రోస్ట్ వీడియోలు, కామెడీ స్కిట్స్,  లైవ్ స్ట్రీమింగ్‌తో యువతను అలరిస్తుంటారు. 1996లో జమ్ము కశ్మీర్‌లో జన్మించిన సమయ్, తన ఇన్స్పిరేషనల్, సరదా వీడియోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నెటిజన్లకు మంచి వినోదం అందించేందుకు ‍ప్రయత్నిస్తుంటారు.

నిషా మధులిక
నిషా మధులిక.. ప్రముఖ భారతీయ  ఫుడ్‌ కంటెంట్ క్రియేటర్. ‘Nisha Madhulika’ అనే ఛానల్ ద్వారా పాపులర్ అయ్యారు. ఇందులో ఆమె ఇండియన్ వంటకాల తయారీని వివరంగా చూపిస్తుంటారు. 1963లో జన్మించిన నిషా తన వీడియోలలో సులభంగా వంటలు చేసుకునే విధానాన్ని చెబుతుంటారు. నిషా మధులిక ఛానల్ కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆహార ప్రియులు నిషా మధులిక ఛానల్‌ను ఫాలో చేస్తుంటారు. 

ఇది కూడా చదవండి: ‘ఆప్‌’ ఓటమితో పంజాబ్‌లో వణుకు.. సీఎంకు ముచ్చెమటలు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement