
అసలు పేరు ఫైసల్ ఖాన్. టీచర్, యూట్యూబర్. ఖాన్ సర్, ఖాన్ సర్ పట్నాగా పాపులర్. సొంతూరు.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. అలహాబాద్ యూనివర్సిటీలో సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేశాడు. 2019లో ‘ఖాన్ జీఎస్ రీసెర్చ్ సెంటర్’ పేరుతో యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేశాడు.
స్కూళ్లు, కాలేజీలు బంద్ అయిన కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో అకడమిక్స్‌ని టీచ్ చేస్తూ ఖాన్ చేసిన వీడియోలు ఇటు యూట్యూబ్‌లో అటు ఇన్‌స్టాలో వైరలై అతనికి బోలెడంత మంది ఫాలోవర్స్‌ని.. సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించి పెట్టాయి. ఎంతటి కష్టమైన, క్లిష్టమైన సబ్జెక్ట్‌ని అయినా అరటి పండు మింగినంత అలవోకగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఖాన్ సర్ యూఎస్‌పీ. అందుకే అతని యూట్యూబ్ చానెల్‌కి స్టూడెంట్సే కాదు వరుణ్ ధవన్ లాంటి సినిమా యాక్టర్స్ కూడా సబ్‌స్క్రైబర్సే!
సోషల్ మీడియాలోనే కాదు సోషల్ యాక్టివిటీస్‌లోనూ ఖాన్ సర్ ఫస్టే! స్కూల్‌కి వెళ్లలేని పేద పిల్లలకు ఫ్రీగా టీచ్ చేస్తాడు. ఆర్థికావసరాల్లో ఉన్న వాళ్లకు తనకు తోచిన హెల్ప్ చేస్తాడు. యూట్యూబ్ ద్వారా ఖాన్ సర్ నెలకు 15 లక్షల రూపాయలు సంపాదిస్తాడని అంచనా! ఆర్జనే కాదు సాయమందించే మనసూ ముఖ్యమే అని ప్రూవ్ చేస్తున్నాడు ఖాన్ సర్!
ఇవి చదవండి: Pooja Singh: పూజా సింగ్ టు.. రింకీ దూబే.. బై శాన్వికా..!
Comments
Please login to add a commentAdd a comment