Famous
-
Sunandha Mala Setti: స్వర్ణగిరిని సందర్శించిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
అనుసృజన
అను పెళ్లకూరు.. ఫ్యాషన్ రంగంలో బాగా వినబడే పేరు. ఫ్యాషన్‌పై ఆమెకున్న పిచ్చి పద్దెనిమిదేళ్ల వయసులోనే మిస్ యూఏఈ ఫైనలిస్ట్ కోసం దుస్తులను డిజైన్ చేసే కాంట్రాక్ట్‌ను తెచ్చిపెట్టింది. కేవలం రూ. పదిహేను వేలతో అద్భుతమైన మూడు డిజైన్స్‌ను అందించి, అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు, తన పేరును ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్స్ జాబితాలో చేర్చుకుంది.ఫ్యాషన్‌పై ఉన్న ప్యాషన్‌తో ఇంటర్ అయిపోయిన వెంటనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయింది అను. కానీ, ఆ రంగంలో ఆచరణాత్మక అనుభవం చాలా ముఖ్యమని గ్రహించింది. దాంతో తరగతులకు హాజరవక.. కాలేజ్ డ్రాప్ అవుట్‌గా మిగిలింది. తన అభిరుచిని గైడ్‌గా తలచి, అనుభవాన్ని పాఠాలుగా మలచుకుంది. సోదరుడు సూర్య సహకారంతో ‘ఎస్ అండ్ ఏ (సూర్య అండ్ అను)’ పేరుతో ఓ మల్టీ డిజైనర్ స్టోర్‌ను ప్రారంభించింది. మరోవైపు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి దుస్తులను డిజైన్ చేయడం మొదలుపెట్టింది. అలా పాపులారిటీ సంపాదించుకోవడంతోపాటు తన డిజైన్స్ సెలబ్రిటీల కంట పడేలా చేసుకుంది. అది వర్కవుట్ అయి.. సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసే చాన్స్ కొట్టేసింది. నిహారిక కొణిదెల, రుహానా శర్మ, వితికా షేరు, రెజీనా కసాండ్రా, ఈషా రెబ్బ, వైష్ణవి చైతన్య వంటి సెలబ్రిటీలందరికీ అను పెళ్లకూరు ఫేవరిట్ డిజైనర్ అయింది. ఆ ప్రోత్సాహంతోనే ‘తనాషా’ పేరుతో సొంత బ్రాండ్‌ను స్థాపించింది. అంతేకాదు, ఇటీవల ప్రతిష్ఠాత్మక బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో ‘స్వర్ణిరహ’ పేరుతో తన లేటెస్ట్ కలెక్షన్స్‌ను ప్రదర్శించి.. ప్రశంసలు అందుకుంది. ఆ ఈవెంట్‌కు గ్లామర్‌ను జోడిస్తూ ప్రఖ్యాత నటీమణులు శ్రియా సరన్, మృణాల్ ఠాకూర్ షో స్టాపర్స్‌గా ర్యాంప్ వాక్ చేశారు. అటు సంప్రదాయం, ఇటు ఆధునిక శైలి రెండింటి మేళవింపుగా ఉండే ఆమె డిజైన్స్‌కు స్థానికంగానే కాదు, అంతర్జాతీయంగానూ గుర్తింపు లభించింది. దుబాయ్, శ్రీలంక, సింగపూర్ దేశాల్లో జరిగిన పలు ఫ్యాషన్ షోస్‌లో అను తన డిజైన్స్‌ను ప్రదర్శించింది.అనుభవాన్ని మించిన గురువు ఉండరు. అది నాకు చాలా నేర్పింది. మొదట్లో ఎన్నో సవాళ్లను, ఇంకెన్నో అవమానాలను ఎదుర్కొన్నా. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందని నమ్మాను. అదే నిజమైంది.– అను పెళ్లకూరు. -
క్రేజీ.. డీజే..
అర్ధరాత్రి సమయం..చిమ్మ చీకట్లని. పట్ట పగలుగా మార్చే రంగురంగుల విద్యుత్ కాంతుల్లో.. ఓ వైపు ఛీర్స్‌తో హుషారు.. మరోవైపు చిందుల జోరు.. ఆ సమయంలో తోడు లేకుండా అమ్మాయిలు బయటకు వెళ్లడమే సరికాదని నొక్కి వక్కాణించే సంప్రదాయ వాదుల చెవులకు చిల్లులు పడే సంగీతంతో కదం తొక్కుతున్నారు ఆధునిక యువతులు. డీజేలుగా.. మేల్ డామినేషన్‌కు గండికొడుతూ శరవేగంగా ముందుకు దూసుకొస్తున్నారు. ‘మనసుకు నచ్చిన సంగీతం.. వయసుకు తగ్గ వినోదం.. మంచి ఫ్రెండ్స్. ఇన్ని అందించే రంగాన్ని వదిలేసి సాదా సీదా ఉద్యోగం ఎందుకు చేయాలి?’ అని ప్రశ్నింస్తున్నారు అఖిల. ఉద్యోగం అంటే మంచి ఆదాయం వస్తుంది కదా..అంటే..! ‘నేను ఎంచుకున్న కెరీర్లో అంతకన్నా ఎక్కువ సంపాదనే ఇప్పుడు వస్తుంది’ అంటూ స్పష్టం చేశారు. సాయంత్రం ఆరు దాకా అఖిల.. ఆరు దాటాక డీజే బ్లాక్.ఎవరూ డేర్ చేయని రోజుల్లోనే.. దాదాపు పదేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చారు లీనా. నగరంలోని సికింద్రాబాద్‌లో నివసించే ఈ సింథీ యువతి.. డిగ్రీ పూర్తి చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేశారు. అనంతరం కొన్ని షోస్ చేశారు.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆ తర్వాత ఫుల్‌టైమ్ డీజేయింగ్ను ఎంచుకున్నారు. ‘ఏవీ మనసుకు నచ్చలేదు. అదే నా కెరీర్‌ను ఇటు మార్చింది’ అంటూ చెప్పారు డీజే లీనా. ఫ్రీలాన్స్ డీజేగా సిటీలోని సగం పైగా క్లబ్స్‌లో ఇప్పటికే తన మ్యూజిక్ వినిపించానంటున్న లీనా.. బాలీవుడ్ అంటే తనకు ప్రేమ అనీ, అందుకే ఆ సంగీతాన్ని ప్లే చేయడానికి తాను ఇష్టపడతానని అంటున్నారు. అమ్మాయిలు ఈ రంగంలోకి ఎక్కువగా రాకపోవడానికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరకకపోవడమే కారణమంటున్నారు లీనా.. తాను కూడా అతి కష్టం మీద కుటుంబ సభ్యులను ఒప్పించగలిగానని చెబుతున్నారు.ట్రెడిషనల్ ఫ్యామిలీలో.. ట్రెండీగా.. ‘నేను ఇక్ఫాయ్లో బీబీఏ పూర్తి చేశాను. సొంతంగా బిజినెస్ చేయాలనేది నా ఆలోచన. అయితే చిన్నప్పటి నుంచీ డీజేయింగ్ అంటే ఇష్టం. ఫ్రెండ్స్‌తో క్లబ్స్‌కి వెళ్లినప్పుడు కేవలం డీజే మ్యూజిక్ కోసమే వెళ్లేదాన్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు అఖిల. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ పూర్తి సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అఖిల.. 2018లో డీజే స్కూల్లో చేరాలని నిర్ణయించున్నారు. అప్పుడు ఇంట్లో వాళ్ల నుంచి చెప్పుకోదగ్గ ప్రతిఘటననే ఎదుర్కొన్నారు. ‘ఫ్యామిలీ వద్దు అన్నప్పటికీ మనసు మాటే విన్నాను. ఒక ప్రోగ్రామ్‌కి కేవలం రూ.1000తో ప్రారంభించి.. ఇప్పుడు అంతకు పదింతలు తీసుకునే స్థాయికి చేరాను’ అంటూ సగర్వంగా చెప్పారామె. అమ్మాయిల భద్రత విషయం గురించి మాట్లాడినప్పుడు.. ‘మా చుట్టూ బౌన్సర్స్ ఉంటారు. ఇప్పటిదాకా చిన్న చేదు అనుభవం కూడా నాకు ఎదురుకాలేదు’ అంటూ చెప్పారామె. భవిష్యత్తులోనూ డీజేగా కొనసాగుతానని, మరిన్ని టాప్ క్లబ్స్‌లో తన మ్యూజిక్‌ని వినిపిస్తానని బాలీవుడ్ ట్య్రాక్స్కి పేరొందిన ఈ డీజే బ్లాక్ చెబుతున్నారు.‘ఫ్లో లో.. ‘జో’రుగా.. ‘మా నాన్న వాళ్లది వరంగల్. అయితే నేను నార్త్‌లోనే పెరిగాను. ప్రస్తుతం సిటీలో సెటిలయ్యా’ అంటూ చెప్పారు ఫ్లోజో. డిగ్రీ పూర్తి చేశాక.. కొన్ని కార్పొరేట్ ఉద్యోగాలు చేశా. అయితే చిన్నప్పటి నుంచీ సంగీతం పై ఉన్న ఇష్టంతో డీజేసూ్కల్లో చేరి కోర్సు పూర్తి చేసి డీజేగా మారాను అంటూ చెప్పారు ఫ్లోజో. ప్రస్తుతం నగరంలో టాప్ డీజేల్లో ఒకరుగా ఉన్న ఈ అమ్మాయి తొలుత లిక్విడ్స్‌లో రెసిడెంట్ డీజేగా ప్లే చేశానని, కొంత కాలం తర్వాత ఫ్రీలాన్స్ డీజేగా మారి, పలు అవార్డ్స్ కూడా అందుకున్నానని వివరించారు. థాయ్‌ల్యాండ్ వంటి అంతర్జాతీయ వేదికలపైనా, గోవా వంటి పార్టీ సిటీల్లోనూ ప్లే చేశానంటున్న ఫ్లోజోకి తన పేరు స్టైలి‹Ùగా ఉండడంతో మార్చుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. ఈ కెరీర్లో అటు ఆనందం, ఇటు ఆదాయం రెండూ బాగుంటాయంటున్న ఫ్లోజో.. ఆరేడేళ్లలోనే కారు, ఫ్లాట్ కొనగలిగానని సంతోషంగా చెప్పారు. ఇదీ చదవండి: గేలి చేసినచోటే గెలిచి చూపించిన మగువలు! -
కార్తీకం స్పెషల్.. దేశంలోని ప్రముఖ శివాలయాలు
దీపావళి అమావాస్య వెళ్లగానే కార్తీకమాసం ప్రవేశించింది. ఈ మాసంలో శివారాధన ఎంతో శ్రేష్టమని పెద్దలు చెబుతుంటారు. మనదేశంలో వేల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక పురాతన శివాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కేదార్నాథ్ (ఉత్తరాఖండ్)భారతదేశంలోని నాలుగు ధామాలలో కేదార్నాథ్ ఒకటి. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌లో మందాకిని నదికి సమీపంలో ఉన్న కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో ఉంది.లింగరాజ్ ఆలయం (భువనేశ్వర్)భువనేశ్వర్‌లోని పురాతన శివాలయాలలో లింగరాజ ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని సోమవంశీ రాజవంశానికి చెందిన రాజు జజాతి కేశరి నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుని స్వరూపమైన హరిహరుడు. ఈ ఆలయ ప్రస్తావన సంస్కృత గ్రంథాలలో కనిపిస్తుంది.నాగేశ్వర దేవాలయం (గుజరాత్)ఈ ఆలయం ద్వారకకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయాన్ని నాగనాథ్ దేవాలయం అని కూడా అంటారు. ఇది గుజరాత్‌లోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి విషం శరీరంలోకి ప్రవేశించదని భక్తులు నమ్ముతారు.కాశీ విశ్వనాథ దేవాలయం (ఉత్తర ప్రదేశ్)కాశీ విశ్వనాథ దేవాలయం వారణాసిలో పవిత్ర గంగానదికి పశ్చిమ ఒడ్డున ఉంది. బంగారు పూతతో కూడిన గోపురాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. కాశీ విశ్వనాథుని సమక్షంలో చివరి శ్వాస తీసుకునే వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని చెబుతారు.శివోహం శివాలయం (బెంగళూరు)శివుని ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో 65 అడుగుల ఎత్తయిన శివుని విగ్రహం ఉంది. శివోహం శివాలయంలో అతిపెద్ద శివలింగ ద్వారం కూడా ఉంది. ఇక్కడ శివునితో పాటు 32 అడుగుల ఎత్తయిన వినాయకుడి విగ్రహం కూడా ఉంది. ఈ శివాలయంలో ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుందని నమ్మకం.మురుడేశ్వర్ (కర్ణాటక)ఉత్తర కర్ణాటకలోని మురుడేశ్వర్‌లో ఎత్తయిన శివుని విగ్రహం ఉంది. ఆలయం వెనుక అరేబియా సముద్రం గంభీరంగా కనిపిస్తుంది. ఈ విగ్రహానికి సమీపంలో 20 అంతస్తుల శివుని ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి తరలివస్తుంటారు.సిద్ధేశ్వర్ ధామ్ (సిక్కిం)సిద్ధేశ్వర్ ధామ్ ఆలయం సిక్కిం రాజధాని గాంగ్టాక్కు సమీపంలో ఉంది. విష్ణువు, కృష్ణుడు, జగన్నాథుడు శివుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలతో పాటు 108 అడుగుల ఎత్తయిన శివుని విగ్రహం కూడా ఇక్కడ ఉంది.ఇది కూడా చదవండి: పార్వతీపురంలో గజ రాజుల బీభత్సం -
దేశంలోని ప్రముఖ మహాలక్ష్మి ఆలయాలు
దీపావళి నాడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున భక్తులు మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు. మన దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రముఖ మహాలక్ష్మీదేవి ఆలయాలున్నాయి. వాటిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోల్డెన్ టెంపుల్ (తమిళనాడు)తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని మహాలక్ష్మి ఆలయాన్ని దక్షిణ భారతదేశంలోని ‘గోల్డెన్ టెంపుల్’ అని పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా పేరొందింది. 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయం చెన్నైకి 145 కిలోమీటర్ల దూరంలో పాలార్ నది ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం దీపావళి నాడు వేలాది మంది భక్తులు ఈ ఆలయంలో అమ్మవారి దర్శనానికి తరలివస్తుంటారు.మహాలక్ష్మి ఆలయం (ముంబై)ఈ ఆలయం మహారాష్ట్రలోని ముంబైలో గల బి. దేశాయ్ మార్గ్‌లో ఉంది. ముంబై మహాలక్ష్మి దేవాలయంగా ఈ ఆలయం పేరొందింది. బ్రిటీష్ కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఛత్రపతి శివాజీకి కలలో లక్ష్మీదేవి కనిపించి, ఈ ఆలయాన్ని నిర్మింపజేసిందని చెబుతారు. ఈ మహాలక్ష్మి ఆలయ గర్భగుడిలో మహాలక్ష్మి, మహాకాళి మహాసరస్వతి విగ్రహాలు కనిపిస్తాయి.మహాలక్ష్మి ఆలయం (కొల్హాపూర్)మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో గల మహాలక్ష్మి ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో చాళుక్య పాలకుడు కర్ణదేవుడు నిర్మించాడు. షిల్హర్ యాదవ్ దీనిని తొమ్మదవ శతాబ్దంలో ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఆలయ ప్రధాన గర్భగుడిలో నాలుగు అడుగుల ఎత్తయిన మహాలక్ష్మి దేవి విగ్రహం దర్శనమిస్తుంది. ఇది దాదాపు 40 కిలోల బరువు ఉంటుంది. ఈ లక్ష్మీదేవి విగ్రహం సుమారు 7 వేల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు.లక్ష్మీనారాయణ దేవాలయం (ఢిల్లీ)ఢిల్లీలోని ప్రధాన దేవాలయాలలో లక్ష్మీనారాయణ దేవాలయం ఒకటి. ఈ ఆలయాన్ని 1622లో వీర్‌సింగ్ దేవ్ నిర్మించాడు. 1793లో పృథ్వీ సింగ్ ఆలయాన్ని పునరుద్ధరించాడు. అనంతరం బిర్లా కుటుంబం ఈ ఆలయాన్ని 1938లో విస్తరించి, పునరుద్ధరించింది. అందుకే ఈ ఆలయాన్ని బిర్లా టెంపుల్ అని పిలుస్తారు.మహాలక్ష్మి ఆలయం (ఇండోర్)మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గల మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఇండోర్ నడిబొడ్డున ఉన్న రాజ్వాడలో నిర్మించారు. ఈ ఆలయాన్ని 1832లో మల్హర్రావు (II) నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయంలో మూడు అంతస్తులు ఉన్నాయి. అయితే 1933లో అగ్నిప్రమాదం కారణంగా ఆలయం ధ్వంసమైంది. 1942లో ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించారు. దేశంలోని నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు తరలివస్తుంటారు.అష్టలక్ష్మి దేవాలయం (చెన్నై)తమిళానడులోని చెన్నైలోని ఇలియట్ బీచ్ సమీపంలో అష్టలక్ష్మి ఆలయం ఉంది. ఈ ఆలయం నాలుగు అంతస్తులలో నిర్మితమయ్యింది. లక్ష్మీదేవి ఎనిమిది రూపాల విగ్రహాలను ఈ ఆలయంలో సందర్శించవచ్చు. ఆలయంలోని రెండవ అంతస్తులో లక్ష్మీ దేవి, విష్ణువు విగ్రహాలు ప్రతిష్ఠితమయ్యాయి.ఇది కూడా చదవండి: దీపావళికి ముందే గ్యాస్ ఛాంబర్లా రాజధాని -
దేశంలోని ఐదు ప్రముఖ కాళీమాత మందిరాలు
కోల్‌కతా: దేశంలో దేవీ నవరాత్రుల వైభవం కొనసాగుతోంది. ఈ నవరాత్రులలో ఏడవ రోజున కాళికాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దుర్గాదేవి రూపం మహిళా సాధికారతకు చిహ్నంగా పరిగణిస్తారు. కాళికా రూపాన్ని పూజించడం ద్వారా శత్రుబాధ నివారణ అవుతుందని, దుఃఖాలు నశించిపోతాయని చెబుతుంటారు.దేశంలో పలు కాళీమాత ఆలయాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆసక్తికర చరిత్రలు ఉన్నాయి. వీటిలో ఐదు దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కాలిబడి(ఆగ్రా)ఆగ్రాలోని కాలిబడి కాళికా ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ ఉన్న అద్భుత ఘాట్‌లోని నీరు ఎప్పటికీ ఎండిపోదని, అందులో క్రిమికీటకాలు పెరగవని స్థానికులు చెబుతుంటారు.జై మా శ్యామసుందరి(కోల్‌కతా)మరో కాళీ దేవాలయం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉంది. దాని పేరు జై మా శ్యామసుందరి కాళీ మందిరం. ఈ ఆలయంలో కాళీదేవి సంచరిస్తుందని స్థానికులు చెబుతుంటారు. ప్రతీరోజూ ఉదయం ఆలయ తలుపు తెరిచినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయని అంటారు.కాళీఘాట్(పశ్చిమ బెంగాల్)మూడవ కాళీ దేవాలయం కూడా పశ్చిమ బెంగాల్లో ఉంది. కాళీఘాట్‌లోని ఈ కాళీ దేవాలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో కాళీదేవి నాలుక బంగారంతో తయారు చేశారు.కాళీ ఖో(ఉత్తరప్రదేశ్)నాల్గవ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో వింధ్య పర్వతంపై కాళీ ఖో పేరిట ఉంది. ఈ ఆలయం ధ్యాన సాధనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారికి సమర్పించే ప్రసాదం మాయమవుతుండటం వెనక కారణం ఏమిటో నేటికీ వెల్లడి కాలేదని భక్తులు చెబుతుంటారు.మాతా బసయ్య(మొరెనా) ఐదవది ఉత్తరప్రదేశ్‌లోని మొరెనాలో ఉన్న మాతా బసయ్య ఆలయం. ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల క్రితం నాటిది. నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ద్వారా భక్తుల తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇది కూడా చదవండి: కైలాస్నాథ్... చరణాద్రి శిఖరం -
Faisal Khan: ఇటు సోషల్ మీడియా.. అటు సోషల్ యాక్టివిటీస్‌లోనూ ఖాన్ సర్ ఫస్టే!
అసలు పేరు ఫైసల్ ఖాన్. టీచర్, యూట్యూబర్. ఖాన్ సర్, ఖాన్ సర్ పట్నాగా పాపులర్. సొంతూరు.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. అలహాబాద్ యూనివర్సిటీలో సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేశాడు. 2019లో ‘ఖాన్ జీఎస్ రీసెర్చ్ సెంటర్’ పేరుతో యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేశాడు.స్కూళ్లు, కాలేజీలు బంద్ అయిన కరోనా లాక్డౌన్ టైమ్‌లో అకడమిక్స్ని టీచ్ చేస్తూ ఖాన్ చేసిన వీడియోలు ఇటు యూట్యూబ్‌లో అటు ఇన్‌స్టాలో వైరలై అతనికి బోలెడంత మంది ఫాలోవర్స్‌ని.. సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించి పెట్టాయి. ఎంతటి కష్టమైన, క్లిష్టమైన సబ్జెక్ట్‌ని అయినా అరటి పండు మింగినంత అలవోకగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఖాన్ సర్ యూఎస్పీ. అందుకే అతని యూట్యూబ్ చానెల్‌కి స్టూడెంట్సే కాదు వరుణ్ ధవన్ లాంటి సినిమా యాక్టర్స్ కూడా సబ్‌స్క్రైబర్సే!సోషల్ మీడియాలోనే కాదు సోషల్ యాక్టివిటీస్‌లోనూ ఖాన్ సర్ ఫస్టే! స్కూల్‌కి వెళ్లలేని పేద పిల్లలకు ఫ్రీగా టీచ్ చేస్తాడు. ఆర్థికావసరాల్లో ఉన్న వాళ్లకు తనకు తోచిన హెల్ప్ చేస్తాడు. యూట్యూబ్ ద్వారా ఖాన్ సర్ నెలకు 15 లక్షల రూపాయలు సంపాదిస్తాడని అంచనా! ఆర్జనే కాదు సాయమందించే మనసూ ముఖ్యమే అని ప్రూవ్ చేస్తున్నాడు ఖాన్ సర్!ఇవి చదవండి: Pooja Singh: పూజా సింగ్ టు.. రింకీ దూబే.. బై శాన్వికా..! -
ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..
నాగాలాండ్‌లోని లాంగ్వా చాలా ప్రత్యేకతలు కలిగిన గ్రామం. ఈ గ్రామం స్పెషలిటీ వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. ఇలాంటి గ్రామం మరొకటి ఉండే అవకాశం కూడా లేదన్నంత స్పెషాలిటీగా ఉంటుంది. ఎంత స్పెషల్ అంటే..ఒకే ఇంట్లో రెండు దేశాల సరిహాద్దును చూడొచ్చు. ఆ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? అదెలా సాధ్యం అంటే..నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో ఒకటి లాంగ్వా. ఇక్కడ 'కోన్యాక్ నాగా' అనే గిరిజన తెగ ఉంటుంది. ఈ గ్రామం మధ్యలోంచి ఇండియా, మయన్మార్ బోర్డర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బోర్డర్ గ్రామాన్ని విడదీయకపోవడం విశేషం. ఈ గ్రామ ప్రజలు హెడ్ హంటింగ్‌కు ప్రసిద్ధి. ఈ కోన్యాక్ తెగ ప్రజలు తమ శత్రువులపై యుద్ధం జరిపి.. విజయం సాధించిన గుర్తుగా శత్రువు తలని తీసి తమ గ్రామానికి అలంకరణగా ఉంచుతారు. ఇక్కడ ప్రజలు తమ ఇళ్లను ఏనుగు దంతాలు, హార్న్‌బిల్ ముక్కులు, మానవ పుర్రెలతో అలంకరించుకుంటారు. ఈ పుర్రెలు ఇలా గ్రామంలో ప్రతి ఇంటిపై ఉండటం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందనేది వారి నమ్మకం. ఈ గ్రామం నల్లమందు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లాంగ్వ్లోని కున్యాక్ నాగా తెగ పెద్దని అంఘ్ అని పిలుస్తారు. అతడిని అక్కడ ప్రజలు మహారాజుగా భావిస్తారు. అతని ఇల్లు ఇండో-మయన్మార్ సరిహద్దు గుండా వెళ్తుంది. చెప్పాలంటే అతడి ఇల్లుని రెండు భాగాలుగా విభజిస్తుంది. దీంతో అతడి కిచెన్ మయన్మార్‌లో ఉంటే బెడ్రూం ఏకంగా భారత్‌లో ఉంది. దాదాపు అక్కడ ఉండే ప్రజల ఇళ్లన్ని ఇలానే ఉంటాయి. ఆ గ్రామ పెద్దకి ఏకంగా 60 మంది భార్యలు. అతడి కృషి వల్ల లాంగ్వా గ్రామం ఎంతో అభివృద్ధి సాధించింది. అంతేగాదు ఇక్కడ ప్రజలకు రెండు దేశాల పౌరసత్వం లభిస్తుంది. ఒకప్పుడూ ఆ గ్రామంలో రహదారి సరిగా ఉండేది కాదు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సిబ్బంది కొండలా ఎత్తుగా ఉండే ఆ రహదారిని చక్కగా చదును చేసి బాగు చేయడంతో చక్కటి రవాణా కనెక్టివిటీ ఏర్పడింది. ఈ గ్రామాన్ని సందర్శించడానికి అనువైన సమయం అక్టోబర్ నుంచి మార్చి నెల సమయం. ఆ సమయంలో లాంగ్వా గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడుతూ ఆహ్లాదంగా ఉంటుంది. (చదవండి: 'లంగ్స్ ఆఫ్ చత్తీస్‌గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్‌మ్యాన్..) -
మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!
పూర్తిగా గడ్డకట్టిన మంచుతో నిర్మితమైన ఈ హోటల్ ఫిన్లండ్‌లోని కెమీ నగరంలో ఉంది. దీనిని తొలిసారిగా 1996లో ప్రారంభించారు. తొలి సంవత్సరంలోనే ఈ హోటల్‌కు మూడు లక్షల మంది అతిథులు వచ్చారు. ఫిన్లండ్‌లో ఏటా ఏప్రిల్ వరకు శీతకాలం ఉంటుంది. ఇక్కడ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచు గడ్డకట్టే పరిస్థితులే ఉంటాయి. అందువల్ల ఏటా శీతకాలంలో ఈ హోటల్‌ను నిర్మించి, అతిథులకు అందుబాటులో ఉంచుతున్నారు. వేసవి మొదలయ్యాక ఈ మంచు అంతా కరిగిపోతుంది. దాదాపు ఇరవైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ హోటల్లో ఒక ప్రార్థనా మందిరం, రెస్టారెంట్ సహా పర్యాటకులకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులోని టేబుళ్లు, కుర్చీలు, మంచాలు కూడా మంచుతో తయారు చేసినవే! వీటిపైన ధ్రువపు జింకల చర్మంతో సీట్లు, పరుపులు ఏర్పాటు చేస్తారు. ఇందులోని రెస్టారెంట్లో విందు భోజనాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. (చదవండి: వాట్ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..) -
వరల్డ్ ఫేమస్ లోకల్ టాలెంట్! గాయత్రి దేవరకొండ..
అచ్చమైన తెలంగాణ అమ్మాయి. ఆమె ఇన్‌స్టా కంటెంట్ కూడా తెలంగాణ నేటివిటీనే రిఫ్లెక్ట్ చేస్తుంటుంది. ఫొటోగ్రాఫర్, లిరిసిస్ట్, సింగర్, మ్యుజీషియన్, నేచర్లవర్ ఎట్సెట్రా! ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంది. మోటర్‌సైకిల్ రైడ్ చేస్తుంది. బైక్ రిపేర్ చేస్తుంది. ఇలా పనికి జెండర్ డిస్క్రిమినేషన్ లేదు అని ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేస్తోన్న ప్రతిభ ఆమెది.అసలు ఈ పిల్లకు రాని పని అంటూ ఉందా అని ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్ అబ్బురపడేలా చేస్తుంది. ధర్మపురికి చెందిన ఈ అమ్మాయి కరోనా టైమ్‌లో తన చుట్టూ ఉన్న డిప్రెసివ్ మూడ్‌ని పోగొట్టడానికి.. తన ఊళ్లో మొక్కలను నాటింది. రాత్రనక పగలనక వాటి ఆలనాపాలనా మీదా అంతే శ్రద్ధను పెట్టింది.ఇప్పుడవి పెరిగి ఆ ప్రదేశమంతా ఓ గార్డెన్‌లా మారింది. గలగలపారే సెలయేరు.. జలజల దూకే జలపాతం.. ఇలా ఏ సినినమ్ అయినా సూటయ్యే ఇన్స్పైరింగ్ గర్ల్ గాయత్రి. ఇప్పుడు ఆమె ‘దేవరకొండాస్ స్పెషల్’ పేరుతో యూట్యూబ్ చానెల్‌నూ పెట్టింది.ఇవి చదవండి: ఎవరీ శశాంక్..? ఇన్నింగ్స్ చివర్లో వచ్చి.. సుడిగాలి... -
ప్రముఖ కంపెనీల రెయిన్బో కలర్ లోగోలు.. (ఫోటోలు)
-
ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
నిజానికి ఉడిపి కాదు, ఉడుపి అని వ్రాయాలి. ఉడుపి అంటే అర్థం నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రుని భూమి అని అర్థం. ఇక ఉడుపి వంట లేక భోజనం- దీని మూలం ఉడుపిలో ఉన్న కృష్ణ దేవాలయంలో, అష్ట మఠాలలో ఉంది. ఉడుపి శ్రీ మధ్వాచార్యులు జన్మించిన ఊరు. ఇది ద్వైత సాంప్రదాయ ముఖ్య కేంద్రం. అన్నదాన సేవలో భాగంగా ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయంలో శిక్షణ పొందిన వంటవారు ఉడిపి హోటళ్లను తెరవడానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. మరీ ఉడుపి భోజనానికే ఎందుకంటే పేరుగాంచిందంటే..కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న సైన్యానికి..ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరంటే..? మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి దాదాపు 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి. రెండవది బలరాముడు. ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపిరాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు. అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది, నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము. వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు చెపుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది. 50 లక్షల మందికి భోజనం వండటం అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుందంటూ..అందరికీ భోజనాలు తయారుచేయమని చెబుతాడు శ్రీకృష్ణుడు.నిజానికి 50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు, అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం భీముడికి ముఖ్యం. అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు. అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు. నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేషుడు.ఎలా వండేవాడంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా, వృధాకాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు. ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు?..అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు? అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు. అసలు నరేషునికి ఎలా తెలుస్తుంది? ఈ రోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని, మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..ఇలా18 రోజులు గడిచిపోయాయి. పాండవులు గెలిచారు. పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు. కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు. ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని గొప్పతనం అంతా ఎవరికి ఇస్తారు అని అడిగాడు?. అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని చెబుతాడు. అప్పుడు నరేషుడు మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు. ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుడుని అడుగుతాడు యుధిష్టరుడు. అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు... శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు. నేను లెక్క పెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని.. శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు. ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు. ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు. ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు. ఇదంతా 13వ శతాబ్దంలో కర్ణాటకలోని చిన్న తీర పట్టణమైన ఉడుపిలో ప్రారంభమైంది. ఇక్కడ, ఒక ప్రసిద్ధ శ్రీ కృష్ణ దేవాలయంలో భక్తులకు ఉచిత భోజనం లేదా అన్నదానం చేసే పద్ధతిని ప్రారంభించింది. మెనూలో ఆహారం ఎప్పుడు వడ్డించాలనే సమయాలు రెండూ నిర్ణయించబడ్డాయి. ఈ దేవాలయాలలో శిక్షణ పొందిన వంటవారు చివరికి బెంగళూరు, చెన్నై, ముంబై వంటి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి ఈ ప్రాంతాల్లో ఉడుపి హోటళ్లను ఏర్పాటు చేసినట్లు చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడ భోజనానికి విశేష స్థానం ఉంది. సాత్విక పద్ధతిలో చెయ్యాలి. శాకాహారం భోజనం మాత్రమే చెయ్యాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఉపయోగం చేయకూడదు. కృష్ణ మఠంకు చాలా చాలా మంది భక్తులు వస్తారు. వాళ్ళు అందరికి ప్రసాదం రూపంలో భోజనం ప్రతి దినం ఇస్తారు. అంత మందికి భోజనం ఇవ్వాలి, అందుకే చాలా మంది వంటచేసే బ్రాహ్మణులు ఉండేవారు. ఉడుపిలో చాలమంది బ్రాహ్మణులకు వంట చేసే విషయంలో ప్రావీణ్యత దొరికింది. హోటల్ ఉద్యమం ప్రారంభించడానికి ఈ పాకశాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించారు. 1942లో ఉడిపి నుండి ముంబైకి వలస వచ్చిన ఒక యువకుడు మొదటి ఉడిపి శ్రీకృష్ణ హోటల్ని స్థాపించాడు. 1950వ దశకంలో, ఇద్దరు సోదరులు మావల్లి టిఫిన్ రూమ్ (ఎంటీఆర్), ఉడిపి తరహాలో మరొక హోటల్ని ఏర్పాటు చేశారు. 80 సంవత్సరాల వ్యాపారం తర్వాత, ఎంటీఆర్ ఇప్పుడు ఒక పెద్ద నమ్మకమైన సంస్థగా పరిగణించబడుతుంది.ఇదంతా గత వైభోగం కాని నేడు.. దేశ వ్యాప్తంగా ఉడుపి హోటల్స్ విలుప్త అంచున ఉన్నాయి...మన ఆహార సంస్కృతి తీవ్ర ప్రమాదంలో ఉంది, అమెరికన్ ఎమ్ఎన్సీలు ఫుడ్ జెయింట్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఉడిపి రెస్టారెంట్లను తొలగిస్తోంది. దీని పర్యవసానంగా చాలా ఉడుపి ఫుడ్ జాయింట్లు వేగంగా మూసుకుపోతున్నాయి. పదేళ్ళ క్రితం వరకు దేశంలో ఏ మూలకు వెళ్ళినా కుగ్రామంలో కుడా ఉడుపి హోటల్ ఉండి తీరాల్సిందే. ఉడుపి హోటల్ పేరు ఎత్తితే చాలు ఆ రవ్వ దోశలు, మసాలా దోశలు, వడ సంబారు, ఘుమఘ్జుమ లాడే కొబ్బరి చట్నీలు..... కానీ నేడు వాటి స్థానంలో నూడుల్స్ సెంటర్లు, పాణి పూరీలు, అమెరికన్ ఎమ్ఎన్సీలు పుణ్యమా..! అని దేశీయ చాట్ సెంటర్లు కుడా కనుమరుగైపోయాయి మన పిల్లలు జంక్ ప్లాస్టిక్ ఫుడ్స్‌కు అలవాటు పడి చిన్నతనం నుంచే తీవ్ర ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ జంక్ ఫుడ్స్‌తో స్థూలకాయం, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి.అమెరికన్ ఫుడ్ దిగ్గజా లక్ష్యం మన చిన్నారులు, యువతే. ముఖ్యంగా పిల్లల మనస్సును మరల్చగలగడమే వారి థ్యేయం. ఎందుకంటే..?మధ్య వయస్కులు, వృద్ధులు ఈ జంక్ ఫాస్ట్ ఫుడ్‌ను ఎన్నటికీ అంగీకరించరని వారికి బాగా తెలుసు. ఈలోగా చిన్నారులు యుక్తవయస్సు వచ్చే నాటికి ఈ జంక్ ఫుడ్స్‌కు బాగా బానిస అయ్యిపోతారు. నిజానికి ఇది మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందులో ఉపయోగించే పదార్థాలు మన రూపు రేఖల్ని అందవిహీనంగా మార్చేసి మనకి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!) -
భారతదేశంలోని ప్రముఖ మసీదులివే..
దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. మనదేశంలో ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలాలైన మసీదులు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని మసీదులు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలోని కొన్ని ప్రముఖ మసీదుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జామా మసీదు, ఢిల్లీ జామా మసీదు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రసిద్ధ మసీదులలో ఒకటి. 1956లో షాజహాన్ నిర్మించిన ఈ మసీదులో సుమారు 25 వేల మంది ఒకేసారి ప్రార్థనలు చేయవచ్చు. ఎర్ర ఇసుకరాయి, పాలరాయితో నిర్మితమైన ఈ మసీదు మీనార్ 135 అడుగుల ఎత్తు కలిగివుంది. మక్కా మసీదు, హైదరాబాద్ దేశంలోని పురాతన, అతిపెద్ద మసీదులలో ఇది ఒకటి. మక్కా మసీదు 1694లో మక్కా నుండి తెచ్చిన మట్టి, ఇటుకలతో నిర్మితమయ్యింది. 75 అడుగుల ఎత్తైన ఈ మసీదులో ఒకేసారి 10 వేల మంది కూర్చునే అవకాశం ఉంది. ఈ మసీదు చౌమహల్లా ప్యాలెస్, లాడ్ బజార్, చార్మినార్ తదితర చారిత్రక ప్రదేశాలకు సమీపంలో ఉంది. తాజ్-ఉల్-మసీదు, భోపాల్ తాజ్-ఉల్-మసీదు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద, అందమైన మసీదుగా పేరుగాంచింది. ఈ మసీదును ‘మసీదుల కిరీటం’ అని కూడా పిలుస్తారు. లక్ష మందికి పైగా జనం ఈ మసీదులో కూర్చుని ప్రార్థనలు చేయవచ్చు. జామియా మసీదు, శ్రీనగర్ శ్రీనగర్‌లో ఉన్న జామియా మసీదు భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మసీదులలో ఒకటి. దీనిలో ఒకేసారి 33 వేల మంది ప్రార్థనలు సాగించవచ్చు. జమ్మూ కాశ్మీర్‌లోని పాత శ్రీనగర్‌లో ఈ మసీదు ఉంది. బడా ఇమాంబర, లక్నో 1784లో అవధ్ నవాబ్ నిర్మించిన ఈ మసీదులో ఒకేసారి మూడు లక్షల మందికి పైగా జనం ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మసీదుగా గుర్తింపు పొందింది. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. జామా మసీదు, ఆగ్రా యూపీలోని ఆగ్రా కోటకు ఎదురుగా ఉన్న ఈ జామా మసీదు దేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటిగా పేరొందింది. దీనిని ఫ్రైడే మసీదు అని కూడా పిలుస్తారు. ఈ మసీదు ఎర్ర ఇసుకరాయి, తెల్లని పాలరాయితో నిర్మించారు. -
Famous Temples In India Photos: భారతదేశంలోని ప్రముఖ హిందూ దేవాలయాలు (ఫొటోలు)
-
దూసుకుపోతున్న ‘చదువురాని చాయ్‌వాలా’
దేశంలో టీ దుకాణాలకు మంచి డిమాండ్ ఉంది. ఎక్కడ కొత్తగా టీ దుకాణం ఏర్పాటైనా అది విజయవంతం అవుతుందనే మాట వినిపిస్తుంటుంది. తాజాగా బీహార్‌లో వినూత్న టీ దుకాణం ఏర్పాటయ్యింది. దాని పేరు వినగానే ఎవరికైనా వింతగా అనిపిస్తుంది. మాధేపురాలోని సింగేశ్వర్కు చెందిన రోహిత్ ‘అన్పఢ్ చాయ్‌వాలా’ (చదువురాని చాయ్‌వాలా) పేరుతో టీ స్టాల్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఐదు రకాల టీలు లభిస్తాయి. అయితే ఇక్కడ టీ బాగోలేదని ఎవరైనా వినియోగదారుడు అంటే రోహిత్ వారికి డబ్బు వాపసు చేస్తాడు. విద్యార్థులకు టీపై ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇస్తుంటాడు. రోహిత్ తన దుకాణంలో టీని రూ. 10కే అందిస్తున్నాడు. మొదట్లో తన దుకాణం పేరు బాగోలేదని చాలామంది అన్నారని, అయితే ఆ పేరు అలాగే ఉంచాలని అనుకున్నానని రోహత్ తెలిపాడు. తాను ఎటువంటి డిగ్రీ చదవలేదని, పెద్దగా ఏమీ చదువుకోలేదని అందుకే అన్పఢ్ చాయ్‌వాలా అని దుకాణానికి పేరు పెట్టానని రోహిత్ వివరించాడు. ఇప్పుడు తన టీ దుకాణం పేరు స్థానికంగా అందరి నోళ్లలో నానుతోందని, తాను ప్రతిరోజూ 400 నుండి 500 కప్పుల టీ విక్రయిస్తున్నానని రోహిత్ తెలిపాడు. విద్యార్థులకు 10శాతం తగ్గింపు ధరకే టీ ఇస్తున్నానని, దీనివలన చదువుకుంటున్న విద్యార్థులకు కాస్త ఉపశమనం లభిస్తుందని రోహిత్ తెలిపాడు. యూట్యూబ్‌లో పలు టీ దుకాణాల వీడియోలను చూశాక, తాను ‘అన్పఢ్ చాయ్‌వాలా’ పేరుతో సొంత స్టార్టప్‌ను ప్రారంభించానని అన్నాడు. తాను వినియోగారులకు మసాలా టీ, ప్లెయిన్ టీ, స్పెషల్ టీ, అల్లం టీ, కాఫీ టీ అందిస్తున్నానని తెలిపాడు. -
ఏఏ దేశాల్లో శివాలయాలు ఉన్నాయి?
పరమశివునికి మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ దేవాలయాలు ఉన్నాయి. శుక్రవారం శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో విదేశాల్లోని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుపతినాథ్ ఆలయం (నేపాల్) ఈ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది ఇది శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయాన్ని హిందువులతో పాటు బౌద్ధమతస్తులు కూడా సందర్శిస్తుంటారు. కైలాస మానసరోవరం (చైనా) కైలాస మానసరోవరం అనేది ఒక పవిత్రమైన సరస్సు. ఈ పర్వతం టిబెట్ చైనాలో ఉంది. ఇది శివుని నివాసం అని హిందువులు నమ్ముతారు. ప్రంబనన్ ఆలయం (ఇండోనేషియా) ప్రంబనన్ ఆలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్‌లో ఉంది. దీనిని ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయమని చెబుతుంటారు. ఇక్కడ ఎనిమిది దేవాలయాల సమూహం ఉంది. మున్నేశ్వరం (శ్రీలంక) ఈ ఆలయం శ్రీలంకలో ఉంది. దీనిని 'త్రికోణమాలి' అని కూడా పిలుస్తారు. మున్నేశ్వరం అత్యంత పురాతనమైన శివుని ఆలయం. రావణుని వధించిన తర్వాత రాముడు ఈ ఆలయంలో తన ఆరాధ్యదైవమైన శివుణ్ణి పూజించాడని చెబుతారు. గౌరీశంకర్ ఆలయం (నేపాల్) ఈ ఆలయం నేపాల్‌లో ఉంది. ఆలయంలో శివపార్వతులు కొలువయ్యారు. ఈ ఆలయం ఖాట్మండుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కటాస్‌రాజ్ ఆలయం (పాకిస్థాన్) ఈ ఆలయం పాకిస్తాన్లో ఉంది . దీనిని 'సెవెన్ పూల్స్ టెంపుల్' అని కూడా పిలుస్తారు. అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం (మలేషియా) అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం మలేషియాలోని జోహోర్ బారులో ఉంది. ఇది మలేషియాలోని పురాతన హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది. శ్రీ శివ మందిర్ (ఇంగ్లండ్) శ్రీ శివాలయం ఇంగ్లండ్‌లో ఉంది. ఈ ఆలయం లండన్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివాలయం (నెదర్లాండ్స్) ఈ ఆలయం నెదర్లాండ్స్‌లో ఉంది. ఈ ఆలయం ఆమ్స్టర్డామ్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివాలయం (జర్మనీ) ఈ ఆలయం జర్మనీలో ఉంది. ఈ ఆలయం బెర్లిన్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. -
‘భారత రత్న’ అందుకున్న ప్రముఖులెవరు?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజానేత కర్పూరి ఠాకూర్‌ను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది. ఇప్పటివరకూ 49 మంది ప్రముఖులు ‘భారతరత్న’ను అందుకున్నారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారతరత్న పొందిన వారిలో క్రికెట్ గాడ్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్ పేరు కూడా ఉంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు... ఇలా పలువురు ‘భారతరత్న’ అందుకున్నారు. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం రోజున దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేస్తుంది. ఈ జాబితాలో తాజాగా ప్రముఖ గాంధేయ సోషలిస్ట్ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ పేరు కూడా చేరింది. కర్పూరి ఠాకూర్ 1970, డిసెంబర్ నుండి 1971 జూన్ వరకు తిరిగి 1977 డిసెంబర్ నుండి 1979 ఏప్రిల్ వరకు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కర్పూరి ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. భారతరత్నను ప్రదానం చేయడం 1954లో ప్రారంభమైంది. కులం, వృత్తి, హోదా, లింగ భేదం లేకుండా ఆయారంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ గౌరవం దక్కుతుంది. ఇప్పటివరకు ‘భారతరత్న’ అందుకున్నవారు 1. చక్రవర్తి రాజగోపాలాచారి (రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు)- 1954 2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (తత్వవేత్త, రాజకీయవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)- 1954 3. చంద్రశేఖర్ వెంకట రామన్ (భౌతిక శాస్త్రవేత్త)- 1954 4. భగవాన్ దాస్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు, తత్వవేత్త, విద్యావేత్త)- 1955 5. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (సివిల్ ఇంజనీర్, రాజకీయవేత్త, మైసూర్ దివాన్)- 1955 6. జవహర్లాల్ నెహ్రూ (స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత, భారత మాజీ ప్రధాని)- 1955 7. గోవింద్ వల్లభ్ పంత్ (స్వాతంత్ర్య సమరయోధుడు)- 1957 8. ధోండో కేశవ్ కర్వే (సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుడు)- 1958 9. బిధాన్ చంద్ర రాయ్ (వైద్యుడు, రాజకీయ నేత , పరోపకారి, విద్యావేత్త, సామాజిక కార్యకర్త) - 1961 10. పురుషోత్తం దాస్ టాండన్ (స్వాతంత్ర్య సమర యోధుడు)- 1961 11. రాజేంద్ర ప్రసాద్ (స్వాతంత్ర్య సమర యోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త, పండితుడు, భారత మాజీ రాష్ట్రపతి)- 1962 12. జాకీర్ హుస్సేన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1963 13. పాండురంగ్ వామన్ కేన్ (ఇండాలజిస్ట్, సంస్కృత పండితుడు)-1963 14. లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు, భారత మాజీ ప్రధాని) – 1966 15. ఇందిరా గాంధీ (రాజకీయనేత, భారత మాజీ ప్రధానమంత్రి)-1971 16. వరాహగిరి వెంకట గిరి (స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ రాష్ట్రపతి)-1975 17. కుమారస్వామి కామరాజ్ (మరణానంతరం) (రాజకీయవేత్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి) - 1976 18. మదర్ మేరీ థెరిసా బోజాక్షియు (మదర్ థెరిసా) (మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు) - 1980 19. వినోబా భావే (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)-1983 20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)-1987 21. మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ (మరణానంతరం) (రాజకీయనేతగా మారిన నటుడు)-1988 22. భీమ్ రావ్ రామ్‌జీ అంబేద్కర్ (మరణానంతరం) (సంఘ సంస్కర్త)-1990 23. నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (వర్ణవివక్ష వ్యతిరేక పోరాట నేత)- 1990 24. రాజీవ్ గాంధీ (మరణానంతరం) (రాజకీయనేత, భారత మాజీ ప్రధాని)-1991 25. సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1991 26. మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్ (స్వాతంత్ర్య పోరాట వీరుడు, భారత ప్రధాని)- 1991 27. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు)-1992 28. జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా (పారిశ్రామికవేత్త)- 1992 29. సత్యజిత్ రే (చిత్ర నిర్మాత)- 1992 30. గుల్జారీ లాల్ నందా (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1997 31. అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు)- 1997 32. ఎ.పి.జె. అబ్దుల్ కలాం ( శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)-1997 33. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (కర్ణాటక శాస్త్రీయ గాయని)-1998 34. చిదంబరం సుబ్రమణ్యం (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1998 35. జయప్రకాష్ నారాయణ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)- 1999 36. అమర్త్య సేన్ (ఆర్థికవేత్త)- 1999 37. ప్రకాష్ గోపీనాథ్ బోర్డోలోయ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు) – 1999 38. రవిశంకర్ (సితార్ వాద్యకారుడు) - 1999 39. లతా దీనానాథ్ మంగేష్కర్ (గాయని)- 2001 40. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (హిందుస్తానీ క్లాసికల్ షెహనాయ్ ప్లేయర్)- 2001 41. భీంసేన్ గురురాజ్ జోషి (హిందుస్తానీ క్లాసికల్ సింగర్)- 2009 42. సిఎన్ఆర్ రావు (కెమిస్ట్, ప్రొఫెసర్)- 2014 43. సచిన్ రమేష్ టెండూల్కర్ (క్రికెటర్)- 2014 44. అటల్ బిహారీ వాజ్‌పేయి (రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)- 2015 45. మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) (పండితులు, విద్యా సంస్కర్త)- 2015 46. నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం) (సామాజిక కార్యకర్త)- 2019 47. భూపేంద్ర కుమార్ హజారికా (మరణానంతరం) (ప్లేబాక్ సింగర్, గేయ రచయిత, సంగీతకారుడు, కవి, చలనచిత్ర నిర్మాత) - 2019 48. ప్రణబ్ ముఖర్జీ (రాజకీయనేత, భారత మాజీ రాష్ట్రపతి)- 2019 49. కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) (రాజకీయనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి) – 2024 -
భారతదేశంలోని అంత ప్రసిద్ధి కాని కొన్ని అందమైన బీచ్‌లు (ఫొటోలు)
-
2023లో ‘ఉదయ్‌పూర్’ ఎందుకు మారుమోగింది?
2023కు జ్ఞాపకాలతో వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. నూతన సంవత్సరానికి ఉత్సాహంతో స్వాగతం పలికేందుకు మనమంతా సిద్ధం కావాల్సిన తరుణం వచ్చేసింది. అయితే 2023 రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. దీనికితోడు 2023లో ఉదయపూర్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఇష్టమైన నగరంగా కూడా పేరు తెచ్చుకుంది. ఉదయ్‌పూర్ జీ-20ని స్వాగతించింది. రెండు భారీ డెస్టినేషన్ వెడ్డింగ్‌లు కూడా ఉదయపూర్‌లో జరిగాయి. ట్రావెల్ అండ్ లీజర్ 2023లో విడుదల చేసిన జాబితాలో ఉదయపూర్ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఇష్టమైన నగరంగా పేరు తెచ్చుకుంది. పర్యాటకుల అభిరుచి, స్థానిక సంస్కృతి, ఆహారం, షాపింగ్, వివిధ పర్యాటక ప్రదేశాల ఆధారంగా నిర్వహించిన సర్వేలో ఉదయపూర్ నగరానికి 93.33 రీడర్ స్కోర్ లభించింది. ప్రపంచంలోని నలుమూలలకు చెందిన పర్యాటకులు ఉదయ్‌పూర్‌ను ఎంతగానో ఇష్టపడుతుంటారు. భారత్ అధ్యక్షతన తొలి జీ-20 సమావేశం ఉదయపూర్‌లో జరిగింది. రెండవ జీ-20 సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ (ఎస్ఎఫ్డబ్ల్యుజీ) సమావేశం కూడా ఇక్కడే జరిగింది. దీనిలో 90 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయపూర్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ప్రసిద్ధి చెందింది. 2023లో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా ఇక్కడే వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన వీరి వివాహానికి సినీ పరిశ్రమకు చెందిన తారలే కాకుండా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా హాజరయ్యారు. భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ప్రేమికుల రోజున ఉదయపూర్‌లో నటాషాను వివాహం చేసుకున్నారు. స్టార్ హోటల్ రాఫాల్లో క్రైస్తవ ఆచారాల ప్రకారం జరిగిన ఈ వివాహానికి హార్దిక్ కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇది కూడా చదవండి: అయోధ్య విమానాశ్రయం విశేషాలివే -
పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి..
2023వ సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పలువురు స్వామీజీలు అటు రాజకీయాలను, ఇటు ప్రజలను అమితంగా ప్రభావితం చేశారు. వీరు వార్తల్లో తరచూ కనిపించారు. ఇలాంటి 10 మంది స్వామీజీల గురించి ఇప్పుడు తెలసుకుందాం. 1. సంత్ ప్రేమానంద్ సంత్ ప్రేమానంద్ మహారాజ్ ఏడాది పొడవునా అగ్రస్థానంలో వార్తల్లో నిలిచారు. బృందావనంలో నివసిస్తున్న సంత్ ప్రేమానంద్ సత్సంగాన్ని వినడానికి జనం ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు సంత్ ప్రేమానంద్ మహరాజ్‌ను దర్శించుకున్నారు. ప్రేమానంద్ చిన్ననాటి పేరు అనిరుధ్ కుమార్ పాండే. ఆయన 13 సంవత్సరాల వయసులోనే సన్యాసం స్వీకరించారు. 2. పండిట్ ధీరేంద్ర శాస్త్రి బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర గార్గ్ ప్రవచనకర్తగా రెండవ స్థానంలో నిలిచారు. తన ముందున్నవారి ఆలోచనలు గ్రహించి, వారి సమస్యలను పరిష్కరించగలరనే పేరు సంపాదించారు. ధీరేంద్ర గార్గ్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రసిద్ది చెందారు. తొమ్మిదేళ్ల వయసులోనే ఆయన హనుమంతుని పూజించడం ప్రారంభించారు. 3. జయ కిషోరి కథకురాలు జయ కిషోరి జీ 2023లో ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఆమె పూర్తి పేరు జయ శర్మ. ఆమె 1995లో రాజస్థాన్‌లోని సుజన్‌గఢ్‌లో జన్మించారు. ఈ 27 ఏళ్ల కథకురాలు యూట్యూబ్‌లో ఎంతో ఫేమస్ అయ్యారు. జయ కిషోరి చిన్న వయస్సులోనే భగవద్గీతను పారాయణం చేస్తూ, ప్రజలను ఆకట్టుకున్నారు. జయ కిషోరి భజన గాయకురాలిగానూ పేరొందారు. 4. సద్గురు జగ్గీ వాసుదేవ్ కర్ణాటకలో జన్మించిన సద్గురు జగ్గీ వాసుదేవ్ మోటివేషనల్ స్పీకర్, యోగా టీచర్. జగ్గీవాసుదేవ్ స్థాపించిన ఇషా ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. జగ్గీవాసుదేవ్‌ను సద్గురు అని కూడా పిలుస్తారు. జగ్గీవాసుదేవ్ యూట్యూబ్ చానళ్లు ఇంగ్లీషుతో సహా అనేక భాషల్లో అందుబాటులో ఉన్నాయి. 5. శ్రీశ్రీ రవిశంకర్ తమిళనాడులో జన్మించిన ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ తన ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ ద్వారా కోట్లాదిమందిని ప్రభావితం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 6. గౌర్ గోపాల్ దాస్ మహారాష్ట్రలో జన్మించిన మోటివేషనల్ స్పీకర్, కృష్ణ భక్తుడైన సన్యాసి గౌర్ గోపాల్ దాస్ 2023లో తన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలతో వార్తల్లో నిలిచారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా హోల్డర్ అయిన సంత్ గోపాల్‌దాస్ ఇస్కాన్‌లో సభ్యునిగా ఉన్నారు. 7. పండిట్ ప్రదీప్ మిశ్రా భోపాల్‌కు చెందిన పండిట్ ప్రదీప్ మిశ్రా.. శివ మహాపురాణం చెప్పడంలో ప్రసిద్ధి చెందారు. ఈ ఏడాది పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వార్తల్లో నిలిచారు. ఆయన ప్రవచనాలు వినేందుకు లక్షలాది మంది తరలివస్తుంటారు. 8. అనిరుద్ధాచార్య జీ మహారాజ్ ఈయన బృందావన నివాసి. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో జన్మించారు. తన ఉపన్యాసాలలో గోసేవ, జీవిత విలువల గురించి చెబుతుంటారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తుంటారు. అనిరుద్ధాచార్య జీ మహారాజ్‌కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. 9. వైష్ణవ్ రామ భద్రాచార్య వైష్ణవ శాఖకు చెందిన రామానందాచార్య స్వామి శ్రీరామ భద్రాచార్య మహారాజ్ ఐదేళ్ల వయసులో కంటిచూపు కోల్పోయారు. అయితే పీహెచ్డీ పొందడమే కాకుండా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ద్వారా దివ్యాంగులకు అనేక విద్యావకాశాలు కల్పించారు. 2015లో భారత ప్రభుత్వం అతనిని పద్మభూషణ్‌తో సత్కరించింది. 10. దేవకీ నందన్ ఠాకూర్ దేవకీ నందన్ ఠాకూర్ జీ ప్రముఖ కథకునిగా పేరొందారు. 2022, 2023లలో సనాతన ధర్మానికి మద్దతు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. దేవకీ నందన్ ఠాకూర్ మధురలోని ఓహవా గ్రామంలో జన్మించారు. తన ఆరేళ్ల వయస్సులో బృందావనం చేరుకుని, పరమ భక్తునిగా మారిపోయారు. ఇది కూడా చదవండి: యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది? -
ఈ ఏటి మేటి మహిళలు వీరే!
కొద్దిరోజుల్లో 2023 ముగియబోతోంది. డిసెంబరులో సగభాగం ఇప్పటికే గడిచిపోయింది. ఈ ఏడాది ప్రపంచంలోని పలు దేశాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చర్చలలోకి వచ్చిన మహిళలు కొందరు ఉన్నారు. అత్యధిక సంపాదనతో.. టేలర్ స్విఫ్ట్: ఈ సంవత్సరం వార్తల్లో ప్రముఖంగా కనిపించారు. ఫోర్బ్స్ జాబితాలో టేలర్ స్విఫ్ట్ ఐదవ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది అక్టోబర్‌లో టేలర్ స్విఫ్ట్ బిలియనీర్‌గా మారారు. టేలర్ స్విఫ్ట్ పేరొందిన సింగర్. ఆమె తన పాటలు, నటన ద్వారా ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన మొదటి మహిళగా నిలిచారు. టేలర్ స్విఫ్ట్ తన పాటలు, రాయల్టీల ద్వారా 500 మిలియన్ డాలర్లు (ఒక మిలియన్ అంటే రూ. 10 లక్షలు) సంపాదించారు. ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ ఏడాది వార్తల్లో కనిపించారు. ఫోర్బ్స్ జాబితాలో మెలోని నాల్గవ స్థానంలో నిలిచారు. 2022, అక్టోబరు 22న మెలోని ఇటలీ పగ్గాలు చేపట్టారు. మెలోనీ ఇటలీకి తొలి మహిళా ప్రధానమంత్రి. మెలోని 2014 నుండి ఇటలీ రైట్ వింగ్ పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీకి అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. ఫోర్బ్స్ జాబితాలో మూడో స్థానం.. కమలా హారిస్ కూడా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. కమలా హారిస్ అమెరికాకు చెందిన మొదటి నల్లజాతి మొదటి మహిళ. అలాగే ఆమె అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన మొదటి దక్షిణాసియా అమెరికన్. 2021, జనవరి 20న కమలా హారిస్ యూఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఫోర్బ్స్ జాబితాలో కమలా హారిస్ మూడో స్థానంలో నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలిగా.. క్రిస్టీన్ లగార్డ్.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలు. ఈ ఉన్నత పదవిని చేపట్టిన మొదటి మహిళ క్రిస్టీన్ లగార్డ్. ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. యూరో జోన్ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గించేందుకు ఆమె ప్రయత్నించారు. అత్యంత శక్తివంతమైన మహిళగా.. ఫోర్బ్స్ జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్లేయెన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఉర్సులా వాన్ డెర్లేయెన్ 2019, జూలైలో ఈ బాధ్యతలు చేపట్టారు. ఆమె యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా నియమితులైన మొదటి మహిళ. ఉర్సులా వాన్ డెర్లేయన్ అత్యంత శక్తివంతమైన మహిళగా పేరొందారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
ప్రపంచంలోని 10 అత్యంత ప్రసిద్ధ చర్చిలు (ఫొటోలు)
-
చైనాలోని రాచప్రాసాదం.. ఏకంగా 8వేలకు పైగా గదులు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాసాదం. చైనా రాజధాని బీజింగ్‌లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ప్రాసాదం ‘ఫర్బిడెన్ సిటీ’గా పేరు పొందింది. చైనాలోని మింగ్ వంశీయులు చేపట్టిన దీని నిర్మాణం 1406లో మొదలుపెడితే, 1420లో పూర్తయింది. హోంగ్వు చక్రవర్తి కొడుకు ఝుడి నాన్జింగ్ నుంచి బీజింగ్‌కు తన రాజధానిని మార్చుకున్నాక, బీజింగ్‌లో ఈ నిర్మాణం చేపట్టాడు. దాదాపు ఐదు శతాబ్దాల కాలం ఇది చైనా చక్రవర్తులకు రాచప్రాసాదంగా వర్ధిల్లింది. కమ్యూనిస్టు పాలన మొదలయ్యాక ఇది మ్యూజియంగా మారింది. దాదాపు ఒక ఊరంత విస్తీర్ణంలో ఉన్న ఈ సువిశాల ప్రాసాదంలో 980 భవంతులు, 8,886 గదులు ఉన్నాయి. యునెస్కో దీనిని 1987లోనే ప్రపంచ వారసత్వ నిర్మాణంగా ప్రకటించింది. ఈ అద్భుత నిర్మాణాన్ని ఏటా సుమారు 15 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. (చదవండి: Karnataka Sakaleshapura : సకలేశపుర చూడడానికి రెండు కళ్లు చాలవు.!) -
నవ్వులు పంచిన చింటుగాడు ఇక లేడు!
సోషల్ మీడియా ఎరాలో ఎప్పుడు ఎవరు ఎలా పాపులర్ అవుతారో ఊహించలేం. అలాగే ఆ వచ్చిన ఫేమ్ ఎంత త్వరగా పోతుందో కూడా చెప్పలేం. అయితే ఆ ఫేమ్‌ను కలకాలం గుర్తుండిపోయేలా చేసుకునేవాళ్లు కొందరే. ఈ క్రమంలో మనషులే కాదు.. మూగ జీవాలు సైతం విపరీతంగా ప్రజాదరణ పొందుతున్నాయి. అలా ఇంటర్నెట్లో నవ్వుల పువ్వులు పూయించిన ఓ శునకం ఇక లేదు అనే వార్త ఇంటర్నెట్తో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇంటర్నెట్లో ఇంతకాలం నవ్వులు పూయించిన చీమ్స్(Cheems) అనే శునకం ఇక లేదు. కొంతకాలంగా లుకేమియాతో బాధపడుతున్న ఆ కుక్క.. శనివారం ఉదయం సర్జరీ జరుగుతున్న టైంలో ప్రాణం విడిచింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన దాని యాజమాని.. దాని జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలంటూ అభిమానులను కోరుతున్నారు. ఇంతకీ ఈ షిబా ఇనూ జాతి కుక్కకి.. మన తెలుగులో చింటుగాడు, చీమ్స్మావా అనే ట్యాగ్ కూడా ఉంది. View this post on Instagram A post shared by Cheems_Balltze (@balltze) చీమ్స్(Cheems Dog) అసలు పేరు బాల్టెజ్. ఏడాది వయసున్నప్పుడు హాంకాంగ్‌కు చెందిన ఓ కుటుంబం దాన్ని దత్తత తీసుకుంది. ఓ ఫొటోగ్రాఫర్ కారణంగా దీని ఫొటోలు ఇంటర్నెట్కు చేరాయి. 2013 చివర్లో విపరీతంగా దాని ఫొటోలు వైరల్ అయ్యాయి. అంతేకాదు.. ఆ ఏడాది టాప్ మీమ్‌గా చీమ్స్‌కు గుర్తింపు కూడా దక్కింది. మరీ ముఖ్యంగా కరోనా టైం నుంచి చీమ్స్ హవా నడిచింది. కోకొల్లలుగా మీమ్స్ పుట్టుకొచ్చాయి చీమ్స్పై. ఆ మహమ్మరి టైంలో మానసికంగా కుంగిపోయిన ఎంతో మందికి నవ్వులు పంచింది ఈ శునకం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోనూ చింటు పేరు మీద ఇప్పటికీ రకరకాల వెర్షన్లతో(అందులో డబుల్ మీనింగ్వే ఎక్కువ) మీమ్స్ కనిపిస్తుంటాయి. చీమ్స్ లేకపోతేనేం.. దాని మీమ్స్.. అది పంచిన నవ్వులతో ఇంటర్నెట్ ప్రపంచంలో ఎప్పటికీ సజీవంగా ఉంటుందనేది అభిమానుల మాట. -
East Godavari Famous Foods: ఉమ్మడి తూ.గో. రుచులు.. మీరు ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
పిల్లల ఫేమస్ కోసం తల్లి తాపత్రయం.. ఊహకందని చేదు అనుభవం ఎదురయ్యేసరికి..
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలామంది తమకు లభించే ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. తమ వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తూ కూడా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు తమ పిల్లలను ఫేమస్ చేసేందుకు తపన పడుతుంటారు. పిల్లలు పుట్టినది మొదలు వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. చాలామంది తమకు పిల్లలకు పుట్టగానే వెంటనే ఫొటోతీసి, దానిని తమ చిన్నారి తొలి ఫోటో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పిల్లలు పుట్టిన వెంటనే వారి పేరుతో ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో అకౌంట్ క్రియేట్ చేసి, వారి ఫొటోలు షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్స్‌గా చూడాలనుకుని.. న్యూయార్క్ పోస్టులోని ఒక రిపోర్టు ప్రకారం కత్రీనా స్ట్రోడ్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తమకు పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్చేస్తూ వస్తోంది. తమ పిల్లలను సోషల్ మీడియా స్టార్స్‌గా చూడాలనుకుంది. కత్రీనాకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు 4 ఏళ్లు, కుమారునికి 3 ఏళ్లు. ఆమె తన ఇద్దరు పిల్లలను టిక్‌టాక్, ఇన్స్టాగ్రమ్లోఫేమస్ చేసింది. టిక్‌టాక్ యూజర్ చేసిన పనికి.. తమ పిల్లలను ఆడుకుంటున్నప్పటి ఫొటోలు, వీడియోలు, స్విమ్మింగ్ చేస్తున్నప్పటి వీడియోలను కత్రీనా తరచూ పోస్టు చేస్తుంటుంది. అయితే కత్రీనా 2022లో ఉన్నట్టుండి తమ పిల్లల ఫొటోలను, వీడియోలను షేర్ చేయడం మానివేసింది. టిక్‌టాక్ యూజర్ ఒకరు కత్రీనా కుమారుని ఫోటోను ఉపయోగించి, ఒక పోస్టు క్రియేట్ చేసి, ఆ పిల్లాడు తన కుమారుడు అని పేర్కొన్నాడు. చిన్నారుల ఫొటోలను సేవ్ చేసుకుని.. అమెరికాలోని కరోలినాలో ఉంటున్న కత్రీనా తనకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడుతూ ‘మా పిల్లల మాదిరిగానే చాలామంది పిల్లలకు ఇలాంటి ముప్పు ఎదురవుతోంది. చాలామంది సోషల్ మీడియాలో షేర్ అయ్యే చిన్నారుల ఫొటోలను సేవ్ చేసుకుని దుర్వినియోగం చేస్తున్నాన్నారని’ తెలిపింది. ఈ విషయాన్ని తన భర్తకు కూడా తెలియజేశానని పేర్కొంది. కత్రీనా తాను ఇన్నాళ్లూ చేస్తూ వచ్చిన పనికి పశ్చాత్తాప పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి.. ఈ చేదు అనుభవం ఎదురైన తరువాత ఆమె సోషల్ మీడియాలోని తమ పిల్లల ఫొటోలను, వీడియోలను తొలగించింది. 2021లో అమెరికాకు చెందిన ఒక రిపోర్టు ప్రకారం 77శాతం తల్లిదండ్రులు తమ పిల్లల ఫొటోలను ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు. పలువురు కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి చిన్నారుల ఫొటోలను, వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారని పలు ఉదంతాలు నిరూపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: సీమా, సచిన్‌ల స్టోరీని తలపించే ఇక్రా, ములాయం లవ్ స్టోరీ.. చివరికి? -
ఎంతటి సంపన్నుడయినా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మేనా?
మోసం... సాధారణంగా ఇది నమ్మకాన్ని ఆనుకుని ఉంటుందేమో! అందుకే నమ్మిన వ్యక్తులనే ఎదుటివారు నయవంచన చేస్తుంటారు. మోసాలకు పాల్పడేవారు ఎదుటివారి మానసిక బలహీనతలను ఉపయోగించుకోవడం ద్వారా ఎంతటి తెలివితేటలు కలిగినవారినైనా ఇట్టే బురిడీ కొట్టిస్తారు. నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని ఎంతటి సంపన్నులైనా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మగా మారుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో లెక్కకు అందనంత బిలియన్ డాలర్లకు సంబంధించిన మోసాల వార్తలు తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్, ఎఫ్‌టీఎక్స్ (బహామాస్-ఆధారిత క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్) వ్యవస్థాపకుడు. ఈయన తన కంపెనీ పెట్టుబడిదారులుగా ప్రముఖులను ఆకర్షించి, వారి చేత పెట్టుబడులు పెట్టించారు. ఈ ప్రముఖుల జాబితాలో టామ్ బ్రాడీ, స్టెఫ్ కర్రీ, నవోమి ఒసాకా, లారీ డేవిడ్, కెవిన్ ఓ లియరీ తదితరులు ఉన్నారు. బిలియనీర్ అయిన బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ సామ్రాజ్యం నవంబర్ 2022లో కూలిపోయింది. ఇప్పుడు ఎఫ్‌టీఎక్స్ దివాలా కంపెనీ. బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ మోసానికి సంబంధించిన పలు కేసులు కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఎలిజబెత్ హోమ్స్ చేసిన పని ఇదే.. ఇదే కోవలోనే ఎలిజబెత్ హోమ్స్ కథ కూడా ఉంటుంది. హోమ్స్ అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా బిలియనీర్‌గా పేరొందింది. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె నికర విలువ ఆస్తుల $4.5 బిలియన్లు. ప్రస్తుతం పనిచేయని ఆమె సంస్థ థెరానోస్‌లో ఆమె 50% వాటా కలిగివుంది. థెరానోస్ కంపెనీ పెట్టుబడిదారుల జాబితాలో రూపర్ట్ ముర్డోక్, వాల్టన్ కుటుంబంతో సహా ప్రపంచంలోని పలువురు ప్రముఖుల పేర్లు కనిపిస్తాయి. 2022లో ఆమెపై వచ్చిన ఆరోపణలలో దోషిగా తేలిన నేపధ్యంలో ఆమె యూఎస్ నుండి పారిపోయే ప్రయత్నంలో హోమ్స్ మెక్సికోకు వన్-వే టిక్కెట్‌ను కొనుగోలు చేసినట్లు కోర్టు వెల్లడించింది. బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్,హోమ్స్లు తెలివైనవారిని ప్రముఖులను ఎలా మోసం చేశారు? వీరు నైపుణ్యం కలిగిన మోసగాళ్ల మాదిరిగానే, ఎదుటివారి భావోద్వేగాలను, వారి అవసరాలను ఉపయోగించుకున్నారనే ఆరోపణలున్నాయి. భిన్నమైన వ్యక్తిత్వాలను గుర్తించి.. ఇలా మోసపోతున్న బాధితుల జాబితాలో అమాయకులు, వయసుపైబడినవారు సాధారణంగా కనిపిస్తారు. మోసాలకుగురయిన బాధితుల డేటా భిన్నమైన వ్యక్తిత్వాలను ప్రతిబింబిస్తుంది. ఇది చాలా నిశితంగా పరిశీలిస్తేనే అవగతమవుతుంది. దీనిపై పరిశోధకులు చేపట్టిన పరిశోధనలలో అధునికులు, బాగా చదువుకున్నవారు, యువకులందరూ స్కామ్‌లకు గురవుతారని వెల్లడయ్యింది. మోసగాళ్ళు నిర్దిష్ట జనాభాను తమ లక్ష్యంగా చేసుకుంటారు. ఇది కూడా చదవండి: 200 ఏళ్లనాటి ఫార్మ్‌హౌస్‌లో రహస్య భూగర్భం.. లోపల ఏముందో చూసేసరికి.. మితిమీరిన నమ్మకంతోనే.. దుర్బలత్వంతో కూడిన మితిమీరిన నమ్మకమే మోసాలకు ప్రధాన కారకం అని కూడా పరిశోధనలో కనుగొన్నారు. ఒక రంగంలో అత్యధిక విజయాలు సాధించిన వారి సామర్థ్యం మరో రంగంలో వీక్‌గా ఉండటాన్ని మోసగాళ్లు గ్రహిస్తారు. ఉదాహరణకు బెర్నీ మాడాఫ్.. ఆర్థిక నిపుణులు కాని సంపన్నులను, బాగా చదువుకున్న వృత్తిపరమైనవారిని సులభంగా మోసం చేశారని పరిశోధనలో తేలింది. చాలామంది విపరీతమైన నమ్మకం కారణంగానే స్కామ్‌ను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతారు. దీనికి ఉదాహరణ లాటరీ విజేతలు వీరే నంటూ వచ్చే ప్రకటనలు. ఇవి ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా చాలామంది వీటి బారిన పడి మోసపోతుంటారు. సాధారణంగా మోసగాళ్లు ఇతరులలో భవిష్యత్ భయం వంటి బలమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తారు. దీంతో మోసగాళ్ళు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. దీంతో వారు ఎదుటివారిలో తమపై మరింత నమ్మకం కలిగేలా వాతావరణం సృష్టిస్తారు. సెలబ్రిటీలు- సామాజిక గుర్తింపు సోషల్ ప్రూఫ్ అనేది మనస్తత్వవేత్త రాబర్ట్ సియాల్డిని రూపొందించబడిన పదం. వినియోగదారులు.. ఇతరులు ఏమి చేస్తున్నారో తెలుసుకుని, దానికి ప్రతిస్పందనగా తాము ఏమి చేయాలనేది నిర్ణయించుకుంటారు. దీనినే సోషల్ప్రూప్ అనవచ్చు. సెలబ్రిటీలు తమ సామాజిక గుర్తింపును ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు. పలువురు ప్రముఖులు ఆధునిక సాంకేతికతను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ఉత్పత్తి లేదా సేవల ప్రభావంపై అమితమైన నమ్మకం కలిగివుంటారు. క్రిప్టోకరెన్సీ బారినపడి.. అక్టోబర్ 2022లో కిమ్ కర్దాషియాన్.. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను ప్రచురించినందుకు $250,000 చెల్లించడంలో విఫలమైనట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ నేపధ్యంలో ఆమె యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కి $1.26 మిలియన్ సెటిల్మెంట్ చెల్లించడానికి అంగీకరించారు. ఆమె నెలకొల్పిన సంస్థ ఎథేరియం మ్యాక్స్ బారినపడి సెలబ్రిటీలు మడోన్నా, జస్టిన్ బీబర్, డీజే ఖలీద్, పారిస్ హిల్టన్, గ్వినేత్ పాల్ట్రో, స్నూప్ డాగ్, సెరెనా విలియమ్స్, జిమ్మీ ఫాలన్లు మోసపోయారని తేలింది. అప్రమత్తతతో నేరాలకు అడ్డుకట్ట పలు పరిశోధనల ప్రకారం మోసగాళ్ల కోణం నుండి చూస్తే ఆర్థికంగా దిగువస్థాయిలో ఉన్నవారి కంటే ధనవంతులను లేదా సంస్థలను మోసం చేయడం చాలా సులభం. నిపుణులు మోసాలకు గురైన వారిని ఇంటర్వ్యూ చేయగా వారు ‘బ్రాండ్’కు అమితంగా ప్రభావితమయ్యారని, మోసపోయినా వారు బహిర్గతం చేయడానికి, అవమానాన్ని ఎదుర్కొనేందుకు, లేదా నేరాన్ని నివేదించడానికి ఇష్టపడటం లేదని తేలింది. సోషల్ మీడియా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడి మోసాలకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో నిపుణులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి ఎందుకు పంపిస్తున్నారంటే.. -
పాములు పట్టడంలో ఎవరైనా అతని తర్వాతే.. ‘స్నేక్ మ్యాన్’ స్టోరీ!
ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ అటవీ విభాగంలో 21 ఏళ్లుగా పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన కెరియర్లో ఏకంగా 400 పాములను పట్టుకున్నాడు. ఈ ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా అతనికి వెంటనే ఫోన్ వస్తుంది. ఇంత భారీస్థాయిలో పాములను పట్టుకున్న ఆయనకు కొత్త గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 1,800 రకాల పాములు.. పామును చూడగానే ఎవరైనా భయంతో వణికిపోతారు. అది విషపూరితమైనా, ప్రమాదకారికాకపోయిన భయం అనేది అందరిలో కామన్. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1,800 రకాల పాములు ఉన్నాయి. వీటిలో 60 జాతుల పాములు అంత్యంత విషపూరితమైనవి. ఆ పాముకు సంబంధించిన ఒక్క చుక్క విషమైనా మనిషిని ఇట్టే బలిగొంటుంది. అయితే పాముల రక్షణ కోసం పాటుపడుతున్న కొందరిని మనం చూసేవుంటాం. వీరు పాములు ఎక్కడ కనిపించినా.. వాటిని జాగ్రత్తగా పట్టుకుని అడవులలో సురక్షితంగా విడిచిపెడుతుంటారు. 400 విషపూరిత పాములను పట్టుకుని.. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ అటవీ విభాగంలో పనిచేస్తున్న బేచూ సింగ్ గత రెండు దశాబ్ధాలలో పాములను పట్టుకోవడంతో విశేష అనుభవం సంపాదించాడు. ఇప్పటివరకూ 400 విషపూరిత పాములను పట్టుకుని, వాటిని సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టాడు. జైన్పూర్కు చెందిన ఆయన 2002 నుంచి రామ్‌పూర్ అటవీ విభాగంలో పనిచేస్తున్నాడు. అతను పాములను పట్టుకునే తీరును చూసిన అధికారులు, గ్రామస్తులు అతనిని ‘స్నేక్ మ్యాన్’ అని పిలుస్తుంటారు. నదుల నుంచి విషపూరిత పాములు.. రామ్‌పూర్ ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఉంది. నదుల నుంచి ఇక్కడకు పాములు వస్తుంటాయి. స్థానికంగా ఎవరికి పాము కనిపించినా వారు ఈ విషయాన్ని అటవీశాఖకు తెలియజేస్తారు. ఈ సమాచారం అందుకోగానే అక్కడి అధికారులు పామును పట్టుకునేందుకు ఆ ప్రాంతానికి బేచూ సింగ్‌ను పంపిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు.. రామ్‌పూర్ అటవీశాఖ డీఎఫ్ఓ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ బేచూసింగ్ స్నేక్ మ్యాన్ ఆఫ్ రామ్పూర్గా పేరొందాడని తెలిపారు. అతను 400 పాములను పట్టుకున్నప్పటికీ వాటికి ఎటువంటి హాని చేయకుండా అడవుల్లో విడిచిపెట్టారన్నారు. తమకు ఎక్కడి నుంచి అయినా పాముల గురించి సమాచారం వస్తే వెంటనే అక్కడకు బేచూసింగ్ను పంపిస్తామన్నారు. -
అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన సింగర్స్
-
మార్కెట్ విలువ ప్రకారం టాప్ 10 భారతీయ కంపెనీలు
-
ఆంధ్ర ప్రదేశ్‌లోని టాప్ 10 ప్రసిద్ధ దేవాలయాలు
-
ప్రపంచవ్యాప్తం గా ప్రసిద్ధి చెందిన టాప్ - 10 భారతీయ బ్రాండ్లు
-
ప్రపంచంలోని 10 ప్రసిద్ధి చెందిన టొంబ్స్
-
అత్యంత ప్రజాదరణ ఉన్న టాప్ 10 కళాకారులు
-
ప్రపంచంలోని టాప్ 10 స్ట్రీట్ మర్కెట్స్
-
టాప్ లేపేస్తున్న ‘పాప్’ సింగర్స్
-
ఒలింపిక్స్‌లో అత్యధిక బంగారు పతకాలు సాధించిన టాప్ 10 క్రీడాకారులు
-
ఆర్మీలో ఉన్నత స్థానంలో ఉన్న సెలెబ్రెటీస్
-
ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన పర్వత శిఖరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 శ్రీమంతులు వీరే
-
భారతదేశంలో టాప్ 10 వంతెనలు
-
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన టాప్ 20 మ్యూజియంలు
-
సోదరుడు దోస్తోవ్స్కీ
‘‘అమ్మా, నా బంగారం! నిజానికి మనం అంతా అందరికీ బాధ్యులమే. కానీ ఈ సత్యం మానవాళి గుర్తించటం లేదు. గుర్తించిననాడు భూమి స్వర్గంగా మారిపోతుంది.’’ (కరమజోవ్ సోదరులు)తెలుగు సాహిత్యం వరకూ గతేడాది చివర్లో ఒక అద్భుతం సంభవించింది. అది రష్యన్ మహానవల ‘బ్రదర్స్ కరమజోవ్’కు తెలుగు అనువాదం రావడం! ఆ నవల సృష్టికర్త, ఈ పదాన్ని దాని అక్షరమక్షరంతో నిజం చేసిన ఫ్యోదర్ దోస్తోవ్స్కీ (1821–1881) ద్విశతాబ్ది జయంతి కూడా గతేడాదే(నవంబర్ 11) కావడం మరో విశేషం. ఆ సందర్భాన్ని ఉత్సవం చేయడం కోసమే ‘రష్యన్ సాహిత్యాభిమాన వేదిక’ ఈ బృహత్ కార్యానికి పూనిక వహించింది. తొమ్మిది వందల పేజీల ఈ నవలను ‘సాహితి’ ప్రచురించింది. దీని అనువాదకురాలు అరుణా ప్రసాద్ ఒక జీవితకాలానికి సరిపడా ప్రేమకు అర్హురాలు! ఇంత ఊరించిన తర్వాత దీన్ని చదవడానికి పాఠకుడు ఆతృత పడితే దెబ్బతినొచ్చు. మొత్తంగా పుస్తకంలో ఏం ఉందో(‘పితృహత్య’) మొదటే తెలిసిపోతుంది. కాబట్టి, ఆ క్షణంలో ఏం మాట్లాడుకుంటున్నారో అదే ముఖ్యం. రంగస్థలంపై పాత్రలు వచ్చి, అంతరంగాన్ని ‘ఏకపాత్రాభినయం’లా ఎలా ఆవిష్కరించుకుంటాయో ఇవీ అలాగే చేసినట్టుగా తోస్తుంది. కానీ ఆలోచిస్తే అంత అవాస్తవం ఏమీ అనిపించదు. ఒక ఉద్వేగంలోకి వెళ్లిన మనిషి ఎలా వదరుతాడో ఇక్కడా అంతే! అయితే సంభాషణల్లో జీవితపు మౌలిక ప్రశ్నల్ని ఎలా వెతుక్కుంటారన్నది ముఖ్యం. ఎన్ని చిత్తవృత్తులు, ఎన్ని వృత్తాంతాలు, ఎన్ని ఒప్పుకోళ్లు, ఎన్ని వేడుకోళ్లు! ఇందులో ప్రతి ఒక్కరూ ‘పాపం’ చేసినట్టే ఉంటారు. దానికి తగిన ‘శిక్ష’ అనుభవిస్తూనే ఉంటారు. అల్పులు, ఉన్మత్తులు, మొరటు మనుషులు, ఏ పెద్దరికమూ నిలుపుకోలేని హాస్యగాళ్లు... అసలు ‘నీచుడు’ అనుకునేవాడిలోనూ అత్యంత సున్నితపు పొరలు ఉంటాయని తెలుస్తున్నప్పుడు ఆనంద బాష్పాలు కారుతాయి. తను చచ్చేంత డబ్బు అవసరంలో ఉన్నా, ఆ డబ్బు కోసం అవసరమైతే తండ్రినే చంపేంత కోపంగా ఉన్నా, అదే డబ్బు అడిగితే తనకు కాత్యా ఇస్తుందని తెలిసినా, ఆమెను కాదని గృషెంకాను ప్రేమిస్తున్నప్పడు, కాత్యాను ఆ డబ్బు అడగలేకపోయానని ద్మిత్రీ విచారణలో చెప్పడం మానవాంతరంగపు లోతుకు అద్దం. ఇంతే లోతైన మరో ఘట్టం– ‘ఎల్డర్’ జోసిమా దగ్గర తన తప్పును ఒప్పుకున్న ‘రహస్య అతిథి’... ఆయన ముందు నైతికంగా తగ్గిపోయానని భావించి తిరిగి ఆయననే చంపాలనుకోవడం! మన మూలమూలలా ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, రచయిత ఎంత సూక్ష్మాంశాల దగ్గరికి వెళ్తాడంటే ఇంత సున్నితమైన నవల మరొకటి ఉందా అనిపిస్తుంది. ఒకే అమ్మాయి (గృషెంకా) కోసం తండ్రీ కొడుకులు ఫ్యోద్ర్, ద్మిత్రీ పోటీ పడటం; ఒకే అమ్మాయి(కాత్యా) కోసం అన్నాదమ్ములు ద్మిత్రీ, ఇవాన్ బరిలో ఉన్నట్టనిపించడం... జీవితపు చేదు వాస్తవం. ఇందులో ముగ్గురు సోదరులైన ద్మిత్రీ ఒక మృగంలానూ, ఇవాన్ మేధావిలానూ, అల్యోషా ఆధ్యాత్మిక జీవిగానూ కనబడతారు. అయితే దోస్తోవ్స్కీకి మృగాల పట్ల తక్కువ అభిప్రాయం లేదు. ‘మృగాలెప్పుడూ, ఎన్నటికీ మానవుడంత క్రూరంగా ఉండజాలవు’. బహు గొంతులు, సూక్ష్మంలోనూ సూక్ష్మం దోస్తోవ్స్కీని అనితర సాధ్యమైన రచయితగా నిలబెడతాయి. ప్రతి పాత్రలోనూ రచయిత ఎంతగా పరకాయ ప్రవేశం చేస్తాడంటే, అదింక ఇంకోలా మాట్లాడే వీలున్నట్టు కనబడదు. చిన్న పాత్రలైన గ్రిగొరీ, మేడమ్ హోలకోవ్, లిజి, కొల్యాకు కూడా ఇది వర్తిస్తుంది. ఆఖరికి, తుంటరి పిల్లాడు ఇల్యూష గుండుసూదిని గుచ్చిన రొట్టెను విసరడంతో తిని చనిపోయిన కుక్క జుట్చ్‌కా కూడా ఒక ‘వ్యక్తి’గా దర్శనమిస్తుంది. అదే మథనంతో మరణానికి చేరువైన ఇల్యూషా కూడా అంతే నొప్పి పుట్టిస్తాడు. జీవితాన్ని చివరికంటా శోధించి, అందులోని సర్వ వికారాల్నీ తడుముతూ కూడా అది ప్రేమకు అర్హమైనదే అని చాటడం దోస్తోవ్స్కీ లక్ష్యం! అందుకే దేవుడి సృష్టిలోని సకల దుర్మార్గాలనూ పరిపరి విధాలుగా ఇవాన్ ఎత్తి చూపినప్పుడు కూడా దానికి స్పందనగా– తనను నిర్బంధించిన మహా ధర్మాధికారి పెదవులను క్రీస్తు ముద్దాడిన కథనాన్ని పునర్జీవిస్తూ – అల్యోషా, అన్న పెదవుల మీద ముద్దు పెట్టుకుంటాడు. ఆధ్యాత్మిక రాజ్యస్థాపన ద్వారానే నిజమైన సోదర భావం నెలకొంటుందని దోస్తోవ్స్కీ విశ్వాసం. అరెస్టయ్యి, గంటలకొద్దీ సాగిన విచారణ తర్వాత, అలసటతో నిద్రపోయినప్పుడు... తనకు తలగడ పెట్టే దయ చూపినవారెవరని ద్మిత్రీ కదిలిపోతాడు. అదెవరో రచయిత చెప్పడు. కానీ ఎంతటి నిరాశలోనైనా ఒక దయగల చేయి ఎప్పటికీ ఉంటుందని చాటుతాడు. ‘అటువంటి ఒక్క జ్ఞాపకం ఉన్నా అది కూడా మనను కాపాడటానికి ఉపయోగపడుతుంది’ అని ముగింపులో వీడ్కోలు చెబుతూ పిల్లలకు అల్యోషా చెప్పేది ఇందుకే. అసలు హంతకుడు ఎవరో బయటపడేప్పటికి ఈ నవల కాస్తా సస్పెన్స్ థ్రిల్లర్ రూపు తీసుకుంటుంది. కానీ దీని విస్తృతి రీత్యా ఆ వర్గానికి పరిమితం చేయడం దీన్ని సరైన అంచనా కట్టకపోవడమే అవుతుంది. ఇది సమస్త మానవాళి పశ్చాత్తాపాల చరిత్ర! జీవన మధువును నింపుకోవడానికి ప్రతి ఒక్కరూ పడే తహతహ. పాపభీతితో కుమిలిపోయే ఎందరో జీవన్మృతుల వ్యథ. 1880లో ఈ నవల వచ్చిన 4 నెలలకు దోస్తోవ్స్కీ మరణించాడు (ఈ ఫిబ్రవరి 9న 140వ వర్ధంతి.) ఆ లెక్కన ఇది ఒక మహారచయిత చివరి వీలునామా కూడా! ‘అద్భుతాలను’ ఆశిస్తాడు మనిషి. కానీ అద్భుతం వల్ల కాక మామూలుతనం వల్ల దాని విలువ పెరగాలి. ఈ పుస్తకం ఎంత మామూలుదంటే, ఆ మామూలుతనమే అద్భుతంగా తోస్తుంది. -
అసలు పేరు ‘నగ్న పర్వతం’.. కానీ పర్యాటకులు మరోలా పిలుస్తారు!
కొన్ని ప్రయాణాలు ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటాయో అంతే భయాన్నీ క్రియేట్ చేస్తాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన శిఖరాల్లో తొమ్మిదవ శిఖరంగా పేరున్న ‘నంగా పర్బత్’ పై జర్నీ కూడా అలాంటి అనుభవాన్నే ఇస్తుంది. పాకిస్తాన్‌లోని రెండవ ఎత్తయిన పర్వతం ఇది. ఆక్రమిత కాశ్మీరులోని గిల్గిట్ బాల్టిస్తాన్‌లో చిలాస్, అస్తోర్ ప్రాంతాల మధ్య ఉన్న ఈ శిఖరం ఎత్తు 26,660 అడుగులు (8,130 మీటర్లు). నంగా పర్బత్ అంటే ‘నగ్న పర్వతం’ అని అర్థం. 1953లో హెర్మన్ బుహ్ల్ (ఆస్ట్రియన్ జర్మన్) అనే పర్వతారోహకుడు మొదటిసారి ఈ పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వతం నిటారుగా ఉండడం వల్ల దీన్ని ఎక్కడం చాలా కష్టం. 20వ శతాబ్దం మొదట్లో ఈ పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో అనేకమంది మరణించడంతో దీనికి ‘కిల్లర్ పర్వతం’ అనే పేరూ వచ్చింది. ఇది చాలా ఇరుకైన రహదారి కావడంతో దీని మీద ప్రయాణం చాలా ప్రమాదకరం. కారకోరం హైవే దగ్గర ఆరంభమయ్యే ఈ పర్వత మార్గం గుండా.. 10 మైళ్ల దూరంలో ప్రయాణిస్తే ఒక అందమైన పల్లెటూరు వస్తుంది. ఈ క్యాంప్‌ను మోస్ట్ డేంజరెస్ అండ్ థ్రిల్లింగ్ టూర్ అంటారు పర్వత పర్యాటక ప్రియులు. -
Pala Peni: ఆహా! ఆ రుచే వేరు
ఆహార ప్రియులు ఇష్టపడే సరికొత్త రుచి ఇది. ఈ పేరు చెబితే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, గోవా, ఒడిశా ప్రాంతాలకు చెందిన వారితో పాటు ఉత్తర భారతీయుల నోరూరుతుంది. మైదా, నెయ్యి లేదా డాల్డాతో తయారు చేసే ఈ పదార్థాన్ని పాలలో ముంచి తింటే ఆహా! ఆ రుచే వేరు. సామాన్యుడికి సైతం అందుబాటు ధరతో లభించే ఈ స్వీట్ తయారీకి గుంతకల్లు కేంద్రంగా మారింది. దేశవ్యాప్తంగా పేరు గాంచిన ప్రముఖ స్వీట్స్ విక్రయదారులు సైతం వీటిని తమ దుకాణాల్లో ఆకర్షణీయంగా ప్రదర్శించి విక్రయాలు సాగిస్తుండడం గమనార్హం. ఇంతకూ ఆ స్వీట్ ఏమిటో తెలుసుకోవాలని ఆత్రుత ఉంది కదూ? అయితే వెంటనే గుంతకల్లుకు వెళదాం రండి... గుంతకల్లు టౌన్(అనంతపురం జిల్లా): గుంతకల్లు రైల్వే స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న మోదీనాబాద్ హంపయ్య కాలనీకి చేరుకోగానే పాలపేనీ తయారీలో నిమగ్నమైన కుటుంబాలు కనిపిస్తాయి. కాలనీలోని పలు కుటుంబాల వారు కుటీర పరిశ్రమను తలపించేలా పాలపేనీని తయారు చేస్తుంటారు. ఈ తయారీపై ఆధారపడి ప్రత్యక్షంగా సుమారు 150 కుటుంబాలు.. పరోక్షంగా వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఒక్కో తయారీ కేంద్రంలో రోజూ 10 మందికి తగ్గకుండా ఉపాధి పొందుతుంటారు. పేనీల తయారీలో ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చినా... గుంతకల్లు వాసులు చేతితో తయారు చేసిన పేనీల రుచి అమోఘమని ఆహారప్రియులు కొనియాడుతుంటారు. చేతితో పేనీలు చేస్తున్న గౌసియా నైపుణ్యం తప్పనిసరి.. సన్నటి దారపు పోగులను తలపించేలా కనిపించే పాల పేనీ తయారీ ఎంతో కళాత్మకంగా ఉంటుంది. ఇందుకు ఎంతో నైపుణ్యం అవసరం. ఉదయాన్నే స్వచ్ఛమైన మైదా పిండిని నీళ్లలో కొన్ని గంటల పాటు నానబెట్టి తర్వాత చేతితోనే గట్టిగా పిసికి ముద్దలుగా చేసుకుంటారు. వీటికి నెయ్యి లేదా డాల్డా పట్టిస్తూ రోల్ చేస్తూ నాలుగైదు పొరలుగా చేస్తారు. తర్వాత చేతి వేళ్లతో ఆడించి దారం మందంలో సేమియా (పేనీ) చుట్టలుగా మారుస్తారు. ఇలా మార్చిన పేనీలను నెయ్యి లేదా డాల్డాలో దోరగా వేయించి వెలికి తీస్తారు. గుంతకల్లు కేంద్రంగా రోజూ 2వేల కిలోల పాలపేనీ తయారవుతూ ఉంటుంది. చాలా మంది జిల్లాతో పాటు పొరుగునే ఉన్న కర్నూలు జిల్లా వీధి వ్యాపారులు, స్వీట్ స్టాల్ నిర్వాహకులు వీటిని కిలో రూ.120 చొప్పున (డాల్డాతో చేసినవి) కొనుగోలు చేసి, వారివారి ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. చాలా మంది గంపల్లో తీసుకెళ్లి రైళ్లలో ప్రయాణికులకు విక్రయించి జీవనం సాగిస్తున్నారు. పేనీలకు పాలు, చక్కెర కలిపి ఆరగిస్తే ఆ రుచిని ఎన్నటికీ మరువలేమని ఆహార ప్రియులు పేర్కొంటున్నారు. -
టేస్ట్ అదరహో.. మటన్ లందు కర్నూలు మటన్ వేరయా !
సాక్షి,కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాష్ట్రంలో కర్నూలు పొట్టేలు మాంసానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడి మాంసం రుచికరంగా ఉండటమే కాకుండా ధర కూడా ఎక్కువగా ఉంటుంది. నగరంలో సుమారు 70 మంది మాంస విక్రయదారులు ఉన్నారు. పొట్టేళ్లను సమీప ప్రాంతాల్లో జరిగే సంతల్లో కొంటుంటారు. నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోని పెబ్బేరు గ్రామం పొట్టేళ్ల సంతకు ప్రసిద్ధి. అక్కడ సంత శనివారం జరుగుతుంటుంది. అలాగే జిల్లాలోని పత్తికొండ, నందికొట్కూరు కూడా సంత జరిగే ప్రాంతాలు. అక్కడ సోమవారం జరుగుతుంటుంది. ఇక్కడి మాంస విక్రయదారులు ఈ మూడు ప్రాంతాల నుంచి వారం రోజులకు సరిపడే పొట్టేళ్లు తెచ్చుకుని కోస్తుంటారు. ఈ ప్రాంతంలో నెల్లూరు జుడిపి, నెల్లూర్ బ్రౌన్ అనే రెండు రకాల జాతి పొట్టేళ్లు లభిస్తాయి. పైగా పొట్టేలు మాంసంలో కరోనా నిరోధించే శక్తి ఎక్కువ. ఇందులో ఒక ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. కోడి మాంసంలో అది లభించదు. ఇక్కడి పొట్టేళ్లు సారవంతమైన నేలల్లో మేస్తాయి. ఈ నేలల్లో వాటికి మంచి పోషకాహారాలు లభిస్తాయి. పొరుగు జిల్లాతో పోలిస్తే.. అనంతపురం జిల్లాతో పోలిస్తే ఇక్కడి మాంసమే నాణ్యమైనది. రుచిలోనూ మేలైన రకంగా ఉంటుంది. ఈ విషయం శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ఆ జిల్లాలోని పొట్టేళ్లలో కర్ణాటక ప్రాంతంలోని మాండియా బ్రీడ్ కలుస్తుంటుంది. పొట్టేళ్ల సంతాన ఉత్పత్తి సమయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆడ పొట్టేలు కానీ లేక మగ పొట్టేలు కానీ మాండియా బీడ్‌కు చెందినదైతే సంతానోత్పత్తి ద్వారా వచ్చిన పొట్టేలు మాంసంలో రుచి ఉండదు. అందువల్ల ధరల్లోనూ తేడా ఉంటుంది. అనంతపురంలో మాంసం ధర రూ. 400కు కిలో ఉంటే కర్నూలులో మాత్రం రూ. 700 పల్కుతోంది. అయితే అనంతపురం మాంసంలో ఎముకలు, పేగులు వంటి వ్యర్థ పదార్థాలు 30 శాతమే ఉంటాయి. కర్నూలు మాంసంలో ఆ శాతం 40 దాకా ఉంటుంది. వ్యర్థాలు ఎక్కువ ఉండటం కూడా మాంసం ధరపై ప్రభావం చూపిస్తుందని కొందరు విశ్లేషకులు చెబుతారు. జాతీయ పరిశోధన కేంద్రానికి రవాణా.. జాతీయ పరిశోధనా కేంద్రం హైదరాబాదులోని చెంగిచెర్లలో ఉంది. కర్నూలు మాంసం నిత్యం ఈ కేంద్రానికి ఎగుమతి అవుతుంటోంది. వధశాలలు ఎలా ఉండాలి, ఏ ప్రాంతంలో మాంసం కోయాలి, ఎలాంటి జంతువులను కోయాలి, ఏఏ జాగ్రత్తలు పాటించాలి వంటి అనేక అంశాలను అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా నిర్ధారిస్తుంటారు. వారు పరిశోధనలకు కర్నూలు మాంసాన్నే ఉపయోగిస్తారు. అదే సంస్థలోని విక్రయ కేంద్రంలోనూ కర్నూలు మాంసాన్ని అందుబాటులో ఉంచుతారు. మాంసానికి కూడా ఇంత స్టోరీ ఉంటుందా అనేది ఇప్పుడే తెలుస్తోంది కదూ! ఇది ముమ్మాటికి నిజం. నేల స్వభావం, అక్కడి గడ్డిమేత ఆధారంగా తేడా: డాక్టర్ రమణయ్య, పశుసంవర్ధక శాఖ జేడీ నేల స్వభావం, అక్కడి గడ్డిమేత ఆధారంగా జీవాల మాంసాల్లో తేడా ఉంటుంది. కర్నూలు నగరంతో పాటు చుట్టూ ఉండే నేల సారవంతమైనది. ఇక్కడ మొలిచే గడ్డిలోనూ తేడా ఉంటుంది. ఈ గడ్డిని మేతగా తీసుకునే జీవాల మాంసంలోనూ తేడా కనిపిస్తుంది. కర్నూలుతో పోలిస్తే హైదరాబాదు మాంసానికి కూడా రుచి తక్కువే. అందువల్లే అక్కడి పరిశోధనా కేంద్రం వారు చెంగిచెర్లకు తెప్పించుకుంటారు. చదవండి: Raghuveera Reddy: ‘కట్టిపడేసే’ దృశ్యం, వైరల్ ఫోటో -
పసిడికి పెట్టింది పేరు.. నరసాపురం గోల్డ్ మార్కెట్
సాక్షి, నరసాపురం (ప.గో): అరబ్ దేశాల్లో తయారయ్యే బంగారు ఆభరణాల డిజైన్లు రోజుల వ్యవధిలోనే పసిడి ప్రియుల కోసం అక్కడి గోల్డ్ మార్కెట్లో రెడీగా ఉంటాయి. జ్యూయలరీ అయినా, గోల్డ్ బిస్కట్లయినా అక్కడి నుంచే రాష్ట్రంలోని చాలా షాపులకు సరఫరా అవుతుంటాయి. అందుకే నరసాపురం గోల్డ్ మార్కెట్ రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మన జిల్లాలో గోల్డ్ మార్కెట్‌ను శాసిస్తున్న ఈ పట్టణం తెలుగు రాష్ట్రాల్లోనే నాణ్యమైన బంగారం బిజినెస్‌కు పెట్టిందిపేరు.. శతాబ్దం పైనుంచే మేలిమి బంగారాన్ని వినియోగదారులకు అందిస్తున్న ఇక్కడి మార్కెట్ ఉభయ గోదావరి జిల్లాల్లో హోల్‌సేల్ వ్యాపారానికి పేరుపడింది. అందుకే కార్పొరేట్ సంస్థలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో బంగారం మార్కెట్లో ఇక్కడి వర్తకులు సత్తా చాటుతున్నారు. 1920లలో బంగారం వ్యాపారానికి పునాది దాదాపు 100 సంవత్సరాల ముందు నుంచే నరసాపురం బంగారం వ్యాపారానికి ప్రఖ్యాతి గాంచింది. 1920 ప్రాంతంలో ఇక్కడ పసిడి మార్కెట్‌ను ప్రారంభించారు. రాజస్థాన్‌కు చెందిన కొన్ని జైన్ కుటుంబాలు బ్రిటిష్ హయాంలో ఇక్కడ స్థిరపడ్డారు. మొదట తాకట్టు వ్యాపారం ప్రారంభించిన జైన్లు తరువాత కాలంలో బంగారం వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో చిన్నగా ప్రారంభమైన వ్యాపారం తరువాత కాలంలో భారీగా విస్తరించింది. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 400 వరకూ జ్యూయలరీ షాపులు ఉండగా ఒక్క నరసాపురంలోనే 150 వరకూ షాపులు ఉన్నాయి. రిటైల్ వ్యాపారమే కాదు.. ఇక్కడి నుంచి ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని షాపులకు హోల్‌సేల్‌గా బంగారం సప్లయ్ చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జ్యూయలరీ షాపులకు కూడా ఇక్కడి హోల్‌సేల్ వ్యాపారులు బంగారం, వెండి సప్లయ్ చేస్తారు. ఇందులో బిస్కెట్ల నుంచి ఆభరణాల వరకూ అన్నీ ఉంటాయి. పలు కార్పొ రేట్ షాపులకు కూడా ఇక్కడి డీలర్లు సప్లయ్ చేస్తుంటారు. నరసాపురం కేంద్రంగా రోజుకు రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకూ వ్యాపారం సాగుతుంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్లలో వ్యాపారం రోజుకు మరో రూ.2 నుంచి రూ.3 కోట్లు అదనంగా ఉంటుంది. 1980 నుంచి రెడీమేడ్ ఆభరణాల హవా బ్రిటిష్ వారి హయాంలో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అమల్లో ఉండేది. బంగారు బిస్కెట్ల అమ్మకాలకు కొందరికే అనుమతి ఉండేది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లకు నరసాపురం వచ్చేవారని చెబుతారు. ముఖ్యంగా జల రవాణా సౌలభ్యం ఉండటంతో వేరే రాష్ట్రాల వ్యాపారులు అక్రమంగా ఇక్కడకు బంగారం తరలించి అమ్మకాలు చేసేవారని ప్రచారం ఉంది. ఆ సమయంలోనే నరసాపురం బంగారం వ్యాపారానికి పేరుపడింది. 1980 నుంచి రెడీమేడ్ ఆభరణాల హవా ప్రారంభమైంది. ఆ అవకాశాన్ని కూడా ఇక్కడి వ్యాపారులు అందిపుచ్చుకున్నారు. దుబాయ్, సింగపూర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, అమృత్సర్ ఇలా దేశ, విదేశాల్లో తయారయ్యే అధునాతన డిజైన్లు రోజుల వ్యవధిలోనే ఇక్కడి వ్యాపారులు తయారుచేసేవారు. 30 మంది వరకూ హోల్‌సేల్ వ్యాపారులు.. నరసాపురంలో 30మంది వరకూ హోల్‌సేల్ వ్యాపా రులు ఉన్నారు. వీరికి నరసాపురం కేంద్రంగా ముంబై, చెన్నై, కోల్‌కతాలో అనుబంధ కార్యాలయాలు ఉంటాయి. రెండు రాష్ట్రాల్లోని జ్యూయలరీ షాపుల నుంచి వచ్చే ఆర్డర్ల మేరకు బంగారం, వెండి తెప్పిస్తారు. వెండి ఆభరణాల తయారీకి దేశంలో తమిళనాడులోని సేలం ప్రసిద్ది. తరువాత స్థానంలో నరసాపురం ఉండటం మరో విశేషం. మన రాష్ట్రంలో వెండి హోల్‌సేల్ వ్యాపారం నరసాపురం నుంచే పెద్దస్థాయిలో జరుగుతుంది. గోల్డ్ ఎగ్జిబిషన్లో నరసాపురం స్టాల్స్ ప్రతీఏటా జులై–నవంబర్ మాసాల మధ్యలో ముంబైలో ఇంటర్నేషనల్ గోల్డ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. గల్ఫ్ దేశాలతో పాటు లాటిన్ అమెరికా, జర్మనీ నుంచి కూడా కస్టమర్లు ఇక్కడకు వస్తారు. ఈ ఎగ్జిబిషన్లో నరసాపురం వ్యాపారుల స్టాల్స్‌కు మంచి క్రేజ్. దీంతో నరసాపురం పసిడి ఖ్యాతి ప్రపంచ గుర్తింపు పొందింది. జిల్లా ప్రజలతో జైన్లు మమేకం బంగారం వ్యాపారం కోసం గణేష్మల్, శాంతలాల్, జోట్మల్ నట్మల్, గులాబ్‌చంద్ కుటుంబాలు వచ్చాయి. ప్రస్తుతం నరసాపురంలో 94 జైన్ కుంటుంబాలు ఉన్నాయి. జిల్లాలోని మరికొన్ని పట్టణాలకు కూడా వీరి వ్యాపారం విస్తరించింది. బంగారంతో పాటు ఇతర వ్యాపారాల్లో కూడా వీరు స్థిరపడ్డారు. ఎన్నో ఏళ్ల కష్టం దాగిఉంది నరసాపురం పేరు చెబితే ఇప్పుడు బంగారం పేరు గుర్తుకువస్తుంది. ఓ వ్యాపారం ద్వారా ఊరికి పేరు రావడం గొప్ప విషయం. దీని వెనుక కొన్ని జైన్ కుటుంబాల సంవత్సరాల కష్టం దాగిఉంది. వేరే రాష్ట్రం నుంచి వచ్చినా కూడా ఇక్కడి ప్రజలతో వారు ఏర్పర్చుకున్న బంధం, సేవా దృక్పథం ఈ ఉన్నతికి కారణం. భవిష్యత్‌లో కూడా ఇది కొనసాగాలి – సీహెచ్ రెడ్డప్ప ధవేజీ, వ్యాఖ్యాత, నరసాపురం అన్ని డిజైన్లూ దొరుకుతాయి ఏ మోడల్ ఆభరణం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. అందుకే దూరప్రాంతాల్లో ఉన్న చుట్టాలు కూడా ఎప్పుడైనా బంగారం కొనాలనుకుంటే ఇక్కడకు వచ్చి మా ఇళ్లలో ఉండి కొనుక్కుని వెళతారు. ఫోన్లు చేసి బంగారం రేటు ఎంతుందో కనుక్కోమంటారు. ఈ ప్రాంతంలోని అందరి ఇళ్లలోనూ ఇవే అనుభవాలు. బంగారానికి మా ఊరు పెట్టిందిపేరు. – మేకల కాశీఅన్నపూర్ణ, గృహిణి, నరసాపురం మా పెద్దల కృషే కారణం నరసాపురం బంగారం వ్యాపారానికి పేరు రావడానికి కారణం మా పెద్దలు చేసిన కృషే. 1980లో రెడీ మేడ్ ఆభరణాల రాకతో వ్యాపారం బాగా పెరిగింది. దుబాయ్‌లో జరిగే ఇంటర్నేషనల్ గోల్డ్ ఎగ్జిబిషన్‌కు చాలాసార్లు వెళ్లాను. మా ఆభరణాలకు అక్కడ మంచి పేరుంది. – వినోద్‌కుమార్‌జైన్, నరసాపురం బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
కుకింగ్ క్వీన్ .. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్..
పిల్లల చదువులు పూర్తయ్యి ఉద్యోగాల్లో స్థిరపడగానే పెళ్లి చేసి కోడళ్లకు కిచెన్ బాధ్యత లు అప్పజెప్పి మనవళ్లు మనవరాండ్రతో ఆడుకోవాలనుకుంటారు మన భారతీయ సంప్రదాయ మహిళలు. కానీ నిషా మధులిక మాత్రం అలా అనుకోలేదు. జీవితంలో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్‌ను ప్రారంభించి కోట్లమంది అభిమానుల్ని సంపాదించారు. దాంతో ఆమె సోషల్ మీడియా స్టార్‌గానే గాక ..‘‘పాపులర్ ఇండియన్ వెజిటేరియన్, యూట్యూబ్ చెఫ్, రెస్టారెంట్ కన్సల్టెంట్, ఫుడ్ బ్లాగర్, టెలివిజన్ పర్సనాలిటీ’’ వంటి అనేక సెలబ్రిటీ హోదాలను సొంతం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పెరిగిన నిషాకి ఢిల్లీకి చెందిన ఎంఎస్ గుప్తాతో వివాహం జరిగింది. ఢిల్లీకి వచ్చేసిన నిషాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల పెంపకంలోనూ, మరోపక్క భర్త వ్యాపారంలో సాయం చేస్తూ బిజీగా ఉండేవారు. పిల్లలు చదువులు పూరై తమ ఉద్యోగాలతో బిజీ అయిపోయారు. దీంతో అప్పటిదాకా తీరిక లేకుండా గడిపిన నిషాకి ఒక్కసారిగా తీరిక ఏర్పడడంతో తనని తాను బిజీగా ఉంచుకునేందుకు ఏదైనా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో తన కొడుకు బ్లాగ్‌కు రాస్తుండడం చూసి.. తనకు బాగా అనుభవమున్న కుకింగ్‌ను బ్లాగ్స్లో రాయాలనుకున్నారు. కొడుకు సాయంతో.. భర్త, కొడుకు సాయంతో.. నిషా 2007లో కుకింగ్ బ్లాగ్‌ను ప్రారంభించి దానిలో వంటల తయారీ గురించి రాసేవారు. తర్వాత తనే సొంత వెబ్సైట్ https:/nishamadhulika.com లో తన తల్లి దగ్గర నేర్చుకున్న విభిన్న వంటకాలు వండుతూ అవి ఎలా వండాలో రాసి పోస్టులు పెట్టేవారు. నిషా వంటలను ఇష్టపడిన అభిమానులు ‘‘వీడియోలు పెట్టండి మేడం’’ అని అడగడంతో.. వీడియోలు కూడా అప్లోడ్ చేయడం మొదలు పెట్టారు. అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటిదాకా 1300 కుపైగా వంటల వీడియోలను అప్లోడ్ చేశారు. సిసలైన శాకాహార వంటలు మధులిక కుటుంబం 2009 లో నోయిడాకు మకాం మార్చింది. అప్పుడే ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. శాకాహార వంటకాలకు ప్రాధాన్యత నిచ్చిన నిషా ఉల్లి, వెల్లుల్లి లేని వంటకాల వీడియోలు పోస్టు చేసేవారు. ఈ వీడియోలు మిలియన్ల మందిని ఆకర్షించేవి. ప్రస్తుతం నిషా ఛానల్ సబ్స్క్రైబర్స్ కోటీ పదిహేను లక్షలకు పైనే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వేలమంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఐదుగురితో టీం .. యూ ట్యూబ్ వీడియోల ద్వారా ఆదాయం వస్తుండడంతో.. మంచి కిచెన్‌ను సెటప్ చేసి, ఐదుగురితో టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీమ్ రెండుమూడు వంటల వీడియోలు తీసి.. తరువాత ఛానల్లో అప్లోడ్ అయిన వంటకాలకు వచ్చే కామెంట్లు, అభిప్రాయాలను సమీక్షిస్తూ లోపాలను ఎలా సరిదిద్దాలో చూసుకునేది. టాప్‌టెన్ బెస్ట్ యూ ట్యూబర్.. మొదట్లో బ్లాగ్స్, వీడియోలు చేయడం ప్రారంభించినప్పుడు ఇది వ్యాపారంగా చూడని నిషా.. తనకు తెలిసిన అనేక వంటకాలను హిందీలో అప్లోడ్ చేసేవారు. తరువాత ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలో ఉన్న తన ఫాలోవర్స్ తమ భాషల్లో వీడియోలు అప్లోడ్ చేయమని అడగగా వాళ్ల భాషల్లో వంటల వీడియోలు, సబ్‌టైటిల్స్‌తో పోస్టు చేసేవారు. అంతేగాక పలు వెబ్సైట్లకు వంటల ఆర్టికల్స్ రాసిచ్చేవారు. దీంతో సబ్స్క్రైబర్స్తోపాటు, ఆదాయం పెరిగింది. ఈ క్రమంలో ఆమె 2014లో యూట్యూబ్ చెఫ్స్ టైటిల్, 2017లో టాప్ యూట్యూబ్ కుకింగ్ కంటెంట్ క్రియేటర్ అవార్డులు అందుకున్నారు. ఇండియన్ టాప్‌టెన్ బెస్ట్ యూ ట్యూబ్ స్టార్స్ జాబితాలో.. రెండుసార్లు నిషా స్థానం దక్కించుకున్నారు. అంతేగాక ప్రముఖ మ్యాగజీన్లు బ్లూమ్‌బర్గ్, ఎకనామిస్ట్, ఇండియా టుడే వంటివి ఆమె సక్సెస్ స్టోరీని ప్రచురిస్తూ ‘కుకింగ్ క్వీన్’గా అభివర్ణించాయి. లోక్‌సభ టీవీ ఆమె ఇంటర్వ్యూనూ టెలికాస్ట్ చేయడం విశేషం. -
సీఎం కార్యాలయానికి బెదిరింపు సందేశాలు
న్యూఢిల్లీ: తెలుగులో కొద్ది రోజుల క్రితం ఓ సినిమా వచ్చింది. దానిలో హీరో ఫేమస్ అవ్వడం కోసం రాజకీయ నాయకుడి మీద దాడి చేస్తాడు. సేమ్ ఇలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ డెలివరీ బాయ్ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని భావించాడు. దాని కోసం ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రితో సహా పలువురు రాజకీయ నాయకులను బెదిరిస్తూ.. ఈ మెయిల్స్ పంపాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగు చూసింది. వివరాలు.. ముంబైకి చెందిన అభిషేక్ తివారి అనే వ్యక్తి చదువు మధ్యలో మానేసి ప్రస్తుతం డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే ఉద్యోగ జీవితం పట్ల నిరాశతో ఉన్న అభిషేక్ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని భావించాడు. అందుకోసం తొలుత ముంబైలోని ఓ జాతీయ పార్టీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్స్ పంపాడు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఇలా కాదని భావించి ఈ సారి ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు నాయకులను చంపుతానని బెదిరిస్తూ.. మెయిల్స్ పంపాడు. అంతేకాక ఢిల్లీలో ఉన్న ఓ జాతీయ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని బాంబు పెట్టి పేల్చేయబోతున్నట్లు మెయిల్ చేశాడు. ఈ మెయిల్స్ గురించి సీఎం కార్యాలయ సిబ్బంది ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఐపీ అడ్రెస్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి నిందితుడు ముంబై నాలసొపరా ప్రాంతంలో ఉన్నాడని తెలియడంతో ఓ బృందం అక్కడకు వెళ్లి అభిషేక్ తివారీని అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా.. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతో ఈ పని చేసినట్లు ఒప్పుకున్నాడు. -
30 ఏళ్లుగా అదే రుచి..
సాక్షి, భైంసా(ముథోల్) : భైంసాలో ఇప్పటికీ గడ్డెన్న ఆఫీసుగా చెప్పుకునే ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి వచ్చే కార్యకర్తలకు ఆనవాయితీగా అటుకులు, పేలాలే టిఫిన్‌గా అందించడం కొనసాగుతోంది. ముథోల్ గడ్డపై చెరగని ముద్ర వేసుకున్న గడ్డెన్న కాకా వారసత్వం కొనసాగుతోంది. దివంగత గడ్డెన్న ఆరుసార్లు రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. గడ్డెన్న బతికున్నంతకాలం ఇక్కడి వారంతా కాకా అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆయన ఉన్న ప్రతిరోజు ఇక్కడికి వచ్చే కార్యకర్తలందరికీ అల్పాహారాలు తినిపించి, యోగక్షేమాలు తెలుసుకుని పంపేవారు. సలీం చేతిలో.. సలీం.. ఈ పేరు ముథోల్ నియోజకవర్గంలో అందరికీ చూపరిరిచితం. దివంగత గడ్డెన్న మన మధ్యలేక పదిహేనేళ్ల కాలం గడుస్తోంది. గడ్డెన్న బతికున్నంతకాలం అక్కడికి వచ్చేవారికి ఆయన వంట మనిషి సలీం అటుకులు, పేలాలు తాళింపు వేసి సిద్ధంగా ఉంచేవారు. తన వద్దకు వచ్చిన అనుకూలురైనా, వ్యతిరేకులైనా ఉదయం వేళ వస్తే టిఫిన్, రాత్రి వేళ వస్తే భోజనం చేయించి పెట్టేవారు. ముథోల్ నియోజకవర్గ ప్రజలు గడ్డెన్న కాకా అభిమానులు పట్టణానికి ఏ పని కోసం వచ్చినా ఇక్కడి గడ్డెన్న కాకా ఆఫీసులో టిఫిన్ చేసి వెళ్లేవారు. 2004 ఏప్రిల్ 20న గడ్డెన్న కాకా మరణ అనంతరం ఆయన కుమారులు విఠల్‌రెడ్డి, సూర్యంరెడ్డిలు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 30 ఏళ్లుగా.. ముప్పయ్యేళ్లుగా అప్పుడు, ఇçప్పుడు అదే సలీం వంట మనిషిగా ఉన్నారు. గడ్డెన్న కాకా బతికున్న సమయంలోనూ విఠల్‌రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినప్పడు సలీ మే వంట మనిషిగా ఉన్నాడు. ముప్పయ్యేళ్ల నుంచి ఒకే రుచితో అటుకులు, పేలాలు అల్పాహారాన్ని తయారు చేసి పెడుతున్నాడు. కాకా అభిమానులు ఆయన కార్యకర్తలు సలీం చేతి అటుకులు, పేలాలుతినేందుకే ఇష్టపడుతుం టా రు. రుచికరమైన అటుకులు, పేలాలు తినేం దు కు గడ్డెన్న కాకా ఆఫీసుకు వస్తుంటారు. అప్ప ట్లో గడ్డెన్న వద్ద ఇప్పట్లో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి వద్ద వంట మనిషిగా పని చేస్తున్న సలీం ఎలాం టి అహంభావం లేకుండా సదాసీదాగా ఉంటాడు. ఇప్పటికీ ఆ కుటుంబమే.. ఈ కుటుంబం వద్దే పనిచేయాలని అనిపిస్తుంది. గడ్డెన్న సాబ్ జమానా నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. ఎంతోమంది పిల్లలు అప్పట్లో తండ్రులతో కలిసి ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడంతా రాజకీయ నాయకులుగా ఎదిగి మండల స్థాయి పదవులు చేస్తున్నారు. గడ్డెన్న కాకా దివంగతులయ్యాక విఠల్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా నేను వంటమనిషిగానే ఉన్నాను. వంటమనిషిలా కాకుండా కుటుంబ సభ్యునిగా చూసుకునే గడ్డిగారి ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేను. ఎన్నిరోజులైనా ఇక్కడే వంటమనిషిగా కొనసాగుతాను. – సలీం, వంటమనిషి -
తెలంగాణ వంటలకు ప్రపంచస్థాయి గుర్తింపు
జిల్లా వనరుల కేంద్రం చైర్మన్ డాక్టర్ యాదగిరి ఆకట్టుకున్న జిల్లా స్థాయి తెలంగాణ వంటల పోటీ బిజినేపల్లి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన ప్రాంత వంటలకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందని జిల్లా వనరుల కేంద్రం చైర్మన్ డాక్టర్ యాదగిరి అన్నారు. పాలెం శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో బుధవారం జిల్లాస్థాయి లో తెలంగాణ వంటకాల పోటీలను నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ యాదగిరి మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు ఉపాధి మార్గాలను ఎంచుకోవాలన్నారు. మనం మన గురించి కాకుండా సమాజ హితం కోసం పాటు పడాలన్నారు. గతంలో తెలంగాణ వంటలకు గుర్తింపు ఉండేది కాదని, నేడు జాతీయ స్థాయిలో తెలంగాణ వంటకం గట్కాకు గుర్తింపు రావడం అందుకు ఉదాహరణ చెప్పుకొచ్చారు. పాలమూరు విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ప్రపంచంలో హోటల్ మేనేజ్మెంట్ విద్యకు ఎంతో ఆదరణ పెరిగిందని, విద్యార్థులు ఆ రంగాన్ని ఎంచుకొని ఉన్నతంగా రాణిస్తున్నారని అన్నారు. ఆకట్టుకున్న తెలంగాణ వంటలు జిల్లాస్థాయిలో నిర్వహించిన తెలంగాణ వం టలు కళాశాలలో తోటి విద్యార్థులను ఆకట్టుకున్నాయి. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థినీలు పోటీల్లో తమ ప్రతిభను కనబర్చారు. నాగర్‌కర్నూల్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు కుర్బానికా మీట తయారు చేసి కృష్ణవేణి, స్రవంతిలు మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు. పాలెం డిగ్రీ కళాశాల విద్యార్థులు బీట్రూట్ రైస్ వండి మానస, సీత, సింధూలు ద్వితీయ బహుమతి, ప్రూట్స్ సలాడ్ తయారు చేసి ఓరియంటల్ కళాశాల విద్యార్థులు హరిణి, శ్రీదేవిలు తృతీయ బహుమతి పొందారు. విద్యార్థులను డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేందర్‌సింగ్ అభినందించారు. కార్యక్రమంలోడి.కె.వసంతారెడ్డి,కృష్ణ, నాగరా జు, రాధాకుమారి, పద్మజారాణి పాల్గొన్నారు. -
‘ఇష్టపడి చదివితేనే ఉన్నతి’
కామారెడ్డి : కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(ట్రస్మా) ఆ«ద్వర్యంలో కామారెడ్డిలో పదో తరగతి విద్యార్థులకు విద్యపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరేందుకు ప్రయత్నించాలన్నారు. విజయాన్ని అందిపుచ్చుకోవడానికి ఇష్టంతో చదవాలని సూచించారు. పదోతరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం, పదో తరగతి తర్వాత చదవాల్సిన కోర్సుల ఎంపిక తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో బల్రాం, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు టి.ఆనంద్‌రావ్, ప్రధాన కార్యదర్శి పి.రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి కృష్ణమూర్తి, మాస్టర్ మైండ్స్ అధినేత మోహన్, ఆయా పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రముఖ హిప్నాటిస్ట్ అనుమానాస్పద మరణం
న్యూఢిల్లీ: ప్రసిద్ధ పారానార్మల్ పరిశోధకుడు, హిప్నాటిస్ట్ గౌరవ్ తివారీ (32 )అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఢిల్లీలోని తన ఫ్లాట్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో గత గురువారం చనిపోయారు. భారత పారానార్మల్ సొసైటీ వ్యవస్థాపక సీఈవో తివారీ ద్వారక ప్రాంతంలో తన ఫ్లాట్ లోని బాత్రూమ్ లో శవమై కనిపించారు. బాత్రూమ్ నుంచి దబ్ మన్న శబ్దం బిగ్గరగా వినిపించడంతో కుటుంబ సభ్యులు ఎలర్ట్ అయ్యారు. బలవంతంగా తలుపు తెరిచి అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే గౌరవ్ చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఏడాది జనవరిలో వివాహం అయిన గౌరవ్ తల్లిదండ్రులు, భార్యతో కలిసి నివసిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునేంత పెద్ద సమస్యలేవీ లేవని తెలుస్తోంది. ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదికలో మెడ చుట్టూ నల్ల లైన్ ఉండడంతో , ఊపిరి ఆడక చనిపోయి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఒక ప్రతికూల శక్తి తన వైపు లాక్కుంటోందని గౌరవ్ తివారి ఒక నెల క్రితం భార్యతో చెప్పినట్టు తెలుస్తోంది. ఎంత ప్రయత్నించినా... అదుపు చేయడం కష్టంగా ఉందని భార్య దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పనిలో ఒత్తిడికారణంగా అలా అలోచిస్తున్నారని తాను పెద్దగా పట్టించుకోలేదని పోలీసులకు తెలిపింది. పారానార్మల్ (విపరీత మానసిక ప్రవర్తన గల) సమాజం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2009 లో ఏర్పాటు పారానార్మల్ సొసైటీని స్థాపించి తన సేవలను అందిస్తున్నారు. విపరీత మానసిక ప్రవర్తన గల దాదాపు6000 ప్రదేశాలను సందర్శించి.. దర్యాప్తు చేపట్టారు. ఇంతలో ఆయన మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల విచారణ కొనసాగుతోంది. -
చేదుగా మారుతున్న 'రసగుల్లా'..!
రసగుల్లా కథ కంచికి చేరేట్టు కనిపించడం లేదు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య మొదలైన 'రస'వత్తరమైన చర్చకు తెరపడటం లేదు. రసగుల్లా వంటకం మాదంటే మాదంటూ.. పేటెంట్ కోసం రెండు రాష్ట్రాల గొడవలు ముదిరి రసకందాయంలో పడ్డాయి. న్యాయ నిర్ణేతగా తమిళనాడుకు బాధ్యతలు అప్పగించినా... విషయం తేలేట్టు కనిపించడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్ మినిస్టర్ డాక్యుమెంటరీలున్నాయంటూ వాదన లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది. భారత దేశానికి తూర్పుభాగంలో ప్రసిద్ధి చెందిన తియ్యని పంచదార వంటకం.. ఇప్పుడు రెండు రాష్ట్రాలమధ్య చేదుగా మారింది. రసగుల్లా పూరిలో పుట్టిందని ఒడిశా... కోల్ కతాలో పుట్టిందని పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కొన్నాళ్ళుగా కొట్టుకుంటున్నాయి. పేటెంట్ హక్కులు తమకే కావాలంటూ ఇరు రాష్ట్రాలూ పోటీ పడుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ మంత్రి మళ్ళీ రసగుల్లాకు తామే యజమానులమనడం తగవుకు దారితీసింది. రసగుల్లా బెంగాల్ దేనని నిరూపించడానికి తమ వద్ద పుష్కలంగా ఆధారాలు (డాక్యుమెంటరీలు) ఉన్నాయని మంత్రి రబిరంజన్ చటోపాధ్యాయ అనడం మళ్ళీ మొదటికొచ్చింది. రసగొల్లాగా పిలిచే... గుండ్రని తీపి పదార్థం కేవలం బెంగాల్ కు చెందినదేనని, ఒడిషా ఆరు వందల ఏళ్ళక్రితం తమ రాష్ట్రంలో పుట్టిందని చెప్పినా తగిన.. ఆధారాలు (డాక్యుమెంటరీలను) చూపించ లేకపోయిందని వెస్ట్ బెంగాల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అంటున్నారు. అయితే పంచదార పాకాన్ని ఆరు వందల ఏళ్ళక్రితమే తమ రాష్ట్రం కనుగొందని, దీనిపై నిర్థారణకోసం ఒడిశా ప్రభుత్వం మూడు కమిటీలను కూడ వేసిందని ఒడిశా మంత్రి ఇటీవల తెలిపారు. అంతేకాదు తమ రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయంలో మొదటిసారి 12వ శతాబ్దంలోనే ఈ స్వీట్ వడ్డించినట్లుగా ఆధారాలున్నాయని, బెంగాల్ చూపించే ఆధారాలు 150 ఏళ్ళ క్రితం వేనని అంటున్నారు. కాగా బెంగాల్ ప్రభుత్వం ఈ రుచికరమైన వంటకం తమదేనంటూ తాజాగా ఓ అప్లికేషన్ సమర్పించడంతోపాటు, దానికి సంబంధించిన వివరణాత్మక పత్రాలను కూడ అందజేసినట్లు బెంగాల్ మినిస్టర్ చెప్పారు. -
పిండివంటలకు కేరాఫ్ అడ్రస్ చిన్నఅమిరం
-
జానకిరామ్‌కు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్ శివారులోని హరికృష్ణ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు చితికి నిప్పంటించిన పెద్ద కుమారుడు తారక రామారావు శోకసంద్రంలో నందమూరి కుటుంబం.. బోరున విలపించిన హరికృష్ణ జానకిరామ్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి హరికృష్ణ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో రాజకీయ, సినీ ప్రముఖుల రాక హైదరాబాద్/ మొయినాబాద్ రూరల్: నందమూరి జానకిరామ్‌కు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు అశ్రునయనాలతో ఆదివారం తుది వీడ్కోలు పలికారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని ముర్తుజాగూడ సమీపంలో ఉన్న హరికృష్ణ వ్యవసాయ క్షేత్రంలో జానకిరామ్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా ఆకుపాముల గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ (42) మృతి చెందిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి జానకిరామ్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించి.. శనివారం రాత్రే ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మసాబ్‌ట్యాంక్ ప్రాంతంలోని హరికృష్ణ నివాసానికి పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. జానకిరామ్ మృతి వార్త తెలిసిన నందమూరి బంధుగణంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక కన్నీటిలో మునిగిపోయిన హరికృష్ణను, మా నాన్నకేమైందంటూ రోదిస్తున్న జానకిరామ్ కుమారుడు తారకరామారావును, సోదరులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లను బంధుమిత్రులు, ఆప్తులు ఓదార్చారు. హీరో నందమూరి బాలకృష్ణ, నంద మూరి బంధువులు హరికృష్ణ ఇంటి వద్దకు చేరుకొని జానకిరామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బంధువులు, అభిమానుల సందర్శనార్థం జానకిరామ్ పార్థివ దేహాన్ని ఇంటి ఆవరణలో ఉంచారు. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్, దగ్గుబాటి వెంకటే శ్వరరావు తదితరులు అంతిమ సంస్కారాలకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియల కోసం ఒకటిన్నర గంటల సమయంలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ముర్తుజాగూడ గ్రామ సమీపంలోని హరికృష్ణ ఫామ్‌హౌస్‌కు పార్థివ దేహాన్ని తరలించారు. వాహనం ముందు సీట్లో హీరో కల్యాణ్‌రామ్, జానకిరామ్ పెద్ద కుమారుడు తారకరామారావు కూర్చున్నారు. ఆ వాహనం వెనుక నారా లోకేశ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు వారి వాహనాల్లో వెళ్లారు. ఫామ్‌హౌస్‌లో జానకిరామ్ కుమారుడు తారక రామారావుతో అంత్యక్రియలు నిర్వహింపజేశారు. ఈ సమయంలో కుమారుడిని గుర్తుచేసుకుంటూ హరికృష్ణ బోరున విలపించారు. పరామర్శించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర ప్రముఖులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9.30 గంటలకు నందమూరి హరికృష్ణ నివాసానికి వెళ్లి జానకిరామ్ కుటుంబసభ్యులను ఓదార్చారు. వారితో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు పరిటాల సునీత, చిన రాజప్ప కొల్లు రవీంద్ర, ఎంపీలు చిరంజీవి, కె.నారాయణ, మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రులు కె.విజయరామారావు, పెద్దిరెడ్డి, కాసు కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే బాబూమోహన్, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు అడుసుమిల్లి జయప్రకాశ్, కృష్ణయాదవ్, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. కాగా సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, డి.సురేష్‌బాబు, ఆదిశేషగిరిరావు, బోయపాటి శ్రీనివాస్, పూరీ జగన్నాథ్, జగపతిబాబు, బండ్ల గణేశ్, శ్రీను వైట్ల, చలపతిరావు, అల్లు అర్జున్, నారా రోహిత్, మంచు విష్ణు, అల్లరి నరేష్, జీవిత, వందేమాతరం శ్రీనివాసరావు, గీతాంజలి, పృథ్విరాజ్, జయవాణి, అఖిల్ తదితరులు హరికృష్ణ కుటుంబాన్ని ఓదార్చారు. ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు మునగాల: జానకిరామ్ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు నల్లగొండ జిల్లా మునగాల ఎస్ఐ ఎస్.రమేశ్ తెలిపారు. ఎస్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కోనాయిగూడానికి చెందిన రైతు వెంకన్న ఆకుపాముల జాతీయ రహదారి పక్కన సాగు చేసిన వరినారును తీసుకెళ్లడానికి సొంత ట్రాక్టర్‌తో వచ్చాడు. వరినారు తీసుకొని స్వగ్రామానికి వెళ్లేందుకు ఆకుపాముల శివారులో రాంగ్రూట్లో వచ్చి.. ట్రాక్టర్‌ను యూ టర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న జానకిరామ్ టాటా సఫారీ వాహనం ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌ను డ్రైవర్ నడుపుతున్నాడా..? యజమాని నడిపాడా? అన్నది ఇంకా తేలాల్సి ఉందని ఎస్ఐ చెప్పారు. ప్రస్తుతానికి పరారీలో ఉన్న డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని, అతని పేరు కూడా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ కుటుంబంతో నా అనుబంధం ప్రత్యేకమైనది. జానకిరామ్ మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ నా మోకాలి గాయం కారణంగా.. వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించలేకపోయాను. ఈ విషాదం నుంచి కోలుకునే స్థైర్యాన్ని నందమూరి కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.’’ - కైకాల సత్యనారాయణ ‘‘అన్నగారు ఎన్టీఆర్‌తో నాకున్న అనుబంధం గురించి తెలిసిందే. చెన్నైలో ఉన్నప్పట్నుంచీ హరికృష్ణ కుటుంబంతో స్నేహబంధం ఉంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత తన తాత పేరు మీద జానకిరామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్‌ను ఆరంభించారు. అప్పుడు నిర్మాతల మండలిలో సభ్యత్వం కోసం వేరే నిర్మాత సంతకం అడిగితే.. తను నా దగ్గరికే వచ్చాడు. మా కుటుంబంతో అంత చనువుగా ఉండేవాడు. అలాంటి జానకిరామ్ ఇప్పుడు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. దేవుడు హరికృష్ణ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.’’ - మోహన్‌బాబు ‘జానకిరామ్ మరణవార్త చాలా బాధ కలిగించింది. ‘గోపాల గోపాల’ షూటింగ్ నిమిత్తం వారణాసిలో ఉన్నందున రాలేకపోయాను. హరికృష్ణ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను. జానకిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’’ - పవన్ కల్యాణ్ -
హరికృష్ణ గెలుపు
దోహా: ఖతార్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మూడో విజయాన్ని సాధించాడు. శనివారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హరికృష్ణ 45 ఎత్తుల్లో బార్టోజ్ సోకో (పోలండ్)పై గెలిచాడు. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికకు రెండో ఓటమి ఎదురైంది. భారత్‌కే చెందిన సూర్యశేఖర గంగూలీతో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో హారిక 35 ఎత్తుల్లో ఓడిపోయింది. -
పోరాడి గెలిచిన వీణ
ఆడబిడ్డ పుట్టిందని ముఖం చాటేసిన అత్తింటివారు మూడు రోజులుగా మెట్టినింటి ఎదుట బాధితురాలి నిరశన ఎమ్మెల్యే జోక్యంతో కథ సుఖాంతం తిరుపతి క్రైం/మంగళం: తిరుపతి భవానీ నగర్‌కు చెందిన హరికృష్ణకు, జీవకోనకు చెందిన వీణాకు గత ఏడాది వివాహం జరిగింది. ఇతను మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. వీరికి 11 నెలల క్రితం పాప పుట్టింది. కొడుకు పుట్టలేదని వీణను కాపురానికి తీసుకురాలేదు. కనీసం పాపను చూసేందుకు కూడా హరికృష్ణ, అతని అమ్మానాన్నలు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం వీణ తన కుమార్తెను తీసుకుని అత్తగారింటికి చేరుకుంది. అయితే ఆమె అత్తామామ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. హరికృష్ణ కూడా దుకాణం మూసేసి అదృశ్యమయ్యాడు. దీంతో బాధితురాలు అత్తగారింటి ముందు నిరాహార దీక్షకు దిగింది. ఈమెకు పలు ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. చివరకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వెంకటమరణ అక్కడకు చేరుకుని బాధితురాలికి అండగా నిలిచారు. హరికృష్ణను పిలిపించి ఇద్దరితో మాట్లాడారు. మీడియా సమక్షంలో మళ్లీ పూలదండుల మార్పించి ఒకటి చేశారు. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటానని అతడు తెలిపాడు. తమను కలిపేందుకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.