పరమశివునికి మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ దేవాలయాలు ఉన్నాయి. శుక్రవారం శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో విదేశాల్లోని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పశుపతినాథ్ ఆలయం (నేపాల్)
ఈ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది ఇది శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయాన్ని హిందువులతో పాటు బౌద్ధమతస్తులు కూడా సందర్శిస్తుంటారు.
కైలాస మానసరోవరం (చైనా)
కైలాస మానసరోవరం అనేది ఒక పవిత్రమైన సరస్సు. ఈ పర్వతం టిబెట్ చైనాలో ఉంది. ఇది శివుని నివాసం అని హిందువులు నమ్ముతారు.
ప్రంబనన్ ఆలయం (ఇండోనేషియా)
ప్రంబనన్ ఆలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్‌లో ఉంది. దీనిని ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయమని చెబుతుంటారు. ఇక్కడ ఎనిమిది దేవాలయాల సమూహం ఉంది.
మున్నేశ్వరం (శ్రీలంక)
ఈ ఆలయం శ్రీలంకలో ఉంది. దీనిని 'త్రికోణమాలి' అని కూడా పిలుస్తారు. మున్నేశ్వరం అత్యంత పురాతనమైన శివుని ఆలయం. రావణుని వధించిన తర్వాత రాముడు ఈ ఆలయంలో తన ఆరాధ్యదైవమైన శివుణ్ణి పూజించాడని చెబుతారు.
గౌరీశంకర్ ఆలయం (నేపాల్)
ఈ ఆలయం నేపాల్‌లో ఉంది. ఆలయంలో శివపార్వతులు కొలువయ్యారు. ఈ ఆలయం ఖాట్మండుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కటాస్రాజ్ ఆలయం (పాకిస్థాన్)
ఈ ఆలయం పాకిస్తాన్‌లో ఉంది . దీనిని 'సెవెన్ పూల్స్ టెంపుల్' అని కూడా పిలుస్తారు.
అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం (మలేషియా)
అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం మలేషియాలోని జోహోర్ బారులో ఉంది. ఇది మలేషియాలోని పురాతన హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది.
శ్రీ శివ మందిర్ (ఇంగ్లండ్)
శ్రీ శివాలయం ఇంగ్లండ్‌లో ఉంది. ఈ ఆలయం లండన్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శివాలయం (నెదర్లాండ్స్)
ఈ ఆలయం నెదర్లాండ్స్‌లో ఉంది. ఈ ఆలయం ఆమ్‌స్టర్‌డామ్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శివాలయం (జర్మనీ)
ఈ ఆలయం జర్మనీలో ఉంది. ఈ ఆలయం బెర్లిన్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment