shiva temples
-
కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ చరిత్ర ఇదే!
-
కోనసీమ నలుచెదురులా పురాణ ప్రసిద్ధి
సాక్షి, అమలాపురం: పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. గౌతమీ చెంతన వెలసిన కోటిపల్లిలో శ్రీపార్వతీ సమేత సోమేశ్వరస్వామి, నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూ.. వృద్ధ గౌతమీ నదీపాయ చెంతన వెలసిన భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, క్షణ కాలంలో ముక్తిని ప్రసాదించే ముక్తేశ్వరం క్షణ ముక్తేశ్వరస్వామి, అనంత కుండల ఫలాన్ని ప్రదర్శించే కుండలేశ్వరంలోని కుండలేశ్వరస్వామి, దేశంలో ఎక్కడా లేని విధంగా శివపార్వతులు ఒకే పీఠంపై కొలువైన పలివెల ఉమా కొప్పేశ్వర స్వామి ఆలయం.. ఇలా చెప్పుకొంటూపోతే పచ్చని కోనసీమ నలుచెదురులా పురాణ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలకు కొదవేలేదు. గోదావరి సప్త నదీపాయల ప్రవాహంతో పునీతమైన కోనసీమ బుధవారం జరిగే మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కనుంది.పంచారామం క్షేత్రం ద్రాక్షారామంపంచారామ క్షేత్రమైన త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం. మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ఇదొకటి. 12వ శక్తి పీఠంగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ఇక్కడ వెలిశారు. దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ శివ లింగం 18 అడుగుల ఎత్తు ఉంటోంది. -
శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు..
-
పంచారామ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
-
కార్తీక మాసం తొలి సోమవారం.. భక్తులతో శైవక్షేత్రాలు కిటకిట
-
ఏఏ దేశాల్లో శివాలయాలు ఉన్నాయి?
పరమశివునికి మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ దేవాలయాలు ఉన్నాయి. శుక్రవారం శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో విదేశాల్లోని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుపతినాథ్ ఆలయం (నేపాల్) ఈ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది ఇది శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయాన్ని హిందువులతో పాటు బౌద్ధమతస్తులు కూడా సందర్శిస్తుంటారు. కైలాస మానసరోవరం (చైనా) కైలాస మానసరోవరం అనేది ఒక పవిత్రమైన సరస్సు. ఈ పర్వతం టిబెట్ చైనాలో ఉంది. ఇది శివుని నివాసం అని హిందువులు నమ్ముతారు. ప్రంబనన్ ఆలయం (ఇండోనేషియా) ప్రంబనన్ ఆలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్‌లో ఉంది. దీనిని ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయమని చెబుతుంటారు. ఇక్కడ ఎనిమిది దేవాలయాల సమూహం ఉంది. మున్నేశ్వరం (శ్రీలంక) ఈ ఆలయం శ్రీలంకలో ఉంది. దీనిని 'త్రికోణమాలి' అని కూడా పిలుస్తారు. మున్నేశ్వరం అత్యంత పురాతనమైన శివుని ఆలయం. రావణుని వధించిన తర్వాత రాముడు ఈ ఆలయంలో తన ఆరాధ్యదైవమైన శివుణ్ణి పూజించాడని చెబుతారు. గౌరీశంకర్ ఆలయం (నేపాల్) ఈ ఆలయం నేపాల్‌లో ఉంది. ఆలయంలో శివపార్వతులు కొలువయ్యారు. ఈ ఆలయం ఖాట్మండుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కటాస్‌రాజ్ ఆలయం (పాకిస్థాన్) ఈ ఆలయం పాకిస్తాన్లో ఉంది . దీనిని 'సెవెన్ పూల్స్ టెంపుల్' అని కూడా పిలుస్తారు. అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం (మలేషియా) అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం మలేషియాలోని జోహోర్ బారులో ఉంది. ఇది మలేషియాలోని పురాతన హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది. శ్రీ శివ మందిర్ (ఇంగ్లండ్) శ్రీ శివాలయం ఇంగ్లండ్‌లో ఉంది. ఈ ఆలయం లండన్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివాలయం (నెదర్లాండ్స్) ఈ ఆలయం నెదర్లాండ్స్‌లో ఉంది. ఈ ఆలయం ఆమ్స్టర్డామ్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివాలయం (జర్మనీ) ఈ ఆలయం జర్మనీలో ఉంది. ఈ ఆలయం బెర్లిన్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. -
శివాలయాలకు పోటెత్తిన భక్తులు
సాక్షి, శ్రీశైలం: కార్తీకమాసం చివరి రోజు, చివరి సోమవారం కావడంతో శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడి పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరించారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగించారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించారు. వేకువ జాము నుంచే క్యూలైన్లో వేలాదిమంది భక్తులు శివుని దర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. శీఘ్రదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. సాయంత్రం పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు. తిరుపతిలో.. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కపిల తీర్థం ఆలయం జలపాతం వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, దీపారాధన చేశారు. ఇందుకోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చివరి సోమవారం కావడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శ్రీకాళహస్తిలో.. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం స్వర్ణముఖి నదిలోకి కార్తీక దీపాలు వదిలిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో.. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా గోదావరి ఘాట్‌లో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు. రాజమండ్రిలో ఉమా మార్కండేయ స్వామి ఆలయం భక్త జన సందోహంతో కిటకిటలాడుతోంది. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంకు తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. ద్రాక్షారామ భీమేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా.. పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. -
తప్పక చూడాల్సిన అద్భుతమైన శివాలయాలు (ఫొటోలు)
-
హరహర మహాదేవ
సాక్షి, అమరావతి/శ్రీశైలం టెంపుల్/సాక్షి, నరసరావుపేట/శ్రీకాళహస్తి రూరల్: హరహర మహాదేవ..శంభో శంకర అంటూ శైవ క్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని పోటెత్తిన భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడాయి. ప్రముఖ శివాలయాల్లో తెల్లవారు జాము నుంచే భక్తులు నదులు, కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులు తీరారు. పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు, వివిధ వాహన సేవలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించుకుని భక్తులకు కనుల విందు చేశారు. శ్రీశైలం భక్తజనసంద్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తజనసంద్రంగా మారింది. నల్లమల కొండలు శివనామస్మరణతో పరవశించాయి. శనివారం మల్లన్న, భ్రమరాంబదేవిలకు దేవస్థాన ధర్మకర్తల మండలి అ«ధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో ఎస్.లవన్న దంపతులు, ప్రధానార్చకులు వీరయ్యస్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు శివపార్వతులకు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పరిమళపుష్పాలతో అలంకరించి ఆశీనులు గావించారు. వేదపండితులు వేదమంత్రాలు వల్లిస్తుండగా ఆదిదంపతులు ఒకటయ్యారు. శ్రీశైల ఆలయంపైన ఉన్న నవనందులకు అర్ధరాత్రి పాగాను అలంకరించిన దృశ్యం నీలకంఠుడికి పాగాలంకరణ మహాశివరాత్రి పర్వదినాన శ్రీమల్లికార్జునస్వామికి ఆలయంపై పాగాలంకరణ శివరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకం. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన చేనేత కార్మికుడు పృధ్వి వెంకటేశ్వర్లు స్వామి వారి గర్భాలయ విమాన గోపురం, ముఖమండపంపై ఉన్న 14 నందులను కలుపుతూ పాగాలంకరణ చేశారు. కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తజనంతో నిండిపోయింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు శనివారం శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కోటప్పకొండ ప్రత్యేకతైన ప్రభల ఉత్సవం ఘనంగా జరిగింది. ఏకంగా 22 భారీ విద్యుత్ ప్రభలతో పాటు చిన్న చిన్న ప్రభలు ప్రభల నిధికి చేరాయి. రాత్రి స్థానిక ఎమ్యెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శివనామస్మరణతో మార్మోగిన శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తి మహాశివరాత్రిని పురస్కరించుకుని శివనామస్మరణతో మార్మోగింది. స్వామి, అమ్మవారికి ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లు ఇంద్ర విమానం–చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామి వారు నంది వాహనంపై, అమ్మవారు సింహ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. నంది వాహన సేవ సమయంలో ఉత్సవమూర్తులు స్వర్ణాభరణాల అలంకరణతో మెరిసిపోయారు. పంచారామాల యాత్ర రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పంచారామాలైన ద్రాక్షారామం శ్రీభీమేశ్వరస్వామి దేవస్థానం, సామర్లకోట శ్రీకుమార భీమారామం, అమరావతి శ్రీఅమరేశ్వర స్వామి దేవస్థానం, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం, భీమవరం సోమేశ్వరస్వామి దేవస్థానం యాత్రికులతో కిటకిటలాడాయి. అలాగే మహానంది ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. జాగరణకు ఏర్పాట్లు శివాలయాల్లో జాగరణ నిమిత్తం తరలివచ్చిన భక్తుల కోసం ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. భరతనాట్యం, బుర్రకథ, హరికథ కాలక్షేపాలతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు తెల్లవార్లు జరిగేలా సిద్ధం చేశారు. -
శివనామస్మరణతో మారుమ్రోగుతున్న శివాలయాలు
-
తూర్పుగోదావరి జిల్లాలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు
-
శివ శివ శంకర.. భక్తజన జాతర
సాక్షి, నెట్వర్క్: మహా శివరాత్రి ఉత్సవాలకు శివాలయాలు ముస్తాబయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన శివాలయాలన్నీ విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతున్నాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్నిచోట్లా ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణల్లో భక్తుల జాగరణకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. వేములవాడలోని రాజన్న సన్నిధిలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు భక్తులు ఇప్పటికే తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక్కడ సోమవారం ఆరంభమైన మహాజాతర మంగళ, బుధవారాల్లోనూ కొనసాగనుంది. మరోపక్క మంగళవారం నాటి ఉత్సవాలకు జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లోని బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అచ్చంపేటలోని ఉమామహేశ్వరాలయం శివపూజలకు సిద్ధమైంది. నల్లమల అటవీ ప్రాంతంలో ‘చెంచుల పండుగ’ పేరుతో నిర్వహించే శివరాత్రి వేడుకల్లో శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో మంగళవారం పెద్దపట్నం పండుగ నిర్వహించనున్నారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ప్రధానాలయంలో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. వరంగల్ నగరంలోని చారిత్రక వేయిస్తంభాల గుడి (రుద్రేశ్వరస్వామి ఆలయం)లో మహాశివరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణలో క్యూలైన్లు ఏర్పాటుచేసి చలువ పందిళ్లు వేశారు. గవర్నర్, సీఎం శివరాత్రి శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ వేర్వేరుగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ మహాశివుడు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించాలని ప్రార్థించారు. కాళేశ్వరం ప్రధాన ఆలయం ఎములాడలో జాతర షురూ వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం మహాశివరాత్రి జాతర.. ఉదయం 3 గంటలకు స్వామికి సుప్రభాత సేవతో ప్రారంభమైంది. 5 గంటలకు ప్రాతఃకాల పూజ, మధ్యాహ్నం 2.30కి రాజన్నకు మహానివేదన సమర్పించారు. రాజన్న జాతరకు ఈసారి 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఇక మంగళవారం మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఉదయం టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కేటీఆర్, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొననున్నారు. కాగా, రాజన్న దర్శనానికి పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు గుడి ఆవరణతోపాటు చెరువులోని ఖాళీ స్థలంలో గుడారాలు వేసుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు నిలిపివేయడంతో షవర్ల వద్ద రద్దీ పెరిగింది. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకొని, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దుచేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రాజన్న గుడి చెరువు ఖాళీస్థలంలో శివార్చన పేరుతో 1,500 మంది కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాస శోభ
-
కార్తీక శోభ
-
శైవ క్షేత్రాల్లో కార్తీక మాస శోభ..
కార్తీక మాసం శివుడికి ప్రీతికర మాసం.. అందుకే దీన్ని పవిత్ర మాసంగా భావిస్తారు. సోమవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో దీపారాధన చేయడం ద్వారా సర్వపాపాలు హరించుకుపోతాయని ప్రజల నమ్మకం. తెల్లవారు జామునే నిద్రలేవడం.. కతికా నక్షత్రం అస్తమించేలోగా స్నానమాచరించడం, భోళాశంకరుడికి నిత్యం రుద్రాభిషేకం చేయడం, మెడలో రుద్రాక్షలు, తులసీ పూసల్ని ధరించడం, ఒక్కపూట మాత్రమే భోజనం చేయడం వంటి సంప్రదాయాలను ఆచరిస్తారు. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కార్తీక మాస ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. చదవండి: ధర్మ దాన దీపోత్సవం తూర్పుగోదావరి జిల్లా : కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఐ పోలవరం మండలం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో భక్తులు దర్శించుకుంటున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని శివనామ స్మరణతో కుండలేశ్వరం,ముమ్మిడివరం, తాళ్ళరేవు, యానంలోని శైవ క్షేత్రాలు మారుమ్రోగింది. మురమళ్ళ వృదగౌతమి గోదావరిలో తెలవారుజాము నుంచి భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాశివుని దర్షించుకునేందుకు ఆలయాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీకమాస పర్వదిన సందర్భంగా శివనామ స్మరణతో దక్షిణ కాశి ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం మారుమ్రోగుతోంది. ఈ క్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. మొదటి కార్తీక సోమవారం కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ స్వామివారిని, అమ్మవారిని భక్తులు దర్శించుకునేలా అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటిస్తూ స్వామివారిని, అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. కోవిడ్ ప్రభావంతో కార్తీక సోమవారం స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు స్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. ఆలయంలో సప్త గోదావరి నదిలో స్నానాలు నిలిపివేశారు. అభిషేకాలు, కుంకుమ పూజలు, దీపారాధనల కూడా నిషేధించారు. పోటెత్తిన భక్తులు రాజమండ్రి గోదావరి ఘాట్‌లో భక్తుల పుణ్యస్నానాలు, దీపారాధనలు చేపట్టారు. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నవరం, పిఠాపురం పాదగయా క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. పాలకొల్లు శ్రీక్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భీమవరం శ్రీఉమాసోమేశ్వరజనార్దన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు అధికారులు దర్శనం కల్పిస్తున్నారు. అమర లింగేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సామూహిక నదీస్నానాలకు అనుమతించలేదు. కర్నూలు జిల్లా శ్రీశైలం : శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనాలు ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతీరోజు నాలుగు విడతలుగా ఆర్జిత సామూహిక అభిషేకాలు నిర్వహించారు. ఏకాదశ రుద్రాభిషేకం రాజన్నసిరిసిల్లా జిల్లా : కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. స్వామివారికి అర్చకులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన చేయనున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా : కార్తీక మాస సందర్భంగా చర్ల మండలంలోని శ్రీ ఉమారామళింగేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా : కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో కార్తీక మాసం మొదటి రోజు సోమవారం కావడంతో భక్తిశ్రద్ధలతో గోదావరి నదిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. శివ నామస్మరణతో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి దేవాలయం మార్మోగుతుంది. కరోనా ప్రభావంతో భక్తులు అంతగా లేక పవిత్ర గోష్పాద క్షేత్రం వేలవేల పోయింది. మాస్కు ధరించి శివపార్వతులను పలువురు భక్తులు దర్శించుకున్నారు. పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం ప్రత్యేక పూజలు చేపట్టారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సామూహిక నది స్నానాలకు అనుమతి లేదు విజయవాడ : కార్తీకమాసం మొదటి సోమవారం భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. కార్తీక దీపారాధన కోసం పెద్ద సంఖ్యలో భక్తుల పూజలు నిర్వహిస్తున్నారు. అభిషేకాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోవిడ్ కారణంగా ఘాట్లలో స్నానం చేయడానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. గుంటూరు : కార్తీక సోమవారం కావడంతో అమరావతి అమరలింగేశ్వర స్వామి దర్శించుకోడానికి భారీ స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అధికారులు కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. సామూహిక నదీ స్నానాలకు అధికారులు అనుమతించలేదు. సామూహిక దీపారాధనకు కూడా అనుమతి లేదు. -
హర హర మహాదేవ శంభో శంకర
సాక్షి, నెట్వర్క్: హర హర మహాదేవ శంభో శంకర నామస్మరణతో రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు పులకించాయి. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు ఆలయాలకు చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. దక్షిణ కైలాసంగా పేరొందిన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి తెల్లవారుజామున 3 గంటల నుంచే భారీ సంఖ్యలో భక్త జనం చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లు ఇంద్ర విమానం–చప్పరంపై ఊరేగారు. రాత్రి స్వామివారు నంది వాహనంపై, అమ్మవారు సింహ వాహనంపై పట్టణంలోని నాలుగుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. శనివారం మరో ప్రధాన ఘట్టమైన రథోత్సవం నిర్వహణకు స్వామివారి రథాన్ని సిద్ధంగా ఉంచారు. ఆలయంలో అడుగడుగునా ఏర్పాటు చేసిన పుష్పాలంకరణ భక్తులను ఆకట్టుకుంది. వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవ కల్యాణం శ్రీశైలంలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మహా శివరాత్రి పర్వదిన ఘడియలు ప్రారంభం కాగానే శ్రీమల్లికార్జునస్వామిని వరుడిగా తీర్చిదిద్దే పాగాలంకరణ మొదలైంది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించడానికి వచ్చిన వేలాదిమంది భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 11 మంది రుత్వికులు స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. శివనామస్మరణతో హోరెత్తిన సాగరతీరం సుబ్బరామిరెడ్డి లలితా కళాపరిషత్ ఆధ్వర్యంలో విశాఖ సాగరతీరంలో శుక్రవారం మహా కుంభాభిషేకాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి పర్యవేక్షణలో కోటి లింగాలకు పూజలు నిర్వహించారు. విశాఖ ఆర్కే బీచ్‌లో కోటి శివలింగాలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్న సుబ్బరామిరెడ్డి, స్వామీజీలు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర వైభవంగా కోటప్పకొండ తిరునాళ్లు గుంటూరు జిల్లా నరసరావుపేటలో కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన విద్యుత్ ప్రభల కాంతులతో కోటప్పకొండ దేదీప్యమానంగా వెలిగిపోయింది. రామతీర్థంలో శివనామ స్మరణ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి భక్తులు పోటెత్తారు. వైష్ణవ దేవాలయం అయినప్పటికీ ఏటా శివరాత్రికి లక్షలాది మంది భక్తులు హాజరై పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. సాక్షాత్తూ శ్రీరాముడే రామ క్షేత్రంలో శివుని మంత్రాన్ని జపించారని భక్తులు విశ్వసిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే గాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. భోగాపురం, పూసపాటిరేగ, లావేరు, రణస్థలం, భీమిలి, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి మత్స్యకారులు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రతిమను మధ్యలో ఉంచి చుట్టూ వృత్తంలా ఏర్పడి సంప్రదాయ బద్ధంగా నృత్యాలు చేశారు. -
భక్తులతో కిటకిటలాడూతున్న హైదరాబాద్‌లోని శైవ క్షేత్రాలు
-
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ
-
కార్తీక మాసం: శివనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
కార్తీకమాసం మొదటి సోమవారం విజయవాడ భ్రమరాంభమల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు కృష్ణానదిలో స్నానాలాచరించి కార్తీక దీపాలు వెలిగించారు. మహాశివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. దీపాల వెలుగులతో ఆలయం మరింత శోభను సంతరించుకుంది. బ్రమరాంభ మల్లేశ్వర స్వామి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గుంటూరు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం కోటప్ప కొండ భక్తులతో నిండిపోయింది. కార్తీకపూజల కోసం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి 30 వేల మంది వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లాల్లోని శివాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. అన్నవరం సత్యదేవుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామునుంచే భక్తులు పెద్దసంఖ్యలో సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. మహిళలు రావిచెట్టు వద్ద పూజలు చేసి దీపాలు వెలిగించారు. స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో పశ్చిమగోదావరి జిల్లాల్లోని శైవక్షేత్రాలన్నీ కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ.. మహాశివుడిని దర్శనం చేసుకుంటున్నారు. కార్తీక మాసం శివునికి ఎంతో ఇష్టమైన మాసమని, అలాంటి కార్తీక మాసంలో అందులోనూ సోమవారం ఆ మహాశివుడిని ఆరాధిస్తే.. పుణ్యఫలాలు దక్కుతాయని ప్రతీతి. ఈ మాసంలో శివ శివ అని స్మరిస్తే చాలు.. ఆ దేవదేవుడు కరుణిస్తున్నాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే కార్తీక మాసంలో భక్తులు సైతం శివారాధన కోసం ఆలయాలకు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి.. నీలకంఠుడికి అభిషేకాలు చేయిస్తున్నారు. ముఖ్యంగా పంచారామక్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట శివాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఘాట్లన్నీ భక్తజన సందోహంతో నిండిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ కార్తీక సోమవారం పూజలు వైభవంగా జరుగుతున్నాయి. టెక్కలి మండలం రావివలస గ్రామంలోని శ్రీ ఎండల మల్లికార్జునస్వామివారి ఆలయంలో కొలువైన అతిపెద్ద శివలింగాన్ని దర్శించుటకు భక్తులు తరలివస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచే కాకుండా.. ఇతర జిల్లాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంగణంలో శివనామస్మరణలు మారుమోగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారు జామున మూడు గంటల నుంచే గోదావరి నదిలో పుణ్యస్నానాలాచరించారు. పెద్దసంఖ్యలో వచ్చిన మహిళలు నదిలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు . ఆలయంలోని మహాశివునికి అభిషేకాలు చేశారు. గోదావరితీరం దీపాల కాంతితో శోభాయమానంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడు శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగుతోంది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం మహాశివుడు భక్తులకు దర్శనమిచ్చాడు. తెల్లవారుజామునుంచే ధర్మగుండంలో పుణ్యస్నానాలాచరించి కార్తీక దీపాలను వెలిగించి కోడె మొక్కులు తీర్చుకున్నారు . భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అర్జిత సేవలను రద్దు చేసి భక్తులకు లఘు దర్శనం కల్పించారు. నల్లగొండ జిల్లాలోని యాదాద్రి సహా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోనూ భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. -
కార్తీక మాసం: భక్తులతో కిక్కిరిసిన గోదావరి జిల్లాలోని శైవక్షేత్రాలు
-
శివనామస్మరణలతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
సాక్షి, హైదరాబాద్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. తెల్లవారు జామునుంచే భక్తులు శివాలయాలకు పొటెత్తారు. బిల్వార్చనలు, క్షీరాభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తీ, శ్రీశైలం, వేములవాడ రాజన్న ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ♦శ్రీకాళహస్తీశ్వరాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పరమేశ్వరుడు శ్రీజ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరస్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇవాళ ఇంద్ర విమానం, నందివాహనం, సింహ వాహన సేవలు, అర్ధరాత్రి ఒంటి గంట నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు లింగోద్భవ దర్శనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు పొటేత్తడంతో ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ♦ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, భీమవరం సోమేశ్వరాలయం, పట్టిసీమ వీరభద్రేశ్వరస్వామి, పాలకొల్లు శ్రీక్షీరారామలింగేశ్వర స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.గోష్పాద క్షేతంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ♦ శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ వంటి కార్యక్రమాలు జరుగునున్నాయి. ♦ తిరుపతి కపిల తీర్థం కపిలేశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూలమూర్తికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ♦ విజయనగరంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా పశుపతి నాధేశ్వరీ, ఉమారామలింగేశ్వర స్వామి, జయితి శ్రీమల్లికార్జున స్వామి, పుణ్యగిరిలోని సన్యాసేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పొటేత్తారు. ♦ వేముల వాడ రాజన్న ఆలయానికి భక్తులు పొటెత్తారు. భక్తులకు ఆలయ సమాచారం కోసం అధికారులు ప్రత్యేకయాప్‌ను రూపొందించారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ♦తూర్పుగోదావరి జిల్లాలోని శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. పంచారమ క్షేత్రాలు ద్రాక్షారమం, సామర్లకోట ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, కోటపల్లి ఛాయాసోమేశ్వరాలయం, ముక్తేశ్వరం, ఉమాకోటిలింగేశ్వరుని ఆలయాల్లో శివరాత్రి సందడి నెలకొంది. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ♦ అమరావతిలో వైభవంగా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమరేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కోటప్పకొండలోని తిరునాళ్లకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వైఎస్ జగన్ శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. -
శ్రీశైలం ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి
అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ రావు కర్నూలు(రాజ్‌విహార్): మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శైవ క్షేత్రాల్లో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్ఎస్) కె. సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా శ్రీశైలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నాలుగు ప్రాంతాలను గుర్తించామన్నారు. వాటిలో కంట్రోల్ రూమ్ (ఆసుపత్రి), ఆలయం వెనుక, పాతాళగంగ రోడ్డు, కర్ణాటక గెస్టు హౌస్ వద్ద ఒక్కొక్క ఫైర్ ఇంజన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటితోపాటు ఒక బుల్లెట్ అగ్నిమాపక వాహనం కూడా సిద్ధంగా ఉంచనున్నట్లు తెలిపారు. పాతాళగంగ వద్ద భక్తుల రక్షణ కోసం 15 మంది రెస్క్యూ సిబ్బంది నియమిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల్లో మొత్తం 75 మంది విధులు నిర్వహిస్తుండగా ఐదుగురు అధికారులుంటారని వెల్లడించారు. తమ శాఖ సిబ్బందితోపాటు పోలీసు, ఇతర అధికారులు సూచించిన నిబంధనలు, హెచ్చరికలను పాటించి సహకరించాలని కోరారు. గుజరాత్ రాష్ట్రంలో విపత్తు, అగ్ని మాపకంపై డిగ్రీలో కోర్సులు ఉన్నాయని, ఈ మేరకు ప్రమాద, విపత్తులను నివారణ కోసం ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లా ఫైర్ అఫీసర్లు భూపాల్ రెడ్డి, విజయకుమార్ పాల్గొన్నారు. -
సూక్ష్మంలో మోక్షాన్నిచ్చే శివాలయాల సందర్శన
రాజమహేంద్రవరం కల్చరల్ : ద్రాక్షారామ భీమేశ్వర ఆలయానికి నలుదెశలా ఉన్నా 108 శివాలయాలు జాతక విభాగంలో చెప్పిన 27 నక్షత్రాలకు కలిపి ఉండే 108 పాదాలకు ప్రతీకలని, ఆయా నక్షత్ర జాతకులు వీటిల్లో తమకు అనుకూలమైన ఆలయాన్ని సందర్శించడం ద్వారా మంచి ఫలితం లభిస్తుందని శ్రీ మహాలక్ష్మి సమేత చిన్నవేంకన్నబాబుస్వామివారి పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు అన్నారు. తొంభై గంటల్లో చేయాలనుకున్న భీమసభ సందర్శన యాత్ర ను, 72 గంటల్లో ముగించుకుని గురువారం సాయంత్రం నగరానికి వచ్చిన ఆయనకు పుష్కరాల రేవు వద్ద శిషు్యలు ఘనస్వాగతం పలికారు. ముందుగా పుష్కరాల రేవులోని గోదావరి మాత విగ్రహానికి, తరువాత గోదావరి నదీమతల్లికి ఆయన హారతులు ఇచ్చారు. శిషు్యలనుద్దేశించి చిన్న వేంకన్నబాబు మాట్లాడుతూ, జ్యోతిషరంగంలో కృషి చేస్తున్నవారు ఈ ఆలయాలను తప్పక దర్శించగలిగితే, వారి మాటకు ప్రామాణికత లభిస్తుందని అన్నారు. ద్రాక్షారామ క్షేత్రానికి నాలుగు దిక్కులా ఉన్న 108 ఆలయాల్లో కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయని, కొన్నిచోట్ల సుశిక్షితులయిన అర్చకులు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మానికి మూలస్తంభాలైన ఆలయాలను పరిరక్షించుకోవడం మన బాధ్యతని చెప్పారు. -
తెలుగు రాష్ట్రాలలో కార్తీక శోభ...
-
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ.
-
ఆలయాల్లో కార్తీక కాంతులు
హైదరాబాద్: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం వేకువజాము నుంచే శైవక్షేత్రాలు, నది, సముద్ర తీరాలు భక్తుల కళకళలాడాయి. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులతో నిండిపోయాయి. గోదావరి తీరంలోని ఖమ్మం జిల్లా భద్రాచల క్షేత్రంలో వేకువజామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి తీరానికి చేరుకున్నారు. పుణ్యస్నానాలు చేసి, శ్రీరాముని సన్నిధిలో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం పాతాళగంగ వద్ద రద్దీ పెరిగిపోయింది. మల్లికార్జున స్వామి దర్శనానికి జనం పోటెత్తారు. భక్తుల రద్దీ కారణంగా ఆర్జిత సేవలను రద్దు చేసి, స్వామి వారి అలంకార దర్శన సేవభాగ్యం కల్పించారు. తిరుపతిలోని కపిలతీర్థంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కపిలతీర్థం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భక్తులను దగ్గరగా అనుమతించటం లేదు. శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.సింహాచల వరాహ నరసింహ స్వామి క్షేత్రం, నల్లగొండ జిల్లా యాదాద్రి, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళలు కార్తీక దీపారాధన చేశారు. గోదావరి, కృష్ణా నదులతోపాటు బాపట్ల సూర్యలంక, ఒంగోలు, విశాఖ కాకినాడ, బందరు సముద్ర తీరాల్లో భక్తులు కార్తీక స్నానాలు చేస్తున్నారు. -
భక్తులతో పోటెత్తిన శివాలయాలు
హైదరాబాద్ : పరమ శివుడికి అత్యంత ప్రియమైనది కార్తీక మాసం. తొలి కార్తీక సోమవారం రోజు రాష్ట్రంలోని శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడికి పూజలు చేశారు. హైదరాబాద్‌లో శివాలయాలు కిక్కిరిసిపోయాయి. కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తొలిరోజే సోమవారం కావడంతో శివాలయలకు భక్తులు పోటెత్తారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులంతా మహాశివుని దర్శనానికి క్యూ కట్టారు. సోమవారమంటే మహాదేవునికి మహా ప్రియం అందులోనూ ఈసారి విశేషించి సోమవారంనాడే ఈ మాసం ప్రారంభమైంది. ఈ మాసమంతా శివారాధనా, ఉపవాసం చెయ్యలేనివారు కేవలం ఈ ఒక్క సోమవారంనాడైనా నిండుమనస్సుతో చెయ్యగలిగితే వారు తప్పక కైవల్యాన్ని పొందుతారు. ఈ మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా శివదేవునికి అభిషేకం, అర్చనలు చేసినవారు వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. మరోవైపు శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. మహాదేవుడిని దర్శించుకుని అనుగ్రహం పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.మరోవైపు కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మహిళలు నదిలో దీపాలు వదలి దీపారాధన చేశారు.