సాక్షి, అమలాపురం: పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. గౌతమీ చెంతన వెలసిన కోటిపల్లిలో శ్రీపార్వతీ సమేత సోమేశ్వరస్వామి, నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూ.. వృద్ధ గౌతమీ నదీపాయ చెంతన వెలసిన భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, క్షణ కాలంలో ముక్తిని ప్రసాదించే ముక్తేశ్వరం క్షణ ముక్తేశ్వరస్వామి, అనంత కుండల ఫలాన్ని ప్రదర్శించే కుండలేశ్వరంలోని కుండలేశ్వరస్వామి, దేశంలో ఎక్కడా లేని విధంగా శివపార్వతులు ఒకే పీఠంపై కొలువైన పలివెల ఉమా కొప్పేశ్వర స్వామి ఆలయం.. ఇలా చెప్పుకొంటూపోతే పచ్చని కోనసీమ నలుచెదురులా పురాణ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలకు కొదవేలేదు. గోదావరి సప్త నదీపాయల ప్రవాహంతో పునీతమైన కోనసీమ బుధవారం జరిగే మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కనుంది.
పంచారామం క్షేత్రం ద్రాక్షారామం
పంచారామ క్షేత్రమైన త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం. మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ఇదొకటి. 12వ శక్తి పీఠంగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ఇక్కడ వెలిశారు. దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ శివ లింగం 18 అడుగుల ఎత్తు ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment