
విద్యానగర్(కరీంనగర్): ఠాకూర్ అశ్విని అలియస్ ఆశాది కరీంనగర్‌లోని భగత్‌నగర్. నగరంలోని డైలీ మార్కెట్, వేంకటేశ్వరస్వామి గుడి వద్ద ఫుట్‌పాత్‌పై సీజనల్ వ్యాపారం చేస్తుంది. మట్టికుండలు, దీపాల ప్రమిదలు, రంగుల ముగ్గులు, పచ్చడి జాడీలు, దీపాల వత్తులు అమ్ముతుంది. రెండేళ్ల కిత్రం వ్యాపార అభివృద్ధి కోసం తొలిసారిగా ఆమె అమ్మే వస్తువుల గురించి రీల్ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయగా వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.
దీంతో మరిన్ని రీల్స్ చేసి పోస్ట్ చేసింది. వాటికి కూడా ఆశించిన దానికన్నా ఎక్కువగా స్పందన రావడంతో సినిమా పాటలు, జానపద గేయాలు, భక్తి, రోమాంటిక్, ప్రేమ, ఎడబాటు తదితర అంశాలపై రీల్స్ చేయడం మొదలు పెట్టగా వాటికి కూడా లక్షల్లో వ్యూస్ రావడం, ఆరో తరగతి వరకే చదివిన ఆశాకు భర్త, కుటుంబ సభ్యులు ప్రోత్సాహం తోడవడంతో రీల్స్‌పై మక్కువ పెంచుకుంది. రెండేళ్లలో 600 వరకు రీల్స్ చేసింది. ‘ఇన్‌స్ట్రాగామ్‌లో నా రీల్స్ చూసిన డైరెక్టర్లు చాలా మంది వారి సినిమాల్లో అడిగారు. కీ రోల్ పాత్రలు వస్తే తప్పకుండా చిన్న, పెద్ద సినిమాల్లో చేస్తాను’ అని ఠాకూర్ అశ్విని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment