asha
-
ఆర్సీబీకి భారీ షాక్!
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)-2025 ఆరంభానికి ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ప్లేయర్లు గాయాల వల్ల ఈ టోర్నమెంట్‌కు దూరం కాగా.. తాజాగా స్టార్ స్పిన్నర్ ఆశా శోభన కూడా తప్పుకొంది.ఈ నేపథ్యంలో ఆమె స్థానాన్ని భారత వికెట్ కీపర్ బ్యాటర్ నుఝత్ పర్వీన్‌తో భర్తీ చేస్తున్నట్లు ఆర్సీబీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘దురదృష్టవశాత్తూ.. మోకాలి గాయం కారణంగా మా చాంపియన్ ఆల్‌రౌండర్ ఆశా శోభన(Asha Sobhana) డబ్ల్యూపీఎల్-2025 మొత్తానికి దూరమైంది.స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నుఝత్ పర్వీన్ ఈ సీజన్లో ఆశా శోభన స్థానాన్ని భర్తీ చేస్తుంది. నుఝత్ ఆర్సీబీకిలో నీకు స్వాగతం’’ ఆర్సీబీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.కాగా 33 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఆశా శోభన మహిళల టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా చివరగా భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. నాడు గ్రూప్ దశలో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆమె గాయపడింది. అయితే, ఇంత వరకు కోలుకోలేదు. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ తాజా ఎడిషన్ మొత్తానికి ఆమె దూరమైంది.గత సీజన్లో ఆశా శోభన మొత్తంగా పన్నెండు వికెట్లు తీసి జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఇదివరకే సోఫీ మెలినెక్స్, కేట్ క్రాస్ గాయాల కారణంగా ఆర్సీబీకి దూరం కాగా.. సోఫీ డివైన్ టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది.మరోవైపు.. ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్ కూడా గాయం వల్ల స్వదేశంలో పలు సిరీస్‌లకు దూరమైన విషయం తెలిసిందే. కాబట్టి ఆమె ఆర్సీబీ తుదిజట్టులోకి వస్తుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.ముంబై ఇండియన్స్‌లోకి పరుణిక సిసోడియాడబ్ల్యూపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ సీజన్ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానంలో పరుణిక సిసోడియా జట్టులోకి వచ్చింది. కనీస ధర రూ. 10 లక్షలతో పరుణిక ముంబై ఇండియన్స్‌లో చేరింది.కాగా ఇటీవల జరిగిన మహిళల అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో పరుణిక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ నుంచి ఆమెకు పిలుపు రావడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 14- మార్చి 15 వరకు మహిళల ప్రీమియర్ లీగ్ జరుగనుంది. ముంబై ఇండియన్స్ వుమెన్స్, ఆర్సీబీ వుమెన్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మొత్తంగా 22 మ్యాచ్‌లు జరుగుతాయి. -
Asha Negi: సాహసాలకు ఆమె వెనుకాడని 'ఆశా' జీవి..
ఆశా నేగీ.. హిందీ ‘బిగ్ బాస్’, ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ లాంటి రియాలిటీ షోస్ చూసేవారికి బాగా తెలిసిన పేరు. ఒక షోలో ఆమె పార్టిసిపెంట్, మరొక షోకి ఆమె హోస్ట్. రియాలిటీ షోసే కాదు సీరియల్స్, స్పోర్ట్స్, మూవీస్, సిరీస్.. ఇలా చాలా క్రెడిట్సే ఉన్నాయి ఆమెకు!– ఆశా పుట్టిపెరిగింది ఉత్తరాఖండ్ రాజధాని డెహరాడూన్లో. అక్కడి డీఏవీ కాలేజ్‌లో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ టైమ్‌లోనే అందాల పోటీలో పాల్గొని ‘మిస్ ఉత్తరాఖండ్’ క్రౌన్ గెలుచుకుంది.– గ్రాడ్యుయేషన్ తర్వాత ఆశాకు బెంగళూరులోని ఓ టూర్స్ అండ్ ట్రావెల్స్ కన్సల్టన్సీలో ఉద్యోగం వచ్చింది. అందులో కొన్నాళ్లు వర్క్ చేశాక కాల్ సెంటర్‌కి మారింది.– తను చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగాలేవీ నచ్చకపోవడంతో గ్లామర్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుని ముంబైకి మకాం మార్చింది. ఎక్కడ ఆడిషన్స్ ఉన్నా వెళ్లి అటెండ్ అవసాగింది. ఆ ప్రయత్నాల్లోనే ‘సప్నోం సే భరే నైనా’ అనే టీవీ సీరియల్లో అవకాశం వచ్చింది. కానీ అది ఆమెకు అంతగా గుర్తింపునివ్వలేదు.తర్వాత ‘పవిత్ర్ రిశ్తా’ అనే సీరియల్లో నటించింది. దాంతో ఆశాకు ఎనలేని గుర్తింపు వచ్చింది. ఆ పాపులారిటీనే ఆమెకు ‘బిగ్ బాస్’ (సీజన్ 6) హౌస్‌కి వెళ్లే చాన్స్‌ను తెచ్చింది. ‘నచ్ బలియే’ సీజన్ 6లో పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీనీ ఇచ్చింది.ఆశాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. చక్కగా ఆడుతుంది. అందుకు స్పోర్ట్స్ రియాలిటీ ఎంటర్టైన్మెంట్ షో ‘బాక్స్ క్రికెట్ లీగ్’ రెండు సీజన్లే ఉదాహరణలు. సీజన్ 1 ఢిల్లీ డ్రాగన్స్ తరఫున, సీజన్ 2లో కోల్‌కతా బాబూ మోశాయ్స్ తరఫున ఆడింది.సాహసాలకూ ఆమె వెనుకాడదు. ఆ ముచ్చట తీర్చుకోవడానికి ‘ఖత్రోంకే ఖిలాడీ’ సీజన్ 6లో పాల్గొని సెమీఫైనల్ దాకా వెళ్లింది.ఆశా యాక్టింగ్ టాలెంట్ చూసి అనురాగ్ బసు తన ‘లూడో’ సినిమాలో వేషం ఇచ్చాడు. తన పాత్ర పరిధిలో చక్కగా అభినయించింది. తర్వాత ‘కాలర్ బాంబ్’ అనే సినిమాలోనూ నటించింది.సీరియల్, సినిమా, సిరీస్.. ఏదైనా సరే.. నటనకు అవకాశం ఉంటే చాలు అనుకునే ఆశా అందుకు తగ్గట్టుగానే ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చింది.. ‘బారిష్’ అనే సిరీస్‌తో. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఇండస్ట్రీ’తో వీక్షకులను అలరిస్తోంది."పేరుకు తగ్గట్టే నేను ఆశా జీవిని. ఆ తత్వమే ఇండస్ట్రీలో నన్ను లైవ్‌గా ఉంచుతోంది." – ఆశా నేగీఇవి చదవండి: Nitasha Gaurav: న్యూ గ్రామర్ అండ్ గ్లామర్! -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
కునో నేషనల్ పార్క్‌లో సందడి.. మూడు చీతాలకు జన్మనిచ్చిన ‘ఆశా’
‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమీబియా నుంచి తీసుకోచ్చిన ‘ఆశా’ అనే చీతా తాజాగా మూడు చీతా పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయానికి సంబంధించిన వీడియోను కేంద్ర పర్యావరణ, కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘కునో నేషనల్ పార్క్‌లో ‘ఆశా’ చీతా.. మూడు చీతా కూనలకు జన్మనిచ్చిన విషయం పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది. ‘ఆశా’ను ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా నుంచి తీసుకువచ్చారు. ఈ ప్రజెక్టులో చీతాల సంరక్షణకు కృషి చేస్తున్న కునో నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు’ అని భూపేందర్ యాదవ్ తెలిపారు. దశాబ్దాల క్రితం ఇండియాలో అంతరిచిన పోయిన చీతాలను తిరిగి అభివృద్ధి చేయాలన్నలక్ష్యంతో 17 సెప్టెంబర్ 2022న ప్రాజెక్టు చీతాను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్తగా పుట్టిన మూడు చీతా పిల్లతో కలిపి మొత్తం చీతాల సంఖ్య 18కి చేరింది. అయితే నమీబియా నుంచి తీసుకువచ్చిన ‘సాశా’ అనే ఆడ చీతా 2023 మార్చి 27న మరణించిన విషయం తెలిసిందే. ‘ప్రాజెక్టు చీతా’ భాగంగా మొత్తం 8 చీతాలను నమీబియా నుంచి భారత్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. Purrs in the wild! Thrilled to share that Kuno National Park has welcomed three new members. The cubs have been born to Namibian Cheetah Aasha. This is a roaring success for Project Cheetah, envisioned by PM Shri @narendramodi ji to restore ecological balance. My big congrats… pic.twitter.com/c1fXvVJN4C — Bhupender Yadav (@byadavbjp) January 3, 2024 చదవండి: ప్చ్.. మన బాహుబలికి అంత బలం లేదట! అందుకే ఇలా.. -
వైజాగ్ నేవీ మారథాన్ విజేతలు శిఖంధర్, ఆశా
విశాఖ స్పోర్ట్స్: విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన వైజాగ్ నేవీ మారథాన్ 8వ ఎడిషన్ ఓపెన్‌లో శిఖంధర్, మహిళల్లో ఆశా విజేతలుగా నిలిచారు. వైజాగ్ నేవీ మారథాన్ పరుగు సాగరతీరంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి అథ్లెట్లు విజయమే లక్ష్యంగా ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల పరుగుపెట్టారు. ఔత్సాహికులు సరదాగా ఐదు కిలోమీటర్ల మేర ఫన్ రన్ చేపట్టారు. ఫుల్ మారథాన్ 42.2 కిలోమీటర్లు, హాఫ్ మారథాన్ 21.1 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల రేస్‌ను నిర్వహించి విజేతలకు బహుమతులందించారు. మారథాన్ రేస్, ఫన్ పరుగు ఆర్కే బీచ్ మీదుగా నేవల్ కోస్టల్ బ్యాటరీ వైపు వద్ద యూటర్న్ తీసుకుని.. కాళీమాత ఆలయం మీదుగా వీఎంఆర్డీఏ ఎంజీఎం పార్క్ వద్దకు చేరుకోగానే ముగిసింది. పది కిలోమీటర్ల పరుగు తెన్నేటి వద్ద యూ టర్న్ తీసుకోగా, హాఫ్ మారథాన్ పరుగు వీరులు రుషికొండ గాయత్రి కళాశాల దగ్గర యూ టర్న్ తీసుకున్నారు. పూర్తి మారథాన్‌లో అథ్లెట్లు ఐఎన్ఎస్ కళింగ సమీపంలోని చేపాలుప్పాడ దగ్గర యూ టర్న్ తీసుకుని ప్రారంభస్థానానికి చేరుకున్నారు. వీఎంఆర్డీఏ పార్క్‌లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పురుషుల ఓపెన్ హాఫ్ మారథాన్‌లో దీపక్ కుంబార్, 10 కిలోమీటర్ల పరుగులో సోనుకుష్వా విజేతలుగా నిలిచారు. మహిళా విభాగం హాఫ్ మారథాన్‌లో లిలియన్ రుట్టో, 10 కిలోమీటర్ల పరుగులో మేరీగ్రేస్ విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు. -
Asha Suman: ఆత్మవిశ్వాసమే అసలైన గురుదక్షిణ
రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో దివ్యాంగురాలైన ఒక స్టూడెంట్ అత్యాచారానికి గురైన సంఘటన ఆశా సుమన్‌ను షాక్‌కు గురి చేసింది. స్కూలు, కాలేజిల్లో చదివే అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పాలని ఆ సమయంలో సంకల్పించుకుంది ఆశ. దివ్యాంగులు, సాధారణ యువతులు 30 వేల మందికి పైగా ఆత్మరక్షణ విద్యలు నేర్పించిన ఉపాధ్యాయురాలు ఆశా సుమన్ గురించి... తొమ్మిది సంవత్సరాల క్రితం రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని ఖార్కర గ్రామంలో... ఆరోజు స్కూల్‌కు వెళ్లింది ఆశా సుమన్. బడిలో మగపిల్లలు తప్ప ఆడపిల్లలు ఎవరూ కనిపించలేదు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఈ లోపే ఎవరో ఊళ్లో జరిగిన దుర్ఘటన గురించి చెప్పారు. దివ్యాంగురాలైన ఒక అమ్మాయి సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ సంఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. విషయం తెలిసిన ఆశ హుటాహుటిన బాధితురాలి ఇంటికి వెళ్లింది. ఆ సంఘటనకు సంబంధించిన విషయాలు చెవిన పడుతున్నప్పుడు ఆమె మనసు దుఃఖసముద్రం అయింది. ఈ సంఘటన ప్రభావంతో కొద్దిమంది తల్లిదండ్రులు అమ్మాయిలను స్కూల్‌కు పంపడం మాన్పించారు. నిజానికి ఆ ప్రాంతంలో ఆడపిల్లల చదువుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. ఇచ్చే వాళ్లు కూడా తమ ఇంటి ఆడపిల్లలను బడికి పంపడానికి భయపడుతున్నారు. స్కూల్‌కు వెళ్లినా, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా ఆ పాశవిక సంఘటన, తల్లిదండ్రులపై దాని ప్రభావం పడి ఆడపిల్లలు స్కూల్‌కు దూరం కావడం... ఇవి పదేపదే గుర్తుకు వచ్చి ఆశను విపరీతంగా బాధపెట్టాయి. ‘ఆ అమ్మాయికి తనను తాను రక్షించుకోవడం తెలిస్తే ఇలా జరిగేది కాదేమో. ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్య నేర్పాలి’ అనుకుంది. మొదటి అడుగుగా... పిల్లల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడింది. పిల్లలను తిరిగి స్కూల్‌కు పంపించడానికి వారు మొదట్లో ససేమిరా అన్నారు. చదువు అనేది ఎంత అవసరమో వివరించి, అమ్మాయిలు తమను తాము కాపాడుకునే ఆత్మరక్షణ విద్యల గురించి చెప్పి వారిలో మార్పు తీసుకువచ్చింది. కొన్ని రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి అమ్మాయిలను తన స్కూటర్‌పై స్కూల్‌కు తీసుకువచ్చేది. రెండు నెలల తరువాత పరిస్థితి మామూలుగా మారింది. స్కూల్లోని అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించడంతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పేది. ఆశ గురించి విన్న చుట్టుపక్కల ఊళ్లలోని స్కూల్, కాలేజీ వాళ్లు ‘మా స్టూడెంట్స్‌కు కూడా నేర్పించండి’ అంటూ ఆహ్వానిం చారు. కాదనకుండా వారి ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో స్కూళ్లు, కాలేజీలలో ఎంతోమంది అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించింది. వైకల్యం ఉన్న బాలికలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పే విధానం వేరుగా ఉంటుంది, వారు సులభంగా అర్థం చేసుకునేలా, అర్థం చేసుకున్నది ఆచరణలో చేసేలా రోజువారి సంఘటనలను ఉదాహరిస్తూ, డమ్మీని ఉపయోగిస్తూ నేర్పిస్తుంటుంది. దృష్టిలోపం ఉన్న మౌనిక అనే స్టూడెంట్ ఆశ టీచర్ దగ్గర సెల్ఫ్–డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకుంది. ‘నేను బయటికి ఎక్కడికి వెళ్లినా తోడుగా అన్నయ్య వచ్చేవాడు. అన్నయ్య లేకుంటే బయటకు వెళ్లడానికి సాహసించేదాన్ని కాదు. అయితే ఇప్పుడు నా గురించే నేనే కాదు, తల్లిదండ్రులు కూడా భయపడడం లేదు. ఎవరైనా నాకు చెడు చేయడానికి ముందుకు వస్తే నిమిషాల్లో మట్టి కరిపించగలననే నమ్మకం వచ్చింది’ అంటుంది మౌనిక. స్టూడెంట్స్లోనే కాదు వారి తల్లిదండ్రులలోనూ ఇప్పుడు ఎంతో ధైర్యం వచ్చింది. ‘చాలామందిలాగే నేను కూడా మా అమ్మాయిని స్కూల్‌కు పంపడానికి భయపడ్డాను. ఇప్పుడు అలాంటి భయాలేవీ లేవు. స్కూల్ అయిపోగానే అమ్మాయిల కోసం ఆశా టీచర్ నిర్వహిస్తున్న సెల్ఫ్–డిఫెన్స్ క్లాసులను దగ్గర నుంచి చూశాను. అమ్మాయిల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది. ప్రతి స్కూల్లో ఆశలాంటి టీచర్ ఒకరు ఉండాలి’ అంటున్నాడు ఆ ఊరికి చెందిన జస్వంత్. అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఆశ టీచర్ చేస్తున్న కృషికి ఎన్నో పురస్కారాలు లభించాయి. ఆత్మరక్షణ విద్యల వల్ల అమ్మాయిల్లో కనిపించే ఆత్మవిశ్వాసమే తనకు అసలు సిసలు గురుదక్షిణ అంటుంది ఆశా సుమన్. -
Asha Malviya: మహిళల భద్రత దిశగా ఆశా యాత్ర
మనదేశంలో మహిళల భద్రత, మహిళాసాధికారత సాధన కోసం ఆశా మాలవీయ దేశపర్యటనకు సిద్ధమయ్యారు. విజయవంతంగా సాగుతున్న ఆమె యాత్ర తెలుగు రాష్ట్రంలో ప్రవేశించింది. మహిళల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా ఉందని చెప్పారామె. ఆశా మాలవీయది మధ్యప్రదేశ్ రాష్ట్రం, రాజ్‌ఘర్ జిల్లా సతారామ్ గ్రామం. ఆమె క్రీడాకారిణి, పర్వతారోహణలో అభిరుచి మెండు. మహిళాభ్యుదయం లక్ష్యంగా సాగుతున్న ఆమె సైకిల్ పర్యటనలో స్త్రీ సాధికారత, భద్రత గురించి సమాజాన్ని చైతన్యవంతం చేస్తోంది. ఆమె పర్యటన ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె తన లక్ష్యాన్ని వివరించారు. అపోహను తొలగిస్తాను! ‘‘నేను స్పోర్ట్స్‌లో నేషనల్ ప్లేయర్‌ని. పర్వతారోహణలో రికార్డు హోల్డర్ని. ప్రస్తుతం 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేస్తున్నాను. నవంబర్ ఒకటిన భోపాల్‌లో ప్రారంభమైన నా సైకిల్ యాత్రలో ఎనిమిది వేల కిలోమీటర్లు పూర్తయ్యాయి, విజయవాడ చేరుకున్నాను. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాత్ర నిర్వహించాలనేది లక్ష్యం. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తయింది. భారతదేశం మహిళలకు అంత సురక్షితమైన దేశం కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని నేను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాను. ‘దిశ’ బాగుంది సీఎం జగన్ గారిని కలవడం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉంది. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఏపీలో మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్ డౌన్‌న్‌లోడ్ చేసుకున్నాను. ఈ యాప్ చాలా బాగా పనిచేస్తోంది. ఏపీలో మహిళలే కాదు, ప్రజలంతా సురక్షితంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగారు నన్ను ప్రశంసలతో ముంచెత్తడంతోపాటు నా ఆశయం కోసం 10లక్షల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. తిరుపతి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి నాకు ప్రత్యేక రక్షణ అందించారు. స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మంచివి. దేశానికే ఆదర్శంగా నిలిచిన జగన్‌న్‌మోహన్‌న్‌రెడ్డి లాంటి మఖ్యమంత్రిని కలవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఆశా మాలవీయ. మహిళల భద్రత, సాధికారతతోపాటు ప్రపంచదేశాల ముందు మనదేశం గౌరవాన్ని ఇనుమడింపచేయాలనే ఆమె ఆశయం ఉన్నతమైనది. ఈ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆమెను ఆశీర్వదిద్దాం. – సాక్షి, ఏపీ బ్యూరో -
ఆశా మాలవ్యకు సీఎం జగన్ అభినందనలు.. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పర్వతారోహకురాలు ఆశా మాలవ్య సోమవారం కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. కొద్దిరోజులుగా సైక్లింగ్ చేస్తూ అనేక రాష్ట్రాలలో పర్యటిస్తున్న ఆశా లక్ష్యం నెరవేరాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని సీఎం ప్రకటించారు. సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలో మీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పిన ఆశా.. ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్లు పూర్తయిందని సీఎంకి వివరించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్‌యాత్ర చేస్తున్నారు. సీఎంను కలిసిన అనంతరం ఆశా మాలవ్య మీడియాతో మాట్లాడుతూ, స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ జగన్‌లాంటి ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శమన్నారు. ‘‘ప్రస్తుతం నేను 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేస్తున్నాను. నవంబర్ 1న భోపాల్‌లో నా సైకిల్ యాత్ర ప్రారంభించి నేడు విజయవాడ చేరుకున్నాను. మొత్తం 28రాష్ట్రాల్లో నా యాత్ర నిర్వహించాలనేది టార్గెట్ ఇప్పటికే 7రాష్ట్రాల్లో నా సైకిల్ యాత్ర పూర్తయింది’’ అని ఆమె పేర్కొన్నారు. భారత దేశం మహిళలకు అంత సురక్షితమైన దేశం కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని నేను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారిని కలిశాను. సీఎంని కలవడం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉంది. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి’’ అని ఆశా మాలవ్య అన్నారు. చదవండి: విశాఖ అమ్మాయి.. భారీ ప్యాకేజ్‌తో కొలువు ‘‘మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఏపీలో మహిళల భద్రత కోసం దిశా యాప్ ప్రవేశపెట్టారు. నేను దిశా యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిని చెక్ చేశాను. దిశా యాప్ ఎంతో గొప్పగా పనిచేస్తోంది. ఏపీలో మహిళలు మాత్రమే కాదు అందరూ సురక్షితంగా ఉన్నారు. నా ఆశయం కోసం ముఖ్యమంత్రి నాకు 10లక్షల రూపాయలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. నేను తిరుపతి వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించాను. అక్కడి నుంచి నాకు ప్రత్యేక రక్షణ అందించారు’’ అని ఆశా మాలవ్య చెప్పారు. -
Asha Sahay: 17 ఏళ్ల వయసులో దేశం కోసం! జపాన్‌లో పుట్టి.. నేతాజీ ఆర్మీలో
కొందరు అందరిలా ఉండరు.... ‘ఎందుకీ పక్షులు కొమ్మల్ని విడిచి పారిపోతున్నాయి ఆకాశాల బరువుల్ని మోసుకుంటూ? ఎందుకీ చెట్లు ఇలా వలస పోతున్నాయి పువ్వుల భారాన్ని మోసుకుంటూ? ఎవరైనా వాటి నేత్రాల్లో ఉన్న శోకసముద్రాలు గుర్తించారా? దేశపు గొంతులో ఉన్న ఆక్రోశం ఎవరైనా విన్నారా?’ అంటూ దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. అలాంటి వారిలో ఒకరు ఆశా సహాయ్. పదిహేడు సంవత్సరాల వయసులో దేశం కోసం యుద్ధక్షేత్రాల్లోకి వెళ్లింది... జపాన్‌లోని కోబ్ నగరంలో జన్మించింది ఆశా సహాయ్. తండ్రి ఆనంద్ మోహన్ సహాయ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు రాజకీయ సలహాదారు. అంతకుముందు బాబూ రాజేంద్రప్రసాద్‌కు సెక్రెటరీగా పనిచేశాడు. బిహార్‌లోని భాగల్పూర్కు చెందిన ఆనంద్ మోహన్ ఆనాటి నిర్బంధ పరిస్థితుల్లో జపాన్‌కు వెళ్లాడు. అక్కడ బతుకుదెరువు కోసం జపాన్ పిల్లలకు ఇంగ్లీష్ బోధించేవాడు. ‘దేశానికి దూరంగా ఉన్నా, మా నుంచి దేశం ఎప్పుడూ దూరంగా లేను. నా దేశానికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు రావాలని ఆబాలగోపాలం కోరుకునే రోజులవి’ అంటున్న ఆశా సహాయ్ తల్లిదండ్రుల ద్వారా మాటలు, పాటల రూపంలో దేశభక్తిని ఆవాహన చేసుకుంది. పదిహేడు సంవత్సరాల వయసులో నేతాజీ భారత జాతీయ సైన్యంలోని రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో చేరింది. జపాన్ నుంచి తైవాన్ అక్కడి నుంచి థాయిలాండ్ వరకు ప్రయాణించి రాణి ఝాన్సీ రెజిమెంట్‌లోకి వెళ్లింది. రైఫిల్ హ్యాండ్లింగ్ నుంచి యాంటీ–ఎయిర్ క్రాఫ్ట్గన్స్ వరకు తొమ్మిది నెలల పాటు రకరకాల విద్యల్లో కఠినమైన శిక్షణ తీసుకుంది. గెరిల్లా యుద్ధతంత్రాలలో ఆరితేరింది. సింగపూర్, మలేసియా, బర్మా... యుద్ధకేత్రాల్లో పని చేసింది. తాగడానికి నీరు, తినడానికి తిండి దొరకని ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నో రోజులు బర్మా అడవుల్లో గడిపింది. తన పోరాట అనుభవాలను ఎప్పటికప్పుడు డైరీలో రాసుకునేది. ఆశా సహాయ్ని సైనిక దుస్తుల్లో చూసిన రోజు తల్లి సతీ సహాయ్... ‘నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించవద్దు. ఇప్పుడు నువ్వు మా బిడ్డవి కాదు, భరతమాత బిడ్డవు’ అని ఆశీర్వదించింది. బెంగాల్‌కు చెందిన సతీ సహాయ్ ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడు చిత్తరంజన్‌దాస్‌కు సమీప బంధువు. ‘బాంబుగాయాలతో బాధ పడుతున్నా సరే వెనకడుగు వేసేవాళ్లం కాదు’ అని ఆ రోజులను గుర్తు చేసుకుంటుంది ఆశా సహాయ్. తాను డైరీలో రాసుకున్న విషయాలను ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్ కోలిన్స్ తాజాగా ‘ది వార్ డైరీ ఆఫ్ ఆశా–సాన్: ఫ్రమ్ టోక్యో టు నేతాజీస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ’ పేరుతో పుస్తకంగా ప్రచురించింది. పుస్తకాన్ని ఇంగ్లిష్‌లో ప్రచురించడం ఇదే తొలిసారి. ఆశా మునిమనవరాలు తన్వీ శ్రీవాస్తవ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ‘ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. ఆ రోజుల్లో యువతరంలో ఉప్పొంగే దేశభక్తి భావాలు, చేసిన త్యాగాల గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన ఆశా ఏరోజూ వెనకడుగు వేయలేదు’ అంటుంది తన్వీ శ్రీవాస్తవ. ‘ఇది వ్యక్తిగత పుస్తకం కాదు. ఆ రోజుల్లోని పోరాటస్ఫూర్తికి అద్దం పట్టే పుస్తకం’ అంటున్న 94 సంవత్సరాల ఆశా సహాయ్ తన కుమారుడితో కలిసి పట్నా (బిహార్)లో నివసిస్తోంది. చదవండి: అలనాటి ఆకాశ వాణి Alpana Parida: క్షేమంగా... లాభంగా.. ఫైబర్ హెల్మెట్.. తక్కువ బరువు! -
విలేజ్ నుంచి విదేశాలకు: పూజా, ఆశా, సుర్భి ఏం చేస్తున్నారంటే!
మారుమూల గ్రామాల్లో ఉన్న మహిళలు చదువుకోలేకపోవచ్చు. కానీ, వారి చేతుల్లో అందమైన మన ప్రాచీన కళావైభవం దాగుంటుంది. తరతరాలుగా వస్తున్న ఆ వైభవం ఇప్పటికీ మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఆ కళల పట్ల ఉన్న వారి ప్రతిభను ఆ గ్రామాలకే పరిమితం అవడం లేదు. దేశ సరిహద్దులు దాటుతున్నాయి. మన దేశీయ హస్తకళలకు విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను గమనించి, ప్రాచీన హస్తకళలకు తిరిగి జీవం పోస్తున్న వారెందరో తమతో పాటు వేలాదిమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎదుగుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని సురోలి గ్రామానికి చెందిన పూజా షాహి ఊళ్లో తయారు చేసిన హస్తకళలను అమెరికా–జర్మనీ దేశాలకు ఎగుమతి చేస్తోంది. 2009లో కొంతమందితో మొదలుపెట్టిన చిన్న స్టార్టప్ నేడు లక్షల టర్నోవర్ సాధిస్తోంది. నిరక్షరాస్యులైన ఇక్కడి మహిళలు తయారు చేసిన హస్తకళలను ఇప్పుడు అమెరికా, జర్మనీలకు పంపుతున్నారు. అమ్మమ్మల కాలపు కళగా పేరొందిన క్రొయేషియా కళ ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. దీనికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఇక్కడి గ్రామీణ మహిళల జీవితాలను మార్చేసింది. ‘నేను ఇంటర్మీడియెట్ వరకు చదివాను. చిన్నప్పటి నుండి మా అమ్మ క్రొయేషియా నుండి వివిధ వస్తువులను తయారు చేయడం చూశాను. వాటి నుండి చాలా ప్రేరణ పొందాను. మెల్లగా నా చెయ్యి కూడా క్రొచెట్ అల్లడం మొదలుపెట్టింది. రకరకాల బొమ్మలు, అలంకరణ వస్తువులు క్రొచెట్తో తయారు చేస్తూ, ఆర్డర్ల ద్వారా వాటిని ఇస్తుండేదాన్ని. తర్వాత్తర్వాత నా చుట్టూ మా ఊళ్లో ఉన్న మహిళలపైన దృష్టి పెట్టాను. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటిపని, వంటపని, పిల్లలపని.. దీంట్లో ఉండిపోతారు. ఈ ఆడవాళ్లు డబ్బు ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే వారి అదృష్టం మారుతుందనుకున్నాను. అలా, వారి చేత కూడా సోఫాకవర్లు, టీవీ కవర్లు, ఊయల, వాల్ హ్యాంగర్లు, ఫొటో ఫ్రేములు, కర్టెన్లు, బాటిల్ హోల్డర్లు, వాలెట్లు తయారు చేయించేదాన్ని. ‘జాగృతి యాత్ర’ సంస్థ పరిచయం అయ్యాక ఈ ఉత్పత్తులను ఎలా అమ్మాలి అనే విషయాలపై అవగాహన వచ్చింది. ‘డియోరియా డిజైన్’ పేరుతో కంపెనీ ప్రారంభించాను. ఇది ఇప్పుడు సంపాదన క్రాఫ్ట్‌గా మారింది. 100 రకాల అలంకార వస్తువులు, 50 రకాలకు పైగా ఆభరణాలు, ఉపకరణాలను తయారుచేస్తున్నాం. వీటిని అమెరికా, జర్మనీ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటివరకు 35 వేల మంది మహిళలు శిక్షణ పొందారు. రాబోయే మూడేళ్లలో పదివేల మంది మహిళలు పర్మినెంట్ ఉద్యోగులుగా పనిచేయాలన్న లక్ష్యంగా కృషి చేస్తున్నాను. మా డిజైన్స్‌కి ‘వన్ డిస్ట్రిక్ట్... వన్ ప్రొడక్ట్’ అని పేరు పెట్టారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నన్ను ‘దేవి’ అవార్డుతో సత్కరించి, మా పనిని అభినందించారు. మొదట్లో నా కుటుంబసభ్యులే నాకు మద్దతుగా నిలవలేదు. కానీ, నేడు నా హస్తకళల పనిలో నిమగ్నమవడంతో నేను విజయం సాధించాను అనిపించింది’ అంటారు పూజా షాహి. కుట్టుపనికి అంతర్జాతీయ మార్కెట్ గుర్తింపు మహిళలకు శక్తినిస్తుంది. ఏదైనా చేయగలరని భావించేలా చేస్తుంది. అప్పుడు వారు తమ విలువను అర్థం చేసుకుంటారు’ అంటారు స్వరా బో దబ్ల్యూ ఫౌండర్ ఆశా స్కారియా. కేరళలోని ఎట్టుమనూరు చెందిన ఆశా హస్తకళాకారులను గుర్తించి, వారి కళను మరింత శక్తిమంతం చేస్తుంది. ‘మహిళలు ఇంటి నుండి పనిచేస్తారు. వారు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉపాధిని కల్పించుకోవడంతో పాటు సాధికారికంగా ఉంచుతుంది’ అంటారు ఆమె. స్వరాబ్రాండ్ కళాకారులు తయారుచేసిన చీరలను అంతర్జాతీయంగా మార్కెట్ చేస్తుంది. దేశమంతటా గ్రామీణ మహిళలల్లో దాగున్న ప్రాచీన కుట్టుపని నైపుణ్యాలను పెంపొందింపజేస్తుంది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్, కేరళకు చెందిన కళాకారులతోపాటు దుంగార్పూర్లోని వారితోనూ, మహిళా కళాకారులను సమీకరించిన స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుంది. అంతేకాదు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని మహిళలు లేదా మానవ అక్రమ రవాణా నుండి రక్షించబడిన మహిళలకు మద్దతుగా స్వరా పనిచేస్తుంది. కళల పట్ల అభిరుచితో... సుర్భి అగర్వాల్ జోద్‌పూర్‌లో స్పెషాలిటీ హాస్పిటల్‌ను నడుపుతున్న తన కుటుంబ వ్యాపారాన్ని విడిచిపెట్టి కళ పట్ల ఆమెకున్న అభిరుచిని అందిపుచ్చుకుంది. దేశంలోని వెనుకబడిన మహిళలకు సహాయం చేయాలనుకుంది. రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని హస్తకళాకారులతో కలిసి, గృహాలంకరణ ఉత్పత్తులను తయారుచేయడానికి ‘ది ఆర్ట్ ఎక్సోటికా’ను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా హస్తకళాకారులతో కలిసి గృహాలకంరణ ఉత్పత్తులను తయారు చేయిస్తూ, వాటిని అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని నేత కార్మికులకు సహాయం చే యడానికి ఆమె తన గ్యారేజ్ నుంచి వర్క్ ప్రారంభించింది. జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు హస్తకళలను, చేనేత ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది సుర్బి. చదవండి: ‘100 రకాల’ డ్రాగన్ రైతు! ఒక్కో మొక్క రూ. 100 నుంచి 4,000 వరకు అమ్మకం! -
వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే: బంగారంలాంటి బ్లడ్ డోనర్
అనుబంధాల గురించి చెప్పే సందర్భంలో ‘నీటి కంటే రక్తం చిక్కనిది’ అంటారు. రక్తం చిక్కనిది మాత్రమే కాదు... ఎన్నో జీవితాలను చక్క బెట్టేది. జీవితానికి రక్షణగా నిలిచేది. ‘అన్నదానం మాత్రమే కాదు రక్తదానం కూడా మహాదానం’ అనే ఎరుకను ప్రజల్లో తీసుకురావడానికి తన వంతుగా ప్రయత్నిస్తోంది ఆశా సూర్యనారాయణ్... ‘ప్రౌడ్ టు బీ బ్లడ్ డోనర్’ ‘మీ రక్తంతో పాటు ఒకరికి జీవితాన్ని కూడా ఇస్తున్నారు’ ‘రక్తదాతలు జీవితరక్షకులు’... మొదలైన నినాదాలు గట్టిగా వినిపించని కాలం అది. 24 సంవత్సరాల వయసులో తొలిసారిగా రక్తదానం చేసింది బెంగళూరుకు చెందిన ఆశా సూర్యనారాయణ్. ఒకరోజు దినపత్రిక చదువుతున్నప్పుడు రక్తదానానికి సంబంధించి సిటీ హాస్పిటల్ వారి ప్రకటన కనిపించింది. తనది వారు అడిగిన బ్లడ్‌గ్రూపే. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి రక్తదానం చేసింది. నిజానికి తనకు అప్పుడు రక్తదానం ఎలా చేయాలి, దాని విలువ ఏమిటి... మొదలైన విషయాలపై అవగాహన లేదు. ఇప్పుడు ఆమె వయసు 55 సంవత్సరాలు. ఆరోజు ప్రారంభమైన రక్తదానం ఇప్పటికీ ఆగలేదు. ఒకసారి బెంగళూరులో క్యాన్సర్ పేషెంట్‌కు రక్తదానం చేసింది. మరుసటి రోజు ఆ హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు... ఆశను చూసి ఒక వృద్ధురాలు వేగంగా నడిచివచ్చింది. దగ్గరికి రాగానే తన కాళ్ల మీద పడింది. ‘అయ్యో! మీరు పెద్దవాళ్లు’ అంటూ ఆమెను లేపింది ఆశ. ‘మీరు ఎవరో తెలుసుకోవచ్చా?’ అని అడిగేలోపే... ‘మీరు రక్తదానం చేసి నా బిడ్డను బతికించారు’ అంటూ కట్టలకొద్ది డబ్బును ఇవ్వబోయింది. ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించిన ఆశ ‘ఒక్క రూపాయి కూడా అవసరం లేదు తల్లీ. ఇప్పుడే కాదు మీరు ఎప్పుడు పిలిచినా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తాను’ అని ఆ వృద్ధురాలికి ధైర్యం చెప్పింది. నిజానికి ఈ సంఘటన రక్తదానం పట్ల తన దృక్పథాన్ని పూర్తిగా మార్చి వేసింది. నిబద్ధతను మరింతగా పెంచింది. ‘నేను చేయడమే కాదు చేయించాలి కూడా’ అనుకొని రక్తదానం గురించి మహిళలతో మాట్లాడినప్పుడు వారు విముఖంగా ఉన్నారు. ‘రక్తదానం వల్ల మహిళలు బలహీనమవుతారు’... మొదలైన అపోహలే దీనికి కారణం. అందుకే అలాంటి అపోహలను తొలిగించే ప్రచారాన్ని చేపట్టింది. ఇది మంచి ఫలితం ఇచ్చింది. చాలామంది మహిళలు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. రక్తదానం చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు, కుటుంబ సభ్యులు భయపడుతుంటారు. ఆశ కుటుంబలో కూడా మొదట్లో అలాంటి భయాలు ఉన్నా, తరువాత మాత్రం ఆమెకు పూర్తిగా అండగా నిలిచారు. కోవిడ్ కోరలు చాచిన భయానక కాలంలో బ్లడ్ డొనేషన్స్ భారీగా తగ్గిపోయాయి. రెగ్యులర్‌గా రక్తదానం చేసేవాళ్లు కూడా ‘రిస్కు ఎందుకు’ అంటూ ఇళ్లు కదలడం లేదు. ఆ సమయంలో తాను చొరవ తీసుకుంది. ‘రక్తదానం చేయడానికి అభ్యంతరం లేదు. కానీ బ్లడ్‌బ్యాంకుకు మాత్రం వచ్చేది లేదు’ అన్నారు చాలామంది. అలాంటి వారికి ధైర్యం చెప్పి బ్లడ్‌బ్యాంకులకు తీసుకెళ్లేది ఆశ. ఆశను అభిమానంగా ‘గోల్డెన్ బ్లడ్ డోనర్’ అని పిలుచుకుంటారు అభిమానులు. రక్తదానంతో మొదలైన ఆమె సమాజసేవ అక్కడితో ఆగిపోలేదు. మరెన్నో మంచిపనులకు అది బలమైన పునాదిగా మారింది. కోవిడ్ సమయంలో దిక్కుమొక్కులేని వారికి అన్నదానం, అనాథ శవాలకు దహన సంస్కారాలు చేయడం, వాక్సినేషన్ డ్రైవ్..ఆమె చేసిన మంచి పనుల్లో కొన్ని మాత్రమే. -
'ఆశ ఎన్కౌంటర్' ట్రైలర్.. ఇది కల్పితమన్న ఆర్జీవీ
RGVs New Movie Aasha Encounter Trailer Released : సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరెన్ని విమర్శలు చేసినా తను చేయాలనుకుంది చేసి తీరతాడు. 2019, నవంబర్26న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన ఆధారంగా ఆర్జీవీ రూపొందిన చిత్రం ఆశ ఎన్కౌంటర్. గతంలోనే దీనికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. అయితే కోర్టు ఆదేశాల మేరకు టైటిల్‌ను మార్చి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ సినిమాను నవంబర్26న విడుదల చేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు. అయితే ఈ సినిమా కథ మాత్రం ఎవరిని ఉద్దేశించి కానీ, ఏ ఆధారపడి తీసింది కాదని, ఇది పూర్తిగా కల్పితం అని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో సోనియా ఆశ టైటిల్ రోల్లో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. AASHA ENCOUNTER film got delayed due to COVID and LEGAL issues but now it’s releasing on NOVEMBER 26th featuring @SoniaAASA in title role directed by @anandchandra02 and produced by @anuragkancharla https://t.co/CqmID1h96X — Ram Gopal Varma (@RGVzoomin) October 31, 2021 -
పీజీ గోల్డ్ మెడలిస్ట్.. ప్రేమించి పెళ్ళి చేసుకొంది.. అంతలో ఏమైందోగానీ!
సాక్షి, మైసూరు: చదువుల్లో మేటి, బంగారు పతకం కూడా సాధించింది, కానీ జీవితంలో ఓడిపోయింది. శనివారం మైసూరు జేపీ నగరంలో ఆశా (30) అనే వివాహిత అనుమానాస్పదరీతిలో శవమైంది. ఆమె స్వస్థలం మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా మడేనహళ్ళి. ఎనిమిదేళ్ల కిందట మళవళ్ళికి చెందిన నాగప్రసాద్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకొంది. మైసూరులోని జేజీ నగరలో కాపురం పెట్టారు. ఆశా గతంలో మైసూరు వర్సిటీలో పీజీ పూర్తిచేసి స్వర్ణ పతకం కూడా సాధించింది. భర్త నాగప్రసాద్ కట్నం తేవాలని భార్యను తరచూ వేధించేవాడు. అతని పోరు తట్టుకోలేక ఆశా రెండుసార్లు పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు జడ్జి ఇద్దరికీ నచ్చజెప్పడంతో మళ్లీ కలిసి ఉన్నారు. అప్పటికీ భర్త వేధింపులు ఆపకపోవడంతో ఆశ వేరేగా పీజీ హాస్టల్లో ఉంటానని స్పష్టంచేసింది. ఇంతలో ఏమైందోగానీ శనివారం తెల్లవారుజామున ఇంటిలో ఉరి వేసుకొన్న స్థితిలో ఆమె మరణించింది. విద్యారణ్యపుర పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (కొత్త కారుకు పూజ కోసం వెళుతూ..) -
‘ఆశ’ వదులుకోలేదు: స్వీపర్ నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా..
రోజూ ఎన్నో సక్సెస్ స్టోరీలు చూస్తుంటాం. వాటిలో చాలామట్టుకు చిన్నస్థాయి నుంచి పెద్ద విజయాలు అందుకున్న వాళ్లే కనిపిస్తుంటారు. తమ కష్టపుకథలు మరికొందరిలో స్ఫూర్తి నింపాలనేదే వాళ్ల ఉద్దేశం కూడా. రాజస్థాన్‌కి చెందిన ఆశ కందారా గాథ కూడా అలాంటిదే. జైపూర్: ఆశ కందారా.. మూడు రోజుల వరకు జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో పని చేసిన ఒక స్వీపర్. 2016 నుంచి కాంట్రాక్ట్ సర్వీస్‌లో కొనసాగిన ఆమెకు.. పన్నెండు రోజుల క్రితమే పర్మినెంట్ ఎంప్లాయి లెటర్‌ను చేతిలో పెట్టారు అధికారులు. ఆ సంతోషం మరువక ముందే.. ఏకంగా ఆమె తన లక్క్ష్యం అందుకుంది. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్‌లో 728 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించింది. దీంతో త్వరలో ప్రభుత్వాధికారి హోదాలో ఆమె బాధ్యతల్ని చేపట్టబోతోంది. నిజానికే రెండేళ్ల క్రితమే ఆమె పరీక్షలకు, ఇంటర్వ్యకు హాజరుకాగా.. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ చివరికి మంగళవారం రాత్రి ఫలితాలు వెలువడ్డాయి. घर चलाने के लिए लगाती थीं झाड़ू, लेकिन मेहनत लाई रंग और बनी SDM! सुनिए Asha Kandara के संघर्ष की ये कहानी#AshaKandara #SDM #Story pic.twitter.com/R2jekPkg0I — News Tak (@newstakofficial) July 16, 2021 భర్త వదిలేయడంతో.. 1997లో ఆశ చదువు ఆపేయించి మరీ పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇద్దరు పిల్లలు పుట్టాక మరో మహిళతో సంబంధం పెట్టుకుని.. ఆమెను వదిలేశాడు భర్త. దీంతో ఆమె పుట్టింటికి చేరింది. భర్తను అదుపులో పెట్టుకోలేకపోయిందంటూ సమాజం మొత్తం ఆశదే తప్పని నిందించింది. కానీ, ఆమె అవేం పట్టించుకోలేదు. ఇంట్లో చిన్నచిన్న పనులు చేస్తూనే.. పేరెంట్స్ సహకారంతో చదువును కొనసాగించింది. 2016లో ఎట్టకేలకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో మున్సిపల్ కార్పొరేషన్లో టెంపరరీ స్వీపర్ పోస్టులకు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యింది. మలుపు తిప్పిన సెల్యూట్ ఆశకు ప్రేరణ తన పైఅధికారులే. రోజూ వాళ్ల గదుల్ని, ఆఫీసు పరిసరాల్ని శుభ్రం చేయడం, కిందిస్థాయి ఉద్యోగుల నుంచి వాళ్లు గౌరవం అందుకోవడం ఆమెను ఆకర్షించేవట. ఓరోజు విధుల్లో ఉండగా హఠాత్తుగా పైఅధికారులు ఇన్స్పెక్షన్కు వచ్చారు. అప్పటిదాకా తనతో సరదాగా గడిపిన తోటి ఉద్యోగులు ఒక్కసారిగా నిలబడి వాళ్లకు సెల్యూట్ చేయడంతో, ఆ గౌరవం తనకూ దక్కాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే పరిస్థితులు అందుకు ప్రతికూలంగా ఉన్నాయని తెలిసినా ఆమె ఆశను వదులకోలేదు. పిల్లల పోషణ కోసం ఓవైపు 10 గంటలు స్వీపర్‌గా పని చేస్తూనే.. ఆర్ఏఎస్ ఎగ్జామ్‌లకు కష్టపడి ప్రిపేర్ అయ్యింది. చివరికి తన కలను నెరవేర్చుకోవడంతో పాటు త్వరలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించబోతోంది ఆశా కందారా. ‘ఈ విజయం నా కుటుంబానికే అంకితం. నా నిర్ణయాన్ని గౌరవించి, నాకు అండగా నిలబడినందుకే ఈ గెలుపు సాధ్యమైంది’ అని సంతోషంగా చెప్తోందామె. మేయర్ కుంతి దియోరా నుంచి అభినందనలు అందుకుంటున్న ఆశ -
ఆమె టీవీలో అల్లరి చేస్తే, ఇక్కడ ఇంట్లో మురిసిపోతారు
ఆశా నేగి.. కానీ, అందరికీ పూర్విగానే తెలుసు. తను అక్కడ టీవీలో అల్లరి చేస్తే.. ఇక్కడ ఇంట్లో మురిసిపోతారు. అంతలా ప్రేక్షకులను మాయ చేసిన ఆశా ఇప్పుడు వెబ్ ప్రపంచంలోనూ అందరి మనసులు దోచేస్తోంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో పుట్టి, పెరిగింది. దయానంద్ ఆంగ్లో వేదిక్ (డీఏవీ) కాలేజీలో బీకామ్ చేసింది. అనంతరం ఓ కాల్ సెంటర్లో ఉద్యోగం సంపాదించుకుంది. ఆ సమయంలోనే ‘మిస్ ఉత్తరాఖండ్ 2009’ అందాల పోటీలో పాల్గొని కిరీటం సాధించింది. నటనపై ఉన్న ఇష్టంతో ముంబై చేరింది ఆశా. తొలి అవకాశం ‘పవిత్ర రిష్తా’ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అందులో తను షోషించిన ‘పూర్వీ’ పాత్రను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు.. అదే ఆమె ఇంటి పేరుగా మారేంతలా. ఈ సీరియల్లోని రిత్విక్ ధంజని, ఆశా నేగి జంటకూ అంతే క్రేజ్ ఏర్పడింది. జీవితంలోనూ ఆ ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. కలసి ఇండియన్ డ్యాన్స్ రియాలిటీ షో ‘నాచ్ బలియే 6’లో పాల్గొని విజయం సాధించారు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే ఆ ఇద్దరూ విడిపోయారు. ప్రేమ గాయంతో కుంగిపోలేదు ఆశా. 2013లో ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ షోకు వాఖ్యాతగా చేసింది. ‘ఖత్రోం కే ఖిలాడీ’ షోలో రన్నరప్‌గా నిలిచింది. ఇలా పలు సీరియల్స్, షోలు చేస్తూ బుల్లితెరపై బిజీగా ఉంటోంది. గతేడాదే ‘బారిష్’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీకీ పరిచయమైంది ఆశా. ఆ తర్వాత చేసిన ‘అభయ్ 2’ ఆమెను ఓటీటీ స్టార్ చేసేసింది. క్రైం జర్నలిస్టుగా అందులో ఆమె కనబర్చిన నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ కారణంగానే అనురాగ్ బసు దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ మూవీ ‘లూడో’లో ఆమెకు స్థానం దక్కింది. అభిషేక్ బచ్చన్ పక్కన నటించింది. సదా కృతజ్ఞురాలిని డిజిటల్ ప్లాట్‌ఫాం అనేది సినిమాకు, టీవీకి మధ్య ఉన్న అందమైన వంతెన. నటనకు సంబంధించి సంపూర్ణ స్వేచ్ఛను ఇక్కడ నేను ఆస్వాదించాను. అలాగని నాకు గుర్తింపు తెచ్చిపెట్టిన టీవీని ఎన్నటికీ మరువను. దానికి సదా కృతజ్ఞురాలినే. – ఆశా నేగి -
మమ్మల్నీ కలుపుకోండి.. నిప్పురవ్వలం మేము
ఆషా పట్వాల్‌కు కళ్లు లేవు. ‘లేనిది మాకు కదా.. మీకు చూడ్డానికేం?’ అంటోంది. ఆమెకు చెవులూ వినిపించవు. వినికిడి లేనిది మాకు కదా.. మీకు వినడానికేం?’ అంటోంది. ‘మమ్మల్నీ కలుపుకోండి.. నిప్పురవ్వలం మేం’ అంటోంది. ఐరాస డేటా ఫోరమ్‌కి మాట లేదు! ఏం పిల్ల..! అనైతే అంది. మందాకిని, అలకనంద నదుల సంగమంలో ఉంటుంది రుద్రప్రయాగ. మహాశివుడి మూడు కళ్లలా ఉత్తరాఖండ్‌లోని చమోరి, పౌరి, తెహ్రీ జిల్లాల నుంచి రుద్రప్రయాగ ఆవిర్భవించింది. రుద్రుడంటే శివుడు. ఆ రుద్రస్థలిలో జన్మించిన ఆషా పట్వాల్‌కు రెండు కళ్లూ లేవు! కళ్లతోపాటు వినికిడి శక్తీ లేదు! అనుకోకుండా ఏదైనా అద్భుతం జరిగితే ఆ అమ్మాయికి చూపు రావచ్చు. అయితే తనకు చూపు రావాలని కోరుకోవడం లేదు ఆషా. ‘నాలాంటి వారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. మమ్మల్ని చూడండి’ అని విజ్ఞప్తి చేస్తోంది. ఆ విజ్ఞప్తిని నిముషం కన్నా తక్కువ నిడివిగల వీడియోలో చూసి ఐక్యరాజ్య సమితి అధికారులు కదిలిపోయారు! ఆషాకు పదహారేళ్లు. రుద్ర ప్రయాగ్‌లో పదవ తరగతి చదువుతోంది. చూపు, వినికిడి లేకున్నా, మాట ఉంది. చక్కగా ఆటలు ఆడుతుంది. డిస్కస్ త్రోయింగ్, పరుగు పందెం ఆమెకు ఇష్టమైన ఆటలు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్ డేటా ఫోరమ్’.. ‘డేటా ఎందుకు అవసరమంటే?’ అనే టాపిక్‌ని ఇచ్చి, నిముషంలోపు వీడియోలో రికార్డ్ చేసి పంపమని ఎంట్రీలు ఆహ్వానిస్తే ఆషా కూడా తన వీడియోను రికార్డ్ చేసి పంపింది. అందుకు ఆమెను ‘సెన్స్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రోత్సహించింది. 15–24 ఏళ్ల వయసులోని వారికి డేటా ఫోరమ్ పెట్టిన ప్రపంచవ్యాప్త పోటీ ఇది. ఆ పోటీ పేరు ‘1 మినిట్ వాయిసెస్ ఆఫ్ యూత్’. షార్ట్‌లిస్టులో పదిమంది ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఆ పదిమందిలో ఒకరు ఆషా పట్వాల్! ‘ఐ యామ్ ఇన్విజిబుల్’అని ఆషా వీడియో మొదలౌతుంది. ‘నేను కనిపించను’ అని. వీడియోలో తను కనిపిస్తూనే ఉంటుంది. సైలెంట్ వీడియో అది. చేతులు కదుపుతూ, కళ్ల సైగలతో చెబుతుంటుంది. మరి కనిపించకపోవడం ఏంటి? తనను, తనలాంటి వాళ్లను ప్రపంచం చూడటం లేదని చెప్పడం. పట్టించుకోవడం లేదని, లెక్కల్లోకి తీసుకోవడం లేదని గుర్తు చెయ్యడం. జనాభా లెక్కల్లోకి తమలాంటి వాళ్లను కూడా చేర్చుకొమ్మని ఆ వీడియోలో ఆషా అభ్యర్థించింది. తమలాంటి వాళ్లు అంటే.. రెండు విధాలైన అసహాయతలతో ఉన్నవారు అని. బధిరత్వం, అంధత్వం రెండూ ఉన్నవారు. ‘‘డేటాలోకి మమ్మల్నీ తీసుకుంటే ప్రపంచంలో మేమూ ఒక భాగం అవుతాం. ఈ కరోనా సమయంలో మేము జీవితాన్ని మరింత ఛాలెంజ్‌గా తీసుకోవలసి వస్తోంది. అందుకు ఆవేదన చెందడం లేదు. టీచర్ని కావాలని నా ఆశయం. అందుకోసం కూడా కష్టపడుతున్నాను’’ అని వీడియోలో చెప్పింది ఆషా. (ఆమె సంజ్ఞలు అర్థం అయేందుకు వీడియోలో కింద టెక్స్ట్ వస్తుంటుంది). ‘‘డేటా అవసరం ఏంటి అని కదా మీరు అడిగారు. భవిష్యత్తును నిర్మించుకోడానికి డేటా అవసరం. మీ డేటాలోకి మాకూ స్థానం ఇవ్వండి. జాతిలో స్ఫూర్తిని రాజేసే నిప్పురవ్వలం మేము’’ అని ఆషా ముగించింది. బధిరత్వం, అంధత్వం రెండూ ఉన్నవారు దేశంలో ఐదు లక్షలమంది వరకు ఉన్నారు. అయితే ప్రత్యేకమైన కేటగిరీగా మాత్రం వీళ్లు జనాభా లెక్కల్లో లేరు. ఆ విషయం ఆషా తన వీడియోలో ప్రధానంగా ప్రస్తావించింది. ఆషాకు పుట్టిన కొన్నాళ్లకు చూపు సమస్య వచ్చింది. కంజెనిటల్ క్యాటరాక్ట్. తండ్రికీ, ఇద్దరు తోబుట్టువులకూ ఆ వైకల్యం ఉంది. డెహ్రాడూన్‌లోని ‘షార్ప్ మెమోరియల్ స్కూల్ ఫర్ బ్లైండ్’ ప్రిన్సిపాల్ సుమనా సామ్యేల్ ఆషాను ఢిల్లీ తీసుకెళ్లి సర్జరీ చేయించారు. తిరిగి రుద్రప్రయాగ్కి రాగానే ఆషాకు మెనింజైటిస్ ఇన్ఫెక్షన్ సోకింది! దానిని గుర్తించి చికిత్సకు వెళ్లేలోపే వినికిడి శక్తీ పోయింది. మళ్లీ సుమననే ఆషాను డెహ్రాడూన్‌లోని ‘బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ డెఫ్ చిల్డ్రన్’లో చేర్పించి, సంజ్ఞల భాషను నేర్పించారు. ఐక్యరాజ్యసమితి ‘1 మినిట్ వాయిసెస్ ఆఫ్ యూత్’ కాంటెస్ట్ షార్ట్‌లిస్ట్‌లో ఉన్న ఆషా విజేత అయినా, కాకున్నా ఆమె చూపించే ప్రభావం మాత్రం మనదేశంలోని బధిర–అంధులకు ప్రయోజనకారిగా ఉండొచ్చు. మన దేశంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 1న జనగణన మొదలవుతోంది. అందులో కనుక బధిర అంధులకు ఒక కేటగిరీ ఉంటే అది తప్పకుండా ఆషా వీడియో ఎఫెక్టే! తమనూ సెన్సస్ ‘డేటా’లో చేర్చాలన్న ఆమె విజ్ఞప్తి ఇప్పటికే ఐరాస అధికారుల దృష్టిలో ఉంది కనుక ఆ మేరకు ఈలోపే మన ప్రభుత్వానికి వారి నుంచి సూచనలు అందవచ్చు. -
ఆశావహ సేద్యం!
రసాయనిక వ్యవసాయానికి పెట్టింది పేరైన హర్యానా రాష్ట్రంలో ఆశా వంటి ప్రకృతి వ్యవసాయదారులు అరుదుగా కనిపిస్తారు. ఆశ తన కుటుంబ సభ్యులు, కూలీల సహకారంతో గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పండ్ల తోటలు, పంటలు సాగు చేస్తానంటే వాళ్ల ఇంట్లో వాళ్లే ఎగతాళి చేశారు. అయినా, ఆశా వెనకంజ వెయ్యలేదు. జిల్లా కేంద్రం చర్కి–దద్రి జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో పిచొంప కలన్ గ్రామం ఆమెది. 3,200 గడప ఉంటుంది. ఆశా, ఆమె కోడలు జ్యోతితోపాటు ఆ ఊళ్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు చాలా కొద్దిమంది మాత్రమే. వాళ్లకు మూడెకరాల భూమి ఉంది. అందులో నారింజ, నిమ్మ, బత్తాయి చెట్లతో కూడిన పండ్ల తోటను సాగు చేస్తున్నారు. పరస్పరం పోటీ పడని సీజనల్ పంటలను అంతర పంటలుగా సాగు చేయడం ప్రకృతి వ్యవసాయంలో ఓ ముఖ్య సూత్రం. ఆశా ఆ సూత్రాన్ని పాటిస్తున్నారు. పాలకూర, మెంతికూర, శనగలు, సజ్జలు, గోధుమలను కూడా అంతరపంటలుగా సాగు చేస్తూ ఉత్తమ రైతుగా ఆశా పేరు గడించారు. అదే తోటలో సీతాఫలం మొక్కలను కూడా నాటాలని ఆమె అనుకుంటున్నారు. తొలుత రెండేళ్ల పాటు సాధారణ దిగుబడితో పోల్చితే 40 శాతం మేరకే దిగుబడి వచ్చిందని, అయినా మక్కువతో ప్రారంభించిన ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించి, ఇప్పుడు మంచి దిగుబడులు పొందుతున్నానని ఆశా తెలిపారు. ఏ రోజైనా ఇంటిపనులు చేసుకున్న తర్వాత ఉదయం, సాయంత్రం తోటలోకి వెళ్లి పనులు స్వయంగా చేసుకోవడం ఆశాకు, ఆమె కోడలికి అలవాటు. ప్రతిరోజూ శ్రద్ధగా తోటను గమనించుకుంటూ.. ఎక్కడైనా చీడపీడల జాడ కనిపిస్తే వెంటనే కషాయాలు, ద్రావణాలు పిచికారీ చేసి అదుపు చేయడం ముఖ్యమైన సంగతి అని ఆశ అంటున్నారు. గొయ్యిలో పాతిపెట్టిన మట్టి పాత్రలో పుల్లమజ్జిగ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చీడపీడలకు దాన్ని నీటిలో కలిపి పిచికారీ చేస్తారు. ఔషధ చెట్ల నుంచి సేకరించిన జిగురుకు నిప్పు అంటించి తోటలో పొగబెట్టడం ద్వారా చీడపీడలను సంప్రదాయ పద్ధతిలో ఆశా పారదోలుతున్నారు. ‘పంటలు పూత దశలో మా బామ్మ ఇలాగే చేసేది’ అంటున్నారామె. ప్రతి రెండు నెలలకోసారి ద్రవ జీవామృతాన్ని తోటకు అందిస్తూ భూసారాన్ని పెంపొందిస్తున్నారు. వర్మీకంపోస్టును సైతం తయారు చేసి పంటలకు వాడుతున్నారు. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ఎరువులు, పురుగుమందులను తయారు చేసుకుంటున్నారు. బయట ఏవీ కొనడం లేదు. బోరు నీటిని స్ప్రింక్లర్లు, డ్రిప్ ద్వారా పంటలకు అందిస్తున్నారు. ‘ఈ తరహా ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి చాలా తక్కువే. అయితే, కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది’ అంటున్నారు ఆశా కోడలు జ్యోతి. సతత్ సంపద అనే స్వచ్ఛందసంస్థ హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులను పరిచయం చేస్తూ ఉంటుంది. ఆశకు ఈ సంస్థ తోడ్పాటునందించింది. సతత్ సంపద డైరెక్టర్ జ్యోతి అవస్థి ఇలా అంటున్నారు.. ‘భూమిలో డీఏపీ, యూరియా వెయ్యకుండా పంటలు ఎలా పండుతాయి? అని రైతులు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. భూమిలో సారం పెరగడానికి రెండేళ్లు పడుతుంది. అందుకే ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన తొలి రెండేళ్లలో దిగుబడి తక్కువగా ఉంటుంది. ఎంతో మక్కువతో ప్రారంభించిన ఆశ వంటి రైతులు తట్టుకొని నిలబడగలరు. కానీ, మరీ చిన్న రైతులు దీనికి తట్టుకోలేరు. అందుకే మేం ఈ రైతులతో పనిచేస్తున్నాం. మార్పు నెమ్మదిగా వస్తుంది..’. -
ఇద్దరు కూతుళ్లు.. తప్పు నాన్నా
తండ్రి పేరు రొనాల్డ్ ఫెంటీ. కూతురి పేరు రాబిన్ రిహానా ఫెంటీ. తండ్రికి ఎంటర్టైన్మెంట్ బిజినెస్ ఉంది. ‘ఫెంటీ ఎంటర్టైన్మెంట్’. కూతురికి బ్యూటీ బిజినెస్ ఉంది. ‘ఫెంటీ బ్యూటీ’. ఈ పేర్లు, బిజినెస్ పేర్లు అలా ఉంచితే.. రిహానాకు గాయనిగా, బిజినెస్ ఉమన్‌గా, దౌత్యవేత్తగా, డాన్సర్‌గా, పాటల రచయిత్రిగా మంచి పేరుంది. ఆ పేరు ఆమె ఫెంటీ బిజినెస్ బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచేసింది. ఫెంటీ లిప్‌స్టిక్‌లు, ఫెంటీ లోదుస్తులు అంటే అమ్మాయిలకు పిచ్చి. ఫెంటీ అనే ఇంటి పేరు ఈ కూతురికి ఆ తండ్రి ఇచ్చిందే అయినా, తన ‘ఫెంటీ’ బ్రాండ్ పేరును తండ్రి అతడి ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌కి వాడుకోవడం రిహానాకు నచ్చలేదు. ఆమెకు మాటైనా చెప్పకుండా, ఆమె పేరు చెప్పి కోటీ యాభై లక్షల డాలర్ల ‘టాలెంట్ హంట్’ టూర్ డీల్ కుదుర్చుకున్నాడు. ‘మా అమ్మాయి వచ్చి పెర్ఫార్మ్ చేస్తుంది’ అని మాట కూడా ఇచ్చేశాడు. ‘‘అదేంటి డాడీ..’’ అంటే, ‘‘రెండు బిజినెస్‌లూ మనవే కదమ్మా’’ అన్నాడు. రిహానాకు తండ్రి తీరు నచ్చలేదు. ‘‘ఇంటి పేరు మీరిచ్చిందే కావచ్చు. బ్రాండ్ పేరు నేను సంపాదించుకున్నది నాన్నా’’ అంది. అని ఊరుకుంటుందనే అనుకున్నాడు ఆ తండ్రి. కానీ ఆ కూతురు కోర్టుకు వెళ్లింది. తన తండ్రి తన బ్రాండ్ నేమ్‌ను వాడకుండా నిరోధించాలని రిహానా కేస్ ఫైల్ చేసింది. ఈ బార్బడోస్ గాయని ఆస్తుల ప్రస్తుత విలువ 26 కోట్ల డాలర్లు. ఆస్తుల విలువ ఎంతని కాదు, మనిషిగా మన విలువ ఎంతో అది ముఖ్యం అంటోంది రిహానా! ఇంకో అమ్మాయి పేరు ఆశ. ఆ అమ్మాయి తండ్రి పేరు రామ్ విలాస్ పాశ్వాన్. కేంద్ర మంత్రి. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు. ఆ తండ్రికి వ్యతిరేకంగా ఈ కూతురు బిహార్ రాజధాని పాట్నాలో ధర్నాకు కూర్చుంది. ‘‘పాశ్వాన్ తక్షణం క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేసింది. నాన్న కదా అనుకోలేదు. ‘పాశ్వాన్’ అనే అనింది! ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు కొందరు మహిళలతో కలిసి వచ్చి లోక్ జనశక్తి పార్టీ ఆఫీసు బయట ఆశా బైఠాయించింది. ‘‘పాశ్వాన్.. క్షమాపణ చెప్పండి’’ అనే ప్లకార్డ్ ఆమె చేతిలో ఉంది. ఆర్జేడీ నాయకురాలు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని ‘అంగూఠా ఛాప్’ అని కామెంట్ చేశారు పాశ్వాన్. చదువులేని మనిషి అని అర్థం ఆ మాటకు. ఆ మాట నచ్చలేదు ఆశాకు. తండ్రి అనడం అసలే నచ్చలేదు. ‘‘ఇది ఒక మాజీ ముఖ్యమంత్రిని మాత్రమే అవమానించడం కాదు, నాతో సహా రాష్ట్రంలోని మహిళలందర్నీ అవమానించడమే’’ అని ఆశా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్ ఇస్తూ ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆర్జేడీ పార్టీ వ్యతిరేకించింది. ‘‘వాళ్లకు నినాదాలివ్వడం, చదువురాని వాళ్లను ముఖ్యమంత్రిని చెయ్యడం మత్రమే తెలుసు’’ అని ఎవర్నీ పేరు పెట్టి అనకుండా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాశ్వాన్ విమర్శించారు. ‘‘ఇలా అనడం తప్పు. రబ్రీదేవికి పాశ్వాన్ క్షమాపణ చెప్పాలి’’ అన్నది ఆశా డిమాండ్. కూతురు డిమాండ్ చేసింది కదా అని పాశ్వానేమీ రబ్రీదేవికి అపాలజీ చెప్పలేదు. బహుశా ఆ వివాదం పార్టీ ఆఫీసు నుంచి పాశ్వాన్ ఇంటికి మరలి ఉండాలి. పాశ్వాన్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. ఉష, ఆశ ఆయన మొదటి భార్య రాజ్‌కుమారి కూతుళ్లు. ఇంకో కూతురు ఈష, కొడుకు చిరాగ్ రెండో భార్య రీనా సంతానం. ఆశా భర్త అనిల్ సాధు. 2015లో బిహార్‌లోని బొచ్ఛాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లోక్ జన శక్తి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొన్ని నెలలకు ఆర్జేడీలో చేరి, ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అయ్యారు. లాలూ ప్రసాద్ అడిగితే కనుక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన తండ్రిపై పోటీగా హాజీపూర్ బరిలో నిలిచేందుకు ఆశ సిద్ధంగా ఉన్నారు. గట్టి అమ్మాయే. -
ఆయనకు ఎక్కడో మచ్చ ఉంది
తమిళసినిమా: నటుడు విమల్‌కు ఎక్కడో మచ్చ ఉంది. ఏమిటీ అర్థం కావడం లేదా. విమల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు (ఇతనికి ఎక్కడో మచ్చ ఉంది) అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఆయనకు జంటగా ఆషా జవేరి నటిస్తోంది. ఏఆర్.ముఖేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి ప్రొడక్షన్స్ పతాకంపై నటి చార్మిళ మాన్రే, ఆర్.సావంత్ కలిసి నిర్మిస్తున్నారు. వీరిలో నటి చార్మిళ మాన్రే కన్నడంలో ప్రముఖ కథానాయకిగా రాణించారన్నది గమనార్హం. ఈమె అక్కడ ప్రముఖ హీరోలందరితోనూ సుమారు 40 చిత్రాలకు పైగా నటించారు. ఈమె నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు. చార్మిళ మాన్రేను కన్నడంలో కథానాయకిగా పరిచయం చేసిన దర్శకుడు ఏఆర్.ముఖేశ్నే ఆమె తొలిసారిగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం మరో విశేషం. ఈయన తమిళంలో ఇండ్రు ముదల్, ఆయుదం చిత్రాలతో పాటు కన్నడంలో గజనీ, జోకర్ అనే హాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించారు. తాజా చిత్రం ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం గురించి తెలుపుతూ ఇది గ్లామర్‌తో కూడిన హ్యూమర్ అంశాలతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. దీని షూటింగ్ తొలి షెడ్యూల్ 10 రోజుల పాటు లండన్‌లో నిర్వహించినట్లు తెలిపారు. రెండవ షెడ్యూల్‌ను చెన్నైలో జరుపుతున్నట్లు చెప్పారు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు జాలీగా ఎంజాయ్ చేసే పూర్తి ఎంటర్టెయినర్గా ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం ఉంటుందని, అన్ని వర్గాల వారు చూసి ఆనందించే చిత్రం ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు అని దర్శకుడు తెలిపారు. దీనికి సంగీతాన్ని నటరాజ్ శం కరన్, ఛాయాగ్రహణం గోపి అందిస్తున్నారు. -
తమ వారే అనుకుని వేరొకరికి అంత్యక్రియలు
అన్నానగర్: తంజావూరు జిల్లా తిరుభువనం తోప్పు వీధికి చెందిన రామచంద్రన్ ఎలక్ట్రీషియన్. ఇతని భార్య ఆషా (40). వీరికి విఘ్నేష్ (22) అనే కుమారుడు ఉన్నాడు. ఆషాకి మానసిక వ్యాధి ఏర్పడిన స్థితిలో గత 13 సంవత్సరాలకు ముందు రామచంద్రన్ విడాకులు పొందాడు. అనంతరం ఇంకొక మహిళను వివాహం చేసుకుని కుమారుడు విఘ్నేష్‌తో నివసిస్తున్నాడు. గత నెల 26న కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ చికిత్స ఫలించక మృతి చెందింది. దీనిపై పోలీసులు విచారణ చేశారు. ఇందులో మృతి చెందింది తిరుభువనానికి చెందిన ఆషా అని నిశ్చయించి మృతదేహాన్ని ఆమె కుమారుడు విఘ్నేష్‌కు అప్పగించారు. దీంతో మృతదేహానికి అంత్యక్రియలు చేశాడు. ఈ స్థితిలో సోమవారం తిరుభువనం దుకాణ వీధిలో ఆషా తిరుగుతున్నట్లు గుర్తించిన తెలిసిన వారు వెంటనే ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు వచ్చి ఆమెను వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. -
అంగన్వాడీ, ఆశాలు అనర్హులు
‘ఒంటరి మహిళ భృతి’ సందేహాలపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల కేటగిరీలో ఆర్థిక భృతిని పొందేందుకు అంగన్ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తుల స్వీక రణ, పరిశీలన సందర్భంగా వ్యక్తమవుతున్న సందేహాలకు సెర్ప్ అధికారులు స్పష్టత ఇచ్చారు. వీరందరికీ వార్షికాదాయం నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ, గతంలో జారీచేసిన ఉత్తర్వుల (జీవో ఎంఎస్ నం 17) మేరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు (హోంగార్డులు సహా) ఆర్థిక భృతిని పొందేందుకు అర్హులు కారని పేర్కొన్నారు. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఒంటరి మహిళలుగా ఆర్థిక భృతిని పొందేందుకు అనర్హులని, తక్కువ వేతనంతో పనిచేస్తున్న సీనియర్ మేట్లు మాత్రమే అర్హులని తెలిపారు. గ్రామ సర్పంచ్, ఎంపీ టీసీ, జెడ్పీటీసీ.. తదితర (గౌరవ వేతనం పొందుతున్న) ప్రజాప్రతి నిధులు అర్హులు కారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన పిల్లలున్న మహిళల కుటుంబ ఆదాయం పరిమితికి లోపు ఉన్నట్లయితే ఆర్థిక భృతి పొందేందుకు అర్హులే. అభయ హస్తం పింఛన్ పొందుతున్న ఒంటరి మహిళలు, దాన్ని కాదనుకుని ఆర్థిక భృతి పొందే విషయంలో మాత్రం సెర్ప్ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. -
సమస్యలపై కదంతొక్కిన ఆశా వర్కర్లు
కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా కాకినాడ సిటీ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆధిక సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రూ.5 వేలు వేతనం ఇవ్వాలని, 104, ఇతర కార్యక్రమాల బకాయి పారితోషికాలు చెల్లించాలని, పని భద్రత, పీఎఫ్, ఇఎస్ఐ, ప్రమాదబీమా సౌకర్యాలు కల్పించాలని, నాలుగు సంవత్సరాల యూనిఫాం అలవెన్స్ వెంటనే చెల్లించాలని, ఎన్హెచ్ఎంకు 2017–18 సంవత్సర బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ నినదించారు. సుమారు మూడు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ నుంచి బాలాజీచెరువు సెంటర్ వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ గౌరవాధ్యక్షురాలు ఎం.వీరలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నాయని విమర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఎంతో ప్రాముఖ్యమైన మాతా, శిశు మరణాలు తగ్గించడానికి, గర్భిణీ, బాలింతల సంరక్షణ చూస్తున్న ఆశా వర్కర్లకు అసలు వేతనమే ఇవ్వకుండా అరకొర పారితోషికాలు ఇస్తూ అన్నిరకాల పనులు చేయించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్స్కు ఏవిధమైన వేతనం నిర్ణయించకుండా ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటోందని మండిపడ్డారు. ధరలు అధికంగా పెరిగి కుటుంబాన్ని పోషించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే కనీసవేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, అధ్యక్షురాలు బి.ఎస్తేరురాణి, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు జి.బేబిరాణి తదితరులు పాల్గొన్నారు. -
కోర్టును ఆశ్రయించిన జర్నలిస్టు భార్య
భర్త హత్య కేసులో నిందితుడి రాజకీయ ప్రముఖులతో కలిసి కనిపించడంతో హిందూస్తాన్ జర్నలిస్టు రంజన్ భార్య ఆశ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తనయుడు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్, గత శనివారం జైలు నుంచి విడుదలైన మరో ఆర్జేడీ నేత షహబుద్దీన్ లతో జర్నలిస్టు రంజన్ ను హత్య నిందితుడు మహమ్మద్ కైఫ్ మీడియాకు కనిపించాడు. దీంతో తన భర్త రంజన్ హత్య కేసుపై విచారణ చేయించాలని ఆయన భార్య ఆశా రంజన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నిందితులతో ఫోటోలు దిగడం, నిందితుడు పక్కనే ఉన్నా పోలీసులు పట్టించుకోకపోవడం లాంటివి చూస్తుంటే.. రంజన్ భార్య, ఆమె ఇద్దరు పిల్లలకు ప్రాణహాని ఉందని ఆశా తరఫు లాయర్ కిశ్లేయ్ పాండ్ అన్నారు. కాగా, కైఫ్ పై రంజన్ హత్యే కాకుండా మరో 5 కేసులు కూడా ఉన్నాయి. సీబీఐ బుధవారం రంజన్ హత్య కేసు విచారణను ఆరంభించింది. బీహార్ నాయకులతో ఫోటోలు, వీడియోల్లో ఉంది తానేనని కైఫ్ మీడియాకు చెప్పాడు. కేసు విషయం తన లాయర్లు చూసుకుంటున్నారని తెలిపాడు. తాను పోలీసుల ముందు హాజరుకావడానికి సిద్ధమేనని అన్నాడు. కైఫ్ తో తనకు సంబంధాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఖండించారు. వెయ్యిమందిలో ఎవరో ఒకరు వచ్చి తనతో ఫోటో దిగితే అతడు షూటర్ అని తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా సోదరుడిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్రని ఆరోపించారు. -
హరితహారం లక్ష్యం చేరుకోవాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 314 కిలోమీటర్ల రోడ్ల వెంబడి మొక్కలు నాటి హరితహార లక్ష్యాన్ని చేరుకోవాలని పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ ఆశ సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఈఎన్సీ సత్యనారాయణరెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో సమీక్షించారు. న ర్సరీల్లో అందుబాటులో ఉన్న, నాటాల్సిన మొక్కల వివరాలపై ఆరా తీశారు. జిల్లాలో ఈత మొక్కలు అందుబాటులో లేని విషయాన్ని అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ నెల 10న పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 314 కిలోమీటర్ల రోడ్ల వెంబడి లక్ష్యం ప్రకారం మొక్కలు నాటాలని సూచించారు. డ్వామా ఆధ్వర్యంలో నర్సరీల్లో 1.5 మీటర్ల మొక్కలు 50 వేలు ఉన్నాయని డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి తెలిపారు. ఈ వీసీకి పంచాయతీరాజ్ ఎస్ఈ రఘు, ఈఈలు అశోక్‌కుమార్, సుధాకర్‌రెడ్డిలు హాజరయ్యారు. -
అలరిస్తున్న 'జాతీయ' గీతాలాపనలు
-
ఇద్దరు కి'లేడీ'ల అరెస్ట్..!
చిత్తూరు అర్బన్: ప్రయాణికుల్లా బస్సుల్లో రాకపోకలు సాగిస్తూ అదను చూసి పక్కవారి ఆభరణాలను కొట్టేయడం.. ఆ డబ్బుతో జల్సాలు చేయడం వృత్తిగా ఎంచుకున్న ఇద్దరు యువతుల్ని చిత్తూరు టూటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం మైసూరు సిటీలోని ఎరగనహళ్లికి చెందిన టీఆర్.చిన్నమ్మ అలియాస్ ఆష, రాణి, శివపుత్రుడు అలియాస్ శివ ముగ్గురూ దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నారు. పుంగనూరు, చిత్తూరు, తిరుపతి రైల్వే స్టేషన్లలో పలు చోరీలకు పాల్పడ్డారు. బస్టాపులు, రైల్వే స్టేషన్లు, బస్సుల్లో రద్దీగా ఉన్న ప్రయాణికుల హ్యాండ్ బ్యాగులు కత్తిరించి చోరీలు చేయడం, నిద్రపోతున్న వారి బంగారు ఆభరణాలు దొంగిలించడంలో వీరు దిట్ట. గురువారం నగరంలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండుకు తరలించారు. ఇప్పటి వరకు పలు చోరీలకు పాల్పడి కూడబెట్టిన 200 గ్రాముల బంగారాన్ని, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. -
'నిబంధనల పేరుతో నిధులు ఆపేస్తున్నారు'
విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకంలో రోజుకోరకంగా మార్పులు తీసుకు వస్తుందని ఆంధ్రప్రదేశ్ స్పెషాల్టీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రతినిధి రమణమూర్తి ఆరోపించారు. ఆదివారం విజయవాడలో జరిగిన ఆశా సర్వసభ్య సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ప్రనిధిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ... నిబంధనల పేరుతో ఆసుపత్రులకు నిధులు ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలుగా అనిపిస్తున్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఎన్ని సార్లు అడిగినా పాత, కొత్త ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌లో ఓపీ సేవలు అందించడం సాధ్యం కాదని రమణమూర్తి స్పష్టం చేశారు. మా సమస్యలపై ఈ నెల 24వ తేదీన జరిగే సమావేశంలో అనుకూలమైన నిర్ణయాలు వెలువడకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని రమణమూర్తి తెలిపారు. -
జోరువానలో ఆగ్రహ జ్వాల
- టీడీపీ నేతల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన - వాళ్ల మనుషులను పెట్టుకోవడానికి మమ్మల్ని తొలగిస్తున్నారు - తెలుగుదేశానికి ఓటేయలేదనే వేధిస్తున్నారు - అంగన్వాడీ, మధ్యాహ్న భోజన, ఆశ,ఐకేపీ వర్కర్ల నిరసన - కలెక్టరేట్ దిగ్బంధం - వర్షంలోనూ కొనసాగిన ధర్నా, రాస్తారోకో - మహిళలు, పోలీసుల మధ్య తోపులాట, స్వల్ప ఉద్రిక్తత విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. మహిళలమని చూడకుండా టీడీపీ నేతలు తమను నానా దుర్భాషలాడుతూ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారని అంగన్వాడీ, ఆశ, ఐకేపీ, మధ్యాహ్న భోజన వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వారిని పెట్టుకునేందుకు కారణాల్లేకుండా, తమ పట్ల నీచంగా ప్రవరిస్తూ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం కదం తొక్కారు. రెండు గేట్లనూ మూసేసి మహా ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌ను దిగ్బంధిం చి ఉద్యోగులు, సందర్శకుల రాకపోకలను అడ్డుకున్నారు. జోరున వర్షం పడుతున్నా లెక్క చేయకుండా రాస్తారోకో చేశారు. శుక్రవారం ఉదయం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అంగన్వాడీ, ఐకేపీ, మధ్యాహ్న భోజన, ఆశ వర్కర్లు కలెక్టరేట్‌కు చేరుకుని తమకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు సుధారాణి, తమ్మినేని సూర్యనారాయణల ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా మధ్యాహ్నం మూడు గంటల వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా సుధారాణి తదితరులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో మహిళా ఉద్యోగులపై కారణాల్లేకుండా వేటు వేస్తున్నారన్నారు. ఓటు వేయలేదనే అక్కసుతోనే ఇదం తా చేస్తున్నారని ఆరోపించారు. తమవారిని నియమిం చుకునేందుకు కక్ష సాధింపులకు దిగుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 30 మంది మధ్యాహ్న భోజన వర్కర్లను జిల్లా వ్యాప్తంగా తొల గించారన్నారు. ఆశ వర్కర్లకు ప్రభుత్వం పెంచిన రూ.300 మొత్తాన్ని వేతనాలకు కలపకుండా వదిలేశారన్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా నిర్వహించినపుడు అందరినీ వినియోగించుకోవడమే తప్ప ఎటువంటి ప్రయోజనాలనూ కల్పించడం లేదన్నారు. ఐకేపీలో 15 నెలలుగా వీబీకేలకు (విలేజ్ బుక్ కీపర్లు) వేతనాలు ఇవ్వడం లేదన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ మహిళలే చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ వారికి వ్వాల్సిన వేతనాలు, గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. మహిళల పట్ల నీచంగా ప్రవర్తిసూ, విధుల నుంచి అన్యాయంగా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన మధ్యాహ్న భోజన వర్కర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఓ వైపు వర్షం.. మరో వైపు ఆందోళన ఓ వైపు జోరుగా వర్షం పడుతున్నా మహిళా ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. తడుస్తూనే ధర్నా కొనసాగించారు. మరోవైపు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఆ ప్రాంతమంతా ఆందోళనకారుల నినాదాలతో దద్దరిల్లింది. కలెక్టరేట్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. మహిళల జుత్తు పట్టుకుని, మెడపై చేతులేసి.... ఆందోళనకారులంతా కలెక్టర్‌ను కలవాలని ప్రయత్నించారు. వర్షం పడుతుండడంతో తమ డిమాండ్లు నెరవేర్చేందుకు గడువు విధించి విరమించాలని, వినతిపత్రాన్ని కలెక్టర్, జేసీ తదితరులకు ఇవ్వాలని మహిళలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారంతా ఒక్కసారిగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొంతమంది పోలీసులు మహిళల జుత్తు పట్టుకుని లాగేశారు. మరికొంతమంది మెడపై చేతులేసి నెట్టేశారు. ఈ సమయంలో మహిళలు పెద్దపెట్టున కేకలు వేశారు. బిగ్గరగా నినాదాలు చేశారు. రాజకీయ కక్షలు ఆపాలంటూ నినాదాలు చేస్తూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కలెక్టరేట్ దిగ్బంధం మధ్యాహ్నం 3 గంటల వరకూ కొనసాగింది. అనంతరం జాయింట్ కలెక్టర్ బి.రామారావు, డీఆర్వో బి.హేమసుందర్‌లకు ఆందోళనకారులు వినతిపత్రం అందించారు. తొలగించిన మధ్యాహ్న భోజన నిర్వాహకులను 15 రోజుల్లో తిరిగి చేర్చుకోవాలని, ఆశ, వీబీకేలకు వేతనాలు ఇవ్వాలనీ ఈ సందర్భంగా గడువు విధించారు. లేకుంటే 16వ రోజున తిరిగి కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు తమ్మినేని సూర్యనారాయణతో పాటు ఉమామహేశ్వరి, సుధారాణి, విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి, ఆర్ జయప్రద, అంగన్వాడీ, ఐకేపీ, ఆశ, మధ్యాహ్న భోజన నిర్వహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఏ పెళ్లి బెటర్?
అనురాగ్, రోహిత్‌రాజ్, మేర్లిన్ జెస్సీ, ఆషా, సితార ప్రధాన పాత్రధారులుగా రూపొందనున్న చిత్రం ‘గుండెల్లో గుచ్చి గుచ్చి చంపకే’. కృష్ణ తోట దర్శకుడు. షా ఐటి సొల్యూషన్స్ ప్రై.లిమిటెడ్‌తో కలిసి వి.వెంకట్రావ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మార్చి తొలివారంలో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో నిర్మాత మాట్లాడుతూ -‘‘మార్చిలో వరంగల్‌లో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. మే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎంబీఎస్ ప్రసాద్ తెలిపారు. ‘‘ప్రేమ వివాహం,పెద్దలు కుదిర్చిన వివాహం, షరతులతో కూడిన వివాహం, పెళ్లితో నిమిత్తం లేకుండా అవగాహనతో కలిసుండటం వీటిల్లో ఏది బెటర్.. అనే నేపథ్యంలో సరదాగా సాగే సినిమా ఇది’’అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌రెడ్డి, కెమెరా: ఎం.మురళీకృష్ణ. -
ఎవరీ అమ్మాయి?
కృష్ణ, అపేంద్ర, ఆషా, దివ్య, జిషాంక్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘చామంతి’. జె.మోహన్‌కాంత్ దర్శకుడు. టి.చలపతి నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను టి.ప్రసన్నకుమార్, సాయి వెంకట్ చేతుల మీదుగా శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. చక్కని ప్రేమకథతో కూడిన అచ్చతెనుగు సినిమా అని, పద్మనావ్.వి ఇచ్చిన నాలుగు శ్రావ్యమైన బాణీలను పద్దెనిమిది మంది సింగర్స్‌తో పాడించామని దర్శకుడు చెప్పారు. తమ తొలి ప్రయత్నం సఫలం అవుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. -
‘లూమియా, ఆశ’ సిరీస్‌లో నోకియా.. కొత్త ఫోన్లు
పనాజి: మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజం, నోకియా కంపెనీ లూమియా మోడల్లో రెండు కొత్త ఫోన్లను, ఆశా మోడల్లో మరో 2 కొత్త ఫోన్లను, మొత్తం నాలుగు కొత్త ఫోన్లను వచ్చే నెలలో మార్కెట్లోకి విడుదల చేయనున్నది. విండోస్ ఓఎస్ ఆధారిత లూమియా మోడల్లో 1320, 525 మోడళ్లను, చౌక ధరల స్మార్ట్‌ఫోన్ ఆశా మోడల్లో 500, 503ను అందించనున్నామని నోకియా ఇండియా డెరైక్టర్ విపుల్ మెహ్రోత్ర చెప్పారు. ఆశా 500 ధర రూ.4,499 అని, ఆశ 503 ధర రూ.6,799 అని పేర్కొన్నారు. లూమియా ధరలను ఆయన వెల్లడించలేదు. అయితే నోకియా కంపెనీ విదేశాల్లో లూమియా 1320ను 339 డాలర్లకు, లూమియా 525ను 199 డాలర్లకు విక్రయిస్తోంది. నోకియా రెండో ఫ్యాబ్లెట్ నోకియా కంపెనీ రెండో ఫ్యాబ్లెట్ అయిన లూమియా 1320లో 6 అంగుళాల స్క్రీన్, హెచ్డీ డిస్ప్లే, 1.7 గిగా హెట్స్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 5 మెగా పిక్సెల్ కెమెరా, వంటి ప్రత్యేకతలున్నాయి. ఇక లూమియా 525లో 4 అంగుళాల టచ్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 1 గిగా హెట్స్ డ్యుయ ల్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఆశ 503లో 3 అంగుళాల స్క్రాచ్ రెసిస్టెంట్ గొరిల్లా గ్లాస్ స్క్రీన్, 5 ఎంపీ కెమెరా వంటి ప్రత్యేకతలు, ఆశ 500లో 2.8 అంగుళాల స్క్రీన్, 2 మెగా పిక్సెల్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. నోకియా మొబైల్ ఫోన్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ 700 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.