హరితహారం లక్ష్యం చేరుకోవాలి
Published Tue, Aug 9 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
మహబూబ్‌నగర్ న్యూటౌన్: పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 314 కిలోమీటర్ల రోడ్ల వెంబడి మొక్కలు నాటి హరితహార లక్ష్యాన్ని చేరుకోవాలని పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ ఆశ సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఈఎన్‌సీ సత్యనారాయణరెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో సమీక్షించారు. న ర్సరీల్లో అందుబాటులో ఉన్న, నాటాల్సిన మొక్కల వివరాలపై ఆరా తీశారు. జిల్లాలో ఈత మొక్కలు అందుబాటులో లేని విషయాన్ని అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ నెల 10న పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 314 కిలోమీటర్ల రోడ్ల వెంబడి లక్ష్యం ప్రకారం మొక్కలు నాటాలని సూచించారు. డ్వామా ఆధ్వర్యంలో నర్సరీల్లో 1.5 మీటర్ల మొక్కలు 50 వేలు ఉన్నాయని డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి తెలిపారు. ఈ వీసీకి పంచాయతీరాజ్ ఎస్‌ఈ రఘు, ఈఈలు అశోక్‌కుమార్, సుధాకర్‌రెడ్డిలు హాజరయ్యారు.
Advertisement
Advertisement