Harithaharam
-
భాగ్యనగరానికి పచ్చలహారం
సాక్షి, సిటీబ్యూరో: మహానగర అవసరాలకు అనుగుణంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి ఫలితాలనిస్తోంది. హరితహారంలో భాగంగా హైదరాబాద్ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో కొద్ది భాగాన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ సిటీ అయిన నగరానికి పర్యావరణ అవసరాలు తీరేలా మొదటి దశలో 109 అర్బన్ ఫారెస్ట్ బ్లాకులలో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 59 పార్కులు పూర్తి కాగా మరో 50 అర్బన్ పార్కులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆనందంగా విహరించేలా.. నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఔటర్‌కు ఇరువైపులా అనేక కొత్త కాలనీలు, నివాస ప్రాంతాలు వెలిశాయి. దీంతో శివారు ప్రాంతాలను ఆనుకొని ఉన్న పట్టణ అడవుల్లో కొంతభాగాన్ని ఉద్యానాలుగా మార్పు చేయడం వల్ల వివిధ ప్రాంతాల ప్రజలకు పార్కుల్లో ఆహ్లాదంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది. హెచ్ఎండీఏ పరిధిలో త్వరలో 59 పార్కులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 39 పార్కులు ఇప్పటికే పూర్తయ్యాయి, సందర్శకులను అనుమతిస్తున్నారు. మరికొన్ని పార్కులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 20 వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం 59లో 27 పార్కులను అటవీ శాఖ అభివృద్ధి చేయగా, 16 పార్కులను హెచ్ఎండీఏ చేపట్టింది. టీఎస్ఐఐసీ, ఎఫ్డీసీ, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్ సంస్థలు మిగతా పార్కులను అభివృద్ది చేస్తున్నాయి. వాకింగ్ ట్రాక్‌లు, యోగా ప్లేస్‌లు.. ►ప్రతి అర్బన్ ఫారెస్ట్ పార్కులో తప్పనిసరిగా ప్రవేశ ద్వారం, నడకదారి, వ్యూ పాయింట్ ఏర్పాటు ఉండేలా ఏర్పాటు చేశారు. ►పిల్లలకు ఆట స్థలం, యోగా షెడ్, సైక్లింగ్, వనదర్శిని కేంద్రం వంటి వాటికి ఈ పార్కుల్లో ప్రాధాన్యమిస్తున్నారు. పార్కు కోసం కేటాయించిన అడవిని మినహాయించి మిగతా అటవీప్రాంతాన్ని కన్జర్వేషన్ జోన్‌గా పరిరక్షణ చర్యలు చేపడతారు. జీవ వైవిధ్యం, నీటి వసతి వంటి సదుపాయాల పెంపునకు చర్యలు చేపట్టారు. అర్బన్ పార్కులను గాంధారి వనం, ప్రశాంతి వనం, ఆక్సీజన్ పార్కు, శాంతి వనం, ఆయుష్ వనం, పంచతత్వ పార్క్ వంటి రకరకాల థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయడం విశేషం. పెరిగిన అడవుల విస్తరణ... ►హరితహారంతో నగరంలో అడవుల విస్తరణ 33.15 చదరపు కిలో మీటర్ల నుంచి 81.81 చదరపు కిలో మీటర్లకు విస్తరించింది. అంటే ఏడాదికి సగటు విస్తరణ 4.3 నుంచి 8.2 చదరపు మీటర్లకు పెరిగింది. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిని వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించడం మరో విశేషం. నగరంలో పచ్చదనం పెంపుదలతో పాటు కాలుష్యం బారిన పడకుండా అటవీ, మున్సిపల్ శాఖలు నిరంతరం శ్రమిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి ఎఫ్ఏఓ నుంచి ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ ట్యాగ్ లభించడానికి విశేషంగా కృషి చేశాయి. -
ప్రజా ఉద్యమంలా హరితహారం
భువనగిరి: 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మొ దలుపెట్టిన హరితహారం కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని అటవీశాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని వడాయి గూడెం గ్రామ పరిధిలోని ఆంజనేయ అభయారణ్యంలో డ్రోన్ మెషీన్ ద్వారా సీడ్‌బౌల్స్‌ను చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏడేళ్ల కాలంలో హరితహారం లక్ష్యాన్ని చేరుకున్నామని, రాష్ట్రంలో 5 శాతం గ్రీన్‌బెల్ట్ పెరిగిందని పేర్కొన్నారు. 2030లోగా 1 బిలియన్ సీడ్‌బౌల్స్ ప్లాంటేషన్ చేసేలా కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. ఈ ఏడాది అభయారణ్యాల్లో డ్రోన్ ద్వారా ప్లాంటేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు. మొక్కలు నాటడానికి వీల్లేని ప్రాంతాలు, కొండలపై డ్రోన్ ద్వారా సీడ్‌బౌల్స్ వెదజల్లుతున్నామని, సంవత్సరం తర్వాత శాటిలైట్ ద్వారా పరిస్థితిని తెలుసుకుంటామని తెలిపారు. అంతకుముందు మండలంలోని హన్మాపురం, తుక్కాపురం గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, సీసీఎఫ్ అక్బర్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి పాల్గొన్నారు. -
హరితహారం: ఎమ్మెల్యే నాటిన మొక్కలు తినేసిందని..
సాక్షి, కొల్లాపూర్: హరితహారంలో భాగంగా గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 7వ వార్డులో మొక్కలు నాటారు. కాసేపటికే కొన్ని మొక్కలను ఓ మేక తినేసింది. దీంతో మున్సిపల్ సిబ్బంది దాన్ని పట్టుకొని కొత్త గ్రంథాలయ భవనం వద్ద ఇనుప జాలీలో బంధించారు. జరిమానా చెల్లించి తీసుకెళ్లాలని యజమాని రంగస్వామికి కబురంపారు. శుక్రవారంమేకను విడిపించుకునేందుకు రంగస్వామి రాగా అధికారులు లేరు. ఈలోగా విషయం సోషల్‌మీడియాకు ఎక్కడంతో శుక్రవారం సాయంత్రం అధికారులు మేకను విడిచిపెట్టారు. -
హైదరాబాద్‌కు అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ట్రీ సిటీగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఎఫ్ఏవో గుర్తించిందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ఇది గర్వకారణమని, హరితహారం విజయని అన్నారు. సభ్యులు యాదగిరిరెడ్డి, రేఖా నాయక్‌లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రాన్నే సీఎం రీడిజైనింగ్ చేస్తున్నారని టీఆర్ఎస్ సభ్యుడు యాదగిరిరెడ్డి ప్రశంసించారు. ఇక ఇంద్రకరణ్‌రెడ్డి సమాధానం చెబుతూ విద్యా సంస్థలను 100 శాతం గ్రీనరీ చేయాలన్న లక్ష్యం ఉందన్నారు. 2015 నుంచి ఇప్పటివరకు 179.08 కోట్ల మొక్కలు నాటామని, పునరుజ్జీవనంతో కలిపి మొత్తం 217 కోట్ల మొక్కలు ఇప్పుడు నిలబడ్డాయన్నారు. విద్యుత్‌శాఖ అధికారులు చెట్ల కొమ్మలు నరకకుండా ఆదేశాలు ఇస్తామన్నారు. 10,750 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయని, దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదన్నారు. -
ఛాలెంజ్‌ను స్వీకరించిన రేణు దేశాయ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు సినీ నటి, రచయిత రేణూ దేశాయ్. ‘పుడమి పచ్చగుండాలే–మన బతుకులు చల్లగుండాలే’అనే నినాదంతో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ చాలెంజ్ మూడో దశలో భాగంగా మొక్కలు నాటిన యాంకర్ ఉదయభాను.. బ్రహ్మానందం, రేణూ దేశాయ్‌లకు ఛాలెంజ్ విసిరారు. ఉదయ భాను విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి రేణూ శుక్రవారం ఉదయం తన కూతురు ఆద్యతో కలిసి మొక్కలు నాటారు. (ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మీ) హరితహారంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో ప్రతి ఒక్కరు తమకి తాము ఛాలెంజ్ విసురుకొని మొక్కలు నాటాలని రేణూ విజ్ఞప్తి చేశారు. ఇక ఆద్యతో కలిసి రేణూ మొక్కలు నాటిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మంత్రి కేటీఆర్, కవిత, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, గోపీచంద్, ప్రభాస్, యాంకర్ సుమ, అనసూయ, రష్మి లాంటి ఎందరో సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ స్వీకరించి మరి కొందరికి సవాల్ విసిరారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. (రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకుంటా..) View this post on Instagram We all need to do it 😊 A post shared by renu desai (@renuudesai) on Jul 2, 2020 at 11:24pm PDT -
ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన నివాసంలో మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ 3వ విడతలో భాగం యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆయన స్వీకరించారు. ఇందులో భాగంగా మణికొండలోని తన నివాసంలో శనివారం ఉదయం మొక్కలు నాటి, అందుకు సంబంధించిన ఫోటోలను బ్రహ్మానందం షేర్ చేశారు. కాగా తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. (చాలెంజ్ స్వీకరించిన వివి వినాయక్) ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇతరులతో నాటించాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. కేటీఆర్, కవిత, చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, గోపీచంద్, ప్రభాస్, వీవీ వినాయక్, యాంకర్ సుమ, అనసూయ, రష్మి తదితరులు ఈ ఛాలెంజ్ స్వీకరించి మరి కొందరికి సవాల్ విసిరారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. (ఎన్టీఆర్‌కు సుమ గ్రీన్ చాలెంజ్) -
ఎజెండా.. వ్యవసాయం, ‘ఉపాధి’
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సాగు ఏర్పాట్లతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం, హరితహారం కార్యక్రమం అమలుపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, జిల్లా పరిషత్ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా అటవీ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి సైతం పాల్గొననున్నారు. జిల్లా వ్యవసాయ కార్డులు, సాగు విస్తీర్ణం, ఎరువులు, విత్తనాల సరఫరా, రుణ మాఫీ, రైతుబంధు, రైతు వేదికల నిర్మాణం తదితర అంశాలపై ఈ సదస్సులో కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉపాధి హామీతో నీటి పారుదల, పంచాయతీరాజ్ శాఖలను అనుసంధానం చేసినందున.. ఈ పనులను మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి నగరాలు విడిచి పల్లెబాట పట్టిన శ్రమజీవులకు ఉపాధి హామీ అండగా నిలుస్తుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం ఈ పనులను విరివిగా చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు గ్రామ పంచాయతీల పనితీరును కూడా ఈ సమావేశంలో సీఎం సమీక్షించనున్నారు. ట్రాక్టర్లు, ట్యాంకర్ల కొనుగోలు, ఈ నెల 20 నుంచి నిర్వహించ తలపెట్టిన హరితహారం, డంపింగ్ యార్డులు, వైకుంఠధామం, సీజనల్ వ్యాధులపైనా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ వ్యాప్తి తీరు, రోగులకు చికిత్సకు సంబంధించిన సంసిద్ధతను సైతం ఈ సదస్సులో సీఎం కేసీఆర్ సమీక్షించే అవకాశాలున్నాయి. -
దోపిడీకి గేటు తీశారు!
ప్రతి జీపీలో వన నర్సరీ ఏర్పాటు ఆ అధికారికి వరంగా మారింది. నర్సరీల్లోని మొక్కలను జంతువుల బారినుంచి రక్షించేందుకు గేట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. స్థానికంగా మంచి నాణ్యతతో ఒక్కో గేటు రూ.6 నుంచి 7 వేలకు తయారు చేయించవచ్చు. సదరు అధికారి మాత్రం ఒక్కోగేటును రూ. 14 వేలకు తయారు చేయించినట్లు జీపీల నుంచి చెక్కులు తీసుకున్నారు. దీనికి ఎంపీడీఓలను పావులుగా వినియోగించుకున్నారు. ఇలా సగానికి సగం నిధులను బొక్కేశారు. స్థానికంగా తయారు చేయించాల్సిన గేట్లను నిజామాబాద్, హైదరాబాద్‌లో తయారు చేయించడంలో మతలబు ఊహించుకోవచ్చు. జిల్లాలోని 553 జీపీలకు సంబంధించి దాదాపు రూ.70 లక్షల మేర చెక్కులు తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షి, పరిగి: పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయి. 14వ ఆర్థికసంఘం నిధులను వన నర్సరీ గేట్ల పేరుతో దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాస్థాయి ఉన్నతాధికారి ఒకరు లోపాయికారిగా వ్యవహరించి నిధులను బొక్కేశారని జిల్లాలోని ఆయా మండలాల సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పల్లెలను పచ్చని పందరిగా మార్చాలని భావించింది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ ఆ బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించింది. ఇందుకోసం 14వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవచ్చని చెప్పింది. జంతువులు, మేకలు, గొర్రెల నుంచి నర్సరీల్లోని మొక్కలను కాపాడేందుకు గేట్లు బిగించుకోవాలని జీపీల సర్పంచ్‌లకు అధికారులు సూచించారు. అయితే, ఇందులో తన పవర్‌ను వినియోగించి ఓ జిల్లాస్థాయి అధికారి నిధులను బొక్కేసేందుకు ప్రణాళిక రచించారు. రూ. 6–7 వేలకు తయారయ్యే ఒక్కో గేట్లకు ఏకంగా రెండింతల నిధులు వెచి్చంచారు. రూ.14 వేలతో ఒక్కో గేటును కొనుగోలు చేశారు. వాటిని ఏకంగా హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్‌లో తయారు చేయించారు. సర్పంచ్‌లకు ఎలాంటి సమాచారం ఇవ్వ కుండానే గేట్లను పంపించారు. జిల్లాలోని 553 పంచాయతీల్లో ఈ గేట్ల కోసం సుమారు 70 లక్షలను వెచి్చంచారు. ఈమేరకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల నుంచి చెక్కులు తీసేసుకున్నారు. ఇందులో సగానికిపైగా సదరు ఉన్నతాధికారి కమీషన్ రూపంలో మింగేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ గేట్ల వ్యహహారం అనుమానాస్పదంగా ఉండటంతో కుల్కచర్లలోని కొందరు సర్పంచ్‌లు తామే సొంతంగా తయారు చేయించుకున్నారు. అందుకోసం ఒక్కో గేటుకు రూ. 6–7 వేలు వెచి్చంచి అదే నాణ్యతతో స్థానికంగానే తయారు చేయించుకున్నారు. నిజామాబాద్ అడ్డాగా కుంభకోణం జిల్లాలో వెలుగు చూసిన అవకతవకల వ్యవహారం ఆనవాళ్లు నిజామాబాద్, హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయి. నర్సరీకి బిగించే ఒక్కో గేటుకు రూ.14 వేల ఖర్చు అవుతుందని లోపాయికారిగా సదరు ఉన్నతాధికారి కొటేషన్ తయారు తయారు చేయించారు. స్థానికంగా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు ఏ మాత్రం తెలియకుండా సగం గేట్లను హైదరాబాద్‌లోని రాజధాని వెల్డర్స్ దగ్గర, మిగతా సగం గేట్లు నిజామాబాధ్లోని శ్రీకర్ మల్టీ సర్వీసెస్ వద్ద తయారు చేయించారు. ఈ విషయం ఎంపీడీఓలకు చెప్పి వారితో జీపీలకు సమాచారం చేరవేశారు. ఒకేచోట గేట్లు తయారు చేయించాం.. ఒక్కో గేటుకు రూ.14 వేలు చెక్కుల రూపంలో ఇవ్వాలని సర్పంచ్‌లు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. వారితో గుట్టుగా 14వ, ఆర్థిక సంఘం నిధుల నుంచి చెక్కులు రాయించుకుని రూ. లక్షల్లో కమీషన్లు బొక్కేశారు. ఈ గేట్లను స్థానిక వెల్డర్లకు చూయిస్తే ఒక్కో గేటు రూ. 6– 7 వేలకు తయారు చేస్తామని చెబుతుండటంతో సర్పంచ్‌లు, కార్యదర్శులు నోళ్లు వెల్లబెట్టారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు. -
మొక్కలు తిన్న ఎద్దు.. యజమానికి జరిమానా
సాక్షి, లింగాల (అచ్చంపేట): మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో రోడ్డుకు ఇరువైపుల నాటిన హరితహారం మొక్కలను ఎద్దు తిన్నందుకు దాని యజమానికి జరిమానా విధించినట్లు పంచాయతీకార్యదర్శి పవన్ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇటీవల రోడ్డుకు ఇరువైపుల మొక్కలను నాటగా అదే గ్రామానికి చెందిన ఈడిగ ఏమయ్య అనే రైతుకు చెందిన ఎద్దు సోమవారం మేసింది. యజమాని నిర్లక్ష్యంగా ఎద్దును మొక్కకు కట్టి ఉంచగా అది చుట్టు పక్కల నాటిన మొక్కలను తినేసింది. ఈ విషయాన్ని కార్యదర్శి ఎంపీడీఓ రాఘవులు దృష్టికి తీసుకవెళ్లగా ఆయన ఆదేశాల మేరకు యజమానికి జరిమానా విధించినట్లు కార్యదర్శి తెలిపారు. -
ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరా..
సాక్షి, చిన్నంబావి(మహబూబ్‌నగర్) : రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహరం పనుల్లో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ శ్వేతామహంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదురోజుల క్రితం వచ్చి చెప్పినప్పటికీ మీలో ఎందుకు మార్పు రావడంలేదని ప్రశ్నించారు. పెద్దదగడ గ్రామంలో ఉపాధి హామీ కూలీల చేత చేయించాల్సిన పనులను, మిషన్ ద్వారా ఎందుకు చేయించారని అని ప్రశ్నించారు. గురువారం మండలంలోని పెద్దదగడ, చెల్లెపాడు, చిన్నంబావి గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటకపోవడం, అదేవిధంగా గ్రామాల్లో 50శాతం కూడా పూర్తికాకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇది చదవండి : దండం పెడ్తాం.. మా ఉద్యోగాలు కాపాడండి ప్లాస్టిక్ నిషేధిద్దాం.. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత గ్రామలుగా తీర్చిదిద్దడంలోనూ అధికారులు విఫలం అవుతున్నారని, కనీసం గ్రామంలోని ప్రజలకు అవగాహన కూడా కల్పించలేకపోతున్నారని అన్నారు. కనీసం మహిళా సంఘాలను కూడా చైతన్య పరచలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నా రు. హరితహరం కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన పెద్దదగడ గ్రామ కార్యదర్శి, ఫిల్డ్ అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీస్ ఇవ్వా లని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ బద్రీనాథ్, ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ సభ్యులు వెంకట్రామమ్మ, అభిలాష్ రావు, ఏపీఓ ఉన్నిస బేగ్, తహసీల్దార్ పర్‌కుందా తన్సిమా ఉన్నారు. -
దండం పెడ్తాం.. మా ఉద్యోగాలు కాపాడండి
సాక్షి, ఖిల్లాఘనపురం (వనపర్తి) : మీకు దండం పెడతా.. హరితహారం పనులకు వచ్చి మా ఉద్యోగాలు కాపాడండి అంటూ షాపురం పంచాయతీ కార్యదర్శి రవితేజ, సర్పంచ్ బాలాంజనేయులతో కలిసి కూలీలకు చేతులెత్తి మొక్కారు. గ్రామాల్లో మొక్కలు నాటాలని, నాటిన మొక్కలకు కంచే ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించడం, ఇటీవల పలువురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఆందోళనకు లోనైన పంచాయతీ కార్యదర్శి మంగళవారం ఉదయం గ్రామం నుంచి ఇతర పనులకు ట్రాలీ ఆటోపై వెళ్తున్న కూలీలను అడ్డుకుని హరితహారం పనులకు రావాలని కోరారు. -
మొక్కే కదా అని పీకేస్తే.. కేసే!
సాక్షి, సిద్దిపేట: హరితహారంలో భాగంగా నాటిన మొక్కను ఓ దుకాణ యజమాని తొలగించడంతో అతనిపై సిద్ధిపేట వన్‌టౌన్ ఠాణాలో గురువారం కేసు నమోదైంది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మోహినిపురా వెంకటేశ్వరాలయం సమీపంలో ఓ చెప్పుల దుకాణం ఎదుట నాలుగు రోజుల క్రితం స్థానిక కౌన్సిలర్, అధికారులు హరితహారంలో భాగంగా వేప మొక్కలు నాటారు. ఈ నెల 7న రాత్రి అక్కడి దుకాణం యజమాని ఉమేశ్ మొక్కను తొలగించాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటన వెలుగుచూడడంతో పట్టణ ఉద్యాన శాఖాధికారి ఐలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘మెదక్‌ను హరితవనం చేయాలి’
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మూడు కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట మండలం కమలాపూర్, జంబికుంట గ్రామాల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీఆర్డీఏ ఏపీడీ సీతారామారావులతో కలిసి వర్షంలోనే మొక్కలు నాటారు. మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా జంబికుంట ప్రధాన రహదారి నుంచి గ్రామం వరకు ఇరువైపులా జూనియర్ కళాశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జంబికుంట, పేటలోని స్త్రీశక్తి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహించిన హరితహారంలో మొక్కలను నాటి పట్టించుకోలేదన్నారు. ఈ సారి నూతన పంచాయితీరాజ్ చట్టం ప్రకారం ప్రతీ మొక్కకు పక్కా లెక్కతో పాటు ప్రతీ గ్రామంలో 47 వేల మొక్కలను నాటడంతో సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. 85 శాతం మొక్కలను కాపాడకపోతే సర్పంచ్, గ్రామ కార్యదర్శిపై వేటు తప్పదన్నారు. గ్రామ సభలు క్రమం తప్పకుండానిర్వహించుకొని ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. కర్ణాటక, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి 15 నుంచి 20 రకాల పండ్ల మొక్కలను తెప్పించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతీ యేటా 100 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళిక చేపట్టినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా అధికారులు జిల్లాలో మొక్కలను పెంచాలన్నారు. దీంతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా మారేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఇంకుడుగుంతలు చేపట్టడంతో పాటు నీటిని వృథా చేయకూడదని కోరారు. ఎస్బీఎం ద్వారా నిర్మించిన టాయిలెట్స్‌ను వినియోగించుకొని అంటురోగాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలి.. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. ప్రతీ గ్రామం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. చెట్లు నాటడమే కాకుండా సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. ఇథియోఫియా దేశాన్ని ఆదర్శంగా తీసుకొని హరితహారం విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యులు విజయరామరాజు, ఎంపీడీఓ బన్సీలాల్, తహసీల్దార్ కిష్టానాయక్, సర్పంచ్‌లు కుంట్ల రాములు, మామిడి సాయమ్మ, ఎంపీటీసీ స్వప్నరాజేశ్, రైతు సమితి అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, ఏపీఓ సుధాకర్, ఏపీఎం గోపాల్, పీఆర్ ఏఈ రత్నం, ఏఓ రత్న, నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అల్లాదుర్గంలో మొక్కలు నాటిన కలెక్టర్ అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం రేణుకా ఎల్లమ్మ ఆలయం ఆవరణలో శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ధర్మారెడ్డి మొక్కలు నాటారు. అంతకుముందు రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షం పడుతున్నా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడి టీచర్లు, డ్వాక్రా గ్రూపు మహిళలు, ఈజీఎస్ సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ సీతరామారావ్, అడిషనల్ పీడీ, ఐసీడీఎస్ పీడీ రసూల్‌బీ, మండల ప్రత్యేక అధికారి సుధాకర్ ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సౌందర్య, సర్పంచ్ అంజయ్య యాదవ్, సీడీపీఓ సోమశేఖరమ్మ, ఎంపీడీఓ రాజమల్లయ్య, మాజీ ఎంపీపీ కాశీనాథ్, ఏపీఎం అశోక్, సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్ఐ మహ్మద్‌గౌస్ తదితరులు పాల్గొన్నారు. చెత్త రహిత జిల్లాగా మార్చేద్దాం మెదక్ జోన్: మెదక్ జిల్లాను సంపూర్ణ ఆరోగ్యం, చెత్త రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా విద్యార్థులను చైతన్యం చేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరెట్లో ప్రధానోపాధ్యాయులతో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి నర్సరీని ఏర్పాటు చేసి అందులో పలు రకాల పండ్లు, పూల మొక్కలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. పాఠశాలల్లో అన్ని రకాల మొక్కలు నాటాలన్నారు. ఉపాధి హామీ కూలీలతో పాఠశాల ప్రాంగణంలో వందకుపైగా గుంతలు తీయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 7న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో హరితహారం కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో 50 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి హైదరాబాద్‌కు రిసైక్లింగ్ కోసం పంపించినట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే చెత్త రహిత గ్రామాలుగా రూపు దిద్దుకుంటాయన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలని ఎంపీడీఓలకు ఆదేశాలు జారిచేసినట్లు తెలిపారు. అనంతరం ఐలవ్ మై జాబ్ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో జిల్లా స్థాయిలో నిలిచిన విజేతలను కలెక్టర్ సన్మానించారు. వహిదుల్లా షరీఫ్(బాలుర ఉన్నత పాఠశాల, మెదక్), సుకన్య(జెడ్పీహెచ్ఎస్, పాపన్నపేట), సమీర్(జెడ్పీహెచ్ఎస్ కుసంగి), సాజిద్ పాషా(ప్రాథమిక పాఠశాల బొడ్మట్‌పల్లి)లను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రవికాంత్‌రావు, నోడల్ అధికా>రి మధుమోహన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సెక్టోరియల్ అధికారులు నాగేశ్వర్, సుభాష్, ఏడీ భాస్కర్‌తోపాటు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
చేసింది చాలు..!
సాక్షి, ఇందూరు (నిజామాబాద్ అర్బన్): జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో గల ఉపాధి హామీ విభాగం హరితహారం సెక్షన్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కీలకమైన సెక్షన్లో పని చేసిన ఓ ఉద్యోగి హరితహారానికి సంబంధించిన గుత్తేదారుల నుంచి పర్సంటేజీలు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచీ ఈ సెక్షన్లో పని చేసిన సదరు ఉద్యోగిని ప్రస్తుతం మొక్కలు నాటే కీలక సమయంలో సెక్షన్ బాధ్యతల నుంచి తప్పించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అనుకోకుండా సెక్షన్ తొలగించి సోషల్ ఆడిట్ విభాగానికి మార్చడంతో అక్రమ వసూళ్లు జరిగాయన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. ప్రస్తుతం ఈ విషయం ఉపాధి హామీ విభాగంలో హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలో ఈ ఏడాది డ్వామా శాఖ ఆధ్వర్యంలో కోటి వరకు మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేశారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రతీ గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. అయితే, టేకు మొక్కలను రైతులకు ఉచితంగా అందజేయడానికి టేకు స్టంపులను టెండరు ద్వారా కొనుగోలు చేసి జిల్లాకు తెప్పించి నర్సరీల్లో పెంచుతున్నారు. అయితే హరితహారం విభాగానికి మొన్నటి వరకు జిల్లా పరిషత్‌కు చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్ డ్వామాకు డిప్యూటేషన్‌పై వచ్చి పని చేశారు. గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు, పాలిథిన్ కవర్లు, టేకు స్టంపులు, నీటి ట్యాంకుల కొనుగోలు ఇతర విషయాలను మొదటి నుంచీ సదరు ఉద్యోగే చూశారు. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారుల నుంచి పర్సంటేజీలు వసూల్ చేసినట్లు ఆరోపణలున్నాయి. సెక్షన్ ఉద్యోగి పర్సంటేజీలు అడుగుతున్నట్లు నేరుగా డీఆర్‌డీవోకే గుత్తేదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అప్పటికే సదరు ఉద్యోగిపై అనేక ఫిర్యాదులు రావడం, విధుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వంటి ఆరోపణలున్నాయి. కమీషన్లకు ఆశపడి డీఆర్డీవోనే తప్పుదోవ పట్టించి హరితహారంలో తెరచాటుగా వసూళ్ల పర్వం కొనసాగించినట్లు తెలిసింది. దీంతో ఉద్యోగి వ్యవహారంపై సీరియస్ అయిన డీఆర్డీవో నెల క్రితం హరితహారం సెక్షన్ నుంచి తొలగించి సోషల్ ఆడిట్ విభాగానికి మార్చారు. సదరు ఉద్యోగిని సొంత శాఖ జిల్లా పరిషత్‌కు సరెండర్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఉపేక్షించని డీఆర్డీవో.. హరితహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై డీఆర్డీవో చర్యలు ఉపక్రమిస్తున్నారు. నర్సరీల్లో మొక్కలను పెంచకుండా నిర్లక్ష్యంగా ఉన్న వివిధ మండలాల్లోని ఐదారుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. మరి కొందరికి నోటీసులు జారీ చేసి హెచ్చరించారు. అయితే, డీఆర్డీవో కళ్లుగప్పి హరితహారం విభాగంలో గుత్తేదారుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లుగా ఉద్యోగిపై ఆరోపణలు రావడంతో సెక్షన్ నుంచి తొలగించినట్లు చర్చ జరుగుతోంది. సెక్షన్ మార్చిన విషయం వాస్తవమే.. హరితహారం విభాగం చూస్తున్న ఉద్యోగిని వేరే సెక్షన్‌కు మార్చిన విషయం వాస్తవమే. అయితే, ఆ ఉద్యోగిపై అవినితీ ఆరోపణలు లేవు. సహజంగానే ఇతర సెక్షన్‌కు బదిలీ చేశాం. ఆరోపణలున్నాయనే విషయం నా దృష్టికి రాలేదు. – రమేశ్ రాథోడ్, డీఆర్డీవో, నిజామాబాద్ -
ఇక ‘మహా’ పచ్చదనమే!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పచ్చదనంపై దృష్టి సారించింది. నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు జన సముదాయాలు, కాలనీలు, నగర పంచాయతీలు, భువనగిరి, గజ్వేల్ రహదారులపై లక్షల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో పాటు చెరువుల చుట్టూ పక్కల కూడా భారీ స్థాయిలో మొక్కలు నాటి పచ్చదనాన్ని తీసుకొచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుంది. ముఖ్యంగా ఔటర్ చుట్టూరా చిట్టడవిని తలపించే రీతిలో మొక్కలు నాటేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ ఐదో విడత హరితహారం కార్యక్రమంలో కోటీ 14 లక్షల మొక్కలను నాటడం, పంపిణీ చేయడం వంటి చర్యలు చేపట్టాలని అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓఆర్ఆర్ ప్రాంతాన్ని ఒక ఉద్యానవనంను తలపించేలా మొక్కలను పెంచాలని సూచించారు. ప్రధానంగా ఓఆర్ఆర్ ఇంటర్ ఛేంజెస్, సర్వీసు రోడ్లు, జాతీయ, రాష్ట్రీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పాటు గతంలో ఓఆర్ఆర్ చుట్టూపక్కల నాటిన మొక్కల ప్రస్తుత పరిస్థితి ఏంటన్న దానిని కూడా ఆరా తీశారు. గతంలో నాటిన మొక్కల సంరక్షణను చూసుకుంటూనే మరిన్ని మొక్కలు నాటాలని హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ అధికారులకు కమిషనర్ అరవింద్‌కుమార్ దిశానిర్దేశనం చేసినట్టు తెలిసింది. కోటీ 14 లక్షల మొక్కలు రెడీ... నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో గ్రీనరీ పెంచేందుకు కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హరితహారంలో ఈ ఏడాది కోటి 14 లక్షల మొక్కలను హెచ్ఎండీఏ అందుబాటులో ఉంచింది. వీటిలో దాదాపు 60 లక్షల మొక్కలను ఎంపీడీవోల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించిన హెచ్ఎండీఏ అధికారులు దాదాపు 54 లక్షల మొక్కలు మొదట నాటాలని నిర్ణయించారు. ఓఆర్ఆర్, పార్కులు, రేడియల్ రోడ్లు, చెరువుల, ఉప్పల్ భగాయత్, మూసీ రివర్ ప్రంట్ డెవలప్మెంట్ ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఓఆర్ఆర్ వెంట వాహన ప్రయాణాన్ని చల్లదనం చేయడంతో పాటు అడవిని తలపించేలా మొక్కలు నాటేందుకు అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు సిద్ధమవుతున్నారు. గతేడాది ఓఆర్ఆర్ వెంట పెట్టిన మొక్కల్లో దాదాపు 90 శాతం మేర మొక్కలను సంరక్షించగలిగామని తెలిపారు. మరో మూడేళ్లలో గ్రీనరీ ఫలితాలు కనిపిస్తాయన్నారు. గతేడాది 95 లక్షల 30 వేలు మొక్కలు హెచ్ఎండీఏ పంపిణీ చేయడంతో పాటు నాటితే ఈసారి ఆ సంఖ్య కోటీ 14 లక్షలకు పెంచామని తెలిపారు. దాదాపు 163 రకాల మొక్కలను హెచ్ఎండీఏ పరిధిలోని 18 నర్సరీలో పెంచామని తెలిపారు. బ్లాక్ ప్లాంటేషన్... హెచ్ఎండీఏ ఆధ్వరంలో ప్రత్యేకంగా 17 ప్రాంతాలలో 25 చోట్ల బ్లాక్ ప్లాంటేషన్ చేపడుతున్నారు. జన సముదాయాలకు, కాలనీలకు దగ్గరలో చేపట్టనున్న బ్లాక్ ప్లాంటేషన్లలో నడక రహదారులు, చిన్నారుల పార్కులు, సైక్లింగ్ పాత్‌లు కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే 12 నగర పంచాయితీలలో కూడా పచ్చదనాన్ని పెంచేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. భువనగిరి, గజ్వేల్ రహదారిపై సెంట్రల్ మీడియన్లలో(రోడ్డు మధ్యలో ఉన్న ఖాళీస్థలం) కూడా గతంలోలాగానే మొక్కలు పెంచి పచ్చదనాన్ని అభివృద్ధి చేయనున్నారు. అలాగే కీసర, ఘట్కేసర్, శంషాబాద్, పెద్దఅంబర్ పేట, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లో ల్యాండ్‌స్కేప్ చేసి పచ్చదనాన్ని కళ్లముందు కనపడేలా చేయనున్నారు. అలాగే హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం ప్రైవేటు లే–అవుట్ల అనుమతులు మంజూరు చేసేటప్పుడు కూడా పచ్చదనాన్ని పెంపొందించటానికి తప్పనిసరిగా మొక్కల పెంపకం చేపట్టేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. -
ఆదర్శంగా హరితహారం
సాక్షి, హైదరాబాద్: హరితహారం పథకం దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శం అని ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపు కోసం చేపట్టిన హరితహారం పథకంపై అధ్యయనం చేసేందుకు యూపీ అధికారులు ఇక్కడికి వచ్చారు. కోట్లాది మొక్కలు నాటాలనే సీఎం కేసీయార్ సంకల్పమే అత్యంత ధైర్యమైన నిర్ణయమని వారు ప్రశంసించారు. యూపీ గ్రీన్ ప్రాజెక్ట్ మిషన్ డైరెక్టర్, గోరఖ్‌పూర్ చీఫ్ కన్జర్వేటర్‌గా ఉన్న బివాస్ రంజన్ నేతృత్వంలో అధికారుల బృందం సోమవారం అరణ్యభవన్‌లో రాష్ట్ర అటవీశాఖ అధికారులతో సమావేశమైంది. హరితహారం అమలు తీరు పూర్తిగా అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో కూడా గ్రీన్ ప్రాజెక్టును సమర్థంగా అమలు చేయనున్నట్లు బివాస్ రంజన్ వెల్లడించారు. ఈ ఏడాది వర్షాకాలంలో యూపీ జనాభాకు (22 కోట్ల మంది) సమానంగా, ఒక్కొక్కరు ఒక్కో మొక్క చొప్పున 22 కోట్ల మొక్కలు నాటాలనే నిర్ణయాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నారని తెలిపారు. ఇందుకోసం ఎలా సన్నద్ధం కావాలన్న ప్రణాళికలో భాగంగా తెలంగాణ పర్యటనకు వచ్చినట్లు చెప్పారు. మా సీఎంను కోరతాం.. హరితహారాన్ని చూసేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను తెలంగాణలో పర్యటించాల్సిగా కోరతామని యూపీ అధికారులు తెలిపారు. పచ్చదనం గ్రామ అభివృద్ధిలో తప్పనిసరి అంశంగా చేరుస్తూ కొత్తగా తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టాన్ని కూడా వారు ప్రశంసించారు. భారీ సంఖ్యలో నర్సరీల ఏర్పాటు, ఉపాధి హామీ నిధుల అనుసంధానం, మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం ప్రజలు, విద్యార్థుల భాగస్వామ్యంపై తెలంగాణ అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎం.డోబ్రియల్ యూపీ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అడవుల సంరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పీసీసీఎఫ్ పీకే ఝా తెలిపారు. అటవీ సంరక్షణ, హరితహారం అమలుపై గజ్వేల్, సిద్దిపేట, మెదక్ ప్రాంతాల్లో యూపీ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ (విజిలెన్స్) రఘువీర్, అదనపు పీసీసీఎఫ్ లోకేశ్ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మేయర్ భార్య గ్రీన్ చాలెంజ్
సాక్షి, సిటీబ్యూరో: హరితహారం భాగంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి బుధవారం బంజరాహిల్స్‌లోని తమ ఇంటి ప్రాంగణంలో మొక్క నాటారు. సనత్‌నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్‌రెడ్డి చేసిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించి మొక్క నాటిన ఆమె.. ఈ సందర్భంగా ప్రముఖ నటి అమల, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌కు గ్రీన్ చాలెంజ్ విసిరారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు అవి పెరిగేంత వరకు సంరక్షించాలని కోరారు. -
ఊరికో నర్సరీ
సాక్షి, సిరిసిల్ల : హరితహారం కార్యక్రమం నిరాటంకంగా సాగేందుకు ఊరూరా నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈమేరకు స్థలాలు ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. కొత్త పంచాయతీరాజ్ జట్టంలో నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంప కం, రక్షణ తదితర అంశాలను చేర్చింది. ఈ నెల 2 నుంచి కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి రావడంతో ఈమేరకు గ్రామానికో నర్సరీ ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో, ప్రభుత్వ పాఠశాలలు, భూములు, రైతుల నివాస, పరిసర ప్రాంతాల్లో నాటేం దుకు అవసరమైన మొక్కలు గ్రామ నర్సరీలోనే అందుబాటులో ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని మొత్తం 261 గ్రామ పంచాయతీల్లో 220 గ్రామ పం చాయతీల్లో నర్సరీల ద్వారా మొక్కలు పెం చాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. స్థానికంగా ఉపయోగపడే మొక్కలతో..స్థానికంగా ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా పండ్ల జాతుల మొక్కలను నర్సరీల్లో పెంచనున్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండే మొక్కలు, భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులకు అనువుగా పెరిగే మొక్కలనే ఈ నర్సరీల్లో పెంపకానికి ఎంచుకుంటారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న నర్సరీలకు అదనంగా మరిన్ని నర్సరీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో నర్సరీలో 20వేల నుంచి లక్ష వరకు మొక్కలు.. గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయనున్న నర్సరీల్లో స్థానికంగా ఉన్న స్థలం, నాటడానికి అవసరమయ్యే మొక్కలను బట్టి కనీసం 20 వేల నుంచి లక్ష వరకు వివిధ జాతుల మొక్కలను పెంచనున్నారు. ఈ నర్సరీలకు గ్రామాల్లో స్థల సేకరణే కీలకంగా మారనుంది. ఈనెల 15 లోగా గ్రామ పంచాయతీల పరిధిలో అందుబాటులో ఉన్న స్థలాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నర్సరీలకు అవసరమైన స్థలం, ఫెన్సింగ్, బోరు మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుని అక్టోబర్ నాటికి నర్సరీల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈలోగా మొక్కల పెంచేందుకు అవసరమైన విత్తన బ్యాగులను ఏర్పాటు చేసేందుకు బెడ్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పాలిథిన్ బ్యాగుల్లో మట్టిని నింపి వాటిలో పండ్ల విత్తనాలు, టేక్ స్టంప్స్ నాటి అక్టోబర్ ఆఖరుకల్లా సిద్ధం చేయాల్సి ఉంది. స్థల సేకరణే ప్రధానం.. గ్రామాల్లో ఏర్పాటు చేసే నర్సరీలను ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీ సమన్వయంతో నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో నర్సరీల ఏర్పాటుకు స్థల సేకరణయే ప్రధాన సవాల్‌గా మారింది. ప్రభుత్వ భూముల్లో కాకుండా ఎవరైనా జాబ్‌కార్డు ఉన్న ప్రైవేటు వ్యక్తులు స్థలం సమకూర్చితే వారికే నర్సరీ నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. నర్సరీల నిర్వహణకు ఉపాధిహామీ కూలీలను వినియోగించుకునేందుకు ప్రభుత్వ వీలు కల్పించింది. నర్సరీల నిర్వహణ, నాటిన మొక్కల సంరక్షణకు గ్రామాల్లో ప్రత్యేకంగా గ్రామ కమిటీతో కూడిన హరితసైన్యాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచుతోపాటు ఔత్సాహికులైన రైతులు, యువకులు ఇందులో భాగస్వామ్యం కల్పించనున్నారు. నర్సరీలు, మొక్కల సంరక్షణ బాధ్యతలు వీరు చూసుకోవాల్సి ఉంటుంది. నిర్వహణకయ్యే ఖర్చు ప్రభుత్వమే చూసుకుంటుంది. -
దేశంలో తెలంగాణ నంబర్‌వన్
నిజాంసాగర్(జుక్కల్) : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అ హర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్, గున్కుల్, తె ల్గాపూర్, గిర్నితండా, దూప్‌సింగ్ తండాల్లో గురు వారం పంచాయతీ భవనాలను ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశాల్లో ఆయన మాట్లాడారు. పరిపాలన సౌల భ్యం కోసం ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను ఏర్పా టు చేశారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేర్చడం లక్ష్యంగా పంచాయతీలను బలోపేతం చేస్తున్నారన్నారు. గున్కుల్‌లో మొక్కలు నాటారు. సుపరిపాలన ఆగస్టు మాసంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు అద్భుతాలు చేకూరుస్తున్నాయని దఫేదార్ రాజు అన్నారు. కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడంతో గ్రామాలు, గిరిజన తండాల్లో సుపరిపాలన సాధ్యమైందన్నారు. అలాగే కంటి సమస్యతో బాధపడుతున్న వృద్ధు లు, మహిళలకు వెలుగునివ్వాలన ఉద్దేశ్యంతో ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెడుతుందన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు ప్రమాదవశాత్తు, సాధారణ మరణం పొందిన బాధిత కుటుంబానికి మేలు చేకూరేలా ఆగస్టు 15 నుంచి రైతు బీమా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సింగితం ఎంపీటీసీ సభ్యురాలు కలకొండ శైలజ, ఎంపీడీవో రాములునాయక్, టీఆర్ఎస్ నాయకులు వినయ్‌కుమార్, గడ్డం గంగారెడ్డి, వాజిద్‌అలీ, అహ్మద్‌హుస్సేన్, బేగరి రాజు, లింగాల రాంచందర్, కలకొండ నారాయణ, సాయాగౌడ్, చందర్‌గౌడ్, బల్రాం, చెందర్, దఫేదార్ విజయ్, కాశయ్య, మహేందర్, రాజన్న యువసేన సభ్యులు సంపత్, గోవీర్, ప్రవీణ్, శ్యాం, వికాస్‌గౌడ్, బొర్ర నరేశ్, స్వామిగౌడ్ పాల్గొన్నారు. -
గ్రీన్ చాలెంజ్
సాక్షి, వరంగల్ రూరల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రీన్ చాలెంజ్ జోరుగా సాగుతోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారుల వరకు ఒకరికొకరు సవాల్ విసురుకుంటూ మొక్కలు నాటుతున్నారు. దీంతో జిల్లాలో చేపట్టిన హరితహారం కార్యక్రమం ఊపందుకుంది. గ్రీన్ చాలెంజ్ నేపథ్యమిదే.. తెలంగాణ ఇగ్నైటింగ్ మైండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ బాధ్యులు ఒకరు మూడు మొక్కలు నాటి మూడేళ్లపాటు కాపాడాలని, మొక్కలు నాటగానే మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ విసరాలనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరా హైతో భరా హై (పచ్చదనం నిండి ఉంటే భూ మాత నిండుకుండలా ఉంటుంది. అలా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ కడుపు నిండా ఉంటారు అని అర్థం) అనే నినాదంతో ఈ గ్రీన్ చాలెంజ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,00,060 మంది గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించి 18,05,876 మొక్కలు నాటారు. ఎలా భాగస్వాములు కావాలంటే.. www.ingnitingminds.co.in వెబ్సైట్ ద్వారా ముందుగా రిజిస్టర్ అయిన తర్వాత మూడు మొక్కలు నాటి వాటి గురించి స్క్రిప్ట్ రాయాలి. తర్వాత సెల్ఫీ దిగి ఫొటోలను అప్లోడ్ చేయాలి. అలాగే ఎవరికి సవాల్ విసురుతున్నారో వారి ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్, వాట్సప్ ఫోన్ నంబర్‌ను అప్లోడ్ చేస్తే నేరుగా వారికి వెళ్తుంది. ముందుగా మూడు మొక్కలునాటి మూడేళ్లపాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటానని ప్రతిజ్ఞ చేయాలి. నాటిన మొక్కలతో సెల్ఫీ దిగి ఎవరికైతే సవాల్ విసురుతున్నారో వారికి షేర్ చేయాలి. సవాల్‌ను స్వీకరించి 10 రోజుల్లో మొక్కలు నాటేందుకు ముందుకు రాకపోతే ఓడిపోయినట్లు అవుతుంది. ఇలా సాధారణ వ్యక్తి నుంచి అన్ని స్థాయిలవారు గ్రీన్ చాలెంజ్ పేరుతో సెల్ఫీ దిగి మరో ముగ్గురికి సవాల్ విసురుతున్నారు. ఎక్కడ చూసినా గ్రీన్ చాలెంజ్‌ల చర్చనే సాగుతోంది. జిల్లాలో యువత సైతం మొక్కలు నాటి వారి స్నేహితులకు గ్రీన్ చాలెంజ్‌ను విసురుతున్నారు. గొలుసు కట్టుగా.. జిల్లాలో మొక్కలు నాటడం గొలుసుకట్టుగా సాగుతోంది. గ్రీన్ చాలెంజ్ సవాళ్లను స్వీకరించి మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్‌ను విసురుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సాధారణ వ్యక్తులు సైతం గ్రీన్ చాలెంజ్ విసురుతున్నారు. తక్కువ కాలంలో.. ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఐదు జిల్లాల్లో 4.74 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హరితహారంను విజయవంతం చేసేందుకు అటవీశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. హరితహారంలో పాల్గొనేందుకు జిల్లా యంత్రాంగానికి సైతం బాధ్యతలు అప్పగించారు. గ్రీన్ చాలెంజ్ కొత్తగా ఉండటంతో అనతికాలంలోనే సోషల్ మీడియా ద్వారా మంచి ప్రాచుర్యం పొందింది. ప్రజలు తమ వంతు బాధ్యతగా హరితహారంలో యజ్ఞంలా భాగస్వాములు అవుతున్నారు. జోరుగా గ్రీన్ సవాల్ జూలై 24న కలెక్టరేట్లో కలెక్టర్ ముండ్రాతి హరిత మూడు మొక్కలు నాటి సీపీ రవీందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి గ్రీన్ చాలెంజ్ విసిరారు. జూలై 28న హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మూడు మొక్కలు నాటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఈ చాలెంజ్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అదే రోజు హన్మకొండలోని ఎక్సైజ్ కాలనీలో మొక్కలు నాటి ఉద్యోగ సంఘాల నేతలకు గ్రీన్ చాలెంజ్ విసిరారు. అంతేగాక డిప్యూటీ సీఎం చాలెంజ్‌తో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ జూలై 30న వర్ధన్నపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మూడు మొక్కలు నాటి వర్ధన్నపేట, పర్వతగిరి, హసన్‌పర్తి ఎంపీపీలు మార్నేని రవీందర్రావు, రంగు రజిత కుమార్, సుకన్య రఘుకు గ్రీన్ చాలెంజ్ విసిరారు. అలాగే వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన అరూరి మరో మూడు మొక్కలు నాటి వర్ధన్నపేట జెడ్పీటీసీ సారంగపాణి, వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి, హసన్‌పర్తి జెడ్పీటీసీ సుభాష్‌గౌడ్‌కు గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించిన డిప్యూటీ మేయర్ సిరాజోద్దిన్ మొక్కలు నాటి ముగ్గురు కార్పొరేటర్లకు గ్రీన్ చాలెంజ్ విసిరారు. మహబూబాబాద్‌లో ‘నేను సైతం’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సలీమా మహబూబాబాద్‌లో మూడు మొక్కలు నాటి ఎస్పీ కోటిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపెల్లి రవీందర్‌రావుకు గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఇటీవల మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మూడు మొక్కలు నాటి కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ నరేష్ నాయక్‌కు గ్రీన్ చాలెంజ్ విసిరారు. కరీంనగర్ జెడ్పీచైర్ పర్సన్ తుల ఉమ గ్రీన్ చాలెంజ్ పిలుపు మేరకు జూలై 30న రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలోని తన స్వగృహంలో మూడు మొక్కలు నాటారు. ఈ మొక్కలు నాటి మరో ముగ్గురు ప్రజాప్రతినిధులు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, శాసన మండలి సభ్యుడు నారదాసు లక్ష్మ ణరావుకు గ్రీన్ చాలెంజ్‌ను విసిరారు. -
చాలెంజ్‌ను స్వీకరించిన పవన్
ఒకప్పుడు రైస్ బకెట్ చాలెంజ్, మొన్నటి వరకు ఫిట్నెస్ చాలెంజ్, ప్రస్తుతం హరితహారం చాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రముఖులు ఈ చాలెంజ్‌లను స్వీకరిస్తున్నారు. మరికొందరికి సవాళ్లను విసురుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మెగా ఫ్యామిలీ ఎంటరైంది. ఓ ప్రముఖ చానెల్ అధినేత విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి .. ఓ మొక్కను నాటారు. అనంతరం చిరు మరో ముగ్గురికి చాలెంజ్‌ను విసిరారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, రామోజీరావు, పవన్ కళ్యాణ్‌లకు గ్రీన్‌చాలెంజ్‌ను విసిరారు. తాజాగా ఈ సవాల్‌ను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్వీకరించారు. ఓ మొక్కను నాటుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ చాలెంజ్‌లో కేటీఆర్, కవిత, రాజమౌళి, బ్రహ్మానందం, చిరంజీవి, మహేష్ బాబు లాంటి ప్రముఖులు పాల్గొన్నారు JanaSena Chief @PawanKalyan accepted the challenge by Sri Chiranjeevi garu. #HarithaHaram pic.twitter.com/iA543QRuPg — JanaSena Party (@JanaSenaParty) 31 July 2018 -
చాలెంజ్‌ను స్వీకరించిన సూపర్‌స్టార్
రైస్ బకెట్ చాలెంజ్‌తో మొదలైన ఉద్యమం.. ఎన్నో సామాజిక విషయాల్లో చాలెంజ్‌లు విసురుతూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మొన్నామధ్య క్రీడా శాఖా మంత్రి రాజ్యవర్ధన్ విసిరిన హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్ చాలెంజ్ ఎంత పాపులర్ అయిందో వేరే చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ను దాటి టాలివుడ్‌కు ప్రవేశించిన ఈ చాలెంజ్‌ను.. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. తాజాగా హరితహారం చాలెంజ్ వైరల్‌గా మారుతోంది. కేటీఆర్, కవిత, సచిన్, రాజమౌళి లాంటి సెలబ్రెటిలు చాలెంజ్‌ను స్వీకరించి ఓ మొక్కను నాటి మరికొంత మందికి ఈ చాలెంజ్‌ను విసిరారు. కేటీఆర్ విసిరిన ఈ చాలెంజ్‌ను తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు స్వీకరించారు. తన కూతురుతో కలిసి ఓ మొక్కను నాటుతున్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. తనను నామినేట్ చేసినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. గౌతమ్, సితారా, వంశీ పైడిపల్లికి చాలెంజ్‌ను విసిరారు. మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. Challenge accepted, @KTRTRS & @RachakondaCop 😊 Thank you for nominating me...👍 #HarithaHaram is a great initiative taken towards a go green environment. I now nominate my daughter Sitara, my son Gautam and my @directorvamshi to take on the challenge. pic.twitter.com/SEhcuM4Dgy — Mahesh Babu (@urstrulyMahesh) July 30, 2018 -
తెలంగాణను హరితవనంగా తీర్చిదిద్దుదాం
మక్తల్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకం గా చేపట్టిన హరితహారంలో అందరూ పాల్గొనడం ద్వారా రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం మాద్వార్‌లోని శ్రీగట్టు తిమ్మప్ప దేవాలయం ప్రాంగణంలో సోమవారం ఆయన మొక్కలు నాటి హరితహారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్క లు నాటి సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ బాధ్యులు ఎమ్మెల్యేతో పాటు సబ్‌కలెక్టర్ ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతును సన్మానించారు. మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, ఎఫ్ఆర్వో నారాయణరావు, ఏపీడీ చంద్రశేఖర్, ఏపీఓ చిట్టెం మాధవరెడ్డి, ఎంపీడీఓ విజయనిర్మల, హెచ్ఎం రాందాస్, సర్పంచ్ రాధమ్మ, ఎంపీటీసీ రవిశంకర్‌రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డితో పా టు రాజేశ్వర్‌రావు, సంతోష్‌రెడ్డి, రాంలింగం, ఈ శ్వర్, విశ్వనాథ్, ఆశప్ప, రాజమహేందర్‌రెడ్డి, నే తాజీరెడ్డి, శ్రీనివాసులు, కాషయ్య పాల్గొన్నారు. -
హరితహారానికి ‘ఉపాధి’ నిధులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసే పనులు మొదలుకుని వాటిని కాపాడే వరకు ప్రతి దశలోనూ మానవ శ్రమే ప్రధానం కాబట్టి వ్యవసాయ కూలీలతో ఆ పనులు చేయించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దీనికి సంబంధించి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన హరితహారం కార్యక్రమంపై ఆదివారం ప్రగతి భవన్లో కేసీఆర్ సమీక్షించారు. ‘‘కొత్తగా ఏర్పాటు చేసుకున్న వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ఒక్కో గ్రామాన్ని ఒక్కో యూనిట్‌గా తీసుకోవాలి. ప్రతి గ్రామంలో నర్సరీ పెంచాలి. నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయడం, వాటిని పంపిణీ చేయడం, గుంతలు తీయడం, నీళ్లు పోయడం లాంటి పనులన్నీ వ్యవసాయ కూలీలతో చేయించండి. నరేగా నిబంధనలు కూడా ఉపాధి కల్పించే పనులు చేపట్టాలని కచ్చితంగా చెప్పాయి. కాబట్టి నరేగా నిధులను తెలంగాణ హరితహారం కోసం వినియోగించడం సముచితంగా, ఉభయ తారకంగా ఉంటుంది’’ అని సీఎం చెప్పారు. పచ్చదనం తిరిగి రావాలి... అడవులు, చెట్ల నరికివేత వల్ల గ్రామాల్లో కోల్పోయిన పచ్చదనం, పర్యావరణం హరితహారంతో తిరిగి రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ‘‘అడవులు నాశనం కావడం వల్ల అనేక అనర్థాలు కలిగాయి. మానవ జీవితం కల్లోలం అయింది. అడవిలో చెట్ల పండ్లు తిని బతికే కోతులు ఊళ్లమీద పడ్డాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. వంటింట్లోకి కూడా చొరబడి మన తిండిని కూడా ఎత్తుకుపోతున్నాయి. ఇలాంటి పరిణామాలకు అడవులు, చెట్లు లేకపోవడమే కారణం. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల పునరుద్ధరణ జరగాలి. గ్రామాల్లో కూడా విరివిగా చెట్లుండాలి. పండ్ల చెట్ల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నర్సరీల్లో పెంచే మొక్కల్లో 25 శాతం పండ్ల మొక్కలుండాలి. కోతులు, పక్షులు, ఇతర అడవి జంతువులు తినే తునికి, ఎలక్కాయ, మొర్రి, నేరేడు, సీతాఫలం, జామ తదితర పండ్ల మొక్కలను పెద్ద సంఖ్యలో సిద్ధం చేసి పంపిణీ చేయాలి. అడవుల్లో, పొలాల దగ్గర, ఖాళీ ప్రదేశాలలో వాటిని పెంచాలి. దీనివల్ల కోతులు, ఇతర అడవి జంతువులు జనావాసాల మీద పడకుండా ఉంటాయి. మనుషులు తినే పండ్ల మొక్కలను కూడా సిద్ధం చేస్తే అందరూ తమ ఇళ్లలోనే వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, సీఎస్ ఎస్.కె. జోషి, పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మొక్క’వోని సంకల్పం
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఊళ్లను హరిత గ్రామాలుగా మార్చేందుకు ప్రభుత్వం పూనుకుంది. నాలుగో విడత హరితహారంలో భాగంగా ప్రతి ఇంట్లో పచ్చదనం కనిపించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటివరకు ప్రభుత్వ స్థలాలు, రహదారి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం.. ఈసారి ప్రతి గ్రామంలోనూ స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకోనుంది. సంఘంలోని ప్రతి సభ్యురాలు తన ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటేలా ప్రోత్సహించడం ద్వారా క్షేత్రస్థాయిలో హరితహారం విజయవంతం చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ విడతలో జిల్లావ్యాప్తంగా 1.97 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ హరితహారం కార్యక్రమంపై పలుమార్లు సమీక్షలు నిర్వహించి.. లక్ష్యం మేరకు అధికారులు విరివిగా మొక్కలు నాటించాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో అధికారులు తమ శాఖల పరిధిలో మొక్కలు నాటించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరగడంతో క్షేత్రస్థాయిలో మొక్కలు నాటేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రభుత్వం చేస్తున్న సూచనలతోపాటు జిల్లా అధికారులు నూతన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే కుటుంబానికి ఆరు మొక్కలు పంపిణీ చేసి నాటించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. జిల్లా అధికారులు ఒకడుగు ముందుకేసి ఇందులో మహిళలు పాలుపంచుకునే విధంగా చర్యలు చేపట్టారు. గత మూడు విడతల్లో నాటిన మొక్కలు కొన్ని చనిపోవడంతోపాటు సంరక్షణ లేక ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటనున్నారు. ఈసారి నాటిన మొక్కలు ఎండిపోకుండా.. వాటిని సంరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. మహిళా సంఘాలకూ బాధ్యత.. హరితహారంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు అధికారులతోపాటు ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా విజయవంతం చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే మొక్కలు నాటడంతోనేతమ బాధ్యత తీరిందని ప్రజలు భావిస్తుండటంతో చాలా వరకు మొక్కలు ఎండిపోతున్నాయి. అలా కాకుండా.. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చూడాలనే ఉద్దేశంతో ఈసారి హరితహారం కార్యక్రమంలో మహిళా సంఘాలు పాలుపంచుకునే విధంగా చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 25,034 స్వయం సహాయక సంఘాలు ఉండగా.. వీటిలో 2,31,586 మంది సభ్యులున్నారు. వీరిచేత సుమారు 13లక్షలకు పైగా మొక్కలు నాటించాలని ప్రయత్నిస్తున్నారు. మహిళా సంఘాల్లోని ఒక్కో సభ్యురాలికి ఆరు మొక్కలు ఇచ్చి.. వారి ఇంటి ఆవరణతోపాటు పరిసరాల్లో నాటించాలని సూచిస్తున్నారు. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. ఒకవేళ మొక్క ఏ కారణం చేతనైనా ఎండిపోయినా.. చనిపోయినా.. దాని స్థానంలో మరో మొక్కను వెంటనే నాటాల్సి ఉంటుంది. రైతులకూ మొక్కల పంపిణీ.. డీఆర్డీఏ ద్వారా రైతులకు కూడా మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు మొక్కలను అందజేస్తారు. వీటి రవాణా, నాటేందుకు, నీళ్లు పోసేందుకు అయ్యే ఖర్చులను ఉపాధిహామీ పథకం ద్వారా ఆయా రైతులకు చెల్లిస్తారు. అలాగే పెద్ద రైతులకు కూడా గుంతలు తీసినందుకు, మొక్కలు నాటేందుకు అయ్యే ఖర్చును చెల్లించనున్నారు. ఇక ప్రతి కుటుంబానికి 6 మొక్క లు పెంచుకునేందుకు ఉచితంగా ఇవ్వనున్నారు. వీటిని ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు. అలాగే 6 నుంచి 9వ తరగతి వరకు చదవుతు న్న ప్రతి విద్యార్థికి 6 మొక్కలు పంపిణీ చేయనున్నారు. వీరు కూడా తమ ఇంటి ఆవరణలో మొక్కలను పెంచాల్సి ఉంటుంది. ఇతర ప్రభుత్వ శాఖలైన విద్య, నీటిపారుదల, దేవాదాయ తదితర శాఖలు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవుతారు. ప్రభుత్వ శాఖల లక్ష్యం ఇలా.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1.97 కోట్ల మొక్కలు నాటించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వీటిలో డీఆర్డీఏ ద్వారా 66 లక్షల మొక్కలు, అటవీ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 45 లక్షలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 15 లక్షలు, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 8 లక్షలు, సింగరేణి ద్వారా 5 లక్షలు, మున్సిపాలిటీల ద్వారా 8 లక్షలు, ఐటీసీ ద్వారా 50 లక్షల మొక్కలు నాటించేందుకు బాధ్యతలు అప్పగించారు. ఆయా శాఖల అధికారులు లక్ష్యాల మేరకు మొక్కలు నాటించేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. -
నర్సరీల బాధ్యత సర్పంచ్‌లదే
ధారూరు: ప్రతి గ్రామ పంచాయతీలో ఒక గ్రామ వన నర్సరీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం తగిన స్థలాలను గుర్తించాలని ధారూరు ఫారెస్టు రేంజర్ సీహెచ్ వెంకటయ్యగౌడ్ సూచించారు. హరితహారంలో భాగంగా గురువారం ధారూరు మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, పీఏసీఎస్ చైర్మెన్, కోఆప్షన్ సభ్యుడు, ఐకేపీ గ్రామ సంఘం లీడర్, మండల, గ్రామ స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, ఏపీఎం, ఏపీఓ, టీఏలు, ఎఫ్‌ఏలు, ఈసీ, సీసీలకు జరిగిన అవగాహన, శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గ్రామ వన నర్సరీల ఏర్పాటు కోసం పాఠశాలల్లోని ఖాళీ స్థలాలను, బంజరు, బీడు భూములు, గ్రామ కంఠాల స్థలాలను ఎంపిక చేస్తే అనువుగా ఉంటుందని ఆయన సూచించారు. ప్రతి గ్రామ వన నర్సరీలో 40 వేల వివిధ రకాల మొక్కలను పెంచాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గ్రామ వన నర్సరీలకు నీటి వసతి, నిర్వాహణ బాధ్యతలు సర్పంచులే చూడాల్సి ఉంటుందన్నారు. పనులు చేసే కూలీలకు మాత్రం ఉపాధిహామీ పథకం ద్వారా డబ్బులు అందుతాయని చెప్పారు. గ్రామ వన నర్సరీల్లో పెంచే ప్రతి మొక్క గ్రామస్తులకు అవసరమైనవిగా ఉండాలని, అలాంటి మొక్కలనే ఎంపిక చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొక్కలను పెంచడానికి పాలిథిన్ కవర్లు, సారవంతమైన మట్టి, నీటి వాడకంపై ఆయన సమగ్రంగా వివరించారు. అనంతరం జెడ్పీటీసీ పట్లోళ్ల రాములు మాట్లాడుతూ అభివృద్ధి అంటే గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలే కాదని మొక్కల పెంపకం కూడ ఇందులో భాగమే అన్నారు. చెట్లు ఏపుగా పెరిగితే గ్రామం పచ్చదనంతో అందంగా ఉంటుందని, పర్యావరణ కాలుష్యం నివారింపబడుతుందన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం కనీసం 5 మొక్కల వరకు నాటాలని, పొలాల వద్ద ఎకరాకు 40 మొక్కల చొప్పున నాటవచ్చని ఆయన సూచిం చారు. ఫారెస్టు వారు మొక్కలను పెంచి పంపిణీ చేస్తే వాటిని తీసుకెళ్లి నాటకుండా వృథాగా పడేయరాదని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సబిత, ఈఓపీఆర్డీ మున్నయ్య, ఏఓ పావని, ఏపీఓ సురేశ్, ఏపీఎం దేవయ్య, గ్రామ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
మొక్కలు నాటిన జీవితా-రాజశేఖర్
సాక్షి, మేడ్చల్ : జీవితా-రాజేశేఖర్ కుటుంబం హరితహారంలో భాగమైంది. ఆదివారం కూతురు శివాని జన్మదినం సందర్భంగా కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద జీవిత, రాజశేఖర్, కూతుళ్లు శివాని, శివాత్మికలు మొక్కలు నాటారు. కాగా, గత మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఓఎస్టీ ప్రియాంక వర్గీస్‌తో జీవితా రాజశేఖర్ భేటీ అయిన విషయం తెలిసిందే. హరితహారంలో భాగస్వామ్యం విషయమై చర్చించారు. తమ ట్రస్ట్ ద్వారా హరితహారంలో పాల్గొనే విషయంపై ప్రియాంక చర్చించినట్లు జీవిత వెల్లడించారు. హరితహారం కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని జీవిత పేర్కొన్నారు. -
దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలు
సాక్షి, హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అన్ని సంపదలతో పోలిస్తే ఆరోగ్యమే ప్రధానమైనదని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సమకూర్చడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు దశల వారీగా ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు. సౌర విద్యుత్‌లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అటవీ పునరుజ్జీవన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై మంగళవారం అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. జూలైలో నాలుగో విడత హరితహారం ప్రారంభమవుతుందని, ప్రజలంతా అందులో భాగస్వాములైతే కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పారు. ప్రజలంతా హరితహారంలో పాల్గొనాలని.. మొక్కలు నాటడంతోపాటు నాటిన ప్రతీ మొక్కా బతికేలా రక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అప్రమత్తంగా ఉండాలి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం మనపై కూడా ఉంటుందని.. ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. వీలైనంత వరకు కాలుష్య కారకాలను వాడకుండా ఉండాలని చెప్పారు. ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగంతో ముప్పు పొంచి ఉందని.. నిత్య జీవితంలో ప్లాస్టిక్ అవసరమున్నా, దానితో తలెత్తే దుష్పరిణామాలపై ఏమరుపాటు వద్దని పేర్కొన్నారు. హరితహారం ఫలితాలు కనిపిస్తున్నాయి రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చాలన్న లక్ష్యంతోనే ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమం ప్రారంభమైందని.. గత మూడేళ్లుగా చేపట్టిన చర్యల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. మొక్కలు నాటడంతోపాటు వాటి పెంపకం, రక్షణకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉంటాయన్నారు. వచ్చే నెలలో నాలుగో విడత హరితహారం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 38 కోట్ల మొక్కలు నాటనున్నామని పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా అర్బన్ ఫారెస్ట్ పార్కులు, రహదారి వనాలు (ఎవెన్యూ ప్లాంటేషన్) ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నాటడం కాదు.. పెంచేలా.. ఇప్పటివరకు మూడు విడతలుగా జరిగిన హరితహారంలో రాష్ట్రవ్యాప్తంగా 82 కోట్ల మొక్కలు నాటారు. తాజాగా నాలుగో విడతలో ప్రధానంగా టేకు, వెదురు, పూలు, పళ్ల మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈసారి స్కూళ్లు, కాలేజీల ఆవరణలో మొక్కలు ఎక్కువగా నాటాలని.. విద్యార్థులను ఎక్కువగా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మొక్కలు నాటే సమయంలో హడావుడి చేస్తున్న ప్రభుత్వ విభాగాలు తర్వాత వాటి రక్షణను గాలికి వదిలేస్తున్నాయనే విమర్శల నేపథ్యంలో.. ఈసారి మొక్కలు నాటడంతో పాటు రక్షణ విషయంలో జవాబుదారీగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నేరుగా సీఎంవో పర్యవేక్షణ నాటిన మొక్కలు, వాటిలో బతికి ఉన్నవెన్ని, రక్షణకు తీసుకున్న చర్యలేమిటనే అంశాలపై అటవీ శాఖ ఈసారి కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ప్రతినెలా మొక్కల ఫొటోలను అటవీ శాఖకు చెందిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ వెబ్‌సైట్‌తోపాటు మొక్కల వివరాలను జియో ట్యాగింగ్ ద్వారా సీఎం క్యాంపు కార్యాలయంలోని డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేస్తున్నారు. దాంతో ముఖ్యమంత్రే స్వయంగా ఏయే ప్రాంతాల్లో మొక్కలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏమిటన్నది పర్యవేక్షించే వీలుంటుందని చెబుతున్నారు. -
అడవుల్లో 100 కోట్ల చెట్లు
సాక్షి, హైదరాబాద్: నాలుగో విడత హరితహారంలో భాగంగా అడవుల్లో 100 కోట్ల మొక్క లు పెంచేందుకు అటవీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. చెట్లను నరికి కలప స్మగ్లింగ్‌కు పాల్పడే వారిపై పీడీ చట్టం ప్రయోగించాలని నిర్ణయించారు. ఈ మేరకు సచివాలయంలో హరితహారం పురోగతిపై జిల్లాల కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగో విడత హరితహారం కోసం తొమ్మిది వేల నర్సరీలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. కొత్త నర్సరీలకు స్థలం గుర్తింపు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. అనంతరం ఎస్కే జోషి మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలకు పంపిన ఫార్మాట్లను అన్ని వివరాలతో అటవీ శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా స్థాయిలో కొత్త నర్సరీల ఏర్పాటుపై శిక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. అటవీ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల సిబ్బంది దీనిలో పాల్గొంటారని చెప్పారు. -
‘గజ్వేల్’ మా రోల్ మోడల్
అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చిన వివిధ జిల్లాల కలెక్టర్లతో గజ్వేల్ ఆదివారం కళకళలాడింది. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి నవ్వుతూ..ముందుకు నడిపిస్తూ అభివృద్ధి పనులకు తన సహచరులకు వివరించారు. పర్యటన అనంతరం ఇక్కడ అమలవుతున్న హరితహారం పనులను తాము ఆదర్శంగా తీసుకుంటామని బృందం సభ్యులు ప్రకటించారు. ఎడ్యుకేషన్ హబ్ అద్భుతమని కొనియాడారు. యుద్ధప్రాతిపదికన జరుగుతున్న అభివృద్ధి తీరుపైఆశ్చర్యం వ్యక్తం చేశారు. గజ్వేల్: సీఎం ఇలాకా గజ్వేల్‌లో సాగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించేదుకు వచ్చిన కలెక్టర్లతో గజ్వేల్ కళకళలాడింది. పర్యటన అనంతరం మా జిల్లాల్లోనూ ఇదే తరహా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతాం అంటూ జిల్లా కలెక్టర్ల బృందం ప్రకటించింది. నియోజకవర్గంలో చేపట్టిన అటవీ సహజ పునరుద్ధరణ(ఏఎన్ఆర్), కృత్రిమ పునరుద్ధరణ(ఏఆర్)తీరుపై రాష్ట్రంలోని రంగారెడ్డి, అదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు మినహా మిగతా వారంతా బస్సులో యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో అధ్యయనం జరిపారు. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పీకే ఝా, హరితహారం ఓఎస్డీ, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారిణి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ‘గడా’ ప్రత్యేకాధికారి హన్మంతరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, ఏపీసీసీఎఫ్ డోబ్రియాల్, సీసీఎఫ్ ఏకే సిన్హాలతో కలిసి కలెక్టర్ల బృందం ఇక్కడ పర్యటించింది. హైద్రాబాద్‌లో శనివారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న హరితహారం, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించాల్సిందిగా సూచించిన నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది. ముందుగా ‘హారితహారం’.. మొదట ములుగు మండలం నర్సంపల్లిలో ఏఎన్ఆర్(యాడెడ్ నేచురల్ రీ–జనరేషన్), ఏఆర్(ఆర్టిఫిషియల్ రీ–జనరేషన్)బ్లాక్‌లను వారు పరిశీలించారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేనివిధంగా గజ్వేల్ రేంజ్ పరిధిలో 439 హెక్టార్లలో ఏఎన్ఆర్, 370హెక్టార్లలో ఏఆర్ విధానంలో మొక్కల పెంపకం జరిగిందని పీసీసీఎఫ్ పీకే ఝా కలెక్టర్లకు వివరించారు. 2015–16లో 70 లక్షల మొక్కలు, 2016–17లో కోటి 21లక్షల మొక్కలు, 2017–18లో కోటి 57లక్షల మొక్కలు ఉద్యమస్థాయిలో నాటినట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ల బృందం గజ్వేల్ మండలం కోమటిబండ గుట్టపై నిర్మించిన ‘మిషన్‌భగీరథ’ హెడ్‌వర్క్స్ ప్రాంతం నుంచి గజ్వేల్ నియోజకవర్గంలోని ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతున్న తీరును కలెక్టర్లు ఈఈ రాజయ్యను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే నం.1 గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్వివరించిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అనంతరం గజ్వేల్‌లో బాలుర, బాలికల ఎడ్యుకేషన్ హబ్‌ను పరిశీలించారు. 3వేల మంది బాలురు, 2500మంది బాలికలకు విద్యను అందిస్తూ.. హాస్టల్‌తో పాటు అన్ని రకాల వసతులు కల్పించిన తీరును ప్రత్యక్షంగా వీక్షించారు. ఇలాంటి హబ్ దేశంలో ఎక్కడా లేదని.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కలెక్టర్ల బృందానికి వివరించారు. రూ. 153కోట్ల వ్యయంతో అధునాతన వసతులతో ఈ హబ్‌ను నిర్మించినట్లు చెప్పారు. అదేవిధంగా పేదల కోసం నిర్మించిన 1250 ‘డబుల్ బెడ్రూమ్ మోడల్ కాలనీని కలెక్టర్ల బృందం పరిశీలించింది. 156 బ్లాకులుగా ఒక్కో బ్లాకులో 8 ఇళ్ల చొప్పున కాలనీని నిర్మించామని, కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీళ్లు, పార్కు, షాపింగ్ కాంప్లెక్స్, ఫంక్షన్‌హాల్ వంటి వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలు చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఏసీ, ఇతర అధునాతన వసతులతో చేపట్టిన వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి బృందానికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ..గజ్వేల్‌లో అమలవుతున్న హరితహారం తో పాటు వినూత్న పద్ధతుల్లో జరిగిన అభివృద్ధిని అధ్యయనం చేయడానికి కలెక్టర్ల బృందం రావడం హర్షణీయమన్నారు. పర్యటన ద్వారా మిగతా జిల్లాల్లో సైతం ఇదే తరహాలో అభివృద్ధికి బాటలు పడే అవకాశముందన్నారు. పాత టీంను పలకరించిన రోనాల్డ్ ప్రస్తుత మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్ గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులను పేరు పెట్టి పిలుస్తూ ఆకట్టుకున్నారు. లంచ్‌కు వెళ్ళే సమయంలో రోనాల్డ్‌రోస్ ములుగు మండలంలోని అటవీ అతిథిగృహానికి తన వాహనంపై నుంచి డ్రైవర్‌ను దింపేసి సెల్ఫ్ డ్రైవింగ్ చేశారు. కలెక్టర్లంతా బస్సులో ప్రయాణించగా...‘మిషన్ భగీరథ’ హెడ్‌వర్క్స్ వద్ద రోనాల్డ్‌రోస్ ఇలా సెల్ఫ్ డ్రైవింగ్‌తో వెళ్ళడం అందరి దృష్టిని ఆకర్షించింది. గజ్వేల్అభివృద్ధి అదుర్స్.. గజ్వేల్ డెవలప్మెంట్ ఎక్సలెంట్. హరితహారం ద్వారా మంచి కార్యక్రమాలు చేపట్టారు. మా జిల్లాలో కూడా హరితహారంలో ముందంజలో ఉన్నాం. అభివృద్ధి పనుల తీరు బాగుంది. గజ్వేల్ విజిట్ సంతోషంగా ఉంది.– ఆమ్రపాలి, వరంగల్ అర్బన్ కలెక్టర్ -
లండన్‌లో 'తెలంగాణకు హరితహారం'
సాక్షి, లండన్ : ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో 'తెలంగాణకు హరితహారం' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమం 'తెలంగాణకు హరితహారం' అని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులంతా మొక్కలు నాటి, ప్రజలంతా ఇందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ అటవీ పాలసీ కింద పర్యావరణ స్థిరత్వం, పర్యావరణ సంతులనం కొనసాగించటానికి మొత్తం భూమి విస్తీర్ణంలో కనీసం ౩౩శాతం భూమి అడవులు, చెట్లు ఉండాలన్నారు. ఇది మానవ, జంతు, మొక్కల సంరక్షణ కోసం కీలకమైన అవసరం అని తెలిపారు. తెలంగాణలో మొత్తం విస్తీర్ణంలో అటవీ ప్రాంతం కేవలం 25.16 శాతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విస్తీర్ణంలో కావలసిన ౩౩శాతం స్థాయికి అడవులను, పచ్చదనం పెంచడంలో భాగంగా 'తెలంగాణ హరిత హారం'ను ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు. లక్ష్యం : 230 కోట్ల మొక్కలు అటవీ ప్రాంతాలు : 100 కోట్ల మొక్కలు అటవీ ప్రాంతాలు కానివి : 120 కోట్ల మొక్కలు హెచ్.ఎం.డి.ఎ. : 10 కోట్ల మొక్కలు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 40 లక్షల చొప్పున మొక్కలు నాటాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెలుతోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే నాయకులతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు కూడా పాల్గొన్నారు. లండన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి పాల్గొని, స్థానిక ప్రవాసులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శిలు శ్రీధర్ రావు తక్కలపెల్లి, సృజన్ రెడ్డి చాడా, ముఖ్య నాయకులు రాజేష్ వర్మ, శ్రీకాంత్ జెల్లా, రవి రతినేని, సురేష్ బుడగం, వినయ్ ఆకుల, సత్య చిలుముల, రమేష్ ఎసెంపల్లి, వేణు, జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ రావు బాలమూరి, జాగృతి నాయకులు లండన్ గణేష్, వంశీ సముద్రాల, టాక్ సభ్యులు రాకేష్ వాకా, వెంకీ, రవి కిరణ్, రాకేష్ పటేల్, ప్రతీక్ తదితరులు హాజరైన వారిలో ఉన్నారు. -
నా బర్త్ డే రోజు ఆ పని చేయండి: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ నేతలకు ఓ విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజున హంగు ఆర్భాటాలకు డబ్బు వృథా చేయడం కంటే.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు పాల్గొనడం ఉత్తమమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తమ పార్టీ నేతలకు కేటీఆర్ సూచించారు. పుట్టినరోజు వేడుకలను సామాన్యులైనా తమ బంధుమిత్రులతో జరుపుకోవాలనుకుంటారు. సెలబ్రిటీల పుట్టినరోజులంటే ఇక చెప్పనక్కర్లేదు.. పూర్తిగా సందడి వాతావరణం నెలకొంటుంది. కానీ తెలంగాణలో కీలకనేత, రాష్ట్రమంత్రి అయినప్పటికీ తన పుట్టినరోజు వేడుకలను సామాన్యుడిలా జరుపుకోవాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగులు, బొకేలు, ప్రకటనలంటూ హడావుడి చేయవద్దని.. అందుకోసం డబ్బు ఖర్చు చేయవద్దని, అందరికీ మంచి జరిగే హరిత హారంలో పాల్గొంటే ఉత్తమమని టీఆర్ఎస్ నేతలకు ఆయన సూచించారు. జూలై 24న కేటీఆర్ పుట్టినరోజన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ తమ పార్టీ నేతలను హరితహారం కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రోత్సహించేలా ట్వీట్ చేశారు. పని చేయడమే ముఖ్యమంటూ తన ఉద్దేశాన్ని కేటీఆర్ స్పష్టంచేశారు. కేటీఆర్ ట్వీట్ పై నేతల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Request TRS leaders NOT to waste money on Bouquets, Hoardings, Flexis or Advertisements on my birthday. Instead participate in #HarithaHaram — KTR (@KTRTRS) 19 July 2017 -
పచ్చదనమే ఆధారం.. అందుకే హరితహారం
- వెస్లీ గర్ల్స్ హైస్కూల్లో మొక్కలు నాటిన విద్యార్థినులు, టీచర్లు హైదరాబాద్: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం అప్రతిహతంగా కొనసాగుతున్నది. మూడో విడత హరితహారంలో భాగంగా శనివారం సికింద్రాబాద్‌లోని సీఎస్ఐ వెస్లీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు, సిబ్బంది ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెస్లీ గర్ల్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ మేరి సునీల వినోద్ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పచ్చదనం ఆవశ్యకమని, నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని అన్నారు. హరితహారంపై విద్యార్థినులు డ్రాయింగ్, కాంపిటీషన్, డిబేట్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సజిత, ప్రైమరీ సెక్షన్ ప్రిన్సిపల్ విజయప్రభావతి, పీఈటీ దీవెన, టీచర్లు సుజ్ఞాన, వికాసిని, లేయారాణి, రీటా, కెజియా, విజయకుమారి, ధనలక్ష్మీ, అరుణ, వాసంతి, జ్యోతి, హేమలత, సూజన్, పద్మ, లక్ష్మీ సువర్చల, సుజాత, సునీత, సిబ్బంది ఆలివ్, ప్రసాద్, రవిప్రకాశ్‌తోపాటు సుకన్య తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ విద్యాసంస్థల్లో ‘గ్రీన్ డే’
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో శనివారం గ్రీన్ డే పాటించనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో గవర్నర్ నరసింహన్ దంపతులు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మొక్కలు నాటనున్నారు. గ్రామాలు, పట్టణాలలో ఉదయం 9 గంటల నుంచి హరితహారంపై ర్యాలీలు జరగనున్నాయి. 10 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుంది. 11 గంటలకు పర్యావరణం, మొక్కల పెంపకంపై అవగాహన సదస్సులు జరుగుతాయి. అన్ని విద్యా సంస్థల్లో 50 లక్షల మొక్కలు నాటాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావ్!
పీఆర్ ఏఈపై ఎమ్మెల్యే బాబూమోహన్ ఆగ్రహం రేగోడ్ (మెదక్): ‘‘అంతా నీ ఇష్టారాజ్య మా? ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావ్.. అభి వృద్ధి కోసం నిధులు మం జూరు చేస్తే నీ ఇష్టమొచ్చిన చోట పనులు చేయిస్తావా.. ఉద్యోగం ఊడదీస్తా’’అంటూ మెదక్ జిల్లా అందోల్ ఎమ్మెల్యే పి.బాబూమోహన్ పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేగోడ్ మండలం జగిర్యాల, కొండాపురం, రేగోడ్ల్లో శుక్రవారం నిర్వహించిన హరిత హారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటడానికి వచ్చిన బాబూమోహన్‌కు, అం తకు ముందు మంజూరు చేసిన సీసీ రోడ్డు కనిపించలేదు. సీసీ రోడ్డు నిర్మించలేదా? ఎందుకంటూ పలువురిని ఆరా తీశారు. దానిని మరోచోట నిర్మించారని తెలిసింది. తాను ఇక్కడి సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేస్తే మరోచోట వేయడం ఏమిటని ఏఈపై మండిపడ్డారు. -
హరిత తెలంగాణకు తరలి వచ్చిన కేసీఆర్‌లు
కరీంనగర్‌కల్చరల్: హరితహారం మూడో విడుత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కరీంనగర్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌కు మానేరు విద్యా సంస్థల విద్యార్థులు కేసీఆర్ మాస్క్‌లతో వినూత్న తరహాలో స్వాగతం పలికారు. మానేరు స్కూల్ నుంచి సిరిసిల్ల బైపాస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేదిక వద్దకు 400 మంది విద్యార్థులు తరలివచ్చారు. హరితహారానికి స్ఫూర్తిని కలిగిస్తూ మాస్క్‌లతో వచ్చిన విద్యార్థులను అధికారులు, ప్రజలు, నాయకులు అభినందించారు. విద్యాసంస్థల చైర్మన్ కడారు అనంతరెడ్డి సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సునీతారెడ్డితోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నాటిన మొక్క వద్ద హరిత తెలంగాణను సాధిద్దాం అంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. -
ప్రచార కార్యక్రమంలా మారొద్దు
హరిత హారంపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ‘కాలుష్యాన్ని అరికట్టాలంటే పచ్చదనాన్ని పెంపొందించడమే ఏకైక మార్గం. తెలంగాణ ప్రభుత్వం హరితహారాన్ని బాధ్యతగా తీసుకోవడం శుభపరిణామం. కానీ ఇది ప్రచార కార్యక్రమంలా మారొద్దు’అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం భవిష్యనిధి ప్రాంతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘క్షేత్రస్థాయిలో కార్మికులు, ప్రజలు భాగస్వాములను చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. కార్మికుల ఆరోగ్య భద్రత విషయంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత తనకు ఎలాంటి లేఖ ఇవ్వలేదని చెప్పారు. అయినప్పటికీ నిజామాబాద్‌లో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. ఆమె తనతో గొడవ పడాల్సిన అవసరం లేదని, సమస్య ఉంటే కార్యాలయానికి రావాలని, చాయ్ ఇచ్చి మరీ సమస్యను పరిష్కరిస్తానని దత్తాత్రేయ అన్నారు. -
హరితహారం.. ఓ ఉద్యమం
ఈ సారి 40 కోట్ల మొక్కలు నాటుతాం: జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపడుతోందని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరహాలోనే ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. బుధవారం మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ కరీంనగర్లో ప్రారంభిస్తారని చెప్పారు. సోమవారం సచివాలయంలో తన చాంబర్లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండేళ్లలో 49 కోట్ల మొక్కలను నాటామని, మూడో విడతలో 40 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించామని, ఇందులో 120 కోట్ల మొక్కలు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో, 100 కోట్ల మొక్కలు అటవీ ప్రాంతం (డీ గ్రేడ్ ఫారెస్ట్)లో, మరో 10 కోట్ల మొక్కలు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో నాటాలని నిర్ణయించామని మంత్రి వివరించారు. -
హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతి ...
సదాశివపేటరూరల్ : తీవ్ర కరువు, వర్షాలు పడకపోవడం సకల సమస్యలకు చెట్ల లేకపోవడమేనని గ్రహించిన సీఎం కేసీఆర్ హరితహారం అనే బహుత్తర కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. కానీ మెదక్ జిల్లా సదాశివపేట రూరల్ మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో కొందరు ఆకతాయిలు ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. వెల్టూర్ రోడ్డుకు ఇరువైపులా అటవీ శాఖ , మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో గత సంవత్సరం జూన్‌లో భారీ సంఖ్యలో మొక్కలను నాటారు. సీఎం కేసీఆర్ పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకంగా దష్టిసారించడంతో అధికారులు, సిబ్బంది హరితహారం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని వెల్టూర్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటి వాటి చుట్టు కంచెను ఏర్పాటు చేశారు. ఎరువులు వేసి, నీళ్లు పోసి మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోని పెంచిపోషించి పెద్దవిగా చేశారు. తీరా ఇప్పుడు మూడు సంవత్సరాల వయస్సు గల రోడ్డుకు ఒక వైపు నాటిన దాదాపు వంద పైచిలుకు మొక్కలు, మరో వైపు దాదాపు 300 పైచిలుకు మొక్కలు కొందరి ఆకతాయిల చిలిపిచేష్టల పనికి అగ్నికి ఆహుతయ్యాయి. వెల్టూర్ రోడ్డు ప్రారంభమయ్యే నుంచి వెల్టూర్ గ్రామం వరకు ఒక వైపు నాటిన మొక్కలకు నిప్పు అంటించడంతో అవి పూర్తిగా కాలిపోయాయి. పర్యావరణ పరిరక్షణతో పాటుగా వాతావరణ సమతుల్యతను కాపాడటానికి హరితహరం కార్యక్రమంతో కోట్ల రూపాయాలను వెచ్చించి కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే కొందరు దుర్మార్గులు పథకాన్ని నీరు కారుస్తున్నారు. మరో వైపు అధికారుల నిర్లక్ష్యం కూడా కారణంగా కనబడుతోంది. మొక్కలను నాటిన తర్వాత వాటి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. హరితహారంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్కడక్కడ మొక్కలు ఎండిపోవడం, పశువులు తినడం, కాలిపోవడం లాంటివి జరుగుతున్నాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అగ్నికి ఆహుతి అయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ప్రజలు కోరుతున్నారు. -
హరితహారాన్ని కొనసాగించాలి
వలిగొండ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. అనంతరం శిథిలావస్థకు చేరి ఖాళీగా ఉన్న ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌లో మొక్కను నాటారు. శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలను చేరుకుని విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో వర్షం నీరుతో సహా వృథా కాకుండా చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. హరితహారంలో పెంచుతున్న మొక్కలను చూశారు. ఈ సందర్భంగా ఆమెను పాఠశాల సిబ్బంది సన్మానించారు. ఆ తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరుగుదొడ్లు 100 శాతం పూర్తయ్యేలా, మిషన్ భగీరథను త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ మహేందర్‌రెడ్డి, ఇన్చార్జి ఎంపీపీ కుంభం వెంకట్‌పాపిరెడ్డి, జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, తహసీల్దార్ అరుణారెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ గిరిబాబు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పబ్బు ఉపేందర్, ఉపాధ్యక్షుడు కాసుల కృష్ణ, డాక్టర్ సుమన్‌కల్యాణ్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎంఈఓ విజయారావు, ఏపీఓ ఇమ్మానీయేల్, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు. -
హరితహారం ప్రణాళికలు సిద్ధం చేయాలి
రాష్ట్ర ఫారెస్టు ఫోర్స్ అధికారి పీకే ఝూ సంగారెడ్డి జోన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి వచ్చే ఏడాది కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఫారెస్టు ఫోర్స్ ఉన్నతాధికారి పీకే ఝూ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరితహారం కార్యక్రమంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు నిర్థేశించిన లక్ష్యం, నాటిన మొక్కలు, మొక్కల రక్షణకు చేపట్టిన చర్యలను ఆన్లైనలో ఆప్‌లోడ్ చేయాలని కలెక్టర్లకు సూచించారు. మైక్రో ప్రణాళికలు రూపొందించుకోని ప్రాంతాలవారీగా మొక్కల రక్షణ కోసం చర్యలు తీసుకోవడంతో పాటు మొక్కలకు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాటిన మొక్కలను నూటికి నూరుశాతం రక్షించాలన్నారు. ఈ ఏడాది మిగిలిన లక్ష్యాన్ని వచ్చే ప్రణాళికలో చేర్చి హరితహారం కార్యక్రమం కార్యచరణను సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం మండలాల వారీగా నర్సరీలను ఎంపిక చేయాలన్నారు. కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ రెండు కోట్ల 71 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేసి కోటి 58 లక్షల మొక్కల వివరాలను ఆప్‌లోడ్ చేశామన్నారు. సూక్ష్మ ప్రణాళికలను రూపొందించుకొని నాటిన మొక్కల ర„ý క్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే ఏడాది హరితహారం కార్యక్రమానికి అన్ని మండలాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి కార్యచరణను పూర్తి చేసినట్లు వివరించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా అటవీ అధికారి సుధాకర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్, గఢ ప్రత్యేకాధికారి హన్మంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
హరితహారంలో వరంగల్‌కు ప్రథమ స్థానం
జిల్లా టార్గెట్ 4.50 కోట్లు ఇప్పటి వరకు నాటిన మొక్కలు 4.37 కోట్లు : కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. హన్మకొండలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కరుణ మాట్లాడుతూ జిల్లాకు 4.50 కోట్ల టార్గెట్ ఉండగా.. ఇప్పటివరకు 4.37 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి 4.50 కోట్ల లక్ష్యానికి చేరుకోవాలని అధికారులకు సూచించారు. నాటిన మొక్కలను జియో ట్యాగింగ్ చేయడంలో కూడా వంద శాతం లక్ష్యం సాధించాలన్నారు. తరచుగా తనిఖీలు నిర్వహించి మొక్కలు ఎన్ని బతికి ఉన్నాయి.. ఎన్ని చనిపోయాయనే విషయంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు. పాఠశాలలను తనిఖీ చేయాలి.. జిల్లా, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు ఒకేరోజు పాఠశాలలను తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో రాత్రి బస చేసి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. తనిఖీలు, రాత్రి బసలపై ప్రత్యేక తేదీని నిర్ణయిస్తామని చెప్పారు. మారుమూల పాఠశాలల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అటవీ అధికారి శ్రీనివాస్, జిల్లా ప్రజాపరిషత్ సీఈఓ ఎస్.విజయ్‌గోపాల్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, సీపీఓ రాంచందర్‌రావు పాల్గొన్నారు. -
వానలు ఫుల్.. మొక్కలు నిల్!
♦ సందిగ్ధంలో ‘హరితహారం’ ♦ అప్పట్లో వర్షాలు లేక మొక్కలు మట్టిపాలు ♦ ప్రస్తుతం విస్తారంగా వానలు.. కరువైన మొక్కలు ♦ నర్సరీలు మొత్తం ఖాళీ ♦ అయోమయంలో అధికారులు ‘అడిగిన మొక్కనిస్తాం.. నాటి సంరక్షించండి’ అంటూ ప్రచార ఆర్భాటంతో ప్రభుత్వం తలపెట్టిన హరితహారం కీలక సమయంలో సందిగ్ధంలో పడింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించి మొక్కలు నాటే క్రతువులో ప్రజల్ని భాగస్వామ్యం చేసింది. విరివిగా మొక్కలు పంపిణీ చేసి ప్రోత్సహించింది. అప్పట్లో వర్షాలు సహకరించకపోవడంతో మెజార్టీశాతం మెక్కలు మట్టిపాలయ్యాయి. తాజాగా వర్షాలు సంతృప్తికరంగా కురుస్తుండగా... నాటేందుకు మాత్రం మొక్కలు కరువయ్యాయి. అటు నీటి యాజమాన్య సంస్థ, ఇటు అటవీ శాఖవద్ద మొక్కలు నిండుకోవడంతో ఆయా శాఖల అధికారులు దిక్కులు చూస్తున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఈ ఏడాది జిల్లాలో 2.12కోట్ల మొక్కలు నాటేలా యంత్రాంగం ప్రణాళిక రచించింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జిల్లాలో 1.41కోట్ల మొక్కలు నాటేలా లక్ష్యన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో చర్యలకు ఉపక్రమించిన యంత్రాంగాన్ని వర్షాభావ పరిస్థితులు తీవ్ర నిరాశకు గురిచేశాయి. దీంతో లక్ష్యం గాడి తప్పింది. ఇప్పటివరకు 1.35కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు పడడంతో మొక్కలు నాటేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ నర్సరీల్లో మొక్కలు అందుబాటులో లేకపోవడంతో హరితహారం డైలమాలో పడింది. నీటి యాజమాన్య సంస్థ, అటవీ శాఖల పరిధిలోని నర్సరీలు ఖాళీ అయ్యాయి. హరితహారం కింద భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్న యంత్రాంగానికి చివర్లో ఎదురుదెబ్బ తగిలింది. సీజన్ ప్రారంభంలో అధికారులు విరివిగా మొక్కలు నాటుతూ వచ్చారు. వర్షాభావ పరిస్థితులతో పెద్ద సంఖ్యలో మొక్కలు ఎండిపోయాయి. మరోవైపు నర్సరీల్లోనూ భారీగా మొక్కలు మట్టిపాలయ్యాయి. దీంతో నిర్దేశిత లక్ష్యంలో పురోగతి సగమవగా... అందులో ప్రాణం పోసుకున్నవి అరకొరే. ––––––––––––––––––––––––––– ప్రధాన శాఖలు నాటిన మొక్కలు (లక్షల్లో..) ––––––––––––––––––––––––––– శాఖ నాటింది డ్వామా 25.76 డీఆర్డీఏ 11.62 వ్యవసాయ 22.52 జీహెచ్ఎంసీ 84.91 హెచ్ఎండీఏ 60.89 ప్రైవేటు సంస్థలు 37.93 -
హరితహారం లక్ష్యం పూర్తిచేయండి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ మహబూబ్‌నగర్ న్యూటౌన్ : హరితహా రం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు ని ర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. మంగళవారం ఆయన హై దరాబాద్ నుంచి తెలంగాణకు హరితహారం, జాతీయ రహదారి, రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ తదితర విషయాలపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల వారీగా తెలంగాణకు హరితహారం కింద ఇప్పటి వరకు నాటిన మొక్కలు పూర్తిచేయాల్సిన లక్ష్యాలను సమీక్షిస్తూ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలను నాటడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. వర్షపాతం లేకనే : కలెక్టర్ టికె.శ్రీదేవి ఇన్నాళ్లూ జిల్లాలో కనీసం సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదు కావడంతో పథకానికి కాస్త బ్రేక్ పడిందని తెలిపారు. వర్షాల్లేక 48 వేల హెక్టార్లలో పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. జిల్లాలో సగభాగం మొక్కలు నాటేందుకు వీల్లేక హరితహారంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని తెలిపారు. అలాగే కష్ణా పుష్కరాలు కూడా రావడంతో పథకం ముందుకు సాగలేదన్నారు. అయినప్పటికీ నాటిన కోటి 90 లక్షల మొక్కల్లో 90 శాతం మొక్కలను బతికించుకోగలిగామని, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. రానున్న సంవత్సరంలో హరితహారం కింద మొక్కలు నాటేందుకు ఇప్పటినుంచే నర్సరీల్లో మొక్కలు పెంచే కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వీసీలో వివరించారు. భూసేకరణ పనులు త్వరలో పూర్తి జాతీయ రహదారికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను మూడు వారాల్లో పూర్తిచేస్తామని కలెక్టర్ తెలిపారు. రైల్వేకు సంబంధించి 830 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటి వరకు 411 ఎకరాలు సేకరించామని, నెలన్నర కాలంలో దీన్ని కూడా పూర్తిచేస్తామన్నారు. కాన్ఫరె¯Œæ్సలో జేసీ ఎం.రాంకిషన్, డీఎఫ్ఓలు గంగారెడ్డి, రామ్మూర్తి, పద్మాజా, డ్వామా, డీఆర్‌డీఏల పీడీలు దామోదర్‌రెడ్డి, మధుసూదన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్సీడీసీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి మహబూబ్‌నగర్ వ్యవసాయం : కేంద్ర ప్రభుత్వం నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పోరేషన్(ఎన్సీడీసీ) ద్వారా అందజేస్తున్న రాయితీ రుణాలను జిల్లాలోని గొర్రెల కాపారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టికే శ్రీదేవి కోరారు. పథకం కింద 2012–13 సంవత్సరంలో రూ.65కోట్ల రుణాలు మంజూరయ్యాయని, వాటిలో ఒక్కో యూనిట్లో 20శాతం రాయితీ మరో 60శాతం రుణంగా పొందవచ్చని మిగితా 20శాతం సొమ్మును మార్జిన్మని కింద లబ్దిదారలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 2014–15 ఏటా మొదటి విడుతగా రూ.18.54కోట్ల రూపాయలను 1707 మంది లబ్దిదారులకు మార్టిగేజ్ ద్వారా రుణాలు అందజేస్తే అందులో ఇప్పటి వరకు రూ.2.90కోట్ల రికవరి సొమ్మును ఎన్సీడీసీకి చెల్లించినట్లు ఆమె తెలిపారు. రెండో విడుతగా రూ.33.18కోట్ల రూపాయలు జిల్లా గొర్రెల పెంపకందారుల యూనియన్‌లో జమ అయ్యాయని వీటి ద్వారా 3305 యూనిట్లను గొర్రెల కాపారులకు అందజేసేందుకు ప్రణాళిక తయారు చేసినట్లు ఆమె తెలిపారు. అర్హత ఉన్న గొర్రెల కాపారులు ప్రాథమిక గొర్రెల సహకార సంఘం ద్వారా జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
వర్షాభావంతో లక్ష్యసాధన పూర్తికాలేదు
కలెక్టర్ రఘునందన్‌రావు సాక్షి, రంగారెడ్డి జిల్లా : సీజన్లో వర్షాలు ఆశాజనకంగా లేకపోవడంతో హరితహారం లక్ష్యాన్ని సాధించలేకపోయామని కలెక్టర్ రఘునందన్‌రావు అభిప్రాయపడ్డారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి గణాంకాలను కలెక్టర్ వివరిస్తూ పైవిధంగా స్పందించారు. జిల్లాలో 3.32కోట్ల మొక్కలు నాటేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. నాటిన వాటిలో 60శాతం మొక్కల్ని జియోట్యాగింగ్ చేశామన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ ఆమ్రపాలి, ఎస్పీ నవీన్‌కుమార్, ప్రత్యేకాధికారి శోభ తదితరులు పాల్గొన్నారు. -
ఇదేనా ‘హరితహారం’
మిర్యాలగూడ టౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం మూలంగా నీరుగారిపోతోంది. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రం. మిర్యాలగూడ పట్టణంలో లక్ష మెుక్కలు నాటాలనే లక్ష్యంతో నర్సరీల నుంచి భారీగా మెుక్కలను తీసుకువచ్చి మున్సిపాలిటీలో ఉంచారు. గత నెలలో మున్సిపల్ అధికారులు ఆర్భాటంగా కొన్ని మెుక్కలు నాటినా మిగతా వాటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కార్యాలయంలోనే అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. వీటిలో కొన్ని మెుక్కలు ధ్వంసం కాగా మరికొన్నింటిలో మట్టి పూర్తిగా కరిగి మెుక్కలు ఎండిపోయాయి. ఈ నెల 31 వరకు హరితహారం లక్ష్యం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించినా అధికారుల్లో చలనం కనబడడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెుక్కలను నాటాలని స్థానికులు కోరుతున్నారు. -
2.22 కోట్ల మొక్కలు నాటాం
నాటిన వాటిని సంరక్షిస్తున్నాం.. కలెక్టర్ రోనాల్డ్ రోస్ అటవీ పర్యావరణ ముఖ్య కార్యదర్శి మీనా వీడియో కాన్ఫరెన్స్ సంగారెడ్డి జోన్: హరితహారంలో భాగంగా ఈ ఏడాది జిల్లాలో మూడు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. అటవీ పర్యావరణ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 2.22 కోట్ల మొక్కలు నాటినట్టు చెప్పారు. నాటిన మొక్కలను రక్షించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 164 గ్రామ పంచాయతీల్లో వంద శాతం లక్ష్యాన్ని సాధించినట్టు చెప్పారు. వచ్చే ఏడాది హరితహారం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మొక్కలను సంరక్షించాలి: మీనా వీడియో కాన్ఫరెన్స్‌లో బీఆర్ మీనా కలెక్టర్లతో మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. నాటిన మొక్కలను సంరిక్షించాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి అడిషనల్ పీసీఎఫ్ డాబ్రియల్, డీఎఫ్ఓ సుధాకర్ రెడ్డి, ఎక్సైజ్ డీసీ ఖురేషి, డ్వామా పీడీ సురేందర్‌కరణ్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని దోతిగూడెంలోని హెజలో ల్యాబ్ ఆవరణలో సోమవారం తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా భువనగిరి ఆర్డీఓ భూపాల్‌రెడ్డి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో హెజెలో ల్యాబ్ హెచ్ఆర్ ప్రభాకర్, వీఆర్వో షేక్ చాంద్‌పాష, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
బ్రిక్స్ సదస్సులో ‘తెలంగానం’
రాయికల్ : జైపూర్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వివరించారు. ఆదివారం ముగింపు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో వస్తున్న మార్పులు, సభ్యదేశాలు తీసుకోవాల్సిన చర్యల గురించి జరిగిన చర్చాగోష్టిలో కవిత హరితహారం కార్యక్రమం గురించి తెలిపారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాడటం లక్ష్యంగా హరితహారం కొనసాగుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1300 కోట్లు వెచ్చించిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 22 శాతంగా ఉన్న అడవుల శాతాన్ని 33 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో చెరువుల పునరుద్ధరణ గురించి సదస్సులో తెలిపారు. ఈ సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అభినందించారు. -
శబరిపీఠంలో ‘హరితహారం’
నారాయణపేట రూరల్ : పట్టణ శివారులోని వల్లంపల్లిరోడ్డులో గల శబరి పీఠంలో గురువారం అఖిల భారత అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కాకర్ల భీమయ్య అయ్యప్పస్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించి అర్చకుల వేధ మంత్రోచ్ఛరణాల మధ్య రావి, జమ్మి, మర్రి, వేప మొక్కలు నాటి పుష్కరాల నుంచి తెచ్చిన నీటిని పోశారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పోషల్నారాయణ, ఓంప్రకాష్, సంజీవ్, రఘు, నగేష్, వెంకటేష్, మల్లేష్, పాల్గొన్నారు. -
నాటిన మొక్కలకు పర్యవేక్షణ కరువు
పశువులకు ఆహారంగా మారుతున్న వైనం పట్టించుకోని అధికారుల ఆగ్రహం వ్యక్తంచేస్తున్న పర్యావరణ ప్రేమికులు కొండపాక: వర్షాలు సమృద్దిగా కురవాలంటే పర్యావరణ పరిరక్షణ ఒక్కటే పరిష్కారమని గుర్తించిన ప్రభుత్వం హరితహారం చేపట్టింది. దీని కోసం కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. అయితే నాటిన మొక్కలను పర్యవేక్షణ చేయకపోవడంతో ఎండిపోతున్నాయి. అంతేకాకుండా మేకలు, గొర్రెలకు ఆహారంగా మారాయి. అధికారులు గట్టిచర్యలు తీసుకుని హరితహారం సక్రమంగా అమలు జరిగేలా చూడాలని కోరుతున్నారు. హరితహారం కోసం మండలంలో ఈజీఎస్, అటవీశాఖ ఆధ్వర్యంలో ఆరు నర్సరీ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటి నుంచి మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు మొక్కలు సరఫరాచేస్తున్నారు. ఈజీఎస్ కింద ఖమ్మంపల్లిలో లక్ష మొక్కలు పెంపకం చేపట్టగా, కొండపాక, లకుడారం, వెలికట్ట, మేదినీపూర్, కుకునూరుపల్లి, మర్పడ్గ కేంద్రాల్లోని ఒక్కొక్క నర్సరీలో 75 వేల మొక్కలపెంపకం చేపట్టారు. మండల వ్యాప్తంగా 4.70 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు కూడా తయారుచేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు, కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలు, దేవాలయ ప్రాంగణాలు, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ శాఖ రోడ్లకు ఇరువైపులా, పొలాల గట్లపై సుమారు నాలుగు లక్షల మొక్కలు నాటినట్లు ఇంచార్జి ఎంపీడీఓ ఆనంద్‌మేరీ వివరించారు. ఈ మొక్కలను ఈజీఎస్ పథకంలో నాటడం జరిగిందని పేర్కొన్నారు. కానీ నాటిన మొక్కలను సంరక్షించే చర్యలను మాత్రం అధికారులు, పాలకులు గాని చర్యలుతీసుకోకపోవడంతో మేకలకు ఆహారంగా మారాయి. దుద్దెడ నుంచి మర్పడ్గ, సిర్సనగండ్ల నుంచి ఓదన్చెర్వుల మార్గంలో నాటి మొక్కలు సంరక్షించకపోవడంతో ఎండు పుల్లలుగా మారిపోయాయి. వాటిని చూసిన ప్రయాణికులు, పాదచారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినా అధికారులు, ప్రజాప్రతినిధులు వాటి సంరక్షణపై శీతకన్నువేయడం సరికాదని తప్పుబడుతున్నారు. వెంటనే తగుచర్యలు తీసుకుని మిగిలిన మొక్కలను కాపాడాలని కోరుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరందించాలి మొక్కలు నాటారు మంచిదే కానీ పెరిగే వరకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలి. గతంలో వృక్షాలు అధికంగా ఉండటంతో వర్షాలు సకాలంలో కురిసేవి. ప్రస్తుతం చెట్లు లేక వర్షాలు పడటంలేదు. అందుకే వరుస కరువు పరిస్థితి. - లక్ష్మి, కొండపాక కంచే ఏర్పాటు చేయాలి ఈజీఎస్ పథకంలో చాలా మొక్కలు నాటారు. వాటి రక్షణకు చుట్టూ కంచె పెట్టించాలి. లేకపోతే మేకలు, పశువులు మేయడం ఖాయం. చర్యలు తీసుకోకుండా ఎంతో ఖర్చు పెట్టి మొక్కలు పెట్టిస్తే ఏం లాభం. వెంటనే కంచె ఏర్పాటు చేసేలా చూడాలి. - బాలవ్వ, వెలికట్ట ట్యాంకర్ల ద్వార నీరందిస్తాం... సకాలంలో వర్షాలు కురువాలన్న మంచి ఉద్దేశంతో ప్రభుత్వం హరితహారం పథకాన్ని చేపట్టింది. నాటిన మొక్కలు ఎండిపోకుండా చేసేందుకు ఈజీఎస్ సిబ్బందితో సర్వేబుల్ రిపోర్టులను అప్లోడ్ చేయిస్తుంది. పూర్తి కాగానే ట్యాంకర్ల ద్వారా నీరందించడంతో పాటు రక్షణ కోసం కంచెల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. - ఆనంద్‌మేరీ, ఇంచార్జి ఎంపీడీఓ -
తెచ్చారు.. ఎండబెట్టారు...
వరంగల్ : హరితహారంలో భాగంగా నాటేందుకు తెచ్చిన మొక్కలు ఎండకు ఎండిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో హరితహారంలో భాగంగా 12.50లక్షల మెుక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 8,44,860 మొక్కలు నాటారు. అయితే, ఇంకా వేల సంఖ్యలో మెుక్కలు తెప్పించగా అందులో చాలా వరకు నాటడం లేదు. గ్రేటర్ వరంగల్ శివారు ఏనుమాముల వార్డు కార్యాలయం వద్ద మూడు వేలకు పైగా మెుక్కలు ఉన్నాయి. వాటిని నాటకపోవడంతో ఎండకు ఎండిపోతున్నాయి. వివిధ డివిజన్లలో మెుక్కల కోసం ప్రజలు బల్దియా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక్కడేమో సిద్ధంగా ఉన్న మెుక్కలను నాటకుండా, ప్రజలకు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
హరితహారం టార్గెట్ పూర్తి చేయాలి
కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ అర్బన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలాల వారీగా కేటాయించిన టార్గెట్‌ను వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మంది రంలో బుధవారం రాత్రి ఎంపీడీఓలతో హరితహారంపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జఫర్‌గఢ్ వంటి మండలాలు 90 శాతం లక్ష్యాన్ని సాధిస్తే అటవీప్రాంతం ఎక్కువగా ఉన్న ఏటూరునాగారం, తాడ్వాయి మండలాలు మొక్కల పెంపకంలో ఎందుకు వెనకబడుతున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహహరిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. సెలవులు, పండుగ రోజుల్లో కూడా మొక్కలు నాటాలని సూచించారు. ఇకపై ప్రతి రోజు సాయంత్రం ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. కాగా, హరితహారం లక్ష్యసాధనలో పూర్తిగా వెనకబడిన తాడ్వాయి, గణపు రం ఎంపీడీఓలకు చార్జ్ మెమోలు ఇవ్వాలని జెడ్పీ సీఈఓను.. కలెక్టర్ ఆదేశించారు. సమీక్షలో జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, అటవీశాఖ అధికారి శ్రీనివాస్, సీపీఓ రాంచందర్‌రావు, సీఈఓ విజయగోపాల్, ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 2.76 కోట్ల మెుక్కలు నాటాం
హన్మకొండ అర్బన్ : జిల్లాలో 4 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటివరకు 2.76 కోట్లు నాటినట్లు జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరితహారంపై సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా నుంచి జేసీ మాట్లాడుతూ జిల్లాలో 95 శాతం మొక్కలు సరై్వవల్ అయినట్లు తెలిపారు. జియో టాగింగ్ విధానం కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుత జిల్లాకు రూ.11.66 కోట్లు నిధులు అవసరమని తెలిపారు. మండల ప్రత్యేక అధికారుల ద్వారా నివేదికలు తీసుకొని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పీసీ సుధార్‌బాబు, కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, అటవీశాఖ అధికారులు రాజారావు, అధికారులు పాల్గొన్నారు. -
మార్చి నాటికి ‘హరితహారం’ లక్ష్యాన్ని పూర్తి చేయాలి
నల్లగొండ: హరితహారంలో భాగంగా ఈ ఏడాది నల్లగొండ జిల్లాకు నిర్దేశించిన 4.80 కోట్ల మెుక్కల లక్ష్యాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మొక్కలను పర్యవేక్షించే బాధ్యత ఇప్పటి వరకు ఉపాధి హామీ, అటవీ శాఖల ఆధ్వర్యంలో జరిగిందని, ఇక నుంచి ఏ శాఖ పరిధిలో నాటిన మొక్కలకు ఆ శాఖాధికారులే బాధ్యత వహించాలన్నారు. ప్రతి బుధవారం మండల ప్రత్యేక అధికారులు మొక్కలు నాటిన ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. తనిఖీ నివేదికను ప్రభుత్వం రూపొందించిన ఫార్మాట్ ప్రకారం శనివారంలోగా కలెక్టర్‌కు సమర్పించాలని, దానిని కలెక్టర్ పరిశీలించిన అనంతరం అదే రోజు సాయంత్రం వరకు ప్రభుత్వానికి పంపాలన్నారు. ప్రతి పదిహేను రోజులకోసారి మొక్కల ఎదుగుదలకు సంబంధించిన ఫోటోలను తీసి పం పించాలన్నారు. మెుక్కల రక్షణకు ‘కాటిల్ గ్రాప్స్’ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ సత్యనారాయణ, డ్వామా పీడీ దామోదర్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. -
ఉద్యమంలా హరితహారం
ఇప్పటికే నాటిన రెండు లక్షల మొక్కలు మరిన్ని నాటేందుకు సిద్ధంగా నాటిన మొక్కలకు ట్రీగార్డుల ఏర్పాటు రక్షణకు ప్రత్యేకంగా పంచాయతీ సిబ్బంది నియామకం దుబ్బాక రూరల్: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం దుబ్బాక నగర పంచాయతీలో పరుగులు తీస్తోంది. దుబ్బాకతోపాటు దుంపలపల్లి, ధర్మాజీపేట, చేర్వాపూర్, చెల్లాపూర్, మల్లాయిపల్లి, లచ్చపేట వార్డుల్లో ఉద్యమంలా మొక్కలు నాటారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. విరివిగా మొక్కలు నాటడంతో పర్యావరణ కాలుష్యాన్ని కాపాడడమే కాకుండా, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, మొక్కలు నాటడం వల్ల అవి పెరిగి చెట్లుగా మారి అవి మనల్ని రక్షిస్తాయనే అవగాహనతో ఇక్కడి ప్రజలు హరితహారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. నగర పరిధిలో ఇప్పటివరకు సమారు రెండు లక్షల వరకు మొక్కలు నాటారు. మరి కొన్ని మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నారు. నాటిన ప్రతి మొక్కకు రక్షణగా ట్రీ గార్డు, ముళ్ల కంచె వేశారు. మొక్కల సంరక్షణకు నగర పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ పరిధిలోని రేకులకుంట శ్రీమల్లికార్జున దేవస్థానం సమీపంలో ఉన్న సర్వే నంబర్ 117, 129లోని భూమిలో 84 ఎకరాల్లో లక్ష మొక్కలు నాటారు. ఇందుకోసం భూ యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. నాటిన ప్రతి మొక్కను భూ యజమానులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. 84 ఎకరాల భూమిలో నీలగిరి 80 వేల మొక్కలు, అల్ల నేరెడు పది వేలు, సీతాఫలం ఐదు వేలు, చింత ఐదు వేల మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కనూ భూ యాజమానులు శ్రద్ధతో పెంచుతున్నారు. వీటితో కలిపి ఇప్పటివరకు నగర పంచాయతీ పరిధిలో సుమారు రెండు లక్షల మొక్కలు నాటారు. ప్రతి మొక్కనూ కాపాడుతాం నాటిన ప్రతి మొక్కనూ కాపాడుతాం. ఇందుకోసం సిబ్బందికి బాధ్యతలు అప్పగించాం. మొక్కలకు రక్షణగా ట్రీ గార్డు, ముళ్ల కంచెలు వేస్తున్నాం. ఇప్పటివరకు నగర పంచాయతీ పరిధిలో సుమారు రెండు లక్షల మొక్కలు నాటాం. ఇంకొన్ని మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాం. 84 ఎకరాల్లో లక్ష మొక్కలు నాటడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన భూ యజమానులకు కృతజ్ఞతలు. - భోగేశ్వర్, దుబ్బాక నగర పంచాయతీ కమిషనర్ వాడవాడలా మొక్కలే.. నగర పంచాయతీ పరిధిలో ఎక్కడ చూసినా నాటిన మొక్కలే కన్పిస్తున్నాయి. కార్యాలయాలు, పాఠశాలలు, పొలాలు, ఎక్కడ చూసినా మొక్కలతో నిండిపోయాయి. నాటిని కాపాడేందుకు నగర పంచాయతీ వారు ట్రీ గార్డు, చుట్టూ ముళ్ల కంచె వేశారు. ప్రతి మొక్కను నగర పంచాయతీ సిబ్బంది శ్రద్ధతో పెంచుతున్నారు. - దత్తం స్వామి, స్థానికుడు -
కొనసాగిన హరితహారం
చిన్నచింతకుంట : మండలంలోని దుప్పల్లిలో శుక్రవారం సర్పంచ్ పీ ప్రేమ్‌కుమార్, ఎంపీటీసీ సభ్యుడు మాసన్నయాదవ్ ఆద్వర్యంలో మామిడి మొక్కల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్లను పెంచడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. వీటి ద్వార నే వర్షాలు కురుస్తాయని, లేదంటే ఏడారిగా మారి ఈ ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుంటుందని చెప్పారు. గ్రామాల్లో తమ ఇంటి ముందు పొలం గట్టున చెట్లు నాటుకోవాలన్నారు. కార్యక్రమంలో మహిళ సంఘం సభ్యులు శ్యామలమ్మ,సీసీ రాజు,మహిళ సంఘాల లీడర్లు తదితరులు పాల్గొన్నారు. -
హరిత తెలంగాణగా రూపుదిద్దుదాం
ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నాగర్‌కర్నూల్: ప్రతిఒక్కరూ ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించి హరిత తెలంగాణగా మార్చేందుకు అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని నల్లవాగు నుంచి ఉయ్యాలవాడ వరకు బుధవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు పలకాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భావితరాలను దృష్టిలో ఉంచకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటాలని అదేవిధంగా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్లే తీసుకోవాలని అన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించినపుడే మన బాధ్యతను నెరవేర్చినట్టని అన్నారు. ఈ సందర్భంగా సాహితీ డీఈడీ కళాశాల, కస్తూర్భా విద్యార్థులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి, ఉయ్యాలవాడ సర్పంచ్ మనోహరమ్మ, ఎంపీటీసీ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
హరితహారం లక్ష్యం చేరుకోవాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 314 కిలోమీటర్ల రోడ్ల వెంబడి మొక్కలు నాటి హరితహార లక్ష్యాన్ని చేరుకోవాలని పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ ఆశ సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఈఎన్సీ సత్యనారాయణరెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో సమీక్షించారు. న ర్సరీల్లో అందుబాటులో ఉన్న, నాటాల్సిన మొక్కల వివరాలపై ఆరా తీశారు. జిల్లాలో ఈత మొక్కలు అందుబాటులో లేని విషయాన్ని అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ నెల 10న పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 314 కిలోమీటర్ల రోడ్ల వెంబడి లక్ష్యం ప్రకారం మొక్కలు నాటాలని సూచించారు. డ్వామా ఆధ్వర్యంలో నర్సరీల్లో 1.5 మీటర్ల మొక్కలు 50 వేలు ఉన్నాయని డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి తెలిపారు. ఈ వీసీకి పంచాయతీరాజ్ ఎస్ఈ రఘు, ఈఈలు అశోక్‌కుమార్, సుధాకర్‌రెడ్డిలు హాజరయ్యారు. -
పంటలను ధ్వంసం చేయడం తగదు
వరంగల్ చౌరస్తా : పేదలు, ఆదివాసులు సాగు చేసుకుంటున్న పంట లను హరితహారం పేరుతో ధ్వంసం చేయడం తగదని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. ఈ మేరకు వరంగల్ చౌరస్తాలో న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ 2006 అటవీ హక్కు లచట్ట ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వకుండా.. ఉన్న భూముల్లో మొక్కలు నాటడమేమిటని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని కేసీఆర్ ప్రకటించి, ఇప్పుడు భూములను లాక్కోవడం సరికాదన్నారు. నాయకులు చిర్ర సూరి, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పసునూటి రాజు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పైండ్ల యాకయ్య, నాయకులు మైదం పాణి, మోహన్, కార్తీక్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు -
వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన హరితహారం ప్రత్యేక అధికారి
నేరేడుచర్ల : నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని నల్లగొండ, ఖమ్మం జిల్లాల హరితహారం ప్రత్యేక అధికారి, సంయుక్త సంచాలకులు ఆర్. లక్ష్మణుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో నాటిన మొక్కలను పరిశీలించి మొక్కల సంరక్షణ కోసం పలు సూచనలు చేశారు. మరో 500 మొక్కలను కార్యాలయం అవరణలో నాటాలని మార్కెట్ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట నేరేడుచర్ల మార్కెట్ కార్యదర్శి అమరలింగేశ్వరరావు, సిబ్బంది వెంకన్న తదితరులు ఉన్నారు. -
కమాండ్ కంట్రోల్ సెంటర్లో ‘హరితహారం’
నాగార్జునసాగర్ : జలాశయతీరంలోని హిల్‌కాలనీలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్లో హరితహారంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో విశాలంగా ఉన్న ఈకంట్రోల్ సెంటర్లో విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట డీఎస్పీ ఎస్.మోహన్‌రెడ్డి, సీఐ శివరాంరెడ్డి, ఎస్బీ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండున్నర ఏళ్లలోనే అభివృద్ధి
మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం తలకొండపల్లి : 70ఏళ్లలో చేయలేని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రెండున్నర ఏళ్లలో చేసి బంగారు తెలంగాణ దిశలో పయనిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ జెడ్పీహెచ్ఎస్,Sకర్కాస్‌తండా ప్రాథమిక పాఠశాలల్లో మొక్కలు నాటారు. అనంతరం ఖానాపూర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 250గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 1,700ఎకరాలను పంపిణీ చేశామన్నారు. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందిస్తామన్నారు. వచ్చే ఖరీఫ్‌నాటికి కేఎల్ఐ ద్వారా 62వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అలాగే పాలమూర్–రంగారెడ్డి ఎత్తిపోతల చేపట్టి బీడు భూములను సస్యశ్యామలంగా మారుస్తామన్నారు. ఆమనగల్లు మండలం చింతలపల్లి నుంచి ఖానాపూర్ మీదుగా మెదక్‌పల్లి వరకు, పెద్దూర్ నుంచి తలకొండపల్లి వరకు బీటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఎక్కడ? (సెపరేట్ బాక్స్‌లో ఇవ్వండి) కాగా, ఖానాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గత ఏడాది ఉపాధిహామీ పథకం ద్వారా ఎంత ఖర్చు చేశారు, ఎన్ని పని దినాలు కల్పించారు, జాబ్ కార్డులు ఎన్ని, గ్రామంలో ఇళ్లు ఎన్ని?.. అని ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్ఏ) వెంకటేశ్‌ను మంత్రి ప్రశ్నించారు. 440జాబ్ కార్డులకు వందరోజుల పనిదినాలు కల్పిస్తే సుమారు రూ.70 లక్షలు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 12శాతం మాత్రమే చేయడమేమిటని మండిపడ్డారు. మొక్కలు నాటకపోయినా, ఉపాధిహామీ పనులు చేపట్టకపోయినా ఎఫ్ఏతోపాటు టీఏ, ఏపీఓ, ఏంపీడీఓలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సరిగా పనిచేయని వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు నర్సింహ, అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీలు లక్ష్మీదేవీరఘరాం, రాజశేఖర్; ఆయా గ్రామ సర్పంచ్‌లు అంజనమ్మ, మణెమ్మ, ఉపసర్పంచ్లు కరుణాకర్‌రెడ్డి, యాదయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ శ్రీనివాసాచార్య పాల్గొన్నారు. -
నాటకుండా పడేస్తారా?
మొక్కలపై నిర్లక్ష్యం వీడకుంటే చర్యలు తప్పవు మంత్రి జోగు రామన్న హెచ్చరిక జన్నారం : హరితహారం గురించి రాష్ట్రమంతా కలిసి సాగుతుంటే తెచ్చిన మొక్కలను నాటకుండా పడేస్తారా.. గత పది రోజుల క్రితం నేను వచ్చి నాటినప్పుడు పడేసిన మొక్కలు ఇప్పటికీ అలాగే ఉంచుతారా..ఏం తమాషా చేస్తున్నారా... నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు అని అటవీశాఖ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. పది రోజుల క్రితం హరితహారంలో భాగంగా మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డు ఆవరణలో మెుక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇందుకోసం 800 మొక్కలు తీసుకువచ్చారు. విద్యార్థులు, కార్యకర్తలు, అధికారులు మొక్కలు నాటారు. మంత్రి వెళ్లిపోయిన మరుక్షణమే మొక్కలను గుంతల వద్దే వదిలేసి వెళ్లారు. శుక్రవారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేయగా ఎక్కడి మొక్కలు అక్కడే పడేసి ఉన్నాయి. కొన్ని మొక్కలు చనిపోయాయి. వాటిని చూసిన మంత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న వారెవ్వరు అని పిలువగా సెక్యురిటీ గార్డులు వచ్చారు. మొక్కలపై ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అధికారులు ఎక్కడున్నారని ఆరా తీశారు. తహశీల్దార్ రావాల్సిందిగా కోరడంతో అందుబాటులో లేరు. దీంతో పడేసిన మొక్కలను ఆయన తీసి పక్కన పెట్టారు. మొక్కలు దొరక్కా కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నామని, ఇక్కడ తెచ్చిన మొక్కలను నాటకుండా తమాషా చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మొక్కలు నాటించాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీశ్‌కుమార్‌ను ఆదేశించారు. -
నేడు మెగా ప్లాంటేషన్
సదాశివపేట: ప్రభుత్వం ప్రటిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం రెండో విడత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఎవరెస్ట్ ఎన్‌క్లెవ్‌లో, 11 గంటలకు సిద్దాపూర్ కాలనీలో శ్రీకృష్ణ మందిరం వద్ద, 11.15 సిద్దాపూర్ కాలనీలోని పాత కమ్యూనిటి హాల్ వద్ద, 11.30 గంటలకు సిద్దాపూర్ రోడ్డులోగ సాయినగర్ కాలనీలో మెగా ప్లాంటేషన్ చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ ఇస్వాక్‌ఆబ్‌ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, ప్రజాప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. -
ప్రజలు భాగస్వాములు కావాలి
నారాయణపేట రూరల్ : హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నారాయణపేటకు వచ్చిన ఆయన మండలంలోని అంత్వార్ గ్రామ స్టేజీ దగ్గర మొక్కలునాటి నీళ్లు పోశారు. ప్రభుత్వం గ్రామాలను పచ్చగా మార్చడానికి ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపడుతోందని, ప్రజల సహకారం ఉంటేనే లక్ష్యం నెరవేరుతుందన్నారు. అధికారులకు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయాలని, నాటిన మొక్కలకు కంచెలు ఏర్పాటు చేసి నీళ్ళుపోస్తూ కాపాడలన్నారు. రైతుల పొలాల గట్లపై నాటిన మొక్కలను పర్యవేక్షిస్తూ వారికి రావాల్సిన డబ్బులను సకాలంలో అందించాలన్నారు. అనంతరం ఈజీఎస్ ద్వారా నాటిన మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీడీ వెంట ఏపీఓ జయమ్మ, ఫీల్డ్అసిస్టెంట్ రేణుక, మాజీ సర్పంచ్ పాకాల వెంకటయ్య, టీఏలు గోపాల్, బాలరాజు, ఈసీ రంజిత్ ఉన్నారు. -
మొక్కలను సంరక్షించాలి
అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోండి హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి అధికారులతో కలెక్టర్ సమీక్ష ఇందూరు : నాటిన ప్రతి మొక్కను సంరక్షించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ యోగితా రాణా మండల స్థాయి, క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణకు హరితహారంపై సంబంధిత అధికారులతో, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను పూర్తి స్థాయిలో నాటడంతో పాటు వాటిని సంరక్షించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో కుటుంబానికి 800 మొక్కలను సంరక్షించడానికి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి కార్యచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. మైక్రోప్లాన్ ద్వారా ఒక్కో కుటుంబానికి 800 మొక్కలను సంరక్షించడానికి కుటుంబాల వివరాలు సేకరించాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయడంలో భాగంగా గ్యాప్ ఉన్నచోట వాటిని పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్ రవీందర్ రెడ్డి, ఇన్చార్జి డ్వామా పీడీ సునంద, డీఎఫ్‌వోలు సుజాత, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విధులపై అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఇందూరు : విధులపై అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ యోగితా రాణా డ్వామా అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరును పరిశీలించారు. పని తక్కువగా ఉన్న సిబ్బందికి పనులను కేటాయించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సేకరించి నమోదు చేయాలని, ఇందుకు టీంలుగా విడిపోవాలని కలెక్టర్ ఆదేశించారు. లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. అంచనాలను వాస్తవానికి అనుగుణంగా సిద్ధం చేయాలని సూచించారు. విధులపై సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం చేస్తే చర్యలు తప్పవని సూచించారు. కలెక్టర్ వెంట ఇన్చార్జి డ్వామా పీడీ సునంద, విజిలెన్స్ అధికారి శ్రీహరి, అధికారులున్నారు. -
గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
మంచాల: గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటు పడాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం మంచాల మండల పరిధిలోని లింగంపల్లి, తాళ్లపల్లి గూడ గ్రామాల్లో హరితాహారం పథకం కింద మొక్కలు నాటారు, అదే విధంగా ఆయా గ్రామాల్లో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడన్నాకి ప్రతి ఒక్కరు బాధ్యతగా బావించి ముందుకు రావాలన్నారు. గ్రామాల్లో ప్రజలందరికి మౌలిక వసతుల కల్పన కోసం తన వంతు సహాకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు.ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీరు, విధి లైట్లు, వంటి సమస్యలను పరిష్కారించుకోవాలన్నారు. అదే విధంగా గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం కూడా చాలా అవసరమన్నారు. గ్రామాల అభివృద్ధికి విడుతల వారిగా నిధులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చె నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు కూడా పేదలకు అందించే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. బంగారు తెలంగాణ రాష్ర్ట సాధనలో బాగంగా ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాధిముభారక్, వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు ,రవాణా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి కోట్లాది రూపాయాలు కేటాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలు గుర్తించుకోవాలన్నారు. లింగంపల్లిలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు, మరో రూ.5లక్షలతో అండర్ డ్రైనేజీ పనులు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా తాళ్లపల్లి గూడ గ్రామంలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు, రూ.3లక్షలతో అండర డ్రైనేజీ పనులు ప్రారంభం చేయడం జరిగింది. హరితాహారం..... హరితాహారం పథకంలో బాగంగా లింగంపల్లి, తాళ్లపల్లి గూడ గ్రామాల్లో 5వేల మొక్కలు నాటడం జరిగింది. నాటిన ప్రతి మొక్కను కాపాడాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో హరితాహారం పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు. నాటిన మొక్కలను కాపాడినప్పుడే ఆ పథకాన్నికి సార్ధకత చేకూరుతుందన్నారు.గ్రామాల్లో పాఠశాల స్థాయి నుండి రైతు వరకు కచ్చితంగా మొక్కలు నాటాలి. వాటిని పెంచాలన్నారు. ప్రకృతి వైఫరిత్యాలను అడ్డుకోవాలంటే కచ్చితంగా మొక్కలను నాటాలన్నారు. పచ్చధనం ద్వారా ప్రకృత్తి బాగుంటుందన్నారు.ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలి, రైతులు బాగుండాలి అంటే కచ్చితంగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో మంచాల ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ సభ్యుడు భూపతిగళ్లమహిపాల్, వైస్ ఎంపీపీ భాషయ్య, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దండేటికార్ రవి, డైరెక్టర్ కిషన్‌రెడ్డి, లింగంపల్లి సర్పంచ్ రాచకొండ వాసవి, తాళ్లపల్లిగూడ సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీ సభ్యురాలు మంజుల, ఉప సర్పంచ్ మహేంధర్, వార్డు సభ్యులు, ఎంపీడీఓ నాగమణి, తహసీల్దార్ శ్యాంప్రకాశ్, మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిందం రఘుపతి, నాయకులు పరమేష్, శ్రీరాంలు, జానీ పాష, యాదయ్య, సీఐ గంగాధర్, ఎస్సైలు కె.యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలి
నల్లగొండ తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ఆకు పచ్చ తెలంగాణగా తీర్చిదిద్దాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం 25 లక్షల ఈత చెట్లను నాటాలని తెలిపారు. మొక్కల కొరత ఉన్నందున పొరుగు రాష్ట్రాల నుంచి మొక్కలు తేవడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో నర్సరీల్లో మొక్కల కొరత ఉన్నట్లయితే పొరుగు జిల్లాలలో ఉన్న నర్సరీ మొక్కలను అవసరమైన చోటకు తరలించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మాట్లాడుతూ సీఎం ప్రతి రోజు హరితహారం సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి హరితహారం కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇన్చార్జి అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు పని చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున మొక్కలకు నీటి సరఫరా తగ్గినట్లు తెలిపారు. మొక్క సంరక్షణకు ఫెన్సింగ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ భూముల్లో మొక్కలు నాటడానికి అనుమతి లేదని తెలియజేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినందున సంబంధిత అటవీ భూములలో వెంటనే మొక్కలు నాటించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హరితహారం కార్యక్రమం నిరంతరం జరిగే ప్రక్రియ అయినందున అనుకూల వాతావరణం ఉన్నప్పుడు మొక్కలు విధిగా నాటించాలని తెలిపారు. కల్యాణలక్ష్మీకి మార్గదర్శకాలు జారీ కల్యాణలక్ష్మీ పథకానికి లబ్ధిదారుల ఎంపిక విధానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆ మార్గదర్శకాల ప్రకారం సంబంధిత తహసీల్దార్ పరిశీలించి ధ్రువీకరించాలని తెలిపారు. కృష్ణా పుష్కరాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు 4 కోట్ల 80 లక్షల మొక్కల లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.. ఇప్పటివరకు ఒక కోటి 61 లక్షల మొక్కలు నాటించామని తెలిపారు. జిల్లాలో ఇంకా 25 లక్షల మొక్కలు అవసరం ఉన్నాయని తెలియజేయగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే జిల్లాకు మొక్కలను పంపిస్తామని పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. ఇన్చార్జి అధికారులను నియమించి కంట్రోల్ రూమ్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పుష్కర ఘాట్లను రాష్ట్ర మంత్రులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అటవీ శాఖ అదనపు సీసీఎఫ్ ఫరై్గన్, జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్. యన్.సత్యనారాయణ, డీఆర్వో రవి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీఎఫ్ఓ తదితరులు పాల్గొన్నారు. -
హరితహారాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
గ్రామ నోడల్ అధికారులే బాధ్యత తీసుకోవాలి జెడ్పీ సీఈఓ రమణారెడ్డి మర్పల్లి: హరితహారంలో భాగంగా గ్రామాల్లో లక్ష్యాన్ని మించి మొక్కలు నాటించే పూర్తి బాధ్యత ఆయా గ్రామాల నోడల్ అధికారుదేనని జెడ్సీ సీఈఓ (ఓఎస్డీ) రమణారెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో హరితహారంపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏ మండలంలో కురువని విధంగా మర్పల్లి మండలంలో జూలై మొదటివారం నుంచి జూలై 31 వరకు సాధారణ వర్షపాతం కన్నా అధికంగా వర్షాలు కురిసాయన్నారు. దీంతో హరితహారంలో మొక్కలు నాటేందుకు అనువైన కాలమన్నారు. ఇప్పటికే ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయాల్సి ఉన్నా.. ఎందుకు పూర్తి చేయలేక పోయారని ఆయా గ్రామాల నోడల్ అధికారులపై సీఈఓ రమణారెడ్డి మండిపడ్డారు. నోడల్ అధికారులుగా ఏఏ గ్రామంలో ఎన్ని మొక్కలు నాటారనే వివరాలను గ్రామాల వారీగా అడిగి తెలుసుకున్నారు. వీఆర్ఓలు, ఐకేపీ సిబ్బంది నోడల్ అధికారులుగా ఉన్న గ్రామాల్లో లక్ష్యం మేరకు మొక్కలు నాటించకపోవడంతో ఆయా శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోనున్నామని ఆయన హెచ్చరించాడు. మండలంలో ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఆయా గ్రామాల్లో లక్షా 89 వేల మొక్కలు వ్యవసాయ పొలాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలతోపాటు శ్మశానవాటికల్లో మొక్కలు నాటించాలని ప్రణాళికలు రూపొందించారు. ఇంటి ఆవరణల్లో మరో 27 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేశారు. దీంతో నెలరోజులుగా ఇప్పటివరకు కేవలం లక్షా 82 వేల మొక్కలు మాత్రమే నాటించడంతో మిగతా 27 వేల మొక్కలు ఎందుకు నాటించలేకపోయారని నోడల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో టార్గెట్ పూర్తి చేసి 19 గ్రామ పంచాయతీలకు గాను ప్రతి నోడల్ అధికారి మరో 20 వేల మొక్కలు నాటించేందుకు చర్యలు తీసుకోవాలని రమణారెడ్డి ఆదేశించారు. అనంతరం ఎంపీపీ సుమిత్రమ్మ, వైస్ ఎంపీపీ అంజయ్యగౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో రైతులతో సభలు నిర్వహిస్తే తాము సైతం పాల్గొని రైతులు మొక్కలు నాటుకునేలా తమవంతు సహాయం అందిస్తామన్నారు. సమావేశంలో ఎంపీడీఓ దత్తాత్రేయరాజు, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, ఈఓపీఆర్డీ అశోక్‌కుమార్, మండల విద్యాధికారి విద్యాసాగర్, ఏఓ శ్రీనివాస్, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు ఐకేపీ సీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యమంలా హరితహారం చేపట్టాలి
సంగారెడ్డి రూరల్: మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. మంగళవారం సంగారెడ్డి మండలం చింతలపల్లి గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామానికి 40 వేల మొక్కలు తప్పకుండా నాటేలా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు అవసరైమన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కూలీలతో నాటిన మొక్కలకు కంచె ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. వాతావరణ కాలుష్యంతో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో ప్రాణవాయువును ఇచ్చే చెట్టు ఎంతో అవసరమని తెలిపారు. దీనిని గుర్తించుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. రోజురోజుకు అటవీప్రాంతాలు తగ్గుముఖం పట్టడం వల్ల వాతావరణ సమత్యులత దెబ్బతింటుందన్నారు. అలాగే వర్షాలు సకాలంలో కురవటంలేదని చెప్పారు. చెట్టు అధికంగా ఉంటే వర్షాలు సమృద్దిగా కురవటంతోపాటు వాతావరణం చల్లగా ఉంటుందన్నారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. అలాగే గ్రామంలోని ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, ప్రభుత్వ పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు, ఉద్యోగులు సైతం హరితహారం అమలుపై ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విద్యార్థులతో కలిసి గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించారు. నాటిన మొక్కలను కాపాడతామని విద్యార్థులతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండల్‌రెడ్డి, సర్పంచ్ పావని వెంకటేశ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చిల్వెరి ప్రభాకర్, ఎంపీడీఓ సంథ్య, ఎంపీఓ ప్రవీణ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఎం.ఎ.హకీం, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి యూసుఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
‘ హరితహారం ’ దేశానికే ఆదర్శం
సూర్యాపేట : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం బాలరాజు గురువు అయిన నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజరత్నం పదవీ విరమణ సందర్భంగా ఆయన నివాసానికి చేరుకొని వారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకటే రోజు 155 కిలోమీటర్ల మేర లక్షా 50 వేల మందితో ఒకేసారి మొక్కలు నాటించడం అద్భుతమన్నారు. బ్రెజిల్, చైనా తర్వాత తెలంగాణ రాష్ట్రమే మొక్కలు నాటడంలో నిలిచిందన్నారు. హైవేకు రెండు వైపులా మొక్కలు నాటి ఉండడం ఎంతో ఆహ్లాదంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని మిషన్ భగీరథ, కాకతీయ, వసతిగృహాలకు సన్న బియ్యం పథకాలను ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా నిలిచారన్నారు. గురువులు నేర్పిన సామాజిక స్పృహలతోనే నేడు ఈ రోజు రాజకీయంగా ఎదగలిగామన్నారు. తల్లిదండ్రుల పాత్ర కంటే గురువు పాత్ర గొప్పదన్నారు.అనంతరం రిటైర్డ్ ప్రిన్సిపాల్ రాజరత్నం కుటుంబ సభ్యులు గువ్వల బాలరాజును గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శ్యాంసుందర్‌రెడ్డి, మధుసూదన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సమష్టిగా లక్ష్యాన్ని అధిగమిద్దాం
అధికారులతో సమీక్షలో ఆర్డీఓ సూచన సిద్దిపేట జోన్: హరితహారంలో భాగంగా నియోజకవర్గానికి నిర్దేశించిన లక్ష్యాన్ని సమష్టిగా అధిగమిద్దామని సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి సూచించారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా హరితహారంలో నాటి మొక్కలు, వాటి స్థితిగతులను తెలుసుకున్నారు. గ్రామానికి 40 వేల మొక్కల లక్ష్యాన్ని అధిగమించాలని సూచించారు. ఆయా మండలాలకు అవసరమైన మొక్కలను అటవీ శాఖ, నర్సరీల నుంచి దిగుమతి చేసుకోవాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా ముందస్తుగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సుధాకర్, మంత్రి ఓఎస్డీ బాల్‌రాజు, సిద్దిపేట రేంజ్ అధికారి శ్యాంసుందర్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ఉద్యమంలా హరితహారం
♦ నాటిన మొక్కలకు రక్షణగా ముళ్ల కంప నాటండి ♦ మానవాళికి చెట్లు ఎంతో అవసరం ♦ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ధారూరు: రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందని, నాటిన ప్రతి మొక్కకు రక్షణగా ముళ్ల కంపను ఏర్పాటు చేయాలని జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. ధారూరు మండలంలోని జైదుపల్లి అడవిలో జిల్లా అటవీశాఖ అధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చెట్లు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మొక్కలను నాటి నీరు పోశారు. అనంతరం జైదుపల్లి సర్పంచు తాళ్లపల్లి సంతోష అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మానవత్వం లేకుండా చెట్లను నరికివేస్తున్నారని, ఒక చెట్టు నరికితే 10 చెట్లను నాటి పెంచాలని సూచించారు. చెట్ల తరుగుదల వల్ల వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు చెట్లు లేక వాతావరణ సమతుల్యం దెబ్బతిని వర్షాలు కురువకపోవడంతో వ్యవసాయం కుంటుపడుతుందని జెడ్పీ చైర్పర్సన్ అన్నారు. వర్షాలు లేక జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండక రైతులతో పాటు ప్రజలు, పశువులు, జంతువులు నీటి కోసం అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతగిరిగుట్ట అడవులు అందంగా ఉన్నాయని, ఇక్కడ సినిమా షూటింగ్‌లు నిరంతరం జరుగుతున్నాయంటే చెట్లు ఉండటమే కారణమని అన్నారు. ఇక్కడి అడవుల్లో వివిధ రకాల పూలమొక్కలను నాటాలని పర్యాటక ప్రాంతంగా ఆకర్షించబడుతుందని సునీతారెడ్డి అన్నారు. అడవుల్లో పండ్ల మొక్కలు కూడా నాటించాలని ఆమె హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డివిజన్ ఫారెస్టు అధికారి శ్రీనివాస్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే బి. సంజీవరావు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డివిజన్ ఫారెస్టు అధికారి శ్రీనివాస్, జిల్లా సోషల్ ఫారెస్టు అధికారి నాగభూషణం, సబ్ డీఎఫ్ఓ రేఖాభాను, ఫారెస్టు రేంజర్ నర్సింగ్‌రావు, డిప్యూటీ ఫారెస్టు రేంజర్ యూసూఫ్పాష, జైదేపల్లి, తరిగోపుల గ్రామాల సర్పంచులు టి.సంతోష, రవికుమార్, ఎంపీపీ ఉమాపార్వతి, ధారూరు పీఏసీఎస్, మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు హన్మంత్‌రెడ్డి, రాజునాయక్, వేణుగోపాల్‌రెడ్డి, సంతోష్‌కుమార్, వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, జైదుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మమ్మ, మాజీ ఎంపీపీ నర్సింహారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు హఫీజ్, టీఆర్ఎస్ నాయకులు శుభప్రదపటేల్, భీంసేన్చారి తదితరులు పాల్గొన్నారు. -
హరితహారం చారిత్రాత్మకం
మేడ్చల్: తెలంగాణలో చేపట్టిన తెలంగాణకు హరితహారం దేశ చరిత్రలో చారిత్రాత్మకమైన విషయమని రాష్ర్ట హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ నగర పంచాయతీ పరిధిలోని అత్వెల్లిలో మేడ్చల్ పోలీసులు నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మట్లాడుతూ దుర్బిక్ష పరిస్థితులను శాశ్వతంగా దూరం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి అశోక చక్రవర్తిలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాడని అన్నారు.ఇలాంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.గత ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలను విస్మరించడం వల్లే నేడు తెలంగాణలో కరువు పరిస్ధితులు ఏర్పడ్డాయని ప్రభుత్వం మొక్కలు నాటి అడవుల శాతం పెంచడానికే హరితహారంపై ప్రత్యేక శ్రధ్ద వహిస్తుందని అన్నారు.రాష్ర్టంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలు దేశంలోనే గోప్ప ప్రశంసలు పొందాయని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసలు కురిపించిందని తెలిపారు. పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఇప్పటికి 40లక్షల మొక్కలు నాటామని సైబరాబాద్ వెస్ట్ జోన్‌లోని బాలానగర్ డివిజన్లో 50వేల మొక్కలు నాటామని రెండుమూడు రోజుల్లో 3వేల మొక్కలు నాటుతామని తెలిపారు. కార్మిక శాఖ ఆద్వర్యంలో 4లక్షల మొక్కలు నాటామని మరో 10లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.తాను హరితహారంలో రాష్ర్టమంతటా పర్యటించి మొక్కలు నాటుతున్నానని ఇలాంటి కార్యక్రమంలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. నగర పంచాయతీ పరిధిలోని పొదుపు సంఘాల మహిళలకు ఇంటింటి వద్ద మొక్కలు నాటాలని మొక్కలు సరఫరా చేశారు.కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతీ నాయకుడు మొక్కలు నాటే విధంగా చేసి ఆయన మొక్కలు నాటారు.విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొని సామూహికంగా మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలోని దుర్గమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ సాయిశేఖర్, పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్,మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ సత్యనారాయణ, ఎంపీపీ విజయలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాస్కర్‌యాదవ్, మాజీ చైర్మెన్ నందారెడ్డి,నాయకులు పాల్గొన్నారు. -
వాతావరణ సమతుల్యతకు హరితహారం
రాష్ర్ట రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఘట్కేసర్: వాతావరణ సమతుల్యతకు హరితహారం అవసరమని రాష్ర్ట రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.మండలంలోని ఏదులాబాద్ గ్రామంలో గురువారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలునాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు సంవత్సరాల్లో 44కోట్ల మొక్కలునాటుతామన్నారు. అడవులు 33 శాతం ఉండవలసి ఉండగా అంతశాతం అడవులు లేవన్నారు.ప్రతి గ్రామంలో హరితహారంలో భాగంగా 40వేల మొక్కలు నాటాలన్నారు. అడవులు చాలనన్ని అడువులు ఉన్న జిల్లాలో వానలు బాగ కురిసి చెరువులు నిండుతున్నాయన్నారు.అడవులశాతం తక్కువగా ఉన్న రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో వానలు సరిగా కురవడం లేదన్నారు.హరితహారం కార్యక్రమం మొక్కలు నాటి వాటిని భావితరాలకు అందచేయాలన్నారు.మొక్కలునాటడమే కాకుండా వాటిని కాపాడాలన్నారు.మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు.2లక్షల 75వేల మొక్కలునాటినట్లు చెప్పారు.హరితహారం కార్యక్రమంలో స్వచ్ఛందసేవాసంస్థలు ముందుకురావడం అభినందనీయమన్నారు.దేశంలో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం నిర్వహించినట్లు వివరించారు.హరితహారం, మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుచేస్తుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేసుధీర్రెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్పార్టీవాళ్లు రాజకీయం చేస్తున్నారని చెప్పారు,మల్లన్న సాగర్‌ప్రాజెక్టు ద్వారా శామీర్‌పేట్ చెరువును నీటిని నింపి ఆనీటిని గ్రావిటితో ఏదులాబాద్ చెరువును నింపి మండలవాసులకు నీరు అందిస్తామన్నారు.నీటిని రాకుండా చేస్తున్నవారి ప్రయత్నాలను కుట్రలను ప్రతి ఒక్కరు తిప్పి కొట్టాలన్నారు.తెలంగాణలో పచ్చదనం చేయడానికి హరితహారం కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు.యువజన సర్వీసుల విభాగం కమిషనర్ మహ్మద్ అబ్ధుల్ అజీజ్ మాట్లాడుతూ భూమిలో తగినన్ని అడవులు లేకపోవడం వల్ల వాతావరణంలోని ఓజోన్ పొర పలుచబడుతుందన్నారు.దీంతో సరిగా వానలు కురవక అనేక అనర్ధాలు కలుగుతాయన్నారు.మహసముద్రాలు, పర్వతాలు, అడవులు భూమి వాతవరణాన్ని సమతుల్యత ఉంచడానికి తోడ్పాటునుఅందిస్తాయన్నారు.సమావేశంలో స్టెప్ సీఈఓ సీతారామరావు,జడ్పీటీసీ మందసంజీవరెడ్డి,సింగిల్‌విండో డైరెక్టర్ గొంగళ్లస్వామి,ఎంపీడీఓ శోభ,తహసీల్ధారు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ మూసీశంకరన్న,ఎంపీటీసీ మంకంరవి, గోపాల్‌రెడ్డి, వార్డుసభ్యులు మేకల లక్ష్మి, లక్ష్మణ్, కొండమ్మ, నాయకులు రాజేందర్, ధరంకార్ సత్యరామ్, బాలేష్,యుగేందర్, హరిశంకర్, బొక్క ప్రభాకర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, మేకల కుమార్,అబ్బోళ్ల ఇందిరా నాగేష్,మెట్టురమేష్,మురళీ, జీబీఎన్ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పొటో28ఎండీసీ42 ప్రసంగిస్తున్న మంత్రిమహేందర్రెడ్డి, పొటో28ఎండీసీ42ఎ మొక్కలునాటుతున్న మంత్రిమహేందర్రెడ్డి -
ఇబ్రహీంపూర్ సమష్టి కృషికి నిదర్శనం
హరితహారంలో ఇబ్రహీంపూర్ సమష్టి కృషికి నిదర్శనం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చొరవ అభినందనీయం కాంపా నిధులు సక్రమంగా వినియోగం జిల్లాలో అటవీ శాఖ చీఫ్ పీకేజూ పర్యటన సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం లక్ష్యాన్ని సాధిస్తోందని, సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామస్తులు సమిష్టి కృషితో లక్షల మొక్కలు నాటడం అభినందనీయమని రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి (ప్రిన్సిపల్ సీసీఎఫ్ ) పీకేజూ ప్రశంసించారు. బుధవారం ఆయన సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌ను సందర్శించి స్థానిక ఎఫ్ఆర్వో కార్యాలయంలో సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు చొరవతో ఇబ్రహీంపూర్లో ఒకే రోజు లక్ష మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ధేశించిందన్నారు. 3 సంవత్సరాల్లో సాధించాల్సిన 1.20 లక్షల మొక్కల లక్ష్యాన్ని ఇబ్రహీంపూర్ ఈ సంవత్సరమే 2.10 లక్షల మొక్కలతో అధిగమించిందన్నారు. గ్రామంలోని యువకులు స్పూర్తితో గ్రామాన్ని హరితవనంగా మార్చడం అభినందనీయమన్నారు. మొక్కలు నాటడమే కాదని వాటని సంరక్షించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటవీ శాఖకు 17 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ధేశించిందన్నారు. జిల్లాలో 1.36 కోట్ల మొక్కల్ని అటవీశాఖ ఆధ్వర్యంలో నాటేలా లక్ష్యాన్ని నిర్ధేశించామన్నారు. ఇప్పటికే 2 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ కొనసాగిందన్నారు. అదే విధంగా జిల్లాలోని అడవుల సరిహద్దు వెంట 488 కిలోమీటర్ల పొడవునా కందకాలను పూర్తి చేయడం జరిగిందని, మరో 90 కిలో మీటర్లు పూర్తి చేస్తామన్నరు. గజ్వేల్‌లో నిర్ధేశించిన లక్ష్యాన్ని అధిగమించడం జరిగిందన్నారు. ప్రాజెక్ట్‌ల, రహదారుల నిర్మాణానికి అటవీ భూమిని వినియోగించుకున్నందుకు . ప్రతి రూపంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కాంపా నిధులను రాష్ట్రంలో సక్రమంగా వినియోగించేలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఫారెస్ట్ చీఫ్ పర్యటన రాష్ట్ర ఆటవీ శాఖ ఛీప్ పీకేజూ బుధవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ హరితహారం కింద నాటిన మొక్కలను, గ్రామస్తులు సమిష్టిగా తీసిన కందకాలను, ఇంకుడు గుంతలను పరిశీలించారు. అదే విధంగా మర్పడగ నర్సరీ, గజ్వేల్, మీనాజీపేట, కోమటిబండ, బంగ్లా వెంకటాపూర్, నర్సంపల్లిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్లానిటేషన్లను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అయన వెంట అడిషనల్ పీసీసీఎఫ్ రాకేష్ మోమన్ డోగ్రీయా, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్‌రావు, సిద్దిపేట ఎఫ్ఆర్వో వెంకటరామరావు, శ్యాంసుందర్‌రెడ్డి, కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
కేటాయించిన లక్ష్యాన్ని సాధించాలి
హరితహారం సమావేశంలో కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహారంలో శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ లోకేష్‌కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో హరితహారంపై వ్యవసాయం, అటవీ, ఎక్సైజ్ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖలకు ఎన్ని మొక్కలు నాటాలో ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు అధికారులందరూ సమన్వయంతో కషి చేయాలన్నారు. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నాలుగువందల మొక్కలకు ఒక వన సేవకుడి నియమించనున్నట్లు చెప్పారు. మొక్కల సంరక్షణ, వాటి తీరుతెన్నుల వివరాలను తెలుసుకునేందుకు ప్రతినెలా నివేదికలను అందజేయాలన్నారు. ఎన్నెస్పీ కాలువ, మిషన్ కాకతీయ ద్వారా అభివద్ధి చేసిన చెరువుగట్లపై ఈతచెట్లు పెంచేందుకు గాను జిల్లాలకు ఏడు లక్షల విత్తనాలను ప్రత్యేకంగా తెప్పించినట్లు తెలిపారు. ప్రజలు గహాలలో పండ్లమొక్కలను వేసుకోవడానికి, వారు కోరిన వాటిని పంపిణీ చేయాలన్నారు. అటవీ భూముల్లో సామాజిక వనవిభాగం ద్వారా మొక్కలను నాటాలన్నారు. ఈ సమావేశంలో జేసీ దేవరాజన్‌దివ్య, అటవీశాఖ అధికారి నర్సయ్య, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ మణిమాల, ఎక్సైజ్ డీసీ మహేష్, ఇరిగేషన్ ఎస్ఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నెలాఖరులోగా టార్గెట్ పూర్తి చేయాలి
ప్రతి మొక్కను సంరక్షించాలి అడవిని నాశనం చేయిస్తే కఠిన చర్యలు విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల సాక్షిప్రతినిధి, ఖమ్మం హరితహారం కార్యక్రమం కింద జిల్లాలో పెట్టుకున్న లక్ష్యాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం డీసీసీబీ కార్యాలయంలో మొక్కలు నాటిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 2.30 కోట్ల మొక్కలు నాటారని, ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలన్నారు. మొక్కల సంరక్షణకు ఒక్కోదానికి రూ.85లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, సింగరేణి ఆధ్వర్యంలో కూడా రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నామన్నారు. హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. దేశస్థాయిలో చూస్తే జిల్లాలో అటవీ విస్తీర్ణం ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయిందని, దీనికి సామాజిక, రాజకీయ కారణాలు అనేకం ఉన్నాయన్నారు. గిరిజనుల బతుకులను బుగ్గిపాలు చేయవద్దని, సమాజ వ్యతిరేక కార్యకలాపాలను ప్రొత్సహించే పార్టీలు ఏవీ బాగుపడలేదన్నారు. కన్నతల్లి లాంటి అడవిని సంరక్షించుకోవాలని, అడవిని నాశనం చేయాలనే చూసే వారిపై కఠినంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, కలెక్టర్ డీఎస్.లోకేశ్‌కుమార్, జేసీ దివ్య, అటవీశాఖ చీప్ కన్జర్వేటర్ రఘువీర్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు. -
హరితహారంలో భాగస్వాములమవుతాం
ఐనవోలు (వర్ధన్నపేట) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో విద్యుత్‌శాఖ ఉద్యోగుల భాగస్వామ్యంతో మొక్కలు నాటి సంరక్షిస్తామ ని ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ అన్నారు. మండలంలోని ఐనవోలులో విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా సిబ్బందితో కలిసి ఆయనమొక్కలు నాటా రు. సీఎండీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ చేపట్టి న హరితహారంలో ప్రతివ్యక్తి పాల్గొనాలని పిలుపునిచ్చారు. సబ్‌స్టేçÙన్ పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చర్యలు చేపడుతామ ని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ మోహన్‌రావు, డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ నర్సింగరావు, చీఫ్ ఇంజ నీర్ ఆఫ్ ఆపరేషన్ సదన్లాల్, ఎస్ఈ ఆపరేషన్ సదన్లాల్, డీఈ వి జేందర్, ఎంపీపీ మార్నేని రవీందర్రావు, ఏడీఈ పెద్దిరాజం, ఏఈ లక్ష్మణ్‌నాయక్, సర్పంచ్ పల్లంకొండ సురేష్, ఎంపీటీసీ సభ్యుడు బొల్లెపెల్లి మధు, మల్లికార్జునస్వామ ఆలయ ఈవో శేషుభారతి, పాల్గొన్నారు. ం -
లక్ష్యం సాధించిన హరితహారం
వంద శాతం మొక్కలు నాటిన మూడు పంచాయతీలు రామాయంపేట: మండలంలోని మూడు పంచాయతీలు వంద శాతం మొక్కలు నాటి జిల్లాలోనే గుర్తింపు పొందాయి. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చొరవతో మండలంలోని తొనిగండ్ల, చల్మెడ, రాయిలాపూర్ గ్రామ పంచాయతీలు లక్ష్యం సాధించాయి. ప్రతి గ్రామంలో 40 వేలకు తగ్గకుండా మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ మొదలుకొని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో ఆయా పంచాయతీల్లో యుద్ధప్రతిపాదికన మొక్కలు నాటారు. ఈ మేరకు చల్మెడ తిరుమలనాధస్వామి ఆలయంవద్ద ఈనెల 16న ఒకే రోజు 40 వేలకుపైగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ఈగ్రామంలో ఇప్పటికే 50 వేల మొక్కలు నాటారు. ఇంకా మొక్కలు నాటేందుకు నాటడానికి ఆసక్తితో ఉన్నామని గ్రామ సర్పంచ్ నాగరాజు తెలిపారు. తొనిగండ్లలో ఇప్పటికే 41వేలకు పైగా మొక్కలు నాటారు. మరో ఐదువేల మొక్కలు నాటుతామని సర్పంచ్ పిట్ల శ్యామయ్య తెలిపారు. రాయిలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేలకు పైగా మొక్కలు నాటారు. ఇంకా నాలుగైదు వేల మొక్కలు నాటుతామని సర్పంచ్ రామస్వామి పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకరంగా తీసుకున్నాం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకరంగా తీసుకుని గ్రామస్తుల సహకారంతో ఇప్పటికే సుమారుగా 50వేల మొక్కలు నాటాం. 16న వేలాదిమంది ఒకేరోజు 40వేల మొక్కలు నాటారు. మరిన్ని మొక్కలు నాటడానికి ఆసక్తితో ఉన్నాం. – నాగరాజు, చల్మెడ సర్పంచ్ ఇతర గ్రామాలకు ఆదర్శం మొక్కలు నాటే విషయంలో తొనిగండ్ల, రాయిలాపూర్, చల్మెడ గ్రామాలు వంద శాతం ఫలితాలు సాధించడం గర్వకారణం. ఈ గ్రామాలను ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలి. గ్రామస్తులు ఐక్యంగా కృషి చేయడంతోనే ఫలితాన్ని సాధించారు. నాటిన మొక్కలను సంరక్షిస్తేనే సార్ధకత లభిస్తుంది. – పుట్టి విజయలక్ష్మి, ఎంపీపీ, రామాయంపేట వందశాతం ఫలితాలు సాధిస్తాం మండలంలోని మూడు గ్రామాల్లో వందశాతం మొక్కలు నాటడం పూర్తయింది. మిగతా గ్రామాల్లో కూడా వంద శాతం లక్ష్యం సాధించే దిశగా ముందుకెళుతున్నాం. ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందదర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. – రాణి, ఎంపీడీవో, రామాయంపేట పద్మాదేవేందర్‌రెడ్డి సహకారం వల్లే హారితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మొదటినుంచి డిప్యూటీ స్పీకర్ పదే పదే చెప్పడంతో తాము గ్రామస్తులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే గ్రామం పరిధిలో 41 వేలకుపైగా మొక్కలు నాటాం ఇంకా నాటేందుకు గ్రామస్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. – పిట్ల శ్యామయ్య, తొనిగండ్ల సర్పంచ్ -
‘హరీ’త హారం.. ఎంత నిర్లక్ష్యం..!
నీళ్లు అందక వాడిపోతున్న వైనం కానరాని సామాజిక భాగస్వామ్యం నిర్వహణ విస్మరించిన అధికారగణం సిరిసిల్ల : ‘హాలో సార్.. నమస్తే.. ఎక్కడున్నారు?.. నేను మీ ఆఫీస్‌కు వచ్చా’ అనడిగితే.. ‘ ‘ఆ.. నేను హరితహారంలో బిజీగా ఉన్నా.. మొక్కలు నాటుతున్నా.. అందరితోనూ నాటిస్తున్నా’నంటూ అధికారులు సమాధానం చెబుతున్నారు. లక్షల మొక్కలు నాటాలనే సదుద్దేశంతో అధికారులేకాదు.. ప్రజాప్రతినిధులు, అన్నివర్గాలూ హరితహారం విజయవంతం కోసం శ్రమిస్తున్నారు. కానీ నాటిన మొక్కల నిర్వహణ విస్మరిస్తున్నారు. ఫలితంగా అవన్నీ నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఓ వైపు అధికారులు మొక్కలు నాటుకుంటూ వస్తుంటే.. మరోవైపు నాటిన మొక్కలు నీళ్లుఅందక వాడిపోతున్నాయి. వాటికి రక్షణ లేక పోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. సిరిసిల్ల కళాశాల మైదానంలో ఇటీవల అధికారులు మొక్కలు నాటారు. వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో పశువులు మేసేశాయి. పందులు పీకేశాయి. సిరిసిల్ల ప్రాంతంలో సుమారు 40లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. సంరక్షణపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడంతో వాడిపోయి నేల కూలుతున్నాయి. స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలోని మొక్కలే ఇందుకు ఉదాహరణ. హరితహారం ద్వారా మొక్కలు నాటుతున్నా.. రక్షణ లేక అవి బతకలేక ‘హరీ’మంటున్నాయి. సిరిసిల్ల రెవెన్యూ, ఫారెస్ట్, మున్సిపల్, ఇరిగేషన్, మండల పరిషత్, ఐసీడీఎస్, విద్యా, వైద్యం, సామాజిక వనాలు, ఆర్టీసీ, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, పంచాయతీరాజ్.. ఇలా అన్ని శాఖలు ఎవరికి వారు హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపడుతుండగా.. మొక్కలను బతికించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో హరితహారం లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పటికైనా అధికారులు నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
హరితహారంపై నిర్లక్ష్యం వీడాలి
డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి కుల్కచర్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని డీఆర్డీఏ పీడీ, మండల ప్రత్యేకాధికారి సర్వేశ్వర్‌రెడ్డి అన్నారు.మంగళవారం మండల అభివృద్ధి కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో తప్పకుండా 40 వేల మొక్కలు నాటాలని సూచించారు.ముఖ్యంగా సెక్టోరియల్ అధికారులు రోజూ పర్యవేక్షణ చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్డ్, పట్టా భూముల్లో మొక్కలు నాటాలని సూచించారు. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తీయించాలని ఉపాధిహామీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్‌బాబు, ఏపీఓ చారి, ఏఓ పాండు, ఏపీఎం శోభ, అటవీశాఖ అధికారి పర్వేజ్ ,విద్యాధికారి అబీబ్‌హమ్మద్, డిప్యూటీ తహసీల్దార్ అశోక్, ఆర్ఐ యాదయ్య పాల్గొన్నారు. -
మొక్కలు నాటిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
‘హరితహారం’ విజయవంతం చేయండి నవాబుపేట: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నరేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని మూలమాడలో మంగళవారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగమే హరితహారం కార్యక్రమమన్నారు. మొక్కలు విరివిగా పెంచి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పోలీస్ రాంరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ సుభాన్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ డెక్క మాణెయ్య, నాయకులు రాములు, మోహన్‌రెడ్డి, నరెందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కొనసాగుతున్న హరితహారం
హుజూర్నగర్ : హరితహారంలో భాగంగా పట్టణంలో సోమవారం పడిగరాయిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవాలయం సమీపంలో ఎన్ఎస్పీ కాల్వ కట్టపై అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. పట్టణంలోని 9, 11 వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ రవి, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఎన్ఎస్పీ ఏఈలు నరేష్, మౌనిక, వర్క్ ఇన్స్పెక్టర్లు కోటయ్య, వెంకటేశ్వర్లు, ఉపేందర్, కౌన్సిలర్లు రవినాయక్, పుల్లయ్య, కిరణ్‌కుమార్, నాయకులు కామిశెట్టి రవికుమార్, ఉప్పల విజయలక్ష్మి, కుక్కడపు కాశయ్య, వీరభద్రం, కృష్ణారెడ్డి, సైదులునాయక్, కృష్ణ, బాబూరావు, యోహాన్, చంటి పాల్గొన్నారు. -
లక్ష్యాన్ని చేరుకోవాలి
రాంనగర్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ డాక్టర్ యన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ఉన్నందున జిల్లాలో ఇప్పటి వరకు హరితహారం కింద నాటిన మొక్కల పూర్తి వివరాలతో హాజరుకావాలని అధికారులకు సూచించారు. నాటిన ప్రతి మొక్క వివరాలను పూర్తిస్థాయిలో క్రోడీకరించి సేకరించాలని నియోజకవర్గ ఇన్చార్జి అధికారులను కోరారు. 65వ జాతీయ రహదారి వెంట నాటిన ప్రతి మొక్కకు 30 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి మొక్కలను సంరక్షిస్తున్నట్లు వివరించారు. వర్షాలుపడని చోటట్యాంకర్లను ఉపయోగించి నీటిని సరఫరా చేసి మొక్కలను కాపాడాలని సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమ అమలు జరుగుతున్న విధానంపై ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు. అధికారులు అప్రమత్తతో పనిచేసి జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొన్ని శాఖల్లో ఇంకా మందకొడిగా పనులు నడుస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినందున వెంటనే సంబంధిత శాఖల అధికారులు పనులు వేగవంతంగా చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు నాటిన ప్రతి మొక్కను సంరంక్షించడానికి ఫెన్సింగ్ 15 శాతం మాత్రం జరిగిందని, మిగతా పనులు వేగవంతం చేసి ఫెన్సింగ్‌ను ప్రతి మొక్కకు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, డీఆర్వో రవి, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డ్వామా పీ.డీ. దామోదర్‌రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
హరితహారంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : మానవాళి మనుగడకు చెట్లు ఎంతో ఉపయోగపడుతాయని కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చెట్లను నరికివేయకుండా చూసుకోవాలని, హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలని అన్నారు. నీడనిచ్చే మొక్కలతో పాటు ఫలాలనిచ్చే మొక్కలు నాటుకోవాలని సూచించారు. దానిమ్మ వల్ల సి విటమిన్ లభిస్తుందని, హైబ్రీడ్ జాతికి చెందిన మొక్కలు ఒక సంవత్సరంలోనే ఫలాలనిస్తాని తెలిపారు. ఉసిరి, కరివేపాకు మొక్కలు నాటుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా హరితహారం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్షి్మనారాయణ, ఐసీడీఎస్ పీడీ జ్యోత్సS్న, ఏపీడీ ఝాన్సీలక్షి్మబాయి, డీసీపీఓ నర్మద, సీడీపీఓలు ఎన్ఐసీ రాములు, శిశుగృహ మేనేజర్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ మంత్రా.. మజాకా..!
ఆకస్మిక తనిఖీ భోరజ్–సిర్సన్నలో మొక్కలను పరిశీలన.. నిర్లక్ష్యం వీడాలని అధికారులకు క్లాస్ జైనథ్ : రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సోమవారం అధికారులను హడలెత్తించారు. ఆయన ఆకస్మికంగా మండలంలోని భోరజ్–సిర్సన్న పీఆర్ రోడ్డు వెంట ఇటీవల హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. రోడ్డు వెంట నడుస్తూ.. మొక్కల పరిస్థితిపై అధికారులను అడదిగారు. ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? ఇంకా ఎన్ని నాటాలి? అని పీఆర్ ఏఈ నారాయణ, ఈజీఎస్ ఏపీవో ఆంజనేయులులను ప్రశ్నించారు. మొత్తం 1600 మొక్కల్లో 600 నాటామని, ఇంకా వెయ్యి త్వరలోనే నాటుతామని వారు మంత్రికి వివరించారు. కొన్ని గుంతల్లో మొక్కలు నాటకుండా వదిలి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇరువైపులా 33 ఫీట్ల వెడల్పుతో మొక్కల నాటాలని చెబుతున్నా కూడా 20–24 ఫీట్లలో మొక్కలు నాటడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రోడ్డును విస్తరిస్తే మొక్కల పరిస్థితి ఏమిటని? ముందు చూపు, పక్కా ప్రణాళికలు లేకుండా మొక్కలు నాటడం వెనక అధికారుల ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. చిన్న మొక్కలు నాటొద్దని ఆదేశాలు జారీ చేసినా పెడచెవిన పెట్టారని అన్నారు. నాటిన మెుక్కలకు ముళ్ల కంచె ఏర్పాటు చేయకపోవడంపై అధికారులను తీవ్రంగా మందలించారు. ‘ఇష్టం ఉంటే పనిచేయండి.. లేదంటే మానేయండి.. అంతేకాని హరితహారంపై నిర్లక్ష్నాన్ని సహించేది లేదు..’ అని స్పష్టం చేసారు. మంత్రి వెంట జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, నాయకులు ముడుపు దామోదర్‌రెడ్డి, అడ్డి భోజారెడ్డి, ఇజ్జగిరి అశోక్, రాజన్న, కోల పరమేశ్వర్, తదితరులు ఉన్నారు. -
బాధ్యతగా భావించి మొక్కలు నాటాలి
ఆదిలాబాద్ టౌన్ : మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల భావితరాలకు ఎంతో దోహదపడుతాయన్నారు. మానవాళికి అవసరమయ్యే ఆక్సిజన్ విడుదల చేసి పర్యావరణాన్ని కాపాడుతాయన్నారు. నాటిన మొక్కలను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, కమిషనర్ అలివేలు మంగతాయారు, టీఆర్ఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బాలురి గోవర్ధన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాజిదోద్దిన్, కౌన్సిలర్ జయశ్రీ, రైల్వే ఏఈ చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు. -
హరితహారం ప్రజలకు ఓవరం లాంటిది
హాలియా: హరితహారం తెలంగాణ ప్రజలకు ఓ వరం లాంటిదని ప్రజలందరూ ఐక్యమత్యంగా మొక్కలు నాటాలని టీఆర్ఎస్ నాగార్జునసాగర్ ఇన్చార్జ్ నోముల నర్సింహ్మయ్య అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఇబ్రాహింపేట పరిధిలోని సంతోష్‌నగర్‌లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హారితహారం కార్యక్రమని మొక్కలు నాటడంతో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని తద్వారా బంగారు తెలంగాణకు బాటలు వేసినట్లేనన్నారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ భాధ్యతపై అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి సంరక్షణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఆప్కాబ్ ఛైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, ఎం.సి కోటిరెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, యడవల్లి మహేందర్‌రెడ్డి, ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, కూరాకుల వెంకటేశ్వర్లు, చవ్వా బ్రహ్మానందరెడ్డి, నల్లబోతు వెంకటయ్య, చాపల సైదులు, రుద్రాక్షి మహేశ్, పోషం శ్రీనివాస్‌గౌడ్, ఎన్నమల్ల సత్యం, సురభి రాంబాబు, అబ్దుల్ హలీం పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. -
మొక్కల పెంపకంతో కాలుష్య నివారణ
కమ్మర్పల్లి : కంకర మిషన్ ప్రాంగణాల్లో మొక్కలు నాటి. కాలుష్యాన్ని నివారించాలని గనుల శాఖ (మైన్స్) డిప్యూటీ డైరెక్టర్ కె.యాదగిరి సూచించారు. హరితహారంలో భాగంగా శనివారం మండల కేంద్ర శివారులోని కంకర మిషన్ వద్ద ఆయన మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మైన్స్ ఏడీ సైదులు, టెక్నికల్ అసిస్టెంట్ నర్సింగ్ రమేశ్, సాయిరాం, సీనియర్ అసిస్టెంట్ గోవర్ధన్, జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్, కంకర మిషన్ నిర్వాహకుడు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పల్లె పచ్చగుండాలి : మంత్రి జూపల్లి
అలంపూర్‌రూరల్: బంగారు తెలంగాణ ఆవిర్భవించాలంటే గ్రామగ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని మంత్రి జూపల్లికృష్ణారావు అన్నారు. శనివారం టీఆర్ఎస్ తాలూకా ఇన్చార్జ్ మంద శ్రీనాథ్ ఆధ్వర్యంలో జరిగిన హరితహారం కార్యక్రమమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా బస్టాండ్, కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున కదలివచ్చి చెట్ల ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మందజగన్నాథం, ఆర్డీఓ అబ్దుల్ హమీద్, సీఐ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ మల్లికార్జున్, తహసీల్దార్ మంజుల, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ టి.నారాయణరెడ్డి, సర్పంచ్ జయరాముడు, స్థానిక ఎస్ఐలు పర్వతాలు, గిరీష్‌కుమార్, టీఆర్‌ఎస్‌అధ్యక్షుడు మహేష్‌గౌడ్, నాయకులు విక్రమ్‌సేనారెడ్డి,ఆత్మలింగారెడ్డి, వడ్డేపల్లి శ్రీనివాసులు ఉన్నారు. -
హరితహారానికి ఇరాన్ కాన్సులెట్ ప్రశంసలు
అనంతపద్మనాభ స్వామి సన్నిధిలో కాన్సులెట్ జనరల్ నౌరియన్ కుటుంబసభ్యులు వికారాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం చాలా బాగుందని ఇరాన్ కాన్సులేట్ జనరల హాసన్ నౌరియన్ ప్రశంసించారు. రెండు రోజుల పాటు అనంతగిరిలో కుటుంబసమేతంగా గడిపేందుకు వచ్చిన ఆయన హరిత రిస్టార్స్‌లో బస చేశారు. శనివారం ఉదయం కుటుంబసమేతంగా అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. హరితహారం చేపట్టడం మంచి పరిణామమని కొనియాడారు. ప్రధాని నరేంద్రమోదీ మంచి పాలన దీక్షుడని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా పేరుతో లక్షలాది కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇరాన్‌కు భారతీయులకు మధ్య బేధాలు పెద్దగా ఉండవన్నారు. ఇరాన్ రాయబార కార్యాలయాలు దేశంలో మూడు ప్రాంతాల్లో ఉన్నాయని ఇవి ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, వైజ్ఞానిక, సాంస్కృతిక సహకారాన్ని ఎప్పటికప్పుడు అందించుకుంటూ పనిచేస్తాయని తెలిపారు. నరేంద్రమోదీ ఇరాన్ వచ్చినప్పుడు తమ దేశం ఘన స్వాగతం పలికిందని, ఇరాన్ ప్రధాని ఇక్కడి కూడా వచ్చారని గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇంకా మెరుగయ్యాయని తెలిపారు. ఇరాన్లో తొంబై శాతానికి పైగా ముస్లింలే ఉంటారని చెప్పారు. భారతదేశంలో వివిధ రకాల భాషలు, కులాలు, సంస్కృతుల ఉన్నా ఐకమత్యంగా ఉంటారని తెలిపారు. -
ప్రతీ మొక్కను సంరక్షించాలి
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి రామన్న మెుక్కలు నాటిన మంత్రి, ఎమ్మెల్యే, పీవో ఇంద్రవెల్లి : హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. హరితహారంలో భాగంగా శనివారం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి మండలంలోని ముత్నూర్ గ్రామ సమీపంలో ఉన్న త్రివేణి సంఘం చెరువు కట్టపై మెుక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులు అంతరించి చెట్లు లేకపోవడంతో వర్షాలు సరిగా పడక పర్యావరణం కలుషితమవుతోందని తెలిపారు. ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్, ఉట్నూర్ ఆర్డీవో ఐలయ్య, ఎంపీపీ జాదవ్ మీరాబాయి, జెడ్పీటీసీ సభ్యురాలు దేవ్‌పూజే సంగీత, ముత్నూర్ సర్పంచ్ తుమ్రం తారమతి, తహసీల్దార్ ఆజ్మీర శంకర్‌నాయక్, ఎంపీడీవో బానోత్ దత్తారాం, ఎఫ్ఆర్వో శివకుమార్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుపీయన్ తదితరులు పాల్గొన్నారు. రాథోడ్ కలప తరలించారు.. మేము మొక్కలు నాటుతున్నాం మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అక్రమంగా కలప తరలిస్తే.. అడవిని పెంచడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి రామన్న విమర్శించారు. అటవీ సంపదను తరలించిన ఆయనకు హరితహారం కార్యక్రమాన్ని విమర్శించే హక్కు లేదని అన్నారు. మార్కెట్ కమిటీ ఏడీపై మంత్రి ఆగ్రహం జన్నారం : ‘మార్కెట్ యార్డు ఆవరణలో మెుక్కలు నాటేందుకు వచ్చిన విద్యార్థులతో మెుక్కలు ఎందుకు నాటించలేదు.. హరితహారం అంటే తమాషాలా అనిపిస్తుందా..’ అంటూ మంత్రి రామన్న జన్నారం మార్కెట్ కమిటీ ఏడీ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే విద్యార్థులతో మెుక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, ఎంపీపీ చెటుపల్లి రాజేశ్వరి, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, డీఎఫ్‌వో రవీందర్, ఎంపీడీవో రమేశ్, ఎంపీటీసీ సభ్యులు జ్యోత్సS్న, సుమలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రాజరాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కపెల్లి, వైస్ చైర్మన్ సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హరితహారంలో భాగస్వాములు కావాలి
కొండమల్లేపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో దేవరకొండ మండలం చింతకుంట్లలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి, సర్పంచ్ శవ్వ యాదమ్మవెంకటయ్య, వైస్ చైర్మన్ నల్లగాసు జాన్‌యాదవ్, ఎక్సైజ్ సీఐ జిలానీ, ఎస్ఐ పరమేశ్వర్‌గౌడ్, నాయకులు శిరందాసు కృష్ణయ్య, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, పస్నూరి వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. -
ఊరూరా హరితహారం
గ్రామ పంచాయతీలకు బాధ్యులను కేటాయిస్తాం వీసీలో కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: మొక్కలు నాటడం, వాటి రక్షణ, పెంపకం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించాలని, ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం హరితహరం పురోగతిపై మండలాల వారీగా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గ్రామ, మండల స్థాయి అధికారులు సూక్ష్మస్థాయిప్రణాళికను రూపొందించుకొని మొక్కలను నాటించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి బాధ్యులను కేటాయిస్తామని, నాటిన మొక్కలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయించి రక్షించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. రోడ్లకు ఇరువైపులా, పొలాల గట్ల వెంట, కమ్యూనిటీ స్థలాలు, శ్మశానవాటికలు, చెరువుగట్లపై మొక్కలు వేసేందుకు సామాజిక వన విభాగం నర్సరీలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటి ఆవరణలో వేసుకునేందుకు ప్రతి ఇంటికి ఒక మామిడి, కొబ్బరి, మునగ, నేరేడు వంటి మొక్కలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డ్వామా నుంచి 25లక్షల టేకు మొక్కలను పంపిణీ చేశామని, 10 లక్షల మొక్కలు నాటించాలని సూచించారు. అదనంగా టేకు, పండ్ల మొక్కలను రెండు రోజుల్లో సరఫరా చేయనున్నట్లు వివరించారు. మొక్కల రవాణాకు ప్రతి మండలానికి రూ.20 వేలు విడుదల చేస్తున్నామని, కార్యక్రమ తీరును రాష్ట్ర, జిల్లా అడిట్ బృందాలు తనిఖీ చేస్తాయని తెలిపారు. వ్యక్తిగత మరుగుడొడ్లకు సంబంధించి గతంలో ఆర్డబ్ల్యూఎస్ నుంచి జిల్లాలో 17 వేల మరుగుదొడ్లు మంజూరు కాగా, ఎనిమిది వేలు పూర్తయ్యాయని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఆర్డబ్ల్యూఎస్ నుంచి 13 వేలు, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి 46 వేల మరుగుదొడ్లను మంజూరు చేసినట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటి సీఈఓ కర్నాటి రాజేశ్వరి పాల్గొన్నారు. -
హరితహారాన్ని అంతా మెచ్చుకుంటున్నారు..
అర్వపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విదేశీయులు కూడా ప్రశంసిస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. గురువారం అర్వపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో అమెరికా దేశస్తులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 5 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. అమెరికాలోని ఎల్డీఎస్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డార్లా న్యూటన్, లారెన్స్ న్యూటన్ మనోహర్ బేకరా, ట్రస్ట్ కోర్డినేటర్ శేఖర్ అలమూరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం ఎంతో బాగుందని కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాశం విజయయాదవరెడ్డి, ఎంపీపీ దావుల మనీషావీరప్రసాద్, వైస్ చైర్మన్ గుజ్జ యుగేందర్‌రావు, జడ్పీటీసీ సంద అమల, వైస్ ఎంపీపీ బొడ్డు వెంకన్న, గుండగాని అంబయ్య, తహసీల్దార్ పులి సైదులు, ఎంపీడీఓ శిరీష తదితరులు పాల్గొన్నారు. -
హరితం.. క్షేమకరం
పంచాయతీరాజ్ శాఖ ఈఈ మనోహర్‌రావు మర్పల్లి: హరతిహారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పంచాయతీరాజ్ శాఖ ఈఈ మనోహర్‌రావు పిలుపునిచ్చారు. మండలంలోని రావులపల్లి గ్రామంలో ఎంపీపీ సుమిత్రమ్మ, సర్పంచ్ నాద్రీగ కమలమ్మ, ఎంపీడీఓ దత్తాత్రేయరాజు, పాఠశాల విద్యార్థులతో కలిసి గురువారం ఆయన మొక్కలు నాటారు. ముందుగా గ్రామంలోని పీతాంబరేశ్వర ఆలయం వద్ద 100 చింత చెట్లు, రావులపల్లి నుంచి మర్పల్లికి వెళ్లే పంచాయత్ రాజ్ రోడ్డు ప్రక్కల వేర్వేరు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకొనేందుకు వెంటనే మొక్కల చుట్టూ కంచె నాటాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. నేడు నాటిన ప్రతి మొక్క భవిష్యత్తులో మహావృక్షాలుగా మారుతాయన్నారు. దీంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. చెట్లు వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుమిత్రమ్మ, సర్పంచ్ నాద్రీగ కములమ్మ, డీఈ రాజ్‌కుమార్, ఏఈ శ్రీనివాసులు, ఎంపీడీఓ దత్తాత్రేయరాజు, ఈఓపీఆర్డీ అశోక్‌కుమార్, ఏపీఓ శంకర్, ఏపీఎం మధుకర్, వైస్ ఎంపీపీ అంజయ్యగౌడ్, నాయకులు నారాయణ్‌రెడ్డి, రమేష్సాగర్, జైపాల్, శ్రీకాంత్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, పంచాయత్‌రాజ్ డివిజన్ సిబ్బంది రాజశేఖర్, జగన్మోహన్రెడ్డి, సాక్షర భారత్ మండల కో ఆర్డినేటర్ రాజు, పంచాయతీ కార్యదర్శి సంగారెడ్డి, ఫారెస్టు సెక్షన్ అధికారి వెంకటేశ్వర్లు గ్రామస్తులు, విద్యార్థులు ఉన్నారు. -
మొక్కలు నాటిన ఎస్పీ దుగ్గల్
ఆదిలాబాద్ క్రై ం : జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ బాలుర పాఠశాలలో ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ బుధవారం మొక్కలు నాటారు. పాఠశాల విద్యార్థులు బ్యాండ్‌మేళాలతో ఎస్పీకి స్వాగతం పలికారు. పాఠశాలలో 500 మొక్కలు నాటే కార్యక్రమానికి ఎస్పీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో ప్రజలు రక్తహీనతతో బాధపడుతున్నందున హరితహారం కార్యక్రమంలో గిరిజన గ్రామాల్లో పోలీసులు మునగచెట్లు నాటుతున్నారన్నారు. మునగచెట్ల పెంపకంతో రక్తహీనత బాధితులకు మేలు జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రతీహాస్టల్‌లో పోలీసులు మునగచెట్లు నాటాలని ఆదేశించారు.గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, వైస్‌ప్రిన్సిపాల్ సతీశ్‌కుమార్, వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఏఎసై ్స అప్పారావు, విద్యార్థులు పాల్గొన్నారు. -
శ్మశానవాటికలో మెుక్కలు నాటిన ఎస్పీ
ఆదిలాబాద్ కల్చరల్: ప్రతి ఒక్కరూ సమాజంలో బాధ్యతాయుతంగా మొక్కలు నాటాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంకోలిరోడ్‌లో గల క్రిస్టియ్ శ్మశాన వాటికలో హరితహరం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌దుగ్గల్ ముఖ్యఅతిథిగా హజరై శ్మశాన వాటిలో మొక్కలు నాటారు. ఇందులో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి, జోగుపౌండేషన్ చైర్మెన్ ప్రేమెందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ సాజిదోద్దిన్, మావల సర్పంచ్ ఉష్కం రఘుపతి, తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు బట్‌రాజ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలం దివాకర్,బాస్కర్, పిల్లా ప్రవీన్, ఆలం రూప, డెవిడ్, సతీష్ తదితరులు ఉన్నారు. -
ఉపాధి సిబ్బందిపై డ్వామా పీడీ ఆగ్రహం
హరితహారంలో మొక్కలు నాటిన వాటిపై కాకిలెక్కలు చ్పెప్దొదని హెచ్చరిక తాండూరు రూరల్: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడంపై కాకిలెక్కలు చెప్పవద్దని ఉపాధి సిబ్బందిపై డ్వామా పీడీ హరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలోని ఠాగూర్‌హాల్లో ఎంపీడీఓ జగన్మోహన్రావు ఆధ్వర్యంలో ఉపాధి హామీ సిబ్బందితో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమాన్ని నీరుగారిస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఎన్ని మొక్కలు నాటారో వివరాలు వెల్లడించాలని ఫీల్డ్ అసిస్టెంట్లను కోరారు. తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆమె ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమం అంటే మీకు తమాషాగా ఉందా..? అని హెచ్చరించారు. నెలరోజుల నుంచి కార్యక్రమంపై చెబుతూనే ఉన్నా.. మీ పద్ధతి మార్చుకోవడం లేదన్నారు. గ్రామాల్లో ఎన్ని గుంతలు తవ్వారు? ఎన్ని మొక్కలు నాటారు..? అనే విషయాలపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం మండలం మొత్తంపై నివేదిక ఇవ్వాలని ఏపీఓ శారదను కోరారు. ఆమె కూడా తప్పుడు నివేదిక ఇవ్వడంతో స్టోరీలు చెప్పొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ తప్పుడు లెక్కలే చెబుతున్నారని ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లపై అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి పనులను విస్మరిస్తే ఊరుకునేది లేదు బషీరాబాద్: గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని డ్వామా పీడీ హరిత ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి అధికారులు, సిబ్బందితో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల వారీగా హరితహారం కార్యక్రమంపై సిబ్బందితో సమీక్షించారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడంపట్ల చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఉపాధి సిబ్బందిపై మండిపడ్డారు. పాఠశాలల్లో ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారని అడిగి తెలుసుకున్నారు. వన నర్సరీల్లో నుంచి తరలించిన మొక్కలను నాటారా? లేదా? అనే విషయమై విచారణ జరుగుతుందన్నారు. హరితహారం మొక్కలు నాటినట్లు తప్పుడు నివేదికలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నాటిన మొక్కలను పరిరక్షించేలా అధికారులు, సిబ్బంది చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, ఎంపీడీఓ ప్రమీల, ఏపీఓ జనార్ధన్, అటవీశాఖ బీట్ అధికారి జర్నప్ప, ఏపీఎం చినశేఖర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
మొక్కలు నాటిన హోంమంత్రి
⇒ గత పాలకులు చెట్లు నాటకపోవడం వల్లె రాష్ట్రంలో దుర్భిక్షం ⇒ మొక్కలు నాటని వారు సమాజ వ్యతిరేకులు ⇒ హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి మేడ్చల్: గత పాలకులు రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటకపోవడం వల్లే నేడు తెలంగాణ దుర్భిక్ష పరిస్థితులు నెలకున్నాయని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అన్నారు. ఆయన పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ, కండ్లకోయలోని మేడ్చల్ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో బుధవారం హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తో కలిసి మొక్కలు నాటారు. ఈసంధర్భంగా ఐటిఐలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకులు చెట్లను నరికారె గాని నాటలేదని ఆరోపణలు చేశాడు.ముఖ్యమంత్రి కేసీఆర్ దూర ఆలోచనలు చేసి నాటి చక్రవర్తి అశోకుడి లా రాష్ట్రంలో మొక్కలు నాటడానికి ఉద్యమంలా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నాడు.ఇంటికోక మొక్క తప్పనిసరిగా నాటాలని మొక్క నాటని వారు సమాజవ్యతిరేకులని అన్నారు.అందరు భాగస్వాములై మొక్కలు నాటితే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని అన్నాడు. రాష్ట్రంలో చేడుతున్న పనుల వల్ల ప్రపంచం తెలంగాణ వైపు చూస్తుందని త్వరలో హరితహారం కార్యక్రమం గిన్నిస్ బుక్కులో చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.మిషన్ భగీరధ కార్యక్రమాన్ని ప్రధాని మోడి అగస్టు 7న గజ్వెల్లో ప్రారంబిస్తారని ఆయన చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో 40 వేల మొక్కలు నాటారని, ఐటిఐలలో లక్ష మొక్కలు, కార్మిక శాకలో మూడు లక్షల మొక్కలు నాటాలని అన్నారు. మేడ్చల్ ఐటిఐ తీరు పై నాయిని ఆగ్రహం.. మేడ్చల్ ఐటిఐ తీరుపై హోం,కార్మిక ఉపాది కల్పన శాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లాలు ను చూసి ఇళ్ళు ను చూడు అన్న చందంతో ఐటిఐ ప్రిన్సిపాల్ శైలజను పోల్చారు. ఐటిఐ ప్రధాన గేటు నుండి భవనం వరకు కంకర తేలిన రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో రోడ్డె బాగు చేయలేని అధికారులు పిల్లలకు చదువులు ఏం చెబుతారంటూ అగ్రహం వ్యక్తం చేశారు. రూ.4 లక్షల మంజూరీ కోసం అర్జి పెట్టకున్నామని శైలజ వివరిస్తుండగా 4లక్షల నిధులు సమకూర్చకోకపోతే ఎలా అంటూ అక్కడే ఉన్న ఉపాధికల్పన డైరక్టర్ నాయక్‌ను ప్రశ్నించారు.వెంటనే నిధులు విడుదల చేసి రోడ్డు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఐటిఐలో ఖాళీగా ఉన్న 22 పోస్టులను మంజూరీ చేస్తామని హమీ ఇచ్చారు. పీఎస్‌కు ఐటిఐలో ఎకరం స్థలం కేటాయించా మేడ్చల్ పోలీస్‌స్టేషన్ ఇరుకైన ప్రదేశంలో శిధిల భవనంలో కోనసాగుతుందని హోంమంత్రి దృష్టి సారించి నూతన భవనానికి నిధులు మంజూరీ చేసి భవనాన్ని నిర్మించడానికి ఆయన చూస్తున్న ఉపాధి కల్పన శాఖ ఆధీనంలో ఉన్న ఐటిఐ స్థలంలో ఎకరం ను పోలీస్‌స్టేషన్‌కు కేటాయించాలని కోరారు.చూస్తానని హోమంత్రి చెప్పారు. మేడ్చల్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలంతా మంత్రులయ్యారని సుధీర్‌రెడ్డి సైతం మంత్రి అవుతారమె అంటూ సెటర్లు వేశారు.ఎమ్మెల్యే లు ఎంతబాగా హరితహారంలో పాల్గొని అధిక చెట్లు పెడితే అన్ని అధిక నిధులు ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని అంటూ విషయాన్ని గుర్తు చేశారు.కార్యక్రమంలో ఎల్టీఎఫ్ ప్రిన్స్‌పల్ సెక్రటరీ అహ్మద్ నవీద్, ఉపాధి కల్పన శాఖా డైరక్టర్ కె.వై నాయక్, ఎంపీపీ విజయలక్ష్మీ, జెడ్పీటీసీ జెకె శైలజ, మార్కెట్ కమిటీ చైర్మెన్ సత్యనారయణ, ఎంపీడీఓ దేవసహయం,తహసిల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, నగరపంచాయతీ కమిషనర్ రాంరెడ్డి,టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
గిరిజనులకు ‘ఉరి’ హారం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా గిరిజనులను బ్రతకనివ్వరా, వారిని బజారుపాలు చేస్తారా అనే ప్రశ్న ఎదురవుతోంది. అనుభవిస్తున్న భూములకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా హరితహారం పేరుతో లాక్కుంటే ఎలా? మానవులు తమకు ఊహ తెలిసినప్పటి నుంచి భూమిని దుక్కి చేసి పంటలు పండించే ప్రక్రియకు పూను కున్నారు. ప్రకృతి పచ్చదనా నికి నిదర్శనం. పర్యావరణ సమతుల్యం లోపిస్తే జీవరాశుల ఉనికికే ప్రమాదం. అందులో సగటు మనుషులు తగిన ఆహారం లేకుండా జీవించజాలరు. రుతువులు సరిగా పనిచేయకుంటే అధిక వర్షాలు, కరువులు సంభవిస్తుంటాయి. అందుకని కనీసం 40 శాతం భూమిలో అడవి, నదులు, గుట్టలు ఉండటం సమంజసం. భూముల వర్గీకరణను ఎవరు ఏ ప్రాతిపదికన చేశారనేది ప్రధాన ప్రశ్న. రాచరిక వ్యవస్థలో భూము లపై హక్కుకు సంబంధించి రికార్డులు రూపొందించి, సర్వే నంబర్లు, రెవెన్యూ భూములుగా నమోదు చేశారు. రెవెన్యూ భూములలో ప్రభుత్వశిఖం, కారజు కాతా, దేవాదాయ, వక్ఫ్, ఇనాం తదితర సబ్ క్లాజు లుగా ప్రభుత్వాలు గుర్తించాయి. ఆ తర్వాత అసైన్ మెంట్, భూసంస్కరణ, అటవీ భూముల హక్కుల చట్టాలను ప్రభుత్వాలు తెచ్చాయి. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడు స్తున్నా ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అటవీ, రెవెన్యూ హద్దుల సమస్య వివాదాస్పదంగానే మిగిలిపోయింది. రెవెన్యూవారు లబ్ధిదారులకు పట్టా సర్టిఫి కెట్లు ఇస్తారు. అటవీశాఖ వారు అడ్డుతగులుతారు. మధ్యలో నిరు పేద రైతు నలిగిపోతున్నాడు. ముఖ్యమంత్రుల దృష్టికి తెచ్చినా వారు ప్రత్యేక కృషి చేయలేదు. ఇప్పటికీ ఈ అంశం జటిలంగా, కొరకరాని కొయ్యగా మారింది. గత 30 సంవత్సరాల నుంచి అనేక గిరిజనులతో పాటు ఎస్సీ, బీసీలు కూడా ప్రభుత్వ భూములను చదునుచేసుకొని పోడు వ్యవసాయం ద్వారా జీవనో పాధి గావించుకుంటున్నారు. ఇలా సుమారు 10 లక్షల ఎకరాల పోడు భూములలో సాగు చేయబడుతున్నది. యూపీఏ-1కు వామపక్షాలు బయటి నుండి మద్దతిచ్చిన సందర్భంలో 2006లో అటవీ భూముల హక్కుల చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. 10 సంవత్సరాల నుంచి కాస్తులో ఉండి, అనుభవిస్తున్న వారికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఉత్తర్వులు వెలువ డ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో పట్టాలివ్వడానికి సర్వేలు జరిగినా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఒకవైపు తెలంగాణ ఉద్యమం, సంక్లిష్ట రాజకీయ నేపథ్యంలో అవి పెండింగ్‌లో ఉండిపో యాయి. 2014 జూన్ 2న కొత్త తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అటవీ భూముల చట్టప్రకారం గిరిజనులకు సర్టిఫికెట్లు ఇస్తా రని భావించారు. కానీ దానికి భిన్నంగా కేసీఆర్ ప్రభుత్వం ‘‘హరిత హారం’’ పేరుతో పేదల భూములు లాక్కో వడానికి అటవీశాఖ, పోలీసు శాఖలను ఉసికొల్పింది, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు పూనుకున్నది. ఖమ్మం, వరంగల్, మహబూ బ్‌నగర్, నల్లగొండ, అదిలాబాద్ తదితర జిల్లాలలోని గిరిజనుల భూము లను బలవంతంగా లాక్కొంటూ మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టింది. తాత, తండ్రుల నుండి సాగు చేసుకున్న భూములను ఎలా లాక్కుంటారని, అన్యా యమని ఎదురు తిరిగిన పేదలపై పీడీ యాక్టు తదితర సెక్షన్ల కింద కేసులు పెట్టి రోజుల తరబడి జైళ్ల పాలు చేసింది. గతంలో ఇలా జరిగినపుడు వామపక్షాలు ఐక్యం గాను విడివిడిగాను ఉద్యమబాట పట్టాయి. అసెం బ్లీలో చర్చ జరిగింది. కాస్తు చేసుకొని బ్రతుకుతున్న పేదల జోలికి అధికారులు వెళ్ళరని ముఖ్యమంత్రిగారే స్వయంగా నిండు అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయినప్పటికీ గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. అసెంబ్లీలో వాగ్దానం చేసి సంవత్సరం గడిచి నప్పటికీ గిరిజనులపై కేసులను ప్రభుత్వం ఉపసం హరించుకోలేదు. ఈసారి హరితహారం సందర్భంగా మళ్ళీ పోడు వ్యవసాయం చేసుకోకుండా అధికారులు అడ్డుపడుతూ దున్ననివ్వడం లేదు. ఖమ్మం జిల్లాలో కేవలం 86 వేల ఎకరాలలోని లబ్ధి దారులకు పట్టాలు ఇచ్చారు కానీ వాటిలో చాలా వాటిని దున్నుకోనివ్వడం లేదు. భూములకు వెళ్లిన రైతులను అరెస్టులు చేశారు. దీనిపైన ఉన్నతాధికారులతో సమగ్రమైన విచారణ జరి పించాలని ిసీపీఐ కోరుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా గిరిజనులను బ్రతకనివ్వరా, వారిని బజారుపాలు చేస్తారా అనే ప్రశ్న ఎదురవుతోంది. దళితులకు, గిరిజను లకు భూమిలేని కుటుంబానికి మూడెకరాల భూమి కొని ఇస్తామని వాగ్దానం చేశారు. అమలులో మాత్రం నత్తతో పోటీ పడుతున్నారు. గిరిజనులు బానిసలుగానే ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నదా! అందుకే మూడెకరాల వాగ్దానాన్ని అమలు చేయడం లేదా? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సబ్బండవర్ణాలు భాగస్వాములైన విషయం పాలకు లకు గుర్తు లేదా! ఈ రాష్ట్రంలో పలుకుబడి కలిగిన అనేక మంది భూ దొంగలు, కబ్జాకోరులున్నారు. వారి జోలికి వెళ్లరు? వారినుంచి భూములను స్వాధీనం చేసుకోరు. ప్రభుత్వానికి పోలీసులకు పేదలంటే చులకన భావముండటం మానవత్వం అనిపించు కోదు. పైగా అనుభవిస్తున్న భూములకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా హరితహారం పేరుతో దానిని కూడా లాక్కుంటు న్నారు. అందుకేప్రభుత్వం ఇప్పటికైనా సమీక్షించు కోవాలి. ఆలోచనలో మార్పు చేసుకోవాలి. లేకపోతే ప్రభుత్వం అణచివేతకు నిరసన ఉద్యమాలు కొనసా గక తప్పదు. తక్షణమే 2006 అటవీ భూముల హక్కుల చట్టాన్ని అనుసరించి అర్హులైన పేదలందరికీ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలి. రెవెన్యూ, అటవీ భూముల సరి హద్దు నిర్ధారణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి - చాడ వెంకట్‌రెడ్డి మొబైల్ : 94909 52301 -
‘మేడారం హరితవనం’ సత్ఫలితాలిచ్చేనా ?
అమలు కోసం అధికారుల సన్నాహాలు నేడు మేడారంలో పర్యటించనున్న మంత్రి జోగు రామన్న ఎస్‌ఎస్‌తాడ్వాయి : హరితహారం పథకం కింద వనదేతలు కొలువు దీరిన మేడారాన్ని హరితవనంలా తిర్చిద్దిద్దాలనే సంకల్పంతో అధికార యంత్రం సిద్ధమైంది. గతలో మేడా రం చుట్టూ పక్కల నాలుగు వైపులా సమరుగా 3 కిలోమీటర్ల మేరకు కంకవనం ఉం డేది. పలు రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్య లో రావడంతో అసియాఖండంలోనే అతిపెద్ద జాతరగా పెరొందింది. 1996లో జాతరను గత ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడంతో అప్పటి నుంచి వనదేవతలకు ఆదరణ పెరుగుతోంది. వేల మందితో మొదలైన భక్తుల రాక కొటి మంది భక్తులకు చేరింది. కంక కర్రలతో గుడారాలు ఏర్పాటు రెండేళ్లకోసారి జరిగే జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులు మేడారం అటవీ ప్రాంతంలో ఉన్న కంకవనాలను నరికి గుడారాలు ఏర్పా టు చేసుకుంటారు. భక్తులు కంకవనాలను విచ్చలవిడిగా నరకడంతో ప్రస్తుత పరిస్దితుల్లో కంకవనాలు కనుమరుగైపోయాయి. మేడా రం అటవీ ప్రాంతం సమారుగా 2వేల హె క్టార్లు ఉండేది. ఇందులో వెయ్యి హెక్టార్ల మేర కు కంకవనం విస్తరించి ఉండేదని ఆ గ్రామ గిరిజనులు చెబుతున్నారు. ఈ ప్రదేశంలో హరితహారంలో భాగంగా కంకచెట్లు నాటితే బాగుంటుందని ప్రజలు సూచిస్తున్నారు. చెట్లే భక్తులకు విడిది మేడారం వచ్చిన భక్తులు చెట్ల కిందనే వంటావార్పు చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. జాతర సమయంలోనే కాకుండా మిగతా రో జుల్లో కూడా మేడారం వచ్చే భక్తులు చెట్ల కిం ద విడిది చేస్తారు. గత ఏడాది హరితహారంలో భాగంగా సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో మేడారం రోడ్ల వెంట మొక్కలు నాటారు. వేసవి కాలంలో వాటి సంరక్షణను పట్టించుకోకపోవడంతో ఎండల తీవ్రతకు నాటి మొ క్కల్లో సగానికిపైగా మొక్కలు ఎండిపోయా యి. సమ్మక్క తల్లి చిలకల గుట్టకు రక్షణ కవచం కోసం గుట్ట చుట్టూ 3 వేల మీటర్ల వరకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా మూడేళ్ల క్రితం ప్రభుత్వం రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో 1500 మీటర్ల వరకు గుట్ట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కానీ మిగిలిన 1500 మీట ర్లు ఫెన్సింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని పూజారులు ఫిబ్రవరిలో జరిగిన జాతర సందర్భంగా ప్రభుత్వ పాలకుల దృష్టి కి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం మేడారంలో అటవీశాఖ మంత్రి జోగురామన్న పర్యటించనున్న నేపథ్యంలో అంతరించిపోయిన అడవిని పూర్వవైభవం తీసుకువచ్చేలా మేడారాన్ని హరితవనంలా తీర్చిద్దిదేలా చూడాల్సిన ఉంది. -
హరితహారంపై సీఎస్ సమీక్ష
పాల్గొన్న కలెక్టర్, మంచిర్యాల ఆర్డీవో మంచిర్యాల రూరల్ : రెండో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించి లక్ష్యం, సాధించిన ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంచిర్యాల ఆర్డీవో కార్యలయంలో కలెక్టర్ జగన్మోహన్, ఆర్డీవో అయిషా మస్రత్ ఖానమ్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వర్షాల ప్రభావంతో హరితహారం లక్ష్యం చేరుకోలేకపోయామని తెలిపారు. ఈ నెల 23వ తేదీలోగా 80 శాతం లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. ఆయా శాఖల వారీగా నాటిన మొక్కల వివరాలు ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. సోషల్ ఫారెస్ట్రీ 12 వేలు, జిల్లాలో గల 6 డివిజన్ ఫారెస్ట్‌లలో 35 లక్షల 28 వేలు, డ్వామాలో 2 కోట్లు లక్ష్యం కాగా.. ఈ నెల 25, 26 తేదీల్లో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. విద్యాశాఖ ద్వారా 100 శాతం హరితహారం సాధించినట్లు పేర్కొన్నారు. రోడ్లు, భవనాల శాఖ ఇప్పటివరకు 29 కిలోమీటర్ల మేర మొక్కలు నాటిందని వివరించారు. ఇరిగేషన్ శాఖ కూడా 30 వేలకు గానూ 39 వేల మొక్కలు నాటి అధిక లక్ష్యం సాధించిందని తెలిపారు. ఉద్యానవన శాఖ ద్వారా అర్బన్ ప్రాంతాల్లో పండ్లు, పూల మొక్కలు పెద్ద ఎత్తున పంపిణీ చేసినట్లు చెప్పారు. హరితహారం కార్యక్రమంలో సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ స్వయంగా పాల్గొని మొక్కలు నాటారని తెలిపారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు 4 లక్షల మొక్కలు, ఇతర బ్యాంకులు 50 వేల మొక్కలు నాటాయని వివరించారు. నాటిన మొక్కలు సంరక్షించేలా చర్యలు తీసుకుంటూ తగిన సూచనలు చేస్తున్నామని కలెక్టర్ సీఎస్‌కు తెలిపారు. -
హరితహారంపై వీడియోకాన్ఫరెన్స్
నల్లగొండ : తెలంగాణకు హరితహారంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. నల్లగొండ జిల్లాకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్చార్జి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలోని కొన్ని మండలాల్లో మొక్కలు నాటలేదన్నారు. ఇప్పటికే అన్ని చోట్ల గుంతలు తీసి సిద్ధంగా ఉంచామని వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటి లక్ష్యాన్ని అధిగమిస్తామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, అటవీ శాఖ అదనపు సీసీఎఫ్ పరై్గన్, చీఫ్ కన్వజర్వేషన్ ఫారెస్టు (టెరిటోరియల్, హైదరాబాద్) సిద్ధానంద్ కుకురుతి, అడిషనల్ ప్రిన్సిపాల్ చీఫ్ కన్వజర్వేషన్ ఫారెస్టు (టెరిటోరియల్, హైదరాబాద్) సి.బి మలాసి, ఏజేసీ వెంకట్రావ్, డీఆర్వో రవి పాల్గొన్నారు. -
సెల్ఫీ విత్ మెుక్క
-
హరితహారం షార్ట్ ఫిల్మ్ సీడీ ఆవిష్కరణ
సూర్యాపేటటౌన్ : పట్టణంలోని కేఎస్ రెడ్డి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో హరితాహారంపై నిర్మించిన షార్ట్‌ఫిల్మ్ సీడీని మంగళవారం పట్టణంలోని పాఠశాలలో మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారంపై చిన్నారులతో షార్ట్‌ఫిల్మ్ తీయడం అభినందనీయమన్నారు. షార్ట్‌ఫిల్మ్‌లో మొక్కల ప్రాధాన్యం గురించి చక్కగా వివరించారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కల్లెపల్లి మహేశ్వరి, పాఠశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్‌రెడ్డి, కె.నిర్మల, దశరథ తదితరులు పాల్గొన్నారు. -
హరితహారంలో ప్రభుత్వం విఫలం : వంగాల
నల్లగొండ : జాతీయ రహదారి వెంట 10 అడుగుల లోపే మొక్కలు నాటడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగాల స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న జాతీయ రహదారిగా ఉన్న 6 లేన్లుగా విస్తరణ జరగనుందని ఈ నేపథ్యంలో సీఎం ఒకే రోజు లక్ష మొక్కలను నాటించడం వల్ల అందుకు వెచ్చించిన డబ్బులన్ని వృథానే అన్నారు. హరితహారంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో లేదన్నారు. పార్టీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయకపోతే ఆగస్టు 15న పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు రియాజ్ అలీ, మందడి సైదిరెడ్డి, ఆకునూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మెుక్క.. లెక్క తప్పింది..!
అప్పుడు ఉన్నాయన్నారు.. ఇప్పుడు కొంటామంటున్నారు.. సోషల్ ఫారెస్టులో మళ్లీ మొక్కల›కొనుగోళ్ల జాతర ఏకంగా 1.30 కోట్ల మొక్కలు కొనాలని నిర్ణయం అత్యవసరం పేరుతో షార్ట్‌టెండర్ గతేడాది కొనుగోళ్లలో రూ.కోట్లలో అక్రమాలు.. సస్పెన్షన్లు.. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ‘హరితహారం అమలుకు సిద్ధంగా ఉన్నాం.. నాటేందుకు నాలుగు కోట్ల మొక్కలు అందుబాటులో ఉంచాం. ఈసారి అటవీ శాఖ నర్సరీల్లో 1.45 కోట్ల మొక్కలు పెంచాం. సోషల్ ఫారెస్టు నర్సరీల్లో 1.10 కోట్ల మొక్కలు, డ్వామా నర్సరీల్లో కోటి మొక్కలు, ఐటీడీఏ నర్సరీల్లో 30 లక్షలు, సింగరేణి నర్సరీల్లో 15 లక్షల మొక్కలు పెంచాం. మొత్తం నాలుగు కోట్ల మొక్కలున్నాయి.. ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం..’ హరితహారం కార్యక్రమం ప్రారంభానికి (ఈనెల 8కి) ముందు ప్రజాప్రతినిధుల ప్రకటనలు, ఉన్నతాధికారుల నివేదికల సారాంశం ఇది. ‘నర్సరీల్లో టేకు మొక్కలు ఇంకా పెరగలేదు. ఇంకా పండ్ల మొక్కలు కావాలని ప్రజలు అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ మొక్కలు అందుబాటులో లేవు. అందుకే అత్యవసరంగా మొక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించాం.’ సోషల్ ఫారెస్టు విభాగం తాజా నిర్ణయమిది. హరితహారం మొక్కల కొనుగోళ్ల జాతరకు మళ్లీ తెరలేచింది. ఇన్నాళ్లు నాలుగు కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు నర్సరీల్లో మొక్కలు ఇంకా పెరగలేవని, సుమారు 30 లక్షల పండ్ల మొక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా జామ, మామిడి, సపోట, దానిమ్మ వంటి పండ్ల మొక్కలను కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ 30 లక్షల్లో పది లక్షల అంట్ల మొక్కలు (గ్రాఫ్ట్ వెరైటీ) కొనాలని భావిస్తున్నారు. అత్యవసరం పేరుతో షార్ట్‌టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. గతేడాది మొక్కల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగిన విషయం విధితమే. అసలు కొనుగోలు చేయకుండానే కొన్నట్లు.. వాటిని రహదారులకు ఇరువైపులా నాటినట్లు రికార్డులు సృష్టించారు. ప్రజాప్రతినిధులు, అటవీ శాఖలోని అధికారులు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి రూ.లక్షల్లో జేబులు నింపుకున్నారు. ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు చేపట్టిన విచారణలో ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో ఏకంగా డీఎఫ్‌వోతోపాటు, పలువురు రేంజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నేపథ్యంలో ఈసారి 30 లక్షల మొక్కలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ సారైనా కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతుందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో కోటి టేకు వేర్లు కొనుగోళ్లు.. పండ్ల మొక్కలే కాదు, టేకు వేర్లను కూడా కొనుగోలు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు టేకు మొక్కలను సరఫరా చేసిన అటవీ శాఖ ఇప్పుడు రైతులకు టేకు వేర్లనే సరఫరా చేయాలని భావిస్తోంది. దీంతో ఇకపై రైతులు టేకు మొక్కలకు బదులు టేకు వేర్లను నాటుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కోటి టేకు వేర్లను కొనుగోలు చేసేందుకు షార్ట్టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అయితే సమయం లేదనే కారణంగా ఇతర పక్క జిల్లాల్లో సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకే సరఫరా కాంట్రాక్టు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. 1.63 కోట్లు నాటి రాష్ట్రంలోనే ప్ర«థమస్థానం.. హరితహారం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గానికి 40 లక్షల చొప్పున జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ నెల 8న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో సోమవారం వరకు 1.63 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ రికార్డుల్లో పేర్కొంటోంది. ఈ లెక్కన నాలుగు కోట్ల మొక్కల్లో నాటిన 1.63 కోట్ల మొక్కలు పోగా, ఇంకా సుమారు 2.37 కోట్ల మొక్కలుండాలి. కానీ.. అటవీ శాఖ తాజాగా 1.30 కోట్ల మొక్కలను కొనుగోలు చేయాలనే నిర్ణయానికి రావడం గమనార్హం. దీంతో మొక్కల లెక్కల్లో గందరగోళం నెలకొంది.] ప్రజలు అడుగుతున్నారనే కొంటున్నాం.. పండ్ల మొక్కలు కావాలని ప్రజలు కోరుతున్నారు.. టేకు మొక్కలు కావాలని రైతులు అడుగుతున్నారు. పెంచిన మొక్కలన్నీంటిని సరఫరా చేశాం. ఇంకా కావాలని డిమాండ్ ఉంది. 30 లక్షల పండ్ల మొక్కలు కావాలని మండలాల నుంచి ఇండెంట్లు అందాయి. అందుకే కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు కొనుగోళ్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. – శ్రీనివాస్‌రావు, సోషల్ ఫారెస్టు డీఎఫ్‌వో -
హరితహారం
-
సాక్షి హరితహారం
-
అడవుల విస్తీర్ణాన్ని పెంచాలి
♦ మున్సిపాలిటీల్లో ఇంటికో మొక్క నాటాలి ♦ జిల్లాలో పదికోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం ♦ తాండూరులో మొక్క నాటిన మంత్రి మహేందర్‌రెడ్డి తాండూరు: తెలంగాణలో అడవుల విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, అందుకే ప్రభుత్వం హరితహారం చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పీ.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అడవుల విస్తీర్ణం పెరగటంవల్ల భవిష్యత్తులో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలోని పది జిల్లాలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో 1.20 లక్షల మొక్కలు నాటాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్టు మంత్రి చెప్పారు. తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో అటవీ విస్తీర్ణం పెంచడానికి ఆయా జిల్లాల్లో అధికంగా మొక్కలు నాటనున్నట్టు వివరించారు. మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఇంటికో మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.నాటిన మొక్కలను సంరక్షించడం బాధ్యతగా ప్రజలందరూ భావించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతోపాటు ప్రజలు, స్వచ్ఛంధ సంస్థలు సినీనటులు హరితహారంలో భాగస్వామ్యం కావడం మంచి పరిణామమన్నారు. జిల్లాలో పదికోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. అంతకుముందు మంత్రి హరితహారం పతకాన్ని ఆవిష్కరించి, పావురాన్ని ఎగురవేసి, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సాజిద్ అలీ, టీఆర్ఎస్, టీడీపీ కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్లు అబ్దుల్ రజాక్, సుమిత్‌కుమార్‌గౌడ్, కౌన్సిలర్లు నీరజ, పరిమళ, శోభారాణి, అబ్దుల్ఖని, వాలిశాంత్కుమార్, అరవింద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్, ఇంజినీర్ సత్యనారాయణ, ఏఈ శ్రీను, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనంతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రవూఫ్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల అధ్యక్షులు జగదీశ్వర్, హాదీ, నాయకులు జుబేర్‌లాల, బోయరాజు, కళాశాల, పాఠశాలల విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు -
హరితహారంపై ఆరా
పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారుల వివరాల సేకరణ రోజు వారీగా నివేదికలు పంపుతున్న అధికారులు నిర్లక్ష్యం వీడని పలు శాఖలు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : హరితహారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా నిత్యం ఎన్ని మొక్కలు నాటారు.. ఏయే శాఖలు నాటిన మొక్కలెన్ని.. పాల్గొన్న ప్రజాప్రతినిధులెవరు..? వంటి అన్ని అంశాలపై రోజువారి నివేదికలు ఇవ్వాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు ప్రభుత్వానికి పంపుతున్నారు. మొక్కలు నాటడంలో ఆయా శాఖలకు నిర్దేశిత లక్ష్యం ఎంత..? ఈ రోజు ఎన్ని మొక్కలు నాటారు.. శాఖల వారీగా వివరాలు పంపిస్తున్నారు. మొక్కలు నాటడంలో నిర్దేశిత లక్ష్యం పూర్తి చేసుకున్న గ్రామాల వివరాలు కూడా ఈ నివేదికల్లో పేర్కొంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వంటి అంశాలను నివేదికల్లో పేర్కొంటున్నారు. రాష్ట్రంలోనే మొదటి స్థానం.. ఈ పథకం అమలులో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఏ జిల్లాలో లేనివిధంగా అత్యధికంగా 1.08 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8న హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. ఎనిమిది రోజుల్లో జిల్లాలో కోటికి పైగా మొక్కలు నాటడం గమనార్హం. వారం రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటడానికి అనువైన వాతావరణం ఉంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంపై దృష్టి సారించారు. కలెక్టర్ జగన్మోçßæన్ కూడా నిత్యం అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. లక్ష్యానికి మించి నాటిన పోలీసు శాఖ.. జిల్లాలో పోలీసు శాఖకు నిర్దేశించిన లక్ష్యం కంటే దాదాపు రెట్టింపు మొక్కలు నాటినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. ఈ శాఖ ఆధ్వర్యంలో 6 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటివరకే 11.13 లక్షల మొక్కలు నాటినట్లు రికార్డుల్లో పేర్కొంటున్నారు. డ్వామా ద్వారా మొత్తం రెండు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణతో ఈ విభాగం పనిచేస్తోంది. ఇప్పటివరకు 67.28 లక్షల మొక్కలు నాటినట్లు పేర్కొంటున్నారు. అటవీ శాఖ టెరిటోరియల్ విభాగానికి 1.33 కోట్ల మొక్కలు పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 13.01 లక్షల మొక్కలు నాటగలిగారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కలెన్నో లెక్కలు లేకుండా పోయాయి. ఈ సమాచారం నివేదికల్లో కనిపించడం లేదు. అలాగే రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కల సంఖ్య నామమాత్రంగా ఉంది. ఇలా మొత్తం 17 ప్రభుత్వ శాఖలకు సంబంధించి రోజు వారి నివేదికలను సేకరిస్తున్నారు. -
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం..
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. హరితహారం, ఉపాధి హామీ పథకం పనులపై నల్లగొండలోని ఉదియాదిత్య భవన్లో ఆదివారం ఆయన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. మండలాల వారీగా హరితహారం ప్రగతి నివేదికను పరిశీలించిన జూపల్లి జిల్లాలో శాలిగౌరారం, కేతేపల్లి, దామరచర్ల, మేళ్లచెర్వు, చిలుకూరుతో పాటు మరికొన్ని మండలాలు వెనుకంజలో ఉండడంపై మండిపడ్డారు. ఆయా మండలాల ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయకట్టు, నాన్ఆయకట్టుతో స ంబంధం లేకుండా అన్ని చోట్ల గుంతలు తీసిపెట్టుకోవాలని.. వర్షాలు పడే సమయానికి మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ఎంపీడీఓల పైనే ఉందన్నారు. 15 మండలాల్లో నిర్దేశించిన లక్ష్యానికంటే అతి తక్కువగా గుంతలు తీశారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి 40 వేల గుంతల లక్ష్యాన్ని నిర్దేశించినందున రోజుకు రెండు వేల గుంతల చొప్పున తీయించాలని.. ఆ తర్వాత మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. తొలి అవకాశంగా అధికారులు, ఉద్యోగులపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదని.. మలిదశ సమీక్ష నాటికి హరితహారం కార్యక్రమంలో పురోగతి కనిపించకుంటే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి పథకం బాధ్యతలను ఎంపీడీఓలకే అప్పగించినందున క్షేత్రస్థాయిలో పనిచేయని ఈజీఎస్ ఉద్యోగులపై చర్యలు తీసుకునే అధికారం వారికే ఉందన్నారు. ఉపాధి పథకంలో కనీసం 50 శాతం కూలీల కుటుంబాలకు వంద రోజుల పని కల్పించాలన్నారు. హరితహారం కార్యక్రమంలో ఉపాధి కూలీలను భాగస్వాములు చేయాలని సూచించారు. జిల్లాకు నిర్ణయించిన 4.71 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్నారు. హరితాహారం, ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి అదనంగా ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించుకునేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. చిత్తశుద్ధితో పనిచేయాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో చేపట్టాలని మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. భూభాగంలో 33 శాతం ఉండాల్సిన అటవీ ప్రాంతం నల్లగొండ జిల్లాలో ఐదు శాతం మాత్రమే ఉందని, దీన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాకు ప్రాధాన్యమిచ్చి ఇక్కడి నుండే హరితహారం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడం ద్వారా రేపటి తరానికి మేలు జరుగుతుందన్నారు. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి, మొక్కుబడిగా కాకుండా వంద శాతం గుంతలు తీయడం పూర్తి చేయాలన్నారు. వర్షాలు పడిన వెంటనే మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఇన్చార్జి కలెక్టర్ ఎన్.సత్యనారాయణ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం, డీఆర్ఓ రవినాయక్, డ్వామా పీడీ దామోదర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ అంజయ్యతోపాటు జిల్లా, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నల్లగొండ జిల్లాలో హరితహారం
-
ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి– మంత్రి జగదీశ్‌రెడ్డి
అనంతారం (గుండాల) : బంగారు తెలంగాణగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా ఆదివారం మండలంలోని అనంతారం, సుద్దాల గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కృష్ణారావుతో కలిసి మొక్కలు నాటిన అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంత ప్రజలు కీలకంగా పని చేశారని, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. గంధమల్ల రిజర్వాయర్ ద్వారా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు తాగు నీరు అందించి సస్యశ్యామలం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మండలంలోని అనంతారం గ్రామంలో రూ.5 లక్షలతో మంజూరైన యువజన సంఘం భవన నిర్మాణానికి, రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులకు, సుద్దాలలో రూ.4.75 కోట్లతో మంజూరైన సుద్దాల, పల్లెపహాడ్ గ్రామాల మధ్య ఉన్న బిక్కేరుపై వంతెన నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్‌లు ఆదివారం శంకుస్థాపన చేశారు. మండలానికి వరాల జల్లు గుండాల మండలం తుర్కలశాపురం జీడికల్ చౌరస్తా మిగిలిన మెటల్ పనులను బీటీగా మార్చేందుకు రూ.25 లక్షలు, అనంతారం నుంచి తేర్యాలలో మిగులు రోడ్డు పనిని బీటీగా మార్చేందుకు రూ.2 కోట్లు, 20 విద్యుత్ స్తంభాలను మంజూరు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి వరాలు గుప్పించారు. సుద్దాలలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.5 లక్షలు, యూత్ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు, పల్లెపహాడ్‌లో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి సభా ముఖంగా ప్రకటించారు. -
మొక్కలు నాటిన చేవెళ్ల డీఎస్పీ
చేవెళ్లః చేవెళ్ల గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన కేసారం గ్రామంలో ఆదివారం చేవెళ్ల సబ్ డివిజనల్ పోలీసు అధికారి శృతకీర్తి మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా డీఎస్పీ శృతకీర్తి మాట్లాడుతూ...మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే విజయవంతమవుతుందన్నారు. గ్రామాలలోని ఖాళీ, నిరుపయోగ స్థలాలలో విరివిగా మొక్కలను నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, సీఐ జే.ఉపేందర్, ఎస్ఐ భీంకుమార్, ఏఎస్ఐ హన్మంత్‌రెడ్డి, సిబ్బంది భీంరావు, ఉపసర్పంచ్ రాజిరెడ్డి, యువజనసంఘాల ప్రతినిధులు రాము, రాకేష్, శ్రీనివాస్, సుధాకర్, తదితరులున్నారు. -
పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం
ఊట్కూర్ : ఊట్కూర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో శనివారం పోలీసుల ఆధ్వర్యంలో బుద్ధిమాంద్యం విద్యార్థులచే హరితహారం కార్యక్రమం నిర్వహించారు. పీఎస్ఐ కేతావత్ రవి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని కోరారు. బుద్దిమాంద్యం విద్యార్థులు హరితహారంలో పాల్గొనడం స్ఫూర్తినిస్తుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హన్మంతు, వెంకట్రాములు, వికలాంగుల సంఘం నాయకులు నర్సింగమ్మ, రాములమ్మ, వినోద్‌కుమార్, కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి ఆధ్వర్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లు
గోదావరిఖని : తెలంగాణకు హరితహారం రెండో దశ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న గోదావరిఖనిలో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాట్లు ప్రారంభించారు. శుక్రవారం స్థలాన్ని చదును చేసి, దాదాపు ఐదు వేల మొక్కలు నాటేందుకు వీలుగా గుంతలను తవ్వించారు. ఆర్జీ-1 ఇన్చార్జి సీజీఎం సుధాకర్‌రెడ్డి, రామగుండం రీజియన్ ఫారెస్ట్ విభాగం డెప్యూటీ మేనేజర్ కర్ణా నాయక్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అంబటి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ దాదాసలాం పనులను పరిశీలించారు. ఒకే రోజు 3.50 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు ఈ నెల 18న ఒకే రోజు రామగుండం రీజియన్ పరిధిలో 16 చోట్ల 3.50 లక్షల మొక్కలు నాటేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఆర్జీ-1 డివిజన్లో 1.50 లక్షల మొక్కలు, ఆర్జీ-2లో లక్ష మొక్కలు, ఆర్జీ-3లో లక్షలు మొక్కలు నాటనున్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని మేడిపల్లి ఓసీపీ, ఆర్జీ-1 ఎంవీటీసీ, పీజీ, డిగ్రీ కళాశాల, కాలనీ పరిధిలోని పోచమ్మ దేవాలయం, వకీల్‌పల్లి గని, ఓసీపీ-3 ఆవరణ, అల్లూరు ఏరియా, ఓసీపీ-1, ఓసీపీ-2, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు, జూలపల్లి గ్రామంతో పాటు అన్ని ఏరియాల్లోని రహదారుల పక్కన మొక్కలు నాటనున్నారు. 18న ముఖ్యమంత్రి డిగ్రీ కళాశాలలో కార్యక్రమం ముగిసిన తర్వాత స్థానిక సింగరేణి ఎంవీటీసీ ఆవరణలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, ఇతర అధికారులు మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
క్రమశిక్షణతోనే ఉన్నత చదువులు
ఆర్మూర్: విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నపుడే ఉన్నత చదువులు చదవడంలో విజయం సాధిస్తారని జిల్లా వృత్తి విద్యాధికారి ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ శివారులోని పిప్రి రోడ్డులో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కళాశాల కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. తరగతులు నిర్వహిస్తున్న తీరును, అధ్యాపకులు బోధిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. చదువులతో పాటు వి ద్యార్థులు తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను గౌరవించాలనే సంస్కారాన్ని అలవర్చుకోవాలన్నారు. అ నంతరం కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నా టారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ రఘురాజ్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. -
చెట్లు పెంచితేనే భవిష్యత్తు
నిజామాబాద్: చెట్లు పెంచితేనే మనకు భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ యోగితారాణా సూచించారు. నిజామాబాద్ మండలం సారంగపూర్ పాండురంగా రైస్‌మిల్ ఆవరణలో శుక్రవారం జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా రైస్‌మిల్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మొ క్కలు నాటాలని సూచించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు దయానంద్‌గుప్త, కార్యదర్శి మోహన్‌రెడ్డి తది తరులు కలెక్టర్ యోగితారాణాను, జేసీ రవీందర్‌రెడ్డి సత్కరించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలిని ఇద్దాం గాంధారి: ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి భావితరాలకు స్వచ్ఛమైన గాలిని ఇద్దామని కలెక్టర్ అన్నారు. గాంధారి మండ లం యాచారం తండాలో స్థానిక పాఠశా ల ఆవరణలో తండావాసులతో మాట్లాడారు. భావి తరాలకు మనం ఆస్తులు ఇవ్వకపోయినా కనీసం స్వచ్ఛమైన గాలి నైనా ఇచ్చేందుకు చెట్లను పెం చుదామన్నారు. ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మిం చుకోవాలని సూచించారు. నెలరోజుల్లో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. తండావాసులు వినతి పత్రాలు ఇవ్వగా వంద శాతం మరుగుదొడ్లు నిర్మించే వరకు వినతిపత్రాలు స్వీ కరించేదిలేదని తిరస్కరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేకాధికారి ఉపేందర్ రెడ్డి, ఎంపీడీవో సాయాగౌడ్ పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటాలి తాడ్వాయి: హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను నాటాలని కలెక్టర్ సూచించారు. బ్రహ్మాజివాడిలో హరితహారాన్ని పరిశీలించా రు. ఒక్కొక్క గ్రామంలో 40 వేల మొక్కలను నాటాల్సి ఉండగా 50 శాతం కూ డా ఎందుకు పూర్తికాలేదని అధికారుల ను నిల దీశారు. అధికారులు, ప్రజాప్రతి నిధులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో లక్ష్మి, ఏవో శ్రీకాంత్, ఈవోపీఆర్డీ నారాయణ, ఎంఈవో పాతసత్యం,సర్పంచ్ శాంతాబాయి ఉన్నారు. -
నానక్‌రామ్ గూడలో మొక్కలు నాటిన హీరో
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి హీరో దగ్గుబాటి రానా తనవంతుగా మద్దతు తెలిపాడు. సోమవారం ఉదయం అతడు నానక్‌రామ్ గూడలో రెండు మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే నాటిన మొక్కను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని, అందరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని కోరాడు. 'గుడ్ మార్నింగ్!! దిస్ ఈజ్ హౌ మై డే బిగెన్! ట్రీ ప్లాంటేషన్ ఇన్ నానక్ రామ్ గూడ!!మేక్ యూఆర్ ఆల్సో గ్రీన్!! అంటూ రానా ట్విట్ చేశాడు. కాగా హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీనటులు హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. Good Morning!! This is how my day began! Tree plantation in Nanakramguda!! Make urs as green!! #HarithaHaram pic.twitter.com/kcqy8CZGiH — Rana Daggubati (@RanaDaggubati) 11 July 2016 -
హరితహారం కోసం..
- సైక్లింగ్ చేస్తూ సంగారెడ్డికి వచ్చిన రాజీవ్ త్రివేది సంగారెడ్డి రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో పాల్గొనేందుకు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది ఆదివారం సైకిల్ యాత్ర చేశారు. 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డికి వచ్చారు. హైదరాబాద్ నుంచి సైకిల్‌పై బయలుదేరి సంగారెడ్డిలోని పోలీస్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్, కంది సమీపంలోని జిల్లా జైలు ఆవరణలో మొక్కలు నాటారు. -
హరితహారంలో ప్రతి పౌరుడూ పాల్గొనాలి
- జిల్లా కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రెండు వారాలపాటు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ సర్పంచ్ మొదలుకొని మంత్రి వరకు ప్రజాప్రతినిధులతోపాటు అన్ని స్థాయిల అధికారులను సమన్వయం చేసుకోవాలని, హరితహారాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా నడిపించాలని సూచించారు. ప్రతి పౌరుడూ ఈ కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటేలా కార్యాచరణ, వ్యూహాలను రూపొందించాలన్నారు. కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను తన క్యాంపు కార్యాలయానికి పంపించాలని, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటడంతోపాటు వాటిని పరిరక్షించే చర్యలు చేపట్టాలన్నారు. రహదారుల వెంట, విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్ యార్డులు, ఖాళీ ప్రదేశాల్లో వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలన్నారు. ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటి సంరక్షించాలనే అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. -
రేపు హెచ్ఎండీఏ పరిధిలో హరితహారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11న హెచ్ఎండీఏ పరిధిలో ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విద్యార్థుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు, పాఠశాలల నుంచి కార్పొరే ట్ సంస్థల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, హైదరాబాద్ నగరాన్ని నందన వనంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఈ భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ మహాకార్యంలో ప్రజలంతా పాలుపంచుకోవాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కనీసం ఒక మొక్క నాటాలని ఆయన కోరారు. -
తొలిరోజు నాటిన మొక్కలు కోటికి పైనే!
సాక్షి, హైదరాబాద్: రెండో విడత ‘తెలంగాణకు హరితహారం’ సందర్భంగా తొలిరోజు నాటిన మొక్కల వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో కోటీ ఆరు లక్షల మొక్కలు నాటినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 25,44,685 మొక్కలు నాటగా, 20 లక్షలకు పైగా మొక్కలతో ఆదిలాబాద్ రెండో స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హరితహారాన్ని ప్రారంభించిన నల్లగొండ జిల్లాలో అటవీశాఖ ద్వారా 87 వేల మొక్కలు నాటినట్లు చూపగా, ఇతర శాఖలు నాటిన మొక్కల వివరాలు లేవు. అయితే 2,75,000 మొక్కలు నాటినట్లు ఈ జిల్లా అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాల వారీగా తొలిరోజు (8వ తేదీ) నాటిన మొక్కల వివరాలు జిల్లా అటవీశాఖ నాటినవి ఇతర విభాగాలు మొత్తం ఆదిలాబాద్ 1,29,000 19,36,962 20,65,962 నిజామాబాద్ 7,25,095 18,19,590 25,44,685 మెదక్ 2,45,000 7,39,000 9,84,000 రంగారెడ్డి 0 7,58,000 7,58,000 నల్లగొండ 87,000 - 87,000 మహబూబ్‌నగర్ 27,000 5,56,770 5,83,770 వరంగల్ 3,96,874 9,50,000 13,46,874 ఖమ్మం 7,60,000 6,64,700 14,24,700 కరీంనగర్ 1,75,618 6,28,975 8,04,593 హెచ్ఎండీఏ 28,700 మొత్తం 25,45,587 80,53,997 1,06,28,284 -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
హైదరాబాద్ : నగరంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఎరైజ్ సంస్థ, సాక్షి ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్‌లో వివిధ స్కూళ్ళ విద్యార్థులు హరితహారంపై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. జీహెచ్ఎంసీ గ్రౌండ్ లో మొక్కలు నాటి అనంతరం ర్యాలీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. డివిజన్లో లక్ష మొక్కలను నాటి పర్యావరాణాన్ని రక్షించడమే ధ్యేయంగా ముందుకెళుతున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే డివిజన్ వ్యాప్తంగా మొక్కలను నాటేందుకు 69 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. శనివారం హిమాయత్‌నగర్‌లో రోడ్డుకు ఇరువైపులా స్థానిక నేతలతో కలసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా చింతల మాట్లాడుతూ మొక్కలను నాటే కార్యక్రమం మహోద్యమంగా తలపెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థలను, కార్పొరేట్ కార్యాలయాలను భాగస్వాములను చేస్తున్నామన్నారు. -
చెట్లు నాటితే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు
హైదరాబాద్ : చెట్లు నాటితేనే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన హరితహారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఏడాదికి 42 కోట్ల చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ సంస్థలతోపాటు 108 ప్రైవేట్ సంస్థలు హరితహారంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు. -
నేటి నుంచే పచ్చని పండుగ
- నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో రెండో విడత హరితహారాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ - రెండు వారాల పాటు కార్యక్రమం.. 46 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం - విజయవాడ హైవేపై 2 గంటల్లో లక్ష మందితో 163 కిలోమీటర్ల పొడవునా మొక్కలు నాటే కార్యక్రమం - గ్రేటర్లో ఈనెల 11న ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటే లక్ష్యం సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ఆకుపచ్చని రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం రెండో విడతకు సర్వం సిద్ధమైంది. రెండు వారాల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద ప్రారంభిస్తారు. మొత్తంగా ఈ వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 46 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 4,213 నర్సరీల్లో సుమారు 200 రకాల మొక్కలను సిద్ధం చేశారు. అయితే గతేడాది చేపట్టిన హరితహారం తొలివిడత వర్షాభావం కారణంగా నత్తనడకన సాగింది. ఈసారి వాతావరణం ఆశాజనకంగా ఉండడంతో 46 కోట్ల మొక్కలు నాటి రికార్డు సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఇటీవల సమీక్షించి, అధికార యంత్రాంగానికి కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందులో అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయం, విద్య, నీటిపారుదల, ఎక్సైజ్, రోడ్లు భవనాల శాఖ తదితర 25 కీలక విభాగాలు పాలుపంచుకోనున్నాయి. గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 33 శాతం పచ్చదనం లక్ష్యంగా.. పర్యావరణ సమతౌల్యం కోసం భూభాగంలో 33 శాతం అడవులు, పచ్చదనం ఉండాలి. కానీ ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా చూస్తే 22 శాతం, తెలంగాణలో 24 శాతమే ఉంది. ఈ నేపథ్యంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గతేడాది రంగారెడ్డి జిల్లా చిలుకూరులో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో తొలి ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యం పెట్టుకున్నా... వర్షాభావ పరిస్థితుల కారణంగా 15 కోట్లకు మించలేదు. దీంతో ఈసారి రికార్డు స్థాయిలో 46 కోట్ల మొక్కలను నాటి వచ్చే యేటికి లక్ష్యాన్ని పెంచాలని నిర్ణయించారు. ఈసారి నాటే 46 కోట్ల మొక్కల్లో 36.81 కోట్ల మొక్కలు నీడనిచ్చే మర్రి, రావి, వేప వంటివి కాగా... టేకు, మద్ది వంటి లాభదాయకమైన చెట్లు 8.5 కోట్లు సిద్ధం చేశారు. మరో కోటి వరకు పండ్ల మొక్కలను, చెరువు కట్టలపై పెంచేందుకు కోటి ఈత మొక్కలు, పూల మొక్కలను సిద్ధం చేశారు. రెండుగంటల్లో లక్షన్నర మొక్కలు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాలో హరితహారాన్ని ప్రారంభించే సమయంలోనే.. హైదరాబాద్-విజయవాడ హైవేపై 163 కిలోమీటర్ల మేర 2 గంటల్లో లక్షన్నర మొక్కలు నాటేందుకు ప్రభుత్వ శాఖలు ప్రణాళిక తయా రు చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి సరిహద్దు అయిన నల్లగొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు రోడ్డుకు ఇరువైపులా లక్షన్నరకు పైగా మొక్కలు నాటనున్నారు. ఈ మొత్తం దూరాన్ని 14 సెగ్మెంట్లుగా విభజించి ప్రతి సెగ్మెంటుకు ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు ఈ రహదారిపై 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, 10మండలాలు, 50 గ్రామా ల పరిధి ఉంది. ఒకేసారి లక్ష మంది 163 కిలోమీటర్ల మేర మొక్కలు నాటడం రికార్డుగా నిలుస్తుందని సీఎం కార్యాలయం పేర్కొంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో.. కాంక్రీట్ అడవిగా మారిన హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఐదేళ్లలో హెచ్ఎండీఏ పరిధిలో 7 కోట్ల చెట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో 3 కోట్ల చెట్లు పెంచే లక్ష్యంలో భాగంగా ఈనెల 11న ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. -
రాష్ట్రమంతా ఆకుపచ్చని పండుగ
- జాతీయ రహదారులకు ఇరువైపులా హరితహారం - 8న హైదరాబాద్-కోదాడ వరకు మొక్కలు నాటే ఉత్సవం - 165 కిలోమీటర్ల పొడవునా 85 వేల మంది భాగస్వామ్యం - నల్లగొండ జిల్లాలో హరితహారాన్ని ప్రారంభించనున్న సీఎం సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణలోని అన్ని జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు పెంచాలని నిర్ణయించింది. ఈ మహోద్యమంలో ప్రజలందరూ కలసి వచ్చేలా కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 8న నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం పెద కాపర్తి వద్ద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ జిల్లాలు, శాఖల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దు వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ రహదారి పొడవునా ఒకేసారి 85 వేల మంది హరితహారంలో భాగస్వాములు కానున్నారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరున్న అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి నల్లగొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు మొక్కలు నాటనున్నారు. స్వయం సహాయక బృందాల సభ్యులు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ తరలివచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం రహదారిని 14 సెగ్మెంట్లుగా విభజించారు. ఒక్కో సెగ్మెంట్‌కు ఒక్కో అధికారిని ఇన్చార్జిగా నియమించారు. హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, పది మండలాలు, 50 గ్రామాలున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 14 సెగ్మెంట్లలో మొక్కల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోనున్నారు. ఒకే రకం పూల చెట్లు కాకుండా పది కిలోమీటర్లకు ఒర రకం, ఒక రంగు చొప్పున చెట్లను పెంచనున్నారు. తెలంగాణ నుంచి వెళ్లే అన్ని జాతీయ రహదారులకు ఇరువైపులా ఇలాగే మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో బయల్దేరిన ప్రయాణికులు తెలంగాణ సరిహద్దు దాటే వరకు అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో చల్లని గాలుల మధ్య ప్రయాణం సాగించేలా పూలచెట్ల పెంపకం జరగనుంది. ఔషధ మొక్కల పంపిణీకి ఏర్పాట్లు పండ్లు, పూల మొక్కలతోపాటు ఔషధ మొక్కలనూ భారీ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ముఖ్యమంత్రి ఆదేశం మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11న హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు, నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా, హైటెక్ సిటీ, చార్మినార్, ఉప్పల్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు పెట్టి ఔషధ మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
మహిళలు తలుచుకుంటే పట్టణాలన్నీ హరితమయం
హరితహారంపై శిక్షణలో మంత్రి కేటీఆర్ 72 పట్టణాల్లో 64 లక్షల మొక్కలు నాటాలి గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 25 లక్షల మొక్కలు సాక్షి, హైదరాబాద్: మహిళలంతా తలుచుకుంటే పట్టణాలన్నీ హరితమయంగా మారిపోతాయని పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో సోమవారం పురపాలకశాఖ కమిషనరేట్ (సీడీఎంఏ)లో పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు హరితహారంపై శిక్షణ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రతి మహిళా సంఘం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాలు ఇప్పటికే ఎన్నో స్ఫూర్తిదాయక విజయాలు అందుకున్నాయని, హరితహారం ద్వారా మరోసారి చరిత్రను పునరావృతం చేయాలన్నారు. సొంత పిల్లల మాదిరిగా మొక్కలను పెంచాలన్నారు. ఈ ఏడాది 72 పట్టణాల్లో 64 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 25 లక్షల మొక్కలు నాటనున్నామని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 806 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో మొక్కల పెంపకం అత్యవసరమైందన్నారు. చెట్లు లేక లోకల్ వార్మింగ్ వల్ల జరుగుతున్న దుష్ఫలితాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండే ఉంటుందన్నారు. హరితహారంతో 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకున్నామని, ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు నాటుతామన్నారు. వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది హరితహారం విజయవంతమవుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మహాయజ్ఞంలో పురపాలకశాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందన్నారు. మొక్కలను నాటి, పెంచే పట్టణాలకు రూ. 5 కోట్లకుపైగా ప్రోత్సహకాలు ప్రకటిస్తామన్నారు. పట్టణాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని కేటీఆర్ సూచించారు. మున్సిపల్ ఆస్తులను కాపాడేందుకు మొక్కలను పెంచడమే చక్కని పరిష్కారమన్నారు. జియో ఫెన్సింగ్‌తోపాటు గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు పురపాలకశాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సంచాలకులు దానకిశోర్‌ను ఆదేశించారు. రాష్ట్రంలోని 13 పురపాలికలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా మార్చి 100% మరుగుదొడ్లు నిర్మించడంలో సహకరించిన మహిళ సంఘాల నేతలను కేటీఆర్ సన్మానించారు. -
కేబినెట్ భేటీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: మంత్రులు వివిధ ఏర్పాట్లలో బిజీగా ఉన్న నేపథ్యంలో శనివారం సాయంత్రం జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం ఉదయం మెదక్ జిల్లా పటాన్చెరులో జరిగిన హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అక్కడి నుంచి వచ్చిన తరువాత ఎంసీహెచ్ఆర్డీలో జరగాల్సిన స్వచ్ఛ హైదరాబాద్ సమీక్ష సమావేశానికి హాజరుకావాలి. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడతారని సీఎంవో కార్యాలయం ముందుగా ప్రకటించింది. అయితే, స్వచ్ఛ హైదరాబాద్ సమావేశం, మీడియా సమావేశంతో పాటు, కేబినెట్ భేటీ కూడా వాయిదా పడినట్టు వరుస ప్రకటనలు వెలువడ్డాయి. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా కొందరు మంత్రులు జిల్లాల్లో బిజీగా ఉన్నా రు. ఆదివారం ప్రభుత్వం హైదరాబాద్‌లో అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందు ఏర్పాట్లలో కొందరు మంత్రులు నిమగ్నమై ఉన్నారు. ఉన్న ఒకరిద్దరు సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో చర్చించడంలో బిజీగా ఉన్నారు. వీటిన్నింటికీ తోడు కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతూ సీఎం సచివాలయం వైపు రావడం లేదు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ వాయిదా పడింది. -
ఉద్యమంగా హరిత హారం
-
ఉద్యమంగా హరిత హారం
* ఆకుపచ్చ తెలంగాణ అందరి లక్ష్యం కావాలి: సీఎం కేసీఆర్ * మన బిడ్డల భవిష్యత్తు కోసం మొక్కలు నాటాలి * రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్ * ‘కాళేశ్వరం’తో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తా * సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉంది * వేల్పూరు నుంచే కేజీ టు పీజీ ఉచిత విద్య * కామారెడ్డిని జిల్లాగా చేస్తా * నిజామాబాద్ జిల్లాలో సీఎం హరితహారం * దేశానికే ఆదర్శం: జవదేకర్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టుబట్టి, జట్టుకట్టి ఉద్యమించిన ప్రజలు.. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని మరో ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర పాలకుల పాలనలో ముందుచూపు లేక తెలంగాణలో అడవులు అంతరించిపోయాయని, అందువల్లే ఈ నీళ్ల గోస ఏర్పడిందని అన్నారు. పల్లె నుంచి పట్నం దాకా ఉద్యమ స్ఫూర్తితో అందరూ మొక్కలు నాటాలని, అందరి లక్ష్యం ఆకుపచ్చ తెలంగాణ కావాలని పేర్కొన్నారు. గోదావరి జలాలు సద్వినియోగం చేయడం కోసం ఇంజినీర్లతో ఓ ప్రత్యేక కార్యాచరణ రూపొందించానని, ఇంకా కొందరు మంత్రులకే ఈ విషయం తెలియదని, ఆమోదం కోసం త్వరలోనే కేబినెట్లో పెడతానని చెప్పారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేజీ టు పీజీ పథకాన్ని నిజామాబాద్ జిల్లా వేల్పూరు నుంచే ప్రారంభిస్తానని, హైదరాబాద్‌కు వెళ్లాక సాంకేతిక కారణాలపై చర్చించి దీనిపై ప్రకటిస్తానని వెల్లడించారు. కామారెడ్డి మంచి ఆర్థిక నగరంగా ఎదుగుతుందని, దీన్ని నూటికి నూరు శాతం జిల్లాగా చేసి తీరుతానని స్పష్టంచేశారు. 230 కోట్ల మొక్కలు నాటుతాం హరితహారంలో భాగంగా సీఎం సోమవారం నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. వేల్పూరు మండలం మోతె నుంచి మొదలైన పర్యటన కామారెడ్డి వరకు సాగింది. మోతె, వేల్పూరు, ఆర్మూరు, నిజామాబాద్, ధర్నారం, సదాశివనగర్, కామారెడ్డిలలో ఆయన పలుచోట్ల మొక్కలు నాటారు. మోతె, వేల్పూరు, నిజామాబాద్, కామారెడ్డిలలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. తెలంగాణలో మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ కార్యక్రమం విజయవంతమైతే ప్రపంచంలో అత్యధికంగా మొక్కలు నాటిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. గ్రామాలను పచ్చగా చేసే బాధ్యత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తీసుకోవాలన్నారు. ‘‘నిజామాబాద్ జిల్లాలో అడవులను నాశనం చేయడంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఆరుద్ర కార్తె. ఇప్పుడెట్ల ఉండాలే... వానలు, ముసుర్ల జోరుండాలే. కాని ఎండకాలంలా ఎండలు కొడ్తున్నయ్. అందుకనే మనం అందరం మన బిడ్డల భవిష్యత్ కోసం మొక్కలు నాటాలే. జనం మధ్యకు చేరిన కోతులు వాపసు పోవాలే. వానలు మళ్లీ రావాలే’’ అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానం సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేసీఆర్ చెప్పారు. సంక్షేమ రంగానికి దేశంలో నెలకు రూ.28 వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలంగాణే అన్నారు. ‘‘గతంలో దొడ్డు సీఎంలు ఉండేవారు. వారు సంక్షే మ విద్యార్థులకు దొడ్డు బి య్యం అందించారు. నేను సన్న గా ఉన్నా.. సన్న బియ్యూన్నే ఇస్తు న్నా..’’ అంటూ చమత్కరించారు. రాష్ట్రంలో రెండేళ్ల తర్వాత 24 గంటల త్రీఫేజ్ కరెంటు అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ ఎండిపోయిందని దీనికి గత పాలకులే కారణమన్నారు. సింగూరు నుంచి జిల్లాకు నీటిని తీసుకువస్తామన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేస్తానని, ఆ పథకం ద్వారా నిజామాబాద్‌లోని ఆర్మూర్, బాల్కొండ, కా మారెడ్డి, ఎల్లారెడ్డిలకు నీరందిస్తామన్నారు. 30 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా ఎలా ఉండేదో అలా తీర్చిదిద్ది నంబర్ వన్ చేస్తానన్నారు. రాష్ట్రంలో రామగుండం, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్లను అంతర్జాతీయంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇందుకు ఒక్కో కార్పొరేషన్‌కు ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. మోతె నా ఊరు! ‘తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన ఊరు మోతె. ఉద్యమ తొలినాళ్లలో నాకు అండగా నిలిచింది ఈ ఊరే. అలాంటి మోతె నా ఊరు కాకపోతే ఏమవుతది. ముమ్మాటికీ మోతె కేసీఆర్ గ్రామం. మోతె అభివృద్ధికి నాదే పూచీ. ఇక్కడ ఏం చేయకపోయినా నా ఇజ్జతే పోతది. అందుకే మోతెను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తా’ అని సీఎం చెప్పారు. మోతె మట్టిని తీసుకెళ్లి తెలంగాణ అన్ని జిల్లాల్లోని బావుల్లో కలిపితే బాగుంటుందని, అలా చేస్తే తెలంగాణలోని కొందరు సన్నాసులకు మోతె ప్రజలకున్న తెలంగాణ స్ఫూర్తి వస్తుందన్నారు. గ్రామంలోని రైతులందరికీ 100% రాయితీపై బిందుసేద్య పరికరాలు అందజేస్తామని, ఇల్లు లేని పే దలకు రెండు పడక గదులతో 200 ఇళ్లు మంజూరు చేస్తానని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాలుగు నెలల్లో రెండస్తుల పంచాయతీ భవనం నిర్మిస్తామన్నారు. మురుగు కాల్వల నిర్మా ణానికి రూ.2.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశానికే ఆదర్శం: జవదేకర్ తెలంగాణలో సాగుతున్న హరితహారం కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర అటవీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశంసించారు. మోతె, వేల్పూరు, ఆర్మూరులో జరిగిన హరితహారంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం దేశంలో మరెక్కడా జరగడం లేదన్నారు. ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తాను స్వయంగా చూశానని, అదే తరహాలో ఇప్పుడు హరితహారం ఉద్యమం చూస్తున్నానన్నారు. -
సర్వం సిద్ధం
వేల్పూరుకు చేరుకున్న కేసీఆర్ జిల్లాలో నేడు సుడిగాలి పర్యటన ఎమ్మెల్యే బాజిరెడ్డి ఇంట్లో భోజనం 'మోతె' నుంచి కామారెడ్డి వరకు హరితహారంలో బిజీగా గడపనున్న సీఎం నగరంలో జరిగే సభకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేవకర్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ హరితహారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన ఆదివారం రాత్రి వే ల్పూరుకు చేరుకున్నారు. బాల్కొండ ఎమ్మెల్యే వే ముల ప్రశాంత్‌రెడ్డి ఇంట్లో బస చేశారు. సోమవారం సీఎం పాల్గొనే కార్యక్రమాల కోసం జిల్లా అధికార యంత్రాంగం పటి ష్ట ఏర్పాట్లు చేసింది. ముందుగా అనుకు న్న షెడ్యూల్లో కొద్దిపాటి మార్పులు చే స్తూ సీఎం కేసీఆర్ పర్యటన వి వరాలను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదివారం రాత్రి ప్రకటించారు. నిజామాబాద్ రఘునాథ చెరువుతో పాటు తెలంగాణ యూనివర్సిటీలో సీఎం మొక్కలు నాటే కార్యక్రమా లు రద్దయ్యాయి. ఉదయం మోతెలో మొదలయ్యే సీఎం పర్యటన కామారెడ్డిలోని రవాణాశాఖ యూనిట్ ఆవరణ లో మొక్కలు నాటే వరకు బిజీబిజీగా సాగనుంది. నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌం డ్, కామారెడ్డిలోని ఆర్డ్స్‌అండ్‌సైన్స్ కళాశాలలో జరిగే రెండు బహిరంగసభలలో కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌం డ్స్‌లో జరిగే బహిరంగ సభకు కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ హాజరుకానున్నారు. జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్న సీఎం మధ్యాహ్నం మహా లక్ష్మినగర్‌లోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇంటిలో భోజనం చేసిన అనంతరం తిరిగి పర్యటనను కొనసాగించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా మూడు రోజులుగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర అధికారులు, ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాట్ల ను పర్య వేక్షించారు. పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి శ్రీ నివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం పరిశీలించారు. -
ఒక్క రోజుకే ‘షెడ్డు’కు..!
-
ఒక్క రోజుకే ‘షెడ్డు’కు..!
* రూ. 5 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ బస్సుపై సీఎం అసంతృప్తి * హరితహారానికి గుర్తుగా ఆకులు, పూల బొమ్మలులేవని పెదవి విరుపు * పథకాల సీడీ పెట్టినా పనిచేయని సౌండ్‌సిస్టం * జేసీబీఎల్ కంపెనీ వర్క్‌షాపునకు తరలింపు * ఖాళీ సీడీ పెట్టారని తేల్చిన అక్కడి ఇంజనీర్లు * అవగాహన ఉన్న సిబ్బందిని పెట్టాలని సూచన సాక్షి, హైదరాబాద్: ఎన్నో హంగులు.. ప్రత్యేకతలతో మెర్సిడెస్ బెంజ్ రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఒక్క రోజుకే ‘షెడ్డు’కు చేరింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేసిన ఈ బస్సులోని ఏర్పాట్లపై సీఎం పెదవి విరిచారు. దీంతో వాటిని సరిదిద్దేందుకు ఆర్టీసీ అధికారులు వెంటనే బస్సును.. దాని బాడీ రూపొందించిన జేసీబీఎల్ కంపెనీకి అప్పగించారు. ఫలితంగా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బస్సులో కాక తన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళ్లారు. శుక్రవారం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కేసీఆర్ ఈ బస్సులోనే వెళ్లారు. ఆరోజు ఉదయం యాదాద్రి ఆలయం వద్ద బస్సుకు పూజలు చేయించి తీసుకొచ్చాక ముఖ్యమంత్రి పర్యటన మొదలైంది. ఆ సందర్భంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సీడీని ప్లే చేయగా పాట రాలేదు. అర కిలోమీటర్ దూరం వరకు వినిపించే శక్తివంతమైన సౌండ్ సిస్టం ఏర్పాటు చేసిన బస్సులో సాధారణ సీడీ ప్లే కాకపోవటంతో ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తెలుపు రంగులో ఉన్న బస్సు బాడీపై ఆకుపచ్చ రంగు స్ట్రైప్ ఏర్పాటు చేశారు. హరితహారానికి సరిపోయేలా ఆ స్ట్రైప్‌పై ఆకులు, పూల బొమ్మలు ఉండాల్సిందని, అవి లేక పేలవంగా ఉందని సీఎం పెదవి విరిచారు. దీంతో ఆర్టీసీ అధికారులు దాన్ని జేసీబీఎల్ వర్క్‌షాపునకు తరలించారు. అయితే బస్సులోని ఆడియో వ్యవస్థ బాగానే ఉందని అక్కడి ఇంజనీర్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో వినియోగించిన సీడీ ఖాళీగా ఉందని, అందులో పాటలు లేకపోవటం వల్లే పనిచేయలేదని గుర్తించారు. బస్సులోని ఆధునిక వ్యవస్థపై అవగాహన లేకపోవటంతో సిబ్బంది సరిగా వ్యవహరించలేదని వారు పేర్కొన్నట్టు తెలిసింది. అవగాహన ఉన్న వ్యక్తిని కొద్దిరోజుల పాటు బస్సులో ఉంచాలని, లేకుంటే కొత్తవారికి దాని వివరాలు తెలియక లోపాలున్నట్టు భ్రమపడే అవకాశం ఉందని చెప్పారు. ఇక బస్సు వెలుపల ఆకుపచ్చ రంగు స్ట్రైప్‌పై పూలు, ఆకుల స్టిక్కర్లను అప్పటికప్పుడు అతికించారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు బస్సును అందజేయనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
హరితహారాన్ని ప్రారంభించిన కేసీఆర్
చిలకూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హరితహారాన్ని ప్రారంభించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చిలుకూరులో కేసీఆర్ మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. అంతకుముందు చిలుకూరు బాలాజీ ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలుకూరులో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. మూడేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటడమే హరితహారం లక్ష్యమని చెప్పారు. వన సంపద చాలా విలువైనదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.