హరితహారంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి
Published Mon, Jul 25 2016 11:43 PM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : మానవాళి మనుగడకు చెట్లు ఎంతో ఉపయోగపడుతాయని కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చెట్లను నరికివేయకుండా చూసుకోవాలని, హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలని అన్నారు. నీడనిచ్చే మొక్కలతో పాటు ఫలాలనిచ్చే మొక్కలు నాటుకోవాలని సూచించారు. దానిమ్మ వల్ల సి విటమిన్ లభిస్తుందని, హైబ్రీడ్ జాతికి చెందిన మొక్కలు ఒక సంవత్సరంలోనే ఫలాలనిస్తాని తెలిపారు. ఉసిరి, కరివేపాకు మొక్కలు నాటుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా హరితహారం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్షి్మనారాయణ, ఐసీడీఎస్ పీడీ జ్యోత్సS్న, ఏపీడీ ఝాన్సీలక్షి్మబాయి, డీసీపీఓ నర్మద, సీడీపీఓలు ఎన్‌ఐసీ రాములు, శిశుగృహ మేనేజర్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement