వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, ఇతర అధికారులు
- నాటిన వాటిని సంరక్షిస్తున్నాం.. కలెక్టర్ రోనాల్డ్ రోస్
- అటవీ పర్యావరణ ముఖ్య కార్యదర్శి మీనా వీడియో కాన్ఫరెన్స్
సంగారెడ్డి జోన్: హరితహారంలో భాగంగా ఈ ఏడాది జిల్లాలో మూడు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. అటవీ పర్యావరణ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 2.22 కోట్ల మొక్కలు నాటినట్టు చెప్పారు. నాటిన మొక్కలను రక్షించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 164 గ్రామ పంచాయతీల్లో వంద శాతం లక్ష్యాన్ని సాధించినట్టు చెప్పారు. వచ్చే ఏడాది హరితహారం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
మొక్కలను సంరక్షించాలి: మీనా
వీడియో కాన్ఫరెన్స్‌లో బీఆర్ మీనా కలెక్టర్లతో మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. నాటిన మొక్కలను సంరిక్షించాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి అడిషనల్ పీసీఎఫ్ డాబ్రియల్, డీఎఫ్‌ఓ సుధాకర్ రెడ్డి, ఎక్సైజ్ డీసీ ఖురేషి, డ్వామా పీడీ సురేందర్‌కరణ్ తదితరులు పాల్గొన్నారు.