District Collector
-
ఆదిలాబాద్ జిల్లాలోని విత్తన గౌడౌన్లలో తనిఖీలు
-
నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు?
భోపాల్: నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు? అంటూ ట్రక్కు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు పడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ జిల్లాలో జరిగింది. న్యాయ సంహిత బిల్లులోని హిట్ అండ్ రన్ నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో షాజాపూర్ కలెక్టర్ కిశోర్ కన్యాల్ మంగళవారం సమావేశమయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని, విధుల్లో చేరాలంటూ వారిని హెచ్చరించారు. తమతో సక్రమంగా మాట్లాడాలని ఓ ప్రతినిధి చెప్పగా, కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. నీ స్థాయి ఎంత? అంటూ మండిపడ్డారు. తమకు ఏ స్థాయి లేదు కాబట్టే ఈ పోరాటం చేస్తున్నామని ఆ ప్రతినిధి బదులిచ్చాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు కలెక్టర్ కిశోర్ కన్యాల్‌ను ఆ పదవి నుంచి తొలగింగి, రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీగా బదిలీ చేసినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. -
అధికారులు, జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే అనిల్ కుమార్
-
నేడే మద్యం లాటరీలు
సాక్షి, హైదరాబాద్/జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రానున్న రెండేళ్ల కాలానికిగాను లైసెన్సుల మంజూరు కోసం నేడు(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్‌షాపులకు లాటరీలు నిర్వహించనున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18వ తేదీన ముగిసిన నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘డ్రా’తీయనున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వీడియో చిత్రీకరణ ద్వారా ఈ లాటరీల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, ఈ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, లాటరీలో విజేతలకు వెంటనే షాపుల కేటాయింపు ఉత్తర్వులు అందజేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. ఎంట్రీ పాసులు ఉన్నవారిని మాత్రమే డ్రా తీసే ప్రదేశంలోకి అనుమతించాలని, లాటరీ ప్రక్రియ విషయంలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. కాగా, మంత్రి ఆదివారం మహబూబ్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో కూడా ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లాటరీ ప్రక్రియ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. -
22(ఎ) జాబితా నుంచి.. ఆ భూముల్ని తొలగించవచ్చు
సాక్షి, అమరావతి: పేదలకు 1954వ సంవత్సరానికి ముందు ఇచ్చిన (అసైన్డ్) భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు స్పష్టతనిస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ), ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తాజాగా సర్క్యులర్ జారీచేశారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ తమ జిల్లాలో ఉన్న పరిస్థితిని వివరిస్తూ దీనిపై స్పష్టత ఇవ్వాలని సీసీఎల్‌ఏని కోరారు. కర్నూలు జిల్లాలో 5,382.78 ఎకరాల ప్రభుత్వ భూమిని 1954 జూన్ 18 నాటికి 2,755 మంది నిరుపేదలకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చారని, ఈ భూములను నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఎ) 1 నుంచి తొలగించడంపై పలు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఆ భూముల్ని 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చా? లేదా? అనే దానిపై తగు సూచనలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీసీఎల్ఏ స్పష్టతనిస్తూ 22 (ఎ) కేసులను త్వరితగతిన పరిష్కరించడం కోసం 2022 సెప్టెంబర్ ఒకటో తేదీన జిల్లా కలెక్టర్లకు అన్ని అంశాలపైనా తగిన వివరణలు, సూచనలతో ఒక సర్క్యులర్ ఇచ్చినట్లు తెలిపారు. మరోసారి దీనిపై స్పష్టతనిస్తూ.. 1954 జూన్ 18కి ముందు పేదలకు (డిప్రెస్డ్ క్లాసెస్) షరతులతోగానీ, షరతులు లేకుండా గానీ ఇచ్చిన భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చని స్పష్టంచేశారు. ఆ భూములకు సంబంధించిన పట్టాలు అందుబాటులో ఉన్నా, లేకపోయినా రెవెన్యూ రికార్డుల ఆధారంగా సుమోటోగా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. అసైన్డ్ భూముల వ్యవహారంపై తరచూ ప్రశ్నలు వస్తుండడంతో ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఈ సర్క్యులర్ ఇచ్చింది. స్వాతంత్య్రానికి ముందు పేదలకిచ్చిన భూములను 22(ఎ) జాబితా నుంచి తీసివేయాలని గతంలోనే ప్రభుత్వం స్పష్టంచేసినా జిల్లా కలెక్టర్లు, జేసీలు రకరకాల కారణాలు, వివాదాల భయంతో వాటి జోలికి వెళ్లడంలేదు. నిబంధనల ప్రకారం చేయాల్సిన వాటిని కూడా చేయకుండా నాన్చుతున్నారు. అందులో భాగంగానే తమ వద్దకు వచ్చే ఇలాంటి పిటిషన్లపై తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా సీసీఎల్ఏకి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ వ్యవస్థకి సంబంధించి అనేక అంశాలపై జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఉన్నాయని సీసీఎల్ఏ తరచూ స్పష్టంచేస్తూనే ఉన్నారు. ఇలాంటి అంశాలపై తామిచ్చిన మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. అందులో భాగంగానే 1954 ముందు పేదలకిచ్చిన భూములను 22 (ఎ) నుంచి నిరభ్యంతరంగా తొలగించవచ్చని తాజా సర్క్యులర్ ఇచ్చారు. -
కర్నూలు తొలి మహిళా కలెక్టర్‌గా బాధ్యతలు.. డాక్టర్ సృజన ఏమన్నారంటే..
కర్నూలు(సెంట్రల్): ‘‘నేను ఎక్కువగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో పనిచేశా. మొదటగా జిల్లాలోని సమస్యలపై అవగాహన పెంచుకుంటా. ఆ తరువాత వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతూ అభివృద్ధిలో జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తా’’ అని జిల్లా నూతన కలెక్టర్ డాక్టర్ జి.సృజన అన్నారు. సోమవారం ఉదయం 9.37 గంటలకు కలెక్టర్ తన చాంబర్లో తొలి మహిళా కలెక్టర్‌గా సర్వమత ప్రార్థనలు అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు కలెక్టర్‌గా రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు, రీసర్వేపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే గుడిసెలు లేని రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుందన్నారు. రీసర్వేతో వందేళ్ల భూ సమస్యలకు చెక్ పడుతుండడంతో ప్రాధాన్యతగా తీసుకొని పనిచేస్తానన్నారు. ఇక అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానన్నారు. కార్యక్రమంలో కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్‌తేజ, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఆర్డీఓ హరిప్రసాద్, కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్, కేఆర్ఆర్సీ ఎస్డీసీ నాగప్రసన్న లక్ష్మీ, డీఆర్డీఏ పీడీ ఎం.వెంకటసుబ్బయ్య, సీపీఓ అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసినా స్పందిస్తా నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటా.. ప్రజా సమస్యలపై వాటాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసినా స్పందిస్తా. ఏ అంశంలోనైనా వేగంగా స్పందించడానికే ఇష్టపడతా’’ అని కలెక్టర్ జి.సృజన అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ముందుగా ఒక్కో అధికారిని పరిచయం చేసుకొని పాలనలో తన ప్రాధాన్యత అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం కలిగేలా పనిచేయాలన్నారు. అధికారులు సమయ పాలన పాటించకపోయినా, బాధ్యతా రహితంగా వ్యవహరించినా సహించేది లేదని మొదటి సమావేశంలోనే నిక్కచ్చిగా తెలిపారు. నిత్యం ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటానని.. ఫైళ్లను ఈ–ఆఫీసులోనే పంపాలని, అప్పుడే వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఫైళ్ల నిర్వహణలో సమస్యలు ఉంటే అధికారులు నేరుగా తనకు ఫోన్ చేయవచ్చన్నారు. మండలస్థాయిలోని స్పెషల్ ఆఫీసర్ వ్యవస్థతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే డాక్టర్ జి.సృజన తనదైన శైలిలో విధి నిర్వహణలో పాల్గొన్నారు. ఉదయం స్పందన, జిల్లా ఉన్నతాధికారుల సమావేశాల్లో తన లక్ష్యాలేమిటో వివరించారు. సాయంత్రం కలెక్టరేట్ సమూదాయంలో ఏ అధికారి కార్యాలయం ఎక్కడుందో పర్యటించి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ‘స్పందన’ కంటితుడుపు కాదు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కంటి తుడుపు కాదని, అధికారులు శ్రద్ధగా పనిచేయకపోతే ఇబ్బందులు తప్పవని జిల్లా కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. మండల, సచివాలయ స్థాయిల్లో పరిష్కారం కావాల్సిన సమస్యలు జిల్లా స్థాయి స్పందనకు రావడంపై ఆమె అధికారులను నిలదీశారు. తీరు మార్చుకోవాలని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె స్పందనలోనే మొదట పాల్గొని ప్రజల నుంచి వినుతులు స్వీకరించారు. స్పందనలో డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఎస్డీసీలు రమా, సీపీఓ అప్పలకొండ, డీఆర్డీఏపీడీ ఎం.వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఏమన్నారంటే.. ► స్పందనలో వచ్చిన 30–40 సమస్యల్లో అధికంగా మండల, గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిష్కారం కావాల్సిన చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ వచ్చి మూడేళ్లవుతున్నా అక్కడ ఎందుకు పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలేదు. ► స్పందనలో వచ్చిన సమస్యల్లో పరిష్కరించే అధికారికి కాకుండా ఇతరులకు పంపితే ఆ ఫిర్యాదు రిజెక్ట్ అవుతుంది. తద్వారా అర్జీదారుడు పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ► స్పందన సమస్యలను గడువులోపు పరిçష్కరించాలి. తిరస్కరించిన సమస్యలకు తగిన కారణాలతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా చూడాలి. ► ‘జగనన్నకు చెబుతాం’ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ కార్యక్రమాన్ని సీఎంఓ నుంచి అధికారులు పర్యవేక్షిస్తారు. దివ్యాంగుల దగ్గరికే వెళ్లి అర్జీల స్వీకరణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ జి.సృజన మొదటి అధికారిక కార్యక్రమం స్పందనలో తన సేవా గుణాన్ని చాటుకున్నారు. స్పందనకు వచ్చిన వికలాంగులు, అంధుల దగ్గరికే వెళ్లి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ‘‘గతంలో స్పందన సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు. ఇప్పటి నుంచి ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలి. లేకపోతే ఏ కారణంతో చేయలేకపోతున్నారో ఎండార్స్మెంట్లో స్పష్టం చేయాలి.’’ – జి.సృజన, జిల్లా కలెక్టర్ -
మా సార్ బయటికి వచ్చేటప్పటికి కారును చల్లగా ఉంచాలి
హన్మకొండ అర్బన్: కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎర్త్ డేకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించి ప్రకృతి పరిరక్షణ గురించి చెబుతున్న సందర్భం.. అదే సమయంలో కలెక్టరేట్ ఆవరణలో ఓ ప్రభుత్వ వాహనం మూడు గంటలుగా ఆన్‌లోనే ఉంచి.. డ్రైవర్ ఏసీ వేసుకుని ఉన్నాడు.. ఇదేమిటి.. ఇన్ని గంటలు కారును ఆన్‌లోనే ఉంచావు అని అడిగితే ‘మా సార్ బయటికి వచ్చేటప్పటికి కారును చల్లగా ఉంచాలి’ అని సమాధానం. ఇంతకు ఆ కారు ఎవరిదంటే.. బల్దియా ఎస్ఈ అధికారిక వాహనం. గ్రీవెన్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. కార్యక్రమం ముగిసి బయటికి వచ్చేంతవరకు కారును ఇలా ఆన్‌లోనే ఉంచడం గమనార్హం. ఇదేనేమో ఇంధన పొదుపు.. పర్యావరణ పరిరక్షణ అంటే.. !! -
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆస్తులను జప్తు చేయాలని డిస్ట్రిక్ట్ అడిషనల్ కోర్టు తీర్పునిచ్చింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు నష్ట పరిహారం ఇవ్వాలని 2012లో బాల్కొండ ప్రాంత రైతాంగం కోర్టును ఆశ్రయించగా నష్టపరిహారం కింద బాధితులకు రూ.62,85,180 చెల్లించాలని కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే అధికారులు 51,13,350 మాత్రమే జమ చేశారు. దీంతో రైతులు తిరిగి కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పును అమలు చేయనందున జిల్లా కలెక్టరేట్ ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. చదవండి: (వైఎస్సార్ పాదయాత్ర దేశ రాజకీయాలలో ఓ సంచలనం: భట్టి) -
బాబును ఎత్తుకొని కలెక్టర్ ప్రసంగం
చంకలో మూడేళ్ల బాబుతో ప్రసంగిస్తున్నది కేరళలోని పత్థనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్. ప్రైవేట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కుమారునితో పాటు హాజరైన ఆమె బాబును చంకలో ఎత్తుకునే ప్రసంగించారు. ఈ వీడియో వైరలైంది. అయ్యర్ తీరు ఐఏఎస్ వంటి ఉన్నతాధికారి బాధ్యతల నిర్వహణలో అనుసరించాల్సిన నైతిక విలువలకు తగ్గట్టుగా లేదంటూ విమర్శలు విన్పిస్తున్నాయి. దాంతో వీడియోను డిలీట్ చేశారు. మరోవైపు పలువురు కలెక్టర్ చర్యను సమర్థిస్తున్నారు. 2018లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తన మూడేళ్ల కూతురితో హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అది అనధికారిక కార్యక్రమం కాబట్టే తన భార్య బాబును తీసుకెళ్లిందని కలెక్టర్ భర్త, కేరళ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కేఎస్ శబరినాథన్ చెప్పుకొచ్చారు. -
కేటుగాళ్లు.. కలెక్టర్ డీపీ పెట్టుకుని 1.40 లక్షలు కొట్టేశారు
సూర్యాపేట క్రైం: కలెక్టర్ డీపీ పెట్టుకుని ఏకంగా జిల్లా అధికారి అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.40 లక్షలు కాజేశారు. సూర్యాపేట కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ డీపీతో కేటుగాళ్లు వాట్సాప్ నంబర్‌తో డీఎంహెచ్‌వో డాక్టర్ కోటాచలం నంబర్‌కు మెసేజ్ చేశారు. నాకు అర్జెంటుగా రూ.1.40 లక్షలు కావాలని కోరారు. దీంతో నిజంగానే కలెక్టర్ మెసేజ్ పెట్టారని నమ్మి సదరు వైద్యాధికారి ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా ఏకంగా రూ.1.40 లక్షల విలువైన ఆరు అమెజాన్ గిఫ్ట్ కార్డులను పంపించారు. వెంటనే అదే నంబర్ నుంచి ఇంకో రూ.20 వేలు పంపించాలని సైబర్ నేరగాడు అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారి ఆ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పనేనని గ్రహించి ఆ అధికారి సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..) -
వారం వారం.. ప్రగతి లక్ష్యం.. కొత్త విధానానికి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాలన యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించి, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలను సత్వరంగా అమలు చేయడంలో భాగంగా జిల్లా కలెక్టర్లకు వారం వారం లక్ష్యాలను నిర్దేశించే కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శ్రీకారం చుట్టారు. ప్రతి ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్లకు వాట్సాప్ ద్వారా.. సోమవారం నుంచి వారం రోజుల పాటు దృష్టి సారించాల్సిన అంశాలు, సాధించాల్సిన పురోగతిపై స్పష్టమైన లక్ష్యాలను విధిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కుంటి నడకతో.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయికి వెళ్లే సరికి ముందుకు పురోగమించడం లేదు. క్షేత్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తతతో కొన్ని ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో తలెత్తుతున్న సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలపై విస్తృత రీతిలో సమీక్షలు జరుపుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో కొంతకాలం అధికార యంత్రాంగం హడావుడి చేసినా సమస్యలు కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే సీఎస్ చర్యలు చేపట్టారు. ప్రాధాన్యత అంశాల అమలుపై ప్రతివారం లక్ష్యాలను నిర్దేశించి పురోగతిని సమీక్షించాలని నిర్ణయించారు. తాజాగా ఈ వారం ఐదు అంశాలపై దృష్టి సారించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలని సూచించారు. 1. పోడుపై సమన్వయ కమిటీ సమావేశాలు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల సమస్యకు పరిష్కారం కల్పించడంలో భాగంగా ఈ వారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలి. గ్రామ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి గడువు నిర్దేశించుకోవాలి. ఎప్పటిలోగా ఈ పనిని పూర్తి చేస్తారో తెలియజేయాలి. 2. పెన్షన్ కార్డుల పంపిణీ పూర్తి చేయాలి ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ వారంలోగా పూర్తి చేయాలి. గ్రామ పంచాయతీ స్థాయిలో పంపిణీ చేపట్టాలి. ఒక్కో ఎమ్మెల్యే రోజుకు 8 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. కార్యక్రమం పూర్తికి లక్షిత తేదీని తెలియజేయాలి. 3. క్రమబద్ధీకరణ దరఖాస్తులు పరిశీలించాలి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదలు నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించడానికి జారీ చేసిన జీవో 59 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలను ప్రారంభించి రెండు వారాల్లోగా పూర్తి చేయాలి. ఇందుకు సరిపడ సంఖ్యలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తుల పరిశీలన జరపాలి. 4. ధరణి సమస్యలకు సత్వర పరిష్కారం ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా టీఎం33 కింద ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పట్టాదారు పేరు, విస్తీర్ణం, భూమి స్వభావం, మిస్సింగ్ సర్వే నంబర్ల నమోదు గురించి వచ్చే దరఖాస్తులను పరిష్కరించాలి. ఎన్ని దరఖాస్తులు ఆమోదించారో, ఎన్ని తిరస్కరించాలో ఎప్పటికప్పుడు వివరాలు పంపాలి. ముఖ్యంగా నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలి. 5. విషాహార ఘటనలు పునరావృతం కావొద్దు రాష్ట్రంలోని గురుకుల, కేజీబీవీ వసతి గృహాల్లో విషాహార ఘటనలు పునరావృతం కాకూడదు. ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యహరించాలి. పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఇదీ చదవండి: ఎన్ఐఏ పంజా.. నిజామాబాద్ కేంద్రంగా ఉగ్రవాద శిక్షణపై ఫోకస్ -
జిల్లా కలెక్టర్‌కే ఝలక్ ఇచ్చిన కోతి.. ఏం చేసిందంటే?
లక్నో: ఒక జిల్లాకు కలెక్టర్ అధిపతి. జిల్లాలో ఆయనను మించిన పవర్ఫుల్ వ్యక్తి మరొకరు ఉండరు. అయితే, అలాంటి వ్యక్తికే ఝలక్ ఇచ్చింది ఓ కోతి. చుట్టూ పదుల సంఖ్యలో పోలీసులు, స్థానికులు ఉన్నప్పటికీ కలెక్టర్ కంటి అద్దాలను ఎత్తుకెళ్లి తానేంటో చూపించింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్, మథురాలోని బృందావన్ నగరంలో వెలుగు చూసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. జిల్లా మెజిస్ట్రేట్ నవనీత్ చాహల్ గ్లాసెస్‌ను ఎత్తుకెళ్లిన వానరం దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు భారత అటవీ సర్వీసెస్(ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద. కలెక్టర్ నవనీత్ చాహల్, పలువురు పోలీసులు ఓ భవనం వద్ద గుమిగూడి కోతి నుంచి గ్లాసెస్ ఎలా తెచ్చుకోవాలో ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ భవనం గోడలపై ఇతర కోతులు సైతం ఉన్నాయి. కొద్ది సేపు బుజ్జగించిన తర్వాత కంటి అద్దాలను తిరిగి ఇచ్చేసింది ఆ వానరం. ‘భారత్‌లోని ఓ జిల్లాలో డిస్ట్రిక్ట్ మెజిస్టేట్ను మించిన పవర్ఫుల్ వ్యక్తి ఉండడు. బృందావన్‌లో డీఎం నవనీత్ చాహల్ అద్దాలను కోతీ ఎత్తుకెళ్లింది. కొద్ది సమయం బుజ్జగించిన తర్వాత తిరిగి ఇచ్చేసింది’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు సుశాంత నంద. If you had not seen someone more powerful than District Magistrate of a District in India😊 Monkey snatches glasses from DM Navneet Chahal in Vrindavan, Mathura.After some pleading,the monkeys returned the glasses. pic.twitter.com/YTERfjh62G — Susanta Nanda IFS (@susantananda3) August 21, 2022 ఇదీ చదవండి: మెడలో విష సర్పంతో అతిచేష్టలు.. నిండు ప్రాణం బలి! -
కలెక్టర్‌వా? పోలిటికల్ ఏజెంట్‌వా?
భోపాల్: ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థిని పక్కనపెట్టి.. ఓడిన అభ్యర్థిని విజేతగా ప్రకటించిన నేరానికి ఓ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ పోస్ట్‌కే అనర్హుడివంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ ఎన్నికల్లో ఓడిన ఓ అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటించారు పన్నా జిల్లా కలెక్టర్ సంజయ్ మిశ్రా. దీంతో న్యాయమూర్తి ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పన్నా కలెక్టర్ సంజయ్ మిశ్రా-ఫైల్ ఫొటో పన్నా జిల్లాలో జులై 27వ తేదీన 25 మంది సభ్యులున్న గున్నూర్ జనపద్ పంచాయతీకి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరిగాయి. వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి పరమానంద శర్మ బీజేపీ అభ్యర్థి రామ్‌శిరోమణి మిశ్రాను ఓడించారు. అయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ పరమానంద శర్మను విజేతగా ప్రకటించగా.. రామ్‌శిరోమణి మాత్రం పన్నా కలెక్టర్ సంజయ్ మిశ్రాను ఆశ్రయించి వ్యవహారాన్ని మరో మలుపు తిప్పారు. దీంతో ఆ మరుసటి రోజు లాటరీ ద్వారా ఎన్నికలు నిర్వహించి.. రామ్శిరోమణిని విజేతగా ప్రకటించారు కలెక్టర్ సంజయ్ మిశ్రా. దీంతో పరమానంద శర్మ హైకోర్టును ఆశ్రయించారు. తన వాదనను వినిపించేందుకు సమయం కూడా ఇవ్వలేదని పిటిషన్లో అభ్యర్థించారు. పిటిషన్‌పై విచారణ సందర్భగా.. జస్టిస్ వివేక్ అగర్వాల్, కలెక్టర్ సంజయ్ మిశ్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనొక పొలిటికల్ ఏజెంట్‌గా వ్యవహారించారు. కలెక్టర్‌గా ఉండే అర్హత ఆయనకు లేదు. కలెక్టర్ విధుల నుంచి ఆయన్ని తొలగించాలి అని న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
వాట్ యాన్ ఐడియా సర్ జీ! అధికారులకు కొత్త రకం ఫోన్లు ఇచ్చిన కలెక్టర్
సాక్షి, చెన్నై: తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్‌కుమార్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన పరిధిలోని అధికారులతో సమన్వయం కోసం అందరికీ పుష్..టు టాక్ పేరిట కొత్త రకం ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చా రు. వివరాలు.. ప్రదీప్‌కుమార్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిధిలోని అధికారులను ప్రజా సేవలో సమన్వయ పరిచేందుకు, ప్రభుత్వ కార్యాక్రమాల విస్తృతం చేయడమే లక్ష్యంగా కొత్త ప్రయోగంపై ఆయన దృష్టి పెట్టారు. ఇందుకోసం విదేశాల నుంచి పుష్ టు టాక్ పేరిట 35 కొత్త రకం ఫోన్లను కొనుగోలు చేశారు. ఆపదలో రక్షణ కవచం.. తొలి విడతగా జిల్లా పరిధిలోని రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి విభాగాల అధికారులకు ఈ పుష్ టు టాక్ ఫోన్లను అందజేశారు. అయితే, ఈ ఫోన్లకు నంబర్లు ఉండవు. ఎవరెవరి చేతిలో ఈ ఫోన్లు ఉన్నాయో కేవలం వారి పేర్లు మాత్రమే ఉంటాయి. సంబంధిత అధికారితో అత్యవసరంగా మాట్లాడదలిచినా, సమాచారం అందజేయాలని భావించినా ఇందులో ప్రత్యేక ఆఫ్షన్లు ఉంటాయి. కలెక్టర్ మాత్రం ఒకేసారిగా 35 మందితో మాట్లాడేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే, ఆయా అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారో కలెక్టర్ ఇట్టే పసిగట్టేందుకు కూడా అవకాశం ఉంది. ఈ ఫోన్లు డైరెక్ట్‌గా మొబైల్ టవర్ల ద్వారా పనిచేస్తాయి. మహిళా అధికారులు ఎక్కడైనా తనిఖీలకు వెళ్లిన సమయంలో ఏదేని ప్రమాదం తలెత్తినా, ఆపదలో ఉన్నా.. ఇందులోని ఎస్ఓఎస్ అనే ఎమర్జెన్సీ బటెన్‌ను నొక్కగానే అందరికీ సమాచారం క్షణాల్లో వెళ్తుంది. సమీపంలోని ఉన్నతాధికారులు తక్షణం అక్కడికి చేరుకుని అండగా నిలుస్తారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, తాను ఏదేనా సమాచారం పంపిన పక్షంలో, అధికారులు ఇతర పనుల్లో ఉంటే ఆ వివరాలు ఈ ఫోన్లలో అట్టే నిల్వ ఉంటాయని పేర్కొన్నారు. అధికారులు ఎవరైనా ఆపదలో ఉన్న పక్షంలో ఆరంజ్ కలర్ బట్టన్‌ను నొక్కితే చాలు అని, తనతో పాటుగా అందరం తక్షణం సంబంధిత ప్రాంతానికి చేరుకుంటామని వివరించారు. సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్లేందుకే ఈ ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. -
వాన దేవునిపై ఫిర్యాదు.. వైరలవుతోన్న లేఖ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు వర్షాభావంతో అల్లాడుతున్నాయి. దాంతో సకాలంలో వానలు కురిపించని వరుణుడిపై, అతనికి ఆ మేరకు ఆదేశాలివ్వని ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎన్ వర్మ అనే ఓ రెవెన్యూ అధికారి తీర్మానించాడు! ఈ మేరకు ఏకంగా జిల్లా కలెక్టర్‌కే సిఫార్సు చేశాడు!! జరిగిందేమిటంటే...వర్షాభావానికి ఇంద్రుడు, వరుణుడే బాధ్యులని ఆరోపిస్తూ ఫిర్యాదుల స్వీకరణ దినం (సమాధాన్ దివస్) సందర్భంగా గోండా జిల్లాకు చెందిన సుమిత్‌కుమార్ యాదవ్ అనే రైతు వర్మకు లేఖ ఇచ్చాడు. జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల జనజీవనంపై ప్రతికూల ప్రభావం పడిందని యాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులపై ఇద్రుడిని నిందిస్తూ ఇలా లేఖ రాశారు. చాలా నెలలుగా వర్షాలు పడలేదని గౌరవనీయమైన అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి జంతువులు, వ్యవసాయంపై కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీంతో ఆయా కుటుంబాల్లోని మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున, ఈ విషయంలో వరుణుడిపై తగు చర్యలు తీసుకుని బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాము.’ అని పేర్కొన్నాడు. ఇంతో ఎన్ఎన్ వర్మ .. లేఖను పూర్తిగా చదవకుండానే ‘బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవా’లని సిఫార్సు చేస్తూ ఆ లేఖను ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి పంపాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. దాంతో నాలుక్కరుచున్న వర్మ, తానసలు ఆ లేఖ పంపనే లేదు పొమ్మని బుకాయిస్తున్నాడు. సమాధాన్ దివస్‌లో వందలాది ఫిర్యాదులు వస్తుంటాయి గనుక బహుశా చదవకుండానే లేఖను ఫార్వర్డ్ చేసి చిక్కుల్లో పడ్డాడని అధికారులు అంటున్నారు. ఇంతకూ ఇంద్ర వరుణులపై కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలంటూ నెటిజన్లు హాస్యం పండిస్తున్నారు. -
జోరువానలోనూ కలెక్టర్, ఎంపీ పర్యటన
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఒకవైపు ఉరుములు, పిడుగులతో భారీ వర్షం పడుతున్నా కూడా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కొయ్యూరు మండలంలోని కిత్తాబు గ్రామాన్ని సందర్శించారు. మంత్రి, కలెక్టర్ సోమవారం నాడు గానుగుల వరకు ప్రభుత్వ వాహనాల్లో వెళ్లి, అక్కడి నుంచి 2 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి కిత్తాబు గ్రామానికి చేరుకున్నారు. జడివానలో తడుచుకుంటూ గ్రామానికి చేరుకున్న మంత్రి, అధికారులను చూసి గిరిజనులు అమితమైన ఆనందానికి లోనయ్యారు. గ్రామంలో తమ సమస్యలను వివరించారు. వారి మాటల్ని ఓపికగా విన్న కలెక్టర్, మంత్రి వెంటనే సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
ఆ అధికారం జిల్లా కలెక్టర్లకే ఉంది
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూముల్లో ఏవి నిషేధిత భూములో తెలిపే జాబితాను రిజిస్ట్రేషన్ శాఖకు పంపే అధికారం జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ భూముల జాబితా పంపే అధికారం తహసీల్దార్లకు లేదని స్పష్టం చేసింది. కలెక్టర్లు పంపిన జాబితా ఆధారంగా మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారులు నడుచుకోవాలని తెలిపింది. ఇతర శాఖల అధికారులు కూడా ఈ జాబితాను జిల్లా కలెక్టర్ల ద్వారా పంపేందుకు మాత్రమే చట్టం అనుమతిస్తుందని తెలిపింది. ఈ జాబితాలోని భూముల వివరాలను కలెక్టర్లు పరిశీలించి, సంతృప్తికరంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ అధికారులకు పంపాలని స్పష్టం చేసింది. కలెక్టర్లు కాకుండా ఇతర అధికారులు నేరుగా పంపిన జాబితాను రిజిస్ట్రేషన్ అధికారులు వెనక్కి పంపి, కలెక్టర్ల ద్వారా జాబితా పంపాలని కోరవచ్చునని తెలిపింది. చిత్తూరు జిల్లా కురబలకోట మండల తహసీల్దార్ అంగల్లు గ్రామంలోని 3.14 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేరుస్తూ మదనపల్లి సబ్ రిజిష్ట్రార్‌కు పంపడాన్ని హైకోర్టు చట్ట విరుద్ధంగా ప్రకటించింది. ఆ జాబితా ఆధారంగా ఆ భూమిని విక్రయించేందుకు పిటిషనర్లు సమర్పించిన డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించడాన్ని తప్పుపట్టింది. ఆ డాక్యుమెంట్లను స్వీకరించి, ఆ భూములపై రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఇతర నిషేధ ఉత్తర్వులు ఏవీ లేకుంటే రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిష్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పునిచ్చారు. ఇదీ నేపథ్యం అంగల్లు గ్రామంలోని రెండు సర్వే నంబర్లలో 3.88 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు డి.కృష్ణమూర్తి నాయుడికి కేటాయించారు. ఆయన మరణానంతరం ఆ భూమిని పొందిన వ్యక్తులు అందులో 3.14 ఎకరాలని ఇతరులకు విక్రయించేందుకు సబ్ రిజిస్ట్రార్‌కు డాక్యుమెంట్లు సమర్పించారు. ఆ భూమి తహసీల్దార్ పంపిన నిషేధిత భూముల జాబితాలో ఉండటంతో సబ్‌రిజిస్ట్రార్ ఆ డాక్యుమెంట్లను స్వీకరించలేదు. దీంతో భూమి విక్రేతలు దొమ్మాలపాటి సరళ, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి విచారణ జరిపి ఇటీవల తీర్పునిచ్చారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది కొవ్వూరి వీఆర్ రెడ్డి, ప్రభుత్వం తరపున సహాయ న్యాయవాది (ఏజీపీ) వాదనలు వినిపించారు. -
కోర్టుకు బయలుదేరిన తండ్రి, కుమార్తె అదృశ్యం
సాక్షి, అమరావతి: కోర్టుకు వాస్తవాలను వివరించేందుకు బయలుదేరిన తండ్రి, కుమార్తెను కొందరు అడ్డుకున్న ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ చేత విచారణ జరిపించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ యువతిని, ఆమె తండ్రిని శుక్రవారం ఉదయం తమ ముందు వ్యక్తిగతంగా హాజరుపరచాలని నిర్దేశించింది. ఆకస్మిక అదృశ్యంపై వారి వాంగ్మూలాలను నమోదు చేసి వాస్తవాలు తేలుస్తామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మజ్జి మాధవి వయస్సు 20 ఏళ్లు అయినప్పటికీ 10వ తరగతి చదువుతుందన్న కారణంతో శ్రీకాకుళం జిల్లా రావిచాద్రి గ్రామస్థాయి బాల్యవివాహ నిషేధ అధికారి ఆమె వివాహాన్ని అడ్డుకుంటున్నారంటూ మజ్జి ఆదినారాయణ, ఆయన కుమార్తె మజ్జి మాధవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాలని శిశుసంక్షేమ శాఖ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. కేసు తిరిగి విచారణకు రాగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. పిటిషనర్ ఆదినారాయణే తన కుమార్తెకు 18 ఏళ్లు నిండిన తరువాత వివాహం చేస్తానంటూ అధికారులకు రాసిచ్చారని తెలిపారు. దీనిపై పిటిషనర్ల న్యాయవాది వి.సుధాకర్‌రెడ్డి ఈ విషయాన్ని పిటిషనర్లతో మాట్లాడి నిర్ధారణ చేసుకుంటానని చెప్పడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. న్యాయవాది సుధాకర్‌రెడ్డి పిటిషనర్లతో మాట్లాడగా.. అధికారులు తెల్లకాగితాలపై తమ వేలిముద్రలు తీసుకున్నారని, తామెలాంటి రాతపూర్వక వివరాలివ్వలేదని చెప్పారు. ఈ విషయాలను స్వయంగా కోర్టుకు తెలిపేందుకు రావాలని సుధాకర్‌రెడ్డి సూచించగా ఆదినారాయణ, మాధవి బుధవారం శ్రీకాకుళం నుంచి విజయవాడ బయలుదేరారు. వారు కోర్టుకు రాలేదు. వారిని సంప్రదించేందుకు సుధాకర్‌రెడ్డి ప్రయత్నించినా వారి ఆచూకీ తెలియలేదు. వారు హైకోర్టుకు వస్తున్నారన్న విషయాన్ని వారి ఇంటి ఎదురుగా ఉన్న వలంటీర్ స్థానిక వీఆర్వోకు చేరవేశారని, తర్వాత తండ్రి, కుమార్తె ఆచూకీ తెలియడంలేదని న్యాయవాది సుధాకర్‌రెడ్డి గురువారం కోర్టుకు నివేదించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్ దేవానంద్ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని, పిటిషనర్లు ఆదినారాయణ, మాధవిలను శుక్రవారం కోర్టుముందు హాజరుపరచాలని కలెక్టర్‌ను ఆదేశించారు. -
అడవి జంతువులకు బోర్లేస్తరు.. మేమంతకన్నా హీనమా?
అన్నం తిన్నంక బిడ్డ నీళ్లడిగితే ఏం చెప్పాల్నో తెలుస్తలేదు. ఫారెస్టు వాళ్లు జంతువులకు బోర్లేస్తరు. మేం అంతకన్నా హీనమా? ఆన్లైన్ క్లాసులని పిల్లలంటే కరెంటు లేక, సిగ్నల్ రాక పిల్లలకు ఏం చెప్పమంటారు? మా ఊరికి రోడ్డు, బోరు, కరెంటు, ఆశ వర్కరు వచ్చే దాకా ఇక్కడ్నుంచి పోం. ఈడనే అటుకులు తింటం. బియ్యం వండుకుంటం. మేమేం జాబులు అడుగుతలేం. పైసలియ్యమంటలేం. ఊరి సమస్యలు తీర్చమంటున్నం. అందుకే ఇంత దూరం నడుసుకుంట వచ్చినం’అంటూ తమ పల్లె గోసను నీళ్లు తిరుగుతున్న కళ్లతో జిల్లా అధికారుల ముందు వెళ్లబోసుకుంది ఆదివాసీ బిడ్డ నిర్మల. నిర్మల్: తమ గ్రామ సమస్యలు తీర్చాలంటూ ఊరు ఊరే కదిలొచ్చింది. నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామవాసులంతా పిల్లాపాపలతో కలిసి 75 కిలోమీటర్లు నడిచి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చారు. కాళ్లకు చెప్పుల్లేకున్నా చిన్నారులు, మహిళలు వడివడిగా నడుస్తూ వచ్చేశారు. ఏడాది కిందే సమస్యలను విన్నవించినా పరిష్కరించలేదని ఇద్దరు అడిషనల్ కలెక్టర్ల ముందు తమ గోడు చెప్పుకున్నారు. ఇలా ఒక్క చాకిరేవే కాదు.. నిర్మల్ జిల్లాలోని పలు అటవీ గ్రామాలు ఇంకా కరెంటును చూడకుండా.. బీటీ రోడ్డు ఎక్కకుండా.. చెలిమల నీళ్లే దిక్కుగా బతుకీడుస్తున్నాయి. రాకెట్లు నింగికి పంపుతున్న ఈ కాలంలో, మిగులు విద్యుత్ మూటగట్టుకుంటున్న మన రాష్ట్రంలో ఇంకా గుడ్డి వెలుగురులోనే ముందుకు సాగుతున్నాయి. చెలిమల నీళ్లు తోడుకుంటున్న చాకిరేవు గ్రామస్తులు రాత్రిపూట ఏం కష్టమొచ్చినా ఇబ్బందే.. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి 75 కిలోమీటర్లు వెళ్తే పెంబి మండలంలోని అటవీ గ్రామం చాకిరేవు వస్తుంది. పెంబి నుంచి 4 కిలోమీటర్ల వరకు మట్టిరోడ్డుంది. మధ్యలో దొత్తివాగు వస్తుంది. దీనిపైన వంతెన లేదు. వాగు దాటాక దాదాపు 10 కిలోమీటర్లు ఆ ఊరి వరకు రోడ్డు లేదు. కరెంటు పోతే క్షణం ఉండలేని ఈరోజుల్లో అక్కడ అనాదిగా విద్యుత్‌ను చూడని కుటుంబాలున్నాయి. చీకటి పడితే ఇప్పటికీ నూనెలో వత్తి వేసుకుంటున్నాయి. 25–30 కుటుంబాలు ఉండే ఈ పల్లెలో పొద్దంతా వ్యవసాయం చేస్తూ చీకటి వేళకు ఇళ్లకు చేరుకుంటున్నారు. కరెంటుతో పాటు తాగు నీళ్లూ ఆ ఊరికి అందట్లేదు. కిలోమీటర్ల దూరంలోని వాగులు, చెలిమెలే దిక్కవుతున్నాయి. రాత్రిపూట ఏ కష్టం వచ్చినా ఇబ్బందే. ఊరంతా కలిసి టార్చిలైట్లు పట్టుకుని పరిష్కరించుకోవాల్సిందే. ప్రసవానికైనా, ప్రమాదం జరిగినా ఊరికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎడ్లబండ్లపైనే తీసుకురావాలి. ఈ కష్టాలను తీర్చాలంటూ ఊరు ఊరంతా నిర్మల్ కలెక్టరేట్ వరకు నడిచి వచ్చింది. ఇలా నడిచి వచ్చిన వారిలో పిల్లలు, వృద్ధులతో పాటు ఓ గర్భిణి ఉన్నారు. పెంబి నుంచి చాకిరేవుకు వెళ్లే మార్గం ఎన్నో గ్రామాల్లో నూనె దీపాలే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఆదివాసుల గూడేల్లో ఇంకా విద్యుత్, రోడ్డు, తాగునీటి సౌకర్యాల్లేవు. నిర్మల్ జిల్లా పెంబి మండలం సోముగూడ, చాకిరేవు, రాగిదుబ్బ.. కడెం మండలంలోని మిద్దెచింత, రాంపూర్, వస్పల్లి పంచాయతీ పరిధిలోని పలు గూడేలకు కరెంటు లేదు. చాలా కుటుం బాలు కిరోసిన్, మంచి నూనెతో దీపాలు పెట్టుకుంటు న్నాయి. గతంలో ఐటీడీఏ కొన్ని గ్రామాలకు సోలార్ లైట్లను పంపినా చాలావరకు పనిచేయట్లేదు. రోడ్లు లేక కాలినడకనే జనం నడుస్తున్నారు. అటవీ చట్టాలు, అనుమతుల పేరిట పెడుతున్న నిబంధనలే వీరికి శాపంగా మారుతున్నాయి. దీపం వెలుతురులో బియ్యం ఏరుతున్న యువతి ఊర్ల ఉంటే ఎవుసం చేసుకొనైనా బతుకుతం కరెంటు, మంచి నీళ్లు లేకుండా ఆ ఊర్లో ఎట్లుంటున్నరు? ఇన్ని కష్టాల మధ్య అడవిలో ఉండే కంటే వేరే దగ్గరికి పోవచ్చు కదా’అని ఆదివాసీ మహిళ లక్ష్మీబాయిని అడిగితే.. ‘ఎటుపోతం సారూ.. తాతల కాలం నుంచి మేం నమ్ముకు న్న భూములను ఇడిసి యాడికి పోవాల? ఏం పని చేసుకుని బతకాల? ఊర్ల ఉంటే ఇంత ఎవుసం చేసుకునైనా బతుకుతం’అని చెప్పింది. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడేలకు ఊరివాళ్లంతా కలిసి వినతిపత్రం ఇచ్చారు. తర్వాత కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. వీరి పాదయాత్రకు తెలంగాణ ఆదివాసీ సంఘం, బీజేపీ, వైఎస్ఆర్టీపీ నాయకులు మద్దతు తెలిపారు. -
దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దీర్ఘకాలిక భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏళ్ల తరబడి పరి ష్కారం కాకుండా పెండింగ్‌లో పడిపోయిన సమస్యల వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తోంది. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్లో సమస్యల వివరాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గ్రామం, మండలం, సర్వే నంబర్, భూ విస్తీర్ణం, సమస్య ఏంటి, పరిష్కారం ఎలా చేయాలి తదితర వివరాలతో నివేదికలు పంపాలని సూచించారు. దీంతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లు ఈ అంశంపై దృష్టి పెట్టి ప్రభుత్వం అడిగిన ఫార్మాట్లో నివేదికలను కలెక్టరేట్లకు పంపినట్టు సమాచారం. ఈ నివేదికల్లో పలు ఆసక్తికర భూ సమస్యలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలు స్తోంది. అయితే వీటిల్లో అనేక సమస్యల పరిష్కారం అంత సులభంగా అయ్యే పని కాదని, భూ సంబంధిత చట్టాలు మార్చాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. చట్టాలు మారిస్తేనే పరిష్కారం దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టడంపై రెవెన్యూ యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సమస్యలు పరి ష్కారం కావాలంటే చట్టాలు మార్చాల్సిం దేనని అంటున్నాయి. గత 20–30 ఏళ్లుగా రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ భూముల్లో పేద రైతులు సాగు చేసుకుంటున్నారని, వారికి ఆ ప్రభుత్వ భూమిని అధికారికంగా కేటాయించేందుకు రాష్ట్రంలో అమల్లో ఉన్న భూ చట్టాలు అనుమతించవని అంటున్నారు. అదే విధంగా జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల లోపు భూములను అసైన్ చేయడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయని, ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత ఈ సమస్య మరింత జఠిలం అయిందని పేర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అసైన్డ్ చట్టంలో మార్పులు చేయాలని అభిప్రాయపడుతున్నాయి. సమరయోధుల భూములూ చిక్కుముడులే.. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన భూములపై జరిగిన క్రయవిక్రయ లావాదేవీల పరిష్కారం కూడా అంత సులభం కాదని తెలుస్తోంది. వాస్తవానికి స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములను పదేళ్ల తర్వాత నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకుని అమ్ముకోవచ్చని చట్టం చెబుతోంది. అయితే ఎలాంటి ఎన్వోసీలు లేకుండానే చాలాచోట్ల సబ్ రిజిస్ట్రార్లు ఈ భూములను నిర్దిష్ట గడువు తర్వాత ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేశారు. సేల్డీడ్లు కూడా అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ భూములన్నీ ధరణి పోర్టల్‌లో ప్రభుత్వ భూములుగా కనబడుతున్నాయి. ఈ భూములకు ఎన్వోసీని కేవలం లబ్ధిదారుడైన స్వాతంత్య్ర సమరయోధుడు లేదా మాజీ సైనికుడి పేరిట ఇచ్చేందుకు మాత్రమే చట్టాలు అనుమతిస్తాయి. అందువల్ల ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ప్రజోపయోగ కార్యక్రమాల నిమిత్తం సేకరించిన పట్టా భూముల విస్తీర్ణాన్ని ఎడాపెడా నమోదు చేయడంతో చాలాచోట్ల సేకరించిన దాని కంటే ఎక్కువ విస్తీర్ణం ప్రభుత్వ ఖాతాలో జమ అయింది. ఇప్పుడు ఆ భూమిని పట్టాదారుకు ఇవ్వాలంటే ప్రభుత్వ భూమిని ఇతరులకు బదలాయించేందుకు అనుమతి ఉండదు. ఇలాంటి సమస్యలన్నీ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని తీర్చాలంటే చట్టాలు మార్చాలనేది రెవెన్యూ వర్గాల అభిప్రాయం. సాదా బైనామాల సంక్లిష్టత భూ సంబంధిత సమస్యల్లో ప్రధానమైనది సాదా బైనామాలు. తెల్ల కాగితాల ద్వారా జరిగిన క్రయ విక్రయాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనేకసార్లు దరఖాస్తులు స్వీకరించింది. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో తహశీల్దార్లు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అదే విధంగా ధరణి పోర్టల్‌లో కొత్త సర్వే నంబర్ల నమోదు, పట్టాదారు పేరు మార్పు, విస్తీర్ణంలో తేడాల సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. -
AP: ప్రాణం నిలిపిన కలెక్టర్
నెల్లిమర్ల (విజయనగరం జిల్లా): రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో పడి ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలను కలెక్టర్ ఎ.సూర్యకుమారి కాపాడారు. సకాలంలో స్పందించి సదరు వ్యక్తిని ఆర్డీఓ వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. అక్క డి వైద్యులు వెంటనే అత్యవసర వైద్యం అందించడంతో గాయపడిన వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. కలెక్టర్‌గా పరిపాలనలో తనదైన ముద్ర వేసుకున్న సూర్యకుమారి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి, తన మానవత్వాన్ని చాటుకు న్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాల్లోకి వెళ్తే.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి వేణుగోపాలపురం కాలనీకి చెందిన బి.అప్పారావు(30) శనివారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై నెల్లిమర్ల నుంచి గాజులరేగ వెళ్తుండగా జేఎన్టీయూ జంక్షన్లో ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో కలెక్టర్ సూర్యకుమారి చీపురుపల్లిలో పింఛన్ల పంపిణీకి వెళ్లి తిరిగి విజయనగరం విచ్చేస్తున్నారు. రోడ్డు పక్కన రక్తపు మడుగులో వ్యక్తి పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే కారును ఆపి 108 వాహనంలో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించేందుకు ఫోన్ చేశారు. అయితే 108 వచ్చేందుకు కొంత ఆలస్యమవుతుందని గుర్తించి, తన వెనకే వస్తున్న ఆర్డీఓ భవానీశంకర్ అధికారిక వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ నాగభూషణరావుకు విషయం తెలియజేసి, అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. ఆ సమయానికి ఆస్పత్రిలోనే ఉన్న డీసీహెచ్ఎస్ ఇతర వైద్యులను అప్రమత్తం చేశారు. గాయపడిన వ్యక్తికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, సకాలంలో వైద్యమందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. ఆదివారం మధ్యాహ్నానికి గాయపడిన అప్పారావు అపస్మారక స్థితి నుంచి బయటపడినట్లు కలెక్టర్‌కు డీసీహెచ్ఎస్ తెలిపారు. గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తీసుకురావడం వల్లనే ప్రాణాలు కాపాడగలిగామని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన కలెక్టర్ చొరవను అధికారులతో పాటు వైద్య సిబ్బంది అభినందిస్తున్నారు. -
100% టీకాలే లక్ష్యం: మంత్రి హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ నూరు శాతం జరిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామా లు, మండలాలవారీగా లక్ష్యాలను ఖరారు చేసి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నా రు. ఆర్థికమంత్రి హరీశ్ తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ అదనపు బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో శనివారం బీఆర్కేఆర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వాక్సినేషన్‌తోపాటు కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, ఆరోగ్యశ్రీ కింద అందుతున్న సేవల తీరుతెన్నులను అడిగి తెలుసుకొని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, డీసీహెచ్లకు పలు ఆదేశాలిచ్చారు. ఇతర శాఖల సహకారం తీసుకోండి... వాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు ఇతర శాఖల సహకారాన్ని తీసుకోవాలని హరీశ్ ఉన్నతాధికారులకు సూచించారు. ప్రతి వారం వ్యాక్సినేషన్లో సాధించిన లక్ష్యాలను సమీక్షించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్టంలో 18 ఏళ్లు దాటిన వారు 2.77 కోట్ల మంది ఉండగా 2.35 కోట్ల మందికి మొదటి, 1.08 కోట్లమందికి రెండు డోసులు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. మరో 18.66 లక్షలమంది రెండో డోస్ వేసుకొనేందుకు కేంద్రాలకు రావాల్సి ఉందన్నారు. డిసెంబర్‌లోగా కొత్త వైద్య కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 8 వైద్య కళాశాలల భవనాలను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని కలెక్టర్లను హరీశ్ ఆదేశిం చారు. కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల పడకల సామర్థ్యాలను పెంచాలని, విద్యార్థుల వసతికి అనువైన హాస్టల్ భవనాలను గుర్తించాలన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలికవసతుల కల్పన, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆసుపత్రుల తనిఖీలు.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 946 రకాల వైద్య సేవలు అందిస్తుండగా, కేంద్ర పథకమైన ఆయుష్మాన్ భారత్ కింద 646 రకాల వైద్య సేవలను చేర్చినట్లు మంత్రి హరీశ్ తెలిపారు. వైద్యానికి మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల సేవలను ప్రజలకు విస్తృతంగా అందించాలన్నారు. ఇకపై పీహెచ్సీ మొదలు మెడికల్ కాలేజీ వరకు అన్నిం టినీ తనిఖీ చేస్తామని, ఆశా వర్కర్ నుంచి హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు అందరి పనితీరు ఆధారంగా పోస్టింగ్‌లు, ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. -
వర్ష బాధితులకు తక్షణ సాయం
సాక్షి, అమరావతి: భారీ వర్షాల బాధితులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలను చేపట్టాల్సిందిగా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయ శిబిరాల్లోని బాధితులకు మంచి ఆహారం అందించడంతో పాటు వారికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల కలెక్టర్లు, అధికారులతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నెల్లూరుకు, మరో రెండు బృందాలు చిత్తూరుకు చేరుకున్నాయని, కర్నూలులో ఇంకో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మంగళగిరిలో కూడా అదనపు బృందాలను సిద్ధం చేశామని, పరిస్థితులను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్ సహాయ పునరావాస కేంద్రాలు ► అవసరమైన చోట సహాయ శిబిరాలను, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సహాయ శిబిరాల్లో ఉంచిన వారిని బాగా చూసుకోవాలి. వారికి మంచి ఆహారం అందించడంతోపాటు బాధితులకు వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలి. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా వ్యవహరించాలి. ► ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలి. అవసరమైన మందులను సరిపడా అందుబాటులో ఉంచుకోవాలి. పీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. వారి కోసం ఒక ఫోన్ నంబర్‌ను అందుబాటులో ఉంచాలి. బాధితులను ఆదుకోవడంతో పాటు సహాయక చర్యల అమలు కోసం వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలి. ఇందుకు అనుగుణంగా లైన్ డిపార్ట్మెంట్లను సిద్ధం చేయాలి. ఎస్ఓపీల ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. వర్షాల అనంతరం కూడా పారిశుధ్యం విషయంలో చర్యలు తీసుకోవాలి. ► ఆహారం, తాగునీటి ప్యాకెట్లను బాధిత ప్రాంతాల్లో పంపిణీ చేయాలి. అవసరమైన మేరకు వీటిని సిద్ధంగా ఉంచుకోవాలి. రిజర్వాయర్లు, చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ► భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లు, చెరువులకు గండ్లు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలి. నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ► వర్షాలు, నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ.. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నీటిని విడుదల చేయాలి. ఇదే సమయంలో తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకోవాలి. ప్రధానంగా రిజర్వాయర్లు, డామ్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ► రోడ్లు ఇతరత్రా మౌలిక సదుపాయాలకు ఎక్కడ నష్టం వాటిల్లినా వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. తీవ్ర ప్రభావిత మండలాల్లో అగ్నిమాపక కేంద్రాలను, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలి. ► ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ.. జిల్లాల నుంచి ఆ వివరాలను వెంటనే పంపించాలి. ఫోన్‌కాల్‌కు మేం అందుబాటులో ఉంటాం.. ఇంకా ఏం కావాలన్నా వెంటనే తెలియజేయండి. ► బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం తుపానుగా మారి దక్షిణ కోస్తాంధ్రాలో తీరందాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈనెల 17న ఇది తీరం దాటే అవకాశాలున్నాయని వివరించారు. దీనివల్ల దక్షిణ కోస్తాంధ్రలో మరో విడత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ► ఈ సమీక్షలో సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి (మైనార్టీ శాఖ) ఎస్ బి అంజాద్ బాషా, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటే.. వెంటనే వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. అత్యవసర సేవలకు అంతరాయం రాకుండా ముందు జాగ్రత్తగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా అధికారులు వెంటనే సంప్రదించాలి. వర్షం ప్రభావిత ప్రాంతాల్లో అన్ని రకాల సహాయ కార్యక్రమాలు వేగంగా అమలయ్యేలా చూడాలి. -
‘వరి’ని నిషేధిత జాబితాలో చేర్చారా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరి విత్తనాలు అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన మౌఖిక వ్యాఖ్యలపై హైకోర్టు మండిపడింది. వరి విత్తనాలను నిషేధిత జాబితాలో ఏమైనా చేర్చారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. జిల్లా మెజి్రస్టేట్‌గా ఉండి చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారే.. చట్టవిరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించింది. వరిని విక్రయించిన దుకాణాలను తెరవాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా తాను లెక్కచేయనంటూ కలెక్టర్ చేసిన పేర్కొనడం కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు వెంకట్రామిరెడ్డిపై క్రిమినల్ కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. వరి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు బత్తుల నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది చిన్నోళ్ల నరేష్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా, వరి విత్తనాలు విక్రయించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదని ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ‘జిల్లా మెజి్రస్టేట్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం. చట్టానికి అతీతులు ఎవరూ కాదు. కోర్టులు ఆదేశించినా లెక్క చేయనని పేర్కొనడం క్రిమినల్ కోర్టుధిక్కరణ కిందకే వస్తుంది. భవిష్యత్తులో కలెక్టర్‌కు ఏదైనా సమస్య వచ్చినా న్యాయస్థానాన్నే ఆశ్రయించాల్సి ఉంటుంది’అని న్యాయమూర్తి గుర్తుచేశారు. కలెక్టర్‌పై తదుపరి చర్యల కోసం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. (చదవండి: ఈ రోజు లాస్ట్ మీటింగ్.. గాంధీ భవన్లో మాట్లాడాలా వద్దా అనేది తేల్చుకుంటా) -
బతుకమ్మ చీరల పంపిణీ బాధ్యత కలెక్టర్లకు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ చీరలు పంపిణీ చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి చీరలు పంపిణీ చేయాలా లేక కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామ, వార్డు కేంద్రాల్లో పంపిణీ చేయాలా అనే నిర్ణయాన్ని కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు టెస్కో ఎండీ శైలజా రామయ్యర్ వెల్లడించారు. బతుకమ్మ చీరలు ఇప్పటికే జిల్లాల్లోని గోదాములకు సరఫరా కాగా, అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ/ వార్డు కమిటీ ద్వారా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి, గ్రామ మహిళా సంఘం ప్రతినిధి, రేషన్ డీలర్ సభ్యులుగా ఉండే కమిటీ పర్యవేక్షణలో చీరల పంపిణీ జరుగుతుంది. మున్సిపల్ వార్డు స్థాయిలో బిల్ కలెక్టర్, వార్డు మహిళా సంఘం ప్రతినిధి, రేషన్ డీలరు సభ్యులుగా ఉండే కమిటీ చీరలు పంపిణీ చేస్తుంది. -
భూమి ఆన్‌లైన్‌కి లంచం అడుగుతున్నారు
ఒంగోలు: ‘నాకు 70 సెంట్ల భూమి ఉంది. దానిని ఆన్లైన్ చేయమని అధికారులను కోరితే తిప్పుకుంటూ ఉన్నారు. చివరకు రూ.10 వేలు లంచం ఇస్తేనే చేస్తామని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అంటున్నారని’ ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే రైతు నేరుగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఒంగోలులోని స్పందన సమావేశపు హాలు నుంచి ప్రవీణ్‌కుమార్ నిర్వహించారు. పొదిలికి చెందిన బీ శ్రీదేవి మాట్లాడుతూ సర్వే నం 1052లో తన భూమిని ఆన్లైన్ చేసినా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. మూడు సార్లు తహసీల్దార్‌ను కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదని తెలిపింది. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై విచారించి వెంటనే పాస్ పుస్తకం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. టంగుటూరుకు చెందిన పాదర్తి సుబ్బరాయుడు అనే రైతు తన భూమి ఆక్రమణకు గురైందని, సర్వే చేయించి హద్దులు వేయమని తహసీల్దార్, సర్వేయర్‌ను అడిగితే కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సర్వేయర్‌ను పంపించి సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు. కనిగిరి మండలం మాచవరానికి చెందిన కే ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామ కంఠంలో వార్డు సచివాలయానికి మూడు సెంట్ల భూమి కేటాయిస్తే, చంద్రహాస్ అనే వ్యక్తి అందులోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్, తహసీల్దార్, వీఆర్ఓకు అర్జీ ఇచ్చామన్నారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. డయల్ యువర్లో వచ్చిన వాటిని వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ డయల్ యువర్ కార్యక్రమం ముగిసిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమావేశం నిర్వహించారు. డయల్ యువర్ కలెక్టర్ ద్వారా నేరుగా తనకు ఫోన్లు చేసిన ప్రజలు చెప్పిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జవాబుదారితనంతో సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు జే వెంకటమురళి, టీఎస్ చేతన్, కేఎస్ విశ్వనాథన్, కే కృష్ణవేణి, ఇన్చార్జి డీఆర్ఓ సరళా వందనం పాల్గొన్నారు. -
మా మంచి కలెక్టరమ్మ: పూలరేకులపై నడిపిస్తూ.. సెల్యూట్లు చేస్తూ
గాంధీనగర్: కొందరు అధికారులు తమ సేవలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. తనకు కష్టం ఉన్నా.. తన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలనే తాపత్రయంతో నిరంతరం శ్రమిస్తుంటారు. అటువంటి అధికారులు ఉంటే తమకు కూడా మంచే జరుగుతుందని అక్కడి ప్రజలు భావిస్తుంటారు. ఒకవేళ ఆ అధికారి మరోచోటకు బదిలీ అయి వెళ్లిపోతుంటే తమ ఇంట్లో మనిషి వెళ్లిపోతున్నట్లే ఏడుస్తుంటారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం. ప్రభుత్వ అధికారి అన్నప్పుడు బదిలీలు సాధారణం. తాజాగా ఒక జిల్లా కలెక్టర్ బదిలీ పేరిట మరో ప్రాంతానికి వెళ్లాల్సి రావడంతో అక్కడి ప్రజలు, అధికారులు ఆమెకు ఘనమైన వీడ్కోలు ఇవ్వడం వైరల్‌గా మారింది. వివరాలు.. గుజరాత్ లోని రాజకోట్ జిల్లాకు రెమ్యా మోహన్ కలెక్టర్‌గా సేవలందిస్తున్నారు. తన పనితనంలో ఆమె అక్కడి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వారం కిందట రెమ్యా మోహన్నేషనల్ హెల్త్ మిషన్, డైరెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ప్రజలు, ఉద్యోగులు భావోద్వేగంతో ఆమెకు చివరిసారిగా వీడ్కోలు పలికారు. పూలు జల్లుతూ.. రెడ్ కార్పెట్ వేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం పూల రథంతో వీడ్కోలు పలుకుతూ తమ గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడి సెక్యూరిటీ గార్డుల గౌరవ వందనాన్ని స్వీకరించిన రెమ్యా మోహన్ కన్నీటిపర్యంతం అవుతూ అక్కడి నుంచి వెళ్లారు. కాగా కోవిడ్ -19 తో పాటు ఈ మధ్యన వచ్చిన తుఫాను సమయంలోను రెమ్యా నాయక్ నిరంతరం శ్రమించారు. ఎంత కష్టం ఎదురైనా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవను కొనసాగించారు. ఈ కృతజ్ఞతాభావంతోనే అక్కడి ప్రజలు, అధికారులు ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా ఘనంగా వీడ్కోలు పలికారు. 1980 లో ఎస్.జగదీషన్ తరువాత ఒక జిల్లా కలెక్టర్‌కు ఈ విధంగా గౌరవం లభించడం ఇదేనని అక్కడి స్థానికులు సంతోషంతో పేర్కొన్నారు. -
ఏపీలో నేటి నుంచి పేదలందరికీ ఇళ్లు మెగా గ్రౌండింగ్ డ్రైవ్
-
అనంతపురం: తాడిపత్రిలో 500 పడకల తాత్కాలిక ఆసుపత్రి
అనంతపురం: కోవిడ్ రోగుల కోసం జిల్లాలోని తాడిపత్రిలో 500 పడకల తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ గంధం చుంద్రుడు తెలిపారు. కోవిడ్‌కు సంబంధించి జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. అత్యవసర వినియోగానికి ఆక్సిజన్ ట్యాంకర్‌ను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు పేర్కొన్నారు. కోవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లు పక్కదారి పట్టించే ఉద్యోగులను సస్పెండ్ చేయడానికి వెనుకాడబోమని తెలిపారు. -
విశాఖ : కోవిడ్ నియంత్రణకు పెద్ద ఎత్తున చర్యలు
-
టైరు మార్చిన కలెక్టర్ రోహిణి, వైరల్
మైసూరు: కలెక్టర్ అంటే సమాజంలో గొప్ప హోదా. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా తక్షణమే అందుబాటులోకి వస్తాయి. ఆ హోదాను పక్కనపెట్టి తన కారు టైర్‌ను స్వయంగా మార్చుకొని వార్తల్లో నిలిచారు కర్ణాటకలోని మైసూరు జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి. తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి సింధూరి తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల క్రితం కొడగు తదితర పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె సొంతంగా కారును డ్రైవ్ చేశారు. మార్గంమధ్యలో టైర్ పంక్చర్ అయ్యింది. ఆమె స్వయంగా రంగంలోకి దిగి, కారు కింద జాకీ అమర్చి టైర్‌ను ఊడదీసి, మరో టైర్‌ను అమర్చారు. రోడ్డుపై వెళ్లేవారు గమనించి మీరు మైసూరు జిల్లా కలెక్టర్ కదా! అని అడగ్గా అవును తానే రోహిణి సింధూరినని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా శుక్రవారం వైరల్ అయ్యాయి. కలెక్టర్ హోదాలో ఉండి కూడా స్వంతంగా కారు టైర్ మార్చుకున్న కలెక్టర్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. -
పుదుచ్చేరి జిల్లా కలెక్టర్‌పై విష ప్రయోగం?
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి జిల్లా కలెక్టర్ పూర్వ గార్గ్‌పై విష ప్రయోగం జరిగిందన్న అభియోగాలతో సీబీ–సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వైఖరిని వ్యతిరేకిస్తూ సీఎం నారాయణస్వామి నేతృత్వంలో శుక్రవారం రాజ్‌నివాస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమం బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్లో అధికారులు గురువారం సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అధికారులకు ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి సీసాలను అందజేశారు. కలెక్టర్ పూర్వగార్గ్ వాటర్ బాటిల్ తెరవగానే స్పిరిట్ వంటి రసాయనం వాసన గుప్పుమనడంతో తాగకుండా అధికారులకు అప్పగించారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. మిగతా బాటిళ్లలో మాత్రం స్వచ్ఛమైన నీరే ఉంది. జిల్లా కలెక్టర్‌కు అందజేసిన బాటిల్లోని నీరు మాత్రమే విషతుల్యంగా ఉండడంతో అధికారులు హతాశులయ్యారు.ఈ ఘటనను లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఖండించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కి వ్యతిరేకంగా సీఎం నారాయణస్వామి శుక్రవారం ధర్నా చేశారు. -
సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూవివాదాలు, ఇతర వ్యవహారాల్లో జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంచ లన నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్లే ఈ బాధ్యత లను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్దిపాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు 2 నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని ప్రకటించారు. ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగుపరుస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ధరణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగు పర్చాల్సిన అంశాలపై గురువారం ఆయన ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవసరమైతే క్షేత్రస్థాయి విచారణ.. ‘కోర్టుల విచారణలో ఉన్నవి మినహా, భూరికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్–బీలో చేర్చిన భూములకు సంబంధించిన అంశాల న్నింటినీ కలెక్టర్లు 60 రోజుల్లో పరిష్కరించాలి. అవసరమైన సంద ర్భాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ణయాలు తీసుకో వాలి. యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకు ఒకటి చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. సరిహద్దు వివాదాలున్న చోట జిల్లా కలెక్టర్లు సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలి. చదవండి: (‘ఆయుష్మాన్’తో ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం) ధరణి పోర్టల్ రాకముందు రిజిస్ట్రేషన్ అయిన భూములను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ఆధారంగా, కొన్నవారి పేరిట జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్ చేయాలి. మీ–సేవ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తులు స్వీకరించి, స్లాట్లు కేటాయించాలి.. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. క్రమబద్ధీకరించిన సాదాబైనామాల ప్రకారం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలి. పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణిలో కొత్తగా కోర్టు పోర్టల్.. ‘కోర్టుల ద్వారా, కలెక్టర్ల ఆధ్వర్యంలోని ట్రిబ్యునళ్ల ద్వారా వచ్చిన అధికారిక తీర్పుల ప్రకారం ధరణిలో భూములకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేపట్టాలి. కోర్టు పోర్టల్‌ను ధరణిలో చేర్చాలి. సేత్వార్ వ్యత్యాసాలపై కలెక్టర్లు విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకోవాలి. ఆ వివరాలను ధరణిలో నమోదు చేసి, పాసుబుక్కులు ఇవ్వాలి. కొన్నిచోట్ల ఒకే సర్వే నంబరులో ప్రభుత్వ, ప్రైవేటు భూములున్నాయి. ఆ సర్వే నంబరును నిషేధిత జాబితా (22/ఏ) లో పెట్టారు. అలా పెట్టిన చోట్ల కలెక్టర్లు విచారణ జరిపి, ఏది ప్రభుత్వ భూమో, ఏది ప్రైవేటు భూమో నిర్ణయించాలి. అర్హుల వివరాలను ధరణిలో చేర్చి, పాస్ పుస్తకాలు ఇవ్వాలి..’అని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. సమావేశంలో విస్తృత చర్చ అనంతరం సీఎం కేసీఆర్ జారీ చేసిన ఆదేశాలివే.. ►1/70 చట్టం అమలులో లేని ప్రాంతాల్లో ఆ చట్టం కింద నమోదైన కేసులను పరిష్కరించాలి. 1/70 చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో భూములపై ఆ ప్రాంత ఎస్టీల హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి. ►ధరణి పోర్టల్ ద్వారా లీజ్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. ►‘నాలా’ద్వారా కన్వర్ట్ అయిన భూముల వివరాలను ధరణిలో నమోదు చేసి, వాటికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. ►అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ చేసుకోవడానికి ధరణి పోర్టల్ ద్వారా అవకాశమివ్వాలి. ►వ్యవసాయ భూమల లీజు డీడ్, ఎక్సే్చంజ్ డీడ్ల రిజిస్ట్రేషన్లకు ధరణిలో అవకాశం కల్పించాలి. ►వ్యవసాయ భూముల్లో నెలకొల్పే సంస్థలు, కంపెనీలు ఆ భూములు అమ్ముకునేందుకు, కొనుక్కునేందుకు ధరణిలో తక్షణం అవకాశం కల్పించాలి. ►పాస్‌పోర్టు నంబరు నమోదు చేసుకుని ఎన్ఆర్ఐల భూములు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించాలి. ►ఈసీల మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్లను ఆన్లైన్లో ప్రింట్ తీసుకునే అవకాశం కల్పించాలి. ►ఏదైనా అనివార్య కారణాల వల్ల స్లాట్ బుక్ చేసుకున్న రోజు రాని వారికి స్లాట్ రద్దు చేసుకోవడానికి, మరో రోజు బుక్ చేసుకునేందుకు అవకాశమివ్వాలి. స్లాట్ బుకింగ్ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి ఇవ్వాలి. ►స్లాట్ బుక్ చేసుకునేప్పుడు వివరాలు తప్పుగా నమోదైతే, స్లాట్ బుక్ చేసుకున్న చోటే వాటిని సవరించుకునేందుకు రిజిస్ట్రేషన్ కన్నా ముందు అవకాశం కల్పించాలి. ►చట్టబద్ధ వారసుల పేర్లను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో అనుమతిదారుల (కన్సెంటింగ్ పార్టీ) కేటగిరీ కింద నమోదు చేసుకునే ఆప్షన్ కల్పించాలి. ►మైనర్ల పేరిట భూములు రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో మైనర్లు, సంరక్షుల పేర పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలి. ►ప్రభుత్వం అసైన్ చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములను బదలాయించాలి. ►పట్టాదార్ పాసుబుక్కులు పోయినట్లయితే, వాటి స్థానంలో ‘ట్రూ కాపీ’తీసుకునే అవకాశం కల్పించాలి. ►ప్రభుత్వ భూములు, చెరువు ఎఫ్.టి.ఎల్. భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయవద్దు. ►ఇనాం భూములను సాగు చేసుకుంటున్న హక్కుదారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి, ఆ వివరాలను ధరణిలో నమోదు చేయాలి. ►ధరణిలో స్లాట్ బుక్ కాకపోతే, ఎందుకు కావడం లేదనే విషయం దరఖాస్తుదారుడికి తెలిపే ఆప్షన్ ధరణిలో ఉండాలి. రైతులకు ఇబ్బంది ఉండొద్దనే ‘ధరణి’: సీఎం కేసీఆర్ వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండవద్దనే ఉద్దేశంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. 2 నెలల వ్యవధిలోనే లక్షా 6 వేల మంది ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకోగా వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు ఐదెకరాల లోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్ చేయించుకుని, మ్యుటేషన్ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్, రెవెన్యూ వ్యవహారాల నిపుణులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రామయ్య, సుందర్ అబ్నార్, రఫత్ అలీ, జిల్లా కలెక్టర్లు వెంకట్రాంరెడ్డి, హనుమంతరావు, ప్రశాంత్ పాటిల్, నారాయణరెడ్డి, శశాంక్ పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం ఇద్దరు సర్పంచ్‌లు సస్పెండ్
సాక్షి, రంగారెడ్డి: పంచాయతీ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సర్పంచులు, ఒక పంచాయతీ అధికారిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేౠరు. విధులను నిర్లక్ష్యం చేస్తే సహించబోనని పేర్కొంటూ మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట గ్రామ సర్పంచ్ కనక మామిడి శ్రీనివాస్, కేతిరెడ్డి పల్లి సర్పంచ్ ఎన్.హరీశ్ చంద్‌ను సస్పెండ్ చేశారు. వీరితోపాటు శంకర్ పల్లి మండలంలోని మొకీల గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ తులసిపైనా కలెక్టర్ అమోయ్ కుమార్ వేటువేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను సరిగ్గా అమలు చేయక పోవడం, అభివృద్ధిలో వెనుకబడ్డందుకు బాద్యులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. -
విజయవాడ లిబర్టీ ఆసుపత్రిలో కోవిడ్ వైద్యం రద్దు
సాక్షి, విజయవాడ : కరోనా వైద్యం పేరుతో పలు ఆసుపత్రులు లక్షల రూపాయలు వసూలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నా ప్రైవేటు ఆసుపత్రుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా లక్షల్లో ఫీజు వసూలు తన భర్త ప్రాణాలు పోగొట్టారని విజయవాడ లిబర్టీ ఆసుపత్రి యాజమాన్యంపై మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదివారం ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. విజయవాడకు చెందిన లిబర్టీ ఆసుపత్రిలో కోవిడ్ వైద్యం రద్దు చేస్తున్నట్లు తెలిపారు.(చదవండి : పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్) రాజమండ్రికి చెందిన మహిళ ఫిర్యాదుతో విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. లిబర్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధిక ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కమిటీ అందించిన నివేదికతో ఆటోనగర్‌లో ఉన్న లిబర్టీ ఆసుపత్రిలో కరోనా వైద్యం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను వేరే చోటికి తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
వేలివెన్ను వీఆర్ఓపై సస్పెన్షన్ వేటు
సాక్షి, పశ్చిమ గోదావరి: ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన వీఆర్ఓ సూర్యజ్యోతిని శనివారం అధికారులు సస్పెండ్ చేశారు. మండలంలోని సచివాలయంలో ఆమె వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జూలై 27న వేలివెన్ను గ్రామానికి చెందిన బూరుగుపల్లి సుబ్బలక్ష్మి అనే మహిళా రైతుకు సంబంధించిన 42 సెంట్ల భూమి మ్యుటేషన్ కోసం 42 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. తహిసీల్దార్‌కు వీఆర్ఓపై ఆమె ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీఆర్వో లంచం అడిగినట్టు విచారణలో రుజువు కావడంతో ఆమెను సస్పెండ్ చేయాలంటూ నిన్న(శుక్రవారం) కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ ఆయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ సూర్యజ్యోతిని అధికారులు సస్పెండ్ చేశారు. (కరోనా: ఆఖరు ఘడియల్లో ఆత్మబంధువులు) -
వైద్యుల నియామకంపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ చికిత్సల కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్య నిపుణులకు నెలకు రూ. 1.5లక్షల గౌరవ వేతనం, జనరల్ డ్యూటీ డాక్టర్లకు నెలకు రూ. 70 వేల చొప్పున చెల్లించనున్నారు. ఈ మేరకు కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా వచ్చే ఆరు నెలలపాటు వారి సేవల్ని వినియోగించుకునేలా ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (‘ఆ మరణాలు దాచాల్సిన అవసరం లేదు’) -
వాలగానే వేసేద్దాం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి ఏ సమయంలోనైనా మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున వాటిని నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మిడతల నిరోధక చర్యలపై దృష్టి సారించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోనే ఉన్న మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చేందుకు అవకాశాలు అలాగే ఉన్నందున, తగిన జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల జిల్లాల కలెక్టర్లు, అటవీ, పోలీసు ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మిడతల దండును ఎదుర్కోవడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలో జిల్లా కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. (మిడతల దండు మళ్లీ వచ్చేసింది) సాధారణంగా మిడతల దండు ఉదయం వేళ ప్రయాణం చేస్తుంటుంది. ఈ సమయంలో వీటిని చంపడం అంత సులువు కాదు. చెట్లపై, చేనుపై వాలినపుడే వాటిని చంపేందుకు సులువవుతోంది. దీంతో రాత్రివేళ, వేకువజామున మిడతలను చంపేందుకు సిద్ధపడాలని, అందుకు అవసరమైన సామగ్రిని సిద్ధంగా పెట్టుకోవాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. ముందుగా రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించే సరిహద్దు జిల్లాలను గుర్తించాలి. అన్ని గ్రామాలలోనూ మిడతలు ప్రవేశించే మార్గాలను గుర్తించి, అక్కడి ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి జిల్లాకు 500 లీటర్ల రసాయనాలను సిద్ధంగా పెట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రంగు కలిపిన నీటితో గ్రామాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. వీటన్నింటిపై వ్యవసాయ శాఖ త్వరలోనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ విడుదల చేయనుంది. (ఒమెన్ నుంచి ముంబై వైపు మిడతల యాత్ర!) రూ. 53.55 లక్షలు కేటాయింపు... ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రసాయనాల కొనుగోలుకు, పీపీఈ కిట్లకు జిల్లాకు రూ. 5.95 లక్షల చొప్పున రూ. 53.55 లక్షలు కేటాయించింది. ఈ నిధులను విపత్తు నిర్వహణ నిధుల నుంచి వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. (కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు...) జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీసు లేదా ఎస్పీ, జిల్లా అటవీ అధికారి, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా ఫైర్ అధికారి, డీపీవోతో పాటు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుంచి కీటక శాస్త్రవేత్తతో కలిపి ప్రతి జిల్లాకు జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మిడతల దాడి జరిగే అన్ని మండలాలు, సరిహద్దు గ్రామాలలో గ్రామ కమిటీలను గుర్తించాలి. ప్రభుత్వ సిబ్బందితోపాటు ప్రభుత్వ సంస్థలు, సంఘాలు, సమూహాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలి. మిడతలు ప్రవేశించే స్థలాలను గుర్తించి, వాటిని చంపేందుకు స్ప్రే చేయడానికి తగిన స్థలాన్ని గుర్తించాలి. భారీ వాహనాలు, ఫైరింజన్లు వెంటనే వచ్చేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి. రాత్రివేళ పిచికారీ చేయాల్సి ఉన్నందున లైటింగ్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదకరమైన రసాయనాలు స్ప్రే చేస్తున్నందున పీపీఈ కిట్లు ధరించాల్సి ఉంటుంది. పంటలకు, పశుపక్షాదులకు ఎటువంటి ఆరోగ్య, ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులు కూడా అందుబాటులో ఉండేలా చూడాలి. మొక్కల నర్సరీలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వేప పూత ముందుగా చల్లుకోవడం మంచిది. అటవీ ప్రాంతం అయితే సెల్‌ఫోన్ సిగ్నల్స్ సమస్య వచ్చే అవకాశం ఉన్నందున కమ్యూనికేషన్ సెట్ వినియోగించాల్సి ఉంటుంది. -
వాహ్.. కలెక్టర్ సాబ్
దూకుడుగా వ్యవహరించడం కాదు చురుగ్గా ఆలోచించడం రావాలి.. కేడర్ ఒక్కటే కాదు తగిన సమయస్ఫూర్తీ కావాలి. ఆజ్ఞలివ్వడం సరిపోదు.. అందరినీ కలుపుకొని వెళ్లి పనిచేయించుకునే సామర్థ్యమూ డాలి.. ఈ మూడు లక్షణాలతో మరో మూడు సూత్రాలను అమలు చేసి రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో కరోనా వైరస్‌కు చెక్ పెట్టారు డైనమిక్ కలెక్టర్ రాజేంద్ర భట్.. కరోనాను కట్టడి చేయడంలో దేశమంతా కేరళ ప్రణాళికలవైపు చూస్తూంటే చడీచప్పుడు లేకుండా ఆ వైరస్ వ్యాప్తిని నిలువరించారు. కరోనా కొత్త కేసు ఒక్కటి కూడా లేకుండా చేశారు.. సాక్షాత్తూ ప్రధానమంత్రి దృష్టినీ బిల్వారా వైపు తిప్పారు ఆ జిల్లా కలెక్టర్, 56 ఏళ్ల రాజేంద్ర భట్. విజయ రహస్యం ఏమిటని అడిగితే ‘అదేం భగీరథ ప్రయత్నం కాదు.. సింపుల్ త్రీ స్టెప్స్ ప్లాన్ అంతే’ అంటారు వినమ్రంగా. ఈ మూడు సూత్రాలు.. బిల్వారా.. వస్త్రపరిశ్రమకు పెట్టింది పేరు. కాబట్టి సహజంగానే వలసకార్మికులకు ఆవాసంగా మారింది. కరోనాకూ హాట్‌స్పాట్ అయింది మొత్తం 27 పాజిటివ్ కేసులతో. బిల్వారా వాసులకు తెలిసి.. భయంకంపితులు కాకముందే తక్షణ కార్యాచరణ మొదలుపెట్టాడు రాజేంద్ర భట్. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఐసోలేషన్‌లో ఉంచడం, ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహించడం, క్వారంటైన్‌ను అమలు చేయడం.. ముఖ్యమైన ఈ మూడు అంశాలే ఆయన కార్యాచరణ. ఆయనకు మాత్రమే తెలిసిన సీక్రెట్స్ కావు.. కరోనా నివారణలో జగమెరిగిన ఉపాయాలే. ఎలా మొదలుపెట్టారు? కరోనా కర్ఫ్యూను ప్రకటించే ముందు తన సిబ్బందిని డెయిరీ ఫామ్స్‌కు పంపించాడు రాజేంద్ర భట్.. ప్రతి ఇల్లు రోజుకు ఎన్ని పాలను కొంటారో లెక్క తీయమని. అలాగే నిత్యావసరాల నిల్వలు, సరఫరా ఎంతో కూడా బేరీజు వేసుకున్నాడు. రోజుల తరబడి ఇంట్లో ఉన్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని రాష్ట్రప్రభుత్వాన్ని కోరాడు జిల్లా సరిహద్దులు మూసివేయడానికి అనుమతి ఇవ్వాలని. వెంటనే ఓకే చేసింది ప్రభుత్వం. అంతేకాదు బిల్వారాలోని ఆసుపత్రులు, హోటళ్లు మొదలైన అన్నిటిమీదా పూర్తి అధికారాలు ఇచ్చేసింది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఆ వెంటనే ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయించారు. గ్రామాల నుంచి పట్టణాల దాకా జిల్లా మొత్తం పొలిమేరలు మూసి వేయించారు. వైద్య సిబ్బందిని 24 గంటలు అలర్ట్‌లో ఉంచాడు. ఇంకోవైపు కరోనా గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు కొనసాగించారు. వీటన్నిటి నేపథ్యంలో ‘కరోనా తీవ్రత జిల్లా ప్రజలకు అర్థమయ్యేలోపే ఆ వ్యాప్తిని 27 కేసులకే పరిమితం చేశారు. గడిచిన పది రోజులుగా రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో ఒక్కటంటే ఒక్క కొత్త పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ‘గ్రేట్ ఎఫర్ట్.. ’ అంటూ రాజేంద్ర భట్‌ను ప్రశంసించబోయేంతలోనే ‘ఇది నా ఘనత కాదు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, మా సిబ్బంది కలిసి చేసిన ప్రయత్నం. టీమ్ వర్క్’ అని తన విజయంలో అందరినీ భాగస్వామ్యం చేస్తారు. ‘అయినా.. ఒక్క కొత్త కేసు రాలేదని ఇప్పుడే ప్రకటించుకోవడం ఎందుకు? మే వరకూ వేచి చూద్దాం.. అప్పటికీ ఒక్కటి కూడా నమోదు కాకపోతే.. నిజంగానే ఈ ప్రయత్నంలో మేము సఫలీకృతమైనట్టే’ అంటారు బిల్వారా కలెక్టర్ రాజేంద్ర భట్. స్టేట్ సర్వీస్ నుంచి సివిల్ సర్వీస్‌కు.. రాజేంద్ర భట్ .. రాజస్థాన్ స్టేట్ సర్వీస్ నుంచి 2007లో ఐఏఎస్‌గా ప్రమోషన్ పొందాడు. ‘స్టేట్ సర్వీస్ ఉద్యోగ అనుభవం ఈ కరోనా క్లిష్ట సమయంలో ఆయన చురుగ్గా ఆలోచించి, సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో ఉపయోగపడింది. డైరెక్ట్ ఐఏఎస్ యంగ్ కలెక్టర్ల కన్నా ఆయన ఎంతో సమర్థవంతుడు’ అని ఆయన టీమ్‌లోని యువ ఐఏఎస్ ఆఫీసర్లు రాజేంద్రభట్ను కొనియాడుతున్నారు. కరోనా విషయంలోనే కాదు.. బిల్వారా జిల్లా కలెక్టర్‌గా రాజేంద్ర భట్ చార్జ్ తీసుకున్నప్పటి నుంచి జిల్లా సర్వతోముఖాభివృద్ధికోసం జిల్లాకు సంబంధించిన అన్ని శాఖలతో ఆయన నిర్వహిస్తున్న స్నేహపూర్వక సంబంధాలు, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం.. దేశంలోని కలెక్టర్లు, యువ ఐఏఎస్ ఆఫీసర్లందరికీ ఆదర్శం, ఆయన పాలన నైపుణ్యత అందరూ తెలుసుకొని అమలు చేయవలసిన పాఠం.. అంటున్నారు రాజస్థాన్‌లోని ఐఏస్ అధికారులు. -
ఆ కలెక్టర్ పేరుతోనే వెలిసిన గ్రామం
సాక్షి, ములగాడ (మల్కాపురం): కలెక్టర్ పేరు మీద వెలిసిన ఓ గ్రామం ఇప్పుడు దినదినాభివృద్ధి సాధిస్తూ జీవీఎంసీ 58వ వార్డుకు తలమానికంగా మారింది. 1909లో గుల్లలపాలెం ఏర్పడింది. గ్రామం ఏర్పడిన నాటికి కేవలం 50 కుటుంబాలు మాత్రమే ఇక్కడుండేవి. కాలక్రమంలో ఒకొక్క గ్రామం ఇక్కడ వెలిసింది. 1963–67 సంవ్సరంలో అప్పటి కలెక్టర్ శ్రీహరిరావు సింధియా నుంచి జింక్ వరకూ గల మట్టి రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామస్తులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో కలెక్టర్ శ్రీహరిరావు ఈ ప్రాంతీయులకు ఆత్మీయుడయ్యారు. దీంతో కలెక్టర్ శ్రీహరిరాజు పేరుతో శ్రీహరిపురం అని గ్రామానికి పేరు పెట్టారు. గుల్లలపాలెం, శ్రీహరిపురం, శ్రీనివాసనగర్, రాంనగర్, కోడిపందాల దిబ్బ, ఎదురవానిపాలెం, ములగాడ, పిలకవానిపాలెం, గొందేశిపాలెం ఇప్పుడు జీవీఎంసీ 58వ వార్డులో ఉన్నాయి. జీవీఎంసీ 58వ వార్డుకు ప్రధాన ప్రాంతం శ్రీహరిపురమే. కాలుష్య సమస్యకు కారణమవుతున్న అలూఫ్లోరైడ్ పరిశ్రమ 1983లో వార్డుగా... అప్పటి వరకూ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం 1983లో వార్డుగా రూపాంతరం చెందింది. అప్పుడు 46వ వార్డుగా గుర్తించారు. 2020లో ఆ వార్డు కాస్తా 58వ వార్డుగా మారింది. 46వ వార్డులో ఉన్నప్పుడు ఓటర్లు 12 వేల మంది ఉన్నారు. ప్రస్తుతం 17 వేల మంది ఓటర్లు ఉండగా..జనభా 20 వేలకుపైగా ఉంది. వార్డులో ప్రధాన సమస్యలు వార్డులో కోరమండల్, అలూఫ్లోరైడ్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల నుంచే వచ్చే కాలుష్యంతో ములగాడ, గుల్లలపాలెం, కోడిపందాల దిబ్బ, ఎదురవానిపాలెం, ములగాడ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ గ్రామాల్లో చాలా మంది యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ప్రధాన గెడ్డలు ఆక్రమణకు గురి కావడంతో దిగువ ప్రాంత గ్రామాలు వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. -
అచ్చం సినిమాలో మాదిరి.. దుమికిన కలెక్టర్!
సాక్షి, భూపాలపల్లి:‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ శుక్రవారం పలు కాలనీల్లో పర్యటించారు. ఈక్రమంలో జవహర్ కాలనీలో శ్మశాన వాటిక స్థల అన్వేషణ కోసం శివారులో ఫారెస్టు చుట్టూ ఉన్న ట్రెంచ్ దాటేందుకు జంప్ చేశారు. అచ్చం సినిమా షూటింగ్లో మాదిరి ఆయన జంప్ చేయగా.. ప్రజాప్రతినిధులు మాత్రం కాలువలో రాళ్లు వేసి దాటారు. కలిసిపోయి.. కలివిడిగా.. ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ శుక్రవారం తొర్రూరులో పర్యటించారు. పార్కుల ఏర్పాటు, ఇతరత్రా అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. తర్వాత ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. అప్పటికే మధ్యాహ్న భోజన సమయం కావడంతో విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటే మెట్లపై కూర్చుని భోజనం చేస్తూ వారి బాగోగులపై ఆరా తీయడం ఆకట్టుకుంది. -
ఇళ్లు కనిపించడం లేదు.. కాస్త వెతికి పెట్టండి
సాక్షి, చెన్నై: గృహ నిర్మాణ పథకం కింద తమకు ప్రభుత్వం కట్టి ఇచ్చిన ఇళ్లు కనిపించడం లేదని ఓ దంపతులు నామక్కల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది కాస్త గృహ నిర్మాణ పథకం విభాగ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరు పచ్చ పాళయంకు చెందిన మురుగేష్, కవిత దంపతులు శనివారం కలెక్టరేట్‌కు వచ్చారు. తమ వద్ద ఉన్న ఫొటోలు, ఇతర ఆధారాల్ని కలెక్టరేట్లోని ఫిర్యాదుల విభాగానికి సమర్పించారు. గతంలో తమకు ప్రభుత్వం తరఫున గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరైనట్టు ఫిర్యాదులో వివరించారు. ఇంటి పనులకు పునాదులు వేసే సమయంలో అధికారులు వచ్చారని, ఆ తర్వాత ఏ ఒక్కరూ అటు వైపుగా రాలేదని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఆ గృహ నిర్మాణం పూర్తైనట్టు, తమకు ఆ గృహాన్ని కేటాయించినట్టు రికార్డుల్లో పేర్కొన్నారని వివరించారు. ఈ విషయంగా గ్రామ అధికారుల్ని నిలదీయగా, ఇళ్లు కట్టి ఇచ్చేశామని, ఇక, తమకు సంబంధం లేదని తేల్చినట్టు పేర్కొన్నారు. తమకు కట్టి ఇచ్చినట్టుగా చెబుతున్న ఇళ్లు ప్రస్తుతం కనిపించడం లేదని, దీనిని తమరే కనిపెట్టి ఇవ్వాలని కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. అయితే, ఆ దంపతులకు గృహం నిర్మించి, కేటాయించినట్టుగా రికార్డుల్లో ఉండడంతో, ఈ నిధుల్ని స్వాహా చేసిన వాళ్లెవ్వరో అన్న ప్రశ్న బయలు దేరింది. దీంతో గృహ నిర్మాణ పథకం విభాగం స్థానిక అధికారుల్లో టెన్షన్ బయలుదేరింది. తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వకుండానే, ఇచ్చేసినట్టుగా లెక్కలు తేల్చిన దృష్ట్యా, ఆ ఇళ్లు కనిపించ లేదని, కలెక్టరేట్లో ఫిర్యాదు చేశామని, దీనిపై కలెక్టర్ విచారించి తమకు న్యాయం చేకూర్చాలని మీడియాతో మాట్లాడుతూ, ఆ దంపతులు విజ్ఞప్తి చేసుకున్నారు. -
విజయనగరంలో ఎర్ర చెరువు శుద్ధి కార్యక్రమం
-
కలెక్టర్.. లెక్కల టీచర్
కొడంగల్ రూరల్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ శుక్రవారం కొడంగల్ మండల పరిధిలోని రావులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం క్లాస్‌లోకి వెళ్లి గణితం బోధిస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీవాణితో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ బోర్డుపై మ్యాథ్స్ ఈక్వేషన్ వేసి వివరించారు. -
నెలలో 15 రోజులు క్షేత్రస్థాయిలోనే..
సాక్షి, అమరావతి : పరిపాలనలో జిల్లా కలెక్టర్లే తనకు కళ్లు, చెవులు వంటి వారని.. నెలలో 15 రోజులు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యల పరిష్కారానికి వారు చొరవ చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొంతమంది జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు ఎక్కువగా వెళ్లడం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని.. ఈ పరిస్థితి వెంటనే మారాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదివారం స్పష్టమైన కార్యాచరణను నిర్దేశిస్తూ మార్గదర్శకాలు జారీచేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ– అభివృద్ధి కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి మరోసారి కర్తవ్యబోధ చేశారు. క్షేత్రస్థాయి సమాచారమే మనకు కీలకం.. కలెక్టర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని.. వీడియో కాన్ఫరెన్సులు, టెలీ కాన్ఫరెన్సుల కంటే క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యమిస్తూ.. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నెలలో కనీసం 15 రోజులు క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనల వల్లే సరైన ఫీడ్ బ్యాక్ వస్తుందని.. ప్రజలు, లబ్ధిదారులు, ఇతర వర్గాల నుంచి వచ్చే సమాచారం చాలా కీలకమని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి, వాటి తక్షణ పరిష్కారానికి క్షేత్రస్థాయి పర్యటనలు ఉపయోగపడతాయని సూచించారు. కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని.. ఆస్పత్రులు, హాస్టళ్లు, పల్లెల్లో రాత్రి నిద్ర చేయాలని సూచించారు. ప్రతి కలెక్టర్ తప్పనిసరిగా వారంలో ఒకసారి జిల్లా కేంద్రం వెలుపల ఆసుపత్రులు, హాస్టళ్లలో ఎక్కడో ఒక చోట రాత్రి నిద్ర చేయాలన్నారు. దీని వల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడతాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇకపై వారానికి రెండుసార్లే వీడియో కాన్ఫరెన్స్ మండల స్థాయి అధికారులతో కలెక్టర్లు ఇక నుంచి వారానికి రెండుసార్లు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలి. ముఖ్యమంత్రితో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఒకసారి, వారంలో మరోసారి మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని కలెక్టర్లకు నిర్దేశించారు. సమస్యల తక్షణ పరిష్కారానికి మరిన్ని నిధులిస్తాం కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించిన సమస్యల తక్షణ పరిష్కారానికి ఇప్పటికే జిల్లాకు రూ.కోటి కేటాయించామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ నిధుల్ని సమర్థంగా ఖర్చుచేస్తే.. అవసరమైతే మళ్లీ నిధులు సమకూరుస్తామని సీఎం చెప్పారు. క్షేత్రస్థాయి పర్యటనలో అక్కడికక్కడే పరిష్కరించగలిగిన సమస్యలకు నిధుల అడ్డంకి ఉండకూడదనే ఉద్దేశంతో రూ. కోటి నిధులను ఇప్పటికే కలెక్టర్లకు అందుబాటులో ఉంచారు. -
కలెక్టర్లకు సీఎం జగన్ మార్గదర్శకాలు
సాక్షి, తాడేపల్లి : కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ల కన్నా జిల్లాలో విస్తృతంగా పర్యటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదివారం రోజున అన్ని జిల్లాల కలెక్టర్లకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటనల వల్లనే సరైన ఫీడ్ బ్యాక్ వస్తుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ప్రజలు, లబ్ధిదారుల, తదితర వర్గాల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ చాలా కీలకం అని పేర్కొన్నారు. నెలలో కనీసం 15 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలో ఉండాలని.. ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. రాత్రి పూట ఆస్పత్రులు, హాస్టల్స్, పల్లెల్లో నిద్ర చేయాలని స్పష్టం చేశారు. దీనివల్ల క్షేత్రస్థాయి పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు. కొంతమంది కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని తన దృష్టికి వచ్చినట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ పరిస్థితి మారాలని అన్నారు. పరిపాలనలో తనకు జిల్లా కలెక్టర్లే కళ్లు, చెవులు అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి కలెక్టర్లే వారధి వంటివారని స్పష్టం చేశారు. -
రెవెన్యూ కార్యాలయాలకు పోలీసు భద్రత
సాక్షి, హైదరాబాద్ : తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనమైన దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని రెవెన్యూ కార్యాలయాల వద్ద భద్రతా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అన్ని కార్యాలయాల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. రెవెన్యూ యంత్రాంగం భయాందోళనలకు గురవుతోందని, వెంటనే తమకు భద్రత కల్పించాలని రెవెన్యూ జేఏసీ (ట్రెసా) చేసిన విజ్ఞప్తి మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) సోమేశ్‌కుమార్ బుధవారం కలెక్టర్లకు లేఖ రాశారు. ►అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీసు భద్రతా ఏర్పాటు చేయాలి. ►తహసీల్దార్ కార్యాలయాల్లోకి రాకపోకల కోసం ప్రత్యేక పద్ధతిని పాటించాలి. అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలి ►తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజల కోసం ఏర్పాటు చేసే ‘గ్రీవెన్స్’కార్యక్రమం కోసం నిర్దేశిత వేళలు నిర్ధారించాలి. ఆ సమయంలో కార్యాలయ సిబ్బంది హాజరయ్యేలా చూడాలి. ►కలెక్టర్లు తమ నిధులతో వెంటనే అన్ని కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కార్యాలయంలోని అన్ని ప్రాంతాలు ఆ పరిధిలోకి వచ్చే విధంగా వాటిని అమర్చాలి. ►కొత్తగా ఏర్పాటయిన కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో మౌలిక వసతుల కోసం తీసుకున్న చర్యల నివేదికను పంపించాలి. ►అధికారుల చాంబర్లను కోర్టు హాళ్లను మాదిరిగా ఆధునీకరించాలి. ►ముఖ్యమైన చట్టాలు, మెజిస్టీరియల్ కార్యనిర్వాహక అంశాలపై జిల్లా శిక్షణా కేంద్రాల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి. -
'వలంటీర్లతోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది'
సాక్షి, ఒంగోలు : వలంటీర్లు గ్రామ స్వరాజ్యానికి పట్టుగొమ్మల వంటి వారని, వారి ద్వారా క్షేత్రస్థాయిలో పాలన సులువుగా మారిందని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పేర్కొన్నారు. ఈ వ్యవస్థతో ప్రజలకు సత్వర సేవలు అందించే అవకాశం లభించిందన్నారు. ‘రైతు భరోసా’ ప్రక్రియలో ఎదురైన సమస్యలను రెండు రోజుల్లోపే పరిష్కరించ గలగడం దీనివల్లే సాధ్యపడిందన్నారు. ప్రకాశం జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు పది ప్రత్యేక కార్యక్రమాలకు తాము రూపకల్పన చేస్తున్నామన్నారు. ప్ర: వలంటీర్ల వ్యవస్థ ఎలా ఉపయోగపడుతుంది? కలెక్టర్: ఈనెల 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు అనేక సమస్యలు వెల్లువెత్తాయి. వాటన్నింటిని పరిష్కరించాలంటే ఫీల్డులో పని చేసేవారు కావాలి. దీంతో వలంటీర్లను రంగంలోకి దించాం. వారందరికి మొబైల్‌కే అప్లికేషన్ ఇవ్వడంతో కేవలం ఒకటిన్నర రోజులోనే వాటన్నింటిని పూర్తిచేశారు. వాస్తవానికి గ్రామ వలంటీర్ల వ్యవస్థ అందుబాటులో లేకపోతే ఇది అసాధ్యంగా ఉండేది. వలంటీర్లవల్ల ప్రభుత్వ కార్యక్రమాలు సత్వరమే ప్రజల ముంగిటకు తీసుకువెళ్లగలుగుతున్నామనేది వందశాతం వాస్తవం. ప్ర: రైతు భరోసా పథకంలో ఎంతమందికి లబ్ది చేకూరుతుంది కలెక్టర్: రైతు భరోసా పథకం కింద ఇప్పటికే దాదాపు 4 లక్షల మందిని అర్హులుగా గుర్తించాం. ఇంకా కొంతమంది ప్రజాసాధికార సర్వేలో లేనివారు కూడా ఉన్నారు. వారికి అర్హత కల్పించేందుకు ప్రజాసాధికార సర్వేచేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. అయితే ప్రజాసాధికార సర్వేతోపాటు వారు వెబ్‌ల్యాండ్‌లో కూడా నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా చుక్కల భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. గతంలో వీటికి సంబంధించి కొంత పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. అందువల్ల వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం. అయితే తాము, గ్రామస్థాయిలో వాలంటీర్లు చూపుతున్న చొరవ వల్ల మరో 10వేల మంది లబ్దిదారులు పెరుగుతారని భావిస్తున్నాం. అయినా భూములు తమపైన లేనివారు, భూమి యజమాని చనిపోయినా వాటిని తమ పేరు మీదకు మార్చుకోని కుటుంబాలవారు ఇలాంటి చిన్న చిన్న అంశాలు తప్ప అత్యధికంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. రైతు భరోసా స్కీములో లబ్దిదారులను గుర్తించడంలో ప్రకాశం ప్రథమ స్థానంలో ఉంది. ప్ర: సచివాలయ భవనాల పరిస్థితి కలెక్టర్: గ్రామ సచివాలయాలకు ప్రస్తుతం జిల్లాలో 1038 పంచాయతీలకుగాను 1038 పంచాయతీ కార్యదర్శులు అందుబాటులోకి వచ్చారు. ప్రస్తుతం ఉన్న భవనంకు అదనంగా గదులు నిర్మించడం లేదా అంతస్తు నిర్మించడం కోసం దాదాపు 180 వరకు గుర్తించాం. వీటికి రు25లక్షలు కేటాయిస్తున్నాం. అయితే ప్రతి గ్రామ సచివాలయ భవనం 2వేల చదరపు అడుగులలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇక నూతనంగా నిర్మించేవాటికి మాత్రం రు40లక్షలు కేటాయిస్తున్నాం. ఇందుకు రూ.350కోట్లు సిద్ధంగా ఉన్నాయి. ప్ర: వలంటీర్లను ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? కలెక్టర్: వలంటీర్లు పెద్ద ఎత్తున జిల్లాలో విధులు నిర్వర్తించేందుకు వచ్చారు. వీరంతా చాలా మంచి నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. వీరందరి సేవలను సద్వినియోగం చేసుకునేందుకు సచివాలయ స్థాయిలో పంచాయతీ కార్యదర్శితో వీరికి సమన్వయం చేయబోతున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కనెక్టివిటీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే విధంగా పంచాయతీ నుంచి మండల స్థాయికి కూడా కనెక్టివిటీని తీసుకురావడం ద్వారా వేగవంతంగా ఫలితాన్ని పొందేందుకు, ప్రజలకు సేవలు అందించొచ్చు. ప్ర: ఇసుక సమస్య గురించి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? కలెక్టర్: పాలేరు–బిట్రగుంటకు సంబంధించిన ఇసుకను ఒంగోలు, కందుకూరు, పొదిలి, కనిగిరి ప్రాంతాలలో నాలుగు స్టాక్ యార్డులకు తరలించడం ద్వారా ఇసుక సమస్యకు పరిష్కారం చేయదలిచాం. అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు టీములను కూడా ఆదివారమే పంపిస్తున్నాం. వారు వారితో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపడం ద్వారా ఇసుక సమస్యకు అతి త్వరలోనే ఫుల్స్టాప్ పడనుంది. గిద్దలూరుకు ఇసుక సమస్యను నివారించేందుకు ఏంచేయాలనే దానిపై ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నాం. అక్రమంగా ఇసుక తవ్వకాలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. పట్టా భూముల్లో ఇసుకను సైతం మైనింగ్‌శాఖ ద్వారా తవ్వకాలు జరిపి సంబంధిత సమీప ప్రాంతాల ప్రజలకు అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ప్ర: ఒంగోలు వైద్యశాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపడతున్నారు కలెక్టర్: ఒంగోలు ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే ఆసుపత్రి ఆవరణలో అనధికారికంగా ఆక్రమించుకున్న షాపులను ఖాళీచేయించాం. వాటిని వేలం వేయడం ద్వారా ఆసుపత్రి అభివృద్ధి నిధిని పెంచుకుంటాం. అంతేకాకుండా దిగువ అంతస్తులో ఉన్న రక్షిత మంచినీటిని ప్రతి అంతస్తులోను పొందేందుకే వీలుగా చర్యలు చేపట్టాలని నిర్ణయించాం. అంతే కాకుండా ఏరియా వైద్యశాలలకు సైతం ఎక్స్‌రే మిషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈమేరకు ఇటీవలే డీసీహెచ్ఎస్కు లేఖ కూడా పంపాం. -
మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో సంపూర్ణ మార్పులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శుక్రవారం సాయం త్రం స్థానిక బాపూజీ కళా మందిరంలో వసతి గృహ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వసతి గృహాల్లోనూ మౌలిక వసతుల కల్పిస్తామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అంచనాలు తయారు చేశామని, రూ.10 లక్షల లోపు విలువ కలిగిన అంచనాలను వెంటనే మంజూరు చేస్తామన్నారు. ప్రతి వసతి గృహాని కి ఒక ఇంజినీర్‌కు బాధ్యతలు అప్పగించామ న్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో రూ. 20 లక్షల సర్వశిక్ష అభియాన్ నిధులతో మరమ్మతులు చేపట్టామన్నారు. మరుగుదొడ్లు, ఇతర పనుల కోసం రూ.11 కోట్లతో అంచనాలు త యారు చేశామన్నారు. మొదటి దశలో దాదాపు రూ.6 కోట్లతో పనులను చేపడతామన్నారు. హౌస్ కీపింగ్‌కు అనుమతులు.. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో అవుట్ సోర్సింగ్ ద్వారా హౌస్ కీపింగ్‌కు అనుమతులు వచ్చాయని త్వరలోనే మంజూరు చేస్తామన్నా రు. వసతి గృహాల శుభ్రతపై సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, మరుగుదొడ్లలో విధిగా రన్నింగ్ వాటర్ ఉండాలన్నారు. మరుగు దొడ్ల శుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. దుస్తులు ఆరవేసేందుకు సదుపాయం కల్పించాలన్నారు. కొన్ని గురుకులాల్లో అన్నం, పప్పుచారుతో భోజనం పెడుతున్నారన్నారు. మెనూలో తేడా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో టెండర్లను ఖరారు చేసి, ప్రతి వసతి గృహానికి స్టీమ్ కుక్కర్, గ్రయిండర్, మిక్సీలను సరఫరా చేస్తామన్నారు. ప్రతి వసతి గృహంలో నూ మెనూ బోర్డును ప్రదర్శించాలని, భోజనాల ఫొటోలను ప్రతి రోజూ అప్లోడ్ చేయాలని ఆదేశించారు. వారంలో ఒక రాత్రి నిద్రపోవాలి సంక్షేమాధికారులు వారంలో ఒక రాత్రి వసతి గృహంలో ని«ద్రపోవాలన్నారు. విద్యార్థుల్లో గుణాత్మకత విద్యా విలువలు వారిలో ప్రేరణ కల్పిస్తాయన్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు, సమాజిక విలువలను వివరించాలన్నారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. గతేడాది ఉత్తమ ఫలితాలు సాధించిన పోలాకి, రాజాం బీసీ వసతి గృహ అధికారులను అభినందించారు. వసతి గృహ సమస్యలపై మొబైల్ యాప్‌ను తయారు చేయడం జరిగిందన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సమావేశంలో వసతి గృహాల పరిశీలకులు పి.రజనీకాంతరావు, ఆర్అండ్బీ ఎస్ఈ కె.కాంతిమతి, బీసీ సంక్షేమాధికారి కె.కె.కృతిక, బీసీ కార్పొరేషన్ ఈడీ జి.రాజారావు, ఇంజినీరింగ్ అధికారులు సి.సుగుణాకరరావు, కె.భాస్కరరావు, గుప్త, రామం తదితరులు పాల్గొన్నారు. -
గురుకులం నిర్వహణపై కలెక్టర్ కన్నెర్ర
సాక్షి, శ్రీకాకుళం : కలెక్టర్ జి.నివాస్ హఠాత్తుగా కంచిలిలోని ఏపీ బాలయోగి గురుకులంలో ప్రవేశించారు. నేరుగా భోజన శాల వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. పిల్లలకు ఏం వడ్డించారో స్వయంగా చూసి తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ నిర్దేశించిన మెనూ అమలు కాలేదని గ్రహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాల్సివుండగా.. వారు ఇళ్లకు వెళ్లినట్టు తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. గురుకులం ప్రిన్సిపాల్, నలుగురు టీచర్లు, ఒక జూనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఎందుకు వడ్డించలేదని ప్రిన్సిపాల్ బాలాజీ నాయక్‌ను ప్రశ్నించారు. కేవలం పప్పుచారుతోనే పిల్లలు ఎలా తింటారని నిలదీశారు. దీనికి గల కారణమేంటని ప్రశ్నించగా కూరలు తీసుకురావడం ఆలస్యమైందని ప్రిన్సిపాల్ చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆ సమయంలో ఉపాధ్యాయులు, మిగ తా సిబ్బంది హాజరును పరిశీలించగా, అప్పటికి నలుగురు ఉపాధ్యాయులు, ఒక జూనియర్ అసిస్టెంట్ భోజనం చేయడానికి ఇంటికి వెళ్లారు. దీనిపై కలెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేయకుండా ఇంటికి వెళ్లడం ఏమిటని నిలదీశారు. పిల్లలకు పప్పుచారుపెట్టి .. మీరు మాత్రం మాంసాహా రాలుతినడానికి ఇళ్లకు వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. నాలుగో వంతు పిల్లలు కూడా లేరు కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలో 400 మంది పిల్లలకు 70 నుంచి 80 మంది మాత్రమే హాజరు కావడం, వారు కూడా యూనిఫారాలు ధరించకపోవడాన్ని కలెక్టర్ తప్పుబట్టారు. ఇదేం క్రమశిక్షణ అని ప్రిన్సిపాల్, సిబ్బందిని ప్రశ్నించారు. కలెక్టర్ పర్యటనలో గురుకుల నిర్వహణ తీరు, విద్యార్థుల వసతి తదితర అంశాలను, రికార్డులను పరిశీలించారు. దాదాపు 40 నిమిషాలపాటు ఆయన తనిఖీలు కొనసాగాయి. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూ.. లోపాలకు గల కారణాలను గురుకుల సిబ్బందిని అడిగారు. వారి సమాధానాలకు కలెక్టర్ సంతృప్తి చెందకపోవడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళన సిబ్బందిలో కన్పించింది. ఈ చర్యలకు బాధ్యులను చేస్తూ గురుకుల ప్రిన్సిపాల్ ఎన్.బాలాజీ నాయక్, ఉపాధ్యాయులు టి.వి.రమణ, పి.సురేష్, జి.జయరాం, పి.అమ్మాయమ్మ, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావులను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ జి.నివాస్ ప్రకటించారు. ఈ తనిఖీల్లో కలెక్టర్‌తోపాటు మండల ప్రత్యేకాధికారి ఆర్.వరప్రసాద్, తహసీల్దార్ కె.డిసెంబరరావు, ఎంపీడీఓ చల్లా శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ ఎస్.శివరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్లకూ ఓ ఖజానా
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా కలెక్టర్లకు అధికారం, దర్పం, హోదా ఉన్నప్పటికీ ఇప్పటివరకు సొంతంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేసేందుకు చిల్లిగవ్వ కూడా వారి ఖజానాలో లేని దుస్థితి. ఆసుపత్రి అభివృద్ధి నిధులనో, ఖనిజాభివృద్ధి నిధులనో ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు ఓ ఖజానాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో కలెక్టర్‌కు ఏడాదికి ప్రత్యేకంగా రూ.15 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టర్లకు రూ.195 కోట్లు కేటాయించింది. ఈ నిధుల వినియోగంలో రాజకీయ జోక్యానికి తావులేకుండా.. కలెక్టర్ల విచక్షణకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించే అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడం, పారిశుధ్య నిర్వహణ, చిన్నచిన్న మరమ్మతులకు ఈ నిధులను ఖర్చు చేయొచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేసింది. అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఇప్పటికే రూ.6.5 కోట్ల మేర నిధుల వినియోగానికి టెండర్లు పిలిచారు. టెండర్ల ద్వారానే అన్ని పనులు వాస్తవానికి గతంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధులను(ఎస్డీఎఫ్) కేటాయించింది. ఒక్కో జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్లు ఇచ్చింది. ఈ నిధులను ఖర్చు చేసే అధికారాన్ని కలెక్టర్లకే అప్పగించింది. కానీ, నిధుల వినియోగంలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం రెయిన్గన్ల కొనుగోలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులకు ఖర్చు చేసింది. ఇందులో కొన్ని పనులను అప్పటి అధికార పార్టీ నేతలకు నామినేషన్‌పై అప్పగించారు. ఇప్పుడు కలెక్టర్లకు ఇచ్చిన నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏ పని అయినా టెండర్ ద్వారానే అప్పగించాలని స్పష్టం చేసింది. అనంతపురం జిల్లాలో రూ.6.5 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఎక్కడా నామినేషన్ పద్ధతిని పాటించడం లేదు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రత్యేకంగా కేటాయించిన బడ్జెట్‌ను సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తాం. తద్వారా రానున్న రెండేళ్లల్లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల రూపురేఖలు మారిపోనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజాదరణ పెరుగుతోంది. ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగాయి. వచ్చే రెండేళ్లలో పరిస్థితిలో మరింత సానుకూల మార్పు రావడం ఖాయం’’ అని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు. -
ప్రతిభే కొలమానం
సాక్షి, విశాఖపట్నం: పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి జరుగుతున్న పరీక్షలు ఇవి. అభ్యర్థి ప్రతిభ ఆధారంగానే ర్యాంకు నిర్ణయమవుతుంది. ఆ ర్యాంకు బట్టే ఉద్యోగం భర్తీ జరుగుతుంది. అంతేతప్ప ఇందులో ఎవరి జోక్యం ఉండదు. ఇది పూర్తిగా పోటీ పరీక్ష. ఏ అభ్యర్థి కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. కష్టపడి చదివి పరీక్ష బాగా రాస్తే కచ్చితంగా మేలు జరుగుతుంది. బయట అనవసర ప్రచారాలు నమ్మవద్దు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. పూర్తి పారదర్శకంగా పరీక్షలు.. ప్రతీ ప్రశ్నాపత్రం నాలుగు సెట్లుగా ఉంటుంది. ఎక్కడా కాపీయింగ్‌కు అవకాశం ఉండదు. ఇవి పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయి. ఇవి పోటీపరీక్షలు కాబట్టి అభ్యర్థులకు ప్రతి నిమిషం విలువైనదే. మాల్‌ప్రాక్టీస్ వంటి అనవసర ఆలోచనలు పెట్టుకోవద్దు. అది నేరమవుతుంది. తీవ్ర పరిణామాలు ఉంటాయి. అనవసరంగా భవిష్యత్తు పాడుచేసుకోవద్దు. చక్కగా చదువుకొని పరీక్షల్లో ప్రతిభ చూపించండి. అడిగిన ప్రశ్నకు జవాబు రాయండి. మైనస్ మార్కులు ఉన్నాయి గమనించండి. కేంద్రానికి ముందుగానే చేరుకోండి.. ఇది పోటీ పరీక్ష కాబట్టి అభ్యర్థులంతా తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ఉదయం 7.30 నుంచి 8 గంటలకల్లా చేరుకుంటే మంచిది. పరీక్ష 10 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ 8 గంటల నుంచి పరీక్ష కేంద్రం గేటు తెరుస్తారు. అప్పటి నుంచే అభ్యర్థులు లోపలికి వెళ్లవచ్చు. ఏ హాల్లో ఏయే రోల్ నంబర్లు కేటాయించారో అక్కడ నోటీసు బోర్డులో వివరాలు ఉంటాయి. ముందుగానే చూసుకుంటే తనకు సంబంధించిన హాల్ ఎక్కడుందీ తెలుస్తుంది. 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ లోపలకు అనుమతించరు. అందుకే సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి అభ్యర్థులంతా ప్రయత్నించాలి. అందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. అలాగే అర్బన్ ప్రాంతంలోని పరీక్ష కేంద్రాల జాబితాను ఆటోడ్రైవర్ల అసోసియేషన్లకు ఇచ్చాం. అభ్యర్థులకు సహకరించాలని ఆటోడ్రైవర్లను కోరాం. బస్సు లేదా ఆటో ఏదైనా ఏదైనా సరే పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరండి. కొంతమంది ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా జరిగే పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం పరీక్ష రాసిన కేంద్రాన్నే రెండో పూట పరీక్షకూ కేటాయించాం. కానీ ఉదయం పూట కన్నా మధ్యాహ్నం అభ్యర్థుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి పరీక్ష హాల్, సీటింగ్ మారుతుంది. 12.30 గంటలకు పరీక్ష పూర్తయిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వండి. 2 గంటలకల్లా తమకు కేటాయించిన హాల్ ఎక్కడుందో చూసుకొని వెళ్లండి. -ఇతర జిల్లాల నుంచి కూడా పరీక్ష రాయడానికి వస్తున్నారు కాబట్టి పరీక్ష తేదీకి ముందురోజే ఒకసారి పరీక్ష కేంద్రానికి వెళ్లి సరిచూసుకుంటే ఇంకా మంచిది. ఓఎంఆర్ ఆధారిత పరీక్షలు.. ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకూ జరిగేవన్నీ వోఎంఆర్ ఆధారిత పరీక్షలే. ప్రశ్నాపత్రంతో పాటు వోఎంఆర్ షీట్ కూడా ఇస్తారు. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు చదివి జవాబులను వోఎంఆర్ షీట్లో నింపాలి. ఆప్షన్లు నాలుగింటిలో సరైనదాన్ని బాల్‌పాయింట్ పెన్ (బ్లాక్/బ్లూ)తో మాత్రమే నింపాలి. జెల్ పెన్, ఇంక్ పెన్, పెన్సిల్ ఎట్టి పరిస్థితిలోనూ వాడవద్దు. పరీక్ష ప్రారంభించడానికి ముందు అందరూ కచ్చితంగా ప్రశ్నాపత్రం బుక్లెట్, ఓఎంఆర్ షీట్‌పై ఉన్న సూచనలను తప్పకుండా క్షుణ్నంగా చదవాలి. సాయంత్రానికల్లా ‘కీ’... పరీక్ష పూర్తయిన తర్వాత ఒరిజినల్ ఓఎంఆర్ ఇన్విజిలేటర్‌కు అప్పగించి నకలు (రెండో కాపీ) అభ్యర్థులు తమ వెంట తీసుకెళ్లవచ్చు. ప్రశ్నాపత్రం తెచ్చుకోవచ్చు. ఏరోజు పరీక్షది ఆ రోజు సాయంత్రమే ప్రభుత్వం ‘కీ’ విడుదల చేస్తుం ది. అభ్యర్థులు దాన్ని గమనించి ఎన్ని మార్కులు వస్తాయో చూసుకోవచ్చు. పరీక్షలు పారదర్శకంగా జరుగుతాయనడానికి ఇదే నిదర్శనం. మొబైల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు వద్దు.. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి మొబైల్ ఫోను తేవద్దు. ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులేవీ పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఎవరైనా ఫోన్, మెటీరియల్, ఇతరత్రా పుస్తకాలు తెస్తే ఒక బ్యాగ్‌లో పెట్టి భద్రపరచుకోవడానికి పరీక్ష కేంద్రంలో ఒక గది ఉంటుంది. అయితే తమ వస్తువుల బాధ్యత అభ్యర్థులదే. అందుబాటులో వైద్యం శిబిరం.. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య శిబిరం (మెడికల్ క్యాంప్) పెడుతున్నాం. ఇద్దరు ఏఎన్ఎంలు, ప్ర థమ చికిత్స కిట్, మందులు ఉంటాయి. 108 అంబులెన్స్‌లను అలెర్ట్ చేసి ఉంచాం. పరీక్ష కేం ద్రంలో మంచినీరు ఏర్పాటు చేశాం. టాయిలె ట్స్ సౌకర్యం ఉంటుంది. పరిశుభ్రంగా ఉంచేం దుకు పారిశుద్ధ్య కార్మికులను ఉంచుతున్నాం. గట్టి పోలీసు భద్రత.. పరీక్షలన్నీ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన శిక్షణను సిబ్బంది, అధికారులందరికీ ముగ్గురు నోడల్ అధికారుల పర్యవేక్షణలో ఇప్పటికే పూర్తి అయ్యింది. శనివారం జిల్లాలో కేటా యించిన పోలీసుస్టేషన్లకు మెటీరియల్ చేరుతుంది. ఆదివారం ఉదయం పరీక్ష కేంద్రాలకు గట్టిపోలీసు భద్రతతో పంపిస్తాం. ఎక్కడా ఇ బ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. తప్పుడు ప్రచారం నమ్మవద్దు.. పరీక్షా నిర్వాహకుల జాబితాలు బయటకు వచ్చాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఉద్యోగాలు అమ్ముడుపోతున్నాయనే కల్లబొల్లి మాటలు నమ్మవద్దు. ఈ పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇన్విజిలేటర్లకు కూడా తమను ఏ సెంటర్లకు కేటాయించిందీ ముందు రోజు మధ్యాహ్నం అదీ రహస్యంగా తెలియజేస్తారు. ఏ హాల్ కేటాయిస్తున్నదీ పరీక్ష రోజు ఉదయం 7.30 గంటలకు మాత్రమే సమాచారం ఇస్తారు. అందుకు సంబంధించిన జాబితాలన్నీ సీల్డ్ కవర్లో భద్రంగా ఉన్నాయి. బయటకు ఎలాంటి లీకేజీ జరగలేదు. గుర్తింపు కార్డు ఉంటే మంచిది... హాల్‌టికెట్‌లో కొంతమంది పేరు తప్పుగా వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. అయితే హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ఆ హాల్‌టికెట్‌పై ఫొటో ఆధారంగానే పరీక్షాహాల్లోకి అనుమతి ఇస్తారు. ఎందుకైనా మంచిది అభ్యర్థులు తమ వెంట ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డులు ఏవైనా వెంట తెచ్చుకుంటే మంచిది. హాల్‌టికెట్‌లో ఏమైనా తప్పులు దొర్లితే సరిచూసుకోవడానికి మాత్రమే ఈ గుర్తింపు కార్డులు ఉపయోగపడతాయి. ఏదేమైనా హాల్‌టికెట్ మాత్రం వెంటతెచ్చుకోవడం మరచిపోవద్దు. అది లేకుంటే ఎట్టి పరిస్థితిలోనూ లోపలికి అనుమతించరు. -
ఇక ప్రతివారం ‘కాఫీ టుగెదర్’ : సీఎం జగన్
సాక్షి, అమరావతి : జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కాఫీ టుగెదర్ కార్యక్రమం పేరుతో ప్రతివారం కలుసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. తద్వారా అధికారుల మధ్య సమన్వయం కుదిరి భూవివాదాల పరిష్కారానికి అవకాశముంటుందని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన స్పందన రివ్యూ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘కాఫీ టుగెదర్’ కార్యక్రమం పేరుతో కలుసుకోవాలి. భూవివాదాలకు సంబంధించిన జాబితా ఇచ్చి పుచ్చుకోవాలి. ఈ జాబితాను తహశీల్దార్లకు బుధవారం పంపాలి. గురువారం తహశీల్దార్, ఎస్సై, సర్వేయర్, ఆర్ఐ, వీఆర్వోలు కలిసి కూర్చోవాలి. భూవివాదాల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. చాలా చోట్ల భూవివాదాలు శాంతి భద్రతల సమస్యగా మారాయి. ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీలు చేసిన ఈ ప్రతిపాదనలు బాగున్నాయి. మిగతా అధికారులు ఇది పాటించాలి. మళ్లీ చెప్తున్నా.. ఎక్కడా అవినీతి ఉండకూడదు’ అన్నారు. సెప్టెంబర్‌లో ప్రారంభం.. వచ్చే నెల (సెప్టెంబర్) నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో మొదటగా ప్రారంభిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటిదాకా ప్రజలకు అందించే బియ్యంలో నాణ్యత లేక వారు తినడంలేదని చెప్పారు. ప్రజలు తినగలిగే బియ్యాన్నే ప్రభుత్వం ఇవ్వాలని స్పష్టం చేశారు. చిత్రావతిలో నీళ్లు నిలపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అందుకోసం రూ.52 కోట్లు అవసరమవుతాయని కలెక్టర్ అడిగితే వెంటనే ఇవ్వండని అధికారులకు చెప్పానని గుర్తు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆకుపచ్చ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్/సిద్ధిపేట/గజ్వేల్ : అడవులు విరివిగా ఎక్కడ పెరిగితే ఆ ప్రాంతంలోని ప్రజలు ఆనందంగా ఉంటారు.. ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా, హరిత జిల్లాల ఏర్పాటుకు కలిసి కట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. కలెక్టర్లు, మంత్రులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని సింగాయిపల్లి, నెంటూరు, కోమటిబండ ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను బుధవారం మం త్రులు, కలెక్టర్లకు ఆయన చూపించారు. సింగాయిపల్లి అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలను, గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని గజ్వేల్ షరీఫ్‌లో 160 హెక్టార్లలో నాటిన మొక్కలను పరిశీలించారు. అక్కడి నుంచి 2016లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీ నాటిన మొక్కలను కలెక్టర్లు, మంత్రులకు చూపించారు. మంకీస్ ఫుడ్ కోర్టులు... కొత్త రెవెన్యూ, పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన గురించి కలెక్టర్లతో కేసీఆర్ చర్చించారు. ‘పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలి. ఇందుకోసం 60 రోజుల ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎక్కడా అవినీతికి తావులేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే కొత్త రెవెన్యూ చట్టం రూపొందిస్తున్నాం. ఈ చట్టంతో రైతులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దు. అడవులు నశించడంతో పండ్లూఫలాలు లేక కోతులు ఊళ్లలోకి వస్తున్నాయి. కోతులు వాపస్ పోవాలంటే వాటికి అక్కడే ఆహారం లభించేలా చెట్లను పెంచాలి. ఫల, మేడి, మర్రీ లాంటి 27 రకాల పండ్ల మొక్కలు నాటితే కోతులకు కావాల్సిన ఆహారం దొరుకుతుంది. అడవులు అంటే కోతులు, ఇతర జంతువులతో కళకళలాడుతూ ఉండాలి’అని చెప్పారు. గచ్చకాయ చెట్టు పరిచయం చేసింది నేనే.. ‘అడవులు, చెలకలకు గచ్చకాయ చెట్టు కంచెగా ఉంటుంది. జంతువులు, మనుషులు కూడా లోపలికి వెళ్లలేరు. అటవీ అధికారులకు దాన్ని పరిచయం చేసింది నేనే’అని చెప్పిన కేసీఆర్ ఇలా నాటిన గచ్చకాయ చెట్లను కలెక్టర్లకు చూపించారు. ఎడారిగా ఉన్న సిద్దిపేట అటవీ భూముల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పంచిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అటవీశాఖ అధికారుల పనితీరు భేష్ అని ముఖ్యమంత్రి ప్రశంసించారు. గజ్వేల్ అటవీ ప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అటవీశాఖ పీసీసీఎఫ్ ఆర్.శోభ, అడిషనల్ పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ కలెక్టర్లకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్ స్టాక్‌ను ఉపయోగించుకొని సహజమైన పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామన్నారు. అడవి చుట్టూ కందకాలు తీశామని, దీంతో బయటి జంతువులు లోపలకు రావడంగానీ, లోపలి జంతువులు బయటకు వెళ్లడం కానీ సాధ్యం కాదన్నారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావల్సిన తేమ అందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోశ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాజీవ్‌శర్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి శుభాష్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, భూపతిరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ జహంగీర్, గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రాజయ్య సైతం పాల్గొన్నారు. పచ్చటి గజ్వేల్... ‘తెలంగాణ ఏర్పడిన కొత్తలో గజ్వేల్ నియోజకవర్గంలోని అటవీ భూములు చెట్లు లేకుండా ఏడారిగా ఉండేవి. అడవుల పునరుద్ధరణే లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాం. ఆ ఫలితమే ఇప్పటి ఈ పచ్చటి గజ్వేల్. ఇక్కడ 27 రకాల పండ్ల మొక్కలను పెంచడంతో కోతులకు ఆహారం అందుతోంది. దీన్ని ఆదర్శంగా తీసుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీభూమి ఉంది. ఇది మన భూభాగంలో 23.4 శాతం. అడవుల పెంపకంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఇలా అందరూ భాగస్వాములు కావాలి. అడవుల్లో చెట్ల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాలి’అని కలెక్టర్లకు సీఎం సూచించారు. ఈ సందర్భంగా కోమటిబండలో ప్రారంభించిన మిషన్ భగీరథ ప్లాంట్‌ను కలెక్టర్లకు చూపించారు. అక్కడే వారితో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. -
‘సమస్యలపై ఫోన్ చేస్తే ఎప్పుడూ స్పందించరు’
సాక్షి, వికారాబాద్: ‘నేను చాలా సార్లు ఫోన్ చేశా, మీరు తీయడం లేదు, ఒక వేళ మీటింగ్‌లతో బిజీగా ఉంటే ఆ తర్వాతైనా ఫోన్ చేయొచ్చు కదా.. మీరు ప్రజాప్రతినిధులను చిన్న చూపు చూస్తున్నారు’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్ కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ ఎదుట ఆవేదన వెళ్లగక్కారు. వివరాలిలా ఉన్నాయి.. రైతు సమస్యల పరిష్కారం డిమాండ్‌తో సోమవారం పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వద్దకు వెళ్లిన ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. మాజీ ప్రజా ప్రతినిదులంటే చిన్నచూపు ఎందుకని నిలదీశారు. మీతో మాకు వ్యక్తిగత అవసరలేవీ లేవని, ఈ ప్రాంతం గురించి మీకు గానీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు గానీ పూర్తి స్థాయిలో అవగాహన లేదన్నారు. అందుకోసమే కొన్ని విషయాలు చెప్పాలని ఫోన్ చేస్తే మీరు స్పందించడం లేదని అసహనం వ్యక్తంచేశారు. తాము 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని తెలిపారు. మీరు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫోన్ తీయలేకపోతే తర్వాత చేసినా మార్యాద ఇచ్చిన వారవుతారన్నారు. పలు సమస్యలపై మాట్లాడేందుకు తాను చాలా సార్లు ఫోన్ చేసినా తీయలేదన్నారు. ఇది తమను అగౌరవపర్చినట్లేనని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ సగం మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలు అందలేదని, 50 శాతం రైతులకు రైతుబంధు అందలేదని తెలిపారు. జిల్లా అంటే మరుగుదొడ్లు నిర్మించడం, మొక్కలు నాటడమే కాదు, ప్రజల అవసరాలను తెలుసుకొని పాలన అందిస్తే మంచిదని ప్రసాద్‌కుమార్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. జిల్లా యంత్రాంగం, మండల అధికారులు ఎప్పుడు చూసినా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్, ప్రిన్సిపల్ సెక్రెటరీ వీసీ అంటూ కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదని తెలిపారు. అధికారుల పనితీరుతో ఎంతో మంది రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ నాయకులు తదితరులు ఉన్నారు. -
ప్రధాన జనగణన అధికారులుగా కలెక్టర్లు
సాక్షి, అమరావతి: 2021 నుంచి చేపట్టనున్న జనాభా సేకరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్లను ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారులుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ప్రీ టెస్ట్ సెన్సెస్ నిర్వహణ జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా భోగాపురం, అనంతపురం జిల్లా ఆత్మకూరు, గుంటూరు జిల్లా నర్సరావుపేట సెన్సెస్ చార్జ్ ఆఫీసర్లుగా స్థానిక తహసిల్దార్లను నియామకం చేస్తూ సాధరణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
'ప్రభుత్వం సరికొత్త పాలన అందించబోతుంది'
సాక్షి, కడప : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త గ్రామ సచివాలయ పాలనలో భాగంగా గ్రామ వలంటీర్ల పాలనకు శ్రీకారం చుట్టబోతోంది. స్వాతంత్య్ర వేడుకల అనంతరం గురువారం ఉదయం 11 .00 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనిని ప్రారంభిస్తారు. తొలిరోజు వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తారు. అనంతరం వలంటీర్లు వారి పరిధిలోని గృహాలకు వెళ్లి పరిచయ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత గ్రామ సచి వాలయ పాలనలో భాగస్వాములవుతారు. గ్రామ సచివా లయ పాలనను ప్రభుత్వం పారదర్శకంగా, అవినీతి రహితంగా నిర్వహించాలని కృత నిశ్చయంతో ఉంది. ఈ పాలనను ముందుకు నడిపించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లపై పెట్టింది. గురువారం నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థ ప్రారంభం నేపథ్యంలో వారి విధి విదానాలు, పాలన తీరుతెన్నులను కలెక్టర్ సీహెచ్ హరి కిరణ్ ‘సాక్షి ప్రతినిధి’కి వివరించారు. గ్రామ వలంటీర్ల పాలనను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని కలెక్టర్ సీహెచ్ హరికిరణ్ తెలిపారు.అనంతరం సీఎం సందేశమిస్తారన్నారు. ప్రభుత్వ పాలన ఎంత పారదర్శకంగా, అవినీతి రహితంగా ఉంటుందో ఆయన తెలియజేస్తారన్నారు. వలంటీర్ల పనితీరు, వారి నడత, నడక ఎలా ఉండాలో స్పష్టత ఇస్తారని, ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎలా తీసుకెళ్లాలో ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేస్తారని కలెక్టర్ తెలిపారు. సీఎం సందేశం అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం ఇందులో పాల్గొంటారన్నారు. ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు వలంటీర్ల పరిచయ కార్యక్రమం ఉంటుందన్నారు. వారికి కేటాయించిన 50 లేదా 60 గృహాలకు వెళ్లి వారు పరిచయం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 23 నుంచి 30వ తేది వరకు గ్రామాల్లో అర్హులైçన వారికి నివాస స్థలాల కోసం సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు.వారం రోజుల్లో వలంటీర్లు దీనిని పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. తర్వాత శిక్షణా తరగతులు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. వలంటీర్లు బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. చిన్న పొరపాటు జరిగినా ఉపేక్షించమని చెప్పారు. గాంధీజయంతి నుంచి గ్రామసచివాలయ వ్యవస్థ అక్టోబరులో గాంధీ జయంతి నాటి నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి వస్తుందని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను ప్రభుత్వం అక్కడి నుంచే అమలు చేస్తుందన్నారు. ఇక గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపికకు సంబంధించి సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కేటగిరి–1 పరిధిలో జిల్లాలో 82 వేల మంది ఆన్లైన్లో, అన్ని కేటగిరీలకు కలిపి లక్షా 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో 400 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న వలంటీర్ పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. జిల్లాలో అర్హులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఇంటి స్థలాల కోసం జమ్మలమడుగు డివిజన్ మినహా మిగిలిన డివిజన్ల పరిధిలో 2021 ఎకరాలు గుర్తించామన్నారు స్పం దన సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. గ్రామ సచివా లయ వ్యవస్థ రాగానే అర్హులందరికీ పెన్షన్లు, రేషన్‌కార్డులు అందజేస్తామని వివరించారు. -
రైతు కూలీగా మారిన జిల్లా కలెక్టర్
సాక్షి, భూపాలపల్లి : ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడు బిజీగా ఉండే అధికారి రైతు కూలీగా మారి పొలంలో వరినాట్లు వేశారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. ఆ అధికారి పేరు వాసం వెంకటేశ్వర్లు. ఈయన భూపాలపల్లి కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రైతుల సమస్యలే ఎజెండాగా తీసుకొని వాటిని పరిష్కరిస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారు. భూ పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏన్నో ఏళ్లుగా రైతులు పడుతున్న సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కార మార్గాలు చూపించారు. తాజాగా జిల్లాలోని ఘనపురం మండలంలో రైతు సమస్యల పరిష్కారం కోసం వెళుతున్న క్రమంలో దారి మధ్యలో రైతు కూలీగా మారి పొలంలో నాట్లు వేశారు. ఒక జిల్లాకు కలెక్టర్ అయి ఉండి ఎలాంటి బేషజాలకు పోకుండా మాతో కలిసి వరినాట్లు వేయడం తమకెంతో ఆనందం కలిగించదని అక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. -
'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'
సాక్షి, విజయవాడ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడాన్ని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకొవాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం విజయవాడలోని బిషప్ హాజరయ్య పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఇంతియాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్ బెండాజోల్ టాబ్లెట్లను అందజేశారు. ఈ టాబ్లెట్ ద్వారా నులి పురుగులను నివారించవచ్చని పేర్కొన్నారు. అపరిశుభ్ర వాతావరణం ఆరోగ్యానికి హానికరమని వెల్లడించారు. ఏడాది వయపు నుంచి 18 ఏళ్ల పిల్లల వరకు శరీరంలో నులిపురుగులు వస్తాయని, అందుకే పని చేసిన ప్రతీసారి చేతులను శుభ్రంగా కడుక్కుంటే నులిపురుగులు దరిచేరవని తెలిపారు. -
తెయూను మొదటి స్థానంలో నిలబెడదాం
సాక్షి, డిచ్పల్లి : యూనివర్సిటీ సిబ్బంది అందరూ తనకు సమానమేనని, సమష్టి కృషితో తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడదామని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇన్చార్జి వీసీ వి.అనిల్‌కుమార్ అన్నారు. శుక్రవారం తెయూ ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పరిపాలనా భవనంలో వివిధ విభాగాలను సందర్శించారు. బోధన, బోధనేతర సిబ్బందిని విభాగాల వారీగా పరిచయం చేసుకున్నారు. విద్యా సంస్థలంటే తనకెంతో ఇష్టమని, తాను చదువుకునే సమయంలోనే ఉద్యోగం సాధించడానికి వివిధ పోటీ పరీక్షలను రాశానని గుర్తు చేసుకున్నారు. ఆచార్యుల ఆలోచనా విధానం, మార్గనిర్దేశనం ఉన్నతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీకి క్రమంగా వస్తూ ఉంటానని ప్రతి నెలలోనూ సిబ్బంది పనితీరుకు సంబం ధించి సమావేశం నిర్వహిస్తామన్నారు. అందరి సూచనలు, సలహాల ప్రకారం విద్యాపరమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెయూ మూడోస్థానంలో ఉందని, మొదటి స్థానానికి రావడానికి మనందరం సమష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణం ఉండాలని సూచించారు. అధ్యాపకులు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. ప్రతి విద్యార్థి పరీక్ష ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి గోల్డెన్, రెండో స్థానంలో నిలిచిన విద్యార్థికి సిల్వర్, మూడో స్థానం పొందిన విద్యార్థికి కాపర్ బ్యాడ్జెస్ వంటి గుర్తింపు కార్డులను నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. తద్వారా విద్యార్థులందరూ పోటీతత్వంతో మరింత బాగా చదివి మంచి ఫలితాలను సాధించడానికి చూస్తారని ఇన్చార్జి వీసీ తెలిపారు. ఆయన వెంట రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బలరాములు, సీవోఈ సంపత్‌కుమార్, ఏఈ వినోద్, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులున్నారు. -
కలెక్టర్ కట్టె పట్టినా అంతే!
జిల్లాలో మొత్తం రైతుల ఖాతాలకు గాను 2,121 ఖాతాలకు సంబంధించి భూములకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా కేవలం సాంకేతిక కారణాలతో డిజిటల్ సంతకాలు కాలేదు. రైతులకు సంబంధించి ఆధార్ కార్డు నంబర్లు లేవని చెప్పడంతో పాటు ఇతర కారణాలతో వీటిని పక్కన పెట్టారు. ప్రభుత్వం పదేపదే చెబుతున్నా... జిల్లా కలెక్టర్ బరిగె పట్టుకున్నట్లుగా వెంటపడుతున్నా క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలేమో! సాక్షి, హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన(ఎల్‌ఆర్‌యూపీ) కార్యక్రమం జిల్లాలో ప్రహసనంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ప్రతీ శనివారం ఎల్‌ఆర్‌యూపీ సమస్యలపై డీఆర్వో నుంచి వీఆర్వో స్థాయి వరకు అధికారులతో నేరుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ వారంలో సాధించిన, ఇంకా సాధించాల్సిన ప్రగతిపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజావాణికి వచ్చిన భూసమస్యల విషయంలో అధికారులు తక్షణం స్పందించాలని, రైతుల సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. అయినా కొందరు అధికారుల్లో మార్పు రావడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూలాల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కారం చేసే ఉద్దేశం వారిలో కనిపించడంలేదు. అలా కాకపోతే ఉద్యోగులు ‘ఆశించిన ఫలితం’ దక్కడం లేదనే భావనతో కొన్ని పనులు పక్కన పడేస్తున్నారు. మరికొన్నిచోట్ల సర్వేల పేరుతో పెండింగ్‌లో పెడుతున్నారు. సర్వే పూర్తి చేసుకుని తమ భూమి రికార్డుల్లో నమోదు చేయమని వెళ్తే ఆ సర్వే నంబర్లో ఖాళీ లేదని చెబుతున్నారు. లేదంటే చుట్టుపక్కల ఉన్న అందరూ కలిపి సర్వే చేయించుకోండి అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో రైతులు వీఆర్వోలు, మండల కార్యాలయాల చుట్టూ తిరగలేక అలిసిపోతున్నారు. చివరకు మళ్లీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి ప్రతీ సోమవారం కలెక్టరేట్‌కు వస్తున్నారు. పైసలిస్తేనే పని... అర్బన్ జిల్లాలో మెజార్టీ మండలాల్లో భూములు విలువ ఎకరానికి రూ.కోట్లల్లో ఉంది. ఇలాంటి చోట రైతు బందు పథకంతో పాటు విలువైన భూమిని తమ పేరుతో భద్రంగా ఉంచుకోవాలని రైతులు ఆరాటపడటం సహజం. దీనిని అదనుగా తీసుకుని రెవెన్యూ సిబ్బంది తమకు అడినంత ఇస్తేనే పనిచేస్తున్నారు. కొన్నిచోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మిలాఖత్ అయి పక్కన భూములు ఉన్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. భూమికి మార్కెట్లో ఉన్న ధరను బట్టి రెవెన్యూ సిబ్బంది తమ కమీషన్ డిమాండ్ చేన్నారు. రూ.కోట్లల్లో ధర ఉన్నచోట రూ.లక్షల్లో ఇవ్వాల్సిందే. రైతులకు సంబంధించి అన్ని రుజువులు ఉన్నా అడిగినంత ఇస్తేనే పనులు చేస్తున్నారు. 21 శాతం పార్ట్ బీలో... రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 1,31,210 ఖాతాలతో పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. ఇందులో 89,243 ఖాతాలు అంటే 68శాతం వ్యవసాయ భూములకు సంబంధించినవి ఉన్నాయి. మిగతా వాటిలో 14,430 అంటే 11శాతం వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ అసైన్డ్ లాండ్స్‌కు ఖాతాలు మంజూరు చేశారు. ఈ లెక్కన వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు మొత్తంగా 1,03,673 ఖాతాలతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. మిగతా 21 శాతం అంటే 27,537 ఖాతాలు పార్ట్ ‘బీ’ భూములకు సంబంధించినవి ఉన్నాయి. -
గ్రామాభివృద్ధికి సహకరించాలి :జిల్లా కలెక్టర్
సాక్షి, ఝరాసంగం: గ్రామ ఆరోగ్య వేదిక కార్యక్రమం ద్వారా గ్రామాలు ఆదర్శవంతంగా మారాలని, అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని నర్సాపూర్‌లో గ్రామ ఆరోగ్య వేదిక ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని శిథిల పాఠశాలతో పాటు ప్రధాన రహదారిలోని మురికి కాల్వలు, ఇంటి ఆవరణలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ముఖ్యంగా ఆరోగ్యం, పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. వైద్యశాఖ అధికారులు వ్యాధుల లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కళాకారులచే కళాజాత ద్వారా అవగాహన కల్పించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఆయన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామం ఒక అంశంలో మాత్రమే కాకుండా అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో పాతటైర్లు, కొబ్బరి చిప్పలు తొలగించాలన్నారు. వర్షాలు కురిసిన సమయంలో నీటి నిల్వతో డెంగ్యూతో పాటు తదితర వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. ప్రతి శుక్రవారం పరిసరాలను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించేందుకు బుట్టలను పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. గ్రామంలో స్థలం లేనందున ఎవరైనా 10 గుంటల స్థలం ఇప్పించేందుకు ముందుకు రావాలని కోరారు. గ్రామాల్లో యువజన సంఘాలు ఏర్పాడి గ్రామాభివృద్దికి సహకరించాలన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని పేర్కొన్నారు. సిద్దిపేటలోని ఇబ్రహీంపూర్, తుప్రాన్లోని మల్కాపూర్ గ్రామాల మాదిరి ఆదర్శవంతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవదాసు, సర్పంచ్ శశిరేఖశ్రీనివాస్రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ జితిష్బీ.పాటిల్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్యాధికారి మోజీరాంరాథోడ్, జిల్లా పశువైద్యాధికారి రామారావు రాథోడ్, ఇమ్యూనైజేషన్ అధికారిణి గాయత్రీదేవి, ఎంపీడీఓ సుజాత, మండల వైద్యాధికారి మజీద్ తదిరులు పాల్గొన్నారు. -
అందరూ సెలవులు పెడితే ఎలా?
సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం) : ఆసుపత్రి పనివేళల్లో కనీసం 20 శాతం సిబ్బంది అయినా అందుబాటులో ఉండకపోతే ఎలా? రోగుల పరిస్థితి ఏంటని కలెక్టర్ జే నివాస్ వైద్యాధికారి ప్రదీప్‌కుమార్‌పై అసహనం వ్యక్తం చేశారు. గురువారం వీరఘట్టం పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇక్కడ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టికను పరిశీలించారు. తక్కువ మంది సిబ్బందిలో కొంద రు బదిలీల కౌన్సెలింగ్‌కు, ఇంకొంత మంది సెలవుపై వెళ్లారు. అయితే ఆసుపత్రిలో కనీస సిబ్బంది కూడా లేకపోవడంతో ఆసుపత్రి నిర్వహణ బాగులేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. హెల్త్ ఎడ్యుకేటర్ వై యోగీశ్వరరరెడ్డి నాలుగు నెలల్లో 27 సెలవులు పెట్టినట్లు గుర్తించిన కలెక్టర్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఉద్యోగికి ఇన్ని సెలవులు ఎలా మంజూరు చేశారని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే హెల్త్ ఎడ్యుకేటర్‌ను సస్పెండ్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని ఫోన్లో ఆదేశించారు. అంతకు ముం దు వార్డుల్లో రోగులను పలకరించి ఇక్కడ వైద్య చికిత్సల గురించి తెలుసుకున్నారు. అందరూ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. ఈయన వెంట పాలకొండ ఆర్డీవో ఎల్ రఘుబాబు, మండల ప్రత్యేకాధికారి ఎస్ శ్రీనివాసరావు ఉన్నారు. ప్రభుత్వ సంస్థల్లో వసతులు మెరుగుపడాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపడాలని కలెక్టర్ జే నివాస్ ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు విధిగా ఆస్పత్రులు, విద్యాసంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, తదితర సంస్థలను సందర్శించాలన్నారు. అక్కడ మౌలిక వసతుల కొరతను గుర్తించి వారంలోగా పరిష్కరించాలన్నారు. గురువారం సాయంత్రం మండల ప్రత్యేకాధికారులతో, మండల అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడి యో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రభుత్వ సంస్థలు మంచి సేవలకు నిలయాలుగా మారాలన్నారు. ఆస్పత్రి ప్రసవాలు, వైద్యసేవలు పక్కాగా అం దాలని, వసతి గృహాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని ఆదేశించారు. మరుగుదొడ్లు, తదితర మరమ్మతులు తక్షణమే చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై, సిబ్బందిపై చర్యలు చేపట్టాలన్నారు. స్పందన కార్యక్రమానికి రావడం వల్ల సమస్య పరిష్కరమైనట్లుగా ప్రజల్లో నమ్మకం కలగాలన్నారు. మండల వ్యవస్థపై విశ్వాసం పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
పని చేయని వారిని పంపించేస్తా
సాక్షి, విజయనగరం : జిల్లా కేంద్రమైన విజయనగరం నగర పాలక సంస్థ ప్రక్షాళనకు కలెక్టర్, ప్రత్యేకాధికారి డా.ఎం.హరిజవహర్‌లాల్ శ్రీకారం చుట్టారు. నాలుగు రోజుల కిందట ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ సోమవారం సంస్థ అధికారులు, సిబ్బందితో మున్సిపల్ కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. విభాగాల వారీగా వారు నిర్వహిస్తున్న విధులను తెలుసుకొని రానున్న ఆరునెలల కాలానికి వారు చేయాల్సిన పనులపై స్పల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించారు. పనిచేయని వారిని పంపించేస్తానని హెచ్చరించారు. నగరపాలక సంస్థకు వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఆదాయం, రెవిన్యూ వసూళ్లు తదితర అంశాలపై చర్చించారు. పట్టణంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులపై సమీక్షించారు. వీధులు, రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. పట్టణంలోని పాఠశాలలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని సంబంధిత అధికారి గాంధీకి సూచించారు. నగరంలో తాగునీటి సమస్య పరిష్కారంలో భాగంగా భూగర్భ జలాల పెంపుదలపై దష్టి సారించాలన్నారు. జలసంరక్షణ చర్యలను చేపట్టాలన్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల నమోదుకు ఒక రిజిష్టర్ నిర్వహించాలని ఆదేశించారు.పార్కుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆక్రమణలు తొలగించాలని సూచించారు. బుచ్చెన్న కోనేరుతోపాటు ఎన్సీఎస్ థియేటర్ వెనుక భాగంలోని చెరువు, ప్రేమసమాజం ఎదురుగా ఉన్న చెరువులను పునరుద్ధరించాలని స్పష్టంచేశారు. నగరంలోని పలు కూడళ్లను ట్రాఫిక్ పరంగా అభివృద్ధిచేసి వాటిని సుందరీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వర్మ, సహాయ కమిషనర్ కనకమహాలక్ష్మి, వైద్యాధికారి డా.ప్రణీత తదితరులు పాల్గొన్నారు. -
తీరంలో డీశాలినేషన్ ప్లాంట్
సాక్షి, నెల్లూరు : జిల్లాలో నీటి ఇబ్బందుల శాశ్వత పరిష్కారం కోసం తీరంలో డీశాలినేషన్ (లవణ నిర్మూలన) ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. చెన్నై నగరం సమీపంలో ఉన్న డీశాలినేషన్ ప్లాంట్‌ను ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. సోమవారం మొదటి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ క్రమంలో సదస్సుకు రాష్ట్ర మంత్రివర్గంతోపాటు ప్రభుత్వ సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన సమస్యలపై కలెక్టర్ సమగ్ర నివేదిక సిద్ధం చేసుకొని సమావేశానికి హాజరయ్యారు. తాగునీటి ఇబ్బందులు, శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలు, అలాగే నూతన ప్రాజెక్ట్ అయిన డీశాలినేషన్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు, పశువుల దాణాకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందజేశారు. తీవ్రమవుతున్న తాగునీటి సమస్య జిల్లాలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, ముఖ్యంగా ఈ వేసవిలో వందలాది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు అధికంగా ఉండడంతో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని, రోజులు గడిచే కొద్దీ తాగునీటి సమస్య ఉన్న గ్రామాల సంఖ్య పెరుగుతోందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో 940 గ్రామాలు ఉండగా వాటిలో 339 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అధికంగా ఉందని, దీనికోసం ట్యాంకర్ల ద్వారా ఆయా గ్రామాల్లో నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. డెల్టా, మెట్ట ప్రాంతాలతో సంబంధం లేకుండా గడిచిన నాలుగేళ్లుగా వర్షాభావంతో జిల్లాలో ఇబ్బందులు పెరిగాయని వివరించారు. గత నెలలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ప్రతిపాదనల మేరకు రూ.6 కోట్ల బిల్లులు మంజూరు చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో మరో రూ.10 కోట్ల వరకు తాగునీటి సరఫరాకు కేటాయించాలని కలెక్టర్ ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే చెన్నై నగరం సమీపంలోని మింజూరులో డీశాలినేషన్ ప్లాంట్లను సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారని, నెల్లూరు జిల్లాలో 168 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉందని, తీరం వెంబడి 12 మండలాలు ఉన్నాయని, జిల్లాలో అనువైన ప్రాంతంలో డీశాలినేషన్ ప్లాంటు ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. అలాగే జిల్లాలో పశువుల దాణా కొరత అధికంగా ఉందని, దీనిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. మంగళవారం కూడా కాన్ఫరెన్స్ కొనసాగనుంది. మంగళవారం కలెక్టర్‌తోపాటు ఎస్పీ కూడా సమావేశంలో పాల్గొననున్నారు. -
ప్రజా సమస్యలే అజెండా
సాక్షి, కాకినాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో జరిగే తొలి సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి సిద్ధమయ్యారు. అజెండాలో పేర్కొన్న ప్రకారం జిల్లాకు సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే సంబంధిత శాఖల నుంచి నోట్ రప్పించుకుని, నివేదిక తయారు చేశారు. కొత్త ప్రభుత్వం..కొత్త ముఖ్యమంత్రి..కొత్త కలెక్టర్..తొలి సమీక్షా సమావేశం..అంటే తప్పకుండా ప్రత్యేకత ఉంటుంది. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడమే తరువాయి సంక్షేమ కార్యక్రమాలపై సంతకాలు పెడుతున్నారు. నవరత్నాలను అమల్లోకి తెస్తున్నారు. బాధ్యతలు స్వీకరించి నెల రోజులు కాకముందే చాలా హామీలను అమలు చేశారు. ఒకవైపు సంక్షేమం చూస్తూనే మరోవైపు అభివృద్ధి, పాలనపై దృష్టిసారించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా కలెక్టర్లతో తొలి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అజెండా అంశాలను తెలిపారు. ఆరోగ్య శ్రీ, 108, 104, వ్యవసాయం, నవరత్నాల అమలు, తాగునీటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రాథమ్యాల ప్రకారం అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మురళీధర్‌రెడ్డి ఏజెన్సీపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ రెండు రోజుల పాటు పర్యటించి జనం కష్టాలను తెలుసుకున్నారు. వైద్యం, పోలవరం తదితర సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏజెన్సీకి ఏమి అవసరమో గుర్తించారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు కూడా దాదాపు అవే కావడంతో అనుభవ పూర్వక నోట్ తయారు చేసుకున్నారు. ఎటపాక సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు విలీన మండలాల్లో వ్యవసాయ అధికారుల కొరత ఉంది. ప్రస్తుతం ముగ్గురు మండల వ్యవసాయాధికారులు మాత్రమే ఉన్న నేపథ్యంలో కొత్తగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక వ్యవసాయ అధికారి పోస్టులను మంజూరు చేయవల్సిందిగా సీఎంను కోరనున్నారు. మత్స్యకార సంక్షేమం వేట నిషేధ సమయంలో మత్స్యకా రులకు ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున జిల్లాలో 23,190 మందికి రూ. 23.19 కోట్లు రావాల్సి ఉంది. నవరత్నాల్లో భాగంగా మత్స్యకారులకు భృతి మంజూ రు చేయవల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా ఉప్పాడ కొత్తపల్లి ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్‌కు మత్స్యశాఖ అధికారులు 2018 ఆగస్టు 16న రూ.280.40 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. వైద్య, ఆరోగ్యం జిల్లాలోని ఇంజరం, ఎర్రిపాక, లింగంపర్తి, జి.కొత్తపల్లి, మురమండ, నరేంద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాల అవసరం ఉంది. వాటిని మంజూరు చేయవల్సిందిగా కోరనున్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాలో ఖాళీగా ఉన్న 64 ఆరోగ్య మిత్ర పోస్టులను భర్తీ చేయాలని కోరనున్నారు. జిల్లాలోని ఏరియా ఆసుపత్రుల్లో సీటీ స్కానర్స్ లేక రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం, తుని, రామచంద్రపురం, అమలాపురం ఏరియా ఆసుపత్రులకు సీటీ స్కానర్స్ మంజూరు చేయవల్సిందిగా కోరనున్నారు. . రోగుల తాకిడి దృష్ట్యా పిఠాపురం, గోకవరం, రౌతులపూడి, ముమ్మిడివరం, తాళ్లరేవు, మండపేట కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను 30 నుంచి 50 పడకలకు; కొత్తపేట, రాజోలు, పెద్దాసుపత్రి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలను 50 నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని, రాజానగరం నియోజకవర్గ పరిధిలోని సీతానగరం పీహెచ్‌సీని వందపడకల కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంగా అప్‌గ్రేడ్ చేయాలని కోరనున్నారు. జిల్లాలో 108 వాహనాల కొరత ఉంది. తొమ్మిది వాహనాల అవసరం ఉంది. కూనవరం, కోరుకొండ, గొల్లప్రోలుకు ఒక్కొక్కటి చొప్పున, ఐటీడీఏ పరిధిలోని ప్రాంతాలకు ఆరు వాహనాలు మంజూరు చేయవల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. జిల్లాలోని కూనవరం, పిఠాపురం ప్రాంతాలకు 104 వాహనాల్లేవు. ఆ రెండు ప్రాంతాలకు రెండు 104 వాహనాలు మంజూరు చేయాలని కోరనున్నారు. గృహ నిర్మాణం ఏజెన్సీలో 2071 ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. సకాలంలో చెల్లింపులు జరగకపోవడం, యూనిట్ ఖరీదు తక్కువగా ఉండటం, రవాణా, బిల్డింగ్ మెటీరియల్ వ్యయం పెరగడంతో నిర్మాణం మందకొడిగా సాగుతోంది. వీటిని వేగవంతం చేసేందుకు, యూనిట్ ఖరీదు పెంచేందుకు, సకాలంలో చెల్లింపులకు అవసరమైన రూ.15.53 కోట్లు సబ్ ప్లాన్ నిధుల నుంచి మంజూరు చేయాలని కోరనున్నారు. పీవీటీజీ (కొండరెడ్ల) లబ్ధిదారులకు అదనంగా రూ.లక్ష, మిగతా ఎస్టీలకు అదనంగా రూ.75వేలు మంజూరు చేస్తే నిర్మాణాలు వేగవంతం కానున్నాయని తెలపనున్నారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ హౌసింగ్‌లో భాగంగా నాన్ షెడ్యూల్డ్ లబ్ధిదారులకు రూ.3.55 లక్షలకు, షెడ్యూల్డ్ లబ్ధిదారులకు రూ.4.55 లక్షలకు యూనిట్ చేయాల్సిందిగా కోరనున్నారు. చేనేతని జౌళి శాఖ జిల్లాలోని 37 చేనేత సహకార సంఘాలకు ఆప్కో రూ.10.02 కోట్ల బకాయి పడింది. 2018 ఏప్రిల్ నుంచి చెల్లింపులు చేయలేదు. 2019 జనవరి నుంచి ఆప్కో కొనుగోలు చేయక సహకార సంఘాల వద్ద 2019 మే చివరి నాటికి రూ.9.06 కోట్ల విలువైన వస్త్రాలు నిల్వ ఉండిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించాలని కోరనున్నారు. -
అధికారులు పరువు తీస్తున్నారు!
కావలసినంత విద్యుత్ సరఫరా అవుతున్నా... వినియోగదారులకు కోతలు తప్పడంలేదు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా... ఎక్కడ లోపం ఉన్నదో తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. మొత్తమ్మీద విద్యుత్ అధికారుల తీరు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. చిన్నపాటి గాలివాన వస్తే చాలు గంటలకొద్దీ సరఫరా నిలిచిపోతోంది. ఫలితంగా జిల్లావాసులు పగలనకా... రాత్రనకా... అవస్థలు పడాల్సిన దుస్థితి దాపురిస్తోంది. అసలే మండువేసవి... దానికి తోడు విద్యుత్‌సరఫరా నిలిచిపోవడంవల్ల ఎదురవుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. సాక్షి, విజయనగరం : జిల్లాలో 6లక్షల 30వేల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరికి సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 358 మంది క్షేత్ర స్థాయిలోనూ, 280 మంది కార్యాలయాల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యుత్ కేటాయింపుల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతిజిల్లాకు నిర్ధిష్ట కోటాను నిర్ణయిస్తారు. అలా జిల్లాకు రోజుకు 6.35 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోటా ఉంది. అవసరాన్ని బట్టి కోటాను మించి కూడా ఇస్తుంటారు. అలా జిల్లాలో రోజుకు 7.40 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. అంటే కోటా కంటే 1.04 మిలియన్ యూనిట్లు అధికంగా జిల్లాకు వస్తోంది. రెండు రోజుల క్రితం అంటే ఆదివారం రాత్రి జిల్లాలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు. ఆ రోజు రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకూ కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అందకుమించి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అది కూడా గంటో రెండు గంటలో కాదు. ఏకంగా నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ. రాత్రంతా జిల్లా ప్రజలు ఉక్కపోతతో అవస్థలు పడుతూ నిద్రలేకుండానే గడిపారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 7.30 గంటలకు పోయిన కరెంట్ తెల్లవారుజాము 3గంటల వరకూ రాలేదు. ఆ రోజే కాదు ఏ రోజు ఏ చిన్న గాలివాన వచ్చినా ఇదే పరిస్థితి. ఇంత ఘోరంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారంటే చాలా పెద్ద సమస్యే వచ్చి ఉంటుందనుకుంటాం. కానీ దీనికి అధికారులు చెప్పిన కారణం చూస్తే ఔరా అనిపించకమానదు. అదేమిటంటే విజయనగరం పట్టణంలోని ధర్మపురి వద్ద 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పిన్ ఇన్సులేటర్ కాలిపోయిందట. విద్యుత్ సబ్స్టేషన్లలో గుండ్రని ఆకారంలో పింగాణీతో చేసినవి కొన్ని ట్రాన్స్ఫార్మర్లపైన, విద్యుత్ తీగల మధ్య కనిపిస్తూ ఉంటాయి. వాటినే పిన్ ఇన్సులేటర్లుగా పిలుస్తుంటారు. జిల్లాలో మరో రెండు చోట్ల కూడా ఇదే సమస్య ఏర్పడింది. సాధారణంగా ఇలాంటి సమస్య వస్తే కాలిపోయిన పిన్ ఇన్సులేటర్‌ను మార్చడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. అయితే ఈ పని చేయడానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుంది. దీనికి ఇంచుమించు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. అంతకు మించి సమయం పట్టనవసరం లేదు. కానీ జిల్లాలో ఇదే సమస్యకు ఏడెనిమిది గంటలు పట్టడం విచిత్రం. దీనికి అధికారులు చెబుతున్న కారణమేమిటంటే అసలు ఎక్కడ పిన్ ఇన్సులేటర్‌కాలిపోయిందో, మరేదైనా సమస్య వచ్చిందో తెలియడం లేదట. సమస్య ఎక్కడో తెలుసుకోవడానికే సమయం పడుతోందట. అత్యధిక సాంకేతిక ప్రమాణాలు కలిగిన సంస్థగా దేశ స్థాయిలోనే గుర్తింపుతో పాటు అవార్డులు తీసుకున్న ఏపీఈపీడీసీఎల్‌లో ఉద్యోగుల అ« ద్వాన పనితీరుకు ఇదొక్కటే నిదర్శనం. చిన్న చిన్న సమస్యలకే ఇన్నేసి గంటలు విద్యుత్ కోత విధిస్తే నిజంగా పెద్ద సమస్య ఏదైనా వస్తే పరిస్థితిని ఊహించడానికే భయంగా ఉంది. ఇంత జరుగుతున్నా ఏపీఈపీడీసీఎల్ సీఎండీగానీ, జిల్లా కలెక్టర్‌గానీ దీని గురించి పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ విద్యుత్ శాఖ అధికారులతో వీరిద్దరూ ఒక్క సమీక్ష కూడా చేయకపోవడంతో కింది స్థాయి సిబ్బంది నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
కలెక్టర్ల నుంచి క్లియరెన్స్ వచ్చాకే..
సాక్షి, హైదరాబాద్: జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారుల నుంచి క్లియరెన్స్ వచ్చాకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఏకగ్రీవాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈ సీ) ఆదేశించింది. పదవుల వేలం, నామినేషన్లు వేయ కుండా అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి అభ్యర్థులపై ఒత్తిళ్లు తేవ డం వంటి ఆరోపణలపై వచ్చే ఫిర్యాదులు, పత్రిక లు, మీడియాలో వచ్చే వార్తల పరిశీలనకు జిల్లాలో కలెక్టర్ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. చట్టంలోని అంశాల ప్రాతిపదికన కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, డీసీపీలు విచారణ జరిపి, ఇందులో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పదవుల వేలం, నామినేషన్లు వేయకుం డా అభ్యర్థులను బెదిరించడం, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి ప్రాథమిక ఆధా రాలున్న సందర్భాల్లో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సాధారణ పరిశీలకులు ఎస్ఈసీకి నివేదికలు పంపించాలని తెలపింది. వీటికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు పూర్తిగా సంతృప్తి చెందాకే ఏకగ్రీవాలకు అనుమతి ఇవ్వాలని పేర్కొంది. పదవుల వేలం, ఒత్తిళ్లు, బెదిరింపులు చోటుచేసుకున్న చోట తదుపరి ఆజ్ఞల కోసం ఎస్ఈసీకి నివేదిక పంపించాలని ఆదేశించింది. పరిషత్ నోటిఫికేషన్లో భాగంగా తొలి విడత ఎన్నికలకు ఆదివారం (28న), రెండో విడతకు మే 2న, మూడో విడతకు మే 6న పోటీచేసే అభ్యర్థుల జాబితాలను సాయంత్రం 3 గంటల తర్వాత ప్రచురించాల్సిన నేపథ్యంలో ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఆదివారం ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్, ఇతర సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపించారు. -
సాకులు చెప్పొద్దు..
హన్మకొండ అర్బన్ : ‘ఇకపై ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది.. అన్ని శాఖల అధికారులు హాజరుకావాలి.. సాకులు చొప్పొద్దు’ అని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్‌కు హాజరైన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అధికారులు ఎక్కువ మంది రామకపోవడంపై ఆరాతీసి హాజరు వివరాలను పరిశీలించారు. జెడ్పీ సమావేశం ఉండటంతో చాలా మంది అక్కడికి వెళ్లినట్లు అధికారులు తెలుపగా ఇకపై అధికారులు తప్పనిసరిగా గ్రీవెన్స్‌కు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖలకు సంబంధించిన రాయితీ డబ్బులు నెల రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసినా యూనిట్లు ఎందుకు గ్రౌండింగ్ చేయాలేదని అధికారులను ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ మంగళవారం సాయంత్రం పత్య్రేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంటూ రుణాల గ్రౌండింగ్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పారు. అలాగే ఎంజీఎంలో సదరం క్యాంపుల నిర్వహణ, సర్టిఫికెట్ల పంపిణీపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గ్రీవెన్స్‌కు హాజరైన వివిధ శాఖల అధికారులు సదరం సర్టిఫికెట్ ఇప్పించండి తనకు ఆరు నెలల క్రితం పక్షవాతం రావడంతో రెండు కాళ్లు పూర్తిగా పనిచేయడం లేదు. మంచానికి పరిమితమయ్యాను. సదరం సర్టిఫికెట్ మంజూరు చేసి పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన సులువూరి లక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రం అందజేశారు. ఆలయ భూమిని కబ్జా చేస్తున్నారు హన్మకొండలోని వరంగల్ అర్బన్ ఆర్డీఓ కార్యాలయం సమీపాన 1145 సర్వే నంబర్లో ఉన్న కాకతీయుల కాలంనాటి బాలరాజరాజేశ్వర స్వామి దేవాలయం భూమిని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వారు కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు. ఈవిషయంలో అధికారులు సత్వరం చర్యలు తీసుకుని సుమారు 26 గుంటల భూమి కాపాడాలని కాయతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ కన్వీనర్ చీకటి రాజు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. -
రైతుల బాధను అర్థం చేసుకోండి
మెదక్ రూరల్ : ప్రతీ రెవెన్యూ అధికారి రైతుల స్థానంలో ఉండి ఆలోచించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను తరచూ కార్యాలయాల చుట్టూ అధికారులు తిప్పుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఎంతో మంది రైతుల భూములను ఇతరుల పేర్ల మీదికి మారుస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారుల పేర్ల మీద ఉన్న భూములను సైతం ఇతరుల పేర్ల మీదికి రాస్తే ఊరుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. రికార్డులపై అధికారులకు కనీస అవగాహన లేదన్నారు. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడమే అధికారుల కనీస బాధ్యత అనే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారన్నారు. ప్రతీ అధికారి ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. కొన్ని మండలాల్లో వీఆర్వోలపై తహసీల్దార్ల పర్యవేక్షణ కొరవడిందన్నారు. వీఆర్వోల పనితీరును ఎప్పటికప్పుడు తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రెండేళ్ల నుండి పౌతి కేసులు సైతం పరిష్కరించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అంతకుముందు జాయింట్ కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల పనితీరు జిల్లాలో సంతృప్తికరంగా లేదని, అధికారులు తమ పని తీరును మార్చుకొని ప్రజలకు నిస్వార్థమైన సేవలను అందించాలన్నారు. జిల్లాలో ఉన్న వీఆర్వోల్లో కొద్ది మంది మాత్రమే విజయవంతమయ్యారని తెలిపారు. ప్రతీ సమస్యను చిత్తశుద్ధితో అధ్యయనం చేసుకొని పరిష్కారం దిశగా కృషి చేయాలన్నారు. రైతుల భూములకు సంబంధించిన ప్రొసీడింగ్‌పై తహసీల్దార్లు సంతకం చేసేటప్పుడు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతీ మండలంలో ఉన్న ఫారెస్ట్, రెవెన్యూ భూములకు సంబంధించిన జాయింట్ సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసినా కొన్ని మండలాల్లో ఇంకా పూర్తి చేయలేదని, వాటిని సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు సాయిరాం, అరుణారెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ గంగయ్యతోపాటు తహసీల్దార్లు, ఆర్ఐలు, వీర్వోలు, సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సీడ్ హబ్‌గా మారనున్న రాష్ట్రం కౌడిపల్లి(నర్సాపూర్): మన రాష్ట్రం త్వరలో సీడ్ హబ్‌గా మారనుందని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే సాగులో మరింత అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి వద్ద ఉన్న డాక్టర్ డి రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యా సంస్థ వ్యవసాయ కళాశాల 15వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, ఏడీఏ పరశురాంనాయక్, విజ్ఞానజ్యోతి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అర్జునరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్కరణలతో రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి జరుగుతోందన్నారు. త్వరలో రాష్ట్రం సీడ్ హబ్‌గా మారుతుందన్నారు. ఇజ్రాయిల్ వ్యవసాయంలో ఎన్నో అద్భుతాలు చేస్తోందన్నారు. మన దేశంలో అన్ని రకాల నేలలు, వాతావరణం ఉన్నాయని తెలిపారు. రసాయన ఎరువుల వాడకంతో భూమి నిస్సారంగా మారిందన్నారు. ఐటీఐ, పాల్టెక్నిక్ కన్నా వ్యవసాయ విద్యలో మంచి భవిష్యత్తు ఉందన్నారు. విజ్ఞానజ్యోతి విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో రాణించాలని అన్నారు. జిల్లాలో వ్యవసాయ అభివృద్ధి : డీఏఓ పరశురాంనాయక్ జిల్లాతోపాటు రాష్ట్రంలో వ్యవసాయానికి మంచి రోజులు ఉన్నాయని, విద్యార్థులు ప్రభుత్వం ఉద్యోగం కంటే వ్యవసాయంలో మంచిగా రాణించాలని డీఏఓ పరశురాంనాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ విజ్ఞానజ్యోతి విద్యార్థులు అన్ని రంగాలలో ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. ఇక్కడ చదివిన కౌడిపల్లి ఏఈఓ రాజశేఖర్‌గౌడ్ జిల్లాస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నారని గుర్తుచేశారు. అనంతరం విద్యార్థులు సాగు చేసిన పంటలకు వచ్చిన లాభాలను ఒక్కో విద్యార్థికి రూ. 635 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞానజ్యోతి ప్రతినిధులు డీఎన్‌రావు, రాజశేఖర్, అచ్యుతరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ల తీరుపై సీఈవో ద్వివేది ఆగ్రహం
-
లంచాలకు కళ్లెం
సాక్షి, హైదరాబాద్: అవినీతికి ఆస్కారం లేకుండా.. ప్రజలకు మరింత బాగా సేవలందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టం, మున్సిపల్ చట్టాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాలను ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలన్నారు. కలెక్టర్/జిల్లా పరిపాలనాధికారి(ఐఏఎస్) నాయకత్వంలో అడిషనల్ కలెక్టర్/అడిషనల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వంటి అధికారుల బృందంతో జిల్లా స్థాయిలో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. లే అవుట్లకు అనుమతులు, ఆస్తుల అంచనాలు (అసెస్మెంట్స్) తదితర పనులన్నీ ఈ బృందం ఆధ్వర్యంలోనే జరగాలన్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాల రూపకల్పనపై కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చట్టం కఠినంగా ఉండాల్సిందే.. ‘ప్రజలకు మంచి సేవలు అందించడం కన్నా ప్రజా ప్రతి నిధులకు, అధికారులకు గొప్ప బాధ్యతలేవీ లేవు. ఎవరికీ ఎక్కడా ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా ప్రజలకు పనులు జరగాలి. రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి పనులు జరగాలి. దీనికోసం కఠినమైన కొత్త చట్టాలను తేవాలి. రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. వాటిని పనిచేసే పాలనా విభాగాలుగా మార్చాలి. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు కూడా తమ విధుల విషయంలో స్పష్టత ఇవ్వాలి. కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను, కొత్త మున్సిపాలిటీలను, కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకుని పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఆయా కార్యాలయాల్లో అవినీతి లేకపోతేనే.. ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుంది. నాకు ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొర పెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి? ప్రజలు ఎందుకు లంచాలివ్వాలి? లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలి. ఇందుకోసం పటిష్టమైన చట్టాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేయాలి. భూమిశిస్తులు, నీటి రకాలు వసూలు చేసినప్పుడు కలెక్టర్ అనే పదం పుట్టింది. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఇంకా కలెక్టర్ అనే పిలవాలా? లేక జిల్లా పరిపాలనాధికారి అని పిలవాలా? అని ఆలోచించాలి. కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ఐదారుగురు ముఖ్యమైన అధికారుల బందాన్ని ఏర్పాటు చేయాలి. వారికి కొన్ని నిర్థిష్ట శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ముఖ్యమైన పనులన్నీ ఐఏఎస్ అధికారి నాయకత్వంలోని అధికారుల బందం పర్యవేక్షించాలి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సేవలు అందించడం, అవినీతికి, అలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం ఈ అధికారి బాధ్యత. కలెక్టర్/పరిపాలనాధికారి, అడిషనల్ కలెక్టర్/అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విధులు, బాధ్యతలను నిర్ధిష్టంగా పేర్కొనాలి. లేఔట్ల అనుమతులు, ఆస్తుల అంచనాలు (ప్రాపర్టీ అసెస్మెంట్స్) తదితర పనులు ఐఏఎస్ అధికారి నాయకత్వంలోని బృందం చేయాల్సి ఉంటుంది’అని కేసీఆర్ సూచించారు. మౌలిక వసతులపై ఎక్కువ దృష్టి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దష్టి పెట్టాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో విధిగా వైకుంఠధామం (శ్మశానం) నిర్మించాలి. నర్సరీ ఏర్పాటు చేయాలి. అనుమతులు, సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలి. ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలి. ఇవన్నీ అంశాలు కొత్తగా రూపొందించే చట్టంలో పొందుపరచాలి. తెలంగాణలో పట్టణ జనాభా బాగా పెరుగుతోంది. పట్టణాల్లో ఏర్పడే అవసరాలను తీర్చే విధంగా తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. హైదరాబాద్ నగరానికి సంబంధించి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఇతర పట్టణాలు, నగరాలను ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణమైన విధాన రూపకల్పన జరగాలి’అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వి.శ్రీనివాస్‌గౌడ్, లోక్‌సభ సభ్యులు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు కేటీఆర్, బాల్క సుమన్, వివేకానంద గౌడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్.నర్సింగ్‌రావు, సునీల్ శర్మ, అరవింద్ కుమార్, నీతూప్రసాద్, స్మితాసభర్వాల్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావు పాల్గొన్నారు. అడిషనల్ సీఎస్‌లను నియమించాలి : కేసీఆర్ జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారి నాయకత్వంలో అధికార యంత్రాంగం ఏర్పడినట్లే, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పడాలి. సీఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ సీఎస్‌లను నియమించాలి. వారికి శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారి నాయకత్వంలో పనిచేసే బృందం పనితీరును సీఎస్ నాయకత్వంలోని బృందం పర్యవేక్షించాలి. ఈ బృందం ఎప్పటికప్పుడు అవసరమైన నిర్ణయాలను తీసుకోవాలి. -
అవినీతి పెరిగిపోయిందంటూ కేసీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : అవినీతికి ఆస్కారం లేని విధంగా, ప్రజలకు మరింత బాగా సేవలు అందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాలను ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలని సూచించారు. కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి పేరుతో పిలవబడే ఐఏఎస్ అధికారి నాయకత్వంలోని అడిషనల్ కలెక్టర్ లేదా అడిషనల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని పిలవబడే ముఖ్య అధికారుల బృందంతో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. లే అవుట్లకు అనుమతులు, ఆస్తుల అంచనాలు(అసెస్మెంట్స్) తదితర పనులన్నీ ఈ అధికారిక బృందం ఆధ్వర్యంలోనే జరగాలని వివరించారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలన్నారు. కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాల రూపకల్పనపై శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రజలకు మంచి సేవలు అందించడం కన్నా గొప్ప బాధ్యతలేవీ లేవు. ప్రజలకు ఎవరికీ ఎక్కడా ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా పని జరగాలి. రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కావల్సిన పనులు జరగాలి. దీనికోసం కఠినమైన కొత్త చట్టాలు తేవాలి. రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. వాటిని పనిచేసే పాలనా విభాగాలుగా మార్చాలి. జిల్లా పరిషత్‌లకు, మండల పరిషత్‌లకు కూడా తమ విధుల విషయంలో స్పష్టత ఇవ్వాలి. కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను, కొత్త మున్సిపాలిటీలను, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకుని పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఆయా కార్యాలయాల్లో అవినీతి లేకుండా ప్రజలకు పని కావడంతోనే ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘నాకు ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి? ప్రజలు ఎందుకు లంచాలివ్వాలి? లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలి. ఇందుకోసం పటిష్టమైన చట్టాలు రూపొందించి, పకడ్బందీగా అమలు చేయాలి. రెవెన్యూలో, రిజిస్ట్రేషన్లలో, మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో ఒక్క పైసా ఇవ్వకుండా పనులు జరిగే పరిస్థితులు రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉంది’ అని ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. ‘జిల్లా ముఖ్య పరిపాలనాధికారి సారథ్యంలో సీనియర్ అధికారుల నాయకత్వంలో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థ ఉండాలి. భూమిశిస్తులు, నీటి రకాలు వసూలు చేసినప్పుడు కలెక్టర్ అనే పదం పుట్టింది. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఇంకా కలెక్టర్ అనే పిలవాలా? లేక జిల్లా పరిపాలనాధికారి అనే పేరు పెట్టాలా? అని ఆలోచించాలి. కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ఐదారుగురు ముఖ్యమైన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలి. వారికి కొన్ని నిర్థిష్ట శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ముఖ్యమైన పనులన్నీ ఐఎఎస్ అధికారి నాయకత్వంలోని అధికారుల బృందం పర్యవేక్షించాలి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సేవలు అందించడం, అవినీతికి, అలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం ఈ అధికారి బాధ్యత. కలెక్టర్/పరిపాలనాధికారి, అడిషనల్ కలెక్టర్/అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విధులు, బాధ్యతలను నిర్ధిష్టంగా పేర్కొనాలి. లే అవుట్ల అనుమతులు, ఆస్తుల అంచనాలు (ప్రాపర్టీ అసెస్మెంట్స్) తదితర పనులు ఐఎఎస్ అధికారి నాయకత్వంలోని బృందం చేయాల్సి ఉంటుంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లాగా తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ను నెలకొల్పి రాష్ట్రంలోని స్థితిగతులకు అనుగుణంగా పాలన సజావుగా సాగే ప్రక్రియను ప్రవేశ పెట్టే అవకాశాలు పరిశీలించాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లా స్థాయిలో ఐఎఎస్ అధికారి నాయకత్వంలో అధికార యంత్రాంగం ఏర్పడినట్లే, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పడాలి. సిఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ సిఎస్ లను నియమించాలి. వారికి శాఖలు అప్పగించాలి. జిల్లా స్థాయిలో ఐఎఎస్ అధికారి నాయకత్వంలో పనిచేసే బృందం పనితీరును సిఎస్ నాయకత్వంలోని బృందం పర్యవేక్షించాలి. ఎప్పటికప్పుడు కావాల్సిన నిర్ణయాలను ఈ బృందం తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు పారిశుద్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో విధిగా వైకుంఠధామం నిర్మించాలి. నర్సరీ ఏర్పాటు చేయాలి. అనుమతులు, సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలి. ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలి. ఇవన్ని అంశాలు కొత్తగా రూపొందించే చట్టంలో పొందుపరచాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘తెలంగాణలో పట్టణ జనాభా బాగా పెరుగుతున్నది. పట్టణాల్లో ఏర్పడే అవసరాలను తీర్చే విధంగా తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. హైదరాబాద్ నగరానికి సంబంధించిన జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏలకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఇతర పట్టణాలు, నగరాలను ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణమైన విధాన రూపకల్పన జరగాలి’ అని సిఎం చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కెటి రామారావు, బాల్క సుమన్, వివేకానంద గౌడ్, ఎంపిలు బిబి పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ ఎస్.కె.జోషి, సీనియర్ ఐఎఎస్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, సునిల్ శర్మ, అరవింద్ కుమార్, నీతూ ప్రసాద్, స్మితాసభర్వాల్, న్యాయ కార్యదర్శి నిరంజన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 10, 11న సెలవు
సాక్షి, పశ్చిమ గోదావరి : ఓటర్లు స్వేచ్చాయుత వాతావరణంలో తమకు నచ్చిన నేతను ఎన్నుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 3417 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. 530 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో మొత్తం 32,18,106 ఓటర్లుండగా వారిలో పురుషులు15,81,496.. స్త్రీలు 16,36,610 ఉన్నారన్నారు. జిల్లాలో అత్యధికంగా చింతలపూడి నియోజకవర్గంలో 2,63,337 మంది ఓటర్లుండగా.. భీమవరం 2,46,342 ఓటర్లతో రెండో స్థానంలో ఉందని తెలిపారు. అత్యల్పంగా నరసాపురం నియోజకవర్గంలో 1,68,122 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారన్నారు. పోలింగ్ కోసం 25 వేల మంది సిబ్బందితో పాటు.. ఎన్నికల నిర్వహణకు 3441 ప్రిసైడింగ్ అధికారులను కూడా నియమించామని తెలిపారు. ‘మై ఓట్ క్యూ’ మొబైల్ యాప్ వాడకం ద్వారా పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు కోసం 2900 మంది సివిల్ పోలీసులతో పాటు 12 కంపెనీల పారామిలటరీ బలగాలను, 4 కంపెనీల ఏపీఎస్పీ బలగాలను, 29 కంపెనీల గ్రే హౌండ్స్ బలగాలను వినియోగిస్తున్నామని తెలిపారు. 2651 పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ద్వారా లైవ్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 10, 11 తేదిలలో సెలవు ప్రకటించారని తెలిపారు. డీఎస్పీల నేతృత్వంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకి స్పెషల్ స్టైకింగ్ బృందాలను నియమించామని తెలిపారు. -
ఈ మూడు రోజులు కీలకం
సాక్షి, అనంతపురం అర్బన్: ‘సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం పోలింగ్ ఈనెల 11న జరగనుంది. ఈ మూడు రోజులు అత్యంత కీలకం. ఎన్నికల విధుల్లో పొరపాట్లకు, విమర్శలకు చోటివ్వకండి. ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘన జరగకూడదు. ఓటరు స్లిప్‌లు బీఎల్ఓల ద్వారానే పంపిణీ జరగాలి. రాజకీయ పార్టీల ద్వారా జరిగితే కఠిన చర్యలు ఉంటాయి.’’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.వీరపాండియన్ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదివారం స్థానిక ఎస్ఎస్బీఎన్న్ డిగ్రీ కళాశాలలో జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్‌తో కలిసి ఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మూడు రోజులు చాలా కీలకం, ఎక్కడా పోరపాటు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశించారు. బీఎల్ఓలతో అండర్ టేకింగ్ తీసుకోండి ఓటరు స్లిప్పులు రాజకీయపార్టీల ద్వారా పంపిణీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటరు స్లిప్పులు అనధికార వ్యక్తులకు స్వాధీనం చేయలేదని బీఎల్ఓలతో అండర్ టేకింగ్ తీసుకోవాలని ఆర్ఓలను కలెక్టర్ ఆదేశించారు. ఓటర్ల జాబితా మార్కింగ్ సోమవారం నాటికి పూర్తి చేయాలన్నారు. పొరపాట్లు జరగకూడదు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దివ్యాంగ ఓటర్ల కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేసుకోవాలని, వాలంటీర్లను నియమించుకోవాలన్నారు. అంధ ఓటర్ల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ బ్యాలెట్ పత్రం ఏరా>్పటు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలన్నారు. చురుకుగా పనిచేయాలి ఈ మూడు రోజులూ ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఎంసీసీ, వీఎస్టీ బృందాలు చురుకుగా పనిచేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా పర్యటించి తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకోసం అదనంగా రెవెన్యూ సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. సివిజిల్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు నియమించిన ఉద్యోగులకు మినహాయింపులు ఇవ్వరాదని ఆదేశించారు. పోలింగ్‌కు అవసరమైన సామగ్రి సక్రమంగా ఉన్నాయా లేదాని తనిఖీ చేసుకోవాలన్నారు. శిక్షణ నిర్వహించండి పోలింగ్ నిర్వహణపై నియోజకవర్గాలకు చెందిన పీఓలు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాలను సోమవారం నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు సంబంధిత ఆర్ఓలకు సూచించారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన విధులు, నివేదికలు గురించి ఆర్ఓలకు క్షుణ్ణంగా వివరించారు. సమావేశంలో జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆరో ఎం.వి.సుబ్బారెడ్డి, అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు పాల్గొన్నారు. -
ఓటు హక్కు.. వంద నోటు కాదు
సాక్షి, ములుగు: ఓటు హక్కు అంటే వంద రూపాయాల నోటు, లిక్కర్ బాటిల్ కాదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. డీఆర్డీఏ తరఫున మండలంలోని జాకారం సాంఘిక సంక్షేమ శాఖ గురుకులం విద్యార్థులతో ఆదివారం ఏర్పాటు చేసిన ఓటు హక్కు వినియోగ అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా సరైన నాయకుడిని ఎంచుకునే అవాకాశం ఉంటుందని అన్నారు. కొంతమంది ఓటు వేసే రోజును ప్రభుత్వ సెలవుదినంగా అనుకుంటున్నారని, ఆ ఆలోచనను మరిచి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు వినియోగంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. ప్రలోభాల విషయంలో పౌరులు నేరుగా 1950 టోల్ ప్రీ నంబర్‌కి కానీ, ప్రత్యక్ష సమాచారాన్ని అందించడానికి నేరుగా సీ విజిల్ యాప్ ద్వారా కాని ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. సీ విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను జిల్లా యంత్రాంగం తరఫున గంటన్నర సమయంలో పరిష్కరిస్తామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటును వినియోగించే విధంగా తగిన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చేపట్టిన ఆటపాటలు అలరించాయి. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సంజీవరావు, డీపీఎం సతీష్, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్, డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య, సీఐ సార్ల రాజు, తహసీల్దార్ భూక్యా గన్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ
సాక్షి, పాలకొండ : జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ పూర్తి చేసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన పాలకొండ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొత్తగా ఓటు నమోదు కోసం 84వేల దరఖాస్తులు అందాయని, అందులో ఇంకా 24వేల దరఖాస్తులు పరిశీలించి ఓటరు కార్డులు జారీ చేయాల్సి ఉందని తెలిపారు. వీరందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇంతవరకూ జిల్లాలో 2,674 ఓట్లు తొలగించామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి పీవో, ఏపీవోలను నియమించామని వారికి 16వ తేదీన నియోజకవర్గాల్లో శిక్షణ అందిస్తామని వివరించారు. వచ్చేనెల 3వ తేదీన మరో మారు శిక్షణ అందించాల్సి ఉందని తెలిపారు. ప్రతి మండలానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. వారితో పాటు 50మందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి నిఘా పెంచామని వివరించారు. ఉధ్యోగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 470 పోలింగ్ కేంద్రాలకు ర్యాంపులు ఏర్పాటు చేశామని, 62 కేంద్రాలకు మరుగుదొడ్లు, 71 కేంద్రాల్లో తాగునీటి బోర్లు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. మద్యం, ధనం, ఎన్నికల నియమావళి అమలుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం ఆయన డీఎస్పీ ప్రేమ్‌కాజల్‌తో మాట్లాడి బందోబస్తు ఏర్పాట్లపై సూచనలు అందజేశారు. ఈవీఎంలను భద్రపరచనున్న డిగ్రీ కళాశాలను సందర్శించి పరిశీలించారు. పర్యటనలో కలెక్టర్‌తో పాటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎల్.రఘుబాబు, తహసీల్దార్ నరసింహ, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. -
ఎన్నికల వ్యయ నిర్వహణ సెల్ ప్రారంభం
సంగారెడ్డి జోన్: పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లా కలెక్టరేట్లోని డీసీఓ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఎన్నికల వ్యయ నిర్వహణ సెల్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోకవర్గం నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులు తమ రోజువారి జమ, ఖర్చులు ఈ సెల్లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు రోజువారి ఖర్చులకు సంబంధించిన అకౌంట్స్ రిజిష్టర్‌లో రికార్డు చేయాలని స్పష్టం చేశారు. సీజర్స్ అమౌంట్, వస్తువులకు సంబంధించి ఆయా టీంలు ఎక్స్పెండిచర్ నోడల్ అధికారికి రిపోర్ట్ అందించాలని సూచించారు. సీజర్స్ మొత్తాలను రుజువులు తీసుకొని నోడల్ అధికారి రిలీజ్ చేస్తారని పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా వ్యయనిర్వహణ నోడల్ అధికారిగా తుమ్మ ప్రసాద్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అధికారి అంజయ్య ఉన్నారని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్లకు 7 మంది ఏఈఓలు తమ నివేదికలను నోడల్ అధికారికి సమర్పిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ ప్రసాద్, పార్లమెంట్ నియోజకవర్గ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అధికారి అంజయ్య, ఏఈఓ చిన్న తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల కోడ్ అమలుపై దృష్టి సారించాలి
సాక్షి, కంకిపాడు: ఎన్నికల కోడ్ అమలుపై దృష్టి పెట్టాలని విజయవాడ సబ్‌కలెక్టరు, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మిషా సింగ్ ఆదేశించారు. మంగళవారం ఆమె కంకిపాడులో పర్యటించారు. గోసాల సెంటరులో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న వాహనాల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం బస్టాండు సెంటరులో ప్రచారంలో ఉన్న వాహనాన్ని సిబ్బందితో తనిఖీ చేయించి అనుమతులు తీసుకున్నారో? లేరో? పరిశీలించారు. అనుమతులు లేని ఓ ప్రచార వాహనాన్ని మండల పరి షత్ కార్యాలయానికి తరలించారు. తహసీల్దార్ మమ్మీ, స్క్వాడ్ ప్రతినిధి లక్పతి, ఇతర సిబ్బందితో సబ్‌కలెక్టరు మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. నిబంధనలు పాటించకుండా ప్రచారం సాగిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోగోలు తొలగించండి ఈడుపుగల్లు(కంకిపాడు):విద్యాశాఖ ద్వారా పంపిణీ చేయనున్న సైకిళ్లపై ప్రభుత్వ లోగోలను తొలగించాలని విజయవాడ సబ్ కలెక్టరు మిషాసింగ్ ఆదేశించారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సీఎం, మంత్రి ఉన్న ఫోటోలతో ఉన్న లోగోను సైకిళ్లపై అమర్చి విద్యార్థినులకు పంపిణీకి సన్నాహాలు చేయడంతో అధికా రులు నిలుపుదలచేయించిన విషయం తెలిసిందే. దీంతో ఈడుపుగల్లు జెడ్పీహైస్కూల్లో అందుబాటులో ఉంచిన సైకిళ్లను మంగళవారం ఆమె పరిశీలించారు. విద్యాశాఖ ద్వారా పంపిణీ జరుగుతున్నందున ప్రభుత్వ లోగోలు తొల గించాలన్నారు. జిల్లా విద్యాశాఖ నుంచి పంపిణీ తేదీ తీసుకుని లబ్ధిదారులకు సైకిళ్లు అందించాలని, లోగోలను పోలీ సుస్టేషన్‌లో అప్పగించాలని అధికారులను ఆదేశించారు. -
పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు