
గద్వాల రూరల్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం కృష్ణా నది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ శశాంక ఆదివారం పరిశీలించారు.
గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో జాతీయ రహదారి నుంచి బైక్‌పై ప్రయాణించి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని కేంద్రం వద్ద తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, దివ్యాంగుల కోసం ర్యాంపు ఏర్పాటు చేయించాలని తహసీల్దార్ జ్యోతిని ఆదేశించారు. తిరుగు ప్రయాణంలో ఆయన గుర్రంగడ్డ నుంచి పుట్టీలో బీరెల్లి మీదుగా ప్రయాణించి తర్వాత గద్వాలకు చేరుకున్నారు.