సమావేశంలో జేసీ దయానంద్, డీసీపీ వెంకట్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సాక్షి, హన్మకొండ అర్బన్: ఈ నెల ఐదో తేదీన సాయంత్రం 5గంటల నుంచి 144 సెక్షన్ విధించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో స్థానికేతర వ్యక్తులను గుర్తించి బయటకు పంపించనున్నట్లు తెలిపారు. 5న సాయంత్రం 5గంటల తర్వాత కల్యాణ మండపాలు, లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు సురేంద్రసింగ్, టి.ఆనంద్, పోలీస్ కమిషనర్ డాక్టర్ టి.రవీందర్‌లతో కలిసి నిఘా కమిటీలు, పోలిస్ అధికారులతో సోమవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నందున నిఘాను పెంచాలన్నారు. 7న పోలింగ్ సందర్బంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలను తీసుకోనున్నట్లు తెలిపారు. బ్రాడ్‌బాండ్ 133 పోలింగ్ కేంద్రాలు, సీసీ కెమెరాల ద్వారా 250 కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 307 పోలింగ్ కేంద్రాల్లో ఆఫ్‌లైన్ ద్వారా వెబ్ కాస్టింగ్ చేయించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment