మంగళ హారతులతో రేవూరి ప్రకాష్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న మహిళలు
సాక్షి, హన్మకొండ: నేను పక్కా లోకల్...45 ఏళ్ల నుంచి హన్మకొండలోనే ఉంటున్నా...నగరం నడిబొడ్డున భవానినగర్‌లో నా ఇళ్లు... కుటుంబంతో సహా ఈ ఇంటిలో ఉంటున్నా...బాల్యంలో చదువుకున్నది కూడా ఇక్కడే...తాను స్థానికేతరుడిని ఎలా అవుతానని ప్రజా కూటమి అభ్యర్థి రైవూరి ప్రకాష్‌రెడ్డి విమర్శకులకు సవాల్ విసిరారు. శుక్రవారం హన్మకొండలోని వడ్డెపల్లి, ముదిరాజ్ వాడ, ఎస్సీ వాడ, బాలయ్య హోటల్, ఎన్జీవోస్ కాలనీ, ఇందిరానగర్‌లో పాదయాత్ర నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి తనకు ఓట వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, నుదిటిపై తిలకం దిద్దారు.
ఈ ప్రచారంలో రేవూరి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తిని నేనేనని... తెలంగాణ ద్రోహిని ఎలా అవుతానని ప్రశ్నిం చారు. చిదంబరంతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను గట్టిగా వినిపించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయాన్ని కేసీఆర్‌ను అడిగి తెసుకోవాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి వినయ్‌భాస్కర్‌కు సూచించారు. కారుకు ఓటేస్తే ప్రజల బతుకులు బుగ్గిపాలు అవుతాయన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడతూ మచ్చలేని వ్యక్తి రేవూరి ప్రకాష్‌రెడ్డి అని, కబ్జాలకై లాలూచీ పడే వ్యక్తి కాదని, నిస్వార్థ సేవకుడని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి మహ్మద్ రియాజ్, ప్రజా కూటమి నాయకులు బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డి, బంక సరళ, నాగరాజు, తాళ్లపల్లి జయపాల్, పల్లె రాజిరెడ్డి, రవీందర్, దొంగరి సతీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment