సాక్షి, హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గత మూడు అసెంబ్లీ ఎన్నికలతో పరిశీలిస్తే పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్య ప్రతి ఎన్నికకు పెరుగుతోంది. 2009లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజక వర్గాల్లో 136 మంది అభ్యర్థులు పోటీచేయగా, 2014లో 156 మంది పోటీచేశారు. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగి 172 మందికు చేరింది. ఈ సారి 12 నియోజకవర్గాల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో తక్కువగా ఎనిమిది మంది మాత్రమే పోటీలో ఉన్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నుంచి అత్యధికంగా 21 మంది చొప్పున పోటీలో ఉన్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో శాసనసభకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఓసారి పరిశీలిద్దాం...
Comments
Please login to add a commentAdd a comment