Hanmakonda District
-
అయ్యో పాపం అనుకుంటే.. పోలీసులకే షాకిచ్చాడు!
హన్మకొండ, సాక్షి: చనిపోయాడనుకున్న వ్యక్తి ఒక్కసారిగా లేచి మాట్లాడితే.. ఆ షాక్ ఎలా ఉంటుందో ఉహించుకోండి. అలాంటి ఘటనే వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. కుంటలో ఓ మృతదేహం తేలియాడుతున్నదన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఆ వ్యక్తిని బయటికి లాగుతుండగా సదరు వ్యక్తి లేచి మాట్లాడడం చూసి షాక్‌కు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా కావలికి చెందిన శ్రీనివాస్ కాజీపేటలోని ఓ గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు సోమవారం చిత్తుగా మద్యం సేవించి నగరంలోని రెడ్డిపురంలోని కోవెలెకుంటకు వెళ్లారు. అక్కడ కొంతసేపు కుంటలోకి దిగారు. మద్యం మత్తులో శ్రీనివాస్ కొంత ఒడ్డు మేరలో నిద్ర పోయాడు. శ్రీనివాస్ మృతి చెందినట్లుగా భావించిన వారు అక్కడినుంచి జారుకున్నారు. ఆ తర్వాత స్థానికులు ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలియాడుతున్నట్లు గమనించి 108 అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అంబులెన్స్‌తోపాటు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుంట లోతుగా ఉన్నట్లు భావించిన పోలీసులు ఒకరిచేయి మరొకరు పట్టుకుని తేలియాడుతున్న ఆ వ్యక్తిని బయటికి లాగేందుకుప్రయత్నిస్తున్న క్రమంలో అతనే నేరుగా లేచి నిల్చున్నారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. బయటికి తీసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుంటలో చల్లదనానికి నిద్ర వచ్చనట్లు సదరు వ్యక్తి పోలీసులకు చెప్పాడు. తనకు రూ.50 ఇస్తే కాజీపేటకు వెళ్తానని చెప్పడంతో పోలీసులు అతనికి డబ్బులు ఇచ్చి పంపించి వేశారు. తాగి నీటిలో పడుకున్న వ్యక్తి.. చనిపోయాడనుకొని పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు.. తీరా వచ్చి చూస్తే షాక్ హనుమకొండ - రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు.. అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు మరియు 108 సిబ్బందికి సమాచారం… pic.twitter.com/zzR7SGbFwP— Telugu Scribe (@TeluguScribe) June 10, 2024 VIDEO CREDITS: Telugu Scribe -
సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
సాక్షి, హసన్‌పర్తి: తెలంగాణలో పోలీసుల వేధింపులే కారణమంటూ సూసైడ్ లేఖ రాసి పెట్టి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సూసైడ్ లేఖ రాసి పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ సందర్భంగా ప్రశాంత్ సూసైడ్ లేఖలో.. తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమని తెలిపాడు. సీఐ తన సెల్‌ఫోన్, వాచీ లాక్కుకొని తనను తీవ్రంగా కొట్టారని ప్రశాంత్ ఆరోపించారు. పోలీసులు సమస్యను పరిష్కరించకపోగా తీవ్రంగా కొట్టడంతో దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. అలాగే, తన దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వమంటే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ.. సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన వ్యక్తిహన్మకొండ - పోలీసుల దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి, తన చావుకు హసన్ పర్తి సీఐ, ఎస్ఐ కారణమని అదృశ్యమైన వ్యక్తి.తన దగ్గర అప్పు తీసుకున్నవారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే.. వారు తనను కొట్టారని ఆరోపణ. తన… pic.twitter.com/WFHGs1Qkea— Telugu Scribe (@TeluguScribe) May 1, 2024 Video Credit: Telugu Scribeఈ నేపథ్యంలో తన భర్తను కాపాడాలని హసన్‌పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య శ్యామల హన్మకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసుల కారణంగా అవమాన భారంతో తన భర్త ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని ఆమె తెలిపారు. ఇక, ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
హన్మకొండ జిల్లా హసన్‌పర్తి SR యూనివర్సిటీలో సూసైడ్ కలకలం
-
పట్టపగలే.. భార్య కళ్ల ఎదుటే.. కత్తితో..
వరంగల్: వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో బుధవారం ఉదయం ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి భార్య కళ్లేదుటే వృద్ధుడిని కత్తితో గొంతు కోసి పరారయ్యారు. భూ వివాదమే హత్యకు కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన నాముతాబాజీ రాధాబాయ్, రాంచందర్(65) దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాంచందర్ ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహించి రిటైరయ్యారు. పదేళ్ల క్రితమే ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు. పిల్లలకు పెళ్లిళ్లై వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. ప్రస్తుతం రాధాబాయ్, రాంచందర్ మాత్రమే ఎస్ఆర్ ఆర్తోటలోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాంచందర్‌కు పరకాల నియోజవర్గం పత్తిపాక శాయంపేట గ్రామంలో 1.20గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి విషయమై స్థానికుడి నడమ వివాదం కొనసాగుతోంది. ఈ విషయంపై శాయంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుమారు 11.20 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తులు ఎస్ఆర్తోటలో రాంచందర్ పేరు పెట్టి పిలుస్తూ ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరో వచ్చారు అని భార్య రాధాబాయ్ చెప్పగానే బెడ్రూం నుంచి హాల్లోకి ప్రవేశించిన రాంచందర్‌ను దుండగులు కింద పడేసి వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి పరారయ్యారు. ఆ దృశ్యం చూసిన భార్య షాక్‌కు గురైంది. రక్షించండి అంటూ రాంచందర్ ఇంట్లోనుంచి రోడ్డుపైకి చేరి రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలిసిన వెంటనే మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ సురేష్.. ఎస్సై శ్రీలత, సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. మృతుడి బంధువులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి పెద్ద కుమారుడు నాము తాబాజీ ప్రదీప్ చందర్ మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ టి.సురేష్ తెలిపారు. భూ వివాదమే హత్యకు కారణమా..? వృద్ధుడి హత్య అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా..? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా..? పత్తిపాక శాయంపేటలోని 1.20 గంటల భూ వివాదమే హత్యకు కారణమా..? భూ వివాదంపై పట్టు వీడడం లేదనే కక్షతో గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసి ఉంటారా..? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. పత్తిపాక శాయంపేటకు చెందిన ఓ వ్యక్తికి రాంచందర్ నడమ భూవివాదం ఉందని, మృతుడి కుమారుడు ప్రదీప్ చందర్ చెప్పడంతో సదరు వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. హత్య చేసి పరారైన వ్యక్తులు ముందుగా ఎక్కడినుంచి ఇంటికి చేరుకున్నారు..? ఆ తరువాత ఏ దారిలో వెళ్లి ఉంటారు..? అనే దానిపై సీసీ పుటేజీలను సైతం పరిశీలించినట్లు తెలిసింది. -
TS Election 2023: తొమ్మిది మంది 'సిట్టింగ్'లకు మళ్లీ చాన్స్!
వరంగల్: బీఆర్ఎస్లో టికెట్ల ఉత్కంఠకు తెరపడింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేయడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఊహాగానాలకు తెరదించేలా ముఖ్యమంత్రి మరోసారి ‘సిట్టింగ్’లకే పెద్దపీట వేశారు. ఉమ్మడి వరంగల్‌లో 12 స్థానాలకు 11 స్థానాలకు సోమవారం అభ్యర్థులను ప్రకటించిన గులాబీ నేత.. జనగామ అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో పెట్టారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ములుగు నియోజకవర్గం నుంచి జెడ్పీ ఇన్చార్జ్ చైర్పర్సన్ బడే నాగజ్యోతిని బరిలోకి దింపుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘సిట్టింగ్’లను మార్చుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని పటాపంచలు చేసేలా కేసీఆర్ కేవలం ఒకే ఒక ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఆశావహుల ఆశలన్నీ ఆవిరి కాగా.. తొమ్మిది మంది సిట్టింగ్‌లకు మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కింది. మహబూబాబాద్, డోర్నకల్, భూపాలపల్లి, వరంగల్ తూర్పు నుంచి టికెట్ వస్తుందని భావించిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు మాలోతు కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య ప్రస్తావన లేకుండా పోయింది. మొదటిసారి నాగజ్యోతి.. ఎనిమిదోసారి రెడ్యానాయక్.. తాజాగా ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ప్రత్యేకతలు ఉన్నాయి. ములుగు నుంచి అభ్యర్థిగా ఎంపికై న బడే నాగజ్యోతి మొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తుండగా.. మాజీ మంత్రి, డోర్నకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ధరమ్సోతు రెడ్యానాయక్ ఎనిమిదోసారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్.. ఒక్కసారి మాత్రమే సత్యవతి రాథోడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇటీవల ఆయనపై కొంత వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయనకు బదులు కుటుంబంలో ఒకరికి లేదా మంత్రి సత్యవతికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ రెడ్యానాయక్ ఇది నాకు చివరి ఎన్నిక.. భవిష్యత్‌లో పోటీ చేయనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం దక్కింది. ఓటమెరుగని నేతగా సుధీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒకసారి ఎంపీ, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు సార్లు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికై , మరో మూడుసార్లు (2009, 2014, 2018లలో) పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దయాకర్‌రావు ఏడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఐదోసారి తలపడనున్నారు. 2014, 2018లలో వర్ధన్నపేట నుంచి గెలుపొందిన అరూరి రమేష్ హ్యాట్రిక్ దిశగా మూడోసారి బరిలో నిలవనున్నారు. అదే విధంగా పరకాల నుంచి ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి సైతం ఇదే రేసులో ఉన్నారు. మహబూబాబాద్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బానోతు శంకర్‌నాయక్ హ్యాట్రిక్ ఆశల్లో ఉన్నారు. ఉద్యమనేతగా ఎదిగిన పెద్ది సుదర్శన్‌రెడ్డి నర్సంపేట నుంచి రెండుసార్లు పోటీ చేసినప్పటికీ 2018లో గెలుపొందారు. మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొంది బీఆర్ఎస్లో చేరిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తుపై తొలిసారి పోటీ చేయనున్నారు. వరంగల్ తూర్పు నుంచి రెండోసారి నన్నపునేని నరేందర్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. -
లారీ బీభత్సం..! ఆటోను 30 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో..
వరంగల్: వలస జీవులను లారీ మింగేసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆరుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయా కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు చెందిన సుమారు పది కుటుంబాలు తేనే సేకరణ కోసం వరంగల్ జిల్లా కేంద్రానికి వచ్చి ఓసిటీ మైదానంలో డేరాలు వేసుకుని నివాసం ఉంటున్నాయి. నెల రోజుల క్రితం వచ్చిన ఈ వలసజీవులు నిత్యం ఉదయమే ఇక్కడ నుంచి ఆటోల్లో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లి తేనె సేకరించి తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. రోజుమాదిరిగానే బుధవారం ఉదయం రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఒక ఆటోలో వర్ధన్నపేట, తొర్రూరు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద లారీ రాంగ్రూట్లో వచ్చి ఆటోను ఢీకొంది. అలాగే కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తుల్లో ఒకే కుటుంబానికి చెందిన కురేరి సురేష్ (43), అతడి కుమారులు అమిత్ కురేరి (23), నితీష్ కుమార్ కురేరి (11), సురేష్ సోదరి కుమారులు (మేనల్లుళ్లు) రూప్‌చంద్ దామి(33), జలావత్ దామి అలియాస్ జాబీర్ (19)తోపాటు ఆటోడ్రైవర్ నగరంలోని కరీమాబాద్ ఏసీరెడ్డి నగర్‌కు చెందిన బట్టు శ్రీనివాస్ (42)మృతి చెందారు. మృతుడి కురేరి సురేష్ మరో కుమారుడు అమీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు ప్రీతి, పూజ తెలిపారు. ఆకలి తీర్చిన వ్యాపారులు.. రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు మృతి చెందారని తెలుసుకున్న లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌కు చెందిన పలువురు వ్యాపారులు చలించారు. తమ కుటుంబ సభ్యులు మృతి చెందారని, అందుకే ఉదయం నుంచి ఏమి తినలేదని చెప్పడంతో భోజనం తయారు చేయించి వారి ఆకలి తీర్చినట్లు వ్యాపారులు బిట్ల కృష్ణ, పాపాని భాస్కర్, బూర ప్రకాశ్ తెలిపారు. అమ్మా వస్తున్నా.. అంతలోనే దుర్మరణం ఖిలా వరంగల్: అమ్మా వస్తున్నా...కలిసి భోజనం చేద్దాం అంటివి.. అంతలోనే మాయమైనవా.. రెండు రోజులాయే నా చేతి కూడు తినక కొడుకా...తినకుండానే వెళ్లిపోయినావా .. అంటూ ఆటోడ్రైవర్ బట్టు శ్రీనివాస్ తల్లి రాజమ్మ రోదిస్తుంటే అక్కడున్న వాళ్లంతా కంటితడి పెట్టుకున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురిలో ఆటోడ్రైవర్ బట్టు శ్రీనివాస్ కూడా ఉన్నారు. శ్రీనివాస్‌కు పదేళ్ల క్రితం వివాహం జరగగా కుమార్తె, కుమారుడు ఉన్నారు. తొమ్మిది నెలల క్రితం బతుకుదెరువు కోసం భార్య కల్పన, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులతో రెండు నెలల క్రితం భార్య కల్పన తన పిల్లలను వెంటబెట్టుకుని నర్సంపేట ద్వారక పేటలోని పుట్టింటికి వెళ్లిపోగా.. శ్రీనివాస్ మాత్రం పుప్పాలగుట్ట ఏసీరెడ్డినగర్లోని తన పెద్దన్న నివాసం ఉండే తల్లి రాజమ్మ ఇంటికి చేరుకున్నాడు. అతను ప్రస్తుతం నాగమయ్య టెంపుల్ సమీప కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని అద్దె ఆటో నడిపిస్తున్నాడు. బుధవారం ఉదమే యజమానికి ఆటో ఇచ్చేసి ఇంటికి వస్తాననుకున్నాడు. ఈ లోపు ఓసిటీలో డేరాలు ఏర్పాటు చేసుకున్న జైపూర్‌కు చెందిన వలస జీవులు అండర్ బ్రిడ్జి వద్ద బట్టు శ్రీనివాస్ ఆటో ఎక్కి తొర్రూరులో దించాలని కోరారు. దీంతో వారిని ఎక్కించుకుని బయలుదేరగా ఇల్లంద వద్ద లారీ ఢీకొంది. దీంతో శ్రీనివాస్ మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో శ్రీనివాస్ సోదరుడు బట్టు కిషన్, వదిన మాలతీ, మృతుడి తల్లి రాజమ్మ, నర్సంపేట నుంచి చేరుకున్న భార్య కల్పన, ఇద్దరు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో వరంగల్ పుప్పాలగుట్ట ఏసిరెడ్డినగర్లో విషాదం నెలకొంది. -
పోలీసులకు సవాల్‌గా ‘కత్తిపోటు’ కేసు.. అనుమానాలెన్నో..
వరంగల్: వరంగల్ నగరంలోని మిల్స్‌కాలనీ ఠాణా పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన కత్తిపోటు కేసు విచారణ పోలీసులకు సవాల్‌గా మారింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ సమయంలో వరంగల్ నగరం నడిబొడ్డున ఈనెల 5వ తేదీ రాత్రి గణేశ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వారం రోజులు కావొస్తున్నా.. పోలీసులు ఏం తేల్చలేకపోతున్నారు. ఎం.శ్రీనివాస్, అతడి బావమర్ది కె.రంజిత్‌కు బ్యాంకులో ఇప్పించిన దాదాపు రూ.కోటిన్నర రుణం కింద ఇవ్వాల్సిన కమీషన్ అడిగినందుకే తనపై దాడి చేశారని చారుగండ్ల శ్రీనివాస్ మిల్స్‌కాలనీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి జరిగిన రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. అక్కడి నుంచి రక్తపు మరకలతో ఎంజీఎం ఆస్పత్రికి వెళ్తే వైద్యులు చికిత్స అందించారు. దాదాపు కడుపుపై మూడు కుట్లు వేసి మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు. అనుమానాలెన్నో.. పోలీసులు తేల్చాల్సిందే.. ● నిందితుడు ఎం.శ్రీనివాస్ అదే రోజు రాత్రి వరకు హైదరాబాద్‌లో ఉన్నట్టుగా చెప్పడంతో అక్కడి సీసీటీవీ ఫుటేజీలను తెప్పిస్తున్నట్టుగా తెలిసింది. ● బాధితుడు సి.శ్రీనివాస్ మాత్రం తనపై దాడి చేసింది ఎం.శ్రీనివాస్, కె.రంజిత్ అని ఖరాఖండిగా పోలీసులకు చెబుతున్నాడు. దాడి జరిగిన ప్రాంతానికి కొద్ది మీటర్ల దూరంలో నిందితుడు ఎం.శ్రీనివాస్ ఇంటి వద్ద సీసీ టీవీ కెమెరాలు కూడా ఉన్నాయి. అయితే ఆ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు బాధితుడు శ్రీనివాస్ అతడి ఇంటి ముందుకు వచ్చి బండిపైనే ఉండి పిలిచినట్టుగా ఉన్న దశ్యాలు రికార్డు అయ్యాయి. ● బాధితుడు ఆరోపిస్తున్నట్టుగా తనపై దాడి చేసిన సమయంలో అటువైపుగా కారు వెళ్లడం వల్ల బండి స్లో చేశానని, ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడి చేస్తుండడంతో బండి పట్టుకొని ముందుకొచ్చానని చెప్పాడు. ●బాధితుడు చెప్పినట్లుగా ఆ సమయంలో అటువైపుగా వెళ్లిన కారు దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీకి చిక్కాలి. అటువంటిదేమీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. అంటే ఇతడిపై దాడి జరిగి పరారైన వెంటనే ఆ కారు వెనక్కి తీసుకొని వెళ్లారా? వెళ్తే మెయిన్‌రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యం చిక్కి ఉంటుంది కదా.. ఆ దిశగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ● బాధితుడే కత్తితో దాడి చేసుకొని ఇలా చేశాడన్న ప్రచారం జరిగినా.. అందులో వాస్తవం ఎంత అన్నది పోలీసులు తేల్చాలి. బాధితుడు మాత్రం తనను తాను పొడుచుకునేంత ఖర్మ పట్టలేదని, కమీషన్ ఇవ్వాలని కొన్నిరోజులుగా వారి చుట్టూ తిరుగుతున్నానని, దాని కోసం ప్రాణం తీసుకునే నాటకాలు ఆడాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు. అవసరమైతే తనను మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానే తప్ప ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. ● దీంతో అసలు ఏం జరిగిందనే దిశగా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి అసలు నిందితులెవరో తేల్చాల్సిన అవసరం కనిపిస్తోంది. అవసరమైతే ఆ దాడి చేసిన సమయంలో ఫిర్యాదుదారుడు శ్రీనివాస్‌తో పాటు ఇంకా ఎవరి మొబైల్ నంబర్లు ఆ ప్రాంతంలో పనిచేశాయి అనే దిశగా కూడా విచారించాల్సిన అవసరం ఉంది. -
విషాదం: వీధి కుక్కల కారణంగా చిన్నారి మృతి
సాక్షి, హన్మకొండ: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఎక్కువైన విషయం తెలిసిందే. వీధి కుక్కల దాడిలో ఇప్పటికే పలువురు మృతిచెందగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, తాజాగా హన్మకొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతిచెందాడు. వివరాల ప్రకారం.. తెలంగాణ దశాబ్ది సంబరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. 21రోజులపాటు జరిగే ఉత్సవాల్లో నేడు 19వరోజున విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో విద్యా దినోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కాగా, విద్యా దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ తీస్తుండగా విద్యార్థులపైకి వీధి కుక్కలు ఎగబడ్డాయి. ఈ సమయంలో కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి విద్యార్థి ఇనుగాల ధనుష్(12) మృతిచెందాడు. కాగా, ధనుష్ ఆరో తరగతి చదవుతున్నాడు. అయితే, ధనుష్ మృతితో గ్రామంలో విషాయఛాయలు అలుముకున్నాయి. ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. -
కేయూలో ఉద్రిక్త వాతావరణం
సాక్షి, హన్మకొండ: కాకతీయ యూనివర్సిటిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీలో ఇవాళ జరగాల్సిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ వాయిదా పడింది. సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు మహాధర్నాకు దిగారు. వీసీ ఛాంబర్లోకి దూసుకెళ్లడంతో పాటు అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట ధర్నాకు దిగారు. మరోవైపు సభకు వర్సిటీ అధికారులు సైతం అనుమతి ఇవ్వకపోవడంతో.. హైకోర్టులోనే ఈ అంశంపై తేల్చుకుంటామని కేయూ జేఏసీ నేతలు చెప్తున్నారు. సభ అర్థాంతరంగా రద్దు కావడంతో కాకతీయ యునివర్సిటీ లైబ్రరీ వద్ద మహా ధర్నాకు దిగారు. ఈ క్రమంలో.. భారీగా విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రూప్ వన్ అభ్యర్థులు తరలివస్తుండగా.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గేటు ముందు టైర్లు అంటించేందుకు కొందరు విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. -
ప్రైవేటు హాస్టల్ ఓనర్ నిర్వాకంతో రోడ్డున పడ్డ విద్యార్థులు
-
పరువు తీశారని మాజీ సర్పంచ్ ఆత్మహత్య
సాక్షి, వరంగల్(శాయంపేట): తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయడంతోపాటు పరువుతీశారని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మాజీ సర్పంచ్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు. అతని మృతికి పీఏసీఎస్ చైర్మన్ దంపతులే కారణమని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన శుక్రవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..హుస్సేన్‌పల్లి గ్రామానికి చెందిన భూతాల సురేష్ (40) పత్తి, మక్కలు, వరిధాన్యం కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపార అవసరాల నిమిత్తం శాయంపేట గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్ వద్ద 5నెలల క్రితం రూ.20లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో శాయంపేటలోని తన రెండు అంతస్తుల భవనాన్ని బ్యాంక్‌లో పెట్టి లోన్ తీసుకోవడానికి డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నాడు. 20 రోజులనుంచి తన అప్పు చెల్లించాలని శరత్.. తరచూ సురేష్ ఇంటికి వెళ్లి దూషిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల శరత్.. సురేష్‌ను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి ఇంటి పత్రాలు ఇవ్వాలని మూడు గంటలపాటు నిర్బంధించాడు. విషయాన్ని సురేష్ ఫోన్లో తన మిత్రులకు తెలియజేయడంతో వారు వచ్చి ఇంటి డాక్యుమెంట్స్ అప్పగించి అతన్ని తీసుకెళ్లారు. ఈ నెల 16న సురేష్ శాయంపేటలోని తన ఇంటికి అమ్మకానికి బోర్డు పెట్టాడు. విషయం తెలుసుకున్న శరత్ అతని భార్య రమాదేవి ఈ నెల 19న సురేష్ ఇంటికి వెళ్లి చుట్టుపక్కల వారి ముందు అప్పు విషయంలో దుర్భాషలాడుతూ సురేష్‌పై దాడి చేశారు. అవమానాన్ని భరించలేక సురేష్ అదేరోజు సాయంత్రం కొత్తగట్టుసింగారం శివారు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. చైర్మన్ దంపతుల వేధింపుల వల్లే తాను మానసికంగా కుంగిపోయి పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని సురేష్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. అప్పుగా తీసుకున్న రూ. 20లక్షలు చెల్లించాలని వేధింపులకు గురిచేయడం, ఇంటి ఒరిజినల్ దస్తావేజులు ఇవ్వాలని నిర్బంధించడం, కాలనీవాసుల ముందే పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్ దంపతులు దుర్భాషలాడుతూ కొట్టడంతో మనస్తాపం చెంది తన భర్త సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని భార్య రాణి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కుసుమ శరత్, భార్య రమాదేవిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. రోడ్డుపై ధర్నా .. పీఏసీఎస్ చైర్మన్, అతని భార్యపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు సాయంత్రం నాలుగు గంటల నుంచి పత్తిపాక–శాయంపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. పరకాల ఏసీపీ శివరామయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు మద్దతు ప్రకటించారు. బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా, సురేష్ మృతిపై బంధువులు చేసిన ఆరోపణలపై పీఏసీఎస్ చైర్మన్ శరత్‌ను వివరణ కోరేందుకు ఎంతసేపు ప్రయత్నించినా స్పందించలేదు. -
లా విద్యార్థిని బలవంతంగా కామాంధుల వద్దకు.. ఎమ్మెల్యే ప్రైవేటు పీఏతోపాటు
సాక్షి, వరంగల్ క్రైం: న్యాయ విద్య చదువుతున్న ఓ విద్యార్థినికి తీరని అన్యాయం జరిగింది. కాసుల కక్కుర్తితో ఓ హాస్టల్ నిర్వాహకురాలు.. ఆ విద్యార్థిని జీవితంతో చెలగాటం ఆడింది. కొన్నిరోజులుగా తనకు పరిచయమున్న వారి కామవాంఛ తీర్చేందుకు బాధితురాలిని బలవంతంగా వారి వద్దకు పంపింది. ఈ వేధింపులు భరించలేని విద్యార్థిని చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ ఉండటం గమనార్హం. హనుమకొండలోని ఓ ప్రైవేటు న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ నాలుగో సంవత్సరం చదువుతున్న సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థిని.. కళాశాలకు సమీపంలోని ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. హాస్టల్ నిర్వాహకురాలు వేముల శోభ ఆ విద్యార్థినిని తనకు పరిచయం ఉన్న వ్యక్తుల వద్దకు కొన్నిరోజులుగా బలవంతంగా పంపుతోంది. చదవండి: (ఆర్ఎంపీ వైద్యం చేస్తూ.. యువతులతో వ్యభిచారం) ఈ దారుణాన్ని భరించలేని బాధితురాలు రెండు రోజుల క్రితం హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హాస్టల్ నిర్వాహకురాలి మరిది, అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ అయిన వేముల శివకుమార్, హనుమకొండ చౌరస్తా సమీపంలో మెడికల్ షాపు నిర్వహించే కోట విజయ్‌కుమార్ అనే వ్యక్తి తనపై లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే నగరంలోని పలుచోట్లకు సైతం హాస్టల్ నిర్వాహకురాలు తనను బలవంతంగా పంపించిందని విద్యార్థిని పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుల కింద హాస్టల్ నిర్వాహకురాలు వేముల శోభ, వేముల శివకుమార్, కోట విజయ్‌కుమార్‌లను గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలిస్తామన్నారు. బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపుతామని చెప్పారు. -
హైదరాబాద్ సంస్థాన విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ స్వాతంత్య్ర పోరాటానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది పరకాల అమరధామం. అక్కడి మట్టి.. రజాకార్లు పారించిన రక్తపుటేర్లకు సాక్ష్యం.. నిరంకుశ నిజాం నుంచి స్వాతంత్య్రాన్ని కాంక్షించి అమరులైన యోధుల పోరాటానికి సాక్ష్యం. అదే.. మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా చరిత్రలో నిలిచిపోయిన పరకాల ఊచకోత ఘటన. సరిగ్గా 73 ఏళ్ల క్రితం.. 1947, సెప్టెంబర్ 2న జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే కాంక్షతో చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష సంఖ్యలో హాజరైన ప్రజలపై రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణహోమం మరో జలియన్ వాలాబాగ్‌గా మారింది. రజాకార్లపై పోరాడి ఎందరో అసువులుబాసి అమరవీరులుగా నిలిచారు. అలాంటి ఉద్యమంలో హనుమకొండ జిల్లా పరకాలది ప్రత్యేక స్థానం. సెప్టెంబర్ 2, 1947న పరకాల సమీపంలో ఉన్న పైడిపల్లి తాళ్ల నుంచి విమోచనోద్యమకారులు భారత జాతీయ జెండా ఎగురవేయడానికి పరకాలకు వచ్చారు. రజాకార్లు ఈ విషయం పసిగట్టి ఉద్యమకారులు జాతీయజెండాను ఎగురవేయనీకుండా అడ్డుకోమని నిజాంతో ఆదేశం జారీ చేయించారు. ఖాసింరజ్వీ నేతృత్వంలో పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ జియాఉల్లా, మేజిస్ట్రేట్ విష్ణువేశ్వర్ రావులు మూడు లారీల బలగాలను రంగంలోకి దింపారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ఉద్యమకారులపై తుపాకీగుళ్ల వర్షం కురింపిచారు. పరకాల చాపలబండ వద్ద గుమిగూడిన ఉద్యమకారులపై దాడిచేశారు. కత్తులు, బల్లాలు, బరిశెలతో మారణకాండ కొనసాగించగా 19 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురిని రంగాపూర్ గ్రామంలో చెట్టుకు కట్టేసి గొడ్డలి, బరిసెలు, తుపాకులతో కాల్చి చంపారు. ఈ మారణహోమంలో శ్రీశైలం, గజ్జి పర్వతాలు (కనిపర్తి), కుంట అయిలయ్య (నాగుర్లపల్లె), బత్తుల సమ్మయ్య, ఆముధాపురం వీరన్న, మేకల పోచయ్య,(రాయపల్లె), మంత్రి కేదారి, పోతుగంటి పెద్దులు (దమ్మన్నపేట), గుండారపు కొమరయ్య, దాతుపెల్లి రాజయ్య, కుమ్మరి రాములు (రేగొండ), గెల్లే కట్టమల్లు (దామరంచపల్లె), జాలిగపు ముసలయ్య, తొనగరు పూర్ణాసింగ్ (చల్లగరిగె), కలువాల అంకూస్ (గోవిందాపురం) తదితరులు అమరులయ్యారు. ఆకుతోట మల్లయ్య, రాజ్‌మహ్మద్, వర్దెల్లి వీరయ్యలను చెట్లకు కట్టేసి కాల్చి చంపారు. నిజాం పోలీసులు, రజాకార్లు వెంటాడి 200 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. సాయుధ పోరాటానికి కేరాఫ్... నిజాం రాక్షసకృత్యాలను వ్యతిరేకిస్తూ రహస్య జీవితం గడుపుతున్న ఉద్యమనేతలు ప్రతీకారం తీర్చుకోవడానికి మహరాష్ట్రలోని చాందా బోర్డర్ క్యాంప్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు సారథ్యంలో తొలివిడత వంద మంది సాయుధ శిక్షణ పొందారు. పిస్తోల్, రైఫిల్స్, మందు గుండు సామగ్రి సేకరించి చంద్రగిరి గుట్టలను కేంద్రంగా చేసుకొని సాయుధ పోరాటం జరిపారు. సాయధ దళాలు జమీందార్లు, జాగీర్దారులు, పెత్తందార్లు, మక్తెదారులకు చరమగీతం పాడాయి. ఈ దాడులను తట్టుకోలేక నిజాం పోలీసులు గ్రామాల్లో ప్రజలను విచక్షరహితంగా హింసించారు. చివరకు 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం ప్రభుత్వం లొంగిపోవటంతో ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువు పీల్చుకున్నారు. (క్లిక్ చేయండి: ‘కొరియర్’గా.. వారియర్‌గా!) రాత్రి వేళల్లో సమావేశాలు: చంద్రారెడ్డి అలియాస్ రంజిత్ నిజాం పాలనకు తిరుగుబాటుదారులైన ఎస్.మనోహర్‌రావు, కె.వి.నర్సింగరావు ఆదేశాలతో రాత్రివేళల్లో గ్రామాల్లో యువకులతో సమావేశాలు నిర్వహించేవాళ్లు. చాలామంది యువకులను మహారాష్ట్ర చందా ప్రాంతానికి పంపించి అక్కడ ఆజాద్ హింద్‌ఫౌజ్ నుంచి విరమణ పొందిన సైనికులతో ప్రత్యేక గెరిల్లా శిక్షణ ఇప్పించారు. జనవరిలో చందాకు వెళ్లిన వారిలో నేనూ ఉన్నా. 1948 మార్చి వరకు గెరిల్లా శిక్షణ పొందాను. అనంతరం మారుపేర్లతోనే స్వగ్రామాలకు చేరుకున్నాం. అదే సమయంలో ఉద్యమం తీవ్రంగా కొనసాగుతుండటంతో దామెర మండలంలోని చంద్రగిరి గుట్టలను షెల్టర్‌గా మార్చుకొని సాయుధపోరుకు శ్రీకారం చుట్టాం. చాపలబండ వద్ద రజాకార్ల తూటాల నుంచి తప్పించుకున్న నన్ను వారం రోజులకు పట్టుకున్నారు. చిత్రహింసలకు గురిచేసి.. చనిపోయాడనుకొని వెళ్లిపోయారు. కానీ కొన ఊపిరితో బయటపడ్డాను. (క్లిక్: మందు పాతరలు.. చివరి అస్త్రం) -
ప్రేమించాడు.. పెళ్లికి నిరాకరించాడు..
హసన్‌పర్తి: ప్రేమ పేరుతో యువతిని నమ్మించిన ఓ యువకుడు శారీరకంగా దగ్గరై చివరికి పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. హసన్‌పర్తి మండలం సీతంపేటకు చెందిన మంత్రి త్రివేణి (20) నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అదే వీధిలో ఉంటున్న ఆటో డ్రైవర్ గోళ్ల సుమన్ అలియస్ కిట్టు (ప్రస్తుతానికి ఓ షాపులో దినసరి కూలీ)తో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే సుమన్ ఆమెను నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. నెలరోజుల క్రితం త్రివేణి కుటుంబం వేలేరుకు వలస వెళ్లింది. ఇటీవల త్రివేణి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో సుమన్ నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన త్రివేణి శనివారం రాత్రి వేలేరులోని తన ఇంట్లో పురుగుల మందు తాగింది. పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు వేలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీతంపేటకు చెందిన మరో ముగ్గురు యువకులు కూడా ఆత్మహత్యకు కారకులుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఇది అప్పులకుప్ప ప్రభుత్వం: ఈటల
కమలాపూర్: కేసీఆర్ అహంకారాన్ని, డబ్బు సంచులని లిక్కర్ సీసాలని, పోలీస్ దుర్మార్గాలని ఈనెల 30న బొందపెట్టాలని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు, కొత్తపల్లి, కన్నూరు, శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజుపల్లి, ఉప్పల్ గ్రామాల్లో శనివారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు డబ్బులిస్తే కాంట్రాక్లర్టు డబుల్ బెడ్రూంలు, బ్రిడ్జీలు కట్టరా.. రోడ్లు వేయరా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని, ఇది అప్పుల కుప్ప ప్రభుత్వమని భయపడే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని విమర్శించారు. ప్రజలను గోల్మాల్ చేయాలని చూస్తున్న మిమ్మల్ని ఈ నెల 30న ప్రజలే గోల్మాల్ చేస్తారని, 30వ తేదీన ఒక్క గుద్దు గుద్దితే దిమ్మ తిరిగి, ఇంకోసారి హుజూరాబాద్ జోలికి రారని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావును ఉద్దేశించి మాట్లాడుతూ, కేసీఆర్ నిన్నూ నన్నూ అవమానించింది నిజం కాదా? కన్నీళ్లతో మన పరుపులు తడిసిపోతే నీ భార్యా నా భార్య చూసింది నిజం కాదా? ఇవాళ నీ పదవికోసం కేసీఆర్ కత్తి ఇస్తే నన్ను పొడవాలని చూస్తున్నావని ఈటల ఆరోపించారు. ‘ఆస్తులు పోగేసుకున్నది మీరు, పోగొట్టుకున్నది నేను. 18 ఏళ్లు ఉద్యమ బిడ్డగా, తెలంగాణ గర్వంచేలా బతికిన. హుజూరాబాద్‌లో మీ అబద్ధాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది’ అని వ్యాఖ్యానించారు. దమ్ముంటే ఆస్తులు, ఆరోపణలపై అంబేడ్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు రావాలని కేసీఆర్, హరీశ్‌రావులను ఈటల సవాల్ చేశారు. -
కొంప ముంచిన అత్యాశ.. రూ.2 కోట్లతో ఉడాయించిన వ్యాపారి
సాక్షి, హన్మకొండ చౌరస్తా: ఇంటి వద్దే కూర్చొని నెలకు రూ.20 వేల వరకు సంపాదించండి అంటూ వచ్చిన ప్రకటన పలువురిలో ఆశలు రేకెత్తించింది. చివరకు ఆ అత్యాశే కొంపముంచింది. ఏకంగా రూ.2 కోట్లు కుచ్చుటోపీ పరారయ్యాడో వ్యాపారి. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఓ కాంప్లెక్స్‌లో విజయవాడకు చెందిన శ్రీనివాసరావు మార్చిలో ముత్యాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇంటి వద్దే కూర్చోండి, నెలకు రూ.20 నుంచి రూ.30 వేల వరకు సంపాదించండి అంటూ ప్రకటనలు ఇచ్చాడు. దండ అల్లేందుకు సరిపడా ముత్యాలు తామే ఇస్తామని, ఆ ముత్యాలతో మాల అల్లుకుని వస్తే రూ.300 చెల్లిస్తానని చెప్పాడు. కానీ తొలుత దండ విలువ ఆధారంగా రూ.2 వేలు పెట్టుబడి పెట్టాలని, అలా ఎన్ని దండలకు సరిపడా డబ్బు చెల్లిస్తే అన్ని ముత్యాలను అందిస్తామని తెలిపారు. దీంతో దాదాపు 165 మంది రూ.రెండు కోట్ల మేరకు వ్యాపారి శ్రీనివాసరావుకు చెల్లించారు. ఇదే అదనుగా భావించిన అతను ఉడాయించాడు. -
న్యూజెర్సీలో తెలంగాణ వాసి మృతి
సాక్షి, నయీంనగర్: అమెరికాలోని న్యూజెర్సీలో హన్మకొండ భవానీనగర్‌కు చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు కిందపడి చనిపోయాడు. ప్రవీణ్‌కుమార్ (37) డిసెంబర్ 22న న్యూజెర్సీలోని ఎడిసన్ టౌన్షిప్ నుంచి న్యూయార్క్‌లోని ఆఫీసుకు వెళ్తుండగా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రవీణ్ తండ్రి రాజమౌళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డీఈగా రిటైర్ అయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా ప్రవీణ్‌కుమార్ చిన్నవాడు. రాజమౌళి స్వస్థలం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామం కాగా, భవానీనగర్‌లో స్థిరపడ్డారు. నాలుగేళ్లుగా భార్య నవతతో కలసి ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నాడు. దంపతులు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రవీణ్ మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ మృతదేహం ఆస్పత్రిలోనే ఉందని, -
రేపటి నుంచి హన్మకొండలో 144 సెక్షన్
సాక్షి, హన్మకొండ అర్బన్: ఈ నెల ఐదో తేదీన సాయంత్రం 5గంటల నుంచి 144 సెక్షన్ విధించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో స్థానికేతర వ్యక్తులను గుర్తించి బయటకు పంపించనున్నట్లు తెలిపారు. 5న సాయంత్రం 5గంటల తర్వాత కల్యాణ మండపాలు, లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు సురేంద్రసింగ్, టి.ఆనంద్, పోలీస్ కమిషనర్ డాక్టర్ టి.రవీందర్‌లతో కలిసి నిఘా కమిటీలు, పోలిస్ అధికారులతో సోమవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నందున నిఘాను పెంచాలన్నారు. 7న పోలింగ్ సందర్బంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలను తీసుకోనున్నట్లు తెలిపారు. బ్రాడ్‌బాండ్ 133 పోలింగ్ కేంద్రాలు, సీసీ కెమెరాల ద్వారా 250 కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 307 పోలింగ్ కేంద్రాల్లో ఆఫ్‌లైన్ ద్వారా వెబ్ కాస్టింగ్ చేయించనున్నట్లు తెలిపారు. -
‘కారు’ పనైపోయింది : జైరాం రమేష్
సాక్షి, హన్మకొండ: తెలంగాణలో ‘కారు’ పనైపోయింది.. కేసీఆర్ ఇక ఫాం హౌస్‌కే పరిమతమవుతారని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. ఆదివారం హన్మకొం డలోని పోచమ్మకుంట, సగర కాలనీ, ప్రేమ్‌నగర్ కాలనీ, హనుమాన్ నగర్, నయింనగర్, లష్కర్‌సింగారం, రాజాజీనగర్, రాంనగర్లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి ప్రజా కూటమి అభ్యర్థి రేవూరి ప్రకాష్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నయింనగర్‌లో జైరాం రమేష్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా, రాహుల్‌గాంధీ ఇచ్చారని, బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ కుటుంబ తెలంగాణగా మార్చారని విమర్శించారు. ప్రజలను మాయమాటలతో మోసం చేస్తూ నాలుగున్నర ఏళ్లు పాలన సాగించాడని, కేసీఆర్ పతనానికి వరంగల్ నుంచి నాందీ పలకాలని కోరారు. సైకిల్‌ను నడపాలంటే చేయి సహకారం అవసరమని అందుకే టీడీపీకి కాంగ్రెస్ సహకిస్తోందని చెప్పారు. హనుమాన్ నగర్లో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు మాట్లాడుతూ బీజేపీకి కొమ్ము కాస్తున్న కేసీఆర్ వరంగల్ అభివృద్ధిపై ఎందుకు ఒత్తిడి తేలేదని ప్రశ్నించారు. కాజీపేటలో వ్యాగన్ పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ కేంద్రం వచ్చిందా అని ప్రశ్నించారు. రైతులకు, దళితులు, యువకులకు కేసీఆర్ ఒరుగబెట్టింది ఏమీ లేదని, ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రచారం కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ప్రజాకూటమి నాయకులు బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డితోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
హన్మకొండ: నేను లోకల్.. 45 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా..
సాక్షి, హన్మకొండ: నేను పక్కా లోకల్...45 ఏళ్ల నుంచి హన్మకొండలోనే ఉంటున్నా...నగరం నడిబొడ్డున భవానినగర్‌లో నా ఇళ్లు... కుటుంబంతో సహా ఈ ఇంటిలో ఉంటున్నా...బాల్యంలో చదువుకున్నది కూడా ఇక్కడే...తాను స్థానికేతరుడిని ఎలా అవుతానని ప్రజా కూటమి అభ్యర్థి రైవూరి ప్రకాష్‌రెడ్డి విమర్శకులకు సవాల్ విసిరారు. శుక్రవారం హన్మకొండలోని వడ్డెపల్లి, ముదిరాజ్ వాడ, ఎస్సీ వాడ, బాలయ్య హోటల్, ఎన్జీవోస్ కాలనీ, ఇందిరానగర్‌లో పాదయాత్ర నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి తనకు ఓట వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, నుదిటిపై తిలకం దిద్దారు. ఈ ప్రచారంలో రేవూరి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తిని నేనేనని... తెలంగాణ ద్రోహిని ఎలా అవుతానని ప్రశ్నిం చారు. చిదంబరంతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను గట్టిగా వినిపించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయాన్ని కేసీఆర్‌ను అడిగి తెసుకోవాలని టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్‌భాస్కర్‌కు సూచించారు. కారుకు ఓటేస్తే ప్రజల బతుకులు బుగ్గిపాలు అవుతాయన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడతూ మచ్చలేని వ్యక్తి రేవూరి ప్రకాష్‌రెడ్డి అని, కబ్జాలకై లాలూచీ పడే వ్యక్తి కాదని, నిస్వార్థ సేవకుడని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి మహ్మద్ రియాజ్, ప్రజా కూటమి నాయకులు బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డి, బంక సరళ, నాగరాజు, తాళ్లపల్లి జయపాల్, పల్లె రాజిరెడ్డి, రవీందర్, దొంగరి సతీష్ పాల్గొన్నారు. -
అభ్యర్థులు పెరుగుతున్నరు..
సాక్షి, హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గత మూడు అసెంబ్లీ ఎన్నికలతో పరిశీలిస్తే పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్య ప్రతి ఎన్నికకు పెరుగుతోంది. 2009లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజక వర్గాల్లో 136 మంది అభ్యర్థులు పోటీచేయగా, 2014లో 156 మంది పోటీచేశారు. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగి 172 మందికు చేరింది. ఈ సారి 12 నియోజకవర్గాల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో తక్కువగా ఎనిమిది మంది మాత్రమే పోటీలో ఉన్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నుంచి అత్యధికంగా 21 మంది చొప్పున పోటీలో ఉన్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో శాసనసభకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఓసారి పరిశీలిద్దాం... -
ప్రజాభీష్టమే ఫైనల్
-
ప్రజాభీష్టమే ఫైనల్
► 31 జిల్లాలకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర... తెరపైకి ఆసిఫాబాద్ ► గద్వాల, సిరిసిల్ల, జనగామలపై ఏకాభిప్రాయం ► అంతా దసరా చేసుకుంటుంటే వాళ్లెందుకు బాధ పడాలె? ► అధికారులతో ముఖ్యమంత్రి వ్యాఖ్య ► హన్మకొండ జిల్లా ప్రతిపాదన రద్దు ► కొత్తగా వరంగల్ రూరల్, అర్బన్ ► జిల్లాలపై కేకే నేతృత్వంలో హైపవర్ కమిటీతో అధ్యయనం ► రెండ్రోజుల్లో తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 31 జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతోపాటు జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సూచనప్రాయంగా ఆమోదం తెలిపారు. దసరా రోజున ప్రారంభమయ్యే కొత్త జిల్లాలతో ప్రజలంతా సంతోషంగా పండుగ చేసుకుంటే ఈ ప్రాంతాల ప్రజలు మాత్రం బాధపడటం మంచిది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. కొత్తగా ఈ నాలుగు జిల్లాల ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలో హైపవర్ కమిటీతో అధ్యయనం చేయిస్తామని, రెండు మూడు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నాలుగు జిల్లాలను ఏయే మండలాలతో కలిపి ఏర్పాటు చేయవచ్చో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. చిన్న జిల్లాల ద్వారానే అభివృద్ధి సాధ్యమని, సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ సులభతరం అవుతుందని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున వీటి సంఖ్య పెరిగినా అభ్యంతరం లేదని సీఎం మరోమారు స్పష్టంచేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సోమవారం కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఆయన చర్చించారు. మూడు లక్షల కుటుంబాలకు ఓ జిల్లా చిన్న పాలనా విభాగాలే మంచి ఫలితాలిస్తాయని ప్రపంచవ్యాప్తంగా గతానుభవాలు సూచిస్తున్నాయని, అదే స్ఫూర్తి తో తెలంగాణలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సత్వర అభివృద్ధికి, స్థానిక వనరుల సద్వినియోగానికి, పేదరిక నిర్మూలనకు చిన్న జిల్లాల ఏర్పాటు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రతీ జిల్లాలో సగటున 3 లక్షల కుటుంబాలుండేలా జిల్లాలను పునర్వవ్యస్థీకరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ జిల్లాలో మంత్రి, కలెక్టర్లు తమ కంప్యూటర్లో కుటుంబాల వివరాలు నమోదు చేసుకుని స్వయంగా ఒక్కో కుటుంబం గురించి శ్రద్ధ తీసుకునే పరిస్థితి రావాలని అన్నారు. సిరిసిల్లకు రాజన్న జిల్లా పేరు వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు చేసే విషయంలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో ముసాయిదాలో ఉన్న హన్మకొండ జిల్లా రద్దయినట్లయింది. వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని కూడా వరంగల్ నగరంలోనే ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచిం చారు. కొత్తగూడెం జిల్లాకు ‘భద్రాది కొత్తగూడెం’గా పేరు పెట్టాలని నిర్ణయించారు. సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడే జిల్లాకు రాజన్న పేరు పెట్టాలనే ప్రతిపాదనలు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వికారాబాద్, మహబూబాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లాలకు అవే పేర్లను కొనసాగించాలని నిర్ణయించారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ప్రతిపాదించిన కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లితోపాటు సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించాలన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట మండలాలను కరీంనగర్‌లోనే కొనసాగించాలని, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలను వరంగల్ అర్బన్ జిల్లాలో, హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. మండలాలు అటూ.. ఇటూ.. వరంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపాలని, ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. కరీంనగర్ జిల్లాలో కొత్తగా రుద్రంగి మండలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఆరు మండలాలు (ఆళ్లపల్లి, కరకగూడెం, చుంచుపల్లి, లక్ష్మిందేవి పల్లి, సుజాత నగర్, అన్నపురెడ్డి) ఏర్పాటు చేసే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ప్రతిపాదిత జనగామ జిల్లాలో కొత్తగా స్టేషన్ ఘన్పూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భూపాలపల్లి జిల్లాలోని ములుగు కేంద్రానికి ఉన్న ప్రాధాన్యం, గిరిజన జనాభాను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకంగా నిధులు కూడా విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లాలో గాదిగూడ, సిరికొండ మండలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంథని రెవెన్యూ డివిజన్‌ను యథాతథంగా కొనసాగించి, పెద్దపల్లి నగర పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని నిర్ణయించారు. మహబూబాబాద్ జిల్లాలో చిన్నగూడూరు, భూపాలపల్లిలో టేకుమట్ల మండలాల ఏర్పాటును ప్రతిపాదించారు. జిల్లాలపై నేతల్లో ఏకాభిప్రాయం వరుసగా రెండ్రోజుల చర్చల తర్వాత కొత్త జిల్లాలపై నాయకుల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. వరంగల్ జిల్లాలో 5, కరీంనగర్లో 4, మహబూబ్‌నగర్‌లో 4, మెదక్‌లో 3, రంగారెడ్డిలో 3, నల్లగొండలో 3, ఆదిలాబాద్‌లో 4, నిజామాబాద్‌లో 2, ఖమ్మంలో 2 జిల్లాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మాత్రమే మారకుండా ఒక జిల్లాగా ఉండబోతుంది. మొత్తంగా తెలంగాణలో 31 జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కసరత్తు జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పాత తప్పు చేయొద్దు గతంలో మండలాలు ఏర్పాటు చేసినప్పుడు రాజకీయ జోక్యం ఎక్కువైందని, ఇప్పుడలా జరగడానికి వీల్లేదని సీఎం స్పష్టంచేశారు. ‘‘అప్పుడు నాయకులు తమ స్వార్థం మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. మండలాల కూర్పు ప్రజల అభీష్టం మేరకు జరగలేదు. అర్హతలున్నా కొన్ని మండల కేంద్రాలు కాలేకపోయాయి. ఇప్పుడలా జరగవద్దు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జరగాలి. గతంలో జరిగిన పొరపాట్లను సవరించాలి. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామాలు వేరే మండలంలో ఉన్నా సరే వాటిని సమీప మండలంలో కలపాలి’’ అని సూచించారు. 2022 నాటికి రూ.5 లక్షల కోట్ల బడ్జెట్ 2022 నాటికి తెలంగాణ బడ్జెట్ రూ.5 లక్షల కోట్లకు చేరుతుందని సీఎం చెప్పారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి దేశంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ పేదరికం పోలేదు. దళితులు బాగుపడలేదు. పేదలు పేదలుగానే ఉన్నారు. అందుకే పాలకులకు తృప్తి లేదు. వెలితి అలాగే ఉంటున్నది. ఈ పరిస్థితి నుంచి బయటపడే చక్కని అవకాశం తెలంగాణ రాష్ట్రానికున్నది. మంచి ఆదాయ వనరులున్నాయి. సానుకూల పరిస్థితులున్నాయి. అందుకే తెలివిగా పేదరికంపై యుద్ధం చేయాలి. రాష్ట్రం నుంచి పేదరికాన్ని తరిమికొట్టాలి. 2022 నాటికి తెలంగాణ బడ్జెట్ అయిదు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. అప్పటికీ తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తవుతాయి. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణం, మిషన్ భగీరథ, రహదారుల నిర్మాణం లాంటి భారీ పెట్టుబడులతో చేసే పనులు పూర్తవుతాయి. మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లాంటి కొన్ని పనులు మాత్రమే ఉంటాయి. అప్పుడు మన చేతిలో చాలా డబ్బు ఉంటుంది. ఆ డబ్బులన్నీ పేదరిక నిర్మూలనకే వినియోగిస్తాం. ప్రతీ కుటుంబంపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రతీ కుటుంబ స్థితిగతులు మంత్రులు, కలెక్టర్ కంప్యూటర్లో పెట్టుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతారు. ప్రతీ ఒక్క కుటుంబం వృద్ధి సాధించేలా కార్యాచరణ రూపొందిస్తారు. తెలంగాణకు వచ్చిన ఆదాయం పేదరిక నిర్మూలనకే కేటాయిస్తాం’’ అని సీఎం అన్నారు. కొత్తగా తెరపైకి ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మితోపాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆసిఫాబాద్ జిల్లాను ప్రతిపాదించారు. దీంతో కొత్త జిల్లా కూర్పుపై సీఎం అప్పటికప్పుడు ప్రత్యేకంగా కసరత్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాను 20 మండలాలతో, కొమురంభీం మంచిర్యాల జిల్లాను 13 మండలాలతో, ఆసిఫాబాద్ జిల్లాను 15 మండలాలతో, నిర్మల్ జిల్లాను 18 మండలాలతో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రూపొందింది. కొత్తగా జిల్లాలో 16 మండలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బెల్లంపల్లి, ముధోల్ డివిజన్లు ఏర్పాటు చేయాలని, క్యాతంపల్లిని నగర పంచాయతీగా మార్చాలని, బాసర కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. -
హన్మకొండ జిల్లా రద్దు!
- ప్రజాభిప్రాయంపై సీఎంకు నివేదికలు - కొత్తగా వరంగల్ రూరల్ జిల్లా - కాకతీయ లేదా భద్రకాళి పేరు పెట్టే యోచన - అధికారులతో కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష - జిల్లాలపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు - ఇప్పటికే 30 వేలు దాటిన వైనం సాక్షి,హైదరాబాద్: కొత్త జిల్లాల ముసాయిదాపై వెల్లువెత్తుతున్న ప్రజాభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటోంది. వరంగల్ జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలపై పునరాలోచనలో పడింది. వరంగల్ సిటీ కేంద్రంగా ఉన్న వరంగల్, హన్మకొండలను రెండు జిల్లాలుగా విభజించడంపై అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబికింది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేట నగరాలు మూడూ ఒకే జిల్లాలో ఉండాలనే అభిప్రాయాలకు ఎక్కువ మంది మొగ్గుచూపారు. ఇంటెలిజెన్స్‌తో పాటు వివిధ వర్గాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మతో పాటు ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ జిల్లా అంశమే చర్చకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హన్మకొండకు బదులు వరంగల్‌ను జిల్లాగా కొనసాగించాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సమక్షంలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు మినహాయిస్తే వరంగల్‌లో దాదాపు 30 మండలాలు, 23 లక్షలకుపైగా జనాభా ఉంటాయి. వైశాల్యమూ పెద్దగా ఉంటుందని, దాంతో చిన్న జిల్లాల దృ క్పథమే దెబ్బతింటుందని సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో 27 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించడం తెలిసిందే. సగటున ఒక జిల్లాలో 18 మండలాలు, 13.33 లక్షల జనాభా ఉంటాయి. కానీ వరంగల్ 30 మండలాలు, 23 లక్షల జనాభాతో రాష్ట్రంలోనే పెద్ద జిల్లాగా ఏర్పడుతుంది. తద్వారా పాలనా సౌలభ్యానికి చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్న స్ఫూర్తి దెబ్బ తింటుందనే చర్చ జరిగినట్లు సమాచారం. తెరపైకి ‘వరంగల్ రూరల్’ వరంగల్ నగరాన్ని విడదీయకుండా ఉండేందుకు వరంగల్ రూరల్ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అందుకు అనుగుణంగా మార్పుచేర్పుల కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిపాదిత హన్మకొండ జిల్లాను రద్దు చేసి, అందులో ప్రతిపాదించిన మండలాలన్నిటినీ వరంగల్ జిల్లాలో కలుపుతారు. దాంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు ప్రస్తుతం హన్మకొండ జిల్లాగా ప్రతిపాదించిన మండలాలన్నీ కొత్త వరంగల్ జిల్లాలోనే ఉంటాయి. వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం మినహా వరంగల్‌లో ప్రతిపాదించిన ఇతర మండలాలతో కొత్తగా వరంగల్ రూరల్ జిల్లా ఏర్పడుతుంది. ఇలా రెండు జిల్లాలు చేస్తే వరంగల్ సిటీ మొత్తం ఒకే జిల్లాలో ఉంటుందని, చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్న ప్రయోజనమూ నెరవేరుతుందని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. కొత్తగా ఏర్పడే వరంగల్ రూరల్ జిల్లాకు కాకతీయ జిల్లా, లేదా భద్రకాళి జిల్లా అని పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 30 వేలు దాటిన అభ్యంతరాలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన పన్నెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ద్వారా 29,411 మంది ఆన్లైన్లో తమ విజ్ఞప్తులను నమోదు చేశారు. వీటికి తోడు జిల్లా కలెక్టరేట్లలో, సీసీఎల్ఏలో మరో రెండు వేలకు పైగా అర్జీలు అందినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ అర్జీల ప్రకారం అత్యధికంగా వనపర్తి జిల్లా ఏర్పాటుపై 7,738, యాదాద్రి జిల్లాపై 4,386 విజ్ఞప్తులు అందాయి. కొత్త డివిజన్లకు సంబంధించి అత్యధికంగా జగిత్యాల జిల్లాపై 5,168 ఫిర్యాదులు నమోదయ్యాయి. కోరుట్లను రెవిన్యూ డివిజన్ కేంద్రం చేయాలని అత్యధికంగా విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. కొత్త ప్రతిపాదనల స్వరూపం వరంగల్ జిల్లా (21 మండలాలు): వరంగల్ కార్పొరేషన్, హన్మకొండ, ఖిలా వరంగల్, హసన్‌పర్తి, ఖాజీపేట, ధర్మసాగర్, చిల్పూర్, వేలేరు, స్టేషన్ ఘన్పూర్, రాయపర్తి, జఫర్‌గఢ్, నర్మెట్ట, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల, ఇల్లంతకుంట, హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట వరంగల్ రూరల్ జిల్లా (14 మండలాలు) : ఐనవోలు, వర్ధన్నపేట, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, పర్వతగిరి, నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, ఖానాపూర్, దుగ్గొండి, నల్లబెల్లి, శాయంపేట, పరకాల -
చారిత్రక నగరాన్ని విడదీయొద్దు
న్యూశాయంపేట : చారిత్రక నగరాన్ని విడదీ యకుండా వరంగల్ జిల్లాను మూడు జిల్లాలు గా విభజిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నా రు. అయితే, హన్మకొండ జిల్లాగా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల ఏర్పాటుపై శనివారం కలెక్టరేట్లో డీఆర్ఓకు పార్టీ అభిప్రాయాన్ని వినతిపత్రం ద్వారా అందించారు. భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ పేరుకు బదులు సమ్మక్క సారక్క పేరు పెట్టాలని, మహబూబాబాద్‌ను మానుకోటగా మార్చాలని కోరారు. జనగామను జిల్లా చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. నాయకులు రాజారెడ్డి, కొత్త దశరథం, శ్రీరాంరెడ్డి, ప్రవీణ్, దిలీప్‌నాయక్, రమణారెడ్డి పాల్గొన్నారు.