రాష్ట్రంలో 31 జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలతోపాటు జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సూచనప్రాయంగా ఆమోదం తెలిపారు. దసరా రోజున ప్రారంభమయ్యే కొత్త జిల్లాలతో ప్రజలంతా సంతోషంగా పండుగ చేసుకుంటే ఈ ప్రాంతాల ప్రజలు మాత్రం బాధపడటం మంచిది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. కొత్తగా ఈ నాలుగు జిల్లాల ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలో హైపవర్ కమిటీతో అధ్యయనం చేయిస్తామని, రెండు మూడు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Published Tue, Oct 4 2016 7:03 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement