
భార్య నవత, కుమారుడు గగన్‌తో ప్రవీణ్‌కుమార్(ఫైల్)
సాక్షి, నయీంనగర్: అమెరికాలోని న్యూజెర్సీలో హన్మకొండ భవానీనగర్‌కు చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు కిందపడి చనిపోయాడు. ప్రవీణ్‌కుమార్ (37) డిసెంబర్ 22న న్యూజెర్సీలోని ఎడిసన్ టౌన్‌షిప్ నుంచి న్యూయార్క్‌లోని ఆఫీసుకు వెళ్తుండగా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రవీణ్ తండ్రి రాజమౌళి ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో డీఈగా రిటైర్ అయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా ప్రవీణ్‌కుమార్ చిన్నవాడు. రాజమౌళి స్వస్థలం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామం కాగా, భవానీనగర్‌లో స్థిరపడ్డారు. నాలుగేళ్లుగా భార్య నవతతో కలసి ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నాడు. దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రవీణ్ మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ మృతదేహం ఆస్పత్రిలోనే ఉందని,
Comments
Please login to add a commentAdd a comment