man died
-
రెండో భార్య మద్యం మానేయమన్నందుకు..
కంబదూరు: మద్యం మానేయడం ఇష్టంలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కంబదూరు మండలం ఓబగానిపల్లికి చెందిన రాజన్న (29) మొదటి భార్య మృతి చెందింది. దీంతో 30 రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో రోజూ తప్పతాగి ఇంటికి చేరుకునేవాడు. శనివారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి చేరుకోవడంతో తల్లి నాగమణి, భార్య చైత్ర మందలించారు. రోజూ మద్యం తాగుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని, ఏదైనా పని చేసుకుంటూ గౌరవంగా బతుకుదామని హితవు పలికారు. అయితే మద్యానికి పూర్తి స్థాయిలో బానిసైన రాజన్న... అదే రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఇంట్లో వారు గమనించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రవీన్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
Hydra: ఇల్లు పోతుందన్న భయంతో పేద గుండె ఆగింది
ఉప్పల్, సాక్షి హైదరాబాద్: తన ఇల్లు కూల్చివేస్తారేమో అన్న దిగులుతో ఓ నిరుపేద గుండె ఆగింది. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్ కేటీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన స్కూల్ వ్యాన్ నడిపే తాటిపల్లి రవీందర్ (55)కి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కుమార్తెలిద్దరికీ వివాహాలు అయ్యాయి. రవీందర్ 75 గజాల స్థలంలో నిరి్మంచిన రేకుల ఇంట్లో ఉంటున్నారు. ఇది మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండటం వల్ల రవీందర్ నివాసముంటున్న ఇంటికి అవతలి పక్కన ఉన్న ఇంటికి అధికారులు మార్కు చేశారు. దీంతో రవీందర్‌కు తన ఇంటిని కూడా కూల్చి వేస్తారేమోనన్న బెంగ పట్టుకుంది.అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్నాడు. ఉన్న చిన్న ఇల్లు ఆధారం పోతే ఎలా బతికేదంటూ కుటుంబ సభ్యులతో ఆందోళన వ్యక్తం చేసేవాడు. నెల రోజుల క్రితం ఇదే ఆవేదనతో గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మరోసారి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ రవీందర్‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పెద్ద దిక్కు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హైడ్రాపై ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు: రంగనాథ్ మూసీ నది ఎఫ్ఐఎల్, బఫర్ జోన్లలో మార్కింగ్, కూల్చివేతలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ ఫేక్ ప్రచారం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో హైడ్రాపై భయాందోళనలు సృష్టిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరిచారు. మూసీ నదిలో హైడ్రా ఎలాంటి చర్యలు చేపట్టదనీ, నిబంధనల ప్రకారమే హైడ్రా కార్యకలాపాలు ఉంటాయన్నారు. ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. Atul Subhash Case: అతుల్.. అంతులేని ఆవేదన -
పిడుగుపాటుకు యువతీ యువకుడు మృతి
ఐనవోలు/వర్ధన్నపేట: వ్యవసాయ భూముల్లో పనులు చేస్తుండగా పిడుగుపడి యువతీ యువకుడు మృతి చెందారు. కాగా, విద్యుత్ సౌకర్యం లేక టార్చ్‌లైట్ వెలుతురులోనే శవపరీక్ష చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దౌతుబాజి శ్రీనివాస్, దౌతుబాజి విజయ, రాధాబాయి, ఇందిర, కోమల, శ్రావణి, రాజు ఆదివారం పొలాల్లో పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో అందరూ సమీపంలోని రేకుల షెడ్డులోకి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడింది. పిడుగు ధాటికి షెడ్డులో ఉన్న ఏడుగురూ కింద పడిపోయారు. తేరుకుని లేచి చూడగా ఇందిర కుమార్తె శ్రావణి (17), కూకట్ల కోమల కుమారుడు రాజు (24) మృతిచెంది ఉన్నారు. ఈ ఘటనలో కోమలతోపాటు మిగతా నలుగురు అస్వస్థతకు గురయ్యారు. జఫర్‌గఢ్ ఎస్సై రాంచరణ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టార్చ్‌లైట్ వెలుతురులో శవపరీక్ష ఇదిలా ఉండగా శ్రావణి, రాజు మృతదేహాలకు వర్ధన్నపేట శ్మశానవాటికలోని పోస్టుమార్టం గదిలో విద్యుత్ సౌకర్యం లేక టార్చ్‌లైట్ వెలుతురులోనే శవపరీక్ష చేశారు. వెంకటాపురం గ్రామం జఫర్‌గఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండడంతో వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాలను తీసుకురాగా శ్మశానవాటికలోని పోస్టుమార్టం గదికి తరలించారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వైద్యులు అక్కడికి చేరేసరికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో టార్చ్లైట్ల సహాయంతో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో మృతుల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. అక్కడ విద్యుత్ మీటరు లేకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపి వేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతుంటే.. పోస్టుమార్టం గది నిర్మించి ఇచ్చాం, మిగతా విషయాలకు ఆస్పత్రి వారిదే బాధ్యత అని మున్సిపల్ శాఖ చేతులు దులిపేసుకున్నట్టు సమాచారం. -
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
మేడ్చల్ రూరల్: మేడ్చల్ మండలం రాజబొల్లారం తండాలో శనివారం రాత్రి నిర్వహించిన వినాయక నిమజ్జనం అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీటమునిగి మృతి చెందాడు. స్ధానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజ బొల్లారం తండాకు చెందిన మాజీ సర్పంచ్ మాంగ్యా నాయక్ తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి పలువురు యువకులు సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో కరంతోడ్ సురేందర్ అలియాస్ హంజా(28) నీటిలో మునిగాడు. ఈ విషయాన్ని గమనించని మిగతా యువకులు విగ్రహాన్ని నీటిలోకి నెట్టారు. ఈ క్రమంలో విగ్రహం మీద పడి హంజా నీటిలో మునిగిపోయాడు. నిమజ్జనం తర్వాత రోడ్డుపైకి వచ్చిన యువకులకు హంజా కనబడకపోవడంతో తిరిగి నీటిలోకి వెళ్లి చూడగా విగ్రహం కింద పడి విగతజీవిగా కనిపించాడు. మృతుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రైన్లో బెర్త్ కూలి.. ప్యాసింజర్ మృతి
తిరువనంతపురం: ట్రైన్ అప్పర్ బెర్త్ ఒక్కసారిగా కూలిపోవటంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. కేరళకు చెందిన ప్యాసింజర్ అలిఖాన్ సీకే తన స్నేహితులతో ఆగ్రాకు.. ఎర్నాకులం-హజ్రత్ నిజాముద్దీన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జూన్ 16న జరిగిన ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ట్రైన్ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ప్రయాణిస్తున్న సమయలో ఒక్కసారిగా అలిఖాన్ సీకేపై అప్పర్ బెర్త్కూలిపోయింది.దీంతో ఆయన మెడకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.దీంతో ఆయన్ను రామగుండంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తలించారు. ఇక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రైన్లో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తటంలో రైల్వే మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ‘ఎక్స్’లో స్పందించారు. అప్పర్ బెర్త్ కూలిపోయిందని తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. ‘‘ రైల్వే అధికారుల ట్రైన్‌లోని బెర్త్‌ను పరిశీలించారు.ప్రయాణీకుడు అలిఖాన్ సీకే సీటు నెం. S/6 కోచ్‌లో 57 (లోయర్ బెర్త్). అయితే ఆయనపై ఉన్న పైబెర్త్కు చైన్ సరిగ్గా అమర్చకపోవడం వల్లనే కిందకు పడిపోయింది. కానీ, పైబెర్త్ డ్యామెజీ కారణంగా కిందపడలేదు’’ అని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై రామగుండం రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి గాయాలైన ప్రయాణికుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేరళ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ప్రధాని మోదీ ప్రభుత్వంలో రైల్వేలో జరుగుతున్న ప్రమాదాలపై విమర్శలు చేసింది. ఈ ప్రమాదాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. -
ఆటలో సిక్స్... జీవితంలో ఔట్!
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిన ఆకస్మిక గుండెపోటు మరణాలు వెంటాడుతున్నాయి. ఐదేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల ముసలి వరకు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. కళ్ల ముందు హుషారుగా ఉన్న వారు క్షణాల్లో విగత జీవులుగా మారుతున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ, క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ.. అంతెందుకు రోడ్డుపై నడుస్తున్న వారు ఆకస్మాత్తుగా కుప్పకూలి అందరికి దూరమవుతున్నారు.తాజాగా ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. మహారాష్ట్ర థానెలోని మీరా రోడ్డులో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రౌండ్లో రెండు టీమ్‌లు క్రికెట్ ఆడుతుండగా.. పింక్ జెర్సీ ధరించి బ్యాటింగ్ చేస్తున్న యువకుడు బంతిని గట్టిగా సిక్స్ కొట్టాడు. బాల్ అమాంతం ఎగిరి పార్క్ గ్రౌండ్ బయట పడింది. ఇంతలో ఏమైందో ఏమో వెంటనే ఉన్నచోటే బ్యాటర్ కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి క్రీడాకారులు అతన్ని బతికించేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. యువకుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిని రామ్ గణేష్ తేవార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడి మరణానికి ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువకుడు కుప్పకూలడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.#DisturbingVisuals : On camera, man dies immediately after hitting six in match near mumbai. In a shocking incident in Thane's Mira Road area in Maharashtra, a man died while playing cricket. #shocking#Thane #HeartAttack #Cricket #heartattack pic.twitter.com/882Zi9QwcS— Indian Observer (@ag_Journalist) June 3, 2024 -
అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి
ఖమ్మం సహకారనగర్: బీటెక్ పూర్తిచేశాక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చినా కాదను కున్న యువకుడు ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఇటీవలే కోర్సు పూర్తికాగా, కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు తల్లి దండ్రులూ అమెరికా వెళ్లారు. పట్టా స్వీకరించిన సంతోషంలో స్నేహితులతో కలిసి విహారయాత్ర కు వెళ్లిన ఆ యువకుడు అక్కడి జలపాతంలో మునిగి మృతి చెందగా.. కొడుకు మృతదేహంతో స్వస్థలానికి వెళ్లాలని తెలిసిన ఆ తల్లిదండ్రుల రోదనకు అంతు లేకుండా పోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంలోని మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్ లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్ (24) రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేయగా అమెజా న్లో ఉద్యోగం వచ్చింది. అయినా ఎంఎస్ చదవా లనే లక్ష్యంతో అమెరికా వెళ్లాడు. అక్కడ అరిజోనా యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తిచేసిన ఆయన వారం క్రితం పట్టా స్వీకరించారు. కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు అమెరికా వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అయితే, ఎంఎస్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా అమెరికాలోని ప్రసిద్ధ ఫాసిల్ క్రీక్ జలపాతం వద్దకు రాకేశ్, ఆయన స్నేహితులు ఈనెల 8వ తేదీన వెళ్లారు.జలపాతం వద్ద సరదాగా గడుపుతుండగా రాకేశ్‌తో పాటు మరో యువకుడు ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యలు చేపట్టగా మరుసటిరోజు 25 అడుగుల లోతులో మృతదే హాలు లభించాయి. రాకేశ్‌తో పాటు మృతి చెందిన మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్యతో సన్నిహితంగా ఉన్నందుకే హత్య
రాయికల్: తన భార్యతో సన్నిహితంగా ఉన్నందుకే నాగెల్లి భూమేశ్.. సురేశ్ అనే యువకుడిని హత్య చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శుక్రవారం జరిగిన హత్య నేరానికి సంబంధించిన వివరాలను సోమవారం రాయికల్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. రాయికల్ మండలం తాట్లవాయికి చెందిన నాగెల్లి సురేశ్, నాగెల్లి భూమేశ్ వరుసకు అన్నదమ్ముల్లు. భూమేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో సురేశ్ భూమేశ్ భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా సురేశ్ పట్టించుకోలేదు. 2023 అక్టోబర్‌లో దుబాయ్ నుంచి ఇంటికి వసూ్తనే సురేశ్‌ను చంపాలనే ఉద్దేశంతో వెంట కత్తి తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా భార్యతో సన్నిహితంగా మెలగడాన్ని గమనించాడు. దీంతో సురేశ్‌పై పగ పెంచుకుని, ఎలాగైనా చంపాలని అనుకుని ఈనెల 7న ఉదయం పొలం వద్దకు నీరు పెట్టడం కోసం సురేశ్ వెళ్లడాన్ని గమనించాడు. ప్లాన్ ప్రకారం కత్తిని తీసుకుని తన ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్లాడు. పొలానికి కొద్దిదూరంలో ఉన్న చెరువు కట్టపై ద్విచక్ర వాహనాన్ని పెట్టాడు. తన పొలానికి నీరు పెట్టేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్న సురేశ్‌ను ఆపి తాను పొలానికి వస్తున్నానని చెప్పాడు. పొలం గట్టుదగ్గర ద్విచక్ర వాహనాన్ని ఆపగానే భూమేశ్ వెంట తెచ్చుకుని కత్తితో సురేశ్ తల, మెడపై విచక్షణరహితంగా నరికాడు. కిందపడిన సురేశ్ ప్రాణభయంతో బావి వైపు పరుగెత్తుతుండగా మరోసారి నుదుటిపై, తలపై కత్తితో నరికాడు. దీంతో తీవ్రంగా గాయాలైన సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సురేశ్ మృతదేహాన్ని అదేబావిలోకి తోసేశాడు. కత్తిని కూడా అదే బావిలో పడేశాడు. రక్తం మరకలు శుభ్రం చేసుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికొచ్చి స్నానం చేసి అనంతరం వేములవాడ రాజన్న (శివరాత్రి జాతర) దర్శనానికి వెళ్లాడు. సురేశ్ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే సురేశ్ బావిలో శవమై కనిపించాడు. హత్య విషయాన్ని తెలుసుకున్న రూరల్ సీఐ ఆరీఫ్ అలీఖాన్, ఎస్సై అజయ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సురేశ్ తల్లి నాగేల్లి లక్ష్మి భూమేశ్‌పై అనుమానం ఉందని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భూమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిచ్చిన సమాచారం మేరకు బావిలో పడేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్య సమయంలో వినియోగించి రెండు మొబైల్స్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 48 గంటల్లో నిందితుడిని పట్టుకున్న సీఐ, రాయికల్ ఎస్సైలను డీఎస్పీ అభినందించారు. -
చిన్నప్పటినుంచీ తిండిపెట్టిన వాడినే చంపేసింది!
క్రూర జంతువులు ఎపుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు అనడానికి తాజా ఘటన ఒక ఉదాహరణ. చిన్నప్పటి నుంచి తిండి పెట్టి, తనకు సంరక్షుడిగా ఉన్న వ్యక్తినే దారుణంగా చంపేసింది మగ సింహం. అది ఏ మూడ్‌లో ఉందో తెలియదు గానీ తనకు తిండిపెడుతున్న జూకీపర్‌పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నైజీరియా, ఒసున్ రాష్ట్రంలోని ఒబాఫెమి అవోలోవో యూనివర్శిటీ జంతుప్రదర్శనశాలలో చోటు చేసుకుంది. ఈ సంఘటనతో యూనివర్సిటీ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఒలియావుకి అందరూ నివాళులర్పించారు. బీబీసీ కథనం దాదాపు దశాబ్ద కాలంగా సింహాలకు సంరక్షుడిగా ఉన్నాడు ఒలాబోడే ఒలావుయి (Olabode Olawuyi), విధుల్లో భాగంగా సోమవారం సింహాలకు ఆహారం ఇస్తుండగా జూకీపర్‌పై దాడి చేసి చంపేసింది సింహం. అతడిని రక్షించడానికి అతని సహచరులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. (Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్) ఒలావుయి వెటర్నరీ టెక్నాలజిస్ట్. తొమ్మిదేళ్ల క్రితంక్యాంపస్లో పుట్టిన సింహం సంరక్షణ బాధ్యతల్లో ఉన్నాడు. మరో దురదృష్టకర ఘటన ఏంటంటే, జూకీపర్‌ని చంపిన సింహాన్ని కూడా జూ సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్లు యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ అడెబాయో సిమియోన్ బమిరే వెల్లడించారు. (COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!) తాళం వేయకపోవడంతోనే ఘోరం జూకీపర్ సింహాలకు ఆహారం ఇచ్చిన తర్వాత తలుపు తాళం వేయడం మరచిపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు అబ్బాస్ అకిన్రేమి ,ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఉత్తర నైజీరియాలోని కానోలోని జూలో 50 ఏళ్లకు పైగా సింహాలకు ఆహారం అందిస్తున్న అబ్బా గండు స్పందిస్తూ, ఇది దురదృష్టకరమని, మరిన్ని భద్రతా చర్యలు అవసరమని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ దుర్ఘటన ప్రభావం తనమీద ఉండదనితాను చనిపోయే వరకు సింహాలకు ఆహారం అందిస్తూనే ఉంటానని తెలిపాడు. ( వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..!) -
తిరుపతి జూ ఘటన.. తేలని ప్రశ్నలు!
తిరుపతి (మంగళం): మద్యం మత్తు వల్లే జరిగిందా? సెల్ఫీ కోసమే అంతటి సాహసానికి పూనుకున్నాడా? లేదంటే చావడానికే సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడా?.. తిరుపతి జూ పార్క్ దుర్ఘటనలో పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలివే. రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద గుర్జర్(38) జూ సందర్శనకు వెళ్లి.. సింహానికి బలి కావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. కుటుంబ సభ్యుల్ని విచారిస్తేనే.. ఈ కేసు ముడి వీడుతుందని తిరుపతి పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు, శ్రీ వేంకటేశ్వర జూ సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం.. గుర్జర్ గురువారమే హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చాడు. మధ్యాహ్న సమయంలో సిబ్బంది వారిస్తున్నా వినకుండా.. సింహాల ఎన్‌క్లోజర్ వైపు వెళ్లే యత్నం చేశాడు. తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి లోపలికి దూకాడు. కొంత దూరంలోని వాటర్‌ట్యాంక్ మీదుగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అంతటితో ఆగకుండా.. వంద మీటర్ల దూరంలో ఉన్న సింహాన్ని చూసి గట్టిగా అరిచాడు. జూలో మూడు సింహాలు ఉన్నాయి. వాటిల్లో దుంగాపూర్ అనే సింహం తనవైపు చూడగానే తొడగొట్టి పిలిచాడు. సింహం కూడా అంతే వేగంగా స్పందించింది. అది తనవైపు రావడంతో భయంతో ఉలిక్కిపడ్డాడు. పక్కనే ఉన్న చెట్టెక్కే ప్రయత్నంలో కాలుజారి కిందపడ్డాడు. వెంటనే సింహం ప్రహ్లాద్ గుర్జర్ మెడను నోటితో పట్టుకుని వంద మీటర్లకుపైగా దూరం లాక్కెళ్లి చంపేసింది. సిబ్బంది గమనించి పరుగున వచ్చి సింహాన్ని బోనులో బంధించాడు. కానీ, ఈలోపే అంతా జరిగిపోయింది. ఎస్వీ జూ పార్క్ లో సింహం దాడిలో మృతి చెందిన ప్రహ్లాద్ గుల్జార్ డెడ్ బాడీ రుయా మార్చురీకి తరలించారు పోలీసులు. ఆధార్ కార్డు ఆధారంగా రాజస్థాన్‌లో ప్రహ్లాద్ కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే అంత ఎత్తులో ఉన్న కంచె ఎక్కి లోపలికి దూకేంత సాహసం చేయడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో ఉన్నా.. అంత ఎత్తును అంత చాకచక్యంగా దూకడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రహ్లాద్ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు సిబ్బంది చెప్పడం లేదు. పైగా శవ పరీక్షలో మద్యం తీసుకున్న ఆనవాళ్లపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ప్రహ్లాద్ మానసిక స్థితి సరిగ్గా లేదా? లేదంటే ఇతర సమస్యలు ఏమైనా ఉండి ఆత్మహత్యకు యత్నించాడా? అనే కోణంలోనూ విచారించాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేశామని.. కుటుంబీకులు వస్తేనే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. -
రాత్రి మిస్సింగ్.. తెల్లారేసరికి శవమై
బంజారాహిల్స్: అనుమానాస్పదస్థితిలో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుర్గాభవానీనగర్ బస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–5లోని దుర్గాభవానీనగర్ బస్తీకి చెందిన మునావత్ కార్తీక్ (10) సెయింట్ మేరీస్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం రాత్రి ఆడుకునేందుకు వెళుతున్నట్లు తల్లిదండ్రులు రమేష్, కవితకు చెప్పి బయటికి వెళ్లాడు. అతను తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. కాగా బుధవారం ఉదయం సమీపంలోని జీహెచ్ఎంసీ పార్కులోని నాలాలో కార్తీక్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అతడు ఎలా మృతి చెందాడనే విషయమై దర్యాప్తు చేపట్టారు. వరదనీటి కాలువ పైకప్పు లేకపోవడంతో ప్రమాదవశాత్తూ అందులో పడి మృతి చెంది ఉంటాడా? ఇంకేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. రాత్రి అదృశ్యమైన కుమారుడు తెల్లారేసరికి విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బైక్.. క్షణంలో ఇద్దరూ..
అనంతపురం: అతివేగం ఇద్దరిని బలిగొంది. కరిడికొండ శివారు 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగి, మరొకరు చిరు వ్యాపారి ఉన్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలోని కళాకారుల కాలనీకి చెందిన మల్లికార్జున, శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. చిన్న కొడుకు కురువ భువనచంద్ర (29) హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం స్నేహితుడి బుల్లెట్ బైక్ తీసుకుని అనంతపురం బయల్దేరాడు. ఆటోలో పల్లెలు తిరుగుతూ స్టీలుసామాన్లు, మిక్సీలు విక్రయిస్తూ జీవనం సాగించే బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి చెందిన సలార్‌బాషా (55) అర్ధరాత్రి వేళ గుత్తి మండలం కరిడికొండ జాతీయ రహదారి సమీపంలో ఆగాడు. ఇటు వైపు నుంచి అటువైపు ఉన్న ధాబా వద్దకు వెళ్లేందుకని నడుచుకుంటూ రోడ్డు డివైడర్‌పైకి చేరుకున్నాడు. అక్కడ చెట్ల మధ్య నుంచి కిందకు కాలు పెట్టగానే అల్లంత దూరాన 130 కిలోమీటర్ల వేగంతో బైక్‌పై వస్తున్న భువనచంద్ర వేగాన్ని అదుపు చేయలేకపోయాడు. బైక్ ఢీకొని సలార్‌బాషా వంద అడుగుల దూరం ఎగిరి కిందపడగా.. భువన చంద్ర 50 అడుగుల మేర గాల్లోకి ఎగిరి పడ్డాడు. స్థానికులు ప్రమాద విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని.. అచేతనావస్థలో ఉన్న ఇద్దరినీ గుత్తి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల్లో సలార్బాషాకు భార్య రషీదా, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. భువనచంద్ర అవివాహితుడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరుతున్న బైక్ రేసర్ల ఆగడాలు.. గుత్తి శివారు 44వ నంబర్ జాతీయ రహదారిపై బైక్ రేసర్లు పేట్రేగిపోతున్నారు. హైదరాబాద్–బెంగళూరు మధ్య శని, ఆదివారాల్లో వందలాదిమంది బైక్ రేసర్లు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 250 సీసీ నుంచి 500 సీసీ సామర్థ్యం కలిగిన బుల్లెట్, హోండా, యమహా బైక్‌లను రేసర్లు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఆరు గంటల్లో వెళ్లాలని బెట్టింగ్ వేసుకుని.. వేగంతో పోటీపడుతూ వారితో పాటు ఇతరులనూ ప్రమాదాల్లోకి నెడుతున్నారు. జాతీయ రహదారిపై పోలీసులు నిఘా ఉంచి బైక్ రేసర్ల ఆగడాలను అరికట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. -
పరోట తిని వ్యక్తి మృతి
అన్నానగర్: పరోట తిన్న కొద్దిసేపటికే ఛాతి నొప్పితో వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని సిత్తర్పట్టికి చెందిన రామకృష్ణన్ (39) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ సదురగిరిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో లారీ డ్రైవర్‌గా చేరాడు. అదే పట్టణానికి చెందిన వీరముత్తు, రామకృష్ణన్ లారీలో సరుకులు ఎక్కించుకుని నిలకోటై సమీపంలోని విలంపట్టి ప్రైవేట్ మిల్లుకు వచ్చారు. గురువారం రాత్రి ఇద్దరూ అక్కడున్న ఓ కేఫ్‌లో పరోటా తిన్నారు. కొద్దిసేపటికి రామకృష్ణన్‌కు ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. వెంటనే చికిత్స నిమిత్తం నిలకోటై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు. అతని తల్లి ఇన్బవల్లికి.. పోలీసులకు సమాచారం అందించారు. విలంపట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాపారంలో నష్టం వచ్చిందని..తనువు చాలించిన యువకుడు..
నల్గొండ: వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకొని మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం డిండి మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఏటెల్లి మల్లేష్(25) హైదరాబాద్‌లో ఉంటూ కారు నడపడంతో పాటు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతడు చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో మూడు రోజుల క్రితం అతడు స్వగ్రామమైన సింగరాజుపల్లికి వచ్చాడు. మంగళవారం గ్రామ శివారులోని ఇతరుల వ్యవసాయ పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటువైపుగా వెళ్తున్న రైతులు గమనించి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, చిన్న పాప ఉంది. కాగా ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సైదులు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com మద్యానికి బానిసై బలవన్మరణం మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొనిఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం దేవరకొండ మండల పరిధిలోని ఉచ్చరాలతండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉచ్చరాలతండాకు చెందిన జపుల హరి(31) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన హరి తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో హరి సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకన్నాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
తాగుడుకు పైసలు లేవని.. ఓ వ్యక్తి తీవ్ర నిర్ణయం..
నల్గొండ: మద్యం తాగడానికి డబ్బులు లేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మునుగోడు మండలంలోని కొరటికల్ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కొరటికల్ గ్రామానికి చెందిన బోడిశ సత్తయ్య(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సత్తయ్య మద్యానికి బానిసయ్యాడు. సోమవారం రాత్రి మద్యం తాగేందుకు అతడి వద్ద డబ్బులు లేకపోడంతో తట్టుకోలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తయ్య కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి అప్పటికే అతడు మృతిచెందాడు. మృతుడి కుమారుడు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి విద్యుత్ స్తంభాల లోడ్‌తో వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని నీలంనగర్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలంలోని ఆలగడప నుంచి గద్వాల్ జిల్లాకు విద్యుత్ స్తంభాలు లోడ్‌తో వెళ్తున్న లారీ పెద్దఅడిశర్లపల్లి మండలం నీలంనగర్ సమీపంలో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభాలు తీసుకెళ్తున్న లారీ క్లీనర్ గుగులోతు నితిన్(20) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. తీవ్రగాయాలైన అతడిని స్థానికులు 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి సక్రాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
శవమై తేలిన ధర్మతేజ
కరీంనగర్: ఎన్టీపీసీకి చెందిన పలువురు యువకులు ఈనెల 8వ తేదీన బర్త్ డే పార్టీ చేసుకునేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వచ్చారు. కేక్ కట్ చేసి విందు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు మిత్రులు గోదావరినదిలో స్నానానికి దిగారు. ఈక్రమంలో కనకమేడల ధర్మతేజ(32) నీటిలో గల్లంతైన విషయం తెలిసిందే. 48 గంటల పాటు గోదావరినదిలో జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం మృతదేహం లభించింది. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతుడి బంధువులకు అప్పగించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు అంతర్గాం ఎస్సై బోగె సంతోష్‌కుమార్ తెలిపారు. -
ఉదయం అదృశ్యం.. రాత్రికి మృతదేహం
హైదరాబాద్: జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన నన్నపనేని కార్తీక్ (28) నగరంలోని ఓ టీవీ చానెల్లో కెమెరామన్‌గా పని చేస్తున్నాడు. ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్ కాలనీలో మహిపాల్, భీమా ప్రవీణ్‌తో కలిసి అద్దె గదిలో ఉంటున్నాడు. ఈ నెల 2న ఉదయం కార్తీక్ ఉద్యోగానికి వెళ్తున్నట్లు స్నేహితులకు చెప్పి తన బైక్‌పై బయలుదేరాడు. రాత్రి తిరిగి రాకపోయేసరికి రూమ్మేట్ ప్రవీణ్ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని రావడంతో రాత్రంతా వెతికారు. ఈ నెల 3న కూడా గదికి రాకపోయేసరికి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కార్తీక్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలిస్తున్న సమయంలో మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ చెరువులో పడి కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందింది. మంగళవారం సాయంత్రం శామీర్‌పేట్ చెరువు వద్ద బైక్‌తో పాటు కార్తీక్ మొబైల్ ఫోన్ పోలీసులకు కనిపించింది. దీని ఆధారంగా కార్తీక్ అడ్రస్‌ను కనిపెట్టి ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం తెల్లవారుజామున కార్తీక్ మృతదేహం ఒడ్డుకురావడంతో అదే విషయాన్ని ఫిలింనగర్ పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్ ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
దెయ్యం పట్టిందని క్షుద్రపూజలు.. యువకుడు మృతి
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో క్షుద్రపూజలు వికటించి ఓ యువకుడు మృతిచెందాడు. చెన్నూర్ పట్టణం బొక్కగూడెం కాలనీకి చెందిన దంపతులు దాసరి లచ్చన్న, లక్ష్మి కుమారుడు మధు (33) గత 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంచిర్యాలలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడలేదు. మధుకు చేతబడి అయిందని బంధువులు చెప్పడంతో శనివారం సాయంత్రం సీసీసీ నస్పూర్ ప్రాంతానికి చెందిన క్షుద్ర మాంత్రికుడిని ఆశ్రయించారు. ఇంటి వద్ద పూజల్లో భాగంగా మధుపైనుంచి కోడిని తిప్పడంతో అది చనిపోయింది. దీంతో దెయ్యం పట్టిందని, పెద్ద పూజలు చేయాలంటూ చెప్పడంతో ఆదివారం చెన్నూర్ గోదావరి ఒడ్డున మేకతోపాటు పలు క్షుద్రపూజలకు సంబంధించిన సామగ్రితో వెళ్లారు. పూజలు చేసే క్రమంలో మాంత్రికుడు మధుకు గుగ్గిలం (సాంబ్రాణి) పొగ వేసి పైనుంచి దుప్పటి కప్పినట్లు తెలిసింది. పొగతో మధు స్పృహ కోల్పోయి కాసేపటికే మృతిచెందాడు. దీంతో సదరు మాంత్రికుడు పారిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని రాత్రి ఇంటికి తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియల కోసం గోదావరి నదికి తీసుకెళ్లారు. పోలీసులకు విషయం తెలియడంతో నది వద్దే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీఐ వాసుదేవరావును సంప్రదించగా.. క్షుద్రపూజలతో మృతిచెందాడన్న సమాచారం మేరకు పోస్టుమార్టం చేయించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని వివరించారు. చదవండి: చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్ తెరిస్తే.. షాక్‌తో చిన్నారి మృతి -
గణేష్ నిమజ్జనంలో అపశృతి.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో..
సాక్షి, ఖమ్మం: పెనుబల్లి మండలం పాత కారాయిగూడెంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ దూదిపాళ్ల సత్యనారాయణ అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వైద్యం కోసం తిరువూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
భీమవరంలో యువకుడి హత్య
సాక్షి, భీమవరం: భీమవరంలో పట్టపగలు యువకుడి హత్య సంచలనం రేపింది. రౌడీషీటర్లకు సత్ప్రవర్తనపై కౌన్సెలింగ్ ఇచ్చి గంట గడవక ముందే ఈ హత్య జరిగింది. భీమవరం రెండో పట్టణం బలుసుమూడి గాంబీర్దొడ్డికి చెందిన బెవర విజయ్‌బాబు (23)ను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. గతేడాది డిసెంబర్ 24న జరిగిన రౌతుల ఏసు హత్య కేసులో విజయ్‌బాబు నిందితుడు. రౌడీషీటర్లకు భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ద్విచక్రవాహనంపై వెళ్తున్న విజయ్‌బాబు, గోవిందరావును గొల్లవానితిప్ప రోడ్డులోని దుర్గాలక్ష్మి ఆలయ సమీపంలో కారుతో ఢీకొట్టగా బైక్ నడుపుతున్న విజయ్‌బాబు కిందపడిపోయాడు. సోదరుడు గోవిందరావు పక్కనే ఉన్న పంటకాలువలోకి దూకి అవతలి గట్టుకు చేరుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. హంతకుల్లో ఒకరి అరెస్టు ఢీకొట్టిన అనంతరం కారు విజయ్‌బాబును కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. దుండగులు అతనిపై కత్తులతో దాడి చేసి తల, మెడపై విచక్షణారహితంగా నరకడంతో విజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారులో నలుగురు, రెండు మోటార్‌సైకిళ్లపై వాహనాల్లో నిందితులు వెంబడించినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం కారు పట్టణం వైపు వెళ్లినట్లు పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. హత్య ఘటన తెలిసిన వెంటనే ఎస్సై అప్పారావు, ఏఎస్సై బాజీ ఒక యువకుడ్ని వెంటాడి పట్టుకోగా ఆ యువకుడి చేతిలో హత్య సమయంలో ఉపయోగించిన కత్తి ఉన్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన యువకుడు భీమవరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించాడు. మృతుడిపై రౌడీషీట్ ఉందని, హత్యకు కారణాలు సేకరిస్తున్నామన్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామన్నారు. రూరల్ సీఐ సీహెచ్ నాగప్రసాద్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వీడియో: విధిని ఎవరూ ఎదురించలేరు.. ఇదే ఉదాహరణ..
ఘజియాబాద్: ఇటీవలి కాలంలో గుండెపోటు కారణంగా ఎంతో మంది అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వర్కవుట్ చేస్తూ సడెన్‌గా కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ కాలేజీ యువకుడు జిమ్‌లో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. గజియాబాద్‌కు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సిద్దార్థ్ కుమార్ సింగ్(19) అనే యువకుడు శనివారం జిమ్‌కు వెళ్లి వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా.. సడెన్‌గా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో, అక్కడే ఉన్న జిమ్‌లో మరో ఇద్దరు వ్యక్తులు సింగ్ దగ్గరకు వచ్చి అతడిని పైకి లేపే ప్రయత్నం చేశారు. అనంతరం, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సింగ్ పరిశీలించిన వైద్యులు.. సిద్ధార్థ్ అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. A 19 years old boy died while running on trademill in the gym at #Ghaziabad #gym #Running pic.twitter.com/jsOa0aA3C3 — Gulshan Nandaa (@Gulshann_nandaa) September 16, 2023 ఇక, జిమ్‌లో సిద్దార్థ్ మృతిచెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగ్ మృతితో పేరెంట్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, సిద్ధార్ధ్ వారి పేరెంట్స్‌కు ఒక్కడే కుమారుడు. సిద్ధార్థ్ తన తండ్రితో ఘజియాబాద్‌లో ఉంటుండగా.. అతని తల్లి బీహార్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. సింగ్ మృతికి 10 నిమిషాల ముందే తన తల్లితో మాట్లాడాడు. ఇంతలోనే ఇలా జరగడంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇది కూడా చదవండి: భిక్షమెత్తుకొని పొట్టనింపుకునేది.. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్‌గా సూపర్ క్రేజ్ -
చెంపదెబ్బకి అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడ్డాడు.. తర్వాత..
ముంబై: ముంబైలోని సియోన్ రైల్వే స్టేషన్లో భార్యా భర్తలు ఒక వ్యక్తితో ఘర్షణకు దిగారు. వివాదం కాస్తా పెద్దది కావడంతో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగి భర్త బలంగా చెంపదెబ్బ కొట్టడంతో ఆ వ్యక్తి అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. క్షణాల వ్యవధిలో ఆ ట్రాక్‌పైకి వచ్చిన ఓ రైలు ఆ వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ వివరమంతా అక్కడి సీసీటీవీ ఫుటేజిలో స్పష్టంగా రికార్డయ్యింది. పోలీసులు భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సియోన్ రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి 9.15 ప్రాంతంలో భార్యా భర్తలు అవినాష్ మానే(35), శీతల్ మానే(31) అక్కడ ప్లాట్‌ఫారంపై మంఖార్డ్ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే మృతుడు దినేష్ రాథోడ్(26) ఆమెను వెనక నుంచి తోశాడని ఆరోపిస్తూ గొడవకు దిగింది. బాధితుడిపై గొడుగుతో కూడా దాడి చేసింది. పక్కనే ఉన్న భర్త కూడా భార్యకు జతకలిసి ఇద్దరూ కలిసి దినేష్ పై దాడి చేశారు. ఈ క్రమంలో అవినాష్ మానే దినేష్ ను బలంగా చెంప దెబ్బ కొట్టడంతో అదుపుతప్పి రైలు పట్టాలపై పడిపోయాడు. దినేష్ ప్లాట్‌ఫారంపైకి తిరిగి ఎక్కే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకపోయింది. చుట్టూ ఉన్నవారు దినేష్ కు సాయం చేద్దామని ముందుకు వచ్చే లోపు రైలు వస్తుండటాన్ని చూసి వారంతా వెనకడుగు వేశారు. రెప్పపాటులో ఆ ట్రాక్ పైకి వచ్చిన రైలు వేగంగా దూసుకొచ్చి దినేష్ పైనుండి వెళ్ళిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే భార్యా భర్తలు అక్కడి నుండి జారుకుని వారి నివాసమైన ధారావికి పారిపోయారు. అక్కడున్న వారు ఇచ్చిన సమాచారంతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మొదట అవినాష్ ను తర్వాత శీతల్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల -
క్షణాల్లో మాయమైతివా బిడ్డా..
గొల్లపల్లి(ధర్మపురి): ‘క్షణాల్లో మాయమైతివా బిడ్డా’అంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అప్పటి వరకు బాగానే ఉన్న యువకుడు కళ్లముందే కుప్పకూలడం, ఆపై ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల వివరాలు.. గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఓరుగంటి సరోజన– మల్లేశం దంపతులకు అరుణ్(18), కూతురు అక్షిత సంతానం. అరుణ్ జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కళాశాలో డిగ్రీ రెండో సంవత్సరం, కూతురు గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకునే దంపతులు పిల్లలను ఉన్నంతలో చదివిస్తున్నారు. అరుణ్ గురువారం మధ్యాహ్నం మినరల్ వాటర్ తీసుకొచ్చేందుకు వెళ్లాడు. నీటిని క్యాన్‌లో పడుతున్న క్రమంలో అక్కడే ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయాడు. మరోసారి బలవంతంగా లేచి నిలుచునే క్రమంలో మళ్లీ కుప్పకూలాడు. క్షణాల్లో కుప్పకూలడం, ఆపై ప్రాణాలు పోవడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. అయినా ఆందోళనలో ఉన్న స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, కిందపడిపోవడంతో శ్వాస ఆగి చనిపోయాడని ధ్రువీకరించారు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించగా, వారిని ఆపడం ఎవరితరం కాలేదు. -
స్నేహితుడికి సెండాఫ్ ఇచ్చి వస్తూ..
రఘునాథపల్లి/హన్మకొండ: ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్తున్న స్నేహితుడికి ఆనందంగా వీడ్కోలు పలికి తిరిగి వస్తున్న ఆ యువకులు రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు వెళ్లారు. రహదారి పక్కన పార్కింగ్ చేసిన లారీని.. బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు స్నేహితులు రాకేశ్ చంద్ర గౌడ్ (29), సందీప్ (32) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిలోని కోమళ్ల టోల్గేట్ సమీపంలో శనివారం ఉదయం దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం హన్మకొండ గాంధీనగర్‌కు చెందిన వడ్లకొండ నరేందర్, రమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు రాజ్‌కుమార్ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. చిన్న కుమారుడు రాకేశ్ చంద్ర గౌడ్ (29) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. 2020లో ములుగుకు చెందిన నందినితో వివాహమైంది. వీరికి 9 నెలల బాబు ఉన్నాడు. అలాగే, నయీంనగర్‌కు చెందిన వడ్డెపల్లి ఉపేందర్, అనసూయ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు విజయ్ కిరాణం షాపు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు క్రాంతి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. రెండో కుమారుడు సందీప్ (32) బీటెక్ చదివి బిల్డర్‌గా కొనసాగుతున్నాడు. నిజామాబాద్‌కు చెందిన పరిమళతో 2018లో వివాహమైంది. వీరికి 18 నెలల చిన్నారి ఉంది. లారీ రూపంలో కబళించిన మృత్యువు.. యూఎస్ఏ వెళ్తున్న తమ స్నేహితుడికి సెండాఫ్ ఇచ్చేందుకు రాకేశ్ చంద్ర గౌడ్, సందీప్ శుక్రవారం రాత్రి బొలెరోలో వెళ్లారు. పెంబర్తి రిసార్ట్‌లో స్నేహితుడితో గడిపి శనివారం ఉదయం 5 గంటలకు హన్మకొండకు బయలు దేరారు. కోమళ్ల టోల్గేట్ సమీపంలోని మలుపు వద్ద లారీ డ్రైవర్.. నిబంధనలు పాటించకుండా రహదారిపై లారీని నిలిపాడు. ముందు నిలిచి ఉన్న లారీని గుర్తించక బొలెరో ఢీకొంది. దీంతో లారీ కిందికి చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో ముందు సీట్లలో కూర్చున్న ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న సీఐ ఆర్ సంతోష్ , ఎస్సై రఘుపతి సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, స్నేహితులు ఇద్దరు ఒకేసారి మృతి చెందడం.. పైగా ఇద్దరికి రెండేళ్లలోపు చిన్నారులు ఉండడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. రాకేశ్ గౌడ్ తండ్రి నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. ఇష్టారాజ్యంగా పార్కింగ్.. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు.ఈ జాతీయ రహదారిపై నిర్ణీత ప్రాంతాల్లోనే వాహనాలు నిలపాలి. ఇందుకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా లారీలు పార్క్ చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి ఇసుక తీసుకువచ్చే పదుల సంఖ్యలో లారీలను కోమళ్ల టోల్గేట్ సమీపంలో ఇరువైపులా రోడ్డు పక్కన నిలుపుతున్నారు. అదే ఇప్పుడు ప్రమాదానికి కారణమైంది. లారీలను అక్రమంగా పార్కింగ్ చేస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదనే విషయం అనుమానాలకు తావిస్తోంది. -
ఉజ్జయినీ మహంకాళీ బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో అపశ్రుతి నెలకొంది. లష్కర్ బోనాల ఉత్సావాల్లో భాగంగా పలహార బండ్ల ఊరేగింపులో విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్‌గా(23) గుర్తించారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆకాష్.. ఆదివారం రాత్రి విద్యుత్ స్తంభాన్ని ముట్టుకోవడంతో షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ మార్చురీ తరలించారు. కాగా నిన్న రాత్రి కురిసిన వర్షం కారణంగా కరెంట్ పోల్‌కు పవర్ రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్కవాణి వినిపించారు. ఈ ఏడాది అగ్ని ప్రమదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వర్ణలత చెప్పారు. కాస్తా ఆలస్యమైనా మంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయందోళన చెందవద్దని అన్నారు. చదవండి: ఈటల, అర్వింద్‌కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం -
Karimnagar: గుండెపోటు.. వ్యక్తి ప్రాణాలు బలిగొన్న రైల్వేగేటు..
సాక్షి, కరీంనగర్: కూతురు గురుకులం విద్యాలయంలో పదోతరగతి చదువుతోంది. రెండో శనివారం కావడంతో విద్యాలయంలో పేరెంట్స్‌డే నిర్వహించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురును చూసేందుకు ఆ తండ్రి విద్యాలయానికి వచ్చాడు. ఇంటినుంచి తీసుకెళ్లిన ప్రత్యేకమైన వంటకాలు కూతురుకు తినిపించాడు. అంతలోనే విధి వక్రీకరించిందేమో.. ఆ తండ్రి గుండెపోటుతో అల్లాడిపోయాడు. వెంటనే పాఠశాల సిబ్బంది అతడిని కరీంనగర్ తరలించారు. అక్కడ మరోసారి విధి అతడిని చిన్నచూపు చూసింది. అప్పుడే కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని తీగలగుట్టపల్లి రైల్వే గేటు పడింది. సుమారు 15 నిమిషాలు ఆలస్యమైంది. ఆసుపత్రిలో చేర్చగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు.. మండలంలోని మల్లాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం విద్యాలయంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన భూపెల్లి విజయ్, సుధీవన కూతురు స్పందన పదో తరగతి చదువుతోంది. రెండో శనివారం కావడంతో విద్యాలయంలో పేరెంట్స్ డే నిర్వహించారు. దీంతో విజయ్, సుధీవన దంపతులు ఉదయమే కూతురు కోసం ప్రత్యేకమైన వంటకాలు తయారు చేసుకుని విద్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం కూతురుతో కలిసి భోజనం చేశారు. అదే సమయంలో వర్షం రావడంతో ప్రిన్సిపాల్ గిరిజ తల్లిదండ్రులందరరినీ హాల్లోకి రావాలని సూచించారు. హాల్లోకి వచ్చి విజయ్ కూర్చుంటున్న క్రమంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ సుంచు మల్లేశం, విజయ్ భార్య సుధీవన చికిత్స కోసం అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించారు. కరీంనగర్ వద్ద ఉన్న రైల్వేగేట్ అప్పుడే పడటంతో సుమారు 15 నిమిషాలపాటు విజయ్ అంబులెన్స్‌లోనే కొట్టుమిట్టాడాడు. తీరా ఆసుపత్రిలో చేర్చాక.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కరీంనగర్లో గేట్ పడకుంటే విజయ్ బతికేవాడని మల్లేశం తెలిపారు. మృతదేహం వద్ద కూతురు స్పందన రోదించిన తీరు కలచివేసింది. కుటుంబసభ్యులు, రోదనలతో స్తంభంపల్లిలో విషాదం నెలకొంది. కాగా కరీంనగర్ వద్ద రైల్వే గేటుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై బ్రిడ్జ్ నిర్మించాలని గత తొమ్మిదేళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని ఆసుపత్రులకు ఉమ్మడి జిల్లాతోపాటు, ఆదిలాబాద్ జిల్లా నుంచి రోగులను అంబులెన్స్‌ల్లో కరీంనగర్ తీసుకు వచ్చినా గేటుతో ఇబ్బందులు పడ్డ సందర్భారాలున్నాయి. అంబులెన్స్‌లో తీసుకు వచ్చిన రోగులు గంటల కొద్ది గేటు పడడంతో గతంలో పలువురు రోగులు మరణించిన సందర్భాలు ఉన్నాయి, తాజాగా ఆర్వోబీ నిర్మాణం చేపట్టకపోవడంతో పరిస్థితి ఎలా ఉందో చెబుతూ ఆంబులెన్స్ దృశ్యాల్ని మొబైల్ కొంతమంది చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
అమెరికా ఫ్లోరిడాలో తెలుగు వ్యక్తి మృతి
-
‘వందే భారత్’ ఢీకొని యువకుడు మృతి.. ఎక్కడంటే..
వారణాసి నుంచి ఢిల్లీ వెళుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని టూండలా వద్ద చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జలేసర్-పోరా మధ్య రైలు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇదేమీ మొదటిది కాదు.. ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగంగా వెళుతోంది. ఈ సమయంలో ఆ యువకుడు పట్టాలు దాటుతుండగా, అటువైపుగా వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆ యువకుడిని ఢీకొంది. సంఘటనా స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. కాగా వందే భారత్ ఎక్సెప్రెస్ కారణంగా గతంలోనూ పలు ప్రమాదాలు జరిగాయి. ఇదేమీ మొదటిది కాదు. పలుమార్లు ట్రాక్‌పైకి పశువులు వచ్చిన కారణంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ముందుభాగం స్వల్పంగా ధ్వంసమయ్యింది. అలాగే ఈ రైలు వేగం కారణంగా రైలును ఢీకొనడంతో పలు పశువులు మృతి చెందాయి. ఐదు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను స్వాగతించిన ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఐదు వందేభారత్ రైళ్లను స్వాగతించారు. భోపాల్‌లో ఈ రైళ్లకు పచ్చజెండా చూపారు. వీటిలో మొదటి రైలు కమలాపతి- జబల్పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్. రెండవ వందేభారత్ ఖజురహో నుంచి భోపాల్ మధ్య ఇండోర్ మీదుగా నడవనుంది. ఇదేవిధంగా గోవాలోని మడ్గావ్ నుంచి ముంబైకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు మొదలయ్యాయి. నాల్గవ వందేభారత్ ధార్వాడ- బెంగళూరు మధ్య నడవనుంది. ఇది కూడా చదవండి: బ్యాంకు డిపాజిట్ ఫారంలో.. ‘ఇదేందయ్యా ఇది..’ -
మూడేళ్ల క్రితం కులాంతర వివాహం.. యువకుడి దారుణ హత్య
తూర్పు గోదావరి: నిద్ర పోతున్న ఓ యువకుడిపై గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి, హత మార్చిన ఘటన నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సమిశ్రగూడెం గ్రామానికి చెందిన షేక్ హఫీజ్ (23) అదే గ్రామానికి చెందిన తలారి భవానీ(హసీనా)ని ప్రేమించి, మూడేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి హఫీజ్ పెద్దలు అంగీకరించలేదు. దీంతో అతడు భార్య హసీనా ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులందరూ ఇంట్లోను, ఆరుబయట మంచంపై హఫీజ్ ఒక్కడూ పడుకున్నారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హఫీజ్ ముఖంపై బలవంతంగా నొక్కి, తల వెనుక వైపు పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చారు. రక్తమడుగులో ఉన్న భర్త హఫీజ్‌ను చూసి భార్య హసినా కేకలు వేయగా, ఇరుగుపొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని కొవ్వూరు డీఎస్పీ వీఎస్ఎన్ వర్మ, సీఐ కె.వెంకటేశ్వరరా పరిశీలించారు. హఫీజ్ పనీ పాట లేకుండా స్థానికంగా యువకులతో కలిసి పలు గొడవలకు వెళ్తూండటంతో పాత కక్షల నేపథ్యంలో దుండగులు అతడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా ట్రైనీ ఐపీఎస్ పంకజ్‌కుమార్ పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహితతో చనువుగా... యువకుడు మృతి
నరసన్నపేట: మడపాం పంచాయతీ కొత్తపేట గ్రామానికి చెందిన తోట కృష్ణ (35) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈయన మృతదేహం మేజరు పంచాయతీ నరసన్నపేట మారుతీనగర్–1లోని సాయి మందిరం వద్ద పోలీసులు గుర్తించారు. కృష్ణ మృతికి స్పష్టమైన కారణాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతని కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎవరో మృతి చెంది ఉన్నట్లు పోలీసులకు శనివారం ఉదయం సమాచారం వచ్చింది. వెంటనే ఎస్ఐ వై.సింహాచలం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఫోను లభించచడంతో దాని ద్వారా మృతుని ఆచూకీ తెలుసుకున్నారు. కొత్తపేటకు చెందిన తోట కృష్ణగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి సాయమ్మలు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని గుర్తు పట్టారు. కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. మహిళపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెనే తమ కుమారుడు కృష్ణను హత్య చేసి ఉంటుందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా కృష్ణ నరసన్నపేట మారుతీనగర్ ప్రాంతానికి చెందిన వివాహితతో చనువుగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే ఆయన మృతికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. కృష్ణ శుక్రవారం సాయంత్రం పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని.. రాత్రికి రాలేదని, ఉదయానికే పోలీసులు ఫోను చేస్తే తెలిసిందని మృతుని తండ్రి లక్ష్మీనారాయణ విలేకరులకు తెలిపారు. కృష్ణ గతంలో ఆటో నడిపే వాడ ని.. ప్రస్తుతం టోల్గేట్లో పని చేస్తున్నట్లు చెప్పారు. 2017లో ఈదులవలసకు చెందిన హారికతో కృష్ణకు వివాహమైంది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. వారం క్రితమే సీమంతం చేశారు. కాగా వివాహిత ఇంటి వెనుక భాగంలో మృతదేహం లభించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మేడ పైనుంచి దూకడం వల్ల మృతి చెందాడా.. లేదా వివాహిత ఇంట్లో వాళ్లు ఏదో చేసి కిందకు పడేశారా అనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ బాలచంద్రరెడ్డి, సీఐ డి.రాములు పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లే.. బిడ్డా.. మమ్మల్ని ఇంత తొందరగా వదిలి వెళ్లావా..నాయనా!
కెరమెరి(ఆసిఫాబాద్): లే.. బిడ్డా.. మమ్మల్ని ఇంత తొందరగా వదిలి వెళ్లావా..నాయనా! మేమేం పాపంచశామని ఆ దేవుడు ఇంత అన్యా యం చేసిండు.. ఇక ఎవరిని కొడుకా! అని పిలవాలి నాన్నా.. అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు అక్కడివారిని కంటతడిపెట్టించాయి. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుతాడనుకుంటే.. కారు రూపంలో మృత్యువు వెంటాడింది.. ఆసిఫాబాద్ మండల కేంద్రంలో కెస్లాపూర్‌లోని హనుమాన్ విగ్రహం సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గేడాం వేణు(27) తీవ్రంగా గాయపడగా చంద్రాపూర్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో పది నిమిషాలు ఆలస్యం కావడంతో మృతిచెందాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం... ఆసిఫాబాద్‌లోని ఎస్జీవో కాలనీలో నివాసముంటున్న గేడాం నాగేశ్వర్, నిర్మల దంపతులకు ఒక కొడుకు.. ఇద్దరు కూతుర్లు. కుమారుడు వేణుగోపాల్ కెరమెరి మండలంలోని రకంజివాడ గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం బైక్ సర్విసింగ్ కోసం మేణుగోపాల్తో పాటు అనార్పల్లి గ్రామ కార్యదర్శి ప్రశాంత్ మంచిర్యాలకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఆసిఫాబాద్‌లోని కెస్లాపూర్ హనుమాన్ విగ్రహం సమీపంలోకి రాగానే వీరి బైక్‌ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వేణుగోపాల్, ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం ప్రశాంత్‌ను మంచిర్యాలకు తరలించగా, వేణుగోపాల్‌ను చంద్రాపూర్ ఆస్పత్రికి తరలించారు. పది నిమిషాల ఆలస్యంతో... వేణుగోపాల్‌ను చంద్రాపూర్ ఆస్పత్రికి ప్రైవేటు అంబులెన్స్‌లో తరలిస్తుండగా రాజురా వద్ద టైర్ పంక్చర్ అయింది. దీంతో సుమారు 20నిమిషాల సమయం వృథా అయింది. ఆస్పత్రికి చేరుకుని అంబులెన్స్ నుంచి స్ట్రేచర్‌పై పడుకొపెట్టే సరికి ప్రాణాలు వదిలాడు.. పరీక్షించిన వైద్యులు పది నిమిషాల ముందు తీసుకువస్తే బతికేవాడని తెలిపారు. కాగా అంబులెన్స్‌లో ఆక్సిజన్ ఉన్నా పెట్టకపోవడంతో శ్వాస ఆడలేదని, టైరు పంక్చర్ కావడంతో సమయానికి ఆస్పత్రికి చేరలేక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. పలువురి పరామర్శ మరణవార్త తెలియగానే కెరమెరి ఎంపీపీ పెందోర్ మోతిరాం, జెడ్పీటీసీ సెడ్మకి దుర్పతబాయి, ఎంపీడీవో సత్యనారాయణగౌడ్, ఎంపీవో సుదర్శన్, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, ఎంపీడీవో సిబ్బంది సుధాకర్, నాయకులు రూప్‌లాల్, శేశారావు, గ్రామ కార్యదర్శులు పార్థివ దేహానికి పుష్పగుచ్ఛం సమర్పించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
‘అన్నా.. అమ్మానాన్నను బాగా చూసుకో’
హైదరాబాద్: రెండు సెల్ఫోన్లు పోయాయనే బెంగ. మరో ఫోన్ కోసం నాన్నకు భారం కావద్దన్న ఆవేదన.. ఆ యువకుణ్ని ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది. ‘అన్నా.. అమ్మానాన్నను బాగా చూసుకో’ అంటూ సోదరుడికి ఫోన్ చేసి బలవర్మరణం చెందిన ఘటన విషాదాన్ని నింపింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బోరబండ రాజ్‌నగర్‌కు చెందిన చుక్కా శ్రీనివాస్ పంజగుట్ట నిమ్స్‌మేలో పని చేస్తున్నారు. ఆయన రెండో కుమారుడు సాయికుమార్ (21) నగరంలోని ఓ కాలేజీలో బీకాం కంప్యూటర్స్ చదువుతూనే పార్ట్ టైమ్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితం సాయికుమార్ తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న తండ్రి శ్రీనివాస్ కుమారుడికి ‘ఈఎంఐ’ పద్ధతిలో రూ.28 వేల విలువ చేసే మరో సెల్‌ఫోన్ కొనిచ్చాడు. గత శుక్రవారం ఆ ఫోన్ సైతం పోయింది. దీంతో సాయికుమార్ లోలోపల కుమిలిపోయాడు. శనివారం బోరబండ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అదే రోజు అతడు ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. సాయంత్రం పాదచారుల ఫోన్ ద్వారా తన సోదరుడు వినోద్‌కుమార్‌కు ఫోన్ చేశాడు. తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. అమ్మా నాన్నను నువ్వే బాగా చూసుకోవాలని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆందోళన చెందిన బంధువులు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు తుకారం గేటు వద్ద పట్టాలపై ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మృతదేహం తమ కుమారుడు సాయికుమార్దేనని గుర్తించి కన్నీరు మున్నీరయ్యారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం.. ఇంటి పరిసరాల్లో రక్తపు మరకలు
బోయినపల్లి(చొప్పదండి): సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని గాం«దీనగర్ గ్రామానికి చెందిన అందె రవితేజ (23) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో ఫోన్ వచ్చింది. భోజనం అనంతరం వాహనంలో పడుకుంటా అని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో స్తంభంపల్లి గ్రామంలో తమ బంధువుల ఇంటికి రవితేజ వచ్చాడు. అక్కడ గేటు వేసి ఉండడంతో గేటు దూకి లోపలికి వెళ్లాడు. తలుపులు తీయాలని బాదడంతో బంధువులు తీయలేదు. వారు బయటకు వచ్చి చూడగా అతడు అప్పటికే నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మహేందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రవితేజ మృతి విషయం అతడి తల్లి జ్యోతికి ఫోన్ చేసి చెప్పారు. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా స్తంభంపల్లిలో ఘటన జరిగిన ఇంటి పరిసరాల్లో ఆరిన రక్తపు మరకలు ఉన్నాయని మృతుడి తల్లి జ్యోతి ఫిర్యాదులో పేర్కొంది. తన కుమారుడు రవితేజకు బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని ఈ క్రమంలోనే తన కుమారున్ని కత్తితో పొడిచి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, బంధువుల యువతి, ఆమె తల్లి, మేనమామ, అల్లుడిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ బన్సీలాల్ పరిశీలించారు. బంధువుల ఆందోళన సిరిసిల్లటౌన్: స్తంభంపల్లిలో మృతిచెందిన రవితేజ బంధువులు సోమవారం సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని బైఠాయించారు. ఈ కేసులో దోషులుగా ఆరోపిస్తూ సమీప బంధువులతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న సిరిసిల్ల టౌన్ సీఐ అనిల్‌కుమార్ వచ్చి రవితేజ బంధువులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
అవే చివరి మాటలవుతాయని తెలీదు.. ఒక్కసారిగా కుప్పకూలడంతో
మల్కాపురం(విశాఖ పశ్చిమ): అంత వరకు భార్య, పిల్లలతో సరదాగా గడిపాడు. కబుర్లు చెప్పాడు. వేసవి సెలవులు కదా అని బయట ఎండలో తిరగొద్దని, అమ్మ చెప్పినట్టు వినాలని తన ఇద్దరి పిల్లలకు హితబోధ చేశాడు. బైబై చెబుతూ విధులకు వెళ్లిపోయాడు. అప్పటికి ఆయనకు తెలియదు ఇవే తన చివరి మాటలవుతాయని. జీవీఎంసీ 60వ వార్డు పవనపుత్ర కాలనీకి చెందిన పల్లా శ్రీధర్(45) హెచ్‌పీ ఎల్పీజీ(గ్యాస్ కంపెనీ) బోటలింగ్ ప్లాంట్‌లో పదిహేనేళ్లుగా సొసైటీ కార్మికుడిగా పని చేస్తున్నారు. సోమవారం ఉదయం విధులకు వెళ్లారు. ఓ లారీకి కార్మికులతో కలిసి లోడింగ్ కూడా చేశారు. 7 గంటల సమయంలో నడుస్తూ అక్కడ కుర్చీలో కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ పని చేస్తున్న తోటి కార్మికులు విషయాన్ని అధికారులకు చెప్పారు. విధులకు వెళ్లిన గంట సమయానికి శ్రీధర్ అపస్మారక స్థితిలో ఉన్నాడని ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వచ్చి రోదించారు. వెంటనే ఓ వాహనంలో శ్రీధర్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. శ్రీధర్ అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. దీంతో మృతదేహాన్ని అదే వాహనంలో ప్లాంట్ వద్దకు తీసుకొచ్చి కార్మికులు, మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మల్కాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్ వచ్చి మృతుడి భార్య ఆశరాణిని ఓదార్చారు. ఘటనకు సంబంధించి అధికారులతో మాట్లాడారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, 60వ వార్డు కార్పొరేటర్ పి.వి.సురేష్, పలు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు బద్రినాథ్, భోగవళ్లి నాగభూషణం, నక్క లక్ష్మణరావు, ఎల్పీజీ లోడింగ్, అన్ లోడింగ్ కార్మికుల గౌరవాధ్యక్షుడు పృధ్వీరాజ్, లక్ష్మణమూర్తి, నర్సింగ్‌యాదవ్ తదితరులు పరిహారంపై యాజమాన్యంతో చర్చలు జరిపారు. మృతుడి కుటుంబానికి రూ.14 లక్షల పరిహారం, భార్య ఆశరాణికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధి, ఇతర అలవెన్స్‌లు ఇస్తామని యాజమాన్యం అంగీకరించింది. అలాగే ఆడారి ఆనంద్‌కుమార్ తన సొంత నిదుల నుంచి శ్రీధర్ కుటుంబానికి రూ.2 లక్షలు అందిస్తానని ప్రకటించి, తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. మృతుడికి 11 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ లూధర్‌బాబు తెలిపారు. చర్చలు సానుకూలంగా ముగియడంతో మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
మహబూబాబాద్ రూరల్ : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై బి.రాంచరణ్ తెలిపిన కథనం ప్రకారం ఎండీ. ఫకృద్దీన్–ఆశ దంపతుల ఏకైక కుమారుడు ఉమర్ (20) శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆశ ఇంటిగేటు కొట్టి వెళ్లారు. కొంత సమయానికి ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఉమర్ తలకు తీవ్ర గాయామై రక్తస్రావంతో పడి ఉండడాన్ని గమనించింది. వెంటనే అతడిని మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులను స్థానిక వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వెన్నం లక్ష్మారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్ పరామర్శించారు. బంధువుల ఆందోళన.. ఉమర్ మృతిపై కారణాలను పోలీసులు విచారణ చేస్తుండగా మృతుడి తండ్రి ఫకృద్దీన్ తరుపు బంధువులు మాత్రం తల్లి ఆశ అతడిని చంపి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ బి.రమేష్, ఎస్సై బి.రాంచరణ్ ఈదులపూసపల్లికి చేరుకుని వారితో మాట్లాడారు. ఎవరికైనా అనుమానం ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి దోషులను తప్పనిసరిగా శిక్షిస్తామని చెప్పారు. -
ఘోర ప్రమాదం.. ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి
లక్నో: పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి కాన్వాయ్‌లోని కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని పుర్భా మేదినీపూర్ జిల్లాలోని చందీపూర్‌లో గురువారం రాత్రి జరిగింది. పెట్రోల్‌బంక్ వద్ద సీక్ ఇస్రాఫిల్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా కారు ఢికొట్టిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపారు. అంతేగాక ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. కాగా రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు నందిగ్రామ్ ఎమ్మెల్యే కాన్వాయ్‌కు చెందినదో కాదో విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే సువేందు అధికారి మోయినాలో జరిగిన పార్టీ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా నివేదించింది. మరోవైపు ప్రమాదానికి కారణమైన సువేందు అధికారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. ఇక నందిగ్రామ ఎమ్మెల్యే సువేందు అధికారి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దీనిపై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ రాత్రి 10.30 గంటలకు పెట్రోల్ బంక్ దగ్గర రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టింది. స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. మృతుడిని సీక్ ఇస్రాఫిల్‌గా గుర్తించాం. ఎమ్మెల్యే సువేందు కాన్వాయ్ కారు గుద్దడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై సువేందు అధికారితో సహా బీజేపీ నాయకులెవరూ స్పందించలేదు.’ అని తెలిపారు. చదవండి: కలబురిగిలో నువ్వా.. నేనా! హైదరాబాద్ కన్నడనాట తీవ్ర పోటీ -
8న ఎంగేజ్మెంట్.. అంతలోనే ...
హైదరాబాద్: ఈనెల 8న అతడికి ఎంగేజ్మెంట్. అంతలోనే ఆయువకుడు జీవితంపై విరక్తి పుడుతోందని ఉరేసుకున్నాడు. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గోనె లెనిన్‌రెడ్డి(30) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. లెనిన్ డిగ్రీ చదివి కరీంనగర్లో ల్యాబ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 8న అతడికి ఎంగేజ్మెంట్ ఉంది. దీంతో లెనిన్ మంగళవారమే ఇంటికి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం తన తల్లి పద్మను ఫంక్షన్ కోసం గిర్నిబావికి తీసుకెళ్లాడు. అనంతరం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. స్థానికులు తలుపులు బలవంతంగా తొలగించి చూడగా.. అప్పటికే లెనిన్ మృతి చెందాడు. మృతుడి తండ్రి 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. సోదరుడు మల్లారెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ‘జీవితంపై విరక్తి కలుగుతోంది. చావాలని అనిపిస్తోంది. అమ్మను బాగా చూసుకో అన్నయ్య’ అని రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై నవీన్‌కుమార్ మృతదేహాన్ని నర్సంపేట మార్చురీకి తరలించారు. -
షాకింగ్ ఘటన: బైక్‌ను ఢీకొట్టి.. కారుపై యువకుడితో 3 కిలోమీటర్లు లాక్కెళ్లి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోడ్డు ప్రమాదాలు ఇటీవల ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని హై సెక్యూరిటీ వీఐపీ జోన్లో కంఝవాలా తరహా ఘటన చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు టూవీలర్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణం కస్తూర్భా గాంధీ మార్గంలో శనివారం అర్థరాత్రి జరిగింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను రోడ్డు మీద వెళ్తున్న మరో వ్యక్తి తన ఫోన్లో చిత్రీకరించడంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. టాల్‌స్టాయ్ మార్గ్ కూడలి వద్ద బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను మహింద్రా ఎక్స్‌యూవీ కారు ఢీకొట్టింది. దీంతో బైక్ పైన ఉన్న ఓ వ్యక్తి కారుపై పడ్డాడు. మరో వ్యక్తి రోడ్డుపై ఎగిరి పడ్డాడు. ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా డ్రైవర్ కారును ఆపకుండా.. పైన వ్యక్తిని అలాగే ఉంచి వేగంగా వెళ్లనిచ్చాడు. దీన్నంతటినీ ప్రత్యక్షసాక్షి అయిన మహ్మద్ బిలాల్ తన స్కూటీతోపాటు కారును వెంబడిస్తూ వీడియో తీశాడు. హారన్ కొడుతూ, అరుస్తూ డ్రైవర్‌ను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కారు ఎంతకూ ఆపలేదు. అలాగే 3 కిలోమీటర్లు పోనిచ్చాడు. చదవండి: కర్నాటక: ఎన్నికల సిత్రం.. మామిడిచెట్టులో కరెన్సీ కట్టల బ్యాగు అనంతరం గాయపడిన వ్యక్తిని ఢిల్లీ గేట్ సమీపంలో కారు నుంచి కింద పడవేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో యువకుడి తలకు తీవ్ర గాయమవ్వడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని 30 ఏళ్ల దీపాంశు వర్మగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన అతని బంధువు 20 ఏళ్ల ముకుల్ పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కారు నడిపిన వ్యక్తి హర్నీత్ స్ంగ్ చావ్లాను అరెస్టు చేశారు. అతనితో పాటు అతని కుటుంబం కూడా కారులో ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ది కేరళ స్టోరీ విడుదల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి హెచ్చరిక #WATCH | Man Dies In Delhi Hit-And-Run, Seen Lying On Roof As Car Driven For 3 Km Following a car hit a motorcycle one of the men on a motorcycle was thrown several feet away, while the other landed on the roof of the car Incident took place at the intersection of Kasturba… pic.twitter.com/7ta267NDjT — Subodh Kumar (@kumarsubodh_) May 3, 2023 -
ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి యువకుడు మృతి
సాక్షి, తమిళనాడు: ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి ఒక యువకుడు మృతి చెందాడు. ఈ విషాధ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..వివాహ వేడుకలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు కాలేజీ విద్యార్థి అని, పార్ట్ టైం జాబ్‌గా క్యాటరింగ్ పనిచేస్తున్నట్లు తెలిపారు. అతిధులకు వడ్డన చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. బాధితుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించినప్పటికీ తీవ్ర కాలిన గాయలవ్వడంతో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. అతను తీవ్రంగా గాయపడటంతో శరీరం ట్రీట్మెంట్కి సహకరించలేదని అందువల్లే అతడి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: గజరాజులను చూసి తోకముడిచిన పులి: వీడియో వైరల్) -
ఆ దేవుడు నిన్ను తీసుకెళ్లాడా బావా.. నాకు తోడుగా ఉంటావనుకుంటే..
వరంగల్: ఆ దేవుడు నిన్ను తీసుకెళ్లాడా బావా.. నాకు తోడుగా ఉంటావనుకుంటే.. ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయావా.. అంటూ చరణ్ భార్య ఉమ రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. పెళ్లి 5 నెలలు కాక ముందే భర్త మృతి చెందడంతో ఆ యువతి గుండెలవిసేలా విలపించింది. బంధువు అంత్యక్రియలకు వచ్చిన యువకుడు ఎస్సారెస్పీ కాలువలో పడి శుక్రవారం గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన ఆ యువకుడు శనివారం శవమై తేలాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి స్వస్థలం కాగా ప్రస్తుతం హన్మకొండలో నివాసం ఉంటున్నారు. గుగులోత్ రాములు–కళమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దవాడు గుగులోత్ చరణ్ (29) ఐదు నెలల క్రితమే పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లె ఎల్లమ్మగడ్డకు చెందిన ఉమతో వివాహమైంది. సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్దవంగర మండలంలోని గంట్లకుంట శివారు అమర్‌సింగ్ తండాలో తమ బంధువు జాటోతు అమర్‌సింగ్ మృతి చెందాడు. శుక్రవారం తన తల్లిదండ్రులతో కలిసి అంత్యక్రియలకు వచ్చాడు. అనంతరం కాలకృత్యాలు తీసుకునేందుకు పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కాలువలోకి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని రక్షించేందుకు తాడు సహాయంతో ప్రయత్నించినా ఈత రాకపోవడంతో నీటిప్రవాహం ఎక్కువగా ఉండడంతో చరణ్ గల్లంతయ్యాడు. శనివారం తెల్లవారుజామున మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడికి తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెలు ఉన్నారు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై రాజు తెలిపారు. -
వేప పుల్లకోసం వెళ్తే ప్రాణంపోయింది..
వరంగల్: వేపపుల్ల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల సూర్యపేట తండాలో ఆదివా రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండా కు చెందిన 3వ వార్డు సభ్యుడు ధారావత్ మైబు (42)కు ఎకరం పది గుంటల భూమి ఉంది. ఆదివా రం మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. అనంతరం పళ్లపుల్ల(వేపపుల్ల) కోసం బావి దగ్గర ఉన్న వేప చెట్టు వద్దకు వెళ్లాడు. వేపపుల్ల తెంపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. అప్పటికే నీళ్లు అయిపోవడంతో తలకు బలమైన దెబ్బ తగిలింది. కాగా, ఉదయం చేను వద్దకు వెళ్లిన మైబు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెలక వద్దకు వెళ్లారు. బావి వద్ద చెప్పులు కనిపించడంతో బావిలోకి చూశారు. దీంతో జారి పడినట్లు గుర్తించారు. బయటికి తీసి చికిత్స కోసం నర్సంపేటలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, మృతి చెందినట్లు నిర్ధారించారు. మైబుకు భార్య సుజాత, కుమారుడు మధు, కూతురు హేమలత ఉన్నారు. కుమారుడు మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. -
అనంతపురంలో పేలుడు.. ముక్కలైన వ్యక్తి శరీరం
సాక్షి, అనంతపురం: అనంతపురం నగరంలో పేలుడు కలకలం రేపుతోంది. ఊహించని ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. రవాణాశాఖ కార్యాలయం సమీపంలోని బాలాజీ స్టిక్కర్ అండ్ స్ప్రే పేయింట్ షాపులో కెమికల్ పెయింట్ డబ్బా ఓపెన్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెయింట్ బాక్స్ పేలడంతో సతీష్ అనే వాచ్మెన్ అక్కడిక్కడే మృతిచెందాడు. పేలుడు ధాటికి మృతుడి శరీర భాగాలు తునాతునకలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా పేలిన పెయింట్ డబ్బా పదేళ్ల క్రితం నాటిదని తేలుస్తోంది. -
కరోనాతో వ్యక్తి మృతి
సాక్షి, చెన్నై: కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలోనూ ఓ మరణం కేసు నమోదైంది. మంగళవారం తూత్తుకుడిలో చికిత్స పొందుతున 52 ఏళ్ల వ్యక్తి మరణించాడు. వివరాలు.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా చెన్నై, శివారు జిల్లాలు, కోయంబత్తూరు, సేలంలో రోజు వారీ కేసుల సంఖ్య రెండంకెలుగా ఉన్నాయి. ఈ సమయంలో పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంపుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్‌లో కరోనాకు చికిత్స పొందుతూ వచ్చిన మహిళ ఒకరు సోమవారం మరణించారు. దీంతో అక్కడ కరోనా ఆంక్షలను కఠినతరం చేశారు. ఈపరిస్థితులలో తూత్తుకుడిలో కరోనా మరణం సంభవించడం కలకలం రేపుతోంది. ఈ వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స పొందుతున్న సమయంలోనే కరోనా బారిన పడడంతో పరిస్థితి విషమించి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. -
ఆన్లైన్ రమ్మీకి మరొకరు బలి
సాక్షి, చైన్నె: ఆన్లైన్ రమ్మీకి బానిసైన ఓ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ గేమింగ్‌కు బానిసై, చివరికి అప్పుల్లో కూరుకుని ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య 42కు చేరింది. వివరాలు.. తిరుచ్చిలోని తుపాకీ తయారీ పరిశ్రమకు అనుబంధంగా ఉన్న ఓ ఆసుపత్రిలో తూత్తుకుడికి చెందిన ఇసక్కి ముత్తుకుమారుడు రవిశంకర్(42) హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య రాజలక్ష్మి, కుమారుడు సంవర్థన్ ఉన్నారు. ఆ పరిశ్రమకు సంబంధించిన క్వార్టర్స్‌లోనే రవిశంకర్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆన్లైన్ రమ్మీకి బానిసైన ఇతగాడు తోటి ఉద్యోగుల వద్ద, బయటి వ్యక్తులు వద్ద భారీగా అప్పులు తీసుకున్నాడు. బయటి వ్యక్తుల వద్ద రూ. 6 లక్షల వరకు రుణం తీసుకుని ఆన్లైన్ రమ్మీ ఆడాడు. దీంతో రుణదాతల నుంచి అప్పు చెల్లించాలనే ఒత్తిడి పెరిగింది. ఆందోళనలో పడ్డ రవిశంకర్ గత రెండు రోజులుగా బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యాడు. విధులకు సైతం సెలవు పెట్టేశాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన ఎంతకూ నిద్ర లేవక పోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో పరిశ్రమ ఆవరణలోని ఆసుపత్రికి రాజలక్ష్మి తీసుకెళ్లింది. అప్పటికే రవిశంకర్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి గదిలో పరిశీలించారు. బెడ్ మీద అధిక సంఖ్యలో నిద్ర మాత్రల కవర్లు ఉండడంతో వాటిని మింగి బలవన్మర ణానికి పాల్పడి ఉండవచ్చు అన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. ఆన్లైన్ రమ్మీ కారణంగా అప్పుల పాలై రవిశంకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రవి శంకర్ మరణంతో ఆన్లైన్ రమ్మీకి బలైన వారి సంఖ్య 42కు చేరింది. చట్టంపై పరిశీలన.. ఆన్లైన్ రమ్మీ నిషేధం బిల్లును అసెంబ్లీలో రెండు రోజుల క్రితం ప్రభుత్వం మరోసారి ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిని శుక్రవారం రాజ్ భవన్‌కు పంపించారు. ఢిల్లీ వెళ్లిన గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించినట్లు తెలిసింది. ఈ పరిస్థితులలో శనివారం ఈ చట్టం గురించి రాజ్ భవన్లో న్యాయనిపుణులతో గవర్నర్ సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. దీంతో ఇప్పటికై నా ఈ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారా..? లేదా..? అనే చర్చ ప్రారంభమైంది. -
ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుకి కలత చెంది యువకుడు బలవన్మరణం
యువకుడు తన అనారోగ్యానికి అయ్యే ఖర్చు విషయమై కలత చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో ఆదర్శనగర్‌లోని ఓ హోటల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..నితేష్ అనే 25 ఏళ్ల యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఐతే తన ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు తల్లిదండ్రులు భరించగలిగేది కాకపోవడంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ మేరకు ఆదర్శనగర్‌లోని ఓ హోటల్ బుక్ చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే రూమ్ బుక్ చేసుకుని మరీ ఒక ప్లాస్టిక్ సంచితో ముఖాన్ని చుట్టి ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్‌ని అనుసంధానించాడు. దీంతో ఆ వ్యక్తి శరీరంలోకి చేరిని అధికమొత్తంలోని ఆక్సిజన్ ఒక్కసారిగా గుండె స్పందన రేటును పడిపోయేలా చేసి ప్రాణాంతకంగా మారి చనిపోయేలా చేస్తుంది. మృతుడిని నితేష్‌గా గుర్తించారు పోలీసులు. అతను సూసైడ్ నోట్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నానని, చికిత్సకు చాలా ఖర్చు అవుతుందని పేర్కొన్నాడు. దీని కోసం తాను తన తల్లిదండ్రులకు భారంగా మారకూడదని భావించే ఆ యువకుడు చనిపోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈమేరకు పోలీసు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: కాంచీపురం: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పలువురి సజీవదహనం!) -
కొంతకాలంగా దూరం.. వేరొకరి బైక్‌పై వెళ్లిన ప్రియురాలు.. తట్టుకోలేక
గుడివాడరూరల్: ప్రియురాలు తనను పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుడివాడ పట్టణంలోని మార్వాడీ సెంటర్‌కు చెందిన శైలేష్‌సింగ్ (26) తన తండ్రి వావర్‌సింగ్ గుడివాడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా నిర్వహిస్తున్న టీస్టాల్లో తండ్రికి సహాయంగా పని చేస్తున్నాడు. తమ ప్రాంతంలోని ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. కొంత కాలంగా ఆమె శైలేష్‌సింగ్‌ను దూరంపెడుతోంది. ఇటీవల ఆ యువతి వేరే యువకుడి బైక్‌పై వెళ్తూ కనిపించింది. దీంతో మనస్తాపానికి గురైన శైలేష్‌సింగ్ ఆదివారం రాత్రి యువతి ఇంటికి వెళ్లి తనతో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలు ఆర్పారు. అప్పటికే యువకుడికి శరీరంపై 80 శాతం మేర తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 అంబులెన్స్ సిబ్బంది గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా మారడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శైలేష్‌సింగ్ సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి వావర్‌సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా టూటౌన్ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితురాలు దూరం పెట్టిందన్న మనస్తాపంతో
నెల్లూరు(క్రైమ్): స్నేహితురాలు దూరం పెట్టిందన్న మనస్తాపంతో ఓ టైలర్ తన దుకాణంలోనే ఆత్మహత్య చేసుకున్న విషయం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహం కుళ్లి నీచునీరు బయటకు రావడం, దుర్ఘందం వెదజల్లుతుండటాన్ని గుర్తించిన స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని షర్టర్ పగులగొట్టి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. పోస్టల్‌కాలనీ ఆరోవీధికి చెందిన పచ్చియప్పన్ రామస్వామి(48) – రాజేశ్వరి దంపతులు. వారికి సంతోష్‌కుమార్, ఐశ్వర్య సంతానం. ఆయన టైలరింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతను కరెంటాఫీస్ సెంటర్లో టైలరింగ్ దుకాణం నిర్వహిస్తున్నప్పుడు చంద్రమౌళినగర్‌కు చెందిన కె.సుభాషిణి ఆయన వద్ద పనికి చేరారు. ఆమె భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ సహజీవనం చేయసాగారు. ఈ విషయమై రామస్వామికి, భార్య రాజేశ్వరికి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. అయినా రామస్వామి ఇవేమీ పట్టించుకోలేదు. స్నేహితురాలి వద్దనే ఎక్కువ సమయం గడిపేవాడు. అప్పుడప్పుడు భార్య, పిల్లల వద్దకు వచ్చివెళ్లేవాడు. స్నేహితురాలికి విద్యుత్‌భవన్ వద్ద పండ్ల వ్యాపారం పెట్టించాడు. దాని పక్కనే ఆయన టైలరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. స్నేహితురాలి కుమారుడు, కోడలు ఆమంచర్లలో ఉంటున్నారు. వారు ఆర్థికంగా నష్టపోయి ఇటీవల తల్లి వద్దకు వచ్చారు. రామస్వామి సైతం వారికి చేదోడువాదోడుగా ఉండేవాడు. అయితే గత కొద్దిరోజులుగా వారిని ఇంటి నుంచి పంపివేయాలని రామస్వామి స్నేహితురాలిపై ఒత్తిడి తేవడంతోపాటు విపరీతంగా కొట్టేవాడు. దీంతో ఆమె దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో సుభాషిణి అతనిని దూరం పెట్టింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రామస్వామి తన స్నేహితుడి ద్వారా సుభాషిణితో రాజీప్రయత్నాలు చేశాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. శనివారం భార్య, పిల్లల వద్దకు వెళ్లి కొంతసేపు వారితో గడిపి అనంతరం షాపునకు వచ్చాడు. షాపులోనే మద్యం తాగి స్నేహితురాలి కోడలితో గొడవపడ్డాడు. షట్టర్ లోపల గడియపెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఇంటికి రాకపోవడంతో స్నేహితురాలి వద్దకు వెళ్లి ఉంటాడని రాజేశ్వరి, తాను దూరం పెట్టడంతో భార్య వద్దనే ఉంటాడని స్నేహితురాలు భావించారు. సోమవారం సుభాషిణి పండ్ల షాపునకు వచ్చింది. రామస్వామి టైలరింగ్ షాపులో నుంచి నీచునీరు బయటకు రావడం, దుర్ఘంధం వస్తుండడాన్ని గమనించిన ఆమె దర్గామిట్ట పోలీసులకు సమాచారం ఇచ్చింది. దర్గామిట్ట ఏఎస్సై బుజ్జయ్య, హెడ్‌కానిస్టేబుల్ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రామస్వామి భార్య, కుటుంబసభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. కుటుంబసభ్యులు, స్థానికుల సహకారంతో పోలీసులు షట్టర్ పగులగొట్టి చూడగా రామస్వామి ఉరేసుకుని ఉన్నాడు. మృతదేహం కుళ్లి తీవ్ర దుర్ఘంధం వెదజల్లుతూ ఉండడంతో శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. స్నేహితురాలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని రామస్వామి భార్య ఆరోపించింది. తన భర్త మృతిపై విచారణ జరిపి అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగం పోయిందని ఆత్మహత్య
నిజామాబాద్: ఉద్యోగం పోవడంతో చేసిన అప్పు లు తీర్చలేక మనోవేదనకు గురై ఒకరు ఉరి వేసుకు ని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. గాంధారికి చెందిన వడ్ల శ్రీకాంత్ (35) ఓ కంపెనీలో మెడికల్ రిప్రెజెంటివ్‌గా పనిచేస్తూ దేవునిపల్లిల్లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య మౌనిక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ ఇటీవల ఓ బ్యాంక్‌లో వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. బయట కూడా కొన్ని అప్పులు చేసినట్లు తెలిసింది. 3 నెలల క్రితం ఉద్యోగం పోయింది. దీంతో అప్పులు చెల్లించలేక ఇబ్బందులు తప్పలేదు. అప్పుల విషయంలో పలుసార్లు భార్యా, భర్తల మధ్య గొడవలు జరిగాయి. హోళీ పండగ రోజున అతని భార్య, పిలల్లతో కలిసి అత్తగారింటికి లింగంపేట మండలం దేమె గ్రామానికి వెళ్లాడు. మరుసటి రోజు ఒక్కడే దేవునిపల్లికి వచ్చాడు. శనివారం ఉదయం అతని భార్య మౌనిక ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రీకాంత్ ఎత్తకపోవడంతో దేమె నుంచి దేవునిపల్లి ఇంటికి వచ్చి చూసింది. అప్పటికే శ్రీకాంత్ హాల్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
డాడీ.. లేచి మమ్మల్ని ముద్దు పెట్టుకో
కరీంనగర్: ‘డాడీ మేము స్కూల్ నుంచి వచ్చేసరికి నువ్వు వస్తానన్నావు.. హోలీ పండుగ రోజు రంగులు పూసుకొని, ఆడుకుందామన్నావు.. మేము వచ్చాము.. లేచి మమ్మల్ని ముద్దు పెట్టుకో డాడీ.. మమ్మీ మా ఇద్దరినీ పట్టుకొని ఏడుస్తుంది’.. అంటూ ఆ చిన్నారులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ సోదరుడు శైలేందర్‌సింగ్(44) గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. శైలేందర్‌సింగ్ బిల్డర్. ఆయనకు భార్య సరోజ్ఠాగూర్, కూతుళ్లు కనీషాసింగ్, అనితాసింగ్ ఉన్నారు. భార్యాపిల్లలు హైదరాబాద్‌లో ఉంటుండగా శైలేందర్‌సింగ్ గోదావరిఖనిలో కన్స్ట్రక్షన్ పనుల నిమిత్తం స్థానిక కేసీఆర్ కాలనీలోని శ్రీనిధి అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. మూడు రోజులకోసారి హైదరాబాద్ వెళ్లి, కుటుంబంతో గడిపి, వస్తుండేవాడు. శుక్రవారం ఉదయం పైఅంతస్తు నుంచి కిందకు వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు వెళ్లగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అక్కడున్నవారు పరిగెత్తుకు వచ్చి, పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆయన భార్యాపిల్లలు హైదరాబాద్ నుంచి బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. మృతుడి అత్తామామ గుజరాత్ నుంచి రావాల్సి ఉంది. అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రముఖుల నివాళి.. శైలేందర్‌సింగ్ మృతి వార్త తెలియడంతో గోదావరిఖని పట్టణంలోని ఆయన ఇంటికి పార్టీలకతీతంగా ప్రముఖులు, నాయకులు తరలివచ్చారు. శైలేందర్‌సింగ్ సోదరులు అయోధ్యసింగ్, మక్కా న్సింగ్లను పరామర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, కౌశికహరి, కాంగ్రెస్ జాతీయ నాయకుడు బాబ ర్‌సలీంపాషా, కార్పొరేటర్లు శ్రీనివాస్, సతీశ్‌కుమార్, లత, స్వా మి, ధర్మపురి, కుమారస్వామి, రఘువీర్‌సింగ్, మేయర్ అనిల్‌కుమార్, డిప్యూ టీ మేయర్ అభిషేక్‌రావు ఆయన మృతదేహానికి నివాళి అర్పించారు. హైదరాబాద్ నుంచి శైలేందర్‌సింగ్ అభిమానులు వచ్చారు. కుటుంబసభ్యులు శైలేందర్‌సింగ్ నేత్రాలను దానం చేయాలని నిర్ణయించారు. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులకు సమాచా రం ఇవ్వడంతో టెక్నీషియన్ ద్వారా నేత్రాలను సేకరించి, హైదరాబాద్‌లోని వాసన్ ఐ బ్యాంకుకు తరలించారు. -
వైజాగ్‌లో కిడ్నాప్.. తాడివారిపల్లెలో హత్య
పొదిలిరూరల్: ఒంగోలు–నంద్యాల రహదారిలో తాడివారిపల్లె చెక్‌పోస్ట్ సమీపంలో కాలిన మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. అక్రమ సంబంధం నేపథ్యంలో బత్తుల దేవధరణి అనే యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బుధవారం రాత్రి పొదిలి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి యువకుడి హత్య కేసు వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం పెద్ద ఎమ్మనూరు గ్రామానికి చెందిన బత్తుల దేవధరణి(22) చిన్నప్పటి నుంచి చెడు వ్యవసనాలకు బానిసై తిరుగుతుండేవాడు. మహిళలకు పోన్ చేసి మాట్లాడటం, ఆకతాయితనంగా ఉండటంతో తన అన్న పవన్‌సాయి విశాఖపట్టణంలో తన దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే ఇంటర్ వరకు చదివించడంతోపాటు ఓ రెస్టారెంట్లో పనిలో చేర్చాడు. చదువు మధ్యలో ఆపేసిన దేవధరణి నిత్యం సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో గంగ అనే యువతి పరిచయం కాగా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గంగకు ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తితో ముందే అక్రమ సంబంధం ఉంది. దీంతో దేవధరణి, ప్రవీణ్‌కుమార్ మధ్య తరచూ వివాదం నడుస్తోంది. వీరిద్దరితో పవన్‌సాయి మాట్లాడి సర్దుబాటు చేసినప్పటికీ గంగతో దేవధరణి చాటింగ్ చేయడం మాత్రం ఆపలేదు. దీంతో దేవధరణిని అడ్డు తొలగించాలని ప్రవీణ్‌కుమార్ పథకం రచించాడు. అహోబిలం వెళ్లేందుకని చెప్పి జనవరి 30న బాడుగకు కారు మాట్లాడాడు. మనోజ్, చాణక్య, శివకుమార్, నరేష్, స్వప్న అనే యువతితో దేవధరణిని నమ్మబలికించి కారులో ఎక్కించారు. మార్గమధ్యంలో దేవధరణికి క్లోరోఫామ్ ఇచ్చి స్పహలో లేకుండా చేశారు. క్లోరోఫామ్ ప్రభావంతో దేవధరణి కారులోనే మలమూత్రాలు విసర్జించడంతో తర్లుపాడు మండలం తాడివారిపల్లె ఘాట్ రోడ్డులో కారు ఆపి కిందకు దించారు. అటవీ ప్రాంతంలో కత్తితో గొంతు కోసి, పెట్రోల్ పోసి కాల్చి చంపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేవధరణి కనిపించకపోవడంతో సోదురుడు పవన్‌సాయి విశాఖపట్టణం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు చంపడానికి ఉపయోగించిన బాడుగ కారు డ్రైవర్ శివకిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. నిందితుల్లో ఒకడు అరెస్టయ్యాడని, మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. సమావేశంలో పొదిలి సీఐ సుధాకర్‌రావు, తర్లుపాడు ఎస్సై ముక్కంటి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కొడుకు చితికి నిప్పుపెట్టిన తల్లి
కరీంనగర్: తన కన్నీళ్లు తుడుస్తాడనుకున్న కుమారుడు బ్రెయిన్‌స్ట్రోక్‌తో కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆతల్లి రోదనలు మిన్నంటాయి. మండలంలోని నీల్వాయికి చెందిన పున్యపురెడ్డి మధుకర్–రాజేశ్వరి దంపతులకు కుమారుడు సాయికుమార్, కూతురు పల్లవి సంతానం. సాయికుమార్ పదో తరగతి, ఇంటర్లో ఉన్నత శ్రేణి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. తండ్రి మధుకర్ ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా తల్లి రాజేశ్వరి అన్నీతానై పిల్లలిద్దర్నీ చదివించింది. కుమారుడు ఢిల్లీలో ఐఐటీ పూర్తి చేసి మూడునెలల క్రితం బాచ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరాడు. మంగళవారం బ్రెయిన్ స్టోక్ రావడంతో బెంగళూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువుల సహకారంతో మృతదేహాన్ని నీల్వాయికి తరలించారు. పుట్టెడు దుఃఖంలో తల్లి రాజేశ్వరి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు చేసింది. -
ఢిల్లీ అంజలి సింగ్‌లాంటి ఘటన: పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి..
ఢిల్లీలో కొత్తడేది రోజున జరిగిన అంజలి యాక్సిడెంట్ ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుడు గుర్తుపట్టలేనంత స్థితిలో దారుణంగా గాయపడి మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఒక వ్యక్తి సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తిన ఢీ కొట్టి 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు.. ఈ ఘటనను మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద ఉన్న టోల్ బూత్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ పరిసరా ప్రాంతాల్లోని సీసీఫుటేజ్‌లు పరిశీలించి..సదరు వ్యక్తిని ఢిల్లీ నివాసి వీరేంద్ర సింగ్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు పోలీసులు. అతను ఆగ్రా నుంచి నోయిడాకు బయలు దేరుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఐతే అతను విచారణలో సోమవారం రాత్రి దట్టమైన మంచు ఉండటంతో తాను గమనించలేకపోయానని చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. అంతేగాదు తనకు ఆ దట్టమైన మంచు కారణంగా ఢీ కొట్టినట్లు కూడా తెలియలేదని, కారు కింద ఇరుక్కున్నట్లు గమనించలేకపోయినట్లు వివరించాడు. ఐత ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఎవరో తెలియాల్సి ఉందని చెప్పారు పోలీసులు. అతడిని గుర్తించేందుకు సమీప ప్రాంతంలోని సీసీ కెమెరాలను ముమ్మరంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: 'నిజమైన స్నేహితుడికి అర్థం భారత్': ధన్యావాదాలు తెలిపిన టర్కీ) -
భార్య కళ్లముందే పాముకాటుకు గురయ్యిన వ్యక్తి..ఆ తర్వాత..
ఒక్కోసారి కొన్ని విషాద ఘటనలు మన కళ్లముందే జరుగుతుంటాయి. మనం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. కానీ ఆ విషాదాన్ని అంత తేలికగా మర్చిపోలేం. అచ్చం అలాంటి భయానక అనుభవాన్ని ఇక్కడొక మహిళ ఎదుర్కొంది. వివరాల్లోకెళ్తే...ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్‌లో ఒక 60 ఏళ్ల వ్యక్తి తన భార్య ముందే విషపూరితమైన పాము కాటుకు గురై మరణించాడు. అతనికి ఇద్దరు పిల్లలు. ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటినా హెలికాప్టర్, నాలుగు అంబులెన్స్‌లు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది పాములు బయటకు వచ్చే సీజన్ అని చెబుతున్నారు. అక్టోబర్ నుంచి ఏప్రిల్ నెల సమయం ఉష్ణోగ్రతలు మార్పురావడంతో వేడికి బయటకు వచ్చి ఇళ్లలోకి వచ్చేస్తుంటాయిని చెబుతున్నారు నివాసితులు. ఇక్కడ మృతుడు భార్య ఈ అనుకోని ఘటన జరిగిన వెంటనే సహాయం కోసం గట్టి గట్టిగా కేకలు వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అతను ఒక విషపూరితమైన గోధుమ రంగు పాము కాటుకు గురైనట్లు సమాచారం. (చదవండి: వివాహం కాకపోయినా పర్లేదు!..పిల్లలను కనండి అంటున్న చైనా!) -
మరో 20 రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే ఘోరం.. ఆ ఇంట తీవ్ర విషాదం
ఆదోని అర్బన్(కర్నూలు జిల్లా): పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు మృత్యు ఒడి చేరాడు. మరో ఇరవై రోజుల్లో పెళ్లి ఉందనగా.. గుర్తు తెలియని వాహనం రూపంలో మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం పెద్దహరివాణం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎమ్మిగనూరు మండలం గుడికంబాల గ్రామానికి చెందిన హేమాద్రి, రేణుక దంపతుల మొదటి కుమారుడు అరుణ్‌పాండు (24) శిరుగుప్పలోని ఓ ఫర్టిలైజర్స్ దుకాణంలో పనిచేస్తున్నాడు. రోజూ లాగే గురువారం కూడా విధులు ముగించుకొని గ్రామానికి వస్తుండగా.. పెద్దహరివాణం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. చదవండి: వివాహేతర సంబంధం.. ప్రియుడికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రియురాలు దీంతో క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా అరుణ్‌పాండుకు మద్దికెర గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. మరో 20 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విచిత్ర ఘటన: యజమానినే కాల్చి చంపిన కుక్క
ఒక్కోసారి మన పెంపుడు కుక్కలే అనుకోని విధంగా మనకు హాని తలపెడతాయి. విధి రాత లేక వైపరిత్యమో మరి ఏదైనా గానీ ఒక్కోసారి ఇలాంటి షాకింగ్ ఘటనలు మాత్రం కాస్త భయాన్ని కలిగిస్తాయి. ఇక్కడొక వ్యక్తి కూడా తన పెండపుడు కుక్కతో సరదాగా వేటకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. చక్కగా పెంపుడు కుక్క, డ్రైవర్ని తీసుకుని కారులో జాలీగా వెళ్తున్నాడు. అంతే అనుహ్యంగా కుక్క కాల్పులు జరపడంతో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఒక పికప్ ట్రక్కులో 30 ఏళ్ల వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకుని వేటకు వెళ్లాడు. వారితోపాటు డ్రైవర్ కూడా ఉన్నాడు. ఐతే కుక్క తుపాకీ ఉన్న వెనుక సీటు వద్దకు వెళ్లి బయటకు తీసింది. ప్రమాదవశాత్తు అది పేలడంతో బుల్లెట్ సరాసరి ఆ వ్యక్తి శరీరంలోకి దూసుకుపోవడంతో క్షణాల వ్యవధిలో అతను కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటనలో ప్యాసింజర్ సీటులో కూర్చొన్న ఆ వ్యక్తి మరణించగా, డ్రైవర్ క్షేమంగానే ఉన్నాడు. ఐతే యూఎస్ పోలీసులు రైఫిల్‌పై కుక్క అడుగు పడడంతో పేలినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తి కుక్క యజమానినే కాదా అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.40 నిమిషాలకు చనిపోయినట్లు వెల్లడించారు. దీన్ని వేట సంబంధిత ప్రమాదంగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వాస్తవానికి యూఎస్‌లో ప్రమాదవశాత్తు కాల్పులు సర్వసాధారణమే గానీ ఇది మాత్రం కాస్త విచిత్రమైన ఘటనే. (చదవండి: ఫ్యామిలీ తర్వాతే ఏదైనా! అంటూ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన కూతురు) -
కట్టెల కోసం వెళ్తే కబళించిన పులి.. అటవీ సిబ్బంది క్వార్టర్స్ వద్దే ఘోరం!
సాక్షి, కర్ణాటక: మైసూరు జిల్లాలో ఇప్పటికే చిరుత పులులు అనేకమందిని పొట్టనపెట్టుకుంటూ ఉంటే, మరోవైపు పెద్ద పులులు కూడా జనం మీద పడుతున్నాయి. ఓ పులి యువకున్ని చంపిన సంఘటన మైసూరు జిల్లాలో హెచ్డీ కోటె పరిధిలో డీబీ కుప్ప వద్ద నాగరహోళె అడవుల్లోని బళ్ళె ప్రాంతంలో ఆదివారం జరిగింది. మరణించిన యువకుడిని మంజుగా (18) గుర్తించారు. వివరాలు... అటవీ శాఖకు చెందిన వసతి గృహాల వెనుక భాగంలో ఉన్న అడవిలో మంజు స్నేహితులతో కలిసి కట్టెల కోసం వెళ్లాడు. అటువైపు వచ్చిన పులి మంజు పైన దాడి చేసింది. తల వెనుకాల భాగంలో కొరికి, పంజాలతో చీల్చడంతో తీవ్రగాయాలై ప్రాణాలు వదిలాడు. అతని వెంట వచ్చిన మరికొంత మంది యువకులు అక్కడినుంచి పరుగులు పెట్టారు. అంతకుముందు మంజు అరుపులకు సమీపంలోని అటవీ సిబ్బంది వచ్చారు. వారిని చూసిన పులి మంజును వదిలి వెళ్ళిపోయింది. అటవీ సిబ్బంది వెంటనే మంజు మృతదేహాన్ని అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. అంతరసంత పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. స్థానికుల ధర్నా.. క్వార్టర్స్ వెనుకలే పులి తిరుగుతున్నా అటవీ సిబ్బంది పట్టించుకోలేదని, అందుకే యువకుడు బలయ్యాడని స్థానిక ప్రజలు అటవీ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు– చామరాజనగర రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో పోలీసు, అటవీ ఉన్నతాధికారులు చేరుకుని రూ. 15 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. -
సంక్రాంతి సంబరాల్లో విషాదం.. కోడి కత్తి గుచ్చుకొని ఇద్దరు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: ఉత్సాహంగా సాగుతున్న సంక్రాంతి సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి పెందేలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఊర్లో నిర్వహించిన కోడి పందేలను చూసేందుకు పద్మారావు అనే యువకుడు వెళ్లాడు. ఈ క్రమంలో కత్తులు కట్టిన కోళ్లు పొట్లాడుకుంటూ పద్మారావు వైపు దూసుకొచ్చాయి. ఇందులో ఓ కోడికి కట్టిన కత్తి అతని మొకాలి వెనక భాగంలో గుచ్చుకుంది. కత్తి మొకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో కాలి నరం తెగి తీవ్ర రక్తస్రావంతో పద్మారావు అక్కడికక్కడే కుప్పకూలాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆలోపే మరణించాడని వైద్యులు తెలిపారు. ఆనందంగా జరుపుకుంటున్న సంక్రాంతి సంబరాల్లో పద్మారావు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో చోట అదే విధంగా కిర్లంపూడి మండలం వేలంకలో గండే సురేష్ అనే మరో వ్యక్తి మరణించాడు. కోడి కాలికి కత్తి కడుతుండగా గుచ్చుకొని సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. అసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతడు మృతి చెందాడు -
అనకాపల్లిలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
-
మెదక్ జిల్లా : వ్యక్తి సజీవదహనం కేసులో పురోగతి
-
సికింద్రాబాద్: స్నేహితుడు చేతిలో యువకుడి హత్య
-
హైదరాబాద్ బాలానగర్ లో దారుణం.. రూ.400 కోసం వ్యక్తి హత్య
-
విషాదం.. అవతార్ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి
ప్రపంచ సినీ ప్రియులంత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా ‘అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్’. ఈ సినిమా నిన్న (డిసెంబర్ 16) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్‌ను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తెలుగు వారు సైతం ఈ సినిమా చూసేందుకు తెగ ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆంధ్ర ప్రదేశ్‌లో కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్ళాడు. చదవండి: అవతార్-2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు. దీంతో శ్రీను తమ్ముడు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా గతంలో అవతార్ ఫస్ట్‌పార్ట్ సమయంలోనూ ఒకరు ఇలాగే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. తైవాన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి అవతార్ ఫస్ట్ పార్ట్ సినిమా చూస్తూ 2010లో గుండెపోటుతో మరణించాడు. అతడికి హైబీపీ ఉన్నది. అవతార్ సినిమా చూసి తీవ్ర ఉద్రేకానికి గురైన కారణంగా ఆ వ్యక్తి మరణించినట్టు అతడిని పరీక్షించిన వైద్యులు అప్పుడు చెప్పారు. చదవండి: అందుకే నా ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచాను: శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు -
వైరల్ వీడియో : అప్పటి వరకు దోస్తులతో జాలీగా ముచ్చట్లు.. క్షణాల్లోనే ఆనందం ఆవిరి
-
అప్పటి వరకు దోస్తులతో జాలీగా ముచ్చట్లు.. క్షణాల్లోనే ఆనందం ఆవిరి
మనిషి జీవితం ఎంత విచిత్రమైందో ఇప్పటికే పలు సందర్భాల్లో చూశాము. డ్యాన్స్ చేస్తూ, కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతూ సెకన్ల వ్యవధితో ప్రాణాలు కోల్పోయిన వీడియోలు ఎంతో ఆవేదనకు గురిచేశాయి. తాజాగా అలాంటి మరో ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. యూపీలోని కిద్వాయినగర్‌కు చెందిన జుబేర్(18) స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో వారితో కలిసి వీధుల్లో తిరుగుతూ ఫ్రెండ్స్‌తో ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలో కొంత దూరం వారితో కలిసి నడిచిన తర్వాత జుబేర్ తుమ్ముతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. జుబేర్ కింద పడిపోతున్న సమయంలో తోటి ఫ్రెండ్స్ అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అనంతరం, అతడి స్నేహితులు సహాయం కోసం కేకలు వేశారు. దీంతో, ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన స్థానికులు జుబేర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, జుబేర్‌ను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్టు తెలిపారు. దీంతో, ఒక్కసారిగా జుబేర్ కుటుంబ సభ్యులు, అతడి స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. అప్పటి వరకు తమతో జాలీగా ఉన్న స్నేహితుడు సెకన్ల వ్యవధిలో చనిపోవడంతో వారు బాధను తట్టుకోలేకపోయారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. जिंदगी न कोई ठिकाना.........रास्ते चलते अचानक छींक आई, लड़के ने अपना गला पकड़ा और उसकी मौत हो गई. pic.twitter.com/PVtWXfZxKH— Shubham shukla (@ShubhamShuklaMP) December 4, 2022 -
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని.. యువకుడు మృతి
సాక్షి, నల్గొండ: తాను అభిమానించిన నాయకుడు ఓడిపోతాడని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ఆ యువకుడు వేదనకు గురయ్యాడు. అదే ఆందోళనతో గుండెపోటుకు గురై మృతిచెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చౌటుప్పల్‌లోని రాంనగర్ కాలనీకి చెందిన ఊదరి శంకర్ (30) సెంట్రింగ్ పని చేస్తుంటాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో కొంత కాలంగా విద్యానగర్ కాలనీలో సోదరి వద్ద ఉంటున్నాడు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నెల రోజులుగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోసం ప్రచారం నిర్వహించాడు. పోలింగ్ ముగిసిన తర్వాత టీవీలు, సోషల్ మీడియాలో వచ్చిన ఎగ్జిట్‌పోల్ ఫలితాలతో ఆందోళనకు గురయ్యాడు. గురువారం రాత్రి 9 గంటల వరకు తన మిత్రులతో మాట్లాడి ఇంటికి చేరుకున్నాడు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఊరి నుంచి వచ్చిన అక్కాబావలు తలుపు తట్టినా లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పక్కింటి వారి సాయంతో తలుపు తెరిచి చూడగా శంకర్ చనిపోయి ఉన్నాడు. ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి విజయం సాధిస్తారని చాలా ధీమాతో ఉన్న సమయంలో ఎగ్జిట్‌పోల్స్ అందుకు విరుద్ధంగా రావడాన్ని తట్టుకోలేక ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనిల్ తెలిపారు. చదవండి: మునుగోడుపై టీఆర్ఎస్ పోస్ట్‌మార్టం.. ఆ నివేదికలో ఏముంది? -
మరికొన్ని రోజుల్లో విదేశాలకు! పాపం.. అంతలోనే కానరాని లోకానికి
ఖిలా వరంగల్/కాశిబుగ్గ: కొడుకుపై ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బీటెక్ తరువాత విదేశాలకు పంపాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ కూడా పొందారు. మరో ఐదు రోజుల్లో కాలేజీకి వెళ్లాలి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం ఆ యువకుడిని బలితీసుకుంది. స్నేహితుడి ఇంటికి వెళ్లొస్తుండగా వీధి కుక్క అడ్డురావడంతో తప్పించబోగా బైక్ అదుపుతప్పి సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న యువకుడితోపాటు సైకిల్‌పై ఉన్న వ్యక్తి కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వరంగల్–నర్సంపేట రహదారిపై దయానందకాలనీ కనకదుర్గమ్మ దేవాలయం సమీపాన మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగరం మండలం చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన తుమ్మ సంజీవరెడ్డి–నాగశ్రీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు తుమ్మ జయసింహారెడ్డి, అలియాస్ టున్న(19) ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం వరంగల్ పోచమ్మమైదానం సమీపంలోని టీచర్స్‌కాలనీలో నివాసం ఉంటుంది. కాగా, జయసింహారెడ్డి సోమవారం రాత్రి రంగశాయిపేటలోని స్నేహితుడి ఇంటికి వెళ్లొస్తానని తల్లిదండ్రులు చెప్పి బైక్‌పై వెళ్లాడు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున సుమారు 2.40 గంటలకు టీచర్స్‌కాలనీలోని ఇంటికి బయలుదేరాడు. వరంగల్–నర్సంపేట రహదారిలోని దయానందకాలనీ కనకదుర్గమ్మ దేవాలయం సమీపానికి రాగానే వేగంగా ఉన్న బైక్‌కు వీధి కుక్క అడ్డు వచ్చింది. కుక్కను తప్పించబోయే క్రమంలో సైకిల్‌పై కూరగాయల మార్కెట్‌కు బయలుదేరిన వరంగల్ గాంధీనగర్‌కు చెందిన ముదిగొండ నాగవీరం(47)ను బైక్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. జయసింహారెడ్డి మొబైల్ ఫొన్, నోట్లోని పళ్లు ఊడిపోయి రోడ్డుపై ఎగిరిపడ్డాయి. సమాచారం అందుకున్న మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబీలకు సమాచారం అందజేశారు. అనంతరం మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. జయసింహారెడ్డి ఇటీవలే ఇంటర్ పూర్తి చేసి బీటెక్‌లో చేరేందుకు సిద్ధమయ్యాడు. చేతికొస్తున్న కొడుకు అకాల మరణం చెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. అలాగే, నాగవీరం పనికి వెళ్తేగాని కుటుంబం పూటగడవదు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నబోయినపల్లి, వరంగల్ టీచర్స్ కాలనీ, గాంధీనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు ముదిగొండ నాగవీరం బావమరిది రాజనాల శ్రీనివాసప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ ముస్కే శ్రీనివాస్ తెలిపారు. అధ్వానంగా రహదారి.. దయానందకాలనీ నుంచి వెంకట్రామ జంక్షన్ వరకు ఇరువైపులా రోడ్డు ఇరుకుగా ఉందని, దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని, రాంకీ వరకు రోడ్డు విస్తరణ చేసి వెంకట్రామ జంక్షన్ వరకు ఎందుకు చేయడంలేదో చెప్పాలంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి దయానందకాలనీ నుంచి వెంకట్రామ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. -
విధి ఆడిన వింత నాటకం.. అప్పటి వరకు ఎంజాయ్ చేసి ఒక్కసారిగా..
మనిషి జీవితం ఎంత విచిత్రమైనదో ఇప్పటికే ఎన్నో ఘటనల్లో చూసే ఉంటాము. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి క్షణకాలంలో కుప్పకూలి ప్రాణాలు విడిచిన ఘటనలు షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో గర్బా డ్యాన్స్‌లు చేస్తూ భక్తులు వేడుకలు జరుపుకుంటున్నారు. కాగా, వేడుకల్లో గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఆనంద్ జిల్లాలోని తారాపూర్‌లో ఉన్న ఆతీ శివశక్తి సొసైటీలో ఆదివారం సాయంత్రం గర్బా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ, యువకులు చుట్టూ తిరుగుతూ పాటలకు డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో.. వీరేంద్ర సింగ్ రమేష్ భాయ్ రాజ్‌పుత్(21) అందరితో కలిసి గర్బా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా డ్యాన్స్ చేస్తూ ముందుకు వచ్చి కింద కుప్పుకూలిపోయాడు. దీంతో, అక్కడున్న వారంతా సడెన్‌గా ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితులు అతడిని పైకి లేపడానికి ఎంత ప్రయత్నించినా అతడు కదలలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ యువకుడు గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో, పండుగ పూట వారి కుటుంబంలో విషాదఛాయలు అములుకున్నాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. Anand : गरबा खेलते खेलते एक शख्स की मौत। तारापुर में आती शिवशक्ति सोसायटी में गरबा आयोजित किया गया था। युवक को अस्पताल ले जाया गया लेकिन तब तक देरी हो चुकी थी। वजह दिल का दौरा पड़ने से मौत बताई जा रही है। pic.twitter.com/GlUA1irveA — Janak Dave (@dave_janak) October 2, 2022 -
మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు.. ఏడాది వ్యవధిలో తల్లిదండ్రులు కూడా
సాక్షి, నల్గొండ: స్నేహితుల సరదా పందెం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఏడాది వ్యవధిలో తల్లిదండ్రి మృతిచెందగా ఎనిమిదేళ్లుగా మృత్యువుతో పోరాడుతున్న కుమారుడు కూడా కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన బుధవారం కోదాడలో వెలుగులోకి వచ్చింది. కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులో నివాసం ఉంటున్న కొండపల్లి శ్రీనాథ్, గౌతమి దంపతులకు కృష్ణకాంత్, శివ(29) సంతానం. శ్రీనాథ్ న్యాయవాదిగా, గౌతమి ప్రైవేట్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు. కృష్ణకాంత్ ఉన్నత విద్య అభ్యసించి న్యాయవాద వృత్తిలో కొనసాగుతుండగా శివ డిగ్రీ అభ్యసిస్తున్నాడు. అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న వారి కుటుంబంలో అనుకోని అవాంతరం ఎదురైంది. ఎనిమిదేళ్ల క్రితం శివ స్నేహితులతో కలిసి కోదాడ పెద్ద చెరువు గుట్టపై పార్టీ చేసుకున్నారు. మద్యం అలవాటు లేని శివతో స్నేహితులు బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం చీకటి పడడంతో బైక్‌లపై అందరూ ఇళ్లకు బయలుదేరారు. సరదా పందెంతో ప్రమాదం బారిన పడి.. కాగా, స్నేహితులందరూ బైక్‌కు లైట్లు వేసుకోకుండా ఇళ్లకు ఎవరు ముందు వెళ్తే వారు పార్టీ ఇవ్వాలని పందెం పెట్టుకున్నారు. దీంతో మార్గమధ్యలో శివ బైక్ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి కిందపడిపోయాడు. ప్రమాదంలో అతడి తలకు బలమైన గాయం కావడంతో పాటు నడుము కింది భాగం చచ్చుబడిపోయింది. ఏడాది వ్యవధిలో తల్లిదండ్రి మృతి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివను కోదాడతో పాటు హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. కుమారుడి దీనస్థితి చూడలేక ఏడాది క్రితం తండ్రి శ్రీనాథ్ కన్నుమూయగా ఆరు నెలల క్రితం తల్లి కూడా మృతిచెందింది. సోదరుడి సంరక్షణలో చికిత్స పొందుతున్న శివ కూడా మృత్యువును జయించలేక మంగళవారం రాత్రి మృతిచెందాడు. తల్లిదండ్రులతో పాటు ఇప్పుడు సోదరుడు కూడా మృతిచెందడంతో ఆ ఇంట పెను విషాదం అలుముకుంది. -
దేవుడా.. ఏమిటీ విషమ పరిస్థితి
మెదక్ (దుబ్బాక): ఆనందంగా సాగి పోతున్న వారి జీవితంలో విధి వక్రించింది. గుండె పోటు రూపంలో భర్తను బలి తీసుకుంది. నిండు చూలాలైన భార్యకు భర్తను దూరం చేసింది. భర్త చనిపోయి అంత్యక్రియలు ముగిసిన గంటల వ్యవధిలోనే పురిటి నొప్పులు భరిస్తూ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి కానరాని లోకాలకు వెళ్లాడు. కనిపించే భాహ్య ప్రపంచంలో బిడ్డ కన్ను తెరిచాడు. నిన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లావు. ఇప్పుడు నీ కొడుకు రూపంలో మళ్లీ జన్మించావు అంటూ తీరని దు:ఖంలో మునిగిపోయిన ఆ పచ్చి బాలింతరాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. దేవుడా ఏమిటీ విషమ పరీక్ష అంటూ ఆ ఇల్లాలి వేదన ప్రతీఒక్కరి గుండెను కదిలిస్తోంది. ఇంతటి హృదయ విదారకరమైన సంఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సాఫీగా సాగిపోతున్న జీవితంలో.. మండల కేంద్రానికి చెందిన సాన సత్య లక్ష్మి, రాములు కుమారుడు బాలకిషన్ (28) (భాను) బీఫార్మసీ పూర్తిచేశాడు. మూడేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన స్రవంతితో వివాహం జరిగింది. బాలకిషన్ సిద్దిపేటలోని ఓ మెడికల్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితాన్ని చూసి విధికి కన్ను కుట్టిందో ఏమో ఈ నెల 26వ తేదీన బాలకిషన్ గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటికే బాలకిషన్ భార్య స్రవంతి నిండు చూలాలు. కడుపులో ఉన్న బిడ్డను మోస్తూ భర్త అంత్యక్రియల్లో పాల్గొన్న స్రవంతి దయయ స్థితికి ప్రతీ ఒక్కరూ చలించిపోయారు. గ్రామంలో ప్రతీ ఒక్కరితో సన్నిహితంగా మెలిగే బాలకిషన్ ఇక లేడన్న విషయాన్ని మిత్రులు, సన్నిహితులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు. -
ఎస్సై కల నెరవేరకుండానే..
నిజామాబాద్: ఎస్సై కొలువు సాధించాలని ఆ యువకుడు కన్న కలలను విధి కబలించింది. పరీక్ష రాసి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలి తీసుకుంది. నిజాంసాగర్ మండలం అచ్చంపేటకు చెందిన మార ఆంజనేయులు(30) ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష రాసి వస్తుండగా లారీ ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం హైదరాబాద్ శివారులోని దుండిగల్ వద్ద చోటు చేసుకుంది. అచ్చంపేటకు చెందిన మార అంజవ్వ కుమారుడు ఆంజనేయులు ఎస్సై కావాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అద్దెకు ఉంటూ చదువుకుంటున్నాడు. ఆదివారం దుండిగల్ లక్ష్మారెడ్డి కళాశాలలో ఎస్సై ప్రిలిమినరి పరీక్ష రాశాడు. అనంతరం షాపుర్‌లోని రూమ్‌కు బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొంది. లారీ టైర్లు ఆంజనేయులు మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లి అంజవ్వతో పాటు భార్య సారిక, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఇటు పరీక్ష.. అటు సోదరుడి వివాహం ఆంజనేయులు చిన్నాన్న కుమారుడి చింటూ పెళ్లి ఆదివారం నిజామాబాద్‌లో జరిగింది. ఎస్సై పరీక్ష రాసిన తర్వాత వివాహానికి హాజరు కావాలని ఆంజనేయులు అనుకున్నాడు. అంతలోనే రూమ్‌కు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
నా చావుకు కారణం వారే.. పిన్ని వాయిస్ రికార్డ్ బయట పెట్టడంతో..
కృష్ణా (కంకిపాడు): పిన్ని వరుస అయ్యే మహిళ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయటంతో యువకుడిని విచారణకు పిలిచిన పోలీసులు అతడిని కొట్టడం, దూషించటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో కలకలం రేపింది. కంకిపాడు చెందిన రాజులపాటి అరవింద్ (25) ఉద్యోగ అన్వేషణలో బెంగళూరులో ఉంటున్నాడు. పోలీసుస్టేషన్‌కు ఎదురుగా ఉన్న నివాసాల్లో తన తల్లిదండ్రులు, పక్కనే బాబాయ్ పిన్ని వాళ్ల ఇళ్లు ఉన్నాయి. రెండు రోజుల క్రితం తల్లికి, పిన్నికి మధ్య గొడవ జరగటంతో విషయం తెలుసుకున్న అరవింద్ తన వద్ద పిన్నికి సంబంధించి బయటి వ్యక్తులతో మాట్లాడిన వాయిస్ రికార్డులను తమ్ముడికి ఫోన్లో పంపాడు. ఈ విషయమై పిన్నిని ఆమె కొడుకు నిలదీశాడు. గతం నుంచి వాయిస్ రికార్డుల పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అరవింద్‌పై పిన్ని స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ నిమిత్తం అరవింద్‌ను పిలవటంతో గురువారం కంకిపాడుకు వచ్చాడు. పోలీసుస్టేషన్‌కు విచారణకు వెళ్లి తిరిగి వచ్చిన అరవింద్ శుక్రవారం తన నివాసంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొట్టి, తిట్టారు...బతుకు మీద ఆశ చచ్చిపోయింది ‘కొన్నేళ్లుగా పిన్ని మా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. నా వద్ద ఉన్న వాయిస్ రికార్డులను తమ్ముడికి పంపితే తల్లిని మార్చుకుంటాడని భావించాను. ఆరేళ్లుగా మాట్లాడని వ్యక్తిని నేను ఎలా వేధింపులకు గురిచేస్తాను. పిన్ని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. విచారణకు పిలిచి ఓ కానిస్టేబుల్ కొట్టిన దెబ్బలకు, తిట్టిన తిట్లకు, బూతులకు బతకాలనే ఆశ చచ్చిపోయింది. నిందితుడికి మాట్లాడే అవకాశం ఇవ్వమని ఎస్ఐకి విన్నవిస్తున్నా. నా చావుకు కారణం, పిన్ని, కానిస్టేబుల్’ అని రాసిన సూసైడ్ నోట్ వెలుగుచూసింది. దీంతో పోలీసుల వ్యవహారం వివాదాస్పదం అయింది. చేతికి అందివస్తాడనుకున్న కొడుకు శవంగా మారటంతో మృతుడి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. పోలీసుస్టేషన్లో తప్పుడు ఫిర్యాదుచేసిన తోటికోడలు, విచారణ పేరుతో పిలిచి ఇష్టానుసారం కొట్టిన కానిస్టేబులే తమ కుమారుడి మృతికి కారణం అని ఆరోపిస్తున్నారు. -
ఊర్లో ఆడవాళ్లు, మగవాళ్లు నామీద ఇంత పగతో ఉన్నారా?
విజయనగరం క్రైమ్: ఊర్లో ఆడవాళ్లు, మగవాళ్లు నామీద ఇంత పగతో ఉన్నారా? నాకు ఇప్పటివర కూ తెలియదు. ఈ జనాల మధ్యలో బతకలేను మరి. బై ఫ్రెండ్స్’ అంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి, రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన అందించిన వివరాలిలా ఉన్నాయి. దుప్పాడ గ్రామానికి చెందిన తాళ్లపూడి త్రినాథ్ (24) వీటీ అగ్రహారంలో ప్రియా సిమెంట్స్‌లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఊర్లో యువకులంతా కలిసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. అందులో కొన్ని మెసెజ్‌ల విషయంలో వచ్చిన మనస్పర్థల వల్ల త్రినాథ్ తీవ్ర మానసికక్షోభకు గురయ్యాడు. కొంతమందితో వచ్చిన తగాదాల కారణంగా వన్‌టౌన్‌లో కేసు కూడా నమోదైంది. దీంతో మరింత మనస్తాపం చెందిన త్రినాథ్.. ఆదివారం ఉదయం 8.50 గంటలకు వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి బై ఫ్రెండ్స్ అంటూ మెసెజ్ చేసి, 9 గంటలకు అలకానంద కాలనీకి చేరుకుని, రైల్వేట్రాక్ పక్కన బైక్ పార్క్‌చేశాడు. అదే సమయంలో వస్తున్న సికింద్రాబాద్–భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి తల్లి గౌరమ్మ, తండ్రి అప్పారావు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్సై రవివర్మ తెలిపారు. -
క్షమించండి నాన్నా...
కర్నూలు : ‘‘నాన్నా.. నాకు బతకాలని లేదు. మీకు తెలుసు నేను ఓ యువతిని ప్రేమించిన విషయం. ఆమె ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకున్నాను. కానీ ఆమె ఇప్పుడు లేదు. ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు తెలియదు. నా ప్రేయసి ఎక్కడ ఉన్నా బాగుంటుందని ఇన్నాళ్లూ బతికాను. ఆమె బలవన్మరణం చెందిన విషయం తెలిసింది. ఇక నేను బతకను. సారీ నాన్నా’’ అంటూ సూసైడ్ నోట్ రాసి మంగలి శివప్రసాద్ (22) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బి.అగ్రహారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బి.అగ్రహారం గ్రామానికి చెందిన మంగలి రామచంద్ర, వసుంధర దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివప్రసాద్ కోడుమూరు పట్టణంలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కోడుమూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఓ యువతి అదే కళాశాలలో డిగ్రీ చదువుతోంది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని, వేరే చోటుకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. గత ఏడాది కొంతకాలం వేరే చోటుకు వెళ్లిపోయారు. ఈ విషయం రెండు కుటుంబాల వారికీ తెలియడంతో వారిని వెతికి పట్టుకుని తీసుకువచ్చారు. ఇరు కుటుంబాల పెద్దలు పంచాయితీ చేశారు. వీరికి మైనార్టీ తీరలేదు కాబట్టి కొంతకాలం దూరం పెట్టి మైనార్టీ తీరిన తరువాత వివాహం చేద్దామని పెద్దలు మాట్లాడుకొని, ప్రేమికులను ఎవరి ఇంటికి వారిని పంపించారు. అయితే వీరిద్దరూ దూరంగా ఉన్నా వారి మధ్య ప్రేమ మరింత బలపడింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఈ క్రమంలోనే ఆ యువతి సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం శివప్రసాద్‌కు ఆ విషయం తెలిసింది. తను ప్రేమించిన అమ్మాయి లేనప్పుడు తను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలి పనులకు వెళ్లిన అమ్మ తిరిగి ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు వేలాడుతున్న కుమారుడిని చూసి గుండెలు బాదుకుంది. చుట్టు పక్కల వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్‌కిషోర్ రెడ్డి తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అగ్నిపథ్ ఆందోళనలతో నిలిచిన రైలు.. సమయానికి వైద్యం అందక వ్యక్తి మృతి
సాక్షి, విజయనగరం: త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు దేశ వ్యాప్తంగా హింసాత్మకంగా మారిన విషయం తెలిసింది. ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన అల్లర్లు రూ.కోట్లలో ఆస్తినష్టాన్ని మిగల్చడమే కాకుండా పలుచోట్ల ప్రాణాలను కూడా బలితీసుకున్నాయి. అగ్నిపథ్ ఆందోళన నేపథ్యంలో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కొత్తవలసలో నిలిపివేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గుండె జబ్బు చికిత్స కోసం ఒడిశా నుంచి వస్తున్న జోగేష్ బెహరా(70) అనే వృద్ధుడు మృతి చెందాడు. విశాఖలో రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు బెహరా కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే చికిత్స కోసం ఒడిశా నుంచి విశాఖకు అతని కుటుంబ సభ్యులు కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. అయితే అగ్నిపథ్ అల్లర్లతో విశాఖ వెళ్లాల్సిన రైలును అధికారులు కొత్తవలసలోనే నిలిపివేశారు. సమయానికి అంబులెన్స్ లేక కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందారు. సమయానికి వైద్యం అందకనే జోగేష్ మృతిచెందాడని బాధితుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విశాఖలో రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు చదవండి: అగ్నిపథ్ ఆందోళనలు: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం -
రెండు రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య
రాజేంద్రనగర్: సహజీవనం చేస్తున్న మహిళను రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఏమైందో తెలియదు కానీ కాబోయే భార్యకు ఫోన్ చేసి ‘తనను బాగానే అర్థం చేసుకున్నావని.. మంచిగానే చూసుకుంటున్నావని.. కానీ నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ’ ఫోన్ చేసి ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి కడప జిల్లాకు చెందిన విజయ్‌కుమార్(40) కొండాపూర్ రైల్వే స్టేషన్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి 15 ఏళ్ల క్రితం ప్రశాంతి అనే మహిళతో వివాహం జరిగింది. ఒక కుమారుడు పుట్టిన అనంతరం భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వేరుగా ఉంటున్నారు. ఎనిమిదేళ్ల క్రితం టపాచబుత్ర ప్రాంతానికి చెందిన మంజుప్రియతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఏడాదిగా విజయ్‌కుమార్, మంజుప్రియ సహజీవనం చేస్తున్నారు. ఉప్పర్‌పల్లిలోని కె.ఎన్.ఆర్ అపార్ట్మెంట్లో అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వివాహం చేసుకోవాలని మంజుప్రియ ఒత్తిడి తేవడంతో ఈ నెల 25న ఇరువురు పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన పత్రికలను సైతం బంధువులకు అందజేశారు. గత వారం విజయ్‌కుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి కనిపించకుండా పోయాడు. దీంతో మంజుప్రియ టపాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు ఆదివారం రాజేంద్రనగర్ పీఎస్‌కు కేసును బదులాయించారు. ఎస్సై శ్వేత ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం విజయ్‌కుమార్, మంజుప్రియ స్టేషన్‌కు వచ్చి తాము 25న వివాహం చేసుకుంటున్నామని కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో వారికి చట్ట ప్రకారం నోటీసు ఇచ్చి వివరాలను నమోదు చేసుకున్నారు. సోమవారం ఉదయం మంజుప్రియ పెళ్లి షాపింగ్ కోసం తన సోదరితో కలిసి బయటికి వెళ్లింది. విజయ్‌కుమార్ సైతం తాను కూడా కొద్దిసేపట్లో షాపింగ్‌కు వెళతానని చెప్పి ఇంట్లోనే ఉన్నాడు. రెండు గంటల తర్వాత మంజుప్రియకు ఫోన్ చేసిన విజయ్‌కుమార్ తనను బాగానే అర్థం చేసుకున్నావని, బాగానే చూసుకుంటున్నావని చెబుతూ తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో ఆందోళనకు గురైన మంజుప్రియ అతడితో ఫోన్లో మాట్లాడుతూనే ఇంటికి బయలుదేరింది. కొద్ది దూరం రాగానే విజయ్‌కుమార్ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. హుటాహుటిన ఇంటికి వచ్చిన మంజుప్రియ లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో స్థానికులు, రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే విజయ్‌కుమార్ మృతి చెంది ఉన్నాడు. దీంతో మంజుప్రియ తాను బతికి ఏమి ప్రయోజనం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఖైరతాబాద్ పట్టాల వద్ద ఉన్నట్లు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విజయ్‌కుమార్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతికి సంబంధించి∙పూర్తి వివరాలు తెలియలేదని పోలీసులు వెల్లడించారు. మొదటి భార్యకు సంబంధించిన విడాకుల కేసు కోర్టులో ఉన్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వివాహిత మహిళతో యువకుడి సహజీవనం.. కన్న కొడుకుని తీసుకెళ్లి..) -
భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం
విశాఖపట్నం (లావేరు) : మండలంలోని అదపాక జంక్షన్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా అల్లిపురం ప్రాంతానికి చెందిన కె.వేణు(28), తిలోత్తమ డ్యాన్సర్లు. గత ఏడాది నవంబర్‌లో ప్రేమ వివాహం చేసుకొని రణస్థలం మండలం జేఆర్‌పురంలో నివాసముంటున్నారు. సోమవారం రాత్రి నరసన్నపేటలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాంకు వెళ్లేందుకు రణస్థలం నుంచి స్కూటీపై దంపతులు బయలుదేరారు. లావేరు మండలం అదపాక జంక్షన్‌కు వచ్చేసరికి అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టారు. వేణు రహదారిపై పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన తిలోత్తమను 108లో రిమ్స్‌కు తరలించారు. లావేరు పోలీస్ స్టేషన్ హెచ్‌సీ జి.రామారావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. వేణు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. -
భార్యకు చీర కట్టుకోవడం రాదని భర్త ఆత్మహత్య
సాక్షి ముంబై: ఇటీవల వింటున్న ఆత్మహత్యలు చూస్తే చాలా సిల్లీగా, కామెడిగా కనిపిస్తున్నాయి. ఆ కారణాలను వింటుంటే చిర్రెత్తుకొచ్చేలా ఉంటున్నాయి. మరీ అర్థంపర్థ లేని చిన్న చిన్న కష్టాలకు ఆత్మహత్యలకు వెళ్లిపోతున్నారు. చిన్నపిలలు దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే... మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో 24 ఏళ్ల వ్యక్తి ఆరునెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఆ మహిళ అతని కంటే ఆరేళ్లు పెద్దది. కానీ ఆమెకు చీర కట్టుకోవడం, మాట్లాడటం, నడవటం సరిగా రాదు. దీంతో అసంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పైగా సూసైడ్ నోట్లో తన భార్యకు చీరకట్టుకోవడం రాదనే చనిపోతున్నానని పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సార్ అర్జంట్ ఒక ఫోన్ కాల్’.. ఫోన్ దొంగ వెంటపడి రైలు కింద నుజ్జయిన పెద్దాయన -
పోలీసుల దాష్టీకానికి యువకుడు బలి!
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసుల దాష్టీకానికి ఓ యువకుడు మృతి చెందాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బైక్ ఎన్ఓసీ విషయంలో బాలిజీ మోటర్స్ షోరూం యజమానితో ఈ నెల 10న ప్రశాంత్, శ్రావన్ అనే ఇద్దరు యువకులు గొడవ పడ్డారు. దీనిపై షోరూం యజమాని గణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రశాంత్, శ్రావన్‌లను పోలీసు స్టేషన్‌కు పిలిపించిన ఎస్ఐ ఉదయ్ కిరణ్ వేధించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐ ఉదయ్ కిరణ్ వేధింపులు భరించలేకనే ఈ నెల 12 న ప్రశాంత్ పోలిసు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. 12 రోజులుగా చికిత్స పొందుతూ.. మృతి చెందాడు. ఈ ఘటనలో గణపురం ఎస్ఐ ఉదయ్ కిరణ్, షోరూం యజమానిపై కేసులు నమోదు అయ్యాయి. ఎస్ఐ ఉదయ్‌కిరణ్‌కు సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆ కుటుంబంలో మిగిలింది ఒక్కరే..!
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు వెంటాడుతోంది. 15ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కుటుంబంలో ఆరుగురిని బలి తీసుకుంది. తల్లీకొడుకు మాత్రమే ప్రాణాలతో అప్పుడు బయట పడగా.. తాజాగా జరిగిన ప్రమాదంలో కొడుకునూ మృత్యువు కబళించింది. పుట్టిన రోజే మృత్యుఒడికి చేరడంతో స్థానికంగా విషాదం నెలకొంది.. వివరాలిలా ఉన్నాయి.. పదిహేను ఏళ్ల క్రితం రామకృష్ణాపూర్లో నివాసం ఉంటున్న బానోతు నిర్మల కుటుంబం దైవ దర్శనం కోసం తిరుపతికి వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నెల్లూరు జిల్లాలో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో నిర్మల భర్త రతన్‌నాయక్, పెద్ద కుమారుడు, తల్లి, సోదరుడు, మరిది, బంధువు అయిన డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో నిర్మల, చిన్న కుమారుడు వంశీకృష్ణ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం షాక్ నుంచి కోలుకోవడానికి నిర్మలకు ఆరేళ్లు పట్టింది. మంచిర్యాల రాంనగర్లో నివాసం ఉంటోంది. ఆ చేదు జ్ఞాపకాలను మది నుంచి చెరిపేసుకుంటూ ఉన్న ఒక్కగానొక్క కుమారుడు వంశీకృష్ణ(21)ను కంటికి రెప్పలా చూసుకుంటూ పాలిటెక్నిక్ చదివించింది. ప్రస్తుతం వంశీకృష్ణ ఉన్నత చదువుల కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు. 21వ పుట్టిన రోజునే.. ఇష్టమైన బైక్‌తో.. బానోతు వంశీకృష్ణ జన్మదినం సోమవారం కావడంతో అప్పటి వరకు ఇంట్లో సరదాగా ఉండి ఆలయానికి కూడా వెళ్లి వచ్చాడు. బయటకు వెళ్తున్నాని తల్లితో చెప్పి ద్విచక్ర వాహనంపై రామగుండం–పెద్దపల్లిలో తెలిసిన బంధువులు, స్నేహితులను కలిసేందుకు వెళ్లాడు. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ బ్రిడ్జి వద్ద ఊహించని రీతిలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పుట్టిన రోజునే చనిపోవడంతో తల్లి నిర్మల గుండెలవిసేల రోదించిన తీరు పలువురిని కంట తడిపెట్టించింది. ఆసరాగా ఉన్న ఒక్క కొడుకూ చనిపోవడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. కాగా నెల రోజుల క్రితమే వంశీకృష్ణ ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. అదే బండిపై వెళ్తూ అదుపుతప్పి ప్రాణాలు కోల్పోయాడు. అందరినీ కోల్పోయి కొడుకుతో ఉంటున్న తల్లి నిర్మల ఇప్పుడు కొడుకునూ కూడా పోగొట్టుకుని అనాథగా మిగిలిపోయింది. బైక్ అదుపుతప్పి యువకుడి దుర్మరణం రామగుండం: బైక్ అదుపుతప్పి పడిపోయిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. అంతర్గాం ఎస్సై నూతి శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కు చెందిన బానోతు వంశీకృష్ణ(21) సోమవారం బైక్‌పై కరీంనగర్ వెళ్తున్నాడు. బసంత్‌నగర్ రైల్వే ఫ్లైఓవర్ వంతెన సమీపంలో వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. నూతనంగా కొనుగోలు చేసిన పల్సర్ బైక్‌పై అతివేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని, వంశీకృష్ణ హెల్మెట్ కూడా పెట్టుకోలేదని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
కోర్టుకు హాజరు కావాలంటూ.. చనిపోయిన వ్యక్తికి నోటీసులు!!
సాక్షి అస్సాం(సిల్చార్): కొన్ని సంఘటనలను చూస్తే మన వ్యవస్థలోని లోపాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సామాన్యుడిని ఇష్టానుసారమో లేదంటే నిర్లక్ష్యపూరిత వైఖరితోనో కేసులు పెట్టి.. ఇబ్బంది పెట్టడమే కాకుండా అధికారులు సైతం చిక్కుల్లో పడుతుంటారు. అచ్చం అలాంటి ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి చనిపోయి ఆరేళ్లైంది. ఇప్పుడు అతను తన భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని నోటీసులు పంపారు. వివరాల్లోకెళ్తే.... అస్సాంలోని సిల్చార్ గ్రామానికి వచ్చి నివాసం ఉన్న శ్యామ్ చరణ్ దాస్ పై అక్రమ వలసదారునిగా కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అయితే ఆ వ్యక్తి మే 6, 2016న 74 ఏళ్ల వయసులో చనిపోయాడు. అతని మరణం తర్వాత కుటుంబ సభ్యులు అస్సాం ప్రభుత్వం జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడంతో న్యాయమూర్తి ఆ కేసును కొట్టేశారు. అస్సాం కోర్టు దాస్ మరణాన్ని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 23, 2016న కేసు ముగించేసింది కూడా. పైగా న్యాయమూర్తి నాటి కోర్టు ఉత్తర్వుల్లో ఇలా రాశారు... ‘‘సుదన్ రామ్ దాస్ కుమారుడైన చరణ్ దాస్ కుటుంబ సభ్యులు మే 06, 2016న సిల్చార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో మరణించినట్లు మరణ ధృవీకరణ పత్రాలను సమర్పించారు. తాలిగ్రామ్ ఉదర్‌బాండ్ నివాసి అయిన అనుమానాస్సద ఓటరు అయిన దాస్ రికార్డుల ప్రకారం అతని తండ్రి సుధన్ రామ్ దాస్ పేరు 1965 నుంచి 1970 ఓటర్ల జాబితాలో ఉంది కావున కేసును కొట్టివేస్తున్నాం’’ అని జడ్డీ పేర్కొన్నారు. కానీ, ఈ ఏడాది ప్రారంభంలో అక్రమ వలసదారునిగా అనుమానంతో సరిహద్దు పోలీసులు చరణ్ దాస్ పై తాజాగా కేసు నమోదు చేశారు. దీంతో కాచర్ జిల్లాలోని ఫారిన్ట్రిబ్యునల్ (ఎఫ్టీ-3) ప్రకారం అతని పై కేసు నమోదైందని మార్చి 15న నోటీసులు జారీ చేసింది. పైగా తన భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు మార్చి 30న హాజరుకావల్సిందిగా స్పష్టం చేసింది. విశేషం ఏంటంటే.. ఏ కోర్టు అయితే కేసును కోట్టేసిందో మళ్లీ ఆ కోర్టే నోటీసులు జారీ చేసింది. పైగా ఆ నోటీసులో చరణ్ దాస్ ప్రతిస్పందించడంలో విఫలమైనప్పుడు, ట్రిబ్యునల్ రిఫరెన్స్ ఎక్స్‌పార్టీగా నిర్ణయించి అతనిపై తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొంది. అయితే దాస్ భార్య సులేఖా దాస్ కూడా ఎక్స్-పార్టీ ఆర్డర్లో తన భారతీయ గుర్తింపును కోల్పోయింది. ఏప్రిల్ 2018లో విదేశీయుల కోసం ఉద్దేశించిన డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఏప్రిల్ 2020లో బెయిల్‌పై విడుదలైంది. అయితే మార్చి 16న, ఉదర్‌బాండ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారుల బృందం తాలిగ్రామ్ గ్రామంలోని సులేఖా దాస్ ఇంటికి చేరుకుని, మృతుడికి వ్యతిరేకంగా కొత్త నోటీసును కుటుంబ సభ్యులకు అందజేసింది. చరణ్ దాస్ కుమార్తె, బేబీ దాస్ మాట్లాడుతూ.. “మా తండ్రిని అర్ధ దశాబ్దం క్రితమే కోల్పోయాం. అయితే అతను జీవించి ఉన్నాడని కోర్టు అంటోంది. మా నాన్నగారి దగ్గర తన గుర్తింపును రుజువు చేసేందుకు తగిన పత్రాలు ఉన్నప్పటికీ, ఆయన బతికున్నప్పుడు మేము కోర్టు చుట్టూ తిరిగాం. ఇప్పుడు, అతని మరణం తర్వాత మేము అతని తరపున కోర్టుకు హాజరు కావాలి. ఎలా ప్రతిస్పందించాలో నాకు తెలియడం లేదు" అని అన్నారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) సామాజిక కార్యకర్త కమల్ చక్రవర్తి బేబీ దాస్‌కు తమ మద్దతును అందించారు. మార్చి 30న కోర్టు ముందు డాక్యుమెంట్లు సమర్పించడంలో వారు ఆమెకు సహాయం చేయనున్నారు. ఏదీఏమైన మన వ్యవస్థ లోపాలు తేటతెల్లమవుతున్నాయి. పోలీసుల ఫీల్డ్ వెరిఫికేషన్ ఆధారంగా చనిపోయిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలని కోరారు. అంటే డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం పోలీసులు నిందితుడి ఇంటికి కూడా వెళ్లలేదని అర్థమవుతోంది. (చదవండి: కన్నతల్లి నిర్వాకం... పసికందుని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి) -
Hyderabad: ఐదో అంతస్తు నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
-
Hyderabad: ఐదో అంతస్తు నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లోని కోఠి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తాలో ఉన్న బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ షాపింగ్ మాల్ సెంటర్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకిన ఆ యువకుడిని ప్రకాశం జిల్లాకు చెందిన డానియల్(25)గా పోలీసులు గుర్తించారు. పెళ్లి కావడంలేదనే మనస్తాపంతో గత కొంత కాలంగా మానసిక ఆందోళనతో ఉన్నట్లు సుల్తాన్ బజార్ సీఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. -
హోలీ వేళ విషాదం.. మద్యం మత్తు ఫ్రెండ్స్‌తో డ్యాన్స్ చేస్తుండగా..
భోపాల్: శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రజలందరూ ఎంతో ఆనందంతో వేడుకలను జరుపుకున్నారు. కాగా హోలీ వేడుకల్లో అపశృతి జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తనను తానే కత్తితో పొడుచుకుని మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇండోర్‌లో గోపాల్ సోలంకీ(38) అనే వ్యక్తి హోలీ వేళ తన స్నేహితులతో కలిసి ఫుల్‌గా మద్యం సేవించాడు. మద్యం మత్తులో సోలంకీ ఓ కత్తిని చేతిలో పట్టుకుని డ్యాన్స్ ఫ్రెండ్స్‌తో డ్యాన్స్ స్టెప్పులేశాడు. ఈ క్రమంలో చేతిలో కత్తి ఉన్న విషయాన్ని మరిచిపోయి తన ఛాతిని నాలుగు సార్లు పొడుచుకుంటూ డ్యాన్స్ చేశాడు. తాగిన మైకంలో కత్తి ఘాటును ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఇంతలో రక్తం విపరీతంగా కారుతుండటం పక్కనే ఉన్న ఓ మహిళ గమనించి ఆందోళనకు గురైంది. దీంతో సోలంకీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గుండె భాగం నుంచి రక్తం ఎక్కువగా కారిపోవడంతో అతను అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పండుగ వేళ గోపాల్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
చెయ్యి విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు.. కోడి గుడ్డు కూర వండలేదని..
మెదక్, మనోహరాబాద్(తూప్రాన్): కోడి గుడ్డు కూర వండలేదని యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాజుగౌడ్ వివరాల మేరకు.. మండలంలోని రంగాయపల్లి గ్రామానికి చెందిన మస్కూరి నర్సింలు, సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మాములేశ్ (19) ఎనిమిది నెలల క్రితం బైక్ ప్రమాదంలో చెయ్యి విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఎలాంటి పని చేయడం లేదు. మంగళవారం రాత్రి ఇంట్లో కోడి గుడ్డు కూర వండమని తల్లిని అడిగితే ఇంత రాత్రి ఎలా వండాలని అని మందలించింది. దీంతో ఇంట్లో గొడవపడి మాములేష్ బయటకు వెళ్లిపోయాడు. తల్లి సుశీల చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. బుధవారం ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
శివయ్యా.. మాకెందుకీ శిక్ష
వరంగల్ (మంగపేట): మహాశివరాత్రి.. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈనేపథ్యంలో మహాశివుడి దర్శనం కోసం వచ్చి.. పుణ్యస్నానానికి గోదావరిలోకి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాతపడ్డాడు. తల్లిదండ్రుల కళ్లెదుటే కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. వివరాలు.. కమలాపురంలోని టీడీపీ కాలనీకి చెందిన భూక్యా రవి, శారద తమ కుమారులు చంటి, సాయికుమార్(19)తో కలిసి ఉదయం సుమారు 8 గంటలకు ఇంటెక్వెల్ సమీపంలో గోదావరి స్నానానికి వెళ్లారు. తల్లి దండ్రులు గోదావరిలో స్నానాలు చేస్తుండగా సాయికుమార్ తన స్నేహితుడు భూక్యా తరుణ్‌తో కలిసి మరోచోట స్నానం చేసేందుకు వెళ్లాడు. తరుణ్ ఒడ్డుపై ఉండగా సాయికుమార్ గోదావరిలో దిగేందుకు ప్రయత్నిస్తూ.. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో పడిపోయాడు. చేయి అందించాలని తరుణ్‌ను కోరాడు. చేయి అందించిన తరుణ్ సైతం సాయికుమార్‌తో పాటు గోదావరిలో పడిపోయాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో కాపాడాలంటూ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు తరుణ్‌ను బయటకు తీసుకురాగా అప్పటికే సాయికుమార్ నీటమునిగాడు. తహసీల్దార్ సలీం, ఎస్సై తాహెర్‌బాబా సంఘటనా స్థలానికి చేరుకుని నాటు పడవల సాయంతో గజఈతగాళ్లు వలలతో గాలింపు ముమ్మరం చేశారు. స్థానిక మత్స్యకారులు నాటుపడవల సాయంతో వలలతో గాలిస్తూ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సాయికుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్లెదుటే విగతజీవిగా మారిన కుమారుడి మృతదేహం వద్ద .. శివయ్యా.. ఏం పాపం చేశామని ఈ శిక్ష వేశావు.. నీ దర్శనానికే వచ్చాముకదా.. దయ చూపలేదు కదా.. అంటూ ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది. కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని...
సాక్షి, బన్సీలాల్‌పేట్(హైదరాబాద్): చాచానెహ్రూనగర్ బస్తీలో విషాదం చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ పథకం ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. అన్నీ అర్హతలు ఉన్నా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకపోవడంతో మనోవ్యథతో మంచం పట్టి ఇంటి పెద్ద మరణించడంతో.. భార్యా పిల్లలు రోడ్డు పాలయ్యారు. ఈ కన్నీటిగాథకు రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకుల తీరే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. చాచానెహ్రూనగర్ బస్తీలో వెల్డింగ్ పని చేసుకునే రవి(36) భార్య బాలమణి, ఐదుగురు ఆడపిల్లలతో జీవనం సాగిస్తున్నారు. స్థానికంగా ఇల్లు ఉన్న రవి కుటుంబానికి ఇటీవల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయింపు జరగలేదు. ఈ విషయమై రవి రెవెన్యూ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగి తన గోడు వెళ్లబోసుకున్న ఫలితంగా లేకుండా పొయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రవి అస్వస్థతకు గురై మంచం పట్టాడని భార్య బాలమణి వాపోయారు. తీవ్ర మనోవేదనకు గురైన రవి అనారోగ్యంతో ఈ నెల 17న కన్నుమూశారు. శుక్రవారం తండ్రి రవి శవం ముందు ఆడపిల్లలు చుట్టూ కూర్చోని విలపించిన తీరు చూపరుల కంట తడి పెట్టించాయి. శుక్రవారం బన్సీలాల్‌పేట్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రవి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సదరు కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కేటాయించాలని కోరారు. చదవండి: Hyderabad: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చదవండి: దళిత మహిళా సర్పంచ్‌కు టీడీపీ ఉప సర్పంచ్ వేధింపులు -
అత్త సూటిపోటి మాటలు.. వేధింపులు భరించలేక అల్లుడు..
సాక్షి,హుబ్లీ (కర్ణాటక): అత్త వేధింపులకు అల్లుడు బలయ్యాడు. ఈ ఘటన హుబ్లీ తాలూకా బ్యాహట్టి గ్రామంలో చోటు చేసుకుంది. మహమ్మద్‌రఫిక్ నదాఫ్ అనే వ్యక్తి భార్య అసామతో కలిసి గ్రామంలోనే తన అత్త సాహెబీ ఇంటి ఎదుటనే నివాసం ఉంటున్నాడు. అత్తతోపాటు పొరుగింటిలో ఉంటున్న ముదుకప్ప, మాంత్యలు సూటిపోటి మాటలతో వేధిస్తుండటంతో మహమ్మద్‌రఫిక్ నదాఫ్ మనో వేదనకు గురై సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హుబ్లీ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఏఎస్ఐకు 20 ఏళ్ల జైలుశిక్ష మైసూరు: ఆపదలో ఉన్నవారిని రక్షించాల్సిన పోలీస్ అధికారి అయి ఉండి మతిస్థిమితం లేని యువతిని చెరబట్టిన కామాంధునికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం అంతర సనహళ్ళి వద్ద యువతిపై ఏఎస్ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధిస్తూ జిల్లా 2వ సెషన్స్ కోర్టు జడ్జి హెచ్.ఎస్.మల్లిఖార్జునస్వామి మంగళవారం తీర్పు వెలువరించారు. ఒంటరి యువతిని చూసి.. 2017న జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్లినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటిరోజును ఈ దారుణం తెలిసి యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమేశయ్యను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఉమేశయ్య నేరం చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో శిక్ష తప్పలేదు. ప్రభుత్వ న్యాయవాది కవిత పకడ్బందీగా వాదనలు వినిపించారు. రూ. లక్ష జరిమానాను బాధితురాలిగా అందజేయాలని దోషిని ఆదేశించారు. కాగా ఉమేశయ్య జీపు డ్రైవర్‌పై నేరం నిరూపణ కాకపోవడంతో అతనికి విముక్తి కల్పించారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కామాంధులకు గుణపాఠం కావాలని పేర్కొన్నాయి. చదవండిః కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఏకరీతిగా భూ రిజిస్ట్రేషన్..! -
మదనపల్లెలో దారుణం.. పొట్టేలు తల అనుకుని యువకుని తల..
సాక్షి, మదనపల్లె: పొట్టేలు అనుకుని యువకుని తల నరికిన ఘటన మండలంలో కలకలం రేపింది. వివరాలు.. మదనపల్లె మండలం వలసపల్లెలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి కనుమ పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగా ఊరి పొలిమేరలో గ్రామదేవతకు జంతు బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తలారి లక్ష్మణ కుమారుడు తలారి సురేష్(35) పొట్టేలను పట్టుకుని ఉన్నాడు. మరో తలారి గంగన్న కుమారుడు చలపతి మద్యం మత్తులో పొట్టేలును నరకబోయి సురేష్ తల నరికేశాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో బాధితుడిని స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఫాస్ట్‌ఫుడ్ లేదన్నాడని.. కత్తితో తెగబడ్డాడు) -
ప్రాణం తీసిన చైనా మాంజా.. మంచిర్యాలలో విషాదం
సాక్షి, మంచిర్యాల: సంక్రాంతిపూట గాలిపటాల పండుగ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. చైనా మాంజా ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. మంచిర్యాల జిల్లాలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న దంపతులకు గాలిపటం (చైనా మాంజ) దారం అడ్డు తగిలింది. ఆ దారం మెడకు చుట్టుకోవడంతో భీమయ్య అనే వ్యక్తి గొంతు కోసుకుపోయింది. దీంతో భీమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి స్వస్థలం జగిత్యాల జిల్లా గొల్లపల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో యువతి.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో శనివారం గాలిపటంలోని చైనా మాంజా 20 ఏళ్ల యువతి గొంతు కోయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఉజ్జయినిలోని మాధవ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జీరో పాయింట్ బ్రిడ్జి వద్ద ఓ మహిళ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాలిపటం దారం గొంతును కోసేయడంతో తీవ్ర రక్తస్రామై యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు పేర్కొన్నారు. -
బతుకునిచ్చే చెట్టుపైనే ఊపిరి పోయె..
సాక్షి, తంగళ్లపల్లి(కరీంనగర్): కుటుంబాన్ని పోషించేందుకు 20 ఏళ్లు గల్ఫ్ బాట పట్టిన ఇంటి పెద్ద.. ఇకపై కళ్లముందే ఉంటూ, తమను కంటికి రెప్పలా చూసుకుంటాడని భావించిన భార్యాబిడ్డల ఆశలు గల్లంతయ్యాయి. కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు అదే చెట్టుపై మరణించడంతో కుటుంబంతోపాటు గ్రామంలో విషా దం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన గుగ్గిళ్ల కిష్టయ్య గౌడ్ (59) బతుకుతెరువుకు 20 ఏళ్లుగా గల్ఫ్‌లో ఉన్నాడు. ఆరు నెలల క్రితమే గ్రామానికి వచ్చి కులవృత్తి చేసుకుంటూ ఉండిపోదామని నిర్ణయించుకున్నాడు. గౌడ సంఘంలో అతనికి 13 తాటి, 6 ఈత చెట్లను కేటాయించగా.. రెండు నెలలుగా కల్లుగీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం ఉదయం కల్లు గీసేందుకు గ్రామ శివారులోని తాటిచెట్టు ఎక్కాడు. చెట్టు దిగుతుండగా మోకు జారి చెట్టుపైనే వెనక్కి వంగిపోయాడు. ఎంత ప్రయత్నించినా పైకి లేవలేకపోయాడు. మోకు గట్టిగా బిగుసుకుపోవడంతో ఊపిరాడక చెట్టుపైనే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు, గ్రామస్తులు జేసీబీ సా యంతో మృతదేహాన్ని చెట్టుపైనుంచి కిందకు దింపారు. మృతునికి భార్య పద్మ, నలుగురు కూతుళ్లు రజిత, నవ్య, కావ్య, స్వాతి, కొడుకు సాయి ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల వివాహాలు జరిగాయి. మూడో కూతురు హైదరాబాద్‌లోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. కవల పిల్లలైన స్వాతి, సాయి డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నారు. మృతుని భార్య పద్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. చదవండి: ఆ ఇమ్యూనిటీతో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే శక్తి వస్తుంది -
రెండో పెళ్లి.. తల్లిదండ్రులు వేరు కాపురం ఉండనివ్వలేదని..
కల్లూరు: వేరు కాపురం ఉంటామంటే తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ శరత్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాలు.. చిన్నటేకూరు గ్రామానికి చెందిన అబ్దుల్ కరీం దుస్తుల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. మొదటి భార్య 2018లో ఆత్మహత్యకు పాల్పడగా నాలుగు నెలల క్రితమే నందికొట్కూరు మండలం చెట్కూరుకు చెందిన ఫాతిమాబీని రెండో వివాహం చేసుకున్నాడు. కాగా తాము వేరు కాపురం ఉంటామని కొంతకాలంగా కోరుతున్నా.. అందుకు తల్లిదండ్రలు అంగీకరించడం లేదు. చదవండి: POCSO Act: బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష! తాము బతికి ఉన్నంత వరకు అందరం కలిసే ఉందామని సర్దిచెప్పేవారు. దీంతో మనస్తాపం చెంది అబ్దుల్ కరీం మంగళవారం సాయంత్రం దుస్తుల దుకాణంలో పురుగు మందు తాగాడు. గమనించి కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటిపకే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. పోలీసులు బుధవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. భార్య కాపురానికి రావడంలేదని... కర్నూలు: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన పాత కల్లూరులో నివాసముంటున్న పులికొండ(27) ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. దేవనకొండ మండలం తెర్నేకల్‌కు గ్రామానికి చెందిన మేరీతో పదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం సంసారం సాఫీగా సాగింది. పులికొండ మద్యానికి అలవాటుపడి భార్యను సరిగా చూసుకోకపోవడంతో ఆమె గొడవ పడి పుట్టినింటికి వెళ్లింది. చదవండి: 9 లక్షల పొదుపు మొత్తం.. అంతా ఊడ్చేశారు.. అప్పుడు తెలిసింది! పెద్ద మనుషులు రెండు సార్లు పంచాయితీ చేసినప్పటికీ పులికొండలో మార్పు రాలేదు. దీంతో ఆమె కాపురానికి రానని తేల్చి చెప్పడంతో మనస్తాపానికి గురై కల్లూరు వక్కెరవాగు వద్ద ఈ నెల 6న మద్యంలో పురుగు మందు కలుపుకుని తాగి అదే విషయాన్ని సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. అతను అక్కడికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న పులికొండను ఆసుపత్రిలో చేర్పించగా కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. నాలుగవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం: సరదా కోసం శరీరంలోకి గాలి నింపి చంపేశారు!
కోల్‌కతా: సరదా కోసం కొంతమంది విపరీతబుద్ధితో ప్రవర్తిస్తూ.. ఎదుటివారి ప్రాణాలు తీసి రాక్షస ఆనందం పొందుతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి పశ్చిమ బెంగాల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాక్షస బుద్ధి కలిగిన కొందరు.. ఓ వ్యక్తి శరీరంలోకి బలవంతంగా గాలి నింపుతూ మరణించేలా చేశారు. వివరాల్లో వెళ్లితే.. పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లాలో ఉన్న నార్త్ బ్రూక్ జూట్ మిల్లులో రెహమత్ అలీ వర్కర్ పనిచేస్తున్నాడు. నవంబర్ 16న నైట్ డ్యూటీ చేయడానికి రెహమత్ మిల్లుకు వెళ్లాడు. రెహమత్‌ని తోటి వర్కర్లు కొంతసేపు ఆటపట్టించారు. అంతటితో ఆగకుండా సరదా కోసం.. దారుణంగా ఎయిర్ పంపుతో అతని మలద్వారంలోకి బలవంతంగా గాలిని పంపారు. నిస్సహాయుడు అయిన రెహమత్ తనను వదిలిపెట్టమని ఎంత ప్రాధేయపడ్డా విడువకుండా వారు పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటన తర్వాత అతని ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో హుగ్లీలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత క్షిణించడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాలి పంపు ఒత్తిడి వల్ల అతని శరీరంలోని కాలయం పూర్తిగా పాడైపోవటంతో మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. అతనితో పాటు మిల్లులో పని చేసే.. షాజాదా ఖాన్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని రెహమత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. షాజాద్ జూట్ మిల్లును శుభ్రం చేసే ఎయిర్ పంప్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెహమత్ మృతికి బాధ్యతవహిస్తూ.. నష్టం పరిహారం చెల్లించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు యాజమాన్యం ఇంకా స్పందించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ప్రియుడు ఆత్మహత్య.. నువ్వు లేని జీవితం నాకొద్దు
పీలేరు రూరల్ : ‘నువ్వు లేని జీవితం నాకొద్దు’ అని ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక కడప మార్గంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. రొంపిచెర్ల మండలం గానుగచింతకు చెందిన పాలమంద కృష్ణయ్య కుమారుడు పి.శివశంకర్ (25) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేసేవాడు. అదే పంచాయతీ లోకవారిపల్లెకు చెందిన అబ్బునాయక్ కుమార్తె శిల్ప, శివశంకర్ పరస్పరం ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని భావించినా కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన శిల్ప ఐదునెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటికే వర్క్ ఫ్రం హోంలో ఉన్న శివశంకర్ ఈ ఘటనపై తీవ్రంగా కుంగిపోయాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని తిరుపతిలోని తమ కుమార్తె ఇంటికి నెలక్రితం పంపారు. అంతేకాకుండా శిల్ప జ్ఞాపకాల నుంచి దూరం చేయాలని తలచి వివాహం చేస్తామని చెప్పడంతో తిరస్కరించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న తిరుపతిలోని తన అక్క ఇంటి నుంచి శివశంకర్ అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా హలో అని..ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడు. ఈ పరిణామాల క్రమంలో పీలేరు–కడప మార్గంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఓ చింత చెట్టుకు ఉరి వేసుకుని ఓ యువకుడు బలవన్మరణం చెంది ఉండటం గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, శిల్పలేని జీవితం తనకు వద్దు.. అని తన వివరాలతో శివశంకర్ రాసి ఉన్న లేఖ అతడి జేబులో లభించింది. పీలేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నిమిత్తం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మరొకరిని పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలు
శ్రీనగర్: శ్రీనగర్‌లో 24 గంటల వ్యవధిలో ఉగ్రవాదులు మరొకరిని పొట్టనబెట్టుకున్నారు. బొహ్రి కదల్ ప్రాంతంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మొహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. బందిపొర జిల్లాకు చెందిన మొహమ్మద్ ఇబ్రహీం మహరాజ్‌గంజ్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఘటన నేపథ్యంలో భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. ఆదివారం సాయంత్రం బాటామాలూ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పోలీసు కానిస్టేబుల్ ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే. -
రెండో పెళ్లి చేసుకున్నాడని తండ్రిని చంపేశాడు
మహారాష్ట్ర: మానవ సంబంధాలు ఏమైపోతున్నాయో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. ఆస్తి కోసం లేక తనకు ఇష్టం లేని పని చేశారనో చంపడం వరకు వెళ్లి వాళ్ల జీవితాలను కటకటాలపాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి ఘటనే మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. (చదవండి: వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్) వివరాల్లోకెళ్లితే.....మహారాష్ట్రలోని థానేలోని ముర్బాద్ తాలూకాలోని దొంగర్ నవ్లే గ్రామంలో 35 ఏళ్ల వ్యక్తి తన తండ్రితో గత ఐదేళ్లుగా ఆస్తి కోసం గొడవ పడుతూ ఉన్నాడు. పైగా తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం కూడా అతనికి నచ్చలేదు. ఈ క్రమంలో అతను తన తండ్రిపై కక్ష పెంచుకుని ఒక రోజు రాత్రి తన తండ్రి నిద్రపోతున్నసయంలో వెళ్లి మళ్లీ ఆస్తి కోసం గొడవ చేసి అతి కిరాతంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో థానే పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. (చదవండి: ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) -
ప్రేమించి పెళ్లి, భార్య వేలు కట్‌చేసి పారిపోయిన భర్త
బంజారాహిల్స్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు అదనపు కట్నం కోసం భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ముంబైలో నివసించే హసి (22), జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరికి చెందిన రవి నాయక్ ఫేస్బుక్లో పరిచయమయ్యారు. రవి నాయక్ ఇటీవల ఆమెను పెళ్లి చేసుకొని నగరానికి తీసుకొచ్చాడు. హసి బ్యూటీషియన్‌గా పని చేస్తుండగా రవినాయక్ ఖాళీగా ఉన్నాడు. ఈ నెల 10వ తేదీన తనకు రూ. 50 వేలు కావాలంటూ రవి నాయక్ భార్యను అడగగా లేదనడంతో తీవ్రంగా కొట్టి కత్తితో ఓ వేలిని కట్ చేసి పారిపోయాడు. మరోసటి రోజు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో రవి నాయక్‌పై కేసు నమోదు చేశారు. మద్యానికి బానిసై ఆత్మహత్య సినీ పరిశ్రమలో క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్ సమీపంలోని సింధు టిఫిన్ సెంటర్ సమీపంలో అద్దెకుంటున్న తారకేశ్వర్రావు (42), సినీ క్యాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసై డబ్బుల కోసం భార్యతో గొడవ పడుతుండేవాడు రెండ్రోజుల క్రితం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కర్కశ తల్లి లక్ష్మీ అనూష అరెస్టు.. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే -
ఊహించని ప్రమాదం.. తండ్రితో కలిసి కాలేజీకి వెళ్తుండగా...
సాక్షి, ఖమ్మం: లారీ డ్రైవర్ మద్యం మత్తు ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నిర్లక్ష్యంగా లారీ నడపడంతో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి సమీపంలో వరంగల్– అశ్వారావుపేట ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన ఎనగందుల దేవయ్య అదే మండలంలోని పైనంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్నాడు. ఖమ్మంరూరల్ మండల పరిధిలోని సాయికృష్ణ నగర్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి కుమారుడు ఠాగూర్(18), కుమార్తె పవిత్ర ఉన్నారు. వారిద్దరూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ, మొదటి సంవత్సరాలు చదువుతున్నారు. చదవండి: వారి వయసంతా 25 లోపే.. అన్నీ హైస్పీడ్ స్పోర్ట్స్ బైక్‌లే పిల్లలను కాలేజీలో దిగబెట్టడానికి వెళ్లి.. కళాశాలలో దిగబెట్టేందుకని పిల్లలిద్దరినీ తీసుకొని దేవయ్య శుక్రవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గం మధ్యలోని కరుణగిరి సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. లారీ టైర్ ఠాగూర్ నడుముపై నుంచి వెళ్లడంతో కిడ్నీలు బయటకు వచ్చి అక్కడికక్కడే మృతిచెందాడు. దేవయ్య, పవిత్రలపై నుంచి కూడా లారీ వెళ్లడంతో ఇద్దరికీ తీవ్ర గామాలమ్మాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు 108కి సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి లారీ సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య పిండిప్రోలులో ఠాగూర్ అంత్యక్రియలు.. కాగా మృతుడు ఠాగూర్ అంత్యక్రియలు స్వగ్రామం పిండిప్రోలులో జరిగాయి. ఓ పక్క తండ్రీ కుమార్తె తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ఉండగా ఠాగూర్ అంత్యక్రియలను తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు బాధాతృప్త హృదయాలతో నిర్వహించారు. ఉన్నత చదువులు చదివి తమను సంతోషంగా చూసుకుంటావని అనుకుంటే కానరాని లోకాలకు వెళ్లిపోయావా కొడకా అంటూ ఠాగూర్ తల్లి రోదిస్తుంటే అక్కడున్న వారు కన్నీరుమున్నీరయ్యారు. -
మణికొండ నాలా విషాదం: బాధిత కుటుంబానికి పరిహారం
హైదరాబాద్: మణికొండ నాలా ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా.. నాలాను తవ్వి ఎలాంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకుండా అశ్రద్ధగా వ్యవహరించినందుకు... కాంట్రాక్టర్ రాజ్‌కుమార్‌పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, విధుల్లో అలసత్వం వహించినందుకు... మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ వితభానును కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులను జారీచేసింది. మృతుని కుటుంబానికి రూ. 5లక్షలను పరిహారంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈనెల 25న రాత్రి 9 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా మరమ్మతుల కోసం తీసిన గుంతలోపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రజనీకాంత్ గల్లంతయ్యారు. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత నెక్నాంపూర్ చెరువులో బాధితుడి మృతదేహం లభించిన విషయం తెలిసిందే. చదవండి: మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం -
మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం
సాక్షి, హైదరాబాద్: మణికొండ: డ్రైనేజీ కాలువలో కొట్టుకు పోయిన వ్యక్తిని ఎట్టకేలకు గుర్తించారు. సంఘటనా స్థలానికి పక్కనే ఉండే బాబానివాస్ అపార్ట్మెంట్ నుంచి శనివారం రాత్రి బయటకు వచ్చిన గోపిశెట్టి రజనీకాంత్ (42)నే మృతుడిగా తేల్చారు. డ్రైనేజీ కాలువలో పడిన స్థలం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని నెక్నాంపూర్ చెరువు ప్రవేశంలో సోమవారం డీఆర్ఎఫ్ బృందం మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడి అన్న, బావలు అతని చాతీపై ఉన్న ‘సప్పు’ అనే టాటూ గుర్తించి రజనీకాంత్‌గా నిర్ధారించారు. 35 గంటల పాటు మురుగునీటిలో ఉండటంతో శవం కుళ్లిపోయింది. నార్సింగి ఇన్స్పెక్టర్ గంగాధర్, ఎస్సై రాములుల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రజనీకాంత్ షాద్‌నగర్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా, అతని భార్య స్వప్న హైటెక్ సిటీలోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి స్వస్థలం హైదరాబాద్ నగరంలోని రాంనగర్ కాగా మణికొండలో ఫ్లాట్ కొనుగోలు చేసి ఇక్కడ నివసిస్తున్నట్టు బంధువులు తెలిపారు. చేతిలో పెరుగు ప్యాకెట్‌తో... డ్రైనేజీ కాలువలో కొట్టుకుపోయిన రజనీకాంత్ చేతిలో పెరుగు ప్యాకెట్‌ను అలాగే పట్టుకుని ఉన్నాడు. శనివారం రాత్రి ఇంట్లోనుంచి బయటకు వచ్చి ఓ షాపులో పెరుగు ప్యాకెట్‌ను కొనుగోలు చేసి పక్కనే ఉన్న మరో షాపులో సిగరెట్ కొనుగోలు చేసేందుకు రోడ్డు దాటుతూ వరదనీటిలో పడిపోయారు. అతను దాటిన ప్రదేశంలో అంతకు ముందు మట్టి ఉండటం, వరదకు అది కొట్టుకుపోయిందని గమనించకుండా కాలుపెట్టడంతోనే సంఘటన జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. -
పెళ్లి ముచ్చట్లు తీర లేదు.. అంతలోనే ఘోరం జరిగింది
రామభద్రపురం(విజయనగరం): ఆ ఇంటి ముంగిట కట్టిన పచ్చని కొమ్మలు వాడనే లేదు.. పెళ్లి ముచ్చట్లు తీర లేదు.. గణపతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించి.. సంతోషంగా సాగిపోతున్న నూతన జంటపై విధి కన్నెర్ర చేసింది. చెరువు రూపంలో భర్తను కాటేసింది. పెళ్లయిన రెండు నెలలకే ఆ ఇంట విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు పట్టణంలోని దుర్గాన వీధికి చెందిన రాంబార్కి తిరుపతిరావు(29) విశాఖపట్టణంలోని పెప్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రామభద్రపురం మండలంలోని జన్నివలస గ్రామానికి చెందిన పత్తిగుళ్ల కుమారిని ఈ ఏడాది జూన్ 24న వివాహం చేసుకున్నాడు. వినాయక చవితిని అత్తవారింట్లో సరదాగా జరుపుకుందామన్న ఉద్దేశంతో భార్యా భర్తలిద్దరూ సాలూరులో గురువారం సాయంత్రం బాలగణపతి విగ్రం కొనుగోలు చేసి జన్నివల స వచ్చారు. వినాయక పూజను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిపారు. అదేరోజు సాయంత్రం గ్రామం పొలిమేరల్లో ఉన్న పత్తిగుళ్లవాని చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు పూర్తిస్థాయిలో నిండడం, చెరువు లోతును గుర్తించని తిరుపతిరావు కాస్త ముందుకు వెళ్లాడు. అంతే.. ఈత రాకపోవడంతో కుటుంబ సభ్యుల కళ్లముందే మునిగిపోయాడు. భార్య కుమారి కేకలు వే యడంతో పలువురు చేరుకుని మునిగిపోతు న్న తిరుపతిరావును ఒడ్డుకు చేర్చారు. అప్పటికే నీరు ఎక్కువగా తాగడంతో హుటాహుటిన సాలూరు సీహెచ్‌సీకి తరలించినా ఫలితం లేకపోయింది. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు మృతదేహానికి సాలూరు సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. వివాహమైన రెండు నెలలకే తిరుపతిరావు మృతితో అటు కన్నవారు, ఇటు అత్తవారింటిలో విషాదచాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు తవుడమ్మ, తవుడు, అత్త బుచ్చమ్మ, భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: ఏడాదిన్నర పాప.. ఆడుకుంటూ.. మృత్యు ఒడిలోకి -
నెల క్రితమే తల్లి మృతి: బాధను దిగమింగుకుని డ్యూటీకి వెళ్తుండగా..
సాక్షి, కందుకూరు: రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్ చక్రాల కిందపడి ఓ యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని రాచులూరుకు చెందిన తిరుగమళ్ల శ్రీనాథ్(23) బేగకరికంచె సమీపంలోని అమెజాన్ కంపెనీ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గ్రామం నుంచి విధులకు హాజరుకావడానికి మధ్యాహ్నం సమయంలో బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో రాచులూరు–కటికపల్లి మార్గంలో కటికపల్లి నుంచి మట్టిలోడ్‌తో వస్తున్న టిప్పర్, బైక్‌ను ఢీకొనడంతో టిప్పర్ చక్రాల కిందపడి దుర్మరణం చెందాడు. మృతుడికి తండ్రి, చెల్లెలు ఉన్నారు. నెలరోజుల క్రితమే మృతుడి తల్లి ఆండాలు చనిపోవడం, ఇప్పుడు కుమారుడిని కోల్పోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లుతుంది. గ్రామస్తులు,బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. అందరితో కలుపుగోలుగా ఉండే శ్రీనాథ్ చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. సీఐ కృష్ణంరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: సూర్యాపేటలో సమాజం తలదించుకునే ఘటన తీవ్ర విషాదం: వాగులో కొట్టుకుపోయిన కారు.. నవ వధువు మృతి -
దారుణం: వృద్ధుడి తలపై నుంచి దూసుకెళ్లిన బైక్
సాక్షి, నల్లకుంట( హైదరాబాద్): టూ వీలర్‌పై వెళుతున్న ఓ విశ్రాంత ఉద్యోగి ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడిపోయాడు. అదే సమయంలో మరో ద్విచక్ర వాహనంపై వేగంగా దూసుకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై పడిపోయిన బాధితుడి తలపై నుంచి దూసుకువెళ్లాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విశ్రాంత ఉద్యోగి ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రవి కథనం ప్రకారం.. అంబర్‌పేట చెన్నారెడ్డి నగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి మామిళ్ల సత్యనారాయణ (70) శనివారం సాయంత్రం మెడిసిన్ కొనుకునేందుకు విద్యానగర్‌లో డీడీహెచ్ ఆస్పత్రికి వచ్చాడు. మెడిసిన్స్ తీసుకున్న తర్వాత హీరో హోండా (ఏపీ29ఏహెచ్ 4396) బైక్‌పై ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. మెయిన్ రోడ్డుకు చేరుకున్న అతను లెఫ్ట్ టర్న్ తీసుకునే సమయంలో బైక్ అదుపు తప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో విద్యానగర్ లక్కీ కేఫ్ చౌరస్తా నుంచి ద్విచక్ర వాహనంపై వేగంగా దూసుకువచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై పడిపోయిన సత్యనారాయణ తలపై నుంచి దూసుకుపోయాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి సత్యనారాయణ వద్ద ఉన్న సెల్‌ఫోన్ నుంచి అతని కుమార్తె గంగపురం కరుణకు ఫోన్‌చేసి విషయం తెలియజేయగా ఆమె కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాగా అక్కడ చికిత్స పొందుతున్న సత్యనారాయణ ఆదివారం మృతి చెందాడు. తన తండ్రి మృతికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుమార్తె కరుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆ ఇంట మృత్యుఘోష, బీచ్‌కు వెళ్లి.. మృతదేహంగా ఒడ్డుకు
సాక్షి, కురుపాం( విజయనగరం): ఆ ఇంట మృత్యుఘోష వినిపిస్తోంది. తల్లి మరణించిన పది రోజులకే కుమారుడు తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం మండల కేంద్రం శివ్వన్నపేటకు చెందిన సారిక సత్యవతి (60) అనారోగ్యంతో గత నెల 26న మృతి చెందింది. ఆమె పెద్దకర్మ శుక్రవారం జరగాలి. ఈ ఏర్పాట్లలో ఉంటుండగానే స్నేహితులతో కలిసి గురువారం భీమిలి బీచ్‌కు వెళ్లిన చిన్నకుమారుడు సారిక దేవీప్రసాద్ (32) గల్లంతయ్యాడు. మృతదేహంగా ఒడ్డుకు చేరాడు. ఒకే ఇంటిలో రోజుల వ్యవధిలో తల్లీకొడుకుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మెకానిక్‌గా పనిచేస్తున్న దేవీప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
రూ.50లక్షలు డిమాండ్ చేసి.. ప్రాణం తీశారు
సాక్షి, పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం పోతవరంలో ఓ యువకున్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బుధవారం పోతవరం సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆ యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి వంశీ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.50లక్షలు ఇస్తే విడిచిపెడతామని అన్నారు. దీంతో ఏం చేయాలో తెలియని యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుండగులు రూ.50లక్షలు డిమాండ్ చేశారని యువకుడి తండ్రి పోలీసులిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. -
ఐదు నిమిషాల్లో ఇంటికి.. అంతలోనే మృత్య ఒడిలోకి
సాక్షి, పాతపట్నం(శ్రీకాకుళం): మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరనున్న వ్యక్తిని మృత్యువు వెంటాడింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అతను ఆటోను తప్పించబోయి ప్రమాదవశాత్తు పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం గ్రామ సమీపంలో చోటుచేసుకోగా.. ఆదే గ్రామానకి చెందిన సెంటరింగ్ మీస్త్రి బైపోతు ప్రేమకుమార్(27) మృతి చెందినట్లు ఎస్ఐ వి.సందీప్‌కుమార్ తెలిపారు. ప్రేమ్‌కుమార్ రోజులాగే ఆదివారం ఉదయం సెంటరింగ్ పనికోసం ద్విచక్ర వాహనంపై హిరమండలం మండలం ధనుపురం గ్రామానికి వెళ్లాడు. పని ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా పెద్దపద్మాపురం గ్రామ సమీపంలో ఆటోను తప్పించబోయి ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి క్షతగాత్రుడ్ని పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. అయితే ప్రేమ్‌కుమార్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు శ్రీధర్ ధ్రువీకరించారు. మృతునికి భార్య నీరజ, కుమారై శరణ్య (1) ఉన్నారు. భర్త మృతదేహంపై పడి భార్య రోదించిన తీరు స్థానికులను కలచి వేసింది. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
విషాదం: వాకింగ్ కోసమని వెళ్లి.. మట్టి పెళ్లల కింద..
సాక్షి, రహమత్‌నగర్: వాకింగ్ కోసం వెళ్లిన ఓ వ్యక్తి మట్టి పెళ్లలు కింద మృతదేహమై కనిపించాడు. బుధవారం మిత్రుడిని కలిసి వెళ్తున్న క్రమంలో గోడ కూలి మీద పడటంతో ఆశిష్ (25) అనే యువకుడు అసువులు బాశాడు. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. రహమత్‌నగర్ డివిజన్ శ్రీరాంనగర్ పోచమ్మ ఆలయం సమీపంలోని శ్రీ అనూష రెసిడెంట్ ప్రహరీ బుధవారం సాయంత్రం వర్షం కారణంగా కూలిపోయింది. స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ లేకపోవడం, వర్షం మూలంగా ఎవరి ఇళ్లలోకి వారు వెళ్లారు. సహాయక చర్యల్లో భాగంగా గురువారం ఉదయం జీహెచ్ఎంసీ సిబ్బంది జేసీబీతో మట్టి పెల్లలు తొలగిస్తుండగా అందులో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. తమ్ముడు కనిపించడం లేదని.. వాకింగ్ కోసమని వెళ్లిన తన తమ్ముడు కనిపించడం లేదని అంతకుముందు రోజు ఆశిష్ సోదరి ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులను సంఘటన స్థలానికి తీసుకొచ్చారు. మృతుడి జేబులో ఉన్న కారు తాళం చెవిని చూసి ఆశిష్‌గా వారు గుర్తించారు. కల్యాణ్ నగర్ వెంటర్– 3కు చెందిన ఆశిష్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. నిత్యం వాకింగ్ కోసం వస్తూ అనూష రెసిడెంట్‌లో ఉండే మిత్రుణ్ని కలుస్తుంటాడు. ఈ క్రమంలోనే బుధవారం స్నేహితుడిని కలిసి వెళ్తున్న క్రమంలో గోడ కూలడంతో మృత్యువాత పడ్డాడని పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ప్రపుల్లా రెడ్డి, ఎమ్మెల్యే, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఈఈ రాజ్‌కుమార్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. రూ.కోట్ల వ్యయంతో అపార్ట్మెంట్ కట్టి ప్రహరీ నిర్మించపోవడంతోనే ప్రమాదం జరిగిందని బస్తీ వాసులు మండిపడుతున్నారు. మట్టితో కట్టిన పాత గోడతో ఎప్పుడైనా ప్రమాదం వాటిల్లవచ్చని.. దానిని తొలగించి కొత్త గోడను ఏర్పాటు చేసుకోవాలని బస్తీ వాసులు పల మార్లు అపార్ట్‌మెంటువాసులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. -
దారుణం: భూత వైద్యం పేరుతో ఈత బరిగెలతో కొట్టడంతో..
కర్నూలు: భూత వైద్యం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. మద్దికెర మండలం పెరవలికి చెందిన వెంకటరాముడు, ఈరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే ఈ నెల 1న వారి కుమారుడు నరేష్(24) మూర్ఛతో ఆస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఓ భూత వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. ఆ భూత వైద్యుడు నరేష్‌కు దెయ్యం పట్టిందని, ఇంట్లో బంధించి ఈత బరిగెలతో తీవ్రంగా కొట్టాడు. దీంతో అతని ఆరోగ్యం మరింత క్షిణించింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు నరేష్ తల్లిదండ్రులను మందలించి పలువురు చందాలు వేసుకొని అతన్ని ఆస్పత్రికి తరలించారు. నరేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భూతవైద్యం కారణంగా ఓ యువకుడు మృతి చెందడంతో పెరవలి గ్రామంలో విషాదం అలుముకుంది. చదవండి: వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ -
దారుణం: భార్యతో గొడవపడి.. ట్రాన్స్ఫార్మర్ ఎక్కి..
సైదాబాద్: మద్యం మత్తులో ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. అక్బర్‌బాగ్‌లోని ఒక అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేసే అక్బర్ (40) మొదటి భార్య అజ్మరీతో కలిసి ఉంటున్నాడు. నిత్యం మద్యం తాగి భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చేవాడు. సోమవారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చిన అతను భార్యతో గొడవపడ్డాడు. అదే కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చి దిల్కుష్ ఫంక్షన్‌హాల్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కాడు. కింద ఉన్నవారు వారిస్తున్నా వినకుండా అక్కడి విద్యుత్ వైర్లను తాకాడు. దాంతో తీవ్రమైన విద్యుత్ షాక్‌తో అతను అంత ఎత్తు నుండి ఒక్కసారిగా రోడ్డుపైకి పడిపోయాడు. తీవ్రమైన గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆసమయంలో ఆ రహదారిపై వెళుతున్న వారు తీసిన అతని ఆత్మహత్య వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A man ended his life by touching the live wire atop of a eletrical transformer at Akbarbagh Saidabad pic.twitter.com/DqDTXKBqBk — S.M. Bilal (@Bilaljourno) May 31, 2021 చదవండి: Loan App: నకిలీ లెటర్‌తో రూ.కోటి కొట్టేశాడు..! -
ఆర్ఎంపీ వైద్యం వికటించి యువకుడి మృతి
సాక్షి, వెల్దుర్తి(కర్నూలు): ఆర్ఎంపీ వైద్యం వికటించి మండల పరిధిలోని గుంటుపల్లెకు చెందిన యువకుడు వడ్డే మణిదీప్ (17) మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ పెద్దయ్య నాయుడు తెలిపిన వివరాలు.. ఈనెల 22న మణిదీప్ జ్వరం, కాళ్ల నొప్పులతో బాధ పడుతూ వెల్దుర్తిలోని ఆర్ఎంపీ వైద్యుడు వెంకటేశ్వర్లు(అనిల్ క్లినిక్)ను సంప్రదించాడు. అతడు కుడికాలి మక్కికి ఇంజక్షన్ వేసి నయమవుతుందని పంపేశాడు. ఇంటి కెళ్లిన తరువాత కాలు వాపు వచ్చింది. మరుసటి రోజు బొబ్బలు వచ్చాయి. మంగళవారం తండ్రితో కలిసి ఆర్ఎంపీ వద్దకు వెళ్లి ప్రశ్నించగా డోనుకు గానీ, కర్నూలుకు కానీ వెళ్లి వైద్యం చేయించుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు. డోన్‌లోని వాణి పాలి క్లినిక్‌కు వెళ్లగా ఇంజక్షన్ వికటించిందని, కర్నూలుకు వెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు. కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తన కుమారుడు మృతికి ఆర్ఎంపీ వైద్యుడే కారణమంటూ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
నడిరోడ్డుపై వదిలేసిన ట్యాక్సీ డ్రైవర్.. అర్ధరాత్రి భర్త మృతదేహంతో..
సాక్షి, టెక్కలి రూరల్: మండలంలోని అక్కవరం గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఒక మృతదేహాన్ని రహదారిపై దించి వెళ్లిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒడిశాకు చెందిన ప్రదీప్, అంజలి అనే దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రదీప్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారు స్వస్థలం ఒడిశాలోని బాలా సోర్కు ట్యాక్సీలో వెళ్తున్నారు. టెక్కలి సమీపంలోకి రాగానే ప్రదీప్ బండిలోనే మృతి చెందడంతో ట్యాక్సీ డ్రైవర్ ఆ మృతదేహంతో పాటు ఆమెను కూడా వాహనం నుంచి కిందకు దించి వెళ్లిపోయాడు. దీంతో నడిరోడ్డుపై తన భర్త మృతదేహంతో ఆ మహిళ ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉండిపోయింది. విషయం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరో వాహనాన్ని సమకూరుస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు. ‘స్పీకర్ ఆరోగ్యంపై వదంతులు నమ్మవద్దు’ ఆమదాలవలస: స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ రోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పు డు ప్రచారాలు నమ్మవద్దని స్పీకర్ క్యాంపు కా ర్యాలయం నుంచి మంగళవారం రాత్రి ఓ ప్రకటన వెలువడింది. స్పీకర్ దంపతులకు వారం కిందట కరోనా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తు తం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగుందని ప్రకటనలో తెలిపారు. ఇద్దరూ జిల్లాకేంద్రంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. చదవండి: ‘పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు.. పుట్టింటికి వచ్చేస్తా’ -
భార్యాభర్తల గొడవ: ఆపేందుకు వచ్చిన వ్యక్తి హత్య
టీ.నగర్: భార్యాభర్తల గొడవను ఆపేందుకు యత్నించిన వ్యక్తి హత్యకు గురైన ఘటన సోమవారం తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఒరత్తనాడు పుదూరుకు చెందిన రాజేంద్రన్ (60) ప్రైవేట్ మిల్లులో పనిచేస్తున్నారు. అతనితోపాటు అమ్మాపేటకు చెందిన సూసైరాజ్ పనిచేస్తున్నారు. ఇలావుండగా సోమవారం రాత్రి మిల్లులో సూసైరాజ్, అతని భార్య మధ్య గొడవ జరిగింది. వారికి సర్దిచెప్పేందుకు రాజేంద్రన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో రాజేంద్రన్, సూసైరాజ్ గొడవ పడ్డారు. ఆగ్రహించిన సూసైరాజ్ కత్తితో రాజేంద్రన్‌పై దాడి చేశాడు. సంఘటనా స్థలంలోనే రాజేంద్రన్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఒరత్తనాడు పోలీసులు రాజేంద్రన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. సూసైరాజ్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. చదవండి: కుమార్తె లవ్ మ్యారేజ్: కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య -
జూబ్లీహిల్స్‌లో దారుణం: కలిసి మద్యం తాగారు, మళ్లీ వచ్చి చూస్తే
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో దారుణ హత్య జరిగింది. గత రాత్రి 2గంటల సమయంలో శివ (40) హత్యకు గురయ్యాడు. పోలీసులు వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి శివ తన స్నేహితులు రాకేశ్, శ్రీనివాస్, డేవిడ్‌తో కలిసి శివ మద్యం సేవించాడు. మద్యం సేవించిన అనంతరం రాకేశ్, శ్రీనివాస్ వెళ్లిపోగా.. శివ, డేవిడ్ మాత్రం అక్కడే ఉన్నారు. రాత్రి 2.20 గంటల సమయంలో స్నేహితుడు శ్రీనివాస్ వచ్చి చూడగా మద్యం సేవించిన ప్రదేశంలో తల పగిలి రక్తపు మడుగులో శివ విగత జీవిగా కనిపించాడు. వెంటనే శీనివాస్ పోలీసులకు సమాచారం అందించగా.. జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. శివ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు శివ కూలి పని చేసుకుంటూ, ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అనుమానితుడు డేవిడ్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: అత్తారింటికి వచ్చి.. బావిలో పడి ఇద్దరు అల్లుళ్ల మృతి -
అత్తారింట్లో ఘోర అవమానం, యువకుడు ఆత్మహత్య
సాక్ష, బంజారాహిల్స్: భార్య కళ్ల ముందే బావమరిది, అత్త మామలు కొట్టడమే కాకుండా అవమానానికి గురి చేశారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెయింటర్‌గా పని చేస్తూ.. బోరబండ రాజీవ్‌గాంధీనగర్ సమీపంలోని టి.అంజయ్యనగర్‌లో నివసించే దుష్ముక్ లక్ష్మణ్ (26)కు తెల్లాపూర్‌లో నివసించే స్వప్న(20)తో వివాహం జరిగింది. అప్పటికే ఆ యువతికి తనకంటే రెట్టింపు వయస్సున్న వ్యక్తితో పెళ్లి కావడంతో విడిపోయారు. తరచూ గాజులరామారంలో ఉండే తన అత్త ఇంటికి వెళ్తున్న లక్ష్మణ్‌కు ఓ రోజు ఈ స్వప్న కనిపించగా పెద్దలను ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. నెల రోజుల పాటు అంజయ్యనగర్‌లో కాపురం చేసిన వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్తతో నిత్యం గొడవ పడుతుండటంతో కొద్ది రోజులకే పుట్టింటికి వెళ్లిపోయింది. లక్ష్మణ్ కూడా అత్తారింటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే పనికి సరిగ్గా వెళ్లడం లేదంటూ భార్య, భర్తల మధ్య గొడవలు వచ్చాయి. నెల రోజుల క్రితం లక్ష్మణ్ దంపతులకు పాప జన్మించింది. గత నెల 31వ తేదీన లక్ష్మణ్ తన కుమార్తె 21 రోజుల ఫంక్షన్ కోసం అత్తగారింటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి అత్తింట్లో లక్ష్మణ్‌కు అవమానంతో పాటు పెద్ద ఎత్తున గొడవ జరిగింది. లక్ష్మణ్‌ను తీవ్రంగా కొట్టగా పారిపోయే క్రమంలో పట్టుకొని స్తంభానికి కట్టేసి మళ్లీ కొట్టారు. ఈ నెల 1వ తేదీన తెల్లవారుజామున మూత్రవిసర్జన పేరుతో అత్తింటి నుంచి పారిపోయి సమీపంలోని లింగంపల్లి రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు అక్కడికి చేరుకొని లక్ష్మణ్‌ను ఓదార్చారు. కొద్దిసేపటి తర్వాత అంజయ్య నగర్‌కు వచ్చిన లక్ష్మణ్ తన సెల్‌ఫోన్‌ను సోదరుడికి ఇచ్చి ఇప్పుడే వస్తానంటూ వెళ్లిపోయాడు. 1వ తేదీన వెళ్లిన అతను కనిపించకపోవడంతో అంతటా వెతికారు. అయితే లక్ష్మణ్ ఇంటి సమీపంలో నివసించే చిన్నమ్మ ఇంట్లో దుర్వాసన వస్తుండటంతో ఆ ప్రాంతమంతా గాలించగా భవనంలోని సెల్లార్లో లక్ష్మణ్ మృతదేహం కుళ్లిపోయి వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాధంలో మునిగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. లక్ష్మణ్ భార్య పుట్టింటి నుంచి రాకపోవడం, అత్తింటి వేధింపులు, ఆమె కుటుంబ సభ్యుల దాడి నేపథ్యంలోనే తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ మృతుడు సోదరుడు శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బీడీ వెలిగించుకుని పడేసిన అగ్గిపుల్ల.. చూస్తుండగానే ఘోరం -
పరిచయం: మహిళ వేధింపులతో యువకుడి ఆత్మహత్య
సాక్షి, పెద్దపల్లి : ఒక పరిచయం నిండు ప్రాణాన్ని తీసింది. మహిళ వేధింపుల కారణంగా గోదావరిఖని కేకేనగర్‌కు చెందిన కొయ్యాడ రమేశ్(33) సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మానేరు సమీపంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఉపేందర్‌రావు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గోదావరిఖని కేకేనగర్‌కు చెందిన కొయ్యాడ రమేశ్ ఫొటోగ్రాఫర్. ఏడాదిక్రితం ఓ వివాహ వేడుకలో పెద్దపల్లికి చెందిన చింతల రమాదేవితో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఇద్దరిమధ్య ఫోన్లు, సందేశాలు నడిచాయి. ఈ క్రమంలో రమేశ్ నుంచి రమాదేవి రూ.6లక్షలు, రెండు తులాల బంగారం తీసుకుంది. కొద్దిరోజుల క్రితం రమేశ్ బంగారం, నగదు తిరిగి ఇమ్మని అడిగాడు. దీంతో రమాదేవి ఫోన్‌కాల్స్, చాటింగ్ సందేశాలు బయటపెడతానని బ్లాక్మెయిల్ చేసింది. మార్చి 28న పెద్దపల్లి పోలీసుస్టేషన్లో రమేశ్‌పై కేసు పెట్టింది. తాను నివాసం ఉంటున్న చోట పరువుపోయిందని, వేరే ప్రాంతంలో అద్దెకు ఇళ్లు చూస్తానని భార్యకు చెప్పి మార్చి 30న రమేశ్ బయటకు వెళ్లాడు. సాయంత్రంవరకు రాకపోవడంతో అతడి భార్య లావణ్య ఫోన్ చేసింది. రమాదేవి వేధింపులు భరించలేక చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. వెంటనే లావణ్య తన భర్త కనిపించడం లేదని గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల తరువాత శుక్రవారం సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామ సమీపంలోని మానేరువాగు వద్ద రమేశ్ మృతదేహం కనిపించింది. లావణ్య ఫిర్యాదుతో రమాదేవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం; యువతిని లైంగికంగా వాడుకొని.. -
భార్య మరణం తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి, తను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడో తండ్రి. ఈ విషాద ఘటన అనకాపల్లి ముత్రాసు కాలనీలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొక్కిర సత్యనారాయణ, పుష్పలత దంపతులు ముత్రాసు కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే గతేడాది నవంబర్‌లో పుష్పలత అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అప్పటి నుంచి భర్త సత్యనారాయణ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. అయితే మంగళవారం కూడా మనస్తాపం చెందిన సత్యనారాయణ తన పిల్లలకు విషం ఇచ్చి, తర్వాత ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. సత్యనారాయణకు పదేళ్ల కుమారుడు లోకేశ్, తొమ్మిదేళ్ల కూతురు తేజశ్రీ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: బాలికను కిడ్నాప్ చేసి బిక్షాటన, మాట వినకపోవడంతో -
మద్యం అలవాటు: ప్రాణం తీసిన ఆకు పసరు
సాక్షి, కదిరి: పసరు వైద్యం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటన శుక్రవారం ఎన్పీకుంటలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా గాలివీడుకు చెందిన గంగరాజు కుమారుడు వేమల నారాయణ(38) కొంతకాలంగా ఎన్పీకుంటలోని ఓ కార్పెంటర్ వద్ద పనిచేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడిన నారాయణ.. ఆ వ్యసనం నుంచి బయటపడాలని భావించాడు. ఈ క్రమంలోనే పులివెందుల సమీపంలోని సారాపల్లిలో మద్యం మానేందుకు పసరు వైద్యం చేస్తారని తెలిసి శుక్రవారం ఉదయం మరికొందరు మద్యం ప్రియులతో కలిసి అక్కడికి వెళ్లాడు. వారిచ్చిన ఆకు పసరు మందు తాగి మధ్యాహ్నానికి ఎన్పీ కుంటకు చేరుకున్నాడు. సాయంత్రం 4 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించి చుట్టుపక్కల వారు 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా...మార్గమధ్యంలోనే నారాయణ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నరసింహుడు ఈఘటనపై వివరాలు ఆరా తీసి కేసు నమోదు చేశారు. అలాగే నారాయణతో కలిసి పసరు వైద్యం చేయించుకున్న వారి వివరాలు సేకరించి వారిని ఆస్పత్రికి తరలించారు. చదవండి: ‘ఆమె’గా వల.. న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్ -
శ్రీకారం ఆడియో ఫంక్షన్లో గాయపడ్డ వ్యక్తి మృతి
సాక్షి, ఖమ్మం: రెండు రోజుల క్రితం జిల్లాలోని మమత మెడికల్ కాలేజీ ప్రాంగణంలో శ్రీకారం ఆడియో ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేడుకకు జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలో చిరంజీవిని చూడటానికి అభిమానులు అత్యుత్సాహం చూపడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివ బుధవారం మరణించాడు. ప్రకాష్ నగర్‌కు చెందిన శివ వంటమాస్టార్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీకారం ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన చిరంజీవిని చూసేందుకు వెళ్లి.. ప్రాణాలు కోల్పోవడంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చదవండి: శర్వానంద్ నాకు మరో రామ్‌చరణ్ లాగా: చిరు -
రోడ్డు ప్రమాదం: మృతదేహంతో 10 కిమీ ప్రయాణం
చండీఘర్: పంజాబ్‌లో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో ఓ కారు ఎదురుగా వస్తున్న సైకిల్‌ను ఢికోట్టింది. అనంతరం కారుపై ఎగిరి పడ్డ మృతదేహంతో దాదాపు 10 కిలో మీటర్లు ప్రయాణించిన ఘటన రాష్ట్రంలో మొహాలీలో చోటుచేసుకుంది. స్థానికుల సమచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు పంజాబ్‌లోని మోహలీకి చెందిన యోగేంద్ర మొండల్‌గా గుర్తించారు. అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలు... ఫతేగర్ పట్టణానికి చెందిన నిందితుడు నిర్మల్ సింగ్ జిరాక్పూర్ నుంచి సన్నీ ఎన్క్లేవ్ వైపు కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో మొహాలీలోని ఎయిర్‌పోర్టు రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా సైకిల్‌పై వస్తున్న బాధితుడు యోగేంద్రను ఢీకొట్టాడు. దీంతో అతడు గాల్లోకి ఎగిరి నిర్మల్ సింగ్ కారుపై పడ్డాడు. అయితే నిర్మల్ సింగ్ కారు ఆపకుండా మృతదేహంతోనే 10 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ క్రమంలో అతడు యోగేంద్రను హస్పీటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు చెప్పడంతో సన్నీ ఎన్క్లేవ్ వద్ద మృతదేహాన్ని వదిలి పరారయ్యాడు. దీనిపై మొహాలీ డీఎస్పీ రూపిందర్ దీప్ కౌర్ మాట్లాడుతూ.. ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద స్థలంలోని సీసీ కెమెరాల ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. నిందితుడు నిర్మల్ సింగ్‌ను అరెస్టు చేసి అతడిపై ఐపీసీ సెక్షన్ 279, 427, 304, 201 కింద కేసు నమోదు చేసి అనంతరం అతడి కారును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. -
విషాదం: ఇద్దరు పిల్లల్ని హతమార్చి.. ఆత్మహత్య
సాక్షి, చెన్నై: నెల రోజుల క్రితం భార్య ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లల పర్యవేక్షణ భారమై ఓ తండ్రి చెన్నైలో శనివారం కిరాతకానికి పాల్పడ్డాడు. ముక్కు పచ్చలారని ఇద్దరు పిల్లల్ని హతమార్చి తాను కూడా బలన్మరణానికి పాల్పడ్డాడు. చెన్నై కొరుక్కుపేట జీవానగరం ఆరవ వీధికి చెందిన వినోద్(32) ఎలక్ట్రీషియన్. ఇతడికి భార్య కవిత(27), కుమారులు నవీన్(3), ప్రవీణ్(ఏడాదిన్నర) పిల్లలు. మూడు నెలల క్రితం భర్తతో గొడవపడి కవిత పొన్నేరిలోని పుట్టింటికి వెళ్లింది. దంపతుల మధ్య గొడవ పెరగడంతో గత నెల అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వినోద్‌కు ఇద్దరు పిల్లల పర్యవేక్షణ భారమైంది. ఈ పరిస్థితుల్లో శనివారం ఇంటి నుంచి వినోద్, పిల్లలు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు తలుపులు బద్దలు కొట్టిలోనికి వెళ్లారు. అక్కడ పిల్లలు ఇద్దరు మంచంపై మృతి చెంది ఉండడం, ఫ్యాన్‌కు వినోద్ వేలాడుతుండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆర్కేనగర్ పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఇద్దరు పిల్లల్ని గొంతు నులిమి చంపి, వినోద్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తేలింది. చదవండి: ఆన్లైన్ గేమ్: విద్యార్థి ఫ్యాన్‌కు.. -
ఆర్టీసీ బస్సు నుంచి దూకిన వ్యక్తి మృతి
సాక్షి, కొడంగల్ రూరల్ : బస్సు నుంచి కిందకు దూకి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రావులపల్లిలో బుధవారం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావులపల్లి గ్రామ స్టేజీలో దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్ గ్రామానికి చెందిన పొలంసాయన్నోళ్ల రాములు (50)ను ఆయన భార్య మదారమ్మ ఆర్టీసీ బస్సులో ఎక్కించింది. అయితే బస్సు ప్రయాణిస్తున్న సమయంలో రాములు బస్సు నుంచి కిందకు దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థంలోనే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష్య సాక్షుల కథనం మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
చిత్తూరు యువకుడి విషాదాంతం
సాక్షి, తాడేపల్లిరూరల్ (మంగళగిరి): చిత్తూరులో పుట్టి, విశాఖలో ప్రేమాయణం నడిపి, చివరకు ఆదివారం తాడేపల్లి వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడి విషాదంతం ఇది. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం పుణ్యసముద్రం గ్రామానికి చెందిన బత్తయ్య, హేమవతి ఏకైక కుమారుడు వలజపేట బాలాజీ (31) హోటల్ మేనేజ్మెంట్ చేసి తమిళనాడులో ఓ హోటల్లో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి చనిపోవడంతో తండ్రితో ఫోన్లోనే మాట్లాడుతూ ఇంటికి రాకుండా కాలం గడిపాడు. రెండున్నర సంవత్సరాల క్రితం చెన్నై నుంచి ఇంటికి వచ్చిన బాలాజీ విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి వెళ్లలేదు. బాలాజీ వైజాగ్‌లో ఓ హోటల్లో పనిచేస్తున్నప్పుడు తాడిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికను ప్రేమించి, ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కొద్ది రోజులకు ఆ బాలికను తీసుకుని విజయవాడ వచ్చేశాడు. విజయవాడ వచ్చినప్పటి నుంచి ఆ బాలికను అనుమానించేవాడు. పలుసార్లు బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌లో ఒకసారి పంచాయితీ జరిగింది. విజయవాడ ఆటోనగర్ పోలీస్స్టేషన్లోనూ ఇదే పంచాయితీ జరిగింది. చివరకు ఆ బాలిక విసిగిపోయి అజిత్‌సింగ్‌నగర్‌లోని బంధువుల ఇంట్లో ఉంటుండగా, గత ఏడాది డిసెంబర్ 22వ తేదీన ఆ బాలిక నివాసం ఉంటున్న బిల్డింగ్‌పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు బాలాజీని అదుపులోకి తీసుకొని ఆ బాలికను పిలిచి విచారించగా, తనకు ఇష్టం లేదని చెప్పడంతో తల్లిదండ్రులు సైతం తమకు కేసు ఏమీ వద్దని చెప్పారు. దీంతో బాలాజీని ఎటువంటి కేసు లేకుండా పోలీసులు వదిలేశారు. ఈ క్రమంలో బాలాజీ శనివారం రాత్రి తాడేపల్లి సమీపంలో ప్రకాశం బ్యారేజీ 10వ ఖానా వద్ద కృష్ణానదిలోకి దూకాడు. ఈ క్రమంలో గేటుపై పడటంతో తల వెనుక భాగం, ఎదుటి భాగంలో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. గేటు కింద మృతదేహం పడిపోయింది. ఆ మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి బత్తయ్యకు సమాచారం ఇచ్చామని, ఆయన వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్ఐ నారాయణ తెలిపారు. -
అల్లరి వద్దు అన్నందుకు ప్రాణాలు తీశాడు
జయపురం: బొరిగుమ్మ సమితిలోని బిసింగపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న భూమియగుడ గ్రామంలో ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య రేగిన చిన్న వివాదం అందులో ఓ వ్యక్తి హత్యకి దారితీసింది. వివరాలిలా ఉన్నాయి.. భూమియగుడ గ్రామానికి చెందిన డొంబురు భూమియ(27) ఆదివారం ఉదయం బాగా మద్యం తాగివచ్చి ఊరి మధ్యలో అల్లరి చేశాడు. అదే సమయంలో భరత్ నాయక్(23) అనే మరో వ్యక్తి అతడి వద్దకు వచ్చి ఎందుకు ఊరికనే అల్లరి చేస్తున్నావ్.. అని అడిగాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న డొంబురు ఆగ్రహంతో తన వద్ద ఉన్న ఓ పెద్దకర్రతో భరత్ తలపై గట్టిగా మోదాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని, గాయాలతో పడిఉన్న భరత్‌ని ఇంటికి తీసుకువెళ్లి నీరు తాగించారు. ఆ తర్వాత భరత్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం ఈ ఘటనపై భరత్ తండ్రి బిసింగపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోస్టుమార్టం అనంతరం యువకుడి మృతదేహాన్ని బాధిత బంధువులకు అప్పగించారు. -
ఐ లవ్ యూ అంటూ స్టేటస్.. చంపి కాలువలో పడేశారు!
సాక్షి, తాడేపల్లి రూరల్: ఓ విద్యార్థి తన వాట్సప్ స్టేటస్‌లో తన మిత్రుడి ప్రేయసి ఫొటోను పోస్టు చేసి.. ఐ లవ్ యూ అని రాయడం వివాదానికి దారితీసి ఆ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గురవయ్య, శివకుమారి దంపతుల ఏకైక కుమారుడు వెంపటి సాయి విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఉండవల్లి సెంటర్లో కొందరు విద్యార్థులు సాయికి పరిచయమయ్యారు. వారిలో ఒకరైన ఐటీఐ విద్యార్థి తన ఇంటికి సమీపంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ యువతి ఫొటోను వెంపటి సాయి తన స్టేటస్‌లో పెట్టి.. ఐ లవ్ యు అని రాయడాన్ని ఐటీఐ విద్యార్థి చూశాడు. వెంటనే సాయిని ఉండవల్లి సెంటర్‌కి పిలిపించి మరో ముగ్గురితో కలిసి దాడికి పాల్పడ్డాడు. అనంతరం సాయి కనిపించకుండా పోవడంతో అతని తల్లిదండ్రులు తాడేపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దాడికి పాల్పడిన విద్యార్థుల్ని విచారిస్తుండగా.. సాయి వడ్డేశ్వరం వద్ద బకింగ్‌హామ్ కెనాల్లో శవమై కనిపించాడు. సాయిని అతని స్నేహితులు చంపి కాలువలో పడేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
విషాదం: పెళ్లి రోజును భార్యపిల్లలతో కలిసి..
సాక్షి, నిజామాబాద్: పెళ్లి రోజును కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుదామని అనుకున్న యువకుడు అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నడిపల్లి తండా సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. డిచ్పల్లి ఎస్సై సురేశ్‌కుమార్, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కమ్మర్పల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన గడ్డం రాజేశ్వర్ (31)కు భార్య లతాశ్రీ, ఐదేళ్ల కొడుకు ఉన్నారు. ఇటీవల కొనుగోలు చేసిన పంట కోత మిషన్ ద్వారా కర్నాటక రాష్ట్రం బళ్లారి ప్రాంతంలో పంట కోతలు నిర్వహిస్తున్నాడు. సోమవారం తన వివాహ వార్షికోత్సవం కావడంతో భార్యా పిల్లలతో గడిపేందుకు ఆదివారం తెల్లవారుజామునే తన బైక్‌పై (నంబర్ టీఎస్ 16 ఈబీ 7972) బయలుదేరాడు. రాత్రికి కామారెడ్డిలో భోజనం చేసి భార్యా పిల్లల కోసం బిర్యాని, స్వీట్లు పార్శిల్ చేయించుకుని బయలుదేరాడు. 44వ నంబరు జాతీయ రహదారిపై నడిపల్లి తండా సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇనుప గ్రిల్స్‌పై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న డిచ్పల్లి ఎస్సై తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరికొద్ది సేపట్లో భర్త ఇంటికి వస్తాడని ఆనందంతో ఎదురు చూస్తున్న భార్య దుఃఖంలో మునిగిపోయింది. అందరితో కలిసి మెలిసి ఉండే రాజేశ్వర్ మృతి చెందినట్లు తెలియడంతో సోమవారం నాగాపూర్‌లో విషాదం నెలకొంది. -
అమెరికాలో హుజూరాబాద్ వాసి మృతి
సాక్షి, హుజూరాబాద్: అమెరికా నుంచి వస్తాడని కుమారుడి కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు చివరికి పుత్రశోకమే మిగిలింది. అమెరికాలో హుజూరాబాద్ వాసి అనారోగ్యంతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన పంబిడి జగన్మోహన్రావు-లక్ష్మిల ఒకగానొక్క కుమారుడు నిఖిల్‌రావు(29). ఎంఎస్ చదివేందుకు 2015లో అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి చేసుకొని అక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అతన్ని స్వగ్రామం రావాలని తల్లిదండ్రులు పలుమార్లు కోరారు. కానీ హెచ్1బీ వీసా ఆలస్యమవడంతో అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో నిఖిల్‌రావు ఈ నెల 17న అనారోగ్య సమస్యలతో మృతిచెందాడు. అమెరికాలోని బంధువుల ద్వారా కుమారుడి మరణ వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అమెరికా నుంచి కొడుకు వస్తే వివాహం చెద్దామనుకున్నామని, కుమారుడు తమ వద్దే ఉంటాడని ఆశపడ్డామని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిఖిల్‌రావు మృతదేహం వారం రోజుల్లో స్వగ్రామం చేరనున్నట్లు బాధిత బంధువులు తెలిపారు. -
పెళ్లి కావడం లేదని..
మైసూరు: పెళ్లి కోసం ఎన్నిచోట్ల వెతికినా అమ్మాయి దొరకడం లేదు. నాకు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదు అని ఆవేదనకు లోనైన యువకుడు ఉరేసుకుని బతుకు చాలించాడు. నంజనగూడు తాలూకాలోని కప్పసోగు గ్రామంలో సోమవారం చోటు చెసుకుంది. ప్రవీణ్ (28) అనే యువకునికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆరు ఏడు సంవత్సరాలుగా సంబంధాలను వెతుకుతున్నారు. ఏ అమ్మాయి కూడా అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో విరక్తి చెంది ఇంట్లో దూలానికి ఉరి వేసుకున్నాడు. హుల్లహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. -
వివాహేతర సంబంధం; ఇద్దరు ఆత్మహత్య..
సాక్షి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలోని దేవునూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గామ్రంలోని పెద్దజాలుగుంట వద్ద ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. జిల్లాలోని ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలోనీ పెద్దజాలుగుంట వద్ద ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. మృతి చెందిన వారు బాకాటి సుమన్(35), ముల్కనూరు చెందిన సుంచు మాధవి(35)గా పోలీసులు గుర్తించారు. అయితే వీరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమన్, మాధవికి వరసకు అల్లుడు అవుతాడని తెలుస్తోంది. -
న్యూజెర్సీలో తెలంగాణ వాసి మృతి
సాక్షి, నయీంనగర్: అమెరికాలోని న్యూజెర్సీలో హన్మకొండ భవానీనగర్‌కు చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు కిందపడి చనిపోయాడు. ప్రవీణ్‌కుమార్ (37) డిసెంబర్ 22న న్యూజెర్సీలోని ఎడిసన్ టౌన్షిప్ నుంచి న్యూయార్క్‌లోని ఆఫీసుకు వెళ్తుండగా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రవీణ్ తండ్రి రాజమౌళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డీఈగా రిటైర్ అయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా ప్రవీణ్‌కుమార్ చిన్నవాడు. రాజమౌళి స్వస్థలం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామం కాగా, భవానీనగర్‌లో స్థిరపడ్డారు. నాలుగేళ్లుగా భార్య నవతతో కలసి ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నాడు. దంపతులు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రవీణ్ మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ మృతదేహం ఆస్పత్రిలోనే ఉందని, -
ప్రకాశం బ్యారేజీలో దూకి యువకుడు ఆత్మహత్య
సాక్షి, కృష్ణా: జిల్లాలోని విజయవాడ ప్రకాశం బ్యారేజీ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం రెస్యూ చేసి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం మనోజ్ అనే వ్యక్తి ప్రకాశం బ్యారేజీ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను తీవ్రమై మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విజయవాడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆ యువకుడికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ఆట బంతి అనుకుని నాటు బాంబును..
కర్నూలు: జిల్లాలోని అవుకు మండలం చెన్నంపల్లెలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన నాటు బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన మాదిగ వరకుమార్(12) అనే విద్యార్థి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరకుమార్ తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా, ఆట బంతిగా భావించి నాటు బాంబును చేతిలోకి తీసుకున్నాడు. అది ఒక్కసారిగా ఆ బాలుడి చేతిలోనే పేలిపోవడంతో వరకుమార్ రెండు చేతులు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా.. ఫ్యాక్షన్ గ్రామంలో నాటుబాంబు పేలడం, ఒక విద్యార్థి మృతి చెందడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, ఫ్యాక్షన్ జోన్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ సోమ్లానాయక్, బనగానపల్లె సీఐ సురేష్ కుమార్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి పోలీసు జాగిలాలు, క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాల కోసం అన్వేషించారు. నాటు బాంబు పేలుడు ఘటనపై భిన్న కోణాల్లో విచారణ చేపట్టామని, అనుమానితుల వివరాలను కూడా సేకరిస్తున్నామని బనగానపల్లె సీఐ సురేష్‌కుమార్ రెడ్డి తెలిపారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం వివరాలను వెల్లడిస్తామన్నారు. చెన్నంపల్లె గ్రామంలో పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు. -
రమ్మీ ఆడి ప్రాణాలు పొగొట్టుకున్న వ్యక్తి
సాక్షి, విశాఖపట్నం: ఆన్లైన్లో రమ్మీ ఆడి అప్పులపాలైన వ్యక్తి అనుమానస్పద మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. విశాఖలోని గోపాలప్నటం కొత్తపాలెంకు చెందిన నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి మద్దాల సతీష్‌గా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. సతీష్ గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గోపాలపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ సమీపాన ఉన్న రైల్యే ట్రాక్‌పై ఆదివారం సతీష్ మృతదేహాన్నికనుగొన్నారు. అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే సతీష్ ఆన్లైన్ పేకాటకు బానిసై సుమారు కోటి రూపాయలు పోగొట్టుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా మృతుడు సతీష్‌కు భార్య ప్రత్యూష(28), కూతురు సాయి మోక్షిత(6) ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు రైల్వే హాస్పిటల్‌కు తరలించారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్‌ది హత్య, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. -
కన్నీళ్లు మిగిల్చిన నీళ్లు
సాక్షి, చాగలమర్రి(కర్నూలు): గ్రామాన్ని చుట్టుముట్టిన వరదలు ఓ కుటుంబంలో కన్నీళ్లు మిగిల్చాయి. సకాలంలో ఆస్పత్రికి చేర్చే మార్గం లేక.. ఓ వ్యక్తి కన్నుమూశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. వివరాలు.. బ్రాహ్మణపల్లెలో నివాసముండే గాలిపోతు థామస్(65)కు ఆదివారం గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారమిచ్చారు. 108 అంబులెన్స్ కూడా వెంటనే బ్రాహ్మణపల్లెకు బయల్దేరింది. అయితే.. భారీ వర్షాలతో కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వక్కిలేరు వంక రోడ్డుపైకి పొంగి ప్రవహిస్తుండడంతో.. గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో అంబులెన్స్ నిలిచిపోవాల్సి వచ్చింది. దీంతో థామస్‌ను కుటుంబ సభ్యులే గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు ట్రాక్టర్‌పై పంట పొలాల వెంబడి తీసుకెళ్లారు. ఆ తర్వాత ట్రాక్టర్ కూడా వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. దీంతో మంచంపై మోసుకుంటూ సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో నిలిచి ఉన్న 108 అంబులెన్స్ వద్దకు అతికష్టమ్మీద చేరుకున్నారు.అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు అంబులెన్స్ సిబ్బంది నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వక్కిలేరుపై వంతెన నిర్మించాలని 40 ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఆకలేస్తోంది.. అన్నం పెట్టు నాన్నా’
సాక్షి, బొమ్మలరామారం(ఆలేరు): ‘మన ఇంటికి చాలామంది వస్తున్నారు.. ఎందుకు నాన్నా. ఆకలేస్తోంది.. లేచి అన్నం పెట్టు .. మా నాన్నకు ఏమైంది.. ఎందుకు లేవడం లేదు’.. అంటూ తండ్రి మృతదేహం వద్ద చిన్నారులు అడిగిన ప్రశ్నలకు అక్కడికి వచ్చిన వారి హృదయాలు ద్రవించాయి. ఏడాదిన్నర క్రితం అనారోగ్య కారణాలతో తల్లి మృత్యుఒడికి చేరుకోగా.. ప్రస్తుతం తండ్రి కూడా హఠాన్మరణం చెందడంతో పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారులు.. అనాథలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన బొమ్మలరామారం మండలం మైలారం గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. మైలారం గ్రామానికి చెందిన వడ్లకొండ మడేలు(35) ఆటో నడడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ఆరేళ్ల రామ్‌తేజ, నాలుగేళ్ల కార్తికేయ కుమారులు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం మడేలు భార్య మమత అనారోగ్య కారణాలతో మృతిచెందింది. అప్పటినుంచి కుమారుల ఆలనాపాలన మడేలు చూసుకుంటున్నాడు. గుండెపోటుతో.. మడేలు ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రపోయాక గుండెపోటు రావడంతో మృత్యువాత పడ్డాడు. తమ తండ్రికి ఏమి జరిగిందో తెలియని చిన్నారులు మృతదేహం వద్ద దీనంగా నిలబడి చూస్తున్న చూపు కలచివేసింది. బాబాయ్ కనకరాజు, నాయనమ్మ యాదమ్మల వద్దకు వెళ్లి నాన్నను లేమ్మను చెప్పండి ఆకలేస్తుంది. అన్నం పెట్టమను అంటూ అడుగుతుంటే చూపరులు సైతం కన్నీటిని ఆపుకోలేక బోరుమన్నారు. స్పందించిన కలెక్టర్ అనితా రామచంద్రన్ మైలారంలో జరిగిన హృదయ విదారక ఘటన విషయం తెలుసుకుని కలెక్టర్ అనితా రామచంద్రన్ స్పందించారు. వెంటనే మైలారం గ్రామానికి మహిళ శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమశాఖ బాలల పరిరక్షణ అధికారి సైదులును పంపించారు.అనాథలైన చిన్నారుల సంరక్షణ బాధ్యత మహిళ శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమశాఖ తీసుకుంటుందని సర్పంచ్ వడ్లకొండ అరుణ ఆనంద్చారిలకు ఆయన హామీ ఇచ్చారు. చిన్నారులకు సర్పంచ్ వడ్లకొండ అరుణ ఆనంద్ రూ.5వేల ఆర్థికసాయం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ యశోద, ఊర్మిల, అంగన్వాడీ టీచర్ సుల్తానా, ఉప సర్పంచ్ బాబు, ఆరే కృష్ణ, మచ్చ సుదర్శన్ పాల్గొన్నారు. -
ప్రేమకథ విషాదాంతం
సాక్షి, ఎచ్చెర్ల: ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. కులాల హద్దులను చెరిపేశారు. అడ్డు చెప్పిన పెద్దలను కూడా వద్దనుకున్నారు. ఆలయంలో పెళ్లి చేసుకుని నూతన జీవితంలోకి అడుగుపెట్టారు. ఏడాదిన్నర కూడా కాపురం చేయలేదు. భార్య అనుమానాస్పద మృతి, ఆ ఘటన తట్టుకోలేక మూడు రోజులకే భర్త ఆత్మహత్య. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కథ ఆఖరకు విషాదాంతమైంది. రెండు కుటుంబాలకు కడుపు కోత మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్‌ఎల్‌పేట మండలం చింతలబడవంజ గ్రామానికి చెందిన బడాది శిరీష (21), ఎచ్చెర్ల మండలం తోటపాలేం పంచాయతీ పెయిలవానిపేట గ్రామానికి చెందిన బోనెల హేమసుందరావు (24) శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ ప్రేమించుకున్నారు. శిరీష చిన్ననాడే తండ్రి చనిపోవడంతో తల్లి రాజేశ్వరి పెంచి పెద్ద చేసింది. ప్రేమ విషయం తల్లికి చెప్పడంతో ఆమె అంగీకరించలేదు. దీంతో ప్రేమికులు లావేరు మండలం మురపాక గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో 2019 జూన్ 21న వివాహం చేసుకున్నారు. అనంతరం పొందూరు సబ్ రిజస్ట్రార్ కార్యాలయంలో 22న వివాహ రిజస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. పెయిలవానిపేటలో వరుడి ఇంటిలో కొత్త జీవితం మొదలుపెట్టారు. అయితే కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలు పొడచూపాయి. ఆ క్రమంలో ఏమైందో గానీ ఈ నెల 2న సాయంత్రం ఒక్కసారిగా శిరీష ఇంట్లోనే అపస్మారక స్థితికి చేరుకుంది. శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి ఆడపడుచు ఆమని ఫోన్ ద్వారా శిరీష తల్లి రాజేశ్వరికి సమాచారం ఇచ్చారు. రిమ్స్ చేరుకున్న రాజేశ్వరి తన బంధువులతో చర్చించి తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని, భర్త కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులకు సైతం పాల్పడుతున్నారని ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు విచారణ దశలో ఉండగా శనివారం మృతురాలి భర్త హేమసుందరావు ఆత్మహత్య చేసుకున్నారు. పరిమితికి మించి మత్తు మందు ఇంజెక్షన్ డోస్ నరానికి ఇచ్చుకున్నట్లు గుర్తించారు. ఉదయం ఎంత సేపటికీ నిద్ర లేవకపోవటంతో తండ్రి రఘు ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్ల ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించే సరికి ఆయన చనిపోయి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. భార్య మృతిపై పోలీస్ విచారణ సాగటం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి చెందటం వంటి సంఘటనలతో మానసిక సంఘర్షకు గురై హేమసుందరరావు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆస్పత్రిలో పనిచేస్తుండటం, వైద్యంపై అవగాహన ఉండటంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న జంట ఒకరి వెనుక ఒకరు మృతి చెందటంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నే హితులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం: పొలం నుంచి వస్తుండగా..
సాక్షి, ఇందల్వాయి: నల్లవెల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, వార్డు మెంబర్ డీపీ గంగారాం(49)ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దారుణంగా కొట్టి చంపారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శివప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గంగారాం పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా దారి కాసి పథకం ప్రకారం ద్విచక్ర వాహనాన్ని అడ్డుకొని దుండగులు హత్య చేశారు. తలపై నరికి, బండరాళ్లతో కొట్టి చంపి మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేశారు. రాత్రి తొమ్మిది గంటలైనా ఫోన్ లేపకపోవడం, ఇంటికి రాకపోయేసరికి అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. దారిలో గంగారాం మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. గంగారాం గ్రామ పంచాయతీలో 12వ వార్డు మెంబరుగా కొనసాగుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆధారాలు సేకరించడానికి సోమవారం ఉదయం గ్రామానికి వచ్చిన పోలీసులను గ్రామస్తులు అడ్డుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధర్పల్లికి చెందిన గంగారం బావ మరిది లక్ష్మీనారాయణపై గ్రామస్తులు అనుమానంతో దాడి చేశారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని స్థానికులు పేర్కొన్నారు. మృతుడి సోదరుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు గొడుగు రాజు, దామ అనిల్, లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తానే చంపినట్లు సోమవారం సాయంత్రం మృతుడి అల్లుడు రాజు డిచ్పల్లి ఠాణాలో సీఐ ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. -
22 గంటలపాటు ఇంట్లోనే మృతదేహం
సాక్షి, పాల్వంచ: కరోనా మహమ్మారి మనుషుల మధ్య మానవత్వాన్ని కూడా దూరం చేస్తోంది. ఓ వృద్ధుడు గుండెపోటుతో చనిపోతే.. కరోనా వైరస్ సోకి చనిపోయాడని భయపడి, మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ సహకరించలేదు. ఈ సంఘటన పాల్వంచ మండలం నాగారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లాది వెంకయ్య(56)కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా శనివారం సాయంత్రం మృతిచెందాడు. అయితే కరోనా కారణంగా మృతి చెంది ఉంటాడని భావించిన స్థానికులు భయంతో అంతిమ సంస్కారాలకు హాజరుకాకుండా దూరంగా ఉన్నారు. మృతుడి ఇరుగు పొరుగు, గ్రామస్తులెవరూ కనీసం చూసేందుకు కూడా రాలేదు. దీంతో మృతదేహం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 22 గంటలపాటు ఇంట్లోనే ఉంచారు. స్థానికులు సహకరించకపోవడంతో పాల్వంచలోని మున్సిపాల్ కార్మికులను ముగ్గుర్ని పిలిపించి, స్థానిక రైతు రంజిత్ ట్రాక్టర్‌పై మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు. శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో నివాసం ఉండే వారు కూడా మృతదేహాన్ని తమ వీధి నుంచి తీసుకెళ్లొద్దంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. పంచాయతీలు బాధ్యత తీసుకోవాలి నాగారం గ్రామంలో మల్లాది వెంకయ్య మృతి చెందితే అంత్యక్రియలు చేయడానికి గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఇచ్చేందుకు సర్పంచ్, కార్యదర్శి నిరాకరించారని సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన చేశారు. అదే గ్రామానికి చెందిన రంజిత్ అనే వ్యక్తి ట్రాక్టర్ ఇవ్వడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే పంచాయతీలు బాధ్యత తీసుకుని దహన సంస్కారాలు నిర్వహించాలని కోరారు. -
గతంలో అన్న.. ఇప్పుడు తమ్ముడు
సాక్షి, చొప్పదండి: రెండు రోజుల్లో పెళ్లి.. కొత్త జీవితం ప్రారంభించాల్సిన ఓ యువకుడిని విధి విద్యుదాఘాతం రూపంలో బలి తీసుకొని పెళ్లింట తీరని విషాదం నింపింది.. గతంలో వివాహం జరగకుండానే మొదటి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఇప్పుడు పెళ్లికి ముందే రెండో కుమారుడూ అనంతలోకాలకు వెళ్లడం ఓ తాపీ మేస్త్రీ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఎస్సై వంశీకృష్ణ కథనం ప్రకారం.. కమ్మర్‌ఖాన్‌పేటకు చెందిన పులిపాక అంజయ్య తాపీ మేస్త్రీగా పని చేస్తూ భూపాలపట్నం రోడ్డులోని చర్చి ముందు వీధిలో నివాసం ఉంటున్నాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటుండగా కుమారుడు పులిపాక హరీష్(27) చొప్పదండిలోని డిష్ ఆపరేటర్ వద్ద కేబుల్, రీచార్జి పనులు చేస్తున్నాడు. ఇతనికి బుధవారం వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం భూపాలపట్నం రోడ్డులో అంబేద్కర్ చౌరస్తా సమీపంలో గల ట్రాన్స్ఫార్మర్ వద్ద డిష్ వైరు సరి చేస్తుండగా, మెయిన్ లైన్ మూలంగా విద్యుదా ఘాతం సంభవించి, కుప్పకూలిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు తమ వాహనంలో నగునూరులోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. గతంలో అన్న.. ఇప్పుడు తమ్ముడు అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు కాగా, కూతురుకి పెళ్లి చేశాడు. పెద్ద కుమారుడు నరేష్ గతంలో రోడ్డు ప్రమాదంలో, చిన్న కుమారుడు హరీష్ ఇప్పుడు విద్యుదాఘాతంతో మృతిచెందారు. కుమారులిద్దరూ పెళ్లి కాకుండానే చనిపోవడంతో బాధిత కుటుంబీకులు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. వీరి తల్లి కూడా గతంలోనే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. రాఖీ కట్టలేకపోయిన సోదరి రాఖీ పండుగ సందర్భంగా తనకు మిగిలిన ఒక్కగానొక్క సోదరుడికి రాఖీ కట్టాలని హరీష్ సోదరి పుట్టింటికి వచ్చింది. కానీ అతను కేబుల్ పనికి వెళ్లి చనిపోవడంతో తాను రాఖీ కూడా కట్టలేక పోయానని ఆమె రోదించింది. -
కెనడాలో తెలుగు యువకుడు మృతి
సాక్షి, తూర్పుగోదావరి: కెనడాలో మృతి చెందిన తెలుగు యువకుడు తేజారెడ్డి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. 2018లో చదువు నిమిత్తం కెనడాకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తేజారెడ్డి.. నిన్న ప్రమాదవశాత్తు కెనడాలో మరణించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడం కోసం రూ.5 లక్షలు చందాలు వేసుకుని మృతదేహాన్ని పంపించాలని స్నేహితులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కెనడా హాస్పటల్ మార్చురీలో యువకుడి మృతదేహాన్ని భద్రపరిచారు. కెనడా ప్రభుత్వంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంప్రదించి తేజా రెడ్డి మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించాలని స్నేహితులు కోరుతున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సకాలంలో వైద్యం అందకపోవడంతో ఒక రోగి ఊపిరాడక మృతిచెందిన ఘటన అనంతపురం జీజీహెచ్‌లో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైంది. ధర్మవరానికి చెందిన రాజు అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రికి రాగా, వైద్యులు పట్టించుకోలేదు. శుక్రవారం తెల్లవారుజామున మూడుగంటలకు ఆసుపత్రికి వచ్చిన రాజుకు వైద్య చికిత్స సకాలంలో అందించకపోవడంతో ఊపిరాడక మరణించినట్లు తెలిసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు,బంధువులు ఆందోళనకు దిగారు. -
పాజిటివ్ అనుమానం.. ప్రాణం తీసింది..
పిఠాపురం: కరోనా భయం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. గొల్లప్రోలుకు చెందిన వృద్ధుడు (63) కొంతకాలంగా యూరినల్ సమస్యతో బాధ పడుతూ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు. రెండు రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండడంతో ఆదివారం అతడిని భార్య పిఠాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లింది. రెండతస్తుల భవనంలోని ఆస్పత్రికి ఇబ్బంది పడుతూనే తన భర్తను తీసుకువెళ్లింది. మేడ పైకి ఎక్కడంతో ఆయాసపడుతున్న అతడిని చూసిన ఆస్పత్రి సిబ్బందికి అనుమానం వచ్చింది. ప్రస్తుత కరోనా టెస్టు చేయించుకుంటే తప్ప చికిత్స చేయలేమని చెప్పారు. దీంతో భయాందోళనలకు గురైన భార్యాభర్తలిద్దరూ తిరిగి కిందకు దిగారు. కరోనా అనుమానంతో ఆందోళనకు గురైన బాధితుడు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. భార్య లబోదిబోమంటూ రోదిస్తున్నా ఎవరూ దగ్గరకు వెళ్లే సాహసం చేయలేకపోయారు. చివరకు వారి బంధువులకు సమాచారం అందగా వారు ఓ ప్రైవేటు అంబులెన్సులో స్వగ్రామమైన గొల్లప్రోలు తీసుకువెళ్లారు. కరోనా టెస్టు చేయించకుండా అంతిమ సంస్కారాలు చేయకూడదని చెప్పడంతో తిరిగి మృతదేహాన్ని పిఠాపురం ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకూ మృతదేహాన్ని చూడడానికి కూడా బంధువులు సాహసించలేదు. కరోనా టెస్టు చేసిన వైద్యులు అతడికి కరోనా లేదని చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకు రాగా, అందరూ వచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. మామూలు వ్యక్తులనే అనుమానిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనారోగ్యంతో అందులోనూ ఆయాసంతో ఉన్న వ్యక్తిని టెస్టు చేయించుకోమనడం ఆస్పత్రి సిబ్బంది చెప్పడం సమంజసమే. అయినప్పటికీ కరోనా అనుమానం అనారోగ్యంతో ఉన్న వ్యక్తి గుండె ఆగేలా చేసింది. -
నిజామాబాద్‌లో మరో కరోనా మరణం
సాక్షి, నిజామబాద్: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం మరో ఇద్దరు మరణించారు. నిజామాబాద్‌కు చెందిన ఒకరు కరోనాతో మృతిచెందగా, మరొకరు అనారోగ్యంతో మరణించారు. గడిచిన రెండు రోజుల్లో ఐదుగురు మృతిచెందగా, వారిలో నలుగురు కరోనా బారినపడి మరణించారు. జిల్లాలో శనివారం కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు వైద్యులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 230కి చేరుకుంది. (కరోనాను జయించినా.. మరణం తప్పలేదు) -
డబ్బు కోసం దారుణ హత్య
సాక్షి, పెదకూరపాడు: డబ్బు కోసం ఓ యువకుడు దంపతులపై దాడి చేశాడు. భర్త ప్రాణాలు తీసి, భార్యను గాయపరిచి బంగారు నగలను చోరీ చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలంలోని కాశిపాడు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పులిపాటి రాధాకృష్ణమూర్తి (56), అతని భార్య శివవెంకటనరసమ్మ గ్రామంలో చిన్న దుకాణం నడుపుతూ జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన మల్లెల గోపి అలియాస్ పిల్ల గోపి ఇటీవల కృష్ణమూర్తి ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటిలోకి అద్దెకు వచ్చాడు. కృష్ణమూర్తి దంపతులకు తెలియకుండా సోమవారం రాత్రి వారి ఇంటిలోకి గోపి చొరబడ్డాడు. దీన్ని గమనించిన కృష్ణమూర్తి గోపిని ఎందుకొచ్చావని ప్రశ్నించాడు. (మందు కోసం అప్పుడు తల్లిని, ఇప్పుడు కొడుకును) డబ్బు, నగలు ఇవ్వకుంటే చంపేస్తానని గోపి బెదిరించడంతో కృష్ణమూర్తి దంపతులు కేకలు వేశారు. దీంతో భయంతో గోపి కోడవలితో దంపతులపై దాడి చేశాడు. దంపతులు మృతి చెందారని భావించి నరసమ్మ ఒంటిపై ఉన్న 23 సవర్ల బంగారాన్ని దొంగిలించి పారిపోయాడు. కృష్ణమూర్తి మృతి చెందగా, నరసమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు నరసమ్మ స్పృహలోకి వచ్చి గుంటూరులో ఉంటున్న పెద్దకుమారుడు సురేష్‌కు ఫోన్లో విషయాన్ని చెప్పింది. సురేష్ వెంటనే అదే గ్రామంలో ఉన్న తమ బంధువు పుల్లారావుకు సమాచరమివ్వగా, అతడు వెంటనే 108, 100కి డయల్ చేసి విషయం చెప్పారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నరసమ్మను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. నిందితుడు గోపి మంగళవారం ఉదయం చుట్టుపక్కల వాళ్లతో కలిసి ఈ దారుణంపై చర్చించి దొంగలు పడినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. నరసమ్మ ప్రాణాలతో బయటపడటం, జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో పోలీసులు గోపిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.6 లక్షల విలువజేసే నగలను స్వాధీనం చేసుకున్నారు. -
పలాసలో దారుణం: టాయిలెట్లో మృతదేహం
సాక్షి, కాశీబుగ్గ: పలాసలో కలకలం రేగింది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని టాయిలెట్లో బుధవారం ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో పట్టణంలో భయాందోళనలు అలముకున్నాయి. మృతుడిని కవిటికి చెందిన పల్లి సాంబమూర్తి(40)గా పోలీసులు గుర్తించారు. పలాసలోనే చాలాకాలంగా చిన్న చి న్న పనులు చేసుకుంటూ అతడు కుటుంబానికి దూరంగా జీవనం సాగిస్తున్నాడు. మృతదేహం పడి ఉన్న తీరు, శరీరంపై గాయాలు, కాంప్లెక్స్ పరిసరాల్లోని ఆనవాళ్లను బట్టి అతడిని పాశవికంగా హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. కలాసీలు గుర్తించారు.. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బుధవారం ఉదయం కొందరు కలాసీలు టాయిలెట్‌కు వెళ్లగా.. ఒక గది లో మృతదేహం కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీసి ఆ సమీపంలో ఉన్న పోలీసులకు విషయం చెప్పారు. వారు ఎస్ఐ మధుకు సమాచారం అందించడంతో ఆయన సీఐ వేణుగోపాలరావు, క్రైమ్‌టీమ్‌లను సంప్రదించి అంతా కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు. కొందరు ప్రైవేటు కూలీలతో మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహం రక్తపు మడుగులో ఉండడం, శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండడంతో హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అడుగడుగునా.. కాంప్లెక్స్‌లో శవం బయట పడిందన్న విషయం తెలిసి పలాస–కాశీబుగ్గ వాసులు ఆందోళనకు గురయ్యారు. మృతదేహం పడి ఉన్న తీరు, అతడి శరీరంపై గాయాలు పరిశీలనగా చూస్తే తీవ్ర పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న పాన్‌షాప్ తలుపులకు, కింది గచ్చుభాగానికి రక్త పు మరకలు అంటి ఉన్నాయి. చెప్పులు చెల్లాచెదురుగా పడి ఉండగా.. కాంప్లెక్స్‌లో బస్ పాసులిచ్చే ద్వారం వద్దకు వ్యక్తిని ఈడ్చుకువెళ్లిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహాన్ని పోలీసులు చూసే సరికి.. పురుషాంగంతో పాటు ఆపైభాగం, కింది భాగాల్లో తీవ్రమైన గాయాలు కనిపించాయి. అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేనప్పుడు దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమా ర్టం జరిగితే మరిన్ని విషయాలు బయటపడతా యని చెబుతున్నారు. దర్యాప్తులోనే.. ఈ సంఘటనపై కాశీబుగ్గ పోలీసులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. మృతుడు కవిటికి చెందిన పల్లి ఫకీరు(లేటు) తల్లి జోగమ్మల చిన్న కుమారుడని, వివాహం కాలేదని తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎదురుగానే సీసీ కెమెరాలు.. మృతదేహం లభ్యమైన స్థలానికి కాసింత దూరంలోనే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాల్లో దృశ్యాలు, వీడియోలు ఉంటా యని పోలీసులు భావిస్తున్నారు. రక్తపు మరకలు ఉన్న కాంప్లెక్స్ నీటి కుళాయికి ఎదురుగా కూడా ఓ సీసీ కెమెరా ఉంది. మృతుడి జేబులో ఉన్న కాగితాల ఆధారంగా అతడి వివరాలు తెలుసుకున్నారు. -
విషాదం: పెళ్లి వేడుకకు వచ్చి..
సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్): బావమరిది పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వచ్చి రొడ్డు ప్రమాదంతో తీవ్రగాయలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యవకుడు మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో విషాదం నింపింది. సోమవారం రాత్రి మండలంలోని సంగాయిపల్లి వద్ద మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన కానుగంటి నవీన్(29) ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొని తీవ్రగాయలకు గురికావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మడూర్ నుంచి గవ్వలపల్లికి స్కూటీపై వస్తున్న నవీన్‌ను ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే కొంపల్లిలోని రష్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అర్ధరాత్రి దాటిన తరువాత మృతి చెందినట్లు పోలీస్‌లు తెలిపారు. మృతుడు నవీన్‌కు భార్య సంధ్య, 11 నెలల కుమారుడు, తల్లి ఉందని బంధువులు తెలిపారు. కేసునమోదు చేసుకుని గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు ఏఎస్ఐ మల్లికార్జున్ తెలిపారు. పెళ్లి వాయిదా... మడూర్ గ్రామానికి చెందిన మంగళి రామచంద్రం కుమారుడి వివాహం 26న ఉంది. నవీన్ రెండు రోజుల మందే భార్యపిల్లలతో మడూర్ చేరుకున్నాడు. సోమవారం రాత్రి గవ్వలపల్లిలో బంధువులు బస్ దిగడంతో తీసుకువచ్చేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది. అల్లుడు చనిపోయిన విషాదంలో పెళ్లి జరపలేమని వాయిదా వేసి పందిరిని తొలగించారు. -
పెళ్లింట విషాదం..
సాక్షి, శివ్వంపేట(నర్సాపూర్ ): అప్పటి వరకు పెళ్లి సంబరాల్లో అనందంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అక్క పెళ్లి వేడుకల్లో భాగంగా బావగారింటి వద్ద నిర్వహించిన భరాత్‌లో ఉత్సాహంగా పాల్గొన తమ్ముడు గుండెపోటుకు గురై మృతిచెందిన విషాదకర సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం తాళ్లపల్లితండా పంచాయతీ పరిధి శంకర్ తండాకు చెందిన లాకావత్ బుజ్జి తారాసింగ్ దంపతులకు కూతురు నీతా, కొడుకు నరేందర్(20) ఉన్నారు. నీతా పెళ్లి సోమవారం కౌడిపల్లి మండలం బుర్గుగడ్డకు చెందిన మేనబావతో శంకర్ తండాలో ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు. సాయంత్రం తండాలో భరాత్ నిర్వహించి అప్పగింతల కార్యక్రమం అనందంగా నిర్వహించారు. బుర్గుగడ్డలో రాత్రి భరాత్ నిర్వహిస్తుండడంతో అక్కడికి స్నేహితులతో కలిసి నరేందర్ వెళ్లాడు. అక్కబావల భరాత్‌లో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న క్రమంలో అస్వస్థతకు గురైనాడు. కొద్దిసేపు సేదతీరిన అనంతరం మాములు స్థితికి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటికి ఛాతిలో నొప్పిగా ఉందని స్నేహితులతో చెప్పడంతో బైక్‌పై కౌడిపల్లిలోని క్లినిక్ తీసుకెళ్లగా నర్సాపూర్ తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే అందుబాటులో లేకపోవడంతో బైక్ పైనే నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంతో అప్పటికే మృతిచెందాడు. పెళ్లి వేడుకల్లో అనందంగా గడిపిన కుటుంబం నరేందర్ అకస్మాతుగా మృతిచెందడంతో విషాధచాయలు అలుముకున్నాయి. నరేందర్ తూప్రాన్‌లోని స్నేహ జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శంకర్ తండాలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించగా పలువురు ప్రజా ప్రతినిధులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. గత సంవత్సరం శివ్వంపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన నరేందర్ మృతి పట్ల విద్యార్థులు మౌనం పాటించి పాఠశాలకు సెలవు ప్రకటించారు. -
భార్యను కాపాడుతూ.. భర్త మృతి
దుబాయ్ : అగ్ని ప్రమాదం నుంచి భార్యను కాపాడే క్రమంలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత్‌కు చెందిన వ్యక్తి సోమవారం మృతి చెందారు. కేరళకు చెందిన అనిల్(32) మంటల్లో చిక్కుకున్న తన భార్య నీనును రక్షించే క్రమంలో వీరిద్దరూ గత సోమవారం అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్థానికులు ఈ దంపతులను దుబాయ్‌లోని స్థానిక ఆసుపత్రికి తరలించగా 90 శాతం కాలిన గాయలతో చికిత్స పొందుతున్న అనిల్ నేడు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 10 శాతం గాయాలైన ఆయన భార్య నీను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని.. ఈ ఘటనలో బాలుడు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు. దుబాయ్‌లోని ఉమ్ అల్ క్విన్‌లో అనిల్ తన భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత సోమవారం వారి అపార్టుమెంటులోని కారిడార్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటల్లో చిక్కుకున్న నీనును కాపాడేందుకు వెళ్లిన అనిల్ భార్యను రక్షించేందుకు వెళ్లి తాను మంటల్లో చిక్కుకున్నాడు. దీంతో నీను అరుపులు విన్న పక్క అపార్టుమెంటు వాసులు అక్కడి వచ్చి చూసేసరికి అనిల్ మంటల్లో చిక్కుకుని కనిపించారు. మంటలను ఆర్పి దంపతులిద్దరినీ అబుదాబిలోని మఫ్రాక్ ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యులు చికిత్స అందిస్తున్న తరుణంలో నీను పరిస్థితి నిలకడ ఉండగా. బాలుడి మెరుగైన వైద్యం కోసం అబుదాబిలోని మరో ఆసుపత్రికి గత మంగళవారం తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. భార్యను కాపాడుతూ మంటల్లో చిక్కుకున్న భర్త.. -
సరిహద్దుల్ని దాటి ప్రాణాల్ని హరించేస్తోంది..
హాంగ్‌కాంగ్: కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ వైరస్ రోజు రోజుకు ఖండాలు, దేశాలను దాటేస్తోంది. తాజాగా కరోనా వైరస్ సోకి హాంకాంగ్‌లో ఓ వ్యక్తి మరణించాడు. చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని 25 దేశాలను గజగజలాడిస్తోంది. కరోనా వైరస్ వల్ల చైనా బయట నమోదైన రెండవ మరణంగా దీన్ని ధృవీకరిస్తున్నారు. ఇటీవల ఫిలిప్పీన్స్‌లో 44 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌తో మరణించిన విషయం తెలిసిందే. (కరోనా వైరస్ తీవ్రతరం) కాగా హాంకాంగ్‌లో ఇప్పటి వరకు 15 మందికి వైరస్ సోకింది. వారిని ఆస్పత్రుల్లోని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనావైరస్ బారిన పడి చైనాలో ఇప్పటి దాకా 425 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 20 వేల మందికి పైగా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. హాంకాంగ్‌కు చెందిన 39 ఏళ్ళ వ్యక్తి జనవరి 21న వుహాన్ నగరానికి వెళ్లి.. 2 రోజుల్లో తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఆ వెంటనే కరోనా వైరస్ లక్షణాలతో అతను ఆస్పత్రిలో చేరాడు. రక్తపరీక్షలు నిర్వహించగా అతడికి వైరస్ సోకినట్లు తేలింది. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశాడు. కాగా సోమవారం అర్థరాత్రి నుంచి చైనా భూభాగంతో ఉన్న 13 సరిహద్దు క్రాసింగ్స్‌ను హాంకాంగ్ మూసివేసింది. కరోనావైరస్ గ్లోబల్ మార్కెట్లను కుదిపేయడంతో.. పలు విమానయాన సంస్థలు చైనాకు సర్వీసులను నిలిపివేశాయి. భారత్‌లో రెండో కరోనా కేసు..! -
ప్రాణం తీసిన సరదా పందెం
-
గూడ్స్ ప్రమాదం తప్పి.. ఎక్స్‌ప్రెస్ రైలుకు చిక్కి..
జి.సిగడాం: సంతలో సామగ్రి కొనుగోలు చేసేందుకు బయలుదేరిన ఆ వ్యక్తిని మృత్యురూపంలో దూసుకొచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. తొలుత గూడ్స్ రైలు ప్రమాదం నుంచి తప్పించుకుని, పొరపాటున మరో రైలు పట్టాలపైకి రావడంతో ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటన మండలంలోని వాండ్రంగి రైల్వే గేటు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు... సంతవురిటి గ్రామానికి చెందిన ముత్తాల అప్పారావు(50) పొందూరు సంతలో ఇంటి సామగ్రి కొనుగోలు చేసి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి తన గ్రామం నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో వాండ్రంగి రైల్వే గేటు వద్ద పట్టాలు దాటుతున్నాడు. ఇంతలో ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న గూడ్స్‌ను గమనించి వెనక్కి తగ్గాడు. ఈ క్రమంలో పొరపాటున మరో పట్టాలపైకి రావడంతో అదే సమయంలో విశాఖపట్నం నుంచి ఒడిశా వైపు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి ముఖ భాగం గుర్తు పట్టలేనంతగా నుజ్జనుజ్జయింది. మృతుడికి భార్య పద్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అప్పారావు కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడని, పెద్ద దిక్కు కోల్పోయిన పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంఘటనా స్థలానికి ఆమదాలవలస రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణారావు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
‘టిన్నర్’ దాడి నిందితుడు ఆత్మహత్య
జగిత్యాల క్రైం/కొండగట్టు/కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో గత నెల 21న నలుగురు కుటుంబసభ్యులను హత్యచేసిన కేసులో నిందితుడైన లక్ష్మీరాజం (42) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం దిగువ కొండగట్టు ప్రాంతంలో ఆదివారం చెట్టుకు ఉరివేసుకొని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన చిలుమలు లక్ష్మీరాజంకు 2007లో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లికి చెందిన విమలతో వివాహమైంది. వీరికి కూతురు పవిత్ర, కుమారుడు జైపాల్ సంతానం. కుటుంబ కలహాల నేపథ్యంలో హైదరాబాద్‌లో విడిగా ఉంటున్న భార్య విమల నవంబర్ 21న ఖమ్మంపల్లి వచ్చిందని తెలుసుకున్న లక్ష్మీరాజం, అదే రోజు అర్ధరాత్రి విమలతోపాటు బావమరిది జాన్‌రాజ్, ఆయన భార్య రాజేశ్వరి, కుమార్తె పవిత్ర, వదిన సుజాత ఒకే గదిలో నిద్రిస్తుండగా.. వారిపై టిన్నర్ అనే రసాయనం పోసి నిప్పుపెట్టి పరారయ్యాడు. ఆ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. నలుగురు మృతిచెందారు. అప్పటి నుంచి పోలీసులు లక్ష్మీరాజం కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతను కొండగట్టు వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మల్యాల ఎస్సై ఉపేంద్రాచారి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి మైసయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.