తాజాగా ఎంఎస్ పూర్తి.. విహారయాత్రకు వెళ్లగా విషాదం
కొడుకు పట్టా స్వీకరణకు వెళ్లి అక్కడే ఉన్న తల్లిదండ్రులు
ఖమ్మం సహకారనగర్: బీటెక్ పూర్తిచేశాక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చినా కాదను కున్న యువకుడు ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఇటీవలే కోర్సు పూర్తికాగా, కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు తల్లి దండ్రులూ అమెరికా వెళ్లారు. పట్టా స్వీకరించిన సంతోషంలో స్నేహితులతో కలిసి విహారయాత్ర కు వెళ్లిన ఆ యువకుడు అక్కడి జలపాతంలో మునిగి మృతి చెందగా.. కొడుకు మృతదేహంతో స్వస్థలానికి వెళ్లాలని తెలిసిన ఆ తల్లిదండ్రుల రోదనకు అంతు లేకుండా పోయింది.
ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంలోని మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్ లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్ (24) రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేయగా అమెజా న్‌లో ఉద్యోగం వచ్చింది. అయినా ఎంఎస్ చదవా లనే లక్ష్యంతో అమెరికా వెళ్లాడు. అక్కడ అరిజోనా యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తిచేసిన ఆయన వారం క్రితం పట్టా స్వీకరించారు.
కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు అమెరికా వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అయితే, ఎంఎస్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా అమెరికాలోని ప్రసిద్ధ ఫాసిల్ క్రీక్ జలపాతం వద్దకు రాకేశ్, ఆయన స్నేహితులు ఈనెల 8వ తేదీన వెళ్లారు.
జలపాతం వద్ద సరదాగా గడుపుతుండగా రాకేశ్‌తో పాటు మరో యువకుడు ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యలు చేపట్టగా మరుసటిరోజు 25 అడుగుల లోతులో మృతదే హాలు లభించాయి. రాకేశ్‌తో పాటు మృతి చెందిన మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment