Rakesh
-
రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మాట అన్నారు: మూవీ ఈవెంట్లో హరీశ్ రావు
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు. రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..'ముఖ్యమంత్రులు వస్తు ఉంటారు. పోతుంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన పేరు మీద సినిమా తీయడం సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణను సాధించడమే కాదు అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించారు. రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. నేను హైదరాబాద్‌లో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా అని. కేసీఆర్ పల్లెలను, హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. మనం చూసే భౌతికమైన అభివృద్దే కాదు. సామాజిక పరంగా సంస్కృతి పరంగా తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక దశ దిశను చూపించారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కేసీఆర్ చేసిన కృషి. అధికారంలో ఉన్న పార్టీ వారి మీద సినిమాలు తీస్తారు. కానీ అధికారంలో లేకపోయినా రాకేష్ ప్రేమతో, దమ్ము ధైర్యంతో ఈ సినిమా తీశారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు. -
కొండా సురేఖ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి
-
బాలుడి దారుణ హత్య
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో పన్నెండేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడిని గుప్త నిధుల కోసం చంపారా? లేదా డబ్బుల కోసమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివి. బాల్కొండకు చెందిన బండి నరేందర్.. నచ్చు రాకేశ్ మేనమామ అయిన నాగాపూర్‌కు చెందిన దశరథ్ మేకలను మేతకు తీసుకుని వెళ్తాడు. దీంతో రాకేశ్ కుటుంబ సభ్యులకు పరిచయమయ్యాడు. గణపతులను చూసి వద్దామని చెప్పి ఈ నెల 11న బండి నరేందర్ చిట్టాపూర్ గ్రామానికి చెందిన బాలుడు నచ్చు రాకేశ్‌ను.. బాల్కొండకు తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వరకు కూడా రాకేశ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నరేందర్‌ను ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాక పోవడంతో బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా శనివారం ఉదయం బాల్కొండలోని ఖిల్లా ప్రాంతంలో బాలుడి మృతదేహం ఉందని చిట్టాపూర్ గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగుచూసింది. బాలుడి మృతదేహంపై దుస్తులు లేకపోగా.. ఎడమ కంటి భాగంపై బండరాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఖిల్లాలోని ఓ గుహ ముందు హత్య చేసి మృతదేహాన్ని కొద్దిదూరంలో పారేశారు. ఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. బాలుడిని నరేందర్ హత్య చేసి ఉంటాడని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. నరేందర్‌తో వెళ్లేముందు బాలుడు తన అన్న మణికంఠకు ఫోను చేసి చెప్పాడని తెలిపారు. పోలీసులు నరేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే అనుమానితుడు నేరాన్ని అంగీకరించలేదని పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి దర్యాçప్తు చేపట్టి నిందితులను పట్టుకుంటామన్నారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని నరేందర్‌ను తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్య జరిగిన మర్నాడు కూడా నరేందర్ తన భార్య మొబైల్‌తో ఫోన్ చేసి.. రాకేశ్ ఖానాపూర్ వద్ద ఉన్నాడని అబద్ధం చెప్పాడని వివరించారు. హత్య జరిగిన రోజు ఉదయం నరేందర్.. మొదట బాలుడి అన్న మణికంఠకు ఫోన్‌చేసి ఖిల్లా వద్దకు రమ్మన్నాడని, మణికంఠ వెళ్లకపోవడంతో రాకేశ్‌ను తీసుకెళ్లినట్లు వివరించారు. న్యాయం చేస్తామని ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి హామీ ఇవ్వడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనను విరమించారు. హతుని తండ్రి రెండేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
కోస్ట్ గార్డ్ డీజీ హఠాన్మరణం
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: భారత తీర రక్షక దళం(ఐసీజీ) డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ హఠాన్మరణం చెందారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన ఐసీజీ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండెపోటుకు గురైన రాకేశ్ పాల్‌ను వెంటనే చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని అధికార వర్గాలు తెలిపాయి. చెన్నైలోనే ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆస్పత్రికి వెళ్లి రాకేశ్ పాల్‌కు నివాళులర్పించారు. రాకేశ్ పాల్ పారి్థవ దేహాన్ని ప్రత్యేక ఏర్పాట్లతో చెన్నై నుంచి అర్ధరాత్రి వేళ ఢిల్లీకి తరలించారు. రాకేశ్ పాల్ గతేడాది జూలై 19వ తేదీన ఐసీజీ 25వ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ నావల్ ఎకాడమీ విద్యార్థి అయిన రాకేశ్ పాల్ 1989లో ఐసీజీ (ఇండియన్ కోస్ట్ గార్డ్)లో చేరి 34 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. -
చిత్రలేఖనంలో డెలివరీ బాయ్ వారెవ్వా..
సాక్షి, సిటీబ్యూరో: అతడో డెలివరీ బాయ్.. అది సమాజానికి తెలిసిన విషయం. కానీ ప్రపంచానికి తెలియని మరో విషయం ఏంటంటే అతడో మంచి చిత్రకారుడు. కుంచె పట్టాడంటే అద్భుతాలు అలా జాలువారుతాయి. చక్కటి రూపాలను మలచడంలో ప్రసిద్ధుడు. కానీ కుటుంబ పరిస్థితులు మాత్రం ఓ డెలివరీ బాయ్ పనికి పరిమితం చేశాయి. అతడి పేరే రాకేశ్ రాజ్ రెబ్బా. పుట్టింది మహారాష్ట్రలోని సోలాపూర్‌లో.. పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.చిన్నప్పటి నుంచీ ఆసక్తి..రాకేశ్‌కు చిత్రలేఖనం అంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి.. ఆ కళపై ఎలాగైనా పట్టుసాధించాలనే తపనతో చిన్నప్పుడు.. ఎప్పుడూ చూసినా ఏదో ఒక బొమ్మ గీస్తుండేవాడట. అలా కొన్ని వందల చిత్రాలను పుస్తకాల్లో గీసి అపురూపంగా దాచిపెట్టుకున్నాడు.మనుషుల ముఖాలను కూడా గీస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. ప్రస్తుతం అప్పుడప్పుడూ వాల్ పెయింటిగ్స్ వేస్తూ తన కళను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన కళకు మరిన్ని నగిïÙలు అద్దితే ఎన్నో ఎత్తులకు చేరుకుంటాడనడంలో అతిశయోక్తి లేదు.మంచి ఆర్టిస్టు కావాలని కోరిక.. ఆర్ట్ వేయడం అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. సొంతంగానే ఎన్నో బొమ్మలు వేశాను. డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నా. ఎవరైనా ప్రోత్సాహం అందిస్తే మంచి ఆరి్టస్టుగా జీవితంలో పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. – రాకేశ్ రాజ్ రెబ్బా -
నిషేధిత డ్రగ్ తయారీ ముఠా గుట్టురట్టు
జిన్నారం (పటాన్చెరు): టీఎస్ న్యాబ్, జిల్లా పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిషేధిత డ్రగ్‌ను తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ మంగళవారం వివరాలు వెల్లడించారు. గుమ్మడిదలకు చెందిన గోసుకొండ అంజిరెడ్డి, కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌గౌడ్, అనంతారానికి చెందిన సాయికుమార్‌గౌడ్, వికారాబాద్ జిల్లా పంచలింగాలకు చెందిన క్యాసారం రాకేశ్‌లు నిషేధిత అ్రల్పాజోలం తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. నలుగురూ కలిసి కొత్తపల్లి గ్రామ శివారులో ఓ కోళ్ల ఫారాన్ని లీజుకు తీసుకున్నారు. అక్కడ ఓ ప్రత్యేక గదిలో డ్రగ్‌ను తయారు చేసేందుకు రియాక్టర్‌తో సహా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసుకున్నారు. అంజిరెడ్డి బాలానగర్‌లో అ్రల్పాజోలం తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు తీసుసురాగా రాకేశ్ డ్రగ్‌ను ప్రాసెస్‌ను చేసేవాడు. ఆరు నెలలుగా వీరి డ్రగ్ వ్యాపారం బాగానే నడిచింది.అయితే గ్రామ శివారులో వ్యర్థాల ఘాటు వాసనలు వెలువడటంతో ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో టీఎస్ న్యాబ్, పోలీసులు సంయుక్తంగా డ్రగ్ కేంద్రంపై దాడులు జరిపి, రూ.40 లక్షల విలువైన 2.6 కిలోల అ్రల్పాజోలం, మరో రూ.60 లక్షల విలువైన ముడి పదార్థాలు, యంత్రాలను అధికారులు సీజ్ చేశారు. రాకేశ్, అంజిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, సాయికుమార్‌గౌడ్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ప్రభాకర్‌గౌడ్ పరారీలో ఉన్నాడని ఎస్పీ రూపేశ్ తెలిపారు. సమావేశంలో న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ సంతోష్, పటాన్చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, జిన్నారం సీఐ సు«దీర్ కుమార్, ఎస్ఐలు మహేశ్వర్‌రెడ్డి, విజయారావు తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి
ఖమ్మం సహకారనగర్: బీటెక్ పూర్తిచేశాక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చినా కాదను కున్న యువకుడు ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఇటీవలే కోర్సు పూర్తికాగా, కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు తల్లి దండ్రులూ అమెరికా వెళ్లారు. పట్టా స్వీకరించిన సంతోషంలో స్నేహితులతో కలిసి విహారయాత్ర కు వెళ్లిన ఆ యువకుడు అక్కడి జలపాతంలో మునిగి మృతి చెందగా.. కొడుకు మృతదేహంతో స్వస్థలానికి వెళ్లాలని తెలిసిన ఆ తల్లిదండ్రుల రోదనకు అంతు లేకుండా పోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంలోని మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్ లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్ (24) రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేయగా అమెజా న్లో ఉద్యోగం వచ్చింది. అయినా ఎంఎస్ చదవా లనే లక్ష్యంతో అమెరికా వెళ్లాడు. అక్కడ అరిజోనా యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తిచేసిన ఆయన వారం క్రితం పట్టా స్వీకరించారు. కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు అమెరికా వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అయితే, ఎంఎస్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా అమెరికాలోని ప్రసిద్ధ ఫాసిల్ క్రీక్ జలపాతం వద్దకు రాకేశ్, ఆయన స్నేహితులు ఈనెల 8వ తేదీన వెళ్లారు.జలపాతం వద్ద సరదాగా గడుపుతుండగా రాకేశ్‌తో పాటు మరో యువకుడు ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యలు చేపట్టగా మరుసటిరోజు 25 అడుగుల లోతులో మృతదే హాలు లభించాయి. రాకేశ్‌తో పాటు మృతి చెందిన మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
జస్టిస్ రాకేష్ పై సుప్రీం సీరియస్
-
రైళ్ల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: కాజీపేట్–డోర్నకల్, విజయవాడ– డోర్నకల్ మధ్య రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. కాజీపేట్–డోర్నకల్ మధ్య ఈ నెల 14 నుంచి, విజయవాడ–డోర్నకల్ మధ్య ఈ నెల 20 నుంచి రైళ్లు యాథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి. రైల్వేలైన్ల నిర్వహణ దృష్ట్యా ఈ రెండు రైళ్లను ఈ నెల ఒకటో తేదీ నుంచి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
దీపావళి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా హైదరాబాద్–కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్–కటక్ (07165/07166) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14, 21 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.45 గంటలకు కటక్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు కటక్ నుంచి బయల్దేరి మర్నాడు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని.. యువకుడు..
సాక్షి, జగిత్యాల: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని వెంగళాపూర్ గ్రామానికి చెందిన అంతెల్పుల రాకేశ్ (22) కొంతకాలంగా ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఇటీవల పెళ్లి చేసుకుందామని ఆమెను కోరగా ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాకేశ్ సదరు యువతి పెళ్లికి ఒప్పుకోవడంలేదని ఇంట్లో చెబుతూ బాధపడుతుండేవాడు. సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: నా భార్యది ఆత్మహత్య కాదు.. ఇదిగో వినండి.. వాయిస్ రికార్డ్! -
పెళ్లి బరాత్.. డీజే వాహనం.. అదుపు తప్పి ఒక్కసారిగా..
మహబూబాబాద్: పెళ్లి బరాత్‌లో పాల్గొని వస్తున్న డీజే వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన కొయ్యడ రాకేష్, జోరుక సందీప్ , కక్కర్ల పృథ్వీ (18), పున్నంచందర్, హసన్పర్తికి చెందిన మేకల జిధ్యాన్.. ఏపీ 36 టీఏ 4854 నంబరు గల టాటా ఏస్ డీజే వాహనంతో శనివారం పరకాలలో జరిగిన ఓ పెళ్లి బరాత్‌లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం తమ ఇళ్లకు వస్తున్న క్రమంలో కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులో డీజే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కక్కెర్ల పృథ్వీ మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుడి తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు డ్రైవర్ కొయ్యడ రాకేశ్పె కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంజీవ్ తెలిపారు. -
లండన్ గడ్డపై రాకింగ్ రాకేశ్ - జోర్దార్ సుజాత బోనాల జాతర
వరంగల్‌కు చెందిన ఎన్నారై ఫొరమ్ లండన్‌లో బోనాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత పదేళ్లుగా ఈ ఉత్సవం నిర్వహిస్తునప్పటికీ ఈ ఏడాది మరింతగా ఘనంగా నిర్వహించాలని ఎన్నారై ఫోరమ్ నిర్ణయించుకుంది. యాంకర, నటి తెలంగాణ మహిళ అయిన జోర్దార్ సుజాత ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు. ఈ మేరకు ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రీధర్ నీల మాట్లాడుతూ ‘తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల ఉత్సవాలు ఎన్నో ఏళ్లగా లండన్‌లో నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఎప్పటిలా కాకుండా మరింత ఘనంగా చేస్తున్నాం. ఈ వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపడానికి హైదరాబాద్ నుంచి రాకింగ్ రాకేశ్, సుజాత ఇక్కడికి రావడం ఆనందించదగ్గ విషయం’అని తెలిపారు. నేరెళ్ల వేణుమాధవ్ శిష్యుల తర్వాత రాకింగ్ రాజేశ్ మిమిక్రీ అంతగా పాపురల్ అయ్యారు. బజర్దస్త్ వంటి షోలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవల అమెరికా, న్యూజెర్సీలోని నాట్స్ కార్యక్రమం విజయవంతం తర్వాత రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత లండన్‌లో జరిగిన బోనాల ఉత్సవంలో తమదైన శైలి స్కిట్లు, మిమిక్రీ కార్యక్రమాలతో అలరించారు. ఈ షోతో ఆయన 2300 షోల మార్కును దాటారు. రాకింగ్ రాకేశ్ మాట్లాడుతూ ‘వరంగల్ ఎన్నారై ఫోరమ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. కరోనా సమయంలోనే కాకుండా మామూలు సమయంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి నా ద్వారా డబ్బు పంపి సహకారం అందించారు. చిన్నారుల, చదువు ఆర్యోగాలకు సహకరించారు. ఈసారి బోనాల వేడుకలో మేం భాగం కావాలని వరంగల్ ఎన్నారై ఫోరమ్ కోరగా.. గతంలో వారు చేసినా సేవలకు కృతజ్ఞతా భావంతో లండన్ షో చేశాం. మమ్మల్ని ఇందులో భాగం కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం లండన్‌లో చేసిన షోతో 2300 షోలను పూర్తి చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రీధర్ నీల, ఫౌండర్ కిరణ్ పసునూరి, జనరల్ సెక్రటరీ రమణ, వైస్ ప్రెసిడెంట్ నాగ ప్రశాంతి, ప్రవీణ్ బిట్ల, కమల తదితరులకు కృతజ్ఞతలు’ అని అన్నారు. -
నాకు మాస్టర్ గా జీవితం ఇచ్చింది రాకేష్ మాస్టర్
-
రాజేష్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
సాక్షి, రంగారెడ్డి: హయత్‌నగర్‌లో దారుణంగా హత్యకు గురైన రాజేష్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. సుజాతతో వివాహేతర సంబంధం కారణంగానే.. ఆమె భర్త రాజేష్‌ను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఈలోపు నాగేశ్వర్రావు పెద్ద ట్విస్టే ఇచ్చాడు. తన భార్యది సూసైడ్ కాదని.. రాజేష్ చంపాడంటూ సాక్షి టీవీతో చెప్పాడు. ‘‘నా భార్యను రాజేషే చంపాడు. విషం తెచ్చి బలవంతంగా నా భార్యకు తాగించాడు. నేను కానీ.. నా కొడుకులు కానీ రాజేష్‌ను కొట్టలేదు. కొన్ని నెలలుగా నా భార్యను రాజేష్ టార్చర్ పెడుతున్నాడు’’ అని సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడాయన. ఇదిలా ఉంటే ఈ కేసులో వివాహేతర సంబంధమే రాజేష్ హత్యకు కారణమనే విషయాన్ని పోలీసులు దాదాపుగా ధృవీకరించుకున్నారు. ప్రభుత్వ టీచర్ అయిన సుజాతతో రాజేష్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పురుగుల మందు తాగిందని పేర్కొంటూ.. ఈ నెల 24వ తేదీన సుజాతను ఆస్పత్రిలో చేర్పించాడు నాగేశ్వరరావు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె కన్నుమూసింది. అయితే ఆమె విషం తాగిందని చెబుతున్న సమయానికి ముందు ఆమె ఇంటి వద్ద రాజేష్ కనిపించాడని, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది. మరోవైపు రాకేష్ హత్య కేసులో హయత్‌నగర్ పోలీసులు నాగేశ్వర్రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేష్‌ను నాగేశ్వరరావు కొట్టి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఎల్కతుర్తి: ప్రాణస్నేహితులిద్దరూ చనిపోయారన్న బెంగతో ఒక డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో సోమ వారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. తంగళ్లపెల్లి సంపత్, సుమలత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. కార్తీక్(21) హనుమకొండలో డిగ్రీ ప్రథమ సంవత్సరం, చిన్న కుమారుడు వినయ్ 8వ తరగతి చదువుతున్నారు. కార్తీక్ మేనమామ కుమారుడు అఖిల్ ఆరేళ్ల క్రితం క్యాన్సర్‌తో చనిపోయాడు. మరో స్నేహితుడు రాకేష్ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ఈ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు కావడంతో.. వారు చనిపోయినప్పటి నుంచి కార్తీక్ దిగాలుగా ఉండేవాడు. తాను కూడా వారి వద్దకు వెళ్తానంటూ.. అప్పుడప్పుడు తల్లిదండ్రులకు చెప్పేవాడు. దీంతో వారు అధైర్యపడొద్దని కుమారుడికి సర్దిచెప్పేవారు. కాగా, కార్తీక్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ‘నా చావుకు ఎవరూ కారణం కాదని’సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకున్నాడు. ఎస్ఐ పరమేశ్ కేసు నమోదు చేశారు. -
ఘట్ కేసర్ వద్ద ట్రాక్ ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాం : CPRO రాకేష్
-
పట్టాలు తప్పిన గోదావరి
-
యాంకర్ రవి యాడ్ షూటింగ్ కోసం భారీ సెట్టింగ్!
బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయ్యాడు యాంకర్ రవి. ప్రస్తుతం ఈ స్టైలీష్ యాంకర్ ఓ కమర్షియల్ యాడ్‌లో నటించబోతున్నాడు. ‘జబర్దస్త్’ రాకింగ్ రాకేష్‌తో కలిసి నటించబోయే ఈ యాడ్ .. ఓ వస్త్ర వ్యాపారానికి సంబంధించినది. దీని కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ని వేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఓ సినిమా కోసం వేసేంత సెట్లో ఈ కమర్షియల్ యాడ్ షూటింగ్ జరగనుందట. ఆ యాడ్ ద్వారా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ లు ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ యాడ్ ను యాడ్స్ కింగ్ మేకర్ అయిన సంజీవ్ డైరెక్ట్ చేశారు. అలాగే జబర్దస్త్ కి రైటర్ గా చేసినటువంటి సుభాష్ కెమెరామెన్ గా వర్క్ చేయడం విశేషం. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ బ్రాండ్ కు సంబందించిన బ్రాంచెస్ ఓపెన్ అవుతుండడం విశేషం. -
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 30 ప్రత్యేక రైళ్లు.. వివరాలివే
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో 30కి పైగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్ స్టేషన్ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిలో జనరల్ బోగీలు, రిజర్వ్డ్ బోగీలు ఉంటాయి. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం ఆయా ప్రాంతాలకు చేరుకొనే విధంగా ఈ రైళ్లను నడపనున్నారు. జనరల్ ప్రయాణికులు యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు 94 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అన్ని ప్రత్యేక రైళ్లకు ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07048) జనవరి 6న, కాకినాడ టౌన్–సికింద్రాబాద్(07049) జనవరి 7న, హైదరాబాద్–నర్సాపూర్ (070 19) రైలు 7న, నర్సాపూర్–వికారాబాద్ (070 20) రైలు 8న, వికారాబాద్–నర్సాపూర్ (070 21) 9న, నర్సాపూర్–హైదరాబాద్ (07022) 10న, సికింద్రాబాద్–కాకినాడటౌన్ (07039) 9న, కాకినాడటౌన్–వికారాబాద్ (07040) 10న, వికారాబాద్–నర్సాపూర్ (07041) 11న, నర్సాపూర్–సికింద్రాబాద్ (07042) 12వ తేదీన నడపనున్నారు. హైదరా బాద్– మచిలీపట్నం (07011) 11, 13 తేదీల్లో, మచిలీ పట్నం–హైదరాబాద్ (07012) 12, 14 తేదీల్లో, సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07035) 11న, కాకినాడ టౌన్–వికారాబాద్ (07036) జనవరి 12న, వికారాబాద్– కాకినాడటౌన్ (07037) 13న, కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07038) 14న, సికింద్రాబాద్–నర్సాపూర్ (07023) 13న, నర్సాపూర్–సికింద్రాబాద్ (07024) 14న, సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07027) 16న, కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07028) 17న, సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07031) 15న, కాకినాడ టౌన్–వికారాబాద్ (07032) 16న, వికారాబాద్–కాకినాడ టౌన్ (07033) 17న, కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07034) 18న, హైదరాబాద్–నర్సాç³Nర్ (07015) 15, 17 తేదీల్లో, నర్సాపూర్–హైదరాబాద్ (07016) 16, 18 తేదీల్లో నడపనున్నారు. -
Rakesh Master: వైజాగ్‌లో రాకేష్ మాస్టర్ సందడి
గాజువాక(విశాఖపట్నం): ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ గాజువాకలో సందడి చేశారు. రిచ్ గైస్ ఆధ్వర్యంలో చిట్టినాయుడు కాలనీలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలకు హాజరైన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ప్రారంభించారు. అనంతరం అభిమానులతో ముచ్చటించారు. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ట్విటర్ రివ్యూ -
Software Engineer Rakesh: భార్య వేధింపులు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, హన్మకొండ: భార్య, అత్తింటివారి వేధింపులు తాళలేక సూసైడ్ నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజపల్లి గ్రామంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. రాజపల్లికి చెందిన కొండా రాకేశ్(28) హెచ్‌సీఎల్ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఫిబ్రవరి 2న ఎలుకుర్తి హవేలికి చెందిన దేవుళ్లపల్లి శంకర్ కుమార్తె నిహారికతో వివాహం జరిగింది. కొన్ని రోజులు వీరి సంసారం సాఫీగానే సాగింది. రాకేశ్ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తుండడంతో రాజపల్లిలోనే ఉంటున్నారు. పల్లెటూరులో ఉండడం ఇష్టంలేని నిహారిక హైదరాబాద్ వెళ్దామని రాకేశ్‌తో తరుచూ గొడవ పడేది. వర్క్ ఫ్రం హోం పూర్తికాగానే వెళ్దామని సర్ధి చెప్పినా వినకుండా గొడవపడేది. ఈ విషయమై పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా వినని నిహారిక రాకేశ్‌తో సంసారం చేయడం ఇష్టంలేదని, పుట్టింటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంటానని భర్త, అత్తమామలతో గొడవపడి చీపురుతో కొట్టి వెళ్లిపోయింది. చదవండి: (ప్రేమ వివాహం.. ఆపై కులం తక్కువని..) ఈ క్రమంలో వీడియోకాల్ చేసి రాకేశ్‌ను దుర్భాషలాడుతూ నువ్వు చస్తే నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని అబార్షన్ చేయించుకుంటానని నిహారిక వేధించింది. ఇదే విషయమై ఆమె తల్లిదండ్రులు సైతం మానసికంగా వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాకేశ్ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ములుగు ఫ్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటరాజ్యం ఫిర్యాదు మేరకు రాకేశ్ భార్య నిహారిక, అత్తమామలు దేవుళ్లపల్లి శంకర్, అరుణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: (Doctor Death Mystery: ‘అశ్లీల చిత్రాలతో బెదిరించి చంపేశాడు’) -
పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్–తిరుపతి (07691/07692) స్పెషల్ ట్రైన్ ఈనెల 26 రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 9.55 గంటలకు తిరుపతి నుంచి బయ ల్దేరి మరుసటి రోజు ఉదయం 10.10 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది. సికింద్రాబాద్–యశ్వంత్‌పూర్ (07193/ 07194) స్పెషల్ ట్రైన్ ఈనెల 29న మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 30న సాయంత్రం 5.20 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–నాగర్సోల్ (07089/07090) ప్రత్యేక రైలు ఈనెల 24న రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.25 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 25 రాత్రి 10 గంటలకు నాగర్సోల్ నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
రాకేశ్ సోదరునికి ఉద్యోగం.. తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనల సమయంలో పోలీసు కాల్పుల్లో మరణించిన దామెర రాకేశ్ సోదరునికి ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియా మకాల కింద మృతుని సోదరునికి ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం తెలిసిందే. ఈ మేరకు రాకేశ్ సోదరుడు దామెర రామ్రాజుకు అతని విద్యార్హతల ఆధారంగా వరంగల్ జిల్లాలో ఉద్యోగం ఇవ్వాలని సీఎస్ సోమేశ్‌కుమార్ వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. (క్లిక్: సుబ్బారావు తగలబెట్టమన్నాడు.. శివ అమలు చేశాడు!) -
‘పుష్ప’ ఐటం సాంగ్ టైటిల్‌తో సినిమా
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలోని ఐటం సాంగ్ ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ పాట పేరుతోనే ఓ సినిమా తెరకెక్కుతుంది. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మిగిలిన రెండు పాటల షూట్ కోసం కశ్మీర్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమం చేపట్టింది. నిర్మాత మాట్లాడుతూ ‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం వుంది. బ్యాలెన్స్ రెండు పాటలను కాశ్మీర్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తాం. జూలై చివరివారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. అందరూ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా రేలంగి నరసింహారావు గారు గత సినిమాల రికార్థులను ఈ సినిమా అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ..ఇప్పటి వరకు చేసిన కామెడీ సీనిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఇది కామెడీ తో కూడుకున్న హార్రర్ సినిమా. కాశ్మీర్ లో జరిగే పాటల షూట్ తో సినిమా పూర్తి చేసుకొని జులై చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకులు అజయ్ కుమార్, రాజా వన్నెం రెడ్డి, సత్య ప్రకాష్, ఆచంట గోపినాథ్, దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.