South Central Railway to operate 30 special trains for Sankranti - Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి మరో 30 ప్రత్యేక రైళ్లు.. వివరాలివే

Published Fri, Dec 30 2022 2:19 AM | Last Updated on Fri, Dec 30 2022 10:30 AM

Special Trains For Sankranti - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/విజయవాడ: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో 30కి పైగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్‌ స్టేషన్‌ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిలో జనరల్‌ బోగీలు, రిజర్వ్‌డ్‌ బోగీలు ఉంటాయి. రాత్రి హైదరాబాద్‌ నుంచి బయలు­దేరి ఉదయం ఆయా ప్రాంతాలకు చేరుకొనే విధంగా ఈ రైళ్లను నడపనున్నారు. జనరల్‌ ప్రయాణికులు యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు.   

ఇప్పటికే జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు 94 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అన్ని ప్రత్యేక రైళ్లకు ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్‌ సదుపాయం అందు­బాటులో ఉంటుందని వెల్లడించారు.

సికింద్రా­బాద్‌–కాకినాడ టౌన్‌ (07048) జనవరి 6న, కాకినాడ టౌన్‌–సికింద్రాబాద్‌(07049) జనవరి 7న, హైదరాబా­ద్‌–నర్సాపూర్‌ (070 19) రైలు 7న, నర్సాపూర్‌–వికారాబాద్‌ (070 20) రైలు 8న, వికారాబాద్‌–నర్సాపూర్‌ (070 21) 9న, నర్సాపూర్‌–హైదరాబాద్‌ (07022) 10న, సికింద్రాబాద్‌­–కాకినాడటౌన్‌ (07039) 9న, కాకినాడటౌన్‌–వికారాబాద్‌ (07040) 10న, వికారాబాద్‌–నర్సాపూర్‌ (07041) 11న, నర్సాపూర్‌–సికింద్రాబాద్‌ (07042) 12వ తేదీన నడప­నున్నా­రు. హైదరా బాద్‌– మచిలీపట్నం (07011) 11, 13 తేదీల్లో, మచిలీ పట్నం–హైదరాబాద్‌ (07012)

12, 14 తేదీల్లో, సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ (07035) 11న, కాకినాడ టౌన్‌–వికారాబాద్‌ (07036) జనవరి 12న, వికారాబాద్‌– కాకి­నాడటౌన్‌ (07037) 13న, కాకినాడ టౌన్‌­–సికిం­­ద్రాబాద్‌ (07038) 14న, సికింద్రాబాద్‌­–నర్సాపూర్‌ (07023) 13న, నర్సా­పూర్‌­–సికింద్రాబాద్‌ (07024) 14న, సికింద్రాబాద్‌–­కాకినాడ టౌన్‌ (07027) 16న, కాకినాడ టౌన్‌–సికింద్రాబాద్‌ (07028) 17న, సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ (07031) 15న, కాకినాడ టౌన్‌–వికారాబాద్‌ (07032) 16న, వికారాబాద్‌–కాకినాడ టౌన్‌ (07033) 17న, కాకినాడ టౌన్‌–సికింద్రాబాద్‌ (07034) 18న, హైదరాబాద్‌­–నర్సాç­³N­ర్‌ (07015) 15, 17 తేదీల్లో, నర్సాపూర్‌–హైదరాబాద్‌ (07016) 16, 18 తేదీల్లో నడపనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement