సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. 'జన సాధారణ్‌ అన్‌ రిజర్వ్‌డ్‌’ స్పెషల్‌ ట్రైన్లు | Sankranti Rush: South Central Railway To Run Jan Sadharan Special Trains | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. 'జన సాధారణ్‌ అన్‌ రిజర్వ్‌డ్‌’ స్పెషల్‌ ట్రైన్లు

Published Fri, Jan 10 2025 2:44 PM | Last Updated on Fri, Jan 10 2025 4:08 PM

Sankranti Rush: South Central Railway To Run Jan Sadharan Special Trains

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతికి ఊరెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్ రిజర్వ్‌డ్ స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

1) రైలు నంబర్‌ (08534) చర్లపల్లి-విశాఖపట్నం (జనసాధారణ్ అన్‌రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) జనవరి 11, 13, 16, 18  తేదీలలో చర్లపల్లి నుంచి ఉదయం 00.30 గంటలకు (రాత్రి 12.30 గంటలకు) బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు (అదే రోజున ) విశాఖపట్నం చేరుకుంటుంది. 2) రైలు(08533) విశాఖపట్నం-చర్లపల్లి (జనసాధారణ్ అన్‌రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) విశాఖపట్నం నుంచి జనవరి 10, 12, 15,  17  తేదీలలో ఉదయం 09.45 గంటలకు బయలుదేరి (అదే రోజు) రాత్రి 22.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.  

ప్రత్యేక రైళ్లు నంబర్‌ (08533/08534) విశాఖపట్నం-చర్లపల్లి - విశాఖపట్నం జనసాధారణ (అన్ రిజర్వ్‌డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి,  యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ లలో ఇరువైపులా ఆగుతాయి.

3) రైలు నంబర్‌: (08538) చర్లపల్లి-విశాఖపట్నం (జన సాధారణ్‌ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లు) జనవరి 11, 12, 16, 17వ తేదీల్లో చర్లపల్లిలో ఉదయం 10.00 గంటలకు బయలుదేరి 22.00 గంటలకు (అదే రోజు రాత్రి) విశాఖపట్నం చేరుకుంటుంది. 

సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లు

ఇదీ చదవండి: పండుగ బస్సు..‘ప్రత్యేక’ చార్జీ

4) రైలు నంబర్‌ (08537) విశాఖపట్నం - చర్లపల్లి (జనసాధారణ అన్‌ రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లు) 2025 జనవరి 10, 11, 15 & 16 తేదీలలో విశాఖపట్నం నుండి (సాయంత్రం 6.20)  18.20 గంటలకు బయలు దేరుతుంది మరియు  08.00 గంటలకు (మరుసటి రోజు ఉదయం) చర్లపల్లి చేరుకుంటుంది. రైలు(08537/08538) విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం జనసాధరణ (అన్ రిజర్వ్‌డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌లలో ఆగుతాయి. జనసాధరన్ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులను సులభతరం చేయడానికి అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లను అందుబాటులోకి తెచ్చింది.

సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్ సాక్షి మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నామన్నారు. ప్రయాణీకులకు అందుబాటులో ఉండే విధంగా 16 జన సాధారణ రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఛార్జీలే ఈ జన సాధారణ రైళ్లలో వసూలు చేస్తామన్నారు. ఛార్జీల పెంపు భారీగా ఉండదు. ప్లాట్‌ ఫారమ్‌ చార్జీలు కూడా పెంచటం లేదు.

చర్లపల్లి నుంచి కొన్ని రైళ్లు ఈ సంక్రాంతికి నడపనున్నాం. సిటీ నుంచి చర్లపల్లికి వెళ్లాలంటే సికింద్రాబాద్ స్టేషన్ బయట నుంచి కొన్ని బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. చర్లపల్లి కాకుండా సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రైళ్లు నడుస్తాయి’’ అని శ్రీధర్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement