రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ద.మ రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ రైళ్లను నడుపనున్నారు.
► సికింద్రాబాద్–బ్రహ్మపూర్ (07089) ఈ నెల 7, 14 తేదీలలో సాయంత్రం 7.45 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 11.15 గంటలకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది.
► బ్రహ్మపూర్–వికారాబాద్ (07090) ఈ నెల 8, 15 తేదీలలో మధ్య రాత్రి 12.30 గం.లకు బ్రహ్మపూర్‌లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.30 గం.లకు వికారాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07091) 9, 16 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది.
► బ్రహ్మపూర్–సికింద్రాబాద్ (07092) రైలు 10, 17 తేదీలలో మధ్య రాత్రి 12.30 గంటలకు బ్రహ్మపూర్‌లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 6.30 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
► విశాఖపట్నం–కర్నూలు సిటీ (08541) 10, 17, 24 తేదీలలో సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.25 గంటలకు కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08542) 11, 18, 25 తేదీలలో మధ్యాహ్నం 3.30 గం.లకు కర్నూలులో బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
► శ్రీకాకుళం–వికారాబాద్ (08547) 12, 19, 26 తేదీలలో సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గం.లకు వికారాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08548) 13, 20, 27 తేదీలలో రాత్రి 8.25 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు మ«ద్యాహ్నం 12.15 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.
► సికింద్రాబాద్–తిరుపతి (02764) 10, 17 తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.45 గం.లకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02763) 11, 18 తేదీలలో సాయంత్రం 5.15 గం.లకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
► సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07271) 12న రాత్రి 9 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07272) 13న రాత్రి 8.10 గం.కు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, తర్వాత రోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
► సికింద్రాబాద్–బ్రహ్మపూర్ (07093) 8, 15 తేదీలలో సాయంత్రం 7.45 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, తర్వాత రోజు ఉదయం 11.15 గం.లకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07094) 9, 16 తేదీలలో మధ్యాహ్నం 12.30 గం.లకు బ్రహ్మపూర్‌లో బయలుదేరి, తర్వాత రోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
► నర్సాపూర్–సికింద్రాబాద్ (07251) 10న సాయంత్రం 6 గం.లకు నర్సాపూర్‌లో బయలుదేరి తర్వాత రోజు తెల్లవారుజామున 4.50 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07252) 11న ఉదయం 8.30 గం.లకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అదే రోజు రాత్రి 11.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment