
సాక్షి, హైదరాబాద్: వరుస సెలవులు రావడంతో ప్రజలంతా ప్రయాణాలు కట్టారు. సొంత ఊళ్లకు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు రావడంతో ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులతోపాటు పలువురు ఎంపీలు దక్షిణ మధ్య రైల్వేను కోరారు. దాంతో రైల్వే శాఖ ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లకు అదనంగా మరికొన్నింటిని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో 8 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది.

Comments
Please login to add a commentAdd a comment