
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉన్న పోసానిని కూడా కూటమి సర్కార్ వదలలేదు. పోసానికి ఆరోగ్యం బాగోలేదని ఆయన సతీమణి చెప్పిన కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఆరోగ్యం బాగోలేదన్నా కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారు.
పోసాని అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు గేమ్
పోసాని అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు గేమ్ ఆడుతున్నారు. అరెస్టు నోటీసులో రేపటి తేదీ వేశారు. మరో వైపు, కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్టు సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పీఎస్‌గా పోలీసులు పేర్కొన్నారు. కాని, పోసాని కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చిన ఫోన్ నంబర్‌లో ఓబులపల్లి పీఎస్ అంటూ పోలీసులు చెప్పారు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుంచి కేసులను డ్రైవ్ చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోసానిపై 111 కేసు పెట్టడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ వర్గాలు అంటున్నాయి.
కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధింపులు: అంబటి రాంబాబు
ఏ కారణంతో పోసానిని అరెస్ట్ చేశారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోసానిని ఎందుకు అరెస్ట్ చేశారో ఏపీ ప్రజలకు చెప్పాలన్నారు. ‘కూటమి ప్రభుత్వం కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా పోసానిని తీసుకెళ్లారు. కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏపీలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది’’ అంబటి దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment