illegal cases
-
అక్రమ కేసులతో అణచివేయలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శించారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో జరిగిన ఘర్షణలో 16 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టై రిమాండ్‌లో ఉన్న కార్యకర్తలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఆ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు పరామర్శించారు.పరామర్శ అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, పెనుగంచిప్రోలు తిరునాళ్లలో పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని.. విద్వేషపూరితంగా మాట్లాడుతూ రెచ్చగొట్టారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభల పై రాళ్లు, కర్రలు విసిరేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను నోటికొచ్చినట్లు తిట్టారు. టీడీపీ వాళ్లు రెచ్చగొడుతున్నా పోలీసులు కనీసం కట్టడిచేయలేదు. టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసురుతుంటే ఆత్మరక్షణలో భాగంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు’’ అని పేర్ని నాని వివరించారు.‘‘టీడీపీ కార్యకర్తలు నానా గొడవ చేస్తుంటే పోలీసులు కనీసం స్పందించలేదు. తిరునాళ్లలో గొడవ జరిగినపుడు లేని వాళ్లను పోలీసులు ముద్ధాయిలుగా చేర్చారు. జాతరలో ప్రభలకు పూజలు చేస్తున్న పూజారి కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిపై పోలీసులు అన్యాయంగా అక్రమ కేసులు పెట్టారు. అసలు ఈ రాష్ట్రంలో చట్టం, ధర్మం, న్యాయం ఉందా?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పోలీసులు పసుపు పచ్చ కండువా వేసుకున్న వారిలా ఉద్యోగం చేస్తున్నారు. కిరాయి మూకలు, రౌడీ మూకలకు పోలీసులు వత్తాసు పలకడం దురదృష్టకరం. టీడీపీ వాళ్లు విసిరిన రాళ్లతో దెబ్బలు తగిలితే వైఎస్సార్సీపీ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాకీ చొక్కాలేసుకున్న పోలీసులకు ఇది ధర్మమేనా?. చట్టాన్ని టీడీపీకి చుట్టంలా మార్చేసిన ఖాకీలను న్యాయం ముందు నిలబెడతాం. టీడీపీ పార్టీ ఖాజానా నుంచి మీకు జీతాలివ్వడం లేదని పోలీసులు గుర్తుంచుకోవాలి. అమాయకుల పై హత్యాయత్నం కేసుల్లో ఇరికించడం దుర్మార్గం’’ అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.వారిని చట్టం ముందు నిలబెడతాం.. దేవినేని అవినాష్దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభ కంటే ముందు టీడీపీ ప్రభ వెళ్లాలని పెనుగంచిప్రోలులో పోలీసులు ఆపేశారు. టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు గాయపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసు పెట్టి 16 మందిని జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించాం. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో వారికి ధైర్యం చెప్పాం. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు తస్మాత్ జాగ్రత్త. అలాంటి వారిని చట్టం ముందు నిలబెడతాం’’ అని ఆయన హెచ్చరించారు.టీడీపీ ఆఫీస్ నుంచి పేర్లు.. వారిపై కేసులు: తన్నీరు నాగేశ్వరరావుజగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తిరుపతమ్మకు పసుపు కుంకుమ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ పార్టీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనంగా ఉన్నప్పటికీ టీడీపీ పార్టీ కార్యర్తలు రాళ్లు, బాటిల్స్ విసిరారు. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా 25 మందికి పైగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. చదువుకున్న యువకులను కావాలని కేసుల్లో ఇరికించారు. టీడీపీ ఆఫీస్ నుంచి పేర్లు పంపించిన వారిపై కేసులు పెట్టారు. గత యాభై ఏళ్లలో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై న్యాయ పోరాటం చేస్తాం. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అణచివేయలేరు -
ఇప్పటికైనా మించిపోయింది లేదు! ఇకనైనా..
పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, 45 ఏళ్ల చరిత్రలో నాపై హత్యా రాజకీయాల మరక లేదు.. రాజకీయం ముసుగులో నేరాలను ఉపేక్షించం.. కక్ష రాజకీయం చేయను: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. పై రెండు వార్తలు ఒకే రోజూ పత్రికల్లో వచ్చాయి. వీటిల్లో ఒకటి ఏపీలో ప్రస్తుత అరాచక పరిస్థితులకు అద్దం పడుతూంటే... రెండోది వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజలను ఏమార్చే ప్రయత్నానికి మచ్చు తునకలా కనిపిస్తుంది. చంద్రబాబుకు పేరు ప్రతిష్టలు మెండని.. వ్యవస్థలపై పట్టున్న రాజకీయవేత్త అని అంటూంటారు. అయితే ప్రజాస్వామ్యంలో అందరిని అన్నిసార్లూ మోసం చేయలేరు అనేందుకు హైకోర్టు తాజా వ్యాఖ్యలు ఒక నిదర్శనం. నిజానికి గౌరవ న్యాయమూర్తులు రఘునందనరావు, మన్మధరావులకు మనం నమస్కారం చేయాలి. తమ వ్యాఖ్యలతో వీరు పది నెలలుగా ఏపీలో సాగుతున్న రెడ్ బుక్ అరాచక పర్వానికి(Red Book Atrocities) కొంతైనా బ్రేక్ వేశారని అనిపిస్తుంది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త, ఆ పార్టీ అధికార ప్రతినిది అవుతు శ్రీధర్ రెడ్డి కేసులో కాని, మాదిగ మహాసేన నాయకుడు కె.ప్రేమ్ కుమార్ కేసులో కాని హైకోర్టు పరిశీలన ఏ ప్రభుత్వానికైనా కనువిప్పు కలిగించాల్సినవే. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ వైఖరి మార్చుకున్నట్లు కనిపించదు. ప్రముఖ నటుడు 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)పై పెట్టిన ఆయా కేసులలో బెయిల్ వచ్చినా, కుట్రపూరితంగా సీఐడీ మళ్లీ పీటీ వారంట్ తీసుకుని ఆయనను ఇబ్బంది పెట్టే యత్నం చేస్తోంది. ఇదంతా రెడ్‌బుక్ దారుణాల కిందకే వస్తుంది. కక్ష రాజకీయాలే అవుతాయి. వైఎస్సార్సీపీ వాళ్లపై దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం, తప్పుడు కేసుల బనాయింపు వంటి అకృత్యాలు పది నెలలుగా సాగుతున్నా న్యాయ వ్యవస్థ సైతం వీటిని పూర్తి స్థాయిలో పట్టించుకోలేదన్న అభిప్రాయం ఉండేది. దాంతో ఏపీలో పౌరులు ప్రత్యేకించి విపక్షం కాని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు కానీ జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 👉సూపర్‌సిక్స్ పేరుతో ఇష్టారీతిన ఎన్నికల హామీలిచ్చి.. వాటి అమలు చేతకాక ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ హింసాకాండకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. హైకోర్టు తాజా తీర్పు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తోంది. పౌరులను ఆధారాల్లేకుండా.. కేవలం ఊహలపై ఆధారపడి అరెస్టులు చేస్తారా? అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోలీసులు తమని తాము చట్టానికి అతీతులుగా భావిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఇందులో వాస్తవం ఉంది. సోషల్ మీడియా, ఇతర చిన్న కేసుల్లోనూ నోటీసులివ్వకుండా హైదరాబాద్‌సహా ఎక్కడ ఉన్నా ఆకస్మికంగా అరెస్టులు చేయడం.. వారిని క్రిమినల్స్ మాదిరిగా ట్రీట్ చేస్తూండటాన్ని గౌరవ హైకోర్టు గుర్తించడం మంచి పరిణామం. 'రేపు కోర్టుల్లోకి వచ్చి కూడా అరెస్టులు చేస్తారా?".. అనే తీవ్రమైన వ్యాఖ్యలను న్యాయమూర్తులు చేశారంటే పరిస్థితి ఏమిటన్ని అర్థమవుతుంది. అదే సమయంలో చిన్న చిన్న కేసుల్లోనూ మేజిస్ట్రేట్లు పోలీసులు తీసుకొచ్చిన నిందితులను రిమాండ్‌కు ఆదేశించడం కూడా ఆందోళన కలిగించే విషయమే. కొంతమంది మెజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్లు విధిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.👉గతంలో ముఖ్యమంత్రి, మంత్రులను బండబూతులు తిట్టిన టీడీపీ నేతలకు చకచకా బెయిల్ వచ్చిన తీరు, కొన్ని కేసులలో అసలు రిమాండ్‌కే పంపకుండా వదలివేసిన వైనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మాజీ మంత్రి రోజాపైన దారుణమైన దూషణకు దిగిన టీడీపీ మాజీ మంత్రి ఒకరికి కోర్టు రిమాండ్ విధించకుండా వదలిపెట్టింది. అదే.. పోసాని కృష్ణ మురళీకి మాత్రం వరస రిమాండ్లు విధిస్తున్నారు. పోసాని, అవుతు శ్రీధర్ రెడ్డిలు టీడీపీ, జనసేనల వారు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు స్పందిస్తూ జవాబు ఇచ్చారు. అందులో అభ్యంతరం ఉంటే, అసలు ప్రేరేపించిన వారిపై కూడా కేసులు పెట్టాలి కదా! ఆ పని చేయకుండా ఒక పక్షంపైనే కేసులు పెడుతున్నారు. 👉చట్టంలోని కొన్ని సెక్షన్ 111ను ఎంతగా దుర్వినియోగం చేస్తున్నది హైకోర్టు గమనించింది. సోషల్ మీడియాలో పోస్టు పెడితే బలవంతపు వసూళ్ల కింద అమలు చేయవలసిన సెక్షన్లో కేసు పెట్టారని హైకోర్టు తెలిపింది. లోకేష్ బృందానికి ఈ రెడ్ బుక్ ఏదో సరదాగా ఉండవచ్చు. ప్రస్తుతం అధికారం ఉంది కనుక తాము ఏమి చేసినా చెల్లుతుందని విర్రవీగవచ్చు. అధికారాన్ని ఇలా అరాచకాలకు ఉపయోగించుకుంటే అదే రెడ్ బుక్ వారి పాలిట పాముగా మారే ప్రమాదం ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చేసేది చేస్తూనే సుద్దులు చెబుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను రెచ్చగొడతారు. నేతలు తన సమక్షంలోనే బూతులు మాట్లాడినా, సోషల్ మీడియా యాక్టివిస్టులు బూతు పోస్టులు పెట్టినా దానికి స్వేచ్ఛ అనే కవరింగ్ ఇస్తారు. వైఎస్సార్సీపీ వాళ్లు స్పందిస్తే మాత్రం దానినే ఫోకస్ చేస్తూ ప్రచారం చేస్తుంటారు.కావలి గ్రీష్మ అనే ఒక చిన్న స్థాయి నేత తన సమక్షంలోనే బూతులు మాట్లాడితే నవ్వుతూ విన్నారే తప్ప వారించలేదు. ఆ తర్వాత ఆమెను శాసనమండలి సభ్యురాలిని చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబాన్ని టీడీపీ సోషల్ మీడియా ఎంత నీచంగా ట్రోల్ చేసిందీ అందరికి తెలుసు. అయినా చంద్రబాబు దానిని ఖండించినట్లు కనిపించలేదు. అంతెందుకు చంద్రబాబుసహా లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి వంటి కూటమి నేతలు వాడిన బూతు పదజాలానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 👉ఇప్పుడు అధికారం రాగానే తాను బూతులను అరికట్టానని ఆయన సభలలో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నదంతా టీడీపీ కక్ష రాజకీయమే అయినా, తాము ఏమీ ఎరగనట్లు మాట్లాడారు. అంతేకాదు. నలభై ఐదేళ్ల చరిత్రలో తనపై హత్య రాజకీయాల మరక లేదని చంద్రబాబు చెబుతున్నారు. అసలు ఈ ప్రస్తావన తేవలసిన అవసరం ఏమిటో తెలియదు. రాజకీయం ముసుగులో నేరాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మంచిదే. కాని నిజంగా టీడీపీని అలాగే నడుపుతున్నారా? లేక కేవలం ప్రత్యర్ధి పార్టీలపై అభియోగాలు మోపడానికి ఇలా మాట్లాడుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. 👉చంద్రబాబు తోడల్లుడు, ఈ మధ్యే కలిసిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యలు రాసిన పుస్తకాలలో చంద్రబాబు నేరపూరిత రాజకీయాలపై ఏమి రాశారో అందరికి తెలిసిన విషయమే. వాటిపై ఏనాడైనా వివరణ ఇచ్చి ఉంటే చంద్రబాబును ఒప్పుకోవచ్చు. ఎవరు తనపై ఏ ఆరోపణ చేసినా ఏమి పట్టనట్లు ఉండడం ఆయన ప్రత్యేకత. అందుకే వైఎస్సార్సీపీ నేతలు తరచూ వంగవీటి రంగా, పింగళి దశరథ్‌రామ్, మల్లెల బాబ్జీ తదితరుల హత్య కేసులలో వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉంటే కేసులు పెట్టించుకోండని తన కార్యకర్తలకు చెబుతారు. అధికారంలోకి రాగానే ఎదుటి పక్షంపై కేసులు పెట్టండని చెబుతారు. నిజంగా ఈ వయసులో చంద్రబాబు తన కక్ష రాజకీయాలను మానుకుని మంచి పేరు తెచ్చుకునేలా పాలన చేయడమే కాకుండా.. తన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ గోలకు అడ్డుకట్ట వేయకపోతే వారికే నష్టం జరుగుతుందని చెప్పక తప్పదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చెప్పండి.. చేసేస్తాం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల రెడ్‌బుక్ కుట్రలకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సెల్యూట్ చేస్తుండటం యావత్ పోలీసు శాఖను విభ్రాంతికి గురిచేస్తోంది. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులతో మరింతగా విరుచుకు పడాలని ఆయన జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు టార్గెట్ పెట్టి మరీ ఒత్తిడి చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు సీబీఐ దర్యాప్తు చేస్తున్న మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రాష్ట్ర పోలీసు శాఖ అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం విస్మయ పరుస్తోంది. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగన్న సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు తొలుత పులివెందుల, ఆ తర్వాత కడప రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో గురువారం మృతి చెందాడు. కాగా, ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని కూటమి ప్రభుత్వ పెద్దలు పన్నాగం పన్నారు. రంగన్న మృతితోపాటు మరికొన్ని సహజ మరణాలపై దర్యాప్తు కోసం సిట్‌ను నియమించారు. వివేకా హత్య కేసును ఐదేళ్లుగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరి రంగన్న తదితరుల సహజ మరణాలపై ఏపీ పోలీసులు సిట్ పేరుతో దర్యాప్తు చేయడం ఏమిటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కానీ, డీజీపీ గుప్తా మాత్రం ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం విస్మయ పరుస్తోంది. వెలగపూడిలోని సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత డీజీపీ గుప్తా.. తాజా సిట్ గురించి మంత్రులకు వివరించారు. పైగా ‘రంగయ్య మృతి అనుమానస్పదమే’ అని చెప్పారు. ఇంకా సిట్ దర్యాప్తే మొదలు పెట్టకుండా రంగన్న మృతి అనుమానాస్పదమని డీజీపీ ఏకపక్షంగా మంత్రులకు వివరించడం పోలీసు శాఖ ప్రతిష్టను రాజకీయ ప్రయోజనాల కోసం పణంగా పెట్టిననట్టేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా సిట్ నివేదిక ఎలా ఉండబోతోందన్నది స్పష్టమవుతోందని చెబుతున్నారు. వేధించకపోతే వేటేస్తాం..‘వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసుల జోరు పెంచండి’ అని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు తేల్చిచెప్పారు. ఇదే ప్రధానాంశంగా ఆయన ఇటీవల టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా కూటమి నేతలు చేస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని.. ప్రాథమిక ఆధారాలు లేకుండానే అక్రమ కేసులు నమోదు చేసేయాలని ఆయన విస్పష్టంగా ఆదేశించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఏయే నేతలపై ఫిర్యాదు చేయాలన్నది టీడీపీ ప్రధాన కార్యాలయం నిర్ణయిస్తుందని, ఆ ఫిర్యాదులు అందిన వెంటనే అరెస్టులకు తెగబడాలని డీజీపీ నిర్దేశించారని సమాచారం. ఈ సందర్భంగా న్యాయ, సాంకేతిక అంశాలను కొందరు ఎస్పీలు ప్రస్తావించగా, డీజీపీ గుప్తా వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. చెప్పినట్టు వేధించాల్సిందేనని, లేకుంటే బదిలీ వేటేస్తామని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం. మరోవైపు సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ద్వారా కూడా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసుల జోరు పెంచామని కూడా ఆయన వారితో చెప్పడం గమనార్హం. ఎవరు ఎంతగా అక్రమ కేసులతో వేధిస్తున్నారన్నదాన్ని బట్టి ఎస్పీలు, కమిషనర్ల పనితీరు నివేదికలు ఆధారపడి ఉంటాయని కూడా వ్యాఖ్యానించినట్టు సమాచారం.తీసుకోండి ఫిర్యాదులు.. పెట్టండి కేసులు» పోసాని కృష్ణ మురళిపై ఒక్కసారిగా అబద్ధపు ఫిర్యాదులు జోరందుకున్నాయి. ఆయనపై రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో పోలీసులు చకచకా అక్రమ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేసి.. అన్నమయ్య, పల్నాడు, కర్నూలు జిల్లాలు తిప్పుతూ వేధింపులకు తెగబడ్డారు. » మాజీ మంత్రి విడదల రజినీని తాజాగా లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెపై ఓ క్వారీ యజమాని ద్వారా అవాస్తవ ఆరోపణలతో ఏసీబీకి ఫిర్యాదు ఇప్పించారు. ఆ ఫిర్యాదు ప్రతి దుమ్ము దులిపిన ఏసీబీ అధికారులు ఆమెను అక్రమ కేసుతో వేధించేందుకు సన్నద్ధమవుతున్నారు. » పర్చూరు నియోజకవర్గంలో గతంలో ఓట్లను తొలగించారనే ఆరోపణలతో ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసింది. అందుకోసం కుట్ర పూరితంగా టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో ఫిర్యాదు చేయించింది. ఆ వెంటనే ఓట్ల తొలగింపుపై దర్యాప్తునకు సిట్‌ను నియమించింది. టీడీపీ అస్మదీయ అధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్‌ను సిట్ ఇన్చార్జ్గా డీజీపీ సూచించడం గమనార్హం. ఆయన ఇప్పటికే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, విజయ్‌పాల్ తదితరులపై చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కొట్టివేసిన అభియోగాలపై తాజాగా కేసు నమోదు చేసి మరీ వేధింపులకు పాల్పడుతూ దామోదర్ హల్చల్ సృష్టిస్తున్నారు. ఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలంటూ గుంటూరు జీజీహెచ్ అధికారులను వేధిస్తున్నారు. అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న ఈయనకు సిట్ బాధ్యతలు అప్పగించడం పక్కా ప్రభుత్వ పన్నాగమే. » ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై సీఐడీ నమోదు చేసిన అక్రమ కేసులోనూ డీజీపీ గుప్తా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌ను వేధించి అబద్ధపు వాంగ్మూలం ఇప్పించారు. తాజాగా ప్రభుత్వ మాజీ సలహాదారుడు రాజ్ కసిరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఆయన సమీప బంధువులను వేధిస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. తాము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే అక్రమ కేసులు నమోదు చేస్తామని రాజ్ కసిరెడ్డి సమీప బంధువుల ఇళ్లకు పోలీసులు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. -
ఏపీలో పరాకాష్టకు చేరిన కూటమి ప్రభుత్వ అరాచకాలు
-
కుట్ర కేసులతో కూటమి నేతల పైశాచికం
-
కూటమి కక్ష.. పోసాని కృష్ణమురళీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉన్న పోసానిని కూడా కూటమి సర్కార్ వదలలేదు. పోసానికి ఆరోగ్యం బాగోలేదని ఆయన సతీమణి చెప్పిన కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఆరోగ్యం బాగోలేదన్నా కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారు.పోసాని అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు గేమ్ పోసాని అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు గేమ్ ఆడుతున్నారు. అరెస్టు నోటీసులో రేపటి తేదీ వేశారు. మరో వైపు, కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్టు సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పీఎస్‌గా పోలీసులు పేర్కొన్నారు. కాని, పోసాని కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చిన ఫోన్ నంబర్లో ఓబులపల్లి పీఎస్ అంటూ పోలీసులు చెప్పారు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుంచి కేసులను డ్రైవ్ చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోసానిపై 111 కేసు పెట్టడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ వర్గాలు అంటున్నాయి.కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధింపులు: అంబటి రాంబాబుఏ కారణంతో పోసానిని అరెస్ట్ చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోసానిని ఎందుకు అరెస్ట్ చేశారో ఏపీ ప్రజలకు చెప్పాలన్నారు. ‘కూటమి ప్రభుత్వం కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా పోసానిని తీసుకెళ్లారు. కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏపీలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది’’ అంబటి దుయ్యబట్టారు. -
వల్లభనేని వంశీ అరెస్టు.. 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్/పటమట/కృష్ణలంక (విజయవాడ తూర్పు)/కోనేరు సెంటర్ (మచిలీపట్నం): కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్‌లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. ఉదయం ఏడు గంటలకు అయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్, దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ క్లాజ్ 140 (1), 308, 351 (3) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతకుముందు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏడీసీపీ రామకృష్ణ తన బృందంతో హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని వంశీ కోసం గాలింపు చేపట్టారు. రాయదుర్గం మైహోం భుజాలోని తన ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకెళ్లి వంశీకి బీఎన్ఎస్ 47 (1) నోటీసును అందించి ఉన్నపళంగా అరెస్టు చేశారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో మధ్యాహ్నం విజయవాడకు తీసుకొచ్చారు. కొద్దిసేపు భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఉంచి, అనంతరం కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న సెంట్రల్ ఏసీపీ కె. దామోదరరావుతోపాటు లా అండ్ ఆర్డర్ ఏడీసీపీ జి. రామకృష్ణ రాత్రి తొమ్మిది గంటల వరకు వంశీని ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం.. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరోవైపు.. వంశీ అనుచరులైన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన ఏలినేని వెంకట శివరామకృష్ణప్రసాద్ (35), కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన నిమ్మ లక్ష్మీపతి (35)లను కూడా పటమట పోలీసులు గురువారం రాత్రి అరెస్టుచేశారు. వైద్య పరీక్షల నిమిత్తం వారినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం.. వంశీని కోర్టులో హాజరుపరచగా అర్ధరాత్రి 2 గంటల వరకు వాదనలు కొనసాగాయి. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనట్లుగా..ఇక రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులతో బరితెగిస్తోందనడానికి వంశీ అరెస్టే ఉదాహరణ. ఎందుకంటే.. ఏకంగా న్యాయమూర్తి ఎదుట స్వచ్ఛందంగా 164 సీఆర్పీసీ కింద నమోదుచేసిన వాంగ్మూలాన్ని కూడా బేఖాతరు చేస్తూ అక్రమ కేసులకు టీడీపీ కూటమి సర్కారు తెగిస్తోంది. అసలు వంశీపై అక్రమ కేసుకు ప్రాతిపదికగా పోలీసులు చెబుతున్న గన్నవరం టీడీపీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ ముదునూరి సత్యవర్థన్ ఫిర్యాదే అబద్ధమని కోర్టు సాక్షిగా ఇటీవల తేలిపోయింది. ఖాళీ కాగితాలపై తన సంతకం తీసుకుని ఫిర్యాదు చేశారని.. అసలు ఫిర్యాదులో ఏముందో కూడా తనకు తెలియదని సత్యవర్థన్ సాక్షాత్తూ న్యాయమూర్తి ఎదుట స్పష్టంచేశారు. వంశీ తనను బెదిరించనేలేదని.. తనపై దౌర్జన్యం చేయలేదని స్వచ్ఛందంగా వెల్లడించి తన ఫిర్యాదును వాపసు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఇది అవమానంగా భావించి ఎలాగైనా వంశీని అరెస్టుచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో సుదీర్ఘ చర్చల అనంతరం సత్యవర్థన్ కిడ్నాప్ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పోలీసులు సైతం కోర్టులోని పరిణామాలన్నింటినీ బేఖాతరు చేస్తూ రెడ్‌బుక్ కుట్రనే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సత్యవర్థన్ తమ్ముడు కిరణ్‌పై ఒత్తిడి తెచ్చి అవాస్తవ ఆరోపణలతో మరో అబద్ధపు ఫిర్యాదును ఈ నెల 12న ఇప్పించారు. మాజీ ఎమ్మెల్యే వంశీ, కొమ్మా కోట్లు, భీమవరపు రామకృష్ణ, గంటా వీర్రాజు తదితరులు తన సోదరుడిని కిడ్నాప్ చేసి కేసు వాపసు తీసుకునేలా బెదిరించి, భయపెట్టారని అందులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన వెంటనే పటమట పోలీసులు వంశీపై అక్రమ కేసు నమోదు చేశారు. అంటే.. తమకు అసలు న్యాయ వ్యవస్థ అంటే ఏమాత్రం లెక్కలేదన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగిస్తోందన్నది వంశీ అరెస్టు ద్వారా స్పష్టమవుతోంది.కాగా, వంశీ అరెస్టుపై విజయవాడ పటమట పోలీసుస్టేషన్లో గురువారం హైడ్రామా నడిచింది. హైదరాబాదు నుంచి వంశీని పటమట స్టేషన్‌కు తీసుకొస్తారని పోలీసులు లీకులు ఇవ్వడంతో మీడియా అంతా అక్కడికి చేరుకుంది. చివరికి భవానీపురం స్టేషన్‌కు, అక్కడ వంశీని కారుమార్చి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో రైటర్, ఇతర సిబ్బంది కేసుకు సంబంధించిన పత్రాలను రహస్యంగా తరలించారు. వంశీని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చిన పోలీసులు వల్లభనేని వంశీకి రిమాండ్..14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ 4th ACMM కోర్టు ఆదేశాలు జారి చేశారు. కాగా విజయవాడ సబ్ జైల్‌కి పోలీసులు వంశీని తరలించారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. సత్యవర్థన్ స్టేట్మెంట్ రికార్డు..మరోవైపు ముదునూరు సత్యవర్థన్ గురువారం సాయంత్రం పటమట పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ను పోలీసులు రహస్యంగా స్టేషన్లో ఉంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. వంశీ అరెస్టు నేపథ్యంలో సత్యవర్థన్ స్టేట్మెంట్ను రికార్డు చేయటం చర్చనీయాంశంగా మారింది.మాజీమంత్రి పేర్ని నాని హౌస్ అరెస్టు..వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నానిని పోలీసులు గురువారం హౌస్ అరెస్టుచేశారు. తెల్లవారుజామున ఆయన ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకుని బయటికెళ్లేందుకు వీల్లేదని నోటీసులిచ్చారు.ఎఫ్ఐఆర్ అడిగితే ఇవ్వడంలేదు..నా భర్తపై నమోదుచేసిన కేసు ఎఫ్ఐఆర్ అడిగితే ఇవ్వడంలేదు. ఎందుకు అరెస్టుచేశారో చెప్పడంలేదు. రిమాండుకు తీసుకెళ్లినప్పుడు ఇస్తామంటున్నారు. ఎఫ్ఐఆర్ లేకపోతే లీగల్‌గా వెళ్లడానికి అవకాశం ఉండకూడదని ఇలా చేస్తున్నారు. హైదరాబాద్‌లో మా ఇంటికొచ్చి అరెస్టుచేశారు. నోటీసు ఇవ్వకుండా ఎందుకు అరెస్టుచేస్తున్నారని ప్రశ్నిస్తే అప్పటికప్పుడు పేపర్‌పై రాసిచ్చారు. అక్రమ కేసులో ఇరికించేందుకే ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తుంటే తెలంగాణ సరిహద్దుల వద్దే ఏపీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్మోహనరావు సహాయంతో ఇక్కడకు చేరుకున్నాను. – పంకజశ్రీ, వంశీ సతీమణిచంద్రబాబు ఒత్తిడితోనే వంశీ అక్రమ అరెస్టుమాజీ మంత్రి అంబటిసీఎం చంద్రబాబు ఒత్తిడితోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వంశీ అక్రమ అరెస్టు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసులపై డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు అంబటి రాంబాబు, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులతో కూడిన వైఎస్సార్సీపీ బృందం గురువారం అపాయింట్మెంట్ తీసుకుని డీజీపీ కార్యాలయానికి వెళ్లింది. అయినా డీజీపీ కలవలేదు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ తాను ఆ ఫిర్యాదు చేయలేదని, సాక్షి సంతకం తీసుకొని, దానితో వంశీపై తప్పుడు ఫిర్యాదు నమోదు చేశారంటూ మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. దీంతో చంద్రబాబు, లోకేశ్ కుతంత్రాలు బట్టబయలయ్యాయని చెప్పారు. సత్యవర్ధన్‌ను వంశీ కిడ్నాప్ చేసి, బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారంటూ అతని సోదరుడితో ఫిర్యాదు చేయించారని తెలిపారు. వంశీని పోలీసులు క్షణాల్లో అరెస్ట్ చేశారన్నారు. బుధవారం ఓ వివాహ వేడుకలో దెంగులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన రచ్చలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పైనా తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు.తప్పుడు కేసులతో వంశీపై కక్షసాధింపువల్లభనేని వంశీపై పోలీసులు బనాయించిన తప్పుడు కేసును తక్షణం ఉపసంహరించుకోవాలి. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసులను పావుగా వాడుకుని వంశీపై తీవ్ర సెక్షన్లతో కేసులు నమోదుచేశారు. రాష్ట్రంలో చట్టాలను ఎలా తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారో వంశీ అరెస్టు ఉదంతం ఒక నిదర్శనం. అధికారం శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలి. – మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేఅరెస్టు చేయొద్దని కోర్టు చెప్పినా..వల్లభనేని వంశీని అరెస్టుచెయ్యొద్దని కోర్టు ఆదేశాలున్నా, పోలీసులు వాటిని ధిక్కరించి మరీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటవుతుందనే పిచ్చి భ్రమల్లో నుంచి కూటమి నాయకులు బయటకు రావాలి. నియంత పాలన ఎంతోకాలం సాగదు. అన్యాయం జరిగిందని న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే, బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. – జూపూడి ప్రభాకర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితప్పుడు ఫిర్యాదు చేయించి..ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగుతోంది. వంశీపై రాజకీయ కక్ష సాధింపులకే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వంశీ కేసు పూర్తిగా నీరుగారిపోతోందని చంద్రబాబు, లోకేశ్ కక్షపూరితంగా సత్యవర్థన్ కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసి వారితో తప్పుడు ఫిర్యాదు చేయించారు. ఇలాంటి దుర్మార్గ విధానాలకు ప్రభుత్వ పెద్దలే పాల్పడుతుంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా? – వేల్పుల రవికుమార్,వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
కుట్ర బెడిసికొట్టింది
-
చంద్రబాబు పెట్టే కేసులకు మేం భయపడం: మిథున్ రెడ్డి
-
బనగానపల్లె పీఎస్ వద్ద ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేతపై అక్రమ కేసులు
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్‌పై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రోద్బలంతో అక్రమ కేసులు బనాయించారు. గత బుధవారం అబ్దుల్ ఫైజ్ ఇంటిపై మంత్రి బీసీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. అబ్దుల్ ఫైజ్‌కు న్యాయం చేయాల్సిన పోలీసులు ఆయనపైనే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పెద్ద ఎత్తున వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు భారీగా మోహరించారు.ఈ నెల 15న అబ్దుల్‌ఫైజ్ కుమారుడు అబ్దుల్ ఉబేద్ వివాహం జరుగుతుండగా.. ఆ ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులను భయంభ్రాంతులకు గురి చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. అబ్దుల్‌ఫైజ్ కథనం మేరకు.. పెద్ద కుమారుడు అబ్దుల్‌ఉబేద్ జోడే కావడంతో బుధవారం విద్యుత్ దీపాలంకరణతో ఇంటిని తీర్చిదిద్దారు. ఈ ఇంటిని హైదరాబాద్ నుంచి వచ్చిన డ్రోన్ కెమెరామెన్స్ చిత్రీకరిస్తున్నారు. అబ్దుల్‌ఫైజ్ ఇంటికి సమీపంలో ఉన్న మంత్రి ఇంటి వద్ద నుంచి కొందరు టీడీపీ అనుచరులు ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి.. డ్రోన్ కెమెరాను లాక్కొని కిందపడేసి పగులకొట్టారు.అలాగే ఇంట్లో ఉన్న మహిళలను కూడా భయంభ్రాంతులకు గురి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీఐ ప్రవీణ్‌కుమార్ వెంటనే అబ్దుల్‌ఫైజ్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన కూడా మంత్రి అనుచరులకు వత్తాసు పలికారు. డ్రోన్ కెమెరామెన్ల పై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వెంటనే అబ్దుల్‌ఫైజ్ ఇంటి వద్దకు వెళ్లి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
వైసీపీ శ్రేణులపై ఆగని అక్రమ కేసులు !
-
మహిళలను అవమానించేలా కూటమి చర్యలు
-
ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు..
సాక్షి, అమరావతి: అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకూ పెట్రేగిపోతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణచివేసే కుట్రలకు మరింతగా పదనుపెడుతోంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది.పేర్ని నానిపై కక్ష సాధింపు కుట్రతో ఆయన కుటుంబానికి చెందిన గోదాముల్లో ప్రభుత్వం తనిఖీలు నిర్వహించింది. ఏకంగా 4,500 బియ్యం బస్తాలు తగ్గాయని అధికారులు ఏకపక్షంగా నివేదిక ఇచ్చేశారు. గోదాములకు బియ్యం బస్తాలు తీసుకువచి్చనప్పుడు తేమ శాతం అధికంగా ఉంటుంది. దాంతో బియ్యం నిల్వలు బరువు ఎక్కువ ఉంటాయి. కానీ గోదాముల నుంచి బియ్యాన్ని తరలించేటప్పుడు తేమ శాతం తగ్గుతుంది. దాంతో బియ్యం నిల్వల బరువు తగ్గుతుంది. ఇది సహజం. కానీ దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా 4,500 బస్తాలు తగ్గాయని ఏకపక్షంగా నిర్ధారించేశారు.రూ.1.68 కోట్లు రికవరీ కింద చెల్లించాలని నోటీసులిచ్చారు. తమ తప్పు ఏమాత్రం లేకపోయినప్పటికీ.. అంతా సక్రమంగా ఉన్నప్పటికీ పేర్ని నాని కుటుంబం అందుకు సమ్మతించింది. ఈ వ్యవహారంపై ఓ వైపు న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తూనే మరోవైపు ప్రభుత్వం చెప్పినట్టుగా రూ.1.68 కోట్లు చెల్లించింది. నోటీసులకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా రికవరీగా చెల్లించమన్న మొత్తం చెల్లించేయడంతో నిబంధనల ప్రకారం దాంతో ఈ వ్యవహారాన్ని ముగించాలి. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం వేధించాలన్న ఏకైక కుట్రతో ఆ గోదాం యజమానిగా ఉన్న పేర్ని నాని సతీమణి జ యసుధపై అక్రమ కేసు నమోదు చేసింది.రికవరీ మొత్తం చెల్లించినప్పటికీ మరోసారి చెల్లించాలంటూ జేసీ ఈనెల 29న ఇచ్చిన నోటీసు బెయిల్‌ను సహించలేని ప్రభుత్వం ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసును సవాల్ చేస్తూ పేర్ని నాని కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ గోదాము వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను ఆధారాలుగా న్యాయస్థానానికి సమరి్పంచింది. తాము గోదాము నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలించనే లేదని వీడియో ఆధారాలతో సహా తమ వాదనను బలంగా వినిపించింది. పేర్ని నాని కుటుంబ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. పేర్ని జయసుధకు సోమవారం ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.రికవరీ మొత్తం చెల్లించాలని పేర్ని నాని కుటుంబానికి కృష్ణా జిల్లా జేసీ జారీచేసిన నోటీసుదాంతో చంద్రబాబు ప్రభుత్వం తమ పన్నాగానికి మరింత పదును పెట్టింది. అధికారులను సోమవారం మరోసారి ఆ గోదా ము కు పంపించింది. మరో రూ.1.67 కోట్లు రికవరీ మొత్తంగా చెల్లించాలని నోటీసులు ఇ చ్చింది. తద్వారా తమకు నిబంధనలు పట్టవని.. అక్రమ కేసులతో వేధించడమే తమ ఏకైక లక్ష్యమని చంద్రబాబు ప్రభుత్వం బాహాటంగా వెల్లడించింది. ముందు చెప్పిన రికవరీ మొత్తాన్ని చెల్లించినా సరే మరోసారి రికవరీ మొత్తం చెల్లించాలని నోటీసులివ్వడాన్ని పరిశీలకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు.ఇదీ చదవండి: ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే..'పేద బిడ్డలకు తెలుగే' -
వైఎస్సార్సీపీ నేతల పోరుబాటపై పోలీసుల అక్రమ కేసులు
-
దారి పొడవునా బ్రహ్మరథం
సాక్షి ప్రతినిధి, కడప/ సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ జిల్లాలో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారిపొడవునా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం పులివెందుల– బెంగళూరు మార్గంలోని పల్లెల జనమంతా రోడ్డుపైకి వచ్చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. తమ అభిమాన నాయకుడు ఆ రహదారిలో వెళ్తున్నారని తెలుసుకుని ఆయా గ్రామాల వద్ద రోడ్డుపై తిష్ట వేశారు. దారి పొడువునా జననేతకు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ సైతం ఏ ఒక్కరినీ నిరాశ పరచకుండా అందరినీ పలకరిస్తూ, సెల్ఫీలు దిగుతూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మార్గం మధ్యలో ఆయా గ్రామాల్లో నేతలందరినీ పేరు పేరునా పలకరిస్తూ ముందుకు సాగారు. అంబకపల్లి క్రాస్, దొరిగల్లు మీదుగా ముదిగుబ్బ బైపాస్ రోడ్డుకు చేరుకున్న జగన్‌కు.. కాకతీయ దాబా వద్ద కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారందరికీ జగన్ అభివాదం చేశారు. తర్వాత కట్టకిందిపల్లె మీదుగా బత్తలపల్లి మండలం రామాపురం చేరుకున్న జగన్ కాన్వాయ్‌ని ప్రజలు ఆపి, జై జగన్ అంటూ నినదించారు. బత్తలపల్లి టోల్‌ప్లాజా వద్దకు కాన్వాయ్ చేరుకునే సరికే భారీ సంఖ్యలో జనం, పార్టీ శ్రేణులు వేచి ఉన్నారు. ఇక్కడ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు కాన్వాయ్‌కు అడ్డుపడుతూ తమతో మాట్లాడాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వాహనంలో నుంచి బయటకు వచ్చి అభివాదం చేశారు. టోల్‌ప్లాజా వద్దనే అడుగడుగునా వాహనానికి అడ్డుపడడంతో జగన్ వాహనంలో నుంచి మూడు సార్లు బయటకు వచ్చి అభివాదం చేయాల్సి వచ్చింది.కరచాలనానికి పోటాపోటీరాప్తాడులోని నాలుగు రోడ్ల కూడలికి జగన్ కాన్వాయ్ చేరుకోగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మీ శ్రీనివాస్, భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.జగన్‌తో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి ప్రజలు పోటీ పడ్డారు. మార్గం మధ్యలోని బొమ్మేపర్తి, లింగనపల్లి, హంపాపురం, గొల్లపల్లి, మరూరు, ఎం.చెర్లోపల్లి, చెన్నేకొత్తపల్లి సమీపంలో పార్టీ శ్రేణులు, ప్రజలు, మహిళలు ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలికారు. సోమందేపల్లి వై.జంక్షన్ వద్ద శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్, వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, చిలమత్తూరు మండలానికి సమీపంలోని బాగేపల్లి టోల్‌ప్లాజా వద్ద హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఇక్కడ జగన్‌తో కరచాలనం చేసేందుకు యువతీ యువకులు పోటీపడ్డారు. టోల్ ప్లాజా దాటేందుకు సుమారు గంట సమయం పట్టడం గమనార్హం. జగన్‌ను చూసేందుకు వచ్చిన జనాన్ని, పార్టీ శ్రేణుల్ని నిలువరించడానికి ఏపీ, కర్ణాటక పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.అక్రమ కేసులకు భయపడొద్దురాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు. ఇటీవల చిలమత్తూరు మండల టీడీపీ కన్వీనర్ రంగారెడ్డి చేసిన దాడిలో శివప్ప, అతని సోదరుడు వెంకట్‌తో పాటు మత్సేంద్ర, నారాయణప్ప, పవన్ గాయపడ్డారు. అయితే.. పోలీసులు బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వారంతా పెద్దనపల్లి వద్ద వైఎస్ జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయించారని వాపోయారు. వారి కష్టాన్ని ఓపికగా విన్న జగన్.. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులకు భయపడొద్దని వారికి ధైర్యం చెప్పారు. -
ఆరు నెలల అరాచకం
రోజుకు ఒకటికి మించి హత్యలు.. రోజున్నరకు ఓ అత్యాచారం.. రోజుకు 10కిపైగా అక్రమ కేసులు.. రోజుకు 25కుపైగా దాడులు, దౌర్జన్యాలు.. ఏమిటిదంతా అనుకుంటున్నారా!.. ఆరు నెలల పాలనలో చంద్రబాబు ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. స్వయంగా చంద్రబాబు, లోకేశ్ ప్రామాణికంగా తీసుకున్న రెడ్‌బుక్ పాలన రాష్ట్రంలో అధికారికంగా బీభత్సం సృష్టిస్తోంది. 75ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఆరు నెలల్లోనే దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులతో బెంబేలెత్తిపోతోంది. చంద్రబాబు పాలనలో శాంతభద్రతలు చేష్టలుడిగి చూస్తుంటే.. సామాన్యుడి బతుకు ఛిద్రమైపోతోంది. సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ గూండాలు, రౌడీమూకలు యథేచ్చగా హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నాయి. చీనీ తోటలు నరికేస్తున్నారు. దళిత వాడలపై దండెత్తుతున్నారు. సామాన్యులను హడలెత్తించి గ్రామాల నుంచి వెళ్లగొడుతున్నారు. వరుస అత్యాచారాలు, లైంగిక దాడులతో రాష్ట్రంలో కీచకపర్వం యథేచ్చగా కొనసాగుతోంది.ఇక వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతోపాటు సామాన్య సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమ కేసులతో అడ్డూఅదుపు లేకుండా వేధిస్తున్నారు. చంద్రబాబు మార్కు కక్షసాధింపు చర్యలతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం రెడ్‌బుక్ రాజ్యాంగ బాధితులుగా మారిపోయారు. టీడీపీ సాగిస్తున్న అరాచక యజ్ఞంలో సామాన్యుల బతుకులే సమిధులవుతున్నాయి.అరాచకాలే బ్రాండ్.. అదే బాబు పాలన ట్రెండ్ చంద్రబాబు ప్రభుత్వం దాపరికం లేకుండా అరాచకానికి బరితెగిస్తోంది. లోకేశ్ ఫొటోలతోసహా రెడ్‌బుక్ హోర్డింగులు ఏర్పాటు చేయడం ద్వారా మారణహోమంతో బీభత్సం సృష్టించడమే ప్రభుత్వ అజెండా అని అధికారికంగా ప్రకటించడం టీడీపీ కూటమికే చెల్లింది. తద్వారా టీడీపీ గూండాలు కత్తులు, కర్రలు, బాంబులతో యథేచ్ఛగా దాడుల చేయాలని ఆదేశించింది. అందుకు పోలీసులు సహకరించాలి లేదా పక్కకు తప్పుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వమే అధికారికంగా గూండాగిరీకి తెగిస్తే ఎంతటి విధ్వంసం సాగుతుందన్నది యావత్ రాష్ట్రం ఈ 6 నెలల్లో చూసింది. పచ్చ మూకల కీచకపర్వం ఆరు నెలల్లో 126 అత్యాచారాలు, లైంగిక దాడులు చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో కీచకపర్వం అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. ఒకప్పటి చంబల్ లోయలోని అకృత్యాలను తలపిస్తూ రాష్ట్రంలో పచ్చమూకలు మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు తెగబడుతున్నాయి. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బాధిత మహిళల్ని హతమార్చి మరీ దర్జాగా జారుకుంటున్నారు.6 నెలల్లోనే ఏపీలో 126 మంది మహిళలు, బాలికలపై అత్యాచారాలకు, దాడులకు తెగబడటం రాక్షస పాలనకు అద్దం పడుతోంది. వారిలో 12 మందిపై అత్యాచారం జరిపి హత్య చేయడం రౌడీ మూకల బరితెగింపునకు నిదర్శనం. ఇవన్నీ అధికారికంగా కేసులు నమోదైన ఘటనలే. కూటమి పెద్దలు, గూండాలకు భయపడి బాధితులు ఫిర్యాదులు చేయని ఉదంతాలు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయన్నది పచ్చి నిజం. 229 హత్యలు.. 750కుపైగా హత్యాయత్నాలు చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న హత్యాకాండ బెంబేలెత్తిస్తోంది. 6 నెలల్లో రాష్ట్రంలో ఏకంగా 229 మందిని హత్య చేశారు. 750కుపైగా హత్యాయత్నాలకు తెగబడ్డారు. 4 వేలకుపైగా దాడులతో విధ్వంసం సృష్టించారు. 2 వేలకుపైగా ప్రైవేటు ఆస్తులు, 5 వేలకుపైగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ గూండాల దాడులతో బెంబేలెత్తి దాదాపు 5వేల కుటుంబాలు గ్రామాలను విడిచిపెట్టి వలసపోయాయి. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. రాజ్యాంగ హక్కుల కాలరాత సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులతో చంద్రబాబు ప్రభుత్వ అరాచకం పతాకస్థాయికి చేరింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేస్తూ అక్రమ నిర్బంధాలు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతూ.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ వేధింపులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ఎమర్జెన్సీ తరహా పాలనను కూటమి సర్కారు రాష్ట్రంపై రుద్దుతోంది. సెక్షన్లను మారుస్తూ.. చట్టాలను ఏమారుస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది. ఇప్పటివరకు 253 అక్రమ కేసులు నమోదు చేసి 822 మందికి నోటీసులిచ్చింది. 85 మందిని అక్రమంగా అరెస్ట్ చేసింది. రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీస్ దాసోహం పోలీస్ శాఖ లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి గులాంగిరీ చేస్తూ టీడీపీ అరాచకానికి కొమ్ముకాస్తోంది. టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు, గూండాలు యథేచ్ఛగా హత్యలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నా పోలీస్ శాఖ చోద్యం చూస్తోంది. ఏకంగా అఖిల భారత సర్వీస్ అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు కూడా రెడ్‌బుక్ రాజ్యాంగ బాధితులుగా మారిపోవడం ప్రస్తుత వైచిత్రి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించకముందే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డిని బలవంతంగా సెలవుపై పంపారు. అధికారం చేపట్టిన తరువాత ఏకంగా 10 మంది ఐఏఎస్, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. వలపు వల, ఫోర్జరీ కేసుల్లో నిందితురాలు కాదంబరి జత్వానీని అడ్డుపెట్టుకుని ఐపీఎస్ అధికారులు పీఏఎస్‌ఆర్ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్‌గున్నీలను అక్రమంగా సస్పెండ్ చేసింది. అదనపు డీజీ సంజయ్‌ను కక్షపూరితంగా సస్పెండ్ చేసింది. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కుట్ర వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి, మాజీ ఎంపీలు నందిగం సురేశ్, రెడ్డప్ప, మాజీ మంత్రులు విశ్వరూప్, పేర్ని, కొడాలి నాని, జోగి రమేశ్, మేరుగు నాగార్జున, కాకాణి, రోజా, రజినీ, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి, పెద్దారెడ్డి, చెవిరెడ్డి, వల్లభనేని వంశీ, కేతిరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల, పార్టీ నేతలు దేవినేని అవినాశ్, సజ్జల భార్గవ్‌రెడ్డి, వైవీ విక్రాంత్‌రెడ్డి తదితరులతోపాటు వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. వారి ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. -
మేడం చెప్పారు.. స్టేషన్‌కు రండి
సాక్షి, టాస్క్ ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లాలో ఆ ప్రజాప్రతినిధి రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. అధికారం అండతో పచ్చపార్టీ మేడం ‘రెడ్‌బుక్’ అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులే లక్ష్యంగా పోలీసుల్ని ప్రయోగిస్తున్నారు.పోలీసుల పిలుపుతో వెళ్లివస్తున్న వారిపై దారిలో తమ పార్టీ వారితో కొట్టిస్తున్నారు. దీంతో పోలీస్‌స్టేషన్ అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసులు పిలిచినప్పుడు పోలీసు వ్యవస్థపై గౌరవంతో స్టేషన్‌కు వెళ్లినవారికి ఇంటికెళ్లేవరకు రక్షణ ఉండటంలేదు. దారికాచిన తెలుగుదేశం వర్గీయులు దాడిచేస్తున్నారు. ఈ దాడులపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు కేసులు నమోదు చేయడంలేదు. ఎన్నికల ముందు గొడవలపై పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలని కూటమి నేతల నుంచి పోలీసులకు భారీ ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో ఇలా పోలీసులు పిలిస్తే వెళ్లి వస్తున్న వారిపై టీడీపీ వర్గీయులు దాడిచేసి కొట్టారు. తాజాగా పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని వైఎస్సార్సీపీ నేతలకు పోలీసుల నుంచి ఫోన్ వెళ్లింది. ‘మేడం చెప్పారు. స్టేషన్‌కు వచ్చి వెళ్లండి’ అని కాల్ చేశారు. భయపెడుతున్న కొత్తచెరువు ఘటన పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం కొడపగానిపల్లికి చెందిన కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఈ నెల 17వ తేదీన పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేయరాదని హెచ్చరించారు. ఆ కార్యకర్తలు సాయంత్రం తిరిగి వెళ్లేటప్పుడు కొత్తచెరువు శివారులో టీడీపీ నేతలు దాడిచేసి గాయపరిచారు. నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. తాజాగా పెనుకొండ నియోజకవర్గంలో ఎన్నికల ముందు జరిగిన ఓ గొడవకు సంబంధించి వైఎస్సార్సీపీ నేతలను స్టేషన్‌కు పిలిపించాలని మేడం ఆదేశించారని.. నాలుగు రోజుల కిందట పోలీసుల నుంచి ఫోన్‌కాల్స్ వెళ్లాయి. మేడం ఎవరు.. ఏమని ఫిర్యాదు చేశారు.. ఆ గొడవకు సంబంధించి అప్పట్లోనే రాజీకుదిరిందని ఫోన్ రిసీవ్ చేసుకున్నవారు సమాధానం ఇచ్చారు. అయితే మేడం నుంచి ఒత్తిడి ఉందని పోలీసులు చెబుతుండటం విశేషం. రొద్దం మండలం సోషల్ మీడియా కార్యకర్త ఎన్.బాలాజీరెడ్డిని పోలీసులు పదేపదే వెంటాడారు. స్టేషన్‌కు రమ్మని.. పెనుకొండకు తీసుకెళ్లి తర్వాత వదిలేశారు. అంతటితో ఆగకుండా.. చాలా స్టేషన్లలో కేసులు నమోదు చేయించారు. ఇంటికొచ్చే వరకు రక్షణ లేదు పోలీసుల నుంచి ఫోన్ వచ్చిoదని స్టేషన్‌కు వెళ్లినవారితో ఎస్ఐ లేదా సీఐతో మాట్లాడతారు. సోషల్ మీడియాలో పోస్టింగులు, ఎన్నికల ముందు చిన్నపాటి గొడవల గురించి ప్రస్తావిస్తారు. పునరావృతం కారాదని హెచ్చరిస్తారు. ఇంకొందరిని అరెస్టు చేసినట్లు చెప్పి.. సాయంత్రానికి స్టేషన్ బెయిల్ ఇస్తారు. మరుసటిరోజు రావాలని ఆదేశిస్తారు.అయితే సాయంత్రం ఇంటికెళ్లే సమయంలో కూటమి నేతలు దారికాచి దాడులు చేస్తున్నారు. లేనిపోని విషయాలతో గొడవలకు దిగి, పోలీసులపై మళ్లీ ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఇబ్బంది పెడుతున్నారు. కొన్నిచోట్ల బైండోవర్ చేస్తున్నారు. -
హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు
-
రాక్షస పాలనలో దళితులపై కక్ష
సాక్షి, అమరావతి: ‘‘ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..?’’ అంటూ అహంకారపూరితంగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు! ఆ వర్గాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కుతూ.. దళితులకు అసలు నాయకత్వమే లేకుండా చేయాలనే దుర్నీతితో సాగుతున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం.. ప్రశ్నించడమే పాపమన్నట్లు వ్యవహరిస్తున్నారు.ఒకపక్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుక్షణం వేధింపులకు గురిచేస్తూ.. మరోవైపు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఆర్డీవో, డీఎస్పీ, మండల స్థాయి అధికారులపై కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించారు. సూపర్ సిక్స్ సహా హామీల అమలు, అక్రమాలు, వైఫల్యాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు ఎస్సీ వర్గానికి చెందిన సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వారిని పోలీసు స్టేషన్లలో అర్ధ నగ్నంగా నిలబెట్టి అవమానాలకు గురి చేసిన ఘటనపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఎస్సీలను ఉక్కుపాదంతో అణచివేత చర్యలను రోజు రోజుకు ఉద్ధృతం చేస్తున్నారని ఆ సామాజిక వర్గ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులు..» అధికారంలోకి వస్తూనే వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం ఆయనపై వరుసగా కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు తెర తీసింది. దళితులకు నాయకత్వం లేకుండా చేయాలనే కుట్రపూరిత ధోరణితో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా కేసులు నమోదు చేస్తూ బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. నందిగం సురేష్ పై అసలు ఎక్కడెక్కడ, ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలంటూ స్వయంగా హైకోర్టు ఆదేశించడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అన్యాయంపై ప్రశ్నించడం.. దళితుల్లో స్ఫూర్తి రగల్చడమే పాపమనే విధంగా దళిత నేతల పట్ల కూటమి సర్కారు దుర్నీతితో వ్యవహరిస్తోంది. » చంద్రబాబుపై గతంలో గులకరాయి పడిన ఘటనకు సంబంధించి నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌లపై కూటమి సర్కారు ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు దిగింది. » కూటమి సర్కారు రాజకీయ క్షక్ష సాధింపుల్లో భాగంగా నారా లోకేశ్‌పై ట్వీట్ చేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై స్థానిక పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేసింది. జోరుగా సాగుతున్న పేకాట కార్యకలాపాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఓ ప్రజాప్రతినిధి పట్ల ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. జరుగుతున్న విషయాన్ని చెబితే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా విపక్షంలో ఉన్నారనే ఏకైక కారణంతో ఓ ఎమ్మెల్యేపై కేసులు బనాయించడం కూటమి సర్కారు అరాచకాలకు పరాకాష్ట. » బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గతేడాది ఓ వలంటీర్ మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని విశ్వరూప్ కుమారుడు డాక్టర్ శ్రీకాంత్‌ను అక్రమంగా అరెస్టు చేసింది. డాక్టర్ శ్రీకాంత్‌ను ఏ 1గా చేర్చి జైలుకు తరలించింది. ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. » మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు మేరుగు నాగార్జునపై టీడీపీ నేతలు ఓ మహిళతో తప్పుడు కేసు పెట్టించారు. నాగార్జున డబ్బులు తీసుకుని మోసం చేశారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు బనాయించారు. అయితే తనపై అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించినట్లు ఆ మహిళ అఫిడవిట్లో పేర్కొంది. తాను ఎన్నడూ మేరుగు నాగార్జునను చూడలేదని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఆరి్థక లావాదేవీలు లేవని అందులో వెల్లడించడం గమనార్హం.విద్యావంతుడికి అవమానాలు.. రాజమహేంద్రవరంలో వరదలు వచి్చనప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులను నెల రోజుల్లోనే పరిష్కరించినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన విద్యావంతుడైన దళిత యువకుడు పులి సాగర్ తాను నివాసం ఉండే కృష్ణానగర్, బ్రదరన్ చర్చి ప్రాంతాల్లో వరద నీరు ఇంకా నిల్వ ఉండటం, సమస్యలు తొలగకపోవడంపై ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు. దీంతో ఆయనపై కేసులు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం దారుణ అవమానాలకు గురి చేసింది. పోలీసు స్టేషన్‌కు రావాలని ఆదేశించడంతో ఈ నెల 2న ఆయన రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ స్టేషన్‌కు వెళ్లారు. బీఎస్సీ, బీఈడీ చదివిన తనను పోలీసులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ, బెదిరిస్తూ.. సెల్లో అర్ధనగ్నంగా నిలబెట్టి.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లను కాపలాగా ఉంచారని పులి సాగర్ వాపోయారు. దళిత యువకుడిని పోలీసులు ఘోరంగా అవమానించిన తీరును సామాజికవేత్తలు ఖండిస్తున్నారు. » చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గంలో గత ఎన్నికల సమయంలో విద్యుత్తు సబ్ స్టేషన్లో ప్రమాదానికి సంబంధించి టీడీపీ నాయకుల ప్రోద్బలంతో దళితుడైన యాదమరి ఎంపీపీ సురేష్ బాబుపై చిత్తూరు టూ టౌన్ సీఐ అక్రమ కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు దళితవాడలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హరి, జయపాల్, భారతి, బాబుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. » రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లెలో ఇటీవల దళిత వర్గానికి చెందిన ప్రభుపై టీడీపీ సానుభూతిపరులు మరుగుతున్న నూనెను ఒంటిపై పోయడంతో తీవ్ర గాయాలతో కడప రిమ్స్‌లో చేరాడు. » దళితుడనే చిన్న చూపుతో రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాంబాబును టీడీపీ నాయకులు ఆయన కార్యాలయంలోనే వేధించారు. తీవ్ర మానసిక వేధింపులతో కలత చెందిన ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికార యంత్రాంగంపై వేధింపులు» ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్‌కు నిష్పక్షపాతంగా పని చేస్తారనే పేరుంది. ఆయన ఏ రాజకీయ పక్షానికీ కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తున్నారు. అగి్నమాపక డీజీ, సీఐడీ చీఫ్ హోదాల్లో సంజయ్ అక్రమాలు, నిధుల దురి్వనియోగానికి పాల్పడ్డారనే నెపం మోపి ఆయన్ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. » ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ను వేధింపులకు గురి చేస్తున్న కూటమి సర్కారు ఐపీఎస్‌లు పాల్రాజు, జాషువాకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా కక్ష సాధిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి అన్బురాజన్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. రాజకీయ దురుద్దేశాలతో రిటైర్డ్ సీనియర్ పోలీస్ అధికారి విజయ్‌పాల్‌ను వేధించి అరెస్టు చేసింది. » ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణకు నిజాయితీగా, చట్ట ప్రకారం వ్యవహరిస్తారని అధికార వర్గాల్లో పేరుంది. గత ప్రభుత్వంలో ఆయన స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీగా పని చేశారు. విధి నిర్వహణలో నిక్కచి్చగా వ్యవహరించిన రామకృష్ణపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తనిఖీలు నిర్వహించి అక్రమాలను వెలికి తీసినందుకు ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు దిగింది. -
దళితులంటే ఇంత చిన్నచూపా?
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ హామీల అమలుపై నిలదీస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను తుంగలో తొక్కుతూ అక్రమ కేసులతో వేధిస్తోంది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు ఎవరిపైనైనా కేసు నమోదు చేస్తే.. ముందు 41ఏ నోటీసు జారీ చేయాలి. ఆ తర్వాత నిందితుడి నుంచి పోలీసులు సమాధానం తీసుకోవాలి. నిందితుడిపై నమోదైన అభియోగాలతో మేజిస్ట్రేట్ సంతృప్తి చెంది, అనుమతి ఇస్తేనే అరెస్టు చేయాలి. కానీ.. పోలీసులు చట్టాన్ని యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు. రాజమహేంద్రవరంలో వరదలు వచ్చినప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులను నెల రోజుల్లోనే పరిష్కరించానంటూ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై దళిత యువకుడు పులి సాగర్ స్పందిస్తూ.. తాను నివాసం ఉండే కృష్ణానగర్, బ్రదరన్ చర్చి ప్రాంతాల్లో వరద నీళ్లు ఇంకా నిల్వ ఉన్నాయని, ఇతర సమస్యలు అలాగే ఉన్నాయని పోస్టు పెట్టారు. దీనిపై గత నెల 30న పోలీస్‌స్టేషన్‌కు రావాలని రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ స్టేషన్ పోలీసులు ఆదేశిస్తే.. ఈ నెల 2న పులి సాగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ పోలీసులు అతడిని తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ బెదిరించారు. అంతేకాకుండా బీఎస్సీ, బీఈడీ చదివిన తనను సెల్లో అర్ధనగ్నంగా నిలబెట్టి.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లను కాపలాగా ఉంచారని పులి సాగర్ ఆవేదన వ్యక్తం చేశాడు. సీఐ బాజీలాల్ తన పట్ల దురుసుగా వ్యవహరించి గొంతుకు రాయికట్టి గోదావరిలో పడేస్తానని బెదిరించారని బుధవారం మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. కొవ్వుపట్టి కొట్టుకుంటున్నావురా నా..కొ.. అంటూ రెచ్చిపోయారని, పందిలా ఉన్నావు.. నిన్ను కోసి రైలు పట్టాల మీద పడేస్తే దిక్కెవరని బెదిరించారని చెప్పారు. స్థానిక సమస్యపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన పాపానికి దళిత యువకుడినైన తన ఆత్మగౌరవాన్ని పోలీసులు దెబ్బతీసి అమానవీయంగా వ్యవహరించడమే కాక నోటికొచి్చనట్లు అసభ్యంగా మాట్లాడారని పులి సాగర్ వాపోయాడు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు మార్గాని భరత్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు తీవ్రంగా స్పందించారు. బాధిత యువకుడు పులి సాగర్‌తో కలిసి వీరు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సంఘటనను మీడియాకు వివరించారు. -
Big Question: పోస్ట్ ఒక్కటే..ఎఫ్ఆర్ లు అనేకం.. వేలల్లో కేసులు.. వారంతా ఎవరు..?
-
‘గుర్తుంచుకో చంద్రబాబూ.. అధికారం ఎల్లకాలం ఉండదు’
సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ శ్రేణులను వేధించడానికే పోలీసులను వాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.‘‘పాత కేసులను తిరగదోడి.. తప్పుడు కేసులు పెడుతున్నారు. గన్నవరంలో 8 మంది వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా కేసుల్లో ఇరికించారు. న్యాయమూర్తి 307 కేసును తొలగించారు. కానీ బెయిల్ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పచ్చ చొక్కాల ఒత్తిడికి లొంగిపోయారు. కుంటిసాకులతో రెండురోజుల పాటు కాలయాపన చేసి పోలీస్ కస్టడీ కోరారు. రెండు సార్లు విచారణ అయ్యాక ఏముందని పోలీస్ కస్టడీకి కోరుతున్నారు’’ అని పేర్ని నాని ప్రశ్నించారు...అమాయకులను తెచ్చి ముద్దాయిలను చేశారు. వైఎస్సార్సీపీ జెండా, జగన్ బొమ్మ పెట్టుకుని తిరగకుండా చేయాలని చూస్తున్నారు. అడ్డగోలుగా పోలీసులను వాడుతున్నారు. పాతకేసులను తిరగదోడుతున్నందుకు డీజీపీకి మా సూటిప్రశ్న. పాతకేసులకు సంబంధించి ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారా?. తప్పుడు ఉద్యోగం చేశావని ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నారా?. చేసేవి దొంగ పనులు కాబట్టి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరి పై 10, 20 కేసులు పెడుతున్నారు.తమతో పాపాలు చేయిస్తున్నారని కొందరు పోలీసు అధికారులు బాధపడుతున్నారు. ఖాకీ యూనిఫాం వేసుకుని తప్పుడు కేసులు పెట్టి పాపాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ఎల్లకాలం సీఎంగా ఉండడు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈ రోజు పసుపు చొక్కేలేసుకుని అక్రమంగా వ్యవహరిస్తున్న అధికారులు తప్పకుండా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని పేర్ని నాని హెచ్చరించారు. -
మహిళపై పోక్సో కేసు..
-
పీడీ చట్టానికి సవరణ ముసుగులో కూటమి సర్కార్ పచ్చ పన్నాగం
-
Big Question: ప్రశ్నిస్తే వేధించండి.. హామీలు అడిగితే వెంటాడండి..
-
నా భర్తకు ప్రాణహాని ఉంది: ఇంటూరి రవికిరణ్ భార్య సుజన
సాక్షి, విశాఖపట్నం: తన భర్త ఇంటూరి రవికిరణ్‌పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తోందని ఆయన భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె విశాఖ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారో తెలియదు. కేసుల గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పడం లేదన్నారు.‘‘ఇంటూరి రవి కిరణ్ ఆరోగ్యం బాగోలేదు. రవి కిరణ్ హార్ట్ పేషెంట్, రోజు 8 గంటలు రెస్ట్ తీసుకోవాలి. రోజూ ఐదు నుంచి ఆరు వందల కిలోమీటర్ల తిప్పుతున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?. పోలీసుల నుంచి రవి కిరణ్‌కు ప్రాణ హాని ఉంది. పీటీ వారెంట్ మీద రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు. పోలీసులు మొత్తం సోషల్ మీడియా కార్యకర్తల కోసం పని చేస్తున్నారు. రవి కిరణ్‌పై 20 కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది’’ అని సుజన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన తన పైన కూడా దువ్వాడ, రాజమండ్రి సీఐలు దురుసుగా ప్రవర్తించారు. రవికిరణ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని డాక్టర్లు చెప్పిన కూడా పోలీసులు వినిపించుకోలేదు. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా రవికిరణ పై కేసులు పెట్టిస్తోంది. టీడీపీ నాయకులతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పిస్తున్నారు’’ అని సుజన తెలిపారు.ఇదీ చదవండి: పరామర్శకు వెళితే.. చెవిరెడ్డిపై పోక్సో కేసు -
Big Question: ప్రశ్నిస్తే పీడీ యాక్ట్.. సర్కారు వారి బరితెగింపు..
-
‘మొండితోక’ సోదరులపై కక్ష సాధింపు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. గతంలో చోటుచేసుకున్న సంఘటనలను వక్రీకరిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఎల్లో మీడియా ద్వారా ఇష్టారాజ్యంగా లీకులిస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ నిత్యం ప్రభుత్వ అక్రమాలను ఎండగడుతున్నారు. అరుణ్‌కుమార్ శాసనమండలిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేని ప్రభుత్వ పెద్దలు వారిపై కుట్రపన్నారు. దీంతో.. 2022 నవంబరు 4న చంద్రబాబు నందిగామలో పర్యటనలో రాళ్ల దాడి జరిగిందంటూ అప్పట్లో నానా హంగామా చేశారు.కానీ, అది వర్కవుట్ కాలేదు. రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా తాజాగా ఆ ఉదంతంలో ఆధారాల్లేకున్నా, పోలీసులు గతంలో నమోదుచేసిన సెక్షన్–324ను మార్చి కొత్తగా 120 (బి), 147, 307, 324, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులు కన్నెగంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్, మార్త శ్రీనివాసులను అరెస్టుచేసి, ఆదివారం నందిగామ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయాధికారి పోలీసుల తీరును తప్పుపడుతూ సెల్ఫ్ బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో కక్షసాధించేందుకు మరిన్ని అరెస్టులు ఉంటాయని, మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఎల్లో మీడియాకు లీకులు ఇస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అది కట్టు కథే.. అప్పుడే బట్టబయలునిజానికి.. అప్పట్లో చంద్రబాబు పర్యటన అంతా పక్కాగా ప్రణాళికతో నిర్వహించారు. నాడు నందిగామలో రోడ్డుషో జరుగుతున్న దారిలో ఆయన భద్రతాధికారిపై ఎవరో రాయి విసిరారని రాద్ధాంతం చేశారు. ఇంతలో మధుబాబు అనే వ్యక్తి తనకు గాయమైందంటూ చంద్రబాబు వద్దకు రావడం, ఆ వెంటనే దాడి జరిగిందని చంద్రబాబు ప్రకటించడం జరిగిపోయింది. అయితే, పోలీసుల దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. పైగా.. బాధితుడు దాడిపై కాలయాపన చేసి రెండోరోజు కానిస్టేబుల్‌తో ఫిర్యాదు పంపారు. పోలీసులు మెడికల్ టెస్ట్‌కు రమ్మని పిలిచినా రాలేదు. మధుబాబుకు గాయమైందని చెబుతున్న గడ్డం ప్రాంతంలో వాపులేదని ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే, కెమెరా ఫుటేజీ, డ్రోన్ విజువల్స్‌లో ఎక్కడా దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో చంద్రబాబు ఆరోపణ అవాస్తవమని తేలిపోయింది. అయినా ఇప్పుడు మొండితోక సోదరులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు కోసం, నాటి సంఘటనను మళ్లీ ఉపయోగించుకోవటం విస్మయానికి గురిచేస్తోంది. -
ప్రాణం తీసినా భూములివ్వం!
దుద్యాల్: తమ ప్రాణాలు తీసినా సరే భూములు మాత్రం కంపెనీల కోసం ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలోని లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంటతండా ప్రజలు తేల్చి చెప్పారు. శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) అధికారులు ఈ మూడు గ్రామాల్లో పర్యటించారు.ఢిల్లీ నుంచి వచ్చిన కమిషన్ డిప్యూటీ రిజిస్ట్రార్ లా ముఖేశ్, ఇన్స్పెక్టర్లు రోహిత్‌సింగ్, యతి ప్రకాశ్‌శర్మ బాధిత కుటుంబాలను కలిసి అభిప్రాయాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు పోలీసులు తమపట్ల అమానుషంగా వ్యవహరించారని గిరిజన మహిళలు గోడు వెళ్లబోసుకొన్నారు. రోటిబండతండాకు చెందిన సోనీబాయి, కిష్టబాయి, జ్యోతి, ప్రమీల, వాల్మీబాయి, జార్పుల రూప్సింగ్ నాయక్, సీత తదితరులను అధికారులు ప్రశ్నించారు. తమను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, చివరికి ప్రాణాలు తీసినా భూములు మాత్రం ఇవ్వబోమని ఈ సందర్భంగా బాధితులు తేల్చి చెప్పారు. కోర్టుల చుట్టూ తిరిగేందుకు తమ వద్ద డబ్బు లేదని చెప్పగా.. ప్రభుత్వ లీగల్ ఎయిడ్ ద్వారా ఉచితంగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ పర్యటనపై అధికారులు నివేదిక సిద్ధంచేసి కమిషన్‌కు అందజేయనున్నారు. ఈ నెల 11న లగచర్ల ఘటన జరగగా.. బాధిత గిరిజనులు 18న ఢిల్లీకి వెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్హెచ్ఆర్సీ అడిగిన ప్రశ్నలివే.. ప్రశ్న: దాడి జరిగిన రాత్రి మీ మీ ఇళ్లలో ఎం జరిగింది? జవాబు: కరెంట్ తీసి పోలీసులు ఇళ్లలోకి దూరి మగవారిని తీసుకెళ్లారు, ఆడవారిని బెదిరించారు. అడ్డుపడితే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశారు. ప్రశ్న: పోలీసులు మిమ్మల్ని కొట్టారా? జవాబు: కొట్టారు, అసభ్యకరంగా తిట్టారు సార్. ప్రశ్న: మీ డిమాండ్స్ ఏమిటి? జవాబు: మా ప్రాంతంలో కంపెనీలు వద్దు. మేము భూములు ఇవ్వం. మా జోలికి రావొద్దు. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేసి మా కుటుంబ సభ్యులను విడిచిపెట్టాలి. కమిషన్ చేసిన సూచనలు.. ఎఫ్ఐఆర్లో పేరున్నవారు లొంగిపోతే 14 రోజులు రిమాండ్‌కు పంపి, బెయిల్ ఇస్తారు. ఎఫ్ఐఆర్లో పేరు లేనివారు ముందస్తు బెయి ల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ వేసుకోవాలి. లేదంటే ప్రస్తుతం జైలులో ఉన్నవారికి కూడా బెయిల్ రాదు. భూములు, కేసుల వ్యవహారాన్ని న్యాయస్థానాలు చూసుకుంటా యి. గ్రామాల్లోని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు మీ జోలికి రారు. నా కొడుకుకు సంబంధం లేదునా కొడుకు బాష్యానాయక్కు దాడితో ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజంతా మేకలు కాసేందుకు వెళ్లాడని ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. అర్ధరాత్రి వచ్చి ఇంటి నుంచి తీసుకెళ్లడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టారు. – సోనీబాయి, బాధితురాలుబతిమాలినా వదిలిపెట్టలేదు నా భర్త ప్రవీణ్ పాల ఆటో నడుపుతాడు. ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు వచ్చి తలుపు తట్టారు. మేము భయపడి తీయకపోవడంతో కాళ్లతో బలంగా తలుపులు తన్నేసి లోపలికి వచ్చారు. ఇంట్లోని బీరువాను పగలగొట్టి చూశారు. నాకు డెలివరీ సమయం ఉందని బతిమాలినా వినకుండా నా భర్తను లాక్కెళ్లారు. పోలీసులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. – జ్యోతి, బాధితురాలు -
మానవ హక్కులను హరిస్తూ.. అక్రమ కేసులతో వేధిస్తూ..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ అధికారిక గూండాగిరి వెర్రితలలు వేస్తోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో రోజురోజుకీ మరింతగా పేట్రేగిపోతోంది. ఉగ్రవాదులపట్ల కూడా వ్యవహరించనంత కాఠిన్యంతో పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ మానవ హక్కులను నిర్భీతిగా కాలరాస్తున్నారు. ఒక్కొక్కరిపై నాలుగైదు అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టుచేస్తున్న పోలీసులు వారు రిమాండ్‌లో ఉండగానే వారికి తెలియకుండానే మరిన్ని కేసులు పెడుతున్నారు. అరెస్టయిన వారిని రాష్ట్రంలోని జైళ్లకు తిప్పుతూ వారి కుటుంబ సభ్యులను కూడా కలవనీయకుండా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ కుట్రలో భాగస్వామిగా మారిన పోలీసు వ్యవస్థ కూడా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ.. పౌర హక్కులను మంటగలుపుతూ పేట్రేగిపోతోంది. ఇక అక్రమ నిర్బంధాలను సవాల్‌చేస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తుంటే పోలీసులు మరింతగా చెలరేగిపోతున్నారు. వారిపై మరిన్ని అక్రమ కేసులు బనాయించి బెంబేలెత్తిస్తుండటం ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. న్యాయ వ్యవస్థ ఆదేశాల స్ఫూర్తిని సైతం ఉల్లంఘిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అరాచకం ఎలా ఉందంటే..ఎడాపెడా అక్రమ కేసులు..చంద్రబాబు ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎడాపెడా అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ఇప్పటివరకు ఏకంగా 178 అక్రమ కేసులు నమోదు చేసినట్లు లెక్కతేలగా.. వాటికి అదనంగా గత రెండ్రోజుల్లోనే మరో 100 వరకు అక్రమ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఓ కేసులో అరెస్టుచేసిన సోషల్ మీడియా యాక్టివిస్టు రిమాండ్‌లో ఉండగానే ఆయనపై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేస్తోంది. ఇలా ఒకొక్కరిపై కనీసం నాలుగైదు అక్రమ కేసులు నమోదు చేస్తోంది. ఓ కేసులో బెయిల్‌పై బయటకు రాగానే మరో కేసులో అరెస్టుచేసి మరో జైలుకు తరలిస్తోంది. దీంతో అసలు ఎవరిపై ఎన్ని కేసులు నమోదు చేశారన్న కనీస సమాచారం కూడా తెలియనివ్వకుండా పోలీసులు బరితెగించి వేధిస్తున్నారు. అరెస్టు చేసినవారి సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్న రాజ్యాంగపరమైన బాధ్యతను కూడా పోలీసులు బేఖాతరు చేస్తున్నారు. దీంతో తమ వారిని అదపులోకి తీసుకుంది పోలీసులో, ప్రైవేటు గూండాలో తెలీక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారి ఆచూకి కోసం పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.హైకోర్టును ఆశ్రయిస్తే మరిన్ని కేసులు..ఇక సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తూ పైశాచికంగా వ్యవహరిస్తుండడంతో వారి ఆచూకి కోసం కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తూ తమ వారి ఆచూకీ చెప్పాలని వేడుకుంటున్నారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం మరింతగా పేట్రేగిపోతోంది. ఎవరి ఆచూకీ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారో వారిని విడుదల చేస్తూనే ఆ వెంటనే వారిపై ఐదారు అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తోంది.ఇంటూరి ఎక్కడో?తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులువైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌ను అక్రమ కేసులో అరెస్టుచేసి చిత్రహింసలకు గురిచేసినా ప్రభుత్వ కక్ష చల్లారలేదు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆయన్ని రాజమహేంద్రవరం జైలుకు తరలించిన పోలీసులు.. ఆ తరువాత కూడా వేధిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. రవికిరణ్‌ను కలిసేందుకు ఆయన సతీమణి విశాఖ నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వచ్చారు. కానీ, ఆయన్ని విశాఖ జైలుకు తరలించినట్లు అక్కడి జైలు అధికారులు చెప్పారు. దాంతో ఆమె విశాఖ జైలుకు వెళ్లారు.కానీ, తన భర్తను కలిసేందుకు ఆమెకు అవకాశమివ్వలేదు. రెండ్రోజులు ప్రయత్నించిన మీదట జైలు అధికారులు అంగీకరించడంతో ఆమె జైలుకు వెళ్లారు. తీరా ఆమె వెళ్లేసరికి రవికిరణ్‌ను విజయనగరం జైలుకు తీసుకుపోయారు. అక్కడికి వెళ్తే అక్కడా లేరని.. శ్రీకాకుళం జైలుకు తరలించారని చెప్పారు. తీరా ఆమె గురువారం శ్రీకాకుళం జైలుకు వెళ్లేసరికి అక్కడ నుంచి పల్నాడు జిల్లా మాచర్లకు తరలించేశారు. ఇక రవికిరణ్‌ను శుక్రవారం మరో జైలుకు తరలిస్తారని తెలుస్తోంది. ఇలా రవికిరణ్‌ను ఆయన కుటుంబీకులు కలవనీయకుండా పోలీసులు చేస్తున్నారు.మహిళ పట్లా అత్యంత కర్కశంగా..సుధారాణిని వేధిస్తున్న ప్రభుత్వంమహిళ అనే కనీస కనికరం కూడా లేకుండా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన సుధారాణిపట్ల కూడా కక్షతో అత్యంత కర్కశంగా వ్యవహరిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వ రాక్షసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఏడేళ్లలోపు జైలుశిక్ష పడే అవకాశమున్న కేసుల్లో రిమాండ్ విధించకుండా వెంటనే బెయిల్ మంజూరు చేయాలి. సుధారాణిపై నమోదైన కేసులన్నీ ఇలాంటివే. కానీ, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే సమయంలో వివిధ సెక్షన్లు జోడిస్తూ పోలీసులు కనికట్టు చేశారు. సుధారాణి, ఆమె భర్త వెంకట్రామిరెడ్డిలను అరెస్టుచేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. సుధారాణి ఇద్దరు పిల్లలు తల్లిని చూడాలని ఏడుస్తుండటంతో ఆమె తండ్రి వారిని తీసుకుని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వచ్చారు. వారు వచ్చేసరికే ఆమెను విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. తీరా విశాఖపట్నం సెంట్రల్ జైలుకు వెళ్లేసరికి అక్కడి నుంచి శ్రీకాకుళం జైలుకు తీసుకుపోయారు. ఆమె తండ్రి తన ఇద్దరు మనవలతో కలిసి ఎంతో వ్యయ ప్రయాసలు పడి గురువారం శ్రీకాకుళం వెళ్లేసరికి ఆమెను గుంటూరు జైలుకు తరలించేశారు. అక్కడి నుంచి ఆమెను ఒంగోలు జైలుకు తీసుకుపోయారు. ఇక సుధారాణి భర్త వెంకట్రామిరెడ్డి ఎక్కడ ఉన్నారన్నది అంతుచిక్కడంలేదు. రాజమహేంద్రవరం టు బి.కొత్తకోట..శ్రీనాథ్‌రెడ్డి పట్ల ప్రభుత్వ వేధింపులుఅల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాకకు చెందిన శ్రీనాథ్ రెడ్డిపట్ల కూడా ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది. ఆయన్నిసోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం ఆయనపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెట్టారు. ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లుగానీ అరెస్టు చేసినట్లుగానీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. శ్రీనాథ్‌రెడ్డిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన ఎక్కడున్నారనే విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లారు. కానీ, ఆయన్ని అప్పటికే శ్రీకాకుళం జైలుకు తరలించేశారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు శ్రీకాకుళం వెళ్లారు. తీరా వారు అక్కడికి వెళ్లేసరికి.. శ్రీనాథ్‌రెడ్డికి శ్రీకాకుళం నుంచి ఏకంగా 900 కి.మీ.దూరంలో ఉన్న అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోటకు తరలించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. -
ఏపీలో YSRCP నాయకులపై కూటమి సర్కారు వేధింపులు
-
కొనసాగుతున్న ఫిర్యాదులు, అరెస్టులు
సాక్షి నెట్వర్క్: సీఎం చంద్రబాబు, మంత్రులు, టీటీడీ చైర్మన్‌పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. రాజమహేంద్రవరం జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను పీటీ వారెంట్‌పై శుక్రవారం అరెస్టు చేసిన ఏలూరు జిల్లా వేలేరుపాడు పోలీసులు శనివారం జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి రిమాండ్ విధించడంతో మళ్లీ రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. బోరుగడ్డ పోలీసుస్టేషన్లో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన పార్టీలవారు స్టేషన్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అనిల్ ఫొటోలను వారు చెప్పులతో కొడుతూ దహనం చేశారు. గుంటూరు జైలులో రిమాండ్‌లో ఉన్న విశాఖపట్నానికి చెందిన బోడి వెంకటేష్‌ను బాపట్ల జిల్లా చీరాల పోలీసులు పీటీవారెంట్‌పై అరెస్టు చేసి చీరాల కోర్టులో హాజరుపరిచారు. న్యాయాదికారి రిమాండ్ విధించడంతో వెంకటేష్‌ను ఒంగోలు జైలుకు తరలించారు. వైఎస్సార్సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఉండి మండలం ఉణుదుర్రు గ్రామానికి చెందిన గొర్రుముచ్చు సుందర్కుమార్ను శనివారం తెల్లవారుజామున ఉండి పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేశ్‌ను హిందూపురం వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి వరకు విచారించిన అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం కృష్ణాజిల్లా అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు అందింది. సినీనటి శ్రీరెడ్డిపై గుంటూరులోని నగరంపాలెం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
ఏపీలో రాజ్యాంగం తుంగలోకి
-
కక్షే లక్ష్యం.. చట్టానికి తూట్లు!
సాక్షి, అమరావతి: రాజ్యాంగ హక్కులు, చట్ట నిబంధనలను కాలరాస్తూ ‘రెడ్‌బుక్’ పాలనతో అణచివేతలకు పాల్పడుతున్న చంద్రబాబు సర్కారు ఉగ్రవాదుల కోసం ఉద్దేశించిన చట్టాలను.. సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నవారు, ప్రజాస్వామ్యవాదులపై ప్రయోగిస్తూ మానవ హక్కులను హననం చేస్తోంది. ఈ ఏడాది జూలై 1కి ముందు జరిగినట్లు చెబుతున్న ఉదంతాల అభియోగాలపై ఐపీసీ సెక్షన్లకు బదులుగా చట్ట విరుద్ధంగా భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), న్యాయ సంహిత(బీఎన్ఎస్) కింద అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతోంది. వ్యవస్థీకృత నేరాల కింద అక్రమ కేసులు మోపుతోంది. జూలై 1వతేదీకి ముందు నాటి ఉదంతాల అభియోగాలపై బీఎన్ఎస్ కింద కేసులు పెట్టకూడదని కోర్టు తీర్పులు స్పష్టంగా చెబుతున్నా లెక్క చేయడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై బీఎన్ఎస్ఎస్ చట్టం 192, 196, 353(2), 336(4), 340(2), 79, 111(2)(బి), 61(2) సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేస్తోంది. వాటిలో సెక్షన్ 111(2)(బి) అనేది వ్యవస్థీకృత నేరాలకు సంబంధించింది. సోషల్ మీడియాలో పోస్టులకు ఆ సెక్షన్ వర్తించదు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదులు, దేశ భద్రతకు విఘాతం కలిగించే అరాచక మూకలపై నమోదు చేసేందుకు ఉద్దేశించిన ఈ సెక్షన్‌ను సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారిపై బనాయిస్తోంది. ఆ పోస్టులతో సంబంధం లేని వైఎస్సార్సీపీ కీలక నేతలను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్రపూరితంగా బీఎన్ఎస్ఎస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భయోత్పాతం సృష్టిస్తూ పౌర హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజల్లో చైతన్యం రగిలిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద చట్టాలను ప్రయోగిస్తూ ఉక్కుపాదం మోపుతోంది. జూలై 1 తరువాత ఉదంతాలకే బీఎన్ఎస్ఎస్ చట్టాలు.. పార్లమెంట్ చట్టాలు, న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా ఈ ఏడాది జూలై 1 నుంచి దేశంలో కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ నాగరిక సురక్షా సంహిత, న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తుండటం సర్కారు కుట్రలకు నిదర్శనం. కేంద్రం కొత్తగా తెచ్చిన బీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయి. అంతకుముందు జరిగిన ఉదంతాలకు సంబంధించి అభియోగాలపై నమోదయ్యే కేసులను మాత్రం ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ల కిందే దర్యాప్తు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆ మేరకు పార్లమెంట్లో చట్టం కూడా చేసింది. చెల్లదన్న రాజస్థాన్ హైకోర్టు..జూలై 1 తరువాత జరిగిన ఉదంతాల అభియోగాలపై నమోదు చేసే కేసులను మాత్రమే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని రాజస్థాన్ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అంతకుముందు జరిగిన ఉదంతాలపై అభియోగాలను ఐపీసీ సెక్షన్ల కిందే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని తేల్చి చెప్పింది. జూలై 1కి ముందు ఓ వ్యక్తి ఫోర్జరీ సంతకాలతో వీలునామాను సృష్టించారంటూ అదే నెల 27న రాజస్థాన్ పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో నిందితులు జోధ్‌పూర్‌లోని రాజస్థాన్ హైకోర్ట్ బెంచ్‌ను ఆశ్రయించగా పోలీసుల తీరుపై న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఈ ఏడాది జూలై 1కి ముందు జరిగిందని చెబుతున్న ఉదంతంపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని తేల్చిచెబుతూ అక్టోబరు 19న స్పష్టమైన తీర్పునిచ్చింది. బరి తెగించి అక్రమ కేసులు..పార్లమెంట్ చట్టాలు, న్యాయస్థానం తీర్పులు ఇంత విస్పష్టంగా చెబుతున్నా చంద్రబాబు సర్కారు నిర్భీతిగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఈ ఏడాది జూలై 1వతేదీకి ముందు సోషల్ మీడియాలో పెట్టారని చెబుతున్న పోస్టులపై ప్రస్తుతం కేసులు నమోదు చేస్తోంది. మూడు నాలుగేళ్ల క్రితం నాటి సోషల్ మీడియా పోస్టులపై కొత్త చట్టం పేరుతో అక్రమ కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. వీటిపై ఐపీసీ సెక్షన్ అంటే ఐటీ చట్టం కింద మాత్రమే కేసు నమోదుకు ఆస్కారం ఉంటుంది. అది కూడా 41 ఏ కింద నోటీసు ఇచ్చి పంపించాలి. అరెస్ట్ చేయకూడదు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు 680 మందికి నోటీసులు ఇవ్వగా 176 మందిపై అక్రమ కేసులు నమోదయ్యాయి. 440 ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడంతోపాటు 55 మందిని అక్రమంగా అరెస్టు చేసి ఎమర్జెన్సీ నాటి నియంతృత్వ విధానాలతో అరాచకం సృష్టిస్తోంది. -
రాజధానిలో దళితులపై ‘సీఆర్డీయే’ దాష్టీకం!
తాడికొండ: కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు.. రాజధానిలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పేదలు, దళిత రైతులను మాత్రమే టార్గెట్‌గా చేసి అక్రమ కేసులు బనాయిస్తున్న సీఆర్డీయే అధికారులు.. టీడీపీకి చెందిన రైతులకు మాత్రం వత్తాసు పలుకుతుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. తాజాగా శాఖమూరు గ్రామానికి చెందిన జొన్నకూటి ప్రశాంత్ అనే దళిత రైతు సీఆర్డీయే అధికారుల ఆదేశాల మేరకు మినుము పైరును రోటోవేటర్‌తో దున్ని అప్పగించిన తరువాత కూడా అక్రమ కేసు నమోదు చేయడం పట్ల పలువురు విస్తుపోతున్నారు. ఇదంతా ఓ ఎత్తయితే టీడీపీకి చెందిన నాయకులు భారీగా సాగు చేసుకుంటూ, కౌలుకు ఇచ్చుకుంటున్న పంట పొలాల వైపు కన్నెత్తి చూడకపోవడం వారి పక్షపాత వైఖరికి అద్దం పడుతున్నది . తుళ్లూరు మండల పరిధిలో పూలింగ్‌కు ఇచ్చి రిటర్న్‌బుల్ ప్లాట్లు పొంది వార్షిక కౌలు తీసుకుంటున్న రైతులు పొలాలను దున్ని సాగు చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఎకరా రూ.30 వేలకు కౌలుకు ఇచ్చుకుంటున్నారు. అయితే ఇలా.. సాగు చేసుకుంటున్న వారిలో కేవలం దళిత రైతులపై సీఆర్డీయే అధికారులు ఉక్కుపాదం మోపుతూ.. మిగిలిన వారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నాయకుల చేతుల్లో వందలాది ఎకరాలు బందీగా మారినప్పటికీ అధికారులు అటువైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. శుక్రవారం వారాంతపు గ్రీవెన్స్‌లో భాగంగా వైఎస్సార్సీపీ నాయకులు కాకర్ల నాగేశ్వరరావు, గద్దర్ చెన్నకేశవ తదితరులు సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్‌ను కలిసి టీడీపీ నాయకుల ఆక్రమణలో ఉన్న పంట పొలాలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన స్పందించలేదని వారు తెలిపారు. పనుల్లేక పస్తులుండలేక ఖాళీగా ఉన్న భూముల్లో పేదలు ఎస్సీ, ఎస్టీ రైతులు పంటలు సాగు చేసుకుంటే కేసులు నమోదు చేసి వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి చెందిన నాయకుల చేతిలో ఉన్న భూములను కూడా దున్నడంతో పాటు కేసులు నమోదు చేయకపోతే తాము న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. -
YSRCP నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై అక్రమ కేసు
-
ప్రభుత్వ పెద్దలను మెప్పించేందుకే..
సాక్షి, అమరావతి : ప్రభుత్వ పెద్దలను సంతోష పెట్టేందుకు రాష్ట్రంలో పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. ఇలా చేయడంలో ప్రభుత్వ విధానమే అణచివేత ధోరణిలా ఉందని, దానినే పోలీసులు అనుసరిస్తున్నారన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఇష్టమొచ్చినట్లు కేసులు నమోదుచేసి అరెస్టుచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పోలీసులు ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్నారని, ఈ విషయంలో పోలీసులపై విచారణకు ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు పోలా విజయ్‌బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. మతం, కులం, లింగం, పుట్టిన ప్రాంతం తదితరాల ఆధారంగా వర్గాల మధ్య శతృత్వం సృష్టిస్తూ సెక్షన్–153ఏ కింద కేసులు పెడుతున్నారన్నారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చెల్లదని.. ఇదే హైకోర్టు గతంలో తీర్పునిచ్చిందన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రజల విమర్శలను తట్టుకోలేక సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారని శ్రీరాం వివరించారు. ప్రజల హక్కులను కాలరాస్తున్నారు..ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. కేసులపై అభ్యంతరం ఉంటే దానిపై న్యాయపోరాటం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించింది. ఆ పనే చేస్తున్నారని, పోలీసుల అక్రమ నిర్బంధాలపై హేబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని శ్రీరాం తెలిపారు. తప్పుడు కేసుల ద్వారా ప్రజల హక్కులను పోలీసులు హరిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రజలు భయపడేలా చేస్తున్నారని వివరించారు. ప్రతీ దశలోనూ పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ దన్నుతోనే పోలీసులు ఇంత అరాచకానికి పాల్పడుతున్నారని ఆయన ధర్మాసనానికి వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించడాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో తప్పుపట్టిందన్నారు. ఈ పిల్ దాఖలు చేసిన తరువాత పోలీసులు నిర్ధిష్టంగా ఒకే తరహా కేసులు పెడుతున్నారని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసుల నమోదు తప్పుకాదు..ధర్మాసనం స్పందిస్తూ.. సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయడం తప్పుకాదని హైకోర్టు అభిప్రాయపడింది. తమపై (న్యాయమూర్తులు) కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని గుర్తుచేసింది. ఇలాంటి వారిపై కేసులు పెట్టకుండా పోలీసులను నియంత్రించలేమని తెలిపింది. సోషల్ మీడియా ఉన్నది ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి, పోస్టులు పెట్టడానికి కాదని వ్యాఖ్యానించింది. అలాంటి పోస్టులు పెట్టే వారిని చట్టం ముందు నిలబెట్టడంలో తప్పేముందని ప్రశ్నించింది. కేసులపై అభ్యంతరం ఉంటే వాటిని కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని సూచించింది. అంతేతప్ప.. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీచేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -
కొనసాగుతున్న అరాచకపర్వం
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి, బుధవారం పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కొందరిని కోర్టుల్లో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైళ్లకు తరలించారు. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు.. ఎక్కడికి తీసుకెళుతున్నారు.. అనే విషయాలను కుటుంబసభ్యులకు కూడా చెప్పడంలేదు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవు పోలీసులు అత్యుత్సాహంగా కేసులు నమోదుచేసి అరెస్టు చేస్తున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని రిమాండ్ నిమిత్తం జైళ్లకు తరలించారు.ఒకరిని అరెస్టుచేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్శకుడు రాంగోపాల్‌వర్మ సహా ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. నటులు పోసాని, శ్రీరెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కాకినాడ జిల్లాలో జగ్గంపేటకు చెందిన కాపారపు వెంకటరమణను అరెస్టు చేసిన సీఐ శ్రీనివాస్‌రావు కాకినాడ కోర్టులో హాజరుపరిచి, అనంతరం రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిలను మంగళవారం ఆమదాలవలస కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం రిమాండ్ నిమిత్తం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సబ్‌జైలుకు తరలించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన పఠాన్ అయూబ్‌ఖాన్, పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన అన్నంగి నరసింహస్వామి, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ముదిగుబ్బకు చెందిన జనికుల రామాంజనేయులుపై కందుకూరులోను, అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కురమయ్యగారి హనుమంతరెడ్డిపై నెల్లూరు జిల్లా సంగం పోలీస్‌స్టేషన్‌లోను కేసులు నమోదు చేశారు. రాయవరం ప్రాంతానికి చెందిన ఖండవిల్లి సునీల్‌కుమార్, కోరుకొండకు చెందిన లగవత్తుల శివసత్యకుమార్, కనిగిరికి చెందిన హరీశ్వర్‌రెడ్డి, కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కాకరపర్తి శ్రీనివాస్‌పై విశాఖపట్నంలో కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆయతపల్లికి చెందిన ప్రసాద్‌రెడ్డిని బుధవారం మఫ్టీలో వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో అరెస్టు చేసిన నకిరేకల్‌కు చెందిన పి.రాజశేఖర్‌రెడ్డిని నూజివీడు తరలించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పశ్చిమగోదావరి జిల్లా కో–కన్వినర్లు పాటూరి దొరబాబు, కమతం మహేష్‌లకు 41ఏ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. శ్రీరెడ్డిపై కేసు నమోదుటీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియా యాక్టివిస్ట్, సినీనటి మల్లిడి శ్రీరెడ్డిపై మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలోని బొమ్మూరు పొలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై అనకాపల్లి పోలీసులకు టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రత్నకుమారి మరో ఫిర్యాదు చేశారు. రాంగోపాల్‌వర్మకు నోటీసులు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్ ఎస్ఐ శివరామయ్య బుధవారం హైదరాబాద్‌లో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మకు నోటీసు అందించారు. ఈనెల 19న మద్దిపాడు స్టేషన్‌కు రావాల్సిందిగా అందులో కోరారు. వ్యూహం చిత్రం నిర్మించే సమయంలో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్, బ్రాహ్మణిని అవమానించేలా పోస్టింగ్‌లు పెట్టారంటూ రెండురోజుల కిందట మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ కేసు నమోదు చేశారు. పోసానిపై ఫిర్యాదులుసినీనటుడు పోసాని కృష్ణమురళీ టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును అసభ్య పదజాలంతో దూషించారని టీడీపీ నేతలు బాపట్ల సీఐ అహ్మద్జానీకి ఫిర్యాదు చేశారు. సీఎం తదితరులపై అసభ్య పోస్టులు పెట్టిన పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేతలు గుంటూరు, నరసరావుపేటల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిరంకుశత్వం... అక్రమ కేసులతో సోషల్ మీడియా యాక్టివిస్టులకు చిత్రహింసలు
-
ఏపీలో ఆగని తప్పుడు కేసులు, వేధింపులు.. అక్రమ అరెస్టులు
అమరావతి, సాక్షి: సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వ వేధింపుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ శ్రేణులను, మద్దతుదారులను మాత్రమే కాదు.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సామాన్యులపైనా ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో అక్కడక్కడ అక్రమ కేసులు.. అరెస్టులు.. నిర్బంధాలు కొనసాగుతున్నాయి. పోలీసు విచారణకు కాకాణిటీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం ఇవాళ వెంకటాచలం పోలీస్ స్టేషన్‌కు రావాలని కాకాణికి కబురుపంపారు. దీంతో.. తన లీగల్ టీంతో కలిసి పీఎస్‌కు కాకాణి వెళ్లారు.కడప కోర్టుకు వర్రా రవీంద్రారెడ్డిసోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వర్రా రవీంద్రారెడ్డిని జిల్లా పోలీసులు అరెస్ట్‌చేసిన సంగతి తెలిసిందే. సీకే దీన్నే పీఎస్‌లో ఉన్న వర్రా రవీంద్రారెడ్డిని.. ఇవాళ కడప కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. కాసేపటి కిందట.. ఇన్చార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పీఎస్‌కు వచ్చారు. పీఎస్ వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. వర్రా రవీంద్రారెడ్డిని మాత్రమే కాదు.. ఆయన కుటుంబ సభ్యుల్ని సైతం పీఎస్‌లో అక్రమంగా నిర్బంధించి.. వైఎస్సార్సీపీ నిరసనలతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వర్రాను కలిసేందుకు కుటుంబ సభ్యులు రాగా, పోలీసులు ఓవరాక్షన్ చేశారు. చివరకు ఆందోళనకు దిగడంతో భార్య కళ్యాణిని మాత్రం అనుమతించారు.ఇంటూరిని వదలని పోలీసులుసోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌కు పోలీసులు వదలడం లేదు. ఏదో ఒక కేసుతో.. వంకతో పీఎస్‌ల చుట్టూ తిప్పుతున్నారు. గత అర్ధరాత్రి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులుమీడియా కంట పడకుండా జాగ్రత్త పడిన పోలీసులుతమకు ఎటువంటి సమాచారం లేకుండా విశాఖ టు టౌన్ నుండి రాజమండ్రి ప్రకాష్ నగర్ స్టేషన్‌కు రవికిరణ్ తరలించారని ఆరోపిస్తున్న భార్యఎటువంటి ఫార్మాలిటీస్ లేకుండానే తరలించడంపై ఆందోళనప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో రవికిరణ్ ను భార్య బంధువులకు చూపించని పోలీసులుఏ కేసు పై రవి కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారో ఎఫ్ఐఆర్ కాపీ కూడా పోలీసులు చూపించడం లేదంమని ఆరోపిస్తున్న రవికిరణ్ భార్య, బంధువులు -
ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపులు
-
అదే దుర్మార్గం..
సాక్షి నెట్వర్క్: ప్రభుత్వ వైఫల్యాలపై, మోసాలపై, ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం మరోమారు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని అడిగినందుకు, ప్రభుత్వం ఇచ్చే సరుకుల్లో తూకం తేడా ఉందన్నందుకు, పింఛన్లు తెచ్చుకోవడానికి వెళ్లిన వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారని చెప్పినందుకు.. తుదకు కార్టూన్‌ను ఫార్వర్డ్ చేసినందుకు.. ఇలా చిన్న చిన్న విషయాలను సాకుగా చూపి తప్పుడు కేసులు పెడుతోంది. చెప్పాపెట్టకుండా ఇళ్లకు వచ్చి పోలీసులు ఎత్తుకెళ్లిపోతున్నారు. పలువురు బాధితులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుండటంతో వారి అరెస్టులు చూపక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఇంటూరి రవికిరణ్‌పై పోలీసులు మరో నింద మోపి తాజాగా ఇంకో కేసు నమోదు చేశారు. పులివెందులలో సజ్జల భార్గవ్‌రెడ్డి, మరో ఇద్దరిపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఆదివారం రోజే 13 కేసులు నమోదు చేశారంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో ఇట్టే తెలుస్తోంది. |ఇంటూరిపై 15కు చేరిన కేసులు మధురవాడ ధర్మపురి కాలనీకి చెందిన ఇంటూరి రవికిరణ్ పొలిటికల్ పంచ్ వెబ్ చానెల్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ట్విట్టర్ (ఎక్స్), ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ పోలీసులు కేసుల పేరుతో మానసికంగా వేధించారు. ఇప్పటికే ఆయనపై దువ్వాడ, గుంటూరు, విజయవాడ, మార్టూర్ పోలీస్స్టేషన్లలో ఒక్కో కేసు.. గుడివాడ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేస్తూ 41ఏ నోటీసులు జారీ చేశారు. రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్‌లోనూ పలు కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఇతనిపై దాదాపు 15 కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న రవికిరణ్‌ను దువ్వాడ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ పేరుతో రాత్రి 9 గంటలకు వరకు వేధించారు. చివరికి 41ఏ నోటీసులు అందించి ఈ నెల 11న మెజి్రస్టేట్ ముందు హాజరు కావాలని ఆదేశించి విడిచిపెట్టారు. ఈలోగా రవికిరణ్‌పై మహారాణిపేట పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు చేశారని తెలుసుకుని మళ్లీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఆదివారం ఉదయం మళ్లీ మహరాణిపేట పోలీసులు విచారణకు తీసుకొచ్చారు. అనంతరం రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలీసులు వచ్చి, రవికిరణ్‌ను తీసుకెళ్లిపోయారు. కుటుంబ సభ్యులెవరికీ సమాచారం ఇవ్వలేదు. పీటీ వారెంట్‌పై మార్టూరుకు వెంకటేష్ గాజువాక మండలం గొల్ల జగ్గరాజుపేటకు చెందిన బోడి వెంకటేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఈ నెల 3న బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 5న బాపట్ల పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే దువ్వాడ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. 6న దువ్వాడ పోలీస్ స్టేషన్లో టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరోసారి వెంకటేష్‌ని తీసుకెళ్లారు. 7న మరోసారి విచారణకు పిలిపించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. వెంకటేష్‌పై 9న మహరాణిపేట స్టేషన్లో మరో కేసు నమోదైంది. బెయిల్‌పై వచ్చిన వెంకటేష్‌ని మరోసారి విచారణ పేరుతో మహరాణిపేట పోలీసులు తీసుకెళ్లారు. స్టేట్మెంట్ రికార్డు చేసి పంపించే సమయానికి బాపట్ల జిల్లా మార్టూరుకి చెందిన పోలీసులు వచ్చి.. పీటీ వారెంట్‌పై ఆదివారం వెంకటేష్‌ను మార్టూరుకు తరలించి కోర్టులో హాజరు పరిచారు. వెంకటేష్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అన్ని చోట్లా అదే తీరు » సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని చెబుతూ పులివెందుల పట్టణ, అర్బన్ పోలీస్ స్టేషన్లలో వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డిలపై కేసు నమోదైంది. మరికొంత మందిపై కూడా కేసులు పెడుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సీఐ జీవన్ గంగనాథ్ బాబును వివరణ కోరగా.. ఇది ఎస్సీ, ఎస్టీ కేసు అని, ప్రస్తుతానికి ముగ్గురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. » ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెసల శివారెడ్డిపై ఈ నెల 8వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నెల 13వ తేదీ విచారణ నిమిత్తం స్టేషన్‌కు రావాల్సిందిగా ఆదివారం కంకిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీన కూడా ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. » గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ మేకా వెంకటరామిరెడ్డి సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారనే నెపంతో నెల్లూరు 35వ డివిజన్ జనసేన పార్టీ ఇన్చార్జి అశోక్ ఆదివారందర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. » కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇటీవల కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో చిందులు తొక్కడంపై ట్విట్టర్, ఇన్‌స్టాలో పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. » తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మొండోరాకు చెందిన బద్దం అశోక్‌రెడ్డి ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంగళగిరి టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి కోర్టులో హజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించారు. ఎక్కడెక్కడి నుంచో ఫిర్యాదులు » అద్దంకిలో కల్లం హరికృష్ణ రెడ్డి, హరీశ్వర్రెడ్డిలు సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టారని టీడీపీ కార్యకర్త యర్రాకుల రామాంజనేయులు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు డి.చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. » మేదరమెట్లకు చెందిన టీడీపీ కార్యకర్త గోలి అజయ్ ఫిర్యాదు మేరకు కడపకు చెందిన కె.హనుమంతారెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. » సంతమాగులూరు మండలం మిన్నేకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వసంత వేణు ఫిర్యాదుపై గురజాలకు చెందిన పి.వెంకటరామిరెడ్డిపై కేసు నమోదైంది. » ఎన్.బాలాజీరెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వాన్ని తప్పు పడుతూ పోస్టులు పెట్టాడని రేపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు బొర్రా సూర్యరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. చెరుకుపల్లిలో తిరుమల కృష్ణ అనే వ్యక్తిపై కూడా రాం»ొట్లవారిపాలెం గ్రామానికి చెందిన అలుమోలు దుర్గారెడ్డి ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం కార్టూన్ ఫార్వర్డ్ చేశారని..వన్‌కళ్యాణ్, చంద్రబాబులపై వచ్చిన పోస్టింగ్‌ని తన వాట్సా‹ప్ నుంచి ఇతరుల ఫోన్లకు పంపించాడనే నెపంతో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఘంటా మురళీకృష్ణపై తాడేపల్లిగూడేనికి చెందిన జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి ఈ నెల 6వ తేదీన స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై భీమవరం పోలీసులు ఈ నెల 6వ తేదీన మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి తాడేపల్లిగూడెం పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు.తీరా ఈ నెల 10వ తేదీ ఆదివారం అయినప్పటికీ తాడేపల్లిగూడెంలోని న్యాయమూర్తి ఇంటి వద్ద మురళీకృష్ణను హాజరు పరిచగా రిమాండ్ విధించారు. ‘రెండేళ్ల క్రితం నా ఫోన్ వాట్సాప్‌కు పవన్‌కళ్యాణ్, చంద్రబాబుపై ఒక వ్యంగ్య కార్టూన్ వచ్చి0ది. అప్పట్లో దానిని నేను ఫార్వార్డ్ చేశాను. ఆ సమయంలో భీమవరానికి చెందిన జనసేన కార్యకర్త పలికెల కిరణ్‌కుమార్ స్క్రీన్ షాట్ తీసి దాచిపెట్టి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిర్యాదు చేశాడు. దీంట్లో నిజానిజాలు విచారించకుండానే నాపై తప్పుడు కేసు పెట్టారు’ అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
Gun Shot: బాబు బలుపా?.. పవన్ పొగరా?
-
అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. అరాచకానికి పరాకాష్ట
‘‘మేము ఎలా పాలన సాగించినా ఎవరూ నోరెత్తకూడదు.. ఇది మా ప్రభుత్వం.. అంతా మా ఇష్టం.. తప్పు పట్టడానికి మీరెవరు? కాదు కూడదని మా నిర్ణయాలను ప్రశ్నిస్తే నాలుగు తగిలించడంతో పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్లపై కేసులు పెట్టి బొక్కలో వేస్తాం. ఏం చేస్తారో చేసుకోండి. సుప్రీంకోర్టు, హైకోర్టుల సంగతి మా లాయర్లు చూసుకుంటారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లను కూడా వదిలి పెట్టం. మేం చెప్పినట్లు ఎన్ని తప్పుడు కేసులైనా పెట్టడానికి పోలీసులున్నారు. ఆ విధంగా వాళ్లను ట్యూన్ చేసుకున్నాం. ఎవరైనా తోక జాడించి మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చేస్తామో.. ఎలాంటి కేసులు పెడతామో మాకే తెలియదు’’ అన్నట్లు కూటమి సర్కారు గుడ్లురు ముతోంది. నియంతృత్వమే తమ చట్టం అని, రెడ్‌బుక్ తమ రాజ్యాంగమని స్పష్టం చేస్తోంది. తాలిబన్లు సైతం విస్తుపోయేలా వికటాట్టహాసం చేస్తూ, సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేస్తూ రాజ్యమేలుతోంది. పక్కన పేర్కొన్న దయనీయ సంఘటనే ఇందుకు ఓ ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉండటం ప్రజాస్వామ్య వాదులను విస్మయ పరుస్తోంది.సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వారిపైకి పోలీసులను ఉసిగొలుపుతోంది. రాజ్యాంగ ధర్మాన్ని మంటగలుపుతూ పౌర హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు చట్టం, రాజ్యాంగం అనే వాటికి తిలోదకాలు వదిలారు. అధికార పారీ్టల నేతలు చెప్పిన వారందరిపై ఉన్నవీ లేనివీ కల్పించి ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరు పరచాలన్న చట్టాన్ని నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. మహిళలు, వృద్ధులు, మైనర్లు అని కూడా చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు అర్ధరాత్రి, అపరాత్రి అని కూడా చూడకుండా ఊళ్లపై పడి బీభత్సం సృష్టిస్తున్నారు. నిద్రిస్తున్న వారిని అపహరించుకుపోతున్నారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పరు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి అడిగితే మాకేం తెలీదనే సమాధానం వస్తుంది. పోలీసు వాహనాల్లో కుక్కి.. కొడుతూ ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగితే లాఠీలే సమాధానమిస్తున్నాయి. మేం చేసిన తప్పేమిటని ప్రశ్నిస్తే పోలీసుల బూట్లే మాట్లాడుతున్నాయి. ఒక్కొక్కరిపై రెండు మూడు అక్రమ కేసులు నమోదు చేస్తూ ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు తిప్పుతున్నారు. మూడు నాలుగు రోజుల్లోనే ఏకంగా 110కి పైగా అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. ఇవన్నీ బాధితుల తరఫున లాయర్లు, గ్రామ పెద్దలు నిలదీస్తేనే అధికారికంగా ప్రకటించినవి కావడం గమనార్హం. అరెస్టు చూపకుండా వేధిస్తున్న కేసులు వేలల్లో ఉన్నాయనడం అక్షర సత్యం. ఒక్కో కేసులో ఒకరు మొదలు 10–20 మందిని సైతం నిందితులుగా చేరుస్తూ వేధిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా అరెస్ట్ చేయకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తున్నారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న ఆదేశాలు తమకు పట్టవన్నట్టు చెలరేగిపోతున్నారు. బాధిత కుటుంబాలు హెబియస్ కార్పస్ పిటీషన్లతో హైకోర్టును ఆశ్రయించినా సరే తమ నియంతృత్వాన్ని నిర్భీతిగా సమర్ధించుకోవడం దుర్మార్గం. ఇదీ చంద్రబాబు మార్కు పోలీసు రాజ్యం. మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగం! సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల పోలీసులు మహిళ అని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా వ్యవహరించడం దారుణం. మూడు రోజుల పాటు ఆమెను, ఆమె భర్తను చిత్రహింసలకు గురిచేశారు. ‘నన్ను ఈ నెల 5వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. నా భర్త వెంకటరెడ్డినీ చిత్రహింసలకు గురిచేశారు. చిలకలూరిపేట సీఐ రమేష్ దుర్భాషలాడారు. నోరెత్తితే ఇష్టానుసారం కొట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వద్ద జొన్నవాడలోని రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్లినప్పుడు మమ్మల్ని పల్నాడు జిల్లా చిలకలూరిపేట సీఐ రమేష్ బృందం అదుపులోకి తీసుకుంది. చిలకలూరిపేట, ఒంగోలుకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు’ అని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. తుదకు ఆమె తరఫు వారు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో శుక్రవారం సాయంత్రం కొత్త పేట పోలీసులు గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదే విషయాన్ని ఆమె మెజిస్ట్రేట్ ఎదుటే చెప్పారు. పోలీసులు కొట్టడంతో అయిన గాయాలను సైతం చూపించారు. ఈమెపై ఏకంగా 6 అక్రమ కేసులు బనాయించారు. నా భర్తను చంపేస్తారేమో.. ‘సోషల్ మీడియా యాక్టివిస్టు అయిన నా భర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు చంపేస్తారేమోనని భయంగా ఉంది. రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంత వరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడం లేదు. ఐ టీడీపీ, విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి పినపాల ఉదయ భూషణ్, చంద్ర కిరణ్‌లు మా ఆయన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విచారణలో కూడా ఈ విషయం తేలింది. అయినా ఇప్పుడు దీనిపై కుట్ర చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఆయనేదో అంతర్జాతీయ టెర్రరిస్ట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని రవీందర్‌రెడ్డి భార్య కళ్యాణి శనివారం మీడియా ఎదుట కన్నీటి పర్యంతమవడం ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్టగా నిలుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మహిళలను వేధించినట్లా? కూటమి ప్రభుత్వ పెద్దలు నివసిస్తున్న విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో అరాచకాలు, దుర్మార్గాలకు అంతే లేకుండా పోయింది. ఓ పోస్టును సాకుగా చేసుకుని కూటమి నాయకుడొకరు తన పార్టీ కార్యకర్తలతో ఈ నెల 2వ తేదీన పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులిప్పించాడు. అదే రోజు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలోనూ 42 కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాలలో 172 మందికి నోటీసులిచ్చారు. శుక్రవారం నాటికి మొత్తంగా 260 మందికి నోటీసులు ఇచ్చారు. కూటమి సర్కారు వైఫల్యాలు, అక్రమాలపై ప్రశ్నిస్తే.. అమ్మాయిలపై తప్పుడు పోస్టు పెట్టారని అభాండాలు వేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ‘నేను ఇటీవల ఓ వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన పోస్ట్‌ను చూశాను. ఈ మాత్రం దానికే నాకు సైబర్ పోలీసుల నుంచి నోటీసు వచ్చింది. స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలన్నారు’ అని గుంటూరుకు చెందిన ఆకుల మురళి అనే వ్యక్తి విస్మయం వ్యక్తం చేశారు. ఇది నేరమట!శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఈనెల 1వ తేదీన బైనపల్లి దానమ్మ అనే వృద్ధురాలు పింఛన్ కోసం గంటలతరబడి వేచి ఉంటూ సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు వెంటనే ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఇదే విషయాన్ని అదే మండలం కొండపల్లి గ్రామ ఉప సర్పంచ్ మడ్డు జస్వంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇతని పాలిట ఇదే పాపమైపోయింది. పాలక పార్టీ పెద్దల ఆదేశాలతో పోలీసులు అక్రమంగా కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా ఆయన్ను భయపెట్టాలని కూడా ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆయన ఇంట్లో లేడు. గంటల కొద్దీ అక్కడే ఉండి ఆయన కుటుంబ సభ్యులను మానసికంగా వేధించారు. ఆ తర్వాత ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే జస్వంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ రోజు కార్తీక పూజ నిర్వహిస్తున్నామని, భోజనం చేసి వస్తానన్నా కూడా వదల్లేదు. ఫోన్‌ను కూడా లాగేసుకున్నారు. ఏం కేసు పెట్టారని అడిగినా అప్పుడు చెప్పలేదు. తర్వాత లాయర్ సాయంతో బయటకు వచ్చాడు. అయినా ఇప్పటికీ ఎప్పుడుపడితే అప్పుడు స్టేషన్‌కు రావాలంటూ ఫోన్లు చేసి పిలిపిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. 192 బీఎన్ఎస్ సెక్షన్‌తో ఎఫ్ఐఆర్ (150/24) నమోదు చేశారు. శాంతిభద్రతలు నిల్.. వేధింపులు ఫుల్! వరుస హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. వీటిని అరికట్టాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. టీడీపీ గూండాలు కర్రలు, కత్తులతో గ్రామాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 177 మంది హత్యకు గురయ్యారు. 500కుపైగా హత్యాయత్నాలు జరిగాయి. 2 వేలకుపైగా దాడులతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ గూండాల దాడులతో భీతిల్లి దాదాపు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నాయి. అత్యాచార పర్వానికి అంతు లేకుండా పోయింది. ఇళ్లల్లో ఉండే చిన్నారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్ధినులు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 110 మందిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. అయినా శాంతిభద్రతలతో తమకు సంబంధం లేదన్నట్లు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలిక కిడ్నాప్‌కు గురికాగానే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి బతికుండేది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడితే ఏ మేరకు శిక్ష వేశారో పాలకులే చెప్పాలి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. ఇలాంటి వారందరిపై ఏ చర్యలూ లేవు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్‌లలో రహస్య కెమెరాలు పెట్టిన వారిపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగినా ఇక్కడ మాత్రం ఏ చర్యలూ లేవు. అన్నా.. వాడిక ఆర్నెల్లు నడవలేడు⇒ సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశ పాలన సాగిస్తోంది. ఇందులో భాగంగా అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు వారి ఆచూకీ తెలియనీయకుండా, కోర్టులోనూ హాజరు పరచకుండా ఊళ్లు.. ఊళ్లు తిప్పుతూ.. వారిని ఏ విధంగా వేధిస్తున్నారో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతలకు చెబుతుండటం గమనార్హం. ‘అన్నా.. మీరు చెప్పినట్లే వాడిని కుమ్మేశాను. ఏడాది.. కనీసం ఆర్నెల్లు వాడు నడవలేడు. ఆ తర్వాత కూడా వాడు కుంటుకుంటూ నడవాల్సిందే’ అని ఇటీవల ఓ ఎస్ఐ అధికార పార్టీ నేతకు చెప్పడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ⇒ అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన సంజీవరెడ్డిని ఈ నెల 6వ తేదీ రాత్రి పుట్టపర్తి అర్బన్ సీఐ సునీత సిబ్బందితో వచ్చి ఇంటి నుంచి బలంవంతంగా లాక్కెళ్లింది. అప్పటి నుంచి సంజీవరెడ్డి ఆచూకీ తెలియడం లేదు. ⇒ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారనే కారణంతో విశాఖ జిల్లా గాజువాకకు చెందిన వెంకటేష్, ప్రకాశం జిల్లాకు చెందిన పవన్‌పై కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా తమకు ఊడిగం చేసే పోలీసులు ఎక్కడ ఉంటే అక్కడ అక్రమ కేసులు ఇష్టారాజ్యంగా నమోదు అవుతున్నాయి. ఇంకా వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు కసరత్తు సాగిస్తున్నారు.⇒ వాస్తవాలు ఇలా ఉంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఏబీఎన్ వంటి ఎల్లో మీడియా ఈ అరాచకానికి కొమ్ము కాస్తుండటం దారుణం. నిబద్ధత కలిగిన ఇతర మీడియా సంస్థలు ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఎలుగెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బరితెగించి సాగిస్తున్న ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బాధితుల తరఫున న్యాయ పోరాటానికి దిగింది. చంద్రబాబు ప్రభుత్వ రాక్షసత్వాన్ని నిలదీస్తోంది. -
సుధారాణి దంపతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగం
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల మహిళ అని కూడా చూడకుండా పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని, రోజులతరబడి ఆమెపైన, ఆమె భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా, మానసికంగా వేధించారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, పోలూరి వెంకటరెడ్డి, వినయ్ కుమార్ చెప్పారు.\వారు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదు రోజుల కిందట తెలంగాణలో గుడికి వెళ్లిన సుధారాణిని ఆమె భర్త, పిల్లలతో సహా పోలీసులు అదుపులోకి తీసుకొని చిలకలూరిపేటకు తీసుకొచ్చారని తెలిపారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలి పెట్టాల్సింది పోయి వారి నిర్బంధంలోనే ఉంచుకొని, చిత్ర హింసలకు గురి చేశారని చెప్పారు. ఆమెపై 6 అక్రమ కేసులు బనాయించారన్నారు. ఏ సంబంధం లేని ఆమె భర్తపైన కూడా కేసులు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. తాము హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో 8వ తేదీ సాయంత్రం గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి, అక్కడి నుంచి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని చెప్పారు.మేజిస్ట్రేట్‌కు గాయాలు చూపించిన సుధారాణిపోలీసులు శారీరకంగా వేధించి, గాయపర్చారని సుధారాణి మేజిస్ట్రేట్‌కు ఓపెన్ కోర్టులో చెప్పారని, ఆ గాయాలను కూడా చూపించారని ఆమె తరఫు న్యాయవాది వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి చెప్పారు. తనను, భర్త వెంకటరెడ్డిని, పిల్లలను చిలకలూరిపేటకు తీసుకెళ్లారని, పిల్లలను వేరు చేసి భర్తతో పాటు తనను ఒంగోలు వన్‌టౌన్ పీఎస్‌కు తరలించినట్టు ఆమె మేజిస్ట్రేట్‌కు చెప్పారన్నారు. ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ నమోదు చేసినట్లు చెప్పారు. ఒంగోలు ఎస్పీ, ఒంగోలు సీఐ చేతులు, కాళ్లపై తీవ్రంగా కొట్టారని సుధారాణి చెప్పడంతో చికిత్స, మెడికల్ రికార్డుల కోసం ఆమెను గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారన్నారు.శరీరంపై గాయాలున్నట్టు వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో సుధారాణిని పోలీసులు హింసించినట్టు తేలిందని తెలిపారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే రాజకీయ ప్రలోభాలకు తలొగ్గి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడి, సభ్య సమాజం సిగ్గు పడేలా వ్యవహరించడం దారుణమని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పోలీసులపై ఏ బుక్స్ రాసుకోవాలో తమకు తెలుసని, వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులపై ప్రైవేటు కేసులు వేసి న్యాయస్థానాల్లో నిలబెడతామని హెచ్చరించారు. -
ఆ తప్పులన్నీ బయటకొస్తాయి: వైఎస్సార్సీపీ లీగల్ సెల్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు, అరెస్టులకు సంబంధించి దాఖలు చేసిన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి వెల్లడించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల సీసీ ఫుటేజ్‌ను (ఈనెల 4నుంచి 8వ తేదీ వరకు) స్థానిక మెజిస్ట్రేట్‌కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని ఆయన తెలిపారు. దీని వల్ల పోలీసుల తప్పులన్నీ బయటకు వస్తాయని చెప్పారు.తమను ప్రశ్నించే గొంతు ఉండకూడదన్న లక్ష్యంతో, ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ, వైఎస్సార్సీపీ సోషల్‌మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేయిస్తోందని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం గుడ్డిగా కేసులు నమోదు చేయిస్తోందన్న ఆయన.. ఉదాహరణగా ఒక కేస్‌ను ప్రస్తావించారు. తుళ్లూరు మండలం బోరుపాలెనికి చెందిన శ్రీనుపై కేసు పెట్టిన పోలీసులు విచారణకు పిలిచారని, కానీ అతను ఏడాదిన్నర క్రితమే చనిపోయారని చెప్పారు.సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ అని కనిపిస్తే చాలు కేసులు పెడుతున్నారని, విచారణకు హాజరు కావాలంటూ గుడ్డిగా నోటీసులు ఇస్తున్నారని, అలా మరో 15 వేల మందిని బజారుకీడ్చి వారి కుటుంబాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని మనోహర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులన్నింటికీ ఎప్పటికైనా డీజీపీనే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.తమ హెబియస్ కార్పస్ పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసిందన్న వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడు, ఆరోజు పోలీసులు చేసిన అన్ని తప్పులు బయటికి వస్తాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం డీజీపీపై ఒత్తిడి తీసుకొచ్చి ఇదంతా పోలీసుల ద్వారా చేస్తోంది కాబట్టి, అవసరమైతే డీజీపీని సుప్రీంకోర్టుకు లాగుతామని హెచ్చరించారు. పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు తాము పూర్తి అండగా ఉంటామని, కాపాడుకుంటామని మనోహర్‌రెడ్డి వివరించారు. -
సోషల్ మీడియా సైనికులను కేసులతో భయపెట్టలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులపై పోలీస్ కమిషనరేట్‌లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్.. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు.. డీసీపీకి వినతిపత్రం అందించారు.కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది: దేవినేని అవినాష్ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసుల తీరు సరిగాలేదు. నందిగామ నియోజకవర్గం పెండ్యాలలో 150 మందికి నోటీసులిచ్చారు. అక్రమ కేసులు బనాయించి కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా కార్యకర్తలకు మేం అండగా ఉంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేం తోడుగా ఉంటాం.తక్షణమే అక్రమ కేసులు, దాడులు ఆపాలి: వెల్లంపల్లి శ్రీనివాస్ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా కార్యకర్తల పై అక్రమంగా కేసులు పెట్టారు. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టినా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నోటీసులిచ్చి.. అరెస్టులు చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుక ఉండకూడదని అక్రమంగా కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. తప్పుడు కేసులను ప్రోత్సహించొద్దని పోలీసులను కోరుతున్నాం. కేసుల పేరుతో పూటకో స్టేషన్ మార్చి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకను అణచివేస్తే తిరగబడే రోజు కచ్చితంగా వస్తుందిఅన్యాయంపై ప్రశ్నిస్తే తప్పా: మల్లాది విష్ణుప్రతిపక్షం గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ అనేక అబద్ధపు ప్రచారాలు చేసింది. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి విజయవాడలో కేసులు పెడుతున్నారు. 90 మంది మహిళలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే తప్పా. ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరడం తప్పా. కూటమి ప్రభుత్వం తీరు మారకపోతే ఛలో అసెంబ్లీ చేపడతాం. హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్: దొడ్డా అంజిరెడ్డికూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. తిరువూరులో ఇద్దరు విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టారు. దివ్యాంగులను కూడా వదలడం లేదు. సోషల్ మీడియా సైనికులను కేసులతో భయపెట్టలేరు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ పూర్తిగా అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం తప్పిదాలను ఎండగడతాం -
తప్పుడు కేసులు బనాయిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయండి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్ వేధింపులపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని.. ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తే లీగల్ టీమ్‌కు దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఎలాంటి అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని.. 9440284455, 9963425526, 9912205535 ఈ నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. మీ తరపున పోరాటం చేయడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని కార్యకర్తలకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు.‘‘రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌ను సైతం లెక్కచేయడం లేదు. 41ఏ కింద నోటీసులిచ్చి విచారణ చేయాలని గైడ్ లైన్స్ఉన్నాయి. నోటీసులు ఇవ్వకుండానే అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి చిత్ర హింసలు పెడుతున్నారు. అరెస్ట్ చేసి రెండు, మూడు స్టేషన్లకు తిప్పుతున్నారు.’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: తప్పు చేసిన పోలీసులను సప్తసముద్రాల అవతల ఉన్నా వదలం: వైఎస్ జగన్ వార్నింగ్‘‘టీడీపీ అధికారిక వెబ్సైట్లో అన్నీ ఫేక్ పోస్టులే. అమ్మను చంపడానికి ప్రయత్నించానని పోస్టులు పెట్టారు. అది అబద్ధమని విజయమ్మ లేఖ విడుదల చేశారు. విజయమ్మ లెటర్ కూడా ఫేక్ అని మరో పోస్టు పెట్టారు. మాపై ఫేక్ పోస్టులు పెట్టినవారిపై చర్యలేవి?. పోలీసులు సెల్యూట్ కొట్టాల్సింది..మూడు సింహాలకు.. పోలీసులకు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. చంద్రబాబు ఆదేశాలతో అకృత్యాలు చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ నిలదీశారు.ఇదీ చదవండి: అలాగైతే రాధాకృష్ణ, లోకేష్‌లను జైల్లో పెట్టాలి: వైఎస్ జగన్ -
ప్రశ్నిస్తే నేరమా?.. తప్పుడు కేసులపై న్యాయ పోరాటం: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని.. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుధారాణి అనే మహిళను నాలుగు రోజుల క్రితం పోలీసులు తీసుకొచ్చారని.. ఇప్పటికీ కోర్టులో హాజరు పరచలేదని ధ్వజమెత్తారు.దీనిపై మేము హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. పిటిషన్ వేసినందుకు ఆమెపై మరో నాలుగు తప్పుడు కేసులు పెడతామని ఆమెని బెదిరిస్తున్నారు. రాయచోటికి చెందిన హన్మంతరెడ్డిని కూడా అలాగే తీసుకెళ్లారు. మేము పిటిషన్ వేశాక అతన్ని మదనపల్లెలో ఉంచామని పోలీసులు చెబుతున్నారు. వర్రా రవీంద్ర రెడ్డి విషయంలో ఏకంగా ఎస్పీనే బదిలీ చేశారు. ఎస్పీల స్థానంలో నాన్ కేడర్ ఎస్పీలను వేస్తామని ఐపీఎస్‌లను కూడా బెదిరిస్తున్నారు. ‘కేసులు నమోదు చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్లను బాధితులకు ఇవ్వటం లేదు ఇలా చేయటం ద్వారా ఏం చెప్పదలచుకున్నారు?’’ అంటూ మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ, ప్రశ్నిస్తే కేసులు పెట్టటం సరికాదని.. కాలం ఒకేలాగ ఎప్పుడూ ఉండదన్నారు. ప్రభుత్వం చేస్తోన్న తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టటం ఏంటి?. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కల్పిస్తున్నారు. మా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం. వారికి అన్నివిధాలా అండగా నిలబడుతున్నాం. పోలీసులు చేయ్యి చేసుకుంటే ఆ వివరాలు ఇవ్వాలని మా కార్యకర్తలను కోరుతున్నాం. సదరు పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తున్నాం. టీడీపీ అధికార ట్విట్టర్లోనే మాపై దారుణంగా పోస్టులు పెడితే డీజీపీ ఏం చేస్తున్నారు?ఇదీ చదివండి: వేధించకుంటే వేటే!..వైఎస్ జగన్‌ని దారుణంగా దూషిస్తుంటే డీజీపికి కనపడటం లేదా?. మరోసారి ఆ వివరాలన్నీ మేము డీజీపికి ఇవ్వబోతున్నాం. దీనిపై ఆయన కచ్చితంగా కేసులు పెట్టించాలి. లేకపోతే సదరు పోలీసులపై కూడా ప్రైవేట్ కేసులు వేస్తాం’’ అని టీజేఆర్ హెచ్చరించారు. -
ఏపీలో కొనసాగుతున్న ప్రభుత్వ గూండాగిరీ
-
అరాచక పాలనలో అణచివేత.. ప్రశ్నించే గొంతునొక్కే కుట్ర..
-
ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపితే భయంతో కేసులు పెడుతున్నారు
-
కేసులు పెడుతున్నారు.. ఆధారాలు అడిగితే నోరెళ్లబెడుతున్నారు..
-
‘ఎన్ని కేసులు పెట్టినా భయపడం.. ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం’
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతున్నాయి. పెండ్యాల గ్రామంలో వాట్సప్ గ్రూపులోని 170 మందికి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూపులో చర్చించుకుంటున్నారంటూ కేసులు నమోదు చేస్తున్నారు. పీఎస్‌కి పిలిపించి కంచికచర్ల పోలీసులు రోజూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులకు లీగల్ సెల్ అండగా నిలిచింది.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షకట్టి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏ కార్యకర్త మీద అక్రమంగా నిర్బంధించినా పార్టీ కేంద్ర కార్యాలయం వెంటనే స్పందిస్తుందన్నారు. బాధితులు పార్టీ దృష్టికి తీసుకు రావటానికి టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని.. అక్రమ కేసులు వేసిన పోలీసులపై తీవ్ర చర్యలు తీసుకునేలా పార్టీ చూసుకుంటుందన్నారు.పూర్తి న్యాయ సహకారం పార్టీనే అందిస్తుందని.. జైహింద్ అన్న వైఎస్సార్సీపీ కార్యకర్తని నందిగామలో ఎమ్మెల్యే ఇంటికి తీసుకు వెళ్ళి మోకాళ్ల మీద కూర్చో పెట్టారని.. ఇదేనా ప్రజాస్వామ్యం?. చట్టవ్యతిరేకంగా పనిచేసిన ఏ పోలీసునూ వదిలేది లేదు. ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం’’ అని పొన్నవోలు తెలిపారు.అరాచకాలను ప్రశ్నిస్తే.. అక్రమ కేసులా: అంబటి రాంబాబుగుంటూరు: వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షుడు వనమా వజ్రబాబు.. నగరంపాలెం, అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు పోలీసులు అరెస్ట్ చేసిన ఇంటూరి రవి కిరణ్, మేకా వెంకటరామిరెడ్డిని పరామర్శించారు.అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వంలో పోస్టులు పెట్టారని ఇప్పుడు రవికిరణ్‌ని, వెంకటరామిరెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. సోషల్ మీడియా కేసుల్లో 41 నోటీస్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై కూడా టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులపై లోకేష్ పవన్ కల్యాణ్ పోలీసులపైన ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టిస్తున్నారని.. ఎన్ని కేసులు పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు భయపడరన్నారు. పథకాలు ఎందుకు అమలు చేయలేదని సోషల్ మీడియాలో అడిగినా కూడా కేసులు పెడుతున్నారని అంబటి మండిపడ్డారు.మా మహిళా నాయకురాలు విడదల రజినిపై దారుణంగా అసభ్యకరంగా టీడీపీ నాయకులు పోస్టులు పెట్టారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోస్టులు పెడితే పోలీసులు ఆనందమా?. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తే ఇబ్బంది పడతారు. డీజీపీ పొలిటికల్ విమర్శలు మానుకోవాలి. డీజీపీకి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేసినా న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు లేదు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు
-
ముఖ్య నేత కుట్రతోనే పోలీసుల దమనకాండ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ముఖ్య నేత ఆదేశాలతోనే రాష్ట్రంలో భావ ప్రకటనా స్వేచ్ఛపై పోలీసులు దమనకాండ సాగిస్తున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా గొంతును అణచివేసేందుకు ప్రభుత్వ పెద్దల పక్కా పన్నాగాన్ని పోలీసులు నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్‌ల పర్యవేక్షణలో.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించాల్సిందేనని ప్రభుత్వ ముఖ్య నేత పోలీసులకు విస్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నెలల్లోనే తమ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తుతుండటాన్ని ఆయన గుర్తించారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతుండటంతో ముఖ్య నేత బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా శాంతిభద్రతలు పూర్తిగా దిగజారడం.. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం చేతులెత్తేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. దాంతో సోషల్ మీడియా కార్యకర్తలను అణచివేస్తే ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవచ్చని ఆయన భావించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఉంటూ రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని శాసిస్తున్న ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులకు ఆ బాధ్యత అప్పగించారు. ఆ వెంటనే టీడీపీ వీర విధేయులైన ఆ ముగ్గురు రిటైర్డ్ అధికారులు రంగంలోకి దిగారు. ఏకంగా డీజీపీ, సీఐడీ చీఫ్, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ఆ ముగ్గురే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యాలయం నుంచి పంపిన జాబితా ప్రకారం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించాలని స్పష్టం చేశారు. లేకపోతే వారి పోస్టులు ఊడతాయని కూడా హెచ్చరించినట్టు సమాచారం.పోలీస్ యంత్రాంగం జీహుజూర్ ప్రభుత్వ ముఖ్య నేత ఆదేశాలతో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు చెలరేగిపోతున్నారు. టీడీపీ కార్యాలయం పంపిన జాబితా ప్రకారం కార్యాచరణకు దిగారు. కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా వందకుపైగా అక్రమ కేసులు బనాయించడం ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేసులు పెట్టవద్దని.. 41 ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల ఇళ్లపై పడి వారిని బలవంతంగా తీసుకుపోతున్నారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారన్న సమాచారాన్ని సైతం కార్యకర్తల కుటుంబ సభ్యులకు చెప్పడం లేదు. వచ్చి0ది పోలీసులో.. టీడీపీ గూండాలో తెలియక కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల కళ్లకు గంతలు కట్టి పోలీసు వాహనాల్లో ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా హింసిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్ని0చవద్దని హెచ్చరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు న్యాయవాదులతో వెళ్లి ప్రశి్నస్తున్నా పోలీసులు సరైన సమాధానం చెప్పడం లేదు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చేస్తే తప్పనిసరై కొందర్ని విడిచిపెడుతున్నా.. మర్నాడు మళ్లీ రావాలని చెబుతున్నారు. తాము తీవ్రంగా కొట్టిన విషయాన్ని ఎవకైనా చెబితే మరోసారి అంతకుమించిన చిత్రహింసలకు గురి చేస్తామని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా అరాచకాన్ని సృష్టిస్తోంది. ఖాకీ క్రౌర్యంతో లాఠీ రాజ్యం సాగుతోంది. యథేచ్ఛగా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోంది. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ కూటమి ప్రభుత్వ పాల్పడుతున్న హక్కుల ఉల్లంఘనపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి సిద్ధపడుతోంది. కొనసాగుతున్న అక్రమ అరెస్టులుమార్కాపురం/అగనంపూడి (గాజువాక)/తాడికొండ/లక్ష్మీపురం (గుంటూరు ఈస్ట్) : వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, అడ్డగోలుగా కేసుల నమోదు కొనసాగుతోంది. పల్నాడు జిల్లా దమ్మాలపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త కల్లి నాగిరెడ్డిని మంగళవారం ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీసులు అరెస్టు చేశారు. మార్కాపురానికి చెందిన టీడీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు అయ్యప్పమాలలో ఉన్న నాగిరెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో అయ్యప్పస్వామి గుడికి వెళ్తుండగా అదుపులోకి తీసుకుని మార్కాపురం తరలించారు. » వైఎస్సార్సీపీ యువజన విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డిని తాడికొండ పోలీసులు మంగళవారం అక్రమంగా అరెస్టు చేశారు.హరికృష్ణారెడ్డి సెల్‌ఫోన్‌తో పాటు ఆయన తల్లి సెల్‌ఫోన్, ఒక ల్యాప్‌ట్యాప్, డెస్క్టాప్ను సీజ్‌చేశారు. » విశాఖ పార్లమెంటరీ సోషల్ మీడియా కో–కన్వీనర్ బోడే వెంకటేశ్‌పై టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు సాకెళ్ల రతన్‌కాంత్ ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. » వైఎస్సార్సీపీ సోషల్ మీడియా గుంటూరు జిల్లా కన్వినర్ మేకా వెంకటరామిరెడ్డిని నగరంపాలెం పోలీసులు అదుపులో తీసుకున్నారు. -
ఖాకీ క్రౌర్యం.. టీడీపీ గూండాల అరాచకం
సాక్షి, అమరావతి / సాక్షి, నెట్వర్క్: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసుల ద్వారా గూండాగిరీకి బరి తెగించింది. ఫలితంగా ఖాకీ క్రౌర్యం కట్టలు తెంచుకుంటోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తోంది. విచారణ పేరుతో వేధిస్తోంది. పౌర హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. సుప్రీంకోర్టు తీర్పును నిర్భీతిగా ఉల్లంఘిస్తూ పోలీసు రాజ్యంతో బెంబేలెత్తిస్తోంది.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసు వ్యవస్థ స్వచ్ఛందంగా సుప్తచేతనావస్థలోకి వెళ్లిపోయింది. వెరసి టీడీపీ గూండాలు హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోతున్నారు. టీడీపీ రౌడీ మూకలు కత్తులు, కర్రలు, బాంబులతో విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. 80కి పైగా హత్యలు.. 300కు పైగా హత్యాయత్నాలు.. దాదాపు రెండు వేలకు పైగా దాడులు, విధ్వంసాలతో అల్లకల్లోలం సృష్టించారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై యథేచ్చగా దాడులకు పాల్పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఈ దారుణాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలపై చంద్రబాబు సరికొత్త కుట్రకు తెరతీశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ, దాడులకు తెగబడే బాధ్యతను పోలీసులకు అప్పగించినట్టున్నారు. అంటే టీడీపీ గూండాగిరీకి పోలీసు ముసుగుతో రాజముద్ర వేయాలన్న పన్నాగం పన్నారు. వెరసి తప్పుడు కేసులతో సోషల్ మీడియా కార్యకర్తలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.అక్రమ కేసులు, విచారణ పేరుతో దాడులుచంద్రబాబు మనసెరిగి మసలుకునే పోలీసులు ఖాకీ చొక్కాలు విప్పేసి పచ్చ చొక్కాలు తొడుక్కుంటున్నట్టుంది రాష్ట్రంలో ప్రస్తుత భీతావాహ పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులకు తెరతీశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ఆది, సోమవారాల్లోనే ఏకంగా 86 కేసులు నమోదు చేయడం గమనార్హం. అంటే ఈ అక్రమ అరెస్టుల వెనుక ఎంతటి పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమవుతోంది. కేవలం వైఎస్సార్సీపీ శ్రేణులను బెంబేలెత్తించడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసు అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించారు.సోషల్ మీడియా పోస్టులపై నేరుగా కేసులు నమోదు చేయకూడదని, 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. ఆ తీర్పు స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ అక్రమ కేసులతో పోలీసులు చెలరేగిపోతున్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే వారిని బలవంతంగా తీసుకుపోతున్నారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న వారిని తీసుకుపోతున్నారు. వ్యాపార కార్యకలాపాల్లో ఉన్న వారిని, పొలం పనులు చేసుకుంటున్న వారిని, ప్రయాణంలో ఉన్న వారిపై విరుచుకుపడి బలవంతంగా వాహనాల్లో పడేసి పట్టుకుపోతున్నారు.కుటుంబ సభ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. కార్యకర్తల కళ్లకు గంతలు కట్టి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు. విచారణ పేరుతో భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ న్యాయవాదులు వచ్చి గట్టిగా ప్రశ్నిస్తే తప్ప విడిచి పెట్టడం లేదు. మళ్లీ పోలీస్ స్టేషన్‌కు రావాలని చెబుతున్నారు. తాము కొట్టిన విషయాన్ని ఎవరికైనా చెబితే మరోసారి తమ లాఠీలకు పని చెబుతామని బెదిరిస్తున్నారు. ఖాకీలు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ పాశవికంగా దాడులకు పాల్పడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ‘ఫేక్ అకౌంట్ల’తో ప్రభుత్వ కుట్ర వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ప్రశ్నిస్తున్నారు. అదీ వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అది వారి భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకు వస్తుంది. ఆ పోస్టులపై కేసులు నమోదు చేయడం సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసింది. కొన్ని సోషల్ మీడియా ఖాతాల నుంచి కించపరిచే పోస్టులు పెట్టారంటూ అక్రమ కేసులు నమోదు చేస్తోంది.ప్రధానంగా ఎక్స్ (ట్విట్టర్) ఖాతాల్లో పెట్టిన పోస్టులను తమ కేసులకు ప్రాతిపదికగా పోలీసులు చెబుతున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఆ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలు ఎవరివో కూడా తెలీదు. అవి ఫేక్ ఖాతాలు. వాటిని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఆపాదిస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తుండటం ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. ఆ ఫేక్ ఖాతాల వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని తెలుస్తోంది. టీడీపీ సోషల్ మీడియా వర్గాలే ఆ ఫేక్ ఖాతాలతో కించపరిచే పోస్టులు పెట్టి.. వాటి ఆధారంగా వైఎస్సార్సీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అందుకే ఆ కించపరిచే పోస్టులు పెట్టిన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలు ఎవరివో పోలీసులు చెప్పడం లేదు. అవి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల ఖాతాలు అని ఆధారాలు కూడా చూపించలేకపోతున్నారు. పోలీసు క్రౌర్యంలో ఎన్టీఆర్ జిల్లా టాప్రాజ్యాంగ హక్కులను కాల రాయడంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మరింతగా బరి తెగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై 86 అక్రమ కేసులు నమోదైతే.. వాటిలో ఏకంగా 61 కేసులు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషరేట్ పరిధిలోనే నమోదు చేయడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు తమకు వర్తించదనో.. లేక తాము దానిని ఖాతరు చేయమన్నట్టుగా విజయవాడ కమిషనర్ రాజశేఖర్‌బాబు వ్యవహరిస్తున్నారనిపిస్తోంది.ఎంత ఎక్కువుగా అక్రమ కేసులు పెడితే.. అంతగా గుర్తింపు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారేమో అన్నట్టుగా పోలీసుల తీరు ఉందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ సైబర్ పోలీసుల సహకారంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తమ మార్కు గూండాగిరీ ప్రదర్శిస్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకువచ్చేసి తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు.మాజీ మంత్రి కాకాణిపై రెండు అక్రమ కేసులు పోలీసు వేధింపులు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డినీ తాకాయి. ఏదో వాట్సాప్ పోస్టును ఆయన ఫార్వర్డ్ చేశారనే నెపంతో టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే.. ఆయనపై నెల్లూరు పోలీసులు రెండు అక్రమ కేసులు నమోదు చేయడం గమనార్హం. ఆయన ఎలాంటి పోస్టు పెట్టలేదు. ఎవర్నీ కించపరుస్తూ ఎలాంటి పోస్ట్‌నూ ఫార్వర్డ్ చేయలేదు. కానీ టీడీపీ నేతలు చెప్పారనే ఒకే ఒక్క కారణంతో తప్పుడు కేసు నమోదు చేయడం విభ్రాంతికరం.అన్ని ప్రాంతాల్లోనూ అవే అక్రమ కేసులు⇒ గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు మేకా వెంకటరామిరెడ్డిని తాడేపల్లి పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన మార్చిలో ఏదో పోస్టు పెట్టారంటూ టీడీపీ కార్యకర్తలు ఏడు నెలల తర్వాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు సీఐ కళ్యాణ్ రాజు చెప్పడం గమనార్హం. ⇒ తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల గ్రామం వల్లభాపురానికి చెందిన రైతు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆళ్ల జగదీష్‌రెడ్డిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గ్రామంలోని జగదీష్‌రెడ్డి ఇంటికి వచ్చిన ముగ్గురు అగంతకులు, అతడిని తీసుకెళ్లటం, ఏ సమాచారం లేకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేయటం తెలిసిందే. విజయవాడకు చెందిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు జగదీష్‌రెడ్డిని వెంటబెట్టుకు వెళ్లి, సైబర్ క్రైమ్ విజయవాడ సిటీ పోలీసులకు అప్పగించారు.2018లో ఆయన పెట్టిన పోస్టుపై ఫిర్యాదు వచ్చిందని చెప్పడం గమనార్హం. ఆయన్ని విచారించిన తర్వాత రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పంపించివేశారు. విచారణకు మరోసారి రావాలన్న పోలీసుల ఆదేశాల ప్రకారం సోమవారం ఉదయాన్నే మళ్లీ జగదీష్‌రెడ్డి విజయవాడ వెళ్లారు. అక్కడే విచారణ చేస్తుండగా, న్యాయవాదులు, విలేకరులు రావటంతో మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో విడుదల చేశారు. సోషల్ మీడియాలో జగదీష్‌రెడ్డి పెట్టిన పోస్టు, దానిని షేర్ చేయటంపై మొత్తం 16 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. వీరిలో కొందరిని అరెస్ట్ చేయగా, ఇంకొందరిని అరెస్టు చేయాల్సి ఉందని చెబుతున్నారు.⇒ వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కల్లం హరికృష్ణారెడ్డిపై తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా కేసు నమోదు⇒ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింజమూరు మండల కన్వీనర్ పెసల శివారెడ్డిని అరెస్ట్ చేశారు.⇒ నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ తిరుమల కృష్ణ ఆలియాస్ జగన్ కృష్ణను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి కర్నూలు సీసీఎస్ పోలీసులు మహానంది ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డితో కలసి గ్రామానికి చేరుకుని తిరుమల కృష్ణ ఇంటికి వెళ్లారు. కుటుంబీకులు ఇంట్లో ఉన్నా ఏమి చెప్పకుండా ఇల్లంతా తనిఖీ చేశారు. పశువుల పాక వద్ద బర్రెలకు మేపు వేస్తున్న తిరుమల కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.షార్ట్, టీషర్ట్‌పై ఉన్న అతను చొక్కా, ప్యాంట్ వేసుకుని వస్తానని బతిమలాడితే చివరికి ఒప్పుకున్నారు. మహానంది స్టేషన్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి కర్నూలు సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. తమ కుమారుడు ఎక్కడున్నాడో చెప్పండయ్యా అయ్యా అని కృష్ణ కుటుంబీకులు రాత్రి మహానంది స్టేషన్‌కు వచ్చి పోలీసులను బతిమాలినా చెప్పలేదు. కర్నూలుకు చెందిన ఇంతియాజ్ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు కర్నూలు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. క్రైమ్ నెంబర్ 148/2024, 352, 353(1),(సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.⇒ పల్నాడు జిల్లా కంభంపాడు గ్రామానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త నెమలిదిన్నె రంగారెడ్డిపై మాచర్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని అతనిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.⇒ గురజాల మండల సోషల్ మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మండల పరిధిలోని తేలుకుట్ల గ్రామానికి చెందిన పప్పుల వెంకటరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న వెంకటరామిరెడ్డిని సోమవారం అరెస్టు చేసి గురజాల పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు.⇒ ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని కుమారుడు మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టాడని బత్తల శ్రీనివాసులు, మరొకరిపై చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ప్రతిపక్షంలో వున్నపుడు కూడా ఇలాగే పోస్టింగ్‌లు పెట్టారని కడపకు చెందిన టీడీపీ నేత బొజ్జా తిరుమలేష్ ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ⇒ తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త వీరాబత్తుల చంద్రశేఖర్‌ను అనపర్తి పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. సోమవారం విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సీఐ సుమంత్‌ను కలిసి ప్రశ్నించారు. అనంతరం పోలీసులు సెక్షన్–41 నోటీసు జారీ చేసి చంద్రశేఖర్‌ను వదిలి పెట్టారు. రంగంపేట మండలం కోటపాడు గ్రామానికి చెందిన శిరిగిన వెంకటేష్‌ను పోలీసులు నిర్బంధించగా, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు అతడిని బయటకు తీసుకొచ్చారు. -
పల్నాడులో రెడ్ బుక్ పోలీసింగ్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో రెడ్‌బుక్ పోలీసింగ్ నడుస్తోంది. అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్‌గా వేధింపులకు పాల్పడుతున్నారు. కేసు పెట్టకుండా.. నోటీసు ఇవ్వకుండా స్టేషన్లో కూర్చోబెట్టి వేధిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యేల ఒత్తిడితో తప్పడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి ఎత్తుకెళ్లి... శనివారం అరర్ధరాత్రి 12 గంటల సమయంలో రెంటచింతల మాజీ జెడ్పీటీసీ, వైఎస్సార్సీపీ నేత నవులూరి భాస్కర్‌రెడ్డి ఇంటికి రెంటచింతల ఎస్ఐ సీహెచ్ నాగార్జున తన సిబ్బందితో వచ్చి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎక్కడి తీసుకెళ్తున్నారు? అనే ప్రశ్నలకు ఎస్ఐ సమాధానం ఇవ్వలేదు. పిడుగురాళ్ల వరకు తీసుకువెళ్లి తెల్లవారుజామున 4 గంటల సమయంలో తిరిగి రెంటచింతలలో వదిలివెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు పరోక్షంగా భాస్కర్‌రెడ్డికి చెప్పిందేమంటే... ‘నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలంతా ఊర్లు వదలి వెళ్లిపోయారు. మీరు వెళ్లలేదని మాకు పైనుంచి ఒత్తిడి ఉంది. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిది’ అని హెచ్చరించారు. అధికారపార్టీ నేతలపై చర్యలేవీ? వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తప్పు చేయకపోయినా వేధిస్తున్న పోలీసులు... కూటమి పార్టీ నేతలు రోజూ దౌర్జన్యాలకు, దాడులకు తెగబడుతున్నా అడ్డుకోవడం లేదు. నరసరావుపేట, చిలకలూరిపేటలలో వ్యాపారులపై దాడులకు దిగినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ మహిళా నాయకురాలు పాలేటి కృష్ణవేణిని శనివారం అరెస్ట్ చేసి చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన సమయంలో తెలుగు మహిళలు నానా హంగామా సృష్టించారు. కృష్ణవేణిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులను నడిరోడ్డుపై తీవ్రంగా దుర్భాషలాడినా పల్నాడు పోలీసులు పట్టించుకోలేదు. -
అబ్బకొడుకు 'రెడ్‌బుక్' కుట్రలు.. అక్కస్సుతో అక్రమ కేసులు
-
సాక్షి పత్రికపై కేసులు.. సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణ
-
ఆ శిక్ష.. ఐపీఎస్‌లపై కక్ష!
సాక్షి, అమరావతి: వలపు వల (హనీ ట్రాప్)తో బడా బాబులను బ్లాక్ మెయిల్ చేయడం ఆమె వ్యవహార శైలి.. ఫోర్జరీ పత్రాలతో మోసాలకు పాల్పడటం ఆమె నైజం..ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో కేసులు ఆమె నేర చరిత్రకు సాక్ష్యం..ఫోర్జరీ నేరంపై విజయవాడ కోర్టు ఆదేశాలతో రిమాండ్.. ఇదీ ఇటీవల నేపథ్యం.. తీవ్రమైన నేరాల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీ నిరాధార ఆరోపణలతో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేస్తే, ప్రభుత్వం ఎలా స్పందించాలి? ఆమెను అరెస్ట్ చేసి, న్యాయస్థానం ద్వారా రిమాండ్ విధించిన అధికారులపై ఆరోపణలు చేస్తున్నట్టుగా భావించాలి. మరోవైపు ఆమె ఆరోపణలు ఎంత వరకు వాస్తవమో దర్యాప్తునకు ఆదేశించాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు తనను అరెస్టు చేసి జైలులో పెట్టడాన్ని మనసులో ఉంచుకున్న చంద్రబాబు.. ఏదో ఒక సాకు చూపి.. సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలని ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే జుగుప్సాకరమైన, తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీకి ప్రభుత్వం విశిష్ట అతిథి స్థాయిలో ప్రోటోకాల్ మర్యాదలు చేసింది. ఆపై ఆమె ఫిర్యాదును సాకుగా చేసుకుని డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఐజీ టి.కాంతి రాణా, డీఐజీ విశాల్ గున్నీలను ఏకపక్షంగా సస్పెండ్ చేసింది. వారిపై మరిన్ని చర్యలకు సన్నద్ధమవుతోంది. ఈ పరిణామం యావత్ దేశ వ్యాప్తంగా అఖిల భారత సర్వీసు అధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు తనను అరెస్ట్ చేయడాన్ని మనసులో పెట్టుకున్న చంద్రబాబు.. అధికారంలోకి రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారులపై.. అదీ ఏకంగా డీజీ స్థాయి, ఐజీ, డీఐజీ స్థాయి అధికారులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. వ్యక్తిగత కక్షతోనే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు కుట్ర పూరితంగా కక్ష సాధింపునకు పాల్పడుతోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులతో వేధిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. కీలక ఉన్నతాధికారులే లక్ష్యంగా కుట్రలకు పదును పెడుతోంది. కాదంబరితో క్విడ్ ప్రో కో కుట్రవలపు వల (హనీట్రాప్)తో బడా బాబులను బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడటమే వ్యాపకంగా మార్చుకున్న కాదంబరి జత్వానీతో కూడా చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రో కో కుట్రకు తెరతీసింది. ఫోర్జరీ పత్రాలతో భూములు కొల్లగొట్టేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయిన ఆమెతో టీడీపీ ప్రభుత్వం అవగాహనకు రావడం విడ్డూరంగా ఉంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన కేసుల్లో నిందితురాలికి వత్తాసు పలుకుతూ ఐపీఎస్ అధికారులను వేధిస్తుండటం పట్ల అఖిల భారత సర్వీసు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నేర చరిత్ర ఉన్న కాదంబరి జత్వానీతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి.. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్ గున్నీలను ఇప్పటికే ఏకపక్షంగా సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. వారిపై మరిన్ని వేధింపులకు పాల్పడేందుకు సన్నద్ధమవుతుండటం పట్ల ఆగ్రహం వ్యక్యం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ విజయవాడలో ప్రత్యక్షం కావడం వెనుక పక్కా కుట్ర దాగి ఉందని అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి. గతంలో ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసును నీరుగారుస్తామని చెబుతూ.. అందుకు ప్రతిగా ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయమని ఆమెకు షరతు విధించినట్టు స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వ కథ, స్క్రీన్ ప్లే ప్రకారం కాదంబరి జత్వానీ నెల రోజులుగా విజయవాడలో హైడ్రామా సృష్టిస్తున్నారు. జత్వానీపై ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నాయి. వలపు వలతో బడా బాబులను బ్లాక్ మెయిలింగ్ చేయడం ఆమె వ్యాపకంగా చేసుకున్నారని పలు ఫిర్యాదులు, విమర్శలు ఉన్నాయి.నిందితురాలితో ప్రభుత్వం కుమ్మక్కుపారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌కు చెందిన ఐదు ఎకరాలను ఫోర్జరీ పత్రాలతో మరొకరికి విక్రయించేందుకు కూడా కాదంబరి జత్వానీ బరి తెగించారు. వెంటనే అప్రమత్తమైన విద్యాసాగర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. న్యాయస్థానం అనుమతితో నిబంధనలను పాటిస్తూ ముంబయిలో ఆమెను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువచ్చారు. ఫోర్జరీ అభియోగాలకు సంబంధించి పోలీసులు సమర్పించిన ఆధారాలతో న్యాయస్థానం సంతృప్తి చెంది ఆమెకు రిమాండ్ విధించింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత మాత్రాన జత్వానీ గతంలో పాల్పడిన తీవ్రమైన, జుగుప్సాకరమైన నేరాలు ఒక్క దెబ్బతో మాయమైపోయినట్టు కాదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం తన ఫోర్జరీ బాగోతాన్ని ఆధారాలతోసహా వెలికి తీసినందుకే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఆమె కక్ష గట్టారు. కాగా ఆ పోలీసు అధికారులను అక్రమ కేసులతో వేధించాలని అప్పటికే నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం కాదంబరి జత్వానీని తమ కుట్రలో భాగస్వామిగా చేసుకుంది. ప్రభుత్వ పెద్దలు ఆమెతో ఇటీవల ఇప్పించిన ఫిర్యాదుతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఇంకొందరు పోలీసు అధికారుల పేర్లను కూడా చేర్చేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, అధికారులను అవమానిస్తూ వేధిస్తున్న తీరు అఖిల భారత సర్వీసు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఇదే ప్రభుత్వ విధానంగా మారితే.. రాష్ట్రంలో ఏ అఖిల భారత స్థాయి అధికారి కూడా నిబద్ధతతో పని చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఏదైనా నేరానికి పాల్పడిన వారిపై విచారణ నిర్వహించి పక్కా ఆధారాలతో చర్యలు తీసుకుంటే ప్రభుత్వ పెద్దలు అభినందించాలి. కానీ నిందితులతో కుమ్మక్కై అధికారులనే వేధిస్తుంటే రాష్ట్రంలో పని చేసేందుకు ఏ అఖిత భారత సర్వీసు అధికారి కూడా ఇష్టపడరని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం మనో ధైర్యం దెబ్బతింటే అంతిమంగా ప్రజలే నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరో టార్గెట్ రామకృష్ణే .. చంద్రబాబు, ఈనాడు రామోజీరావు కుటుంబం క్విడ్ ప్రో కోకుట్ర మరోసారి అధికారికంగా బట్టబయలవుతోంది. అందులో భాగంగానే స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ పూర్వపు ఐజీ రామకృష్ణకు టీడీపీ కూటమి ప్రభుత్వం గురి పెట్టింది. ఎందుకంటే.. రామోజీరావు కుటుంబం దశాబ్దాలుగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా యథేచ్చగా పాల్పడిన ఆర్థిక అక్రమాలను ఆధారాలతో సహా ఆయన నిగ్గు తేల్చారు. కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ.. కేంద్ర చిట్ ఫండ్ చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రయత్నించారు. ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు కుటుంబం మార్గదర్శి చిట్స్ చందాదారుల సొమ్మును అక్రమ మార్గాల ద్వారా మళ్లించి తమ కుటుంబ వ్యాపార సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌లో అక్రమ పెట్టుబడులుగా పెట్టినట్టు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గుర్తించింది. ఘోస్ట్ చందాదారుల పేరుతో అక్రమాలు, రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్ల సేకరణ తదితర ఆర్థిక నేరాలను వెలుగులోకి తెచ్చింది. దాంతో రెండేళ్లపాటు మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో కొత్త చిట్టీ గ్రూపులు నిలిచి పోవడంతో రామోజీ కుటుంబ ఆర్థిక అక్రమాల పునాదులు కదిలాయి. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్రమాలకు పక్కా ఆధారాలు లభించడంతో గత ఏడాది రామోజీరావు (ప్రస్తుతం చనిపోయారు), ఆయన కోడలు శైలజ కిరణ్‌ను హైదరాబాద్‌లో విచారించారు. ఇది ఆ కుటుంబంతో అనుబంధం ఉన్న చంద్రబాబుకు ఏమాత్రం రుచించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రామకృష్ణను వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనకు పోస్టింగు ఇవ్వనే లేదు. మరోవైపు ఐఆర్ఎస్ అధికారిగా ఆయన డెప్యుటేషన్ పూర్తి కావడంతో కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయకపోయినా సరే.. డీమ్డ్ టు బీ రిలీవ్డ్‌గా పరిగణించి ఆయనకు కేంద్ర ప్రభుత్వం పోస్టింగు ఇచ్చేందుకు సిద్ధమైంది. నిబంధనల మేరకు సాగుతున్న పరిణామాలపై రామోజీరావు కుటుంబం భగ్గుమంది. రామకృష్ణను లక్ష్యంగా చేసుకుని ఈనాడు పత్రికలో రెండు రోజులుగా ప్రత్యేక కథనాలు ప్రచురించారు. రాజగురువు కుటుంబానికి ఆగ్రహం కలిగిందని బెంబేలెత్తిన చంద్రబాబు ప్రభుత్వం.. నిబంధనలను అతిక్రమించేందుకు కూడా వెనుకాడటం లేదు. రామోజీ కుటుంబాన్ని సంతృప్తి పరిచేందుకు రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలాయాన్ని ఆదేశించినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ అధికారి అయిన ఆయనపై ఏకపక్షంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయ వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి. కానీ రామోజీ కుటుంబం కళ్లల్లో ఆనందం చూడటమే తమ లక్ష్యం.. అన్నట్లు రామకృష్ణపై చర్యలు తీసుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసినట్టు సమాచారం. దాంతో రామకృష్ణపై ప్రభుత్వం ఒకట్రెండ్రోజుల్లో కక్ష సాధింపు చర్యలు చేపట్టే అవకాశాలున్నాయని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. -
ఖాకీ వనంలో ‘కలుపు’ వృక్షం
సాక్షి టాస్‌్కఫోర్స్: ఆయన ఓ పోలీసు అధికారి.. నిజాయితీగా, వృత్తిపట్ల నిబద్ధత, అంకితభావంతో ఉండాల్సిన వ్యక్తి.. కానీ, ఆ లక్షణాలేవీ ఆయనలో మచ్చుకైనా కనిపించవు. ఖాకీ యూనిఫాంలో ఉన్న కరుడుగట్టిన ‘పచ్చ’ సైనికుడు. టీడీపీ కార్యకర్తలకంటే ఎక్కువగా పార్టీ కోసం పరితపిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలు చేయించి తిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారు కుప్పం అర్బన్ సీఐ జీటీ నాయుడు. కూటమి సర్కార్ రాగానే స్వైరవిహారం ఈయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అయినప్పటికీ ఎస్ఐ, సీఐగా ఎక్కువ కాలం అనంతపురం జిల్లాలో పనిచేశారు. హిందూపురంలో పనిచేసే సమయంలో వైఎస్సార్సీపీ నేత చేలూరు రామకృష్ణారెడ్డి హత్య కేసులో నిందితులకు సహకరించారనే కారణంగా ప్రభుత్వం ఆయన్ని వీఆర్‌కి పంపించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొద్దిరోజుల తరువాత కుప్పం అర్బన్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన తరువాత వైఎస్సార్సీపీ శ్రేణులపై బెదిరింపులు, దౌర్జన్యాలు వంటి వాటితో చెలరేగిపోతున్నారు. 24 గంటలు టీడీపీ కోసమే అన్నట్లుగా పనిచేస్తున్నారు. పాత కేసులు తిరగదోడుతూ.. తాజాగా.. వైఎస్సార్సీపీ కుప్పం మండల కన్వినర్ మురుగే‹Ù, ఆయన కుమారుడు శ్రీనివాసులుపై ఆయన కన్నుపడింది. వీరిపై ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. ఈ కేసులు కూడా ఇప్పటివి కావు. ఎనిమిది నెలల క్రితం జరిగిన ట్రాక్టర్ దొంగతనం కేసు ఒకటి కాగా.. 2022లో ఎమ్మారీ్పఎస్, స్థానికుల మధ్య చెరువు పనుల విషయంలో చోటుచేసుకున్న వివాదం మరొకటి. ఇందులో మురుగేష్, శ్రీనివాసుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కొద్దిరోజులకు ఇరువర్గాల వారు రాజీపడడమే కాక కేసు ఉపసంహరించుకున్నారు కూడా. ఈ కేసులను సీఐ జీటీ నాయుడు ఇప్పుడు తిరగదోడారు. కుప్పం ఎంపీపీ, మండల కన్వీనర్ కుటుంబం టీడీపీ కండువా కప్పుకోలేదన్న కారణంతో శనివారం రాత్రి మురుగే‹Ù, శ్రీనివాస్‌పై దొంగతనం.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఈ సీఐ వచ్చాకే దాడులు, కేసులు కుప్పం అర్బన్ సీఐగా జీటీ నాయుడు బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచే వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలు అక్రమ కేసులు బనాయించడం ప్రారంభమయ్యాయి. కుప్పం మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ హస్తగతం చేసేందుకు జీటీ నాయుడు రంగంలోకి దిగారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ఒక్కొక్కరిని పిలిపించి వార్నింగ్‌లు ఇవ్వడం ప్రారంభించారు. ‘మర్యాదగా టీడీపీ కండువా కప్పుకో. లేదంటే ఏదో ఒక కేసుపెట్టి జైలుకు పంపుతా’.. అంటూ బెదిరింపులకు దిగారు. తన మాట వినని వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేసినట్లు సమాచారం. సీఐ బెదిరింపులు, దౌర్జన్యాలకు భయపడి ఐదుగురు కౌన్సిలర్లు, మరో ఐదుగురు ఎంపీటీసీలు టీడీపీలో చేరిపోయారు. ఆ చేరికలు కూడా ప్రత్యేక వాహనంలో అమరావతికి పంపించి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పించిన ఘనుడు ఈ సీఐ. ఇక తాజాగా.. కుప్పం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా జల్లికట్టు నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన జల్లికట్టులో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీని నిర్వహణ వెనుక రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్సీపీ నేతను వెంటాడి మరీ ఇదిలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ జూలై 21న బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తుండగా అర్థరాత్రి కాపుకాచి వీ కోట వద్ద అరెస్టుచేసి కుప్పం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అతన్ని అరెస్టు చెయ్యొద్దని కోర్టు ఆదేశాలున్నా.. చంద్రబాబు మెప్పు పొందేందుకు సీఐ జీటీ నాయుడు.. బస్సులో ప్రయాణిస్తున్న నాగార్జున యాదవ్ సెల్‌ఫోన్ సిగ్నల్‌ను ట్రాక్‌చేసి అరెస్టుచేశారు. ఈ విషయం గురించి వైఎస్సార్సీపీ లీగల్ సెల్, మీడియా ప్రతినిధులు ఆయన్ను నేరుగా ఫోన్‌చేసి అడిగినా గోప్యంగా ఉంచారు. అరెస్టుచేయలేదే అంటూ బదులిచ్చారు. చివరకు.. నాగార్జున యాదవ్ స్వయంగా తాను కుప్పం పోలీస్టేషన్లో ఉన్నానని ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 41ఏ నోటీసులు ఇవ్వటం కూడా చట్ట విరుద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ తప్పుబట్టింది. ఇలా కుప్పం అర్బన్ సీఐ జీటీ నాయుడు చట్టాన్ని అతిక్రమించి టీడీపీ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ పట్టించుకోకపోవడంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. -
న్యాయవాదులపై అక్రమ కేసులు బనాయిస్తే సహించం
విజయవాడస్పోర్ట్స్: గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంపై మూడేళ్ల కిందట జరిగిన దాడి ఘటనలో న్యాయవాది ఒగ్గు గవాస్కర్‌ను నిందితుడుగా చేర్చడాన్ని బెజవాడ బార్ అసోసియేషన్(బీబీఏ) న్యాయవాదులు తప్పుబట్టారు. రాజకీయ కోణంలో జరిగిన ఈ దాడి ఘటనలో న్యాయవాదులను ఇరికించేందుకు మంగళగిరి రూరల్ పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. డిఫెన్స్ తరుఫున న్యాయస్థానానికి వాదనలు వినిపించేందుకు వెళ్లిన గవాస్కర్‌పై తాజాగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పోలీసుల తీరును ఖండిస్తూ బీబీఏ న్యాయవాదులు విధులు బహిష్కరించి గవాస్కర్‌కు సంఘీభావంగా విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీబీఏ అధ్యక్షుడు కొత్త చంద్రమౌళి మాట్లాడుతూ 2021లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని, అప్పట్లోనే పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారన్నారు. అయితే పలువురు నిందితుల తరుఫున వకల్తా పుచ్చుకున్న గవాస్కర్‌పై తాజాగా కేసు నమోదు చేసి 88వ నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సబబని ప్రశి్నంచారు. సీనియర్ న్యాయవాది గౌతంరెడ్డి మాట్లాడుతూ పోలీసులు ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. న్యాయవాది గవాస్కర్ మాట్లాడుతూ ఈ కేసులో తన పేరు ఉందని వారం కిందటి వరకు తనకు తెలీదన్నారు. నాలుగు రోజుల క్రితం కోర్టుకు వెళితే హత్యాయత్నం కేసులో నిందితుడిగా తన పేరును పోలీసులు చేర్చడంతో ఒక్క సారిగా ఖంగుతిన్నట్టు చెప్పారు. ఇదేంటని ప్రశి్నస్తే.. పై నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా కేసు నమోదు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం పోలీసుల తీరుకు నిరసనగా న్యాయవాదులు ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఆందోళన కార్యక్రమంలో న్యాయవాదులు మన్మథరావు, నిర్మల్రాజేష్, కోటంరాజు, బసవరెడ్డి, సాయిరామ్, ఆదాం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో ఉండాలంటే మేము చెప్పినట్లు చెయ్యాలి
చంద్రగిరి (తిరుపతి జిల్లా): ఎన్నికల అనంతరం తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి పంచాయతీ కూచువారిపల్లిలో జరిగిన హింసాత్మక ఘటనలు తెలిసిందే. కూచువారిపల్లి, రామిరెడ్డిపల్లిలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే స్థానిక టీడీపీ నేత రామిరెడ్డిపల్లి గ్రామస్తులకు ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులైన పలువురు మహిళలు శనివారం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు.తమకు రక్షణ కల్పించాలని, ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి నుంచి తమను కాపాడాలని రామిరెడ్డిపల్లి మహిళలు స్టేషన్‌కు వెళ్లారు. అయితే పోలీసులు ఫిర్యాదులు కూడా తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రామిరెడ్డిపల్లి గ్రామస్తులందరూ కూచువారిపల్లి భజన మందిరం వద్దకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ నేత బెదిరింపులకు పాల్పడుతున్నట్లు మహిళలు వాపోయారు.లేకపోతే ఒక్కొక్కరిపై కేసులు పెట్టి మీ అంతు చూస్తామంటున్నారని, దీంతో గ్రామంలో పలువురు యువకులు ప్రాణభయంతో పారిపోయారని తెలిపారు. కూచువారిపలి్లకి చెందిన ఓ వ్యక్తి తమను బెదిరిస్తున్నాడంటూ, కాల్ రికారి్డంగ్‌ను పోలీసులకు వినిపించినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు తమ ఫిర్యాదులు తీసుకోలేదని మహిళలు తెలిపారు. ఎవరిని బెదిరించారో వారే ఫిర్యాదు చేయాలే తప్ప, కుటుంబ సభ్యులు రాకూడదని పోలీసులు అంటున్నారని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని మహిళలు అంటున్నారు. -
బాబు సేవలో బదిలీ బలగాలు!
సాక్షి, అమరావతి: రాజకీయ ఒత్తిళ్లతో తాను నియమించుకున్న కొందరు పోలీసుల ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలు న్యాయస్థానం సాక్షిగా బట్టబయలయ్యాయి! ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలు పంచుకుంటూ పోటీ చేసిన ఓ అభ్యర్ధిని కౌంటింగ్ రోజు బయటకు రానివ్వకుండా చేసేందుకు బరి తెగించి ఆడుతున్న నాటకానికి తెర పడింది. ఈసీపై రాజకీయ ఒత్తిడి తెచ్చి నియమించుకున్న కొద్ది మంది పోలీసులు బాబుకు ఏజెంట్ల మాదిరిగా పని చేస్తున్నట్లు తేటతెల్లమైంది. న్యాయస్థానానికి సైతం వారు తప్పుడు సమాచారం ఇవ్వడంపై తీవ్ర విస్మ యం వ్యక్తమవుతోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించడంలో డీజీపీ, టీడీపీకి కొమ్ము కాస్తున్న కొందరు పోలీసుల కుట్ర హైకోర్టు సాక్షిగా రుజువైంది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసమైన రోజు ఉదయం నుంచి ఏం జరిగిందో వాస్తవాలను వెల్లడించకుండా ఎడిటెడ్ వీడియో ఆధారంగా పిన్నెల్లి అరెస్టుకు ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పిన్నెల్లి ఈనెల 23న సానుకూల ఉత్తర్వులు పొందడం విదితమే. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు కానున్నట్లు అదే రోజు సాయంత్రం కల్లా సంకేతాలు అందడంతో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే కొందరు పోలీసు అధికారులు అడ్డగోలు వ్యవహారాలకు తెర తీశారు. అదే రోజు రాత్రి పిన్నెల్లిపై పాత ఘటనలకు సంబంధించి మూడు వేర్వేరు కేసులు హడావుడిగా నమోదు చేశారు. ఆ ఘటనలు ఎప్పుడో జరిగితే పది రోజుల తరువాత తాపీగా పిన్నెల్లిపై హత్యాయత్నం సహా మూడు కేసులు బనాయించారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఉత్తర్వులను అమలు చేయకుండా ఎన్నికల సంఘం, పోలీసులు ఈ తప్పుడు కేసులు పెట్టారని, వాస్తవానికి పిన్నెల్లిని 23వ తేదీ రాత్రి నిందితుడిగా చేర్చారని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే పోలీసులు తాము 22వ తేదీనే పిన్నెల్లిని నిందితునిగా చేర్చామని పేర్కొనడంతో న్యాయస్థానం ఈ విషయంలో వారిని స్పష్టత కోరింది. లిఖితపూర్వకంగా ఆ వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. సంబంధిత డాక్యుమెంట్లను పిన్నెల్లి తరఫు న్యాయవాదులు స్థానిక కోర్టు నుంచి అధికారికంగా పొందారు. వాటిని సోమవారం కోర్టుకు సమరి్పంచారు. దీంతో పచ్చ ముఠాలకు వత్తాసు పలుకుతున్న పోలీసులు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. పిన్నెల్లిని నిందితుడిగా చేర్చి 23వతేదీ రాత్రి స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన విషయాన్ని కోర్టుకు వెల్లడించాల్సి వచ్చింది. దీంతో 23న మధ్యంతర ముందస్తు బెయిల్ పొందిన తరువాత పిన్నెల్లిపై ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు రుజువైంది. పిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్లు నిర్ధారణ కావడంతో కుట్ర కోణం బహిర్గతమైంది. డీజీపీ, పల్నాడులో కొందరు పోలీసులు దిగజారిపోతున్న తీరుకు ఇది అద్దం పడుతోంది. తీర్పు నేటికి వాయిదా తనపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం తన నిర్ణయం వెలువరిస్తామని ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎంల కేసులో హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిలు మంజూరు చేయగానే పిన్నెల్లిపై పోలీసులు అప్పటికప్పుడు మరో మూడు అక్రమ కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు హత్యాయత్నం కేసులున్నాయి. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్ ప్రక్రియలో పాలు పంచుకునేందుకు వీలుగా ఈ కేసుల్లో తనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో అనుబంధ పిటిషన్లు వేశారు. అనుబంధ వ్యాజ్యాలు.. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాల్లో బాధితులు నంబూరి శేషగిరి రావు, నాగ శిరోమణి ఇంప్లీడ్ అవుతున్నారని, ఆ మేరకు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశామని విచారణ సందర్భంగా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. వారి తరఫున తాను వాదనలు వినిపిస్తానని తెలిపారు. అయితే మౌఖిక వాదనలకే పరిమితం కావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకున్నందుకు టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావును పిన్నెల్లి బెదిరించారని పోసాని పేర్కొన్నారు. నాగ శిరోమణి అనే మహిళను కూడా బెదిరించారన్నారు. కౌంటింగ్ రోజు పిన్నెల్లి అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్నారు. 23 రాత్రి 8 గంటలకు స్థానిక కోర్టులో మెమో పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అభ్యర్ధించారు. ఇప్పటికే పిన్నెల్లిపై 9 కేసులున్నాయన్నారు. పిన్నెల్లిపై నిఘా ఉంచాలని ఇదే కోర్టు ఈ నెల 23న ఉత్తర్వులిచ్చినా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. క్రైం నెం 59లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎప్పుడు నిందితునిగా చేర్చారు? దీనికి సూటిగా సమాధానం చెప్పాలని పీపీని ఆదేశించారు. సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లిని నిందితుడిగా చేరుస్తూ 23వతేదీ రాత్రి 8 గంటల సమయంలో స్థానిక కోర్టులో మెమో దాఖలు చేశామని పీపీ వెల్లడించారు. దీంతో పిన్నెల్లిని 22వ తేదీనే నిందితుడిగా చేర్చామంటూ పోలీసులు చెప్పడం పచ్చి అబద్ధమని తేలిపోయింది. అస్మిత్, చింతమనేనికి ఇచ్చినట్లే.. పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపట్టారు. పిన్నెల్లి విషయంలో ఎన్నికల సంఘం తీరు వల్ల ఆ సంస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోందన్నారు. పిన్నెల్లిపై పలు కేసులున్నాయని పోసాని, పీపీ పేర్కొనటాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీ నేతలైన చింతమనేని ప్రభాకర్, అస్మిత్‌రెడ్డిపై కూడా పెద్ద సంఖ్యలో కేసులున్నాయని గుర్తు చేశారు. అస్మిత్‌రెడ్డిపై 30, చింతమనేనిపై 31 కేసులు నమోదయ్యాయన్నారు. కేసుల ఆధారంగా ముందస్తు బెయిల్ ఇవ్వకూడదంటే వీరిద్దరికీ కూడా ముందస్తు బెయిల్ రాకూడదన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో పాలు పంచుకునేందుకు వీరిద్దరికీ ఇదే హైకోర్టు ఈ నెల 23న మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా పిన్నెల్లికి కూడా ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. పోలింగ్ కేంద్రం బయట ఒకే ఘటనకు సంబంధించి పోలీసులు పిన్నెల్లిపై రెండు కేసులు నమోదు చేశారని, ఒకే నేరానికి రెండు కేసులు చెల్లవని కోర్టుకు నివేదించారు. కౌంటింగ్ పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉంది.. కౌంటింగ్ ప్రక్రియలో పాలుపంచుకునే హక్కు ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ అభ్యర్ధికి ఉంటుందని టి.నిరంజన్‌రెడ్డి తెలిపారు. కౌంటింగ్ తేదీ సమీపిస్తున్నందువల్ల కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సిన బాధ్యత పిన్నెల్లిపై ఉందన్నారు. కౌంటింగ్ వద్ద అభ్యర్థి లేని పక్షంలో తీవ్రంగా నష్టపోతారన్నారు. చింతమనేని, అస్మిత్‌రెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించని పోలీసులు పిన్నెల్లి విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు, ఈవీఎంల కేసులో మధ్యంతర బెయిల్ వస్తుందని 23వ తేదీ సాయంత్రం కల్లా గ్రహించడంతో అదే రోజు రాత్రి పిన్నెల్లిపై హత్యాయత్నంతో సహా మూడు కేసులు నమోదు చేశారన్నారు. అయితే పోలీసులు 22నే ఆయన్ను నిందితుడిగా చేర్చామంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని నివేదించారు. ఈమేరకు పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్ల సరి్టఫైడ్ కాపీలను పిన్నెల్లి తరఫు మరో న్యాయవాది రామలక్ష్మణరెడ్డి కోర్టుకు సమరి్పంచారు. పోలీసులు దాఖలు చేసిన మెమోను పరిశీలించాలని నిరంజన్‌రెడ్డి కోరడంతో న్యాయమూర్తి దాన్ని పరిశీలించి పిన్నెల్లిని 23వ తేదీనే నిందితుడిగా చేర్చిన విషయాన్ని ధృవీకరించుకున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నిరంజన్‌రెడ్డి అభ్యర్ధించారు. విచారణకు అశ్వనీ కుమార్ గైర్హాజర్.. క్రైం నెంబర్ 59 కేసులో సీఐ నారాయణ స్వామి తరఫున అసాధారణ రీతిలో హాజరై ఆదివారం వాదనలు వినిపించిన న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ సోమవారం విచారణకు గైర్హాజరయ్యారు. ఆయన జూనియర్ కోర్టు ముందు హాజరై పిన్నెల్లి వ్యాజ్యాల్లో ఇంప్లీడ్ అవుతూ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. హైకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఓ పోలీసు తరఫున ప్రైవేటు న్యాయవాది హాజరు కావడం విస్మయం కలిగించింది. అశ్వనీ కుమార్ ఆ పోలీసు తరఫున హాజరు కావడం వెనుక మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ఉన్న విషయం బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారాన్ని మరింత సాగదీస్తే ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి రావడంతో అశ్వనీ కుమార్ సోమవారం విచారణకు గైర్హాజరైనట్లు న్యాయవర్గాలు చెబుతున్నాయి. బాబు కుట్రలలో భాగస్వాములు.. చంద్రబాబు కుట్రలో భాగం కావడం వల్లే ఎన్నికల సంఘం, డీజీపీ, కొందరు పోలీసు అధికారులు ఆయన చెప్పినట్లు ఆడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కీలకమైన ఓట్ల లెక్కింపు రోజు పోటీలో ఉన్న అభ్యర్ధి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీకి వంతపాడే పోలీసులు అడ్డదారులు తొక్కడం మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినట్లుగా భావించాలని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు. చంద్రబాబు, బీజీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పినట్లుగా ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉన్న పోలీసు అధికారులను ఆకస్మికంగా బదిలీ చేసి పురందేశ్వరి సూచించిన జాబితాలోని వారిని నియమించడంతోనే అడ్డదారులు తొక్కే వ్యవహారం ప్రారంభమైందని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు స్వేచ్ఛగా ఓటును వినియోగించుకొనే అవకాశం లేకుండా చేయడంతోపాటు హింస చెలరేగేందుకు దోహదం చేసిందని పేర్కొంటున్నారు. హైకోర్టు సాక్షిగా తాజాగా బయటడిన కుట్ర దీనికి స్పష్టమైన రుజువుగా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. -
తాపీగా తప్పుడు కేసులు
సాక్షి, అమరావతి: రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈసీ నియమించిన పోలీసు అధికారులు స్వామి భక్తి చాటుకునేందుకు బరి తెగిస్తున్నారు. పోలింగ్ రోజు పల్నాడు, అనంతపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో చోటుచేసుకున్న ఘటనలే అందుకు నిదర్శనం. పల్నాడులో ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు టీడీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నట్లు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆర్వో (రిటర్నింగ్ అధికారి) నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వరకూ, ఎస్పీ నుంచి డీజీపీ దాకా పలుదఫాలు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న రెంటచింతల మండలంలో ఎన్నికల రోజు భారీగా పారా మిలటరీ బలగాలను మోహరించగా, టీడీపీ మద్దతుదారులున్న చోట్ల హోంగార్డులతో సరిపెట్టడం గమనార్హం. తాపీగా సీఐ ఫిర్యాదు..మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంపై ఈనెల 20న నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతా నుంచి ఎడిట్ చేసిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసమైనట్లు పీవో లాగ్ బుక్‌లో ఎక్కడా నమోదు చేయలేదు. పోలింగ్‌కు విఘాతం కలిగినట్లు పేర్కొనలేదు. సిట్ కూడా దీని గురించి ప్రస్తావించలేదు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి పాల్గొన్నట్లు చెప్పలేదు. ఈనెల 18న డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలోనూ ఆ ప్రస్తావనే లేదు. అసలు వెబ్‌కాస్టింగ్ నుంచి అది ఎలా లీకైంది? నిజమైనదేనా? మార్ఫింగ్ చేసిందా? అనే విషయాలను ధృవీకరించుకోకుండా పిన్నెల్లిని అరెస్టు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు.దీన్ని సవాల్ చేసిన పిన్నెల్లికి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో పోలీసులు మరో మూడు అక్రమ కేసులు బనాయించారు. ఈ నెల 14న కారంపూడిలో వైఎస్సార్సీపీ శ్రేణులను చెదరగొడుతుండగా తన తలకు గాయమైందని, ఆ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నారంటూ సీఐ నారాయణస్వామి తాపీగా ఈనెల 22న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక కేసు నమోదైంది. పోలింగ్ రోజు తనను హత్య చేయడానికి పురిగొల్పారని ఆరోపణలు చేసిన ఓ టీడీపీ నేత ఫిర్యాదు ఆధారంగా మరో కేసు నమోదు చేయగా, తనను చంపుతానని బెదిరించారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మూడో కేసును పిన్నెల్లిపై నమోదు చేశారు. వీటిని పరిశీలిస్తే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు ఇలా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.టీడీపీ గూండాలకు చట్టం చుట్టమా?నరసరావుపేటలో పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. గోపిరెడ్డి దొరకకపోవడంతో ఆయన మామపై పచ్చ మూక దాడి చేసింది. అయితే హత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ గూండాలపై కేసు నమోదు చేయకుండా ఆ కేసును పోలీసులు గోపిరెడ్డిపై బనాయించడం విస్మయం కలిగిస్తోంది. నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవిందబాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, మారణాయుధాలు లభ్యమైతే ఆయనపై చిన్న కేసుతో సరిపుచ్చారు. పోలింగ్ మర్నాడు కారంపూడిలో టీడీపీ మూకలు పేట్రేగినా పోలీసులు కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదు. -
కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
సాక్షి, హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామిక చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ శుక్రవారం కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తోంది. ఇటీవలి కాలంలో జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతల అరెస్టు కోసం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటోంది. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపితమైంది. అక్రమ కేసులను వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
కొడాలి నాని, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు కొట్టేసిన కోర్టు
సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ నేతలపై టీడీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులను విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టేసింది. నానితో పాటు, మరో ఆరుగురు వైఎస్సార్సీపీ నేతలు నిర్దోషులుగా కోర్టు తీర్పునిచ్చింది. 2017లో వినాయకచవితి సందర్భంగా గుడివాడలో నాని నిర్వహించిన అన్న సమారాధనను పోలీసుల ద్వారా టీడీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. డీఎస్పీ మహేష్ నేతృత్వంలో అన్నదానాన్ని పోలీసులు అడ్డుకోబోగా, అన్నం పెడుతుంటే అడ్డుకోవడమేంటని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. భోజనం చేస్తున్న టేబుళ్లను పోలీసులు నెట్టి వెయ్యడంతో దుమారం చెలరేగింది. ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే నాని, వైసీపీ నాయకులు గుడ్లవల్లేరు బాబ్జి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్ సహా మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జరిగిన విచారణలో పోలీసులు చూపినవి తప్పుడు సాక్ష్యాలని న్యాయమూర్తి నిర్ధారించారు. వైఎస్సార్సీపీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను కొట్టేస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్ -
ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు చెవిరెడ్డి, జక్కంపూడి
తిరుపతి రూరల్: ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వారిపై తెలుగుదేశం ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు నేటికీ వదలిపెట్టడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ 2015లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆ ఉద్యమాలను అణచివేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు నమోదు చేసింది. ఆ కేసులకు సంబంధించి ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అతని సోదరుడు గణేష్, తల్లి విజయలక్ష్మి మంగళవారం అమరావతిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ జరిగిన ఉద్యమాల్లో ప్రజల తరఫున గళమెత్తిన వైఎస్సార్సీపీ నాయకుడు, ప్రస్తుత రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, గణేష్, విజయలక్ష్మి, కార్యకర్తలు కలిపి మొత్తం 26 మందిపై 2015లో అప్పటి ప్రభుత్వం కేసులు పెట్టింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. అప్పట్లో వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆనాటి ఆందోళనలకు సంఘీభావం తెలిపిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపైనా రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అమరావతి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో మంగళవారం వాయిదా ఉండటంతో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, జక్కంపూడి రాజా, గణేష్, విజయలక్ష్మి విచారణ నిమిత్తం హాజరయ్యారు. -
మోదీ సూచనలతోనే అక్రమ కేసులు, సోదాలు
న్యూఢిల్లీ: అక్రమ కేసులు, దాడులు చేపట్టి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా దెబ్బతీసే లక్ష్యంతో ప్రధాని మోదీ 15 మంది పేర్లను ఢిల్లీ పోలీసులు, ఈడీ, సీబీఐలకు అందజేశారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ 15 మందిలో ఆప్ నేతలే ఎక్కువమంది ఉన్నారన్నారు. శనివారం ఆయన వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ 15 మంది పేర్ల జాబితాను సీబీఐ, ఈడీ, ఢిల్లీ పోలీసులకు అందజేసినట్లు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వచ్చే ఎన్నికల సమయా నికి రాజకీయంగా దెబ్బతీసేందుకు వారిపై అక్రమ కేసులు నమోదు చేయాలని, దాడులు జరపాలని కోరారు’అని సిసోడియా ఆరోపించారు. ‘ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా మోదీజీకి బ్రహ్మాస్త్రం వంటి వారు. ఏదేమైనా ఈ పనిని నెరవేరుస్తానని ఆయన ప్రధానికి హామీ ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ‘సీబీఐ, ఈడీలను మీరు పంపించండి. వారికి మేం ఆహ్వానం పలుకుతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఆప్ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు పెట్టినా కేంద్రం ఏమీ సాధించలేక పోయిందని చెప్పారు. ‘గతంలో చేపట్టిన తనిఖీలతో మీరు ఏం సాధించారు? మా నేత సత్యేందర్ జైన్‌పై 12 కేసులున్నాయి. సీఎం కేజ్రీవాల్ కార్యాలయంపై, నా నివాసంపై సీబీఐ దాడులు చేసింది. ఆప్ 21 మంది ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారు. కానీ, ఏం సాధించారు?’అని సిసోడియా ప్రశ్నించారు. ‘గతంలో దాడులు, అక్రమ కేసులతో ఏం సాధించారు? ఓట్ల రాజకీ యాలతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోండి’అని శనివారం ట్విట్టర్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈ ఆరోపణలను బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఖండించారు. మరికొద్ది నెలల్లో కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలోనే ఆప్ నేతలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. -
బ్రిటిష్, నిజాంలను మరిపిస్తున్న కేసీఆర్
కొణిజర్ల: గత ముప్ఫై ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, నిరుపేదలపై కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ జైలుపాలు చేయడం బ్రిటిష్, నిజాంల పాలనను తలపిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌లో ఇటీవల పోడు ఘర్షణలో అటవీ అధికారులు కేసులు నమోదు చేయగా, జైలుకు వెళ్లి వచ్చిన మహిళారైతులను వారు శుక్రవారం ఇక్కడ పరామర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... దశాబ్దాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నవారికి తమ హయాంలో హక్కు కల్పించగా, 2014 తర్వాత ఆ చట్టం అమలు కావడం లేదన్నారు. దీనికితోడు నిరుపేద దళితులు, గిరిజనులకు మూడెకరాలు భూమి ఇస్తానని గద్దెనెక్కిన కేసీఆర్ తర్వాత ఆ భూమి ఇవ్వకపోగా, ఉన్న పోడు భూములను లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎల్లన్ననగర్ పోడు సాగుదారుల విషయంలో అటవీ, జైలు శాఖల అధికారుల తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు నిరుపేదలంటే చిన్నచూపని ఆరోపించారు. బడా భూస్వాములు గుట్టలకు పట్టాలు చేయించుకున్నా రైతుబంధు ఇస్తూ, పేదలు పోడు సాగుచేసుకుంటే మాత్రం ఒప్పుకోవడం లేదని విమర్శించారు. ఇక్కడి మహిళలపై అట వీ అధికారులు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పం పితే, జైలు అధికారులు ఇబ్బంది పెట్టడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. ‘కొత్త భూమి కొట్టం, పాత భూమి పోనివ్వం’అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని సీతక్క వెల్లడించారు. వారి వెంట మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పాల్గొన్నారు. గిరిజనులిచ్చిన రొట్టెలు తిన్న భట్టి, సీతక్క ఎల్లన్ననగర్ పోడు సాగుదారులను పరామర్శించడానికి వచ్చిన భట్టి విక్రమార్క, సీతక్కకు వారు జొన్నరొట్టెలు ఇచ్చారు. స్థానిక గిరిజన మహిళలు రొట్టెలు తినాలని కోరగా, తొలుత వద్దని చెప్పిన నేతలు ఆ తర్వాత పప్పుతో జొన్న రొట్టెలు తినడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. -
‘అక్రమ కేసులన్నీ ఎత్తేస్తాం’
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయంలో ముస్లిం యువకులు, ప్రత్యేక ఉద్యమ కారులపై పెట్టిన అక్రమ కేసులన్నింటిపైనా విచారణ జరిగి ఎత్తివేస్తామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. బుధవారం ఆమె సచివాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం చాలా మందిపై అక్రమంగా రౌడీ షీట్లు తెరిచి వేధించారని ఆరోపించారు. చంద్రబాబు సభలో నినాదాలు చేశారని ముస్లిం యువకులపై దేశ ద్రోహ కేసులు పెట్టారన్నారు. ఈ విషయాన్ని ముస్లిం యువకులు తమ ప్రభుత్వ దృష్టికి తీసుకురాగా, విచారణలో అవి అక్రమ కేసులని తేలిందన్నారు. అందుకే 9 మంది యువకులపై ఉన్న కేసులను ఉపసంహరించుకున్నామని తెలిపారు. సోషల్ మీడియా వారిపై కూడా అక్రమ కేసులు పెట్టారని, వీటన్నింటిపైనా విచారణ జరిపి ఎత్తివేస్తామని మంత్రి స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
సాక్షి నెట్వర్క్: తెలుగుదేశం ప్రభుత్వం https://www.sakshi.com/tags/data-breachడేటా చౌర్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధికారపార్టీ నేతలు దాన్నుంచి బయటపడేందుకు ఫారం–7 దరఖాస్తుల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసుల నమోదుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలపై భారీ ఎత్తున అక్రమ కేసుల నమోదు చేపట్టారు. ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు చేశారంటూ నోటీసులు జారీ చేయడమేగాక ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారు. అంతేగాక వారిని పోలీస్స్టేషన్లకు పిలిపించి భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. విచారణ పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. (ఇదీ జరుగుతోంది!) అక్రమ కేసుల బనాయింపు తీరిదీ.. - అక్రమ ఓట్ల తొలగింపు కోరుతూ ఫారం–7 కింద దరఖాస్తులు చేశారనే పేరిట కృష్ణా జిల్లాలో బుధవారానికి 22 కేసులు నమోదు చేశారు. మైలవరంలో 15 మంది వైఎస్సార్సీపీకి చెందిన బూత్ లెవల్ కన్వీనర్లను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు సంబంధించి ఆన్లైన్లో అర్జీలను తాము దరఖాస్తు చేయలేదని వారు రాతపూర్వకంగా తెలిపారు. జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేటకు చెందిన వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ డి.కమలేష్రాజును బుధవారం అర్ధరాత్రి చిల్లకల్లు పోలీసుస్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ వచ్చి ఫారం–7 అర్జీపై విచారించారు. కమలేష్‌రాజు పేరిట అతని ఓటును అతనే తొలగించాలని కోరుతూ గుర్తు తెలియన వ్యక్తి ఆన్లైన్లో ఫారం–7 దరఖాస్తు చేయడం గమనార్హం. ఈ విషయమై విచారించేందుకు పోలీసులు అర్ధరాత్రిపూట ఇంటికి రావడమేమిటని కమలేష్‌రాజు వాపోయారు. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) - శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు ఫారం–7 పేరిట 20 కేసులు నమోదయ్యాయి. కావలి సబ్ డివిజన్లో 6, నెల్లూరు రూరల్ సబ్ డివిజన్లో 3, గూడూరు సబ్ డివిజన్లో 3, ఆత్మకూరు సబ్ డివిజన్లో 8 కేసులు చొప్పున నమోదు చేశారు. మంగళవారం గూడూరులో ఆరుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తల్ని విచారణకోసం స్టేషన్‌కు పిలిపించారు. - వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఫారం–7 కింద ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేశారనే ఆరోపణతో వైఎస్సార్సీపీకి చెందిన 90 మందిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలంలో 1,712 ఓట్లకు తొలగింపునకు వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల పేరిట అగంతకులు ఫారం–7 దరఖాస్తు చేశారు. దీనిపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే కలసపాడు పోలీసుస్టేషన్ పరిధిలో 12 మందిపై, బి.కోడూరు పోలీసుస్టేషన్ పరి«ధిలో 15 మంది వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లపై కేసుల నమోదుకు తహసీల్దారు ఆదేశించారు. తమకు తెలియకుండానే ఫారం–7 దరఖాస్తులిస్తే ఎలా కేసులు నమోదు చేస్తారని వీరు విస్తుపోతున్నారు. - పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీకి చెందిన బూత్ కన్వీనర్లను, ముఖ్య కార్యకర్తల్ని బుధవారం పోలీస్స్టేషన్లకు పిలిపించారు. ఏలూరు మండలం నుంచి 205 మందిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వివరాలు సేకరించారు. దరఖాస్తులు మీరే చేశారా లేదా? అని ప్రశ్నించారు. మా పేరుతో ఫొటోతో ఎవరో దరఖాస్తు చేశారు.. మాకు సంబంధం లేదని వారు చెప్పారు. పెదవేగి నుంచి 185 మందిని పిలిపించి విచారించారు. ఆచంటలో బూత్ కన్వీనర్లను ఏలూరు ఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. చింతలపూడిలో పలువురిని చింతలపూడి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఇదే రీతిలో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ బూత్ కన్వీనర్లు, ఇతర కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేశారు. - కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 24 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. డోన్ నియోజకవర్గానికి సంబంధించి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పది మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. ఇదే నియోజకవర్గంలోని బేతంచర్ల మండలంలో 129 మందికి నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఆలూరులో 32 మంది వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లు, పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 50 మంది బూత్ కన్వీనర్లపై కేసులు నమోదు చేసి.. విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. - తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 3వేల మందికి నోటీసులు జారీ చేయడంతోపాటు సుమారు 1,500 మందిపై కేసులు నమోదు చేశారు. వీరందరిని పోలీసు స్టేషన్లకు పిలిపించి విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేశారు. తుని నియోజకవర్గంలో 13 మంది బూత్‌కమిటీ కన్వీనర్లపై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడులో ముగ్గురు బూత్ కమిటీ కన్వీనర్లను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. గొల్లప్రోలు మండలంలో ఓటర్ల తొలగింపునకు దరఖాస్తు చేశారంటూ 43 మంది వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ కన్వీనర్లపై, వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన బూత్ కమిటీ కన్వీనర్ల ఇళ్లకు పోలీసులు మంగళవారం అర్ధరాత్రి వెళ్లి భయాందోళనలు సృష్టించారు. పోలీస్‌స్టేషన్‌కు రాకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. బుధవారం ఉదయం వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీనిపై పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ దొరబాబు ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. కాకినాడ సిటీలో 20 మంది బూత్‌కమిటీ కన్వీనర్లను పోలీసులు విచారించారు. వారికి నోటీసులిచ్చారు. - శ్రీకాకుళం జిల్లాలో ఫారం–7 దరఖాస్తులు దాఖలు చేసిన వ్యవహారంలో దర్యాప్తు పేరుతో 197 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆమదాలవలస మండలంలో 59 మంది, వంగరలో 18 మంది, పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేటలో 52 మంది, భామినిలో 23 మంది, పలాస మండలం మందసలో 26 మంది, పరాసలో 12 మంది, వజ్రపుకొత్తూరులో ఆరుగురు, నరసన్నపేట నియోజకవర్గంలోని సారవకోటలో ఒకరిపై అక్రమ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో.. విశాఖపట్నం జిల్లావ్యాప్తంగా 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం నాటికి 41 కేసులు నమోదు చేశారు. ఒక్క సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఏకంగా 15 కేసులు నమోదయ్యాయి. ఏ.కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, అనకాపల్లి టౌన్, మునగపాక పోలీస్స్టేషన్లలో రెండేసి చొప్పున కేసులు నమోదు కాగా, మిగిలిన 20 పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క చొప్పున కేసులు నమోదయ్యాయి. మెజార్టీ కేసులు వైఎస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని పెట్టినట్టుగానే తెలుస్తోంది. ఈ కేసులన్నింటిని ఆయా పోలీస్స్టేషన్లు జిల్లా సైబర్ క్రైం విభాగానికి బదలాయించారు. వైఎస్సార్సీపీకి చెందిన మండల, గ్రామ, బూత్ కమిటీ నేతలను స్టేషన్లకు పిలిపించుకుని విచారించిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతలిచ్చిన ఫిర్యాదుల మేరకు పెట్టిన కేసుల్లో మాత్రం టీడీపీ శ్రేణులను విచారణకు పిలిచే సాహసం చేయలేకపోతున్నారు. -
విద్యార్థులపై అక్రమ కేసులు
పట్నంబజారు(గుంటూరు): సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెట్టారనే నెపంతో విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టి వారిని తీవ్ర ఇబ్బందులు గురిచేసిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారనే కారణంతోనే తమను పోలీసులు వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. కొద్ది రోజుల కిందట ఫేస్బుక్లో చంద్రబాబు ముఖానికి వేరే ఫొటోను తగిలించి కొందరు పోస్టు చేశారంటూ టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అరండల్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న పోలారెడ్డి జగదీష్‌రెడ్డి, విజయవాడ ఎస్ఆర్కే కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన ఐనవోలు యశ్వంత్, గోగిరెడ్డి సాయివైభవ్, ఏఎన్‌యూలో డిగ్రీ చదువుతున్న గుంటూరుకు చెందిన మద్దు విజయ్‌బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు విచారించి జగదీశ్వరరెడ్డి, యశ్వంత్‌లను స్టేషన్లోనే రాత్రికి ఉంచారు. తిరిగి గురువారం కూడా విచారణ పేరుతో సాయంత్రం వరకు ఉంచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా పార్లమెంటరీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పోలీసు స్టేషన్‌కు చేరుకొని విద్యార్థులకు అండగా నిలబడ్డారు. ఫేస్బుక్లో వచ్చిన పోస్టింగ్‌కు, తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా పోలీసులు ఏకపక్షంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. పోస్టింగ్‌కు సంబంధించి ఆధారాలను చూపెట్టాలని కోరితే మీకు చూపేదేంటి అంటూ పోలీసులు ఇష్టానుసారంగా బూతులు తిడుతున్నారని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నోటీసులు ఇచ్చి విద్యార్థులను విడిచిపెట్టారు. మిమ్మల్ని కేసుల్లో ఇరికిస్తాం.. అరండల్‌పేట పోలీసుస్టేషన్లో విచారణ సందర్భంగా పోలీసులు ఎవరికి వారు మిమ్మల్ని ఇరికిస్తాం అంటూ భయభ్రాంతులకు గురి చేసిన వైనాన్ని చెప్పుకుని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏ తప్పూ చేయకున్నా అన్యాయంగా కేసులు పెడితే మా భవిష్యత్తు ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను పోలీసు స్టేషన్లో ఉంచిన తీరుపై వివరాలు అడిగేందుకు ‘సాక్షి’ అక్కడికి వెళ్లగా.. ట్రైనీ ఎస్సై త్రినాథ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. అనుమతి లేకుండా స్టేషన్ లోపలికి రాకూడదంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. విద్యార్థి జగదీష్‌రెడ్డి ఫొటో తీసిన క్రమంలో సెల్‌ఫోన్ లాక్కుని ఫొటో డిలిట్ చేయాలని ఒత్తిడి చేశారు. సాక్షి మీడియాని ఎవరు పిలిచారంటూ విద్యార్థులు, వారి బంధువులపై చిందులు తొక్కారు. ట్రైనీ ఎస్సై వ్యవహరించిన తీరుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘కేంద్రం అలా చెప్పడంతోనే.. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిశారు’
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తన కక్ష సాధింపు చర్యలకు కేంద్రం సహకరించకపోవడంతోనే చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విటర్లోని పలు అంశాలను ప్రస్తావించారు. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చెప్పింది అక్షర సత్యం. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏదో ఒక నేరం మోపి అరెస్ట్ చేయండని కేంద్రంపై ఒత్తిడి చేశారు. రాష్ట్ర సమస్యలు, నిధులపై చర్చ లేదు. వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడితే తామెలా చేస్తామని కేంద్రం స్పష్టం చేయడంతో.. చంద్రబాబు కాంగ్రెస్సే నయమని అటువైపు జారిపోయార’ని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజలు అప్డేట్ అయిన చంద్రబాబు అదే భ్రమలో ఉన్నారు.. మరో ట్వీట్లో చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చెప్తే ప్రజలు నమ్మే రోజులు పోయాయని అభిప్రాయపడ్డారు. ‘1980-90ల కాలంలో పత్రికల్లో ఏది వచ్చినా ప్రజలు నమ్మేవారు ఆ తర్వాత మీడియా విస్తృతి పెరుగుతూ వచ్చింది. రకరకాల సమాచారం వస్తుంటే నిజమేదో, అబద్ధమేదో తెలిసిపోతుంది. ప్రజలు అప్డేట్ అయినా పాపం చంద్రబాబు, ఆయన కుల మీడియా తాము ఏది వదిలినా ప్రజలు దానినే విశ్వసిస్తారనే భ్రమలో ఉన్నార’ని తెలిపారు. -
పార్టీ అండగా ఉంటుంది
పులివెందుల : టీడీపీ నాయకులు పోలీసుల అండతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తే వారికి పార్టీ అండగా ఉంటుందని..వారి కోసం ఎందాకైనా పోరాటం చేస్తామని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల టీడీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా ద్వారా మంత్రులు లోకేష్, ఆదినారాయణరెడ్డిలను ప్రశ్నించినందుకు సింహాద్రిపురం మండలం చెర్లోపల్లె గ్రామానికి చెందిన యువకుడు మహేష్‌బాబుపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. బెయిల్‌పై విడుదలైన ఆయన శనివారం మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కలిశారు. మంత్రి ఆదేశాలతో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని.. అయితే పార్టీ తనకు అన్నివిధాలుగా అండగా ఉండి సహకరించిందని మహేష్‌బాబు మాజీ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు. అధికార మదంతో తెలుగుదేశం నాయకులు రెచ్చిపోతున్నారన్నారు. వారి అవినీతి ఏ స్థాయిలో ఉందో రెండు రోజుల క్రితం చంద్రబాబు జారీ చేసిన జీఓను బట్టే తెలుస్తోందన్నారు. తమ అవినీతిపై ఎక్కడ దాడులు జరుగుతాయోనని టీడీపీ నాయకులకు భయం పుట్టుకుందన్నారు. ప్రజా సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం వేంపల్లె : ప్రజా సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయమని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వేంపల్లె పట్టణ పరిధిలోని మదీనాపురం, రామలింగయ్య కాలనీలలో మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, ఎంపీపీ రవికుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ప్రజలకు నవరత్నాల గురించి వివరించారు. ముందుగా బైపాస్ రోడ్డులోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలన్నారు.. ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం సాగిస్తున్నారన్నారు. హత్యాయత్నం జరిగినా లెక్క చేయకుండా తిరిగి ప్రజలతోనే తిరుగుతున్న ధీశాలి జగనన్న అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరాలనే నవరత్నాల పథకాలను రూపొందించారని.. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి తదితర పథకాలను అమలు చేస్తారన్నారు. పింఛన్ సొమ్ము రూ.2వేలకు పెంచుతారన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశం కలుగుతుందన్నారు. -
‘రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది’
సాక్షి, దెందులూరు(పశ్చిమ గోదావరి): ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాలనే ఇందుకు నిదర్శనమన్నారు. గురువారం ఆయన దెందులూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని, నాయకులు కొఠారు అబ్బయ్య చౌదరి, కోటగిరి శ్రీధర్, కారుమూరి నాగేశ్వర రావు, కమ్మ శివరామకృష్ణ ఉన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలని ఆరోపించారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టిందని ప్రశ్నించారు. నిధులు లేవని చంద్రబాబు పోలవరాన్ని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో ఎంత దోచుకున్నారనే లెక్కల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పర్యటనకు వస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఏడాదికి కూడా పోలవరం పూర్తయ్యేలా లేదన్నారు. కాసుల కోసమే ఏపీ ప్రభుత్వం పోలవరం చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రభుత్వం చిన్న ఘటనగా చూపే ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు. రిమాండ్ రిపోర్ట్ తర్వాతైన ఈ ఘటనపై పోలీసుల తీరు మారకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసుపై స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ పెదపాడు మండల అధ్యక్షుడు అప్పన ప్రసాద్‌పై తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేయడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ప్రజాబలం ఉన్న వైఎస్సార్ సీపీ నేతలపై అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో పోలీసులు కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బుద్ధిచెబుతారని ఆయన అన్నారు. -
వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ వర్గీయుల దాడి
సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లాలోని నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ నాయకులు దాడికి దిగారు. టీడీపీ వర్గీయుల దాడిలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. మరోవైపు సుబ్బరాయుడుపై దాడి చేయడమే కాకుండా అతనిపై టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయించారు . ఎమ్మెల్యే ఒత్తిడితో సుబ్బరాయుడుతో పాటు మరో ముగ్గురికిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా విచారణ పేరుతో వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి.. పోలీసులు బాధితులపై కేసు నమోదు చేయడం పట్ల వైఎస్సార్ సీపీ నేతలు మండిపడుతున్నారు. పక్షపాతం లేకుండా వ్యవహారించాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా మెలగడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ముస్లింల శత్రువు చంద్రబాబు
సత్తెనపల్లి: ముస్లింలకు ప్రధాన శత్రువు చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ‘ హర్ దిల్ మే వైఎస్సార్’ కార్యక్రమంలో భాగంగా ఈద్గా నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నారా హమారా ... టీడీపీ హమారా సభలో ప్రశ్నించిన మైనార్టీ యువకులపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ఎన్నిక సమయంలో మళ్లీ మైనార్టీలను మభ్యపెట్టేందుకే ‘నారా హమారా – టీడీపీ హమారా’ సభ నిర్వహించారని విమర్శించారు. మైనార్టీల ప్రాతినిధ్యంలేని కేబినెట్ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉందని పేర్కొన్నారు. ముస్లింల స్థితిగతుల గురించి సీఎంగానీ, టీడీపీ నాయకులుగానీ ఆలోచన చేయకపోవడం దౌర్భాగ్యమన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని దుయ్యబట్టారు. వాజ్‌పేయి ఒక్క ఓటుతో ఓడిపోవడంతో సానుభూతి ఓట్లు పడతాయని 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ఆ తరువాత బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని చెప్పి.. 2004లో మోదీ హవా చూసి మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లిలను మోసం చేశారని మండిపడ్డారు. 2002లో గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు మోదీని గుజరాత్లో అడుగు పెట్టనీయబోనని బీరాలు పలికిన చంద్రబాబు.. అదే మోదీ కాళ్లు పట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ముస్లింలు ఉన్నారన్న సంగతి మరిచిపోయి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముస్లింలకు మేలు చేసింది వైఎస్ మాత్రమే.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన నాలుగు శాతం రిజర్వేషన్‌తో ఎంతో మంది ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదవులు చదువుతున్నారన్నారు. కోడెల గెలుపుతో ఏటా ఆయనకు, ఆయన తనయుడు, కుమార్తెకు పుట్టిన రోజులు చేయాల్సిన దుస్థితి టీడీపీ నాయకులకు ఏర్పడిందన్నారు. చిన్న పనికి క్యాష్, పెద్ద పనికి ఆస్తులు రాసివ్వాలని ఎద్దేవా చేశారు. వివాదాస్పద భూముల్లో ప్రవేశించి పంచాయతీల్లో కోడెల తనయుడు మొత్తం మింగేస్తున్నారన్నారు. సత్తెనపల్లి క్లబ్‌పై ఆయన కన్ను పడిందని చెప్పారు. ప్రజల ఆస్తులు దోచుకునే వారిని గెలిపిస్తే ప్రజాస్వామ్యం బతకదన్నారు. గుంటూరులో దేవాదాయ భూమికి చెందిన ఎకరన్నర గుంట స్థలంలో డీమార్ట్ వచ్చేసిందని, దానిలో ప్రతి పైసా సత్తెనపల్లి నుంచి దోచిందేనని చెప్పారు. మున్సిపల్ కార్మికులు డీమార్ట్‌లో పని చేసి స్థానికంగా మచ్చర్ల వేయించుకుంటున్నారన్నారు. కోడెలను సాగనంపాలని పిలుపునిచ్చారు. సభలో మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా, రిటైర్డ్ ఐజీ ఇక్బాల్, నంద్యాలకు చెందిన హబీబుల్లా, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ఆరిమండ వరప్రసాద రెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, మైనార్టీ సెల్ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మహబూబ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ నాగుర్‌మీరాన్, పట్టణ పార్టీ అధికార ప్రతినిధి ఎస్ఎం యూనస్, పిడుగురాళ్లకు చెందిన ఉస్మాన్ మేస్త్రీ మాట్లాడారు. ముందుగా చేపట్టిన భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, ఆతుకూరి నాగేశ్వరరావు, మర్రి సుందరరామిరెడ్డి, బాసు లింగారెడ్డి, భవనం రాఘవరెడ్డి, రాయపాటి పురుషోత్తమ రావు, ఇందూరి నరసింహారెడ్డి, వేపూరి శ్రీనివాసరావు, షేక్ జానీ, అచ్యుత శివప్రసాద్, కళ్ళం వీరభాస్కర్‌రెడ్డి, షేక్ అన్వర్‌బాషా, కళ్ళం విజయభాస్కర్‌రెడ్డి, దూదేకుల మీరావలి తదితరులు పాల్గొన్నారు. -
ఇచ్చిన హామీలు అడిగితే ముస్లింలపై కేసులా బాబు
-
కేశవ్ డైరెక్షన్.. పోలీసుల యాక్షన్
అనంతపురం సెంట్రల్: న్యాయానికి అండగా నిలవాల్సిన పోలీసులు...చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలాంటి సంఘటనే మంగళవారం అనంతపురం టూటౌన్ పోలీసు స్టేషన్లో జరిగింది. హైదరాబాదుకు చెందిన కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేశారని ముగ్గురు యువకులను టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని మీడియా ఎదుట చెప్పిన కాంట్రాక్టర్.. ఆ తర్వాత అధికారపార్టీ నేతల బెదిరింపులతో మధ్యాహ్నానికి మాట మార్చాడు. దీంతో పోలీసులు ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుని కుమారుడు నిఖిల్‌రెడ్డి, అనుచరులు హరిప్రసాద్, భరత్‌కుమార్, శ్రీనివాసులుపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఉరవకొండ ఎమ్మెల్సీ కేశవ్ ప్రోద్భలంతోనే అక్రమ కేసు బనాయించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు ఆరోపించారు. అసలేం జరిగిదంటే... హైదరాబాద్‌కు చెందిన క్రాంతి ఎడిఫ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ ప్రతాప్‌రెడ్డి సోమవారం జిల్లాకు వచ్చారు. నల్గొండ జిల్లా దేవరకొండ వద్ద ఎస్సీబీసీ కెనాల్ వర్క్‌ను సబ్‌కాంట్రాక్ట్ పనులను ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుమారుడు నిఖిల్‌రెడ్డి చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించి దాదాపు రూ.1.50 కోట్ల నగదు లావాదేవీలపై సోమవారం సాయంత్రం స్థానిక సూరజ్ గ్రాండ్ హోటల్లో చర్చించారు. రాత్రి బస చేసిన ప్రతాప్‌రెడ్డి మంగళవారం నాటకీయ పక్కీలో కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు. తనను నిఖిల్‌రెడ్డి, హరిప్రసాద్, శ్రీనివాసులు కిడ్నాప్ చేస్తున్నారని పోలీసులకు ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వీరు ప్రయాణిస్తున్న కారును కూడేరులో అడ్డుకున్నారు. ఆ సమయంలో నిఖిల్‌రెడ్డి లేకపోయినప్పటికీ ఆయన పేరు కూడా నమోదు చేయించారు. కంపెనీ ప్రతినిధి ప్రతాప్‌రెడ్డితో పాటు ఉన్న నిఖిల్‌రెడ్డి అనుచరులైన హరిప్రసాద్, భరత్‌కుమార్, శ్రీనివాసులును కూడేరు పోలీసులు అదుపులోకి తీసుకుని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డబ్బు అడిగిన పాపానికి కిడ్నాప్ కేసు కాంట్రాక్ట్ పనుల్లో డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు కిడ్నాప్ కేసు నమోదు చేస్తారా అని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ మంగళవారం రాత్రి టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఒత్తిళ్లకు తలొగ్గిన టూటౌన్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిని హైదరాబాదుకు పంపించి తమ పార్టీ వారిపై అక్రమంగా కిడ్నాప్ కేసు నమోదు చేయడమేమిటని ప్రశ్నించారు. తమను కూడా కులంపేరుతో దూషించాడని బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఈ ఘటనలో న్యాయం జరగకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కుమ్మతి హనుమంతరెడ్డి, విద్యార్థి విభాగం ఎస్కేయూ అధ్యక్షుడు భానుప్రకాష్, పలువురు ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. -
బాలకృష్ణను వదిలి.. మాపై కేసులా?
కాకినాడ రూరల్: బీజేపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య సోమవారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉపవాస దీక్ష చేపట్టారు. ఈయనకు మద్దతుగా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొని దీక్షల్లో కూర్చున్నారు. బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం చూస్తే ప్రభుత్వం పరిస్థితి ఏమిటో ప్రజలకు ఇట్టే అర్ధమవుతోందని బీజేపీ నాయకులు విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని నోటికొచ్చినట్టు దుర్భాషలాడిన బాలకృష్ణ దిష్టిబొమ్మ దహనం చేస్తే చంద్రబాబు పోలీసులతో బీజేపీ నాయకులపై కేసులు పెట్టించారన్నారు. బీజేపీ నాయకులు తమ నాయకుడైన ప్రధానమంత్రి మోదీని దుర్భాషలాడిన బాలకృష్ణపై కేసులు పెడితే ఎందుకు కేసులు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు మోదీ దిష్టిబొమ్మను తగలబెడితే ఏ ఒక్కరిపై కేసులు పెట్టని పోలీసులు చంద్రబాబుకు తొత్తులుగా మారి బీజేపీ నాయకులపై కేసులు పెడుతున్నారన్నారు. అతి తొందర్లోనే టీడీపీకి పాడికట్టే సమయం ఆసన్నమైందని నాయకులు అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జి పూడి తిరుపతిరావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పైడా కృష్ణమోహన్, రంబాల వెంకటేశ్వరరావు, వేటుకూరి సూర్యనారాయణరాజు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలోజిల్లా బీజేపీ నాయకులు ఘంటసాల గోవిందు, ప్రధాన కార్యదర్శి నల్లా పవన్, గుర్రాల వెంకటరావు, ఆకుల వీరబాబు, చిట్రీడి శ్రీనివాసు, కార్పొరేటర్లు లక్ష్మీప్రసన్న, సుజాత, పార్టీ నాయకులు మామిడాల శ్రీనివాస్, అప్పాజీ, సాయి, సుబ్బారావు పాల్గొన్నారు. -
విద్యార్థులపై అక్రమ కేసులు దారుణం
హైదరాబాద్: ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు వస్తే విద్య పూర్తిగా వ్యాపారంగా మారుతుందని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులో రిజర్వేషన్లు ఉండవని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘన అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఈ అరెస్టులను చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రాథమిక హక్కులనేవి ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోందన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన అంకెళ్ల పృధ్వీరాజ్, చందన్‌లను వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధి విమలక్క, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ, పీవోడబ్ల్యూ సంధ్య, వేదిక కార్యదర్శి చిక్కుడు ప్రభాకర్ పాల్గొన్నారు. -
జైలుకెళ్లడానికైనా సిద్ధం
కనిగిరి: అధికార పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడనని.. ప్రజలకోసం జైలుకెళ్లాడానికైనా సిద్ధంగా ఉన్నానని వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. పీసీపల్లి మండల అధ్యక్షుడు జి. బొర్రారెడ్డి, మరో పదిమందిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. గురువారం రాత్రి విలేకర్లతో మాట్లాడుతూ కేవలం రాజకీయ కక్ష, అధికారం, డబ్బుతో ప్రతిపక్షపార్టీకి చెందిన పీసీపల్లి సర్పంచ్‌ను లొంగబర్చుకున్నారన్నారు. తప్పుడు ఫిర్యాదులతో వైఎస్సార్సీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడంపై తీవ్రంగా మండిపడ్డారు. శ్మశాన వాటికకు ఏవిధమైనా నిధులు మంజూరు లేక పోయినా నిర్మాణం చేపట్టి వారే పగల కొట్టుకుని అన్యాయంగా తమ నాయకులపై కేసులు బనాయించాడాన్ని తప్పుబట్టారు. పీసీపల్లి చెరువులోని సుమారు రూ. 50 లక్షల విలువ చేసే కర్రను అక్రమంగా కొట్టుకోవడాన్ని అడ్డుకున్నందుకే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతా కలిసి దోచుకుంటున్నారు ఎమ్మెల్యే సహా అధికారపార్టీ నాయకులు, అధికారులు కలిసి లక్షలు విలువ చేసే కర్రను దోచుకుంటున్నారని బుర్రా ఆరోపించారు. బ్రాంది షాపుల వద్ద నెలవారీ మామూళ్లు, రోడ్లు, నీళ్లు ఇలా ప్రతిపనిలో పర్సంటేజీలు.. కమిషన్లు తీసుకుంటూ.. ఎమ్మెల్యే నెలకు ఒక సారి కనిగిరికి వచ్చి మూడు సూట్ కేసులు నింపుకుని వెళ్తున్నారని విమర్శించారు. పట్టణంలో చిన్న రోడ్లల్లో మూడంతస్తుల భవనాలు కడుతున్నారని.. వాటిని పగుల కొట్టాలని.. పూర్వీకుల కాలం నుంచి పేదవర్గాల వద్ద ఉన్న ఎకరా, రెండెకరాలు ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకోవాలంటూ ఎమ్మెల్యే.. మంత్రిని కోరడం దుర్మార్గమైన చర్యంటూ మండి పడ్డారు. కమీషన్ల బాబూరావు ఎమ్మెల్యే కదిరిబాబురావు ఇప్పటికి తనపై 6 అక్రమకేసులు పెట్టించారని.. అయినా భయపడనని బుర్రా అన్నారు. ప్రజల్లో విశ్వాసం కొల్పోయిన కమీషన్ల బాబూరావు.. అధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యే అనైతిక రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. పోలీసు అధికారులు న్యాయబద్ధంగా విచారణ నిర్వహించాలని బుర్రా కోరారు. అక్రమ అరెస్ట్‌లు కొనసాగిస్తే.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీసీపల్లి వైస్ ఎంపీపీ మహేష్‌నాగ్, సర్పంచ్‌లు శీలం సుదర్శన్, జపన్య, మోహన్‌రెడ్డి, రమేష్, గోపాల్‌రెడ్డి, కృష్ణా, ఓకే రెడ్డి, మూలె కొండారెడ్డి, పరిమి వెంకట్రావ్, వి. సుబ్బారావు, దత్తాత్రేయ, ఎన్. వెంకటరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకులరెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు సంగు సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి వేల్పుల వెంకటేశ్వర్లు, గుండ్లతోటి మధు, రామన శ్రీను, బాలకృష్ణా పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వేధిస్తుండు సారూ!
నారాయణపేట: మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి వేధిస్తున్నారని దామరగిద్ద మండలం బాపన్‌పల్లి సర్పంచ్ జి.శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మెయిల్, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా లేఖను పంపినట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన శివకుమార్‌రెడ్డి పక్షన తాను నిలబటం తప్పా అని ప్రశ్నించారు. తనపై అక్రమకేసులు బనాయింపచేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనులను ప్రారంభించాలని కోరి నా శివకుమార్‌రెడ్డి అనుచరుడిగా ముద్ర వేస్తూ పట్టించుకోవడం లేదన్నారు. -
పోలీసుల నుంచి నా కుమారుడిని కాపాడండి
కులాంతర వివాహం చేసుకున్నందుకు అక్రమ కేసులు పెట్టారు హైకోర్టుకు అనంతపురం గృహిణి పుష్పలత లేఖ లేఖను పిల్‌గా పరిగణించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఓ పోలీసు అధికారి మేనకోడలిని కులాంతర వివాహం చేసుకున్నందుకు పోలీసులు తన కుమారుడు, భర్తపై అక్రమ కేసులు బనాయించి, తీవ్రంగా హింసించి, డబ్బు, బంగారం తీసుకున్నారని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ అనంతపురం, గంగానగర్‌కు చెందిన కె.పుష్పలత విట్టల్ రాసిన లేఖపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, అనంతపురం ఎస్పీ, తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, రంగారెడ్డి జిల్లా ఎస్పీ, తాండూరు సీఐ సైదులురెడ్డి, అనంతపురం మూడవ టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, ఇబ్రహీంపట్నం ఎస్ఐలు నాగరాజు, లింగస్వామి, కానిస్టేబుల్ నీలం బాలకృష్ణ తదితరులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను జూలై 4కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిధి దాటుతున్న పోలీసులు ‘తాండూరు సీఐ సైదులురెడ్డి మేనకోడలు సౌమ్యారెడ్డి, నా కుమారుడు సాయిచైతన్య గురునానక్ కాలేజీలో చదివే సమయంలో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు భయపడి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయంలో తెలుసుకున్న సైదులురెడ్డి తన పలుకుబడి ఉపయోగించి అనంతపురం మూడవ టౌన్ సీఐ గోరంట్ల మాధవ్‌కు చెప్పి నా కొడుకు, భర్తపై తప్పుడు కేసు బనాయించారు. ఇందుకు ఇబ్రహీంపట్నం ఎస్ఐలు నాగరాజు, లింగస్వామి, కానిస్టేబుల్ బాలకృష్ణ తదితరులు సహకరించారు. నా కొడుకు, భర్తపై రేప్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తరువాత హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఏ కేసు లేకుండా చేస్తామని చెప్పి పై అధికారులకు ఇవ్వాలంటూ రూ.45వేలు, నాలుగు బంగారు గాజులు, నా తాళిబొట్టు పట్టుకెళ్లారు. అయితే నా కొడుకు, భర్తలను చర్లపల్లి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత సౌమ్యరెడ్డితో ఈవ్ టీజింగ్ కేసు పెట్టించి అరెస్ట్ చేయించారు. తరువాత ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఇప్పుడు రౌడీషీట్ తెరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని న్యాయం చేయండి’ అంటూ పుష్పలత ఏప్రిల్ 12న హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను ఏసీజే పిల్ కమిటీకి పంపారు. దానిని పరిశీలించిన పిల్ కమిటీలోని న్యాయమూర్తులు ఈ లేఖను పిల్‌గా పరిగణించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. లేఖను పరిశీలిస్తే ఇది వ్యక్తిగత వివాదంగా కనిపిస్తున్నప్పటికీ, పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్న కేసులు పెరిగిపోతున్నాయని ఓ న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా రాశారు. సమాజంలో ఇటీవలి కాలంలో ఈ ధోరణి ఎక్కువైపోయిందని, అందువల్ల ఈ లేఖను పిల్‌గా పరిగణించడమే సబబని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఏసీజే ఈ లేఖను పిల్‌గా పరిగణిస్తూ ఆ మేర తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు. రిజిస్ట్రీ ఈ లేఖను పిల్‌గా మలిచి, తదుపరి విచారణ నిమిత్తం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఉంచింది. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం విచారించిన ధర్మాసనం, ప్రతి వాదులందరికీ నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలంటూ విచారణను జూలై 4కి వాయిదా వేసింది. -
అక్రమ కేసులకు భయపడం
► వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్ జగన్ మాటల్లో తప్పేముంది? ► మృతులకు రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాల్సిందే ► వనజాక్షి విషయంలో ఈ దూకుడేది..? ► డీఎన్నార్ ఆధ్వర్యంలో నిరసనలు కైకలూరు : నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలితీసుకున్న దారుణఘటనపై నిలదీసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) డిమాండ్ చేశారు. అక్రమ కేసులను నిరసిస్తూ నియోజకవర్గవ్యాప్తంగా కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి మండల కేంద్రాల్లో ఉద్యమించారు. కైకలూరులోని పార్టీ కార్యాలయం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి తాలూకా సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు గురువారం ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఎన్నార్ మాట్లాడుతూమృతిచెందిన కుటుంబాలు, బాధితుల పక్షాన నిలదీసిన జగన్‌పై అధికార పార్టీ నాయకులు బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేవలం దివాకర్ బస్సు ట్రావెల్స్‌కు మేలు చేసే విధంగా అధికార చర్యలు ఉన్నాయన్నారు. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. జగన్‌పై కేసులు ఎత్తివేసి క్షమాపణ చెప్పకపోతే దశలవారీ అందోళన చేస్తామని హెచ్చరించారు. జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డు నోబుల్ మాట్లాడుతూ మహిళా తహసీల్దార్ వనజాక్షిని ఈడ్చుకువెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై రెవెన్యూ సంఘాలు ఏం చర్యలు తీసుకున్నాయని ప్రశ్నించారు. పార్టీ మైనార్టీ నాయకులు అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ జలీల్‌ఖాన్ ఏ పార్టీ నీడన బతికారో మరచిపోయి స్థాయికి మించి మాట్లాడుతున్నారన్నారు. పంజా రామారావు, మీగడ వెంకట కృష్ణారావు, నున్న రాంబాబు, తోట శేషవేణి, సలార్, దండే రవిప్రకాష్, బండి ప్రసాద్, విక్టర్, శ్యామలా, రహంతుల్లా, ఎంపీటీసీ ఆదినారాయణ, సంజీవరావు, జయరాజు, తాతాలు, అజ్మిత్భాషా, బాలమ్మ, రాఘవులు పాల్గొన్నారు. న్యాయ విచారణ చేపట్టాలి... దివాకర్ బస్సు ప్రమాదఘటనపై న్యాయ విచారణ చేయించాలని పార్టీ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కందుల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వైఎస్.జగన్‌పై అక్రమ కేసును నిరసిస్తూ కలిదిండిలో ఉద్యమించారు. నాయకులు ఛాంద్ భాషా, పంతగాని విజయ్, యలవర్తి శ్రీనివాసరావు, యాళ్ళ జీవరత్నం, సమయం సత్యనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు. కేసు ఎత్తివేయాలి.... మండవల్లి : చంద్రబాబు నిరంకుశ పాలన ఎన్నాళ్లో సాగదని పలువురు వైఎస్సార్ సీపీ నేతలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చేబోయిన వీర్రాజు,ఎంపీపీ సాకా జసింత, వైస్ ఎంపీపీ యార్లగడ్డ సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు బోనం శేషగిరి, పెరుమాళ్ళ కొండారెడ్డి, మాజీ ఎంపీటీసీసభ్యుడు పెరుమాళ్ళ పెదవెంకటేశ్వర రెడ్డి, బేబీసరోజిని, చొప్పరపు నాగబ్రహ్మారావు కార్యకర్తలు పాల్గొన్నారు. బాబూ.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే... ముదినేపల్లి రూరల్ : వైఎస్సార్ సీపీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వై.ఎస్.జగన్ మోహనరెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిమ్మగడ్డ భిక్షాలు, మండల కన్వీనర్ బడుగు భాస్కరరావు స్పష్టం చేశారు. పార్టీ ముఖ్యనేతలు బాబూ రాజేంద్రప్రసాద్ ,బేతపూడి వెంకటరమణ, షేక్ అల్లాభక్షు, బండి నాగరాజు, దాసరి శ్రీను, నేతలు పెద్దిబోయిన శివనాగరాజు, కట్టా వెంకటేశ్వరరావు, వర్రే నాగేంద్ర, బోయిన బోసు, గంటా సంసోను, దండే మోక్షానందం, దేవకోటి వెంకటేశ్వరరావు,కార్యకర్తలు పాల్గొన్నారు. -
గిరిజనుల పక్షాన పోరాడితే అక్రమ కేసులా?
తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పక్షమా? పెట్టుబడిదారుల పక్షమా? పోలీసులు తెలుగుదేశం కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు కావాలనే వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు నమోదుచేస్తున్నారు.. బోడికొండ, బడిదేవర కొండ తవ్వకాల అనుమతులు రద్దుచేసేవరకు పోరాడతాం వైఎస్సాసీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ పార్వతీపురం టౌన్: గిరిజనుల పక్షాన పోరాడేవారిపై అక్రమ కేసులు బనాయించడం తగదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. గుండెనొప్పితో బాధపడుతూ పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్‌ను మంగళవారం పరామర్శించారు. ఆస్పత్రి సూపరిం టెండెంట్ జి.నాగభూషణరావుతో మాట్లాడి ప్రసన్నకుమార్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బెల్లాన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పక్షమా లేక పెట్టుబడిదారుల పక్షమా చెప్పాలడి డిమాండ్ చేశారు. గిరిజనుల పొట్టకొట్టేలా బోడికొండ, దేవరకొండలపై గ్రానైట్ తవ్వకాలకు అనుమతులివ్వడం విచారకరమన్నారు. కొండలు కనుమరుగైతే భూములకు సాగునీరు అందదని గిరిజనులు తిరగబడ్డారన్నారు. వారికి మద్దతిచ్చిన వైఎస్సార్ సీపీ, వామపక్షాల నాయకులపై కేసులు పెట్టడం తగదన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీç Üులు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, అవసరమైతే జిల్లా, రాష్ట్ర నాయకత్వం బోడికొండ, బడిదేవర కొండవద్దకు వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఒక చిన్న సంఘటనలో అరెస్టుచేసిన వ్యక్తిని రెండు రోజుల పాటు ఎక్కడ దాచారో తెలపకుండా కనీసం ఆహారం కూడా పెట్టకుండా పోలీసులు హింసిస్తుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజాప్రతినిధులను ఉగ్రవాదుల్లా అర్ధరాత్రి వేల అడవుల్లో తిప్పడం ఏమటని ప్రశ్నించారు. పాలకులు కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండడం విచారకరమన్నారు. బోడికొండ, బడిదేవర కొండల తవ్వకాల అనుమతులు రద్దు చేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు గర్భాపు ఉదయభాను, జిల్లా నాయకులు చుక్క లకు‡్ష్మనాయడు, చింతల జగన్నాథం, తీళ్ల శువిన్నాయుడు, ఎస్.వీ.ఎస్.ఎన్.రెడ్డి, బలిజిపేట మండలం నాయకులు పాలవలస మురళీకృష్ణ, దేవుపల్లి శ్రీనివాస్, గుళ్ల రాజు, కేవీ రావు, వారణాసి కాసి, శ్రీను, సత్యనారాయణ, కౌన్సిలర్లు ఎస్.శ్రీనివాసరావు, ఒ.రామారావు, గొల్లు వెంకటరమణ, గండి శంకరరావులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులపై న్యాయ పోరాటం
పెనుకొండ : పెనుకొండ మండలం దుద్దేబండ పంచాయతీ కేంద్రంలో వైఎస్సార్సీపీ సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డిలతో పాటు ఇతరులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే పోలీసులు అక్రమ కేసును బనాయించారని విమర్శించారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసు వ్యవహారంపై ఎస్ఐ లింగన్నతో చర్చించడానికి శంకరనారాయణ పార్టీ శ్రేణులతో కలిసి గురువారం పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లారు. అయితే ఎస్ఐ అందుబాటులో లేకపోవడంతో కాసేపు వేచిచూశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని అడిగిన శ్రీకాంత్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలపై పెద్దిరెడ్డి, శీనా, కేశవయ్య, రాజులు పక్కా ప్రణాళికతో దాడి చేశారన్నారు. తమ పంచాయతీ కేంద్రంలో ఇతర పంచాయతీకి చెందిన వ్యక్తులు రావడమే కాకుండా దాడి చేశారని సర్పంచ్, ఎంపీటీసీ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. ఫిర్యాదు చేసిన వ్యక్తులపైనే కేసులు బనాయించడం అన్యాయమన్నారు. దాడి చేసిన వారికి నేరచరిత్ర ఉందని తెలిపారు. ఎమ్మెల్యే బీకే.పార్థ«సారథి ఒత్తిడి చేసి కేసులు పెట్టించారన్నారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి, తమ పార్టీ నాయకులు ఫిర్యాదు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను కలవనున్నట్లు తెలిపారు. -
'ఓపిక, ఊపిరి ఉన్నంతవరకూ పోరాడతా'
తుని: ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కాపులను బీసీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి 9వ షెడ్యూల్లో చేర్చమని పంపే హామీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గుర్తులేదని కాపు ఉద్యమనేత, ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ఎన్నికలలో కాపు రిజర్వేషన్‌ను పునరుద్దరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయమని కోరితే చంద్రబాబు అందరిన్నీ ముద్దాయిలుగా చేస్తున్నారన్నారని మండిపడ్డారు. గత తుని కాపు ఐక్య గర్జన సంఘటన సమయంలో ప్రభుత్వం అమాయకులపై కేసులు బనాయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో విషయంలో ముద్రగడ పద్మనాభం సోమవారం కాపు ఉద్యమ సోదరులందరికీ మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేశారు. తుని ఘటనపై తిరిగి పునర్విచారణ పేరుతో వందల మందిని కేసులలో ఇరికించడానికి ఇటీవల మనలో కొంతమందికి నోటీసులు పంపినట్టు మీడియా ద్వారా తనకు తెలిసిందని లేఖలో తెలిపారు. మీడియాలో అనుకూలంగా వార్తలు వస్తున్నాయని మీడియా స్వేచ్ఛపై ప్రభుత్వం ఆంక్షలు కూడా మనకు తెలిసేందనన్నారు. కేసులో విషయంలో ఏ పోలీసు అధికారి విచారణ పేరుతో నోటీసులు పంపినా తీసుకోండి' అని ముద్రగడ పిలుపునిచ్చారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి ధైర్యంగా వెళ్లండి అని చెప్పారు. కొత్త పథకాల పేరుతో చంద్రబాబు మనల్ని మోసగించే ప్రకటనలు చేస్తున్నారనీ, వారి మాటలు అబద్దాలతో నడుస్తున్నాయన్న సంగతి గమనించండి' అంటూ ముద్రగడ సూచించారు. చివరికి బేడీలు వేయించి జైలుకు పంపినా సిద్ధపడండి' అంటూ లేఖలో తెలిపారు. కేసులకు భయపడడానికి మన సోదరలందరూ ముద్దాయిలం కాదూ.. సంఘవిద్రోహులం, తీవ్రవాదులం అంతకటే కాదన్నారు. తెలగ, బలిజ, ఒంటరి బిడ్డలమని పేర్కొన్నారు. ఎక్కడా కూడా పిరికితనం, భయం ఉండకూడదన్నారు. ఈ పోరాటంలో మీతోపాటే నేను కూడా ఉన్నాను' అని చెప్పారు. 'నన్ను నా కుటుంబాన్ని అవమానించడం వల్ల ఉద్యమం నుంచి తొలగిపోను. ఎన్ని అవమానాలు ఎదురైనా భరిస్తాను. ప్రలోభపెట్టి, భయపెట్టి నానుంచి మిమ్మల్ని దూరం చేసినా ఉద్యమం నుంచి పారిపోను' అని స్పష్టం చేశారు. ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంతవరకూ జాతి కోసం పోరాడతాను అని మరోసారి చెబుతున్నానంటూ ధైర్యం చెప్పారు. భావితరాల భవిష్యత్తు కోసం అందరం సైనికుల్లా పోరాడుదాం' అని ముద్రగడ పిలుపునిచ్చారు. దయచేసి పోలీసు విచారణ కోసం ఎవరూ, ఏ చోటికి హాజరైంది తేది, స్థలంతో పాటు, మీ పేరు, తండ్రి గారి పేరు, సెల్ నెంబరు, ఆధార్ కార్డు నెంబర్‌తో ఈ దిగువ తెలిపిన నెంబర్లకు నేను కోరిన సమాచారం యస్.ఎమ్.యస్. చేయండి. 98480 38888, 98482 77199, 98497 41777 మనలో చాలా మందికి వాట్సాఫ్ సౌకర్యం లేదు కావునా వారికి ఈ సమాచారాన్ని అందజేయడం అవసరమైతే ఈ సమాచారాన్ని మీరు తీసుకుని ఈ నెంబర్లకు పంపడం చేయమని ముద్రగడ కోరారు. -
టీడీపీ ఎమ్మెల్యే పైశాచికత్వం
అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కుయుక్తులు వైఎస్సార్సీపీ నాయకులపై.. అక్రమ కేసుల నమోదుకు అధికారులపై ఒత్తిడి రేపల్లె(గుంటూరు): టీడీపీకి చెందిన ఎమ్మెల్యే పైశాచికత్వం ఆకాశాన్నంటుతోంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయిస్తూ గ్రామాల్లో భయాన వాతావరణాన్ని సృష్టిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు విధుల నిర్వహణలో అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారుతున్నామని అధికారులు ఆత్మవిమర్శలో పడ్డారు. పుష్కరాల్లో జరిగిన కోట్ల రూపాయల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు గ్రామాల్లో చిచ్చురేపుతూ ప్రజలను పక్కదోవపట్టించేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘాట్ సమీపంలో బ్యానర్ కట్టారని... టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బ్యానర్లతో పాటు, ఎమ్మెల్యే ఫొటో ఉన్న పసుపు బెలూన్ను పెనుమూడి పుష్కరఘాట్‌లోని ఆంజనేయస్వామి దేవాలయంపై ఎగరవేశారు. దీంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు బ్యానర్‌ను ఈనెల 12వ తేదీన పెనుమూడి గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు, ఫిషర్ మెన్ నాగిడి వెంకటేశ్వరరావు తన పడవపై ఏర్పాటు చేసి పుష్కర ఘాట్‌కు దూరంగా ఆవలి ఒడ్డున నిలిపారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకుల బ్యానర్లు పుష్కర ఘాట్ సమీపంలో ఉండటానికి వీలులేదంటూ స్థానిక ఎమ్మెల్యే అదే రోజు సాయంత్రం పడవపై వైఎస్సార్ సీపీ నాయకుడు ఏర్పాటు చేసిన బ్యానర్‌ను అధికారులతో తొలగించి వేయించారు. అయితే టీడీపీ బ్యానర్లను అలాగే ఉంచి వైఎస్సార్ సీపీ బ్యానర్‌ను తొలగిస్తే పక్షపాతమంటూ ప్రజల్లో విమర్శలు వస్తాయని చెప్పిన అధికారులపై ఎమ్మెల్యే దుర్భాషలాడారు. ఆ పరిస్థితుల్లో విధిలేక వైఎస్సార్సీపీ బ్యానర్‌ను అధికారులు తొలగించారు. దీంతో పాటు పెనుమూడి ఘాట్ రోడ్డులో వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన మోపిదేవి భారీ కటవుట్‌ను కొసి వేయటం, ఎమ్మెల్యే నేరుగా వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్‌కు ఫోన్ చేసి బెదిరించటంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వివాదాలలు సృష్టించి నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సహనంగా వ్యవహరించాలని, పుష్కర సమయంలో భక్తులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగాలని మోపిదేవి సూచిస్తూ ఆ దిశగా ముందుకు సాగారు. అయినప్పటికీ 12వ తేదీన తన విధులకు ఆటంకం కలిగించారంటూ పెనుమూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు నాగిడి వెంకటేశ్వరరావుపై ఈనెల 17వ తేదీన ఆకస్మికంగా తహశీల్దార్ ఎం.నాగిరెడ్డి ఫిర్యాదు చేయటం, మరుసటి రోజు (18వ తేదీ) కేసు నమోదు చేయటం చకచకా జరిగిపోయాయి. దీనిపై తహశీల్దార్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. తహశీల్దార్‌పై ఒత్తిడి తీసుకువచ్చి ఐదురోజుల తరువాత ఫిర్యాదు చేయించటంపై అధికార వర్గల్లో కలకలం మొదలైంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు.. పెనుమూడి గ్రామానికి చెందిన నాగిడి వెంకటేశ్వరరావు ఈనెల 12వ తేదిన పెనుమూడి పుష్కర ఘాట్ వద్ద ఫెక్సీ ఏర్పాటు చేసి విధులకు ఆటంక పరిచినట్లు ఈనెల 17వ తేదిన తహశీల్దార్ ఎం.నాగిరెడ్డి ఫిర్యాదు చేయటంతో ఈనెల 18వ తేది కేసునమోదు చేయటం జరిగింది. – ఎన్.సుబ్రమణ్యం, ఎస్ఐ -
వైఎస్ఆర్ సీపీ నేత కేజే కుమార్ జైలునుంచి విడుదల
చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ ఆయన కుటుంబసభ్యులు సురేష్, యువరాజ్ మంగళవారం సత్యవీడు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనను పార్టీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులు ఫోన్లో పరామర్శించారు. కాగా ఎమ్మెల్సీని అడ్డుకున్నారంటూ దాఖలైన కేసులో కేజే కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి సత్యవేడు సబ్‌జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈనెల 3న నగరిలో వైఎస్ఆర్సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతికుమార్‌పై ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు అనుచరులు దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ముద్దుకృష్ణమనాయుడు ఫిర్యాదు చేశారంటూ పోలీసులు కేజే కుమార్‌ను, ఆయన తనయుడిని అరెస్టు చేశారు. -
నగరి కోర్టుకు కేజే కుమార్
నగరి : చంద్రగిరి ఎంఎల్ఎ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని వరుస కేసులతో వెంటాడిన పోలీసులు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్‌పై దృష్టి పెట్టారు. ఎమ్మెల్సీని అడ్డుకున్నారంటూ దాఖలైన కేసులో ఈయన్ను మూడు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి సత్యవేడు సబ్‌జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పోలీసులు పాత కేసు తిరగదోడారు. గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసును తెరమీదకు తెచ్చారు. ఈ కేసు విచారణకు సంబంధించి కేజే కుమార్‌ను శుక్రవారం పీటీవారెంట్‌పై పోలీసులు నగరి జూనియర్ సివిల్ మెజిస్ట్రేట్ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ నెల 26 వరకు రిమాండ్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు జారీచేసినట్లు సీఐ మల్లికార్జున గుప్తా తెలిపారు. మళ్లీ ఆయనను సత్యవేడు సబ్ జైలుకు తరలిస్తామన్నారు. కోర్టుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజేకుమార్ను చూడడానికి ఆయన సతీమణి చైర్పర్సన్ కే.శాంతి, కుటుంబసభ్యులతో పాటు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో కోర్టు ఆవరణకు చేరుకున్నారు. పోలీసు వ్యాన్ నుంచి దిగిన భర్తను చూసి చైర్పర్సన్ కె.శాంతి కన్నీరు పెట్టుకున్నారు. -
చిత్తూరు జిల్లాలో జర్నలిస్టుల నిరసన
తిరుపతి: అమరావతి భూకుంభకోణాన్ని వెలికి తీసిన సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, మదనపల్లెల్లో సోమవారం పాత్రికేయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. విధి నిర్వహణలో ఉన్న ఫోటో, వీడియో జర్నలిస్టులపై దాడిచేసిన వారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశాయి. తిరుపతిలో జర్నలిస్టులు నల్ల రిబ్బన్లు ధరించి ప్రెస్‌క్లబ్ నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి జర్నలిస్టులపై తప్పుడు కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రెస్‌క్లబ్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, జర్నలిస్టు అసోషియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) సభ్యులు, సాక్షి నెట్వర్క్ ఇన్చార్జ్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులో.. చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో నగరంలో పాత్రికేయులు కలెక్టరేట్ చేరుకుని నారాయణ భరత్ గుప్తకు వినతిపత్రం ఇచ్చారు. సాక్షి జర్నలిస్టులను వేధింపులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మదనపల్లెలో.. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అక్కులప్ప, ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మదనపల్లెలో పాత్రికేయులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాచేశారు. అనంతరం సాక్షి జర్నలిస్టులను వేధింపులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కృతికాభాత్రాకు వినతి పత్రం సమర్పించారు. -
విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
వైఎస్సార్ విద్యార్థి విభాగం డిమాండ్ అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్కేయూలో విద్యార్థుల సమస్యలపై ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నాయకులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ఎస్కేయూ విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి కల్పించాలని, మరోవైపు అధిక మెస్ బిల్లులు వస్తుండడంపై వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సెంట్రల్ ఆఫీస్ స్టోర్ వద్ద ధర్నా చేస్తే విద్యార్థి సంఘం నాయకులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. యూనివర్సిటీలో వీసీ పాలన కాకుండా పోలీసు పాలన జరుగుతోందన్నారు. సమస్యలపై ఏ చిన్న ధర్నా చేసినా పోలీసులకు ఫిర్యాదు చేసి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా అక్రమ కేసులు, అక్రమ దాడులు చేస్తే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు సుధీర్‌రెడ్డి, బాబాసలాం, నగర కార్యదర్శులు పూర్ణచంద్ర, సురేష్ పాల్గొన్నారు. -
'సీఎం ఒత్తిడి వల్లే మాపై అక్రమ కేసులు'
-
'సీఎం ఒత్తిడి వల్లే మాపై అక్రమ కేసులు'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పథకం ప్రకారమే ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ నేతలపై కేసులు పెడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. రేణిగుంట విమానాశ్రయం ఘటనలో సీఎం చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే మాపై కేసులు పెట్టారని ఎమ్మెల్యే వివరించారు. ఇటువంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని, కోర్టులపై మాకు నమ్మకం ఉందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. -
కేసీఆర్‌ను కుర్చీలోంచి దించుతా..
* ఏసీబీ దాడి అనంతరం మీడియాతో రేవంత్ * అనుయాయులకు కట్టబెట్టిన అక్రమాస్తులపై కేసులు పెట్టిస్తా * నాపై ప్రయోగించిన పోలీసులతోనే వారిని ఈడ్చుకొచ్చి లోపలేయిస్తా * ఏసీబీ దాడి అనంతరం మీడియాతో రేవంత్ సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కుర్చీలోంచి దించుతా. ఆయన పరిపాలనలో ఏవైతే అక్రమంగా ఆస్తులను అనుయాయులకు కట్టబెట్టిండో వాటిపై కేసులు కట్టిస్తా. ఈ రోజు నాపై ప్రయోగించిన పోలీసులతోనే వారిని ఈడ్చుకొచ్చి లోపలేపిస్తా. వీటన్నింటినీ రాజకీయంగా ఎదుర్కొంటా. నాకు మనోస్థైర్యం ఉంది. నా వెనుక పార్టీ ఉంది. కార్యకర్తలు, అభిమానుల అండ ఉంది...’ అని తనపై ఏసీబీ దాడుల అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మిత్రుడు సమస్య చెప్పుకుంటానంటే వచ్చా ‘నా మిత్రుడు ఏదో సమస్య చెప్పుకుంటా రాండ్రి అంటే వచ్చా. నాలుగు గంటలకు చంద్రబాబును కలవాల్సి ఉంది. కానీ అంతకంటే ముందే ఇక్కడికి వచ్చినా.. ఇక్కడికి వచ్చినాక ఇది జరిగింది. సీఎం కేసీఆర్ శాసనమండలి సీట్లు గెలవాలనే కోరికతోనో లేదా తెలుగుదేశం పార్టీని, రేవంత్‌రెడ్డిని ఎదుర్కొలేక గతంలో ఏవైతే అక్రమ కేసులు పెట్టాడో అందులో భాగంగా ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నాడు. రాబోయే 25 సంవత్సరాల్లో ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రశేఖర్‌రావుపై పోరాడతా. ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఇది రేవంత్‌రెడ్డి తెలుగుదేశం వర్సెస్ కేసీఆర్ టీఆర్ఎస్. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా నైతిక స్థైర్యం కోల్పోను. ధైర్యంగా నిలబడతా’ అని రేవంత్ పేర్కొన్నారు. తీసుకొచ్చి లోపలేస్తే ఏం చేస్తావ్... మీ దగ్గర రూ.50 లక్షలు దొరికినట్లుగా ఏసీబీ అధికారులు అంటున్నారని విలేకరులు ప్రశ్నించగా ఆగ్రహంగా ఊగిపోయిన రేవంత్‌రెడ్డి..‘పోలీసులు నిన్ను తీసుకొచ్చి లోపల వేసి.. నీ పేరు రాస్తే ఏం చేస్తావ్.. పోలీసులు ఎవరు.. ఎవరి ప్రభుత్వంలో పని చేస్తున్నారు.. ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే మీకు తెల్వదా. మీడియా గొంతు కోసినప్పుడు తెలియదా. చంద్రశేఖర్రావుగారు తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు..’ అని ఆరోపించారు. -
రైతులను అక్రమంగా వేధిస్తున్నారు..
-
రైతులను అక్రమంగా వేధిస్తున్నారు..
హైదరాబాద్ : రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు అంశాలపై అధికార పక్షాన్ని శుక్రవారం ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రైతుల సమస్యలతో పాటు వారిపై అక్రమ కేసులు బనాయించి, వేధిస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానమిచ్చారు. రైతులపై అక్రమంగా కేసులు బనాయించలేదని, అక్రమాలు జరిగాయనే ఆరోపణలతోనే విచారణ జరుపుతున్నారని, ఒకవేళ అక్రమమని తేలితే రైతులపై కేసులు తీసివేయటం జరుగుతుందన్నారు. -
అక్రమ కేసులు పెట్టారని.. గుండెపోటుతో మృతి
గుంటూరు: తమ పిల్లలపై అక్రమ కేసులు పెట్టారనే మనస్థాపంతో ఓ తండ్రి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. తండ్రి యూనిస్ అనే వ్యక్తి మనస్థాపంతో మృతిచెందాడు. అతడి మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద బందువులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అక్రమ కేసులను నిలువరించండి
శ్రీకాకుళం క్రైం/శ్రీకాకుళం పాతబస్టాండ్, తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అధికార బలంతో పోలీసులను పావుల్లా వాడుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వాటిని నిలువరించాలని ఆ పార్టీ నాయకులు జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్, ఇన్చార్జి కలెక్టర్ జి.వీరపాండ్యను సోమవారం వేర్వేరుగా కలిసి కోరారు. ఎస్పీని పార్టీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్‌కుమార్, ధర్మాన పద్మప్రియ తదితరులు కలిసి వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, పోలీసులు బనాయిస్తున్న అక్రమ కేసులను గురించి వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెరిగిపోయూయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులను వాడుకుంటూ వైసీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా అక్రమ కేసులను బనాయిస్తున్నారని వాపోయూరు. ఎటువంటి తప్పులు చేయకపోయినా మంత్రి అచ్చెన్నాయుడు మాటలు విని తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో శాంతి భద్రతలకు టీడీపీ నాయకులు విఘాతం కలిగిస్తున్నారని, దీనికి కొంతమంది పోలీసులనే వాడుకుంటున్నారని చెప్పారు. సంతబొమ్మాళి మండలంలోని రామన్నపేటలో సీనియర్ నాయకుడు ఎన్ని చిన్నబాబు ఎటువంటి తప్పు చేయనప్పటికీ ఆతన్ని ఆరెస్టు చేసి నానాబెయిల్‌బుల్ వారెంటును జారీ చేశారని ఎస్పీకి వివరించారు. సంతబొమ్మాళి మండలం ఆర్.హెచ్.పురం మాజీ సర్పంచ్ మన్మథరావు, కొటబోమ్మాళి మండలం హరిశ్చంద్రపురానికి చెందిన చింతాడ ధర్మారావుపైనా కూడా అక్రమ కేసులు పెట్టి ఆరెస్టులు చేశారని వివరించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలిచ్చిన ఫిర్యాదులను పోలీసులు స్వీకరించటం లేదని ఫిర్యాదు చేశారు. గడిచిన మూడు నెలలుగా జిల్లాలో ఆరాచకం చోటు చేసుకుంటుందని వివరించారు. టెక్కలి డీఎల్పీవో కూడా వైఎస్ఆర్సీపీ సర్పంచ్ల నుంచి రికార్డులు తెప్పించుకొని, కార్యదర్శులను బయపెట్టి వారిపై కేసులు పెడుతున్నారని, చెక్కు పవర్ లేకుండా అక్రమంగా వ్యవహరిస్తున్నారని ఇన్చార్జి కలెక్టర్ వీరపాండ్యన్‌కు వివరించారు. ఎస్పీ, ఇన్చార్జి కలెక్టర్‌ను కలిసిన వారిలో వైఎస్ఆర్ సీపీ నాయకులు రొక్కం సూర్యప్రకాశరావు, చింతడ ధర్మరావు, కె.వి.వి.సత్యనారాయణ, కింజరాపు గణపతి, మురళీధర్‌బాబా, కె.రామారావు, కె.చిన్నబాబు, జగన్నాయకులు ఉన్నారు. -
భద్రత పునరుద్దరించండి: కేసీఆర్ ను కోరిన శంకర్ రావు
హైదరాబాద్: తనకు భద్రత పునరుద్ధరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి శంకర్ రావు విజ్ఞప్తి చేశారు. శనివారం సాయంత్రం కేసీఆర్ ను శంకర్ రావు కలిశారు. తనపై అకారణంగా కేసులు పెట్టారని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమంగా తనపై పెట్టిన కేసుల్ని తొలగించాలని కేసీఆర్‌ను శంకర్ రావు కోరారు. గ్రీన్ ఫీల్స్ భూ వివాదంలో శంకర్ రావుపై కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అక్రమంగా వేల కోట్లు సంపాదించుకున్నారంటూ ఆరోపణలు చేసిన శంకర్ రావు.. డీజీపీపై విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే. -
అక్రమ కేసులు ఎత్తివేయాలి
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ :రైతు నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కేఎస్ఈ జడ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యతిరేక పోరాట కమిటీ బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి ఎస్ఈజెడ్ బాధితుల తరఫున పోరాడుతున్న రైతు నాయకుడు పెనుమళ్లు సుబ్బిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కేసు విచారణ పెండింగ్‌లో ఉండగా అరెస్ట్ చేయరాదన్న హైకోర్టు ఆదేశాలను పోలీసులు పాటించలేదని ఆరోపించారు. అక్రమ అరెస్టు చేసిన కాకినాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని, రిటైర్డ్ డీఎస్పీ హర్షవర్ధన్‌పై కేసు నమోదు చేయాలని, సుబ్బిరెడ్డిపై బనాయించిన ఐదు కేసులను ఎత్తివేయాలని, ప్రభుత్వ అనుమతి లేకుండా భూసేకరణ చేపట్టిన అప్పటి జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్ సింఘాల్ చర్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు కలెక్టర్ నీతూప్రసాద్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు రాజేంద్ర, సూర్యనారాయణమూర్తి, నారాయణస్వామి, వీరబాబు, టీడీపీ నాయకుడు వర్మ, బీజేపీ నాయకులు పద్మారెడ్డి, బీఎస్పీనాయకుడు చొల్లంగి వేణుగోపాల్ పాల్గొన్నారు. భూసేకరణ చట్టబద్దంగానే జరిగింది కాకినాడ సెజ్‌లో భూసేకరణ అంతా చట్టబద్దంగానే జరిగిందని కేఎస్ఈజెడ్ ప్రతినిధులు బుధవారం పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొందరు హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్లపై హైకోర్టు సెజ్ కోసం భూముల కొనుగోలు చట్ట ప్రకారమే జరిగినట్టు తీర్పునిచ్చిందని తెలిపారు. చందు హర్షవర్ధన్ రక్ష సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో విధులు నిర్శహిస్తుండేవారని, విధి నిర్వహణలో భాగంగానే సెజ్ భూములను పర్యవేక్షించారు తప్ప పోరాట కమిటీ ఆరోపణలు సత్యదూరమన్నారు. సుబ్బిరెడ్డి అరెస్టు కేసుకు కాకినాడ సెజ్‌కు ఎటువంటి సంబంధం లేదని ఎస్ఈజడ్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు.