సత్యసాయిజిల్లా: కదిరి వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు | Illegal Cases Against Kadiri Ysrcp Leaders | Sakshi
Sakshi News home page

సత్యసాయి జిల్లా: కదిరి వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు

Published Tue, Mar 25 2025 11:21 AM | Last Updated on Tue, Mar 25 2025 12:45 PM

Illegal Cases Against Kadiri Ysrcp Leaders

దిరి వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగింది.

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరి వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, కదిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మక్బూల్‌ పై పోలీసులు అక్రమ కే‌సులు నమోదు చేశారు. చామలగొంది ఎంపీటీసీ లక్ష్మీదేవిని కిడ్నాప్ చేశారంటూ ఎఫఐఆర్ నమోదు చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఇప్పటికే ఎంపీటీసీ లక్ష్మీదేవి ఓ సెల్ఫీ విడియో విడుదల చేశారు. టీడీపీ నేతల డైరెక్షన్‌లో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. ఎంపీటీసీ లక్ష్మీదేవి దూరపు బంధువు నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 27న గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక  నేపథ్యంలో టీడీపీ కుట్రలకు తెరతీసింది.

గుత్తిలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
కాగా, అనంతపురం జిల్లా గుత్తిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ కోన మురళీధర్‌రెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్ధాలు, వాహనాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు.

శ్రీసత్యసాయి జిల్లా కదిరి YSRCP నేతలపై కక్షసాధింపు చర్యలు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement