సాక్షి, తాడేపల్లి: సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్ వేధింపులపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని.. ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తే లీగల్ టీమ్‌కు దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఎలాంటి అన్యాయం జరిగినా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని.. 9440284455, 9963425526, 9912205535 ఈ నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. మీ తరపున పోరాటం చేయడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని కార్యకర్తలకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు.
‘‘రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌ను సైతం లెక్కచేయడం లేదు. 41ఏ కింద నోటీసులిచ్చి విచారణ చేయాలని గైడ్ లైన్స్‌ఉన్నాయి. నోటీసులు ఇవ్వకుండానే అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి చిత్ర హింసలు పెడుతున్నారు. అరెస్ట్ చేసి రెండు, మూడు స్టేషన్లకు తిప్పుతున్నారు.’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: తప్పు చేసిన పోలీసులను సప్తసముద్రాల అవతల ఉన్నా వదలం: వైఎస్ జగన్ వార్నింగ్
‘‘టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌లో అన్నీ ఫేక్ పోస్టులే. అమ్మను చంపడానికి ప్రయత్నించానని పోస్టులు పెట్టారు. అది అబద్ధమని విజయమ్మ లేఖ విడుదల చేశారు. విజయమ్మ లెటర్ కూడా ఫేక్ అని మరో పోస్టు పెట్టారు. మాపై ఫేక్ పోస్టులు పెట్టినవారిపై చర్యలేవి?. పోలీసులు సెల్యూట్ కొట్టాల్సింది..మూడు సింహాలకు.. పోలీసులకు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. చంద్రబాబు ఆదేశాలతో అకృత్యాలు చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ నిలదీశారు.
ఇదీ చదవండి: అలాగైతే రాధాకృష్ణ, లోకేష్‌లను జైల్లో పెట్టాలి: వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment