ఏపీలో ఆగని తప్పుడు కేసులు, వేధింపులు.. అక్రమ అరెస్టులు | AP CM Chandrababu Naidu Govt Continues YSRCP Social Media Activists Illegal Arrests, More Details Inside | Sakshi
Sakshi News home page

ఏపీలో ఆగని తప్పుడు కేసులు, వేధింపులు.. అక్రమ అరెస్టులు

Published Mon, Nov 11 2024 9:06 AM | Last Updated on Mon, Nov 11 2024 11:16 AM

AP Chandrababu Govt Continues Social Media Illegal Arrests

అమరావతి, సాక్షి: సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వ వేధింపుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులను, మద్దతుదారులను మాత్రమే కాదు.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సామాన్యులపైనా ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో అక్కడక్కడ అక్రమ కేసులు.. అరెస్టులు.. నిర్బంధాలు కొనసాగుతున్నాయి. 

పోలీసు విచారణకు కాకాణి
టీడీపీ సీనియర్‌ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ  మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం ఇవాళ వెంకటాచలం పోలీస్ స్టేషన్‌కు రావాలని కాకాణికి కబురుపంపారు. దీంతో.. తన లీగల్‌ టీంతో కలిసి పీఎస్‌కు కాకాణి వెళ్లారు.

కడప కోర్టుకు వర్రా రవీంద్రారెడ్డి
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వర్రా రవీంద్రారెడ్డిని జిల్లా పోలీసులు అరెస్ట్‌చేసిన సంగతి తెలిసిందే. సీకే దీన్నే పీఎస్‌లో ఉన్న వర్రా రవీంద్రారెడ్డిని.. ఇవాళ కడప కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. కాసేపటి కిందట.. ఇన్చార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పీఎస్‌కు వచ్చారు. పీఎస్‌ వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. వర్రా రవీంద్రారెడ్డిని మాత్రమే కాదు.. ఆయన కుటుంబ సభ్యుల్ని సైతం పీఎస్‌లో అక్రమంగా నిర్బంధించి.. వైఎస్సార్‌సీపీ నిరసనలతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వర్రాను కలిసేందుకు కుటుంబ సభ్యులు రాగా, పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. చివరకు ఆందోళనకు దిగడంతో భార్య కళ్యాణిని మాత్రం అనుమతించారు.

ఇంటూరిని వదలని పోలీసులు

సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌కు పోలీసులు వదలడం లేదు. ఏదో ఒక కేసుతో.. వంకతో పీఎస్‌ల చుట్టూ తిప్పుతున్నారు. 

  • గత అర్ధరాత్రి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

  • మీడియా కంట పడకుండా జాగ్రత్త పడిన పోలీసులు

  • తమకు ఎటువంటి సమాచారం లేకుండా విశాఖ టు టౌన్ నుండి రాజమండ్రి ప్రకాష్ నగర్ స్టేషన్కు రవికిరణ్ తరలించారని ఆరోపిస్తున్న భార్య

  • ఎటువంటి ఫార్మాలిటీస్ లేకుండానే తరలించడంపై ఆందోళన

  • ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో రవికిరణ్ ను  భార్య బంధువులకు చూపించని పోలీసులు

  • ఏ కేసు పై రవి కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారో ఎఫ్ఐఆర్ కాపీ కూడా పోలీసులు చూపించడం లేదంమని ఆరోపిస్తున్న రవికిరణ్ భార్య, బంధువులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement