inturi ravikiran
-
ఇంటూరి రవికిరణ్‌పై ప్రకాశం జిల్లా పోలీసుల దురుసు ప్రవర్తన
సాక్షి, ప్రకాశం జిల్లా: సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కోర్టు షరతు మేరకు సంతకం పెట్టేందుకు ప్రకాశం జిల్లా మార్టూరు స్టేషన్‌కు వెళ్లిన ఇంటూరిని.. అక్కడ నుంచి పర్చూరుకు సిఐ తీసుకెళ్లారు. ఇంటూరి రవి కిరణ్.. ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. కనీసం కేసు వివరాలు కూడా చెప్పకుండా పర్చూరు పోలీసులు దురుసుగా వ్యవహరించారు.కిడ్నాపర్లలా వ్యవహరించిన ప్రకాశం జిల్లా పోలీసులు.. తెల్ల కాగితంపై బలవంతంగా సంతకం చేయించుకొని గుర్తు తెలియని ప్రదేశంలో ఇంటూరి రవి కిరణ్‌ను వదిలేశారు. కనీసం ఏ కేసుపై తీసుకొని వెళ్ళారో కూడా చెప్పని సీఐ శేషగిరి రావు.. ఇంటూరిని ఇబ్బంది పెట్టిన అంశంలో ఇదే సీఐకు న్యాయస్థానం షాకాజ్ నోటీసులు ఇచ్చింది. కక్ష సాధింపులో భాగంగా మరో అక్రమ కేసు బనాయించడానికి పోలీసులు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
న్యాయ సాయం కోరే హక్కు నిందితునికి ఉంది
సాక్షి, అమరావతి : ఏదైనా కేసులో నిందితుడిని పోలీసులు పీటీ వారెంట్ మీద మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినప్పుడు, అతను పోలీసు లేదా జ్యూడిషియల్ కస్టడీని వ్యతిరేకిస్తూ తనకు న్యాయ సాయం అందించాలని మేజిస్ట్రేట్‌ను కోరవచ్చని హైకోర్టు తెలిపింది. అలా కోరే హక్కు నిందితుడికి ఉందని స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్లు నిందితుడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడింది. సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌కు హైకోర్టు ఈ వెసులుబాటుని ఇచ్చింది. రవికిరణ్‌కు సంబంధించి వివరాలేమీ పోలీసులు తమకు తెలియజేయడంలేదని, దీంతో న్యాయ సాయం పొందే అవకాశం లేకుండా పోతోందన్న అతని తరఫు న్యాయవాది వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే రవికిరణ్‌పై నమోదైన కేసుల వివరాలును తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పీటీ వారెంట్ల వివరాలను పోలీసులు నిందితునికి తెలియచేయాల్సిన పని లేదని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది. తన భర్త రవికిరణ్‌పై ఉన్న కేసుల వివరాలు, పీటీ వారెంట్లపై పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదంటూ ఇంటూరి సుజన హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సుజన తరఫున న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది (హోం) ఎ.జయంతి వాదనలు వినిపించారు. -
ఇంటూరి రవికిరణ్ ను కూటమి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది
-
నా భర్తకు ప్రాణహాని ఉంది: ఇంటూరి రవికిరణ్ భార్య సుజన
సాక్షి, విశాఖపట్నం: తన భర్త ఇంటూరి రవికిరణ్‌పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తోందని ఆయన భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె విశాఖ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారో తెలియదు. కేసుల గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పడం లేదన్నారు.‘‘ఇంటూరి రవి కిరణ్ ఆరోగ్యం బాగోలేదు. రవి కిరణ్ హార్ట్ పేషెంట్, రోజు 8 గంటలు రెస్ట్ తీసుకోవాలి. రోజూ ఐదు నుంచి ఆరు వందల కిలోమీటర్ల తిప్పుతున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?. పోలీసుల నుంచి రవి కిరణ్‌కు ప్రాణ హాని ఉంది. పీటీ వారెంట్ మీద రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు. పోలీసులు మొత్తం సోషల్ మీడియా కార్యకర్తల కోసం పని చేస్తున్నారు. రవి కిరణ్‌పై 20 కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది’’ అని సుజన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన తన పైన కూడా దువ్వాడ, రాజమండ్రి సీఐలు దురుసుగా ప్రవర్తించారు. రవికిరణ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని డాక్టర్లు చెప్పిన కూడా పోలీసులు వినిపించుకోలేదు. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా రవికిరణ పై కేసులు పెట్టిస్తోంది. టీడీపీ నాయకులతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పిస్తున్నారు’’ అని సుజన తెలిపారు.ఇదీ చదవండి: పరామర్శకు వెళితే.. చెవిరెడ్డిపై పోక్సో కేసు -
నా భర్తను ఎందుకు కలవనివ్వడం లేదు..? ఇంటూరి రవికిరణ్ భార్య సంచలన వ్యాఖ్యలు
-
దయచేసి నా భర్తను హాస్పిటల్ లో చూపించండి.. ఇంటూరి రవికిరణ్ భార్య ఎమోషనల్..
-
జైల్లో నా భర్తకు ఏమైనా అయితే.. ఇంటూరి రవికిరణ్ భార్య వార్నింగ్
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఇంటూరి రవికిరణ్ భార్య
సాక్షి,తాడేపల్లి: తన భర్త సోషల్‌మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు కావాలనే వేధిస్తున్నారని ఆయన భార్య ఇంటూరి సుజన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం(నవంబర్ 12) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఆమె కలిశారు. తన భర్తను పోలీసులు కేసుల పేరిట వేధిస్తున్న తీరును ఆమె వైఎస్‌జగన్‌కు వివరించారు. అనంతరం ఇంటూరి సుజన మీడియాతో మాట్లాడుతూ‘తన భర్త ఇంటూరి రవికిరణ్‌పై ఇప్పటికి తొమ్మిది కేసులు పెట్టారని, ఇంకా కేసులున్నాయని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల వేధింపులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళితే అండగా ఉంటామన్నారు. రవికిరణ్ చెప్పని మాటలను పోలీసులే రాసుకుని కాగితాలపై సంతకం తీసుకున్నారు. నా భర్తకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత’అని సుజన అన్నారు.కాగా,సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌ను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ప్రకాష్‌నగర్ పోలీసులు విశాఖపట్నం వెళ్లి అక్కడ మహారాణిపేట పోలీసుల అదుపులో ఉన్న రవికిరణ్‌ను అరెస్టు చేసి రాత్రి 11 గంటల సమయంలో రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. రవికిరణ్ అరెస్టుపై ఆయన భార్య సుజనకు కనీస సమాచారం ఇవ్వలేదు. ఎవరి సంతకం లేని ఒక పేపర్ చూపించి రాజమహేంద్రవరం తరలించారు. ఇదీ చదవండి: వారమైన ఆచూకీ లేదు.. రమణారెడ్డి ఎక్కడ -
సోషల్ మీడియా యాక్టివిస్టులు వర్రా, ఇంటూరి అరెస్ట్
కడప అర్బన్/రాజమహేంద్రవరం రూరల్: అసభ్యకర పోస్టులు పెట్టారనే నెపంతో సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు వర్రా రవీంద్రారెడ్డిని, ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రవీంద్రారెడ్డికి సహకరించారనే కారణంతో సుబ్బారెడ్డి, ఉదయ్ అనే వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. వర్రా అరెస్ట్‌కు సంబంధించి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, వైఎస్సార్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు మీడియాకు వెల్లడించారు. వర్రా రవీంద్రారెడ్డి ఆరేడేళ్ల నుంచి వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ద్వారా వైఎస్సార్సీపీ వ్యతిరేకులైన వివిధ పార్టీల నాయకులపై తప్పుడు సమాచారం, ఫొటోలు పోస్ట్ చేశాడని చెప్పారు.ఈ మేరకు ఈ నెల 8న పులివెందుల అర్బన్ పోలీసుస్టేషన్లో పుల్లప్పగారి హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై క్రైమ్ నంబరు 409/24, అండర్ సెక్షన్ 386 ఐపీసీ 196, 351(3), 353(1)(సి), 112(2)(బి) రెడ్‌విత్ 3(5) బిఎన్ఎస్ 2023 సెక్షన్ 3(1)(ఆర్)(ఎస్), 3(2)(వి)(ఎ) ఎస్సీ ఎస్టీ (పీఓఏ) అమెండ్మెంట్ యాక్టు 2015, 67 ఐటీ యాక్టు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న రవీంద్రారెడ్డి కోసం గాలిస్తుండగా ఆదివారం రాత్రి 11.35 గంటలకు ప్రకాశం జిల్లా కుంట– ఆత్మకూరు రహదారిలో దొరికాడని చెప్పారు. రవీంద్రారెడ్డితో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన కమలాపురం మండలం నల్లింగాయపల్లెకు చెందిన గుర్రంపాటి సుబ్బారెడ్డి అలియాస్ సుబ్బారెడ్డి, ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెకు చెందిన గురజాల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కూడా కారులో ఉండటాన్ని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.అనంతరం వారిని కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌కు తరలించి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని చెప్పారు. కోర్టులో పిటిషన్ వేసి వర్రాను పోలీసు కస్టడీలోకి తీసుకుంటామని డీఎస్పీ మురళి తెలిపారు. ఇదిలా ఉండగా తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని వారం రోజులుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని రవీంద్రారెడ్డి భార్య కళ్యాణి మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ఈ నెల 4వ తేది అర్ధరాత్రి వేముల మండలం కొండ్రెడ్డిపల్లెలోని తమ ఇంట్లోకి చొరబడి దౌర్జన్యంగా తన భర్తను తీసుకెళ్లారని చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి తమ అదుపులో లేడని పోలీసులు నాటకమాడారని ఆరోపించారు. పోలీసులు సోమవారం సాయంత్రం వర్రాను మీడియా ఎదుట హాజరు పరిచారు. ఇంటూరి విషయంలో హైడ్రామా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌ను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ప్రకాష్‌నగర్ పోలీసులు విశాఖపట్నం వెళ్లి అక్కడ మహారాణిపేట పోలీసుల అదుపులో ఉన్న ఆయన్ను అరెస్టు చేసి రాత్రి 11 గంటల సమయంలో రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. రవికిరణ్ అరెస్టుపై ఆయన భార్య సుజనకు కనీస సమాచారం ఇవ్వలేదు. ఎవరి సంతకం లేని ఒక పేపర్ చూపించి రాజమహేంద్రవరం తరలించారు. దీంతో ఆందోళన చెందిన ఆమె హుటాహుటిన సోమవారం తెల్లవారుజామున ప్రకాష్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తన భర్త రవికిరణ్ ఆచూకీ తెలపాలని కోరారు. హార్ట్ పేషెంట్ అయిన తన భర్త మందులు వేసుకోవాలని పోలీసుల్ని బతిమాలారు.12 గంటలపాటు స్టేషన్లోనే ఉన్న ఆయన్ని తనకు చూపించాలని కోరారు. అయినా పోలీసులు కనికరించలేదు. సెంట్రల్‌జోన్ డీఎస్పీ రమేష్‌బాబు ప్రకాష్‌నగర్ స్టేషన్‌కి రాగానే ఇన్స్పెక్టర్ బాజీలాల్ ఎఫ్ఐఆర్ సిద్ధం చేశారు. అనంతరం రవికిరణ్ భార్య సుజనను సంతకం చేసేందుకు పిలిచారు. ఏ నేరం చేశారని తన భర్తను అరెస్టు చేశారంటూ సుజన పోలీసులను నిలదీశారు. చివరకు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రవికిరణ్‌కు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టుకు తరలించారు.చెప్పని మాటలను చెప్పినట్లు రాశారు..ఆస్పత్రి ఆవరణలో రవికిరణ్ గద్గదస్వరంతో మీడియాతో మాట్లాడారు. తాను చెప్పని మాటలను చెప్పినట్లు రిపోర్టులో రాసి, తనతో సంతకాలు తీసుకున్నారని చెప్పారు. మధ్యవర్తుల సమక్షంలో రాయలేదని, టీడీపీకి పోలీసులు అమ్ముడుపోయారని మండిపడ్డారు. అనంతరం రవికిరణ్‌ను రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీనివాసరావు ముందు పోలీసులు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, రవికిరణ్ బెయిల్‌పై బయటకు వస్తే వెంటనే అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు గుంటూరు పట్టాభిపురం, పల్నాడు జిల్లా మాచర్ల పోలీసులు పోలీస్‌స్టేషన్ వద్ద, కోర్టు వద్ద మాటు వేశారు.ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా వెంటనే స్పందిస్తూ.. తను స్థానికంగా లేకపోయినా.. న్యాయవాదులను, పార్టీ నేతలను పోలీస్ స్టేషన్ వద్దకు పంపించారు. మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సుజనకు ధైర్యం చెప్పారు. రవికిరణ్‌కు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ రీజినల్ కో ఆర్డినేటర్ సాదిక్ హుస్సేన్ తెలిపారు.ఎఫ్ఐఆర్లో బలవంతంగా ఆరుగురి పేర్లుఎఫ్ఐఆర్లో సజ్జల భార్గవరెడ్డి, అర్జున్‌రెడ్డి, దొంతిరెడ్డి ఈశ్వరరెడ్డి, దొంతిరెడ్డి అమర్‌రెడ్డి, సుమారెడ్డి, జైరెడ్డి పేర్లను ఉద్దేశ పూర్వకంగా చేర్చిన ప్రకాష్‌నగర్ ఇన్స్పెక్టర్ బాజీలాల్.. నా భర్త ఇంటూరి రవికిరణ్‌తో దానిపై బలవంతంగా సంతకం చేయించారు. ఈ విషయాన్ని నా భర్త ప్రభుత్వాస్పత్రిలో చెప్పారు. ఇన్స్పెక్టర్ తీరు అసలు బాగోలేదు. నా భర్తపై పెట్టిన తప్పుడు కేసులతో గతనెల 21 నుంచి స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అయినా కేసులకు భయపడేది లేదు. – ఇంటూరి సుజన -
నాతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారు: ఇంటూరి రవికిరణ్
-
ఇంటూరి రవికిరణ్ భార్య షాకింగ్ నిజాలు
-
ఏపీలో ఆగని తప్పుడు కేసులు, వేధింపులు.. అక్రమ అరెస్టులు
అమరావతి, సాక్షి: సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వ వేధింపుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ శ్రేణులను, మద్దతుదారులను మాత్రమే కాదు.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సామాన్యులపైనా ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో అక్కడక్కడ అక్రమ కేసులు.. అరెస్టులు.. నిర్బంధాలు కొనసాగుతున్నాయి. పోలీసు విచారణకు కాకాణిటీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం ఇవాళ వెంకటాచలం పోలీస్ స్టేషన్‌కు రావాలని కాకాణికి కబురుపంపారు. దీంతో.. తన లీగల్ టీంతో కలిసి పీఎస్‌కు కాకాణి వెళ్లారు.కడప కోర్టుకు వర్రా రవీంద్రారెడ్డిసోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వర్రా రవీంద్రారెడ్డిని జిల్లా పోలీసులు అరెస్ట్‌చేసిన సంగతి తెలిసిందే. సీకే దీన్నే పీఎస్‌లో ఉన్న వర్రా రవీంద్రారెడ్డిని.. ఇవాళ కడప కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. కాసేపటి కిందట.. ఇన్చార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పీఎస్‌కు వచ్చారు. పీఎస్ వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. వర్రా రవీంద్రారెడ్డిని మాత్రమే కాదు.. ఆయన కుటుంబ సభ్యుల్ని సైతం పీఎస్‌లో అక్రమంగా నిర్బంధించి.. వైఎస్సార్సీపీ నిరసనలతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వర్రాను కలిసేందుకు కుటుంబ సభ్యులు రాగా, పోలీసులు ఓవరాక్షన్ చేశారు. చివరకు ఆందోళనకు దిగడంతో భార్య కళ్యాణిని మాత్రం అనుమతించారు.ఇంటూరిని వదలని పోలీసులుసోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌కు పోలీసులు వదలడం లేదు. ఏదో ఒక కేసుతో.. వంకతో పీఎస్‌ల చుట్టూ తిప్పుతున్నారు. గత అర్ధరాత్రి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులుమీడియా కంట పడకుండా జాగ్రత్త పడిన పోలీసులుతమకు ఎటువంటి సమాచారం లేకుండా విశాఖ టు టౌన్ నుండి రాజమండ్రి ప్రకాష్ నగర్ స్టేషన్‌కు రవికిరణ్ తరలించారని ఆరోపిస్తున్న భార్యఎటువంటి ఫార్మాలిటీస్ లేకుండానే తరలించడంపై ఆందోళనప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో రవికిరణ్ ను భార్య బంధువులకు చూపించని పోలీసులుఏ కేసు పై రవి కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారో ఎఫ్ఐఆర్ కాపీ కూడా పోలీసులు చూపించడం లేదంమని ఆరోపిస్తున్న రవికిరణ్ భార్య, బంధువులు -
ఏ కేసుపై అరెస్ట్ చేశారో FIR కాపీ చూపించడం లేదు: రవికిరణ్ భార్య
-
అదే దుర్మార్గం..
సాక్షి నెట్వర్క్: ప్రభుత్వ వైఫల్యాలపై, మోసాలపై, ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం మరోమారు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని అడిగినందుకు, ప్రభుత్వం ఇచ్చే సరుకుల్లో తూకం తేడా ఉందన్నందుకు, పింఛన్లు తెచ్చుకోవడానికి వెళ్లిన వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారని చెప్పినందుకు.. తుదకు కార్టూన్‌ను ఫార్వర్డ్ చేసినందుకు.. ఇలా చిన్న చిన్న విషయాలను సాకుగా చూపి తప్పుడు కేసులు పెడుతోంది. చెప్పాపెట్టకుండా ఇళ్లకు వచ్చి పోలీసులు ఎత్తుకెళ్లిపోతున్నారు. పలువురు బాధితులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుండటంతో వారి అరెస్టులు చూపక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఇంటూరి రవికిరణ్‌పై పోలీసులు మరో నింద మోపి తాజాగా ఇంకో కేసు నమోదు చేశారు. పులివెందులలో సజ్జల భార్గవ్‌రెడ్డి, మరో ఇద్దరిపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఆదివారం రోజే 13 కేసులు నమోదు చేశారంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో ఇట్టే తెలుస్తోంది. |ఇంటూరిపై 15కు చేరిన కేసులు మధురవాడ ధర్మపురి కాలనీకి చెందిన ఇంటూరి రవికిరణ్ పొలిటికల్ పంచ్ వెబ్ చానెల్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ట్విట్టర్ (ఎక్స్), ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్లో యాక్టివ్‌గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ పోలీసులు కేసుల పేరుతో మానసికంగా వేధించారు. ఇప్పటికే ఆయనపై దువ్వాడ, గుంటూరు, విజయవాడ, మార్టూర్ పోలీస్స్టేషన్లలో ఒక్కో కేసు.. గుడివాడ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేస్తూ 41ఏ నోటీసులు జారీ చేశారు. రాజమండ్రిలోని ప్రకాష్‌నగర్‌లోనూ పలు కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఇతనిపై దాదాపు 15 కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న రవికిరణ్‌ను దువ్వాడ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ పేరుతో రాత్రి 9 గంటలకు వరకు వేధించారు. చివరికి 41ఏ నోటీసులు అందించి ఈ నెల 11న మెజి్రస్టేట్ ముందు హాజరు కావాలని ఆదేశించి విడిచిపెట్టారు. ఈలోగా రవికిరణ్‌పై మహారాణిపేట పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు చేశారని తెలుసుకుని మళ్లీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఆదివారం ఉదయం మళ్లీ మహరాణిపేట పోలీసులు విచారణకు తీసుకొచ్చారు. అనంతరం రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలీసులు వచ్చి, రవికిరణ్‌ను తీసుకెళ్లిపోయారు. కుటుంబ సభ్యులెవరికీ సమాచారం ఇవ్వలేదు. పీటీ వారెంట్‌పై మార్టూరుకు వెంకటేష్ గాజువాక మండలం గొల్ల జగ్గరాజుపేటకు చెందిన బోడి వెంకటేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఈ నెల 3న బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 5న బాపట్ల పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే దువ్వాడ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. 6న దువ్వాడ పోలీస్ స్టేషన్లో టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరోసారి వెంకటేష్‌ని తీసుకెళ్లారు. 7న మరోసారి విచారణకు పిలిపించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. వెంకటేష్‌పై 9న మహరాణిపేట స్టేషన్లో మరో కేసు నమోదైంది. బెయిల్‌పై వచ్చిన వెంకటేష్‌ని మరోసారి విచారణ పేరుతో మహరాణిపేట పోలీసులు తీసుకెళ్లారు. స్టేట్మెంట్ రికార్డు చేసి పంపించే సమయానికి బాపట్ల జిల్లా మార్టూరుకి చెందిన పోలీసులు వచ్చి.. పీటీ వారెంట్‌పై ఆదివారం వెంకటేష్‌ను మార్టూరుకు తరలించి కోర్టులో హాజరు పరిచారు. వెంకటేష్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అన్ని చోట్లా అదే తీరు » సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని చెబుతూ పులివెందుల పట్టణ, అర్బన్ పోలీస్ స్టేషన్లలో వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డిలపై కేసు నమోదైంది. మరికొంత మందిపై కూడా కేసులు పెడుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సీఐ జీవన్ గంగనాథ్ బాబును వివరణ కోరగా.. ఇది ఎస్సీ, ఎస్టీ కేసు అని, ప్రస్తుతానికి ముగ్గురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. » ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెసల శివారెడ్డిపై ఈ నెల 8వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నెల 13వ తేదీ విచారణ నిమిత్తం స్టేషన్‌కు రావాల్సిందిగా ఆదివారం కంకిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీన కూడా ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. » గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ మేకా వెంకటరామిరెడ్డి సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారనే నెపంతో నెల్లూరు 35వ డివిజన్ జనసేన పార్టీ ఇన్చార్జి అశోక్ ఆదివారందర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. » కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇటీవల కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో చిందులు తొక్కడంపై ట్విట్టర్, ఇన్‌స్టాలో పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. » తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మొండోరాకు చెందిన బద్దం అశోక్‌రెడ్డి ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంగళగిరి టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి కోర్టులో హజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించారు. ఎక్కడెక్కడి నుంచో ఫిర్యాదులు » అద్దంకిలో కల్లం హరికృష్ణ రెడ్డి, హరీశ్వర్రెడ్డిలు సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టారని టీడీపీ కార్యకర్త యర్రాకుల రామాంజనేయులు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు డి.చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. » మేదరమెట్లకు చెందిన టీడీపీ కార్యకర్త గోలి అజయ్ ఫిర్యాదు మేరకు కడపకు చెందిన కె.హనుమంతారెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. » సంతమాగులూరు మండలం మిన్నేకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వసంత వేణు ఫిర్యాదుపై గురజాలకు చెందిన పి.వెంకటరామిరెడ్డిపై కేసు నమోదైంది. » ఎన్.బాలాజీరెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వాన్ని తప్పు పడుతూ పోస్టులు పెట్టాడని రేపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు బొర్రా సూర్యరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. చెరుకుపల్లిలో తిరుమల కృష్ణ అనే వ్యక్తిపై కూడా రాం»ొట్లవారిపాలెం గ్రామానికి చెందిన అలుమోలు దుర్గారెడ్డి ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం కార్టూన్ ఫార్వర్డ్ చేశారని..వన్‌కళ్యాణ్, చంద్రబాబులపై వచ్చిన పోస్టింగ్‌ని తన వాట్సా‹ప్ నుంచి ఇతరుల ఫోన్లకు పంపించాడనే నెపంతో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఘంటా మురళీకృష్ణపై తాడేపల్లిగూడేనికి చెందిన జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి ఈ నెల 6వ తేదీన స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై భీమవరం పోలీసులు ఈ నెల 6వ తేదీన మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి తాడేపల్లిగూడెం పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు.తీరా ఈ నెల 10వ తేదీ ఆదివారం అయినప్పటికీ తాడేపల్లిగూడెంలోని న్యాయమూర్తి ఇంటి వద్ద మురళీకృష్ణను హాజరు పరిచగా రిమాండ్ విధించారు. ‘రెండేళ్ల క్రితం నా ఫోన్ వాట్సాప్‌కు పవన్‌కళ్యాణ్, చంద్రబాబుపై ఒక వ్యంగ్య కార్టూన్ వచ్చి0ది. అప్పట్లో దానిని నేను ఫార్వార్డ్ చేశాను. ఆ సమయంలో భీమవరానికి చెందిన జనసేన కార్యకర్త పలికెల కిరణ్‌కుమార్ స్క్రీన్ షాట్ తీసి దాచిపెట్టి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిర్యాదు చేశాడు. దీంట్లో నిజానిజాలు విచారించకుండానే నాపై తప్పుడు కేసు పెట్టారు’ అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఆగని వేధింపులు.. ఇంటూరి రవికిరణ్‌పై మరో కేసు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోంది. పోలీసులను వారిపైకి ఉసిగొలుపుతోంది. తప్పుడు కేసులు పెడుతూ.. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌పై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ప్రస్తుతం.. మహారాణిపేట పోలీసుల అదుపులో ఉన్న ఇంటూరిని రాజమండ్రి తరలించనున్నారు.విశాఖలో సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల వేధింపులు కొనసాగుతుండగా, ఈ రోజు కూడా ఇంటూరి రవికిరణ్‌ను ఉదయం 11 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడు గంటలుగా స్టేట్మెంట్ పేరుతో కాలయాపన చేశారు. నిన్న(శనివారం) దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇంటూరిపై దువ్వాడ, మహారాణిపేట పోలీస్స్టేషన్ల్లో కేసులు నమోదయ్యాయి. కాగా, ఇంటూరిపై ప్రకాశం జిల్లాలోనూ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఒక కేసుపై తీసుకెళ్లి రెండు,మూడు కేసులను పెడుతున్నారు.కాగా, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బహిరంగ సమావేశంలోనే వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వ గొంతులో వెలక్కాయ పడినట్లయింది. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటిలాగే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీసింది.ఇదీ చదవండి: అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. అరాచకానికి పరాకాష్టప్రజల దృష్టిని మరల్చడానికి వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీస్ అస్త్రాన్ని ప్రయోగించింది. 2019 నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా ప్రశ్నించే గొంతులను ఖాకీల ద్వారా నొక్కించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ.. భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ.. కక్ష సాధిస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తూ.. సోషల్ మీడియా కార్యకర్తలను జైలుకు పంపిస్తోంది. ఇప్పటికే విశాఖ జిల్లాకు చెందిన నలుగురు కార్యకర్తలకు చిత్ర హింసలకు గురిచేసి కటకటాల పాలు చేసింది. మరింత మందిని కూడా జైలు పాటు చేయడానికి కూటమి పార్టీల చోటా నేతల ద్వారా కేసులు పెట్టిస్తోంది. -
ఇంటూరి రవికిరణ్‌పై పోలీసుల కుట్ర.. ఇవాళ మరోసారి అదుపులోకి
విశాఖ : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై కూటమి ప్రభుత్వ వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. నిన్న 41ఏ నోటీసుల పేరుతో ఇంటూరి రవికిరణ్, ఆయన భార్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వివాదం కావడంతో వదిలేశారు.అయితే ఈ రోజు మరోసారి ఇంటూరి రవి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు వెల్లడించకుండా తరలించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా తీసుకెళ్లడం కలకలం రేపుతుంది.మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారుశనివారం ఇంటూరి రవికిరణ్ ఇంటికి వచ్చిన పోలీసులు తీవ్ర ఇబ్బందులు గురి చేశారని రవికిరణ్ భార్య మీడియా ఎదుట వాపోయారు. తనతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు, తన భర్తను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆమె ప్రశ్నించగా.. ఎలాంటి ఇష్యూ చేయొద్దంటూ బెదిరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
దువ్వాడ పీఎస్‌లో ఇంటూరి రవికిరణ్ అక్రమ నిర్బంధం!
విశాఖపట్నం, సాక్షి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను ఇవాళ దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయన్ని పీఎస్‌కు తరలించారు. స్టేట్మెంట్ రికార్డు పేరుతో ఆయన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం.రవికిరణ్‌ను ఎందుకు తీసుకొచ్చారో తెలియదని ఆయన భార్య మీడియా ఎదుట వాపోయారు. ‘‘పదే పదే పోలీసులు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. నా భర్తను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియదు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు’’ అని అన్నారామె.దువ్వాడ పోలీసులు రవికిరణ్, ఆయన భార్యతో దురుసుగా ప్రవర్తించారు. తనిఖీలు చేయాలని చెబుతూ.. ఆమె కారు తాళాలు లాక్కున్నారు. తన భర్తను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆమె ప్రశ్నించగా.. ఎలాంటి ఇష్యూ చేయొద్దంటూ ఆమెను బెదిరించారు. ఇద్దరినీ భోజనం కూడా చేయనీయకుండా అడ్డుకున్నారు. తన భర్తకు కనీసం మాత్రలు ఇవ్వాలని ఆమె కోరగా.. పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఇబ్బంది పెడతానంటూ సీఐ మల్లేశ్వరరావు బహిరంగంగానే ఆమెకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఇంటూరి రవికిరణ్‌ను అరెస్ట్ చేయించారు. అంతేకాదు.. విచారణ పేరుతో పిలిపించుకుని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. -
ఏపీ ప్రభుత్వం తీరుపై జస్టిస్ కట్జూ ఆగ్రహం
-
ఏపీ ప్రభుత్వం తీరుపై జస్టిస్ కట్జూ ఆగ్రహం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్తల అరెస్టులపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్తల అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కార్టూన్లు అనేవి భావ స్వేచ్ఛ ప్రకటనలో ఓ భాగమని కట్జూ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉందని ఆయన అన్నారు. ఆర్టికల్ 19 (1) ఏ కింద ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్నారు. ప్రజాస్వామ్య విధానంలో రాజకీయవేత్తలను విమర్శించే హక్కు ప్రజలకు ఉందని, ఇక్కడ ప్రజలే ప్రభువులని కట్జూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు అనాగరికం, అప్రజాస్వామికమని, ఏపీ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్‌పై ఆర్టికల్ 356 ప్రయోగించాలని అని కట్జూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఆయన లేఖ రాశారు. I appeal to @RashtrapatiBhvn @PMOIndia to dismiss the @ncbn govt over the unconstitutional arrest of cartoonist Ravi Kiran under Article 356 pic.twitter.com/6Sc2RZxe5S — Markandey Katju (@mkatju) 16 May 2017 -
పొలిటికల్ పంచ్ రవికిరణ్‌కు బెయిల్ మంజూరు
-
పొలిటికల్ పంచ్ రవికిరణ్‌కు బెయిల్ మంజూరు
పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌కు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శాసనమండలికి సంబంధించి అసభ్యకరంగా పోస్టు పెట్టారని టీడీపీ నాయకుడు టీడీ జనార్దన్ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు ఫిర్యాదు చేయగా, ఆయన పోలీసులకు అదే విషయంపై ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు తొలుత విచారణ పేరుతో పలుమార్లు వేధించడమే కాక అర్ధరాత్రి వచ్చి ఎవరో కూడా సరిగా చెప్పకుండా ఇంటినుంచి తీసుకెళ్లిపోయారు. చివరకు హైడ్రామా అనంతరం అరెస్టు చేశారు. ఆ తర్వాత పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తనపై అసభ్యకరంగా పోస్టు పెట్టారని రవికిరణ్ మీద ఫిర్యాదు చేయడంతో అక్కడ ఆయనను అరెస్టు చేశారు. ఈనెల 12న తుళ్లూరు పోలీసులు పీటీ వారంటు పెట్టి మంగళగిరి కోర్టులో సరెండర్ చేశారు. దాంతో కోర్టు ఈనెల 28వరకు రవికిరణ్‌కు రిమాండు విధించింది. ఆ తర్వాత రవికిరణ్ తరఫు న్యాయవాది బెయిల్ కోసం దరఖాస్తు చేయడంతో అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు చేసిన కేసులో బెయిల్ వచ్చింది. విశాఖపట్నం కేసులో కూడా బెయిల్ కోసం అప్పీలు చేశారు. ఆ కేసులో ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. -
ఏపీ సర్కార్‌కు రివర్స్ పంచ్ పడింది...
నిబంధనలకు విరుద్ధంగా అరెస్టుపై తెలంగాణా పోలీసుల అభ్యంతరం న్యాయ నిపుణులు, సామాజిక మాధ్యమాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రవికిరణ్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టని పోలీసులు హెబియస్‌కార్పస్ పిటిషన్ వేసేందుకు సిద్ధమై రవికిరణ్ భార్య ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో తేల్చుకోలేక పోలీసుల తర్జనభర్జనలు ఎట్టకేలకు మళ్లీ అతని ఇంటి దగ్గరే వదిలిపెట్టిన పోలీసులు అమరావతి: సామాజిక మాధ్యమ కార్యకర్త, ‘పొలిటికల్ పంచ్’ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ అక్రమ నిర్బంధం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి రివర్స్ పంచ్ పడింది. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి అడ్డగోలుగా అరెస్టు చేసిన పోలీసుల చర్యపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆత్మరక్షణలో పడిపోయింది. అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు మేరకే అరెస్టు చేశామని సాకులు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతోనే అరెస్టు చేసిందన్న విషయం స్పష్టమైంది. ప్రభుత్వ వైఫల్యాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలను సహించలేని చంద్రబాబు ఆదేశాల మేరకు గుంటూరు పోలీసులు రవికిరణ్‌ను శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తెలంగాణ పోలీసులు, న్యాయ నిపుణులు, సామాజిక మాధ్యమాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కంగుతింది. మరోవైపు రవికిరణ్ భార్య న్యాయపోరాటానికి సిద్ధపడటంతో ప్రభుత్వంలో కలవరం మొదలైంది. రవికిరణ్‌ను అరెస్టు చేశామని విధిలేని పరిస్థితుల్లో అంగీకరించిన పోలీసులు ఆయన్ను మీడియా ముందు ప్రవేశపెట్టలేకపోయారు. సరికదా ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలనే దానిపై కూడా స్పష్టత లేక మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రవికిరణ్ మీద ఉన్న పాత కేసును తెరపైకి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవికిరణ్‌ను తిరిగి అతని ఇంటి వద్దే పోలీసులు వదిలిపెట్టారు. కాగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత పార్టీ ఫిరాయించినప్పుడు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై రవికిరణ్ మీద గతంలో విశాఖపట్నంలో కేసు నమోదయింది. ఐటీ చట్టం కింద నమోదైన ఆ కేసు విచారణ కోసమే అదుపులోకి తీసుకున్నట్లు చూపించాలని పోలీసులు భావిస్తున్నారని సమాచారం. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు మేరకు విశాఖపట్నం పోలీసు స్టేషన్లో 19 తేదీన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు అరెస్టు చేశామని చెబుతున్న పోలీసులు ఆ మేరకు అరెస్టును చూపకపోవడం, పలు కొత్త కేసులను పైకి తీసుకురావడం చూస్తుంటే వారు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు ఇతర రాష్ట్రానికి వెళ్లి అరెస్టు చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను గుంటూరు పోలీసులు ఉల్లంఘించారు. తెలంగాణ పోలీసులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా రవికిరణ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆరు గంటల తర్వాతే అరెస్టు చేయాలనే నిబంధనను పాటించకుండా అర్ధరాత్రి ఒంటిగంటకు అదుపులోకి తీసుకున్నారు. తన భర్తను అపహరించారని, ఆయన ఆచూకీ తెలపాలంటూ రవికిరణ్ భార్య సుజన శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో తెలంగాణా పోలీసులు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు సమాచారం లేకుండా తమ పరిధిలోని వ్యక్తిని ఏపీ పోలీసులు ఎలా అదుపులోకి తీసుకుంటారని తెలంగాణా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు తన భర్త భద్రతపై సందేహాలు ఉన్నాయని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రవికిరణ్ భార్య సుజన ప్రకటించారు. ఈమేరకు హెబియస్‌కార్పస్ పిటిషన్ వేసేందుకు సిద్ధపడటంతో పోలీసుల్లో కలవరం మొదలైంది. అప్పటివరకూ రవికిరణ్ ఆచూకీపై నోరుమెదపని పోలీసులు స్పందించారు. ఆయన్ను తాము అరెస్టు చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ వెల్లడించాల్సి వచ్చింది. అయితే ఆయనను ఎక్కడ ఉంచారో వెల్లడించలేదు. సచివాలయానికి కూతవేటు దూరంలో మందడం ఏఎస్పీ కార్యాలయంలో రవికిరణ్‌ను ఉంచి పోలీసులు పలు దఫాలుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆయన్ని గుట్టుచప్పుడు కాకుండా తిరిగి హైదరాబాద్ తీసుకువెళ్లాలన్న యత్నాలు కూడా ఫలించలేదు. దాంతో అసలు ఆయన్ని ఇంకా రాజధాని ప్రాంతానికి తీసుకురాలేదని... హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నామని...అమరావతి చేరుకోగానే మీడియా ముందు ప్రవేశపెడతామని ...ఇలా గడియకోమాట చెబుతూ వచ్చారు. అయితే మందడం గ్రామంలో ఉన్న ఏఎస్పీ కార్యాలయంలో రవికిరణ్ ఉన్నాడన్న సమాచారంతో మీడియా అక్కడకు చేరుకుంది. కానీ పోలీసు అధికారులు మీడియాను అనుమతించలేదు. రవికిరణ్ ఎక్కడున్నారో చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పోలీసులను ఎంతగా అడిగినప్పటికీ ఫలితం లేకపోయింది. రాత్రి తొమ్మిది గంటలవరకు కూడా ఆయన్ను మీడియా ముందు ప్రవేశపెట్టనేలేదు. రహస్య ప్రాంతానికి తరలింపు! రవికిరణ్‌ను శుక్రవారం రాత్రి 10గంటల ప్రాంతంలో పోలీసులు ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. మందడంలోని ఏఎస్పీ కార్యాలయం ఉన్న వీధిలో రాత్రి 10గంటల సమయంలో అరగంటపాటు కరెంటు సరఫరా నిలిపివేశారు. ఆ సమయంలోనే ఏఎస్పీ కార్యాలయం ఎదుట వాహనాలు వచ్చాయి. ఆ పరిసరాలకు పోలీసులు ఎవర్నీ అనుమతించలేదు. ఆ తరువాత ఆ వాహనాలు అతి వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఆ వాహనాల్లోనే రవికిరణ్‌ను ఓ రహస్య ప్రాంతానికి తరలించారు. చివరకు హైడ్రామా నడుమ రవికిరణ్ తిరిగి శంషాబాద్‌లోని అతని నివాసం వద్ద వదిలిపెట్టారు. -
రవికిరణ్‌ను అరెస్ట్ చేశాం: ఎస్పీ నాయక్
-
రవికిరణ్‌ను అరెస్ట్ చేశాం: ఎస్పీ నాయక్
గుంటూరు : సోషల్ మీడియాలో ఏపీ శాసనమండలిపై అసత్య ప్రచారం చేస్తున్న పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌ను అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ తెలిపారు. ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘శాసనమండలి పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర ప్రచారం జరుగుతోందని అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దల సభను అసభ్యకరంగా చిత్రించిన ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న పొలిటికల్ పంచ్ వెబ్సైట్ ఓనర్ రవిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశాం. అక్కడి నుంచి తీసుకొస్తున్నాం. విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీని మార్ఫింగ్ చేస్తూ అడల్ట్ పిక్చర్ ఫోటోలను పోస్ట్ చేసినందుకు గాను అతని పై సెక్షన్ 67 ఐటీ యాక్ట్, ఐపీసీ 299 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశా’ మన్నారు. చదవండి...(సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ ఆగ్రహం.. ) మరోవైపు రవికిరణ్ భార్య సుజన తన భర్త అరెస్ట్‌పై శంషాబాద్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులమని చెప్పి కొంతమంది తన భర్తను ఇంటి నుంచి తీసుకు వెళ్లారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా సుజన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని డీసీపీ పద్మజ తెలిపారు. -
చంద్రబాబు, లోకేశ్‌పై సెటైర్లు, అరెస్ట్
-
సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ ఆగ్రహం..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందే చేసింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ర్పచారంపై కొరడా ఝుళిపిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం అన్నంత పనీ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు వేసినందుకు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పొలిటిక్ పంచ్ పేరుతో పొలిటికల్ సెటైర్లు వేస్తున్న సోషల్ మీడియా వాలెంటీర్ ఇంటూరి రవికిరణ్‌ను తుళ్లూరు పోలీసులు శంషాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. కాగా అరెస్ట్‌పై పోలీసులు రవికిరణ్ కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. దీంతో అతని భార్య సుజన ఆందోళన చెందుతున్నారు. తన భర్తను ఈ రోజు తెల్లవారుజామున 3.30గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సోషల్ మీడియతో పాటు వెబ్ సైట్లలో టీడీపీ పార్టీ, ఏపీ సర్కార్‌పై జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటి నుంచో పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సోషల్ నెట్‌వర్క్‌లో నెగిటివ్ క్యాంపెయిన్‌పై చట్టప్రకారం యాక్షన్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అయ్యింది. సోషల్‌మీడియాపై కట్టడి తెచ్చేందుకు ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అంశాల్ని పరిశీలిస్తోంది. ఫేస్‌బుక్‌లోని కొన్ని పేజీలు, వెబ్సైట్లపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఆదేశాల మేరకు ఓ బృందం సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచినట్లు తెలుస్తోంది.