సాక్షి,తాడేపల్లి: తన భర్త సోషల్‌మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు కావాలనే వేధిస్తున్నారని ఆయన భార్య ఇంటూరి సుజన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం(నవంబర్ 12) వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఆమె కలిశారు. తన భర్తను పోలీసులు కేసుల పేరిట వేధిస్తున్న తీరును ఆమె వైఎస్‌జగన్‌కు వివరించారు.
అనంతరం ఇంటూరి సుజన మీడియాతో మాట్లాడుతూ‘తన భర్త ఇంటూరి రవికిరణ్‌పై ఇప్పటికి తొమ్మిది కేసులు పెట్టారని, ఇంకా కేసులున్నాయని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల వేధింపులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళితే అండగా ఉంటామన్నారు. రవికిరణ్ చెప్పని మాటలను పోలీసులే రాసుకుని కాగితాలపై సంతకం తీసుకున్నారు. నా భర్తకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత’అని సుజన అన్నారు.
కాగా,సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌ను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ప్రకాష్‌నగర్ పోలీసులు విశాఖపట్నం వెళ్లి అక్కడ మహారాణిపేట పోలీసుల అదుపులో ఉన్న రవికిరణ్‌ను అరెస్టు చేసి రాత్రి 11 గంటల సమయంలో రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. రవికిరణ్ అరెస్టుపై ఆయన భార్య సుజనకు కనీస సమాచారం ఇవ్వలేదు. ఎవరి సంతకం లేని ఒక పేపర్ చూపించి రాజమహేంద్రవరం తరలించారు.
ఇదీ చదవండి: వారమైన ఆచూకీ లేదు.. రమణారెడ్డి ఎక్కడ
Comments
Please login to add a commentAdd a comment