ఆగని వేధింపులు.. ఇంటూరి రవికిరణ్‌పై మరో కేసు | Another Case Against Ysrcp Social Media Activist Inturi Ravi Kiran | Sakshi
Sakshi News home page

ఆగని వేధింపులు.. ఇంటూరి రవికిరణ్‌పై మరో కేసు

Published Sun, Nov 10 2024 6:40 PM | Last Updated on Sun, Nov 10 2024 7:12 PM

Another Case Against Ysrcp Social Media Activist Inturi Ravi Kiran

సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోంది. పోలీసులను వారిపైకి ఉసిగొలుపుతోంది. తప్పుడు కేసులు పెడుతూ.. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ  సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ ఇంటూరి రవి కిరణ్‌పై రాజమండ్రి ప్రకాష్‌ నగర్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ప్రస్తుతం.. మహారాణిపేట పోలీసుల అదుపులో ఉన్న ఇంటూరిని రాజమండ్రి తరలించనున్నారు.

విశాఖలో సోషల్‌ మీడియా కార్యకర్తలపై పోలీసుల వేధింపులు కొనసాగుతుండగా, ఈ రోజు కూడా ఇంటూరి రవికిరణ్‌ను ఉదయం 11 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడు గంటలుగా స్టేట్‌మెంట్‌ పేరుతో కాలయాపన చేశారు. నిన్న(శనివారం) దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఇంటూరిపై దువ్వాడ, మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌ల్లో కేసులు నమోదయ్యాయి. కాగా, ఇంటూరిపై ప్రకాశం జిల్లాలోనూ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఒక కేసుపై తీసుకెళ్లి రెండు,మూడు కేసులను పెడుతున్నారు.

కాగా, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సమావేశంలోనే వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వ గొంతులో వెలక్కాయ పడినట్లయింది. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటిలాగే డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరతీసింది.

ఇదీ చదవండి: అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. అరాచకానికి పరాకాష్ట

ప్రజల దృష్టిని మరల్చడానికి వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై పోలీస్‌ అస్త్రాన్ని ప్రయోగించింది. 2019 నుంచి ఇప్పటివరకు సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా ప్రశ్నించే గొంతులను ఖాకీల ద్వారా నొక్కించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ.. భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ.. కక్ష సాధిస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తూ.. సోషల్‌ మీడియా కార్యకర్తలను జైలుకు పంపిస్తోంది. ఇప్పటికే విశాఖ జిల్లాకు చెందిన నలుగురు కార్యకర్తలకు చిత్ర హింసలకు గురిచేసి కటకటాల పాలు చేసింది. మరింత మందిని కూడా జైలు పాటు చేయడానికి కూటమి పార్టీల చోటా నేతల ద్వారా కేసులు పెట్టిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement