జననేతకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, వైఎస్సార్‌సీపీ నేతలు నల్లబ్యాడ్జీలతో ర్యాలీలు
చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ ప్రోద్బలంతోనే హత్యాయత్నానికి తెగబడ్డారని ఆగ్రహావేశాలు
పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్థం
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
చంద్రబాబు, ఆయన భజన బృందాలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్ : సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి తెగబడటాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్కూలు పిల్లల నుంచి వృద్ధులు, అభిమానులు, మహిళలు, పార్టీ నేతలు పెద్దఎత్తున నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పోద్బలంతోనే ఈ హత్యాయత్నం జరిగిందని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో జగన్‌ను ఎదుర్కోలేక.. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేక.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమనే అక్కసుతోనే సీఎంపై హత్యాయత్నానికి పురిగొలిపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేకచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్థం చేశారు.
ఇందులో భాగంగా.. సీఎంపై హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో హోంమంత్రి తానేటి వనిత నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రిని రాజకీయంగా ఎదుర్కోలేకే దాడిచేయడం బాధాకరమని మంత్రి అన్నారు. దండకున్న తీగ గుచ్చుకుని గాయమైనట్లు కొంతమంది వక్రీకరిస్తున్నారని.. తీగ గుచ్చుకుని గాయమైతే వెనుకనున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఎలా గాయమైందని ప్రశ్నించారు.
ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కుక్కునూరు మండలం కివ్వాక గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. భీమడోలు మండలం కోడేరుపాడు గ్రామంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం మర్రితిప్ప వద్ద చీఫ్ విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాకినాడ రూరల్ మండలంలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ప్రత్తిపాడులో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి దవులూరి దొరబాబు సామర్లకోటలో, పి.గన్నవరంలో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాలరావు, జగ్గంపేట, తునిలో పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హత్యాయత్నానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.
జగన్‌ను టచ్ చేశారు పుట్టగతులుండవు : మంత్రి ‘కొట్టు’
సీఎం జగన్‌ని దాడి ద్వారా టచ్ చేశారు, ఈ కుట్రకు పాల్పడిన వారికి పుట్టగతులుండవని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో ఆయన నల్లరిబ్బన్లు ధరించి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌ను ఎదుర్కోలేక పిరికిపంద చర్యలకు పాల్పతున్నారన్నారు. ఆయనకు వస్తున్న జనాదరణను తట్టుకోలేక ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇక సీఎంపై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకులో ఆరోపించారు.
పేదలకు సంక్షేమం, విద్య, వైద్యం ఉచితంగా అందిస్తున్నందుకు జగన్‌పై దాడులు చేయిస్తావా చంద్రబాబూ అని నిలదీశారు. వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా చంద్రబాబు అంతమొందించాడని, నేడు అదే కోవలో ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జామి మండలంలోని పీతలపాలెంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, పాలకొండలో ఎమ్మెల్యే కళావతి నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలిపారు.
సీఎంపై జరిగిన దాడి అమానుషమని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు హేయమైనవని కోలగట్ల అన్నారు. సీఎం జగన్‌పై జరిగిన దాడికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం, నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్‌లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సోంపేటలో జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, కొత్తూరులో ఎమ్మెల్యే రెడ్డిశాంతి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
చంద్రబాబు కేడర్‌ను రెచ్చగొడుతున్నారు
ఇక సీఎం జగన్‌పై దాడికి నిరసనగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్దఎత్తున నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత.. సింగరాయకొండలో మంత్రి ఆదిమూలపు సురేష్, చీమకుర్తిలో మంత్రి మేరుగ నాగార్జున, కంభంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మార్కాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు, కనిగిరిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
చంద్రబాబు పదేపదే తన కేడర్‌ను రెచ్చగొడుతున్నారని, ఇది హేయమైన చర్య అని బాలినేని, ఆదిమూలపు, మేరుగ నాగార్జున ఆరోపించారు. చీరాల, అద్దంకి, పర్చూరు, అధికార పార్టీ అభ్యర్థులు కరణం వెంకటేష్, పానెం హనిమిరెడ్డి, ఎడం బాలాజీ, వేమూరు అభ్యర్థి వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, రేపల్లె అభ్యర్థి ఈవూరి గణేష్‌లు ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండించారు.
ఉమ్మడి విశాఖలో ఆగ్రహ జ్వాలలు..
ఉమ్మడి విశాఖ జిల్లా మర్రిపాలెంలో వైఎస్సార్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్‌కుమార్, ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఎండాడలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించగా.. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.
గాజువాకలో మంత్రి అమర్‌నాథ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. చంద్రబాబు నీచరాజకీయాలు చెల్లవని.. ఇలాంటి దాడులను తాము సహించబోమన్నారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. పాయకరావుపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా..
జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే, విప్ సామినేని ఉదయభాను, తిరువూరులో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు, మైలవరంలో ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు యాదవ్, విజయవాడ పశ్చిమంలో ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, సెంట్రల్ నియోజకవర్గంలో డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇక మచిలీపట్నం, అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, పామర్రు, పెడన, పెనమలూరు నియోజకవర్గాలోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
పెనమలూరు మండలం గంగూరులో మంత్రి జోగి రమేష్, పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో.. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఇక్కడి ప్రస్తుత అభ్యర్ధి షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. పొన్నూరులో ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ, గుంటూరులో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, మచిలీపట్నం పోర్టు ట్రస్టు ఎండీ మేకతోటి దయాసాగర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఇతర మండలాల్లోనూ నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేశారు. అలాగే, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు నాయకత్వంలో నల్లకండువాలు ధరించి ర్యాలీ నిర్వహించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అమరావతిలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రాస్తారోకోలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. రొంపిచర్ల, వినుకొండలోనూ ఆందోళనలు చేశారు.
ఇది ముమ్మాటికీ కూటమి కుట్రే
ఇదిలా ఉంటే.. సీఎంపై హత్యాయత్నం ముమ్మాటికీ ప్రతిపక్ష పార్టీల కుట్రేనని తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆరోపించారు. చంద్రగిరిలో ఆయన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అలాగే, హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఆధ్వర్యంలో తిరుపతిలో నల్ల కండువాలు, నల్లబ్యాడ్జీలు ధరించి పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్నకు హాని జరిగితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని వారన్నారు.
ఇక అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఎంపై హత్యాయత్నం వెనుక కుట్రకోణం ఉందన్నారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీ‹Ùకుమార్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు కూడా తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో భారీఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
అలాగే శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోనూ నిరసనలు జరిగాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుత ఆందోళనలు జరిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ జనాగ్రహం పెల్లుబికింది. ఆత్మకూరు పట్టణంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధ్వర్యంలో.. ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లరిబ్బన్లను ధరించి నిరసన వ్యక్తంచేశారు. నెల్లూరు నగరంలోనూ నిరసన ర్యాలీలను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment